Radhakrishnan
-
నేడు గవర్నర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీకి గవ ర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం గవర్నర్‌తో జరిగే భేటీలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది.క్షేత్రస్థాయిలో ప్రొటోకాల్ ఉల్లంఘనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సాక్ష్యాధారాలను గవర్నర్‌కు బీఆర్ఎస్ బృందం అందజేస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు, వారిపై పోలీస్ కేసుల నమోదు వంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నా రు. ఈ నెల 23న రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని కేటీఆర్ రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికి అనర్హత వేటు పడకుంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ఎత్తిచూపాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేస్తోంది. -
హస్తినలో ‘బంగారు బోనం’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు రెండు రోజుల పాటు ఘనంగా జరిగాయి. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో బుధవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు లాల్‌దర్వాజ అమ్మవారి బోనాల కమిటీ సభ్యులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బంగారు బోనాన్ని ఎత్తుకుని సింహవాహిని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పూజల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేవుడు ఒక్కడేనని.. భిన్న రూపాల్లో మనం దేవుడిని కొలుస్తామని అన్నారు. ఇదే సెక్యులరిజానికి నిజమైన నిర్వచనమని పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో ఈ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుందని గవర్నర్ రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సింహవాహిని శ్రీమహంకాళి దేవాలయ కమిటీ అధ్యక్షుడు సి.రాజేంద్రయాదవ్, ఇతర ముఖ్యులు గవర్నర్‌కు జ్ఞాపికను అందించారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన బోనాల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు కర్తవ్యపథ్ నుంచి తెలంగాణభవన్ వరకు నిర్వహించిన అమ్మవారి ఘట ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు డోలు, డప్పు దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
7 బిల్లులకు గవర్నర్ ఓకే
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శనివారం ఆమోదం తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులతో పాటు తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) బిల్లు, తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గత సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సుమారు రెండు గంటలపాటు సమావేశమై పెండింగ్ బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన చాలా బిల్లులను నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించకుండా సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టారు. దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో తమిళిసై కొన్ని బిల్లులను మాత్రమే ఆమోదించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లును రాష్ట్రపతికి పంపించారు. మిగిలిన బిల్లులను తిరస్కరించడం లేదా ప్రభుత్వానికి తిప్పి పంపించడం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లుల్లో నాలుగింటిని గత బీఆర్ఎస్ సర్కారు రెండోసారి రాష్ట్ర శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపినా తమిళిసై ఆమోదించలేదు. తాజాగా ఏడు బిల్లులను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. మరో ఐదు ప్రైవేటు వర్సిటీలకు చాన్స్ తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలు కలగనుంది. ఈ బిల్లును బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించింది. కాగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఎన్‌ఐసీఎంఏఆర్ (NICMAR) యూనివర్సిటీ, సంగారెడ్డిలో ఎంఎన్ఆర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురునానక్, మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం యామ్నంపేటలో శ్రీనిధి, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో కావేరి వర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ‘అవిశ్వాసం’ ఇక నాలుగేళ్ల తర్వాత.. మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు–2022కు ఆమోదముద్ర లభించడంతో మున్సిపల్ చైర్పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీస కాల వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెరిగింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మేయర్లు/చైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టడానికి వారి పదవీ కాలం కనీసం మూడేళ్లు ముగిసి ఉండాలని మున్సిపాలిటీల చట్టం పేర్కొంటోంది. మేయర్లు/చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు/డిప్యూటీ మేయర్లను బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి కౌన్సిలర్లు/కార్పొరేటర్లు ఈ నిబంధనను దురి్వనియోగం చేస్తున్నారని పేర్కొంటూ గత ప్రభుత్వం ఈ వ్యవధిని 4 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన చేసింది. రాజ్యసభ సభ్యులకూ ఓటు హక్కు మున్సిపాలిటీల ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వ్యవహరిస్తారని మునిసిపాలిటీల చట్టంలో ఉండగా, చైర్పర్సన్/మేయర్, వైస్ చైర్పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటేసే హక్కు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులకు మాత్రమే ఉన్నట్టు చట్టంలో ఉంది. ‘రాజ్యసభ సభ్యులు’ అనే పదాన్ని చేర్చడంలో చట్టం రూపొందించే సమయంలో పొరపాటున మరిచిపోయారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటు హక్కును కల్పిస్తూ ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది. – ఇక జీహెచ్ఎంసీలో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులకు గాను ఇద్దరు మైనారిటీలు ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 9కి, వారిలో మైనారిటీల సంఖ్య 6కి పెంచాలనే మరో ప్రతిపాదన ఈ బిల్లులో పెట్టారు. మున్సిపాలిటీగా ములుగు ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, కేతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్పు సంబంధిత అంశం కూడా బిల్లు ద్వారా ప్రతిపాదించారు. దీనిని కూడా రెండోసారి శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించారు. 3 పంచాయతీలుగా భద్రాచలం తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023కు ఆమోదం లభించడంతో పాలన వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా, సారపాకను రెండు గ్రామ పంచాయతీలుగా విభజించడానికి, రాజంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. మైనారిటీల జాబితాలో జైనులు – తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రంలోని మైనారిటీల జాబితాలో జైనులకు కూడా చోటు లభించింది. రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలతో పాటు కొత్తగా జైన మతస్తుడిని సైతం సభ్యుడిగా నియమించడానికి వీలు కలిగింది. – తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) బిల్లు ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు బోధనాస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. -
గవర్నర్ ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్‌కు గుంటూరు ఆర్డీవో శ్రీకర్, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం నివాసానికి బయలుదేరి వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్.. చంద్రబాబును కలిశారు. -
నీట్ పేపర్ లీక్ : కేంద్రం దిద్దుబాటు చర్యలు
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు కమిటీ సభ్యుల్ని నియమించింది. లీకేజీపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, కేంద్రం ఆదేశాలతో.. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్ష విధానంలో సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు , డేటా సెక్యూరిటీ తదితర అంశాలపై కమిటీ సిఫారసులు చేయనుంది. రాధాకృష్ణన్‌తో పాటు కమిటీలో ఎయిమ్స్ ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదారబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామమూర్తి, ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ఎమిరిటస్,కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్,ఐఐటీ ఢిల్లీ డీన్ (విద్యార్ధి వ్యవహారాలు) ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ సభ్యులుగా ఉన్నారు.Ministry of Education constitutes a High-Level Committee of Experts to ensure transparent, smooth and fair conduct of examinations. Committee to make recommendations on Reform in the mechanism of the examination process, improvement in Data Security protocols and structure and… pic.twitter.com/TJ9NqqUJMi— ANI (@ANI) June 22, 2024 -
అవతరణ అంటే కేసీఆర్‌కు అగౌరవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ దినోత్సవమంటే ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు గౌరవం లేదని.. ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోని నాయకుడు ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశ విభజన తర్వాత కావాలని ఓ రోజు ముందే ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే పాకిస్తాన్ తరహాలో.. కేసీఆర్ సైతం ఒక రోజు ముందు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకొన్నారని వ్యాఖ్యానించారు.కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంట్ ఏమీ లేదని, ఉన్నదంతా వ్యాపారమేనని విమర్శించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘అమర వీరుల స్తూపం చుట్టూ ఇనుప కంచె ఏర్పాటుతో మాకు సంబంధం లేదు. ఎన్నికల కోడ్ కాబట్టి అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లడానికి ఈసీ అనుమతి అవసరం. మేం ఈసీ నుంచి అనుమతి తీసుకున్నాకే ఆవిర్భావ వేడుకలకు సోనియా గాం«దీని ఆహా్వనించాం. ఆరోగ్య సమస్యల రీత్యా ఆమెకు సుదీర్ఘ ప్రయాణాలు ఇబ్బందికరం. ఆమె రావాలని ఆశిస్తున్నాం. అమరులంటే కేసీఆర్‌కు ద్వేషమెందుకు? రాష్ట్ర అధికార చిహ్నంలో అమరవీరుల స్తూపం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్, కేటీఆర్‌లకు.. అమరవీరులు, వారి కుటుంబాలు, అమరవీరుల స్తూపం అంటే ఎందుకు ద్వేషం? రూ.వెయ్యి కోట్లతో హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం పక్కనే అమర వీరుల స్థూపం కట్టాలని 2014లో జరిగిన మహానాడులో నేను డిమాండ్ చేశాను కూడా. రాష్ట్ర గీతం, చిహ్నంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించలేదన్న బీఆర్ఎస్ ఆరోపణలు సరికాదు. ఆహ్వానించేందుకు అపాయింట్మెంట్ కోరాం. కానీ వాళ్లు రోడ్డెక్కి తాము చెప్పేది చెప్పేశారు. ఆవిర్భావ వేడుకలకు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డిలను కూడా ఆహ్వానించాం. తెలంగాణ అమరవీరులను గుర్తించడానికి కమిటీ వేశాం. గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఎఫ్ఐఆర్ల సేకరణ కోసం ప్ర త్యేక వ్యవస్థ ఏర్పాటు చేశాం. గేయంలో మార్పులపై అందెశ్రీనే అడగండి రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతను పూర్తిగా రచ యిత అందెశ్రీకి అప్పగించాం. అందులో పదాల మార్పు, సంగీత దర్శకుడిగా కీరవాణిని ఎంపిక చేసే నిర్ణయం కూడా అందెశ్రీదే. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్‌లాగా మేం కాంట్రాక్టులు ఇవ్వలేదు. ఔట్ సోర్సింగ్ చేసి కమీషన్లు పొందలేదు. అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం తొలగింపుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయులను చూస్తాను. రెడ్డి, కమ్మ, వెలమ రాజులుగా చూడను. బీఆర్ఎస్లా రాజకీయం చేయలేదు రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు. సాంకేతిక అంతరాయాలు కూడా బాగా తగ్గాయి. రాష్ట్రంలోని ఏ సబ్‌స్టేషన్‌కైనా వెళ్లి లాగ్‌బుక్స్‌ను తనిఖీ చేయడానికి సిద్ధం. బీఆర్ఎస్ పాలనలో సైతం అంతరాయాలు ఉండేవి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా అప్పుడు మేం రాజకీయం చేయలేదు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధాని చేస్తే మూడేళ్లకే ఏపీవారు వెళ్లిపోయారు. ఇప్పుడు గడువు పొడిగించాలని కోరడంలో అర్థం లేదు. పేద రైతులకే రైతు భరోసా! వానాకాలం పంటలకు రైతు భరోసా అమలుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. లక్ష ఎకరాల వ్యవసాయేతర భూములకూ గతంలో రైతుబంధు ఇచ్చారు. ‘నేను అడ్డగోలుగా చేశా.. మీరూ చేయాలి’ అని కేసీఆర్ అంటున్నారు. సంపన్నులు, లేఅవుట్లకు కాకుండా అర్హులైన రైతులకే ఇస్తాం. పేదలకు సాయం చేయడమే ప్రభుత్వ పథకాల లక్ష్యం. ప్రభుత్వ పథకాలకు అర్హత తెల్ల రేషన్‌కార్డు, పేదరికమే. ఆర్టీసీ బస్సు చార్జీలు చెల్లించే స్తోమత గల మహిళలు స్వచ్ఛందంగా ఉచిత ప్ర యాణాలను విరమించుకోవాలని అప్పీల్ చేస్తాం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. కొత్త విగ్రహం రూపకల్పన బాధ్యతను ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌కు అప్పగించాం. ఉద్యమ సమయంలో తెలంగాణ యువత గుండెలపై ‘టీజీ’ అనే అక్షరాలను పచ్చ»ొట్టు పొడిపించుకున్నారు. అందుకే ‘టీఎస్’కి బదులు ‘టీజీ’గా మార్చాం. నేటితో తెలంగాణకు సంపూర్ణ విముక్తిసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏర్పాటై పదకొండో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ఏళ్ల తరబడి సాగిన ఉద్యమంలో పా లు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహి ళలు, రాజకీయ పారీ్టల నేతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలరి్పంచిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇకపై తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన ప్రజలకే దక్కుతాయి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునరి్నర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. గత పదేళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పో యిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాం.తెలంగాణ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజా పాలనను అందిస్తాం. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైంది.’అని శనివారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్ వెల్లడించారు. నేటితో తెలంగాణకు సంపూర్ణ విముక్తి⇒ ఇకపై తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని ⇒ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం ⇒ప్రజలకు సీఎం రేవంత్ దశాబ్ది శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏర్పాటై పదకొండో సంవత్సరంలోకి అడుగుపెడుతోందని, ఏళ్ల తరబడి సాగిన ఉద్యమంలో పా లు పంచుకున్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగు లు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహి ళలు, రాజకీయ పారీ్టల నేతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు.‘ఈ ఏడాది జూన్ 2కు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజుతో తెలంగాణ స్వరాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇకపై తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సింహభాగం మన ప్రజలకే దక్కుతాయి. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. గత పదేళ్లలో తెలంగాణలో విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టడంతో పాటు, ఇంతకాలం కోల్పో యిన ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాం. తెలంగాణ ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజా పాలనను అందిస్తాం. అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్ ప్రణాళికలు, సరికొత్త విధానాల రూపకల్పన మొదలైంది.’అని శనివారం ఒక ప్రకటనలో సీఎం రేవంత్ వెల్లడించారు. ఓ బ్రాండ్ విత్తనాలే అడుగుతుండటంతో సమస్య ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే పత్తి విత్తనాల కొరత ఉంది. మహారాష్ట్ర రైతులు ఆ జిల్లాకు విత్తనాల కోసం రావడంతోనే సమస్య వస్తోంది. గతేడాది కంటే ఈసారి 10 శాతం అధికంగా విత్తనాలను సమీకరించి పెట్టాం. ఓ బ్రాండ్ విత్తనాలనే రైతులు కోరుతుండటంతో సమస్య వచి్చంది.టీచర్లందరినీ ఒకే గాటన కట్టొద్దు.. ప్రభుత్వ టీచర్లు విధులు ఎగ్గొట్టి రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు సరికాదు. అందరినీ ఒకే గాటనకట్టొద్దు. వైద్యశాఖలో నియమితులైన ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఒక నెల జాప్యం జరిగింది. గత ప్రభుత్వంలో కూడా ఇలా జాప్యం జరిగిన సందర్భాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లపై ఆరోపణలు రుజువు కాకముందే వారికి చట్టబద్ధంగా అందాల్సిన హక్కులను ఆపలేం. ఇంజనీర్ల సంఘాలను ఆందోళన కాదు.. ఆమరణ దీక్ష చేసుకొమ్మనండి.. చూద్దాం..త్వరలోనే కొత్తవారికి పీసీసీ పగ్గాలు జూన్ 27తో పీసీసీ అధ్యక్షుడిగా నా పదవీకాలం ముగుస్తుంది. నేను సీఎం అవడంతో.. ఇతరులకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వస్తుంది. దీనిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. 9 నుంచి 12 లోక్‌సభ సీట్లు, రెండు ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంటుంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం నుంచి నలుగురు కేంద్ర మంత్రులు అవుతారు.ఎక్కువగా తాగడంతోనే బీర్ల కొరత తాగడం ఎక్కువ కావడంతోనే రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. అందులోనూ ఓ బ్రాండ్‌కు గిరాకీ పెరిగింది. సదరు కంపెనీ ఆ మేరకు ఉత్పత్తి చేయడం లేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సమీక్ష జరపలేదు. బాధితుల వివరాలు నాకు తెలియదు. గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు భారీగా ఆస్తులున్నట్టు నాకు తెలియదు. ఆ కేసుపై నాకు ఎలాంటి నివేదిక అందలేదు.గవర్నర్ దశాబ్ది శుభాకాంక్షలుసాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రాన్ని సాధించుకోవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ సాధనకు ప్రాణాలర్పించిన యువత బలిదానాలను గుర్తు చేసుకుని, వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని ఆయన ప్రారి్థంచారు. విద్యార్థులు, యువత బలిదానాలతో తెలంగాణ కల సాకారమైందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, నేతలు, విధానరూపకర్తల కఠోర శ్రమ.. అన్ని రంగాల్లో తెలంగాణ పురోభివృద్ధి కొనసాగింపునకు దోహదపడుతుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు సీఎం ఆహ్వనం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ఆహ్వనించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి శనివారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆహ్వనపత్రిక అందజేశారు. ఆదివారం పరేడ్ మైదానంలో నిర్వహించనున్న వేడుకల విశేషాలను గవర్నర్‌కు వివరించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హాజరవుతారని తెలిపారు. -
అందరి వాణి వింటా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలు, సామాన్య ప్రజలకు రాజ్‌భవన్ అత్యంత నిబద్ధతతో నిర్విరామ సహకారం అందిస్తుందని రాష్ట్ర నూతన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. తాను అందరి వాణిని వింటానని, ప్రతి ఆందోళనను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఎల్లవేళలా సమర్థిస్తూ, గౌరవించేలా, అత్యంత శ్రద్ధతో తన విధులను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేశారు. న్యాయం, సమగ్రత, నిష్పాక్షికత సూత్రాలకు కట్టుబడి దృఢ నిబద్ధతతో పనిచేస్తానన్నారు. రాష్ట్రం, ప్రజల అభ్యున్నతికి అత్యంత అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మూడో గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, మాజీ గవర్నర్లు సీహెచ్ విద్యాసాగర్‌రావు, రామ్మోహన్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ ప్రసంగించడంతో పాటు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఓ సందేశాన్ని విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వండి ప్రజల అవసరాలు, ఆకాంక్షలను పరిష్కరించడానికి ప్రాధాన్యతనివ్వాలని అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజా సంఘాలకు రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, న్యాయం, కరుణ అనే సూత్రాల ఆధారంగా మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గొప్ప చరిత్ర, సంస్కృతి, పటిష్ట ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రమని, వ్యవసాయం, ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో విశేష ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. లక్షలాది మందికి లబ్ధి చేకూర్చే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. తెలంగాణ గవర్నర్‌గా పని చేసే అవకాశం కల్పించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా కొత్త గవర్నర్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రివర్గంతో గవర్నర్ గ్రూపు ఫోటో దిగారు. ఇంతకుముందు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్‌కు అదనంగా తెలంగాణ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చార్మినార్: గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానంతరం బుధవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీమణితో కలిసి వచ్చిన ఆయనకు ఆలయ ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. యాదాద్రి మరో వెయ్యేళ్లు నిలుస్తుంది యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అద్భుతంగా ఉందని గవర్నర్ అన్నారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని, మరో వెయ్యేళ్లు అద్భుతంగా నిలుస్తుందని చెప్పారు. గర్భాలయంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఒళ్లు పులకరించిందని అన్నారు. అంతకుముందు గవర్నర్‌కు సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే, ఇతర అధికారులు, అర్చకులు తూర్పు త్రితల రాజగోపురం ముందు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులను గవర్నర్ దర్శించుకున్నారు. ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. సీఎస్ శ్రీస్వామి వారి చిత్రపటాన్ని అందజేయగా, ఈవో భాస్కర్‌రావు లడ్డూ ప్రసాదం ఇచ్చారు. శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీపుష్ప యాగం వేడుకలో గవర్నర్ పాల్గొన్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద మొక్కి, సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని రాసి సంతకం చేశారు. -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. ఇంఛార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాల పై రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్, తెలంగాణకు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ సీనియర్ నేత. గతంలో బీజేపీకి ఆ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా, పలు కీలక పదవులను నిర్వహించారాయన. రెండుసార్లు లోక్‌సభకు కొయంబత్తూరు నుంచి ప్రాతినిద్యం వహించారు. -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్.. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారాయన. అలాగే.. బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
Jharkhand politics 2024: సీఎంగా చంపయ్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్ సోరెన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్‌తో చంపయ్ సోరెన్ -
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
టీవీఎస్ నుంచి మరిన్ని ఎలక్ట్రిక్ టూ–వీలర్లు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ వచ్చే ఏడాది వ్యవధిలో తమ ఎలక్ట్రిక్ టూ–వీలర్ల పోర్ట్‌ఫోలియోను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. అలాగే విద్యుత్ త్రిచక్ర వాహనాన్ని కూడా రూపొందిస్తోంది. 5 నుంచి 25 కిలోవాట్ల శ్రేణిలో పలు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ డైరెక్టర్, సీఈవో కేఎన్ రాధాకృష్ణన్ తెలిపారు. మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఐక్యూబ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 25,000 యూనిట్లకు పెంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండు ఈ–స్కూటర్లు ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ విక్రయాలు ఈ క్వార్టర్‌లోనే ప్రారంభించనున్నట్లు రాధాకృష్ణన్ చెప్పారు. -
మైలార్డ్ అనకండి.. ‘సర్’ చాలు
కోల్‌కతా: ఇప్పటి వరకు ఆచరణలో ఉన్న ‘మైలార్డ్’, ‘లార్డ్‌షిప్’ లాంటి సంబోధన తగదని, తనను ‘సర్’ అని మాత్రమే పిలిస్తే సరిపోతుందని కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాక్రిష్ణన్ వ్యాఖ్యానించారు. బెంగాల్, అండమాన్‌లలోని న్యాయాధికారులందరూ తనను ‘సర్’ అనే సంబోధించాలని ఆయన సూచించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాయ్ చటోపాధ్యాయ.. బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని జిల్లా జడ్జీలకు, కింది కోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు చీఫ్ జస్టిస్ చేసిన సూచనలను పంపారు. ఇకపై జిల్లా న్యాయాధికారులు, హైకోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది తనను ‘సర్’అని సంభోదించాలని చీఫ్ జస్టిస్ ఆకాంక్షించారు. (హైకోర్టు జడ్జికి కరోనా రావాలి: లాయర్) -
కోహ్లికి ‘పెటా’ అవార్డు
న్యూఢిల్లీ: పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (పెటా) భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని 2019 ఏడాదికిగాను ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. శాకాహార ప్రోత్సాహకులను, జంతుజాల ప్రేమికులను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. 31 ఏళ్ల కోహ్లి రాజస్తాన్‌లోని అంబర్ కోట వద్ద మాల్తి అనే ఏనుగును హింసించడాన్ని నిరసిస్తూ ‘పెటా’కు లేఖ రాశాడు. మూగ జీవాలపట్ల కరుణ చూపాలని తన అభిమానులకు సందేశం కూడా ఇచ్చాడు. జంతువుల్ని కొనుగోలు చేయడం కంటే దత్తత తీసుకోవాలని సూచించాడు. గతంలో భారత్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ పనికర్ రాధాకృష్ణన్, బాలీవుడ్ నటీమణులు అనుష్క శర్మ, హేమ మాలిని, జాక్వలైన్ ఫెర్నాండెజ్, హీరో మాధవన్‌లు ‘పెటా’ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డులకు ఎంపికయ్యారు. -
‘వీవీ ప్యాట్’ల లెక్కింపునకు ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తమ నియోజకవర్గాల పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు పద్మావతిరెడ్డి, అద్దంకి దయాకర్, బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. ఫిబ్రవరి 7 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ కౌంటర్‌కు 14వ తేదీ లోపు తిరుగు సమాధానం ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఫిబ్రవరి 14న తదుపరి విచారణ చేపడతామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంల ద్వారా తమకు వచ్చిన ఓట్లకు, వీవీ ప్యాట్లలో నమోదైన ఓట్లకు తేడా ఉందని, అందువల్ల వీవీ ప్యాట్లలో ఓట్లను లెక్కించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిరెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్‌లు హైకోర్టులో తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. వీవీ ప్యాట్లను లెక్కించలేదు.. పిటిషనర్ల తరఫున తూమ్ శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. తుంగతుర్తి నియోజకవర్గంలో 18 ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదని, అందువల్ల వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు వేసిన ఫలితం ఈవీఎంలపై కనిపించనప్పుడు, నిబంధనల ప్రకారం ఆ ఈవీఎంలను పక్కన పెట్టేయాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, ఈ పనిచేయని ఈవీఎంల వీవీ ప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందని, తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో అలా జరగలేదన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు థర్మల్ పేపర్‌పై ముద్రితమవుతాయని, నిపుణులు చెప్పే దానిని బట్టి వీటిపై ముద్రితమైన వివరాలు 45 రోజుల్లో తుడిచిపెట్టుకుపోతాయన్నారు. ఇలా జరిగితే తాము ఈ వ్యాజ్యాలు దాఖలు చేసి ఎటువంటి ప్రయోజనం ఉండదని నివేదించారు. పిటిషనర్ల వాదనలను ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తోసిపుచ్చారు. థర్మల్ ప్రింట్ ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. -
హైకోర్టు సీజే రాధాకృష్ణన్ బదిలీ
-
‘పంచాయతీ’ ఆపలేం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అయితే పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చట్టబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాల్లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతంగా ఖరారు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 15న తీసుకొచ్చి న ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీసీ మహాజన సమితి ప్రతినిధి యు. సాంబశివరావు (ఉసా), తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రిమండలి లేకుండా ఆర్డినెన్స్ జారీ చేయడం చెల్లదని, అందువల్ల దీన్ని రద్దు చేయాలంటూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామల రవీందర్ మరో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు ఉసా, జాజుల తరఫున సీనియర్ న్యాయవాది కె.జి. కృష్ణమూర్తి వాదిస్తూ ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించి బీసీ జనాభాను, ఓటర్లను తేల్చలేదని, ఆర్థిక, గణాంక డైరెక్టరేట్ ఇచ్చిన గణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందన్నారు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 243 (డీ) కింద రిజర్వేషన్లు కల్పించేందుకు అడ్డంకులేవీ లేవన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని వ్యాఖ్యానించింది. తరువాత కృష్ణమూర్తి వాదనలు కొనసాగిస్తూ గతంలో పంచాయతీరాజ్ చట్టం కింద బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవని, ఇప్పుడు చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ ద్వారా వాటిని కుదించారన్నారు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించరాదని ప్రభుత్వం వాదిస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగానే ఆర్డినెన్స్ తెచ్చిందని వివరించారు. నిమ్మక జయరాజ్ కేసులో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న నిబంధనను సుప్రీంకోర్టు పక్కనపెట్టిందని, దీని ఆధారంగానే బీసీలకు గతంలో 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యాయని, అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాలేదని ఆయన గుర్తుచేశారు. లెక్కలు సేకరించాం... అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదిస్తూ మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని, తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఆర్డినెన్స్ తెచ్చామని ధర్మాసనానికి వివరించారు. ఈ సమయంలో కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ బీసీ జనాభా, బీసీ ఓటర్ల లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఆ లెక్కలు తేల్చలేదని, అందుకే దానిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలైందన్నారు. ప్రభుత్వ ఆర్డినెన్స్ వల్ల బీసీ రిజర్వేషన్లు 22 శాతానికే పరిమితం అవుతున్నాయన్నారు. దీనిపై ఏఏజీ స్పందిస్తూ నిబంధనల మేరకు బీసీ లెక్కలు సేకరించి అభ్యంతరాలను స్వీకరించాకే తుది జాబితా రూపొందించామన్నారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ అయిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయినందున పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఆర్డినెన్స్ చట్టబద్ధతపై మాత్రం తేలుస్తామని స్పష్టం చేసింది. -
సాగర్‌ను సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
నాగార్జునసాగర్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ను సందర్శించారు. తెలంగాణ లాంచీలో హిల్ కాలనీ నుంచి కొండకు వెళ్లారు. అక్కడ అలనాటి నదీలోయ నాగరికతను ప్రతిబింబించే దృశ్యాలు, రాతియుగం, శిలాయుగంలో వాడిన పనిముట్లు గల మ్యూ జియం, గ్యాలరీని తిలకించారు. బుద్ధుడికి సంబం ధించిన విగ్రహాలు, చైత్యాలు, యజ్ఞశాల, ఓడరేవు తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా జడ్జీలు తిరుమలరావు, ప్రభాకర్, గురజాల, మాచర్ల జడ్జిలు సత్యశ్రీ , అజయ్‌కుమార్, నిడమనూరు జడ్జి రాధాకృష్ణ, ఎస్పీ రంగనాథ్ తదితరులున్నారు. -
కేశోరామ్ నుంచి విడిగా టైర్ల విభాగం
కోల్‌కతా: బీకే బిర్లా గ్రూప్‌నకు చెందిన కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ నష్టాలొస్తున్న తన టైర్ల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా (బిర్లా టైర్స్) విడగొట్టనుంది. ఫలితంగా కంపెనీ విలువ మరింత పెరగగలదని, మూలధన నిధులు సమీకరణ మరింత సులభమవుతుందని సంస్థ భావిస్తోంది. ఈ కంపెనీ చేపట్టిన రెండో భారీ పునర్వ్యస్థీకరణ ఇది. డీమెర్జర్‌లో భాగంగా ఒక్కో కేశోరామ్ ఇండస్ట్రీస్ షేర్‌కు రూ.10 ముఖ విలువ గల ఒక్కో బిర్లా టైర్స్ షేర్ లభిస్తుంది. టైర్ల వ్యాపారానికే అంకితమైన మేనేజ్మెంట్ కారణంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఆ వ్యాపారంలో మంచి వృద్ధిని సాధించగలమన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ఈ డీ మెర్జర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం పొందాల్సి ఉంది. డీమెర్జర్ అనంతరం సిమెంట్వ్యాపారం కేశోరామ్ ఇండస్ట్రీస్ కింద కొనసాగుతుంది. రూ. 1,000 కోట్ల రుణం బదిలీ... కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు ప్రస్తుతం ఉన్న రూ.1,000 కోట్ల రుణాన్ని బిర్లా టైర్స్ కంపెనీకి బదిలీ చేసే అవకాశాలున్నాయని కేశోరామ్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) రాధాకృష్ణన్ చెప్పారు. టైర్ల వ్యాపారంలో కొనసాగుతామని, ఈ వ్యాపారంలో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామి సహకారంతో అధిక మార్జిన్లు వచ్చే ఆటోమోటివ్ రేడియల్ టైర్ల విభాగంలోకి బిర్లా టైర్స్ ప్రవేశించే అవకాశాలున్నాయి. రెండేళ్ల క్రితం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ హరిద్వార్ సమీపంలోని లక్సర్ టైర్ ప్లాంట్‌ను జేకే టైర్స్‌కు రూ.2,000 కోట్లకు విక్రయించింది. ఈ విక్రయం కారణంగా కేశోరామ్ కంపెనీ రుణ భారం భారీగా తగ్గింది. కాగా ప్రత్యేక కంపెనీగా విడిపోయిన బిర్లా టైర్స్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,453 కోట్లుగా ఉంది. ఇది మొత్తం కేశోరామ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఆదాయంలో 39 శాతానికి సమానం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.67 కోట్లుగా ఉన్న టైర్ల విభాగం నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రెట్టింపై రూ.129 కోట్లకు పెరిగాయి. -
వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది
హైదరాబాద్: వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పదని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయాధికారులు వ్యవస్థ గొప్పతనాన్ని ఇనుమడింపజేయాలని సూచించారు. ప్రతి పనికి నిర్ధిష్టమైన విధానం ఉండటం అవసరమని అన్నారు. వివిధ రకాల కేసులకు సంబంధించిన విచారణకు ప్రత్యేక విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడ్డారు. జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి జ్యుడీషియల్ అకాడమీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాక్ కోర్టు.. శిక్షణలో ఉన్న న్యాయాధికారులు, జడ్జీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. త్వరలో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి జ్యుడీషియల్ అకాడమీలో గౌరవ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ వి.రాఘవేంద్ర ఎస్ చౌహాన్, జ్యుడీషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు పీవీ సంజయ్‌కుమార్, సి.సుమలత, ట్రెయినీ న్యాయాధికారులు, జ్యుడీషియల్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. అంతకు ముందు జ్యుడీషియల్ అకాడమీలో కంప్యూటర్ ల్యాబ్, చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి జ్యుడీషియల్ అకాడమీ రూపొందించిన స్టాండర్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. -
వచ్చే నెల 9వరకూ అభ్యంతరాల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాపై నవంబర్ 9 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలియజేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెల 19 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఆ తేదీకి 10 రోజుల ముందువరకూ అభ్యంతరాలను స్వీకరిస్తా మని హైకోర్టు సీజే జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనానికి ఈసీ విన్నవించింది. బోగస్ ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయో జన వ్యాజ్యం శుక్రవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఓటర్ల తుది జాబితా శుక్రవారం ప్రకటించామని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ ధర్మాసనానికి తెలిపారు. ఓటర్ల జాబితాపై నవంబర్ 9 వర కూ అభ్యంతరాలను స్వీకరించాక మార్పులు, చేర్పులతో పాటుగా తొలగింపునకు ఒకరోజు ఉంటుం దని వివరించారు. ఈ మేరకు అఫి డవిట్ దాఖలు చేశామన్నారు. ప్రచురించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలించేందుకు నియోజకవర్గాల వారీగా ఓటర్ల నమోదు అధికారి, సహాయ అధికారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాలు, బూత్ స్థాయి అధికారుల కార్యాలయాల వద్దా జాబితా బహిర్గతం చేస్తామన్నారు. వాదనల అనంతరం కోర్టు కేసు విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
కేరళకు అందరూ అండగా నిలవాలి
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ పిలుపు నిచ్చారు. ఆదివారం రవీంద్రభారతిలో కాన్ఫె డరేషన్ ఆఫ్ తెలుగు రీజియన్ మలయాళీ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖలతో కలసి కేరళ వరద సహాయనిధి సేకరణను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు చీఫ్‌జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ మాట్లాడుతూ కష్ట కాలంలో ఉన్న కేరళ రాష్ట్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉందన్నారు. దేశం మొత్తం కేరళ రాష్ట్రానికి అండగా నిలుస్తోందనీ, సకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా మాట్లాడారు. ముందుకు వచ్చిన దాతలు.. రవీంద్ర భారతి ప్రాంగణంలో నిర్వహించిన కేరళ వరద సహాయనిధి సేకరణకు విశేష స్పందన లభించింది. కేరళ వరదల బాధితులకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రముఖులతోపాటు సాధారణ ప్రజలు సైతం తమకు తోచినంత సాయం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రోటరీ క్లబ్ రూ.4 లక్షలు, ఇంక్రడబుల్ ఇండియా రూ.2 లక్షలు, విజయాబ్యాంక్ రూ.2 లక్షలు, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, జిల్లా జడ్జి రాధారాణిలు తమ నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్ సతీమణి మీరా రాధాకృష్ణన్, రవాణాశాఖ అధికారి సీఎల్ఎన్ గాంధీ, అసోసియేషన్ అధ్యక్షుడు బెంజ్‌మెన్ తదితరులు పాల్గొన్నారు. ఓసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.. ఓసీ సంక్షేమ సంఘం మలయాళీ విభాగం ఆధ్వర్యంలో రెండు లక్షల రూపాయల చెక్కు, మూడు లక్షల రూపాయల విలువగల సామగ్రిని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి, మలయాళీ విభాగం అధ్యక్షుడు కె.సూర్యకుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉష ఆధ్వర్యంలో వీటిని సేకరించారు. -
ట్రాఫిక్ సమస్యకు మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వడం లేదని, దీని కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ్ హైకోర్టుకు లేఖ రాశారు. ఏటా రోడ్లపై పెరిగిపోతోన్న వాహనాల సంఖ్యను నియంత్రించేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. లేఖపై స్పందించిన హైకోర్టు దీనిని పిల్‌గా మలిచింది. దీని పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, పురపాలక ముఖ్య కార్యదర్శి, రవాణా ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
టీడీపీ, కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకోవద్దనే..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, పరిపాలన అంశాలను గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, తదనంతర పరిణామాలపై ప్రధానంగా చర్చించినట్టు సమచారం. అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో పాల్గొనకుండా టీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరైన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదని తెలిసినా టీడీపీ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని సీఎం అభిప్రాయపడినట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్‌ల రాజకీయ వ్యూహంలో చిక్కుకోవద్దన్న ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు గవర్నర్‌తో సీఎం అన్నట్టు తెలిసింది. ఇలాంటి మూస రాజకీయాలతో ప్రయోజనం ఉండదనే గుణాత్మక మార్పు కోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ఇంటింటికి రక్షిత తాగునీటి సరఫరా ప్రారంభిస్తామని, మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు. రైతుబంధు పథకానికి అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ప్రశంసలు, ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు జీవిత బీమా పథకాల విశేషాలను వివరించారు. కేంద్రం ప్రకటించిన ఆయుష్మాన్ భవ జీవిత బీమా పథకం మార్గదర్శకాల్లో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు గవర్నర్‌కు తెలిపారు. సమాచార హక్కు కమిషనర్లుగా రాజా సదారాం, బుద్ధా మురళీ నియామకాలను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కూడా గవర్నర్‌తో సీఎం చర్చించారు. వరుసగా రెండో ఆదివారం గవర్నర్‌తో కేసీఆర్ భేటీ కావడం విశేషం. సీజేని కలిసిన సీఎం గవర్నర్ నరసింహన్‌తో భేటీకి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
7న చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి. భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ బీఎన్ రాధాకృష్ణన్ చేత గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాజ్‌భవన్ అధికారులతో సమన్వయం చేసుకుని వివిధ శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ల ఏర్పాటు, పుష్పాలంకరణ చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా మీడియా కవరేజి, లైవ్ ఫీడ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ముఖ్య అతిథులను రిసీవ్ చేసుకోవడానికి తగు సిబ్బందిని నియమించాలని హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణాకు స్పష్టం చేశారు. సమావేశంలో ముఖ్య కార్యదర్శులు అధర్ సిన్హా, సునీల్ శర్మ, హర్ ప్రీత్ సింగ్, హైకోర్ట్ ప్రొటోకాల్ రిజిస్ట్రార్ మురళీధర్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, ప్రొటో కాల్ డైరెక్టర్ అర్విందర్‌సింగ్, సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే పాల్గొన్నారు. -
తెలంగాణ-ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
-
ఉమ్మడి హైకోర్టు సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్
న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ నియా మకానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సీజేగా పనిచేస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టే అవకాశముందని వెల్లడించాయి. అలాగే పట్నా హైకోర్టులో జడ్జీగా ఉన్న అజయ్ కుమార్ త్రిపాఠీని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే సుప్రీంకోర్టు కొలీజియం వీరి పేర్లను సిఫార్సు చేయగా, తాజాగా కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు జస్టిస్ రమేశ్ రంగనాథన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. -
రుణ పరపతి రూ.83,400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రుణ పరపతి అంచనా రూ.83,400 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని నాబార్డు వెల్లడిం చింది. అందులో వ్యవసాయ, అనుబంధ దీర్ఘకాలిక రుణాలు రూ.16 వేల కోట్లు ఉంటాయని తెలిపింది. మంగళవారం ఈ మేరకు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. ఈ అంచనా ప్రకారమే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) రుణ ప్రణాళికను ఖరారు చేస్తుందని తెలిపారు. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు తరఫున రూ.12,200 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 అభివృద్ధి పథకాలకు రూ.5,600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన మిషన్ భగీరథకు రూ.6,791 కోట్లు మంజూరు చేశామని, అందులో ఇప్పటివరకు రూ.3,884 కోట్లు విడుదల చేశామని చెప్పారు. రాబోయే రోజుల్లో పాడి అభివృద్ధి, కూరగాయల సాగు, వ్యవసాయ యాంత్రీకరణ, సమగ్ర వ్యవసాయ వ్యవస్థలకు తోడ్పాటు అందిస్తామని వివరించారు. 2022–23 నాటికి రైతు ఆదాయం రెట్టింపునకు తమ వంతు సాయం చేస్తామన్నారు. 2018–2023 మధ్య రాష్ట్రంలో వివిధ రకాల చెందిన 4.02 లక్షల యూనిట్లు స్థాపించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అందుకు రూ.5,639 కోట్ల బ్యాంకు రుణాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 225 రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గతేడాది రుణ ప్రణాళికలో 78 శాతం వృద్ధి కనిపించిందని తెలిపారు. రైతుబంధు పథకం కింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేసినా వారు బ్యాంకు రుణాలు తీసుకుంటారని రాధాకృష్ణన్ అన్నారు. కౌలు రైతులకు కూడా వ్యక్తిగత రుణాలు ఇస్తామని, ఈ మేరకు తాము బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. -
అంతరిక్ష రంగంలో మనదేశం రోల్‌మోడల్
హైదరాబాద్: అంతరిక్ష రంగంలో మనదేశం ప్రపంచానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ఇస్రో, స్పేస్ కమిషన్ మాజీ చైర్మన్, కేంద్ర స్పేస్ విభాగం సలహాదారు డాక్టర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో ఉత్తమమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నామన్నారు. మాజీ సీఎం దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతిని పురస్కరించుకొని చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం బేగంపేట సెస్ ప్రాంగణంలో నిర్వహించిన చెన్నారెడ్డి స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్, మంగళ్యాన్ తదితర ప్రయోగాలు మన శక్తిసామర్థ్యాలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇటీవల 630 టన్నుల బరువున్న జీఎస్ఎల్వీ–ఎంకే 3 నౌక ప్రయోగంలో 3,200 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. దేశీయంగా రూపొందించిన క్రయోజినిక్ ఇంజన్లతో చేసిన వరుస ప్రయోగాలు రాకెట్ టెక్నాలజీ రంగంలో మేలుమలుపుగా చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో దేశం ప్రపంచంలో ఆరో స్థానంలో ఉందని, భవిష్యత్‌లో మరిన్ని స్థానాలు మెరుగు పరచుకోవడానికి ఇస్రో నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. అమెరికాకు చెందిన నాసా బడ్జెట్ 19 బిలియన్ డాలర్లు ఉంటే.. ఇస్రో బడ్జెట్ 1.2 బిలియన్ డాలర్లు మాత్రమేనని, అయినా మనం మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రతీ అంతరిక్ష ప్రయోగం దేశంలోని పేదలకు పరోక్షంగా ఉపయోగపడేదేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలు, సౌర వ్యవస్థలోకి మానవ రహిత ప్రయోగాలు సహ పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. -
ఇద్దరు మంత్రులపై కేసు ?
► విచారణాధికారిగా ఏఎస్పీ శంకర్ ► మంత్రి విజయభాస్కర్‌కు సమన్లు సాక్షి ప్రతినిధి, చెన్నై: వైద్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఆదాయ పన్నుశాఖ దాడులు జరుగుతున్న సమయంలో అధికారులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇద్దరు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అదనపు పోలీస్ కమిషనర్ శంకర్‌ను విచారణాధికారిగా కమిషనర్ కరణ్ సిన్హా నియమించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల సమయంలో ఓటర్లను మభ్య పెట్టేందుకు మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచే నగదు బట్వాడా సాగినట్లు ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. అధికార పార్టీ నేతలు, మద్దతుదారులే లక్ష్యంగా ఈనెల 7వ తేదీన రాష్ట్రం నలుమూలలా ఐటీ దాడులు సాగాయి. ఈ సమయంలో మంత్రులు కామరాజ్, రాధాకృష్ణన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించినట్లుగా చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఐటీ ఉన్నతాధికారులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ మంత్రులపై కేసు నమోదుకు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ నేతృత్వంలో సంఘటనపై విచారణ జరిపేందుకు కమిషనర్ నిర్ణయించారు. ఇదిలా ఉండగా, దాడుల తరువాత కార్యాలయానికి ఐటీ కార్యాలయంలో హాజరైన మంత్రి విజయభాస్కర్‌కు మరలా సమన్లు పంపారు. ఈ సమన్ల ప్రకారం శుక్రవారం ఉదయం అధికారుల విచారణకు మంత్రి మరోసారి హాజరుకావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలను చూపి మంత్రి హాజరుకాలేదు. మాజీ ఎంపీ రాజేంద్రన్, నటుడు శరత్‌కుమార్ ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు మంత్రికి దినకరన్ బాసట మంత్రి విజయభాస్కర్‌కు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆయనకు బాసటగా నిలిచారు. మంత్రి విజయభాస్కర్‌ను పదివి నుంచి తప్పించడమో లేక రాజీనామా కోరడమో అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దినకరన్ గెలుపు కోసమే మంత్రి నగదు పంపిణీ చేసిన సంగతి పాఠకులకు విదితమే. తన గెలుపుకోసం ఐటీ ఉచ్చులో పడి అవస్థలు పడుతున్న మంత్రికి ఆయన భరోసా ఇస్తూ బహిరంగ ప్రకటన చేశారు. -
ఉద్యమ బాట
► తగ్గేది లేదన్నఉద్యమ నేతలు ► బెడిసి కొట్టిన సీఎం ప్రయత్నాలు ► ఇక మరింత ఉధృతం ► అణగదొక్కేందుకు కసరత్తులు ► బలగాల మోహరింపు ► ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఉద్యమాన్ని కొనసాగించేందుకు నెడువాసల్ ఉద్యమకారులు నిర్ణయించారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టు రద్దు ప్రకటన వెలువడే వరకు ఉద్యమం కొనసాగుతుందని, మరింత ఉధృతం చేయనున్నట్టు ఉద్యమ నేతలు ప్రకటించారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలుసాగుతున్నాయి. నెడువాసల్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షి, చెన్నై:పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఉద్యమకారులతో బుధవారం సీఎం ఎడపాటి కే పళనిస్వామి భేటీ అయ్యారు. అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదన్న భరోసా ఇచ్చారు. అయితే సీఎం ప్రయత్నాలు బెడిసి కొ ట్టాయి. ఆయన హామీలు సంతృప్తికరంగా లేని దృష్ట్యా, ఉద్యమాన్ని ముం దుకు తీసుకెళ్లేందుకు ఉద్యమకారులు నిర్ణయించారు. కేంద్రం దిగి వచ్చి ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించేవరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామన్న ప్రతిజ్ఞను గురువారం నెడువాసల్ పరిసర గ్రామాల్లోని ప్రజలు చేశారు. పాఠశాల స్థాయి పిల్లలు, యువత సైతం తరలి వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ, వివిధ రూపాల్లో నిరసనలు, పరిస్థితిని బట్టి ఆమరణ దీక్ష సైతం చేపట్టేందుకు తగ్గ కసరత్తులతో ఉద్యమకారులు ముందుకు సాగుతుండడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఈ ఉద్యమానికి మద్దతుగా చెన్నై వళ్లువర్‌కోట్టం వద్ద సినీనటుడు లారెన్స్ నేతృత్వంలో నిరసనకు పిలుపునిచ్చారు. అయితే పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించారు. ముందుగానే అక్కడకు చేరుకున్న యువతను పోలీసులు బలవంతంగా తొలగించారు. బలగాల మోహరింపు: నెడువాసల్ ఉద్యమాన్ని అణగొక్కేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టుంది. సీఎం హామీ ఇచ్చినా ఉద్యమకారులు వెనక్కు తగ్గక పోవడంపై కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో నెడువాసల్ పరిసరాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా అడ్డుకునే విధంగా చెక్ పోస్టులు ఏర్పాటు అయ్యాయి. బలగాల్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఉత్కంఠ బయల్దేరింది. ఒక్కో గ్రామంలో ఒక్కో కన్నీటి గాథ: హైడ్రో ప్రాజెక్టు నిమిత్తం చాప కింద నీరులా తవ్విన బోరు బావుల రూపంలో ముప్పు ఇప్పటికే బయల్దేరినట్టు అనేక గ్రామాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ వేదికపై ప్రసంగించే ఆయా గ్రామాల ప్రజలు తమ తమ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్టైకాడు పరిసరాలను ‘సిటిజన్’ సినిమా తరహాలో కనుమరుగు చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టు, ఇక్కడ జరిగిన తవ్వకాల పరిశోధనల కారణంగా పిల్లలు మానసిక వికలాంగులుగా, అంతు చిక్కని వ్యాధులతో బాధ పడాల్సి ఉందని కన్నీటి పర్యంతం కావడం అక్కడి వారిని కలచి వేసింది. వనక్కాడులో గతంలో పదిహేను వందల అడుగుల లోతులో ఏర్పాటు చేసిన బోరు బావి కారణంగా, క్యాన్సర్ బారిన పడి పది మంది మరణించి ఉన్నట్టు, మరో 25 మంది ఆ వ్యాధితో బాధ పడుతున్నట్టు అక్కడి ప్రజలు పూర్తి వివరాలను ఉద్యమ వేదిక ముందుకు తీసుకురావడం గమనించాలి్సన విషయం. -
చెన్నై.. కన్నీరు మున్నీరై
- ‘అమ్మ’చివరి చూపు కోసం పోటెత్తిన జన సందోహం - పలు చోట్ల తొక్కిసలాట - స్పృహతప్పిన అనేకమంది - వీఐపీలనూ కట్టడి చేయలేని పరిస్థితి - రంగంలోకి రాష్ట్ర మంత్రులు చెన్నై నుంచి సాక్షిప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను చివరి చూపు కోసం వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. బస్సులన్నీ రద్దుచేసిన జనం రైల్లు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని జనం చెన్నైకు చేరుకున్నారు. చెన్నై సెంట్రల్‌కు చేరుకున్న సిటీ రైళ్ల నుంచి అన్నాసాలైకు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో అన్నాసాలై కూడలి జనంతో కిక్కిరిసింది. రాజాజీహాలు వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడలి నుంచి బారికేడ్లు ఏర్పాటు చేసినా... భారీ ఎత్తున జనం చొచ్చుకు రావటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. ఒక్కసారిగా జనం మూకుమ్మడిగా రాజాజీ హాలు గేటు వద్దకు వెళ్లేందుకు ఎగబడ్డారు. గేటు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు ఉన్నా ఫలితం లేకపోరుుంది. అంతిమయాత్రకు సుమారు 18 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోరుుంది. గేటు మందు అడుగడుగునా తొక్కిసలాట తప్పలేదు. చివరకు చేసేదిలేక పోలీసులు చేతులెత్తేశారు. ఎటుపడితే అటు జనం గేట్లు ఎక్కి దూకి రాజాజీ హాలులోకి ప్రవేశించారు. ఒకానొక సమయంలో భద్రతా సిబ్బంది వాటర్గన్స ప్రయోగించారు. అయినప్పటికీ జనం దూసుకురావడంతో రాజాజీహాలు ప్రాంగణంలో పలుమార్లు తొక్కిసలాట చోటు చేసుకుంది. మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసుకుని కెమెరాలపైకీ జనం చొచ్చుకొచ్చారు. మిన్నంటిన నినాదాలు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించటానికి తమిళ, కర్ణాటక, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, హీరోరుున్లు, సహాయ నటీనటులు, హస్యనటులు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ప్రాంగణంలో వేచి ఉన్న జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ తొక్కిసలాట జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా పలుమార్లు తొక్కిసలాటలో ఇరుకున్నారు. అదే విధంగా సినీ నటీమణి రేఖ కొంత సమయం జనంలోనుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఓ దశలో వీఐపీలనూ కట్టడిచేయలేని పరిస్థితి. దీంతో మంత్రి జయకుమార్, మాజీ మంత్రి వలర్మతిలు రంగంలోకి దిగారు. దివంగత సీఎం భద్రతా సిబ్బంది అమ్మ భౌతిక కాయంకు సమీపంలోకి చేరి, వీపీఐలను కట్టడిచేయడానికి శ్రమించాల్సి వచ్చింది. ఓ దశలో పలువుర్ని బలవంతంగా లాగేయాల్సిన పరిస్థితి. ఓ దశలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకష్ణన్‌ను బలంవంతంగా లాగేయత్నం చేసిన భద్రతా సిబ్బంది తరువాత తేరుకున్నారు. తోపులాటలతో కొందరు స్వల్పంగా గాయపడటం వంటి ఘటనలు తప్పలేదు. -
ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ పదవీ విరమణ
సూళ్లూరుపేట: అంతరిక్ష రంగంలో మరిన్ని ప్రయోగాలతో విజయాలు సాధించి భారత్‌ను ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో నిలపాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ఇస్రో చైర్మన్‌గా తాను బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి చేపట్టిన ప్రయోగాలను విజయవంతం చేసేందుకు కృషిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో చైర్మన్‌గా పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన బుధవారం బెంగళూరు కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాల డెరైక్టర్లతో మాట్లాడారు. మధ్యాహ్నం 3.30కి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి శైలేశ్ నాయక్‌కు అంతరిక్ష శాఖ కార్యదర్శిగా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. అంతరిక్ష శాఖ కార్యదర్శి ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు వ్యవహరించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే, సీనియర్ శాస్త్రవేత్తను కాకుండా శైలేశ్‌ను అంతరిక్ష శాఖ కార్యదర్శిగా నియమించడంపై ఇస్రో వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ పదవికి షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, కిరణ్ కుమార్ల పేర్లను కమిటీ ఇదివరకే సూచించింది. అయితే, ప్రధాని మోదీ బిజీగా ఉండటం వల్ల ఇస్రో చైర్మన్ ఎంపికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఇది తాత్కాలిక నియామకమేనని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. -
లక్ష్యాన్ని చేధించిన జీఎస్ఎల్వీ మార్క్- 3
-
అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్ఎల్వీ మార్క్- 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సరిగ్గా తొమ్మిదన్నర గంటల ప్రాంతంలో శ్రీహరికోటలోని షార్ నుంచి.... జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది. కోట్లాది మంది ప్రజల ఆశలు మోసుకెళ్లిన రాకెట్....అంచెలంచెలు దాటుకుంటూ గమ్యస్తానాన్ని చేరింది. 20 నిమిషాల్లో లక్ష్యాన్ని చేధించింది. వ్యోమగాముల గదిని రాకెట్ 126 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. టార్గెట్‌ను చేరేవరకూ....శాస్త్రవేత్తలతో పాటు కోట్లాది మంది ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. జీఎస్ఎల్వీ రాకెట్ ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశింత స్థానాన్ని చేరడంతో .....షార్‌లో హర్షాతీరేకాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని అభినందనలు తెలుపుకున్నారు. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపించడమే లక్ష్యంగా ఇస్రో చేసిన ప్రయోగం ఇది. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపిన వ్యోమగాముల్ని తిరిగి సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. ఇస్రో ప్రయోగించిన అతిబరువైన ఎక్స్పర్మెంట్ ఇదే. ప్రయోగ సక్సెస్‌తో శాస్త్రవేత్తలు మరో ఐదేళ్లలో అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు సిద్ధమవుతున్నారు. మానవులను అంతరిక్షంలోకి పంపే దిశగా ఇస్రో మరో ముందడుగు వేసిందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇది గుర్తుంచుకోవాల్సిన రోజు అని ఆయన పేర్కొన్నారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాధాకృష్ణన్ మాట్లాడుతూ అందరి కృషితోనే ప్రయోగం విజయవంతమైందన్నారు. క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలోకి చేరుకుందని రాధాకృష్ణన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగానికి రూ.155 కోట్లు వ్యయం అయినట్లు ఆయన తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం సక్సెస్
కక్ష్యలోకి మూడో నావిగేషనల్ శాటిలైట్ భారత ప్రాంతీయ దిక్సూచీ దిశగా మరో ముందడుగు శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లో వారం రోజుల ముందే దీపావళి వెలుగులు విరజిమ్మాయి. షార్ మొదటి వేదిక నుంచి గురువారం తెల్లవారుజామున 1.32 గంటలకు నింగికి ఎగిసిన పీఎస్ఎల్వీ సీ26 రాకెట్ 1,425 కిలోల బరువైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ఉపగ్రహాన్ని 20.18 నిమిషాలకు నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉత్కంఠ మధ్య విజయవంతంగా.. . భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చరిత్రలో రెండోసారి అర్ధరాత్రి నిర్వహిస్తున్న ప్రయోగం కావడంతో గురువారం తెల్లవారుజామున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి పీఎస్ఎల్వీ సీ26 ప్రయోగం 10వ తేదీనే నిర్వహించాల్సి ఉన్నా.. సాంకేతిక లోపం వల్ల వాయిదాపడిన నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ రాకెట్ ఎరుపు, నారింజ రంగు మంటలు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 20.31 నిమిషాల తర్వాత ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ కక్ష్యలోకి చేరింది. రూ.1,600 కోట్ల వ్యయంతో రూపొం దించిన ఈ ఉపగ్రహం పదేళ్లకు పైగా సేవలందిస్తుంది. దీనిలో లాజర్ రెట్రో-రిఫ్లెక్టర్, నావిగేషన్ సిగ్నల్స్ ఎల్-5 ఎస్ బాండ్, గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్)పేలోడ్లను అమర్చి పంపారు. సొంత దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు ఇలా... ప్రస్తుతం అమెరికా, రష్యాలకు మాత్రమే సొంత నావిగేషన్(దిక్సూచీ) ఉపగ్రహ వ్యవస్థలు ఉన్నాయి. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటు కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ, చైనా, జపాన్‌లు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సొంతంగా ‘భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం)’ ఏర్పాటుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా మొత్తం ఏడు ఉపగ్రహాలను నింగికి పంపాల్సి ఉండగా, ఇప్పటిదాకా మూడు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. వచ్చే ఏడాది ఏడు ఉపగ్రహాలను నింగికి పంపి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇస్రో సన్నద్ధమైంది. వీటిలో మొదటి ఉపగ్ర హం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏని జూలై 1న, రెండో ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఏప్రిల్ 4న ప్రయోగించారు. ఈ వ్యవస్థ ఏర్పాటు పూర్తయితే భారత్‌తోపాటు చుట్టూ 1,500 కి.మీ. దూరం వరకూ ఉపగ్రహ దిక్సూచీ సేవలు (జీపీఎస్) అందుబాటులోకి వస్తాయి. భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, విపత్తుల సమయాల్లో ఆకాశంలో విమానాలకు, సముద్రాల్లో నౌకలకు దిక్సూచిగా ఉపయోగపడడమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లలో దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. భౌగోళిక సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, సెల్‌ఫోన్‌తో అనుసంధానం లాంటి సౌకర్యాలు అందుతాయి. ఇకపై ఇలాంటి సేవలకు అమెరికా జీపీఎస్‌పై ఆధారపడకుండా సొంత వ్యవస్థతో పొందేందుకు, పొరుగుదేశాలకు అందించేందుకు వీలుంటుంది. మరో మూడు ప్రయోగాలు: ఇస్రో చైర్మన్ తాజా విజయంతో ఈ ఏడాది ఇప్పటికే నాలుగు విజయాలు దక్కాయి. ఇది సమష్టి విజయం. ఈ ఏడాదిలోనే మరో మూడు ప్రయోగాలకూ సిద్ధమవుతున్నాం. ఇందులో రెండు ప్రయోగాలు షార్ నుంచి, మరో ప్రయోగం ఫ్రాన్స్‌లోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మరో 45 రోజుల్లో కీలకమైన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని షార్ రెండో ప్రయోగవేదిక నుంచి చేపడతాం. డిసెంబర్లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ సీ27 ద్వారా నింగికి పంపుతాం. శ్రీవారి సేవలో రాధాకృష్ణన్ సాక్షి, తిరుమల: ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో సతీసమేతంగా ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. -
ముక్కంటి సేవలో ఇస్రో చైర్మన్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం రాత్రి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ విచ్చేశారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి,అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అధికారులు దుశ్శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో.. తిరుమల : శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు వచ్చిన ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు సాదర స్వాగతం లభించింది. సాయంత్రం 5 గంటలకు ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా ఇటీవల మార్స్ మిషన్ (మామ్) ప్రయోగం విజయవంతం కావడంతో జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయం ముందు, వెలుపల చేసిన మార్పులు చేర్పులపై ఇస్రో చైర్మన్‌కు జేఈవో శ్రీనివాసరాజు వివరించి చెప్పారు. స్వామి దర్శనం తరువాత తిరుగు ప్రయాణమైన రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికారు. -
ఆదర్శప్రాయుడు సర్వేపల్లి
నెల్లూరు (సెంట్రల్) : భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తరువాత గురువునే విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటారన్నారు. ఇటీవల కాలంలో కొందరు ప్రవర్తిస్తున్న తీరు బాధ కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా ప్రమాణాలను పెంచాలని కోరారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకుని వారి పిల్లలను అక్కడే చేర్పించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని బొమ్మిరెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ రాధాకృష్ణన్ తెలుగువారైనందుకు అందరూ గర్వ పడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు తగదన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన 63 మంది ఉత్తమ ఉపాధ్యాయులను జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీకాంత్‌లు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. డీఈఓ ఉష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సహారా కేసులో మలుపు
న్యూఢిల్లీ: సహారా కేసులో హఠాత్ పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ జేఎస్ కేహార్ తప్పుకున్నారు. సుప్రీంకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్ రాకేష్ శర్మ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. దీనిప్రకారం ఇకపై ఈ కేసు విచారణ ప్రక్రియ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుపుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి జస్టిస్ జేఎస్ కేహార్ మే 6న ఒక సమాచారం పంపారు. ఇది మే 7న చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చింది. దీనితో కొత్త బెంచ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కొత్త బెంచ్‌లో న్యాయమూర్తులు ఎవరనే విషయంపై మాత్రం వివరాలను తాజా ప్రకటన తెలియజేయలేదు. ఈ కేసును విచారిస్తున్న ద్విసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ మే 14న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, మరో న్యాయమూర్తి సైతం సహారా విచారణ ప్రక్రియ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తీవ్ర ఒత్తిడి...! తనను నిర్బంధించడం అక్రమం, అన్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగులో ఉండగానే తనను జ్యుడీషియల్ కస్టడీకి ఎలా పంపుతారని సహారా చీఫ్ సుబ్రతారాయ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను న్యాయమూర్తులు రాధాకృష్ణన్, కేహార్లు మే 6వ తేదీన బెంచ్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజు ఈ కేసు విచారణ నుంచి ఇకపై తప్పుకుంటున్నట్లు జస్టిస్ కేహార్ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు సమాచారం పంపడం విశేషం. నిర్బంధానికి సంబంధించి ఇచ్చిన రూలింగ్‌ను తప్పుబడుతూ దాఖలైన రిట్ పిటిషన్‌ను ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులే ఎలా విచారిస్తారని సైతం సహారా చీఫ్ సుబ్రతారాయ్ తరఫు న్యాయవాది రామ్‌జత్మలానీ అంతక్రితం వాదించడం ఇక్కడ ప్రస్తావనాంశం. ఈ అంశంపై రూలింగ్ ఇచ్చిన సందర్భంగా న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సహారా కేసులో బెంచ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. -
హత్య గుట్టువిప్పిన రియాల్టీ షో
చెన్నై: నాలుగేళ్ల క్రితం తన ప్రియుడితో కలసి భర్తను ఏ విధంగా హత్య చేసింది ఒక మహిళ తమిళ టీవీ రియాల్టీ షోలో వివరించి పోలీసులకు దొరికిపోయింది. వారు ఆమెను, ప్రియుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటన బుధవారం ఇక్కడ జరిగింది. బేబీకళ, ఆమె ప్రియుడు గౌరీశంకర్‌తో కలసి భర్త రాధాకృష్ణన్‌ను 2010 జూలై 17న హత్య చేసింది. వారిద్దరూ రాధాకృష్ణన్ ముఖాన్ని ప్లాస్టిక్ కవర్‌తో కప్పి ఊపిరాడకుండా చేశారు. అతను వెంటనే మైకంలోకి వెళ్లిపోవడంతో ఎదిరించే ప్రయత్నం చేయలేకపోయాడు. తన భర్త గుండెనొప్పితో చనిపోయాడని బేబీకళ బంధువులను నమ్మించింది. ఇపుడు ఆ ప్రియుడు తనను మోసం చేసి మరో మహిళతో వివాహానికి సిద్ధం కావడంతో ఆ గుట్టంతా బేబీకళ రియాల్టీ షోలో వివరించింది. ఆమె అత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బేబీకళను, ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. -
మార్స్ ఆర్బిటర్‌కు తొలి ఆటంకం
-
మార్స్ ఆర్బిటర్‌కు తొలి ఆటంకం
సూళ్లూరుపేట : ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్మిషన్కు ఈరోజు చిన్నపాటి ఆటంకం ఎదురయింది. 450 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన మంగళయాన్.. వేర్వేరు దశల్లో వేర్వేరు కక్ష్యలు మారుతూ లక్ష్యం దిశగా సాగాలి. కాగా ఈ ఉదయం అంగారక యాత్రలో ఆర్బిటర్ తొలి ఆటంకం ఎదుర్కొంది. కక్ష్య పెంపులో ఇబ్బందులు ఎదుర్కొన్న మార్స్ ఆర్బిటర్.. లక్ష కిలోమీటర్ల కక్ష్యను అందుకోలేకపోయింది. నిర్దేశిత దూరంకన్నా 10వేల కిలోమీటర్ల దిగువలో ఉంది. దీనిపై స్పందించిన ఇస్రో ఛైర్మన్ రాధా కృష్ణన్, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నవంబర్ 5న ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ ఈ నెల 7 అర్థరాత్రి ఒంటి గంట పదినిమిషాలకు భూమికి 23550 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యను అందుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా కక్ష్య దూరాన్ని పెంచుతూ పోయారు. ప్రస్తుతం 78వేల కిలోమీటర్ల దూరంలో మార్స్ ఆర్బిటర్ ఉంది. -
వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
తిరుపతి : 'మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం కావటంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో రాధాకృష్ణన్ దంపతులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు...వారికి రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం సందర్భంగా రాధాకృష్ణన్ నిన్న కూడా వెంకన్న దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. -
మార్స్.. మేమొస్తున్నాం..
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ25.. అంగారక యాత్రకు సర్వం సిద్ధం సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక అంగారక యాత్రకు సర్వం సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మార్స్ మిషన్‌కు ఆదివారం ఉదయం 6.08 నుంచి నిర్విఘ్నంగా కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోలు బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు నౌక నింగికేసి దూసుకెళ్లనుంది. తద్వారా గ్రహాంతర ప్రయోగాలకు భారత్ శ్రీకారం చుట్టనుంది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. దీన్ని అక్టోబర్ 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబర్ 5కు వాయిదా వేశారు. అంగారకుడిపైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్ట్రాక్ సెంటర్లో 32 డీప్‌స్పేస్ నెట్వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా)ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారత షిప్పింగ్ కార్పొరేషన్ నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉన్నాయి. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేయనున్నారు. 310 రోజుల ప్రక్రియ మార్స్ ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగిస్తున్నారు. రాకెట్‌కు తొలి దశలో ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకండ్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశను పూర్తి చేస్తారు. 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కి.మీ. ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.6 సెకన్లలో 194.869 కి.మీ. ఎత్తులో మూడో దశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కి.మీ. ఎత్తులో నాలుగో దశను పూర్తి చేసేలా రూపకల్పన చేశారు. నాలుగో దశలో 2656.72 సెకన్లకు, భూ ధీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రవేశపెడుతుంది. అక్కడి నుంచి ఉపగ్రహంలోని ఇంధనం సాయంతో ఐదుసార్లు మండించి, దాన్ని అంగారకుడి వైపు మళ్లించే ప్రక్రియను చేపడతారు. అప్పటినుంచి దాదాపుగా 310 రోజుల తరవాత, అంటే 2014 సెప్టెంబర్ 28 నాటికి అంగారకుడి కక్ష్యలో 360‘80,000 కిలో మీటర్లు ఎత్తులో అంగారకుడి చుట్టూరా తిరుగుతూ పరిశోధనలను ప్రారంభిస్తుంది. తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు సాక్షి, తిరుమల: మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ సోమవారం వేకువజామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఎంవోఎం నమూనా ఉపగ్ర హం, దాన్ని మోసుకెళ్లే పీఎస్ఎల్వీ సీ25 నమూనా రాకెట్‌ను గర్భాలయ మూలమూర్తి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. తర్వాత వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. సుదూర ప్రయోగమిది: రాధాకృష్ణన్ అరుణగ్రహంపై పరిశోధనల కోసం ఈ ప్రయోగం చేపట్టామని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సుదూర ప్రయోగానికి షార్‌లో ఆదివారం కౌంట్‌డౌన్ ఆరంభమైందని, మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ప్రయోగించనున్నామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో జీఎస్ఎల్వీ-డీ5 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు.