లండన్: ‘సెల్ఫీ’.. ఇటీవల వైరల్‌లా మారిన ట్రెండ్. మితిమీరి సెల్ఫీలు దిగడం రోగమేనంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధన చేసింది కూడా భారత్‌లోనే కావడం గమనార్హం. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలబారిన పడడం వంటి ఘటనలు భారత్‌లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నందునే ఇండియాను ఎంపిక చేసుకున్నామని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
‘అధికంగా సెల్ఫీలు తీసుకోవడం ఒక మానసిక రోగమే’ అంటూ 2014లో మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా యూకేకు చెందిన నాటింగ్‌హామ్ యూనివర్సిటీ, తమిళనాడులోని తియంగరాజర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం 400 మందిని ఎంపిక చేసుకొని, వారిని మూడు గ్రూపులుగా విభజించారు. రోజుకు కనీసం మూడు సెల్ఫీలు తీసుకునేవారిని మొదటి గ్రూపులో, అంతకంటే ఎక్కువగా దిగేవారిని రెండో గ్రూపులో, అదేపనిగా సెల్ఫీల్లో మునిగిపోయేవారిని మూడో గ్రూపులో చేర్చారు. సెల్ఫీ దిగని రోజు వారి మానసిక పరిస్థితిని పరిశీలించారు. మిగతా రోజులతో పోలిస్తే.. సెల్ఫీ దిగని రోజు వారు మానసికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment