cabinet minister
-
చీటింగ్ కేసులోమంత్రికి రెండేళ్ల జైలు శిక్ష
నాసిక్: 30 ఏళ్ల నాటి చీటింగ్, ఫోర్జరీ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కొకాటేకు నాసిక్ జిల్లా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, యాభైవేల జరిమానా విధించింది. ఈ కేసులో మంత్రి సోదరుడు సునీల్ కోకాటేను కూడా దోషిగా పేర్కొంటూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కోకాటే సోదరులు 1995లో తాము తక్కువ ఆదాయ వర్గానికి (ఎల్ఐజీ) చెందినవారమని పేర్కొంటూ ముఖ్యమంత్రి విచక్షణ కోటా కింద ఇక్కడి యోలకర్ మాలలోని కాలేజీ రోడ్డులో రెండు ఫ్లాట్లను పొందారు. దీనిపై మాజీ మంత్రి, దివంగత టీఎస్ ఢిఘోల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో సర్కార్వాడ పోలీస్ స్టేషన్లో కోకాటే సోదరులు, మరో ఇద్దరిపై చీటింగ్, ఫోర్జరీ కే సు నమోదైంది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం కొకాటే సోదరులకు శిక్ష, జరిమానా విధించిన కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాగా ఈ కేసులో తనకు బెయిల్ లభించిందని, ఉత్తర్వులపై పైకోర్టులో అప్పీలు చేస్తానని మంత్రి కొకాటే తెలిపారు. -
ఈ వారంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ
-
మంత్రి శాఖల కేటాయింపుపై జనసేన, బీజేపీ అసంతృప్తి..!
-
కింజరాపు ఫ్యామిలీకి డబుల్ బొనాంజా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు. వారి ఆశలపై నీళ్లు.. వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్యాట్రిక్ విజయాలు.. టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. -
మోదీ 3.0 టీమ్
1. నరేంద్ర మోదీ ప్రదానమంత్రి కేబినెట్ హోదా 2. రాజ్‌నాథ్‌సింగ్, 3. అమిత్ షా, 4. నితిన్ గడ్కరీ, 5. జేపీ నడ్డా, 6. శివరాజ్‌సింగ్ చౌహాన్, 7. నిర్మలా సీతారామన్, 8. ఎస్.జైశంకర్, 9. మనోహర్‌లాల్ ఖట్టర్, 10. హెచ్.డి.కుమారస్వామి (జేడీఎస్), 11. పీయూష్ గోయల్, 12. ధర్మేంద్ర ప్రధాన్, 13. జితిన్ రాం మాంఝీ (హెచ్ఏఎల్), 14. రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) (జేడీయూ), 15. సర్బానంద సోనోవాల్, 16. వీరేంద్ర కుమార్, 17. కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ), 18. ప్రహ్లాద్ జోషీ, 19. జ్యుయల్ ఓరం, 20. గిరిరాజ్‌సింగ్, 21. అశ్వినీ వైష్ణవ్, 22. జ్యోతిరాదిత్య సింధియా, 23. భూపేందర్ యాదవ్, 24. గజేంద్రసింగ్ షెకావత్, 25. అన్నపూర్ణాదేవి, 26. కిరెణ్ రిజిజు, 27. హర్దీప్సింగ్ పురి, 28. మన్సుఖ్ మాండవీయ, 29. జి.కిషన్‌రెడ్డి, 30. చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ), 31. సి.ఆర్.పాటిల్జ్.స్వతంత్ర హోదా 32. రావ్ ఇందర్జీత్ సింగ్, 33. జితేంద్ర సింగ్, 34. అర్జున్‌రాం మేఘ్వాల్, 35. ప్రతాప్‌రావ్ జాదవ్ (శివసేన), 36. జయంత్ చౌధరి (ఆరెల్డీ).సహాయ మంత్రులు 37. జితిన్ ప్రసాద్, 38. శ్రీపాద నాయక్, 39. పంకజ్ చౌధరి, 40. కృషన్‌పాల్ గుర్జర్, 41. రామ్‌దాస్ అథవాలె (ఆర్పీఐ), 42. రామ్‌నాథ్ ఠాకూర్ (జేడీయూ), 43. నిత్యానంద్ రాయ్, 44. అనుప్రియా పటేల్ (అప్నాదళ్), 45. వి.సోమన్న, 46. చంద్రశేఖర్ పెమ్మసాని (టీడీపీ), 47. ఎస్పీ సింగ్ భగెల్, 48. శోభా కరంద్లాజె, 49. కీర్తివర్ధన్ సింగ్, 50. బి.ఎల్.వర్మ, 51. శాంతను ఠాకూర్, 52. సురేశ్ గోపీ, 53. ఎల్.మురుగన్, 54. అజయ్ టంటా, 55. బండి సంజయ్ కుమార్, 56. కమలేశ్ పాస్వాన్, 57. భగీరథ్ చౌధరి, 58. సతీశ్‌చంద్ర దూబె, 59. సంజయ్ సేథ్, 60. రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, 61. దుర్గాదాస్ ఉయికే, 62. రక్షా ఖడ్సే, 63. సుకాంత మజుందార్, 64. సావిత్రీ ఠాకూర్, 65. తోఖన్ సాహు, 66. రాజ్‌భూషణ్ చౌధరి, 67. భూపతిరాజు శ్రీనివాస వర్మ, 68. హర్‡్ష మల్హోత్రా, 69. నిమూబెన్ బంభానియా, 70. మురళీధర్ మొహొల్, 71. జార్జి కురియన్, 72. పబిత్రా మార్గరీటా. -
కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర మంత్రి అవకాశం వచ్చిన బండి సంజయ్ కూడా ఒక సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగినవారే. విద్యార్ధి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. తర్వాత ఏబీవీపీలో పలు పదవుల్లో కొనసాగారు. కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్చార్జిగా పనిచేశారు. కరీంనగర్లో 2005 నుంచి వరుసగా మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఓటమితో రెండోస్థానంలో నిలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా సంచలన విజయం సాధించారు. ⇒ 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజ య్ నియమితులయ్యారు. ఈ సమయంలో పా ర్టీని పరుగులు పెట్టించారు. దుబ్బాక ఉప ఎన్ని క, జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీని విజయపథాన నడిపించారు. ⇒ ప్రజా సమస్యలపై పలుమార్లు సంజయ్ ఆందోళనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇంటర్ ఫలితాల వివాదం, 317 జీవో, టెన్త్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ఆందోళనలు చేశారు. ⇒ పలు పరిణామాల నేపథ్యంలో 2023లో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నా రు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తర్వా త జాతీ య కిసాన్‌మోర్చా ఇన్చార్జిగా నియమితులయ్యారు. ⇒ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చవిచూశారు. ⇒ తాజా లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. కేంద్ర మంత్రి పదవికి ఎంపికయ్యారు. దీంతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.పేరు : బండి సంజయ్‌కుమార్ పుట్టిన తేదీ : 11–07–1971 తల్లిదండ్రులు : కీ.శే.నర్సయ్య–శకుంతల భార్య : బండి అపర్ణ (బ్యాంకు ఉద్యోగి) పిల్లలు : సాయి భగీరథ్, సాయి సుముఖ్ కులం : మున్నూరు కాపు (బీసీ–డి) పార్టీలో హోదా : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిరాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తా.. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మ కముంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని మోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాకు లభించిన పదవి కార్యకర్తల కృషి ఫలితమే. నాపై నమ్మకం ఉంచి కరీంనగర్ ప్రజలు రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే కేంద్రమంత్రిగా అవకాశం లభించింది. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ లోక్‌సభ స్థానం అభివృద్ధి కోసం వినియో గిస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయ సహ కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా. – బండి సంజయ్, కేంద్ర మంత్రి -
ఆర్ఎస్ఎస్ నుంచి అంచలంచెలుగా..
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డి.. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. తర్వాత భారతీయ జన సంఘ్‌లో, జనతా పారీ్టలో చేరారు. 1977లో యువమోర్చా నాయకుడిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఏర్పాటయ్యాక అందులో చేరారు. భారతీయ యు వమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా కన్వి నర్గా నియమితులయ్యారు.అంచెలంచెలుగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ సమయంలో ఉగ్రవాద నిర్మూలన కోసం రాజకీయేతర సంస్థ ‘వరల్డ్ యూత్ కౌన్సిల్ అగైనెస్ట్ టెర్రరిజం’ను స్థాపించారు. తర్వాత రాష్ట్ర బీజేపీలో కార్యదర్శిగా, కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, నాలుగు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా (రెండుసార్లు ఉమ్మడి ఏపీలో, రెండుసార్లు తెలంగాణలో) పనిచేశారు. 2004లో హిమాయత్‌నగర్ సెగ్మెంట్ నుంచి, 2009, 2014లలో అంబర్‌పేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చాన్స్ దక్కించుకున్నారు. రెండేళ్ల తర్వాత కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహించారు. సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగడం, జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలసివచ్చింది.పేరు : గంగాపురం కిషన్‌రెడ్డి పుట్టినతేదీ : 15–06–1960 తల్లిదండ్రులు : స్వామిరెడ్డి, ఆండాళమ్మ (రైతు కుటుంబం) భార్య : కావ్యారెడ్డి పిల్లలు : వైష్ణవి, తన్మయ్ కులం : రెడ్డి పార్టీలో హోదా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుఆ ఘనత బీజేపీదే సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ కార్యకర్తలకు కేంద్ర మంతివర్గంలో చోటు కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి సంస్కృతి ఒక్క బీజేపీలో మినహా దేశంలోని ఏ పార్టీలోనూ లేదన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, సహాయమంత్రి పదవులు ఇచ్చిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘రెండోసారి కేంద్ర మంతి పదవి దక్కడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రధాని నాకు ఇచి్చన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా’ అని చెప్పారు. -
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేశారు.ఆదివారం (జూన్9) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మోదీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. మోదీతో పాటు 30 మంది కేబినెట్ హోదాలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.72 మందితో మోదీ కేబినెట్ కొలువు దీరింది. వీరిలో 30 మంది కేబినెట్ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య మంత్రులు, ఓబీసీ(27), ఎస్సీలు(10), ఎస్టీలు(6), మైనార్టీలకు (5) మంత్రి పదవులు దక్కాయి. వీరిలో #WATCH | Narendra Modi takes oath for the third straight term as the Prime Minister pic.twitter.com/Aubqsn03vF— ANI (@ANI) June 9, 2024 1.రాజనాథ్ సింగ్2.అమిత్ షా3.నితిన్ గడ్కరీ 4.జేపీ నడ్డా 5.శివరాజ్ సింగ్ చౌహాన్ 6.నిర్మలా సీతారామన్ 7.జై శంకర్ 8.మనోహర్‌లాల్ ఖట్టర్ 9.హెచ్డీ కుమార్ స్వామీ10.పియూష్ గోయల్11.ధర్మేద్ర ప్రధాన్12.జితిన్ రామ్ మాంజీ13.రాజీవ్ రంజన్ సింగ్14.సర్వానంద్ సోనోవాల్15.వీరేంద్రకుమార్16.కింజరపు రామ్మోహన్ నాయుడు17.ప్రహ్లాద్ జోషి18.జువల్ ఓరం19.గిరిరాజ్ సింగ్20.అశ్వినీ వైష్ణవ్21.జోతిరాధిత్య సింధియా22.భూపేందర్ యాదవ్23.గజేంద్ర సింగ్ షెకావత్24.అన్నపూర్ణాదేవి25.కిరణ్ రిజిజు26.హర్దీప్ సింగ్‌పూరి27.మన్సుఖ్ మాండవీయ28.జి.కిషన్ రెడ్డి29.చిరాగ్ పాశ్వాన్ 30.సీఆర్ పాటిల్ -
కేంద్ర కేబినెట్లోకి నడ్డా
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. నడ్డాను కేబినెట్లోకి తీసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. మోదీతో పాటు నడ్డా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవనుంది. ఈ పదవిని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్ మంత్రి పదవి ఖరారావడంతో ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని నివాసంలో జరిగిన కాబోయే మంత్రుల చాయ్ భేటీకి నడ్డా హాజరయ్యారు.ఎన్సీపీకి నో చాన్స్కేంద్ర కేబినెట్ పదవుల్లో ఎన్సీపీకి షాక్ తగిలింది. కేంద్ర కేబినెట్లో అజిత్ పవార్ వర్గానికి చాన్స్ దక్కలేదు. ఎన్సీపీ నేతప్రపూల్ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి పదవిని ఆఫర్ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేబినెట్ మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఆఫర్ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది తనను అవమానించడమేనన్నారు. -
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్‌ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో అలమ్‌ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే. పనిమనిషి ఫ్లాట్‌లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం. -
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్థాన్‌కు చెందిన మంత్రి బాబులాల్ ఖరాడీను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు.వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వంలో బాబులాల్ ఖరాడీ గిరిజన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా(ఇన్స్‌స్టాగ్రామ్) వేదికగా మంత్రి బాబులాల్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. ఈ మేసేజ్‌లో బాబులాల్‌ను చంపేస్తానని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. Babulal Kharadi Receives Death Threat: बाबूलाल खराड़ी को सोशल मीडिया पर मिली धमकी | Udaipur | BJP#RajasthanWithFirstIndia #BabulalKharadi #BJP #Udaipur #RajasthanNews #RajasthanPolitics #DeathThreats pic.twitter.com/s7iL3WY7Gc— First India News (@1stIndiaNews) May 4, 2024 ఈ నేపథ్యంలో మంత్రి బాబులాల్ కుమారుడు.. ఈ మెసేజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు తెలిపారు. అయితే, గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్‌పూర్‌లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
TS: మంత్రి పదవి కోసం అన్నదమ్ముల మధ్య పోటీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రి వర్గంలో మన ఎమ్మెల్యేల్లో ఎవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ వీడడం లేదు. రాష్ట్రంలో తొలి మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరికి కేబినెట్లో బెర్త్ దక్కుతుందనే ఆసక్తి అధికార పార్టీతో పాటు ప్రజల్లోనూ ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 స్థానాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. పార్టీలో సీనియర్ నాయకుడు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు మొదటి కూర్పులోనే కేబినెట్లో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగినా అవకాశం రాలేదు. ఇక గడ్డం సోదరులైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరి ముగ్గురి మధ్య పోటీ నెలకొంది. అన్నదమ్ముల్లోనే పోటీ మాజీ మంత్రి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇద్దరూ అన్నదమ్ములు. వీరిరువురూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. 2004నుంచి 2009 మధ్య చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశానని, తనకే మళ్లీ అవకాశం ఇవ్వాలని వినోద్ కోరుతున్నారు. ఇందుకోసం రెండునెలల క్రితమే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి విన్నవించారు. ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డిని తరచూ కలుస్తున్నారు. గడ్డం వివేక్ కూడా మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ పదవిపై పోటీ పడుతూ ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. వంశీ ఎంపీ టికెట్‌తో లింకు? లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగాలని వివేక్ తనయుడు వంశీకృష్ణ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు, ఒకరికి ఎంపీ టికెట్, మళ్లీ అదే కుటుంబం నుంచి మంత్రి పదవి కూడా ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే కోణంలో పరిశీలన చేస్తున్నట్లు నాయకులు చెప్పుకొంటున్నారు. ఇక వంశీకి లోక్‌సభ టికెట్ కావాలని అడుగుతున్న క్ర మంలో టికెట్ ఇస్తే, మంత్రి పదవి వదులుకుంటా రా? లేక టికెట్‌తో పాటు కేబినెట్లో చోటు కోసం పట్టుబడుతారా? అనేది తేలాల్సి ఉంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలయ్యే దాకా ఈ సమస్య తేల్చ కుడా, మంత్రివర్గ విస్తరణ వాయిదా వేసే అవకాశం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. ఉమ్మ డి జిల్లాలో పాలన పరంగా ఇబ్బంది లేకుండా, స్థా నికంగా మంత్రి ఎవరూ లేకపోవడంతో ఆ స్థానంలో మంత్రి సీతక్కను ఇన్చార్జిగా నియమించారు. దీంతో ఆమెతోనే పాలన కొనసాగిస్తారా? లేక ఇక్క డి ఎమ్మెల్యేల్లో ఎవరికై నా అవకాశం కల్పిస్తారా?.. అనే విషయం తేలేవరకూ వేచిచూడాల్సిందే. ‘పీఎస్సార్’కు పెద్దల హామీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా పార్టీని బలోపేతం చేశార నే మంచి పేరు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఉంది. కష్టకాలంలో పార్టీలో కేడర్‌ను కాపాడినట్లు చెప్పుకొంటారు. ఆ సమయంలో గడ్డం సోదరులు ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. రెండేళ్ల క్రితం బీఎస్పీ నుంచి వినోద్, ఇటీవల అ సెంబ్లీ ఎన్నికల ముందు వివేక్ కాంగ్రెస్‌లో చేర డం తెలిసిందే. వీళ్లిద్దరి కంటే పార్టీలో సీనియర్‌గా ఉండి, పార్టీ కోసం కష్టపడ్డారని, పీఎస్సార్‌కే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘దళిత గిరిజన దండోరా’ బహిరంగ సభ సక్సెస్ చేసి పార్టీలో ఉత్తేజం నింపారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’ను సక్సెస్ చేశారు. మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ వేదికపైనే పీఎస్సార్ వచ్చే ప్రభుత్వంలో మంచిహోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. తర్వాత పార్టీ ఎన్నికల వ్యూహ కమిటీ చైర్మన్‌గా పని చేశారు. ఈ క్రమంలో ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. -
Maharashtra: మంత్రికి కొవిడ్ పాజిటివ్
ముంబై: మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు కొవిడ్ సోనినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. అయితే వైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ అన్నారు. ‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్ ముండేకు కొవిడ్ పాజటివ్ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముండేకు కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని పవార్ తెలిపారు. ‘కొవిడ్ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లో నుంచి ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటున్నారు. అయితే మంత్రి ఆఫీసు సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయినప్పటికీ వారికి కొవిడ్ లక్షణాలు లేవు’ అని మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఇదీచదవండి..బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
నా వల్ల కాదు.. మంత్రి పదవికి ప్రియాంక రాజీనామా
చెన్నై: పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏఐఎన్ఆర్సీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి చందిర ప్రియాంగ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయాలు డబ్బు, కుట్రలతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. పుదుచ్చేరి రవాణాశాఖ మంత్రి చందిర ప్రియాంక తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్టు ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రికి రంగస్వామికి లేఖ పంపారు. కాగా, లేఖలో ప్రియాంక సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాలు కుట్రలతో నిండిపోయాయని, డబ్బుమయంగా మారిపోయాయని అన్నారు. రాజకీయాల్లో కులతత్వం పెరిగిపోయిందని, లింగ వివక్ష సర్వసాధారణంగా మారిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'Could not fight ghost of money power':Puducherry's lone woman legislator and minister, S Chandira Priyanga quits. Watch: https://t.co/C5eaBYqTif pic.twitter.com/2Oq5N5CsPX — editorji (@editorji) October 10, 2023 అలాగే, పుదుచ్చేరిలో రెండు ప్రధాన వర్గాలుగా వన్నియర్లు, దళితులు ఉన్నారని, ఈ వర్గాలకు చెందిన శాసనసభ్యులు తమ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆ వర్గాలు మరింత అభివృద్ధి చెందేందుకు, అవినీతి రహిత రాజకీయాల కోసం తన పదవిని వన్నియర్లు లేదా దళితులు లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. pic.twitter.com/5lejQf9uHy — Chandirapriyanga (@SPriyanga_offl) October 10, 2023 ప్రజల మద్దతు లేకపోయినా ధన బలమున్న వారికి ఈ పదవి ఇచ్చి ద్రోహం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుచేయాలని అభ్యర్థించారు. ఇక, ఆమె రాజీనామాపై స్పందించేందుకు ముఖ్యమంత్రి రంగస్వామి నిరాకరించారు. ప్రియాంగ రాజీనామాపై అడిగేందుకు ఆయన చాంబర్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై రంగస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆహ్వానించకుండా ఎందుకు వచ్చారని వారిపై సీరియస్ అయ్యారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ పోరు.. భారత్‌కు కొత్త సవాల్! -
భార్య పాకిస్తాన్ కేంద్ర మంత్రి.. భర్త తీవ్రవాది
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తాతకాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్-ఉల్-హాక్ కకర్ తాత్కాలికంగా కేబినెట్ విస్తరించారు. కేబినెట్లో తీవ్రవాది యాసిన్ మాలిక్ సతీమణి మిశాల్ హుస్సేన్ మాలిక్ కు కూడా చోటు కల్పించడం పాకిస్తాన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో షెబాజ్ షరీఫ్ తమ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతరం ఆగస్టు 15న అన్వర్-ఉల్-హాక్ కకర్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన నియమించిన కొత్త కేబినెట్ మంత్రుల జాబితాలో మానవ వనరుల శాఖ మంత్రిగా మిశాల్ హుస్సేన్ మాలిక్ ను నియమించినట్లు తెలిపారు. మిశాల్ భర్త జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ తీవ్రవాదులకు నిధులను సమకూర్చిన కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నెరసుడిగా నిర్ధారించగా కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం యాసిన్ మాలిక్ శిక్షను అనుభవిస్తున్నాడు. మిశాల్ హుస్సేన్ మాలిక్ తోపాటు ఆర్ధిక మంత్రిగా మాజీ సెంట్రల్ బ్యాంకు చీఫ్ షంషాద్ అఖ్తర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా సర్ఫరాజ్ బుగాటి నియమితులయ్యారు. వీరితోపాటు మొత్తం 16 మంది మంత్రులతో కూడిన పాకిస్తాన్ కేబినెట్ తో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ఉన్నారు. పాక్ తాత్కాలిక ప్రధానికి ముఖ్య సలహాదారులుగా ఎయిర్ మార్షల్(ఆర్) ఫర్హాట్ హుస్సేన్ ఖాన్, ఆహద్ ఖాన్ చీమా, వకార్ మసూద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేశారు. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ మఫ్టీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మఫ్టీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబైయా సయీద్ 1989, డిసెంబరు 8న కిడ్నాప్ కు గురవ్వగా ఆ కేసులో యాసిన్ మాలిక్ ను నిందితుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే యాసిన్ మాలిక్ స్థాపించిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ ను 2019లో అధికారికంగా నిషేధించింది పాకిస్తాన్. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస -
సీఈసీ నియామకంలో సీజేఐకు అధికారం లేనట్టే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య కొలీజియంపై విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో వివాదాస్పద బిల్లును మోదీ సర్కార్ గురువారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఆయన స్థానంలో కేబినెట్ మంత్రికి స్థానం కల్పించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎన్నికల సంఘంపై కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. కేంద్రం ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చే వరకు ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఇతర కమిషనర్ల నియామకాలు చేపడుతుందని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సీజేఐను తప్పించి కేబినెట్ మంత్రిని చేర్చడం వివాదానికి దారితీసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీసు) బిల్లు, 2023ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ప్రధానమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఆ కమిటీయే సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తుంది. కాంగ్రెస్, ఆప్ ఇతర విపక్ష పార్టీ సభ్యుల ఆందోళనల మధ్య ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుప్రీం తీర్పుని లెక్క చేయరా ? సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వుల్ని నీరు కార్చేలా ఈ బిల్లు ఉందని విపక్షాలు విమర్శించాయి. కమిటీ నుంచి సీజేఐని తప్పించడం అత్యంత ప్రమాదకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలపై ఇది ప్రభావం చూపిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పులేమైనా బీజేపీకి నచ్చకపోతే వాటిని లెక్క చేయదని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం మొత్తాన్ని ప్రధాని మోదీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆరోపించారు. కమిటీలో ఇద్దరు బీజేపీకి చెందినవారే ఉంటే నిష్పాక్షికంగా కమిషనర్ల ఎంపిక ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఏడాది ఈసీలో ఖాళీ కేంద్ర ఎన్నికల కమిషన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఖాళీ ఏర్పడనుంది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేకి 65 ఏళ్లు నిండనుండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పదవీ విరమణ చేస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది రోజుల ముందే ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలి. తాము చెప్పినట్టు వినే కమిషనర్‌ను నియమించుకొని ఎన్నికల కమిషన్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం ఇదంతా చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఉత్తర్వుల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించే వారు. -
సహచర మంత్రి జహావిపై సునాక్ వేటు
లండన్: పన్నుల వివాదంలో చిక్కుకున్న అధికార కన్జర్వేటివ్ పార్టీ చైర్మన్, సహచర కేబినెట్ మంత్రి నదీమ్ జహావిని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ మంత్రి మండలి నుంచి తొలగించారు. జహావి పన్ను వ్యవహారాల్లో మంత్రులకుండే నియమనిబంధనల్ని ఉల్లంఘించారంటూ విచారణలో తేలడంతో సునాక్ ఆయనపై వేటు వేశారు. ప్రస్తుతం జహావి శాఖ లేని మంత్రిగా కేబినెట్లో ఉన్నారు. ప్రభుత్వం నియమించిన స్వతంత్ర విచారణ నివేదికను కూడా సునాక్ విడుదల చేశారు. ఇరాక్‌లో జన్మించిన జహావి ఆర్థిక మంత్రిగా ఉండగా అంతకు ముందు కట్టని పన్నులకు పెనాల్టీగా 50 లక్షల పౌండ్లు చెల్లించారు. ఈ విషయాన్ని దాయడం మినీస్టిరియల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని విచారణ నివేదిక తేల్చి చెప్పింది. -
Punjab: ఆప్ నేతపై అవినీతి ఆరోపణలు.. మంత్రి పదవికి రాజీనామా
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ఆహారశుద్ధి, ఉద్యానవన శాఖ మంత్రి ఫౌజా సింగ్ సరారీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే వైదొలుగుతున్నట్లు తెలుపుతూ తన రాజీనామా లేఖను సమర్పించారు సరారీ. తాను పార్టీకి నమ్మకమైన సైనికుడినని, పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అయితే, తనపై అవినీతి ఆరోపణలు వచ్చిన కొన్ని నెలల్లోనే రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి ఫౌజా సింగ్ సరారీపై నాలుగు నెలల క్రితం అవినితీ ఆరోపణలు వచ్చాయి. ఆయన ఓఎస్డీ తర్సెమ్ లాల్ కపూర్‌తో మాట్లాడిన ఓ ఆడియో వెలుగులోకి రావటం మంత్రిని ఇరుకునపెట్టింది. ఆహారధాన్యాల కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు తీసుకునే విషయంపై ఇరువురు మాట్లాడుకున్నట్లు ఆ ఆడియోలో బయటపడింది. దీంతో మంత్రితో పాటు ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఫౌజాను మంత్రివర్గం నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే ఆ ఆరోపణలను ఖండించారు ఫౌజా. మంత్రి రాజీనామా చేసిన క్రమంలో శనివారం సాయంత్రం పంజాబ్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. సరారీ స్థానంలో పాటియాలా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ బల్బీర్ సింగ్ లేదా జాగ్రాన్ ఎమ్మెల్యే సరవ్‌జిత్ కౌర్ మనుకే మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, కేబినెట్ మంత్రి సుబ్రతా సాహా కన్నుమూశారు. ముర్షిదాబాద్ మెడికల్ కాళాశాలలో గురువారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బుధవారం రాత్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన మంత్రిని ఆసుపత్రికి తరలించగా కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కేబినెట్ మంత్రి సుబ్రతా సాహా మృతి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీరని లోటుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సుబ్రతా సాహా ప్రస్తుతం ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. ముర్షిదాబాద్‌లోని సగర్దిఘి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు గెలుపొందారు. 69 ఏళ్ల సాహాకు ఇటీవలే పిత్తాశయ ఆపరేషన్ జరిగింది. అనారోగ్యం నుంచి కోలుకును బుధవారం ఉదయమే సొంత జిల్లాకు తిరిగివచ్చారు మంత్రి. కానీ, రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన బెర్హంపోర్లోని ముర్షిదాబాద్ మెడికల్ కలేజీలో చేర్పించారు. గురువారం ఉదయం మరణించారు. మమత బెనర్జీ దిగ్భ్రాంతి.. మంత్రి సుబ్రతా సాహా ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ‘సుబ్రతాబాబుతో దీర్ఘకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన రాజకీయ, సామాజిక సేవలు గుర్తుండిపోతాయి. సుబ్రతా సాహా మృతితో రాజకీయ ప్రపంచంలో లోటు ఏర్పడింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని సామాజిక మాద్యమాల్లో రాసుకొచ్చారు దీదీ. ముర్షిదాబాద్ జిల్లా నుంటి 2011లో టీఎంసీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు సుబ్రతా సాహా. సగర్డిఘి నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. తొలిసారి కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆ తర్వాత టీఎంసీలో చేరారు. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ.. టీఎంసీ సీనియర్ నేత రాజీనామా! -
కేబినెట్ మంత్రిగా ఉదయనిధి స్టాలిన్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన తండ్రి కేబినెట్లోకి అడుగుపెట్టారు ఉదయనిధి. సినీ నటుడు, నిర్మాత-పంపిణీదారుడు అయిన ఉదయనిధి మొదటిసారిగా.. 2021లో చెపాక్-తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యువజన విభాంగ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ పదవిలో ఎంకే స్టాలిన్ సుమారు మూడు దశాబ్దాల పాటు కొనసాగారు. ఆ తర్వాత మాజీ సీఎం ఎం కరుణానిధి మరణానంతరం 2018లో డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో యూత్ వింగ్ బాధ్యతలను ఉదయనిధికి 2019లో అప్పగించారు. ఇదీ చదవండి: Sarathkumar: రమ్మీ నాలెడ్జ్ గేమ్!.. నటుడు శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు -
సీఎం గారు ప్లీజ్ నాకు మంత్రి పదవి వద్దు.. ఆయనకే ఇవ్వండి
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీని వీడగా.. తాజాగా రాజస్థాన్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎంకు సొంత పార్టీ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలో బండి నియోజకవర్గం ఎమ్మెల్యే అశోక్ చంద్నా.. క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్షిప్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ రిలీఫ్ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. కాగా, తన శాఖలపై ఇతరుల జోక్యం మితిమీరిపోయిందని తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గౌరవం లేనిచోట తాను ఉండలేను అంటూ అశోక్.. సీఎంకు గెహ్లాట్‌కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశాడు. తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తంచేశారు. అయితే, గత కొంతకాలంగా తన పరిధిలోని శాఖల్లో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కుల్దీప్ రంకా జోక్యం మితిమీరిపోయిందని ఆయన మండిపడ్డారు. తనకు సంబంధించిన శాఖల్లో రంకా తలదూర్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ శాఖలన్నింటిని చూసే బాధ్యతలు ఆయనకే అప్పజెప్పండి. గౌరవం లేని మంత్రి పదవి నుంచి తనను తొలగించండి అని సీఎంను అశోక్ చంద్నా కోరారు. దీంతో ఈ విషయం తాజాగా రాజస్థాన్‌లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ స్పందించారు. సీఎం మీడియాతో మాట్లాడుతూ..‘‘మంత్రి అశోక్ చంద్నా చాలా మంచి వ్యక్తి. అతను ఇటీవల ఎన్నో క్రీడా పోటీలను నిర్వహించారు. బాధ్యతలు పెరగడంతో కాస్త టెన్షన్ పడటంతో ఏదో అలా మాట్లాడారు. దీనిని సీరియస్‌గా తీసుకోకూడదు. నేను త్వరలోనే అశోక్ చంద్నాతో మాట్లాడతాను. నేను అతనితో ఇంకా మాట్లాడలేదు కాబట్టి ఏం జరిగిందో నాకు తెలియదు. అశోక్ ఒత్తిడిలో పనిచేస్తున్నట్లు ఉన్నాడు‘‘ అని తెలిపారు. माननीय मुख्यमंत्री जी मेरा आपसे व्यक्तिगत अनुरोध है की मुझे इस ज़लालत भरे मंत्री पद से मुक्त कर मेरे सभी विभागों का चार्ज श्री कुलदीप रांका जी को दे दिया जाए, क्योंकि वैसे भी वो ही सभी विभागों के मंत्री है। धन्यवाद — Ashok Chandna (@AshokChandnaINC) May 26, 2022 ఇది కూడా చదవండి: కన్నీళ్లలో అస్సాం.. మునుపెన్నడూ లేనంతగా డ్యామేజ్.. -
Kakani Govardhan Reddy: అన్నదాత.. వ్యవసాయశాఖ మంత్రయ్యాడు
అన్నదాత.. ఆమాత్యుడయ్యాడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి పదవి వరించింది. హైదరాబాద్‌లో వివిధ రకాల వ్యాపారాలు చేసి ఉన్నత స్థితికి వచ్చినా ఆయన మూలాలు మాత్రం వ్యవసాయంతోనే ముడిపడి ఉన్నాయి. తల్లిదండ్రులు కాకాణి రమణారెడ్డి, లక్ష్మీకాంతమ్మ స్థానిక ప్రజాప్రతినిధులుగా కొనసాగినా వ్యవసాయమే వారి జీవనాధారం. మంత్రి కాకాణి చదువుకునే రోజుల్లోనే స్వగ్రామం తోడేరులో తమ నిమ్మ తోటలో పండే కాయలను గూడూరు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవారు. విద్యార్థి దశలోనే వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలపై అవగాహన పొందిన ఆయన వ్యవసాయశాఖ పగ్గాలు చేపట్టనున్నారు. సాక్షి, నెల్లూరు: ధాన్యాగారంగా నెల్లూరు ప్రసిద్ధి. పచ్చని పంట పొలాలు, పంటలతో అన్నపూర్ణగా విరాజిల్లుతున్న జిల్లాకు వ్యవసాయ శాఖ దక్కడం గొప్ప పరిణామం. రైతు బిడ్డగానే కాక ఎమ్మెల్యేగా వ్యవసాయం, రైతుల కష్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగిన వ్యక్తి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా సోమవారం కొలువు దీరండంతో జిల్లా కర్షక వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం తోడేరు గ్రామ రైతు బిడ్డగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనతి కాలంలోని రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక నేతగా ఎదిగి మంత్రి స్థానంలో కొలువు దీరాడు. ఆయన కుటుంబం వ్యవసాయ నేపథ్యం కావడంతో వ్యవసాయరంగ స్థితిగతులపై అవగాహన ఉంది. ప్రతి జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా రైతు పక్షాన తన గళం విప్పి వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా వ్యవసాయశాఖపైనే అధికంగా పోరాటాలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు, రైతులను గాలికి వదిలేసి రుణమాఫీ హామీని విస్మరించింది. దీంతో ఎమ్మెల్యేగా కాకాణి సుదీర్ఘకాలం టీడీపీ విధానాలపై పోరాడారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ శాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కాకాణి తన గళాన్ని వినిపించడంతో పాటు వ్యవసాయశాఖలో నెలకొన్న అవినీతిని బయట పెట్టారు. రైతురథం, ధాన్యం కొనుగోలు పథకాల్లో గోల్మాల్ జరిగినట్లు కాకాణి పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు. అయితే అదే శాఖకు ఇప్పుడు కాకాణి మంత్రి కావడం విశేషం. రైతుల కోసం ఉద్యమించిన మంత్రి వారి అభివృద్ధికి పాటు పడతారడంలో ఎలాంటి సందేహం లేదనే అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ కష్ట కాలంలో సర్వేపల్లి ప్రజలను ఆదుకునేందుకు ఎమ్మెల్యేగా కాకాణి పడని కష్టం లేదు. రైతుల నుంచి ధాన్యం సేకరించి బియ్యం, వంట సామగ్రిని పంచి పెట్టారు. జిల్లాకు వ్యవసాయం కీలక శాఖ జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కీలక శాఖ దక్కింది. జిల్లాలో సోమశిల, కండలేరు రెండు ప్రధాన జలనిధులు ఉన్నాయి. ఆ జలాశయాల కింద ఖరీఫ్, రబీ సీజన్లలో దాదాపు 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నాయి. వరి ధాన్యం విస్తారంగా పండుతోంది. ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రకృతి కరుణించింది. వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తోంది. రాయితీపై యంత్రాలు పంపిణీ చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుంది. వ్యవసాయ పరంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్న నెల్లూరు జిల్లాకు వ్యవసాయ శాఖ మంత్రి దక్కడం జిల్లా వ్యవసాయ ప్రగతికి ఇదో మంచి అవకాశం. జిల్లాలో పండే ధాన్యానికి ఆర్బీకే కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తూ రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేయడం, మిల్లర్లకు ముకుతాడు వేసేలా నిర్ణయాలు తీసుకోవడం , జిల్లా అధికార యంత్రాంగాన్ని రైతు సమస్యలపై అప్రమత్తం చేస్తూ సరైన మార్గదర్శకం చేస్తూ వారికి న్యాయం చేయడంలో ముందంజలో ఉంటారు. ఇక ఆ శాఖ మంత్రిగా రైతులకు మరింత న్యాయం జరిగేలా చేస్తారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై అవగాహన వ్యవసాయ రంగంపై మంత్రి కాకాణికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ శాఖ మంత్రిగా ఆయన పలు సంస్కరణలతో పాటు, రైతుల అభివృద్ధికి కృషి చేస్తారనే నమ్మకం రైతులకు ఉంది. మెట్ట ప్రాంత రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన రైతుల కష్ట నష్టాలు, వారికి ఎలాంటి రాయితీలు అందజేస్తే ఉపయోగంగా ఉంటుందో అవగాహన ఉంది. వరుసగా మూడు పర్యాయాలు నియోజకవర్గంలో వాటర్ మేనేజ్మెంట్ను సమర్ధవంతంగా నిర్వహించి పంటలు పండించారు. ఎక్కడ ఎప్పుడు రైతులకు ఏ అవసరం వచ్చినా క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సమస్యను పరిష్కరించారు. ఉద్యాన పంటలు అధికంగా ఈ ప్రాంతంలో పండ్ల తోటల అభివృద్ధి, పండిన పంటల ఎగుమతిని అభివృద్ధి పరుస్తారని రైతులు ఆశిస్తున్నారు. పరుగులు పెట్టిస్తారు వ్యవసాయ మంత్రిగా ఆ శాఖను అభివృద్ధి పథంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరుగులు పెట్టిస్తారు. మా గ్రామానికి చెందిన కాకాణి మంత్రి కావడం గ్రామానికే గర్వకారణం. రైతులకు సేవ చేసుకునే భాగ్యం లభించినట్టుగా మేము భావిస్తున్నాం. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. – ఏనుగు శశిధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, తోడేరు. యార్డుకు మంచి రోజులు జిల్లాలో అతిపెద్ద నిమ్మ మార్కెట్ యార్డు పొదలకూరులో ఉంది. వ్యవసాయంతో పాటు మార్కెటింగ్ శాఖను మంత్రి కాకాణికి కేటాయించడం సంతోషం ఉంది. నిమ్మ యార్డు ఆయన హయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. యార్డులో సౌకర్యాల కల్పనలో ఆయన చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం వ్యాపార వర్గాలు, రైతుల్లో ఉంది. – ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మమార్కెట్ యార్డు. సంప్రదాయ రైతుగా నాగలి పట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఫైల్) మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో కరచాలనం -
తానేటి వనిత అనే నేను..
-
రాజన్న దొర అనే నేను..
-
పినిపె విశ్వరూప్ అనే నేను..
-
విడదల రజిని అనే నేను..
-
ఆర్కే రోజా అనే నేను..
-
పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే నేను..
-
మేరుగ నాగార్జున అనే నేను..
-
కె నారాయణ స్వామి అనే నేను..
-
ఉషశ్రీ చరణ్ అనే నేను..
-
కొట్టు సత్యనారాయణ అనే నేను..
-
కారుమూరి వెంకట నాగేశ్వరరావు అనే నేను..
-
AP New Cabinet: డబుల్ ధమాకా
సమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్ జగన్ సర్కారు పెద్దపీట వేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారిద్దరికీ తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ (కొప్పెలవెలమ)కు చెందిన బూడి ముత్యాలనాయుడికి, కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్కు మంత్రులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్లుగానే పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిద్దరికీ కొత్త కేబినెట్లో చోటు దక్కింది. వార్డు మెంబర్ నుంచి విప్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు మంత్రిగా బూడి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గుడివాడ అమర్నాథ్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. సంబరాల వాతావరణంలో పార్టీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ మరింత బలోపేతం కానుంది. సాక్షి, విశాఖపట్నం: సంబరాలు మిన్నంటాయి. అభిమాను ల సందడి ఆకాశమే హద్దుగా సాగింది. మిఠాయిలు, బాణసంచా వెలుగులు, అభినందన పూమాలలు.. పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కడం వైఎస్సార్సీపీ శ్రేణులకు డబుల్ ధమాకాలా నిలిచింది. ఉదయమంతా శ్రీరామనవమి వేడుకల్లో గడిపిన వారంతా మధ్యాహ్నం నుంచీ గంతులు, కేరింతలతో సందడి చేశారు. నమ్మకానికి మారుపేరు... సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014లో వైఎస్సార్సీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగా.. ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో బూడిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జగనన్న వెంటే నిలిచారు. ఆయనతో ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త కేబినేట్లో మంత్రిగా అవకాశం కల్పించారు. తండ్రికి తగ్గ తనయుడిగా... : పేరుకు తగ్గట్టుగానే తన తండ్రి గుడివాడ గుర్నాథరావులాగే గుడివాడ అమర్నాథ్ పోరాటయోధుడిగా నిలిచారు. తండ్రికి తగ్గ తనయునిగా జిల్లాలో చురుకైన యువ రాజకీయ నేతగా ఎదిగారు. అమర్నాథ్ది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న ఎమెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు గుడివాడ గుర్నాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి వరించింది. తాత నుంచి వారసత్వ రాజకీయం ఉన్నా.. గుడివాడ అమర్నాథ్ తనంతట తానే రాజకీయంగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్సార్సీపీ వెంటే నిలిచారు. జగన్మోహన్రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. 2014లో వైఎస్సార్సీపీ ఓటమిపాలై అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో రాజకీయ దిగ్గజాలు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే యువకుడైన అమర్నాథ్ జిల్లా పార్టీ పగ్గాలను అందుకొని వైఎస్సార్సీపీని ముందుకు నడిపించారు. సీనియర్లను, యువకులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. 2007లో విశాఖ కార్పొరేటర్‌గా 22 సంవత్సరాల వయస్సులోనే ఎన్నికయ్యారు. 2008లో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యునిగా వ్యవహరించారు. 2018 నుంచి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్ని చేపట్టారు. జిల్లాలోని కీలకమైన రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగానూ, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగానూ పనిచేసిన అమర్నాథ్ అనకాపల్లి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మూడు జిల్లాల్లో సంబరాలు... ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లిద్దరినీ మంత్రులుగా ప్రకటించడంతో మూడు జిల్లాల్లో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంకు ధన్యవాదాలు నన్ను నమ్మి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వై.ఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. ఎలాంటి బాధ్యత అప్పగించినా..దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి..మరోవైపు వైఎస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి ఫలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తాను. సీఎం జగనన్న అడుగుజాడల్లో...నా తండ్రి దారిలో ప్రజల కోసం పనిచేస్తాను. – గుడివాడ అమర్నాథ్ సైనికుల్లా పనిచేస్తాం... కొత్త కేబినెట్లో మంత్రిగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాను. మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేస్తాం. ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. వార్డు మెంబర్‌గా రాజకీయ అరంగేట్రం చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ఇప్పుడు మంత్రిని చేశారు. నా తుది శ్వాస ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటా... ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా. – బూడి ముత్యాలనాయుడు -
అమాత్య యోగం.. అద్వితీయం.. కీలక నేతలకు కేబినెట్లో స్థానం
సాక్షి, ఏలూరు: సీనియార్టీకి సముచిత స్థానం, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జిల్లాలో కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది. అంకితభావానికి పెద్దపీట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు యధావిధిగా మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాదిరిగానే ఇప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. ఈసారి అదనంగా ప్రభుత్వ విప్ పదవిని కూడా అప్పగించారు. పార్టీపై విధేయత, పాల నపై అంకితభావం చూపిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమ ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనా రాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), న రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రి య)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పు లు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామా ణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి. తొలిసారిగా కేబినెట్లోకి.. తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మా త్రమే కేబినెట్లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్ విప్ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్ దక్కలేదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యానికి జై‘కొట్టు’ తాడేపల్లిగూడెం: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ని రంతరం ప్రజలను వె న్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హా మీల అమలు కమిటీ చై ర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అ భివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీ కాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ ఎస్యూరెన్స్ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ హౌస్ కమిటీ ఇరిగ్యు లారిటీస్ ఆఫ్ మిల్క్‌డైరీస్ సభ్యునిగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజ యం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమి టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆ యన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్ ఉన్నా రు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు. అందరివాడు.. కారుమూరి తణుకు అర్బన్ : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వి ద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు. 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ న్యూ అలుమ్నీ అసోసియేషన్ వెస్ట్ బ్రుక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. వైఎస్సార్ విద్యుత్ ఎంప్లా యీస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. మీ ఇంట్లో మంత్రిగా ఉంటా.. ‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత ము ఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి నన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది సీఎం జగన్. బీసీ నేతగా నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పటిలాగే నియోజకవర్గంలో ప్రజానీకానికి అందుబాటులోనే ఉంటూ మీ ఇంట్లో మంత్రిగానే ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. విధేయతలో రా‘రాజు’ నరసాపురం: పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు. ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యే అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. వైఎస్సార్ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మె ల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్ సీపీ ఇన్చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజర్టీతో గెలుపొందారు. 1974 మే 29న సత్యనారాయణరాజు, వెంకట సరోజినీదేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య శారదావాణి, కుమారుడు శ్రీకృష్ణంరాజు, కుమార్తె సింధూజ ఉన్నారు. -
AP New Cabinet: అంజద్‌బాషాను రెండోసారి వరించిన మంత్రిపదవి
కడప కార్పొరేషన్: కడప గడపకు మరోమారు మంత్రి హోదా దక్కింది. సమర్థత, విశ్వాసం, సామాజిక సమతుల్యత నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో కడప ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషాకు రెండోసారి అరుదైన అవకాశం లభించింది. ఈయనను మంత్రివర్గంలోకి తీసుకొని ముస్లీం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రపీఠం వేశారు. శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా, రాష్ట్ర రాజధానికి ఎమ్మెల్యే అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివెళ్లాయి. వ్యాపారవేత్తగా కడప వాసులకు సుపరిచితుడైన అంజద్‌బాషా 2005లో రాజకీయ ఆరంగ్రేటం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వైఎస్సార్సీపీ పార్టీలో క్రియాశీలక భూమిక పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కడప నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికై వైఎస్సార్సీపీ ఉన్నతికి కృషి చేశారు. అనంతరం 2014లో శాసనసభకు పోటీచేసే అవకాశం దక్కింది. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్రంలో ఆపార్టీ అధికారం చేజేక్కించుకోలేకపోయింది. నిరంతరం ప్రజల పక్షాన నిలిచి, ప్రత్యక్ష పోరాటాల్లో తనవంతు పాత్రను పోషించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. తర్వాత వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రెటరీగా ఎంపికయ్యారు. అనంతరం 2019 ఎన్నికల మేనిఫేస్టో కమిటీ మెంబర్‌గా అంజద్‌బాషా నియమితులయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన ఆయన మరోమారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. ఆనక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆయనకు రెండవసారి మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విధేయుత..విశ్వాసం..సమర్థత పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్ల విశ్వాసం, ముస్లీం మైనార్టీ వర్గీయుడైనా అత్యంత సమర్థత కల్గిన నాయకుడుగా ఎస్బి అంజద్‌బాషా గుర్తింపు దక్కించుకున్నారు. 2014లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకపోగా, వైఎస్సార్ జిల్లాలో ఆ పార్టీని విచ్ఛిన్నం చేయాలనే దిశగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టిన అటువైపు మొగ్గు చూపకుండా విశ్వాసంగా ఉండడం, పార్టీ కోసం శక్తికి మించి శ్రమించడం ఇవన్నీ కలిసివచ్చాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పాతవారిని తొలగించి కొత్తవారిని మంత్రులుగా తీసుకుంటారని ప్రచారం సాగినా సామాజిక సమీకరణల నేపథ్యంలో అంజద్‌బాషాను మళ్లీ మంత్రిపదవి వరించిందని పరిశీలకులు భావిస్తున్నారు. చేపట్టిన పదవులు అంజద్‌బాషా మదీనా ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్‌గా,బుఖారియా విద్యాసంస్థ ఉపాధ్యక్షుడిగా, అల్ హజ్ ఎస్బి అబ్దుల్ ఖాదర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి, హరూన్ ఛారిటబుల్ ట్రస్టు, నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూల్ అల్యూమిని అసోషియేట్లకు అధ్యక్షుడిగా ఉన్నారు. హౌస్ మసీదు కమిటీ కోశాధికారిగా, ఏపీ ముస్లిం కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా, ఏపీఎస్ఆర్టీసీలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడిగా, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2005లో కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. 2012లో వైఎస్సార్సీపీ కడప సమన్వయకర్త. 2014లో వైఎస్ఆర్సీపీ తరుపున పోటీ చేసి 45వేలపైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2016లో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు. 2018లో జనరల్ సెక్రెటరీ,2019 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్. సార్వత్రిక ఎన్నికల్లో 54వేల మెజార్టీతో విజయం సాధించారు. కుటుంబ నేపథ్యం కడప జిల్లా సిద్దవటంకు చెందిన జనాబ్ ఎస్బి హరూన్ సాహెబ్ 1935 నుంచి 1953 వరకు సుమారు 18 సంవత్సరాలు సిద్దవటం సర్పంచ్‌గా పనిచేశారు. సిద్దవటంలో హరూన్ సాహెబ్ అందించిన సేవలకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఆయన్ను బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. హరూన్ సాహెబ్ కుమారుడైన అబ్దుల్ ఖాదర్ పెద్ద కుమారుడే ఎస్బి అంజద్‌బాషా. 1963లో వారి కుటుంబం వ్యాపార పరమైన సౌకర్యాల కోసం కడప నగరంలో స్థిరపడ్డారు. కడప, కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వీరికి వ్యాపారాలు ఉన్నాయి. నిర్మలా ఇంగ్లీషు మీడియం స్కూలులో ఆయన విద్యాభ్యాసం కొనసాగించారు. సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ క్రమశిక్షణ, అంకిత భావం, కష్టపడే తత్వం, నాయకత్వ లక్షణాలు, సేవాగుణంతో అంజద్‌బాషా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొన్నారు. వీరి సేవా తత్పరతను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. 2005లో కాంగ్రెస్ తరపున కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. కడపకు మరో అవకాశం.. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాకు మంత్రిహోదా దక్కడంతో కడప నియోజకవర్గానికి మరోసారి అవకాశం దక్కింది. ఇదివరకు కడప నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రి హోదా దక్కించుకున్న వారి జాబితాలో అంజద్‌బాషా రెండోసారి చేరారు. ఎస్ రామమునిరెడ్డి(1983), సి రామచంద్రయ్య(1985), డాక్టర్ ఎస్ఏ ఖలీల్‌బాషా(1999), ఎస్ఎండీ అహమ్మదుల్లా (2009), ఇదివరకు మంత్రి పదవులు అలంకరించారు. తాజాగా 2019లో అంజద్‌బాషాకు ఆ హోదా దక్కింది. ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. కడప నుంచి మంత్రి హోదా దక్కించుకున్న వారిలో ఈయన ఐదో ఎమ్మెల్యే కాగా, గడిచిన 3 పర్యాయాలు పరిశీలిస్తే పదేళ్లకు ఓమారు కడప నియోజకవర్గానికి మంత్రి హోదా దక్కుతూ రావడం మరో విశేషం. -
Merugu Nagarjuna: పదునైన గళం.. అలుపెరుగని పోరాటం
గుంటూరు: ప్రజా ఉద్యమాల్లో సుదీర్ఘ ప్రస్థానం, దళిత సమస్యలపై అలుపెరుగని పోరాటం, అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా అడుగులేయడం.. ఇవి గుంటూరు జిల్లాలో మేరుగ నాగార్జున గురించి స్థానికులు చెప్పే మాటలు. దళితుల జీవితాలు చదువులతోనే మారతాయని ప్రతీ చోట చెప్పే మేరుగ నాగార్జున.. పార్టీ ఎజెండాను బలంగా వినిపించగల సత్తా ఉన్న నాయకుడు. స్వయంగా ఉన్నత చదువులు చదివిన మేరుగ నాగార్జున.. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు అధిగమించారు. సమస్య వచ్చిందంటే చాలు రాత్రనక, పగలనక ప్రజల్లోకి దూసుకెళ్లే తత్వం ఉన్న మేరుగ నాగార్జున ఇప్పుడు మంత్రిగా తన పరిధిని మరింత విస్తృతం చేసుకోబోతున్నారు. నేపథ్యం మేరుగు నాగార్జున జూన్ 15, 1966లో గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించాడు. వెల్లటూరులోనే పదో తరగతి వరకు చదివాడు. 1982లో ఇంటర్మీడియట్, 1985లో రేపల్లె లోని ఏబిఆర్ డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1987లో ఎం.కామ్, 1989లో ఎంఫిల్, 1994లో పి.హెచ్.డి పూర్తి చేశాడు. ఉద్యమ జీవితం విద్యార్థి జీవితం నుంచే ఉద్యమాలకు ఆకర్షితుడయిన మేరుగ నాగార్జున.. కాలేజీ రాజకీయాల్లో చైతన్యంగా ఉండేవాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ప్రస్థానం 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేమూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఎస్సీ & ఎస్టీ కమిషన్‌కు చైర్మన్ గా నియమితుడయ్యారు. 2012లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గా పని చేశాడు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న వేమూరు నియోజకవర్గం నుంచి 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రజా సమస్యలపై పదునైన గళం దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యలు చేసినప్పుడు.. కడిగిపారేశారు మేరుగ నాగార్జున. 40 ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించిన మేరుగ నాగార్జున.. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టాలని బలంగా డిమాండ్ చేశారు. -
Ushashri Charan: కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో..
బీసీల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అభిమానం చాటుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు కేబినెట్లో చోటు కల్పించి బీసీల అభ్యున్నతి, స్త్రీ సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి , అనంతపురం: బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ఉన్నత విద్యావంతురాలిగా పేరుగడించారు. లైఫ్ సైన్సెస్‌లో బీఎస్సీ, ఎన్విరాన్మెంటల్ విభాగంలో ఎమ్మెస్సీ చదివిన ఆమె 2012లో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. తర్వాత కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ మూడు సార్లు తిరిగి ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఐదేళ్లు పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆమె కృషిని గుర్తించిన అధిష్టానం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించింది. ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో కదిలిన ఆమె సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన మాదినేని ఉమా మహేశ్వర నాయుడిని 19,896 ఓట్ల తేడాతో ఓడించారు. అసెంబ్లీలో గళం.. ఎమ్మెల్యేగా గెలిచాక తనదైన శైలిలో దూసుకెళ్తూ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే గెలుపొందిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక.. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పలు పర్యాయాలు గళమెత్తి పరిష్కారానికి కృషి చేశారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో తన మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కళ్యాణదుర్గానికి ఆయువుపట్టుగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరు తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీసీ మహిళకు సముచిత స్థానం కల్పించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిజీబిజీగా ఉన్నా.. ఉన్నత విద్యపై ఆసక్తి.. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య తీరిక లేని సమయం గడుపుతున్నా.. ఉన్నత చదువు చదివేందుకు ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో పీహెచ్డీ చేరే అవకాశం ఉండడంతో 3 నెలల క్రితం దరఖాస్తు చేశారు. గత నెలలో ఎస్కేయూ పాలకమండలి ఆమె పీహెచ్డీ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. త్వరలో అడ్మిషన్ కల్పించనున్నారు. ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌గోపాల్ పర్యవేక్షణలో ఉషశ్రీచరణ్ పరిశోధన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి తొలి బీసీ మహిళ.. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి గతంలో ముగ్గురు మహిళలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. కానీ ఇప్పటివరకూ బీసీ వర్గానికి చెందిన మహిళలు ఎవరూ మంత్రులు కాలేదు. కానీ ఉషశ్రీ చరణ్‌కు ఆ అవకాశం దక్కింది. గతంలో లక్ష్మిదేవమ్మ, శమంతకమణి, పరిటాల సునీత ఈ జిల్లానుంచి మంత్రులుగా వ్యవహరించారు. వారి తర్వాత మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఉషశ్రీ చరణ్ నాల్గవ మహిళ. సోమవారం ఉదయం ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక.. ఇప్పటివరకూ ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో అని ఎదురు చూసిన జిల్లా వాసులు.. ఇప్పుడు ఉషశ్రీచరణ్‌కు ఏ శాఖ దక్కుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు.. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి దక్కడంతో అటు పార్టీ శ్రేణులు, ఇటు కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే మంత్రి కానుండడంతో కళ్యాణదుర్గంలో సంబరాలు మిన్నంటాయి. టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఆనందం పంచుకున్నారు. పూర్వజన్మ సుకృతం రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం నిజంగా పూర్వ జన్మ సుకృతం. ఇది ముమ్మాటికీ నాకు జగనన్న ఇచ్చిన వరం. ఈ వరం వల్లే నేను ఇంతదాకా వచ్చా. గతంలో చంద్రబాబు బీసీలతో ఓట్లేయించుకుని వారిని ఓటుబ్యాంకుగానే చూశారు. ఏనాడూ బీసీ వర్గాలకు చెందిన మహిళను మంత్రిని చేయాలని చూడలేదు. నాకు ఏ శాఖ కేటాయించినా బాధ్యతగా, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా నిర్వహిస్తా. అందరినీ కలుపుకుని ఈ ప్రభుత్వానికి, జగనన్నకు కీర్తి తెస్తా. – ఉషశ్రీ చరణ్ ఉషశ్రీ చరణ్ బయోడేటా పూర్తి పేరు: కురబ విరుపాక్షప్ప గారి ఉషశ్రీ చరణ్ (కేవీ ఉషశ్రీచరణ్) పుట్టిన తేదీ: 16–07–1976 తల్లిదండ్రులు : కేవీ రత్నమ్మ, డాక్టర్ కురుబ విరుపాక్షప్ప పుట్టిన స్థలం: రాయదుర్గం భర్త పేరు: శ్రీ చరణ్ రెడ్డి పిల్లలు: కుమార్తె జయనా శ్రీచరణ్, కుమారుడు దివిజిత్ శ్రీచరణ్ విద్యార్హత : బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్). ఎస్కేయూలో అట్మాస్పియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేయనున్నారు. చదవండి: (నూతన మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న అమరనాథ్ ఫ్రొఫైల్ ఇదే..) -
నూతన మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న అమరనాథ్ ప్రొఫైల్ ఇదే..
సాక్షి, అమరావతి: చిన్న వయస్సులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుడివాడ అమరనాథ్.. ఎంచుకున్న ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడే సత్తా, ఏ వేదికపైన అయినా తన గళం వినిపించగల సామర్థ్యం.. వెరసి గుడివాడ అమర్నాథ్కు ఏపీ నూతన మంత్రివర్గంలోకి చోటు దక్కేలా చేసింది. పార్టీ ఎజెండాను బలంగా వినిపించే అమర్నాథ్.. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించగలరు. ►గుడివాడ అమర్నాథ్ 22 జనవరి 1985లో అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి గుడివాడ గురునాథ రావు మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశాడు. అమర్నాథ్ బీటెక్ చదివారు. ►ఆరంభంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన అమర్నాథ్ 2006లో తన 21వ ఏటనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా గెలిచాడు. ఆ తర్వాత విశాఖ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశాడు. ►2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడంతో పాటు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ గా పని చేశారు. ►2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోవింద సత్యనారాయణ పై 8,169 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ►అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అనకాపల్లి పార్లమెంట్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ను పార్టీ నియమించింది. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
బీజేపీ ఎఫెక్ట్.. బీహార్ కేబినెట్ నుంచి మంత్రి అవుట్
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీజేపీ డిమాండ్‌కు తలొగ్గారు. తన కేబినెట్లోని మంత్రి ముఖేష్ సహానిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడింది. ముఖేష్ సహాని.. నితీశ్ కేబినెట్లో పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఆదివారం సాయంత్రం ఆయన్ని కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు నితీశ్ ప్రకటించారు. ముఖేష్ ‘వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ’ (విఐపీ) వ్యవస్థాపకుడు. అధికారి ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ. ముఖేష్‌ను తొలగించాలంటూ బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఈ మేరకు బీజేపీ ఓ లేఖ సైతం రాసింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తొలగించాలంటూ రాజ్‌భవన్‌కు సీఎం నితీశ్ ప్రతిపాదన చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర సమాచార ప్రసార శాఖ తన వాట్సాప్ అధికారిక గ్రూప్‌లో పోస్ట్ చేసింది కూడా. తొలగింపు తక్షణమే అమలులోకి వస్తుందంటూ పేర్కొంది కూడా. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ఎన్డీఏ కోటాలో భాగంగా 11 సీట్లను వీఐపీకి కేటాయించింది బీజేపీ. అందులో నాలుగు స్థానాల్లో వీఐపీ గెల్చింది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు.. మొదటి నుంచి బీజేపీకి విధేయులుగా ఉన్నారు. ఈ తరుణంలో గత వారం అధికారికంగా ఈ ముగ్గురు బీజేపీలో చేరిపోయారు. దీంతో ముఖేష్ సహాని ఒంటరి అయిపోయారు. అయితే సహాని తొలగింపు వెనుక రాజకీయ ప్రతీకారాలు ఏవీ లేవని, కేవలం మత్స్య కమ్యూనిటీలో ఆయన(వికాస్ సహానీ) చేస్తున్న మోసాలు, అవినీతి బయటపడడంతోనే ఆయన్ని తొలగించాలని సిఫార్సు చేశామని బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ వివరణ ఇచ్చుకున్నారు. కానీ, ముఖేష్ అనుచర గణం మాత్రం.. పార్టీ విలీన ప్రతిపాదనను అంగీకరించకపోవడం, అధిష్టాన నిర్ణయాలకు ముఖేష్ వ్యతిరేకంగా వెళ్తుండడం వల్లే ఇదంతా అని ఆరోపిస్తున్నారు. -
Lakhimpur Kheri Violence: ‘ఒక్క ఆధారం చూపినా రాజీనామా చేస్తా’
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరిలో రైతు మరణాల ఘటనపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. తన కుమారుడు ఆశిష్ మిశ్రా ఈ ఘటనలో ఉన్నట్లు ఒక్క ఆధారం చూపిన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కారు అదుపు తప్పి రైతులపైకి దూసుకెళ్లిందని, ఈ ఘటన సమయంలో కారులో తన కుమారుడు లేడని అన్నారు. ఘటన తర్వాత కారుపై దాడిచేయడంతో డ్రైవర్ గాయపడ్డాడని తెలిపారు. లఖీమ్‌పూర్ ఖేరి ఘటనపై నిరాధార అరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. బీజేపీ అధిష్టానం తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. చదవండి: రైతు మరణాలపై... రాజకీయ ఉద్రిక్తతలు ఆదివారం బన్బీర్పూర్ సందర్శనకు వచ్చిన యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, అజయ్ మిశ్రాలకు నల్లజెండాలతో శాంతియుతంగా రైతులు తెలిపిన నిరసన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో నలుగురు రైతులతో సహా 9 మంది మృతి చెందారు. లఖీమ్‌పూర్ ఖేరీలో రైతుల పైనుంచి దూసుకెళ్లిన ఎస్యూవీ (మహీంద్రా థార్)లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ ఉన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఆశిష్ మిశ్రాపై పోలీసులు హత్య, నేరపూరిత కుట్ర, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపటం, అల్లర్లకు కారణం అవడం... తదితర కేసులు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా పేరులేదు. -
రైతు బిడ్డ నుంచి కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: కేబినెట్ విస్తరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేసింది. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్లో చోటు కల్పించింది. కేబినెట్ విస్తరణలో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర హోం సహాయ మంత్రిగా పనిచేస్తున్న జీ.కిషన్‌రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా కల్పించింది. ఆయన కేబినెట్ మంత్రిగా బుధవారం పదవి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన రైతు బిడ్డ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎదిగారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కుటుంబ, రాజకీయ ప్రొఫైల్.. కుటుంబ నేపథ్యం: ► జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు కిషన్ రెడ్డి 1964, మే 15న జన్మించారు. ► కిషన్‌రెడ్డి తండ్రి స్వామి వ్యవసాయ రైతు ► రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం ఆయన స్వస్థలం. ► టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తిచేశారు. ► 1995లో కావ్యతో కిషన్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం వైష్ణవి, తన్మయ్. రాజకీయ ప్రస్థానం.. ► 1977లో జనతాపార్టీలో కిషన్ రెడ్డి చేరారు. ► 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో చేరారు. ► 1980లో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవీ చేపట్టారు. ► 1983లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ► 1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను అధిష్టించారు. ► 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవి చేపట్టారు. ► 2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ► 2009 ఎన్నికల్లో నియోజకవర్గం మారింది. అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2010, మార్చి 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ► 2014 ఎన్నికలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ► 2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ► 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ► ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రి 2019 ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆయనకు హోంశాఖ సహాయమంత్రిగా స్థానం కల్పించారు. బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా కిషన్‌రెడ్డికి కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి కల్పించారు. -
Kerala: అన్నీ కొత్త ముఖాలే.. శైలజ టీచర్‌కు నో ఛాన్స్!
తిరువనంతపురం: కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రెండో దశ కోవిడ్ భారత్‌ను మరింతగా దెబ్బకొట్టింది. అయితే, కరోనా తొలి దశలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి అదుపుతప్పింది. అయితే కోవిడ్ పోరులో కేరళ మాత్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కేరళ సమర్ధంగా ఎదుర్కోవడంలో అప్పటి కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ (64) కృషి చేశారు. ఆమె పనితీరుపట్ల ఎందరో ప్రశంసలు కురిపించారు. ఈక్రమంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వం ఆరోగ్య మంత్రిగా కేకే శైలజకే పగ్గాలు అప్పగిస్తుందని అందరూ భావించారు. ప్రస్తుత కేబినెట్లో ఆమెకు మొండి చేయే ఎదురవనుందని విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కేకే శైలజ కన్నూర్ జిల్లాలోని మత్తనూర్ నియోజకవర్గం నుంచి 60 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కోవిడ్ మొదటి దశలో వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవడంలో శైలజా టీచర్ "రాక్‌స్టార్" ఆరోగ్య మంత్రిగా ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా నిఫా వైరస్ సంక్షోభ కాలంలో కూడా ఆమె పనితీరుకు ప్రశంసలు దక్కాయి. గత ఏడాది సెప్టెంబరులో, యూకేకు చెందిన ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ ఆమెను "టాప్ థింకర్ ఆఫ్ ది ఇయర్ 2020" గా కూడా ఎంపిక చేసింది. మరోవైపు ప్రస్తుత మంత్రివర్గంలో పినరయి విజయన్ తప్ప మిగతా అందరూ కొత్త వారేనని సమాచారం. ఆయన అల్లుడు పీఏ మహ్మద్ రియాస్, పార్టీ కార్యదర్శి ఏ విజయరాఘవన్ భార్య ఆర్.బిందు కూడా కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకోనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై రాజకీయ విశ్లేషకుడు ఎన్ఎం పియర్సన్ స్పందిస్తూ... "పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా ఓ కారణం. ఒక వేళ జట్టు మొత్తాన్ని మార్చితే... అది కెప్టెన్‌కు కూడా వర్తింపజేయాలి’’ అంటూ చురకలంటించారు. (చదవండి: Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం) -
రోడ్డుపై ధర్నా: మంత్రికి అరెస్ట్ వారెంట్
డెహ్రాడూన్ : రోడ్డును బ్లాక్‌చేసి ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరించిన ఓ మంత్రిని అరెస్ట్ చేయాలని ఉత్తరాఖండ్‌లోని దిగువ న్యాయస్థానం స్థానిక పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి అరవింద్ పాండేపై రుద్రపూర్ జిల్లాకోర్టు శుక్రవారం మంత్రిపై నాన్ బెయిబుల్ వారెంట్‌ను జారీచేసింది. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో అప్పటి ప్రతిపక్ష బీజేపీ అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు జాతీయ రహదారిని దిగ్భందించింది. దీంతో స్థానిక పోలీసులు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది స్థానిక నేతలపై కేసు నమోదు చేశారు. ఆయా కేసులను తాజాగా విచారించిన రుద్రపూర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి వారందరినీ దోషులుగా తేల్చారు. ప్రజా వ్యవస్థకు ఆటంకం కలిగే విధంగా వ్యవహరించారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. వీరిలో ప్రస్తుత మంత్రి అరవింద్ పాండేతో పాటు అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హర్భజన సింగ్, రాజ్‌కుమార్, ఆదేశ్ చౌహాన్, మాజీ ఎంపీ బల్రాజ్ పాసీలు ఉన్నారు. కోర్టు ఆదేశాలను అందుకున్న స్థానిక ఎస్పీ రాజేష్ భట్.. నిందితులను అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అక్టోబర్ 23లోపు వారందరినీ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చాలని వెల్లడించారు. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందన్నారు. -
బిహార్ మంత్రిని కబళించిన కరోనా
సాక్షి, పట్నా: కరోనా మహమ్మారి వ్యాధితో చికిత్స పొందుతున్న బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (50) కన్నుమూశారు. ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస తీసుకున్నారు. రేపు (అక్టోబర్ 13 న) ఆయన మృతదేహాన్ని పాట్నాకు తరలించనున్నారు. మంత్రి వినోద్ సింగ్ జూన్ 28న కోవిడ్ బారినపడ్డారు. మంత్రితోపాటు ఆయన భార్యకు కూడా కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో కతియార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందజేశారు. అయితే కరోనా నుంచి ఇద్దరూ కోలుకున్నప్పటికీ, మంత్రికి ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో చికిత్స కోసం పట్నానుంచి ఆగస్టు 16న ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. గత రెండు నెలలుగా మెరుగైన చికిత్స అందించినప్పటికీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో మృత్యువు ఆయనను కబళించింది. వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా వినోద్ సింగ్ర మణంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. సమర్థుడైన ప్రజాదరణ పొందిన నాయకుడంటూ సంతాపం తెలిపారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు నష్టమని బీజేపీ పేర్కొంది. కతిహార్ జిల్లా ప్రాణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వినోద్ సింగ్ మూడుసార్లు గెలుపొందారు. కాగా వినోద్ భార్య నిషా సింగ్ ప్రస్తుతం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రన్‌పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. -
స్వరాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి
సత్యవతి రాథోడ్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన.. లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఏ వ్యక్తికి లేదా సంస్థలకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి గిరిజన మహిళా మంత్రిగా కేసీఆర్ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్ చోటు దక్కించుకున్నారు. అనుభవం, పనితీరు కారణంగా ఆమెకు మంత్రి వర్గంలో గిరిజన కోటాలో స్థానం లభించిందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సత్యవతిరాథోడ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆమెకు సీఎం కేసీఆర్ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖను కేటాయిం చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మహిళగా ప్రమాణ స్వీకారం చేయటంతో గిరిజన జిల్లా అయిన మానుకోటలో టీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి మండలం గుండ్రాతిమడుగు శివారు పెద్ద తండాలో 1969లో జన్మించిన సత్యవతి రాథోడ్ 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత మండల పరిషత్ అధ్యక్షురాలిగా పోటీ చేసి ఓడిన ఆమె ఆపై గుండ్రాతిమడుగు సర్పంచ్‌గా విజయం సాధించారు. 1989లో డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీచేసి రెడ్యా చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. 1995లో సర్పంచ్‌గా, 2005లో నర్సింహులపేట జెడ్పీటీసీగా గెలు పొందారు. 2009లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సత్యవతి తెలంగాణ ఉద్యమం సందర్భంగా 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తాజాగా మంత్రివర్గ విస్తరణలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పదవిని అలకంరించారు. విధేయతకు గుర్తింపు సత్యవతిరాథోడ్ టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి జయాపజాయలకు కుంగిపోకుండా వినయ విధేయలతో పార్టీలో అంకితభావంతో కొనసాగారు. ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిగా పట్టం కట్టారు. 2014లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటంతో పార్టీ మారకుండా రెడ్యానాయక్ గెలుపుకోసం పనిచేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, నల్గొండ టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తూనే అధిష్టానం వద్ద తన పట్టును మరింత పెంచుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. పార్టీకోసం సత్యవతి రాథోడ్ చేసిన సేవలను గుర్తించిన ఆధిష్టానం మంత్రిపదవితో సత్కరించిందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక సత్యవతి రాథోడ్‌ను మానుకోట ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, జెడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మానుకోట జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షాలు తెలియజేశారు. నాడు రెడ్యాకు.. నేడు సత్యవతికి డోర్నకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపోందిన రెడ్యానాయక్ నాడు వైఎస్సార్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పదవి చేపట్టారు. కాగా 11 సంవత్సరాల తరువాత తిరిగి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి సత్యవతి రాథోడ్ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు. బయోడేటా.. పేరు : భూక్య సత్యవతిరాథోడ్ తల్లిదండ్రులు : లింగ్యానాయక్, దస్మి స్వస్థలం : కురవి మండలం పెద్దతండా జీపీ భర్త : భూక్య గోవింద్‌రాథోడ్(లేట్) కుమారులు, కోడల్లు : భూక్య సునీల్కుమార్రాథోడ్–సోనమ్, డాక్టర్ సతీష్‌రాథోడ్–బిందు విద్యార్హత : బీఏ(అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ) స్ఫూర్తినిచ్చిన నేత : సీఎం కేసీఆర్ అభిమానించే వ్యక్తి : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నచ్చిన ప్రదేశం : డోర్నకల్ నియోజకవర్గం మరచిపోలేని రోజు: 2009లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త గోవింద్‌రాథోడ్ మృత్యువాతకు గురికావడం. రాజకీయచరిత్ర : 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తెలుగు మహిళా జిల్లా కన్వీనర్‌గా, 1985లో టీడీపీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షురాలిగా, అదే సంవత్సరం రాష్ట్ర ఎస్టీసెల్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 1987లో మేన మామ బానోత్ సక్రాంనాయక్పై కురవి మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 1987లో భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయ ట్రస్టు బోర్టు సభ్యురాలిగా నియమితులయ్యారు. 1989లో టీడీపీ తరఫున డోర్నకల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1995లో గుండ్రాతిమడుగు(విలేజి) సర్పంచ్‌గా జనరల్ స్థానం నుంచి గెలుపొం దారు. 2001లో కురవి మండలం చింతపల్లి ఎంపీటీసీ స్థానానికి పోటీచేసి ఓడిపాయారు. 2006లో నర్సింహుంలపేట జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో డోర్నకల్ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా రెడ్యానాయక్‌పై విజయం సాధించారు. 2014 మార్చి 3న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రెడ్యానాయక్‌పై పోటీ చేశారు. 2019 మార్చి 12న ఎమ్మెల్యే కోటా కింద టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 8న తొలి గిరిజన మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడు ప్రజలతోనే మమేకం చిన్పప్పటి నుంచి ప్రజలతోనే తిరుగుతుండేది. చిన్పప్పుడే సర్పంచ్‌గా గెలిచింది. చెల్లే నేను మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నాము. ఎమ్మెల్యేగా గెలిచి పేదల కోసమే పనిచేసేది. తెలంగాణ కోసం అందరం కష్టపడ్డాం. చెల్లె కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని అందులోకి వెళ్లి బంగారు తెలంగాణ కోసం పనిచేసింది. కష్టపడ్డదానికి ఫలితం దక్కింది. సీఎం కేసీఆర్ చెల్లెకు మంత్రి పదవి ఇచ్చి గౌరవాన్ని పెంచాడు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – గుగులోత్ కిషన్‌నాయక్, కనకమ్మ(సత్యవతి రాథోడ్ అన్న, వదిన) నా బిడ్డ గొప్పదైంది.. నాబిడ్డ గొప్పదైంది. చిన్నప్పటి నుంచి పార్టీల్లోనే తిరిగేది. చిన్నతనంలో పెళ్లి చేశాము. అయినా రాజకీయాల్లోనే తిరిగేది. సర్పంచ్‌గా గెలిచింది. ఇప్పుడు మంత్రి అయిందని తెలిసింది. సంతోషంగా ఉంది. ఎప్పుడూ ప్రజలతోనే మాట్లాడుతుంది. వారితోనే ఎక్కువగా ఉంటుంది. మాకు సంతోషమే. నాబిడ్డ గొప్ప పదవిలో ఉంది. ఆమెను చూసేందుకు హైదరాబాద్ వెళ్తున్నాం. – గుగులోత్ దస్మి, లింగ్యానాయక్(సత్యవతిరాథోడ్ తల్లిదండ్రులు) బాధ్యత పెరిగింది సీఎం కేసీఆర్ అప్పగించిన మంత్రిపదవితో నాపై బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర ప్రజల అవసరాలు.. వారి ఆకాంక్షలకు తగినట్టుగా పనిచేస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో మందుంటా. నాపై నమ్మకం ఉంచి మంత్రి పదవి అప్పగించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాను. నావెంట పయనించిన అనుచరులు, నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం అహర్నిశలు పనిచేస్తా. – సత్యవతి రాథోడ్ -
కేబినెట్ నుంచి సిద్ధూ నిష్క్రమణ
చండీగఢ్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. గత నెలలోనే ఆయన రాజీనామా చేసినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో జూన్‌లోనే రాజీనామా చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు పంపిన ఆ లేఖను సీఎంకు కూడా పంపుతానన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. దీంతో సిద్ధూ, సీఎం సింగ్‌ల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు పార్టీ అప్పగించింది. అయితే, సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో నెల రోజులపాటు వేచి చూసినా ఎలాంటి ఫలితం కనిపించకనే తాజాగా సిద్ధూ తన రాజీనామా లేఖను బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ నెల రోజులు కూడా సిద్ధూ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు. సీఎం, సిద్ధూ విభేదాలు ఏమిటి?: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం కనిపించకపోవటానికి స్థానిక పాలన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న సిద్ధూయే కారణమంటూ సీఎం అమరీందర్ బాహాటంగా ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో మత విశ్వాసాలకు భంగం కలిగించిన బాదల్ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సీఎంను సిద్దూ ప్రశ్నించారు. అదేవిధంగా, తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్దూ వ్యాఖ్యానించడం విభేదాలకు ఆజ్యం పోసింది. -
ఇదో కొత్త చరిత్ర
-
వైఎస్ జగన్ సామాజిక న్యాయాని చేసి చూపించారు
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారాయణ స్వామి
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీరంగనాథ్ రాజు
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్ని నాని
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తానేటి వనిత
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కోడాలి నాని
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శంకరనారాయణ
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అంజాద్ బాషా
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి
-
బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి శనివారం ఢిల్లీలోని హోంశాఖ కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమా నికి మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ హాజ రై కిషన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ అరవింద్, బీజేపీ నేతలు డీకే అరుణ, విష్ణు వర్ధన్‌రెడ్డి తదితరులు హాజరై కిషన్‌రెడ్డికి శుభా కాంక్షలు తెలిపారు. కిషన్‌రెడ్డి సతీమణి, కొడుకు, కుమార్తె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమిత్‌షాను కలిసి కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
అప్పట్లో ప్రచారం కోసమే వాడుకునేవాళ్లు
సాక్షి, బెంగళూరు: చిన్నవయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన చేసే అవకాశం దక్కించుకున్నారు. కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు. అయినా తొణకలేదు. చివరకు రాజకీయాల్లో ప్రవేశించిన ఆమెకు ఆత్మీయ స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ తరపున నేరుగా శాసన మండలిలోకి ఆమె అడుగుపెట్టారు. ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి దక్కించుకుని.. కన్నడ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా జయమాల(62) నిలిచారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రి జయమాల మాటల్లో... ‘సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయ ఆలోచనలు ఏనాడూ నాకు కలగలేదు. ఆ సమయంలో సినిమా వాళ్లను కేవలం ఎన్నికల ప్రచారం కోసమే వాడుకునేవాళ్లు. ఆ జాబితాలో నేనూ ఉన్నాను. రోజుల తరబడి పార్టీల కోసం తిరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ అంటే నాకు మొదటి నుంచి ఎందుకనో చాలా ఇష్టం. బహుశా ఇందిరా గాంధీ, సోనియా గాంధీ లాంటి శక్తివంతమైన మహిళలు ఆ పార్టీలో ఉన్నందుకే కాబోలు. ఆ తర్వాత పార్టీలో చేరిన నేను క్రియాశీలకంగా వ్యవహరించటం మొదలుపెట్టాను. పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ...మంది పదవి దక్కుతుందని అస్సలు ఊహించలేదు. ఆ విషయం మీడియా ద్వారానే తెలుసుకున్నా. నా భర్త, కూతురికి కూడా ఈ విషయం చెప్పేంత సమయం కూడా లేకుండా పోయింది. ప్రమాణం చేశాక నా కుటుంబ సభ్యులంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి, కర్ణాటక కాంగ్రెస్ కేడర్‌కు నా ధన్యవాదాలు. సీఎం కుమారస్వామిగారు నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తా’ అని ఆమె ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్గా... కాగా, 1980లలో తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో నటించిన జయమాల స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు. రాజ్‌కుమార్, అనంత నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్, శంకర్ నాగ్, ప్రభాకర్ లాంటి స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. తెలుగులో చిరంజీవితో కలిసి రాక్షసుడు చిత్రంలో కనిపించారు. అందులో తారకేశ్వరి పాత్రలో నటించింది ఆమెనే. తర్వాత నిర్మాతగా కూడా ఆమె పలు చిత్రాలను నిర్మించారు. వివాదాలు... కాగా, కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్‌పర్సన్‌గా పని చేసిన సమయంలో ఆమె వైఖరిపై పలు విమర్శలు వినిపించాయి. అంతేకాదు తాను యుక్తవయసు(20 ఏళ్ల ప్రాయంలో)లో ఉన్నప్పుడు శబరిమళ ఆలయాన్ని సందర్శించి.. అయ్యప్ప విగ్రహాన్ని తాకానని ఆమె చేసిన ప్రకటన అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం కేసు.. కోర్టు దాకా వెళ్లింది కూడా. -
మలేసియా మంత్రిగా తొలి భారతీయ సిక్కు
కౌలాలంపూర్: మలేసియా కేబినెట్లో భారతీయ సంతతికి చెందిన సిక్కు వ్యక్తికి చోటు లభించింది. మలేసియా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న తొలి ఇండో- మలేసియా సిక్కు వ్యక్తిగా గోవింద్‌సింగ్ దేవ్ రికార్డు సృష్టించారు. పక్కాటన్ హరప్పన్ సంకీర్ణ మంత్రివర్గంలో గోవింద్‌సింగ్ సమాచార, మల్టీమీడియా శాఖ మంత్రిగా నియమితులైయారు. గోవింద్‌సింగ్‌తో పాటు డెమోక్రాటిక్ యాక్షన్ పార్టీకి చెందిన మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎం.కిలసేగరన్ మానవ వనరులశాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. గోవింద్‌సింగ్ మలేసియాలోని పుచుంగ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రతినిథ్యం వహిస్తున్నారు. గోవింద్ తండ్రి కర్పాల్ సింగ్ మలేసియాలో ప్రముఖ న్యాయవాది, రాజకీయవేత్త. గోవింద్‌సింగ్ 2008లో మొదటిసారి మలేసియా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలను నమోదు చేశారు. గోవింద్‌సింగ్ దేవ్‌కు మంత్రి వర్గంలో చోటు లభించడంతో సిక్కు సామాజిక వర్గం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మలేసియా జనాభాలో లక్ష జనాభా సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. -
'నేను కేబినెట్ మంత్రి కూతురితో రాత్రంతా గడిపా'
లండన్: తాను బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో కూడా ఒక రాత్రి గడిపినట్లు ప్రముఖ హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ చెప్పాడు. ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో పీర్స్ మోర్గాన్ అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం చెప్పాడు. ఆ సమయంలో తన ఎదురుగా వందలమంది కూర్చుని ఉన్నారు. ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షీన్ తనకు హెచ్ఐవీ ఉందని గత ఏడాది బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మధ్య తరుచు ఇంటర్వ్యూలు ఇస్తూ వివాదాలు రాజేస్తున్న ఈ నటుడు ఈసారి ఏకంగా ఓ కేబినెట్ మంత్రి నెత్తిన బాంబు పేల్చాడు. మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిస్తూ 'ఉన్నారు.. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను' అని చెప్పాడు. దీంతో అక్కడ కూర్చున్న వాళ్లంతా షాక్ అయ్యారు. వెంటనే మోర్గాన్ ఆ మంత్రి ఎవరనే విషయం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు సందించాడు. ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా? ఏ శాఖలో ఉన్నారు? పోని ఇప్పుడు లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను అలా పేరు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోలేనని, ఇంటర్ పోల్ అధికారులు నా వెంటపడతారని చెప్పాడు. అయితే, పదే పదే ప్రశ్నించగా ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారంటూ తన సమాధానం ముగించాడు. -
నచ్చని వాళ్లను ఇబ్బందిపెట్టడం అలవాటే..
విశాఖ: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిస్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండిస్తోంటే, కాంగ్రెస్ మాత్రం మతం రంగు పులుముతోందని విమర్శనా బాణాలు ఎక్కుపెట్టారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులమత శక్తులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని వైఖరిని ప్రజలు గమనించాలని వెంకయ్య నాయుడు కోరారు. తనకి నచ్చని వాళ్లని ఇబ్బందులకు గురి చేయడం కాంగ్రెస్ కు అలవాటేనని వెంకయ్య ఆరోపించారు. ప్రజల తీర్పుతో అసహనానికి గురైన కాంగ్రెస్... నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావడాన్ని జీర్తించుకోలేకపోతోందన్నారు. అందుకే ఎన్డీయే సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన మండి పడ్డారు. దేశంలో అసహనం పెరుగుతోందంటూ అవార్డు వాపసీ పేరుతో అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై... నీతి ఆయోగ్ లో చర్చ జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెంకయ్య నాయుడు వివరించారు. -
కాంగ్రెస్ అప్పుడేం చేసింది: వెంకయ్య
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిహార్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడడం ఖాయమని.. మోదీ గెలుపును జీర్ణించుకోలేకే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. కశ్మీర్లో పండిట్లు, ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసినప్పుడు కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. రచయితలు, శాస్త్రవేత్తలు అవార్డులు వెనక్కి ఇస్తున్న వైనంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేకులే అవార్డులు వెనక్కి ఇస్తున్నారని.. వారు రాజకీయాల్లో చేరి బీజేపీపై నేరుగా పోరాటం చేస్తే మంచిదని వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారు. -
కమలంలో నయాజోష్
కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అభినందనల వెల్లువ మూడోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం భారీ ర్యాలీ... సభకు నేతల సన్నాహాలు సిటీబ్యూరో: నరేంద్రమోదీ కేబినెట్లో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు స్థానం దక్కడం గ్రేటర్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు తెచ్చింది. సికింద్రాబాద్ ఎంపీగా నాలుగుమార్లు గెలిచిన దత్తాత్రేయ 1998- 2004ల మధ్య అప్పటి ప్రధాని వాజ్జేయ్ కేబినెట్లో రెండు మార్లు పట్టణాభివృద్ధి, రైల్వేశాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముచ్చటగా మూడోసారి మోదీ కేబినెట్లో మంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. పలువురు పార్టీ నాయకులు దత్తాత్రేయ ప్రమాణస్వీకార ఉత్సవానికి వెళ్లి అభినందించారు. మిగిలిన వారంతా డివిజన్లలో సంబురాలు చేసుకుని అభిమానం చాటుకున్నారు. నగరానికి చెందిన ఎంఎల్ఏలు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, నాయకులు బి.జనార్ధన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి ఢిల్లీలో దత్తాత్రేయను ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర మంత్రి హోదాలో నగరానికి దత్తాత్రేయ తిరిగి వచ్చే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే భారీ ర్యాలీగా వచ్చి అభినందన సభను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కృషి: కేంద్రమంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర రాజధాని అభివృద్ధికి విశేష కృషి చేస్తానని బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం సాయంత్రం ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ... తొలుత సికింద్రాబాద్ లోక్‌సభ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కేంద్ర పథకాలన్నీ హైదరాబాద్‌లో అమలయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. -
'దేశంలోని గొప్ప గొప్ప వ్యక్తులను మర్చిపోతున్నాం'
-
'దేశంలోని గొప్ప గొప్ప వ్యక్తులను మర్చిపోతున్నాం'
హైదరాబాద్:దేశంలోని గొప్ప వ్యక్తులను మర్చిపోతున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో ఓ సదస్సులో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ప్రతీ ఒక్కరూ సాంస్కృతిక విద్యావిలువలు నేర్చుకోవాలని ఆమె సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం రూపొందిస్తామని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 21 వ తేదీన అన్నిస్కూళ్లలో మాతృభాషా దినోత్సవం జరుపుతామని ఆమె తెలిపారు. విద్యార్థులు నైతిక విలువలు నేర్చుకోవాలన్నారు. గురు-శిష్యుల బంధం ఎప్పటకీ విడదీయరానిదని ఆమె అన్నారు.భ్రూణహత్యలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
అభివృద్ధికి చేయూత
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హామీ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సహకారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పండే పంటలను దృష్టిలో ఉంచుకుని వాటికిసంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో వరి, మొక్కజొన్న ఎక్కువగా సాగవుతున్నందున వాటికి సంబంధించిన యూనిట్లకు ప్రాధాన్యమిస్తామన్నారు. దీనికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రితో త్వరలో మాట్లాడతానన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా నిర్మలాసీతారామన్ శనివారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పటికీ తెలంగాణలోని ఇతర పట్టణాలు వెనకబడి ఉన్నాయని, ఆయా జిల్లాల ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. దానివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అలాగే, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకునేలా యువతకు శిక్షణనందించి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఖాయిలాపడ్డ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశించారన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా తానే ఉన్నందున పారిశ్రామిక ప్రగతిపై రూపొందించిన ప్రణాళికల అమలు సులువవుతుందన్నారు. కొన్ని సంవత్సరాలుగా దేశంలో పారిశ్రామిక ఉత్పాదకత హీనదశకు చేరుకున్న నేపథ్యంలో దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. త్వరలో కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రకటిస్తామని, ఎఫ్‌డీఐల విషయంలో తాము ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన అంశాల మేరకే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను బట్టి కాకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం ప్రగతి సాధిస్తుందనే మౌలిక సూత్రం మేరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు రుణ మాఫీ గురించి ప్రస్తావించగా.. అది రాష్ట్రప్రభుత్వాలకు సంబంధించిన విషయమన్నారు. విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీనియర్ నేతలు శేషగిరిరావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ శ్రేణుల స్వాగతం శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో నిర్మాలా సీతారామన్‌కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు వెంటరాగా ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నేతలు ఆమెను ఘనంగా సన్మానించారు. -
మంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం
-
నా పనితీరును చూడండి.. చదువును కాదు..
-
టీడీపీకి ఒకటే మంత్రి పదవి
అశోక్‌గజపతి రాజుకు దక్కిన అవకాశం పార్లమెంటరీ పార్టీ భేటీలో స్పష్టత ఇచ్చిన బాబు న్యూఢిల్లీ: మోడీ సర్కార్ తొలివిడత మంత్రివర్గంలో టీడీపీకి ఒకే కేబినెట్ పదవి దక్కింది. ఆ పార్టీ సీనియర్ నేత, విజయనగరం ఎంపీ అశోక్‌గజపతి రాజుకు ఆ అవకాశం ఇస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదివారం రాత్రి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వెల్లడించారు. మరో మంత్రిపదవి దక్కితే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అది లభించేదన్నారు. ఆదివారం ఉదయం చంద్రబాబు మోడీతో గుజరాత్భవన్లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తొలివిడత మంత్రివర్గ కూర్పులో టీడీపీకి ఒకే కేబినెట్ పదవి ఇవ్వనున్నట్టు మోడీ బాబుకు చెప్పారు. వాస్తవానికి టీడీపీకి రెండు కేబినెట్ పదవులు, మూడు సహాయ మంత్రిపదవులు ఇవ్వాలని చంద్రబాబు బీజేపీ వర్గాలను కోరినప్పటికీ.. మోడీ కేబినెట్లో సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుందని, ఒక్కటితో సరిపెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. అందుకు సరేనన్న బాబు ఆదివారం మోడీని కలిసి.. సీమాంధ్ర అభివృద్ధికి తగిన చేయూతనిస్తే చాలని, కొత్త రాష్ట్రానికి ఉపయోగపడేలా తగిన మంత్రిత్వ శాఖను ఇవ్వాలని కోరారు. అశోక్‌గజపతి రాజుకు ఓడరేవులు, నౌకాయాన శాఖ దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నియోజకవర్గానికి ఒక జిల్లా: రైతు రుణమాఫీ కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా పనిచేయాలని ఈ సందర్భంగా ఎంపీలను చంద్రబాబు కోరారు. కొత్త రాజధాని నిర్మాణం, కాకినాడ-విశాఖ మెట్రో కారిడార్, ఉద్యోగ కల్పన కోసం ఎంపీలు కష్టపడి పనిచేయాలని కోరారు. టీడీపీ ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతివారం సమీక్ష ఉంటుందని, కనీసం 80 శాతం సంతృప్తికర పనివిధానం ఉండాలని సూచించారు. ఎంపీలు వారంలో రెండు రోజులు ఢిల్లీలో ఉంటూ నిధులు తెచ్చేందుకు కృషిచేయాలని కోరారు. అలాగే పోలవరం నిర్మాణం పూర్తిచేయడం, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటుచేయాలన్న చర్చ ఈ సమావేశంలో వచ్చింది. అలాగే రాయలసీమలో తాగు, సాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాని, సీమాంధ్రలో విద్యాసంస్థలు, ఐటీ, ఫార్మాసంస్థలను ఏర్పాటుచేసేందుకు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఎంపీలు కోరారు. సమావేశ వివరాలను ఎంపీలు ఎన్.శివప్రసాద్, అవంతీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడిస్తూ పార్లమెంటరీ పార్టీ నేతను ఇంకా ఎన్నుకోలేదన్నారు. -
క్యాబినెట్ ‘కారు’ ఎక్కేదెవరు?
మహమూద్ అలీ, నాయినికి చాన్స్! తనకూ అవకాశం ఇవ్వాలంటున్న పద్మారావు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా అవకాశం ఎవరికి దక్కనుంది? నగర నేతల్లో ఎంతమందికి చాన్స్ ఉంటుంది? ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్నలివి. ఇటు నేతలు, అటు కార్యకర్తల్లో ఈ అంశమే చర్చనీయాంశమైంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాజధాని నగరానికి ప్రాధాన్యమివ్వాల్సిందే. ఈ నేపథ్యంలో నగర నేతలకు ముఖ్య బాధ్యతలు దక్కే అవకాశమే కనిపిస్తోంది. అందుకే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో మొదటి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు నగర నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనమండలి సభ్యులు మహమూద్ అలీతో పాటు మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిలకు రాష్ట్ర క్యాబినెట్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేటాయిస్తే శానసమండలి సభ్యులు మహమూద్ అలీ పేరును పరిశీలనకు తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. అదేవిధంగా పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా, కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రపడ్డ నాయిని నర్సింహారెడ్డికి సైతం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అవకాశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాయిని నర్సింహారెడ్డి ప్రస్తుతం శాసనసభ - శాసనమండలిలో దేనిలో సభ్యులు కాకపోవటంతో ఆయన పదవిపై ఒకింత చర్చ జరుగుతోంది. ముందు క్యాబినెట్లోకి తీసుకుని తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశం కూడా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వారిలో పద్మారావు (సికింద్రాబాద్), కనకారెడ్డి (మల్కాజిగిరి) గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు)లు మాత్రమే విజయం సాధించారు. అయితే వీరిలో కనకారెడ్డి, మహిపాల్‌రెడ్డిలు తొలిసారిగా విజయం సాధించగా.. పద్మారావు రెండవ మారు శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ఈయనకు రెండు మార్లు కార్పొరేటర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పద్మారావుకు క్యాబినెట్ బెర్త్ ఖాయమనే భావనను పార్టీ ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నివాసం కిటకిట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న కేసీఆర్ నివాసం నా యకులు, కార్యకర్తలు, జనంతో కిటకిట లాడుతోంది. రోజంతా వేలాదిగా తరలివస్తున్న సందర్శకులతో బంజారాహిల్స్‌లోని నందీనగర్ ప్రాంతమంతా రద్దీగా మారిపోయింది. -
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు
నిరుపేద కుటుంబంలో పుట్టిన.. కేబినెట్ మంత్రిగా పనిచేశా.. 965 సినిమాల్లో ఆ మూడు ఎన్నటికీ మరువలేను హాస్యనటుడు బాబుమోహన్ దుగ్గొండిలో స్కూల్ వార్షికోత్సవానికి హాజరు దుగ్గొండి, న్యూస్‌లైన్: ‘చిన్న పల్లెలో నిరుపేద కుటుంబంలో పుట్టాను. పూరిపాక పాఠశాలలో చదివాను. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులను సం పాదించుకున్నా.. ఈ రోజు ఈ స్థాయిలో ఉం టానని ఎన్నడూ ఊహించలేదు’ అని ప్రముఖ హాస్యనటుడు బాబుమోహన్ అన్నారు. దుగ్గొండి మండల కేంద్రంలోని కృష్ణవేణి టా లెంట్ స్కూల్లో గురువారం రాత్రి జరిగిన చైత్ర-2014 వార్షికోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీ ణ ప్రాంతాలలో పుట్టిన ఎంతో మంది కలెక్టర్ లు, డాక్టర్లు అయ్యారని, తాను ఒక మారుమూల పల్లెలో నుంచి వచ్చి పట్టుదలతో ఎంఏ, ఎల్ఎల్బీ చదివి రెండు సార్లు ఎమ్మెల్యే గా, ఒకసారి కేబినెట్ మంత్రిగా పనిచేశానని చెప్పారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించ వచ్చని చెప్పారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చిన్నారులకు వినయ విధేయతలు నేర్పించాల న్నారు. తాను ఇప్పటికి 965 సినిమాలలో నటించానని, వాటిలో మూడు సినిమాలను ఏనాటికీ మరువలేనని ఆయన అన్నారు. అంకుశం.. యాక్టర్‌ను చేస్తే, మామగారు.. కమెడియన్ చేయగా, మాయలోడు.. హీరో చేసిందని బాబుమోహన్ చెప్పారు. సభలో ప్రసంగిస్తూనే ‘నీలిమబ్బు కురులలోన’ ‘ఇంత కూరుంటేయ్యమ్మా.. బువ్వుంటేయ్య మ్యా’ అంటూ పాట పాడుతూ స్టెప్పులు వేసి సభికులను ఆనందంలో ముంచెత్తారు. కొందరు ఆయనతో గొంతు కలిపి స్టెప్పులేశారు. అనంతరం బాబుమోహన్ సర్కిల్ సీఐ మధు, పాఠశాల డెరైక్టర్ పెంచాల శ్రీనివాస్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. అనంతరం వార్షికోత్సవ సభలో విద్యార్థులు ప్రదర్శించిన నృ త్యాలు, నాటికలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో కాకతీయ యునివర్శిటి ప్రిన్సిపాల్ రామస్వామి, ఎంవీ రంగారావు, భూపాల్‌రావు, ఎస్సై ముజాహిద్, సర్పంచ్ ఆరెల్లి చందన, పాఠశాల ఇం చార్జీ రాంబాబు, కళాశాల ఇంచార్జీ దానం వీరేందర్, పేరెంట్స్ కమిట బాధ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మీ గొట్టాలు నన్నేం చేయవ్!
మీడియాపై కావూరి కస్సుబుస్సు ముదినేపల్లి, న్యూస్‌లైన్: ‘‘మీ గొట్టాలు నాకేం చేయవ్..సమాజాన్ని మీడియా పక్కదారి పట్టిస్తోంది’’ అని కేంద్ర మంత్రి కావూరి సాంబశిరావు మీడియాపై చిందులు తొక్కారు. శనివారం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో పీసీసీ సంయుక్త కార్యదర్శి బొర్రా చలమయ్య గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఆయన మీడియా ప్రతినిధులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకముందు సమైక్యాంధ్ర సింహం లా గర్జించిన మీరు ఇప్పుడెందుకు మిన్నకుండి పోయారంటూ అడిగిన ప్రశ్నకు కావూరి ఆగ్రహోదగ్రులయ్యారు. ప్రజలకెలాంటి బాధలేనప్పటికీ కొంతమంది నేతల దుష్ర్పచారంతో పాటు ఇందుకు మీడియా వంత పాడుతూ ప్రజల మధ్య చీలికలు తెస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ వ్యతిరేక వార్తలకు ప్రాధన్యం ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రిగా తెలంగాణలోని సిరిసిల్లకు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు చేసిన కృషి సీమాంధ్ర లో ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించగా మిన్నకుండిపోయారు.