అది ఇటీవల కేరళలో రుతూ ముంచేసిన బురద ప్రవాహమే కావచ్చు... లేదా అప్పట్లో చార్‌ధామ్ లో తుడిచిపెట్టేసిన వరద ప్రవాహమే కావచ్చు. అలనాటి సునామీ లేదా ఉత్తర కాశీ భూకంపమే కావచ్చు... ఇంకా యుద్ధ ఘటనలు.. దాడి లేదా దౌర్జన్యం, లైంగిక దాడి, ముష్కరులు మూకుమ్మడిగా విరుచుకుపడటం, గాయాలపాలు చేయడం, దోపిడీ... ఇలా ఏదైనా సరే అది మానసికంగా షాక్‌కు గురిచేయవచ్చు. ఇవే కాదు... తుఫాను, భారీ అగ్నిప్రమాదం, భూకంపం వంటి ప్రకృతి విపత్తులు, కుటుంబసభ్యులెవరైనా దూరం కావడం, హత్య, ఆత్మహత్య వంటి ఘటనల్లో షాక్‌కు గురవుతారు. షాక్ తర్వాత బాధితులను నిస్తేజంగా మార్చే పరిస్థితిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ (పీటీఎస్‌డీ) అంటారు. ఈ ‘పీటీఎస్‌డీ’ గురించి అవగాహన కోసమే ఈ కథనం.
పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ) బారిన పడ్డ వ్యక్తులు సురక్షితంగా ఉన్నప్పుడూ లేదా అలాంటి పరిస్థితులేమీ లేని సమయాల్లో కూడా తీవ్రంగా భయపడుతుంటారు. మిగతావాళ్లతో పోలిస్తే స్త్రీలు, పిల్లలు ఈ షాక్‌కు గురయ్యే ఛాన్స్ ఎక్కువ.
పిల్లలైతే...
ఎప్పుడో వదిలేసిన పక్క తడపడం వంటి అలవాటు పునరావృతం కావడం
మాటలు మరచి΄ోవడం, మాటల కోసం తడుముకోవడం ∙హాయిగా, ఆడుకోలేక΄ోవడం
ఆత్మీయులైన పెద్దలను విడవకపోవడం.
బాధితులతో వచ్చే ముప్పు...
తమను తాము ఎంతో నిస్సహాయులుగా పరిగణించి బాధపడటం
తీవ్రమైన భయాలతో ఎవరితోనూ కలవక, ఒంటరిగా ఉండిపోవడం
తమను తాము బాధించుకోవడం, ఆత్మహత్యకు పాల్పడటం లేదా ఒక్కోసారి ఎదుటివాళ్లపై దాడికి దిగడం.
నిర్ధారణ...
బాధితుల లక్షణాలనూ వాళ్ల మెడికల్ హిస్టరీని బట్టి
బాధితుల స్నేహితులు, బంధువుల నుంచి వివరాలను రాబట్టడం ద్వారా ∙కొన్ని మానసిక పరీక్షల ద్వారా.
మేనేజ్‌మెంట్ / చికిత్స...
సపోర్టివ్ థెరపీ, రీ ఎష్యూరెన్స్, యాక్టివ్ లిజనింగ్, కోపింగ్ స్కిల్స్ నేర్పడం వంటి చికిత్సలు.
ఎక్స్‌పోజర్ థెరపీ : ఒకేసారి ఆ సంఘటనను గుర్తు చేయకుండా మెల్ల మెల్లగా ఆ సంఘటన గురించి వివరిస్తూ, ఆ దుర్ఘటన జరిగిన ప్రదేశానికి మెల్ల మెల్లగా తీసుకెళ్తూ, ఇప్పుడు అక్కడ అలాంటి పరిస్థితి లేదనీ, ఇకపై అక్కడ ఎంతమాత్రమూ హాని జరగదనే భరోసా కల్పించడం.
లక్షణాలు...
ఆ సంఘటన మళ్లీ మళ్లీ జరుగుతున్నట్లే ఫీల్ కావడం లేదా ఆ సంఘటనలో ఉన్నట్లే ఫీలవుతారు.
నిద్రలో పీడకలలు. అందులో అదే సంఘటన జరుగుతున్నట్లుగా కలలు వస్తాయి
ఆ సంఘటన గురించి తలచుకోడానికి, మాట్లాడానికి ఇష్టపడకపోవడం
ఎంత వద్దనుకున్నా మాటిమాటికీ ఆ సంఘటనల తాలూకు ఆలోచనలే రావడం
సంఘటన తాలూకు ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడకపోవడం
ఆ టైమ్‌లో తమతో ఉన్న వాళ్లను కలవకపోవడం లేదా తప్పించుకుని తిరగడం ∙మూడ్స్ వేగంగా మారిపోవడం ∙ఒక్కోసారి ఆ సంఘటన తాలూకు ఎలాంటి జ్ఞాపకమూ లేకపోవడం
ఆ సంఘటన గురించిన భయాలు, విపరీతమైన కోపం, సిగ్గుగా ఫీల్ కావడం
ప్రతికూల ఆలోచనలే వస్తుండటం
సంఘటన పట్ల తనను తానుగానీ లేదా ఇతరులను గానీ నిందిస్తూ ఉండటం
ఎవ్వరితోనూ కలవకుండా ఒంటరి గా ఉండటం
ఒకప్పుడు తనకు సంతోషం కలిగించిన అవే పనులు ఇప్పుడు ఏమాత్రం ఆనందం ఇవ్వక΄ోవడం
పరిసరాల పట్ల చాలా ఎక్కువ అనుమానాస్పదంగా ఉండటం
ఏ విషయంపై దృష్టి పెట్టలేకపోవడం, నిద్ర సమస్యలు (నిద్రపట్టక΄ోవడం లేదా ఎప్పడూ నిద్రలోనే ఉండటం).
కాగ్నిటివ్ రీ కన్‌స్ట్రక్షన్
ఆ సంఘటనలో బాధితుల ప్రమేయం లేదనీ, ఆ సంఘటన గురించి అపరాధభావనతో ఉండాల్సిన అవసరం లేదనీ, అప్పుడున్న మనుషుల నుంచి తప్పించుకుని తిరగాల్సిన పనిలేదనే నమ్మకాన్ని కల్పించడం. ఇలా సైకోథెరపీ చేస్తూ, ఆత్మహత్య ఆలోచనలనుంచి బయటపడేసే మందుల తోపోటు సెలెక్టివ్ సెరిటోనిన్ రీ–ఆప్‌టేక్ ఇన్హిబిటార్స్, సెరిటోనిన్ నార్ ఎపీనెఫ్రిన్ రీ అప్‌టేక్ ఇన్హిబిటార్స్, నార్ ఎపీనెఫ్రిన్–డోపమైన్ రీ అప్‌టేక్ ఇన్హిబిటార్స్ వంటి మందులు, యాంటీ డిప్రెసెంట్స్‌తో చికిత్స అందిస్తారు.
డా. శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సీనియర్ సైకియాట్రిస్ట్
(చదవండి: బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్‌గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్)
Comments
Please login to add a commentAdd a comment