Disorder
-
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. మా అమ్మాయి ఈ మధ్యే బి.టెక్. పూర్తి చేసింది. తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టాం. తను ఈ మధ్య కాస్త విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టింది. తాను ఒక సినిమా హీరోని ప్రేమిస్తున్నానని, అతణ్ణి మాత్రమే పెళ్ళి చేసుకుంటానని అంటోంది. ఏదో చిన్నపిల్ల సరదాగా మాట్లాడుతుంది అనుకున్నాము. ఆ హీరో కూడా తనను ఇష్టపడుతున్నాడని, అందుకే తాను ఎవర్నీ పెళ్ళి చేసుకోవట్లేదని ఏదేదో మాట్లాడుతుంది. తన గది నిండా ఆ హీరో ఫోటోలతో నింపేసింది. ఫోన్లో ఎప్పుడూ ఆ హీరో సినిమాలే చూస్తుంటుంది. అతను ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడితే అది తనకి ఇన్‌డైరెక్ట్‌గా మెసేజెస్ పంపిస్తున్నాడని అనుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తమను కలుసు కోకుండా అడ్డం పడుతున్నారని, అందుకే నేరుగా వెళ్ళి తనను కలుస్తానని, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మేం గట్టిగా చెప్తే ఏదైనా చేసుకుంటా అని బెదిరిస్తోంది. మాకు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి మాకు ఈ సమస్య నుండి బయటపడే దారి చూపెట్టండి. – విజయలక్ష్మీ, రాజమండ్రిమీరు రాసిన లక్షణాలన్నీ ‘ఎరటో మేనియా ’(Erotomania) లేదా ‘డిక్లేరామ్బాల్ట్ సిండ్రోమ్’ (De Clérambault's syndrome) అనే ఒక రకమైన మానసిక రుగ్మతకు సంబంధించినవి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే చూస్తుంటాం. తమకంటే బాగా ఉన్నత మయిన స్థాయిలో లేదా పదవిలో ఉన్న పురుషులు లేదా సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ లాంటి వారు తమతో రహస్యంగా ప్రేమలో ఉన్నారనే భ్రమలో ఉంటారు. వాళ్ళ ప్రవర్తనని, మాట్లాడే మాటలని తమకోసమే చేస్తున్నారని తప్పుగా భావించుకుంటారు. వాళ్ళకి ఉత్తరాలు, ఇమెయిల్స్, బహుమతులు పంపడం లాంటివి కూడా చేస్తుంటారు. అవతలివైపు నుండి ఎటువంటి స్పందన లేకపోతే తమ మధ్య వేరేవాళ్ళు అడ్డుపడుతున్నారనో లేదా కావాలనే అవతలి వ్యక్తి గోప్యతని పాటిస్తున్నారని కూడా వాదిస్తారు. వాళ్ళు అనుకునేది నిజం కాదు, భ్రమ అని చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, నమ్మకపోగా గొడవలు చేయడం, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం లేదా ఏదైనా చేసుకుంటాం అని బెదిరించడం లాంటివి కూడా చేస్తారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోవాళ్ళకి ఉన్నది ఒక మానసిక సమస్యే అని వారికి తెలియకపోవడం వల్ల వారితో మందులు వేయించడం కూడా కష్టమే. ఇది కాస్త క్లిష్టమైన మానసిక సమస్యే అయినప్పటికీ కొంతకాలం వాళ్ళని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో, ఆసుపత్రిలో ఉంచి, మందులు, కౌన్సెలింగ్ ద్వారా వైద్యం చేస్తే క్రమంగా వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి తగిన వైద్యం చేయించండి. ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది! చదవండి: 35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఆన్లైన్ షాపింగ్‌లో బిజీనా.. అయితే బీకేర్‌ఫుల్!
ఐరన్ మ్యాన్ 3 టీ షర్ట్ కావాలా.. ఆన్‌లైన్‌కు వెళ్లు, బ్లూటూత్ అవసరమా నెట్లో చూడు.. లంచ్‌కి వెజిటబుల్స్ లేవా జొమాటోలో ఆర్డర్ పెట్టు.. ఇది ప్రస్తుతం నగరంలో నడుస్తోన్న కొత్త రకమైన మానియాగా వైద్యులు చెబుతున్నారు.. నగరవాసుల ధోరణిలోనూ ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గృహిణులకు, విద్యార్థులకు, సమయాభావంతో షాపింగ్‌కు వెళ్లలేని వారికి అత్యంత సౌకర్యంగా ఉంటున్న ఈ షాపింగ్ ట్రెండ్.. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కొందరిలో తీవ్రస్థాయి వ్యసనంగా మారడం ఆందోళనకర పరిణామం అని నిపుణులు చెబుతున్నారు. తొలుత దీనిని ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’గా పేర్కొన్న సైకాలజిస్ట్స్.. ఇప్పుడు తీవ్రత దృష్ట్యా ఈ వ్యాధికి ఒనియోమానియా అని నామకరణం చేశారు. ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ‘కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్’ అని పేర్కొనే వ్యాధి ఆధునికుల్లో ముదురుతోందని గుర్తించారు. ‘దీనిని ప్రత్యేక మానసిక ఆరోగ్య స్థితిగా గుర్తించడానికి ఇది సరైన సమయం’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆస్ట్రిడ్ ముల్లర్ అన్నారు. కాంప్రహెన్సివ్ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 5% మంది పెద్దలను సీబీడీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ వెల్లడించింది. వీరిలో ముగ్గురిలో ఒకరు తీవ్రమైన ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధపడుతున్నారు. ఇప్పుడు దీనినే ఒనియోమానియాగా వ్యవహరిస్తున్నారు. ఒనియోమానియా అనేది గ్రీకు భాషలోని ‘ఒనియోస్‘ అనే పదం నుంచి ఉద్భవించింది, ఇది ‘ఉన్మాదం’, ‘పిచ్చితనం’ అనే దానిని సూచిస్తుంది. కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ (సీబీడీ) ముదిరి ఆరోగ్యంపై ప్రతికూల ఫలితాలకు దారితీసే స్థాయిని షాపింగ్ ద్వారా నిర్ధారిస్తారు. తక్షణ ఉత్సాహం కోసం.. ఆన్లైన్ షాపింగ్ వ్యసనపరులం అయ్యామా లేదా అనేదానికి సమాధానంగా వారం రోజుల్లో మనం ఎన్ని ప్యాకేజీలను రిసీవ్ చేసుకున్నాం? అనేది లెక్కిస్తే సరి అంటున్నారు కన్సల్టెంట్ క్లినికల్ సైకాలజిస్ట్ అంకుర్ సింగ్. ఆన్లైన్ షాపింగ్ వ్యసనాన్ని కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్ దాటి ఒనియోమానియాగా పిలుస్తున్నామని, ఇది జీవితంలో ప్రతికూల పరిణామాలకు దారితీసే అతి పెద్ద ప్రవర్తనా సమస్య అని హెచ్చరించారు. ఈ ఆన్లైన్ షాపింగ్ తక్షణ ఆనందాన్ని ఉత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. హార్మోన్లపై ప్రభావం.. కొనుగోలు వల్ల కలిగే ఉత్సాహంతో బాక్స్‌ను ఓపెన్ చేసిన మరుక్షణమే డోపమైన్ హోర్మోన్ విడుదలవుతుంది. ఇది మరింత షాపింగ్ చేయాల్సిన అవసరాన్ని తెస్తుందని అంకుర్ వివరించారు. దీంతో ఒత్తిడి, ఆందోళన, నిరాశ లేదా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి షాపింగ్‌ను ఒక మార్గంగా ఉపయోగించడం పెరుగుతోందని, చివరికి మరింత తీవ్ర ఒత్తిడికి దారి తీస్తోందని విశ్లేషించారు. షాపింగ్ నుంచి పొందిన తాత్కాలిక ఉపశమనం లేదా ఆనందాన్ని పదే పదే కోరుకోవడం, మాదకద్రవ్య దురి్వనియోగానికి సమానమైన వ్యసనాన్ని సృష్టించగలదని హెచ్చరించారు.నష్టాలెన్నో.. సాధారణ వ్యక్తిగత షాపింగ్ సరదా ఎవరికీ హానికరం, లేదా బాధించేది కాదని చాలా మంది భావించవచ్చు. అయితే, ఇది స్థూల ఆర్థిక ఒత్తిడికి దారితీస్తుంది. ప్రత్యేకించి భాగస్వాములిద్దరూ ఉమ్మడి ఆర్థిక ఖాతాను కలిగి ఉన్న సందర్భాల్లో.. ఇది కొనుగోళ్లను దాచిపెట్టమని ప్రేరేపిస్తుంది. ఇది నెమ్మదిగా అపరాధ భావం లేదా అవమానం, ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవం లోపించడం వంటి భావనలను కలిగిస్తుంది. ఈ ప్రవర్తన సామాజిక ఒంటరితనానికి దారితీయవచ్చు. వ్యక్తులు తమ షాపింగ్ అలవాట్లపై నియంత్రణ కోల్పోవచ్చు. ఇది ఆకస్మిక నిర్ణయాలకు దారి తీస్తుందని, ప్రతికూల పరిణామాలు ఉన్నప్పటికీ ఆపలేకపోవడం వ్యాధి తీవ్రతకు చిహ్నమని, ఈ అలవాటు అనుబంధాలపై సైతం వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తు పొదుపు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని సూచిస్తున్నారు. ఇలా వదులుకోవాలి.. ⇒ ఆన్లైన్లో గడపడం కన్నా వ్యాయామం చేయడం, స్నేహితులతో ముచ్చట్లు వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిచాలి. ⇒ విచక్షణతో కూడిన ఖర్చుల కోసం కఠినమైన బడ్జెట్‌ను సెట్ చేసుకోవాలి. పరిమితుల్లో ఉండేలా ఖర్చులను నిర్ణయించుకోవాలి. ⇒ ప్రచార ఈ మెయిల్స్ నుంచి సబ్స్క్రిప్షన్స్ తీసేయడం, ఫోన్ వగైరా డివైజ్‌ల నుంచి షాపింగ్ యాప్‌లను తగ్గించేయాలి. ⇒ తరచూ షాపింగ్ వెబ్సైట్లను సందర్శించకుండా నియంత్రించుకోవాలి. ⇒ అవసరం లేని వస్తువులను జాబితా తయారు చేసి పొరపాటున కూడా అవి కొనుగోలు చేయవద్దని నిర్ణయించుకోవాలి. మొదటి పది ఇవే.. నగరవాసులు అత్యధికంగా ఈ–షాప్ చేస్తున్నవాటిలో అగ్రస్థానంలో పుస్తకాల కొనుగోలు ఉంటే, ఆ తర్వాత వరుసగా దుస్తులు, మూవీ టిక్కెట్స్, ప్రయాణ టిక్కెట్లు, యాక్సెసరీస్, కార్డ్స్, డిజిటల్ డివైజ్‌లు, ఫుట్‌వేర్, గృహోపకరణాలు, బ్యూటీ ప్రొడక్ట్స్.. వగైరా ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన వాళ్లు తరచూ సందర్శిస్తున్న షాపింగ్ సైట్లలో.. స్నాప్ డీల్, అమెజాన్, ఇబే, మింత్ర, జెబాంగ్, ఫ్లిప్‌కార్డ్, షాప్‌క్లూస్, దేశీడైమ్, ఫ్యాషన్ ఎన్ యు.. వంటివి ఉన్నాయి.నగరమా బీకేర్‌ఫుల్.. కరోనా మహమ్మారితో లాక్డౌన్ వల్ల నగరవాసులు ఫిజికల్ స్టోర్లను విస్మరించి, ఆన్లైన్లో ఆర్డర్ చేసేలా అలవాటుపడ్డారు. పైగా నగరంలో ఒక చోటు నుంచి మరోచోటుకు రాకపోకలకు ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు..వంటివి దృష్టిలో పెట్టుకుని గత కొన్ని సంవత్సరాలుగా ఇ–కామర్స్ విపరీతంగా పెరిగింది. అంతేకాక స్మార్ట్ఫోన్ల వినియోగం ఆన్లైన్ షాపింగ్ విజృంభణకు ఆజ్యం పోసింది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ పరంగా 5.73 శాతంతో నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. కాగా రంగారెడ్డి జిల్లా తొమ్మిదో స్థానంలో ఉండడం గమనార్హం. నానాటికీ విస్తరిస్తున్న వ్యాపార వ్యూహాలను గమనిస్తే.. త్వరలోనే నగరం టాప్‌కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని, దీంతో పాటే వ్యసనబాధితుల సంఖ్యలోనే అగ్రగామి కావడం జరగవచ్చని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేవలం పుస్తకాలే.. తొలుత దాదాపు 50 పుస్తకాలకు పైగా ఆన్లైన్ ద్వారానే కొన్నాను. అలా అలా ఇప్పుడు రెగ్యులర్ ఈ–షాపర్ అయిపోయా. కేవలం పుస్తకాలే కాకుండా టేబుల్స్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కూడా ఆన్లైన్లోనే కొంటున్నాను. – నికుల్గుప్తాతక్కువ ధరలకు.. నగరంలోని షోరూమ్‌లు అందించే వాటికన్నా.. ఆన్లైన్ ద్వారానే ఎక్కువ లేటెస్ట్ వెరైటీలు దొరుకుతాయి. బర్త్‌డే లేదా పార్టీ, ఫంక్షన్‌కు తగినవి, లేటెస్ట్ ఫ్యాషనబుల్ గూడ్స్ ఇంటి నుంచే సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అందుకే ప్రస్తుతం షాపింగ్‌లో దాదాపు 70 శాతం ఆన్లైన్ మీదే. – పూజానేతి -
‘పుష్ప-2’విలన్‌కి ఆ సమస్య.. భార్య ఏం చేసిందో తెలుసా?
మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) పుష్ప-2తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళయాళంలో హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ..ఈ చిత్రంతోనే ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా చెరగని ముద్ర వేశాడు. అందుకు తన భార్యే కారణం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఫహాద్. ఆయన ఇటీవలే ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్(ADHD (Attention Deficit Hyperactivity Disorder))) సమస్య బారినపడ్డాడు. ఇలా భార్యభర్తల్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారినడితే ఒక్కసారిగా సంసారంలో గందగోళం ఏర్పడుతుంది. అయితే ఆ పరిస్థితి ఎదురవ్వకుండా తన భార్య తీసుకున్న అనుహ్యమైన నిర్ణయం తమ దాంపత్యం మరింత బలపడేలా చేసిందంటూ భార్య నజ్రియా నజీమ్(Nazriya)పై ప్రశంసల జల్లు కురిపించాడు. మరీ అర్థాంగికి అసలైన అర్థ ఇచ్చేలా ఫహద్ భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దామా..నజ్రియా ప్రపోజ్ చేయడంతోనే..2014లో రూపొందిన మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్’ షూటింగ్లో కలుసుకున్న వీరు.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని నెలల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. అదే ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.అయితే ఈ ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది నజ్రియానే. బెంగళూరు డేస్ చిత్రం షూటింగ్‌లోనే ఓ రోజు నజ్రియానే ఫహద్ దగ్గరికి వచ్చి.. ‘నన్ను పెళ్లి చేసుకో.. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా..’ అని ప్రపోజ్ చేసింది. అది కొత్తగా అనిపించి వెంటనే అందుకు సమత్తం తెలిపాడు ఫహాద్. అలా ఈ ఇద్దరి ప్రేమ పెళ్లిపీటలెక్కింది. అయితే ఫహద్ మాత్రం తన భార్యే ముందు ప్రపోజ్ చేసిందంటూ తెగ సంబరపడిపోతాడు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారాన్ని చూసి విధి పరీక్ష పెట్టాలనుకుందో ఏమో..!. ‘ఫహద్‌కు గతేడాది ఏడీహెచ్‌డీ ఉందని నిర్ధారణ అయింది. ఓపికనే ఆయుధంగా..అయితే నజ్రియా గాబరాపడిపోలేదు. తన భర్త ఈ సమస్యలను అధిగమించేలా తగిన ప్రోత్సహాన్ని అందించింది తమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకుంది. ఈ మానసిక సమస్య తనలో ఎప్పటి నుంచో ఉండొచ్చు. కానీ ఇప్పుడిలా బయటపడింది. అది తమ జీవితం భాగమైపోతుందే తప్ప కొత్తగా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని ధీమగా చెబుతోంది నజ్రియా. "దానికి మా సంతోషాన్ని ఆవిరి చేసే అవకాశం ఇవ్వను. మరింతం అన్యోనంగా ఉండి..ఆ మానసిక పరిస్థితిని తరిమికొట్టేలా తన భర్తకు సహకరించి, ఓపిగ్గా వ్వవహరిస్తానంటోంది". నజ్రియా. అర్థాంగి అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా నిలిచింది నజ్రియా. ప్రతి బంధకంలా ఎదురయ్యే పరిస్థితులను ఆకళింపు చేసుకుని తగిన విధంగా కొద్దిపాటి మార్పులు చేసుకుంటే బంధాలు విచ్ఛిన్నం కావని చేసి చూపించింది నజ్రియా. ఏడీహెచ్‌డీ అంటే..అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడే వ్యక్తికి శ్రద్ధ చూపడం, ఉద్రేకపూరిత ప్రవర్తనలను నియంత్రించడం, వారి ఆలోచనలను ట్రాక్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది ఆందోళన , డిప్రెషన్ లేదా ఇతర మానసిక అనారోగ్య లక్షణాల మాదిరిగానే ఉంటాయి .లక్షణాలు..అనూహ్య మానసిక కల్లోలం కలిగి ఉంటారుపనిలో నిర్లక్ష్యంఅవతలి వ్యక్తి మాట్లాడితే వినాలనిపించకపోవడంసూచనలను అనుసరించకపోవడం లేదా పనులను పూర్తి చేయకపోవడంకార్యకలాపాలను నిర్వహించ లేకపోవడంపనిలో నిరంతర మానసిక శ్రమను నివారించండిఅసహనంనిద్రలేమి వంటి సమస్యలుఅతిగా మాట్లాడటంనివారణ: కేవలం మానసిక నిపుణుల కౌన్సిలింగ్, ఇంట్లో వాళ్ల సహకారంతో దీన్నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: లక్షల వేతనాన్ని వద్దునుకుని సివిల్స్‌కి ప్రిపేరయ్యింది..కట్‌చేస్తే..!) -
అలాంటి వ్యక్తులకి మళ్ళీ పెళ్ళి చేయడం పొరపాటేనా!
డాక్టరుగారూ! మా తమ్ముడు బయట అందరితో చాలా బాగా ఉంటాడు. ఇంట్లో మాత్రం ఎప్పుడూ భార్యతో కొట్లాటలే! భార్యను విపరీతంగా అనుమానిస్తాడు. చాలామందితో సంబంధాలున్నాయని తిట్టడం కొట్టడం కూడా చేశాడు. నిజానికి వాడి భార్య చాలా మంచి అమ్మాయి. ఈ బాధలు భరించలేక మూడేళ్ళ క్రిందట ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. సంవత్సరం కిందట మళ్ళీ మా పెద్దలు రెండో వివాహం చేశారు. మళ్ళీ అదే విధంగా ఈమెను కూడా అనుమానించి వేధిస్తున్నాడు. మావాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో మాకర్థం కావడం లేదు. ఈమె కూడా వీడు పెట్టే బాధలు తట్టుకోలేక ఏమైనా చేసుకుంటుందేమోనని మాకు భయంగా ఉంది. మా తమ్ముడికి ఇలా మళ్ళీ పెళ్ళి చేయడం మా తప్పేనంటారా! అసలు మావాడెందుకు ఇలా చేస్తున్నాడో దయచేసి చెప్పండి.– పద్మావతి, గిద్దలూరుమీ తమ్ముడు ‘డెల్యూజనల్ డిసార్డర్’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు మీరు రాసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. దీనిని ‘ఒథెల్లో సిండ్రోమ్’ అని కూడా అంటారు. షేక్స్పియర్ రాసిన ‘ఒథెల్లో’ నాటకంలోని ఇతివృత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకున్నా, వాస్తవం కాకపోయినా జీవిత భాగస్వామి శీలాన్ని శంకించి ఇలా వేధించడం ఒక విధమైన మానసిక జబ్బే! మెదడులోని కొన్ని రసాయనిక చర్యలవల్ల, వారసత్వంగా వచ్చే జీన్స్ ప్రభావం వల్లనూ కొందరికి ఈ వ్యాధి వస్తుంది. ఇది కూడా ఒక మానసిక రుగ్మత అని తెలియక మీరు మీ తమ్ముడికి మళ్లీ వివాహం చేసి పెద్దపొరపాటు చేశారు. మీ మరదలు చాలా మంచిదని మీరే చెబుతున్నారు కదా... మొదట్లోనే మీవాడిని మానసిక వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించి ఉంటే, మీ మరదలు అలా ఆత్మహత్య చేసుకొని ఉండకపోవచ్చు. ఏమైనా, మీ తమ్ముడికి వచ్చే ఈ అనుమానాలను తగ్గించేందుకు, మంచి మందులు, ఇతర చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఇంకో అఘాయిత్యం జరగక ముందే వెంటనే మీ తమ్ముణ్ణి దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌కు చూపించి వైద్యం చేయిస్తే మీ వాడు పూర్తిగా ఆ భ్రమలు, భ్రాంతుల నుండి బయటపడి రెండో భార్యతో సంతోషంగా సంసారం చేయగలడు. ఆలస్యం చేయకుండా మానసిక వైద్య చికిత్స చేయించండి. (చదవండి: సూర్యరశ్మికి కొదువ లేదు..ఐనా ఆ విటమిన్ లోపమే ఎక్కువ ఎందుకు..?) -
తల వెంట్రుకలను లాగేసుకుంటోంది..!
మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. బీటెక్ చదువుతోంది. ఈ మధ్య తల వెంట్రుకలను గట్టిగా పట్టి ఒక్కొక్కటీ లాగేసుకుంటోంది. మాట్లాడుతూనో.. చదువుకుంటూనో... ఇలా వెంట్రుకలు లాగేస్తోంది. దీనివల్ల తలలో చాలా భాగం బట్టతలలా మారి చూడటానికి అసహ్యంగా కనిపిస్తోంది. గట్టిగా మందలిస్తే, అప్పుడు మానేస్తుంది కానీ మళ్లీ మామూలే! మాకు విసుగొచ్చి ఒక దెబ్బ వేస్తే ఏడుస్తోంది. తాను కావాలని అలా చేయడం లేదనీ, తనకు తెలియకుండానే అలా లాగేస్తున్నానని చెబుతోంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఇలా చేస్తుంటే నలుగురూ ఏమనుకుంటారో అని భయంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే తనకసలు పెళ్లవుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– రాజేశ్వరి, ఆదిలాబాద్మీరు చెప్పిన వివరాలను బట్టి మీ అమ్మాయి ట్రైకోటిల్లో మేనియా అనే మానసిక రుగ్మతతో బాఢపడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది యువతలో వచ్చే ఒక అరుదైన మానసిక రుగ్మత. తలవెంట్రుకలే కాకుండా, కొందరు కనుబొమలు, కంటిరెప్పల వెంట్రుకలను కూడా ఇలాగే లాగేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే ఇలా లాగేసిన వెంట్రుకలను మింగడం కూడా జరుగుతుంది. కొందరు పిల్లల్లో సడన్‌గా వచ్చే కడుపునొప్పికి కారణం ఈ వెంట్రుకలన్నీ కడుపులో అడ్డుపడడమే! ఆందోళన, టెన్షన్‌కు లోనయిన వారిలోనూ, బుద్ధిమాంద్యమున్న వారిలోనూ ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కంపల్సివ్ పుల్లింగ్ అంటే వెంట్రుకలు లాగేయడం అన్నది మళ్లీ మళ్లీ చేయాలనే ఒక మానసిక వైపరీత్యం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీనిని ఎంత అదుపు చేసుకుందామనుకున్నా వారికి సాధ్యం కాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆధునిక మానసిక వైద్యశాస్త్రంలో అద్భుతమైన ఔషధాలతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స కూడా ఉంది. చాలామందికి ఇది మానసిక సమస్య అని తెలియక చర్యవ్యాధి డాక్టర్లను సంప్రదిస్తుంటారు. మీరు ఆలస్యం చేయకుండా మీకు దగ్గరలోని మానసిక వైద్యుని సంప్రదిస్తే మీ అమ్మాయిని ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే..? మనసులో సునామిలా..
అది ఇటీవల కేరళలో రుతూ ముంచేసిన బురద ప్రవాహమే కావచ్చు... లేదా అప్పట్లో చార్ధామ్ లో తుడిచిపెట్టేసిన వరద ప్రవాహమే కావచ్చు. అలనాటి సునామీ లేదా ఉత్తర కాశీ భూకంపమే కావచ్చు... ఇంకా యుద్ధ ఘటనలు.. దాడి లేదా దౌర్జన్యం, లైంగిక దాడి, ముష్కరులు మూకుమ్మడిగా విరుచుకుపడటం, గాయాలపాలు చేయడం, దోపిడీ... ఇలా ఏదైనా సరే అది మానసికంగా షాక్‌కు గురిచేయవచ్చు. ఇవే కాదు... తుఫాను, భారీ అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు, కుటుంబసభ్యులెవరైనా దూరం కావడం, హత్య, ఆత్మహత్య వంటి ఘటనల్లో షాక్‌కు గురవుతారు. షాక్ తర్వాత బాధితులను నిస్తేజంగా మార్చే పరిస్థితిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ (పీటీఎస్డీ) అంటారు. ఈ ‘పీటీఎస్డీ’ గురించి అవగాహన కోసమే ఈ కథనం.పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) బారిన పడ్డ వ్యక్తులు సురక్షితంగా ఉన్నప్పుడూ లేదా అలాంటి పరిస్థితులేమీ లేని సమయాల్లో కూడా తీవ్రంగా భయపడుతుంటారు. మిగతావాళ్లతో పోలిస్తే స్త్రీలు, పిల్లలు ఈ షాక్‌కు గురయ్యే ఛాన్స్ ఎక్కువ. పిల్లలైతే... ఎప్పుడో వదిలేసిన పక్క తడపడం వంటి అలవాటు పునరావృతం కావడం మాటలు మరచి΄ోవడం, మాటల కోసం తడుముకోవడం ∙హాయిగా, ఆడుకోలేక΄ోవడం ఆత్మీయులైన పెద్దలను విడవకపోవడం. బాధితులతో వచ్చే ముప్పు... తమను తాము ఎంతో నిస్సహాయులుగా పరిగణించి బాధపడటం తీవ్రమైన భయాలతో ఎవరితోనూ కలవక, ఒంటరిగా ఉండిపోవడం తమను తాము బాధించుకోవడం, ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఒక్కోసారి ఎదుటివాళ్లపై దాడికి దిగడం. నిర్ధారణ... బాధితుల లక్షణాలనూ వాళ్ల మెడికల్ హిస్టరీని బట్టి బాధితుల స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను రాబట్టడం ద్వారా ∙కొన్ని మానసిక పరీక్షల ద్వారా. మేనేజ్మెంట్ / చికిత్స... సపోర్టివ్ థెరపీ, రీ ఎష్యూరెన్స్, యాక్టివ్ లిజనింగ్, కోపింగ్ స్కిల్స్ నేర్పడం వంటి చికిత్సలు.ఎక్స్పోజర్ థెరపీ : ఒకేసారి ఆ సంఘటనను గుర్తు చేయకుండా మెల్ల మెల్లగా ఆ సంఘటన గురించి వివరిస్తూ, ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి మెల్ల మెల్లగా తీసుకెళ్తూ, ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదనీ, ఇకపై అక్కడ ఎంతమాత్రమూ హాని జరగదనే భరోసా కల్పించడం. లక్షణాలు... ఆ సంఘటన మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లే ఫీల్ కావడం లేదా ఆ సంఘటనలో ఉన్నట్లే ఫీలవుతారు. నిద్రలో పీడకలలు. అందులో అదే సంఘటన జరుగుతున్నట్లుగా కలలు వస్తాయి ఆ సంఘటన గురించి తలచుకోడానికి, మాట్లాడానికి ఇష్టపడకపోవడం ఎంత వద్దనుకున్నా మాటిమాటికీ ఆ సంఘటనల తాలూకు ఆలోచనలే రావడంసంఘటన తాలూకు ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం ఆ టైమ్‌లో తమతో ఉన్న వాళ్లను కలవకపోవడం లేదా తప్పించుకుని తిరగడం ∙మూడ్స్ వేగంగా మారిపోవడం ∙ఒక్కోసారి ఆ సంఘటన తాలూకు ఎలాంటి జ్ఞాపకమూ లేకపోవడం ఆ సంఘటన గురించిన భయాలు, విపరీతమైన కోపం, సిగ్గుగా ఫీల్ కావడం ప్రతికూల ఆలోచనలే వస్తుండటం సంఘటన పట్ల తనను తానుగానీ లేదా ఇతరులను గానీ నిందిస్తూ ఉండటం ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరి గా ఉండటం ఒకప్పుడు తనకు సంతోషం కలిగించిన అవే పనులు ఇప్పుడు ఏమాత్రం ఆనందం ఇవ్వక΄ోవడం పరిసరాల పట్ల చాలా ఎక్కువ అనుమానాస్పదంగా ఉండటం ఏ విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, నిద్ర సమస్యలు (నిద్రపట్టక΄ోవడం లేదా ఎప్పడూ నిద్రలోనే ఉండటం).కాగ్నిటివ్ రీ కన్స్ట్రక్షన్ ఆ సంఘటనలో బాధితుల ప్రమేయం లేదనీ, ఆ సంఘటన గురించి అపరాధభావనతో ఉండాల్సిన అవసరం లేదనీ, అప్పుడున్న మనుషుల నుంచి తప్పించుకుని తిరగాల్సిన పనిలేదనే నమ్మకాన్ని కల్పించడం. ఇలా సైకోథెరపీ చేస్తూ, ఆత్మహత్య ఆలోచనలనుంచి బయటపడేసే మందుల తోపోటు సెలెక్టివ్ సెరిటోనిన్ రీ–ఆప్టేక్ ఇన్హిబిటార్స్, సెరిటోనిన్ నార్ ఎపీనెఫ్రిన్ రీ అప్టేక్ ఇన్హిబిటార్స్, నార్ ఎపీనెఫ్రిన్–డోపమైన్ రీ అప్టేక్ ఇన్హిబిటార్స్ వంటి మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స అందిస్తారు. డా. శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్ సైకియాట్రిస్ట్(చదవండి: బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్) -
చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా చదవకుండా ఉండలేను..?
డాక్టర్ గారూ! నా సమస్య మీకు వింతగా అనిపించవచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా నవలలు, వీక్లీలు... ఒకటేమిటి... ఏ పుస్తకం కనబడినా చదవడం అలవాటైంది. క్లాసు పుస్తకాలు చదువుతుంటే నేను చదివిన నవలల్లోని పాత్రలు, సన్నివేశాలు కళ్ళ ముందు మెదిలి చదవలేక΄ోతున్నాను. దానివల్ల ఆ చదువు ముందుకెళ్ళడం లేదు. ఏదైనా కొత్త పుస్తకం కనబడితే, వెంటనే మొత్తం చదవక΄ోతే, ఏదో పోగొట్టుకున్న భావన కలుగుతుంది. ఆఖరుకు చెత్త కుండీలోని పేపరు ముక్కలు కూడా తీసి చదవందే మనసు నిలకడగా ఉండడం లేదు. ఈ అలవాటును ఎంత మానుకుందాం అనుకున్నా మానలేకపోతున్నాను. దీనివల్ల నేను బీటెక్ పూర్తి చేయలేనేమోనని భయంగా ఉంది. సలహా ఇవ్వగలరు. – చందన, విజయనగరంపుస్తకాలు, నవలలు చదవడం మంచి అలవాటే! కానీ ఏ అలవాటైనా అతిగా చేయడం మంచిదికాదు. కొత్త పుస్తకం కనబడిన వెంటనే మొత్తం చదవాలనే తపన, చదవక΄ోతే ఏదో తెలియని అలజడి ఇవన్నీ ఒక ఎత్తైతే, చివరకు చెత్త కుండీలోని పేపరు ముక్కలను కూడా ఏరుకుని చదవందే ఉండలేక΄ోవడమనేది ఖచ్చితంగా ఒక మానసిక రుగ్మతే! ‘ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’ అనే మానసిక జబ్బుకు లోనైనవారే ఇలా ప్రవర్తిస్తారు. అలా అతిగా చదవాలనే తపన పడటం, ఆ అలవాటును మీరు మానుకోవాలనుకున్నా మానుకోలేకపోవడం ఈ మానసిక సమస్య ముఖ్య లక్షణం. మెదడులోని ‘సెరొటోనిన్’ అనే ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యంలో తేడాలొచ్చినప్పుడు, మీరు చెప్పిన లాంటి లక్షణాలు బయటపడతాయి. ‘క్లోమిప్రెమిన్ ప్లూ ఆక్సిటెన్’ అనే మందుల ద్వారాను, ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ అనే ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారానూ ఈ సమస్య నుంచి మిమ్మల్ని పూర్తిగా బయట పడేయవచ్చు. మీరు వెంటనే మంచి సైకియాట్రిస్ట్ట్ను కలిస్తే మీ సమస్యకు తగిన చికిత్స చేస్తారు. మీరు మీ బీటెక్ చదువు త్వరలోనే విజయవంతంగా పూర్తి చేయగలరు. ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్!ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: ఇదేం నిరసన..!'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’) -
అలియా భట్‌కి ఏడీహెచ్‌డీ డిజార్డర్..అందువల్లే పెళ్లిలో..!
బాలీవుడ్ నటి అలియా భట్ గ్లామర్‌కి నటనకి నూటికి నూరు మార్కులు పడతాయి. అంతలా ప్రేక్షకుల మనుసులను గెలుచుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి దటీజ్ అలియా అని ప్రూవ్ చేసింది. ఫిట్నెస్ పరంగా గ్లామర్ పరంగా ఎంతో కేర్ తీసుకునే ఆమె ఏడీహెచ్‌డీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అందువల్లో తన పెళ్లిలో ఆ సమస్య దృష్ట్యా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది. ఏంటా సమస్య? ఎందువల్ల వస్తుంది?అలియా ఏడీహెచ్‌డీ లేదా టెన్షన్-డెఫిసిట్/హైపర్యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. బాల్యం నుంచే తాను ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్లు తెలిపింది. దీని కారణంగా ఏ విషయంపై గంటల కొద్ది దృష్టిపెట్టి పనిచేయలేను అని చెబుతోంది. ఈ ఇబ్బంది వల్లే స్కూల్లో కూడా ఒకదానిపై ఫోకస్ పెట్టలేకపోయేదాన్ని అని తెలిపింది. ఈ సమస్యకు భయపడే పెళ్లిలో కూడా మేకప్ అరగంటకి మించి ఎక్కువ తీసుకోవద్దని ముందుగానే మేకప్ మ్యాన్లకు చెప్పారట. ఆఖరికి షూటింగ్లలో కూడా ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది అలియాఏడీహెచ్డీ అంటే..చాలా సాధారణమైన న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్లలో ఒకటి. ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ పెద్దలల్లో కూడా నిర్ధారణ అవుతుంది. ఈ రుగ్మత ఉన్నవారి మెదడులోని నరాల నెట్‌వర్క్‌లు, న్యూరోట్రాన్స్మిటర్లలో తేడాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.దీని కారణంగా ఆయా వ్యక్తులు ఏ పని మీద ఒక అరగంటకు మించి అటెన్షన్ ఉంచలేరు. వెంటనే చికాకు, ఒత్తడికి గురవ్వుతారు. అంతేగాదు దీని వల్ల శ్రద్ధ వహించడం, ఎక్కువ సేపు చురుకుగా ఉండటం వంటి వాటిల్లో సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..అజాగ్రత్తఒక దానిపై దృష్టి నిలపడంలో ఇబ్బందిఆర్గనైజ్ చేసి పనిలో ఉండలేకపోవడంఎక్కువ సేపు వింటూ కూర్చోవాలన్న ఇబ్బంది పడటం.మానసిక శ్రమతో కూడిన పనులకు రోజువారీ పనుల్లో మతిమరుపుఎందువల్ల వస్తుందంటే..ఏడీహెచ్‌డీతో బాధపుడుతున్న వ్యక్తుల్లో మెదడు నిర్మాణం, కార్యచరణలో తేడాలు ఉన్నట్లు మానసిక ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లలో పూర్తి పరిక్వతతో మెదడు ఉండకుండా నెమ్మదిగా ఉంటుందట. వీళ్లలో నిర్దేశిత శ్రద్ధే ఉంటుందట. వీరి మెదడులో ఆటోమేటిక్ అటెన్షన్ నెట్వర్క్ అనేది డిఫాల్ట్ మోడ్‌లో ఉంటుందట. అందువల్ల ఇలా జరుగుతుందని అన్నారు. అయితే ఈ రుగ్మత ఎందువల్ల వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరావాల్సి ఉంది. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ డిజార్డర్ కుటుంబ వారసత్వంగా వస్తుందని అన్నారు. (చదవండి: లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్: ‘తగ్గేదెలే’ అంటున్న స్పెషల్ బ్యూటీ) -
డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!
చాలామంది తమ వేతనం సరిపోకవడంతోనో లేదా ఇతరత్రా కారణాలతోనో ఒక షిఫ్ట్ పని చేయగనే... మళ్లీ వెంటనే మరో షిఫ్ట్ చేస్తుంటారు. ఇలా మధ్యలో ఎలాంటి విశ్రాంతి లేకుండా వెంటవెంటనే పనిచేసేవాళ్లలో కనిపించే సమస్యల్లో ఒకటి ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’. రాత్రీ, పగలూ తేడాలేకుండా వెంటవెంటనే పనిచేయాల్సి రావడంతో ఆ షెడ్యూల్స్కు అనుకూలంగా వారి దేహం ఇమడలేపోవడంతో వచ్చే ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.వర్క్షిఫ్ట్ డిజార్డర్స్కు లోనయ్యేవారు పగటివేళ నిద్రమత్తుతో జోగుతూ ఉంటారు. వాళ్లలో నిద్రపట్టడంలో ఇబ్బంది, దృష్టికేంద్రీకరణ సమస్యలు, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. దాంతో పనిప్రదేశాల్లో తప్పులు చేయడం, గాయపడటం జరగవచ్చు. తరచూ అనారోగ్యాల బారిన పడటం కూడా జరుగుతుండవచ్చు. దీర్ఘకాలిక పరిణామాలుగా రక్తంలో కొవ్వు పదార్థాల మోతాదులు పెరగడం, రొమ్ము, పురుషులు ప్రొస్టేట్ కేన్సర్ల బారిన పడటం, గుండె జబ్బుల బారిన పడటం, స్థూలకాయం రావడం వంటి రిస్క్‌లు ఉంటాయి. వర్క్ షిఫ్ట్ డిజార్డర్‌కు కారణమిదే... మన మెదడులో ఒక జీవగడియారం పనిచేస్తుంటుంది. మన తినేవేళలు, నిద్ర సమయాలు ఆ గడియారంలో ఓ అలారంలా నమోదై ఉంటాయి. దాంతో మనం ఓ క్రమబద్ధమైన రీతిలో పనులు చేస్తుంటాం. మనలో తమకు తెలియకుండానే నిర్వహిలమయ్యే ఈ క్రమబద్ధతను ‘సర్కేడియన్ రిథమ్’ అంటారు. ఈ రిథమ్ మారి΄ోవడం, ఈ లయ దెబ్బతినడం (సర్కేడియమ్ ఆల్టరింగ్ సిగ్నల్స్) వల్ల వచ్చే సమస్యలో ముఖ్యమైనది ‘వర్క్ షిఫ్ట్ డిజార్డర్’. లక్షణాలు... సాధారణంగా షిఫ్ట్‌లలో పనిచేసేవారు రోజుకు సగటున నాలుగు గంటల కంటే తక్కువగా నిద్ర΄ోతుంటారు. నిద్ర నాణ్యత కూడా తగ్గుతుంది. దాంతో కొద్దిపనికే అలసిపోతుంటారు. ఇలా పనిచేసేవాళ్లలో కొందరు ఏడెనిమిది గంటలపాటు నిద్ర΄ోయినప్పటికీ వాళ్లకూ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ రావచ్చు. బాధితుల్లో ఈ ‘షిఫ్ట్ వర్క్ డిజార్డర్’ కారణంగా... తరచూ ఆపుకోలేని కోపం రావడం, త్వరత్వరగా భావోద్వేగాలకు గురికావడం (మూడ్ స్వింగ్స్), తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివి కనిపిస్తుంటాయి. నిర్ధారణరాత్రివేళల్లో నిద్రలేమి అలాగే పగటిపూట నిద్ర ముంచుకొస్తుండటం. పని ప్రదేశంలో మాటిమాటికీ నిద్ర వస్తుండటం. పైన పేర్కొన్న లక్షణం షిఫ్టుల్లో పనిచేస్తున్నప్పుడు కనీసం నెల రోజుల పాటు కనిపించడం. నిద్ర ఎంత పడుతుందన్నది తెలుసుకోవడం కోసం ఉపయోగపడే పరికరం ఆక్టిగ్రఫీ సహాయంతో ఏడురోజుల పాటు పరిశీలించినప్పుడు సర్కేడియన్ రిథమ్, స్లీప్ – టైమ్ గ్రాఫ్‌తో సరిగా సరిపోలకపోవచ్చు.నివారణ/చికిత్స..ఈ సమస్య నివారణ కోసం పనిచేసే సమయంలో కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ వంటివి తక్కువగా తీసుకోవడంతోపాటు ఈ కింది అంశాలను బాధితులకు చికిత్సలో భాగంగా సూచిస్తారు, ఇక చికిత్సలో భాగంగా అందించే ప్రక్రియ అయిన బ్రైట్ లైట్ థెరపీలో బాగా తీక్షణమైన వెలుతురులో 3 – 6 గంటల పాటు ఉంచడం షిఫ్ట్ మొదలవడానికి ముందర కొద్దిసేపు కునుకు పట్టేలా చేయడం. (షార్ట్ షెడ్యూల్డ్ న్యాప్స్ (ప్రీ–షిఫ్ట్) ఇంటికి బయల్దేరే సమయంలో అది సాయంత్రమైనప్పటికీ నల్లటి గాగుల్స్ ధరించేలా చూడటం ఇంటి దగ్గర నిద్ర సమయంలో పూర్తిగా దట్టమైన చీకట్లో నిద్రపోయేలా చేయడం. ఆ టైమ్‌లో పరిసరాలు నిశ్శబ్దంగా ఉండేలా చూడటం సూర్యోదయం పూట వెలుగు వస్తున్నప్పుడు నిద్రపట్టడానికి మెలటోనిన్ మందులతో స్లీప్ మాడిఫికేషన్ థెరపీ ఇవ్వడం బాధితులు ఇంటికి వెళ్లగానే నిద్రకు ఉపక్రమించేలా సూచనలు ఇవ్వడం. కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ (చదవండి: అది మీ తప్పు కాదు, మనసుకూ జబ్బులొస్తాయ్!) -
Health: ఆ ఆలోచన నుంచి.. బయటపడేదెలా?
నా వయసు 35 సంవత్సరాలు. ఒక సంవత్సరం నుంచి నాకెందుకో చనిపోవాలనిపిస్తోంది. 24 గంటలూ ఆత్మహత్య ఆలోచనలే వస్తున్నాయి. ఏ పనీ చేయాలనిపించదు. మునుపున్న హుషారు, ఉత్సాహం అసలు లేవు. మనసంతా నెగటివ్ ఆలోచనలతో నిండి, మైండ్ మొద్దుబారి, బ్లాంక్‌గా ఉంటోంది. నిజానికి నాకసలు సీరియస్ సమస్యలేమీ లేవు. నాలో ఈ నైరాశ్యం, నిర్వేదం తొలగి భార్యా పిల్లలతో హాయిగా గడిపే మార్గం చెప్పగలరు. – రఘురాం, అనంతపురంమీరెంతో ఆవేదనతో రాసిన ఉత్తరం చదివాను. మీ పరిస్థితి అర్థం అయింది. ‘మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’ అనే మానసిక వ్యాధికి గురయిన వారిలో ఏ విధమైన కారణాలూ లేకుండా ఇలా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వస్తుంటాయి. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే వారిలో ఆ భావనలు బలపడిపోయి ఎలాంటి కారణం లేకుండానే ఉన్నట్టుండి ఒకరోజు ఆత్మహత్య చేసుకుంటారు.డిప్రెషన్ వ్యాధికి బయటి సమస్యల కంటే మెదడులో జరిగే కొన్ని అసాధారణ రసాయనిక చర్యలే ముఖ్యకారణమని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన సత్యం. వీరు నిరాశా నిస్పృహలతో ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూసి, భయపడుతూ, తాను చేతగాని వాడినని, తనవల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇతరులకు తనవల్ల ఎలాంటి ఇబ్బందీ కలగకూడదని, తనకిక చావే శరణ్యమని భావించి, ఆత్మహత్యకు పాల్పడతారు. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించి, తగిన చికిత్స తీసుకుంటే, డిప్రెషన్ పూర్తిగా తొలగిపోయి మునుపటిలా సంతోషంగా, హుషారుగా ఉండగలరు.మా అబ్బాయికి పదహారేళ్లు. ఇంటర్లో చేర్చాం. మొదటినుంచి చదువులో యావరేజ్. అయితే ఈ మధ్య వాడి దగ్గర సిగరెట్ వాసన వస్తోంది. అదేమని అడిగితే ఒప్పుకోవడం లేదు. మొన్నొకరోజు జేబులో సిగరెట్లు దొరికాయి. గట్టిగా అడిగితే ఎదురు తిరగడం, కోపంతో వస్తువులు విసిరేయడం వంటివి చేస్తున్నాడు. మొదటినుంచి వాడు కొంచెం మొండివాడే. ఈ మధ్య ఆ మొండితన మరీ ఎక్కువైంది. చదువు ఎలా ఉన్నా సరే, కనీసం వాడిలో ఈ మొండితనం, కోపం తగ్గి, స్మోకింగ్ అలవాటు మాన్పించేందుకు మాకేదైనా సలహా ఇవ్వగలరు. – విజయలక్ష్మి, హన్మకొండటీనేజ్లో వచ్చే శారీరక, మానసిక మార్పుల వల్ల వారు కొంత మొండిగా ఉండటం సహజమే. అయితే మీ అబ్బాయిలోని స్మోకింగ్, ఎదురు తిరగడం, విపరీతమైన మొండితనం, కోపం, అబద్ధాలు చెప్పడం లాంటి లక్షణాలు కాండక్ట్ డిజార్డర్ లేదా అపోజిషనల్ డిఫియెంట్ డిజార్డర్ అనే మానసిక రుగ్మతను సూచిస్తున్నాయి. వీటిని చిన్నతనంలో అరికట్టలేకపోతే, అవి భవిష్యత్తులో ఆ కుటుంబానికే కాకుండా, సమాజం మొత్తాన్ని ఇబ్బంది పెట్టే సంఘ విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా స్మోకింగ్ క్రమేణా ఒక వ్యసనంగా మారి, దాంతోపాటు గంజాయి, ఆల్కహాల్ వంటి ఇతర మత్తుపదార్థాలకు కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఇలాంటి పిల్లలకు కొన్ని మందుల ద్వారా, డయలెక్టివ్ బిహేవియర్ థెరపీ అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారా మంచి మార్పు తీసుకురావచ్చు. మీరు ఆందోళన పడకండి.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.comఇవి చదవండి: సిటీ కాప్స్.. గుడ్ మార్నింగ్ హైదరాబాద్! -
అందంగా లేనా? అస్సలేం బాలేనా? ఈ డిజార్డర్ గురించి తెలుసుకోండి!
ప్రసిద్ధ దర్శకుడు కరణ్ జోహార్ తాను ‘డిస్మార్ఫియా డిజార్డర్’తో బాధపడుతున్నానని తెలిపాడు. శరీరంలోని ఏదో ఒక అవయవం పట్ల వ్యక్తిలో తీవ్రమైన అసంతృప్తి ఉండి అది సరిగా లేదని పదే పదే బాధపడటమే ఈ డిజార్డర్. యువతీ యువకుల్లో టీనేజీ కాలంలో ఇదిపాదుకుంటే మున్ముందు వారు సామాజిక జీవితంలో ఇబ్బందిపడాల్సి ఉంటుంది. తగిన కౌన్సెలింగ్‌తో దీని నుంచి బయటపడొచ్చు.ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒక టీనేజ్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి అందరూ భావించేటట్టుగా ‘అందం’గా ఉంది. చర్మం రంగు, రూపం, హైట్ అన్నీ బాగున్నాయి. కాని ఆ అమ్మాయికి ‘నా ముక్కు బాగా లేదు’ అని సందేహం, అనుమానం, అదే నిజం అనిపించే అబ్సెషన్. ఆ ముక్కును ఎలా అందంగా చేయించాలి అనేదే ఆమె సమస్య. ‘కాదు నీ ముక్కు చక్కగా ఉంది. నువ్వు అనుకున్నంత లోపం ఏ మాత్రం లేదు’ అని వీరికి చెప్తే ఒక నిమిషం తెరిపిన పడతారు. మరో నిమిషంలోనే ఆ అనుమానం పెనుభూతంలా ముందుకొస్తుంది. ఈ రుగ్మతను ‘బాడీ డిస్మార్ఫియా డిజార్డర్’ అంటారు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌లో ఒక కోవ కిందకు వస్తుంది. ఇది ఉన్నట్టుగా చాలామందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కరణ్ జోహార్ దీని గురించి మాట్లాడి తాను ఆ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు చెప్పాడు. అందుకే నేను లూజ్ బట్టలు ధరిస్తాను’ అని తెలిపాడు.మైఖేల్ జాక్సన్ కూడాడిస్మార్ఫియా డిజార్డర్‌తో బాధపడిన వాళ్లలో మైఖేల్ జాక్సన్ ఒకడు. అతనికి తన ముక్కు నచ్చలేదు. దాని వల్ల లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేసి చివరకు ప్లాస్టిక్ ముక్కు అంటించాల్సి వచ్చింది. మగవారికి తమ జుట్టు, కళ్లు, భుజాలు, పురుషాంగం, పిరుదులు... వీటిలో ఏదో ఒకటి అస్సలు బాగలేదనే భావన బాల్యంలోనో టీనేజీలోనో స్థిరపడి΄ోతుంది. ఆడవాళ్లకు తమ కళ్లు, ముక్కు, పెదవులు, ఒంటి రంగు... వీటిలో ఏదో ఒక అవయవం గురించి అసంతృప్తి ఏర్పడుతుంది. నిజానికి లోకంలో ఎవరూ చెక్కినట్టుగా ఉండరు. ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నా తమదైన రూపంతో బాగానే ఉంటారు. అయితే డిస్మార్ఫియా డిజార్డర్‌లో చూడటానికి మెరుగ్గా ఉన్నా, అంతపెద్ద లోపం ఏదీ లేక΄ోయినా వారి మైండ్ ‘నీ ఫలానా అంగం ఏం బాగ లేదు బాగలేదు’ అని చెప్తూ ఉంటుంది.మిర్రర్ చెకింగ్ఈ డిజార్డర్‌తో బాధపడేవాళ్లు తమకు లోపం ఉందని భావిస్తూ బట్టలతో, ఆభరణాలతో దానిని కవర్ చేసుకుంటున్నామని అనుకుంటూనే పదే పదే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. లేదా ఎదుటివారిని ‘బాగున్నానా బాగలేనా?’ అని అడుగుతూ విసిగిస్తూ ఉంటారు. ‘బాగున్నావ్’ అన్నా నమ్మరు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మటిక్ సర్జరీలు చేయించుకున్నా వీరికి సంతృప్తి కలగదు. ఎందుకు? సమస్య మైండ్‌లో ఉంది కాబట్టి. ఈ సమస్య ఉన్నవారు కాలక్రమంలో నలుగురినీ కలవని స్థితికి చేరుకుంటారు.కౌన్సెలింగ్డిస్మార్ఫియా డిజార్డర్‌తో బాధ పడేవారు ముందు చేయవలసిన పని తమ యథాతథ రూపాన్ని యాక్సెప్ట్ చేయడం. ‘నేను నా రూపాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను’ అని పదే పదే చెప్పుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదా సైకియాట్రిస్ట్‌లను కలిస్తే వారు కౌన్సెలింగ్‌తో సమస్యను దూరం చేస్తారు. లేదా మరీ పదే పదే అందుకు సంబంధించి నెగెటివ్ థాట్స్ వస్తుంటే మందులతో చికిత్స చేస్తారు. ప్రకృతిలో ప్రతి ప్రాణి భిన్నమైన రూపాలతో ఉంటారని తెలుసుకుంటే శారీరక లోపాకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలు దరి చేరవు. -
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
కొందరికీ షాపింగ్ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్‌గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్‌గా పిలుస్తారు. ఈ డిజార్డర్ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్లైన్ షాపింగ్ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్లో డబ్బు కట్ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలన్నీఫోన్లోనే సేవ్ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్ వివరాన్ని సైబర్ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్ లావాదేవీలను లాక్ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్ ముక్కు నుంచి హెడ్ వరకు కదలకుండా అటాచ్ అయ్యేలా డివైజ్ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్ టాపర్‌గా!) -
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
మాయ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ప్రఖ్యాత ఎమ్మెన్సీలో పనిచేస్తోంది. ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె చలాకీతనం చూసి రవి ఇష్టపడ్డాడు, ప్రపోజ్ చేశాడు, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉంది. ఇద్దరూ కలసి పార్టీలు, పబ్‌లంటూ తిరిగేవారు. పండంటి బిడ్డ పుట్టింది. ఆ తర్వాత మాయ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. బిడ్డను కూడా పట్టించుకోకుండా జిమ్, యోగా అంటూ తిరుగుతోంది. అందంగా కనిపించాలని, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవాలని ఎక్స్పోజింగ్ డ్రెస్లేస్తోంది. కారణం లేకుండానే ఏడుస్తోంది, అరుస్తోంది, ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తోంది. ఆవేశంలో ఆమె ఏమైనా చేసుకుంటే అది తన మెడకు చుట్టుకుంటుందని రవి హడలి పోతున్నాడు. ఈ నేపథ్యంలో మిత్రుల సలహా మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కి వెళ్లారు. ఒక వ్యక్తి సమస్యను అర్థం చేసుకోవాలంటే వారి కుటుంబ, సాంస్కృతిక నేపథ్యం అవసరం. మాయ లేకలేక పుట్టిన పిల్ల. దాంతో ఆమె బాల్యం ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఆటలు, పాటలు, నాట్యంలో ముందుండేది. ఆమె ఏం చేసినా పేరెంట్స్ కాదనేవారు కాదు. తప్పు చేసినా సంబరంగా చప్పట్లు కొట్టేవారు. దాంతో ఇతరులు మెచ్చుకుంటేనే, సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటేనే సెల్ఫ్ వాల్యూ ఉంటుందనే భావన ఆమెలో ఏర్పడింది. మాయతో ఓ గంట మాట్లాడాక ఆమె హిస్ట్రియోనిక్ పర్సనాలిటీ డిజార్డర్(ఏ్కఈ)తో బాధపడుతున్నట్లు అర్థమయింది. సైకోడయాగ్నసిస్లోనూ అదే నిర్ధారణైంది. దీనికి కాగ్నిటివ్–బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ), సైకోడైనమిక్ టెక్నిక్స్ల కలయికగా చికిత్స ఉంటుంది. ఇది మాయ తన సెల్ఫ్ ఇమేజ్ను పెంచుకోవడంలో ఇవి సహాయపడతాయి. ప్రతికూల ఆలోచనా విధానాలను గుర్తించి, సవాలు చేస్తుంది. ఒత్తిడిని జయించడానికి ఆరోగ్యకరమైన కోపింగ్ మెకానిజమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ దంపతులు అంగీకారం మేరకు వారానికో సెషన్ షెడ్యూల్ అయింది. ఆరు నెలల్లో మాయ ప్రవర్తనలో ఆశించిన మార్పులు కనిపించాయి. అసలిదేమిటి? వ్యక్తిత్వ లోపాలుగా కనిపించే మానసిక రుగ్మతలను పర్సనాలిటీ డిజార్డర్స్ అంటారు. ఇవి దాదాపు తొమ్మిదిశాతం మందిలో ఉంటాయి. ఒక శాతం ప్రజల్లో హెచ్పీడీ కనిపిస్తుంది. ఇందులో వ్యక్తి ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు నాటకీయంగా భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ఇతరులను మానిప్యులేట్ చేసేందుకు ఎత్తులు వేస్తుంటారు. ఇది యుక్తవయస్సులో మొదలవుతుంది. ఎలాగైనా ఆకట్టుకోవాల్సిందే.. నిరంతరం ఇతరుల భరోసా లేదా ఆమోదం అవసరం కావడం ఇతరుల దృష్టిని ఆకర్షించే ప్రవర్తనల్లో మునిగిపోవడం ·అందుకోసం మితిమీరిన భావోద్వేగాలను ప్రదర్శించడం బలహీనత, అనారోగ్య లక్షణాలను ప్రదర్శించడం రూపంపై అతిగా శ్రద్ధ చూపడం, ఎక్స్‌పోజింగ్‌గా ఉండే దుస్తులు ధరించడం లైంగికంగా రెచ్చగొట్టేలా ప్రవర్తించడం ఆత్మహత్య బెదిరింపులతో ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కి పాల్పడటం అస్థిరమైన మనోభావాలు, అభిప్రాయాలు, నమ్మకాలు ఎవరూ పట్టించుకోకపోతే నిరాశకు గురవడంమందుల్లేవు, థెరపీనే మార్గం..వ్యక్తిత్వ లోపాలను ఎవరూ గుర్తించరు. గుర్తించినా చికిత్స తీసుకోరు. దీన్ని తగ్గించే మందులూ లేవు. ముందుగా రుగ్మతను గుర్తించడం, దానికి సైకోథెరపీ ద్వారా చికిత్స తీసుకోవడం అవసరం. దానికి ముందుగా జీవనశైలిలో మార్పుద్వారా.. కొంతవరకు సంస్కరించుకోవచ్చు. అతి గారాబమూ కారణమే..కొన్ని కుటుంబాలలో హెచ్పీడీ కొనసాగుతుంది. అందుకే దీనికి జన్యుపరమైన సంబంధం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బాల్యంలో కుటుంబ సభ్యుడి మరణం, లేదా హింసకు గురికావడం వంటివి తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యక్తిత్వ లోపంలో భాగంగా మారవచ్చు. హద్దులు లేని, అతిగా ఆనందించే పేరెంటింగ్ స్టైల్లో పెరిగిన పిల్లల్లో ఈ డిజార్డర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నాటకీయ, అస్థిర, అనుచిత లైంగిక ప్రవర్తనను ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా కారణం కావచ్చు. ఎలాగంటే..రోజూ వ్యాయామం చేయడం తిండి, నిద్ర షెడ్యూల్స్ చేసుకోవడం ఆల్కహాల్, డ్రగ్స్ లాంటివి మానుకోవడం మిమ్మల్ని ట్రాక్‌లో ఉంచడానికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల సహాయాన్ని పొందడం సైకోథెరపీ ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది హెచ్పీడీకి ప్రత్యేకించి మందులు లేకపోయినా, దానివల్ల వచ్చే ఆందోళన, నిరాశలను తగ్గించేందుకు మందులు ఉపయోగ పడతాయి యోగా, బయో ఫీడ్‌బ్యాక్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు వ్యక్తిత్వ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా సహాయ పడవచ్చు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా వీలైనంత త్వరగా వ్యక్తిత్వ రుగ్మతల నుంచి బయటపడవచ్చు.సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!) -
షాకింగ్ ఘటన: అసలు కంటి భాగమే ఏర్పడకుండా పుట్టిన చిన్నారి!
కళ్లు లేకుండా శిశువు జన్మించడం అంటే మాములుగా కొద్దిమందిలో జరిగేదేగా అనేకోకండి. ఎందుకుంటే కళ్లే ఏర్పడకుండా పుట్టడం వేరు. కళ్లు లేకపోవడం వేరు. అంటే.. చూపు కనిపించని అంధులకైనా కంటి నిర్మాణం ఉంటుంది. కాకపోతే దృష్టి లోపం ఉంటుంది. అసలు కంటి స్థానంలో కణజాలం లేదా ఆప్టికల్ నరాలే లేకుండా పుడితే వారిని కళ్లే ఏర్పడకుండా జన్మించిన శిశువు అంటాం. ఈ పరిస్థితి అరుదైనా జన్యు సమస్య కారణంగా ఏర్పడుతుంది. ఇలాంటి చిన్నారులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 మంది దాక ఉన్నారట. అలాంటి చిన్నారే యూఎస్‌లోని మిస్సౌరీలో ఓ ప్రవేటు ఆస్పత్రిలో జన్మించాడు. ఆ చిన్నారి పేరు రెన్లీ. ఆ శిశువు పుట్టుకతో అనోఫ్తాల్మియాతో జన్మించాడు. అందువల్ల ఆ చిన్నారికి కంటి కణజాలం లేదా ఆప్టిక్ నరాలు ఉండని ఒక విధమైన జన్యు పరిస్థితి అని చెప్పారు వైద్యులు. ఈ మేరకు సదరు చిన్నారి తల్లి మాట్లాడుతూ..సిజేరియన్ ద్వారా జన్మించిన తన చిన్నారి రోగ నిర్థారణ కోసం తొమ్మిది రోజులుగా ఆస్పత్రిలోనే వేచి ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యింది. చివరికి వైద్యలు కార్టిసాల్ లేకుండానే జన్మించాడని, అందువల్లే కళ్లు మూసుకుపోయాయని చెప్పారని తెలిపింది. ఇది చాలా అరుదైన పరిస్థితి అని, ఇలా ప్రపంచవ్యాప్తంగా సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే జన్యు మార్పు కొంతమందికి ఒక కన్ను మాత్రమే ప్రభావితమవుతుందని, కానీ చిన్నారి రెన్లీ విషయంలో అందుకు విరుద్ధంగా రెండు కళ్లు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి అతడి మేథస్సును, శారిరీక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే రెన్లీకి భవిష్యత్తులో వచ్చే తన పిల్లలకు కూడా ఈ రుగ్మత వచ్చే అవకాశం 50 శాతం ఉందని తేల్చి చెప్పారు వైద్యులు. ప్రస్తుతం రెన్లీకి కళ్లుని తెప్పించే చికిత్సలు ఏమీ లేనప్పటికీ కంటి సాకెట్ల చుట్టూ ఎముక, మృదు కణజాల పెరుగుదలకు సహాయపడటానికి ప్రొస్టెటిక్ కళ్లు ఇవ్వడంపై దృష్టి పెట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్ది వారాల్లో రెన్లీకి కృత్రిమ కళ్లు అమర్చడానికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలిపారు వైద్యులు. అనోఫ్తాల్మియాకు కారణం.. ఇది ఎందువల్ల వస్తుందనడానికి కారణాలు తెలియాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది శిశువుల్లో వారి జన్యువులు లేదా క్రోమోజోమ్‌లలో మార్పు కారణంగా ఈ పరిస్థితిని కలిగి ఉంటారు. అలాగే గర్భధారణ సమయంలో ఐసోట్రిటినోయిన్ వంటి మందులను తీసుకోవడం వల్ల కూడా అనోఫ్తాల్మియా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో ఎక్స్‌రేలు లేదా ఇతర రకాల రేడియేషన్లకు గురికావడం లేదా మందులు లేదా పురుగులమందుల రసాయానాలు తదితరాలు పిండంలో ఈ లోపం ఏర్పడటానికి కారణమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితికి సంబంధించిన లక్షణాలు.. ⇒ ప్రీ మెచ్చూర్ కంటి శుక్లం: కంటిపై మేఘావృతమైన ఫిల్మ్ కలిగి మబ్బుగా ఉంటుంది. దృష్టి బలహీనమై రంగులను గుర్తించడానికి కష్టమవుతుంది. ⇒ కోలోబోమా కణాజాలం కనిపించకుండా పోతుంది. ఎక్కువగా కనుపాపలో జరుగుతుంది. ⇒ వేరు చేసిన రెటీనా ఇది పూర్తి అంధత్వానికి దారితీసే పరిస్థితి ⇒ ప్టోసిస్ ప్టోసిస్ లేదా సైడోప్టోసిస్, అనేది కండరాలు, నరాలు ఉన్నప్పటికీ పడిపోతున్న కనురెప్పను సూచిస్తుంది. (చదవండి: మొటిమల ముల్లుకు మొటిమలతోనే విరుగుడు!) -
ఈయనకు ఆకలి ఉంది.. నిద్రే కరువైంది!
ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు? థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి. 80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్‌కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు. -
Funday: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?
సాగర్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. చాలా చలాకీగా, చురుగ్గా ఉండేవాడు. సేల్స్ టార్గెట్స్ అందుకోవడంలో ముందుండేవాడు. పెళ్లయ్యాక కూడా ఆ ఉల్లాసం, ఉత్సాహం కొనసాగింది. తర్వాతే మెల్లమెల్లగా దూరమవసాగింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లే కారణమనుకున్నాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా తన మానసిక పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రమోషన్ వచ్చినా, ఇల్లు కట్టుకున్నా, కార్ కొనుక్కున్నా, ఆఖరుకు బిడ్డ పుట్టినా సాగర్‌లో ఎలాంటి ఆనందం లేదా సంతృప్తి లేదు. క్రమంగా తన పనితీరు కూడా దెబ్బతినసాగింది. టార్గెట్స్ అందుకోలేక పోతున్నాడు. అలా నిరాశ, నిస్పృహలతో మూడేళ్లు తనలో తానే మథనపడ్డాడు. దానివల్ల భార్యాపిల్లలతో కూడా సంతోషంగా ఉండలేకపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న సాగర్ ఒంటరిగా మారిపోయాడు. దాంతో మరింత నలిగిపోయాడు. ఎప్పుడూ నిస్సత్తువగా అనిపించసాగింది. చిన్నపనికే అలసిపోతున్నాడు. మానసిక గందరగోళానికి లోనవుతున్నాడు. అతని మనసొక యుద్ధభూమిగా మారింది. నిరంతరం నెగటివ్ ఆలోచనల్లో మునిగిపోతున్నాడు. వీటన్నింటివల్ల తనపై తనకు నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతింది. ఈ లక్షణాలను బట్టి సాగర్ పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్ (పీడీడీ)తో బాధపడుతున్నాడని అర్థమైంది. ఏళ్ల తరబడి దిగులే దీని ప్రధాన లక్షణం. అనేక కారణాలు... మేజర్ డిప్రెసివ్ డిజార్డర్‌కు పీడీడీకి ఉన్న ప్రధానమైన తేడా.. కాలం. కనీసం రెండేళ్లపాటు డిప్రెషన్ ఉంటే దాన్ని పీడీడీగా పరిగణిస్తారు. దీనికి కచ్చితమైన కారణం తెలియదు. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్లానే వివిధ కారణాలుంటాయి. ♦ పీడీడీ ఉన్నవారి మెదడు నిర్మాణంలో, న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ఎమోషన్స్, ఫీలింగ్స్‌ను నియంత్రించే సెరటోనిన్ తగ్గుదల దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ♦ కుటుంబ హిస్టరీ ఉన్న వ్యక్తుల్లో ఇది కనిపిస్తుంది. డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యువులను కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ♦ ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం, ఆర్థిక సమస్యలు లేదా అధికస్థాయి ఒత్తిడి వంటి బాధాకరమైన సంఘటనలు కొంతమందిలో పీడీడీని ప్రేరేపిస్తాయి. ♦ నిత్యం తనను తాను విమర్శించుకోవడం, తనపై తనకు నమ్మకం లేకపోవడం, ఇతరులపై ఆధారపడటం, ఎప్పుడూ చెడు జరుగుతుందని ఆలోచించడం వంటి వ్యక్తిత్వ లక్షణాలు, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. నివారణ లేదు, నియంత్రణే మార్గం... పీడీడీని నివారించడానికి కచ్చితంగా మార్గం లేదు. ఇది తరచుగా బాల్యంలో లేదా యుక్తవయస్సులో మొదలవుతుంది. కాబట్టి ఈ పరిస్థితికి గురయ్యే ప్రమాదం ఉన్న పిల్లలను గుర్తించడం వారికి ముందస్తు చికిత్సను అందించడంలో సహాయపడుతుంది. లక్షణాలను తగ్గించడానికి లేదా నిరోధించడానికి సహాయపడే వ్యూహాలు... ♦ ఒత్తిడిని నియంత్రించడానికి, సమస్యలను పరిష్కరించుకునే సామర్థ్యం పెంచుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి చర్యలు మొదలుపెట్టాలి ♦ సంక్షోభ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు తీసుకోవాలి ♦ వాస్తవిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి ♦ దిగులుగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు ♦ తమను తాము ఉత్సాహపరచుకునేందుకు సెల్ఫ్ హెల్ప్ బుక్స్, జీవిత చరిత్రలు చదవాలి ♦ మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ♦ మంచి ఆహారం తీసుకోవాలి, వీలైనంత వరకు శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేయాలి ♦ సమస్య ముదిరేవరకు ఆలస్యం చేయకుండా లక్షణాలు కనిపించగానే సైకాలజిస్ట్‌ను కలసి చికిత్స పొందాలి ♦ సైకోథెరపీ ద్వారా మీ ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటిని సానుకూలమైన వాటితో భర్తీ చేయాలి. నిరాశ, నిస్సహాయత... పీడీడీ లక్షణాలు కనిపించడానికి సాధారణంగా సంవత్సరాలు పడుతుంది. అలాగే ఆ లక్షణాలు పోవడానికీ సంవత్సరాలు పట్టవచ్చు. లక్షణాల తీవ్రత కాలక్రమేణా మారవచ్చు. ఆ లక్షణాలేంటంటే... ♦ నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, విచారం, శూన్యత ♦ రోజువారీ కార్యకలాపాలపై ఆసక్తి కోల్పోవడం. ♦ అలసట, శక్తి లేకపోవడం. ♦ తనను తాను గౌరవించుకోకపోవడం, తనను తాను విమర్శించుకోవడం ♦ ఫోకస్ చేయడంలో సమస్య, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది. ♦ పనులు సక్రమంగా లేదా సమయానికి పూర్తి చేయడంలో సమస్యలు. ♦ చిరాకు, అసహనం లేదా కోపం. ♦ సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండటం. ♦ గతం గురించి చింత, అపరాధ భావాలు ♦ ఆకలి లేకపోవడం లేదా అతిగా తినడం. ♦ నిద్ర సమస్యలు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?
జానకి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. కొంతకాలం హైదరాబాద్‌లో పనిచేశాక అమెరికా వెళ్లింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో కలసి పబ్‌కు వెళ్లేది. అమెరికా వెళ్లాక అది అలవాటుగా మారింది. రోజూ పబ్, క్లబ్, ఆల్కహాల్ ఆమె జీవితంలో భాగంగా మారిపోయాయి. ఏదైనా ఒకరోజు ఆల్కహాల్ తాగకపోతే పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో ఇంట్లోనే బార్ ఏర్పాటు చేసుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాలుగైదు పెగ్గులు వేయందే నిద్రపట్టేది కాదు. అలా అలా ఆల్కహాల్ వ్యసనంగా మారింది. అయితే వివాహం తర్వాత ఆమెకు సమస్య మొదలైంది. నెలరోజులు ఎలాగోలా ఓపిక పట్టినా ఆ తర్వాత ఆగలేక తాగడం మొదలు పెట్టింది. దాంతో భర్తతో పెద్ద గొడవైంది. సోషల్ డ్రింకింగ్ విషయంలో తనకూ అభ్యంతరం లేదని, కానీ రోజూ స్పృహ తప్పేంతగా తాగుతానంటే భరించలేనని భర్త తేల్చి చెప్పేశాడు. ఈ విషయం ఇరువైపులా పేరెంట్స్‌కు తెలిసి పంచాయతీ పెట్టారు. చివరకు విడాకుల వరకూ దారితీసింది. అలవాటు కాదు.. జబ్బు జానకిలా మద్యం వ్యసనంతో ఇల్లూ, ఒళ్లూ గుల్ల చేసుకున్నవారు, చేసుకుంటున్నవారూ మన చుట్టూ చాలామంది కనిపిస్తారు. మద్యం తాగడం పాపమని కొందరు వారికి హితబోధలు చేస్తే, బలహీన మనస్తత్వమున్నవారే తాగుతారని మరి కొందరు వాదిస్తుంటారు. నిజానికి మద్యానికి బానిసవ్వడం, విపరీతంగా మద్యం సేవించడం, మద్యం వల్ల జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ తాగకుండా ఉండలేకపోవడం ఒక మానసిక రుగ్మత. దానివల్ల అనేకానేక శారీరక, మానసిక సమస్యలు వస్తాయి. హఠాత్తుగా మద్యం తాగడం తగ్గించినా, ఆపేసినా కూడా సమస్యలు వస్తాయి. మద్యం వ్యసనం నుంచి శాశ్వతంగా విముక్తి లభించాలంటే చికిత్స అవసరం. తిడితే సరిపోదు.. చికిత్స అవసరం.. మద్యానికి బానిసైన వారిని చులకనగా చూడటం, తిట్టడం సమస్యను పరిష్కరించవు. అలాంటివారిని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ లేదా అడిక్షన్ ఎక్స్పర్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. అవసరమైతే కొంతకాలం రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచి మద్యపాన వ్యసనం నుంచి బయట పడేయవచ్చు. మద్యపాన వ్యసనం ఉన్నవారు తమకు సమస్య ఉందని గుర్తించక చికిత్స పొందడానికి వెనుకాడతారు. అందువల్ల కుటుంబసభ్యులే వారిని చికిత్సకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వివిధ దశల్లో చికిత్స మద్యపాన వ్యసనానికి వివిధ దశల్లో వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ దశల్లో వ్యక్తిగత, గ్రూప్ కౌన్సెలింగ్.. సమస్యను బాగా అర్థంచేసుకోవడంలో సహాయపడతాయి. మద్యపాన వ్యసనం వల్ల వచ్చిన మానసిక సమస్యల నుంచి కోలుకోవడానికి మద్దతునిస్తాయి. ఆల్కహాల్ చికిత్స నిపుణుల పర్యవేక్షణలో గోల్ సెట్టింగ్, ప్రవర్తనలో మార్పు తెచ్చే పద్ధతులు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వంటివన్నీ వ్యసనం నుంచి బయటపడేందుకు సహాయపడతాయి కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తాగితే వికారం, వాంతులు, తలనొప్పి వంటివి కలుగుతాయి. మరికొన్ని మందులు ఆల్కహాల్ తాగాలనే కోరికను తగ్గిస్తాయి · మద్యపాన వ్యసనం నుంచి కోలుకుంటున్న వ్యక్తులు మళ్లీ మద్యం వైపు మళ్లకుండా కొన్నిరకాల మందులు, ఇంజెక్షన్లు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవ్వడం వ్యసనాల నుంచి కోలుకునేందుకు సహాయపడుతుంది రీహాబిలిటేషన్ సెంటర్ లేదా సైకియాట్రిక్ ఆస్పత్రిలో వారం రోజులపాటు డిటాక్స్ అండ్ విత్ డ్రాయల్ చికిత్స అందిస్తారు. విత్ డ్రాయల్ లక్షణాలను నివారించడానికి మందులు తీసుకోవాల్సి రావచ్చు మద్యపాన వ్యసనం తీవ్రంగా ఉన్నవారు కొన్ని నెలలపాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉండాల్సి రావచ్చు. అక్కడ ఆల్కహాల్, డ్రగ్ కౌన్సెలర్లు, సోషల్ వర్కర్లు, నర్సులు, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు. మద్యపాన వ్యసనం లక్షణాలు మద్యం తాగడం, వ్యసనంగా మారడం, దానికి బానిసవ్వడం మూడూ వేర్వేరు. రెండు గంటల్లో నాలుగైదు పెగ్గులు అంతకంటే ఎక్కువ తాగడాన్ని అనారోగ్యకరమైన డ్రింకింగ్‌గా పరిగణిస్తారు. మద్యపాన వ్యసనానికి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఆల్కహాల్ తాగాలనే బలమైన కోరిక, తాగకుండా ఉండలేకపోవడం · తాగే పరిమాణాన్ని పరిమితం చేయలేకపోవడం తాగడం తగ్గించుకోవడానికి విఫల యత్నాలు చేయడం తాగడంలోనే ఎక్కువ సమయం గడపడం, ఇతర పనులను పక్కన పెట్టడం మద్యం వల్ల బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవడం జీవితంలో సమస్యలకు కారణమవుతుందని తెలిసినప్పటికీ కొనసాగించడం డ్రైవింగ్, ఈత లాంటి సందర్భాల్లో కూడా మద్యం తాగడం కారణాలు.. మద్యపాన వ్యసనానికి సామాజిక, మానసిక, జన్యు కారణాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. మద్యం వినియోగం సాధారణమైన సమాజంలో, కుటుంబంలో పుట్టి పెరిగిన వారికి అది తప్పుగా అనిపించదు. సరదాగా మొదలుపెట్టినా చివరకు వ్యసనంగా మారుతుంది. కాలక్రమేణా ఆల్కహాల్ తాగడం మెదడులోని ఆనందం, పనితీరు, ప్రవర్తనపై నియంత్రణ సాధించే భాగాలతో అనుసంధానమవుతుంది. ఇది మంచి భావాలను పునరుద్ధరించడానికి లేదా ప్రతికూల భావాలను తగ్గించడానికి ఆల్కహాల్ కోరికను కలిగిస్తుంది. అలా మద్యానికి బానిసను చేస్తుంది. కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనలేక మద్యం మత్తులో సేద తీరుతూ వాస్తవికత నుంచి తప్పించుకుంటారు. --సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com (చదవండి: ఆ టైంలోనే అతిపెద్ద అండర్‌గ్రౌండ్ ఎయిర్‌పోర్టు..కానీ ఇప్పుడది..) -
కంటినిండా కునుకు లేదు
సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా దేశంలోని 11% మంది నిద్రకు సంబంధించిన రుగ్మత అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. కొందరిలో ఓఎస్ఏ తీవ్రమై మధుమేహం, రక్తపోటు, ఇతర జీవనశైలి జబ్బులతోపాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణమవుతోంది. ఈ విషయం ఎయిమ్స్–న్యూఢిల్లీ వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. 8 అధ్యయనాల డేటాను విశ్లేషించి ఆ ఫలితాలను స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు. దేశంలోని పనిచేసే వయస్సు వారిలో సుమారు 10.4 కోట్ల మంది ఓఎస్ఏతో బాధపడుతున్నట్టు ఎయిమ్స్ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ నంత్ మోహన్ వెల్లడించారు. ఈ సమస్య శ్రామిక జనాభా ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. ప్రజలలో నిద్ర రుగ్మతల గురించి తక్షణ అవగాహన పెరగాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. మన ఆస్పత్రుల్లో చికిత్స రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓఎస్ఏ సమస్యకు ఉచితంగా చికిత్స అందిస్తారు. గుంటూరు జీజీహెచ్‌లో స్లీప్ ల్యాబ్ సైతం అందుబాటులో ఉంది. నిద్ర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఈ ల్యాబ్‌లో పాలినోగ్రఫీ పరీక్ష నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.25వేల ఖర్చు అయ్యే పాలినోగ్రఫీ పరీక్షను ఉచితంగా చేస్తున్నారు. ఓఎస్ఏ సమస్య అంటే ఓఎస్ఏ అనేది తీవ్రమైన నిద్ర లేమి సమస్య. ముక్కు నుంచి స్వరపేటిక వరకు ఒక శ్వాసనాళం ఉంటుంది. ఆ నాళం మూసుకుపోయినప్పుడు శరీరంలోకి సరిపడినంత ఆక్సీజన్ అందదు. ఈ సమస్యనే స్లీప్ అప్నియా అంటారు. ఓఎస్ఏ సమస్య ఉన్నవారికి నిద్రలో శ్వాస కొద్దిసేపు ఆగిపోతుంది. దీంతో మధ్యలో మెలకువ వస్తుంటుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం ఆగిపోయి పెద్దగా గురక పెడుతుంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే ఓఎస్ఏతోపాటు మధుమేహం, హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోమయోపతి, గుండెపోటు, గుండె వైఫల్యం లాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య రంగ నిపుణుల అంచనా. మనదేశంలో 11శాతం మంది పెద్దలు ఈ సమస్యతో బాధపడుతున్నారని గుర్తించారు. ఇవీ ఓఎస్ఏ లక్షణాలు రాత్రిపూట నిద్రలో తరచూ మెలకువరావడం, చెమటలు పట్టడం నోరు ఎండిపోయిన అనుభూతి గట్టిగా గురకపెట్టడం తీవ్ర అలసట ఒత్తిడి, అశాంతి, ఆందోళన జ్ఞాపకశక్తి తగ్గిపోవడం మతిమరుపు, చిరాకు -
భయాందోళనకు గురిచేసే జబ్బు.. మరి పరిష్కారం?
శివానీ మధ్య తరగతి మహిళ. గతంలో ఒక కంపెనీలో ఉద్యోగం చేసింది. కానీ బస్సు లేదా మెట్రోలో వెళ్లాలంటే భయం ఏర్పడటంతో ఏడాది కిందట ఉద్యోగానికి రాజీనామా చేసింది. భర్త శివాజీ కూడా ఆమె సమస్యను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచాడు. అయితే ఆమె ఆందోళన రోజురోజుకూ పెరిగిపోసాగింది. తోడు లేకుండా కనీసం పక్క వీథిలోని కొట్టుకి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అగ్రోఫోబియా లక్షణాలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేభయం జనం మధ్య ఉండాలన్నా లేదా క్యూలో వేచి ఉండాలన్నా భయం సినిమా థియేటర్లు, ఎలివేటర్లు, చిన్న దుకాణాలు వంటి మూసి ఉన్న ప్రదేశాలంటే భయం పార్కింగ్ స్థలాలు, వంతెనలు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలంటే భయం బస్సు, విమానం, రైలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించాలన్నా భయం బయటకు వెళ్లాలంటే ఎవరైనా తోడు రావాలని కోరుకోవడం భయాందోళనల నుంచి తప్పించుకునేందుకు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావడం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఈ లక్షణాలతో బాధపడటం. అనేక కారణాలు అగ్రోఫోబియాకు కారణమేమిటో కచ్చితంగా తెలియదు. అనువంశికంగా వస్తుందని వైద్యులు భావిస్తారు. జెనెటిక్స్, హెల్త్ కండిషన్, పర్సనాలిటీ, స్ట్రెస్, అనుభవాలు.. అన్నీ ఈ రుగ్మత అభివృద్ధిలో పాత్ర పోషిస్తాయి. సాధారణ జనాభాలో ఒక శాతం కంటే తక్కువమందిలో ఇది కనిపిస్తుంది. పురుషులకంటే స్త్రీలలో రెండు నుంచి∙ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. యువతలో ఇది సర్వసాధారణం. పానిక్ డిజార్డర్, ఇతర ఫోబియాలు ఉన్నవారిలో, అగ్రోఫోబియాతో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, బాధాకరమైన అనుభవాలు ఉన్నవారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. దీనికి చికిత్స తీసుకోకుండా తాత్సారం చేస్తే.. డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలకు, ఆత్మహత్య ప్రయత్నాలకు దారితీస్తుంది. ఒకరోజు ధైర్యం చేసి బయటకు వెళ్లి.. అక్కడే కుప్పకూలింది. పక్కింటివారు చూసి ఇంటికి తీసుకువచ్చారు. ఏమైందని భర్త ప్రశ్నిస్తే.. ఒళ్లంతా వణుకు వచ్చిందని, శ్వాస ఆడలేదని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పింది. ఒక్కోసారి గుండె పట్టేసినట్టుగా ఉంటోందనీ చెప్పింది. శివాజీ వెంటనే ఆమెను హాస్పిటల్‌కి తీసుకువెళ్లి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించాడు. ఆరోగ్యపరంగా అంతా బాగానే ఉందని వైద్యుడు చెప్పాడు. శివానీ మానసికంగా భయపడుతోందని, వెంటనే సైకాలజిస్ట్‌ను సంప్రదించమని సూచించడంతో మా సెంటర్‌కి వచ్చారు. ఇంటికే పరిమితం చేసే జబ్బు శివానీతో అరగంట మాట్లాడాక ఆమె యాంగ్జయిటీ డిజార్డర్‌తో సతమతమవుతోందని అర్థమైంది. దాన్ని నిర్ధారించుకునేందుకు కొన్ని టెస్టులు ఇచ్చాను. వాటి ద్వారా ఆమె అగ్రోఫోబియాతో బాధపడుతోందని తేలింది. ఇది ఒక రకమైన ఆందోళన రుగ్మత. కొన్ని ప్రదేశాలకు వెళ్తే మైకం, మూర్ఛ, పడిపోవడం లేదా అతిసార వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతుంటారు. ఆయా ప్రదేశాలకు వెళ్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు చెమట పట్టడం, వణుకు, శ్వాస సమస్యలు, ఛాతీ నొప్పి రావచ్చు. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు అడుగు బయట పెట్టకుండా ఇంటికే పరిమితమవుతారు. సాధన, సహాయమే మార్గం.. అగ్రోఫోబియాను నివారించడానికి కచ్చితమైన మార్గం లేదు. భయపడే పరిస్థితులను తప్పించుకునే కొద్దీ ఆందోళన పెరుగుతుంది. జీవితం కష్టంగా మారుతుంది. దాన్నుంచి బయటపడాలంటే ముందుగా మీ ప్రయత్నాలు మీరు చేయాలి. వాటివల్ల ఫలితం కనిపించకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి. మీరు భయపడే ప్రదేశాలకు మళ్లీ మళ్లీ వెళ్లడం సాధన చేయాలి. దానివల్ల ఆయా ప్రదేశాల్లో మీకు సౌకర్యం పెరుగుతుంది. ఇలా స్వంతంగా చేయడం కష్టమైతే, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలి· యోగా, ప్రాణాయామం, జాకబ్ సన్, మసాజ్, విజువలైజేషన్ లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ సాధన చేయాలి· మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. అలాగే కాఫీని కూడా మితంగానే సేవించడం మంచిది · తగినంత నిద్ర పోవాలి. ప్రతిరోజూ శారీరకంగా చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. కూరగాయలు, పండ్లతో సహా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి· యాంగ్జయిటీ డిజార్డర్స్ ఉన్న వ్యక్తుల కోసం ఏర్పాటు చేసిన సపోర్ట్ గ్రూప్స్‌లో చేరడం వలన.. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, అనుభవాలను పంచుకోవడానికీ ఆ గ్రూప్స్ సహాయపడతాయి· అప్పటికీ సమస్య తగ్గకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్ట్‌ను కలవాలి. కన్సల్టెంట్.. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీకు సహాయపడతారు· క్రమం తప్పకుండా థెరపీ సెషన్ ్సకు హాజరవ్వాలి. థెరపిస్ట్‌తో మాట్లాడాలి. చికిత్సలో నేర్చుకున్న టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి· ఆందోళన తీవ్రంగా ఉంటే సైకియాట్రిస్ట్ సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: French Bubble Palace Facts: బుడగల మాదిరి భవనం..కట్టడానికే 14 ఏళ్లు..కానీ.. ) -
అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా?
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్‌పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్‌తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్‌ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్‌కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. (చదవడం: ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్‌తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు. ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్‌షిప్‌ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్‌గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది ∙ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
అత్యంత అరుదైన వ్యాధి..మెడిసిన్ ఖర్చే ఏకంగా రూ. 17 కోట్లు!
అత్యంత అరుదైన వ్యాధులు చాలానే ఉన్నాయి. అందులో మనకు తెలిసినవి చాలా తక్కువ. కొన్నింటికి చికిత్స లేకపోగ, మరికొన్నిటికి చికిత్సకు అయ్యే ఖర్చు చూస్తే అసలు సామాన్యుడు కాదు కదా ధనవంతుడైన ఖర్చుపెట్టలేనంతగా ఖరీదుగా ఉంటుంది. ఇక మరొకొన్నిటికి అసలు చికిత్స అనేది ఉండదు. అలాంటి అత్యంత ఖరీదైన వైద్యంతో కూడిన అరుదైన వ్యాధి బారిన పడ్డాడు ఓ చిన్నారి. అతడికోసం ముఖ్యమంత్రి కదిలివచ్చి పరామర్శించడమే గాక అత్యంత ఖరీదైన మెడిసిన్‌ను అందజేశారు. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలో అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు ఏడాదిన్నర చిన్నారి. అతడి పరిస్థితిని చూసి చలించిన ముఖ్యంమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ చిన్నారిని పరామర్శించి చికిత్సలేని ఆ వ్యాధికి ఇచ్చే అత్యంత ఖరీదైన మందును ఆయనే స్వయంగా అందజేశారు. ఆ డ్రగ్ ఖరీదు ఏకంగా రూ. 17.5 కోట్లు. అని చెప్పారు. ఇంతకీ అసలు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుందంటే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే వెన్నెముక కండరాల క్షీణత(ఎస్ఎంఏ). దీని వల్ల వెన్నుపాములోని మోటారు న్యూరాన్లను కోల్పోతుంది. దీంతో కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీన్ని జన్యు నాడీ కండరాల రుగ్మత అని కూడా పిలుస్తారు. ఈ మేరకు ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీకి చెందిన అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ సౌరభ్ నంద్వానీ మాట్లాడుతూ..భారతదేశంలో ఎస్ఎంఏ అనేది చాలా అరుదు. ఇది వస్తే మాత్రం గణనీయమైన ప్రభావం ఉంటుంది. ప్రతి ఏడు వేల మంది జననాలలో మూడు వేలమంది శిశువులు దీని భారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని కారణంగా పక్షవాతం వచ్చి క్రమంగా ఆరోగ్యం క్షీణిచడం తోపాటు మిగతా అవయవాలపై దీని ప్రభావం కూడా ఉంటుందని తెలిపారు. చికిత్స: దీనికి పూర్తి నివారణ లేదు. వెన్నుముక కండరాల క్షీణత కారణమైన జన్యవులను ప్రభావితం చేసేలా చికిత్స అందించడం ద్వారా ఈ సమస్యను అధిగమించడం వంటివి మాత్రమే చేయగలం అని తెలిపారు. దీని కోసం జోల్జెన్స్మా అనే జన్యు పునఃస్థాపన చికిత్స తోపాటు న్యూసినెర్సెన్ (స్పిన్రాజా), రిస్డిప్లామ్ (ఎవిర్స్డ్) అనే రెండు మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాధిత కుటుంబాల జన్యు క్రమాన్ని అధ్యయనం చేసి తత్ఫలితంగా చికిత్స అందించేలా వైద్య విధానాలు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. (చదవండి: మతిమరుపు అనేది వ్యాధా! ఇది వస్తే అంతేనా పరిస్థితి!!) -
రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా? ఈ డివైస్ ఉంటే చాలు
ఈ హైటెక్ హెడ్‌బ్యాండ్ నిద్రలేమిని దూరం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘అర్గో’ దీనిని ‘అర్గోనైట్’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి తెచ్చింది. తొలిసారిగా దీనిని 2019 సీఈఎస్ ప్రదర్శనలో ప్రదర్శించినప్పుడు ఇది విశేషంగా ఆకట్టుకుంది. నిద్రపోయేటప్పుడల్లా దీనిని తలకు తొడుక్కోనక్కర్లేదు. ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కుంటే చాలు. ఇలా వారానికి కనీసం మూడుసార్లు– ప్రతిసారి ఇరవై నిమిషాల సేపు తలకు తొడుక్కున్నట్లయితే, ఇది ఈఈజీ మాదిరిగా పనిచేస్తుంది. మెదడును స్కాన్ చేసి, ఆ చిత్రాలను యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. ఒత్తిడిని, ఆలోచనల తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. కొద్దినెలలు దీన్ని వాడితే నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిని వినియోగించిన వారు కూడా దీని పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ధర 499 డాలర్లు (రూ.40,940). -
అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్!
దియా హైదరాబాద్‌లో ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్. 50 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల ముగ్ధలా కనిపించాలని తాపత్రయపడుతుంటుంది. ప్రతిరోజూ ఉదయమే బరువు చెక్ చేసుకుంటుంది. తన వయసుకు, ఎత్తుకు తగ్గ బరువే ఉన్నా ఆమెకు సంతృప్తిగా ఉండదు. తానింకా బరువు తగ్గాలని విపరీతంగా డైటింగ్ చేస్తుంది. ఎక్సర్సైజుల సంగతి సరేసరి. వీటన్నింటివల్ల ఆమె ఆరోగ్యంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. రెండు నెలల కిందట రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయిస్తే గుండె క్రమరాహిత్యంగా కొట్టుకుంటోందని (అరిథ్మియా), రక్తపోటు కూడా తక్కువగా (హైపోటెన్షన్) ఉందని తేలింది. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి వర్పు రాలేదు. చివరకు మొన్న కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ కూడా డైటింగ్ గొడవే. దాంతో అది ఆరోగ్య సమస్య కాదని, మానసిక సమస్యని గుర్తింన డాక్టర్ సైకో డయాగ్నసిస్‌కి పంపించారు. దియా అనోరెక్సియా నెర్వోసా అనే ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడుతోంది. ఇది తిండికి సంబంధింన ఒక మానసిక సమస్య. బరువు పెరుగుతామనే భయం దీని ప్రధాన లక్షణం. దాంతో విపరీతంగా డైటింగ్ చేస్తుంటారు. దానివల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు రావడంతోపాటు, మరణానికి కూడా దారి తీస్తుంది. సాధారణంగా టీనేజ్, తదుపరి వయసు మహిళల్లో ఈ సమస్య కనిపిస్తుంది. పిల్లలు, పురుషులు, వృద్ధుల్లో కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఒకటి నుంచి రెండు శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. రూపాన్ని బట్టి చెప్పలేం.. ఒక వ్యక్తి రూపాన్ని బట్టి అనోరెక్సియా ఉందో లేదో చెప్పలేం. మామూలు బరువు ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ రుగ్మత ఉండవచ్చు. అలాగే ఈ రుగ్మత లేకున్నా తక్కువ బరువుతో ఉండవచ్చు. కాబట్టి అనోరెక్సియాను గుర్తించడానికి శారీరక, వనసిక, భావోద్వేగ, ప్రవర్తనా సంకేతాలను గుర్తించాల్సి ఉంటుంది. భావోద్వేగ, మానసిక సంకేతాలు: బరువు పెరుగుతుందనే తీవ్రమైన భయం, తక్కువ బరువు ఉన్నప్పటికీ కొవ్వు ఉన్న ఫీలింగ్, విపరీతమైన డైటింగ్, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు. ప్రవర్తనా సంకేతాలు: ఆహారపు అలవాట్లు లేదా దినచర్యలలో మార్పులు, కొన్ని ఆహారాలను మానేయడం, ఆకలిని అణచివేసే మందులను ఉపయోగించడం, మితిమీరిన వ్యాయామం. శారీరక సంకేతాలు: కొన్ని వారాలు లేదా నెలల్లో గణనీయమైన బరువు తగ్గడం, బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) లో వివరించలేని మార్పు, తరుచుగా అలసిపోయినట్లు అనిపించడం, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం (బ్రాడీకార్డియా), ఋతు క్రమం సక్రమంగా లేకపోవడం, ఆబ్సెంట్ పీరియడ్స్ (అమెనోరియా) ‘జీరో సైజ్’ కూడా కారణమే.. అనోరెక్సియాకు కచ్చితమైన కారణం తెలియదు. అయితే కొన్ని జన్యుపరమైన అంశాలు, వనసిక లక్షణాలు, పర్యావరణ కారకాలు, ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక కారకాల కలయిక దీనికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈటింగ్ డిజార్డర్స్ దాదాపు 50% నుంచి 80% జన్యుపరమైనవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ డిజార్డర్‌తో బాధపడే తోబుట్టువులు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఈ రుగ్మత అభివృద్ధి చెందడానికి 10 రెట్లు ఎక్కువ అవకాశం ఉంది. మెదడు రివార్డ్ సిస్టమ్, సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లలో మార్పులు. శారీరక వేధింపులు లేదా లైంగిక వేధింపులు కూడా ఈటింగ్ డిజార్డర్ రావడానికి కారణమవుతాయి. జీరోసైజ్ ఉన్నవారే అందమైనవారనే అవాస్తవ శరీర ప్రమాణాలు. తోటివారి టీజింగ్, అపహాస్యం, బెదిరింపులు.. · మానవ సంబంధాలు సరిగా లేకపోవడం, ఆత్మగౌరవం తగ్గడం! దీర్ఘకాల చికిత్స అవసరం.. మీరు అనోరెక్సియాతో బాధపడుతుంటే ముందుగా మీ కుటుంబ సభ్యులకు తెలపండి. దాని గురించి అవగాహన పెంచుకోండి. తగినంత నిద్ర పొందండి. మద్యం లేదా డ్రగ్స్‌కి దరంగా ఉండండి. దీనికి చికిత్స సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఓపిగ్గా ఉండాలి. · అయితే ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు సాధారణంగా తమకు సమస్య ఉందని గుర్తించరు, అంగీకరించరు. పరిస్థితి తీవ్రమై ప్రాణాంతకమైనప్పుడు మాత్రమే వారు కిత్సను కోరుకుంటారు. అందువల్ల కుటుంబ సభ్యులే దీన్ని ప్రారంభదశలోనే గుర్తిం చికిత్స చేయించడం చాలా ముఖ్యం. అనోరెక్సియా చికిత్సలో న్యూట్రిషన్ కౌన్సెలింగ్, సైకోథెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్, మందులు ఉంటాయి. అవసరమైతే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. ఈ రుగ్మతతో బాధపడే వ్యక్తులు ఇతర మానసిక సమస్యలను కూడా కలిగి ఉంటారు. వాటిని కూడా గుర్తిం సైకోథెరపీ అందించాల్సి ఉంటుంది. · ఆహారం, బరువు పట్ల ఆరోగ్యకరమైన వైఖరిని పెంపొందించడానికి అందించే మానసిక చికిత్సలో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (cognitive behavior therapy), డైలెక్టిక్ బిహేవియర్ థెరపీ (pydialectic behavior therapy) , ఇంటర్‌పర్సనల్ సైకో థెరపీ ( interpersonal psychotherapy ), సైకోడైనమిక్ సైకోథెరపీ (psychodynamic psychotherapy), ఫ్యామిలీ బేస్డ్ థెరపీ (family based therapy) ముఖ్యమైనవి. -సైకాలజిస్ట్ విశేష్ -
ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన.. ఎందుకలా చేస్తున్నారు?
ఒడిశా రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బతికి బట్టకట్టినవారు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. వీరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితులకు నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రైలు ప్రమాదంలో గాయాలపాలైనవారిలో కొందరు తీవ్రమైన ఆందోళనలో ఉండగా, మరికొందరు ఏడుస్తున్నారు. ఇంకొందరు మౌనంగా కనిపిస్తున్నారు. తమకు భయానక కలలు వస్తున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదానికి సంబంధించిన భీతావహ దృశ్యాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. ఈ ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగానే కోలుకుంటున్నారు. అయితే కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన 105 మంది బాధితులలో సుమారు 40 మందిలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్(పీటీఎస్డీ) లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరందికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బాధితులలోని భయాన్ని పోగొట్టేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారు. వైద్యులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. చదవండి: ఆ స్టేషన్ వద్ద ఇక రైళ్లు ఆగవు.. ఎందుకంటే? బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం క్లినికల్ సైకాలజీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జషొబంత్ మహాపాత్ర మాట్లాడుతూ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారి మానసిక పరిస్థితులను గమనించి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇటువంటి ఘోర ప్రమాదాన్ని చూసినప్పుడు బాధితుల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అటువంటప్పుడు భాధితులు తరచూ ఆందోళనకు గురికావడం, ఉన్నట్లుండి ఉలిక్కిపడటం, రోదించడం మొదలైనవి చేస్తుంటారన్నారు. మరికొందరు ఎవరితోనూ మాట్లాడక మౌనంగా ఉంటారన్నారు. ఇలా ప్రవర్తిస్తున్నవారికి తాము కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం నాలుగు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ బృందాలలో మానసిక నిపుణులు, వైద్యులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారన్నారు. నిద్రకు దూరమై.. ఈ సందర్భంగా ఆసుపత్రికి చెందిన ఒక నర్సు మాట్లాడుతూ బాధితులలో చాలామంది సరిగా నిద్రపోవడం లేదన్నారు. వారికి ఇంకా ప్రమాదంనాటి భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయన్నారు. కాగా ఈ ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడొకరు చేతులు,కాళ్లు కోల్పోయాడు. అతను నిద్రపోవడంలేదు. వైద్యులు కళ్లుమూసుకుని పడుకోమని చెప్పినప్పుడు, కళ్లు మూసుకుంటే నాటి భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయని సమాధానిమిస్తున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందున్న ఒక యువకుడు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయాడు. దీంతో ఇతను తరచూ తన స్నేహితుని పేరును గట్టిగా పలుకుతున్నాడు. బాధితులకు చికిత్స అందిస్తున్న ఒక వైద్యుడు మాట్లాడుతూ బాధితులు తమ స్థితిని చూసుకుని ఏడుస్తున్నారని, మరికొందరు విచిత్రంగా నవ్వుతున్నారని తెలిపారు. బాధితులలోని ఇటువంటి లక్షణాలను గమనించి వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. చదవండి: మృతదేహాలను ఉంచిన స్కూల్ కూల్చివేత! -
ఏ కాలంలో బాగా నిద్రపడుతుందంటే..
ఎవరైనాసరే రోజంతా ఏవో ఒక వ్యాపకాలలో మునిగిపోయాక, రాత్రయ్యాక ఇంటికి చేరుకుని నిద్రిస్తారు. అయితే వాతావరణం మారినప్పుడు ఆ ప్రభావం నిద్రపై ఉంటుందనే సంగతి మీకు తెలుసా? ఈ అంశంపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఎవరికైనా సరే వేసవిలో అంత సులభంగా నిద్రరాదని, చలికాలంలో నిద్ర త్వరగా వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఇంతకూ వాతావరణానికి, నిద్రకు మధ్యగల సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీకి చెందిన పరిశోధకులు సంవత్సరంలోని వివిధ కాలాల్లో మనిషి నిద్రపై అధ్యయనం చేశారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. చలికాలం ముగిసిన వెంటనే వేసవి కాలం వస్తుంది. ఈ తరుణంలో రాత్రి సమయం తగ్గి, పగటి సమయం పెరిగినట్లు అనిపిస్తుంది. దీనిని డే- లైట్ సేవింగ్ టైమ్ అని అంటారు. విపరీతమై చలికాలం ఉన్న సమయంలో రాత్రి సమయం పెరిగి, పగటి సమయం తగ్గుతుంది. దీనిని స్టాండర్డ్ టైమ్ అని అంటారు. ఈ అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం డే-లైట్ సేవింగ్ టైమ్ నుంచి స్టాండర్డ్ టైమ్‌కు మారే సమయంలో చాలామందికి స్లీపింగ్ డిజార్డర్ సమస్య తలెత్తుతుంది. అయితే స్టాండర్డ్ టైమ్ నుంచి డే-లైట్ సేవింగ్ టైమ్నకు మారేటప్పుడు ఎటువంటి సమస్య తలెత్తదు. దీనిగురించి అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెంబర్ రాన్ బీ పోస్టుమ్ మాట్లాడుతూ కాలాల మార్పు కారణంగా నిద్ర రావడంలో చాలా రోజుల పాటు మార్పులు రావు. ఇటువంటి మార్పు కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ పరిశోధనలో 45 నుంచి 85 ఏళ్ల మధ్య వయసు కలిగిన 30,097 మంది పాల్గొన్నారు. అధ్యయనంలో భాగంగా నిద్రకు సంబంధించిన ప్రశ్నలను వీరిని అడిగారు. మీరు ఎంత సేపు నిద్రపోతారు? మీకు నిద్ర ఎంతసేపటిలో పడుతుంది? ఎంత ఘాడమైన నిద్ర వస్తుందనే ప్రశ్నలను వారిపై సంధించారు. వీటితో పాటు గడచిన నెలలో ఎన్నిసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందని కూడా ప్రశ్నించారు. అలాగే ఎన్నిసార్లు నిద్ర మధ్యలో లేచారు? అటువంటప్పుడు ఉదయం నిద్రపోయారా అనే ప్రశ్నలు వేశారు. ఈ పరిశోధనలో ఎవరైతే ఒకవారం వ్యవధిలో మూడు లేదా అంతకన్నా ఎక్కువసార్లు నిద్రపట్టేందుకు 30 నిముషాల కన్నా అధికసమయం పట్టిందో లేదా వారి నిద్ర చెదిరిపోయిందో లేదా ఉదయం త్వరగా మెలకువ వచ్చేస్తోందో వారంతా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. పరిశోధకులు కాలాల మార్పు కారణంగానూ నిద్రలో వచ్చే మార్పులపై అధ్యయనం చేశారు. వేసవిలో చక్కగా నిద్రపోయవారు 6.76 గంటలు నిద్రపోతారని, చలికాలంలో దీనికన్నా 5 నిముషాలు అధికంగా అంటే 6.84 నిముషాలు నిద్రపోతారని తేలింది. చదవండి: నీటి అడుగు రాజ్యాలు.. కాలుష్య కాసారాలు -
PTSD: సొంత తాతే తన పట్ల, తన చెల్లి పట్ల నీచంగా.. అందుకే ఆమె ఇలా..
రియాకు 15 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా తనను తాను గాయపరచు కుంటోంది. ఎందుకలా చేస్తుందో పేరెంట్స్ అడిగినా, ఫ్రెండ్స్‌తో అడిగించినా ఏమీ చెప్పలేదు. ఏం చెయ్యాలో అర్థంకాక ఫ్రెండ్స్ సలహాపై పేరెంట్స్ ఆ అమ్మాయిని కౌన్సెలింగ్‌కి తీసుకొచ్చారు. ఆమెతో మాట్లాడినప్పుడు కూడా కారణమేంటో చెప్పలేదు. రెండు మూడు సెషన్లతో ఆమె నమ్మకం సంపాదించుకున్న తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టింది. తన 8 నుంచి 12 ఏళ్ల వరకు సొంత తాతే తనను లైంగికంగా వేధించాడని బోరుమని ఏడ్చింది. ఆ విషయం ఎవరికైనాచెప్తే చంపేస్తానని బెదిరించడంతో ఎవ్వరికీ చెప్పలేదంది. తనతో కూడా అలాగే ప్రవర్తించాడని తన చెల్లీ చెప్పిందని, ఆయన ఏడాది కిందట చనిపోయాడని తెలిపింది. తాత తనతో, చెల్లితో ప్రవర్తించిన విధానం అమ్మానాన్నలకు చెప్తే నమ్మకపోగా... ఇద్దరినీ కలిపి తిట్టారనీ చెప్పింది. తాను ముందే చెప్పి ఉంటే చెల్లెలైనా సేఫ్‌గా ఉండేదని, చెల్లెలికి అలా జరగడానికి తానే కారణమని బాధపడింది. చెల్లెల్ని చూసినప్పుడల్లా తాత గురించి పేరెంట్స్‌కు చెప్పకుండా తప్పుచేశాననే గిల్టీ ఫీలింగ్ చంపేస్తోందని, తాను చేసిన తప్పుకు శిక్షగా చెయ్యి కోసుకుంటున్నానని తెలిపింది. తానలా శిక్ష అనుభవించినప్పుడే మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటోందని తెలిపింది. ∙∙∙ కుటుంబ సభ్యుల మరణం, రక్తసిక్తమైన చావుని కళ్లారా చూడటం, చంపేస్తామనే బెదిరింపులు, యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, తీవ్రమైన గాయం, లైంగిక హింసకు గురికావడం లాంటి అత్యంత బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొన్నవారిని అవి జీవితాంతం వెంటాడుతుంటాయి. ఆ సంఘటన జరిగింది ఒకసారే అయినా దాన్ని మర్చిపోలేకపోతుంటారు. ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారీ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్‌కు గురైన రియాకు ఆ జ్ఞాపకాలు పదేపదే గుర్తొచ్చి తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీన్నే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) అంటారు. పీటీఎస్డీ లక్షణాలు.. ►బాధాకరమైన సంఘటనలు పదేపదే గుర్తొస్తుంటాయి ∙దానికి సంబంధించిన పీడకలలు రోజూ భయపెడుతుంటాయి. ►ఆ సంఘటనకు సంబంధించిన ఆలోచనలు, ప్రాంతాలు తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తాయి ∙వాటిని నివారించేందుకు రోజూ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. ►కొందరిలో బాధాకరమైన సంఘటనలకు సంబంధించి మతిమరపు ఏర్పడుతుంది∙ ►ప్రపంచం, వ్యక్తులు ప్రమాదకరమైనవనే నమ్మకాలు ఏర్పడతాయి. ►ఒంటరిననే భావన కమ్మేస్తుంది. రోజువారీ పనులపై ఆసక్తి తగ్గుతుంది నిరంతరం భయం, కోపం, అపరాధ భావన, అవమానాలతో కుమిలిపోతుంటారు∙ ►స్నేహం, ప్రేమ, దయ, కరుణలాంటి సానుకూల భావోద్వేగాలను అనుభవించలేకపోతారు చిరాకు, విధ్వంసకర ప్రవర్తన, నిద్రలేమి, ఏకాగ్రత లేమి, హైపర్ విజిలెన్స్ ఉంటాయి. ►రియాలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించాయి. చెల్లెలిపై వేధింపులకు తాను చెప్పకపోవడమే కారణమనే అపరాధ భావన, తాను చెప్పినా పేరెంట్స్ నమ్మలేదనే బాధ ఆమె మనసును నిత్యం దహించివేస్తున్నాయి. ►లైంగిక వేధింపులకు గురైన పిల్లల్లో పీటీఎస్డీ ప్రధాన సమస్యగా మారుతుంది. ఇది వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని, డిఫెన్స్ సిస్టమ్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తమను తాము హింసించుకునేలా ప్రేరేపిస్తుంది. రియా చేసిందదే. తనకు తానే శిక్ష వేసుకుంటోంది. ఏం చెయ్యాలి? ►ప్రతి ఏడుగురిలో ఒకరు రియాలా బాల్యంలోనే లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. లైంగిక వేధింపులకు గురైన వారిలో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుంది. అది జీవితాంతం వేధించే పీటీఎస్డీగా మారుతుంది. దీన్ని డీల్ చేయడంలో ముందుగా పేరెంట్స్‌కి కౌన్సెలింగ్ అవసరం. ఆ తర్వాత క్వాలిఫైడ్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్‌ల ద్వారా థెరపీ, చికిత్స అవసరం ఉంటుంది. ►లైంగిక హింసకు పాల్పడేవారిలో ఎక్కువమంది సన్నిహిత బంధువులో, తెలిసినవారో అయ్యుంటారు ∙తల్లిదండ్రులు నిత్యం జాగరూకతతో ఉండాలి. బాల్యంలోనే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి ∙తమపట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా పేరెంట్స్‌కి చెప్పవచ్చనే భరోసా కల్పించాలి ►పీటీఎస్డీ వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకునేందుకు స్ట్రెస్ బాల్స్ ఉపయోగించవచ్చు ∙అనుచిత ఆలోచనలను తప్పించుకోవడానికి విజువలైజేషన్ ఉపయోగపడుతుంది ►మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మైండ్‌ఫుల్ నెస్ ప్రాక్టీస్ సహాయపడుతుంది ∙ప్రతికూల ఆలోచనలు, బాధాకరమైన జ్ఞాపకాలు వచ్చినప్పుడు స్టాప్ అనే పదాన్ని మనసులో చూడండి ►కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎక్స్పోజర్ థెరపీ, ఐ మూవ్ మెంట్ డిసెన్సిటైజేషన్ అండ్ రిప్రాసెసింగ్((EMDR)), ట్రామా–ఫోకస్డ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (TF&CBT) లాంటి థెరపీ పద్ధతులు సహాయపడతాయి∙ న్యూరో లింగ్విస్టిక్ సైకోథెరపీలోని VK Dissociation టెక్నిక్ జ్ఞాపకాల నుంచి దూరమయ్యేందుకు సహాయపడుతుంది. ►సాధారణంగా 12 నుంచి 16 సెషన్లు కౌన్సెలింగ్‌కి హాజరవ్వాల్సి ఉంటుంది. ►యాంగ్జయిటీ, డిప్రెషన్, నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగించేందుకు సైకియాట్రిస్ట్‌ని సంప్రదించి యాంటీ డిప్రసెంట్ పిల్స్ వాడవచ్చు. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. మృణ్మయ భవనం.. పూర్తిగా మట్టితో నిర్మించిన ఈ హోటల్ ఎక్కడుందో తెలుసా? -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్? కేరళలో చికిత్స!
హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్న పూనమ్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటుందట. ఈ వ్యాధి కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతుందట.చదవండి: పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్ గత రెండేళ్ల నుంచి పూనమ్ ఈ వ్యాధితో బాధపడుతుందని ప్రస్తుతం దీన్నుంచి బయటపడేందుకు కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుందట. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ వ్యాధి బారినపడినట్లు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ పూనమ్ అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటుందని సమాచారం. కాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూనమ్ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి వంటి సినిమాల్లో నటించింది. చదవండి: డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా? -
విచిత్రమైన అలవాటు! తన జుట్టును తానే తింటున్న బాలిక!
చాలమందికి పలు రకాలు విచిత్రమైన హ్యబిట్స్ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివి, చెడ్డవి కూడా ఉంటాయి. మన అలవాట్లును మన పెద్దలు లేదా తల్లిదండ్రులు గమనించి అవి మంచివో లేక చెడ్డవో వివరించి చెప్పకపోతే ఇక్కడ ఉన్న బాలిక మాదిరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనక తప్పదు. వివరాల్లోకెళ్తే...చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అదేంటంటే తన జుట్టును తానే తింటుంది. ఐతే దీన్ని ఆమె ఇంట్లో వాళ్లు గమనించకపోవడంతో అదే పనిగా చాలా ఏళ్ల నుంచి తన జుట్టును తానే తింటోంది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం తీసుకోలేనంత దారుణమైన స్థితికి వచ్చేసి నీరసంగా తయారైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆమె కుటుంబసభ్యులు. అక్కడ జరిపిన వైద్య పరీక్షల్లో...ఆమె కడుపు మొత్తం ఏకంగా మూడు కిలోల జుట్టుతో నిండిపోయిందని, అందువల్లే ఆమె ఆహారం తీసుకోలేకపోతుందని అన్నారు. ఆ తర్వాత ఆ బాలికకు వైద్యులు సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి ఆ ముడు కిలోల హెయిర్ బాల్(ఉండలుగా ఉన్న జుట్టు)ని తీసేశారు. ఈ మేరకు జియాన్ డాక్సింగ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ షిహై మాట్లాడుతూ...ఆ బాలిక ఆహారం తీసుకులేని పరిస్థితి ఏర్పడటంతోనే మా వద్దకు వచ్చింది. అసలు ఆమె పొట్టలో ఆహారం పట్టేందుకు అవకాశం లేకుండా జుట్లుతో నిండిపోయిందని, ఆఖరికి ఆమె ఆహార ప్రేగు కూడా మూసుకుపోయిందని చెప్పారు. ఆ బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటంతో ఆమె అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరుగుతుందన్నారు. దీంతో వారు ఆమె విచిత్రమైన అలవాటుని గుర్తించలేకపోయారు. ఆ బాలిక పికా అనే విచిత్రమైన డిజార్డర్‌తో బాధపడుతోందని చెప్పారు. ఇలాంటి సమస్యతో బాధపడే చిన్నారులు, కాగితాలు, సుద్ధ ముక్కలు వంటి తినకూడని వాటిని ఆహారంగా తింటుంటారని చెబుతున్నారు. అంతేగాదు తమ జుట్టును తామే తినడాన్ని రాంపూజ్ సిండ్రోమ్‌గా వ్యవహిరస్తారని చెప్పారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆ చిన్నారి కూడా తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల చాల ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడి ఉండవచ్చని, అందువల్లే ఆమె ఈ విచిత్రమైన అలవాటుకి అడిక్ట్ అయినట్లు వైద్యుడు షిహై చెప్పారు. (చదవండి: డార్విన్ సంతకంతో కూడిన లేఖ వేలంలో ఎంత పలుకుతోందంటే...) -
దేశంలో వైద్య ‘అవ్యవస్థ’
న్యూఢిల్లీ: దేశ జనాభాలో 70 శాతానికి నేటికీ మౌలిక వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చాలా ఊళ్లలో డాక్టర్లుండరు. వాళ్లుంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రముండదు. రెండూ ఉంటే సరైన సదుపాయాలుండవు. ఇదీ మన దేశంలో ఆరోగ్య సేవల పరిస్థితి!’’ అన్నారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రానికి సూచించారు. ‘‘వైద్య సదుపాయాలను పెంపొందించాలి. పరిశోధనలకు ఊతమివ్వాలి. అవసరమైతే స్వచ్ఛంద సంస్థలతో పాటు కార్పొరేట్లను కూడా భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామీణ ప్రాంతాల్లో అవి వైద్య సదుపాయాలు అందించేలా చూడాలి. వైద్య వ్యవస్థ మెరుగుకు ఓ రోడ్ మ్యాప్ తప్పనిసరి’’ అన్నారు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతోందంటూ పలు గణాంకాలు వివరించారు. కుటుంబ, సమాజ, దేశ సంక్షేమంలో కీలక పాత్ర పోషించే మహిళలు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమన్నారు. ‘‘భార్య విలువైనా, తల్లి విలువైనా వారు లేకుండా పోయాకే అనుభవానికి వస్తుంది. మా అమ్మ 80 ఏట కన్నుమూసింది. అయినా ఈనాటికీ అమ్మను మర్చిపోలేకపోతున్నా’’ అన్నారు. ఇల్లాలి ప్రాధాన్యతను ప్రతి కుటుంబమూ గుర్తించాలని సూచించారు. శనివారం ఇక్కడ డాక్టర్ కల్నల్ సీఎస్‌పంత్; డాక్టర్ వనితా కపూర్ రాసిన పుస్తక విడుదల కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. నిజాయితీగా కష్టపడి పని చేసే డాక్టర్లపై హింస, దాడులు పెరుగుతున్నాయన్నారు. వారిపై తప్పుడు కేసులు పెట్టే ధోరణి ప్రబలుతోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. తన కూతురూ డాక్టరే కావడంతో వైద్యుల సమస్యలపై తనకు అవగాహన ఉందని చెప్పారు. ‘‘రోగుల క్షేమం కోసం నిరంతరాయంగా చెమటోడ్చే వైద్యుల స్ఫూర్తిని అభినందిస్తున్నా. వైద్యులంటే మన మిత్రులు, కౌన్సెలర్లు, దిశానిర్దేశకులు. సమాజంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో వారిది చురుకైన పాత్ర కావాలి. వారు పని చేసేందుకు మరింత మెరుగైన, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అవసరముంది’’ అని ఆయన అన్నారు. -
వింత వ్యాధి కలకలం.. పసుపు పచ్చగా మారిన బాలుడి నాలుక
ఈ భూమి ఓ వింత ప్రపంచం. అలాగే ఇక్కడ పుట్టే వింత జబ్బులు మనుషులను బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. వందేళ్లకు ఓ సారి పుట్టుకొచ్చే జబ్బుల గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాలకు గ్రామాలు తుడుచుకు పెట్టుకుపోతే.. ఇప్పుడు కరోనా ప్రపంచ దేశాలకే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎప్పుడు ఏ వేరియంట్ వస్తుందో.. ఏ కొత్త రకం వ్యాధి పుట్టుకొస్తుందో.. తెలియక ప్రపంచ జనులు హడలి చస్తున్నారు. ఒట్టావా: కెనడాకు చెందిన ఓ 12 ఏళ్ల బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇదో అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని డాక్లర్లు సూచిస్తున్నారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. బాలుడు గొంతు నొప్పి, మూత్రంలో సమస్య, కడుపు నొప్పి, చర్మంలో తేడా రావడంతో ఆస్పత్రికి వెళ్ళాడు. కొన్ని పరీక్షలు నిర్వహించిన తరువాత బాలుడుకి రక్తహీనత ఉందని, ఎప్సీన్ బార్ వైరస్ బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా బాలుడు కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ఇది ఓ అరుదైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలిపారు. ఇది అతని ఎర్ర రక్త కణాలపై రోగనిరోధక శక్తి దాడి చేసి వాటిని నాశనం చేస్తుందని వెల్లడించారు. కాగా యూఎస్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. కోల్డ్ అగ్లుటినిన్ వ్యాధి వల్ల రక్తహీనత, ఎర్ర రక్త కణాలు వేగంగా విచ్ఛిన్నం కావడం, కామెర్లను కలిగిస్తుంది. అయితే బాలుడికి చికిత్సలో రక్త మార్పిడి, రోగనిరోధక వ్యవస్థ కార్యకలాపాలను తగ్గించడానికి ఏడు వారాల పాటు స్టెరాయిడ్లను ఉపయోగించారు. దీంతో బాలుడు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. నాలుక రంగు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుందని జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదికలో పేర్కొంది. -
Covid: ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తున్నారా? అయితే ఓసీడే
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా... ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియాగా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళనతో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపనిగా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1: డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొటుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2: మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ∙ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ∙ అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) ∙విపరీతంగా చెమటలు పట్టడం ∙ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట ∙శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం ∙నోరు తడారిపోవడం ∙ఒళ్లు జలదరించడం ∙అయోమయం ∙కడుపులో గాభరా కడుపులో మంట ∙ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం ∙చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం ∙నిత్యం అలజడిగా ఉండటం ∙తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం... పై లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? ► మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. ► మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. ► మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ► మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. ► మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. ► గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ► ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. ► ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: ► రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ► టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ► మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. ► ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. ► బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ► ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. - డాక్టర్ చరణ్ తేజ కోగంటి కన్సల్టెంట్ న్యూరోసైకియాట్రిస్ట్ -
బాబుది ఏడీహెచ్‌డీ కావచ్చు..?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఏడేళ్లు. ఇతర పిల్లలో కలవడం చాలా తక్కువ. మేం ఏమి చెప్పినా వినిపించుకోడు. మాటలు కూడా కొంత ఆలస్యంగానే వచ్చాయి. కొన్నిసార్లు బాగానే ఆడుకుంటాడు గానీ ఒక్కోసారి దేనిమీదా దృష్టికేంద్రీకరించి కుదురుగా ఉండడు. పదే పదే కనురెప్పలు కొడుతుంటాడు. చూసినవాళ్లు... ‘ఇది చిన్నవయసు కదా. ఎదిగేకొద్దీ సర్దుకుంటాడు’ అని అంటున్నారు. అతడి సమస్య ఏమిటి? సరైన సలహా ఇవ్వగలరు. – ఆర్. మహేశ్వరి, నిజామాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి సమస్య ఇదే అని కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ మీ లేఖలోని అంశాలను విశ్లేషిస్తే ఇది అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏ విషయంపైనా చాలాసేపు దృష్టి కేంద్రీకరించలేకపోవడం అని చెప్పవచ్చు. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్‌తో పాటు హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివ్ బిహేవియర్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అటెన్షన్ డెఫిసిట్‌తో పాటుగా కొన్నిసార్లు కొద్దిమందిలో హైపర్ యాక్టివ్ లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ)’ అంటారు. అటెన్షన్ డెఫిసిట్ ఉన్న పిల్లల్లో అకడమిక్‌గా వెనకబడటం, స్నేహితులతో పెద్దగా కలివిడిగా ఉండలేకపోవడం, నిర్లక్ష్యంగా తప్పులు చేస్తూ ఉండటం, ఒక అంశంపైనా లేదా ఒక ఆటపైనా చాలాసేపు ఏకాగ్రత చూపలేకపోవడం, చెప్పినమాట వినకపోవడం, స్కూల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ వంటి టాస్క్‌లు గడువులోపల పూర్తి చేయకపోవడం, నిర్వహణశక్తిలోపం, పదే పదే వస్తువులను పోగొట్టుకోవడం, ఏదైనా అంశం నుంచి త్వరగా దారిమళ్లడం, ఎప్పుడూ విషయాలను మరచిపోవడం వంటివన్నీ నిత్యం చేస్తుండటం అన్నవి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ లక్షణాలు. అలాగే హైపర్ యాక్టివిటీకి సంబంధించి... బాగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఒకేచోట కుదురుగా కొంతసేపు కూడా కూర్చులేకపోవడం, ఎప్పుడూ గెంతుతూ, ఏదో ఎక్కుతూ ఉండటం, నెమ్మదిగా ఆడుకోలేకపోవడం, ప్రశ్నపూర్తిగా అడగకముందే జవాబిచ్చేలా స్పందించడం వంటివి అన్నీ హైపర్ యాక్టివ్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ ‘ఏడీహెచ్‌డీ’ సమస్య ఉన్నవారిలో నేర్చుకునే సామర్థ్యం తగ్గడం, యాంగై్జటీ, డిప్రెషన్, కనురెప్పలు అదేపనిగా కొట్టుకోవడం (టిక్ డిజార్డర్), మలమూత్రాల మీద నియంత్రణ లేకపోవడం, నిద్రసంబంధ సమస్యలు వంటివి ఉండవచ్చు. ఇలాంటి పిల్లల్లో సమస్యను సరిగ్గా నిర్ధారణ చేయడం వల్లనే చికిత్స సరిగా జరిగినట్లవుతుంది. ఈ పిల్లలకు పూర్తిస్థాయి చికిత్స రెండు రకాలుగా జరగాలి. ఒకటి... ప్రవర్తనాపరమైన చికిత్స (బిహేవియరల్ థెరపీ), రెండోది మందులతో చేసే చికిత్స. సమాజం ఆమోదించేలాంటి ప్రవర్తనను తీసుకురావడమే థెరపీ లక్ష్యం. బిహేవియరల్ థెరపీలో చాలా చిన్న చిన్న జాగ్రత్తలు, అంశాలదే కీలక భూమిక. సమస్యపై కుటుంబానికి అవగాహన కల్పించడం, కుటుంబ సభ్యుల చేయూత, క్రమబద్ధమైన జీవితం, నిర్ణీత వేళకు నిద్రలేవడం, పడుకోవడం, వేళకు తినడం వంటి మార్పులతో పాటు స్కూల్లోనూ కొద్దిపాటి మార్పులు, పిల్లలపై టైమ్, పరీక్షల ఒత్తిడి లేకుండా చూడటం వంటి వాటితో సత్ఫలితాలు కనిపిస్తాయి. దాంతోపాటు స్టిమ్యులెంట్ మెడిసిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బిహేవియర్ థెరపీపై అవగాహన కోసం ఇలాంటి పిల్లల పేరెంట్స్ అందరూ గ్రూప్‌గా ఏర్పడి నిర్వహించుకునే తరగతులతో ప్రయోజనం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే అతడికి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్‌తో పాటు టిక్స్ డిజార్డర్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి మీరు పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్‌ను కలిసి చికిత్స తీసుకోండి. ఇక ఇది కొద్దిపాటి దీర్ఘకాలిక సమస్య కాబట్టి తల్లిదండ్రులూ ఓపిగ్గా ఉండాలి. ఈ మానసిక రుగ్మత విషయంలో మంచి సంగతి ఏమిటంటే... ఈ సమస్య ఉన్న పిల్లల శక్తియుక్తులను సరిగ్గా గాడిలో పెట్టగలిగితే వాళ్లు గొప్ప విజయాలు సాధించడానికి అవకాశాలున్నాయి. బాబు అదేపనిగా ఏడుస్తున్నాడు మా బాబు వయసు రెండు నెలలు మాత్రమే. వాడెప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాడు. . డాక్టర్‌కు చూపించినా ఏమీ లాభం లేదు. అసలు వాడి సమస్య ఏమిటో తెలుసుకోవడం ఎలా? మాకు తగిన సలహా చెప్పండి. – ఎల్. పవన్‌కుమార్, ఒంగోలు ఇంత చిన్న పిల్లలు తమ బాధలనైనా కేవలం ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధనం ఏడుపు మాత్రమే. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు, ఎందుకు ఏడుస్తారో, అప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ∙ఆకలి వేసినప్పుడు ∙భయపడినప్పుడు ∙దాహం వేసినప్పుడు ∙బోర్ ఫీల్ అయినప్పుడు ∙పక్క తడిగా అయినప్పుడు ∙వాతావరణం మరీ చల్లగా లేదా వేడిగా ఉన్నప్పుడు ∙పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినప్పుడు ∙కాంతి ఎక్కువైనా, పొగలు కమ్ముకున్నా ∙నొప్పులు ఉన్నప్పుడు ∙పళ్ళు వస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షను వచ్చినప్పుడు ∙కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) ∙జ్వరం ∙జలుబు ∙చెవినొప్పి ∙మెదడువాపు జ్వరం ∙గుండె సమస్యలు ∙కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు. 1–6 నెలల వయసులో ఉన్న పిల్లలు ఎక్కువగా ఏడవటానికి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటివి ప్రధాన కారణాలు. ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్... చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ టైమ్‌లో పిల్లలు కొద్ది సేపు మొదలుకొని చాలా ఎక్కువసేపు ఏడుస్తుంటారు. ∙ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), లేదా వాళ్ల పొట్టమీద పడుకోబెట్టడం, ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
మందుల కారణంగా మధుమేహ సమస్యలు తీవ్రం!
మధుమేహ చికిత్స కోసం వాడే కొన్ని రకాల మందులు... కీటో అసిడోసిస్ అనే రుగ్మతకు.. తద్వారా కాలి దిగువ భాగాలను తొలగించాల్సిన పరిస్థితులకు దారితీస్తున్టన్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించింది. మధుమేహ చికిత్సలో సోడియం గ్లూకోజ్ కోట్రాన్స్పోర్టర్ (ఎస్జీఎల్టీ2) బహుళ ప్రాచుర్యం పొందిందని, మూత్ర పిండాల ద్వారా చక్కెరలను శరీరం వెలుపలకు పంపేందుకు ఇవి సహకరిస్తాయి. అయితే ఈ మందులు సురక్షితమైనవేనా అన్న అంశంపై తొలి నుంచి సందేహాలు ఉన్నాయి. మూత్రపిండాలకు నష్టం మొదలుకొని ఎముకలు తొందరగా విరిగిపోవడం వల్లకు అనే దుష్ప్రభావాలకు ఇదికారణమని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో అంతరాŠఝతీయ శాస్త్రవేత్తల బందం ఒకటి స్వీడన్, డెన్మార్క్‌లకు చెందిన వేల మంది మధుమేహులపై ఒక పరిశోధన చేపట్టింది. 2003 – 2016 మధ్యకాలంలో ఎస్జీఎల్టీ2 మందు వాడేవారిని, జీఎల్పీ1 మందు వాడేవారిని పోల్చి చూసింది. మిగిలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఎస్జీఎల్టీ2 మందు తీసుకునే వారికి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. -
స్త్రీలోక సంచారం
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ కిమ్ కర్దేషియాన్ (37), ఆమె మూడో భర్త, అమెరికన్ పాప్ సింగర్ అయిన కాన్యే వెస్ట్(41)ల ముద్దుల కుమార్తె నార్త్ వెస్ట్(5).. లాజ్ ఏంజిల్ సమీపంలోని పసిఫిక్ పాలిసైడ్లో జరిగిన ఫ్యాషన్ షో ర్యాంప్‌పై మోడల్‌గా అరంగేట్రం చేసింది. మైఖేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్‌లోని ‘థ్రిల్లా’ బొమ్మలా తయారైన ఈ చిన్నారి.. రెడ్ లెదర్ జాకెట్, మ్యాచింగ్ మినీ స్కర్ట్, జిప్–అప్ బ్లాక్ క్రాప్ టాప్, వైట్ సాక్స్, బ్లాక్ షూజ్, బ్లాక్ పర్స్, రెడ్ లిప్‌స్టిక్ ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు అంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోగా ఆ తల్లి కిమ్ కర్దేషియాన్ మనసు ఉప్పొంగిపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, అపోహల్ని పోగొట్టేందుకు యు.ఎస్.లో మొదలైన ‘పింక్ రిబ్బన్ క్యాంపైన్’లో భాగంగా హైదరాబాద్‌లో సోమవారం 10 ఎడిషన్ క్యాంపైన్ ప్రారంభమైంది. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్ తొలగింపు కేసులు తక్కువగా నమోదు అవడానికి కారణం తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించి తగిన చికిత్సను అందించడమేనని పిక్ రిబ్బన్ క్యాంపైన్ ద్వారా ఇది సాధ్యం అయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులతో పాటు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్–ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ సీఈవో, డైరెక్టర్ తమ ప్రసంగంలో తెలిపారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఏ విధంగానైనా వదిలించుకోవాలని చూడడం, చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లలను ఆడపిల్లలు తప్పించుకోవాలని చూడడం ఆదివాసీ తెగల్లోని యువతులను మావోయిస్టుల పోరుబాటలోకి నడిపిస్తున్నాయనీ, ఈ పరిస్థితిని వామపక్ష తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులైన బాలికల్ని, యువతుల్ని తమ ఉద్యమంలోకి వలవేసి లాక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్ పోలీస్, హోమ్శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల నియామకాల్లో మహిళల సంఖ్య 50 శాతానికి మించిపోయిందనీ, ఆదివారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.సోములను చంపడంలో మహిళా మావోయిస్టులే కీలక పాత్ర పోషించారనీ వారు తెలిపారు. బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని జేన్ విల్లెన్బ్రింగ్ రిసెర్చి నిమిత్తం తన మెంటర్, జియాలజిస్టు అయిన డేవిడ్ మర్చంట్‌తో కలిసి అంటార్కిటా ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడు చెప్పినట్లు ఆమె వినకపోవడంతో అనేక విధాలుగా ఆమెను వేధించి, ఆమె శరీరాకృతిలోని ఒంపుసొంపుల గొప్పతనాన్ని వర్ణించి, అప్పటికీ ఆమె లొంగకపోవడంతో ఆమెను మంచు లోయల్లోకి తోసి, ఆమె కళ్లల్లోకి బూడిదను పోసి నానా తిప్పలు పెట్టడంతో.. గతంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా అక్కడి ఒక గ్లేసియర్‌కు పెట్టిన అతడి పేరును ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ‘‘డేవిడ్ మర్చెంట్పై యూనివర్సిటీ తీసుకున్న ఈరకమైన చర్య ద్వారా మీకు న్యాయం జరిగిందని సంతృప్తి చెందారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘దీనిని నేను న్యాయం జరగడం అనుకోవడం లేదు. మొత్తానికైతే ఏదో జరిగింది’’ అని బాధితురాలు జేన్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే డిప్రెషన్, ఈటింగ్ డిజార్డర్, సెల్ఫ్ హార్మ్, బుల్లీయింగ్లతో మనోవ్యాధి పీడితురాలై ప్రత్యేక చికిత్సా కేంద్రంలో గడిపిన అమెరికన్ పాప్ సింగర్ డెమీ లొవాటో (26).. ఈ ఏడాది జూన్ 21న మళ్లీ డిప్రెషన్ బారిన పడి, ఓవర్‌డోస్ మందులు వేసుకోవడంతో ప్రాణాంతక స్థితిలోకి జారిపోయిన రెండు నెలల తర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు! యు.ఎస్.లో ఆమె చికిత్స పొందుతున్న ఆశ్రయ కేంద్రం బయట ఆదివారం ఉదయం, కుక్కను నడిపించుకుంటూ వెళుతున్న ఒక మహిళతో డెమీ లొవాటో మాట కలుపుతూ కనిపించారని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన టి.ఎం.జడ్. (థర్టీ మైల్ జోన్) వెబ్సైట్ ఆమె తాజా ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ట్రంప్ పాలనా యంత్రాంగంలోని జాత్యహంకారాన్ని, లైంగిక వైపరీత్యాలను తట్టుకోలేక అక్కడ పని చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్ మహిళ ఉజ్రా జేయా తన పదవికి రాజీనామా చేశారు. యు.ఎస్. విదేశాంగ శాఖలో పాతికేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగంలో రాణిస్తూ వస్తున్న ఉజ్రా.. ట్రంప్ వచ్చాక, పైస్థాయి పురుష అధికారుల్లో పెడధోరణులు పెచ్చరిల్లాయని, వాటి వల్ల మైనారిటీ మహిళలకు స్వేచ్ఛగా, సమర్థంగా పని చేసే వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు. హాలీవుడ్లో వచ్చిన ‘మీ టూ’ లాంటి శక్తిమంతమైన ఉద్యమం బాలీవుడ్లో ఏనాటికీ రాదని, వచ్చి ఉంటే 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగా చెప్పినప్పుడే నలుగురూ కలిసి వచ్చేవారని రెండేళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తనుశ్రీ దత్తా అన్నారు. ‘ఆ రోజు నా విషయంలో పెదవి విప్పని వారు కూడా ఇప్పుడు స్త్రీసాధికారత గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తోంది. ఎవరి స్వార్థం వారిదైపోయినప్పుడు కలికట్టు మహిళా ఉద్యమాలు ఎలా సాధ్యమౌతాయి?’ అని ‘న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్యానిక్ అటాక్ వెన్నులో వణుకు.. ఒళ్లంతా భయం
చీమంత సమస్యను చూసి పామంత భయపడటం....గోరంత కష్టానికి గొడ్డలంత అనుకొని బెంబేలు పడిపోవడం...ఏదో జరిగిపోతుందనే భయం...ఏదో అయిపోతుందనే భయం... సాధారణానికి మించిఅసాధారణంగాపానిక్!భయాన్ని అర్థం చేసుకుందాం ధైర్యంగా తరిమికొడదాం... మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. అక్కడ థ్రిల్ కోసం జెయింట్‌వీల్ ఎక్కారు. బాగా పైకి వెళ్లాక మీరు ఎక్కిన చైర్ స్క్రూ కాస్త లూజ్ అయినట్లుగా మీకు అనిపించింది. ‘అమ్మో...!అకస్మాత్తుగా అది ఊడిపోయి అక్కణ్ణుంచి పడిపోతే?’ అని మీకు అనిపించింది. అప్పుడు మీకు కలిగే భావన ఏమిటి? భయమా? ఆందోళనా? అంతకు మించిన స్థాయి.భయాందోళనలతో నిండిన శూన్యస్థితి. దానినే ప్యానిక్ అటాక్ అంటారు. ప్యానిక్ అటాక్ అంటే...? తీవ్రమైన ఉద్విగ్నతకులోనైన పరిస్థితుల్లో వచ్చే ఒక రకం రుగ్మతే ప్యానిక్ అటాక్. మన సమాజంలోని 20 నుంచి 25 శాతం మందిలో ఏదో ఒక దశలో పానిక్ అటాక్‌కు లోనుకావడం మామూలే. మనం ఏదైనా అంశంపై ఆందోళన పడ్డ సమయంలో యాంగై్జటీకి గురవుతాం. అలా చూస్తే దీన్ని కూడా ఒక రకం యాంగై్జటీగానే పరిగణించవచ్చు. అయితే యాంగై్జటీకీ, ప్యానిక్ అటాక్కీ ఎంతో తేడా ఉంది. యాంగై్జటీ చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. కానీ ప్యానిక్ అటాక్ అన్నది అకస్మాత్తుగా వచ్చి కొద్ది వ్యవధిలోనే అంతులేని ఆందోళనకు గురిచేస్తుంది. ఆ సమయంలో అటాక్‌కు గురైనవారు పూర్తిగా అచేతనమైన స్థితికి వెళ్లిపోతారు. కొన్నిసార్లు గుండెపోటు వచ్చిన లక్షణాలూ ఇందులో కనిపిస్తాయి. అందుకే ప్యానిక్ అటాక్‌ను గుండెపోటుగా పరిగణించిన సందర్భాలున్నాయి. కొన్ని రకాల గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు మొదటిసారి ప్యానిక్ అటాక్ రూపంలో కనిపించవచ్చు. ప్యానిక్ అటాక్... లక్షణాలు ప్యానిక్ అటాక్ వచ్చినప్పుడు కనిపించే శారీరక లక్షణాలు ఇవి. ∙చేతులు, కాళ్లు తీవ్రంగా వణుకుతాయి ∙గుండెదడ. అయితే ఈ గుండెదడ ప్యానిక్ అటాక్ కారణంగా అకస్మాత్తుగా మొదలవుతుంది. ∙కొందరిలో ఛాతీలో నొప్పి ∙తలలో నొప్పి ∙తలంతా తేలికైపోయినట్లుగా ఉండటం (లైట్‌హెడెడ్‌నెస్) ∙వికారం (నాసియా) ∙మూత్రం అర్జెంటుగా వస్తున్నట్లుగా ఉండటం ∙అస్థిమితంగా ఉండటం ∙అకస్మాత్తుగా చలిజ్వరం వచ్చినట్లుగా అనిపించడం ∙ మత్తుగా, నిద్రవస్తున్నట్లుగా అనిపించడం (డిజ్జీనెస్), ఒళ్లంతా మొద్దుబారినట్లుగా అనిపించడం ∙ఏదో కలలో ఉన్నట్లుగా అనిపించడం ∙ ఎదుట ఉన్న దృశ్యాలనూ స్పష్టంగా చూడలేకపోవడం ∙తీవ్రమైన భయం (టెర్రర్) కారణంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఎంతగా తప్పించుకోవాలనుకున్నా తప్పుకోలేనట్లుగా అనిపిస్తుండటం ∙తనకు సంభవిస్తున్న పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నందుకు లేదా వాటి నుంచి తప్పించుకోలేకపోతున్నందుకు తీవ్రమైన నిరాశగా ఉండటం ∙చనిపోతానేమోననే తీవ్రమైన ఆందోళన. ఎందుకు కలుగుతాయి ఈ ప్యానిక్ అటాక్స్ మన శరీరంలో ప్రకృతి ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఏదైన ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దానితో పోరాడు లేదా దాన్నుంచి పారిపో అనే సంకేతాలను మెదడు ఇస్తుంది. దీన్నే ‘ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. ఈ రెస్పాన్స్ కనబరచాల్సిన తీవ్ర విపత్కరమైన పరిస్థితుల్లో మన శరీరంలోకి ‘ఎపీనెఫ్రిన్’ అనే జీవరసాయనం అకస్మాత్తుగా వెలువడుతుంది. అప్పుడు అంతులేని యాంగై్జటీలో ఒక అచేతన స్థితిలో ప్యానిక్ అటాక్ కండిషన్ నెలకొంటుంది. కారణాలు: చాలా రకాల కారణాలు ప్యానిక్ అటాక్స్ వచ్చేందుకు దోహదం చేస్తాయి. మానసికమైన కారణాలతో పాటు భౌతికపరమైన జబ్బులు కూడా పానిక్ అటాక్స్‌ను కలిగిస్తాయి. ఉదాహరణకు ∙హైపర్ థైరాయిడిజమ్, హైపర్ పారా థైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ∙ఒంట్లో చక్కెర పాళ్లు తగ్గడం (హైపోగ్లైసీమియా) నెలకొన్నప్పుడు ∙గుండెకు సంబంధించిన రుగ్మతలైన లాంగ్ క్యూటీ సిండ్రోమ్, కేటకొలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులార్ టాకికార్డియా, వూల్ఫ్– పార్కిన్సన్– వైట్ సిండ్రోమ్ వంటి జబ్బులు ఉన్నవారికి కూడా ప్యానిక్ అటాక్స్ చాలా సాధారణం.కొందరిలో కొన్ని మందులు వాడుతున్నప్పుడు కూడా పానిక్ అటాక్స్ కనిపించవచ్చు. ఉదాహరణకు ∙డయాబెటిస్ మందులైన మెట్ఫార్మిన్, ఇన్సులిన్ వంటివి వాడేవారిలో ∙యాంటీ మలేరియా మందులు వాడే వారిలోనూ పానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో ఎలాంటి భౌతిక, మానసిక, భావోద్వేగ కారణాలు లేకపోయినా అకస్మాత్తుగా యాంగై్జటీ కలిగి ప్యానిక్ అటాక్ రావచ్చు. కొందరిలో తీవ్రంగా బాధించే ఏదైనా సంఘటన తర్వాత కలిగే రుగ్మతగా (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తర్వాత) గానీ, స్కీజోఫ్రీనియా తర్వాతగానీ ఇలాంటి ప్యానిక్ అటాక్స్ కనిపించవచ్చు. మరికొందరిలో చాలా ఎక్కువగా మద్యం తీసుకున్న తర్వాత ఇవి కనిపించవచ్చు. ఇంకొందరిలో తమకు ఉన్న చెడు అలవాట్లు వదిలేస్తున్నప్పుడు విత్‌డ్రావల్ సింప్టమ్స్ ప్యానిక్ అటాక్స్ రూపంలోనూ కనిపించవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్లు: మానసికమైన కారణాలైన తీవ్రమైన ఒత్తిడి (స్ట్రెస్)తో పాటు కొన్ని రకాల మత్తుమందులు విచ్చలవిడిగా వాడటం, మాదకద్రవ్యాల తీసుకుంటుండటం, పొగతాగడం, మద్యం వంటి అంశాలు యాంగై్జటీని పెంచి ప్యానిక్ అటాక్స్కు ముప్పు (రిస్క్)ను పెంచుతాయి. ఎవరెవరిలో...? ప్యానిక్ అటాక్స్ రావడం సమాజంలోని ప్రజలందరిలోనూ కనిపించవచ్చు. అయితే ముఖ్యంగా పిల్లల్లో, టీనేజీవారిలో మరీ ముఖ్యంగా లేట్ టీన్స్‌లో ఉన్నవారు, అర్లీ అడల్ట్ దశలో ఉన్నవారిలో ఇవి ఎక్కువగా వ్యక్తమవుతుంటాయి. ఫోబియాగా మారే ప్యానిక్ అటాక్... పైన పేర్కొన్న శారీరక కారణాలతో పాటు కొన్ని మానసిక పరిస్థితులూ ప్యానిక్ అటాక్స్‌ను కలగజేస్తాయి. ఉదాహరణకు బాగా ఎత్తులకు ఎక్కినప్పుడు ప్యానిక్ అటాక్ కలిగితే... ఎత్తుల పట్ల భయం (ఫోబియా) వస్తుంది. అలాగే ఎప్పుడైనా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లిఫ్ట్‌లో, ఆటలాడుతున్నప్పుడు.... ఇలాంటి మరే సందర్భాల్లోనైనా ప్యానిక్ అయినప్పుడు... మనసులో దానికి సంబంధించిన ఫోబియా డెవలప్ అవుతుంది. ఇలా మనం మామూలుగా భయపడటానికి ఆస్కారం లేని సందర్భాల్లోనూ భయాలను కలిగించేలా ప్యానిక్ అటాక్స్ రావడాన్ని ఫోబియా అంటారు. ప్యానిక్ అటాక్స్‌లో రకాలు... ప్యానిక్ అటాక్స్ రెండు రకాలు. అవి... ∙ఫోబియాతో కూడిన ప్యానిక్ అటాక్. ∙ఫోబియా ఏదీ లేకుండానే కలిగే ప్యానిక్ అటాక్. ఫోబియాతో వచ్చే ప్యానిక్ అటాక్స్ ఎలా ఉంటాయంటే...? ఫోబియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సందర్భాన్ని రోగి ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి అది. ఉదాహరణకు ఒక రోగి చాలా ఎల్తైన భవనంలోని నలభైరెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ చాలామందే ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఫీలవుతున్నా అంత ఎత్తు మీద రోగి తాను సురక్షితంగా లేనని భావిస్తుంటాడు. అక్కణ్ణుంచి పడిపోతానేమో అని ఆందోళన పడతాడు. నిజానికి అది పేషెంట్ అభిప్రాయమే తప్ప... అలాంటి ఆందోళనకు కారణమైన పరిస్థితులేమీ అక్కడ ఉండవు. దాంతో అతడిలో చెలరేగే తీవ్రమైన భయాందోళనలతో అక్కడ నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచన అతడిలో బలంగా వస్తుంది. ఈ అలోచనను ఎంతగా అవాయిడ్ చేద్దామన్నా అతడికి సాధ్యం కాదు. ఇలాంటివే రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు గుంపులుగా జనం ఉన్నచోట ఉండాలన్నా, ఆరుబయల్లా అనిపించే ప్రదేశాల పట్ల, ఎల్తైన ప్రదేశాల పట్ల... ఇలా అనేక భయాలు ఉంటాయన్నమాట. ఇక ఇలాంటి పరిస్థితులేమీ లేకుండానే ఏర్పడే భయాందోళనతో కూడిన మామూలు పానిక్ అటాక్స్ కూడా చాలామందిలో వస్తుంటాయి. అంతేకాదు... ప్యానిక్ అటాక్స్ అనేవి... కొన్నిసార్లు కొంతమందిలో సోషల్ యాంగై్జటీ డిజార్డర్, ప్యానిక్ డిజార్డర్ డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలనూ తెచ్చిపెడుతుంది. ఎంత సేపు కలుగుతుందీ ప్యానిక్ అటాక్...? ప్యానిక్ అటాక్‌తో బాధపడే వ్యవధి ఒక్కొక్కొరిలో ఒకలా ఉంటుంది. కొందరిలో దాదాపు 10 నిమిషాల కంటే ఎక్కువసేపే ఈ ప్యానిక్ అటాక్ కొనసాగుతుంది. ఆ సమయంలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ కలగవచ్చు. చికిత్స ప్యానిక్ అటాక్స్కు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు బెంజోడయజపైన్స్ ఉండే మందులు కూడా మానసిక నిపుణులు ఇస్తుంటారు. ప్రస్తుతం ఎస్ఎస్ఆర్ఐ మెడికేషన్స్ వంటి కొత్త మందులు ఈ సమస్య నుంచి బయటపడటానికి బాగా పనిచేస్తాయి. మందులతో పాటు కౌన్సెలింగ్ కూడా ప్యానిక్ అటాక్స్ నుంచి కొంతవరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. అధిగమించడం ఎలా? ప్యానిక్ అటాక్స్‌ను అధిగమించడం ఒకింత సులువే. తమకు ఆత్మవిశ్వాసం పెరిగేందుకు చేసే చర్యలతోనూ, మంచి జీవనశైలితో వీటిని అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం ప్యానిక్ అటాక్స్‌ను నివారిస్తుంది. రోజూ ఎక్సర్సైజ్ చేసేవారిలో ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా యాంగై్జటీ కూడా తగ్గడం వల్ల ప్యానిక్ అటాక్స్/ ఒళ్లు బిర్ర బిగుసుకుపోయే పరిస్థితి నివారితమవుతాయి. కృత్రిమ రంగులు, అడెటివ్స్ కలిపిన ఆహారాలు తీసుకునే వారు తేలిగ్గా ప్యానిక్ అటాక్స్కు గురవుతారు. అలా కాకుండా స్వాభావికమైన సమతులాహారం తీసుకునేవారిలో ప్యానిక్ అటాక్స్ తక్కువ. పొగతాగే అలవాటు, మద్యం, కెఫిన్ వంటివి ప్యానిక్ అటాక్స్‌ను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండటం అవసరం. ఒత్తిడిని తగ్గించే మార్గాలైన యోగా, ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్, కండరాలను హాయిగా ఉంచే మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటివి అన్నీ ప్యానిక్ అటాక్స్‌ను తగ్గిస్తాయి. డాక్టర్ ఐ. భరత్ కుమార్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ, హైదరాబాద్ -
మునిగిపోయే గొప్ప ఓడ కాదు, గమ్యం చేర్చే చిన్న దోనె చాలు
ఆనాటి యూదుమత ప్రముఖుడొకాయన యేసుప్రభువు వద్దకొచ్చి నేను నిన్ను వెంబడిస్తాను, నీవెక్కడికెళ్లితే అక్కడికొస్తానన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్లున్నాయి, కానీ తనకు మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ప్రభువాయనకు జవాబిచ్చాడు(మత్తయి 8:20). ఆయన ఏర్పర్చుకొన్న 12 మంది శిష్యులతో సహా ఎంతో మంది ప్రభువును అప్పటికే వెంబడిస్తున్నారు. అప్పటికి మూడేళ్ళుగా యేసు తన వాళ్ళతో కలిసి ప్రతిరాత్రి ఎక్కడో ఒక చోట బస చేస్తూనే ఉన్నాడు, రాత్రి పూట ఎక్కడో ఒకచోట తలవాల్చుతూనే ఉన్నాడు. మరి అతనితో ఈ మాటెందుకు అన్నాడు? ఆయన తన పేదరికాన్ని ప్రకటించుకొంటున్నాడా? ’భూమియు దాని సంపూర్ణతయు, లోకమును అందులో నివాసం చేసేవన్నీ ఆయనవే’ అంటుంది బైబిల్(కీర్తనలు 24:1). విశ్వమంతా తనదే అయినా యేసుప్రభువు ఈ లోకంలో జీవించిన ముప్పైమూడున్నరేళ్లలో తన పరలోకపు తండ్రి అభీష్టం మేరకు దైవత్వాన్ని సంతోషంగా పరిత్యజించి దిగి వచ్చిన పరిపూర్ణ మానవుడు. సకల భోగభాగ్యాలతో రాజప్రసాదంలో అనుభవిస్తున్న అత్యంత విలాసవంతమైన జీవితాన్ని వదిలి మారువేషంలో(లేదా మహిమశరీరం వదిలి మానవ శరీరంలో) తన ప్రజలతో కొంతకాలం సహజీవనం చేసేందుకు పూనుకొన్న మహాచక్రవర్తి ఆయన. ఈ దశలో ఆయనకంటూ సొంత ఆస్తులేవీ లేవు, ఉండవు కూడా. ఆపదలో సాయాన్ని, రుగ్మతలో స్వస్థతనిస్తూ, పడిపోయినపుడు పైకిలేపే స్నేహితుడిగా, కన్నీళ్లు, కష్టాల్లో ఓదార్చే సొంత మనిషిగా ఆయన దీనులు, నిరుపేదల కోసం నిరంతరం శ్రమించాడు. అంటే ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చి, వారితోనే వాళ్ళే తన సర్వంగా జీవించి ఏమీ లేని వారికి ఆయన ‘కొండంత అండ’ అయ్యాడు, వారి జీవితాల్లోనుండి విడదీయలేని భాగమయ్యాడు, వారి ’సొంత మనిషి లేదా సొంత ఆస్తి’గా మారాడు. తలవాల్చుకొనేందుకు కూడా తనకంటూ ఒక సొంత స్థలం లేనివాడే కాని అప్పుడూ ఇప్పుడూ కోట్లాదిమందికి యేసుప్రభువు ఆశ్రయదుర్గమయ్యాడు. ఈ రోజుల్లోలాగే, ఆ రోజుల్లో కూడా మతసంబంధమైన వ్యక్తులే అత్యంత ధనవంతులు. ఎంతో ఆస్థిపరుడైన ఒక శాస్త్రి తనను వెంబడిస్తానన్నపుడు అందుకే యేసుప్రభువు అతన్ని నిరాశపర్చే జవాబిచ్చాడు. నన్ను వెంబడించి నీవు కొత్తగా సంపాదించుకునేదేమీ ఉండదు సరికదా నీకిపుడున్నదంతా వదిలేయాల్సి వస్తుందని ప్రభువు అతనితో పరోక్షంగా అన్నాడు. ఊహించినట్టే అతను జడిసి వెనుదిరిగాడు. ఆస్తులు, విలాసాలు పొందే అవకాశం లేదనుకుంటే ఈనాటి చాలామంది బోధకులు కూడా అతని లాగే ప్రభువును వదిలేస్తారు. ఆస్తులు కాదు, మహిమైశ్వర్యవంతుడైన యేసే మాకు ’తిరుగులేని స్థిరాస్తి’ ఆనుకున్న ఇతర అనుచరులు మాత్రం ఆయన జీవనశైలినే అనుకరిస్తూ ఆయన్ను వెంబడించారు, అద్భుతమైన పరిచర్య చేశారు, పరలోకంలో ఆయనకు పాలిభాగస్థులయ్యారు. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్లో అక్కడి చేయితిరిగిన 16 మంది మెకానిక్‌ల సారధ్యంలో నిర్మించారు. వారి నైపుణ్యాన్ని మెచ్చి ఆ 16 మంది మెకానిక్‌లను ఓడ యజమాని ఫ్రీ టికెట్లిచ్చి తీసుకెళ్తుండగా ఓడతోపాటే వాళ్లంతా మునిగి చనిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ 16 మంది కుటుంబాల ఓదార్పు కోసం బెల్ఫాస్ట్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన గొప్ప సంస్మరణ సభలో ‘మునిగిపోని పడవ’ అనే అంశంతో ఒక దైవజనుడు ప్రసంగించాడు. భయంకరమైన తుఫానులో కూడా తిబెరియా సముద్రంలో యేసుప్రభువున్న ఒక చిన్న పడవ మునిగిపోలేదు. యేసులేని జీవితం ఎంత గొప్పదైనా అది మునిగే ఓడేనని, యేసే ఉంటే చిన్న దోనెలాంటి జీవితమైనా అది పెనుతుఫానులను కూడా జయిస్తుందని ఆయన వివరిస్తే ఆ రోజున ఆ మెకానిక్‌ల పిల్లలు చాలామంది ప్రభువు పరిచర్యకు తమ జీవితాలు అంకితం చేసుకున్నారు. యేసు ఉన్న మునిగిపోని ఓడలుగా వాళ్ళు తమ జీవితాలను నిర్మించుకోవడమే కాక, మరెన్నో వందల జీవితాలను అలా వాళ్ళు ప్రభువులో నిర్మించారు. అలా ఒక పెను విషాదంలో ఆనంద కెరటం ఎగిసిపడింది. ’యేసుప్రభువే నా నిజమైన ఆస్తి’ అని సగర్వంగా ప్రకటించుకోవడమే సజీవ క్రైస్తవం. ఆస్తులు, డబ్బు చుట్టూ తిరిగే క్రైస్తవం, పరిచర్య ఎన్ని హంగులు, ఆర్భాటాలున్నా మృతప్రాయమైనదే, ఒకనాడు మునిగిపోయేదే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
చంటి... బంటి... యాంగై్జటీ
పుస్తకానికి ఉన్న అట్టలు రెండూ చెదిరిపోతే కాగితాలు కుదురుగా ఉంటాయా? గాలికి కొట్టుకుపోవూ! అట్టల్లా కాపాడాల్సిన తల్లిదండ్రులే పిల్లల ముందు గొడవపడుతుంటే చిగురుటాకుల్లా పిల్లలు వణికిపోరా? పేరెంట్స్ మధ్య గొడవ చాలాసార్లు వారి బంధాలను బలపరచవచ్చేమోగానీ... పిల్లలు దాన్ని అర్థం చేసుకోగలరా? ‘అమ్మా నాన్నా విడిపోతారా?మనం చెదిరిపోతామా?’.. ఏ ఇంటి చంటీ బంటీలకైనా ఇదే ఆందోళన. పదేళ్ల బంటీ, ఎనిమిదేళ్ల చంటీ అన్నాచెల్లెళ్లు. వాళ్లిద్దరూ మూడు నాలుగు గంటల్నుంచి కనపడకుండా పోయారు. అప్పటికే కొన్ని గొడవల్లో ఉన్న వాళ్ల పేరెంట్స్‌కు ఇదో అశనిపాతం. పక్కింట్లోనూ, పిల్లల స్నేహితుల ఇళ్లలోనూ వాకబు చేసి, వాళ్లు అక్కడికి రాలేదని కన్ఫర్మ్ అయ్యాక... ఆందోళనగా, హడావుడిగా పోలిస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ కంప్లయింట్ ఇచ్చి... తామూ వెతకడానికి పూనుకున్నారు. ఎందుకో తండ్రి సుధాకర్‌కు డౌట్ వచ్చి బస్‌స్టాండ్‌కు వెళ్లి చూశాడు. అక్కడ ఒక ప్లాట్‌ఫారమ్ మీద బిక్కుబిక్కుమంటూ చంటీ, బంటీ! అప్పటివరకూ ఉన్న భారమంతా ఒక్కసారిగా తొలగిపోయినట్లు అయినట్లు అనిపించింది. కానీ అంతలోనే మళ్లీ ఆందోళన. పిల్లలు తల్లిదండ్రులతో ’ఇంటికి రానేరాం’ అన్నారు. సమూదాయించి తీసుకొచ్చాక కూడా సరిగా నిద్రపోలేదు. ఎలాగో నిద్రపట్టాక మళ్లీ ఉలిక్కిపడి లేస్తున్నారు. రెండు మూడు రోజులు ఇదే తంతు. పేరెంట్స్ ఇద్దరూ ఆందోళనతో పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్లిద్దరితోనూ మాట్లాడాక సైకియాట్రిస్ట్ అప్పుడు తల్లిదండ్రుల వైపునకు తిరిగి... ‘పిల్లలు వెళ్లిపోయిన రోజు ఏం జరిగింది?’ అంటూ అడిగాడు. ఆరోజు జరిగిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు సుధాకర్, అనుపమ. ఆనాడు ఏం జరిగిందంటే...‘‘ఎంత డబ్బని తగలేస్తారిలా’’ అరుస్తోంది అనుపమ.‘‘మాటలు తిన్నగా రానియ్. తగలేయడమేంటి? డబ్బులు పంపింది నా పేరెంట్స్‌కి’’ సుధాకర్ గొంతూ గట్టిగానే ఉంది. ‘‘అదే.. అస్తమానమూ మీరే ఎందుకు పంపాలి? మీరొక్కరనే కొడుకు? మీకో అన్న, తమ్ముడూ ఉన్నారుగా. వాళ్లకు లేదా బాధ్యత’’ భర్తకు ఎదురెళ్లి మాట్లాడుతోంది నరాలు చిట్లేంత ఆవేశంతో!‘‘నా బాధ్యత నాది.. పంపొద్దని చెప్పడానికి నువ్వెరివి?’’ భార్యను కొట్టడానికి వెళ్తాడా అన్నంత కోపంగా అతను. ‘‘ఏమన్నారు.. నేనెవర్నా’’ ఆమె అహం దెబ్బతిన్నది. ‘‘అవును.. నన్ను ఆపడానికి ను..వ్వు.. ఎ..వ..రి..వి’’ ఒత్తి పలుకుతూ అతను. ‘‘ఛీ.. ఇంత మాట అనిపించుకున్న ఈ బతుకు అవసరమా. ఇంకా ఈ భార్యాభర్తల బంధం ఎందుకు?’’ నిలదీసింది.‘‘అయితే డైవోర్స్ ఇచ్చేయ్’’ అన్నాడు.గంట నుంచి ఈ గోలంతా వింటున్న, చూస్తున్న పిల్లలిద్దరు కూడా షాక్ అయ్యారు. తేరుకున్న అనుపమ బెడ్‌రూమ్‌లోకెళ్లి తలుపేసుకుంది. అతను విసురుగా బయటకు వెళ్లిపోయాడు. ‘‘అన్నయ్యా.. అమ్మానాన్నా విడిపోతారా?’’ వెక్కిళ్ల మధ్య అడిగింది ఎనిమిదేళ్ల చంటి. ‘‘ఏమో చెల్లీ’’ అయోమయంగా చెప్పాడు పదేళ్ల బంటి. ‘‘నాకు భయంగా ఉందిరా అన్నయ్యా’’ అదే వెక్కిళ్లతో చంటి. గత కొద్ది రోజులుగా అమ్మానాన్న గొడవలను చూస్తున్నారు. ఈ రోజు తారస్థాయికి చేరుకున్నట్టు అర్థమైంది ఆ పిల్లలను. అభద్రత నిలువనీయడం లేదు వాళ్లను. ఇంట్లో నుంచి పారిపోయి అమ్మమ్మ దగ్గరకు వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు. కాని ఆ పని వల్ల వాళ్లు ప్రమాదంలో పడవచ్చు. పిల్లల ముందు తగువులాడుకునే పెద్దలు ఇవి ఆలోచిస్తారా? అటు బెడ్రూమ్లో ఉన్న అనుపమ పరిస్థితీ ఇంచుమించు ఇదే. ఇలాంటి వాడికోసమా తన వాళ్లందరినీ వదులుకొని వచ్చింది? ఈ రోజు నువ్వెవరు అని అడుగుతున్నాడు.. పైగా డైవోర్స్ కూడా ఇవ్వాలట? దేవుడా ఈ సిట్యుయేషన్ ఎక్కడికి వెళ్తుంది? నేను, నా పిల్లలు ఏమై పోవాలి?’’ భయం ఆమెను వణికిస్తోంది.బయటకెళ్లిన అతని మానసిక స్థితీ అదే. కోపంలో.. ఆవేశంలో నోరు జారాడు. తనెలా రియాక్ట్ అవుతుందో? నిజంగానే నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతుందా? అమ్మానాన్న రెస్పాన్స్‌బులిటీ నేనొక్కడినే తీసుకుంటే తప్పేంటి? వీళ్లనైతే నిర్లక్ష్యం చేయట్లేదు కదా? ఈ మాత్రం అర్థంచేసుకోలేదా? సహనం నశించి ఒక్క మాటన్నాడు. భగవంతుడా.. అనుపమ నన్ను విదిలేస్తే.. అమ్మో ఆ ఊహనే తట్టుకోలేకపోతున్నాడు. బాధ, భయం, ఆందోళన అతనిని ఉండనివ్వట్లేదు. ఇది ఒక రకం యాంగై్జటీ. చంటి, బంటీ అనుభవిస్తున్న ఆ మానసిక పరిస్థితిని ‘అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ’ అంటారు. తమకు ఇష్టంలేకపోయినా ఏదైనా కారణాల వల్ల జీవిత భాగస్వామిని వదులుకోవాల్సి వచ్చే పరిస్థితితో పెద్దలు కూడా ఈ తరహా అడ్జెస్ట్మెంట్ డిజార్డర్‌కు గురవుతారు. అయితే కేస్‌స్టడీలో పేర్కొన్న ఉదాహరణలోని సంఘటనలో మాత్రమే కాదు... ఇతరత్రా ఎలాంటి సందర్భాల్లోనైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఈ విధమైన యాంగై్జటీకి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటిప్పుడు అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ కి కారణమైన సంఘటనను బట్టి కౌన్సెలింగ్‌తో పాటు చికిత్స ప్రక్రియలు మారుతుంటాయి. కొన్నిసార్లు శారీరక సమస్యలు కొంతమందిలో యాంగై్జటీ కారణంగా కడుపులోని జీర్ణస్రావాలు ఎక్కువగా స్రవిస్తూ కడుపు కండరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో స్టమక్ అల్సర్స్ వస్తాయి. అలా పిల్లల్లో కడుపునొప్పులు తరచూ కనిపిస్తాయి. యాంగై్జటీతో దురలవాట్లు తమలోని యాంగై్జటీని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు సిగరెట్, మరికొందరు మద్యం వంటి దురలవాట్లను ఆశ్రయిస్తుంటారు. వాటివల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం కలుగుతున్న భ్రాంతితో ఆ దురలవాట్లలో కూరుకుపోయి జీవితాలను నాశనం చేసుకున్న కేసులు ఎన్నో. చికిత్స పిల్లలకు... పిల్లలు చాలా సున్నిత మనస్కులు. వారి హృదయాలు తేలిగ్గా గాయపడతాయి. అందుకే అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అనే కండిషన్‌కు గురైన పిల్లలకు మొదట తల్లిదండ్రులు కల్పించాల్సింది భరోసా. తాము ఎప్పటికీ కలిసే ఉంటామన్న విశ్వాసాన్ని పిల్లల్లో పాదుగొలపాలి. ∙ పిల్లలకు సైతం నిత్యం వారితో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగవనే నమ్మకాన్ని తల్లిదండ్రులు కల్పించడం ఎంతో అవసరం ∙పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని భర్తీ చేయాలి పెద్దలకు... తల్లిదండ్రులకు మొదట ఫ్యామిలీ కౌన్సెలింగ్ థెరపీ అవసరమవుతుంది. ∙పిల్లల ముందు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ గొడవలు పడకూడదనే విధంగా పెరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ∙ కుటుంబ సభ్యులందరూ ఎదుర్కొన్న పరిస్థితులను పేరెంట్సకు ఉదాహరణగా చూపుతూ పిల్లలు పడిన మానసిక క్లేశాన్ని వారికి వివరించాలి. ఒకవేళ గొడవలు తీవ్రంగా ముదిరి నిజంగానే విడిపోయవాల్సి వస్తే పిల్లలకు కలిగే దురవస్థను వారికి వివరించడం ద్వారా ఆ స్థితి రాకుండా నివారించవచ్చు. అలా కుటుంబంలోని అందరి మానసిక వేదనను తొలగించడం సాధ్యమే. ్డ కారణాలు : భార్యాభర్తల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలలో సమస్యలు (రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్) వంటివి పిల్లల్లో, పెద్దల్లో ఈ తరహా యాంగై్జటీకి కారణమవుతాయి. రకాల యాంగై్జటీకి ప్రధాన కారణం ఆర్థికపరమైన అంశం. దంపతుల్లో ఒకరు చేసింది మరొకరికి నచ్చకపోవడంతో పాటు భార్యభర్తల్లో తాము పనిచేసే చోట కనిపించే ఒత్తిళ్లు, కార్యక్షేత్రంలో ఇబ్బందులు, ఒడిదొడుకులు, బంధువుల్లో తగాదాలు ఇవన్నీ ఈ రకం డిజార్డర్‌కు, తద్వారా వారిలోని యాంగై్జటీకి కారణమవుతాయి. లక్షణాలు : అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ తో బాధపడే పిల్లల్లో ఈ తరహా లక్షణాలు కనిపించవచ్చు అవి... ∙పిల్లలు ఎప్పుడూ తీవ్రమైన ఆందోళనతో ఉండటం ∙సంతోషంగా ఉండాల్సినప్పుడూ ఆ సంతోషం కనిపించకపోవడం ∙స్థిమితంగా ఉండేలేకపోవడం ∙అరచేతులు, అరికాళ్లలో చెమటలు పట్టడం ∙తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతుండటం ∙నిద్ర సరిగా ఉండదు, ఈ తరహా లక్షణాలు కనిపించడానికి దాదాపు మూడు నెలల ముందు పిల్లలుగానీ లేదా పెద్దవాళ్లుగానీ అడ్జెస్ట్మెంట్ డిజార్డర్‌కు గురయ్యేంతగా తీవ్రస్థాయి ఒత్తిడికి గురై ఉంటారు. దాన్ని బట్టి పిల్లల్లోగానీ లేదా పెద్దల్లో గాని ఈ తరహా యాంగై్జటీకి గురయ్యారని నిర్ధారణ చేయవచ్చు. సూచనలు : కుటుంబాల్లో దంపతుల మధ్య చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉండనే ఉంటాయి. ఒక్కోసారి అవే ముదిరి తీవ్రస్థాయి వాగ్వాదాలుగా మారడం చాలా సహజం. అందుకే దంపతుల్లో ఆవేశాలు పెచ్చరిల్లినప్పుడు, వాగ్వాదాలు ముదురుతున్నప్పుడు పిల్లల ముందు వాటిని వ్యక్తపరచకూడదు. వాళ్ల పరోక్షంలోనే విషయాలు మాట్లాడుకోవడం మంచిది. అలాగని వాళ్లు లేనప్పుడు గొడవపడాలని కాదు. ఆవేశం క్షణికమనీ... కొద్దిసేపటి తర్వాత అది తగ్గుతుందని గ్రహించి, కాసింత సేపు గడువిచ్చి మాట్లాడుకుంటే... తల్లిదండ్రుల మధ్యా టెన్షన్ తొలగుతుంది. పిల్లలకూ ఆందోళన తప్పుతుంది. – డాక్టర్ పద్మ పాల్వాయి సీనియర్ ఛైల్డ్ సైక్రియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
రికార్డులూ బద్దలు కొడతారు
కుండలో పట్టనంత ఎనర్జీ ఉంటుంది ఈ పిల్లల్లో! ఇవాళ వీళ్లు ఆగరు... రేపు వీళ్లను పట్టలేం. వీళ్లలో ఉన్న ఈ అత్యుత్సాహం, సూపర్ ఎనర్జీని కంట్రోల్ చేయడం తల్లిదండ్రుల తరం కాదు. కానీ... ఈ దూకుడును దారిలో పెడితే ఫ్యూచర్లో రికార్డులూ బద్దలు కొట్టగలరు. ముందుగా ఒక ఉపకథతో ఈ రుగ్మత గురించి మొదలుపెడదాం. ఇప్పుడతడి వయసు 33 ఏళ్లు. కానీ చిన్నప్పుడు అతడి పరిస్థితి వేరు. దేనిమీదా దృష్టి కేంద్రీకరించేవాడు కాదు. ఉన్నచోట కుదురుగా ఉండేవాడూ కాదు. ప్రతిరోజూ స్కూల్ టీచర్ నుంచి ఫిర్యాదులే ఫిర్యాదులు. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే దేనిమీదా దృష్టి సారించలేని ఒక జబ్బు ఉందని తేలింది. దృష్టి కేంద్రీకరించ లేకపోవడం, అతిచురుగ్గా ఉండటం ఆ జబ్బులో భాగం. అతడి అతి చురుకుదనాన్ని ఎలా భరించాలో తల్లికి తెలియలేదు. ఆ అతిచురుకుదనాన్ని చానలైజ్ చేయాలనుకుని స్విమ్మింగ్‌పూల్‌ను పరిచయం చేసింది తల్లి. ‘ ముఖం తడిసిపోతుంది... ఈదను’ అన్నాడా పిల్లాడు. ‘సరే బ్యాక్స్ట్రోక్తో మొదలుపెట్టు’ అని మరో సలహా ఇచ్చింది. అంతే. 2016 ఒలింపిక్స్ నాటికి ఈతలో అతడు సాధించిన మొత్తం మెడల్స్ 28. వాటిలో 23 బంగారు పతకాలు. ఆ కుర్రాడి పేరు మైకెల్ ఫెల్ప్స్. అతడికి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆ జబ్బు పేరు ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్’. సంక్షిప్తంగా దాన్నే ఏడీహెచ్‌డీ అంటారు. అటెన్షన్ డిఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అంటే: పిల్లల వికాసంలో లోపాన్ని కలిగించే ఒక రుగ్మత ఇది. ఈ రుగ్మతలో దృష్టి కేంద్రీకరణ లోపంతో పాటు, ప్రమాదకరంగా పరిణమించే తీవ్రమైన అతిచురుకుదనం ఉంటుంది. ఈ రెండు లక్షణాల్లో ఒక్కోసారి ఒక్కొక్కటి బయట పడుతుంటాయి. గతంలో ఏడేళ్ల వయసులో బయటపడే ఈ రుగ్మత ఇప్పుడు నాలుగేళ్లకే కనిపిస్తోంది. విస్తృతి కూడా ఎక్కువే: మానసిక వైద్యశాస్త్రంలో దీనిని ఒక రుగ్మతగా పరిగణిస్తున్నారు. ఏడీహెచ్డీలో అనేక రకాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 శాతం పిల్లల్లో ఈ రుగ్మత కనిపిస్తోంది. ఇదొక దీర్ఘకాలిక సమస్య. పిల్లలుగా ఉన్నప్పుడు బయటపడ్డ ఈ రుగ్మత 30 నుంచి 50 శాతం మందిలో ఆ తర్వాత యుక్తవయసుకు వచ్చాక కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక తల్లిదండ్రుల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు ఉంటే పిల్లలకు ఇది వచ్చే అవకాశాలు జన్యుపరంగా చాలా ఎక్కువ. ఏడీహెచ్‌డీకి కారణాలు ఏడీహెచ్‌డీకి కారణాలు ఇప్పటికీ నిర్దిషంగా తెలియదు. జన్యుపరమైన, వాతావరణపరమైన, ఆహారపరమైన, సామాజికమైన అనేక అంశాలు ఈ రుగ్మతకు కారణమవుతాయని నిపుణులు పేర్కొంటు న్నారు. జన్యుపరమైనవి: ఏడీహెచ్‌డీకి కారణమైన జన్యుపరమైన లోపాలను పెట్ స్కాన్ ద్వారా గుర్తిస్తారు. ఈ స్కాన్‌లో మెదడును పరీక్షించినప్పుడు డోపమైన్ ట్రాన్స్పోర్ట్ ప్రక్రియ తక్కువ స్థాయిలో జరుగుతుందని గుర్తించారు. వాతావరణపరంగా: వాతావరణంలో సీసం (లెడ్) కాలుష్యం ఎక్కువగా ఉండేచోట ఉన్న పిల్లల్లోనూ ఇది ఎక్కువ. మద్యం, పొగాకు, పొగతాగడం వంటి నేపథ్యంలో పెరిగే పిల్లల్లో ఈ తరహా రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు తల్లి సమస్యలు ఎదుర్కోవడం లేదా నెలలు నిండకముందే పుట్టడం వంటి కేసుల్లోనూ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ప్రసవం సమయంలో తలకు గాయం అయిన వారు ఏడీహెచ్‌డీకి గురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువగా టీవీ చూసే పిల్లలు, ఇంటర్నెట్, వీడియోగేమ్స్ ఆడే పిల్లల్లో ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పిల్లలు చదువులపై, లక్ష్యసాధనపై నిమగ్నం చేయలేక త్వరగా తమ దృష్టిని వేరే అంశాల వైపునకు మళ్లిస్తారు. ఆహారం: స్వాభావిక ఆహారంపై పెరగకుండా కృత్రిమరంగులు వేసే ఆహారం, ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారం తినే పిల్లల్లో ఏడీహెచ్‌డీ ఎక్కువ. దీనితోపాటు చక్కెర ఎక్కువగా విడుదలయ్యే ‘హై గ్లైసీమిక్ ఇండెక్స్’ ఉన్న ఆహారం... అంటే స్వీట్లు, చాక్లెట్లు తినే పిల్లల్లో ఇది ఎక్కువ. జంక్‌ఫుడ్, ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యంతో వండిన పదార్థాలు తినే పిల్లల్లోనూ ఏడీహెచ్‌డీ అవకాశాలు ఎక్కువ. సామాజిక అంశాలు: కుటుంబ బాంధవ్యాలు సక్రమంగా లేని పిల్లల్లోనూ, సమస్యాత్మక కుటుంబ నేపథ్యం ఉన్న చిన్నారుల్లో ఈ రుగ్మత ఎక్కువ. ఇటీవలి పరిశోధనల ప్రకారం కుటుంబం పట్ల మంచి శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలు, తాతా నాయనమ్మలతో మంచి సంబంధాలున్న పిల్లల్లో తమను తాము చక్కదిద్దుకునే సామర్థ్యం చాలా ఎక్కువ అని తెలిసింది. పిల్లలతో ఆరోగ్యవంతమైన మంచి సంబంధాలు నెరపుతూ, వారితో మంచిగా మసలుతుంటే ఏడీహెచ్‌డీ తీవ్రత తగ్గుతుందని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. చక్కదిద్దడం ఎలా? ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలను సరిదిద్దడం అన్నది ఇటు ఇంట్లో, అటు స్కూల్లో... ఇలా రెండూచోట్లా ఒకేసారి (సైమల్టేనియస్‌గా) జరగాలి. ఈ రెండుచోట్లా పిల్లల ప్రవర్తనను చక్కదిద్దడం (బిహేవియర్ మాడిఫికేషన్), జీవనశైలిలో మార్పులు, కౌన్సెలింగ్, ధ్యానం వంటి వాటి ద్వారా ఏడీహెచ్‌డీని అదుపులో పెట్టవచ్చు. తల్లిదండ్రుల ప్రవర్తన సైతం ఇలాంటి పిల్లల్లో మంచి మార్పు తీసుకుని వస్తుంది. ఇలాంటి పిల్లల పట్ల కఠినంగా ఉండటం, శిక్షించడం సరికాదు. మొదట్లో ఇలాంటి చర్యలతో వెంటనే కొంత మెరుగుదల ఉన్నట్లు కనిపించినా దీర్ఘకాలిక ఫలితాలు చాలా తక్కువ. శాశ్వత మెరుగుదల కోసం చాలా ఓపిక, మంచి సంయమనం, పిల్లల పట్ల శ్రద్ధ చాలా అవసరం. విషయం వారికి తెలియనే తెలియదు... తనకు ఏదో లోపం ఉన్నట్లు పిల్లవాడికి తెలియనే తెలియదు. యుక్తవయసుకు వచ్చేవరకు దాని గురించి తెలిసే అవకాశమే లేదు. ఓరల్స్ విషయంలో వాళ్ల పని తీరు బాగున్నా ఇలాంటి పిల్లలు రాతపని చేయడానికి, హోమ్‌వర్క్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఫలితంగా వాళ్ల గ్రేడ్స్ తగ్గుతాయి. దాంతో ఇలాంటి పిల్లలు అంత తెలివితేటలు ఉన్నవారు కాదనే ముద్ర పడుతుంది. నిజానికి వీళ్లు కూడా చాలా చురుకైన పిల్లలే. మంచి తెలివితేటలు ఉన్నవారే. అయితే తమ శక్తియుక్తులన్నీ చదువు మీద గాక, ఆటపాటలు, ఇష్టమైన హాబీల వంటి వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. సమస్య నియంత్రణకు మార్గాలు ∙రోజూ జరిగినవి అడిగి తెలుసుకోవడం: పిల్లల రోజువారీ కార్యక్రమాలను అడిగి తెలుసుకుని, ఆ రోజు చేసిన తప్పు పనుల వల్ల కలిగే అనర్థాలు వివరించాలి. మంచి విషయాలను ప్రోత్సహించాలి. మర్నాడు తప్పులు జరగకుండా చూడటంతో పాటు, మంచిపనులు చేసేలా ఉత్సాహపరచాలి. మెచ్చుకోవడం: పిల్లల్లోని మంచి విషయాలను మెచ్చుకుంటూ ఉండాలి. మరోమారు అవే చేసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. క్రమబద్ధంగా గడిపేలా చేయడం: వాళ్ల రోజువారీ కార్యక్రమాలు ఒక క్రమపద్ధతిలో జరిగేలా ఒక నిర్దిష్టమైన టైమ్‌టేబుల్ రూపొందించాలి, ఆ ప్రకారం వాటిని చేసేలా చూడాలి. వారు చెడుగా ప్రవర్తించకుండా చూస్తూ ఎప్పుడూ బిజీగా ఉంచాలి. కథలు చెప్పడం: నీతిపాఠాలు హత్తుకునేలా కథలు చెప్పాలి. ఆ కథలకు సంబంధించిన ప్రశ్నలు అడిగిలా ప్రోత్సహించి, వాటిని నివృత్తి చేయాలి. శారీరక వ్యాయామం: రోజూ కనీసం 30 నిమిషాలు ఆటల్లో, వ్యాయామంలో పాల్గొనేలా చూడాలి. తల్లిదండ్రుల శ్రద్ధ: పిల్లల చదువులతోపాటు అన్ని విషయాల్లోనూ పేరెంట్స్ మంచి శ్రద్ధ తీసుకోవాలి. మందులు: ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకు ఇచ్చే మందుల్లో స్టిమ్యులెంట్స్, నాన్స్టిమ్యులెంట్స్ అనే మందులు ఉపయోగిస్తారు. ఈ మందులను ఆరేళ్లకు పైబడినవారిలో ఉపయోగించవచ్చు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయిస్తూ మందులతో పాటు ఫిష్ ఆయిల్, ప్రోబయోటిక్ వంటి సప్లిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దృష్టి కేంద్రీకరణ లోపాలుండే పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇలాంటి పిల్లల్లో దృష్టి కేంద్రీకరణ లోపాలతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా ఉంటాయి. అవి... ∙మతిమరపు. ∙ కమాండ్స్‌ను సరిగా స్వీకరించలేకపోవడం ∙ఇచ్చిన వ్యవధిలో తమక అప్పగించిన బాధ్యతలను నెరవేర్చలేకపోవడం ∙స్పెల్లింగ్స్ చెప్పలేక సిల్లీ తప్పులు చేయడం ∙క్లాస్‌రూమ్‌లో జరుగుతున్న అంశంపై నుంచి త్వరగా దృష్టి మరల్చడం ∙చాలా ఎక్కువగా మాట్లాడుతుండటం. ∙పగటికలలు కనడం ∙ఇంట్లోంచి తీసుకెళ్లిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయడం. ఇక దృష్టి నిలపలేకపోవడం అనే ముఖ్య లక్షణం ప్రతిసారీ అతిచురుకుదనం (హైపర్యాక్టివిటీ)తో కలిసి ఉండకపోవచ్చు. ఇలాంటి పిల్లలను విధేయతా, క్రమశిక్షణా లేనివారిగానూ పరిగణిస్తారు. కానీ అది సరికాదు. దృష్టి కేంద్రీకరణ లోపాలు ఉన్న పిల్లల్లోనూ విధేయత, క్రమశిక్షణ ఉంటాయి. వారిలో తమపై తమకు కొంత నియంత్రణ ఉంటుంది. ఏడీహెచ్‌డీకి చికిత్స తప్పనిసరి... ఎందుకంటే... ఒక మోస్తరు (మాడరేట్) ఏడీహెచ్‌డీ నుంచి తీవ్రమైన (సివియర్) ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలకు చికిత్స అందించకపో 1. దృష్టి కేంద్రీకరణ శక్తి, ఏకాగ్రతా మరింతగా తగ్గిపోతాయి. చదువుల్లో బాగా వెనకబడిపోతారు. స్కూలు నుంచి పేరెంట్స్‌కు ఫిర్యాదులు ఎక్కువవుతాయి. అది పిల్లలపైనా, తల్లిదండ్రులపైనా తీవ్రమైన ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులకు మనోవేదనగా పరిణమిస్తుంది. 2. పిల్లలు అతిచురుకుదనంతో చేసే అల్లరీ, వారు చేసే విధ్వంసకరమైన పనులు శ్రుతిమించి, ఒక్కోసారి అది పిల్లలకూ లేదా ఇతరులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇంతటి పరిస్థితుల్లోనూ దాన్ని పసితనపు అల్లరిగానే పరిగణించి అప్పటికీ తగిన చికిత్స అందించకపోతే యుక్తవయసు వచ్చే నాటికి అతడు తీవ్రమైన నిస్పృహకులోనై డిప్రెషన్లోకి వెళ్లవచ్చు. అందుకే ఏడీహెచ్‌డీ పిల్లలకు చికిత్సతో పాటు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌లు అవసరం. తెలివైనవారు కాదనేది ఒక అపోహ మాత్రమే ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు స్వతహాగా తెలివైనవారే అయినప్పటికీ వారు ఇంటెలిజెంట్ కాదనే దురభిప్రాయం ఉంది. ఆ అపోహ వల్ల వాళ్ల ప్రవర్తనలో మార్పులు (బిహేవియరల్ ప్రాబ్లమ్స్) వస్తాయి. పిల్లల్లో వచ్చే దృష్టి కేంద్రీకరణ లోపాలను కొద్దిపాటి ఓపికతో చాలా బాగా పరిష్కరించవచ్చు. సామాజిక బాధ్యతగల టీచర్లు ఉండే స్కూళ్లలో ఇలాంటి పిల్లలను తేలిగ్గా దారికి తేవచ్చు. అయితే కొద్దిగా మానసిక వైకల్యం ఉండి, ఇలాంటి దృష్టి కేంద్రీకరణ సమస్య వస్తే మాత్రం అలాంటి విద్యార్థులకు ప్రత్యేక (స్పెషల్) స్కూల్స్‌లో చేర్చాలి. అక్కడ ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది సేవలు అవసరమవుతాయి. – డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్ -
కడిగితే పోదు
మహానుభావుడు సినిమాలో హీరో ఓసీడీతో బాధపడుతూ ప్రేక్షకులను కేరింతలు పెట్టిస్తాడు. కానీ నిజజీవితంలో ఇట్స్ నాట్ ఏ లాఫింగ్ మ్యాటర్. ఇంటికి తాళం వేసి మీరూ, నేనూ జేబులో తాళం వేసుకొని బయటకు వెళ్తాం, కానీ ఈ మహానుభావులు మాత్రం వీధి చివరికి వెళ్లి, మళ్లీ వచ్చి తాళం చెక్ చేస్తారు. ఆ తర్వాత సినిమాకు వెళ్లి మళ్లీ డౌట్ వస్తే ఇంట్రవెల్‌కు ముందే ఇంటికొచ్చి మళ్లీ చెక్ చేస్తారు. ఇదండీ... వీళ్ల సినిమా! కడిగిన చేతులే కడుగుతుంటారు... వేసిన తాళాలు చెక్ చేస్తుంటారు... కట్టేసిన గ్యాస్ సిలెండర్‌ను మాటిమాటికీ చూస్తుంటారు. ఈ సినిమాకు శుభం కార్డు వేయాలంటే ముందు ఈ జబ్బును కడిగేయాల్సిందే! ఈమధ్య లక్ష్మి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటోంది. చేతులు పుస్తకానికి తగిలినా, ఎదుటివారి బట్టలకు తాకినా, ఎవరిదైనా ఫోన్ తగిలినా అవి మురికి అయిపోయాయనే భావన ఆమెలోకి వస్తోంది. వెంటనే సబ్బుతో చేతులు కడగటం మొదలుపెడుతోంది. మురికి అయిపోతానేమో ఆమెకు ఎంత ఉందంటే మూడేళ్ల కూతురిని కూడా ఆమె తాకడం లేదు. ఆ పాప తనను ముట్టుకున్నా మురికి అయినట్లుగా తలచి, చేతులూ, ఒళ్లూ కడుక్కుంటోంది. దాంతో ఇంట్లోవాళ్లందరూ లక్ష్మి ప్రవర్తన వల్ల బాధపడుతున్నారు. వాళ్ల ఇల్లు నరకమైపోయింది. ఈ నరకానికి కారణం ఒక జబ్బు. ఆ జబ్బుపేరే ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’. సంక్షిప్తంగా చెప్పాలంటే ఓసీడీ.ప్రతి వందమందిలో ఇద్దరుఓసీడీ అంతగా చదువుకోని వారిలోనూ ఎక్కువని అనే అపోహ ఉంది. కానీ బాగా తెలివైనవారిలోనూ, అన్నీ తెలిసినవారిలోనూ దీని బాధితులు ఉన్నారు. నిజానికి సాధారణ ఐక్యూ కంటే కాస్త ఎక్కువ ఐక్యూ ఉన్నవారిలోనే ఇది ఎక్కువ. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 2 నుంచి 3 శాతం ప్రజలు ఓసీడీతో బాధపడుతుంటారని అంచనా. సాధారణంగా ఈ వ్యాధి 18 ఏళ్ల వయసులో కనిపిస్తుంటుంది. అయితే వ్యాధికి గురైన 5 నుంచి 10 ఏళ్ల తర్వాతగానీ రోగులు, వారి కుటుంబ సభ్యులు డాక్టర్‌ను సంప్రదించడం లేదు. దాంతో జబ్బు ముదిరి చికిత్స కాస్త ఒకింత కష్టమవుతుంది. జబ్బు వచ్చాక ఎంత త్వరగా డాక్టర్‌ను సంప్రదిస్తే చికిత్స ప్రభావం అంత మెరుగ్గా ఉంటుంది. ఓసీడీ అంటే... ఓసీడీ అను సంక్షిప్త రూపంలో ‘ఓ’ అంటే అబ్సెషన్ అనే మాటకు సూచన. అబ్సెషన్ అంటే ఒక ఆలోచన మదిలో వచ్చాక అదే పనిగా అదే అదే రావడం. ఆ ఆలోచనను వదిలించుకోవాలని ఎంత ప్రయత్నపూర్వకంగా అనుకున్నా ఆగకుండా అదే రావడం. ఇలా మనం కోరుకోనిది పదే పదే మనసులో మెదులుతుండటంతో తీవ్ర అసౌకర్యం, ఒత్తిడి కలుగుతుంది. సీ అంటే కంపల్షన్. అంటే పదే పదే వచ్చే ఆలోచనలు ఒక పనిని పదే పదే చేసే పరిస్థితిని (కంపల్షన్ను) కల్పిస్తాయి. అది చాలా సమయాన్ని వృథా చేస్తుంది. ఎలా వస్తాయి ఆ ఆలోచనలు... ఈ రోగుల మనసులో ఏదో ఒక ఆలోచన మొలుస్తుంది. అది మనసును తొలిచేయడం మొదలవుతుంది. అది మనసుపై ఒకరకమైన ఒత్తిడిని, ఉద్విగ్న స్థితిని కలిగిస్తుంది. ఒక పనిచేస్తే ఆ ఉద్విగ్న స్థితి తొలగిపోయి, మనం మామూలవుతామని మన మనసుకు అనిపిస్తుంది. అంతే. ఆ ఉద్విగ్నతనూ, ఆ ఒత్తిడినీ తొలగించేందుకు ఆ పని చేస్తుంటారు. కానీ ఆ ఉద్విగ్నత తొలగిపోదు. పోతుందనే భావనతో మళ్లీ చేస్తారు. ఇలా ఒక పరంపర అదేపనిగా కొనసాగుతుండటంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తుంది. తాము చేస్తున్న పని ఎన్నో రకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోందని గ్రహించాక కూడా తాము దాన్ని ఆపలేకపోవడంతో ఆ పనిచేస్తున్న వాళ్లలో తీవ్రమైన కోపం, నిరాశ, నిస్పృహ పెరుగుతుంటాయి. దాంతో ఆ జబ్బు రోగుల్లో తీవ్రమైన భయాన్నీ, ఆందోళనను కలిగిస్తుంది. లక్షణాలు... ఓసీడీ కడిగిన దాన్నే కడగటం అనే లక్షణంతో వ్యక్తమవుతుంటుంది. ఏమాత్రం మురికి లేదా చెత్త తగిలినా వీళ్లు కడుక్కుంటూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు, కాళ్లు కడుగుతూ బాత్రూమ్లోనే గడుపుతుంటారు. అలాగే తలుపులు, గోడలు, గదులు, కొన్ని వస్తువులనూ కడుగుతుంటారు. ఇటీవల ఈ జబ్బు వ్యక్తమయ్యే లక్షణాల జాబితా బాగా పెరుగుతోంది. వాటిలో కొన్ని... ∙ఎప్పటికీ చేయబోమనే పని పట్ల చేస్తామేమో అనే ఆందోళన : ఒక పని మనం ఎప్పటికీ చేయకపోయినా అది చేస్తామేమో అన్న ఆందోళన మనసును కుదిపేస్తుంటుంది. ఉదాహరణకు మనం దొంగతనం ఎప్పటికీ చేయం లేదా ఎవరనీ అవమానపరచబోం. కానీ ఆ పని చేస్తామేమో అని మనలో ఆందోళన కలుగుతుంది. ఏదైనా నేరం చేస్తామేమోననే బెంగ కొందరిలో వేధిస్తుంటుంది. న్యూస్పేపర్లలోని క్రైమ్ కాలమ్స్‌లో వచ్చే క్రైమ్ వార్తల్లో అవి తమ వల్ల కాదుగదా అని కూడా నిర్ధారణ చేసుకునేంత ఆందోళనతో ఉంటారు. ∙అంటుకుంటుందనే భయమే కంటామినేషన్ అబ్సెషన్ : అంటే దేనివల్లనైనా మనకు జబ్బు వస్తుందేమో అనే ఆలోచన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉదాహరణకు మనం చేసే మూత్రవిసర్జన, మలవిసర్జన, ఇంట్లోని అపరిశుభ్రత, ఎక్కడైనా కాస్త జిగురుగా ఉండే పదార్థాల వల్ల మనకు ఏదైనా హాని జరుగుతుందేమో, దాని వల్ల మనకు జబ్బులు వస్తాయేమో అన్న ఆలోచన అదేపనిగా వస్తూ ఆందోళనకు గురిచేస్తుంది. ∙సెక్స్‌పరమైన అబ్సెషన్ : మనం రాకూడదని కోరుకునే తరహా సెక్స్ ఆలోచనలు వచ్చి, మన ప్రమేయం లేకుండానే, ఎంతగా నియంత్రించుకుందామనుకున్నా ఆగకుండా అదేపనిగా వస్తుంటాయి. పనికిరాని వస్తువులను సేకరించి పెట్టుకోవడం : కొందరు ఏమాత్రం ఉపయోగం లేని వస్తువులను సేకరించి వాటిని దాచుకుంటూ ఉంటారు. అవి దేనికీ పనికిరావని తెలిసినా వాటిని వదిలేయలేరు. పర్ఫెక్షన్ కోసం తాపత్రయం: కొందరు తాము ఆఫీస్‌లో లేదా ఇతరత్రా చేసే పనుల్లో పూర్తి స్థాయి పర్ఫెక్షన్ ఇంకా రాలేదనే అభిప్రాయంతో, దానిలో మరింత పర్ఫెక్షన్ కోసం సమయం వృథా చేస్తుంటారు. ∙జబ్బు ఉందేమోనన్న అపోహ : కొందరిలో తమకు ఏదైనా జబ్బు ఉందేమో, తమ శరీర అవయవాల్లో ఏదైనా లోపం ఉందేమో అనే అనుమానం ఉంటుంది. ఉదాహరణకు తమకు క్యాన్సర్ లేదా ఎయిడ్స్ వంటి జబ్బులు సోకాయేమోనని అనుమానపడుతుంటారు. ఇక దాంతో వాళ్లు అదేపనిగా డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. జబ్బు లేదనే రిపోర్టు వచ్చినా పదే పదే ఆ వైద్య పరీక్షలే మళ్లీ మళ్లీ చేయిస్తుంటారు. ఇలా డబ్బూ, సమయం వృథా చేసుకుంటారు. దీన్ని సొమాటిక్ అబ్సెషన్ అంటారు. పిల్లలలో: పిల్లలు కొంతమందిని చాలా ఎక్కువగా అభిమానిస్తుంటారు. అలా తాము అమితంగా గౌరవించే పెద్దలకూ, తమ తల్లిదండ్రులకూ తామెప్పుడైనా హాని చేస్తామేమో, వాళ్ల గౌరవానికి తలవంపులు తెస్తామేమో అన్న ఆందోళన వాళ్లలో ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కు లోనైనవారు తమ ఆలోచనలను నియంత్రించుకోడానికి లేదా తగ్గించుకోడానికి చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. మనసులో అంకెలు లెక్కపెట్టుకోవడం, ఇతరుల చేత ఒక విషయాన్ని పదే పదే చెప్పించుకోవడం, ప్రార్థనలు చేయడం వంటివి అందులో ముఖ్యమైనవి. అలా చేయడం వల్ల తమకు జరగబోయే చెడు జరగదని వాళ్ల నమ్మకం. అలాగే తమ వస్తువులను పలుమార్లు తాకడం, లెక్కపెట్టుకోవడం వంటి పనులు తాము చేస్తుండటంతో పాటు ఇతరులను కూడా అలాగే చేయమని ఒత్తిడి చేస్తుంటారు. ఓసీడీ వల్ల చాలామందిలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. తమపై తమకు నమ్మకం తగ్గిపోతుంది. రోజువారీ దినచర్యల్లో సమయం వృథాకావడం పెరిగి, జీవనం అస్తవ్యస్తమవుతుంది. అది పనిలోని నాణ్యతనూ, డబ్బునూ, మానవ సంబంధాలనూ దెబ్బతీస్తుంది. నిర్ధారణ : ఓసీడీ జబ్బును లక్షణాల ద్వారానూ, రోగి పరిస్థితిని బంధువులు, స్నేహితుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక వైద్యపరంగా డీఎస్ఎమ్–5 /ఐసీడీ 10 క్రైటీరియా ద్వారా దీన్ని నిర్ధారణ చేయవచ్చు. వై–బాక్స్ స్కేల్ మీద దీని తీవ్రతను తెలుసుకుంటారు. చికిత్స : ఓసీడీ లక్షణాలు కనిపించినప్పుడు అవి ముదిరే వరకు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే, ఫలితాలు అంత బాగా ఉంటాయి. మందులు ప్రారంభించిన వెంటనే మార్పు కనిపించదు. అవి మొదలుపెట్టిన 6 నుంచి 12 వారాల తర్వాత మార్పు కనిపిస్తుంటుంది. ఒకసారి మందులు వాడక మళ్లీ మానేయకూడదు. అలా చేస్తే వ్యాధి తిరగబెట్టడంతో పాటు దాని తీవ్రత మరింత పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఓసీడీకి సంబంధించిన ఆలోచనలు వస్తుంటే వాళ్లను నిర్భయంగా చెప్పమని అడగాలి. అలాగే బాధితులను కించపరచకూడదు, వారు నొచ్చుకునేలా, బాధపడేలా మాట్లాడకూడదు. ఇదో పెద్ద వ్యాధి కాదన్నట్లుగా రోగులకు భరోసా ఇస్తూ ఉండాలి. సరైన చికిత్స తీసుకుంటే ఇది పూర్తిగా తగ్గుతుందనీ, ఇతరుల్లా హాయిగా జీవించగలుగుతారని ధైర్యం చెప్పాలి. ఇటీవల ఈ జబ్బు తగ్గడంలో గణనీయమైన పురోగతి ఉంది. గతంలో పోలిస్తే మంచి మందులు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. బిహేవియర్ థెరపీ లేదా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీతో పాటు రెస్పాన్స్ ప్రివెన్షన్ ప్రక్రియలతో రోగుల్లో మంచి మెరుగుదల కనిపిస్తోంది. తాము భయపడే అంశాలకు రోగిని నెమ్మదిగా గురిచేస్తూ దాని వల్ల ఎలాంటి హానీ ఉండదనే ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పుతూ పోవడమే రెస్పాన్స్ ప్రివెన్షన్ చికిత్సలోని ప్రత్యేకత. ట్రైస్లైక్లిక్స్, ఎస్ఎస్ఆర్ఐస్, బెంజోడయజపైన్స్ వంటి మందుల్ని కేవలం సైకియాట్రిస్ట్‌ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఓసీడీ థీమ్‌తోనే ‘మహానుభావుడు’ సినిమా! ‘మహానుభావుడు’ సినిమాలో హీరో శర్వానంద్ ఓసీడీ పేషేంట్. ఆ జబ్బు ప్రభావంతో అతడు అతిశుభ్రత పాటిస్తుంటాడు. ఆ జబ్బు ఉన్నవారు చేసే పనులు చూసేవారందరికీ వింతగా ఉంటాయి. కొంచెం ఫన్నీగా కూడా అనిపిస్తుంటుంది. చిన్న విషయమే కదా అనిపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అనేది కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించారు. ఈ íసినిమాలో హీరోకి హీరోయిన్ ముద్దు పెట్టడానికి దగ్గరికొస్తే హీరో ఆమెను ఆపి ‘ఈ రోజు బ్రష్ చేశావా’ అని అడుగుతాడు. అలాగే హీరో అమ్మకు జ్వరమొస్తే, ఆమె దగ్గరికి వెళ్లటానికి కూడా అతను సంకోచిస్తుంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి తండ్రికి గుండెపోటు వస్తే కనీసం ఆమె కోసం అతన్ని హాస్పటల్‌కు తీసుకెళ్లటానికి సహకరించడు. ఇలా ఇతనికి ఉన్న జబ్బు కారణంగా దగ్గర వాళ్లు కూడా అయిష్టం పెంచుకోవడం.. వంటివన్నీ ‘ఓసీడీ’ వల్ల కుటుంబ జీవితంపైనా, సామాజికంగా ఎంత ప్రతికూల ప్రభావం ఉంటుందో ప్రతిభావంతంగా చూపించారు డైరెక్టర్ మారుతి. రుగ్మతకు కారణం వివిధ కారణాల వల్ల మెదడులోని రసాయనాల్లో కలిగే మార్పులతో ఓసీడీ వస్తుంటుంది. ప్రధానంగా మన మెదడులో స్రవించే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరిటోనిన్లో మార్పుల వల్ల ఇది వస్తుంది. దీనికి ఇదమిత్థంగా కారణం తెలియకపోయినా బహుశా జన్యుపరమైన మార్పులతో ఇది జరిగి, కుటుంబంలో చాలామందిలో కనిపిస్తుందని వైద్యపరిశోధకులు భావిస్తున్నారు. పిల్లల్లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఈ వ్యాధి కనిపించవచ్చు. ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలయ్యాక, కొందరిలోనైతే మెనింజైటిస్ వంటి వ్యాధుల తర్వాత ఈ రుగ్మత కనిపించవచ్చు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు 35 శాతం ఎక్కువగా ఉంటాయి. అయితే కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నంత మాత్రాన ఇతరులకు ఈ వ్యాధి తప్పక రావాలనేమీ లేదు. కంపల్షన్ డిజార్డర్‌లో చేసే పనులు కంపల్షన్లో సాధారణంగా రోగులు చేసే పనుల్లో ఎక్కువగా ఉండేవివి... ∙తాళం వేశాక అది సరిగ్గా పడిందా లేదా అని మళ్లీ మళ్లీ చూడటం ∙గ్యాస్ స్టవ్ ఆర్పేశారా లేదా అన్ని మళ్లీ మళ్లీ పరీక్షించడం ఏదైనా పని ఎవరికీ హాని చేయకూడదంటూ, దాన్ని కన్ఫర్మ్ చేసుకోడానికి చేసిన పనే మళ్లీ మళ్లీ చేయడం (ఉదాహరణకు పారేసిన పాత బ్లేడులు, కత్తెరలు ఎవరికైనా హాని చేస్తుందని అనిపించి, దాన్ని ఎవరికీ తగలని చోట పారేశామా లేదా అని పదే పదే చూస్తూ, దాన్ని ఎవరికీ అందనిచోటకు నెడుతూ ఉండటం) రాసినదాంట్లో ఏదైనా తప్పు వచ్చిందేమో అని మళ్లీ మళ్లీ రాస్తూ ఉండటం ∙లెక్కపెట్టిన డబ్బులను మళ్లీ మళ్లీ లెక్కపెట్టడం లాంటివి. ఇన్పుట్స్: డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీ కాకతీయ మెడికల్ కాలేజ్, వరంగల్ -
సెల్ఫీ.. ఓ రోగమే!
లండన్: ‘సెల్ఫీ’.. ఇటీవల వైరల్‌లా మారిన ట్రెండ్. మితిమీరి సెల్ఫీలు దిగడం రోగమేనంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన చేసింది కూడా భారత్‌లోనే కావడం గమనార్హం. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలబారిన పడడం వంటి ఘటనలు భారత్‌లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నందునే ఇండియాను ఎంపిక చేసుకున్నామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ‘అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఒక మానసిక రోగమే’ అంటూ 2014లో మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా యూకేకు చెందిన నాటింగ్‌హామ్ యూనివర్సిటీ, తమిళనాడులోని తియంగరాజర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం 400 మందిని ఎంపిక చేసుకొని, వారిని మూడు గ్రూపులుగా విభజించారు. రోజుకు కనీసం మూడు సెల్ఫీలు తీసుకునేవారిని మొదటి గ్రూపులో, అంతకంటే ఎక్కువగా దిగేవారిని రెండో గ్రూపులో, అదేపనిగా సెల్ఫీల్లో మునిగిపోయేవారిని మూడో గ్రూపులో చేర్చారు. సెల్ఫీ దిగని రోజు వారి మానసిక పరిస్థితిని పరిశీలించారు. మిగతా రోజులతో పోలిస్తే.. సెల్ఫీ దిగని రోజు వారు మానసికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు. -
బొటాక్స్‌తో కంటి చికిత్సలు...
కంటికి వచ్చే కొన్ని రుగ్మతలను బొటాక్స్‌తో సమర్థంగా చికిత్స చేయవచ్చు. కంటికి సంబంధించి పలు రకాల సమస్యల్లో బొటాక్స్‌తో చికిత్స సాధ్యమవుతుంది. వాటిలో కొన్ని... కంటి రెప్పలకు సంబంధించి... బ్లెఫరోస్పాజమ్ హెమీఫేషియల్ స్పాజమ్, థైరాయిడ్ ఐ డిజార్డర్ అబ్నార్మల్ లిడ్ ఓపెనింగ్, ఎక్స్పోజ్ కెరటైటిస్ లోవర్ లిడ్ స్పాస్టిక్ ఎంటరోపియన్. మెల్లకన్ను విషయంలో... ► ఈసోట్రోపియా (చిన్నప్పుడు, పెద్దయ్యాక) ► ఇంటర్మిట్టెంట్ స్కింట్ n నర్వ్ పాల్సీ ► కంజెనిటల్ నిస్టాగ్మస్. కంటి అందానికి సంబంధించి (కాస్మటిక్) ► గ్లాబెల్లార్ లైన్స్ n క్రోస్ ఫీట్ n బన్నీ లైన్స్. ఇతరత్రా చికిత్సలు... ► దీర్ఘకాలికంగా కళ్లు పొడిగా ఉండటం (క్రానిక్ డ్రై ఐ) n కంటి నుంచి కన్నీరు కారుతూ ఉండటం (హైపర్ సెక్రిషన్ ఆఫ్ టియర్స్) ► బ్లెఫరోస్పాజమ్ అంటే... కనురెప్ప కండరంపై నియంత్రణ కోల్పోవడం వల్ల కొందరిలో కన్ను తరచూ మూసుకుపోతూ ఉంటుంది. ఈ కండిషన్‌ను బ్లెఫరోస్పాజమ్ అంటారు. ఇలా ఒకవైపు లేదా రెండు వైపులా మూసుకుపోతూ ఉండటంతో రోగి జీవనశైలిలో నాణ్యత లోపిస్తుంది. ఇలాంటి వారిలో కనురెప్ప లోపలికి బొటాక్స్ ఇంజెక్షన్ చేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకసారి ఇంజెక్షన్ చేయిస్తే ఆ ఫలితం 3 నుంచి 6 నెలల పాటు ఉండవచ్చు. ల్యాగ్ ఆఫ్తాల్మస్: ఈ కండిషన్ ఉన్న రోగుల్లో కనురెప్ప పూర్తిగా మూసుకోదు. దాంతో కార్నియా (కంటి నల్లగుడ్డు)పై పుండ్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని సరిదిద్దడానికి కంటి పై రెప్పలో బొటాక్స్ ఇంజెక్షన్ చేస్తారు. దాంతో కనురెప్ప పూర్తిగా మూసుకుంటుంది. ఎంటరోపియాన్: ఈ కండిషన్ ఉన్న రోగుల్లో కంటి కింది రెప్ప లోపలివైపునకు ముడుచుకుపోతుంది. దాంతో కంటి రెప్ప చివరి వెంట్రుకలు కంట్లో రాసుకుపోయి కన్ను రుద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో కంట్లో మంట, పుండ్లు రావచ్చు. బొటాక్స్‌తో ఈ కండిషన్‌ను మెరుగుపరచవచ్చు. స్ట్రాబిస్మస్: మెల్లకన్ను ఉండే కండిషన్‌ను స్ట్రాబిస్మస్ అంటారు. మెల్లకన్ను ఉన్నవారిలో కనుగుడ్డు బయటవైపునకు (ఎక్సోట్రోపియా) లేదా లోపలివైపునకు (ఈసోట్రోపియా) లేదా పైకి, కిందకు కూడా ఉంవచ్చు. మెల్లకన్ను ఉండటం వల్ల రెండు కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరవడుతుంది. దాంతో ఒక వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా) వంటి కండిషన్స్ ఏర్పడతాయి. రెండు కళ్లతోనూ ఒకే దృష్టి (బైనకులార్ విజన్) లోపించడం కూడా జరగవచ్చు. దీర్ఘకాలంలో స్పష్టత లేని కన్నులో చూపు మందగిస్తూ పోవచ్చు. దీన్నే యాంబ్లోపియా అంటారు. ఇలాంటి అనేక రకాల మెల్లకన్ను కండిషన్లలో బొటాక్స్‌తో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది. దాంతో చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సను నివారించవచ్చు. నిస్టాగ్మస్: కొందరిలో కనుగుడ్డు అవిశ్రాంతంగా అటూ ఇటూ చకచకా కదులుతూ ఉంటుంది. ఈ కండిషన్‌ను నిస్టాగ్మస్ అంటారు. దీన్ని సరిదిద్దడానికీ బొటాక్స్ ఉపయోగపడుతుంది. అందం విషయంలో... కనుబొమ పైన ఉండే గీతలను బొటాక్స్‌తో తగ్గించవచ్చు. అలాగే ఇటీవల దీన్ని తగ్గించడానికి బొటాక్స్ క్రీమ్స్ (ఆయింట్మెంట్స్) కూడా లభ్యమవుతున్నాయి. ఇతరత్రా... కొందరిలో కంటి నుంచి అదేపనిగా నీళ్లు కారుతూ ఉంటాయి. దీన్ని వైద్యపరిభాషలో దీన్ని క్రోకడైల్ టియర్స్‌గా అభివర్ణిస్తారు. బొటాక్స్–ఏ ఇంజెక్షన్ సహాయంతో 75 శాతం మందిలో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. దీర్ఘకాలిక పొడి కన్ను : కొందరిలో కళ్లు ఎప్పుడూ పొడిగా ఉంటాయి. దీన్ని బొటాక్స్ ఇంజెక్షన్‌తో మెరుగుపరచవచ్చు. బొటాక్స్‌తో కొన్నిసార్లు వచ్చే దుష్ప్రభావాలు: అనుభవజ్ఞులు కాని వైద్యులతో బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కొందరిలో ఒక వస్తువు రెండుగా కనిపించడం (డబుల్ విజన్), టోసిస్ పెయిన్ (కనురెప్ప నొప్పి పెడుతూ మూసుకుపోవడం) వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇది తాత్కాలికమే కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఇక గర్భవతులకూ, అమైనోగ్లైకోసైడ్ అనే మందులను వాడే రోగులకు, కొన్ని రకాల చర్మవ్యాధులు ఉన్నవారికి బొటాక్స్ ఇవ్వకూడదు. అందుకే ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలిసిన విచక్షణ ఉన్న నిపుణుల వద్దనే ఈ ఇంజెక్షన్ తీసుకోవాలి. డా. రవికుమార్ రెడ్డి కంటి వైద్య నిపుణులు మెడివిజన్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ -
'యువతకు దానిపై అవగాహన లేదు'
ఢిల్లీ: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు యువతను ఒబెసిటీ(స్థూలకాయత్వం) వైపు మళ్లిస్తున్నాయి. అయితే స్థూలకాయత్వం బారిన పడుతున్న యువత దాని దుష్పరిణామాల గురించి తెలుసుకోవడం కాదుకదా.. కనీసం తాము స్థూలకాయులం అని కూడా అంగీకరించే స్థితిలో ఉండటం లేదని తాజాగా ఢిల్లీలో నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలలోని 20 నుంచి 45 ఏళ్ల మధ్యగల సుమారు 1000 మందిపై జరిపిన పరిశీలనలో 80 శాతం మంది ఉండాల్సినదానికన్నా అధిక బరువు ఉన్నారు. అయితే వీరిలో కేవలం 20 శాతం మంది మాత్రమే తాము స్థూలకాయులం అని అంగీకరిస్తున్నారు. యువతకు ఒబెసిటీపై అవగాహనలేకపోవడం వల్ల వారు తీసుకునే ముందుజాగ్రత్తలు తగ్గుతాయని మ్యాక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ డాక్టర్ ప్రదీప్ చౌదరి వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 70 శాతం మందికి ఒబెసిటీతో హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ముప్పు ఉంటుందనే విషయం తెలియదని తేలిందన్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్ యువతను స్థూలకాయులుగా మార్చుతున్నాయని వెల్లడించారు. -
తనను తాను అతిగా ప్రేమించుకునే జబ్బు!
మెడి క్షనరీ తనను తాను ప్రేమించుకోవడం అందరికీ ఉండే సహజాతం. ఇదే లేకపోతే మనిషి మనుగడే కష్టం. అయితే కొందరు తమ గొప్పలు తాము అదేపనిగా చెబుతుంటారు. ఇది కూడా పెద్ద సమస్య కాదు. నిజానికి అలా ఉండటం వల్లనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ తన సామర్థ్యాలను అతిగా ఊహించుకొని తప్పులు చేస్తుంటే మాత్రం ఇది సమస్య అవుతుంది. తనను తాను ప్రేమించుకోవడం మితిమీరితే దాన్ని ఒక మానసిక సమస్యగా పరిగణిస్తారు నిపుణులు. దీన్ని వ్యక్తిత్వానికి, మూర్తిమత్వానికి (పర్సనాలిటీ)కి సంబంధించిన ఆరోగ్య సమస్యగా డాక్టర్లు పేర్కొంటారు. ఇలా తమ పట్ల తమకు ఉన్న అతి ప్రేమ రుగ్మతను నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ (ఎన్పీడీ)గా చెబుతారు. ఒకరు తనను తాను ఎంతగా ప్రేమించుకుంటాడనేందుకు ‘నార్సిసస్’ అనే వ్యక్తి ఒక తార్కాణం. ఆ గ్రీకు పురాణపురుషుడు నీళ్లలోని తన ప్రతిబింబాన్నీ తాను చూసుకొని ఎప్పుడూ మురిసిపోతుంటాడు. ఆయన పేరిటే ఈ రుగ్మతకు ‘నార్సిస్టిక్ పర్సనాటిటీ డిజార్డర్’ అనే పేరు వచ్చింది. -
మైండ్ చిక్కితే బాడీ మెక్కుతుంది
చిక్కడమంటే సన్నబడడమే కాదు, చిక్కుల్లో పడడం కూడా! మనిషికి రకరకాల కష్టాలు. కాదనుకుంటే ఒకటీ ఉండదు. అంతా మైండ్ గేమ్! ఊబకాయం కూడా బాడీ ప్రాబ్లమ్ కాదట. దొంగది... మైండే! నిశాహారం?! ఈ మాట వింటే... ఎవరికైనా మైండు తిరుగుద్ది. అది కూడా రాత్రి పూట! చీకటిలో ఏం తిన్నా ఎవరికీ కనబడదనుకుంటాం కదూ... కానీ రీసెర్చి వాళ్లు మనల్ని పట్టేశారు... నిశాహారం అంటే... రాత్రి పూట బొక్కే జబ్బని! బిఈడి?! డిగ్రీ కాదండోయ్... ఇది కూడా బొక్కుడు జబ్బే. ఎక్కువ తింటే వచ్చే మా‘లావు’ డిగ్రీ. మమ్మీ డాడీ దగ్గర లేకపోతే తిండిలో పేరెంట్స్‌ను చూసుకుంటున్నారట. పిల్లలు దగ్గర లేకపోతే ఫుడ్డులో బిడ్డల్ని చూసుకుంటున్నారట. చెప్పాను కదా... అంతా మైండ్ గేమ్., ఇప్పటి దాకా తిండి ఎక్కువ తినడం వల్లో... పని తక్కువ చేయడం వల్లో లావవుతున్నాం అనుకున్నాం కాదా! వెరీ సిల్లీ... అంతా మైండ్ ఎంగిలి. బరువు పెరగడానికి కారణం... జీవక్రియలు తగ్గడమో, జన్యుసమస్యలు పెరగడమో కాదు. మానసిక సమస్యలే. హైపోథైరాయిడిజమ్ వంటి శారీరక రుగ్మతలు బరువును పెంచేస్తాయని తెలిసిందే. కానీ మానసిక సమస్యలతోనూ బరువు పెరిగిపోతారా? ఇలా మంచం పట్టడానికి కారణం మానసిక కారణాల వల్ల కంచం పట్టడమే అంటున్నారు నిపుణులు. దాంతోపాటు నిశాహారం కూడా. ఇదేదో నిషా కలిగించే ఆహారం కాదు. నిశిరాత్రివేళ నిద్రపట్టక అదేపనిగా తినడం. దీనికీ మానసిక సమస్యలే కారణమని చెబుతున్నారు. ఊరకే ఉంటే ఊరిపోయి ఊబకాయం రావడం మామూలే. కానీ మనసులో అలజడి రేకెత్తించే సమస్యలతోనూ స్థూలకాయం వస్తుందంటున్న నిపుణుల మాటలను మనసుపెట్టి వినండి... మనోభారంతో శరీరమూ భారం! దిగులుగా ఉన్నప్పుడు కొందరు ఊరట కోసం అతిగా తినేస్తుంటారు. ఆగ్రహంతో పళ్లు కొరకడానికి బదులు పంటికింద పటపటలాడించడానికి ఏదో ఒకటి నమిలేస్తుంటారు మరికొందరు. ఆందోళనతో అవసరానికి మించి కంచాల కొద్దీ లాగిస్తుంటారు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు ఏం తింటున్నారో, ఎంత తింటున్నారో గమనించకుండా తినేస్తుంటారు. ఇలాంటివారు ఒళ్లు కదపడానికి పెద్దగా ఇష్టపడరు. కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయంటారు గానీ, కూర్చుని తింటే శరీరం కొండలా పెరుగుతుంది. కొండలా పెరుగుతున్న శరీరాన్ని చూసుకుంటే, మరింత దిగులు కమ్ముకుంటుంది. నలుగురిలోనూ మెలగడానికి సంకోచం కలుగుతుంది. మళ్లీ ఆ దిగులు నుంచి ఊరట పొందడానికి మళ్లీ మళ్లీ తిండినే ఆశ్రయిస్తారు. ఇదంతా ఒక విషవలయంలా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. బీఈడీ... డిగ్రీ కాదు, డిజార్డర్! మానసిక సమస్యల నుంచి బయటపడలేక తినడాన్ని అలవాటుగా చేసుకుంటే, కొన్నాళ్లకు పరిస్థితి మరింత జటిలమవుతుంది. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో పట్టించుకోకుండా అనాలోచితంగా తినేస్తూపోతే, ఈ అలవాటు క్రమంగా ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ (బీఈడీ)గా మారుతుంది. ఈ ‘బెడ్’ బాధితులకు కాసింత తీరిక దొరకడమే తరువాయి... మనసు తిండి మీదకు మళ్లుతుంది. ఎవరికైనా కనీసం వారానికి రెండు రోజులు, వరుసగా ఆరునెలలు అతిగా తినడమే అలవాటుగా కొనసాగితే, అలాంటి వారిని బీఈడీ బాధితులుగానే పరిగణించాలి. మొత్తం జనాభాలో ఇలాంటివారు రెండు శాతం వరకు ఉంటారు. స్థూలకాయుల్లో దాదాపు 25 శాతం మేరకు బీఈడీ బాధితులే. ఇలాంటివారు చురుగ్గా పనులు చేసుకోవడం కంటే, చాలావరకు కూర్చున్న చోటి నుంచి కదలకుండా ఉండేందుకే ఇష్టపడతారు. బద్ధకంగా గడిపే దినచర్య ఫలితంగా స్థూలకాయులుగా మారుతారు. - ఇన్పుట్స్: డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ చక్కెరపై తీపి ‘ఎగస్ట్రా’ నిద్రలేమి, దిగులు, ఆందోళనలతో బాధపడే వారికి మెదడులోని సంతృప్తి కేంద్రం సక్రమంగా పనిచేయదు. దీనివల్ల ఏం తిన్నా, ఎంత తిన్నా వారికి తొందరగా సంతృప్తి కలగదు. అలాంటి వారి మెదడులోని ఆకలి కేంద్రం చక్కెరల కోసం ఆరాటపడుతుంది. అందుకే వారు ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు లేదా తక్షణమే చక్కెరలుగా రూపాంతరం చెందే చిప్స్, సమోసాలు, మిర్చీ బజ్జీలు వంటివీ, పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తినేస్తూ ఉంటారు. చక్కెరపై అదుపులేని మోహమే వారిని చక్కెరవ్యాధి బారిన పడేలా చేస్తుంది. ఆకలి ఎరుగని తిండి ఆకలి రుచి ఎరుగదని అంటారు గానీ, ఇలాంటి తిండి తినే మానసిక రుగ్మత ఉన్న వారిలో వారి తిండి ఆకలి ఎరుగదు. భావోద్వేగాలకు విపరీతంగా లోనయ్యేవారిలో కొందరు, అవాంఛిత భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి తిండిని ఆశ్రయిస్తారు. దుఃఖం, సంతోషం, ఉత్సాహం, ఆందోళన... ఇలా ఎలాంటి భావోద్వేగం కలిగినా, దానిని అణచుకోవడానికి ఏదో ఒకటి తినేస్తారు. ఇంకొందరైతే, ఆహారాన్ని పారవేయడం ఇష్టంలేక ఆకలిగా లేకున్నా తింటారు. రకరకాల కారణాల వల్ల అభద్రతాభావంతో బాధపడేవారు సురక్షితంగా ఉన్నామనే భావన కోసం ఆకలి లేకున్నా తింటారు. ప్లేటులతో తమ చుట్టూ సురక్షితమైన కోటలు కట్టుకుంటున్నామన్న అపోహతో అన్నహితవును పెంచుతారు. ఆరోగ్యహితవు మరుస్తారు. ఎలా అధిగమించవచ్చు? మానసిక సమస్యల వల్ల అతిగా తినే అలవాటును అధిగమించడం కాస్త కష్టమే అయినా, కొంత ప్రయత్నంతో దీనిని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ఈ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఏం తింటున్నామో శ్రద్ధగా గమనించాలి. అతిగా తినడం అలవాటుగా మారి స్థూలకాయానికి దారితీస్తుంది. తినే పదార్థాలపై, వాటి పరిమాణంపై కాస్త శ్రద్ధపెడితే ఈ పరిస్థితిని తేలికగా అధిగమించవచ్చు.ఏ పరిస్థితుల్లో మనసు తిండి వైపు మళ్లుతుందో జాగ్రత్తగా చూడాలి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలి. మానసికంగా ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు తినడం బదులు పెయింటింగ్, సంగీతం వంటి హాబీలకు సమయాన్ని కేటాయించడం మంచిది. ఏమీ తోచకపోతే ఆరుబయట అలా కాసేపు నడక సాగించడం ద్వారా కూడా ఒత్తిడిని జయించవచ్చు.వ్యాయామం చేయడం కాస్త కఠినమైన పరిష్కారం లాగే కనిపిస్తుంది గానీ, స్థూలకాయంతో పాటు ఒత్తిడిని జయించడానికి వ్యాయామానికి మించినది లేదు. స్థూలకాయం నుంచి బయటపడాలనుకునే వారు ముందుగా మిర్చీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. సరైన పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలతో కూడిన సమతుల ఆహారం తీసుకుంటే త్వరగా ఆకలి అనిపించదు. ఫలితంగా తిండి పరిమాణం తగ్గి, బరువు అదుపులోకి వస్తుంది. పిల్లలతో గడపండి! పిల్లలు సహజంగా తల్లిదండ్రుల ప్రేమాభిమానాల కోసం ఆరాటపడుతుంటారు. తల్లిదండ్రులు ఎక్కువసేపు వారితో గడపడం అవసరం. ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులకు అసాధారణమైన పనివేళల కారణంగా పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉండదు. దాంతో పిల్లలు వారిపై బెంగ పెట్టుకుని, క్రమంగా డిప్రెషన్లోకి కూరుకుపోతారు. ఇలాంటి పిల్లలు తిండి ద్వారా ఊరట వెదుక్కొనే ప్రయత్నంలో చిన్న వయసులోనే స్థూలకాయులుగా మారుతారు. ఒంటరితనంలో మానసికంగా కూరుకుపోయిన ఇలాంటి పిల్లలు కాస్త ఎదిగాక మద్యానికి, మాదకద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అవీ ఇవీ... స్థూలకాయాన్ని వైద్యపరమైన సమస్యగా ప్రాచీనకాలంలోనే గుర్తించారు.ప్రాచీన గ్రీకులు, ఈజిప్షియన్లు స్థూలకాయాన్ని వైద్యపరమైన సమస్యగా భావించేవారు. ప్రాచీన భారతీయ వైద్యుడు, శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే స్థూలకాయం వల్ల మధుమేహం, గుండెజబ్బులు వస్తాయని గుర్తించాడు. మధ్యయుగాల వరకు స్థూలకాయాన్ని సంపన్నులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగానే పరిగణించేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇది సామాన్యుల సమస్యగా కూడా మారింది. స్థూలకాయం సమస్య మనుషులకు మాత్రమే పరిమితం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెంపుడు జంతువులకూ ఈ సమస్య ఉంది. అక్కడ 23-41 శాతం శునకాలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఒక అంచనా. వీళ్లు... హుషారు కోసం నిశాచర భోజనం చేస్తారు! ఎవరైనా విపరీతంగా తినేస్తుంటే వారి తిండిని ‘దెయ్యం తిండి’గా అభివర్ణించడం పరిపాటి. పిశాచాలు మేల్కొనే నిశివేళ ఇలాంటి వారిలో దెయ్యంలా భోజనతాపం మేల్కొందా అనిపిస్తుంది. బీఈడీ బాధితులకు, భోజన నిశాచరులకు పెద్దగా తేడా కనిపించదు. అయితే, భోజన నిశాచరులు రాత్రివేళల్లో అతిగా తింటారు. ఏ రాత్రివేళో మెలకువ వస్తే, వంటింట్లో తిండి కోసం వెదుకులాడతారు. అప్పటికప్పుడు అందుబాటులో ఉండే ఏ చిరుతిళ్లో తిననిదే వీరికి ప్రశాంతంగా ఉండదు. రాత్రివేళల్లో ఇలా అతిగా తినడాన్ని మానసిక వైద్యులు ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ (ఎన్ఈఎస్)గా గుర్తించారు. రోజువారీ తీసుకునే ఆహారంలో 35 శాతం కంటే ఎక్కువ కేలరీలు గల ఆహారాన్ని రాత్రివేళల్లో తీసుకునే అలవాటు ఉంటే, దానిని నైట్ ఈటింగ్ సిండ్రోమ్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. ఉదయం దాదాపు ఖాళీ కడుపుతో ఉండటం, రాత్రివేళ అతిగా తినడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలన్నీ ఎన్ఈఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి వారికి ఉదయం వేళలో ఆకలి తక్కువగా, రాత్రివేళ ఎక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో దాదాపు ఒక శాతం, స్థూలకాయుల్లో దాదాపు 20 శాతం వరకు ఇలాంటి వారు ఉంటారు. -
ప్రెగ్నెన్సీలో ‘పైకా’తో జాగ్రత్త!
ఆహారంగా పరిగణించని పదార్థాలను తినే రుగ్మతను పైకా అంటారు. సాధారణంగా పిల్లల్లో ఏదో ఒక దశలో కనిపించే ఈ విపరీత ప్రవర్తన పెద్దలలో తక్కువే. అయితే గర్భవతుల్లో మాత్రం కాస్త తరచుగా కనిపిస్తుంటుంది. ఈ రుగ్మత ఉన్నవాళ్లు మట్టి, బియ్యంలో మట్టి గడ్డలు, ఇసుక, పిండి, పెన్సిల్-ఎరేజర్ ముక్కలు, పేపర్, బొగ్గు, చాక్‌పీసులు, కాల్చేసిన అగ్గిపుల్లలు.. ఇలా అనేక రకాల వస్తువులు తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనడానికి కారణాలు నిర్దిష్టంగా చెప్పలేం. అయితే కొన్ని పరిశీలనలు, అధ్యయనాల ప్రకారం... ఐరన్, క్యాల్షియం, జింక్, థయామిన్, విటమిన్-సి, విటమిన్-డి లోపాలు ఉన్న ప్పుడు, కొన్ని ఖనిజ లవణాల లోపాలు ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది. సమస్యలు: ఈ రుగ్మత వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, పొట్టలో పురుగులు రావడం (ఇన్ఫెస్టేషన్స్) వంటివి జరగొచ్చు. వెంట్రుకలు, ప్లాస్టిక్ వస్తువులు తినేవారిలో అవి పేగుల్లో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కొన్ని సందర్భాల్లో లెడ్ లాంటి విష పూరితమైన పదార్థాలు కడుపులోకి చేరవచ్చు. చికిత్స : ఇలాంటి రుగ్మత ఉన్నవారికి మొదట రక్తహీనత (అనీమియా) ఉందా అని పరీక్షించాలి. అలాగే పొట్టలో పురుగులు పోయేలా డీ-వార్మింగ్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఐరన్, ఇతర విటమిన్లు ఉండే పోషకాహారపు సప్లి మెంట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొందరిలో అరుదుగా మానసిక చికిత్స కూడా అవసరం కావొచ్చు. -
భవిష్యత్తు ‘గడ్డ’ కట్టేస్తోంది!
ఎల్.ఎన్.పేట: పూట కూలీ చేసుకొని పొట్టపోసుకునే కూర్మాపు చక్రపాణి, భారతి దంపతులది ఎల్.ఎన్.పేట మండలం కొవిలాం గ్రామం. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు చంద్రశేఖర్ ఎల్.ఎన్.పేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, రెండో కొడుకు వెంకటరమణ అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పేదవారైనప్పటికీ ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టి, కల్లోలం రేపింది. ఎనిమిది నెలల క్రితం వెంకటరమణ అంతుచిక్కని రుగ్మతకు గురై మంచాన పడ్డాడు. శరీరంపై పెద్దపెద్ద పుండ్లు మాదిరిగా కాయలు వస్తున్నాయి. ఇక్కడా అక్కడా అని లేకుండా శరీరమంతా పాకుతున్నాయి. మొదట ఒకచోట కనిపించే కాయ.. కొన్ని గంటల వ్యవధిలో మరోచోటికి మారుతోందని బాధితుడు వెంకటరమణ చెప్పారు. వాపు ఉన్న చోట బాగా నొప్పిగా ఉంటుందని వివరించాడు. మొఖం, చంకలు, మొలలు, వీపు, చేతులు తదితర బాగాల్లో ఇవి కనిపిస్తున్నాయన్నాడు. కూర్చున్నా, పడుకున్నా భరించలేని బాధగా ఉంటుందని చెప్పాడు. ఈ సమస్యను గుర్తించిన మొదట్లో తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని ఒక డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. పలు పరీక్షలు నిర్వహించి, మందులు ఇచ్చినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారని బాధితుడి తండ్రి చక్రపాణి వివరించారు. ఆయన సూచన మేరకు విశాఖలోని క్వీన్స్ ఎన్నారై క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య నిపుణుడు బి.రవిశంకర్ పరిశీలించి ఇది రక్త సంబంధిత వ్యాధి అని చెప్పారని, తమ కుమారుడి నుంచికొన్ని నమూనాలను ముంబైకి పంపి, నివేదికలు తెప్పించారని చక్రపాణి చెప్పారు. వాటిని పరిశీలించి ఇదో అరుదైన వ్యాధి అని, ఇటువంటి వాటికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స చేసే వైద్యులు ఉన్నారని, అక్కడికి తీసుకువెళ్లాలని సూచించారని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లి చూపిస్తే రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పడంతో అంత స్తోమత లేక వెనుదిరిగి వచ్చామన్నారు. ఏపూటకు ఆ పూట కూలితో పొట్టుపోసుకునే తాము కొడుకును విశాఖపట్నం తీసుకువెళ్లేందుకే అప్పులు చేశామని, ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ తీసుకువెళ్లడం తలకుమించిన భారమని ఆందోళనతో విలపిస్తున్నారు. కళ్లముందే కొడుకు బాధతో విలవిల్లాడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని వాపోయారు. దాతలు సహృదయంతో స్పందించి ఆర్థిక సహాయం (సెల్ నెం.94410 24040, బ్యాంకు అకౌంట్ నెం.62328077834, ఎస్‌బిహెచ్, హిరమండలం) చేయాలని కోరుతున్నారు.