
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టి. భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్ ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ బీఎన్ రాధాకృష్ణన్ చేత గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించనున్నారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి రాజ్‌భవన్ అధికారులతో సమన్వయం చేసుకుని వివిధ శాఖలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాటుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ల ఏర్పాటు, పుష్పాలంకరణ చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా మీడియా కవరేజి, లైవ్ ఫీడ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ముఖ్య అతిథులను రిసీవ్ చేసుకోవడానికి తగు సిబ్బందిని నియమించాలని హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణాకు స్పష్టం చేశారు. సమావేశంలో ముఖ్య కార్యదర్శులు అధర్ సిన్హా, సునీల్ శర్మ, హర్ ప్రీత్ సింగ్, హైకోర్ట్ ప్రొటోకాల్ రిజిస్ట్రార్ మురళీధర్ రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, ప్రొటో కాల్ డైరెక్టర్ అర్విందర్‌సింగ్, సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment