బొటాక్స్‌తో కంటి చికిత్సలు... | sakshi health councling | Sakshi
Sakshi News home page

బొటాక్స్‌తో కంటి చికిత్సలు...

Published Thu, Jan 26 2017 12:25 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

బొటాక్స్‌తో కంటి చికిత్సలు...

బొటాక్స్‌తో కంటి చికిత్సలు...

కంటికి వచ్చే కొన్ని రుగ్మతలను బొటాక్స్‌తో సమర్థంగా చికిత్స చేయవచ్చు. కంటికి సంబంధించి పలు రకాల సమస్యల్లో బొటాక్స్‌తో చికిత్స సాధ్యమవుతుంది. వాటిలో కొన్ని...

కంటి రెప్పలకు సంబంధించి...
 బ్లెఫరోస్పాజమ్‌
హెమీఫేషియల్‌ స్పాజమ్,
 థైరాయిడ్‌ ఐ డిజార్డర్‌
అబ్‌నార్మల్‌ లిడ్‌ ఓపెనింగ్,
ఎక్స్‌పోజ్‌ కెరటైటిస్‌
లోవర్‌ లిడ్‌ స్పాస్టిక్‌ ఎంటరోపియన్‌.

మెల్లకన్ను విషయంలో...
► ఈసోట్రోపియా (చిన్నప్పుడు, పెద్దయ్యాక)
► ఇంటర్‌మిట్టెంట్‌ స్కింట్‌ n నర్వ్‌ పాల్సీ
► కంజెనిటల్‌ నిస్టాగ్మస్‌.
కంటి అందానికి సంబంధించి (కాస్మటిక్‌)
► గ్లాబెల్లార్‌ లైన్స్‌ n క్రోస్‌ ఫీట్‌ n బన్నీ లైన్స్‌.

ఇతరత్రా చికిత్సలు...
► దీర్ఘకాలికంగా కళ్లు పొడిగా ఉండటం (క్రానిక్‌ డ్రై ఐ) n కంటి నుంచి కన్నీరు కారుతూ ఉండటం (హైపర్‌ సెక్రిషన్‌ ఆఫ్‌ టియర్స్‌)
► బ్లెఫరోస్పాజమ్‌ అంటే...  కనురెప్ప కండరంపై నియంత్రణ కోల్పోవడం వల్ల కొందరిలో కన్ను తరచూ మూసుకుపోతూ ఉంటుంది. ఈ కండిషన్‌ను బ్లెఫరోస్పాజమ్‌ అంటారు. ఇలా ఒకవైపు లేదా రెండు వైపులా మూసుకుపోతూ ఉండటంతో రోగి జీవనశైలిలో నాణ్యత లోపిస్తుంది. ఇలాంటి వారిలో కనురెప్ప లోపలికి బొటాక్స్‌ ఇంజెక్షన్‌ చేయడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకసారి ఇంజెక్షన్‌ చేయిస్తే ఆ ఫలితం 3 నుంచి 6 నెలల పాటు ఉండవచ్చు.

ల్యాగ్‌ ఆఫ్తాల్మస్‌: ఈ కండిషన్‌ ఉన్న రోగుల్లో కనురెప్ప పూర్తిగా మూసుకోదు. దాంతో కార్నియా (కంటి నల్లగుడ్డు)పై పుండ్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని సరిదిద్దడానికి కంటి పై రెప్పలో బొటాక్స్‌ ఇంజెక్షన్‌ చేస్తారు. దాంతో కనురెప్ప పూర్తిగా మూసుకుంటుంది.
ఎంటరోపియాన్‌: ఈ కండిషన్‌ ఉన్న రోగుల్లో కంటి కింది రెప్ప లోపలివైపునకు ముడుచుకుపోతుంది. దాంతో కంటి రెప్ప చివరి వెంట్రుకలు కంట్లో రాసుకుపోయి కన్ను రుద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో కంట్లో మంట, పుండ్లు రావచ్చు. బొటాక్స్‌తో ఈ కండిషన్‌ను మెరుగుపరచవచ్చు.

స్ట్రాబిస్మస్‌: మెల్లకన్ను ఉండే కండిషన్‌ను స్ట్రాబిస్మస్‌ అంటారు. మెల్లకన్ను ఉన్నవారిలో కనుగుడ్డు బయటవైపునకు (ఎక్సోట్రోపియా) లేదా లోపలివైపునకు (ఈసోట్రోపియా) లేదా పైకి, కిందకు కూడా ఉంవచ్చు. మెల్లకన్ను ఉండటం వల్ల రెండు కనుగుడ్ల కదలికల్లో సమన్వయం కొరవడుతుంది. దాంతో ఒక వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా) వంటి కండిషన్స్‌ ఏర్పడతాయి. రెండు కళ్లతోనూ ఒకే దృష్టి (బైనకులార్‌ విజన్‌) లోపించడం కూడా జరగవచ్చు. దీర్ఘకాలంలో స్పష్టత లేని కన్నులో చూపు మందగిస్తూ పోవచ్చు. దీన్నే యాంబ్లోపియా అంటారు. ఇలాంటి అనేక రకాల మెల్లకన్ను కండిషన్లలో బొటాక్స్‌తో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుంది. దాంతో చాలా సందర్భాల్లో శస్త్రచికిత్సను నివారించవచ్చు.

నిస్టాగ్మస్‌: కొందరిలో కనుగుడ్డు అవిశ్రాంతంగా అటూ ఇటూ చకచకా కదులుతూ ఉంటుంది. ఈ కండిషన్‌ను నిస్టాగ్మస్‌ అంటారు. దీన్ని సరిదిద్దడానికీ బొటాక్స్‌ ఉపయోగపడుతుంది.

అందం విషయంలో...
కనుబొమ పైన ఉండే గీతలను బొటాక్స్‌తో తగ్గించవచ్చు. అలాగే ఇటీవల దీన్ని తగ్గించడానికి బొటాక్స్‌ క్రీమ్స్‌ (ఆయింట్‌మెంట్స్‌) కూడా లభ్యమవుతున్నాయి.

ఇతరత్రా...
కొందరిలో కంటి నుంచి అదేపనిగా నీళ్లు కారుతూ ఉంటాయి. దీన్ని  వైద్యపరిభాషలో దీన్ని క్రోకడైల్‌ టియర్స్‌గా అభివర్ణిస్తారు. బొటాక్స్‌–ఏ ఇంజెక్షన్‌ సహాయంతో 75 శాతం మందిలో దీన్ని సమర్థంగా నివారించవచ్చు.

దీర్ఘకాలిక పొడి కన్ను : కొందరిలో కళ్లు ఎప్పుడూ పొడిగా ఉంటాయి. దీన్ని బొటాక్స్‌ ఇంజెక్షన్‌తో మెరుగుపరచవచ్చు.
బొటాక్స్‌తో కొన్నిసార్లు వచ్చే దుష్ప్రభావాలు: అనుభవజ్ఞులు కాని వైద్యులతో బొటాక్స్‌ ఇంజెక్షన్‌ తీసుకోవడం వల్ల కొందరిలో ఒక వస్తువు రెండుగా కనిపించడం (డబుల్‌ విజన్‌), టోసిస్‌ పెయిన్‌ (కనురెప్ప నొప్పి పెడుతూ మూసుకుపోవడం) వంటి దుష్ప్రభావాలు కనిపించవచ్చు. ఇది తాత్కాలికమే కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఇక గర్భవతులకూ, అమైనోగ్లైకోసైడ్‌ అనే మందులను వాడే రోగులకు, కొన్ని రకాల చర్మవ్యాధులు ఉన్నవారికి బొటాక్స్‌ ఇవ్వకూడదు. అందుకే ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలిసిన విచక్షణ ఉన్న నిపుణుల వద్దనే ఈ ఇంజెక్షన్‌ తీసుకోవాలి.

డా. రవికుమార్‌ రెడ్డి
కంటి వైద్య నిపుణులు
మెడివిజన్‌ ఐ హాస్పిటల్‌ హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement