విద్యార్థి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌తో బండి సంజయ్‌కు అనుబంధం
2019లో తొలిసారి ఎంపీగా గెలుపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకట్టుకునేలా పనితీరు
తాజాగా కేంద్ర కేబినెట్‌లో అవకాశం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర మంత్రి అవకాశం వచ్చిన బండి సంజయ్ కూడా ఒక సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగినవారే. విద్యార్ధి దశ నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. తర్వాత ఏబీవీపీలో పలు పదవుల్లో కొనసాగారు. కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్‌చార్జిగా పనిచేశారు. కరీంనగర్‌లో 2005 నుంచి వరుసగా మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఓటమితో రెండోస్థానంలో నిలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా సంచలన విజయం సాధించారు.
⇒ 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజ య్ నియమితులయ్యారు. ఈ సమయంలో పా ర్టీని పరుగులు పెట్టించారు. దుబ్బాక ఉప ఎన్ని క, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీని విజయపథాన నడిపించారు.
⇒ ప్రజా సమస్యలపై పలుమార్లు సంజయ్ ఆందోళనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇంటర్ ఫలితాల వివాదం, 317 జీవో, టెన్త్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ఆందోళనలు చేశారు.
⇒ పలు పరిణామాల నేపథ్యంలో 2023లో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నా రు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తర్వా త జాతీ య కిసాన్‌మోర్చా ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.
⇒ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చవిచూశారు.
⇒ తాజా లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. కేంద్ర మంత్రి పదవికి ఎంపికయ్యారు. దీంతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
పేరు : బండి సంజయ్‌కుమార్
పుట్టిన తేదీ : 11–07–1971
తల్లిదండ్రులు : కీ.శే.నర్సయ్య–శకుంతల
భార్య : బండి అపర్ణ (బ్యాంకు ఉద్యోగి)
పిల్లలు : సాయి భగీరథ్, సాయి సుముఖ్
కులం : మున్నూరు కాపు (బీసీ–డి)
పార్టీలో హోదా : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తా..
ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మ కముంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని మోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాకు లభించిన పదవి కార్యకర్తల కృషి ఫలితమే. నాపై నమ్మకం ఉంచి కరీంనగర్ ప్రజలు రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే కేంద్రమంత్రిగా అవకాశం లభించింది. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ లోక్‌సభ స్థానం అభివృద్ధి కోసం వినియో గిస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయ సహ కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా. – బండి సంజయ్, కేంద్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment