ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిహార్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాడడం ఖాయమని.. మోదీ గెలుపును జీర్ణించుకోలేకే కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.
కశ్మీర్లో పండిట్లు, ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసినప్పుడు కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు. రచయితలు, శాస్త్రవేత్తలు అవార్డులు వెనక్కి ఇస్తున్న వైనంపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేకులే అవార్డులు వెనక్కి ఇస్తున్నారని.. వారు రాజకీయాల్లో చేరి బీజేపీపై నేరుగా పోరాటం చేస్తే మంచిదని వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారు.