చెన్నై.. కన్నీరు మున్నీరై | Huge public at Amma last seen of Jayalalitha in chennai | Sakshi
Sakshi News home page

చెన్నై.. కన్నీరు మున్నీరై

Published Wed, Dec 7 2016 4:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

చెన్నై.. కన్నీరు మున్నీరై - Sakshi

చెన్నై.. కన్నీరు మున్నీరై

- ‘అమ్మ’చివరి చూపు కోసం పోటెత్తిన జన సందోహం
- పలు చోట్ల తొక్కిసలాట
- స్పృహతప్పిన అనేకమంది
- వీఐపీలనూ కట్టడి చేయలేని పరిస్థితి
- రంగంలోకి రాష్ట్ర మంత్రులు
 
 చెన్నై నుంచి సాక్షిప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను చివరి చూపు కోసం వివిధ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. బస్సులన్నీ రద్దుచేసిన జనం రైల్లు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకుని జనం చెన్నైకు చేరుకున్నారు. చెన్నై సెంట్రల్‌కు చేరుకున్న సిటీ రైళ్ల నుంచి అన్నాసాలైకు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో అన్నాసాలై కూడలి జనంతో కిక్కిరిసింది. రాజాజీహాలు వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహం వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూడలి నుంచి బారికేడ్లు ఏర్పాటు  చేసినా... భారీ ఎత్తున జనం చొచ్చుకు రావటంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు.

ఒక్కసారిగా జనం మూకుమ్మడిగా రాజాజీ హాలు గేటు వద్దకు వెళ్లేందుకు ఎగబడ్డారు. గేటు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లు ఉన్నా ఫలితం లేకపోరుుంది. అంతిమయాత్రకు సుమారు 18 వేల మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోరుుంది. గేటు మందు అడుగడుగునా తొక్కిసలాట తప్పలేదు. చివరకు చేసేదిలేక పోలీసులు చేతులెత్తేశారు. ఎటుపడితే అటు జనం గేట్లు ఎక్కి దూకి రాజాజీ హాలులోకి ప్రవేశించారు. ఒకానొక సమయంలో భద్రతా సిబ్బంది వాటర్‌గన్‌‌స ప్రయోగించారు. అయినప్పటికీ జనం దూసుకురావడంతో రాజాజీహాలు ప్రాంగణంలో పలుమార్లు తొక్కిసలాట చోటు చేసుకుంది. మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసుకుని కెమెరాలపైకీ జనం చొచ్చుకొచ్చారు.
 
 మిన్నంటిన నినాదాలు
 దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించటానికి తమిళ, కర్ణాటక, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, హీరోరుున్లు, సహాయ నటీనటులు, హస్యనటులు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ప్రాంగణంలో వేచి ఉన్న జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో మళ్లీ మళ్లీ తొక్కిసలాట జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కూడా పలుమార్లు తొక్కిసలాటలో ఇరుకున్నారు. అదే విధంగా సినీ నటీమణి రేఖ కొంత సమయం జనంలోనుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఓ దశలో వీఐపీలనూ కట్టడిచేయలేని పరిస్థితి. దీంతో మంత్రి జయకుమార్, మాజీ మంత్రి వలర్మతిలు రంగంలోకి దిగారు. దివంగత సీఎం భద్రతా సిబ్బంది అమ్మ భౌతిక కాయంకు సమీపంలోకి చేరి, వీపీఐలను కట్టడిచేయడానికి శ్రమించాల్సి వచ్చింది. ఓ దశలో పలువుర్ని బలవంతంగా లాగేయాల్సిన పరిస్థితి. ఓ దశలో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకష్ణన్‌ను బలంవంతంగా లాగేయత్నం చేసిన భద్రతా సిబ్బంది తరువాత తేరుకున్నారు. తోపులాటలతో కొందరు స్వల్పంగా గాయపడటం వంటి ఘటనలు తప్పలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement