దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులెవరనేది తెలియాల్సి ఉంది. వారంలోనే నగరంలో ఇది అయిదో దాడి కావటం గమనార్హం. ఈనెల 14వ తేదీన మహిళా ఆత్మహుతి బాంబర్ దాడిలో 19 మంది మృత్యువాతపడ్డారు.
మసీదుపై బాంబుదాడి..
Published Mon, Jul 17 2017 6:07 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
అబూజ(నైజీరియా): నైజీరియాలోని తీవ్రవాద ప్రాబల్య ప్రాంతం మైదుగురిలోని ఓ మసీదుపై సోమవారం జరిగిన బాంబుదాడిలో పది మంది చనిపోయారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా పేలుడు పదార్థాలు ధరించిన ఓ గుర్తు తెలియని మహిళ ప్రవేశించి తనను తాను పేల్చేసుకుంది.

Advertisement
Advertisement