woman committed suicide
-
కోట్లలో కట్నం.. ఆరంకెల జీతం..అత్తింటి వేధింపులతో కోడలి ఆత్మహత్య?
గతేడాది వరకు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ ఉద్యోగి. ఆరంకెల జీతం. ఉద్యోగ జీవితంలో క్లిష్టమైన సమస్యల్ని మేనేజ్ చేసిన నైపుణ్యం. 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోయారు. తల్లి, సోదరుడి అండతో ఏ చీకూచింత లేని జీవితం. రూ.కోట్లలో బంగారం, కట్నం ఇచ్చి మరీ నగరంలోని ఓ చార్టర్డ్ అక్కౌంటెంట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. ఈ 8 మాసాల్లో ఏం జరిగిందో.. ఎంత క్షోభ అనుభవించిందో.. ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, సోదరుడు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతమ్మధార: నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కు చెందిన సత్యప్రియ(31) ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి తల్లీ, సోదరుడు ఇది ముమ్మాటికీ అత్తింటి వారు చేసిన హత్యేనని ఆరోపిస్తున్నారు. ద్వారకా స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాలు. సత్యప్రియ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తండ్రి 12 ఏళ్ల క్రితం మరణించారు. అన్నయ్య అడబాల రామకృష్ణ హైదరాబాద్‌లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ హెడ్. వీరి సొంతూరు రాజమండ్రి. సత్యప్రియ బెంగళూరులోని డిలైట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది. తర్వాత హైదరాబాద్‌కు మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న నగరంలోని బాలయ్యశాస్త్రి లేఅవుట్‌కి చెందిన ఎల్లిశెట్టి కార్తికేయ(32)తో హైదరాబాద్‌లో ఘనంగా వివాహం జరిగింది. కార్తికేయ విశాఖలో చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని తండ్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. పెళ్లయ్యాక బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని కృపా నిలయంలో ఉంటున్నారు. ఈ నెల 5న వీరు అరకు వెళ్లారు. సత్యప్రియ అక్కడి నుంచి తల్లి శ్రీవెంకటరమణకు వీడియోకాల్ చేసింది. ఐ మిస్ యూ అని చెప్పడంతో తల్లి కంగారు పడింది. వెంటనే ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. కానీ, కుమార్తె ఏమీ లేదని చెప్పిందట. బుధవారం భార్యాభర్తలు ఇంటికి వచ్చేశారు.గురువారం ఉదయం కార్తికేయ యథావిధిగా ఆఫీసుకి వెళ్లిపోయాడు. ఆమె మళ్లీ తల్లికి ఫోన్ చేసి తన బాధ వెల్లబోసుకుంది. సత్యప్రియ పిన్ని కుమార్తెకు వివాహం కుదిరిందని తల్లి చెప్పగా, చెల్లికి బాగా విచారణ చేశాకే మంచి సంబంధం ఖాయం చేయండని సలహా ఇచ్చింది. గురువారం భర్తకి వాట్సప్‌లో కార్టూన్ బొమ్మ పంపించి, మధ్యాహ్నం 12.30 సమయంలో ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేయలేదు. తిరిగి 2.30కు కాల్ చేయగా ఆమె నుంచి బదులు రాలేదు. సాయంత్రం ఇంటికొచ్చి చూసేసరికి పడక గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని సత్యప్రియ కనిపించింది. వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కోడలు చనిపోయి ఉండటాన్ని చూసిన అత్త స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరి్పంచారు. కుమార్తె ఆత్మహత్య విషయమై అత్తింటివారు కాకుండా వేరే వ్యక్తి ఆమె తల్లికి ఫోన్ చేయడం గమనార్హం. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సత్యప్రియ మామ సూర్యచంద్రరావు కోడలి తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చారు. పోలీసులకు రాత్రి 10.20 కు ఫిర్యాదు చేయడం విశేషం. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. పోస్టుమార్టం శనివారం చేస్తారని సమాచారం. విమానంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి నుంచి కారులో శుక్రవారం ఉదయం తల్లి, సోదరుడు విశాఖ చేరుకున్నారు. ద్వారకా స్టేషన్లో తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, అత్తింటివారే హత్య చేశారని తల్లి ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో రూ.4.5 కోట్ల విలువైన బంగారం, కట్నం ఇచ్చామని, పెళ్లికి మరో రూ.కోటి ఖర్చయిందన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, మొదటి నుంచి అల్లుడు తల్లిదండ్రుల మాటలు విని, తన కుమార్తెను అనుమానంతో వేధించేవాడని పేర్కొన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త కార్తికేయ, మామ సూర్యచంద్రరావులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఏసీపీ రాంబాబు పర్యవేక్షణలో ద్వారకా స్టేషన్ సీఐ బీవీ రమణ మృతు రాలి భర్త, అత్త, మామల పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
జీడిమెట్ల: అమ్మా.. నాన్న.. మీరు చెప్పిన మాటలు నేను వినలేదు.. ప్రేమిస్తున్నాను అని వెంటపడిన అబ్బాయి ప్రేమను అంగీకరించారు.. అతను పెట్టే మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నాను. ఐ లవ్ యూ అమ్మా నాన్న అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన మేరకు.. షాపూర్‌నగర్ ఎన్ఎల్బీ నగర్‌కు చెందిన బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల(22)ను అదే ప్రాంతానికే చెందిన ఓరుగంటి వెంకటేశ్ కుమారుడు అఖిల్ సాయిగౌడ్ గత 8సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతున్నాడు. తనను ప్రేమించకపోతే చనిపోతానంటూ వేధించేవాడు. దీంతో అఖిల కూడా సాయిగౌడ్ ప్రేమను అంగీకరించి విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు తెలిపింది. ఈ విషయం ఇరుకుటుంబాలు కూర్చుని మాట్లాడుకుని వీరి ప్రేమను అంగీకరించాయి. వేధించి రోడ్లపైనే కొట్టేవాడు.. కాగా అఖిలను సాయిగౌడ్ మానసికంగా వేధించేవాడు. కోపంతో రోడ్లపైనే కొట్టేవాడు. అయినప్పటికీ అఖిల భరిస్తూ వచ్చింది విషయాన్ని పలుమార్లు తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అతని వేధింపులు భరించలేక అఖిల తనలో తానే కుమిలిపోయేది ఇటీవల కొంతకాలం నుండి సాయిగౌడ్ పెళ్లి విషయంలో ముఖం చాటేశాడు. దీంతో మరింత కుంగిపోయిన అఖిల మంగళవారం రాత్రి 10 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. దీంతో జీడిమెట్ల పోలీసులు అఖిల్ సాయిగౌడ్‌పై కేసు నమోదు చేశారు. -
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో..
సాక్షి, నల్లగొండ క్రైం : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలంలోని బొక్క ముంతలపాడు గ్రామానికి చెందిన మనీష(25) తల్లి నాగేంద్రమ్మతో కలిసి పట్టణంలోని సాగర్ రోడ్డులో అయ్యప్పగుడి సమీపంలో నివాసం ఉంటున్నారు. నాగేంద్రమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ కుమార్తెను ఎమ్మెస్సీ వరకు చదివించింది. సమీప బంధువు అయిన మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డి గూడేనికి చెందిన బోదల రాజేశ్, మనీషలు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మనీష కుటుంబసభ్యులకు రాజేశ్ భరోసా ఇచ్చాడు. అయితే ఆలస్యం అవుతుండడంతో పెళ్లి విషయమై స్పష్టత ఇవ్వాలని మనీష కుటుంబ సభ్యులు తమ ఇంటికి పిలిచి అడిగారు. తన కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని కొంతసమయం పడుతుందని చెప్పాడు. దీనికితోడు ఇతర సంబంధాలు చూస్తే చెడగొడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తల్లి ఇంట్లో లేని సమయంలో మనీష చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్లిన తల్లి తలుపు కొట్టినా తెరవక పోవడంతో సమీపంలోని వారితో కలిసి డోర్‌ను తొలగించి వేలాడుతున్న కూతురు మృతదేహాన్ని కిందికి దింపారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. విషయం పోలీసులకు చేరడంతో తల్లిని వివరాలు అడిగి తెలుసుకోగా పెళ్లి విషయం ప్రస్తావించానని, రాజేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉందని, పెళ్లి సంబంధాలను చెడగొట్టడంతోపాటు అతడు పెళ్లి చేసుకోలేదని తెలిపింది. అయితే తన కమార్తె ఆత్మహత్యకు రాజేశ్‌యే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ ఎస్సై సందీప్‌రెడ్డి తెలిపారు. -
వివాహమైన ఆరు నెలలకే..
గాజువాక: వరకట్న రక్కసికి ఒక యువతి బలైపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు తాళలేక ఊపిరి తీసుకుంది. వివాహమైన ఆరు నెలలకే ఆమె బలవన్మరణానికి పాల్పడటం సంచలనమైంది. పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ శీకువానిపాలెంలో ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శీకువానిపాలెం ప్రాంతానికి చెందిన గౌతమ్ కుమార్ యలమంచిలి ప్రాంతానికి చెందిన దేవీ ప్రియ (24)ను ప్రేమించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గౌతమ్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా దేవీ ప్రియ బ్యూటీషీయన్‌గా పని చేస్తోంది. గౌతమ్ కుమార్ తనకు కట్నం కావాలంటూ వివాహమైనప్పటి నుంచీ దేవీప్రియను వేధిస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటి వారు ఇటీవల లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులు సరిపోవని, ఇంకా కావాలంటూ ఆమెను వేధిస్తుండటం, తాగి వచ్చి సూటిపోటి మాటలతో బాధిస్తుండటంతో వారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే ఆదివారం రాత్రి కూడా వారి మధ్య ఘర్షణ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన దేవీప్రియ ఇంట్లోని ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న న్యూపోర్టు సీఐ కె.పైడపునాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచారం సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు గోవింద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
యువతి ఆత్మహత్య
నిడదవోలు : ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య చోటు చేసుకున్న గొడవతో మనస్తాపం చెందిన యువతి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెరవలి మండలం పెరవలి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం నక్కపల్లి గ్రామానికి చెందిన పిక్కి తాతాలు, రూతి దంపతులకు నలుగురు సంతానం. వీరు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం పెరవలి వచ్చారు. స్థానిక రవళి స్పిన్నింగ్ పరిశ్రమలో పనిచేసిన వారు ఇటీవల ఆ ఉద్యోగాలు మానివేశారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరు రవళి స్పిన్నింగ్ పరిశ్రమ సమీపంలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెక్కి తాతాలు, రూతిలు తమ ఇద్దరు కుమార్తెలు పిక్కి భారతి (20), రాణిలను ఇంటిలో వదిలి హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లారు. ఇద్దరు కుమార్తెలను ఆ తర్వాత రావాలని కోరారు. భారతి, రాణిల మధ్య సెల్‌ఫోన్ కోసం శనివారం గొడవ ప్రారంభమైంది. ఇద్దరి మధ్య ఆ గొడవ తీవ్రస్థాయికి చేరి ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భారతి (20) ఇంట్లో గదిలోకి వెళ్లి తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గొడవపడిన తరువాత తన అక్క ఇంట్లోకి వెళ్లి పడుకుని ఉంటుందని భావించిన చెల్లి రాణి వంట చేసిన తరువాత గది తలుపు తట్టి పిలవగా గదిలో నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో భయంతో కేకలు వేసింది. స్పిన్నింగ్ మిల్లు సిబ్బంది, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సహకారంతో రాణి అక్కను ఆటోలో తణుకులో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే భారతి మృతి చెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు. పెరవలి ఎస్సై జగదీశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించకపోతే మీ తల్లిదండ్రుల్ని చంపేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తిరుమలగిరిలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు దిగడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే యువతిని ప్రేమ పేరుతో ఓ యువకుడు కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అదేకాకుండా తమ స్నేహితున్ని ప్రేమించకుంటే యువతి తల్లిదండ్రులను చంపేస్తామంటూ నిందితుని ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఇటీవల బెదిరింపులకు దిగారు. దీంతో తనవారిని ఏం చేస్తారోనని భయపడిన సదరు యువతి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీకాకుళం తుపాను నష్టంపై ఆందోళనతో మహిళ ఆత్మహత్య
-
వైద్యం కోసం ఎన్ని పాట్లో..!
నార్నూర్: ఆత్మహత్యకు యత్నించిన భార్యను కాపాడుకునేందుకు ఆమె భర్త చేసిన ప్రయత్నం విఫలమైంది. భుజంపై ఎత్తుకుని వాగు దాటి ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడుకోలేకపోయాడు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన రాథోడ్ రాము, పుష్ప దంపతులు ఐదెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశారు. ఇటీవల వర్షానికి పత్తి పంట దెబ్బ తినడంతో ఆందోళనకు గురైంది. పంట అంతంత మాత్రంగానే ఉండటంతో చేసిన అప్పులు ఎలా తీర్చా లో తెలియక మనస్తాపం చెందింది. సోమవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. పుష్పను ఆమె భర్త గ్రామంలోని ఓ వ్యక్తి సహాయంతో వాగు వరకు 2 కిలోమీటర్ల దూరం బైక్‌పై తీసుకొచ్చాడు. మండల కేంద్రం నార్నూర్‌లోని ఆస్పత్రికి తరలించాలంటే గ్రామ సమీపంలోని వాగు దాటాల్సిందే. మోకాళ్లలోతు నీళ్లు ఉండటంతో గత్యంతరం లేక తన భుజంపై ఎత్తుకుని వాగు దాటించాడు. అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని నార్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. వైద్యం అందకుండానే మార్గమధ్యంలోనే పుష్ప మృతిచెందింది. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): ప్రేమించిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాజీనగర్ మసీదు సెంటర్లో ఎం.దేవి కుటుంబం నివాసముంటోంది. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె శ్రావణి (18) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఈ క్రమంలో ఆమెకు నెల్లూరు నవాబుపేటకు చెందిన ప్రసాద్‌తో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంటర్మీడియట్ పూర్తయిన అనంతరం ఆమె చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఇటీవల శ్రావణి తన ప్రేమ వ్యవహారాన్ని తల్లి దేవికి తెలియజేసింది. అతనితోనే తన వివాహం చేయమని తల్లిని కోరింది. దీంతో ఆమె ప్రసాద్, అతని తల్లికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు ప్రసాద్, అతని తల్లి నిరాకరించారు. దీంతో మనస్థాపం చెందిన శ్రావణి శుక్రవారం అర్ధరాత్రి తన ఇంట్లోని వంట గది ఫ్యాన్ కోసం ఏర్పాటు చేసిన కొక్కేనికి చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన దేవి కుమార్తెను కిందకు దించి హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు. శ్రావణిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో దేవి కుప్పకూలిపోయింది. కుమార్తె ఆత్మహత్య విషయమై దేవి శనివారం బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులుపోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై బి. రమేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్యాంక్‌పై నుంచి దూకేస్తా..!
గుంతకల్లు: ఓ మహిళ ఆత్మహత్యాయత్నం గుంతకల్లులో కలకలం రేపింది. రైల్వే ఆస్పత్రి సమీపాన గల పురాతన ఓవర్‌హెడ్ ట్యాంకుపైకి సోమవారం ఓ మహిళ ఎక్కింది. కిందకు దూకి చనిపోతానంటూ కేకలు వేసింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఎస్ఐ వెంకటప్రసాద్, ఆర్పీఎఫ్ ఎస్ఐ భాస్కర్ నేతృత్వంలో సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. నానా అగచాట్లు పడి ఆ మహిళను కిందకు దించి, విచారణ చేపట్టారు. తన పేరు జానకి అని, ఊరు మహబూబ్‌నగర్ జిల్లా గార్లపాడు అని, పదకొండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారని ఆమె తెలిపింది. పెద్దమ్మ, పెద్దనాన్నల వద్ద పెరిగానని, అయితే వారు తరచూ కొడుతుండటంతో బాధ భరించలేక హైదరాబాద్‌కెళ్లి ఆ పని ఈ పని చేసుకుంటూ పొట్ట నింపుకునేదాన్నని వివరించి. ఈ నేపథ్యంలోనే అన్వర్ అనే వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని వాపోయింది. కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగా లేదని, రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో రైలెక్కి గుంతకల్లు స్టేషన్లో దిగానని తెలిపింది. చచ్చిపోవాలనుకుని ట్యాంకుపైకి ఎక్కినట్లు చెప్పింది. జానకి ఇచ్చిన సెల్ నంబర్‌కు డయల్ చేస్తే హైదరాబాద్‌లోని సురేష్ అనే కాంట్రాక్టర్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. జానకి చెప్పిందంతా వాస్తవమేనని, కొన్నేళ్లుగా తన వద్ద స్వీపర్‌గా పని చేస్తుండేదని పేర్కొన్నాడు. రెండు నెలలుగా మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయిందని తెలిపాడు. జానకి హైదరాబాద్ పోతాననడంతో స్థానికులు కొందరు ఆమెను రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లి వదిలారు. -
ఏం కష్టమొచ్చిందో...
ఏం కష్టమొచ్చిందో...ఓ పాతికేళ్ల యువతి పట్టణ శివారు ప్రాంతంలో ఎవరికీ కనబడకుండా తుప్పల్లోకి వెళ్లి వస్తువులన్నీ పక్కన పెట్టి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొంది. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృత్యుఒడిలోకి చేరింది. చికిత్స సమయంలో ఆమె పోలీసులకు చెప్పిన మాటలకు, సంఘటన స్థలం వద్ద ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తుండడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్‌తో పాటు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్పీ జి.పాలరాజు పర్యవేక్షణ చేశారు. సీసీ పుటేజీలలో ఆమె స్థానిక కలెక్టరేట్ వద్ద నుంచి కెఎల్.పురం వైపు వెళ్లే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేస్తున్న దృశ్యాలను కనుగొన్నారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం టౌన్: పట్టణ శివారు ద్వారపూడి గ్యాస్ గోడౌన్స్ దాటిన తర్వాత ఉన్న రియల్ ఎస్టేట్ ఖాళీ స్థలం లోపలికి పట్టణానికి చెందిన ముదునూరి అశ్విని (25) శుక్రవారం సాయంత్రం వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందింది. పోలీసుల విచారణలో మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణ వేగవంతం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ జి.పాలరాజు ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువతి చెప్పిన ఆధారాలతో తమదైన శైలిలో అశ్వినిది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ లభ్యమైన యువతి బైక్ కీ, కర్చీఫ్, కళ్లద్దాలు, కాలిన వస్త్రాలు, చర్మం, వంటి వాటిని గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ఆమె కాలిన తర్వాత కొంత దూరం వచ్చిన దూరాన్ని గుర్తించగలిగింది. ఈ సందర్భంగా సంఘటనా çస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జి.పాలరాజు మాట్లాడుతూ పూర్తి ఆధారాలు సేకరించామన్నారు. పెట్రోల్ బాటిల్ ఇంట్లోదే.. సంఘటనా స్థలం వద్ద లభించిన పెట్రోల్ బాటిల్‌ను అశ్వని తండ్రి వెంకటసాయిరామ్ గుర్తించారు. అది ఇంట్లో బాటిలేనని తెలిపారు. కర్చీఫ్, కళ్లద్దాలు కూడా ఆమెవేనని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. సీసీ పుటేజీల్లో... అశ్విని ఆత్మహత్యకు ముందు కలెక్టరేట్ నుంచి కెఎల్.పురం వెళ్లే రహదారిలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 3.41 నిమషాల నుంచి ఆమె పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని పెట్రోల్ ముందు బైక్‌లో కొట్టిం చి, తర్వాత బాటిల్లో నిండుగా పోయించింది. ఒకానొక సమయంలో టెన్షన్‌తో ఉన్నట్లు అక్కడ పుటేజీలో కనబడింది. పెట్రోల్ కొనుగోలు తర్వాత బాటిల్ ముందున పెట్టుకుంటే అది కాస్త కిందపడిపోయింది. దాన్ని అక్కడ పని చేస్తున్న సిబ్బంది అందించడంతో వెనుక సీట్ కిందన పెట్టి వేగంగా వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఒబిసిటీయే కారణమా? అతి లావు, పెరిగిన వయసు, పెళ్లి కాకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారని పోలీసులు తెలిపారు. అవి కారణాలు కాకపోయి ఉండవచ్చనే అనుమానాలు బలమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు ఇంకా బలమైన కారణమేదో ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు చేసి విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ తెలిపారు. ఎందుకలా... అశ్విని మృత్యువుతో పోరాడుతున్న సమయంలో పోలీసులకు ఇచ్చిన సమాచారంలో ఎవరో ఇద్దరు దుండగులు తన దగ్గరకు వచ్చి పేరేంటని ప్రశ్నించి, పేరు చెప్పగానే కిరోసిన్ పోసి నిప్పంటించారని, మరోసారి కాళ్లు చేతులు కట్టేశారని చెప్పుకొచ్చింది. పట్టణంలోని సీసీ కెమెరాల పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయం బట్టబయలైంది. పెట్రోల్ బంక్‌లో అశ్వినియే పెట్రోల్ కొనుగోలు చేసినట్లు రికార్డ్ అయింది. దీని ఆధారంగా యువతిపై దాడి జరగలేదని తనే ఆత్మహత్యకు పాల్ప డినట్లు తెలుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో ఎందుకలా చెప్పింది, ఆ యువతికి వచ్చిన కష్టమేంటి, ఆత్మహత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి నిరాకరించాడని..
సాక్షి నిజామాబాద్ : వివాహం నిశ్చయం చేసుకొని, రోజూ ఫోన్లో మాట్లాడిన యువకుడు.. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాల్కొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై స్వామిగౌడ్ కథనం ప్రకారం.. బాల్కొండకు చెందిన తోట నవత (23) స్థానిక ఉర్దూ మీడయం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఆమెకు, వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడకు చెందిన రజనీకాంత్‌తో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. పెళ్లి ముహూర్తం దూరంగా ఉండడంతో రజనీకాంత్ దుబాయి వెళ్లాడు. ఇద్దరు రోజూ ఫోన్లో మాట్లాడుకునే వారు. అయితే, నాలుగు రోజుల నుంచి రజనీకాంత్ ఫోన్ చేయడం లేదు. ఆదివారం వరుడి తరఫు బంధువులు నవత ఇంటికి వచ్చి ఈ పెళ్లి చేసుకోవడం రజనీకాంత్‌కు ఇష్టం లేదని, సంబంధం రద్దు చేసుకుందామని ఆమె తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన నవత ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో పాటు అదే గల్లీలో ఉండే అమ్మమ్మ తదితరులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అయితే, అమ్మమ్మ తమ ఇంటికే వెళ్లిందని గుర్తించిన నవత ఆమె ఇంట్లోకి వెళ్లి తాడుతో ఉరేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి చూడగా దూలానికి వేలాడుతూ కనిపించింది. ఆమె కేకలు వేయడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కట్నం కోసమేనా..? నవతతో పెళ్లి రద్దు చేసుకోవడానికి కారణం అదనపు కట్నమే కారణమని తెలిసింది. బాల్కొండ మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతి వాళ్లు ఎక్కువగా కట్నం ఇస్తారనడంతోనే ఈ సంబంధాన్ని వద్దన్నారని సమాచారం. పెళ్లి కుదిరిన సమయంలో నవత తల్లిదండ్రులు కట్నం కింద తొలి విడతలో రూ.లక్ష ముట్టజెప్పినట్లు స్థానికులు తెలిపారు. అయితే, అదనపు కట్నంపై ఆశతోనే పెళ్లిని రద్దు చేసుకున్నారని, దీంతో మనస్థాపానికి గురైన నవత ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. -
ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య
మైసూరు: మానసిక రుగ్మతతో బాధపడుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం నగరంలోని రాఘవేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. రాఘవేంద్రనగర్‌కు చెందిన మోనికా గంగాడికర్(18) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం చదువుతోంది. అయితే కొద్ది కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న మోనికా.. సోమవారం తల్లితో గొడవ పడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించే సమయానికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వివాహమైన 8 నెలలకే...
అనుమానాస్పదస్థితిలో యువతి ఆత్మహత్య ప్రకాశం జిల్లా : వారిద్దరివీ వేరువేరు కులాలు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ, ఏమైందో ఏమోగానీ పెళ్లయిన 8 నెలలకే ఆ యువతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంతనూతలపాడు మండలం చండ్రపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బల్లికురవ అశోక్ ఒంగోలుకు చెందిన రేష్మ (21)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం వేకువజామున 4 గంటలకే ఆటో తీసుకుని ఒంగోలు వెళ్లాడు. ఆ వెంటనే 4.30 గంటలకు ఇంటివెనుక నుంచి ఇంటిపైకి వచ్చిన వేపచెట్టు కొమ్మకు చీరతో ఉరేసుకుని రేష్మ ఆత్మహత్యకు యత్నించింది. ఆ అలికిడి విని చుట్టుపక్కల వారు ఇంటిపైకి ఎక్కి చీరను కత్తితో కోసి రేష్మను కిందకు దించారు. కానీ, ఆలోపే ఆమె ప్రాణాలు వదిలింది. ఘటన స్థలాన్ని సీఐ మురళీకృష్ణ, తహసీల్దార్ ప్రభాకర్, ఎస్సై షేక్ ఖాదర్‌బాషా పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువతి ఆత్మహత్యపై అనుమానాలు
బరంపురం: యువతి మమ్మిని బెహరా(20) మరణంపై పోలీసు అధికారుల్లో హత్య, ఆత్మహత్య అనే సందేహాలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం బెహరా మృతి చెందగా, దీనిపై అనుమానాలు వీడడం లేదు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం... బరంపురం పెద్ద బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో కుమ్మరి వీధిలో బాస్కర్ బెహరా నివాసం ఉంటున్నాడు. తమ్ముడు కుమార్తె మమ్మిని బెహరా(20) తన ఇంట్లో ఉంటూ మహమాయి మహిళా కళాశాలలో +3 డిగ్రీ చదువుతుంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో మమ్మిని బెహరా నిద్రలేచి పెరటిలోకి వెళ్లి తన చున్నీతో ఉరి వేసుకుంది. మమ్మిని బెహరా ఎంతకీ రాకపోయే సరికి పెద్దమ్మ రంజని బెహరా పెరటికి వెళ్లి చూసే సరికి కొన ఊపిరితో మమ్మిని ఉంది. వెంటనే ఆటోలో సోదరుడు సునిల్ బెహరా, పెద్దనాన్న భాస్కర్ బెహరా సొంత గ్రామం కుల్లడా తీసుకువెళుతుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు సోదరుడు సునిల్ బెహరా తెలియజేశారు. మృతురాలు తండ్రి సంతోష్ బెహరా, పెద్దనాన్న భాస్కర్ బెహరా కలిసి శ్రీరామ్‌నగర్ చివరన ఉన్న శ్మశానంలో మమ్మిని బెహరాకు దహన సంస్కారాలు చేశారు. మమ్మిని బెహరా ఆత్మహత్యపై అనుమానాలు రావడంతో ఆమె సొంత సోదరులు దీరు బెహరా, గురు బెహరా ఆదివారం సాయంత్రం పెద్ద బజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేవారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టి కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. దర్యాప్తు కొనసాగుతుందని పూర్తయిన వెంటనే నిజాలు వెలుగులోకి వస్తాయని ఎస్డీపీవో తెలియజేశారు. -
‘నా చావుకు ఎవరూ కారణం కాదు’
నోట్ రాసి వివాహిత బలవన్మరణం మలేసియా టౌన్షిప్: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని నోట్ రాసి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్‌బీ ఎస్ఐ రాజయ్య కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీకాంత్, జ్యోత్స్నలు కేపీహెచ్‌బీ వసంతనగర్‌లో ఉంటున్నారు. శ్రీకాంత్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుండగా.. జ్యోత్స్న గృహిణి. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. రోజూ మాదిరిగానే గురువారం ఉ దయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్లిన శ్రీకాంత్ మధ్యాహ్నం జ్యోత్స్నకు ఫోన్ చేయగా తీయలేదు. దీంతో వాచ్‌మన్‌కు ఫోన్ చేసి తన ఇంటికి వెళ్లమని చెప్పా డు. వాచ్‌మన్ వెళ్లి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. లోపలి నుంచి పాప ఏడుపు వినిపించింది. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా జ్యోత్స్న ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలాన్ని పరిశీలించగా సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘నా చావుకు ఎ వరూ కారణం కాదు. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కట్నం వేధింపులకు వివాహిత బలి
జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన లక్ష్మి వివాహంనర్సాపూర్‌కు చెందిన కటికనపెల్లి తిరుపతితో ఆరేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో లక్ష్మి పుట్టింటివారు రూ.50 వేలు, తులం బంగారం కట్నంగా ఇచ్చారు. కొంతకాలంపాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా అదనంగా కట్నం తేవాలని భార్యను తిరుపతి వేధించసాగాడు. లక్ష్మి తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు మరో రూ.50 వేలు అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మరింత కట్నం తేవాలని తిరుపతి వేధిస్తుండడంతో భరించలేని లక్ష్మి సోమవారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మి అర్ధరాత్రి చనిపోరుుంది. మృతదేహాన్ని సీఐ సతీశ్‌కుమార్, తహశీల్దార్ కుమారస్వామి మంగళవారం పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి రామిళ్ల లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై మల్లయ్య తెలిపారు.