love harrassments
-
బెజవాడలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సాక్షి, విజయవాడ : నగరంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం తనను తాను కత్తితో పొడుచుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రీస్తురాజపురం ప్రాంతానికి దివ్య తేజస్విని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. స్థానికంగా ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న నాగేంద్రబాబు అలియాస్ స్వామి కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. తన ప్రేమను నిరాకరించిందని కక్ష కట్టిన స్వామి.. గురువారం యువతి ఇంటికి వెళ్లాడు. ఇదే విషయంలో వారిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో కోపోద్రేకుడైన స్వామి కత్తితో దివ్య తేజస్వినిపై దాడి చేశారు. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, దాడి చేసిన అనంతరం స్వామి తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. ప్రస్తుతం స్వామి కూడా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్..!
-
ప్రేమించకపోతే మీ తల్లిదండ్రుల్ని చంపేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు దిగడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అదేకాకుండా తమ స్నేహితున్ని ప్రేమించకుంటే యువతి తల్లిదండ్రులను చంపేస్తామంటూ నిందితుని ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఇటీవల బెదిరింపులకు దిగారు. దీంతో తనవారిని ఏం చేస్తారోనని భయపడిన సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'మా కూతుర్ని వేధిస్తున్నారు.. శిక్షించండి'
తిరుపతి: తమ కూతురిని ప్రేమ పేరుతో వేధించిన ఓ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చంద్రిక అనే ఇంటర్ విద్యార్థినిని ఓ ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధించసాగారు. యశ్వంత్, నవీన్ అనే ఇద్దరు యువకులు ప్రతిరోజూ ఆమెను ప్రేమిస్తున్నామంటూ వేధిస్తూ వెంటబడేవారు. ఈ క్రమంలో వారి మాట వినలేదని ఆమెను బైక్‌తో ఢీకొట్టించారు. దాంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పుడా ఆ విద్యార్థిని మంచానికే పరిమితమైంది. వాళ్లు చాలా అమానుషంగా వ్యవహరించారని బాధితురాలు చంద్రిక వాపోయింది. ఇదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో చంద్రిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తిరుపతి పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. బాధితురాలు చంద్రిక డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ అంజూ యాదవ్‌లకు జరిగిన విషయాన్ని అంతా వివరించింది. చంద్రిక స్టేట్మెంట్ ను డీఎస్పీ రికార్డు చేశారు. తమకు న్యాయం చేయాలని చంద్రిక తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. యశ్వంత్, నవీన్ ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థినిని వేధించిన నవీన్, యశ్వంత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.