9 ఏళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేసిన వ్యక్తి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌ | Video Viral: Man Throws 9 Year old Girl To Gground in Kerala Kasaragod | Sakshi
Sakshi News home page

9 ఏళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేసిన వ్యక్తి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్‌

Published Fri, Nov 18 2022 8:12 PM | Last Updated on Fri, Nov 18 2022 8:24 PM

Video Viral: Man Throws 9 Year old Girl To Gground in Kerala Kasaragod - Sakshi

తిరువనంతపురం: కేరళలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. మైనర్‌ బాలికపై 30 ఏళ్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. కాసర్‌గడ్‌ జిల్లాలోని మంజేశ్వర్‌లో చోటుచేసుకుంది. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది.  ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేశాడు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించిన అతనికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడు ఉధ్యవరం నివాసి అబూబకర్ సిద్దిక్ (30)గా గుర్తించారు.
చదవండి: పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement