సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్‌రెడ్డి.. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారు. విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేశారు. తర్వాత భారతీయ జన సంఘ్‌లో, జనతా పారీ్టలో చేరారు. 1977లో యువమోర్చా నాయకుడిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఏర్పాటయ్యాక అందులో చేరారు. భారతీయ యు వమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా కన్వి నర్‌గా నియమితులయ్యారు.
అంచెలంచెలుగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ సమయంలో ఉగ్రవాద నిర్మూలన కోసం రాజకీయేతర సంస్థ ‘వరల్డ్ యూత్ కౌన్సిల్ అగైనెస్ట్ టెర్రరిజం’ను స్థాపించారు. తర్వాత రాష్ట్ర బీజేపీలో కార్యదర్శిగా, కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, నాలుగు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా (రెండుసార్లు ఉమ్మడి ఏపీలో, రెండుసార్లు తెలంగాణలో) పనిచేశారు.
2004లో హిమాయత్‌నగర్ సెగ్మెంట్ నుంచి, 2009, 2014లలో అంబర్‌పేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చాన్స్ దక్కించుకున్నారు. రెండేళ్ల తర్వాత కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహించారు. సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగడం, జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలసివచ్చింది.
పేరు : గంగాపురం కిషన్‌రెడ్డి
పుట్టినతేదీ : 15–06–1960
తల్లిదండ్రులు : స్వామిరెడ్డి, ఆండాళమ్మ (రైతు కుటుంబం)
భార్య : కావ్యారెడ్డి
పిల్లలు : వైష్ణవి, తన్మయ్
కులం : రెడ్డి
పార్టీలో హోదా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఆ ఘనత బీజేపీదే
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ కార్యకర్తలకు కేంద్ర మంతివర్గంలో చోటు కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి సంస్కృతి ఒక్క బీజేపీలో మినహా దేశంలోని ఏ పార్టీలోనూ లేదన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, సహాయమంత్రి పదవులు ఇచ్చిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘రెండోసారి కేంద్ర మంతి పదవి దక్కడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రధాని నాకు ఇచి్చన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment