Waqf
-
వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం!
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్ సీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్ సీపీపై సోషల్ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ.. ఆది నుంచి అదే విధానంవక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్ సీపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సీఎం నితీష్ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.2) రెండో సవరణ కింద.. వక్ఫ్ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్ ర్యాంకింగ్ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్ అబ్బాస్ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా?? -
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది: అంబటి రాంబాబు
-
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ నిరసనకు దిగాయి ముస్లిం సంఘాలు. .‘వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళలన్నీ జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోని జరిగినట్లు జాతీయ న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ తెలిపింది.Bengal: Muslim outfits protest against Waqf Amendment Bill in KolkataRead @ANI Story | https://t.co/JTMcg1k79U#WaqfAmendmentBill #Kolkata pic.twitter.com/iCkDlnuYFp— ANI Digital (@ani_digital) April 4, 2025 అహ్మదాబాద్‌లో తీవ్రరూపం#WATCH | Ahmedabad: Various Muslim organisations hold protests against the Waqf Amendment Bill. pic.twitter.com/viavsuqf3D— ANI (@ANI) April 4, 2025వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.తమినాడు వ్యాప్తంగా విజయ్ తమిళగ వెట్రి కజగం నిరసనచెన్నైలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి, అక్కడ ఇటీవలే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. చెన్నై కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ముస్లింల హక్కులను హరించవద్దు అంటూ నిరసన వ్యక్తమైంది.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.#WATCH | West Bengal: Members of the Muslim community take to the streets in Kolkata to protest against the Waqf Amendment Bill. pic.twitter.com/pKZrIVAYlz— ANI (@ANI) April 4, 2025 దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే -
Merugu Nagarjuna: మైనార్టీలకు తీరని అన్యాయం
-
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, ఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వక్ఫ్ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో ఆయన సవాల్ చేశారు. వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధమని.. వక్ఫ్ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఈ వివాదాస్పద బిల్లు ఆమోదం పొందడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే. -
మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మైనార్టీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. అబద్ధాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదని మండిపడ్డారు. ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబుకు అలవాటే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి మేరుగు నాగార్జున తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్సీపీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. టీడీపీ, ఆ పార్టీ అనుకూల సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాం. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగం అందరూ చూడండి. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లుకు మేం వ్యతిరేకిస్తున్నామని వైఎస్ అనేక సార్లు చెప్పారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభ, రాజ్యసభలో ఓటేశాం. ఏరుదాటాక తెప్ప తగలేయడం చంద్రబాబు అలవాటు. మైనార్టీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. ఎన్నికల్లో వాడుకున్నాడు ఇప్పుడు వదిలేశాడు. మైనార్టీలకు అన్యాయం జరిగితే అంగీకరించనని ఎన్నికల సమయంలో చెప్పారు. గుంటూరు జిల్లా ఎంపీ మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామా చేస్తామన్నారు. అందరూ కలిసి మైనార్టీలకు ద్రోహం చేశారు. టీడీపీ, చంద్రబాబు చేసిన మోసంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. దీన్ని తప్పించుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు.వైఎస్సార్సీపీ రాజ్యసభలో విప్ జారీ చేయలేదని.. బిల్లుకు అనుకూలంగా ఓటేసిందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా ఈ ఫేక్ న్యూస్‌ను నడుపుతున్నారు. అబద్ధాలు, అవాస్తవాలు లేకపోతే చంద్రబాబు రాజకీయమే లేదు. చంద్రబాబు చెబుతాడు.. ఆయన సానుభూతి పరులు ప్రచురిస్తుంటారు. ఎన్టీఆర్ వెన్నుపోటు దగ్గర్నుంచి అప్పుల వరకూ చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పులున్నాయని ప్రచారం చేశారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులున్నాయంటాడు. కానీ, వేటికీ ఆధారాలు చూపించరు. 5 లక్షల 62 కోట్ల రూపాయల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది. పీ-లో భాగంగా పేదలను సంపన్నులను చేస్తానని మభ్యపెడుతున్నాడు. రాష్ట్రంలో పేదలు ఎంత మంది?. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేవారెందరో ప్రజలకు అర్ధమయ్యేట్లు చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో కోటి 61 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. ఈ రాష్ట్రంలో ఇన్ కమ్ ట్యాక్స్ కట్టేది 8 లక్షల 60 వేల కుటుంబాలు మాత్రమే. చంద్రబాబు చేసిన మోసానికి యావత్ ముస్లిం, నార్టీ లోకం రగిలిపోతోంది. వైఎస్ జగన్ మీద మరక వేయాలని చంద్రబాబు చూస్తున్నాడు. మీరు ఎంత బురద జల్లినా జగన్ కడిగిన ముత్యంలా బయటపడతాడు. తస్మాత్ చంద్రబాబు.. ప్రజలే నీకు బుద్ధి చెబుతారు అంటూ’ ఘాటు విమర్శలు చేశారు. -
వక్ఫ్ బిల్లు రాజ్యాంగంపై దాడే
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు భారత రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమేనని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. సమాజాన్ని శాశ్వతంగా విభజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో ఇది భాగమన్నారు. లోక్‌సభలో బిల్లును ఆదరాబాదరగా ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. సంవిధాన్ సదన్‌లో గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా తమ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఒక దేశం– ఒకే ఎన్నిక బిల్లు కూడా రాజ్యాంగ విద్రోహమన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభలో హడావుడిగా ఆమెదింపజేసుకున్నారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి సుస్పష్టం. ఇది రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి చేయడమే. సమాజాన్ని ఎప్పటికీ విభిజించి ఉంచాలనే బీజేపీ వ్యూహంలో భాగమే’ అని సోనియా పేర్కొన్నారు. విపక్షాల సవరణలను మూజువాణి ఓటుతో తిరస్కరించాక, వక్ఫ్ బిల్లును బుధవారం అర్ధరాత్రి లోక్‌సభ 288–232తో ఆమోదించిన విషయం విదితమే. మహిళా రిజర్వేషన్ బిల్లును రెండేళ్ల కిత్రమే ఇరుసభలు ఆమోదించాయని, దాన్ని తక్షణం అమలులోకి తేవాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను బీజేపీ ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పైనా బీజేపీ శీతకన్ను వేస్తోందన్నారు. -
వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25, 26లను ఉల్లంఘించడం ద్వారా ముస్లింల ప్రాథమిక హక్కులను హరించి వేస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వడం అనేది ఆర్టికల్ 25, 26లను ఉల్లంఘించడమేనని చెప్పారు. ఈ నూతన బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరించి వేయడమే కాక, వార్షిక సహకారం 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల వక్ఫ్ బోర్డులను ఆర్థికంగా దెబ్బ తీస్తుందన్నారు. అందువల్ల వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దీనిని కేవలం వక్ఫ్ భూములకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడరాదని, ఇది ముస్లింల మనోభావాలు, వారి ధార్మిక నమ్మకాలతో పాటు పలు అంశాలను దెబ్బతీసే అంశంగా చూడాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్సీపీ సహా అనేక ముస్లిం సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన వైఎస్సార్సీపీ తరఫున దానిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆలిండియా ముస్లిం లా బోర్డ్, జమైత్ ఉల్ ఉలేమా, జమైత్ ఇస్లాం ఎ హింద్ సహా అనేక మైనార్టీ సంస్థలు అనేక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తం చేశాయన్నారు.వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో టీడీపీ విఫలంముస్లింలకు రాజ్యాంగంలో కల్పించిన ఆస్తి హక్కుతో పాటు ధార్మిక అంశాల్లో వారి స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని, మోసం చేసిందని విమర్శించారు. సంస్కరణ అనేది స్వాగతించే అంశమే అయినప్పటికీ మైనార్టీల రక్షణ అనేది చాలా ముఖ్యమని చెప్పారు. దేశంలో 4 వేల సంవత్సరాల నుంచి ఉన్న వక్ఫ్ ప్రాథమిక భావనను ఈ నూతన బిల్లు పూర్తిగా నాశనం చేస్తోందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో సైతం వైఎస్సార్సీపీ తన అభ్యంతరాలను తెలియచేయడమే కాకుండా, రాష్ట్రంలోని ముస్లింలకు అండగా నిలబడిందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డు పేరును మార్చడంతో పాటు బిల్లులోని సెక్షన్ 9, 14 ప్రకారం ముస్లిమేతరులను బోర్డులోకి చేర్చడం పూర్తిగా అసంబద్ధమని అన్నారు. ఈ బిల్లు వక్ఫ్ బోర్డు ఆర్థిక స్వాతంత్య్రాన్ని పూర్తిగా దెబ్బ తీస్తుందని చెప్పారు.వక్ఫ్ బోర్డులో ఇతర మతాల వాళ్లా?మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్ధుల్ హఫీజ్‌ఖాన్ ఆగ్రహంకర్నూలు (టౌన్): వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లిం సమాజాన్ని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని, ఇది చరిత్రలో మచ్చగా నిలిచి పోతుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్ హఫీజ్‌ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం ల విషయంలో చంద్రబాబుకు ఉన్న వ్యతిరేకత ఈ బిల్లు విషయంలో మరోసారి బయట పడిందన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమాతే ఉలేమా, జమాతే ఇస్లామిక్ హింద్, సునతుల్ జమాతే వంటి సంస్థలు ఈ బిల్లును వ్యతిరేకించాయని, దీని వల్ల మైనార్టీలు నష్టపోతారన్నారు. వక్ఫ్ భూములపై కలెక్టర్‌కు అధికారం ఇస్తే ప్రభుత్వం చెప్పినట్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. దీని వల్ల మైనార్టీకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డులో మాత్రం ఇతర మతాల వారిని పెట్టి నామినేటేడ్ పదవులను కేటాయించాలని చూస్తుండటం దారుణమని నిప్పులు చెరిగారు.మైనార్టీలకు చంద్రబాబు ద్రోహంమాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ధ్వజంకడప కార్పొరేషన్: వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని, చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల్లో ముస్లింలను వాడుకుని, ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ సవరణ చట్టానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నాయని చెప్పారు.మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రెండు పార్టీలు వాడుకున్నాయని ధ్వజమెత్తారు. బిల్లును వ్యతిరేకించాలని ఎందరో ముస్లిం మత పెద్దలు చంద్రబాబుకు విన్నవించగా, అండగా ఉంటానని హామీ ఇచ్చారని చెప్పారు. తీరా ఆ బిల్లుకు మద్దతు పలికి మైనారిటీలను తీవ్రంగా వంచించారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం అయ్యాక మైనారిటీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. -
మైనార్టీలు టీడీపీని వీడాలి
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన టీడీపీపై రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలలో తీవ్ర ఆగ్రహం వ్యకమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందులను బహిష్కరించిన ముస్లిం సంఘాలు తాజా పరిణామాలతో టీడీపీని బాయ్‌కట్ చేయాలని నిర్ణయించాయి. ఇందుకు సంబంధించి బుధ, గురువారాల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి కీలక ముస్లిం సంఘాలు దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.లౌకిక పార్టీగా చెప్పుకొనే టీడీపీ.. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి లౌకికవాదానికి చెల్లుచీటి రాసిందని ముస్లింలు మండిపడుతున్నారు. టీడీపీలోని ముస్లిం నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయాలని, ముస్లిం సమాజం టీడీపీని బాయ్‌కట్ చేయాలనే డిమాండ్ బలం పుంజుకుంది.ఉమీద్ పే ‘ఉమ్మీద్’ నహీ హై వక్ఫ్ యాక్ట్–1995ను సవరించిన కేంద్ర ప్రభుత్వం ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్ ఏఫీషియన్సీ అండ్ డెవలప్మెంట్ – ఉమీద్(యుఎంఈఈడి)గా మార్చింది. ఉమీద్పై ముస్లిం సమాజానికి ఉమ్మీద్ నహీ హై (నమ్మకం లేదు). ఇది మత స్వేచ్ఛపై దాడి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను ఉల్లంఘిస్తోంది.దేశంలో ఏ ఇతర మతాలకు వర్తించని నిబంధనలు ముస్లింలకు మాత్రం పెట్టడం దారుణం. దీనిపై రాజ్యాంగ పరిధిలో పోరాటం చేస్తాం. పూర్వీకులు ఇచ్చిన వక్ఫ్ (అల్లాహ్ పేరుతో దానమిచ్చిన) భూములు, ఆస్తులను కాపాడుకోవడం ప్రతి ముస్లిం బాధ్యత. – షేక్ మునీర్ అహ్మద్, రాష్ట్ర కన్వీనర్, ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ముస్లిం నేతల్లారా.. టీడీపీని వీడండిచంద్రబాబు పచ్చి అవకాశవాది అని మరోసారి రుజువైంది. సవరణ బిల్లుకు మద్దతు పలికి చేయాల్సిన నష్టం అంతా చేసిన టీడీపీ, జనసేన ఇంకా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గం. సవరణ బిల్లుకు ఆమోదం పలికిన టీడీపీ.. అందుకు విరుద్ధంగా వక్ఫ్ కమిటీల్లో ముస్లింలకే ప్రాధాన్యత కల్పిస్తామని, కలెక్టర్లకు తుది నిర్ణయం ఉండకుండా ఉన్నత స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పడంలో మతలబు ఏమిటి? ముస్లిం సమాజానికి ద్రోహం చేసిన చంద్రబాబును మైనార్టీ నేతలెవరైనా ఇంకా సమర్థిస్తున్నారంటే వారికి సిగ్గు లేనట్లే. 1997లో బీజీపీతో చంద్రబాబు జత కట్టడాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి బషీరుదీ్దన్ బాబూఖాన్ టీడీపీకి, పదవులకు రాజీనామా చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికిన చంద్రబాబు తీరును నిరసిస్తూ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యేలు, నామినేటెడ్ చైర్మన్లు టీడీపీకి, పదవులకు తక్షణం రాజీనామా చేయకపోతే ముస్లిం సమాజం క్షమించదు. – షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాంరాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ముస్లిం సమాజం రుణపడి ఉంటుంది. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చరిత్రహీనులుగా మిగిలితే.. వైఎస్ జగన్ హీరోగా నిలిచారు. దేశంలోని 14.6 శాతం ముస్లింల అభ్యంతరాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా సవరణ బిల్లును ఆమోదించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయడమే. ఆ బిల్లుకు కూటమి ఎంపీలు మద్దతు ఇవ్వటం చరిత్రలో చీకటి రోజుగా నిలుస్తుంది. ఈ బిల్లుతో వక్ఫ్ భూములతోపాటు మసీదులు, దర్గాలు, ఖబరస్తాన్లకు రక్షణ ఉండదు. – సదర్ ఉద్దీన్ ఖురేషి, ముస్లిం సంక్షేమ సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికార ప్రతినిధి -
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే
ఎవరు ఎంతగా వ్యతిరేకించినా వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారబోతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వోత్కర్షలకు పోవచ్చు. కానీ క్లిష్ట సమయాలే ఎవరేమిటన్నది నిగ్గుదేలుస్తాయి. బిల్లు పార్లమెంటులో గట్టెక్కడం మాట అటుంచి టీడీపీ ఇన్నాళ్లుగా వేస్తున్న సెక్యులర్ వేషాలకు తెరపడింది. టీడీపీ, జేడీ(యూ)ల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్నే నడపటం సాధ్యం కాని దీనస్థితిలోవున్న ఎన్డీయే సర్కారు... ఇప్పుడు వక్ఫ్ బిల్లుపై సునాయాసంగా తన పంతం నెగ్గించు కోవటం ఎలా సాధ్యమైందో అందరికీ తేటతెల్లమైంది. వీరితోపాటు మొదట వీరావేశంతో మాట్లాడిన ఒడిశాకు చెందిన బీజేడీ ఆఖరి నిమిషంలో స్వరం మార్చి పార్టీ ఎంపీలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించటం ప్రభుత్వానికి కలిసొచ్చింది. నిరుడు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆదరా బాదరాగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపక తప్పలేదు. ఎన్డీయే సర్కారు ఏర్పాటైన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్లటం అదే ప్రథమం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి, ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించటం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగింది. అందుకే వక్ఫ్ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుందని అధికారపక్షం నిర్ణయానికొచ్చింది. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. ఎన్నడో 1954లో వచ్చిన తొలి వక్ఫ్ చట్టం అవసరాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో 1995లో దాని స్థానంలో మరో చట్టం తీసుకొచ్చారు. 2013లో సవరణలు చేశారు. అయినా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల్లో దాదాపు సగంవరకూ వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించి సమస్యలున్నాయి. అవినీతి ఉన్నదనీ, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆరోపణలు రావటం కూడా వాస్తవం. పారదర్శకత పాటించటంలేదన్న విమర్శ కూడా ఉంది. వీటిని సరిదిద్దాలంటే ముస్లిం పండితులతో, నిపుణులతో, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి సంస్థలతో మాట్లాడాలి. ఎలావుంటే బాగుంటుందన్న అంశంలో సూచనలూ, సలహాలూ తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా బిల్లు తీసుకురావటంతో ముస్లిం వర్గాల్లో సంశయాలకు అవకాశం ఏర్పడింది. ముస్లింల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పటం బాగానేవున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది.బుజ్జగింపు ధోరణితో, ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టితోనే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తాను చేసిందేమిటో ఆలోచించిందా? నిజంగా చిత్తశుద్ధి వుంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆ వర్గాలతో చర్చించటానికి అభ్యంతరమేమిటి? ముస్లిమేతరులకు వక్ఫ్ బోర్డులు, కౌన్సిళ్లలో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజా యిషీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించి వక్ఫ్ కౌన్సిళ్లు జోక్యం చేసుకోబోవని, కేవలం వక్ఫ్ ఆస్తుల వ్యవహారాలనే చూస్తాయని కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు చెబుతున్నారు. కానీ మౌలికంగా వక్ఫ్ ఆస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తిభావనతో మతపరమైన అవసరాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి. అటువంటప్పుడు ఆ ఆస్తుల నిర్వహణలో అన్యులకు చోటీయటం అసమంజసం కాదా? ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? ఒకవేళ అలా ఇచ్చినా అందుకు ఆ మతస్తులు అంగీకరిస్తారా? ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్‌కు ఇవ్వొచ్చన్న నిబంధన ఉండేది. కానీ తాజా సవరణ ప్రకారం అయిదేళ్లపాటు ఇస్లామ్‌ను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది. అయితే ఇస్లామ్ ఆచరణే మిటో బిల్లు వివరించలేదు. 2013లో ఆ మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఆదరా బాదరాగా వక్ఫ్ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అందువల్ల ఒక్క ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఆ సవరణలను నాటి బీజేపీ నేతలు ఎల్కే అడ్వాణీ, సుష్మాస్వరాజ్ సమర్థించారు. సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంలో తోడ్పడ్డారు. వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగావున్న 20 కోట్లమంది ముస్లింలలో ఎన్నో సంశయాలున్నాయి. బిల్లులోని నిబంధనలు ఆ సంశయాలను మరింత పెంచేవిగా ఉన్నాయి. వక్ఫ్ ఆస్తుల్ని ఆర్నెల్లలోపు డేటా బేస్‌లో నమోదు చేయనిపక్షంలో వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాల మెట్లెక్కటం అసాధ్యమని బిల్లు చెప్పటం సమంజసంగా అనిపించదు. వివాదంలో పడిన వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం కావటం కూడా సమస్యాత్మకం. ఏ ఉన్నతాధికారైనా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం సాధ్యమేనా? ఇది అనుమానాలు రేకెత్తించే అవకాశం లేదా? మొత్తానికి తెలుగుదేశం వంటి పక్షాలు బిల్లుకు ఓటేసి, ఆపైన సవరణలు తీసుకొచ్చామంటూ లీకులిస్తూ, తమ సవరణలతో బిల్లు పకడ్బందీగా వచ్చింద నడం హాస్యాస్పదం. అందులోని డొల్లతనం ఏమిటో ఈ నిబంధనలే చెబుతున్నాయి. క్లిష్ట సమయాల్లో తటస్థత వహించటం ద్రోహంతో సమానం. తటస్థత మాట అటుంచి నిస్సంకోచంగా బిల్లును సమర్థించి టీడీపీ తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు. -
లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP
-
వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్సీపీ
ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు
-
రాజ్యసభలో వక్ఫ్ బిల్లు.. వాడీవేడి చర్చ
Waqf Bill In Rajya Sabha Updates..👉వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది.👉వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రవేశపెట్టారు.వక్ఫ్ బిల్లు పేరు మార్పుకేంద్రమంత్రి కిరణ్ రిజుజు కామెంట్స్..వక్ఫ్ బిల్లును యూఎంఈఈడీగా పేరు మార్పుUMEED (Unified Waqf Management Empowerment Efficiency and Development) బిల్లుగా మార్చినట్టు వ్యాఖ్యలు. #WATCH | Speaking in Rajya Sabha on Waqf Amendment Bill 2025, Union Minister Kiren Rijiju says, "Waqf Amendment Bill, 2025, will be renamed as the UMEED (Unified Waqf Management Empowerment Efficiency and Development) Bill." pic.twitter.com/1sFSkVJqre— ANI (@ANI) April 3, 2025 👉వక్ఫ్ సవరణ బిల్లుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ఇవ్వాలని కోరారు. Speaking in Rajya Sabha on Waqf Amendment Bill 2025, Union Minister Kiren Rijiju says, "I appeal to Congress party and its allies to support Waqf Amendment Bill 2025." pic.twitter.com/jkWTFDPj5J— ANI (@ANI) April 3, 2025చైనా ఆక్రమించిన భూమి తిరిగి రావాలి: రాహుల్ఈ విషయంపై ప్రధాని, రాష్ట్రపతి చైనా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసిందిచైనా రాయబారి ద్వారా ఈ విషయం బయటపడిందిట్రంప్ సుంకాలు విధించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందన తెలియజేయాలని రాహుల్ డిమాండ్ఎంపీ అనురాగ్ ఠాకూర్‌పై ఖర్గే సీరియస్..బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిన్న నాపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారు.మా పార్టీ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకున్నారు.కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.సోషల్ మీడియా, మీడియాల్లో బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలే వైరల్ అవుతున్నాయి.అందువల్లే ఈ రోజు నేను నిలబడి ఆయన ఆరోపణలను ఖండించాల్సి వస్తోంది.ఆయన వ్యాఖ్యలకు గానూ సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలి’’ అని ఖర్గే డిమాండ్ చేశారు.నా జీవితం తెరిచిన పుస్తకం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.అయినప్పటికీ ప్రజా జీవితంలో తలెత్తుకొని నిలబడ్డా.అలాంటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.ఈ ఆరోపణలను ఠాకూర్ నిరూపించగలరా?ఒకవేళ అలా చేస్తే నేను రాజీనామా చేస్తా.లేదంటే ఆయనకు పార్లమెంట్లో ఉండే అర్హత లేదు.రాజీనామా చేయాల్సిందే. ఇలాంటి రాజకీయ దాడులతో బీజేపీ నేతలు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.గుర్తుంచుకోండి. నేను ఎవరికీ భయపడను. తలొగ్గను అని అన్నారు.లోక్‌సభలో ఠాకూర్ కామెంట్స్.. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారహితంగా వినియోగిస్తున్నాయని ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా ఆ భూములను కబ్జా చేశారంటూ ఖర్గేపై ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.I will not bow down!🔥Congress President Shri @kharge ji. pic.twitter.com/otsKZiDySW— Telangana Youth Congress (@IYCTelangana) April 3, 2025సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు..పార్లమెంటులో ప్రతిపక్షాలను మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు.కాంగ్రెస్ సభ్యులు తమ సమస్యలను లేవనెత్తనివ్వకుండా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి చేయడమే.దిగువ సభలో ఈ బిల్లును తొక్కేశారు.మోదీ ప్రభుత్వం విద్య, పౌర హక్కులు, స్వేచ్ఛ, సమాఖ్య నిర్మాణం, ఎన్నికల నిర్వహణ ఏదైనా దేశాన్ని అగాధంలోకి లాగుతోంది.రాజ్యాంగం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది.దాన్ని కూడా కూల్చేయాలనేదే వారి ఉద్దేశమని మాకు తెలుసు.మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ఉద్దేశాలను బహిర్గతం చేయాలి.ఏది సరైనది, ఏది న్యాయబద్ధమైనది అనేది ప్రజలకు తెలియజేసేందుకు అందరం కలిసి మన పోరాటాన్ని కొనసాగించాలి.రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికే ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు.దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు.బీజేపీ సభ్యులు కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలని టార్గెట్ చేశారు. 👉రాజ్యసభలో ఈ బిల్లు ఇప్పుడు కీలకమైన పరీక్షను ఎదుర్కొంటోంది. ఇక్కడ ప్రస్తుత సభ్యుల మొత్తం బలం 236. బిల్లును ఆమోదించడానికి అధికార ఎన్డీయే కూటమికి 119 ఓట్లు అవసరం. స్వతంత్ర, నామినేటెడ్ సభ్యుల మద్దతుతో, దాని సంఖ్య 125గా ఉంది. ప్రతిపక్షం వద్ద 95 ఓట్లు ఉండగా 16 మంది సభ్యులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.👉లోక్‌సభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష సభ్యులు 100 కు పైగా సవరణలను ప్రతిపాదించారు అయితే ఓటింగ్ సమయంలో అవన్నీ తిరస్కరించారు. దాదాపు 12 గంటల చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును స్పీకర్ ఆమోదించారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15 శాతం ఉన్నారని.. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడుతూ, ముస్లిం వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఆర్టికల్స్ 14, 25, 26లను ఉల్లంఘిస్తుందని చెప్పారు.‘‘ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా చేసే చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 13 స్పష్టం చేసింది. నాన్ ముస్లింలను వక్ఫ్ కమిటీలలో ఎలా చేరుస్తారు. మైనారిటీలు టీడీపీ వాదనలను సమర్థించరు. చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు. వక్ఫ్ విషయంలో ముస్లింలకు అండగా నిలబడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగానే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం’’ అని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. -
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన YSRCP
-
ఒవైసీతో కూడా చర్చించాం వక్ఫ్ సవరణ బిల్లుపై మా స్టాండ్ అదే
-
వక్ఫ్ బిల్లుకు మద్దతివ్వడమంటే మాకు ద్రోహం చేయడమే
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్న మోదీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉండడంపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీతో పాటు పలు పార్టీలు అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పార్లమెంట్లో బిల్లును ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం కావడంతో ముస్లిం సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది.రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసేలా ప్రతిపాదించిన ఈ బిల్లును వైఎస్సార్సీపీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ నేతలు ముస్లింల నిరసనల్లో కూడా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఈ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడుతూ వచ్చారు. కేంద్రంలో బిల్లుకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. రాష్ట్రంలోని ముస్లింలకు మాయ మాటలు చెబుతూ రోజులు గడిపారు. దీంతో ఆయన తీరుపై ముస్లిం సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన ఇఫ్తార్ విందును కూడా బహిష్కరించి.. నిరసన తెలిపింది.ఈ నేపథ్యంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ముస్లింల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను ఏకరువు పెట్టినట్లు తెలిసింది. భేటీ అనంతరం అజీజ్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించామని, ముస్లింలపై చంద్రబాబు ఈగ కూడా వాలనివ్వరంటూ కబుర్లు చెప్పడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడమంటే.. తమకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని ముస్లింలు హెచ్చరించారు.ముస్లింలకు ద్రోహం చేయడమే.. వక్ఫ్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇవ్వడమంటే ముస్లింలకు తీవ్ర ద్రోహం చేయడమే. వక్ఫ్ ఆస్తులను రక్షిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల హామీ ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవాలంటే పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి. – గౌస్ లాజమ్, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ మాజీ చైర్మన్ చరిత్ర హీనుడు.. మాయ మాటలతో మభ్యపెట్టేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలను ముస్లిం సమాజం గుర్తించింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. – షేక్ మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వినర్వక్ఫ్ బిల్లుకు జనసేన మద్దతు సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పి.హరిప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన విశ్వసిస్తోందన్నారు. ఈ మేరకు జనసేన ఎంపీలకు పార్టీ పవన్ దిశానిర్దేశం చేశారన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఎంపీలను కోరారన్నారు. -
నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు
న్యూఢిల్లీ: కీలకమైన వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ జరుగనుంది. బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ వాదనలు సమర్థంగా వినిపించేందుకు ఇరుపక్షాలూ సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే వక్ఫ్(సవరణ బిల్లు)ను లోక్‌సభలో ప్రవేశపెడతానని మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. బిల్లుపై చర్చ కోసం ఉభయ సభల్లో ఎనిమిది గంటల చొప్పున సమయం కేటాయించాలని నిర్ణయించారు. అధికార ఎన్డీయేలోని కొన్ని భాగస్వామ్య పక్షాలు వక్ఫ్(సవరణ) బిల్లులో సవరణలు సూచిస్తున్నాయి. బిల్లును జేపీసీ ఇప్పటికే క్షుణ్నంగా పరిశీలించిందని, సవరణలు అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని సీనియర్ బీజేపీ నేత ఒకరు ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన తెలుగుదేశం, జేడీ(యూ) తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. బుధవారం సభ్యులంతా హాజరుకావాలని ఆదేశించాయి. బిల్లుకు మద్దతు పలకాలని ఆ రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు సైతం తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. వక్ఫ్ (సవరణ) బిల్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశంలో మైనార్టీల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ రాజ్యాంగ వ్యతిరేక బిల్లును అంగీకరించే ప్రసక్తే లేదని ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పమంది. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు వ్యతిరేకంగా తాము ఓటు వేయనున్నట్లు పార్టీ ఎంపీలు చెబుతున్నారు. బీఏసీ సమావేశం నుంచి విపక్షాల వాకౌట్ వక్ఫ్ (సవరణ) బిల్లు లోక్‌సభ ముందుకు రానున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. విపక్షాలు సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలన్న ప్రతిపాదనకు వారు అంగీకరించారు. అయితే, ఈ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం తమ గొంతును అణచివేస్తోందని ఆరోపిస్తూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. దీన్నిబట్టి చూస్తే బుధవారం లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న లక్ష్యంతో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఉమ్మడి వ్యూహం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ‘ఇండియా’ కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాందీ, కేసీ వేణుగోపాల్, రాంగోపాల్ యాదవ్, సుప్రియా సూలే, కల్యాణ్ బెనర్జీ, సంజయ్ సింగ్. టి.ఆర్.బాలు, తిరుచ్చి శివ, కనిమొళి, మనోజ్‌కుమార్ ఝా తదితరులు మంగళవారం సమావేశమయ్యారు. ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను అణచివేయడానికే వక్ఫ్(సవరణ) బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.బిల్లుకు మద్దతు పలుకున్న తెలుగుదేశం, జేడీ(యూ)లకు ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజ్యాంగవిరుద్ధమైన బిల్లును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలోనూ బీఏసీ సమావేశం జరిగింది. గురువారం బిల్లుపై ఎనిమిది గంటలపాటు చర్చ చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. లోక్‌సభలో బిల్లు సులువుగా నెగ్గే పరిస్థితి కనిపిస్తోంది. సభలో మొత్తం 542 మంది సభ్యులుండగా, అధికార ఎన్డీయేకు 293 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ అంకెలు ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నాయి.ఏమిటీ వివాదం? వక్ఫ్ బిల్లు. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నియంత్రణ, వివాదాల పరిష్కారంలో ప్రభుత్వాలకు అధికారం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు తీవ్ర వివాదాలకు దారి తీస్తోంది. అందులో ఐదు నిబంధనలను ప్రతిపాదించారు. వాటి ప్రకారం వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు విధిగా స్థానం కల్పించాలి. ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుందా, ప్రభుత్వానికి అన్న వివాదం తలెత్తితే దానిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం. ఇలాంటి వివాదాలపై ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమంగా ఉంటూ వస్తోంది. ఇకపై ఆ ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాక వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను ఇకపై హైకోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన ఆర్నెల్లో లోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ పోర్టల్‌లో విధిగా నమోదు చేయించాలి. ఏదైనా భూమిని సరైన డాక్యుమెంట్లు లేకున్నా చాలాకాలంగా మతపరమైన అవసరాలకు వాడుతుంటే దాన్ని వక్ఫ్ భూమిగానే భావించాలన్న నిబంధనను తొలగించాలని పేర్కొన్నారు. వీటిని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు పలు ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధమని పలు విపక్షాలు ఆరోపిన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రేపు లోక్‌సభకు వక్ఫ్ బిల్లు.. బీజేపీ ఎంపీలకు విప్
ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లును రేపు(బుధవారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన తరుణంలో బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది ఆ పార్టీ అధిష్టానం. రేపు తప్పనిసరిగి బీజేపీ ఎంపీలంతా లోక్ సభలో ఉండాలంటూ విప్ జారీ చేసింది. అయితే ఈ బిల్లును ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కిరణ్ రిజిజువక్ఫ్ సవరణ బిల్లును మైనారిటీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం మధ్యాహ్నం గం. 12.15 ని.లకు వక్ఫ్ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం కానుంది. దీనిపై ఎనిమిది గంటలపాటు చర్చ జరపనున్నారు ఎంపీలు. ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎన్డీఏ ఎంపీలు ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలంతా లోక్ సభకు హాజరుకావాలని విప్ జారీ చేశారు. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి. -
వక్ఫ్ బిల్లుకు సర్వం సన్నద్ధం
న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ)బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉందని మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. బిల్లులోని కొన్ని అంశాలకు సంబంధించి ప్రజలను తప్పుదోవపట్టించి, సమాజంలో ఉద్రిక్తతలను పెంచేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలకు ప్రయోజనాలను అందించేందుకే ఈ బిల్లును రూపొందించామన్నారు. అయితే, ముస్లింలను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకువచ్చేందుకు జరిగే ప్రయత్నాలు దేశానికి మంచివి కావని చెప్పారు. బిల్లు చట్టం రూపంలోకి వస్తే మసీదులు, ఖబరస్తాన్‌ల వంటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. పౌరసత్వ సవరణ బిల్లు సమయంలోనూ ఇలాంటి దుష్ప్రచారమే జరిగిందని గుర్తు చేశారు. బిల్లులోని వివరాలను పూర్తిగా అధ్యయనం చేసి, ప్రభుత్వంతో చర్చలు జరపాలని మంత్రి ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు సైతం ఈ బిల్లును తొందరగా ప్రవేశపెట్టాలని తనను కోరాయని మంత్రి వివరించారు. అందుకే, సాధ్యమైనంత త్వరగా ఈ బిల్లును ఆమోదింప జేసుకోవాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, బిల్లును ప్రవేశపెట్టే తేదీ ఇంకా నిర్ణయం కాలేదని తెలిపారు. మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4వ తేదీతో ముగియనున్నాయి. బిల్లు చట్టరూపం దాల్చాలంటే ఈలోగానే ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. బిల్లును ప్రవేశపెట్టడంపై మంగళవారం రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడి చర్చించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా తెలిపింది. దీన్నిబట్టి చూస్తే మంగళవారం వక్ఫ్ బిల్లును మొదటగా లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశాలు కని్పస్తున్నాయి. ముస్లింల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్న ఈ బిల్లు చట్ట విరుద్ధమని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. పలు సవరణలతో పార్లమెంట్ సంయుక్త కమిటీ ఆమోదం పొందిన బిల్లుకు వ్యతిరేకంగా పలు ముస్లిం సంస్థలు ర్యాలీలు సైతం చేపట్టాయి. -
వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లును దేశ ప్రజలంతా అడ్డుకుని తీరాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) అధ్యక్షుడు ఖాలిద్ సైపుల్లా రెహ్మానీ పిలుపునిచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లును తిరిస్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ, రాష్ట్ర ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముస్లింలు పెద్దఎత్తున తరలిరాగా.. వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో రెహ్మానీ మాట్లాడుతూ.. రాజ్యాంగం ముస్లింలకు ప్రసాదించిన హక్కులను వక్ఫ్ సవరణ బిల్లుతో కాలరాసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వందల ఏళ్లనాటి మసీదులు, మదర్సాల రిజిస్ట్రేషన్ పత్రాలు దొరక్కపోతే మత సంబంధమైన బై యూజర్ నియమం ద్వారా చట్టబద్ధత లభిస్తుందన్నారు. అటువంటి నియమాలను రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తెచ్చి.. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకోవాలని చూస్తోందని విమర్శించారు. దేశంలో ఇప్పటికే లక్షలాది ఎకరాలను ప్రభుత్వాలు ఆక్రమించాయని, ఇంకా అనేక హాస్యాస్పదమైన సవరణలు చేసి వక్ఫ్‌ను బలహీన పరచడానికి సవరణ బిల్లు తెచ్చారన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు సైతం తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు దేశ లౌకిక, ప్రజాస్వామిక వ్యవస్థకు పెను ప్రమాదమని, రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వాదాన్ని కాపాడేందుకు దేశంలోని సెక్యులర్ పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. మహాధర్నాలో జమాతే ఇస్లాం హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫిక్, ఉపాధ్యక్షుడు మాలిక్ ముహతషిమ్ ఖాన్, మజ్లిస్ ఉలమా ఏపీ ప్రతినిధి మౌలానా ముఫ్తి యూసుఫ్, ఉమ్రి అధ్యక్షుడు మౌలానా నసీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ షేక్ అసిఫ్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంవక్ఫ్ పరిరక్షణ ముస్లింల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ బిల్లును ఆమోదిస్తే ముస్లిం సమాజానికి తీవ్ర నష్టంతోపాటు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించినట్టు అవుతుంది. వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. ఈ బిల్లు ముస్లింలకు మాత్రమే నష్టం కలిగించదు. వక్ఫ్ చట్టం–1995కు 2013లో సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకుసంక్రమించిన హక్కులు, అ«ధికారాలను కూడా కోల్పోతాయి. – మౌలానాషా ఫజల్ రహీమ్ ముజద్దిద్, ప్రధాన కార్యదర్శి, ఏఐఎంపీఎల్బీ వక్ఫ్ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందిరాజకీయ ప్రయోజనాల కంటే రాజ్యాంగ పరిరక్షణే ముఖ్యమని వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ భావిస్తారు. అందుకే ముస్లింలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం కలిగేలా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును మా పార్టీ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. వైఎస్ జగన్ ఆదేశాలతో ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించారు. మరోసారి పార్లమెంట్లో ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది. దేశంలో భిన్న మతాలు, కులాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా మెలగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశం. కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజ్యాంగంలో రాసుకున్న రాతలకు తూట్లు పొడుస్తున్నాయి. అటువంటి పాపపు ఆలోచనల నుంచి వచ్చిందే వక్ఫ్ సవరణ బిల్లు. పాపాలు చేస్తున్న వారితోపాటు.. అలాంటి వారికి అండగా నిలవడం కూడా పాపమే అని ఖురాన్ చెబుతోంది. రంజాన్ మాసంలో వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణమైన రాజకీయ పార్టీలను ఈ వేదిక ద్వారా నిలదీయాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత -
AP: మహాధర్నాకు ముస్లిం సంఘాలు సిద్ధం
విజయవాడ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయాలంటూ ముస్లింలు సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు(శనివారం) విజయవాడ ధర్నాచౌక్ లో మహాధర్నాకు సన్నద్ధమయ్యారు. రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకూ ధర్నా చేయనున్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలు పెద్ద ఎత్తున ధర్నాకు హాజరుకావాలని పిలుపునిచ్చాయి ముస్లిం సంఘాలు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని ముస్లిం సంఘాలు హెచ్చరిస్తున్నాయి.ప్రభుత్వ ఇఫ్తార్ బహిష్కరణవక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా నిన్న(మార్చి 27వ తేదీ గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం(మార్చి 26వ తేదీ) ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
బడ్జెట్ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్
Parliament Live Updates March 10th: పార్లమెంట్ మలి(రెండో) విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.లోకసభ వాయిదామధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా #Loksabha adjourned till 12 noon. pic.twitter.com/OWiOwstBES— Lok Poll (@LokPoll) March 10, 2025 #WATCH | On the New Education Policy and three language row, Union Education Minister Dharmendra Pradhan says, "...They (DMK) are dishonest. They are not committed to the students of Tamil Nadu. They are ruining the future of Tamil Nadu students. Their only job is to raise… pic.twitter.com/LdBVqwH6le— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్ వ్యవహారంరాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలుప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం #WATCH | Delhi: Rajya Sabha MP Rekha Sharma says, "The opposition always obstructs the House and important issues are left behind...Today also they will do something similar and we are ready for that too...only those issues will come up in Parliament which are for the… pic.twitter.com/uWHQDiXooN— ANI (@ANI) March 10, 2025 రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలుఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు #WATCH | Delhi: On behalf of Rajya Sabha members, Rajya Sabha Deputy Chairman Harivansh Narayan Singh congratulates the Indian team for clinching the Champions Trophy (Source: Sansad TV) pic.twitter.com/1HcsW5GgFb— ANI (@ANI) March 10, 2025 ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలువక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలుఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చనేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షాఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను, త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లుఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రంఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం -
వక్ఫ్ నివేదికకు జేపీసీ ఆమోదం
న్యూఢిల్లీ: వక్ఫ్ ఆస్తులు, బోర్డ్ వ్యవహారాల్లో సంస్కరణలు, పారదర్శకత తేవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు(Waqf (Amendment) Bill)ను సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(Joint Parliamentary Committee) ఎట్టకేలకు తమ ముసాయిదా నివేదికను బుధవారం ఆమోదించింది. జేపీసీ 38వ సారి సమావేశమై ముసాయిదా నివేదికను ఆమోదించడం కోసం జరిపిన ఓటింగ్‌లో 15 మంది సభ్యులు నివేదికకు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓట్లేయడంతో బీజేపీ నేత జగదాంబికాపాల్(Jagdambika Pal) నేతృత్వంలోని జేపీసీ ఈ నివేదికను ఆమోదించింది. జేపీసీలో సభ్యులుగా ఉన్న విపక్ష పార్టీల నేతలు ఈ నివేదికపై తమ పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేస్తూ నోట్లను సమర్పించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆధునికత సాధించే ఉద్దేశ్యంతోనే గత ఏడాది ఆగస్ట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని బీజేపీ సభ్యులు చెప్పారు. అయితే ఈ బిల్లు ద్వారా ముస్లింల మతసంబంధ వ్యవహారాల్లో కమలదళం ఉద్దేశపూర్వకంగా కలగజేసుకుంటోందని, వక్ఫ్ బోర్డ్ నిర్వహణ అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటోందని విపక్షాలు మండిపడ్డాయి. ఈ నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేస్తామని, శుక్రవారం మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు జగదాంబికా పాల్ చెప్పారు. వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతిస్తూ సవరణ బిల్లు తేవడాన్ని విపక్షాలు ప్రధానంగా తప్పుబడుతున్నాయి. ప్రతి పౌరుడికీ తన మత సంబంధ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, మత సంబంధ, దాతృత్వ సంబంధ సంస్థల నిర్వహణపై ఆ మతస్థులకే పూర్తి హక్కు ఉంటుందని విపక్షాలు తేల్చి చెప్పాయి. సవరణ బిల్లుతో ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 26లోని పౌరుల మతస్వేచ్ఛకు భంగం కల్గిస్తోందని ధ్వజమెత్తాయి. నివేదికను ఆమోదించడాన్ని జేపీసీలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ మసూద్ తప్పుబట్టారు. ‘‘ రాజ్యాంగం ద్వారా మాకు సంక్రమించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వం తరచూ ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడుతుంది. మరి సభ్యుల విషయానికొస్తే హిందూ ఎండోమెంట్ బోర్డ్‌లో హిందూయేతర సభ్యులు లేరు. అలాగే సిఖ్ బోర్డ్‌లో సిఖ్యేతర సభ్యుడు లేడు. క్రిస్టియన్ బోర్డ్‌లో క్రైస్తవేతర సభ్యుడు లేడు. ఇదే నియమాన్ని ముస్లింలకూ వర్తింపజేయాలిగదా?. ఇదంతా వక్ఫ్ బోర్డ్లను నాశనంచేసే కుట్ర’’ అని మసూద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సవరణల్లో ఒక్కటికూడా వక్ఫ్‌కు మేలుచేసేలా లేవు. సవరణలన్నీ వక్ఫ్ బోర్డ్‌ను నాశనంచేసి, వక్ఫ్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని పెంచేలా ఉన్నాయి. ఖాళీ వక్ఫ్ స్థలాలను ప్రభుత్వం లాగేసుకునే ప్రమాదముంది. ముస్లిం ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం ఆమోదించట్లేదు. ఈ సవరణలను మేం తిరస్కరిస్తున్నాం. సవరణలను ఒప్పుకుంటే మేం మా మసీదులను కోల్పోవాల్సి వస్తుంది’’ అని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించే అవకాశం
-
‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్: నిత్యం క్రయవిక్రయదారులతో రద్దీగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ కార్యాలయం మూడు నెలలుగా దాదాపుగా వెలవెలబోతోంది. దీనికి కార ణం కేవలం ఒక్క పదమే కారణమంటే ఆశ్చర్యంగా ఉన్నా, అదే నిజం. ఉన్నతాధికారుల ఉత్తర్వుల్లో ‘మరియు’అనే పదం స్థానంలో ‘నుండి’ అనే పదం టైపింగ్ చేయడమే ఆ పరిస్థితికి కారణం. అప్పటి ‘నుండి’ రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఆ ఒక్క పదంతో రెండు సర్వే నంబర్లకు బదులు ఏకంగా 168 సర్వే నంబర్లలోని వందల ఎకరాల స్థలాల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది. దీనికి హైడ్రా కూడా తోడవడంతో క్రయవిక్రయాలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రతిరోజు 100కుపైగా జరిగే రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గిపోయాయి. ‘మరియు’కు బదులు ‘నుండి’ కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో 58, 226 సర్వే నంబర్లలో వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో వాటిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టరాదని వక్ఫ్ బోర్డు ఆగస్టు 27న ఆదేశాల జారీ చేసింది. ఆదేశాలలో 58 మరియు 226 సర్వే నంబర్లు అని టైపు చేయకుండా పొరపాటున 58 సర్వే నంబర్ నుండి 226 సర్వే నంబరు వరకు అని టైపు చేయడంతో ఏకంగా 168 సర్వే నెంబర్లపై ఈ ఎఫెక్ట్ పడింది. దీంతో వందల ఎకరాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేశారు. చదవండి: మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారులు!వాస్తవానికి నిలిపివేసిన సర్వే నంబర్లలో వక్ఫ్‌బోర్డ్ స్థలం మొత్తం కేవలం ఒక ఎకరం ఒక గుంట స్థలం ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల నుంచి నిలిచిపోవడంతో 50 కాలనీలు, పలు బస్తీల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వెంటనే ఆదేశాల్లో దొర్లిన పొరపాటును సరిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు. ‘రిజిస్ట్రేషన్లు సగం మేర తగ్గిపోవడంతో డాక్యుమెంట్ రైటర్లు, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాపులు, 5 హోటల్స్, మనీ ట్రాన్స్ఫర్ సెంటర్లు బోసిపోతున్నాయి’అని రవీందర్ ముదిరాజ్ అనే స్థానికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచే పార్లమెంట్ సమరం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో అత్యంత ముఖ్యమైన వక్ఫ్ సవరణ బిల్లును జాబితాలో చేర్చారు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లును మాత్రం పక్కనపెట్టారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరుగనున్న శీతాకాల సమావేశాలకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈసారి సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పార్లమెంట్లో సమావేశాల్లో ముందుగా ఇటీవల మరణించిన ఎంపీలకు సంతాపం తెలియజేశారు. తర్వాత కార్యకలాపాలు మొదలవుతాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై జగదాంబికా పాల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తన నివేదికను ఈవారం సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంది. దానిని పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుని ఆమోదించే అవకాశాలున్నాయి. 26న పాత పార్లమెంట్ భవనంలోప్రత్యేక కార్యక్రమం భారతæ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న పార్లమెంట్ ఉభయ సభలు కొనసాగవు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత పార్లమెంట్ భవనం సంవిధాన్ సదన్‌లోని చారిత్రక సెంట్రల్ హాల్లో ఉభయ సభల ఎంపీలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ «ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితరులు హాజరవుతారు. ఈ సందర్భంగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌తోపాటు సంస్కృతం, మైథిలీ బాషలతో కూడిన భారత రాజ్యాంగ ప్రతులను విడుదల చేస్తారు. ‘అదానీ, మణిపూర్’పై చర్చించాలి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డాతోపాటు 30 పారీ్టల నేతలు పాల్గొన్నారు. అదానీపై గ్రూప్‌పై ఆరోపణలు, మణిపూర్ సంక్షోభం, వాయుకాలుష్యం, రైలు ప్రమాదాలపై విస్తృతంగా చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీ అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు విపక్షాలన్నీ సహకరించాలని కోరారు. -
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లు సైతం ఇందులో ఉంది. ఐదు నూతన బిల్లులు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 20న ముగుస్తాయి. వక్ఫ్ సవరణ బిల్లుపై కేంద్రం నియమించిన జాయింట్ కమిటీ తమ నివేదికను పార్లమెంట్‌కు సమరి్పంచనుంది. పంజాబ్ న్యాయస్థానాల(సవరణ) బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, ఇండియన్ పోర్ట్స్ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్(రద్దు) బిల్లుపై పార్లమెంట్ ముందుకు రాబోతున్నాయి. -
వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈద్గా మైదానంలో జమాతే ఈ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ పరిరక్షణ మహాసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారన్నారు.‘‘ఈ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్సీపీ తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం. ముస్లింల తరఫున వైఎస్సార్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైఎస్సార్సీపీ వ్యతిరేకం’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.‘‘రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది. ఆ భూముల్లో చాలా భాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వైఎస్సార్సీపీ ఖండిస్తోంది. వక్ఫ్ బోర్డు భూములే 50 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.‘‘ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు. ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయం. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం. వైఎస్ జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
నా కుటుంబాన్ని దుర్భాషలాడారు: ఎంపీ కల్యాణ్ బెనర్జీ
కోల్‌కతా: వక్ఫ్ బిల్లుపై నిర్వహించిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అనుచితంగా ప్రవర్తించారు. బీజేపీ నేత అభిజిత్ గంగోపాధ్యాయతో జరిగిన వాగ్వాదంలో ఎంపీ బెనర్జీ ఓ గాజు సీసాను పగులగొట్టి దానిని ప్యానల్ చైర్మన్ జగదాంబికా పాల్పైకి విసిరారు. ఈ క్రమంలో ఎంపీ బొటనవేలు, చూపుడు వేలికి గాయం కావడంతో ప్రథమ చికిత్స చేశారు. అయితే వారం రోజుల అనంతరం ఆరోజు జరిగిన ఘటనపై తాజాగా ఎంపీ కళ్యాణ్ బెనర్జీ స్పందించి.. తన చర్యలను సమర్థించుకున్నారు. బీజేపీ ఎంపీ గంగోపాధ్యాయ తనను దుర్భాషలాడారని బెనర్జీ ఆరోపించారు.‘‘నాకు రూల్స్ , రెగ్యులేషన్స్ అంటే చాలా గౌరవం. దురదృష్టవశాత్తు అభిజిత్ గంగోపాధ్యాయ నాపై నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆరోపణలు చేశారు. ఆ రోజు మొదటగా కాంగ్రెస్ ఎంపీ నసీర్, అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ఆయన నన్ను, నా తల్లి, మా నాన్న , నా భార్యను దుర్భాషలాడడం ప్రారంభించారు. ఆ సమయంలో జేపీసీ చైర్మన్ అక్కడ లేరు. ఛైర్మెన్ అక్కడ లేనప్పుడు.. అభిజిత్ గంగోపాధ్యాయ నా పట్ల కఠినంగా ప్రవర్తించారు. ...కానీ, దీంతో జెపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్.. ఎంపీ గంగోపాధ్యాయ పట్ల పక్షపాతంతో వ్యహరించారు. అది నాకు చాలా విసుగు తెప్పించింది. అప్పుడు నేను టేబుల్‌పై ఉన్న గాజు సీసాని పగులగొట్టాను. నేను దానిని చైర్మన్‌పైకి విసిరేయాలని ఎప్పుడూ అనుకోలేదు. సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం ఛైర్మన్‌కు లేదు. స్పీకర్‌కు మాత్రమే అధికారం ఉంది’’ అని అన్నారు.ఈ ఘటన జరినగి తర్వాత బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ, టీఎంసీ ఎంపీ బెనర్జీ చర్యను నిరసిస్తూ చేసిన తీర్మానాన్ని ప్యానెల్ 9-8తో ఆమోదించడంతో అతడిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. బీజేపీకి ఎంపీ జగదాంబిక పాల్ అధ్యక్షతన కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల బృందం అభిప్రాయాలను వింటున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వక్ఫ్ బిల్లులో తమ వాటా ఏమిటని విపక్ష సభ్యులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: మానవత్వం లేదు’.. బెంగాల్, ఢిల్లీపై ప్రధాని మోదీ ధ్వజం -
వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/కర్నూలు(టౌన్): ముస్లిం సమాజానికి నష్టం తెచ్చే వక్ఫ్ సవరణ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ తాజాగా మరోసారి స్పష్టమైన వైఖరిని చాటింది. వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చైర్మన్ జగదాంబికా పాల్‌కు పార్టీ తరఫున జేపీసీ మెంబర్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ శనివారం రాతపూర్వకంగా లేఖ అందజేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని లేఖలో స్పష్టం చేశారు. అనంతరం హఫీజ్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సమాజం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ సవరణ బిల్లును వ్యతిరేకించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారన్నారు.జేపీసీ సమావేశంలో ఈ బిల్లును తమ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తోందో లిఖితపూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ఈ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని జేపీసీకి వివరించామన్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి కలెక్టర్‌కు అథారిటీ ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. వక్ఫ్ భూములకు ప్రత్యేకంగా ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్‌ను బలహీనపరిచేలా సవరణ బిల్లు ఉందన్నారు.ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందన్నారు. ఇప్పటికే లోక్‌సభలో మిథున్‌రెడ్డి, రాజ్యసభలో విజయసాయిరెడ్డి సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, తాము ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో చెప్పారన్నారు. ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ జేపీసీ మెంబర్ విజయసాయిరెడ్డి సైతం బిల్లుకు వ్యతిరేకంగా లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీది డబుల్ గేమ్టీడీపీ పార్లమెంట్లో ద్వంద్వవైఖరి అవలంబించడంతోపాటు సవరణ బిల్లు విషయాన్ని గందరగోళంలో పడేస్తోందని హఫీజ్‌ఖాన్ మండిపడ్డారు. ఇప్పుడు కూడా టీడీపీ రెండు కళ్ల ధోరణి అనుసరిస్తోందన్నారు. పార్లమెంట్‌లోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదన్నారు. పార్లమెంట్లో సవరణ బిల్లుకు మద్దతు పలికిన టీడీపీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీతోపాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తోందని విమర్శించారు. టీడీపీ నాటకాలను ముస్లిం సమాజం గమనించాలని హఫీజ్‌ఖాన్ కోరారు.‘వక్ఫ్ బిల్లు’పై జేపీసీకి పలు సూచనలు చేశాం: మంత్రి ఫరూక్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ సవరణ బిల్లు–2024పై ముస్లిం సమాజం నుంచి ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో. అభిప్రాయ సేకరణకు వచి్చన జేపీసీకి ఏపీ తరఫున పలు సూచనలు చేసినట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన జేపీసీ అభిప్రాయ సేకరణ సమావేశానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ నుంచి 15 మంది కమిటీని పంపినట్లు మంత్రి పేర్కొన్నారు. జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్‌కు రాతపూర్వకంగా వినతిపత్రాలు సమరి్పంచినట్లు తెలిపారు. -
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
సాక్షి, అమరావతి: వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆ బిల్లుపై ముస్లిం మైనార్టీలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని భరోసా ఇచ్చారు. పార్లమెంటు సంయుక్త కమిటీ(జేపీసీ)లో సభ్యుడుగా ఉన్న తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని ముస్లింల అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారని వారికి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్సార్సీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై వైఎస్సార్సీపీ తొలి నుంచి అండగా నిలిచిందని.. వారి వెంట నడుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.మొత్తం వ్యవస్థను కొత్త వక్ఫ్ బిల్లు నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం వల్లే.. కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తుచేశారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో అనేక చర్యలు తీసుకున్నామని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చడం ఒక గొప్ప పరిణామమన్నారు. ముస్లింలకు వైఎస్ జగన్ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో 60ను వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను క్షుణ్నంగా పరిశీలించి, మార్పుచేర్పులపై సిఫార్సులు చేయడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటుకు పార్లమెంటు శుక్రవారం ఆమోదం తెలిపింది. లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది కలిపి 31 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వి.విజయసాయిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), డి.కె.అరుణ (బీజేపీ), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), లావు శ్రీకృష్ణదేవరాయలు (టీడీపీ) ఉన్నారు. కమిటీ తన నివేదికను పార్లమెంట్ తదుపరి సమావేశాల తొలి వారంలో సమరి్పంచనుంది. పార్లమెంట్ నిరవధిక వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలు 12వ తేదీ దాకా జరగాల్సి ఉండగా ముందే వాయిదా వేశారు. -
ముస్లింలపై మీ వైఖరేంటి?
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్టాన్ని పటిష్టం చేసి ఆక్రమణదారుల చెర నుంచి భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సవరణ బిల్లు తేవటాన్ని ముస్లిం సమాజం, మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లు ముస్లిం సమా జానికి గొడ్డలిపెట్టు లాంటిదని స్పష్టం చేస్తు న్నారు. సవరణ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చిన నేప థ్యంలో ఆ పార్టీలోని ముస్లిం మైనార్టీ నేతలు పదవులకు రాజీనామా చేయాలని సూచిస్తున్నారు. పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా సీఎం చంద్ర బాబు మరోసారి ముస్లింలపై తన వ్యతిరేకతను బయట పెట్టారని పేర్కొంటున్నారు. ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణకు చంద్రబాబు అనుకూలమో కాదో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రకటనలు చేసినప్పుడు కూడా చంద్రబాబు కనీసం నోరు విప్పలేదని ప్రస్తావిస్తున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ, జనసేన మద్దతు పలకగా వైఎస్సార్ సీపీ గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 21 మందితో నియమించిన జేపీసీలో తెలంగాణ ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీతోపాటు డీకే అరుణకు ప్రాతినిధ్యం కల్పించారు. మరోవైపు బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ సభ్యులకు అందులో స్థానం కల్పించకుండా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు చోటు కల్పించడం గమనార్హం.వక్ఫ్ చట్టంలో పలు సవరణలు..దేశవ్యాప్తంగా ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల పరిరక్షణకు ఆంగ్లేయుల హయాంలోనే 1937లో వక్ఫ్ చట్టం తెచ్చారు. స్వాతంత్య్రం అనంతరం 1955, 1995లో సవరణలు చేశారు. వక్ఫ్ భూములను ముస్లింలకు మాత్రమే లీజుకు ఇవ్వాలనే నిబంధనను సవరించి ఎవరికైనా ఇవ్వొచ్చని చేర్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లులో ముస్లిం అనే పదం లేకుండా బోర్డులో సభ్యులను తీసుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా ఒక మతానికి చెందిన బోర్డు, సంస్థల్లో అన్య మతస్థులను అనుమతించరు. అందుకు విరుద్ధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ముస్లిమేతరులను నియమించుకునేలా సవరణ బిల్లు అవకాశం కల్పిస్తోంది. వక్ఫ్ ఆస్తుల ఆజమాయిషీ అధికారాలను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించేలా సవరణ ప్రతిపాదించారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి: ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎం వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగాన్ని కల్పించిన ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తూ సవరణలు తేవడం దారుణం. మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే యత్నాన్ని అడ్డుకుంటాం. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేస్తే అది ఎప్పటికీ వక్ఫ్‌దే. ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీలను శత్రువులుగా చూస్తోంది. దేశంలో 9 లక్షల ఎకరాల ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి. ఈ సవరణల ద్వారా కాజేసే యత్నాలు జరుగుతున్నాయి. వక్ఫ్ నిర్వచనాన్ని మార్చే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా కాలరాసే యత్నం చేస్తున్నారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.రాజ్యాంగ విరుద్ధం: హఫీజ్ ఖాన్, వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ ఆస్తి అంటే అది అల్లాకు సంబంధించినది. ఓ ముస్లిం సమాజ సంక్షేమం, మేలు చేయడానికి ఇచ్చిన ఆస్తి. అది ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కొనుగోలు, అమ్మకాలు చేయరాదు. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని సమాజం మేలు కోసం ఉపయోగించాలి. సవరణ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. కలెక్టర్‌కు పూర్తి అధికారాలు ఇవ్వడంతోపాటు వక్ఫ్ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేసేలా బిల్లులో అంశాలున్నాయి. ఇతర మతస్థులను నామినేట్ చేసేలా బిల్లులో ప్రతిపాదించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పార్లమెంటులో మా పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకించారు. ముస్లిం సోదరులకు సంబంధించిన సున్నితమైన విషయాలపై పునరాలోచన చేయాలి. ఎన్నికల ముందు ముస్లిం సమాజానికి ఇచ్చిన వాగ్ధానాలకు టీడీపీ కట్టుబడి ఉండాలి. ఈ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి టీడీసీ మద్దతు ఇవ్వడం దారుణం. బిల్లును వ్యతిరేకించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌కి ముస్లిం సోదరుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు –షేక్ నాగుల్ మీరా. ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడుముస్లిం ప్రయోజనాలను దెబ్బతీసే యత్నాలకు టీడీపీ, జనసేన వంత పాడటం దుర్మార్గం. ముస్లింల పట్ల టీడీపీ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. రాష్ట్రంలో వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు మధ్య ఉన్నాయి. కలెక్టర్లకు వక్ఫ్ భూములపై పూర్తి అధికారాలు అప్పగించడమంటే ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం చేయడమే. ముస్లిం మత విశ్వాసాల్లో అన్య మతస్తుల జోక్యంతో మత సామరస్యానికి విఘాతం కలుగుతుంది. వక్ఫ్ భూములు కట్టబెట్టే కుట్ర –షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్అత్యధిక వక్ఫ్ భూములున్న యూపీ, మధ్యప్రదేశ్‌లో ఆక్రమణకు గురైన విలువైన వక్ఫ్ భూములను చట్టబద్ధం చేసేందుకే సవరణ బిల్లు తెచ్చారు. దీనికి మద్దతు ప్రకటించిన టీడీపీ, జనసేనకు ముస్లిం సమాజం స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. రెండు రోజుల్లో ఏపీతోపాటు అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించి ముస్లిం సమాజానికి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని వివరిస్తాం. హక్కులను కాలరాయడమే –ఆలమూరు రఫీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్.వక్ఫ్ చట్ట సవరణ బిల్లు భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉంది. వక్ఫ్ అనే పదానికి అర్ధమే మార్చేలా ఉంది. మతపరమైన అంశాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన జోక్యం చేసుకోవడం తగదు. దగా చేయడమేముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోంది. వక్ఫ్ చట్ట సవరణకు టీడీపీ మద్దతు తెలిపి ముస్లింలను దగా చేసింది. దీనిపై పోరాటానికి ముస్లిం సమాజం సిద్ధం కావాలి. - అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, మాజీ డైరెక్టర్, కాకినాడవైఎస్సార్ సీపీ నిర్ణయం అభినందనీయంవక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలందరూ స్వాగతిస్తున్నారు. ముస్లిం హక్కుల పరిరక్షణ విషయంలో వైఎస్సార్ సీపీ ముందుండి నడిపిస్తోంది. – డాక్టర్ మీర్జా షంషేర్ అలీబేగ్, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ మైనార్టీల ద్రోహిటీడీపీ తొలి నుంచి ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమే. వక్ఫ్ ఆస్తుల విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి టీడీపీ మద్దతు తెలపడం సిగ్గుచేటు. దీనిపై ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీలకు అండగా నిలబడ్డారు. మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబం మైనార్టీలకు అండగా నిలుస్తోంది. – షేక్ నూరిఫాతిమా, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తూర్పు నియోజకవర్గం, గుంటూరు చట్ట సవరణ సరికాదువక్ఫ్ చట్ట సవరణ సరికాదు. దీన్ని వ్యతిరేకించాల్సింది పోయి టీడీపీ, జనసేన మద్దతు తెలపడం ముస్లింలను అగౌరవపరచడమే. వైఎస్సార్సీపీ ముస్లింలకు అండగా నిలవడం అభినందనీయం. – ఫయాజ్ అహ్మాద్, పురపాలక కౌన్సిలర్, ఆదోని, కర్నూలు జిల్లారాజ్యాంగ ఉల్లంఘనే...వక్ఫ్ బోర్డు నిబంధనల్లో సవరణ చేయటం ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడమే. వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించటం హర్షణీయం. – ఎంఏ భేగ్, వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడురాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడివక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా నవరణలు చేయడం రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడమే. ఈ బిల్లుతో మసీదులు, దర్గాల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ముస్లిం సంస్థల ఆస్తులను దోచుకుంటామంటే ప్రతిఘటన తప్పదు. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. ––ఎస్.అబ్దుల్‌కలీమ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ -
దారికొచ్చిన ఎన్డీయే సర్కారు!
అలవాటైన పద్ధతిలో వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎన్డీయే ప్రభుత్వానికి కాసేపటికే తత్వం బోధపడినట్టుంది. విపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురుకావటంతో దాన్ని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపటానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జేపీసీకి లేదా సెలెక్ట్ కమిటీకి పంపటం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సంద ర్భాల్లో మాత్రమే పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు కొన్ని నెలలముందు అమల్లోకొచ్చిన భూసేకరణ చట్టం పీకనొక్కుతూ ఆదరా బాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావటం ఎవరూ మరిచిపోరు. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా ఆనాడు చెవికెక్కలేదు. ఆర్డినెన్స్ మురిగి పోయిన రెండుసార్లూ దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ తిరిగి ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. రాజ్యసభలోగండం గడిచేలా లేదని గ్రహించాక ఇక దాని జోలికి పోరాదని నిర్ణయించుకున్నారు. అటుపై సాగు చట్టాల విషయంలోనూ రైతులనుంచి ఇలాంటి పరాభవమే ఎదురయ్యాక వాటినీ ఉపసంహరించుకున్నారు. ఐపీసీ, సాక్ష్యాధారాల చట్టం, సీఆర్పీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టాల తాలూకు బిల్లులపై కూడా సంబంధిత వర్గాలను సరిగా సంప్రదించలేదు. ఎన్డీయే ఏలుబడి మొదలయ్యాక చోటుచేసుకున్న వేర్వేరు ఉదంతాల పర్యవసానంగా ముస్లిం సమాజంలో ఒక రకమైన అభద్రతాభావం ఏర్పడిన నేపథ్యంలో ఈ వివాదాస్పద చర్యకు కేంద్రం ఎందుకు సిద్ధపడిందో తెలియదు. బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని ఎన్డీయే భాగస్వామ్య పక్షం జేడీ(యూ) నేత, కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అంటున్నారు. ఇది పారదర్శకత తీసుకొస్తుందని కూడా ఆయన సెలవిచ్చారు. మంచిదే. మరి ఆ వర్గంతో సంప్రదింపులు జరిగిందెక్కడ? ముస్లిం సమాజానికున్న అభ్యంతరాల సంగతలా వుంచి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సైతం ఇది ఎసరు పెడుతోంది. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం భూమి రాష్ట్రాల జాబితాలోనిది.వక్ఫ్ ఆస్తిపై కేంద్ర పెత్తనాన్ని అనుమతించటంద్వారా దాన్ని కాస్తా తాజా బిల్లు నీరుగారుస్తోంది. కనుక ముస్లిం సమాజంతో మాత్రమేకాదు...రాష్ట్రాలతో కూడా సంప్రదించాల్సిన అవసరం లేదా? హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తెచ్చారని లోక్‌సభలో విపక్షాలు చేసిన విమర్శలు కాదని చెప్పటానికి ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. తన చర్య వెనక సదుద్దేశం ఉందనుకున్నప్పుడూ, బిల్లుపై ఉన్నవన్నీ అపోహలే అని భావించి నప్పుడూ తగిన సమయం తీసుకుని సంబంధిత వర్గాలతో చర్చించటానికేమైంది? ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే హడావిడిగా బిల్లు తీసుకొచ్చి వుంటే అంతకన్నా తెలివి తక్కువతనం ఉండదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ మాదిరి ఎత్తుగడలను జనం ఏవగించు కున్నారని బీజేపీకి అర్థమయ్యే వుండాలి.సవరణ బిల్లు ద్వారా తీసుకొచ్చిన 44 సవరణల పర్యవసానంగా వక్ఫ్ బోర్డుల అధికారాలకు కత్తెరపడుతుందని, ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందని కనబడుతూనేవుంది. అరుదైన సంద ర్భాల్లో తప్ప కలెక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని ఎవరూ అనుకోరు. ఫలానా ప్రార్థనాస్థలం శతాబ్దాలక్రితం తమదేనంటూ ఆందోళనలు చేయటం, దానికి ప్రభుత్వాలు వత్తాసు పలుకుతుండటం అక్కడక్కడ కనబడుతూనేవుంది. ఇంతకాలం వక్ఫ్ ట్రిబ్యున ళ్లకు ఉండే అధికారం కాస్తా కలెక్టర్లకు ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.బోర్డుల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించటం, ఆస్తిని విరాళంగా ఇవ్వటంపై ఆంక్షలు సంశయం కలిగించేవే. మతపరమైన, ధార్మికపరమైన కార్యకలాపాల నిర్వహణ కోసం వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించటానికి ఏర్పడిన బోర్డుల్లో వేరే మత విశ్వాసాలున్నవారిని నియమించటం ఏరకంగా చూసినా సరికాదన్న ఇంగిత జ్ఞానం ఉండొద్దా? అసలు ఒకసారి బోర్డు దేన్నయినా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని మార్చటం అసాధ్యమన్న ప్రచారం కూడా తప్పు. ఫలానా ఆస్తి బోర్డుదనుకుంటే సంబంధిత వర్గాలకు నోటీసులిచ్చి వారి వాదనలు పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత చట్టంలోని సెక్షన్40 చెబుతోంది. అటు తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్‌దే తుది నిర్ణయం. పైగా విరాళమిచ్చిన దాత కచ్చితంగా ఇస్లాంను పాటించే వ్యక్తే అయివుండాలని, దానంగా వచ్చే ఆస్తి కుటుంబవారసత్వ ఆస్తి కాకూడదని చట్టం నిర్దేశిస్తోంది. ఇప్పటికే ఇన్ని కట్టుదిట్టమైన నిబంధనలుండగా అందుకు భిన్నంగా ప్రచారం చేయటం సబబేనా? ఈ పరిస్థితుల్లో బిల్లు చట్టమైతే వక్ఫ్ ఆస్తుల చుట్టూ వివాదాలు ముసురుకుంటాయనుకునే అవకాశం లేదా? సంకీర్ణంలోని జేడీ(యూ), ఎల్జేపీలు బిల్లుకు మద్దతు పలకగా సభలో టీడీపీ సంకటస్థితిలో పడిన వైనం స్పష్టంగా కనబడింది. ఆ బిల్లుకు మద్దతిస్తుందట...కానీ జేపీసీకి ‘పంపితే’ వ్యతిరే కించబోదట! ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పుట్టుకొచ్చిన బాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇంకా సజీవంగా ఉందన్నమాట! టీడీపీది చిత్రమైన వాదన. అలా పంపనట్టయితే వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించబోమని చెప్పడానికి నోరెందుకు రాలేదు? ఒకపక్క బిల్లు చట్టమైతే పారదర్శకత ఏర్పడుతుందన్న ప్రభుత్వ వాదనను సమర్థిస్తూనే తమ సెక్యులర్ వేషానికి భంగం కలగకుండా ఆడిన ఈ డ్రామా రక్తి కట్టలేదు. జాతీయ మీడియా దీన్ని గమనించింది. మొత్తానికి సవరణ బిల్లు జేపీసీకి వెళ్లటం శుభ పరిణామం. ఎన్డీయే సర్కారు ఈ సంప్రదాయాన్ని మున్ముందు కూడా పాటించటం ఉత్తమం. -
వివాదాస్పద భూములపై... నిర్ణయాధికారం కలెక్టర్లకే
కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు తేనెతుట్టను కదిపింది. విపక్షాలు, ముస్లిం సంస్థలు దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియను సెంట్రల్ పోర్టల్ ద్వారా క్రమబదీ్ధకరించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ భూముల యాజమాన్య హక్కులపై వివాదం తలెత్తితే ఇప్పటిదాకా వక్ఫ్ ట్రిబ్యూనల్‌కు నిర్ణయాధికారం ఉండేది. కొత్త బిల్లు ఈ అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెడుతోంది. వక్ఫ్ చట్టం–1995ను ఇకపై యునిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్‌గా మారుస్తోంది. మొత్తం 44 సవరణలను ప్రతిపాదిస్తోంది. వక్ఫ్ అంటే ఏమిటి? ఇస్లామిక్ చట్టం కింద మతపరమైన, ధారి్మక కార్యక్రమాల నిమిత్తం అంకితం చేసిన ఆస్తిని వక్ఫ్‌గా పేర్కొంటారు. ఒకసారి వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తే.. ఇక అది అంతిమం. దాన్ని తిరగదోడటానికి ఉండదు. ఈ అంశంపై దృష్టి సారించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. 9 లక్షల ఎకరాలు దేశంలోని 30 వక్ఫ్ బోర్డులు 9 లక్షల పైచిలుకు ఎకరాలను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారత్‌లో పెద్ద మొత్తంలో భూములు కలిగి ఉన్న వాటిల్లో రైల్వేలు, రక్షణ శాఖ తర్వాత వక్ఫ్ బోర్డులు మూడోస్థానంలో ఉన్నాయి. బిల్లులోని కీలకాంశాలు → ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టింది వక్ఫ్ చట్టం– 1995. అందులోని సెక్షన్– 40 ఇందుకు వీలు కలి్పంచింది. కొత్త బిల్లులో ఈ సెక్షన్– 40 రద్దుకు ప్రతిపాదించారు. ఇలా చేయడం ద్వారా వక్ఫ్ బోర్డుల చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని లాగేసుకుంటోందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దుమారం రేగుతోంది. → కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ ఏర్పాటు. కౌన్సిల్లో, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరేసి ముస్లిం మహిళలకు చోటు. ముస్లిమేతరులకూ స్థానం. ఇద్దరు లోక్‌సభ, ఒక రాజ్యసభ ఎంపీకి కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో చోటు కలి్పంచాలి. ఈ ముగ్గురు ఎంపీలు ముస్లింలే అయ్యుండాలనే నిబంధనేమీ లేదు. పాత చట్టం ప్రకారం తప్పనిసరిగా ముస్లిం ఎంపీలకే కౌన్సిల్లో చోటు ఉండేది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కూర్పును మార్చే అధికారాన్ని కూడా బిల్లు కేంద్రానికి కట్టబెడుతోంది. → ఒక ఆస్తి వక్ఫ్‌కు చెందినదా, ప్రభుత్వానిదా అనే వివాదం తలెత్తితే ఇక కలెక్టర్లదే నిర్ణయాధికారం. వక్ఫ్ చట్టం–1995 సెక్షన్– 6 ప్రకారం ఇలాంటి వివాదాల్లో వక్ఫ్ ట్రిబ్యునళ్లు తీర్పు చెప్పేవి. వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటున్న దేన్నైనా కలెక్టర్ ప్రభుత్వ భూమిగా తేలి్చతే ఆ మేరకు రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచొచ్చు. అక్రమంగా ఆస్తులు దక్కించుకోవడానికి స్వార్థపరులు ట్రిబ్యునళ్లను అడ్డం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. → ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా నమోదు చేసే ముందు సంబంధిత పక్షాలన్నిటికీ నోటీసులు ఇవ్వడం. రెవెన్యూ చట్టాల ప్రకారం నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి మ్యూటేషన్ చేయడానికి మార్గదర్శకాలను రూపొందించడం. → కాగ్ నియమించిన ఆడిటర్ ద్వారా ఏదేని వక్ఫ్ బోర్డు ఆస్తుల తనిఖీకి ఆదేశించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లు దఖలు పరుస్తుంది. → బోరాలు, అగాఖానీల కోసం ప్రత్యేకంగా ఔఖాఫ్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వక్ఫ్ బోర్డుల్లో షియాలు, సున్నీలు, బోరాలు, ఆగాఖానీలు, ముస్లింలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూస్తుంది. → తన ఆస్తిని దానంగా ఇవ్వడానికి ఒక వ్యక్తి సిద్ధపడినపుడు.. అతను రాసిన చెల్లుబాటయ్యే అంగీకారపత్రాన్ని (వక్ఫ్‌నామా)ను కొత్త బిల్లు తప్పనిసరి చేస్తోంది. ప్రస్తుతం ఒక వ్యక్తి మౌఖికంగా కూడా తన ఆస్తిని వక్ఫ్‌కు ఇవ్వొచ్చు. → ఐదేళ్లుగా ఇస్లాంను ఆచరిస్తూ.. ఆస్తిపై యాజమాన్య హక్కులున్నపుడే వక్ఫ్ ఇవ్వొచ్చు. → వక్ఫ్ బోర్డులకు వచ్చే డబ్బును వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, అనాథల సంక్షేమం కోసం వినియోగించాలి. అదీ ప్రభుత్వం సూచించిన పద్ధతుల్లో. – నేషనల్ డెస్క్, సాక్షి -
Waqf Amendment Bill 2024: జేపీసీకి వక్ఫ్ (సవరణ) బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి. సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత ‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’ – సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్) పారదర్శకత కోసమే మద్దతు‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు ‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి. – రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రిరాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ మద్దతు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. -
లోక్‌సభ ముందు వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు.. ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న మిథున్‌రెడ్డి
-
Lok Sabha: వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు.కాగా, ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. బిల్లును సభలో ప్రవేశపెట్టే మందు ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. ఇక, ఈ బిల్లును వైఎస్సార్సీపీ, టీఎంసీ, ఎస్పీ, కాంగ్రెస్, మజ్లిస్, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే, టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి.ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్..వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, అధికారాల విభజనకు విఘాతం కలిగిస్తుంది. వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయి. ఆర్టికల్-25కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉంది. అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారు. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
వక్ఫ్ కళ్లకు గంతలు..!
పాలమూరు పట్టణం నడిరోడ్డున... మహబూబ్‌నగర్–రాయచూర్ ప్రధాన రహదారిపై కోట్లాది రూపాయల విలువైన ‘వక్ఫ్’ కాంప్లెక్స్. అందులో 18 బ్లాకులు.. వాటి పరిధిలో అబ్బురపడే విధంగా మొత్తం 463 షాపులు. నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే బ్లాకులు..అక్కడి మార్కెట్ విలువ ప్రకారం నెలకు ఒక్కో షాపు కిరాయి రూ. 3వేల నుంచి రూ. 20వేలపైనే. సగటున రూ.5 వేల చొప్పున లెక్కేసుకున్నా ప్రతినెలా రూ.23.15లక్షలు ఉండాలి. కానీ అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆయా షాపుల నుంచి వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యాలయానికి అందుతోన్న అద్దె కనిష్టంగా రూ.350. గరిష్టంగా రూ.10వేలు. ఇందులో సగటున రూ.3వేల చొప్పున లెక్కించినా.. ప్రతి నెల రూ. 13.89లక్షలు రావాలి. కానీ.. ప్రస్తుతం అందుతోంది కేవలం అక్షరాల రూ.4,43,308 మాత్రమే. మార్కెట్ విలువ ప్రకారం రావాల్సిన.. ప్రస్తుతం వసూలవుతున్న కిరాయిలను పరిశీలిస్తే ఆ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న అద్దె బాగోతం ఇట్టే తెలుస్తుంది. ప్రతి నెలా రూ.23.15లక్షల వరకు వసూలు కావాల్సిన అద్దె కేవలం రూ.4.43లక్షలు మాత్రమే ఎందుకు వసూలవుతుందో సమాధానం అధికారులే చెప్పాలి. వక్ఫ్ అధికారులు దుకాణాలపై నిర్ణయించిన అద్దెపై అనేక విమర్శలు వస్తున్నాయి. సాక్షి , మహబూబ్‌నగర్: పాలమూరు బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే కాంప్లెక్స్‌ను ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు గాలికొదిలేశారు. ఆ కాంప్లెక్స్‌లో అద్దె మాయాజాలంతో పాటు బినామీ బాగోతమూ వెలుగుచూసినా అటువైపు కన్నెత్తిచూడడం లేదు. అంతేకాదూ.. ఎనిమిది షాపులు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వెలువెత్తి, కాంప్లెక్స్‌కు చెందిన ఓ వ్యక్తిపై ఆరు నెలల క్రితమే పోలీసు కేసు నమోదైనా ఒక్కసారి కూడా ఆరా తీసిన పాపాన పోలేదు. కాంప్లెక్స్‌లో జరుగుతోన్న అక్రమాల గురించి స్థానిక వక్ఫ్ ఇన్స్పెక్టర్ రాష్ట్ర శాఖకు నివేదించినా ఇంత వరకు ఎలాంటి అధికారుల తీరుపై పుర ప్రజలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ నిబంధనల ప్రకారం.. లీజు పొందిన పదకొండు నెలల తర్వాత సదరు లీజుదారుడు మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అద్దె కూడా పదిశాతం పెంచాలి. అయితే ఈ నిబంధన కొన్నేళ్ల నుంచే అమలుకు నోచుకుంటోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంప్లెక్సేతర దుకాణాల అద్దె రూ.15వేల పైనే ఉండడం.. వక్ఫ్ కాంప్లెక్స్‌లో మాత్రం గరిష్టంగా రూ. 10వేలు కూడా దాటకపోవడం గమనార్హం. షాపు ఒకరిది.. నిర్వహణ మరొకరిది.. నిబంధనల ప్రకారం లీజుదారులెవరూ తమ దుకాణాలను సబ్ లీజుకు ఇవ్వకూడదు. అలా చేసిన వ్యక్తి లీజును రద్దు చేసే అధికారం వక్ఫ్ బోర్డు అధికారులకు ఉంది. కానీ స్థానిక కాంప్లెక్స్‌లో పలువురు తమ దుకాణాలను ఇతరులకు సబ్ లీజుకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుమారు 300 దుకాణాలు సబ్ లీజుపై కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు లీజుదారులు దుకాణాల నిర్వహణ భారమైనందున తమ వ్యాపారంలో మరొకరిని కలుపుకున్నామని.. సబ్ లీజుకు మాత్రం ఇవ్వలేదని సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి లీజుదారులు తమ పేరిట మంజూరైన దుకాణాలను సబ్ లీజుకు ఇచ్చి వారి నుంచి ప్రతి నెల రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. అదే వక్ఫ్‌బోర్డుకు మాత్రం తాము వసూలు చేసిన దాంట్లో 30శాతం మాత్రమే అద్దె రూపంలో చెల్లిస్తున్నట్లు స్థానిక వక్ఫ్ అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపితేనే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెరచాటున విక్రయాలు? అటు వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరును అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి తన పేరిట మంజూరైన ఎనిమిది షాపులను ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక వక్ఫ్ ఇన్స్పెక్టర్ ముహమ్మద్ గౌస్ గతేడాది జనవరిలోనే సదరు వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సదరు వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ విచారణలో అడుగు ముందుకు పడలేదు. ఇంత జరిగినా రాష్ట్రస్థాయి అధికారులెవరూ ఈ అక్రమ వ్యవహారంపై విచారణ చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా జరుగుతోన్న అక్రమాల వెనక రాష్ట్రాధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క సీఎం కేసీఆర్ వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధికారులకు నివేదించాం మహబూబ్‌నగర్‌లోని వక్ఫ్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న అక్రమ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై ఇది వరకే విచారణ చేపట్టాను. ఇందులో పలు అక్రమాలు వెలుగుచూశాయి. వాటికి సంబంధించిన నివేదికను రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులకు పంపించాను. వక్ఫ్ ఆస్తులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం. లీజుదారులు కూడా తమ దుకాణాలను సబ్ లీజుకు ఇవ్వకూడదు. – ముహమ్మద్ గౌస్, వక్ఫ్ ఇన్స్పెక్టర్ -
ఆ ఇద్దరు!
►ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత హరీష్, శరత్పైనే ►90 శాతం వక్ఫ్, దేవాదాయ భూములు పరాధీనం ►33 వేల ఎకరాలున్నా ‘వక్ఫ్’ ఆదాయం రూ.16 వేలే.. ►లక్షలాది ఎకరాల శిఖం భూములు మాయం ►ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవుళ్లు ►సీఎం ప్రకటనతో భూముల స్వాధీనానికి కసరత్తు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గొలుసుకట్టు చెరువులు.. లక్షల ఎకరాల సర్కారీ భూములు.. మెతుకుసీమ ఆస్తులు. చెరువు నిండి చెలక పారితే.. భూమి శిస్తులతో ప్రభుత్వ ఖజానా కళకళలాడేది. నిజానికి తెలంగాణ వారసత్వ సంపద కూడా ఇవే. కాని ఇప్పుడా వైభవం లేదు. కాలంతో పాటే చెరువులు, కుంటలు, శిఖం భూములు కరిగిపోయాయి. ఎక్కడికక్కడ భూములను ఆక్రమించి అమ్ముకున్నారు. చెరువు శిఖం భూముల నుంచి ప్రభుత్వానికి ‘దమ్మిడీ’ ఆదాయం లేదు. రాష్ట్రంలోనే ఎక్కువ వక్ఫ్ బోర్డు ఆస్తులున్న జిల్లాలో నెల రాబడి కేవలం 16,500 రూపాయలే. ధూపదీప నైవేద్యానికి నోచుకోని ఆలయాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొలుసుకట్టు చెరువుల పునర్నిర్మాణం, ఆక్రమిత భూముల స్వాధీనం సవాల్‌గా మారింది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం, కేసీఆర్ సొంత జిల్లాలోనే వేలకు వేల ఎకరాలు ఆక్రమణకు గురై ఉండటం అటు మంత్రి హరీష్‌రావుకు, ఇటు ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు ఓ సవాల్‌గా మారింది. అబ్బో.. ఎంత భూమో..! జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కలిపి 23 వేల ఎకరాల వక్ఫ్ భూములున్నట్లు ఇటీవల ప్రభుత్వం జరిపిన ప్రాథమిక సర్వేలో బయటపడింది. ఇందులో 99 శాతం భూమి కబ్జా అయింది. వీటికి సరైన రికార్డు లేకపోవడం, ఆస్తులు రెవెన్యూ అధికారుల అజమాయిషీలో కాకుండా ముతావలీల చేతిలో ఉండటంతో సులువుగా ఆక్రమణకు గురయ్యాయి. దాదా పు 20 వేల ఎకరాలకు పైగా ఉన్న దేవాదాయ భూములు చివరకు 3,651 ఎకరాలకు చేరుకున్నాయి. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 180 దేవాలయాల కింద 3,651 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు దేవాదాయ శాఖ రికార్డులను బట్టి తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత భూమి కబ్జా అయిందనే సమాచారం అధికారుల వద్ద లేదు. 6,789 చెరువుల కింద 1,03,468.14 ఎకరాల శిఖం భూమి ఉంది. చెరువు ఎఫ్టీఎల్ భూములను కలుపుకుంటే ఇది 2.5 లక్షల ఎకరాలకు మించి ఉంటుంది. అన్ని రకాల భూములను కలుపుకుంటే జిల్లాలో 3,60,381.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న ట్లు రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. ఇందులో 60 శాతం భూమి ‘వైట్ కాలర్’ దోపిడీదారుల గుప్పిట్లో పడి నలిగిపోయింది. వేల ఎకరాల భూములు తిరిగి రావాలంటే జిల్లా భౌగోళిక స్వరూపం, భౌతిక పరిస్థితులతో పాటు రెవెన్యూ రికార్డులు, భూ సర్వే మీద బాగా పట్టున్న అధికారులు అవసరం. అయితే నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌కు జిల్లా భౌగోళిక పరిస్థితులపై మంచి పట్టుంది. హరీష్‌కు సవాలే...! జిల్లా ఇన్చార్జి మంత్రిగా హరీష్ గొలుసుకట్టు చెరువుల మీద ద ృష్టి సారించారు. గొలుసుకట్టు చెరువులు తెలంగాణ సంస్కృతిలో భాగమంటున్న హరీష్ .. అడ్డంకులను అధిగమించి చెరువుల పునర్నిర్మాణం చేస్తామని అంటున్నారు. ప్రతి చెరువును రక్షించి తీరుతామంటున్నారు. చెరువుల పూడికతీత పనుల్లో జరిగిన భారీ అక్రమాలపై సర్వే చేయించినట్లు సమాచారం. పటాన్‌చెరులోని 9 చెరువు పనుల్లో జరిగిన అక్రమాలను ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఆక్రమించిన వక్ఫ్ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమణదారులు ఎంతటి పెద్దవాళ్లయినా వదలబోమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే ప్రకటించిన మంత్రి, సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోనే వక్ఫ్ భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలు కూల్చివేసి ఆక్రమణదారులకు బలమైన సంకేతాలు పంపించారు. శరత్‌కు సాధ్యమేనా? ఆక్రమిత భూముల పరిరక్షణకు రెవెన్యూ, సర్వే, భూ రికార్డులే ఆధారం. ఈ రికార్డులపై మంచి పట్టున్న అధికారిగా శరత్‌కు గుర్తింపు ఉంది. ప్రభుత్వ భూముల కోసం ఒక ప్రత్యేక ఫార్ములా రూపొందించి, దాని ఆధారంగా గుర్తించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిని మొత్తం 15 కేటగిరీలుగా విభజన చేశారు. ఏ కేటగిరీలో ఎంత భూమి ఉందో స్పష్టంగా రికార్డులు తయారు చేసిపెట్టారు. నిజానికి ప్రభుత్వ భూమి ఎక్కడ ఎంత ఉంది? ఎవరి ఆధీనంలో ఉందో శరత్‌కు తెలిసినంతగా ఇతరులకు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఆయన సేవలను వినియోగించుకోవాలని మంత్రి హరీష్‌రావు యోచిస్తున్నట్టు సమాచారం.