హత్య గుట్టువిప్పిన రియాల్టీ షో | Man's murder comes to light after wife's confession on TV reality show | Sakshi
Sakshi News home page

హత్య గుట్టువిప్పిన రియాల్టీ షో

Published Thu, May 1 2014 2:35 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

హత్య గుట్టువిప్పిన రియాల్టీ షో - Sakshi

హత్య గుట్టువిప్పిన రియాల్టీ షో

చెన్నై: నాలుగేళ్ల క్రితం తన ప్రియుడితో కలసి భర్తను ఏ విధంగా హత్య చేసింది ఒక మహిళ తమిళ టీవీ రియాల్టీ షోలో వివరించి పోలీసులకు దొరికిపోయింది. వారు ఆమెను, ప్రియుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపిన సంఘటన బుధవారం ఇక్కడ జరిగింది. బేబీకళ, ఆమె ప్రియుడు గౌరీశంకర్‌తో కలసి భర్త రాధాకృష్ణన్‌ను 2010 జూలై 17న హత్య చేసింది. వారిద్దరూ రాధాకృష్ణన్ ముఖాన్ని ప్లాస్టిక్ కవర్‌తో కప్పి ఊపిరాడకుండా చేశారు.

అతను వెంటనే మైకంలోకి వెళ్లిపోవడంతో ఎదిరించే ప్రయత్నం చేయలేకపోయాడు. తన భర్త గుండెనొప్పితో చనిపోయాడని బేబీకళ బంధువులను నమ్మించింది. ఇపుడు ఆ ప్రియుడు తనను మోసం చేసి మరో మహిళతో వివాహానికి సిద్ధం కావడంతో ఆ గుట్టంతా బేబీకళ రియాల్టీ షోలో వివరించింది. ఆమె అత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బేబీకళను, ప్రియుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement