masjid
-
ఆరెస్సెస్ చీఫ్‌పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య ఆగ్రహం
రాష్ట్రీయ స్వయంసేవక్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పై జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మందిర్-మసీద్ వివాదాలను ఉద్దేశించి భగవత్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భగవత్‌కు హిందువుల మనోభావాలపై పట్టింపు లేనట్లు ఉందని అన్నారాయన. ఈ మేరకు ఓ జాతీయ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..‘‘అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారని మోహన్ భగవత్ అన్నారు. కానీ, సాధారణ హిందువులు అలా ఏనాడూ అనుకోరు. దేశంలో ఎన్నో ఆలయాలను కూల్చేశారు. ఇది జగమెరిగిన సత్యం. ఆయనకు(మోహన్ భగవత్‌కు) హిందువుల నొప్పేంటో పట్టన్నట్లు ఉంది. హిందువుల ప్రస్తుత దుస్థితి ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన మాటలతో ఆ విషయం స్పష్టమైంది’’ అని అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు.భగవత్ ఏమన్నారంటే..ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పుణే(Pune)లో జరిగిన ‘ఇండియా ది విశ్వగురు’ అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘ఇటీవల కాలంలో మందిర్-మసీద్ వివాదాలు గణనీయంగా పెరగడం ఆందోళనకరం. అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను రాజేసి తాము కూడా హిందూ నాయకులం కావచ్చని కొందరు వ్యక్తులు భావిస్తున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రతిరోజూ కొత్త వివాదం తీసుకొస్తున్నారు. వీటిని ఎలా అంగీకరించమంటారు?.. .. ఇది కొనసాగకూడదు. కలిసిమెలిసి ఎలా ఉంటామో భారత్ చూపించాలి. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోంది. దీనిలో ప్రభుత్వాన్ని నడిపే ప్రజాప్రతినిధులను వారే ఎన్నుకొంటారు. ఎవరో ఒకరి ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రతిఒక్కరూ తమను తాము భారతీయులుగా చెప్పుకొంటున్నప్పుడు ఆధిపత్యం భాష ఎందుకు..? ఎవరు మైనార్టీ..? ఎవరు మెజార్టీ..? ప్రతిఒక్కరూ సమానమే. ఎవరి ఇష్టమైన భగవంతుడి ఆరాధనను వారు పాటించడమే ఈ దేశ ఆచారం. కాకపోతే నిబంధనలు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం అవసరం. అలాగే.. కలుపుగోలు సమాజాన్ని మనకు మంచింది. మన దేశం సామరస్యంగా ఉంటుందని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉంది. మేం హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్(Rama Krishna Mission) లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకొంటాం. మనం చాలాకాలంగా సామరస్యంగా ఉంటున్నాం. దీనిని మనం ప్రపంచానికి అందించాలనుకొంటే.. ఓ ఉదాహరణగా నిలవాలి’’ అని అన్నారు.👉ఇదిలా ఉంటే.. భగవత్ వ్యాఖ్యలపై జగద్గురు స్వామి రామభద్రచార్య సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. భగవత్ తమ అనుచరుడి కాదని మండిపడ్డారు. ఆయన ఎంతోమంది భస్వాసురులను సృష్టించారని.. వాళ్లే ఆరెస్సెస్ నెత్తిన చెయ్యి పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. 👉మరోవైపు.. రాజకీయంగానూ ఈ వ్యాఖ్యలపై చర్చ నడిచింది. సామరస్యం పాటించాలని భగవత్ బీజేపీనే కోరుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు. యోగి ఆదిత్యానాథ్‌కు ఆయన(మోహన్ భగవత్) గనుక సూచిస్తే.. ఏ సర్వేలు. వివాదాలు ఉండవని అఖిలేష్ అన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందిస్తూ.. మోహన్ భగవత్‌ది ద్వంద్వ ధోరణి అని మండిపడ్డారు.ఇదీ చదవండి: ఈ పుణ్య క్షేత్రాల నగరం గురించి తెలుసా? -
ప్రార్థనా స్థలాలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
-
మేం చెప్పేదాకా సర్వేలపై ఉత్తర్వులు, తీర్పులు ఆపండి
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి ఉన్న ప్రార్థనాస్థలాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని నిర్దేశించే 1991నాటి చట్టంలోని సెక్షన్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలకమైన సూచనలు చేసింది. ప్రార్థనాస్థలాల్లో సర్వేలపై వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులపై తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తమ ఆదేశాలే అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రార్థనాస్థలాలు ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద సర్వేలు చేపట్టడాన్ని సవాల్‌చేస్తూ, సమరి్థస్తూ కొత్తగా ఎలాంటి ఫిర్యాదులు, కేసులను తీసుకోవద్దని ధర్మాసనం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, సంభాల్‌లోని షాహీ జామా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లోని ఖ్వాత్– ఉల్–ఇస్లామ్ మసీదు, మధ్యప్రదేశ్‌లోని కమల్ మౌలా మసీదు సహా 10 మసీదులు ఉన్న ప్రాంతాల్లో గతంలో హిందూ ఆలయాలు ఉండేవని, ఆయా స్థలాల్లో సర్వే చేపట్టి ఆ ప్రాంతాల వాస్తవిక మత విశిష్టతను తేల్చాలంటూ 18 కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ప్రార్థనాస్థలాల(ప్రత్యేక అధికారాల)చట్టం, 1991లోని 2, 3, 4వ సెక్షన్ల చట్టబద్ధతను సవాల్‌చేస్తూ న్యాయవాది అశ్వినీ వైష్ణవ్ తదితరులు దాఖలుచేసిన ఆరు పిటిషన్లనూ ఈ స్పెషల్ బెంచ్ గురువారమే విచారించింది. 1947 ఆగస్ట్ 15నాటికి ఉన్న ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని మార్చడానికి వీల్లేదంటూ 1991 చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ఈ సెక్షన్లు అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి వర్తించవంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పి ఆ స్థలాన్ని హిందూవర్గానికి కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారణాసి, మథుర, సంభాల్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నాటి మసీదులు, దర్గాలున్న స్థలాల వాస్తవిక మత లక్షణాన్ని తేల్చాలని కొత్తగా పిటిషన్లు పుట్టుకొచి్చన విషయం విదితమే. కేంద్రానికి 4 వారాల గడువు ‘‘ ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ అన్ని కోర్టులను ఆదేశించడానికి ముందే సంబంధిత కేసుల్లో కక్షిదారుల వాదనలను సుప్రీంకోర్టు వినాలి’’ అని హిందువుల తరఫున హాజరైన సీనియర్ లాయర్ జే.సాయి దీపక్ కోరారు. దీనిపై సీజేఐ ‘‘ కింది కోర్టులు సుప్రీంకోర్టు కంటే పెద్దవైతే కాదుకదా. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృతస్థాయిలో పరిశీలిస్తున్నపుడు కింది కోర్టులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సహజమే. అయినా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకుండా ముందుకు వెళ్లలేం. నాలుగు వారాల్లోపు కేంద్రం తన స్పందనను తెలియజేయాలి. కేంద్రం స్పందన తెలిపాక మరో నాలుగు వారాల్లోపు సంబంధిత కక్షిదారులు వారి స్పందననూ కోర్టుకు తెలియజేయాలి’’ అని సూచించారు. ఈ అంశానికి సంబంధించి 2022 సెపె్టంబర్లో దాఖలైన ప్రధాన పిటిషన్ విషయంలో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. 1991 చట్టాన్ని సవాల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ తదితర సంస్థలు ముస్లింల తరఫున కేసులు వేశాయి. 1991 చట్టాన్ని తప్పుబట్టి తద్వారా మసీదుల ప్రాచీన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని మసీదు కమిటీలు వాదిస్తున్నాయి. -
సంభాల్ హింస: ఎంపీ సహా 400 మందిపై కేసు
ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో సంభాల్ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నారు. వీరిద్దరూ హింసకు పాల్పడటంతోపాటు జనాలను గుంపులుగా సమీకరించి, అశాంతిని రెచ్చగొట్టడం వంటివి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.కాగా సంభాల్ పట్టణంలో మొగల్ కాలానికి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుతో న్యాయస్థానం సర్వేకి ఆదేశించింది. దీంతో ఆదివారం సర్వే నిర్వహిస్తుండగా హింస చేలరేగింది. గుంపుగా వచ్చిన కొందరు స్థానికులు సర్వేకు వ్యతిరేంగా మసీదు ముందు నినాదాలతో ఆందోళనకు దిగారు. చదవండి: ఘొర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామాపోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలకు నిప్పు పెట్టారు. స్పందించిన పోలీసులు లాఠీలు, టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు సైతం గాయాలయ్యాయి.ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్, హింసను కాంగ్రెస్ ప్రేరేపిస్తోందని బీజేపీ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇక సోమవారం సంభల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలు గుంపులుగా గుమిగూడటంపై నిషేధం విధించారు.#WATCH | Delhi: On Sambhal stone pelting incident, Samajwadi Party MP Akhilesh Yadav says "Our MP Zia ur Rahman was not even in Sambhal and despite that an FIR was lodged against him...This is a riot done by the government...Right after the order was passed by the Court, police… pic.twitter.com/qwPGtpho1m— ANI (@ANI) November 25, 2024 -
అయోధ్యలో మసీదు నిర్మాణం ఎంతవరకూ వచ్చింది?
అయోధ్య: యూపీలోని అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న మసీదుకు సంబంధించిన పనులు ఎంతవరకూ వచ్చాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆర్థిక కారణాలతో మసీదు పనులు నిలిచిపోయాయి. మసీదును నిర్మిస్తున్న ట్రస్ట్ ఐఐసీఎఫ్‌కు సంబంధించిన నాలుగు కమిటీలు రద్దు అయిన దరిమిలా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయని తెలుస్తోంది.2019, నవంబర్ 9న సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఆమోదం తెలిపింది. దీనితో పాటు మసీదు నిర్మాణానికి ముస్లింలకు ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం మసీదు కోసం మరో ప్రాంతంలో స్థలాన్ని కేటాయించింది. అయితే మసీదు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అలాగే మసీదు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)తన నాలుగు కమిటీలను రద్దు చేసింది.ఐఐసీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఆర్థిక ఇబ్బందుల కారణంగా మసీదు నిర్మాణ పనులు ఆగిపోయాయి. మసీదు కోసం కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇచ్చింది. ఈ బోర్డు ఈ భూమిని పరిరక్షించేందుకు ఐఐసీఎఫ్ని ఏర్పాటు చేసింది. ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ కమిటీలు మసీదు పేరుతో విరాళాలు సేకరించేందుకు పలు నకిలీ ఖాతాలు తెరిచాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అథర్ హుస్సేన్ తెలిపారు.మసీదు కోసం కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్, కమ్యూనిటీ మసీదు, లైబ్రరీ నిర్మించాలని ఐఐసీఎఫ్ ప్రతిపాదించింది. అయితే ట్రస్టుకు డబ్బు కొరత ఏర్పడింది. గత నాలుగేళ్లలో ఐఐసీఎఫ్ విరాళంగా కోటి రూపాయలు అందుకుంది. అయితే నిర్మాణ పనులు చేపట్టేందుకు ట్రస్టుకు రూ.3 నుంచి 4 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది. కాగా మసీదు నిర్మాణ పనులను చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిధులు సేకరణ జరిగాక మసీదు నిర్మాణ పనులు ప్రారంభమవుయని ఐఐసీఎఫ్ తెలిపింది. ఇది కూడా చదవండి: రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం -
బాబ్రీ మసీదును ఎక్కడ నిర్మిస్తున్నారు? నిధుల సేకరణ ఎలా?
అయోధ్యలో మసీదు నిర్మాణానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బాబ్రీ మసీదు స్థానంలో మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీదును నిర్మించనున్నారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని వాక్యాలను లిఖించిన ఇటుకలను మసీదు నిర్మాణం కోసం వినియోగించనున్నారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థానంలో నిర్మించబోయే ఈ మసీదుకు మహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అని పేరు పెట్టారు. అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్ గ్రామంలో ఈ మసీదును నిర్మించనున్నారు. అయోధ్య భూ వివాదంపై 2019లో తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. ఐదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించాలని ఆదేశించింది. మసీదు నిర్మాణ బాధ్యతను ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు అనుసంధానంగా ఉన్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చేపట్టింది. మీడియాకు ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ సీనియర్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అయోధ్యలో మసీదు నిర్మాణం రాబోయే మే నెలలో ప్రారంభం కానుంది. నిర్మాణం పూర్తికావడానికి నాలుగేళ్లు పట్టవచ్చని భావిస్తున్నారు. మసీదు నిర్మాణం కోసం క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ద్వారా నిధులను సేకరించనున్నారు. ఈ మసీదులో ఐదు మినార్లు ఉండనున్నాయి. అతిపెద్ద ఖురాన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. మసీదు కాంప్లెక్స్‌లో ఆసుపత్రి, మ్యూజియం, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. మసీదు పునాదికి ఉపయోగించే పవిత్ర ఇటుకను మసీదు అభివృద్ధి కమిటీ అధిపతి హాజీ అరాఫత్ షేక్ భారతదేశానికి తీసుకువచ్చారు. ఈ ఇటుకపై మహ్మద్ ప్రవక్త ప్రవచనాలను బంగారంతో లిఖించారు. మసీదులో మొదటి ప్రార్థనను మక్కా ఇమామ్ ఇమామ్-ఎ-హరమ్ అబ్దుల్ రెహమాన్ అల్-సుదైస్ చేస్తారని సమాచారం. -
భారతదేశంలోని ప్రముఖ మసీదులివే..
దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. మనదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని మసీదులు వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జామా మసీదు, ఢిల్లీ జామా మసీదు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రసిద్ధ మసీదులలో ఒకటి. 1956లో షాజహాన్ నిర్మించిన ఈ మసీదులో సుమారు 25 వేల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో నిర్మితమైన ఈ మసీదు మీనార్ 135 అడుగుల ఎత్తు కలిగివుంది. మక్కా మసీదు, హైదరాబాద్ దేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఇది ఒకటి. మక్కా మసీదు 1694లో మక్కా నుండి తెచ్చిన మట్టి, ఇటుకలతో నిర్మితమయ్యింది. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10 వేల మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ మసీదు చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్, చార్మినార్ తదితర చారిత్రక ప్రదేశాలకు సమీపంలో ఉంది. తాజ్-ఉల్-మసీదు, భోపాల్ తాజ్-ఉల్-మసీదు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద, అందమైన మసీదుగా పేరుగాంచింది. ఈ మసీదును ‘మసీదుల కిరీటం’ అని కూడా పిలుస్తారు. లక్ష మందికి పైగా జనం ఈ మసీదులో కూర్చుని ప్రార్థనలు చేయవచ్చు. జామియా మసీదు, శ్రీనగర్ శ్రీనగర్‌లో ఉన్న జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. దీనిలో ఒకేసారి 33 వేల మంది ప్రార్థనలు సాగించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లోని పాత శ్రీనగర్‌లో ఈ మసీదు ఉంది. బడా ఇమాంబర, లక్నో 1784లో అవధ్ నవాబ్ నిర్మించిన ఈ మసీదులో ఒకేసారి మూడు లక్షల మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదుగా గుర్తింపు పొందింది. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. జామా మసీదు, ఆగ్రా యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా ఉన్న ఈ జామా మసీదు దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరొందింది. దీనిని ఫ్రైడే మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు. -
కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి
లఖ్నో: మథురలో చాలాకాలంగా వివాదాల్లో నలుగుతున్న మందిర్–మసీద్ వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అక్కడ షాహీ ఈద్గా స్థానంలో కృష్ణునికి ఆలయం నిర్మించడంపై గట్టిగా దృష్టి సారిస్తామని సంకేతాలిచ్చారు. ‘‘కాశీ, అయోధ్య అనంతరం ఇప్పుడిక మథుర వంతు. అక్కడ మందిరం రూపుదిద్దుకోకుంటే కృష్ణుడు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఇందుకు వేదికైంది. ‘‘కాశీ, అయోధ్య, మథుర విషయంలో మొండితనం, రాజకీయాలు కలగలిసి ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేశాయి’’ అంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలపై విమర్శలు గుప్పించారు. మథురలో కృష్ణుని పురాతన ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారన్న వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. -
జ్ఞానవాపి మసీదులో పూజలు ప్రారంభం
వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో బుధవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభమయ్యాయి. ఇక్కడున్న హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులు ఇచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 సంవత్సరాల తర్వాత మొదటిసారి అని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు అధ్యక్షుడు నరేంద్ర పాండే చెప్పారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని అన్నారు. దక్షిణ సెల్లార్‌ను బుధవారం రాత్రి 10.30 గంటలకు తెరిచినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ పూజలు నిర్వహించామని, ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపీ మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి వారణాసి జిల్లా కోర్టు బుధవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు ప్రారంభం కావడం గమనార్హం. పూజల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారమే నడుచుకున్నామని వారణాసి జిల్లా మేజి్రస్టేట్ ఎస్.రాజలింగం చెప్పారు. మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌ను శుభ్రం చేసిన తర్వాత లక్ష్మీదేవికి, వినాయకుడికి హారతి ఇచి్చనట్లు స్థానికులు చెప్పారు. -
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు
అలహాబాద్: వారణాసి జ్ఞానవాపి మసీదు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేను వెంటనే ప్రారంభించవచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతిస్తూ గత నెలలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఏఎస్ఐ సర్వే అవసరమని, కొన్ని షరతులలో దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధిస్తూ.. అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. కాగా కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదును పురాతన హిందూ దేవాలయంపై నిర్మించారా లేదా అనేది తెలుసుకునేందుకు మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో శాస్త్రీయ సర్వే చేయించడానికి వారణాసి కోర్టు జూలై 21న అనుమతినిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్నిఆదేశించింది. ఆగష్టు 4లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. దీంతో భారత పురావస్తు విభాగ అధికారుల బృందం జూలై 24న సర్వే చేపట్టింది. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను సవాలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సర్వేపై రెండు రోజుల పాటు స్టే విధిస్తూ.. వారణాసి కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లవచ్చని మసీదు కమిటీకి సూచించింది. సుప్రీం ఆదేశాలతోప్రారంభమైన కొన్ని గంటల్లోనే సర్వే నిలిచిపోయింది. వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జూలై 27న విచారణ చేపట్టగా.. ఆగస్టు 3న తీర్పు వెల్లడించే వరకు సర్వే చేపట్టరాదని స్టే విధించింది. తాజాగా మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తక్షణమే సర్వే ప్రారంభించేందుకు ఏఎస్ఐకి అనుమతినిచ్చింది. చదవండి: ‘100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం #WATCH | Allahabad HC has said that ASI survey of Gyanvapi mosque complex to start. Sessions court order upheld by HC: Vishnu Shankar Jain, representing the Hindu side in Gyanvapi survey case pic.twitter.com/mnQJrTzS09 — ANI (@ANI) August 3, 2023 -
ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టుకు జ్ఞానవాపి మసీదు కమిటీ
న్యూఢిల్లీ: యూపీలోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే చేపట్టాలన్న వారణాసి కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలని కోరింది. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ముందుకు రానుంది. జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన అన్ని ఉత్తర్వులపై వెంటనే స్టే ఇవ్వాలని మసీదు కమిటీ కోరుతోంది. ఇప్పటికే జూలై మొదటి వారంలోనే ఈ పిటిషన్ వేసింది. అయితే, విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో సర్వే చేపట్టాలంటూ వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో మసీదు కమిటీ సత్వర విచారణ కోరుతోంది. -
‘అయోధ్య’ మసీదు నిర్మాణానికి తుది అనుమతులు
అయోధ్య: బాబ్రీ మసీదు– రామ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుమేరకు అయోధ్య జిల్లాలో రామమందిరానికి 22 కిలోమీటర్ల దూరంలో ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి సంబంధించిన తుది అనుమతులను అయోధ్య డివిజనల్ కమిషనర్ మంజూరుచేశారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అధీనంలోని ఐదెకరాల ఆ స్థలాన్ని ఇండో–ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్)కు బదిలీచేసే అంశం రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో మసీదు నిర్మాణం ఆలస్యమైంది. కొద్దిరోజుల్లో భూ బదిలీ పత్రాలను ఐఐసీఎఫ్‌కు అందిస్తామని అయోధ్య డివిజినల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ శనివారం చెప్పారు. ఏప్రిల్ 21న నిర్మాణపనుల ప్రారంభ తేదీని ఖరారుచేస్తామని ఐఐసీఎఫ్ కార్యదర్శి అథర్ హుస్సేన్ చెప్పారు. -
9 ఏళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేసిన వ్యక్తి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
తిరువనంతపురం: కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలికపై 30 ఏళ్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. కాసర్గడ్ జిల్లాలోని మంజేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది. ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేశాడు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించిన అతనికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉధ్యవరం నివాసి అబూబకర్ సిద్దిక్ (30)గా గుర్తించారు. చదవండి: పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు #CCTV: A 9-year-old #girl was thrown away by a man in #Kerala's #Kasargod. A girl #student was lifted and thrown on the ground without any reason near #Manjeshwar of Kasaragod. #Kerala pic.twitter.com/090DZ6qgNx — Harish Deshmukh (@DeshmukhHarish9) November 18, 2022 -
మసీదు, మదర్సాను సందర్శించిన మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో మత సహనాన్ని పెంపొందించడానికి గత కొన్ని వారాలుగా ముస్లిం మేధావులతో మంతనాలు జరుపుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ గురు వారం ఒక మసీదు, మదర్సాను సందర్శించారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇలియాస్‌ను కలుసుకొని ఏకాంతంగా గంటకు పైగా చర్చలు జరిపారు. సెంట్రల్ ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్‌లో ఒక మసీదుని సందర్శించారు. తర్వాత ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌లో మదర్సాకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. తమ ఆహ్వానం మేరకే భగవత్ మసీదు, మదర్సాకి వచ్చారని ఇలియాస్ వెల్లడించారు. -
ఒవైసీకి శ్రీనగర్ పోలీసుల స్ట్రాంగ్ కౌంటర్
శ్రీనగర్: ఏఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి శ్రీనగర్ పోలీసులు కౌంటర్ ఇచ్చారు. జామియా మసీద్ విషయంలో ఒవైసీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. సోఫియాన్, పుల్వామాలో తాజాగా మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించారు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. దీంతో హాల్‌కు వెళ్లి సినిమా చూడాలన్న అక్కడి ప్రజల చిరకాల కల నెరవేరిందంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఎంపీ ఒవైసీ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. శ్రీనగర్‌లోని జామియా మసీద్‌ను ప్రతీ శుక్రవారం మూసేస్తున్నారని, కనీసం శుక్రవారం మధ్యాహ్న సమయంలో అయినా తెరవాలంటూ ఎల్జీని ఉద్దేశిస్తూ ఎద్దేవా ట్వీట్ చేశారు ఒవైసీ. అయితే దీనికి.. శ్రీనగర్ పోలీసులు ట్విటర్ ద్వారా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ‘‘జామియా పూర్తిగా తెరిచే ఉంటోంది. కరోనా తర్వాత కేవలం మూడు శుక్రవారాల్లో మధ్యాహ్న నమాజ్ సమయంలో మాత్రమే, అదీ ఉగ్రదాడి సమాచారం, శాంతిభద్రతల సమస్యలతో మూతపడింది. లోపల జరిగే సంఘటనలకు తమది బాధ్యత కాదని జామియా అధికారులు ప్రకటించిన నేపథ్యంలోనే తాత్కాలికంగా ఆ పూటకు మూసేయాల్సి వచ్చింది’’ అంటూ చివర్లో.. అజ్ఞానానికి సాకు లేదు అని ఒవైసీ ట్వీట్‌కు శ్రీనగర్ పోలీసులు ఘాటుగానే బదులు ఇచ్చారు. Jamia is fully opened,only on 3 occasions post-covid,it was temporarily shut for friday noon prayers owing to inputs of terror attack /law & order situation.This was after Jamia authorities failed to take responsibility of happenings inside. Staying far is no excuse of ignorance. https://t.co/wqicG3oAr2 — Srinagar Police (@SrinagarPolice) September 20, 2022 ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే! -
జ్ఞానవాపి వివాదం: ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన. గురువారం సాయంత్రం నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి. ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది. జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యలు -
కుతుబ్‌మినార్ కాదు సూర్య గోపురం!
Qutub Minar was built by Raja Vikramaditya to observe the sun: తాజ్‌మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. ఐదవ శతాబ్దంలో రాజావిక్రమాదిత్య ఈ గోపురాన్ని నిర్మించాడని ఆర్కియాలజీ సర్వే మాజీ అధికారి ధర్మవీర్ శర్మ వాదిస్తున్నారు. అంతేగాదు ఆయన సూర్యుని దిశను అధ్యయనం చేయడం కోసం కుతుబ్ మినార్‌ని రాజవిక్రమాదిత్య నిర్మించారని, కుతుబ్ అలల్ దిన్ ఐబాక్ దీన్ని నిర్మించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది కతుబ్‌మినార్ కాదు సూర్యగోపురం(అబ్జర్వేటరీ టవర్)’’ అని కూడా చెప్పారు. తాను ఆర్కియాలజీ సర్వే తరుఫున కుతుబిమినార్‌లో పలుమార్లు సర్వే చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. అంతేగాదు కుతుబ్ మినార్ టవర్‌లో 25 అంగుళాల వంపు ఉందని జూన్ 21న సూర్యస్తమయం అయ్యే సమయంలో అరగంట సేపు కనువిందు చేసే నీడ ఈ ప్రాంతంలో ఏర్పడదని ఒక కొత్త విషయాన్ని కూడా వెల్లడించారు. కుతుబ్‌మినార్ అనేది స్వతంత్ర నిర్మాణమే గానీ.. మసీదుకు సంబంధించినది కాదని చెప్పారు. తలుపులు కూడా ఉత్తరం వైపు ఉన్నాయని, ఇది రాత్రిపూట ఆకాశంలోని ధృవ నక్షత్రాన్ని చూసేందుకంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (చదవండి: వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం) -
శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ/వారణాసి: కాశీలోని జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన బెంచ్ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కావాలంటే ముస్లింలు వజు వేరే చోట చేసుకోవచ్చన్నారు. కానీ వజూ లేకుండా నమాజ్‌కు అర్థం లేదని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు. హృద్రోగంతో ఆస్పత్రిలో చేరిన దిగువ కోర్టులో వాది తరఫు న్యాయవాది కోలుకొనే దాకా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. రాజ్యాంగ విరుద్ధం వారణాసి కోర్టు ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అహ్మదీ వాదించారు. జైన్ దరఖాస్తుకు స్పందించి శివలింగం దొరికిన ప్రాంతానికి సీలు వేయాలన్న తాజా ఆదేశం సరికాదన్నారు. ఇంతవరకు సర్వే పూర్తయి నివేదిక రాకముందే ఇలాంటి ఆదేశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘మసీదులో ప్రార్ధనలకు అనుమతించాలన్న అభ్యర్థనే అసంబద్ధం. ఇవన్నీ పట్టించుకోకుండా కింద కోర్టు సర్వే జరిపిస్తోంది. మేం హైకోర్టును ఆశ్రయించినప్పుడు కమిషనర్ నియామకానికే అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కానీ సర్వేకు కూడా కింద కోర్టు ఆదేశించింది. సర్వే జరుగుతుండగా అకస్మాత్తుగా శివలింగం కనిపించిందని దరఖాస్తు పెట్టుకోగానే, అది ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాంత రక్షణకు హడావుడిగా ఆదేశాలిచ్చింది’’ అని వాదించారు. కేసు సుప్రీంలో ఉన్నందున స్థానిక కోర్టు విచారణపై స్టే విధించాలని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. హిందూ భక్తుల పార్టీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 19కి వాయిదా వేసింది. సర్వే పూర్తి కాలేదు జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ ప్రతాప్‌సింగ్ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని, కొన్నింటి తాళం చెవులు లభించకపోతే జిల్లా యంత్రాంగం తాళాలు పగలగొట్టడంతో వాటిని కూడా వీడియో తీశామని చెప్పారు. ‘‘వజూ ఖానాలో శివలింగం అంశంపై నేను మాట్లాడను. అక్కడ ఏదో దొరకడం మాత్రం నిజం. దాని ఆధారంగానే కోర్టు ఆదేశాలిచ్చింది’’ అని తెలిపారు. సింగ్ అభ్యర్థన విన్న వారణాసి సివిల్ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్ అజయ్ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్ విశాల్ సింగ్ కోర్టుకు తెలిపారు. సదరు ఫొటోగ్రాఫర్ మీడియాకు తప్పుడు సమాచారమిస్తున్నారన్నారు. అయితే ఆ ఫొటోగ్రాఫర్ తనను మోసం చేశారని మిశ్రా వాపోయారు. ఆ గోడను తొలగించండి! కాశీ విశ్వనాథ ఆలయంలో నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని ఐదుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో మరో పిటీషన్ వేశారు. గోడను తొలగిస్తే బయటపడిన శివలింగం వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని వీరు పేర్కొన్నారు. మసీదు తూర్పు ప్రాంతంలో నంది విగ్రహం వైపు కూడా సర్వే జరపాలని కోరారు. ఈ విషయంపై బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అలాగే మసీదు బావిలో చేపల సంరక్షణ గురించి కూడా బుధవారం కోర్టు విచారిస్తుందని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ చెప్పారు. మథుర మసీదులో నమాజ్ నిలిపివేతకు పిటిషన్ మథుర: నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్ దేవ్ మందిరంలో ఈ మసీదు ఉంది. మసీదు ఉన్న చోటే కృష్ణుడు జన్మించాడని మెజార్టీ హిందువుల భావన అని తాజా పిటీషన్లో పేర్కొన్నారు. మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించినందున దీనికి మసీదు హోదా రాదన్నారు. అందువల్ల ఇక్కడ నమాజు చేయకుండా శాశ్వత నిరోధ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇతర మత చిహ్నాలు లేని, వివాదంలో లేని ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని ఖురాన్ చెబుతోందన్నారు. దీనిపై విచారణ మే 25న జరుగుతుందని జిల్లాప్రభుత్వ న్యాయవాది చెప్పారు. -
జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టులో విచారణ
-
ఆలయం, మసీదు దెబ్బతినడంపై కేసీఆర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాయం కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో వున్న దేవాలయం, మసీదు కొంత దెబ్బతిన్నాయి. ఈ ఉదంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దాని కన్నా పెద్దగా, విశాలంగా ఆలయంతో పాటు మసీదును నిర్మించి ఇస్తామన్నారు. ఎత్తైన భవనాలు కూల్చే సందర్భంలో అక్కడే ఉన్న ప్రార్థనా మందిరాలపై శిథిలాలు పడి అవి దెబ్బతినడంపై తాను చాలా బాధపడుతున్నాను అన్నారు కేసీఆర్. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తమ అభిమతం కాదన్నారు. ఆలయం, మసీదు నిర్వాహకులతో త్వరలోనే సమావేశమవుతానని, వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
బీజేపీ కార్యదర్శిపై మసీదులో దాడి
కట్టప్పన: కేరళ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఏకే నజీర్పై ఇడుక్కి జిల్లా నేడుంగడం మసీదులో దాడి జరిగింది. సీఏఏపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన తూక్కుపాలెం మసీదుకు వెళ్లారు. నమాజు చేస్తున్న ఆయన్ను అక్కడ కొందరు వ్యక్తులు వెనుక నుంచి కుర్చీతో కొట్టారని, కాళ్లతో తన్నారని బీజేపీ తెలిపింది. గాయపడిన నజీర్‌ను చికిత్స కోసం ముందుగా స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కోచిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించామని వివరించింది. ఈ దాడికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ), సీపీఎం అనుబంధ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) కార్యకర్తలే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా, మసీదులో నజీర్పై జరిగిన దాడికి కారకులెవరో తెలియడం లేదని డీఎస్పీ రాజమోహన్ తెలిపారు. -
మసీదుకు మోదీ పేరు!
యశవంతపుర : బెంగళూరు నగరంలో మోదీ పేరును మసీదుకు పెట్టారు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా సామాజిక మాధ్యమాల్లో మాత్రం హల్చల్ చేస్తోంది. వివరాలు...ఇక్కడి శివాజీనగరలో 175 ఏళ్లు క్రితం దాత మోదీ అబ్దుల్ గఫూర్ పేరును మసీదుకు పెట్టారు. ఈ మసీదును ఇటీవల అధునికరణ పనులు చేశారు. మసీదుకు ఎడమవైపున మోదీ మసీదు అని పేరు రాశారు. కుడివైపున మోదీ ఫొటో ఉన్నట్లు వాటాప్‌లో వైరల్ అవుతుంది. వాస్తవంగా ప్రధాని నరేంద్రమోదీ పేరు అయితే కాదు. దాత మోదీ అబ్దుల్ గఫూర్ పేరును మసీదుకు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టినట్లు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వాస్తవంగా దాత పేరును అలా రాశారు అంతే. -
మంత్రి పదవిచ్చి మసీదులు కూల్చుతారా?
అనంతపురం న్యూసిటీ: ‘సీఎం చంద్రబాబునాయుడు మైనార్టీలకు ఓ మంత్రి పదవిచ్చి రెండు మసీదులు కూల్చుతారా? ఇదెక్కడి న్యాయం. జంగాలపల్లి మసీదుకు సంబంధించి ఒక్క ఇటుకను తొలగించినా ఊరుకునేది లేదు’ అని ముతువల్లి నిస్సార్ అహ్మద్ అన్నారు. తిలక్‌రోడ్డు, గాంధీబజార్ రోడ్డు విస్తరణకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మైనార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ అనంతరం పెద్ద ఎత్తున నీలం థియేటర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. ట్రాఫిక్ పెద్దెత్తున స్తంభించిపోవడంతో వన్‌టౌన్, టూటౌన్ పోలీసులు భారీగా మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ధర్నా విరమించాలని సీఐ విజయభాస్కర్ గౌడ్, రాజశేఖర్ ముతువల్లిని, మైనార్టీలను బతిమలాడారు. వారి కోరిక మేరకు ధర్నాను విరమించారు. ఈ సందర్భంగా ముతువల్లి నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ పైసా పైసా సేకరించి రూ.కోటితో జంగాలపల్లి మసీదు నిర్మించామన్నారు. ఇవాళ ప్రభుత్వం మైనార్టీల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా విస్తరణ పనులను కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. మైనార్టీలను కాదని విస్తరణ చేపడితే ఆ పార్టీ పతనం తప్పదని హెచ్చరించారు. కౌన్సిల్ తీర్మానాన్ని కమిషనర్ పీవీవీఎస్ మూర్తి బేఖాతరు చేస్తూ విస్తరణ చేయాల్సిందేనని ఏవిధంగా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. విస్తరణ చేపట్టడానికి ప్రభుత్వానికి అధికారులున్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారని, అలాంటప్పుడు ప్రభుత్వమే విస్తరణ చేస్తామని ఎందుకు చెప్పలేదన్నారు. ప్రభుత్వం నాటకాలాడుతోందని సీఎం చంద్రబాబునాయుడుకు తప్పక బుద్ధి చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ట్రాఫిక్ మళ్లిస్తే విస్తరణ అవసరం లేదన్నారు. కానీ అక్కడి బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. విస్తరణ చేపడితే ఊరుకునేది లేదని, టీడీపీని గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు చాంద్‌బాషా, అత్తార్‌షేక్, నూర్‌మహ్మద్, మైనుద్దీన్, బాషా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వమే మతం
కొచ్చి: నవత్వానికి మతాలు అడ్డురావని వారు నిరూపించారు. విపత్కర పరిస్థితుల్లో అన్య మతస్తుల ఆచారాలు, సంప్రదాయాలను గౌరవించి ఆదర్శంగా నిలిచారు. వరదల ఉధృతికి త్రిసూర్ జిల్లాలోని కోచ్‌కడవులోని జుమా మసీదును వరదనీరు ముంచెత్తింది. దీంతో సమీపంలోని రత్నేశ్వరి ఆలయంలోని హాలులో ముస్లిం సోదరులు ఈద్ ప్రార్థనలు చేసుకోవడానికి దేవాలయ కమిటీ అంగీకరించింది. ప్రార్థనలు చేసుకోవడానికి హాలులో ఏర్పాట్లుచేసింది. ‘బుధవారం కల్లా వరద నీరు తగ్గితే, ప్రార్థనలు చేసుకోవచ్చని భావించాము. కానీ నీరు అలాగే ఉంది. దేవాలయ కమిటీ సభ్యులను కలవగా దేవాలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి వెంటనే అంగీకరించారు’ అని మసీదు కమిటీ అధ్యక్షుడు పీఏ ఖలీద్ చెప్పారు. ‘మొదట మనమంతా మనుషులం. అందరం ఒకే దేవుని బిడ్డలం అని గుర్తుంచుకోవాలి’ అని రత్నేశ్వరి దేవాలయ కమిటీ సభ్యుడొకరు అన్నారు. దేవాలయంలో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఉన్న నన్‌లు బక్రీద్ సందర్భంగా మెహందీ పెట్టుకున్న వీడియోలు, హిందూ దేవాలయాల్ని శుభ్రం చేస్తున్న ముస్లింల ఫొటోలు మాధ్యమాల్లో వైరల్అయ్యాయి. హిందువులకు మసీదులో ఆశ్రయం వరదలకు నిరాశ్రయులైన పలు హిందూ కుటుంబాలకు మల్లప్పురం జిల్లా అక్కంపాడులోని చెలియార్ గ్రామంలో ఉన్న జుమా మసీదు ఆశ్రయం కల్పించింది. వరదలకు నిలువనీడ కోల్పోయిన 78 మంది హిందువులకు మసీదులో వసతి కల్పించారు. వరదనీటితో అపరిశుభ్రంగా మారిన వెన్నియాడ్లోని విష్ణుమూర్తి ఆలయాన్ని, మల్లప్పురంలోని అయ్యప్ప ఆలయాన్ని కొంతమంది ముస్లింలు శుభ్రం చేశారు. ‘ముక్క’ను వదులుకున్న ఖైదీలు కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు పరప్పన అగ్రహారం, బళ్లారి జైలు ఖైదీలు ఒక్కవారం మాంసాహారాన్ని వదులుకున్నారు. ఇలా ఆదా అయ్యే నగదు మొత్తాన్ని వరద బాధితల సహాయార్థం వెచ్చించాలని జైలు అధికారులను కోరారు. ఈ రెండు జైళ్లలో ప్రతి శుక్రవారం ఖైదీలకు మాంసాహారం వడ్డిస్తారు. ఇందుకోసం సుమారు రూ.2–3 లక్షల దాకా ఖర్చవుతోంది. బక్రీద్ సందర్భంగా కేరళలోని త్రిసూర్ రత్నేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు -
జలీల్ ఖాన్ మరో గ’లీజు’
-
జలీల్ ఖాన్‌కి వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన
విజయవాడ: నగరంలోని వన్ టౌన్ జుమ్మామసీద్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వందకోట్ల విలువైన మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ యత్నం చేశారు. జలీల్ ఖాన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మసీద్ స్థలం వద్ద సీపీఐతో పాటు ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగారు. జలీల్ ఖాన్ ముస్లీంల ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీగా పోలీసులు మోహరించారు. జుమ్మామసీద్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ, ప్రజాసంఘాలు, ముస్లీం మైనారిటీలను అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీస్ వాహనాల్లో ఎక్కించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థలాన్ని అక్రమంగా తక్కువ ధరకు కట్టబెట్టడం..ముస్లిం సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో జుమ్మా మసీద్ స్థలం లీజుపై వక్ఫ్ బోర్డ్ చైర్మన్ జలీల్ ఖాన్ వెనక్కు తగ్గారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో జలీల్ ఖాన్ హుటాహుటిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి జుమ్మామసీద్ స్థలం లీజు టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘తాజ్’లో ప్రార్థనలకు స్థానికులకే అనుమతి
న్యూఢిల్లీ: తాజ్మహల్లోని మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు స్థానిక ముస్లింలను తప్ప ఇతర ప్రాంతాల వారిని అనుమతించొద్దని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒక్కటైన తాజ్ ఉనికికి ప్రమాదం వాటిళ్లకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇతర ప్రాంతాల వారు ఆగ్రాలో ప్రార్థనలు చేసుకోవడానికి వేరే మసీదులు ఎన్నో ఉన్నాయని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. భద్రత కారణాల దృష్ట్యా తాజ్ పరిధిలో ప్రార్థనలకు స్థానికేతరులను అనుమతించొద్దంటూ ఆగ్రా జిల్లా అదనపు మెజిస్ట్రేట్ జనవరి 24న ఆదేశాలిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. మెజిస్ట్రేట్ ఆదేశాలనే సుప్రీంకోర్టు సమర్థించింది. -
కూల్చిన మసీదు సంగతి తేల్చండి
లబ్బీపేట (విజయవాడతూర్పు): రంజాన్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం లబ్బీపేట ఈద్గా కమిటీ, ముస్లిం డెవలప్మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈదుల్ ఫితర్ నమాజు కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ముస్లింల కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెబుతుండగా ముందు విజయవాడ రామవరప్పాడులో కూల్చిన మసీదు పునర్నిర్మాణం సంగతి తేల్చాలంటూ మసీదు సంరక్షణ కమిటీ అధ్యక్షుడు నూరుద్దీన్ ముఖ్యమంత్రిని నిలదీశారు. గత పుష్కరాల సమయంలోనూ, జాతీయ రహదారి విస్తరణ సమయంలోనూ దేవాలయాలను, మసీదులను ప్రభుత్వం కూల్చివేసింది. రామవరప్పాడులో మసీదు కూల్చివేయడంపై ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సభలో ఎదురైన ప్రశ్నలతో సీఎం చంద్రబాబు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కలెక్టర్ పక్కనే ఉన్నారు.. నెలరోజుల్లో పూర్తిచేయమని ఆదేశిస్తానన్నారు. చంద్రబాబు మాటలు నమ్మని ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోలేదన్నారు. గత నవంబర్లోనూ మీరు ఇదే హామీ ఇచ్చారు? ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదంటూ నిలదీశారు. ఆ సమయంలో ముస్లింలు హర్షధ్వానాలు చేశారు. నూరుద్దున్ ఇంకా ఏదో చెప్పబోతుంటే పోలీసులు వచ్చి అతన్ని పక్కకు లాగేశారు. దీనిపట్ల పలువురు ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక రంజాన్: సీఎం రంజాన్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబం నిర్భయంగా జీవించేలా భద్రతను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కడప, విజయవాడల్లో హజ్‌హౌస్‌లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ముస్లింలకు త్వరలోనే 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, నగర మేయర్ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఈద్గా కమిటీ సభ్యులు ఎస్కే మునీర్ అహ్మద్, ఎండీఎస్ అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయేల్, జమాయతే ఇస్తామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు రఫీఖ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల పాలిట పెన్నిధి మియామిష్క్
జియాగూడ : పురానాపూల్ వంతెన వద్దగల చారిత్రాత్మకమైన మియామిష్క్ మసీదు, దర్గా ఎంతో ఖ్యాతిగాంచింది. నాటి నుంచి నేటికి యాత్రికులకు బస, విద్యార్థులకు గదులు, మదర్సా ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. చారిత్రాత్మకమైన మియామిష్క్ మసీదు, దర్గాను 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. గోల్కొండను పాలించిన అబ్దుల్లా ఇబ్రహీం కులీకుతుబ్‌షా పాలనలో సైనిక కమాండర్‌గా సేవలందించిన మియామిష్క్ నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవాడు. పాతబస్తీలోని గగన్‌పహాడ్ గుట్ట ప్రాంతం నుంచి తెప్పించిన రాయి పురానాపూల్ వంతెనకు, మియామిష్క్ మసీదు, దర్గాలకు ఉపయోగించా. ప్రస్తుతం మియామిష్క్ దర్గా, మసీదు ఆర్కియాలజీ, వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. రాతితో మసీదు నిర్మాణం.. ఇక్కడి మసీదు నిర్మాణం రాతితో చేపట్టింది. మసీదు చుట్టూ యాత్రికులు, వ్యాపారులు బస చేసేందుకు గదులు నిర్మించారు. అప్పట్లో గోల్కొండ పక్కనే ఉన్న కార్వాన్ వ్యాపార కేంద్రానికి వచ్చేవారు మసీదులోని ఈ గదుల్లో బస చేసేవారు. మసీదులో వ్యాధులను నయం చేసేందుకు ఓ రకమైన మసాజ్ చేసేవారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేడినీళ్లతో హౌజ్‌ను నిర్మించారు. హైదరాబాద్ చివరి నిజాం హయాంలో ఉన ప్రధాన కార్యదర్శి కిషన్ పర్షాద్ మహరాజ్ ఏదో వ్యాధి నిమ్తితం ఇక్కడే చికిత్స పొందాడు. మసీదు, దర్గాల మినార్లు చార్మినార్ నిర్మాణ శైలి డిజైన్‌ను పోలి ఉంటుంది. అలాగే విద్యార్థుల వసతి కోసం సుమారు 35 కు పైగా రెండేసి గదుల ఇండ్లను నిర్మించారు. అప్పట్లోనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ఇందులో ఉంటూ ఉన్నత చదువులను కొనసాగించే వారు. ఇక ప్రత్యేకంగా చిన్నారుల కోసం మదర్సాను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఖురాన్, అరబ్బీ బాషలను నేర్పించేవారు. వరద బాధితులకు సేవలందించిన మసీదు.. 1908లో మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎన్నో ఇళ్లను వరదలు ముంచెత్తగా పల్లపు ప్రాంతంలో ఉన్న మియామిష్క్ మసీదు బాధితులకు రక్షణ కల్పించింది. నీటి పరవళ్లు తగ్గే వరకు మియామిష్క్ మసీదులో వందలాది మంది ప్రజలు ఆశ్రయం పొందారు. అలాగే వరద బాధితుల కోసం కూడా ఎన్నో సేవలందించిన ఘనత ఈ మసీదుకే దక్కుతుంది. పట్టించుకోని అధికారులు.. ఎంతో చారిత్రాత్మకమైన మియామిష్క్ మసీదు, దర్గా, మదర్సా, వసతి గృహాల అభివృద్ధి కోసం పురావస్తు శాఖ విభాగం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే మసీదు పరిసర కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పలుచోట్ల మసీదు కట్టడాలు పెళ్లలు, పెచ్చులూడాయి. ఎంపీ నిధులతో మరమ్మతు పనులు.. ప్రభుత్వం మసీదు పరిరక్షణకు ఎలాంటి నిధులు, రక్షణ, భద్రత కల్పించక పోయినా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేకంగా రూ.10 లక్షలు మంజూరు చేయడంతో చిన్నపాటి మరమ్మతులు చేపడుతున్నాం. అలాగే మైనార్టీ వెల్ఫేర్ ద్వారా బాబా డాకిలా ప్రధాన ద్వారాం అభివృద్ధి, మరమ్మతుల కోసం రూ.20 లక్షలు నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఆ పనులు కూడా చేపడతాం. – సమద్ వార్సి, మియామిష్క్ మసీదు అధ్యక్షుడు -
అర్ధరాత్రి మసీదులో పెళ్లి చేసిన మత పెద్దలు
చిత్తూర్, మదనపల్లె క్రైం : పెళ్లి చేసుకుంటానని మూడేళ్లు సహజీవనం చేశాడు. ఇప్పుడు ఆమెను కాదని మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి వద్దకు చేరుకుని నిరసనకు దిగింది. స్థానికులు స్పందించి ప్రియునికి దేహశుద్ధిచేసి పెళ్లికి ఒప్పించారు. అర్ధరాత్రి సమయంలో మసీదుకు తీసుకెళ్లి మతపెద్దల సమక్షంలో పెళ్లిచేశారు. మదనపల్లె శనివారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. టూటౌన్ ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. చిత్తూరుకు చెందిన సుమియా (25) బెంగళూరులో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మదనపల్లెలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చి వెళ్లే సమయంలో చలపతిరావు కాలనీకి చెందిన జిలానీబాషా కుమారుడు బాబర్(30)తో ప్రేమలో పడింది. ఇద్దరూ బెంగళూరులో వేర్వేరు కంపెనీల్లో పనిచేస్తూ మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సుమియా ఐదుసార్లు గర్భం దాల్చింది. బాబర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఆ ఆధారాలను సుమియా జాగ్రత్తగా భద్రపరచుకుంది. ఇంతలో బాబర్‌కు పెద్దలు మరో అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న సుమియా తాను మోసపోయానని భావించింది. చావోరేవో తేల్చుకోవాలని నిర్ణయించుకుని శనివారం సాయంత్రం మదనపల్లెకు వచ్చింది. ప్రియుడు చలపతిరావు కాలనీలో ఉన్నాడని తెలుసుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో అతని ఇంటి వద్దకు చేరుకుంది. సుమియా రాకను గమనించిన బాబర్ అక్కడి నుంచి జారుకున్నాడు. ఆమె ప్రియుని ఇంటి వద్దే భైఠాయించి నిరసనకు దిగింది. స్థానికులు గమనించి ఆమెను విచారించడంతో బాబర్ అసలు రంగు బయటపడింది. దీంతో సహనం కోల్పోయిన స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే స్థానికులు ఆమెతో బాబర్‌ను పెళ్లికి ఒప్పించారు. ఇద్దరినీ స్థానిక బెంగళూరు బస్టాండులోని పెద్ద మసీదు వద్దకు తీసుకెళ్లారు. మత పెద్దలతో చర్చించి అర్ధరాత్రి పెళ్లి చేయించారు. దీంతో వివాదం సద్దు మణిగింది. -
పెళ్లి రోజే వరుడు పరారీ
యాకుత్‌పురా:కొన్ని గంటల్లో పెళ్లి జరుగుతుండగా పెళ్లి కొడుకు పరారైన సంఘటన మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ గౌస్ కుమార్తె హసినా ఫాతిమాకు, ఆసిఫ్‌నగర్ జిర్రా ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్‌తో వివాహం కుదిరింది. ఈ నెల 29న నాంపల్లిలోని ఓ మసీద్‌లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేగాక ఒప్పందం ప్రకారం పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కట్నకానుకలను అందజేశారు.అయితే గురువారం పెళ్లి కుమారుడు షరీఫ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన వధువు కుటుంబ సభ్యులు మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షరీఫ్ కుటుంబ సభ్యులకు 15 తులాల బంగారు ఆభరణాలు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులను ముందుగానే అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రాహుల్ పై అసదుద్దీన్ మాటల తూటాలు..
సాక్షి, హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని మాటల తుటాలు పేల్చారు. రాహుల్‌కి మసీదులు, ముస్లింలు కంటపడారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో దేవాలయాలకు క్యూ కట్టిన రాహుల్ తాజాగా మళ్లీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘‘ రాహుల్ జీ.. మీకు గుళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? మసీదులు, ముస్లిం ప్రజలు కంటపడటం లేదా? వాటిని ఎందుకు పట్టించుకోవటం లేదు?’’ అని ఒవైసీ రాహుల్‌ను ప్రశ్నించారు. కేవలం మత రాజకీయాలతోనే పార్టీలు లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కూడా ముస్లిం ప్రజల హామీల గురించి ప్రస్తావించలేదని.. ఇలా ఎన్నికల్లో గెలవటం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటమేనని ఒవైసీ చెప్పారు. ఇక నిన్న రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు. ‘‘పార్టీకో రంగును పులుముని మత రాజకీయాలు చేస్తున్నాయ్. అవి తల్చుకుంటే ఏం చేయలేవ్. అదే మేం తల్చుకుంటే ఎంతకైనా తెగిస్తాం. ఆ దెబ్బకి మోదీ, కాంగ్రెస్.. ఇలా ఏవీ పనికి రాకుండా పోతాయ్’’ అని ఒవైసీ హెచ్చరించారు. -
మసీదుపై బాంబుదాడి..
అబూజ(నైజీరియా): నైజీరియాలోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మైదుగురిలోని ఓ మసీదుపై సోమవారం జరిగిన బాంబుదాడిలో పది మంది చనిపోయారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు పదార్థాలు ధరించిన ఓ గుర్తు తెలియని మహిళ ప్రవేశించి తనను తాను పేల్చేసుకుంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. వారంలోనే నగరంలో ఇది అయిదో దాడి కావటం గమనార్హం. ఈనెల 14వ తేదీన మహిళా ఆత్మహుతి బాంబర్ దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు. -
మనస్తాపంతో ఆత్మహత్య
తాడిపత్రి : తాడిపత్రిలోని రోజా మసీదు సమీపంలో రఫీ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ఆందజనేయులు తెలిపారు. అమ్మానాన్నలు మృతి చెందడంతో పిన్ని షాహీన వద్ద ఉంటున్న అతను ఏ పనీపాట లేకుండా జులాయిగా తిరిగేవాడన్నారు. దీంతో ఆమె మందలించడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
నేడు రాష్ట్ర వ్యాప్తంగా దావత్-ఎ-ఇఫ్తార్
-
ఐఎస్ నరమేథం
మూడు ఖండాలూ, నాలుగు దేశాలూ... ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల ఆగడానికి శుక్రవారం 200 మందికి పైగా పౌరులు బలయ్యారు. టునీసియాలో పర్యాటకులు సేద తీరుతున్న బీచ్‌లో సాయుధుడు చొరబడి 38మందిని కాల్చి చంపాడు. కువైట్‌లోని మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడి 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. సిరియాలో ఒక పట్టణంలోకి ప్రవేశిం చిన మిలిటెంట్లు విచ్చలవిడిగా దాడిచేసి 146మందిని చంపేశారు. ఫ్రాన్స్‌లోని ఒక ఫ్యాక్టరీలో ఉగ్రవాది ఒకరి తల నరికి చంపడంతోపాటు ఆత్మాహుతికి ప్రయత్నిం చాడు. అతన్ని సకాలంలో నిర్బంధించకపోయి ఉంటే ఫ్యాక్టరీ మొత్తం అగ్నిగుం డమై భారీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించేది. ఈ ఉదంతాలన్నీ ఐఎస్ విస్తృతినీ, దాని ప్రమాదకర పోకడలనూ తెలియ జెబుతున్నాయి. ఈ దేశాలన్నీ ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, యూరప్ ఖండాల్లో ఉన్నాయి. ఇన్నిచోట్లా ఒక ఉగ్రవాద సంస్థ ఏకకాలంలో దాడికి పాల్పడగలగడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇతర ఉగ్రవాద సంస్థల్లాగే ఐఎస్ సంస్థాగతమైన నిర్మాణం ఏమీ లేదు. అది కేవలం ఇంటర్నెట్ మాధ్యమాన్ని ఆసరా చేసుకుని వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూ తన సిద్ధాంతాలను నూరిపోసే సంస్థ. ఎంత మంది వద్దకు అది చేరువవుతున్నదోగానీ వ్యక్తులుగా కొంతమందినైతే లోబరు చుకోగలుగుతున్నది. వారిని ఆత్మాహుతి దాడులకూ, ఇతర విధ్వంసకర చర్యలకూ పురిగొల్పుతున్నది. దాడులు జరిగేవరకూ వారి అసలు స్వరూపం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడగలుగుతున్నది. ఒక గ్రూపుగా విధ్వంసకర చర్యలకు పాల్పడేవారి ఆనుపానులు తెలుసుకోవడం ఒకసారి కాకపోతే ఒకసారైనా భద్రతా బలగాలకు సాధ్యమవుతుంది. కొంతమంది కలిసిచేసే పని గనుక ఎక్కడో అక్కడ విషయం వెల్లడవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక్కరిగా దాడులకు పథకరచన చేసి అమలు పరిచేవారిని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ఆ బలహీనమైన స్థితిని ఐఎస్ వినియోగించుకుంటోంది. ఇలా వేర్వేరు దేశాల్లో ఒక్కొక్కరే దాడులకు దిగేలా చేయడంతోపాటు ఆ దాడులన్నీ ఒకే రోజు జరిగేలా చూడటంలో ఐఎస్ సాధించిన సమన్వయం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. టునీసియాలో 38 మందిని పొట్టనబెట్టుకుని భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో హతుడైన 23 ఏళ్ల సీఫిద్దీన్ రెజ్గూ ఇలాంటి ఉన్మాదిగా మారాడని ఘటన జరిగేవరకూ తెలియదని అతని ఇరుగు పొరుగువారు మాత్రమే కాదు... తల్లిదండ్రులూ, తోబుట్టువులూ కూడా చెబుతున్నారు. వాస్తవానికి అతను ఇంజనీరింగ్ చదివినా ఇంటర్నెట్తో నిత్యమూ అంటిపెట్టుకుని ఉండేంత తీరికగల జీవితం కాదు. తండ్రి రోజు కూలీ చేసి సంపాదిస్తున్నవాడు. అలాంటి యువకుణ్ణి ఉగ్రవాదిగా మార్చడమే కాదు...ఆ సంగతి బయటపడకుండా అత్యంత గోప్యంగా ఉండేలా ఐఎస్ చూడగలిగింది. టునీసియాలో ఈ దాడి జరిగిన సిలియానా ప్రాంతంలో ఉగ్రవాద గ్రూపుల కదలికలు లేవు. దానికి అటూ, ఇటూ ఉన్న కెఫ్, కసెరీన్ ప్రాంతాలు గత రెండున్నరేళ్లుగా ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. అక్కడ వివిధ ఉగ్రవాద గ్రూపుల మధ్య ఘర్షణలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా బలగాల దృష్టంతా ఆ రెండు ప్రాంతాలపైనా ఉండగా సిలియానాలో ఒక సాధారణ యువకుడు ఇలా ఉన్మాద రూపమెత్తడం ఆశ్చర్యం కలిగించే అంశం. టునీసియాలో మూడు నెలలక్రితం ఒక మ్యూజియంపై దాడిచేసి ఉగ్రవాదులు 22మందిని హత మార్చారు. ఈ రెండు దాడుల్లోనూ ఉగ్రవాదుల లక్ష్యం బ్రిటన్ పౌరులే! టునీసియా నుంచి వెళ్లిన దాదాపు 3,000 మంది యువకులు ఇరాక్, సిరియా, లిబియాల్లో సాగుతున్న ఘర్షణల్లో పాల్గొంటున్నారు. వీరిలో వెనక్కొచ్చిన యువకులు కొందరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నాలుగేళ్లక్రితం అరబ్ దేశాల్లోని నియంతలకు కంటిమీద కునుకులేకుండా చేసిన ప్రజాస్వామిక ఉద్యమానికి పుట్టినిల్లయిన టునీసియా నిరుడు జరిగిన ఎన్నికల్లో ఛాందసవాదులను కాదని సెక్యులర్ విలువలకు కట్టుబడ్డ పార్టీలను ఎన్నుకుంది. టునీసియాకు ప్రధాన ఆదాయ వనరైన టూరిజంను దెబ్బతీయడంతో పాటు తమపై దాడులకు పాల్పడుతున్న పాశ్చాత్య దేశాలకు గుణపాఠం నేర్పడం...అదే సమయంలో తనకు పోటీగా ఉన్న అల్ కాయిదా సంస్థ ప్రభావాన్ని తగ్గించడం ఐఎస్ ఉద్దేశంలా కనబడుతోంది. మతిలేని తన దాడుల ద్వారా షియా, సున్నీ తెగలమధ్య ఘర్షణలు సృష్టించడం...తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కూడా ఐఎస్ దాడుల లక్ష్యం. ఐఎస్ సారథ్యం సున్నీ తెగకు చెందినవారిదే అయినా ఆ తెగలోని సాధారణ పౌరులు ఇలాంటి హింసాత్మక ఘటనలను సమర్ధించరు. ఆ రెండు తెగలకు చెందినవారూ అన్ని దేశాల్లోనూ సఖ్యతతో మెలగుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడటం ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని భావిస్తు న్నారు. ఇలాంటి సామరస్య భావనకు తూట్లు పొడవడమే లక్ష్యంగా కువైట్ మసీదు లో ఐఎస్ దాడిచేసింది. ఇందువల్ల కువైట్‌లో తన వర్గాన్ని పెంచుకోవచ్చునను కుంటున్నది. టునీసియాలో దాడి జరిగిన రోజునే ఫ్రాన్స్‌లోనూ ఐఎస్ అచ్చం అదే తరహా దాడికి పథకరచన చేసింది. లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చి ఆ దేశాన్ని వల్లకాడుగా మార్చడంలో ఫ్రాన్స్ అమెరికాతో చేతులు కలిపి పనిచేసినా మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే అది అమెరికాను గుడ్డిగా అనుసరించే దేశం కాదు. మొన్న జనవరిలో చార్లీహెబ్డో పత్రికపై ఐఎస్ ఉగ్రవాదులు దాడి జరిపి 12 మందిని కాల్చిచంపాక ఆ దేశం ఐఎస్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంది. ఇది కూడా ఐఎస్‌కు ఆగ్రహం కలిగించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భద్రతా పరంగా తీసుకునే చర్యలతోపాటు ఆయా దేశాల్ల్లో పేదరికం, నిరుద్యోగం వంటివి అరికట్టడానికి కృషి జరగాలి. అంతేకాదు... అమెరికా, పాశ్చాత్య దేశాలు తాము అనుసరిస్తున్న విధానాలను సవరించుకోవాలి. లిబియాలోనైనా, సిరియా లోనైనా ఆ దేశాల విధానాల ఫలితమే ఇప్పుడు ఐఎస్ ఆవిర్భావానికి తోడ్పడ్డా యని మరిచిపో కూడదు. అలాగే మొన్న అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై జరిగిన దాడిగానీ, ఇప్పుడు కువైట్‌లో జరిగిన దాడిగాని మన దేశానికి కూడా హెచ్చరి కలవంటివే. తగినంత అప్రమత్తతతో మెలగాల్సిన అవసరాన్ని ఈ దాడులు తెలియజెబుతున్నాయి. -
నాలుగు దేశాలపై ఉగ్ర పంజా
హింసే తమ మతమని ఉగ్రవాదులు మరోసారి చాటుకున్నారు! ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలోనూ రక్తపుటేర్లు పారించారు. కువైట్, టునీసియా, సిరియా, ఫ్రాన్స్‌లలో అమాయకులను బలిగొన్నారు. కువైట్‌లో ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)కు చెందిన ఓ ఉగ్రవాది శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిపి 25 మందిని చంపేశాడు. టునీసియాలోని ఓ బీచ్‌లో మరో ముష్కరుడు పర్యాటకులపై తూటాలు కురిపించి 28 మంది ప్రాణాలు తీశాడు. ఫ్రాన్స్‌లో ఇంకో ఉగ్రవాది ఓ ఫ్యాక్టరీపై దాడి చేసి, ఒక వ్యక్తిని అత్యంత కిరాతకంగా తల నరికేశాడు. ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించి రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు. ఇక నిత్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న సిరియాలో రక్తం రుచి మరిగిన ఐఎస్ ముష్కరులు 146 మందిని హత్య చేశారు. ఈ ఉగ్రవాద చర్యలను ప్రధాని నరేంద్రమోదీతోపాటు పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. కువైట్ మసీదులో ఐఎస్ ఆత్మాహుతి దాడి 25 మంది మృతి.. 200 మందికి గాయాలు కువైట్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు కువైట్‌లో పేట్రేగిపోయారు. షియాల మసీదులో ఆత్మాహుతి దాడికి పాల్పడి 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. నగరంలోని అల్-ఇమామ్ అల్-సాదిక్ మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఐఎస్ ఈ ఘాతుకానికి తెగబడింది. దాడికి పాల్పడింది తామేనని, అబు సులేమాన్ అల్-మువాహిద్ అనే మిలిటెంట్ ఆత్మాహుతి దాడి చేసినట్లు ప్రకటించుకుంది. ఈ మసీదులో సున్నీ ముస్లింలకు షియా బోధనలు చేస్తున్నారని, అందుకే దాడి చేసినట్లు ఐఎస్ అనుబంధ సంస్థ నజ్ద్ ప్రావిన్స్ తెలిపింది. 2006 తర్వాత కువైట్‌లో ఉగ్రవాద దాడి చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 25 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయాలపాలైనట్లు ప్రభుత్వ వర్గాలు వె ల్లడించాయి. టునీసియా బీచ్‌లో కాల్పులు 28 మంది మృతి టునిస్: ఉత్తరాఫ్రికా దేశమైన టునీసియాలోని ఒక బీచ్ రిసార్ట్‌లో పర్యాటకులపై ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 28 మందికి పైగా మరణించారు. అది ఉగ్రవాద దాడిగా అధికారులు నిర్ధారించారు. దేశ రాజధాని టునిస్కు 140 కిమీల దూరంలో ఉన్న సౌస్సెలోని సముద్ర తీరంలో ఉన్న రిసార్ట్ మర్హబాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారన్న టునీసియా ప్రభుత్వం.. వారి వివరాలను వెల్లడించలేదు. ఇది ఉగ్రవాద దాడేనని, ఆ ఉగ్రవాదిని భద్రతాదళాలు హతమార్చాయని హోంశాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఫ్రాన్స్ ఫ్యాక్టరీలో శిరచ్ఛేదం సెయింట్-క్వెంటిన్-ఫలవీర్: ఫ్రాన్స్‌లోని ఓ చిన్నపట్టణంలో అనుమానిత ఉగ్రవాది శుక్రవారం పట్టపగలు బీభత్సం సృష్టించాడు. ఓ గ్యాస్ ఫ్యాక్టరీపై దాడి చేసి ఒకరి తల నరికి, ఆ తలను ఫ్యాక్టరీ గేటుకు తగిలించాడు. అతడు జరిపిన పేలుళ్లలో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. లియోన్ నగరానికి 40 కి.మీ. దూరంలోని సెయింట్-క్వెంటిన్-ఫలవీర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అమెరికా కంపెనీ ఎయిర్ ప్రొడక్ట్స్‌కు చెందిన ఫ్యాక్టరీలోకి దుండగుడు వాహనంలో దూసుకొచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ తెలిపారు. శిరచ్ఛేదానికి గురైన వ్యక్తి మృతదేహం వద్ద అరబిక్ అక్షరాల జెండా కనిపించింది. అది ఇస్లామిక్ స్టేట్దని వార్తలొచ్చాయి. నిందితుడిని యాసిన్ సల్హీ(35)గా గుర్తించారు. అతని భార్యనూ అరెస్ట్ చేశారు. సిరియాలో ఐఎస్ నరమేధం 146 మంది పౌరుల బలి బీరట్: సిరియాలో జిహాదీలు మారణహోమం సృష్టించారు.146 మందిని హత్య చేశారు. కొబేన్ప్రాంతంలోని బీరట్‌లో ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ సిరియా(ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు శుక్రవారం పట్టణంలోకి ప్రవేశించి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారు. సమీప గ్రామంలో మరో 26 మందిని చంపేశారు. గత కొన్నివారాలుగా కుర్దీష్ మిలటరీ చేపట్టిన చర్యలకు ప్రతీకారంగా జిహాదీలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. గురువారం జిహాదీలకు చెందిన ముగ్గురు వాహనాల్లో దూసుకొచ్చి బీరట్ పట్టణ ప్రవేశమార్గంలో బాంబులతో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నారు. మృతదేహాలు ఇళ్లల్లో, వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో బీరట్‌లో 120 మంది, సమీపంలోని గ్రామంలో మరో 26 మంది పౌరులను ఐఎస్‌కు చెందిన తీవ్రవాదులు హత్య చేశారని సిరియా మానవ హక్కుల పరిశీలక బృందం డెరైక్టర్ రమీ అబ్దెల్ రహమాన్ తెలిపారు. కుబేన్లోని ప్రతి కుటుంబమూ ఒక వ్యక్తిని ఈ మారణహోమంలో కోల్పోయింది. వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని టర్కీ సరిహద్దు ప్రాంతాల్లోకి పారిపోయారు. -
కాసుల వక్ఫ్ భూములు
సాక్షి, ఖమ్మం: ఒకప్పుడు మసీదులకు ఆదాయ వనరులుగా ఉన్న వక్ఫ్ భూములు నేడు అన్యాక్రాంతమయ్యాయి. బహిరంగ మార్కెట్లో ఈ భూములకు రూ.కోట్లు పలుకుతుండటంతో వీటిపై కబ్జాదారుల కన్నుపడింది. అధికారులు, మసీదు సంరక్షకుల చేయి తడిపి అందినకాడికి కాజేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల్లో వందలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యా యి. ఇవి వక్ఫ్ భూములని తెలిసి కూడా అధికారులు కబ్జాదారులకు సహకరించి యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తుండటం గమనార్హం. వక్ఫ్‌భూములు మసీదుల అభివృద్ధికి ఆదాయ వనరుగా ఉండాలి. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏటా ఆయా మసీదు కమిటీల పేరున బ్యాంకు ఖాతాలో జమ చేసి ఖర్చు చేయాలి. కానీ ఈ పరిస్థితి మారిపోయింది. ఇవి ప్రభుత్వ భూములైనా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చూస్తే రూ.కోట్లు పలుకుతున్నాయి. ఖమ్మం నగ రం, పాల్వంచ, బూర్గంపహాడ్, వేంసూరు, కల్లూరు, బోనకల్, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ , కొణిజర్ల, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో విలువైన వక్ఫ్ భూములున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములను క్రయవిక్రయాలు చేయకూడదు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి. అయితే జిల్లాలో రెవెన్యూ రికార్డుల ప్రకారం వక్ఫ్ భూములు వందల ఎకరాలు ఉన్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడ అన్యాక్రాం తమయ్యాయి. ముతావలి(సంరక్షకులు)లు ఈ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో ఖమ్మం నగరం, ప్రధాన పట్టణాల్లో ఉన్న వక్ఫ్ భూములకు ధర పెరిగింది. సంరక్షకులుగాా ఉన్న వీరు కబ్జాదారుల మాయలో చిక్కుకుని ఈ భూములను వారికి దొడ్డిదారిన అమ్మేస్తున్నారు. కాసుల భూములు..: ఖమ్మం నగరంలో గత పదిహేనేళ్లలో 170 ఎకరాలకు పైగా వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఖమ్మం నగరం కార్పొరేషన్‌గా అవతరించి భూముల ధరలు పెరగడంతో ఇంకా ఈ ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. నగరంలోని జామామసీదు, ముస్తఫానగర్, గొల్లగూడెం, మున్నేరు నది సమీపం, బుర్హాన్‌పురం, ఖజాయిత్, షాహిద్ దర్గా ప్రాం తం, ఓల్డ్ క్లబ్, కస్పాబజార్ సమీపంలో ఈ భూములను ఆక్రమించడంతోపాటు రిజిస్ట్రేషన్లు చేసుకుని పెద్దపెద్ద భవనాలే నిర్మిం చారు. వీటికి కార్పొరేషన్ నుంచి కూడా అన్ని అనుమతులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ముతావలీలు మారుతుండటంతో వీరంతా ఈ భూములను అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు వినపడుతున్నాయి. అలాగే వైరా, ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, మధిర మం డలం మాటూరు, కొణిజర్ల మండలం అమ్మపాలెంలో కూడా ఈ భూములను ఆక్రమిం చారు. బోనకల్ మండలం నాగులవంచ, వేంసూరు రెవెన్యూ పరిధిలో, పాల్వంచ, ఎర్రుపాలెం మండలం రెమిడిచర్ల, బూర్గం పాడు మండలం నాగినేనిప్రోలులో కబ్జాలు యథేచ్ఛగా సాగాయి. అధికారుల కన్నుసన్నల్లోనే... మండలస్థాయిలో మసీదుల ఆధ్వర్యంలో ఉన్న వక్ఫ్ భూములకు ముతావలిలు సంరక్షకులు. ఇక అవి కబ్జాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంది. మసీదుల భూములను కబ్జా చేస్తున్నారని కొంతమంది మత పెద్దలు మండల, జిల్లాస్థాయి అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం శూన్యం. ఈ భూములకు స్థానిక అధికారులే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇస్తుండటంతో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అధికారులకు ముడుపులు ముట్టచెబుతుండటంతో తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జాదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. కబ్జా అవుతున్నట్లు ఇచ్చే ఫిర్యాదులపై కొంతమంది అధికారులు స్పందిస్తూ క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లినా ముతావలిలు వీరిని బురిడీ కొట్టిస్తున్నట్లు సమాచారం. ఎస్పీకి ఫిర్యాదు..: వేంసూరు గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.లక్షల విలువ చేసే మసీదు భూములు ఆక్రమణలో ఉన్నాయని, వీటిని రక్షించాలని కోరుతూ గ్రామానికి చెందిన కొంతమంది ముస్లింలు ఇటీవల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గ్రామ రెవెన్యూ పరిధిలో 70 ఎకరాల వరకు వక్ఫ్ భూములున్నాయి. ఇందులో 10 ఎకరాల వరకు ఆక్రమణకు గురైనట్లు వారు ఎస్పీకి వివరించారు. అంతేకాకుండా ఉన్న భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని మసీదు అభివృద్ధికి వెచ్చించకుండా ముతావలిల వారసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణలో ఉన్న భూములపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఎస్పీకి అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.