
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు దిగడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అదేకాకుండా తమ స్నేహితున్ని ప్రేమించకుంటే యువతి తల్లిదండ్రులను చంపేస్తామంటూ నిందితుని ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఇటీవల బెదిరింపులకు దిగారు. దీంతో తనవారిని ఏం చేస్తారోనని భయపడిన సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.