జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన లక్ష్మి వివాహంనర్సాపూర్‌కు చెందిన కటికనపెల్లి తిరుపతితో ఆరేళ్ల క్రితం జరిగింది. వివాహ సమయంలో లక్ష్మి పుట్టింటివారు రూ.50 వేలు, తులం బంగారం కట్నంగా ఇచ్చారు. కొంతకాలంపాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా అదనంగా కట్నం తేవాలని భార్యను తిరుపతి వేధించసాగాడు. లక్ష్మి తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు మరో రూ.50 వేలు అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి మరింత కట్నం తేవాలని తిరుపతి వేధిస్తుండడంతో భరించలేని లక్ష్మి సోమవారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది.
గమనించిన కుటుంబ సభ్యులు లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి లక్ష్మి అర్ధరాత్రి చనిపోరుుంది. మృతదేహాన్ని సీఐ సతీశ్‌కుమార్, తహశీల్దార్ కుమారస్వామి మంగళవారం పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి రామిళ్ల లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై మల్లయ్య తెలిపారు.