దేశంలోని గొప్ప వ్యక్తులను మర్చిపోతున్నామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో ఓ సదస్సులో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. ప్రతీ ఒక్కరూ సాంస్కృతిక విద్యావిలువలు నేర్చుకోవాలని ఆమె సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన జాతీయ విద్యా విధానం రూపొందిస్తామని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 21 వ తేదీన అన్నిస్కూళ్లలో మాతృభాషా దినోత్సవం జరుపుతామని ఆమె తెలిపారు. విద్యార్థులు నైతిక విలువలు నేర్చుకోవాలన్నారు. గురు-శిష్యుల బంధం ఎప్పటకీ విడదీయరానిదని ఆమె అన్నారు.భ్రూణహత్యలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.