Domestic cricket
-
అర్థంపర్థంలేని చెత్త మాటలు: సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ వైరల్
తాను జట్టు మారబోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. జర్నలిస్టులు ఈ మధ్య స్క్రిప్టు రైటర్లుగా మారిపోయారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం కంటే చెత్త విషయం మరొకటి ఉండదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నుంచి సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి నయా తారల వరకు.. ముంబై క్రికెట్ టీమిండియాకు ఎంతో మంది ఆటగాళ్లను అందించింది. అంతేకాదు అత్యధికంగా 42 సార్లు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన ఘనత కూడా ముంబైదే.అయితే, టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టును వీడి.. గోవా జట్టులో చేరబోతున్నాడని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అదే విధంగా.. సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబైని వీడి గోవా క్రికెట్‌తో జట్టు కట్టబోతున్నాడని.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ కూడా సూర్య బాటలో నడవనున్నాడనే ప్రచారం జరిగింది.అంతేకాదు.. జైస్వాల్, తిలక్ గోవా జట్టులో చేరేలా సూర్యనే వారిని ప్రోత్సహించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఘాటుగా స్పందించాడు. సదరు కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ .. ‘‘ఇతను స్క్రిప్టు రైటరా? లేదంటే జర్నలిస్టా?ఇకపై నేను నవ్వుకోవాలంటే కామెడీ సినిమాలు చూడటం మానేసి.. ఇలాంటి ఆర్టికల్స్ చదవడం మొదలుపెట్టాలేమో!.. అర్థంపర్థంలేని చెత్త మాటలు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా సూర్య పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. సూర్య, తిలక్లను మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వరుసగా రూ. 16.35 కోట్లు, రూ. 8 కోట్లకు అట్టిపెట్టుకోగా.. రాజస్తాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్‌ను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఇక హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సూర్య ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఇప్పటి వరకు ముంబై మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం ఒకే ఒక్కటి గెలిచింది.ఇక సూర్య ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లలో కలిపి 104 పరుగులు చేయగా.. తిలక్ వర్మ 70 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 34 పరుగులే చేసి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా టీ20 విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య కొనసాగుతుండగా.. తిలక్ టీ20లలో, జైస్వాల్ టెస్టుల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.Script writer hai ya journalist? Agar hasna hai toh I will stop watching comedy movies and start reading these articles. Ekdum bakwas 🤣🤣🤣 pic.twitter.com/VG3YwQ5eYb— Surya Kumar Yadav (@surya_14kumar) April 2, 2025 -
దేశవాళీలో ఆడితే మంచిదే కానీ...
దుబాయ్: భారత క్రికెటర్లకు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి చేయడం సరైన నిర్ణయమేనని మాజీ ఆటగాడు శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆడే ప్లేయర్లకు తగినంత విశ్రాంతి కూడా అవసరమనే అంశాన్ని విస్మరించరాదని కూడా అతను గుర్తు చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ సమతూకం పాటించాలని శిఖర్ చెప్పాడు. ‘ఇది చాలా చక్కటి నిర్ణయం. నా దృష్టిలో ప్రస్తుత క్రికెటర్లంతా దేశవాళీ మ్యాచ్‌లలో ఆడాలి. అప్పుడే ఆ మ్యాచ్‌లకు ఆకర్షణ వస్తుంది. కోహ్లి ఢిల్లీ తరఫున ఆడితే స్టేడియం ఎలా నిండిపోయిందో మనం చూశాం. అయితే కీలక ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి కూడా అవసరం. వారిపై అధిక భారం వేయరాదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ సంబంధిత వ్యక్తులు పర్యవేక్షించాలి’ అని ధావన్ వ్యాఖ్యానించాడు. 2013 చాంపియన్స్ ట్రోఫీలో 363 పరుగులతో శిఖర్ ధావన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోరీ్న’గా నిలిచాడు. తాజా టోర్నీ కోసం ఐసీసీ ఎంపిక చేసిన నలుగురు ఈవెంట్ బ్రాండ్ అంబాసిడర్లలలో అతను కూడా ఒకడు. గత ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన ధావన్... ఆటకు దూరమైనందుకు తాను ఏమాత్రం చింతించడం లేదని వెల్లడించాడు. ‘నేను చాలా బాగా ఉత్సాహంగా ఉన్నాను. ఎలాంటి చింతా లేదు. ప్రస్తుతం జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా ఆట గురించి నాకు బాగా తెలుసు. దేవుడు చాలా సుదీర్ఘ కెరీర్ ఇచ్చినందుకు కృతజ్ఞుడను’ అని స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లు ఏకపక్షంగా మారిపోవడంపై కూడా అతను స్పందించాడు. ‘మ్యాచ్‌పై అంచనాలు, ఆసక్తి, మైదానంలో తీవ్రత అలాగే ఉన్నాయి. గతంలో వారు వరుసగా గెలిచేవారు. ఇప్పుడు మనం గెలుస్తున్నాం. అంతే తేడా ఉంది’ అని శిఖర్ విశ్లేíÙంచాడు. ప్రస్తుతం జట్టు వైస్ కెపె్టన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ ఆ హోదాకు అర్హుడని... మున్ముందు అతను కచ్చితంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని ధావన్ అభిప్రాయపడ్డాడు. -
ఇదేమీ స్కూల్ కాదు.. సూపర్స్టార్లు అయినా తప్పదు: చీఫ్ సెలక్టర్
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రవేశపెట్టిన ‘పటిష్ట జట్టుకు పది సూత్రాల’ అంశంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు ప్రయోజనాల కోసమే నిబంధనలు కఠినతరం చేశామే తప్ప.. ఇవేమీ స్కూలు పిల్లలకు ఇచ్చే పనిష్మెంట్లు కావని పేర్కొన్నాడు. జట్టులోని ప్రతి సభ్యుడు పరిణతి గలిగిన వ్యక్తులేనని.. సూపర్ స్టార్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారన్నాడు.అయితే, జాతీయ జట్టుకు ఆడుతున్నపుడు ప్రతి ఒక్కరు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అగార్కర్ స్పష్టం చేశాడు. ప్రతి టీమ్‌లోనూ రూల్స్ ఉంటాయని.. జట్టు అభివృద్ధి, ప్రయోజనాలు మాత్రమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు రోజురోజుకు మరింత మెరుగుపడటానికి మాత్రమే నిబంధనలు విధించినట్లు తెలిపాడు.బీసీసీఐ ప్రవేశపెట్టిన పది సూత్రాల పాలసీదేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సిందే ‘స్టార్ హోదాతో దేశవాళీ క్రికెట్‌ను అటకెక్కించిన ఆటగాళ్లు ఇకపై బరిలోకి దిగాల్సిందే. టీమిండియాకు ఎంపిక కావాలంటే రంజీ మ్యాచ్‌లు, ఇతర దేశవాళీ టోర్నీలలో ఆటగాళ్లంతా వారి వారి రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండాలి. సహేతుక కారణం ఉంటే తప్ప... తప్పుకోవడానికి యువ ఆటగాళ్లకే కాదు సీనియర్లకు ఇకపై వీలుండదు’బ్రాండ్–ఎండార్స్మెంట్లు కుదరవు టోర్నీలు, సిరీస్‌లు జరుగుతుంటే ఇకపై ‘బ్రాండింగ్’ షూటింగ్‌ల్లో పాల్గొనడం కుదరదు. ఆటగాళ్లు కుదుర్చుకున్న ఎండార్స్మెంట్ ఒప్పందాల కోసం సిరీస్ మధ్యలో ఫొటో షూట్స్ నిషిద్ధం.కుటుంబసభ్యుల అనుమతికి ఓ పరిమితి విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు ఆ ద్వైపాక్షిక సిరీస్ 45 రోజులకు మించి సుదీర్ఘంగా సాగితే క్రికెటర్ల కుటుంబసభ్యులు కూడా అసాంతం ఉంటామంటే ఉండనివ్వరు. 45 రోజులు ఆ పైన పర్యటనల కోసం ఇకపై రెండు వారాలపాటే కుటుంబసభ్యుల్ని అనుమతిస్తారు. స్వల్పకాల పర్యటనలకు మాత్రం వారం పరిమితే ఉంటుందిక! జట్టుతో పాటే పయనం ఇప్పటి వరకు ఆటగాళ్లు విడతల వారీగా, పర్యటన షెడ్యూల్‌కు ఉన్న సమయానికి అనుకూలంగా ఆటగాళ్లు ఆయా దేశాలకు వేర్వేరుగా పయనమయ్యేవారు. కానీ ఇక మీదట ఓ జట్టుగా సహచరులతో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తద్వారా జట్టులో అను‘బంధం’ బలపడేందుకు దోహదం చేస్తుంది. అనివార్య కారణాలు లేదంటే తప్పనిసరై ఫ్యామిలీతో ప్రయాణించాలంటే మాత్రం బోర్డు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి! వ్యక్తిగత సిబ్బందికి కట్టుబాట్లు జట్టులో ఎంత సీనియరైనా, దిగ్గజమైనా తమ వెంట వ్యక్తిగత సిబ్బందిని తీసుకెళ్తామంటే అనుమతించరు. సదరు సిబ్బంది అవసరమనుకుంటే ఆ ఆటగాడు కచి్చతంగా బోర్డు ఆమోదం పొందాల్సి ఉంటుంది.‘అదనపు’ లగేజీ భారం ప్లేయర్లపైనే... విమాన ప్రయాణానికి సంబంధించి ఇప్పటి వరకు ఆటగాళ్ల లగేజీపై ఎలాంటి ఆంక్షలు, పరిమితుల్లేవు. ఎన్ని కేజీలు తీసుకెళ్లినా ఆ భారాన్ని బోర్డే భరించేది. కానీ ఇకపై ఒక ఆటగాడు 150 కేజీలకు మించి లగేజీ తీసుకెళితే ఆ భారం ఆటగాళ్లే మోయాలి.కలసికట్టుగా ప్రాక్టీస్ సన్నాహాలకు ఆటగాళ్లంతా సమయానికి అందుబాటులో ఉండాలి. నెట్స్‌లో శ్రమించేందుకు వెళ్లే సమయంలో తమకు వీలుచిక్కిన సమయంలో స్టేడియానికి చేరకుండా... అంతా కలిసి ఒకే బస్సులో ప్రాక్టీసుకు బయలు దేరాలి.బోర్డు కార్యక్రమాలకు హాజరు బీసీసీఐ నిర్వహించే సమావేశాలు, ఈవెంట్లు, కార్యక్రమాలకు భారత ఆటగాళ్లంతా అందుబాటులో ఉండాలి. ఇది క్రికెట్ వృద్ధికి మరింత దోహదం చేస్తుందని బోర్డు భావిస్తోంది.మ్యాచ్‌లు ముగిశాక... ఏదైనా పర్యటన, సిరీస్, టోర్నీల్లో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇష్టారీతిన ఎవరికివారు హోటల్ గదులకు వెళతామంటే కుదరదు. అందరు కలిసి జట్టుగా వెళ్లాలి. జట్టుతో పాటే పయనించాలి. గదుల్లోనూ కలిసిమెలిసే బస స్టార్ ఆటగాళ్లకు విడిగా ప్రత్యేక గదులిస్తున్నారు. ఇకపై రెండు వారాలు, ఒక వారం కుటుంబసభ్యుల పరిమితికి లోబడి మాత్రమే ప్రత్యేక గదుల్ని కేటాయిస్తారు. మిగతా సమయంలో సహచర ఆటగాళ్లతో గదుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. చదవండి: అందుకే సిరాజ్‌ను ఎంపిక చేయలేదు: రోహిత్ శర్మ -
వన్డేలో 407 చే‘దంచేశారు’
వడోదర: భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో రికార్డు లక్ష్యఛేదన నమోదైంది. పురుషుల అండర్–23 వన్డే టోర్నమెంట్లో సూపర్ ‘డబుల్’ ఫామ్‌లో ఉత్తరప్రదేశ్ (యూపీ) బ్యాటర్ సమీర్ రిజ్వీ (105 బంతుల్లో 202 నాటౌట్; 10 ఫోర్లు, 18 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుస మ్యాచ్‌ల్లో రెండో అ‘ద్వితీయ’ సెంచరీ సాధించడంతో యూపీ 407 పరుగుల లక్ష్యాన్ని 41.2 ఓవర్లలోనే ఛేదించి దేశవాళీ క్రికెట్ పుటలకెక్కింది.జీఎస్ఎఫ్సీ మైదానంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట సొంతగడ్డపై విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 406 పరుగుల భారీస్కోరు చేసింది. టాపార్డర్ బ్యాటర్ దనిశ్ మాలేవర్ (123 బంతుల్లో 142; 16 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిడిలార్డర్లో కెపె్టన్ ఫయాజ్ (62 బంతుల్లో 100; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) ‘శత’క్కొట్టారు. మూడో వికెట్‌కు వీరిద్దరు 197 పరుగులు జోడించారు. తర్వాత జగ్జోత్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా అర్ధసెంచరీ సాధించడంతో విదర్భ 400 పైచిలుకు భారీ స్కోరు చేసింది. అయితే ఈ సంతోషం ప్రత్యర్థి లక్ష్యఛేదనకు దిగడంతోనే ఆవిరైంది. ఓపెనర్లు శౌర్య సింగ్ (42 బంతుల్లో 62; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), స్వస్తిక్ (28 బంతుల్లో 41; 1 ఫోర్, 4 సిక్స్‌లు) 10.4 ఓవర్లలోనే 106 పరుగులు చకచకా జతచేశారు. ఈ మెరుపు శుభారంభం రికార్డు ఛేజింగ్‌కు బాటవేసింది. వన్‌డౌన్ బ్యాటర్ షోయబ్ సిద్దిఖీ (73 బంతుల్లో 96 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రిజ్వీ అబేధ్యమైన మూడో వికెట్‌కు కేవలం 173 బంతుల్లోనే 296 పరుగులు ధనాధన్‌గా జతచేయడంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 41.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీలో సమీర్ గత మ్యాచ్‌లో త్రిపురపై కూడా (93 బంతుల్లో 201 నాటౌట్) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ రెండు సందర్భాల్లోనూ అతను అవుట్ కాకుండా అజేయంగా నిలవడం విశేషం. -
హైదరాబాద్, రాజస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
జైపూర్: దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో రాజస్తాన్‌తో మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ ఒక విజయం, 2 ఓటములు, ఒక ‘డ్రా’తో 8 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానానికి చేరింది. ఓవర్‌నైట్ స్కోరు 36/0తో శనివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.హిమతేజ (176 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా... తన్మయ్ అగర్వాల్ (126 బంతుల్లో 79; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధ శతకంతో మెరిశాడు. అభిరత్ రెడ్డి (46; 7 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయం కంటే ముందే ‘డ్రాకు అంగీకరించారు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయగా... రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 425 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన రాజస్తాన్ మూడు పాయింట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ బాదిన రాజస్తాన్ బ్యాటర్ శుభమ్ గర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు లభించింది.స్కోరు వివరాలు:హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 410; రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ 425; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (ఎల్బీ) (బి) అజయ్ సింగ్ 79; అభిరత్ రెడ్డి (సి) కునాల్ సింగ్ రాథోడ్ 46; రోహిత్ రాయుడు (సి) కునాల్ సింగ్ రాథోడ్ (బి) అనికేత్ చౌధరి 0; హిమతేజ (నాటౌట్) 101; రాహుల్ సింగ్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 0, మొత్తం (65 ఓవర్లలో 3 వికెట్లకు) 273. వికెట్ల పతనం: 1–56, 2–57, 3–196, బౌలింగ్: దీపక్ చహర్ 2–0–11–0, అజయ్ సింగ్ 22–0–84–1, దీపక్ హుడా 6–2–17–0, మహిపాల్ లొమ్రోర్ 18–0–86–0, అరాఫత్ ఖాన్ 5–1–18–1, అనికేత్ చౌధరి 6–0–18–1, అభిజీత్ తోమర్ 6–0–39–0 -
BCCI: దేశవాళీ క్రికెట్లో ప్రోత్సాహకాలు
ముంబై: దేశవాళీ క్రికెట్లో ఆటగాళ్ల ప్రదర్శనకు మరింత ప్రోత్సాహం అందించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ కూడా ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ రెండు టోరీ్నలలో నాకౌట్ మ్యాచ్‌లలో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించేవారు. వీరికి కూడా మొమెంటో ఇస్తుండగా ప్రైజ్‌మనీ మాత్రం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లలోనైతే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను ప్రకటించే సంప్రదాయం లేదు. ఇకపై దీనిలో మార్పు రానుంది. మరోవైపు మహిళల క్రికెట్‌కు సంబంధించిన అన్ని టోరీ్నల్లోనూ, జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లకు కూడా తాజా ‘ప్రైజ్‌మనీ’ నిర్ణయం వర్తిస్తుందని షా వెల్లడించారు. మంచి ప్రదర్శనకు తగిన గుర్తింపు ఇచ్చే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని... బోర్డు అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన.. ఇకపై
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్తగా మూడు టోర్నమెంట్లు ప్రవేశపెట్టింది. దేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో మాత్రమే ఈ మూడు టోర్నమెంట్లు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది.కాగా పాకిస్తాన్లో ఇప్పటికే నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు ఉన్నాయి. వీటికి అదనంగా పై మూడు టోర్నమెంట్లను పీసీబీ ప్రవేశపెట్టింది.ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ‘‘దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు మధ్య చాంపియన్స్ టోర్నమెంట్లు వారధిగా నిలవడమే కాకుండా.. క్రికెటింగ్ ఎకోసిస్టమ్‌ను పునరుత్తేజితం చేసే విధంగా ఉంటాయి. ప్రతిభ ఆటగాళ్లను గుర్తించి.. వారి నైపుణ్యాలకు పదునుపెట్టి.. గ్లోబల్ వేదికపై రాణించేలా వారిని తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’’ అని తెలిపాడు. చాంపియన్స్ టోర్నీల్లో డాల్ఫిన్స్, లయన్స్, పాంథర్స్, స్టాలియాన్స్, వోల్వ్స్ పేర్లతో ఐదు జట్లు ఉంటాయని పేర్కొన్నాడు.గత మూడేళ్లుగా ఆకట్టుకుంటున్న 150 మంది టాప్ డొమెస్టిక్ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొంటారని మొహ్సిన్ నఖ్వీ వెల్లడించాడు. ప్రతి జట్టుకు పాకిస్తానీ మాజీ సూపర్‌స్టార్ మెంటార్‌గా ఉంటాడని వెల్లడించాడు. విశేష అనుభవం ఉన్న వారిని మాత్రమే కోచ్‌లుగా నియమించుకుంటామని స్పష్టం చేశాడు.కాగా గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేదు అనుభవాలు ఎదుర్కొంటోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురవడంతో పాటు.. వన్డే వరల్డ్‌ప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక పీసీబీ చైర్మన్ నియామకం, హెడ్‌కోచ్‌ల విషయంలోనూ హైడ్రామా జరిగింది. అదే విధంగా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, క్రమశిక్షణా రాహిత్యం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం ఇటీవల.. కఠిన నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావాళ్లెవరైనా ఏదేని కారణం చేత జాతీయ జట్టుకు దూరమైతే.. దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియాలో ఆడే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ధిక్కరించిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై వేటు వేస్తూ.. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకుని శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక పీసీబీ సైతం తాజా చర్యతో బీసీసీఐ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్‌ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్‌లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్‌లో వరుసగా 10 మ్యాచ్‌లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్‌బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్‌లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్‌లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్‌పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్‌ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
50 ఓవర్ల ఫార్మాట్లో భారీ స్కోర్.. ఇంగ్లండ్ 498 పరుగులు చేస్తే..!
50 ఓవర్ల క్రికెట్ ఫార్మట్‌లో (లిస్ట్-ఏ క్రికెట్) భారీ స్కోర్ నమోదైంది. ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్-2023లో భాగంగా ససెక్స్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో డర్హమ్ జట్టు 427 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ అలెక్స్ లీస్ (107 బంతుల్లో 144; 19 ఫోర్లు) భారీ శతకంతో విరుచుకుపడగా.. వన్‌డౌన్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్హమ్ (54 బంతుల్లో 102; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విజృంభించాడు. వీరితో పాటు ఓపెనర్ గ్రహం క్లార్క్ (58 బంతుల్లో 72; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. ఫలితంగా డర్హమ్ లిస్ట్-ఏ క్రికెట్ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు కలుపుకుని) 21వ అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యుత్తమ టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు జట్టు పేరిట ఉంది. గతేడాది (2022) విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో ఎన్ జగదీశన్ (277) భారీ డబుల్ సెంచరీతో విరుచుకుపడగా.. సాయి సుదర్శన్ (154) శతకంతో మెరిశాడు. Records galore in Hove as centuries from Bedingham & Lees help Durham to commanding one-day cup win.#ForTheNorth — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. గతేడాది జూన్ 17న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 498 పరుగుల భారీ స్కోర్ సాధించింది. నాడు ఇంగ్లీష్ జట్టులో ఏకంగా ముగ్గురు శతక్కొట్టారు. ఫిల్ సాల్ట్ (122), డేవిడ్ మలాన్ (125), జోస్ బట్లర్ (162 నాటౌట్) మెరుపు శతకాలతో చెలరేగిపోయారు. Shot Jonesy to bring up our highest List A score 🤩#ForTheNorth pic.twitter.com/HDR5fVmBkZ — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 ఇక ససెక్స్-డర్హమ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ససెక్స్ 39.1 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ టామ్ హెయిన్స్ (65), ప్రెంటిస్ (65) అర్ధసెంచరీలతో రాణించారు. DAVID BEDINGHAM HAS OUR FASTEST LIST A 100 IN JUST 52 BALLS!!#ForTheNorth pic.twitter.com/5j9tZDIVug — Durham Cricket (@DurhamCricket) August 4, 2023 -
క్రికెట్లో కొత్త రూల్.. ఇకపై ఓవర్‌కు..!
దేశవాళీ క్రికెట్లో బీసీసీఐ కొత్త రూల్‌ను అమల్లోకి తేనుంది. త్వరలో ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఓవర్‌కు రెండు బౌన్సర్లకు అనుమతిచ్చింది. ఇప్పటివరకు టీ20ల్లో ఓవర్‌కు ఒకే బౌన్సర్ నిబంధన అమల్లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య పోటీని బ్యాలెన్స్ చేసేందుకు ఈ రూల్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ రూల్‌తో పాటు మరో నిబంధనను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమల్లోకి తెస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సక్సెస్ కావడంతో ఆ రూల్‌ను కూడా ముస్తాక్ అలీ టోర్నీలో అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ముస్తాక్ అలీ టోర్నీలో రెండు బౌన్సర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ సక్సెస్ అయితే మిగిలిన దేశవాళీ టోర్నీల్లోనూ ఈ రెండు రూల్స్‌ను అమల్లోకి తెస్తారని సమాచారం. టీ20 ఫార్మాట్లో రెండు బౌన్సర్ల నిబంధన అమల్లోకి తెస్తే బౌలర్ల ప్రభావం పెరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారులు వివరించారు. ఇదిలా ఉంటే, 2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 6 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్‌లు తలపడనున్నాయి. -
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు. -
'డొమెస్టిక్ లీగ్స్ వల్ల ప్రమాదంలో ఐసీసీ గ్లోబల్ క్రికెట్'
ప్రస్తుతం క్రికెట్లో అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే లీగ్‌ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్‌లు ఎక్కువైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్‌ల వల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాలని క్రికెట్లో చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. ఇప్పటికే ఐపీఎల్, బీబీఎల్, పీఎస్ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమొస్టిక్స్ లీగ్ ఉండగా.. కొత్తగా సౌతాఫ్రికా టి20(SAT20), ఇంటర్నేషనల్ లీగ్ టి20(ILT20) పుట్టుకొచ్చాయని.. వీటివల్ల క్రికెట్లో సంప్రదాయ ఫార్మాట్ టెస్టు క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రమాదం ఉందని వెల్లడించింది. అంతేకాదు ఈ లీగ్‌ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. ఈ లీగ్‌ల్లో అగ్రభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకే చెందినవే ఉన్నాయని.. ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీలో భాగమైన అసోసియేట్ దేశాలు సహా అఫ్గానిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది. దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)తో ఎంసీసీ శుక్రవారం భేటీ అయింది. చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్‌లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది. 2023 నుంచి 2027 వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ పేరుతో షెడ్యూల్‌ను రూపొందించింది. అంతర్జాతీయ క్రికెట్‌తోనే బిజీగా గడిపే క్రికెటర్లు.. ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలయ్యి కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది. అందుకు ఉదాహరణ జస్ప్రీత్ బుమ్రా, షాహిన్ అఫ్రిది లాంటి క్రికెటర్లు. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్‌కు, డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మధ్య ఓవర్లాప్ ఏర్పడి సమస్య మొదలవుతుందని వివరించింది. ఈ ఏడాదిలో ఒక్క అక్టోబర్-నవంబర్ నెలలు మాత్రమే గ్యాప్ ఏర్పడిందని.. ఆ గ్యాప్‌కు కారణం కూడా ఐసీసీ వన్డే ప్రపంచకప్ నిర్వహించనుండడమే. ఈ సమయంలో అన్ని దేశాలు తమ అత్యున్నత జట్లతో బరిలోకి దిగుతాయి కాబట్టి ఎలాంటి డొమెస్టిక్ లీగ్స్‌కు ఆస్కారం ఉండదని తెలిపింది. పురుషుల క్రికెట్లో మాత్రమే ఇలా ఉందని.. మహిళల క్రికెట్లో ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్ సక్రమంగానే అమలవుతుందని ఎంసీసీ అభిప్రాయపడింది. 2025 వరకు ఐసీసీ ఇప్పటికే వుమెన్స్‌కు సంబంధించిన ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. అయితే ఇప్పుడిప్పుడే మహిళల క్రికెట్లో విరివిగా డొమెస్టిక్ లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా డొమెస్టిక్ లీగ్‌లతో ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)ని అభ్యర్జించింది. ఎంసీసీ వ్యాఖ్యలపై వరల్డ్ క్రికెట్ కమిటీ సానుకూలంగా స్పందించింది. డబ్ల్యూసీసీ సభ్యుడు, టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ''ఐసీసీ గ్లోబల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్ల మధ్య బ్యాలెన్సింగ్ అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికి టెస్టు క్రికెట్ అనేది బిగ్గెస్ట్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉంది. ఆ ఫార్మాట్లోనే మనకు ఆణిముత్యాలాంటి క్రికెటర్లు దొరుకుతుంటారు. ఎన్నో గొప్ప మ్యాచ్‌లు చూస్తుంటాం. అందుకే దానిని టెస్టు క్రికెట్ అంటారు. ఎంసీసీ చేసిన వ్యాఖ్యలను అంగీకరిస్తున్నా. డొమెస్టిక్ లీగ్ నిర్వహిస్తున్న ఆయా దేశాలు అటు ఐసీసీ గ్లోబల్ క్రికెట్‌కు, ఇటు డొమొస్టిక్ లీగ్‌లకు సమాన ప్రాధాన్యత ఇస్తాయని అనుకుంటున్నా.'' అని తెలిపాడు. మరో సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ''డొమెస్టిక్ క్రికెట్‌కు, ఐసీసీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుంది. ఐసీసీలో దేశం తరపున ఆడితే.. డొమెస్టిక్‌లో వివిధ దేశాల ఆటగాళ్లు ఒకే పంచన ఉంటారు. అయితే నా పరిదిలో అంతర్జాతీయ క్రికెట్లోనే ఒక ఆటగాడు ఎక్కువగా రాణించడం చూస్తాం. ఉదాహరణకు క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలు ఘనత.. మురళీధరన్ 800 టెస్టు వికెట్ల ఘనతలను అంతర్జాతీయ క్రికెట్లోనే చూశాం. కాబట్టి అంతర్జాతీయ క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. సమన్వయంతో కూడిన క్రికెట్‌ను ఆడడం మంచింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. The MCC World Cricket committee unanimously concluded that the game has reached an important crossroads. They recommended urgent intervention from the game’s leaders to ensure international and franchise cricket can thrive together harmoniously. #CricketTwitter — Marylebone Cricket Club (@MCCOfficial) March 9, 2023 చదవండి: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం BGT: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సిగ్గుపడాలి! అయినా ప్రతిదానికీ.. -
ఫిక్సింగ్ బారిన క్రికెటర్.. రెండేళ్ల నిషేధం
పాకిస్తాన్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కొత్తేం కాదు. ఫిక్సింగ్ కలంకం ఏదో ఒక రూపంలో ఆ జట్టును చుట్టుముడుతునే వచ్చింది.గతంలో మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్, సల్మాన్ భట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఫిక్సింగ్ కలకలం రేపింది. లెప్టార్మ్ స్పిన్నర్, ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఆసిఫ్ అఫ్రిది మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీఈబీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పీసీబీ పేర్కొంది. 2022 ఏడాది సెప్టెంబర్‌లో ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు.అక్కడ రావల్కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై నిషేధం విధించింది.'' ఆర్టికల్ 2.4.10ని ఉల్లంఘించిన కారణంగా ఆసిఫ్ ఆఫ్రిదిపై రెండేళ్ల అనర్హత, దీంతో పాటు ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించినందుకు ఆరు నెలల నిషేధం విధించాం. ఈ రెండు ఏకకాలంలో అమలు చేయబడుతాయి. 2024 సెప్టెంబర్ 12 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.'' అని పీబీసీ పేర్కొంది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా పేరు పొందిన ఆసిఫ్ అఫ్రిది 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ టి20ల్లో 63 వికెట్లు తీశాడు. పీఎస్ఎల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన ఆసిఫ్ అఫ్రిది దేశవాళీ క్రికెట్లో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఆసీస్‌తో సవాల్‌కు సిద్దం; బ్యాటింగ్‌లో ఏ స్థానమైనా ఓకే -
శతకాల మోత.. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 17) మొదలైన మ్యాచ్‌ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు శతకాల మోత మోగించారు. ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు మొత్తం 13 మంది తొలి రోజు ఆటలో సెంచరీలు బాదారు. సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. మేఘాలయతో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో బిహార్ ఆటగాడు బిపిన్ సౌరభ్ (177) కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ ఆటగాడు సచిన్ బేబి (116 నాటౌట్) ఉత్తర్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒడిశా ఓపెనర్ శాంతాను మిశ్రా (107 నాటౌట్) హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర ఆటగాడు నౌషద్ షేక్ (145 నాటౌట్) ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై చిచ్చర పిడుగు సర్ఫరాజ్ ఖాన్ (125) అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు ఓపెనర్ ఎన్ జగదీశన్ (125) చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు సమర్పిత్ జోషి (123) మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాళ్లు అన్మోల్ప్రీత్ సింగ్ (124), నేహల్ వధేరా (123 నాటౌట్) చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రైల్వేస్ ఆటగాళ్లు వివేక్ సింగ్ (108), ఉపేంద్ర యాదవ్ (113) నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ ఆటగాడు అంకిత్ కల్సీ (116 నాటౌట్) హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్ ఆటగాడు అనుస్తుప్ మజుందార్ (137 నాటౌట్) -
ఏకైక భారత ఆటగాడిగా పృథ్వీ షా.. ఈ రికార్డు కూడా తన ఖాతాలోనే!
Ranji Trophy 2022-23- Prithvi Shaw అమిన్‌గావ్ (అస్సాం): జాతీయ జట్టులో పునరాగమనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విషయం విదితమే. అస్సాం జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో పృథ్వీ షా (383 బంతుల్లో 379; 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో 23 ఏళ్ల పృథ్వీ షా 89 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ చరిత్రలో మహారాష్ట్ర క్రికెటర్ బి.బి.నింబాల్కర్ (443 నాటౌట్; 1948లో కతియావార్ జట్టుపై) తర్వాత రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా పృథ్వీ షా నిలిచాడు. అదే విధంగా ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో దేశవాళీ క్రికెట్లో అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఏకైక భారత ఆటగాడిగా రికార్డు రంజీ ట్రోఫీలో ‘ట్రిపుల్ సెంచరీ’... విజయ్ హజారే వన్డే టోర్నీలో ‘డబుల్ సెంచరీ’... ముస్తాక్ అలీ టి20 టోర్నీలో సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు పొందాడు. రియాన్ బౌలింగ్‌లో.. ఇక ఈ రంజీ సీజన్లో పృథ్వీ ఇప్పటివరకు 539 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు పృథ్వీ షాను జాతీయ జట్టుకు సెలక్ట్ చేస్తారా లేదంటే అన్యాయం చేస్తూనే ఉంటారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా 2021 శ్రీలంక పర్యటన తర్వాత పృథ్వీ షాకు ఇంతవరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 240తో బ్యాటింగ్ కొనసాగించిన పృథ్వీ మరో 139 పరుగులు సాధించి రియాన్ పరాగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఓవర్‌నైట్ స్కోరు 397/2తో ఆట కొనసాగించిన ముంబై ... కెప్టెన్ అజింక్య రహానే (191; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటవ్వగానే తొలి ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 129 పరుగులు చేసింది. చదవండి: Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని? IND Vs SL: కోల్‌కతాలోనే సిరీస్ పడతారా? -
శతకంతో చెలరేగినా టీమిండియాలోకి రావడం కష్టమే!
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ చాన్నాళ్ల తర్వాత సూపర్ శతకంతో చెలరేగాడు. 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. అతని ధాటికి ప్రత్యర్థి జట్టు 9 వికెట్ల తేడాతో భారీ పరజయాన్ని మూటగట్టుకుంది. విషయంలోకి వెళితే.. మహారాజ ట్రోపీ కెస్సీఏ టి20 చాలెంజ్‌లో భాగంగా శుక్రవారం శివమొగ్గ స్ట్రైకర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్ 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రోహన్ కదమ్ 52 బంతుల్లో 84, బీఆర్ శరత్ 51 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 15.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగగా.. ఎల్ ఆర్ చేతన్ 34, అనీస్ కెవి(35 నాటౌట్) సహకారమందించారు. ఇక మయాంక్ అగర్వాల్ టీమిండియా జట్టులో స్థానం కోల్పోయి చాలా కాలం అయిపోయింది. మళ్లీ జట్టులోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ వెళ్లిపోయిన తర్వాత పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ అటు బ్యాటింగ్‌లో.. ఇటు కెప్టెన్సీలో ఘోరంగా విఫలమయ్యాడు. మరోసారి లీగ్ దశలోనే పంజాబ్ ఇంటిబాట పట్టింది. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల ప్రతిభకు కొదువ లేదు. రోజుకో కొత్త క్రికెటర్ తెర మీదకు వస్తుండడం.. ఒక్కోసారి జట్టును ఎంపిక చేయడంలో బీసీసీఐకి కూడా తలనొప్పిగా మారిపోయింది. ఎఫ్టీపీలో భాగంగా టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఒక సీనియర్.. మరొకటి జూనియర్ జట్టుగా విడదీసి ఆయా టోర్నీలు ఆడేందుకు పంపిస్తున్నారు. ఇంత పోటీతత్వంలో మయాంక్ టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాడా అంటే చెప్పడం కష్టమే అవుతుంది. A great day in the field. 💯 Hungry for more. We march on🔥 #KBBlasters pic.twitter.com/4pN6sL97cI — Mayank Agarwal (@mayankcricket) August 13, 2022 చదవండి: Adam Lyth: సొంత బోర్డు షాకివ్వడంతో.. ఇబ్బందుల్లో ఇంగ్లండ్ క్రికెటర్ -
బరోడా జట్టుకు ఆడనున్న అంబటి రాయుడు
సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు దేశవాళీ క్రికెట్లో మరోసారి బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిశిర్ హట్టంగడి ధ్రువీకరించారు. గత సీజన్ వరకు రాయుడు ఆంధ్ర తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, ఆంధ్ర, విదర్భలతో పాటు 2012–14 మధ్య రాయుడు బరోడా తరఫునే బరిలోకి దిగాడు. కాగా గతంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల రాయుడు.. మరోసారి ఈ జట్టుకు ఆడాలని ఉందని బీసీఏను సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అతడు ప్రొఫెషనల్ కేటగిరీలో ఆడనున్నాడు. ఇక అంబటి రాయుడు టీమిండియాకు 55 వన్డేలు, 6 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019 మార్చిలో జాతీయ జట్టుకు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే! -
టోర్నీకి ఎంపిక చేయలేదని యువ క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
దేశవాలీ టోర్నీకి ఎంపిక చేయలేదన్న కారణంతో ఒక క్రికెటర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. షోయబ్ అనే ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ సింద్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇంటర్ సిటీ చాంపియన్‌షిప్‌ను ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులను కోరింది. కాగా బోర్డులు కోచ్‌ల సలహా మేరకే ట్రయల్స్‌ను నిర్వహించి ఆపై జట్టును ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్‌ను కోచ్ కనీసం బౌలింగ్ ట్రయల్ కూడా తీసుకెళ్లలేదు. దీంతో హైదరాబాద్ జట్టులో షోయబ్ పేరు గల్లంతయింది. ఈ విషయం తెలుసుకొని తీవ్ర మనస్థాపం చెందిన షోయబ్ ఇంటికి వచ్చి బెడ్రూంకు వెళ్లి తలుపులేసుకున్నాడు. షోయబ్ కోపంగా రావడం చూసిన ఇంటి సభ్యులు బెడ్రూంకు వెళ్లి చూసే లోపలే షోయబ్ తన చేతిని బ్లేడ్‌తో పలుమార్లు కట్ చేసుకొని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అతని కుటుంబసభ్యులు స్పందించారు. ''కోచ్ తనను బౌలింగ్ ట్రయల్స్ తీసుకెళ్లలేదని.. దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాననే బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. మేం వెళ్లి చూసేలోపే చేతి కట్ చేసుకొని బాత్రూంలో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం షోయబ్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు పేర్కొన్నట్లు'' తెలిపారు. అయితే పాకిస్తాన్ క్రికెట్లో ఇది కొత్తేం కాదు. ఇంతకముందు 2018లో అండర్-19 క్రికెటర్ ముహమ్మద్ జర్యాబ్ తనను జట్టులో నుంచి తీసేశారని ఉరి వేసుకొని ఆత్యహత్య చేసుకోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. చదవండి: కొడుకు బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన క్రికెటర్.. వీడియో వైరల్ 'ఆ క్రికెటర్ యువ ఆటగాళ్లకు ఒక గుణపాఠం.. చూసి నేర్చుకొండి' -
భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!
BCCI: భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ శుభవార్త వచ్చింది. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న బుడగ (బయో బబుల్) నిబంధనలను ఎత్తి వేయాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుడగ నిబంధనల వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేశంలో కోవిడ్ ప్రభావం కూడా తగ్గుముఖం పడతుండడంతో బయో బబుల్ నిబంధనలకు పూర్తిగా స్వస్థి పలకాలని బీసీసీఐ యోచిస్తుంది. దీంతో ఈ నెల (ఏప్రిల్) నుంచే ఆటగాళ్లకు బుడగ నిబంధనల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వెసులుబాటు దేశవాళీ క్రికెటర్లకు మాత్రమేనని తెలుస్తోంది. త్వరలో రెండు దేశవాళీ టోర్నీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో పాటు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: శతక్కొట్టిన ఆర్సీబీ.. అంబరాన్నంటిన సంబురాలు -
BCCI: ఆ క్రికెటర్లు ఒక్కొక్కరికి 11 లక్షల చొప్పున.. మరో 5 లక్షలు కూడా
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందుల పాలైన దేశవాళీ క్రికెటర్లకు చెల్లించే ఫీజుల పంపిణీ ప్రక్రియను క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆరంభించింది. ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా పురుష, మహిళా క్రికెటర్లకు ఆయా నిబంధనల మేరకు చెల్లింపులు షురూ చేసింది. కాగా 85 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్-19 కారణంగా 2020-21 రంజీ ట్రోఫీ టోర్నీ నిర్వహణ రద్దైన విషయం తెలిసిందే. అదే విధంగా పలు కీలక మ్యాచ్‌ల నిర్వహణకు కూడా ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో ఆటగాళ్లకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా ఫీజులు చెల్లించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూపు ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా... 2019-20 సీజన్లో భాగంగా రంజీ ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌కు సుమారు 11 లక్షల రూపాయలు చెల్లించారు. రోజుకు(నాలుగు రోజుల పాటు మ్యాచ్) 35 వేల చొప్పున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. ఇక 2020-21 ఏడాదికి గానూ నష్టపరిహారం రూపంలో సదరు ఆటగాడికి మరో 5 లక్షల రూపాయల మేర దక్కనుంది. ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ సెప్టెంబరులో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త స్లాబుల ప్రకారం... 40 మ్యాచులకు పైగా ఆడిన సీనియర్లకు రూ. 60 వేలు, అండర్-23 ప్లేయర్లకు 25 వేలు, అండర్-19 క్రికెటర్లకు 20 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: IPL 2022 Auction: ఆంధ్రా క్రికెటర్‌కు వేలంలో మంచి ధర పలకడం ఖాయం! -
రిటైర్మెంట్ ప్రకటించిన సన్‌రైజర్స్ బౌలర్!
భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ బిపుల్ శర్మ దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికా తరుపున ఆడేందుకు బిపుల్ శర్మ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డొమిస్టిక్ క్రికెట్లో పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ తరుపున బిపుల్ శర్మ ఆడాడు.105 టీ20 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ 1203 పరుగులతో పాటు, 84 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2010 సీజన్‌కు గాను బిపుల్ శర్మ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు. ఈ సీజన్లో 104 పరుగులతో పాటు, 8వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 18 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ శర్మ 83 పరుగులతో పాటు, 9వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 33 మ్యాచ్‌లు ఆడిన బిపుల్ శర్మ 187 పరుగులతో పాటు, 17వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా 2016లో విజేతగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా అమెరికా తరుపున ఉన్ముక్త్ చంద్ కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: సెంచరీతో మెరిశాడు.. వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయి! -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు
కరాచీ: పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మేనల్లుడు మహమ్మద్ హురైరా పాకిస్థానీ దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఖైద్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల హురైరా.. బలూచిస్థాన్‌పై అజేయ త్రిశతకం(341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. హురైరాకు ముందు పాక్ లెజెండరీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ 1975లో 17 ఏళ్ల 310 రోజుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, ఆ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు. పాక్‌లో త్రిశకం బాదిన ఆటగాళ్లలో మైక్ బ్రేర్లీ(ఇంగ్లండ్), మార్క్ టేలర్(ఆసీస్), వీరేంద్ర సెహ్వాగ్(భారత్) ఉన్నారు. చదవండి: మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ అతడే.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు Northern's Mohammad Huraira who scored his maiden triple-century in the Quaid-e-Azam Trophy 2021-22 final-round clash against Balochistan talks about his heroic effort. #QeAT #HarHaalMainCricket pic.twitter.com/dz7n3MkZN7 — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 MONUMENTAL EFFORT! 19-year-old Mohammad Huraira becomes the second youngest Pakistan batter to score a first-class triple century! 👏👏#HarHaalMainCricket pic.twitter.com/QtYRKDRCKT — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 -
దేశవాళీ వన్డే విజేతను తేల్చేందుకు...
ముంబై: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2021–22లో మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇటీవలే ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20ల్లో సత్తా చాటిన ఆటగాళ్లు ఇప్పుడు వన్డే క్రికెట్లో తమ విలువేంటో చూపించేందుకు సన్నద్ధమయ్యారు. నేటి నుంచి జరిగే వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం 38 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దేశంలోనే ఏడు వేదికల్లో (ముంబై, జైపూర్, రాంచీ, చండీగఢ్, రాజ్‌కోట్, తిరువనంతపురం, గువహటి)లలో మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై, మరో పెద్ద జట్టు తమిళనాడు మధ్య జరిగే తొలి పోరుతో టోర్నీ మొదలవుతుంది. కొన్నాళ్ల క్రితమే ముస్తాక్ అలీ టి20 టోర్నీని నెగ్గిన తమిళనాడు అమితోత్సాహంతో ఉంది. భారత సీనియర్ జట్టులో సభ్యులుగా ఉన్నవారు కాకుండా పలువురు గుర్తింపు పొందిన క్రికెటర్లు విజయ్ హజారే ట్రోఫీలో ఆయా జట్ల తరఫున కీలకపాత్ర పోషించనున్నారు. హర్షల్ పటేల్, రాహుల్ చహర్, దీపక్ చహర్, యశస్వి జైస్వాల్, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, అంబటి తిరుపతి రాయుడు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 38 జట్లను ఎలైట్.. ప్లేట్ గ్రూప్‌లుగా విభజించారు. ఎలైట్ ‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’, ‘ఇ’ గ్రూప్‌లలో ఆరు జట్లు చొప్పున ఉన్నాయి. మరో ఎనిమిది జట్లతో ప్లేట్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఐదు ఎలైట్ గ్రూప్‌ల నుంచి ‘టాప్’లో నిలిచిన ఐదు జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇవే గ్రూప్‌లలో రెండో స్థానంలో నిలిచిన ఐదు జట్లు... ప్లేట్ గ్రూప్ టాపర్ (మొత్తం ఆరు జట్లు) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. డిసెంబర్ 27న ఫైనల్ జరుగుతుంది. ఎలైట్ ‘ఎ’ గ్రూప్‌లో ఆంధ్ర... ఎలైట్ ‘సి’ గ్రూప్‌లో హైదరాబాద్ ఉన్నాయి. హైదరాబాద్ జట్టు: తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), హిమాలయ్, అలంకృత్, అతుల్ వ్యాస్, భవేశ్ సేథ్, మికిల్ జైస్వాల్, కవిన్ గుప్తా, త్రిషాంక్ గుప్తా, చందన్ సహాని, తనయ్ త్యాగరాజన్, అజయ్‌దేవ్ గౌడ్, గౌతమ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, టి. రవితేజ, అక్షత్ రెడ్డి, కొల్లా సుమంత్, తిలక్ వర్మ, సీవీ మిలింద్, రాహుల్ బుద్ధి, అబ్దుల్ ఖురేషీ, అద్నాన్ అహ్మద్, మొహమ్మద్ అఫ్రిది. -
క్రికెటర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
Jay Shah Good News For Domestic Cricketers: దేశవాళీ క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా శుభవార్త చెప్పారు. 2019-20 సీజన్‌కు గానూ ఆటగాళ్లందరికీ 50 శాతం మేర అదనంగా మ్యాచ్ ఫీజు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా 2020-2021 సీజన్ జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా... దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 40 మ్యాచులకు పైగా ఆడిన సీనియర్లకు రూ. 60 వేలు, అండర్-23 ప్లేయర్లకు 25 వేలు, అండర్-19 క్రికెటర్లకు 20 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ట్విటర్ వేదికగా జై షా ప్రకటన చేశారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది జరగాల్సిన దేశవాళీ సహా వివిధ క్రికెట్ టోర్నీలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్ వేగవంతం కావడం, కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభం నుంచి పలు క్రీడా ఈవెంట్లు మొదలయ్యాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 యూఏఈ వేదికగా ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. డొమెస్టిక్ క్రికెట్ 2021-2022 షెడ్యూల్ ఇలా... ►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న మొదలు. ►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021. ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021. ►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022. ►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022. చదవండి: CSK Vs MI: పొలార్డ్ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్ అయ్యేది! -
రనౌట్ అవకాశం; ఊహించని ట్విస్ట్.. ఫీల్డర్ల పరుగులు
డబ్లిన్: ఐర్లాండ్ క్రికెట్ క్లబ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఒక బుజ్జి కుక్క చేసిన పని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టేలా చేసింది. విషయంలోకి వెళితే..ఐర్లాండ్‌లోని బ్రీడి క్రికెట్ క్లబ్ మైదానంలో బ్రీడీ, సీఎస్ఎన్ఐ మధ్య వుమెన్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అసలే వర్షం పడడంతో 20 ఓవర్లను కాస్త 12 ఓవర్లకు కుదించారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్ దిశగా షాట్ ఆడింది. ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరింది. చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది అదే సమయంలో ఒక బుజ్జి కుక్క తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్ అయింది. అలా రనౌట్ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. చివరికి బ్యాట్స్‌వుమెన్ వద్దకు వెళ్లి ఆగిన కుక్క బంతిని అక్కడ పడేసి వెళ్లింది. చివరకు మైదానంలోకి ప్రవేశించిన యజమాని కుక్కను తన వెంట తీసుకెళ్లడంతో కథ సుఖాంతం అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది. చదవండి: Mitchell Marsh: గర్ల్‌ఫ్రెండ్‌తో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ నిశ్చితార్థం The fielding coach we all need. 🐶pic.twitter.com/TWjjQEQR8k — CricTracker (@Cricketracker) September 11, 2021 -
2021- 22 సీజన్ ఇండియా డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ఇదే!
న్యూఢిల్లీ: కరోనా అదుపులోకి వస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 2021-22 సీజన్‌కు గానూ దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు 21న సీనియర్ వుమెన్ వన్డే లీగ్‌తో డొమెస్టిక్ క్రికెట్ ఈవెంట్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. అక్టోబరు 20న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మొదలుకానుందని, నవంబరు 12 ఇందుకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఉంటుందని పేర్కొంది. వీటితో పాటు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఈవెంట్లకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసిన తన ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో మొత్తంగా మహిళా, పురుషుల క్రికెట్.. అన్ని ఫార్మాట్లలో 2127 దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2021-2022 డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్: ►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న ప్రారంభం ►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021 ►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021 ►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022 ►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022 -
ఆ క్యాచ్ చూస్తే ఔరా అనాల్సిందే..
కేప్‌టౌన్: క్రికెట్లో స్లిప్ ఫీల్డింగ్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా క్యాచ్ చేజారడమే కాకుండా బంతి శరీరంపైకి దూసుకొచ్చి గాయాలబారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ స్థానంలో ఫీల్డింగ్ అంటే ఫీల్డర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. దక్షిణాప్రికా దేశవాళి క్రికెట్లో భాగంగా జరిగిన ఓ 50 ఓవర్ మ్యాచ్‌లో ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మార్టిన్ వాన్ జార్స్‌వెల్డ్ అనే ఆటగాడు చాలా అప్రమత్తంగా వ్యవహరించి, బ్యాట్స్‌మెన్ బంతిని ఆడే దిశను ముందుగానే పసిగట్టి, ఫస్ట్ స్లిప్ నుంచి లెగ్ సైడ్‌కు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. బ్యాట్స్‌మెన్ స్కూప్ షాట్‌కు ప్రయత్నిస్తున్నాడని పసిగట్టి, వికెట్‌కీపర్ వెనుక నుంచి అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్‌ను ఒడిసిపట్టుకొని ఫీల్డ్‌లో ఉన్నవారందరిని అవాక్కయ్యేలా చేశాడు. ఆ క్రికెటర్ చేసిన అద్భుత విన్యాసం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఫీల్డర్ చూపిన సమయస్పూర్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ క్యాచ్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ స్లిప్ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ ఫీట్‌ను సాధించిన జార్స్‌వెల్డ్ దక్షిణాఫ్రికా తరపున 9టెస్టులు, 11 వన్డేలు ఆడాడు. కాగా, దక్షిణాఫ్రికా జట్టు జాంటీ రోడ్స్ లాంటి అల్‌టైమ్ గ్రేట్ ఫీల్డర్లను అందించడమే కాకుండా, గ్యారీ కిర్‌స్టన్, గ్రేమ్ స్మిత్ లాంటి అద్భుతమైన స్లిప్ ఫీల్డర్లను కూడా అందించింది. This is one of the great all-time slips catches from South Africa's provincial 50-over competition! pic.twitter.com/5Gpfv9V9Jg — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) March 1, 2021 -
7 వేదికలు... 38 జట్లు... 102 మ్యాచ్‌లు
ముంబై: ఎట్టకేలకు భారత దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి దేశంలోని ఆరు నగరాల్లో (నాకౌట్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో) దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరగనుంది. కరోనా నేపథ్య పరిస్థితుల్లో ‘బయో బబుల్’ వాతావరణంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్–2021 వేలం ఉండటం... ఈ ఏడాదే స్వదేశంలో టి20 ప్రపంచకప్ జరగనుండటంతో... ఐపీఎల్ ఫ్రాంచైజీలను, బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి అవకాశం కల్పించనుంది. ► స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఏడేళ్ల నిషేధం ఎదుర్కొని... నిషేధం గడువు పూర్తి కావడంతో భారత మాజీ బౌలర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఈ టోర్నీతో దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేయనున్నాడు. కర్ణాటక జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పోటీపడనుంది. ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నా... జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ముంబై ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. సూర్యకుమార్ ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ► గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఢిల్లీ తరఫున, గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్న సురేశ్ రైనా ఉత్తరప్రదేశ్ తరఫున బరిలోకి దిగనున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తొలిసారి ముంబై సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. అర్జున్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడినా ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాడు. ► గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన కర్ణాటక మూడోసారీ టైటిల్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆంధ్ర, హైదరాబాద్ జట్లకు తమ ఉనికిని చాటుకోవడానికి ఈ టోర్నీ వేదికగా నిలువనుంది. ఆంధ్ర జట్టుకు అంబటి రాయుడు... హైదరాబాద్ జట్టుకు తన్మయ్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ‘డ్రా’ను పరిశీలిస్తే ఆంధ్ర, హైదరబాద్ జట్లు నాకౌట్‌కు చేరాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో అస్సాంతో హైదరాబాద్ తలపడుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఫార్మాట్ ఎలా ఉందంటే? మొత్తం 38 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఆరేసి జట్లతో కూడుకున్న ఐదు ఎలైట్ గ్రూప్‌లు... ఎనిమిది జట్లతో కూడిన ఒక ప్లేట్ గ్రూప్ ఉంది. జనవరి 19వ తేదీ వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఎనిమిది జట్లు నాకౌట్ దశకు అర్హత పొందుతాయి. ఆరు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన ఆరు జట్లతోపాటు ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలిచిన రెండు అత్యుత్తమ జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకుంటాయి. లీగ్ దశలో 95 మ్యాచ్‌లు, నాకౌట్ దశలో 7 మ్యాచ్‌లు కలిపి టోర్నీలో మొత్తం 102 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లు ఎక్కడంటే? జనవరి 26 నుంచి నాకౌట్ దశ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని మొతెరా సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తారు. జనవరి 26న రెండు క్వార్టర్ ఫైనల్స్... 27న మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. 29న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. జనవరి 31న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? కరోనా నేపథ్యంలో ఏ వేదికలోనూ ప్రేక్షకులకు ప్రవేశం లేదు. లీగ్ దశ మ్యాచ్‌లు రోజూ మధ్యాహ్నం 12 గంటలకు, ఆ తర్వాత రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. లీగ్ దశలో గ్రూప్ ‘ఇ’, ‘బి’ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జియో టీవీలోనూ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. దీపక్ హుడా అవుట్... బరోడా జట్టు ఆల్‌రౌండర్ దీపక్ హుడా ముస్తాక్ అలీ టి20 టోర్నీ నుంచి చివరి నిమిషంలో వైదొలిగాడు. బరోడా జట్టు కెప్టెన్ , భారత జట్టు సభ్యుడు కృనాల్ పాండ్యా గత రెండు రోజులుగా తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని... ఇతర జట్ల ఆటగాళ్ల ముందు తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ దీపక్ హుడా బరోడా క్రికెట్ సంఘానికి లేఖ రాశాడు. జట్ల వివరాలు ఎలైట్ గ్రూప్ ‘ఎ’: జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, రైల్వేస్, త్రిపుర. వేదిక: బెంగళూరు ఎలైట్ గ్రూప్ ‘బి’: హైదరాబాద్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు, అస్సాం. వేదిక: కోల్‌కతా ఎలైట్ గ్రూప్ ‘సి’: గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, బరోడా, ఉత్తరాఖండ్. వేదిక: వడోదర ఎలైట్ గ్రూప్ ‘డి’: సర్వీసెస్, సౌరాష్ట్ర, విదర్భ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గోవా. వేదిక: ఇండోర్ ఎలైట్ గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, హరియాణా, ముంబై, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి. వేదిక: ముంబై ప్లేట్ గ్రూప్: మేఘాలయ, చండీగఢ్, బిహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్. వేదిక: చెన్నైడిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక (ఫైల్) -
'క్షమించండి.. మళ్లీ రిపీట్ కానివ్వను'
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ బంగబంధు టీ20 కప్‌లో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సహచర ఆటగాడు నజుమ్ అహ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఒక జూనియర్ క్రికెటర్‌పై రహీమ్ ఇలా ప్రవర్తించడమేంటని పలువురు మాజీ, సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. రహీమ్ చర్యకు మ్యాచ్ రిఫరీ అతని ఫీజులో 25శాతం జరిమానా విధించాడు.తాజాగా రహీమ్ తాను చేసిన పనికి బాధపడుతున్నానని.. మళ్లీ ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాని ఫేస్బుక్ వేదికగా అభిమానులకు చెప్పుకొచ్చాడు. (చదవండి : కొట్టేస్తా... ఏమనుకున్నావ్!) 'మ్యాచ్ సందర్భంగా తోటి క్రికెటర్‌పై నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మ్యాచ్ ముగిసిన వెంటనే నజుమ్ అహ్మద్‌కు క్షమాపణ కోరాను. ఒక మనిషిగా నేను అలా ప్రవర్తించడం తప్పు. అతన్ని కొట్టడానికి చేయి చూపించడం సరైనది కాదు. అందుకే నా చర్యను తప్పుబడుతూ క్రికెట్ అభిమానులకు.. ఆరోజు మైదానంలో ఉన్న ప్రేక్షకులకు మరోసారి క్షమాపణలు కోరుతున్నా. ఇలాంటి ఘటన నానుంచి మళ్లీ పునరావృతం కావని మీకు ప్రామిస్ చేస్తున్నా.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రహీమ్ జట్టు బెక్సింకో ఢాకా 9 పరుగులతో ఫార్చున్ బరిషల్‌పై నెగ్గి ప్లే ఆఫ్‌కు చేరింది. -
దేశవాళీ సీజన్‌కు ముహూర్తం
న్యూఢిల్లీ : కరోనా కారణంగా చాలా ఆలస్యమైన దేశవాళీ క్రికెట్ టోర్నీల నిర్వహణపై కదలిక వచ్చింది. కొత్త సంవత్సరం ఆరంభంలో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. బయో సెక్యూర్ హబ్‌లను ఏర్పాటు చేసి ఆరు రాష్ట్రాల్లో జనవరి 10 నుంచి 31 వరకు ముస్తాక్ అలీ టోర్నీని నిర్వహించనున్నట్లు బీసీసీఐ అనుబంధ సంఘాలకు జై షా మెయిల్ ద్వారా తెలిపారు. ‘టోర్నీలో పాల్గొనాలనుకునే రాష్ట్ర జట్లు జనవరి 2వ తేదీన సంబంధిత వేదికల వద్దకు రావాల్సి ఉంటుంది. 10 నుంచి పోటీలు జరుగుతాయి. 31న ఫైనల్ నిర్వహిస్తాం. ఈ టోర్నీ గ్రూప్ దశ పోటీలు ముగిశాకే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలపై ఓ నిర్ణయం తీసుకుంటాం. ముస్తాక్ అలీతో పాటు మరో టోర్నీ నిర్వహణను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సంఘాలు ఏర్పాట్లు చేసుకోవాలి’ అని జై షా సూచనప్రాయంగా తెలిపారు. -
దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ ఆదివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నమెంట్ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్ అభిమానులను అలరించనుంది. ఇక ముస్తాక్ అలీ టోర్నీకి సంబంధించి ఇప్పటివరకైతే వేదికల్ని నిర్ణయించలేదు. జనవరి 2 తర్వాత ఏయే వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తారో ఫైనల్ కానుంది. ఇదిలాఉండగా.. కరోనా భయాల నేపథ్యంలో బీసీసీఐ ఐసీఎల్-2020 ని దుబాయ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ అనంతరం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరి వెళ్లింది. అటు తర్వాత వచ్చే ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత దేశంలో జరిగే తొలి అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ అదే కానుంది. -
కొత్త సంవత్సరంలోనే దేశవాళీ సీజన్: గంగూలీ
న్యూఢిల్లీ: యువ క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తోన్న ఈ సీజన్ దేశవాళీ క్రికెట్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చాడు. జనవరి 1 నుంచి దేశవాళీ సీజన్‌ను ప్రారంభించనున్నట్లు శనివారం ప్రకటించాడు. బీసీసీఐ అపెక్స్ మండలిలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పాడు. ‘దేశవాళీ క్రికెట్ గురించి విస్తృతంగా చర్చించాం. 1 జనవరి 2021 నుంచి దేశవాళీ సీజన్ ప్రారంభించాలని నిర్ణయించాం. అన్ని టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు. కానీ రంజీ ట్రోఫీని కచ్చితంగా పూర్తిస్థాయిలో నిర్వహిస్తాం’ అని గంగూలీ వెల్లడించాడు. జనవరి–మార్చి వరకు రంజీ ట్రోఫీ నిర్వహించే అవకాశముందన్నాడు. మార్చి, ఏప్రిల్ విండో జూనియర్లు, మహిళల క్రికెట్‌కు కేటాయిస్తామని అన్నాడు. ఆసీస్‌లో భారత పర్యటన గురించి మాట్లాడుతూ ‘క్రికెట్ ఆస్ట్రేలియా పర్యటన వివరాలను పంపించింది. వాటిపై చర్చించాం. జనవరి మూడో వారంలోగా అక్కడ 4 టెస్టులు ఆడతాం. అక్కడికి వెళ్లాక క్వారంటైన్లో కూడా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొంటారు’ అని వివరించాడు. ‘ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మరో నాలుగైదు నెలల సమయం ఉంది. అప్పటి పరిస్థితులను బట్టి షెడ్యూల్‌ను రూపొందిస్తాం. భారత్‌లోనే ఈ సిరీస్ నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తాం. ఒకవేళ సాధ్యంకాకపోతే రెండో ప్రత్యామ్నాయ వేదికగా యూఏఈని పరిశీలిస్తున్నాం’ అని గంగూలీ తెలిపాడు. -
క్రికెట్లో ‘కొల్పాక్’ ఖేల్ ఖతం
కేప్‌టౌన్: గత కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ను బాగా దెబ్బ తీసిన కొల్పాక్ ఒప్పందం కథ ముగిసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో వాణిజ్య ఒప్పందం ఉన్న దేశాలకు చెందిన వ్యక్తులకు వర్క్ పర్మిట్‌తో ఈయూ ఉద్యోగుల తరహాలోనే అన్ని హక్కులు వర్తిస్తాయి. దీనిని ఉపయోగించుకొని కైల్ అబాట్, ఒలివర్, రిలీ రోసో, సైమన్ హార్మర్వంటి పలువురు కీలక ఆటగాళ్లు సహా 45 మంది క్రికెటర్లు సునాయాసంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడే అనుమతి పొంది బాగా డబ్బులు సంపాదించుకున్నారు. కొల్పాక్ ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లకు మళ్లీ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం ఉండదు. ఈ కారణంగా దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్ బాగా బలహీన పడింది. అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లండ్ తప్పుకుంది. దాంతో కొల్పాక్ ఒప్పందాలకు ఇకపై అవకాశం లేదు. ఇప్పుడు సఫారీ ఆటగాళ్లంతా సొంతగడ్డపైనే తమ సత్తాను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే వెళ్లిపోయిన వారి పట్ల కూడా తాము కఠిన వైఖరి అవలంబించమని, తిరిగి వస్తే స్వాగతిస్తామని దక్షిణాఫ్రికా క్రికెట్ కొత్త డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రకటించాడు. ‘కొల్పాక్ కథ ముగిసిపోయింది కాబట్టి మా దేశపు అత్యు త్తమ ఆటగాళ్లంతా ఇక్కడే ఆడాలని కోరుకుంటున్నాం. వస్తారా లేదా అనేది వారిష్టం. వారిని ప్రోత్సహించడం మా బాధ్యత. వారంతా మళ్లీ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో ఆడితే వారి ప్రదర్శనను బట్టి జాతీయ జట్టులోకి ఎంపిక చేయడానికి అభ్యంతరం లేదు’ అని స్మిత్ స్పష్టం చేశాడు. -
2024 మ్యాచ్‌లు... 6471 మంది ఆటగాళ్లు
న్యూఢిల్లీ: నిర్వహించిన మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రాతినిధ్యం పరంగా ప్రస్తుత సీజన్ (2018–19) భారత క్రికెట్ దేశవాళీ చరిత్రలో అతి భారీదిగా మిగిలిపోనుంది. ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్–12 ఫైనల్‌తో సీజన్ ముగియనుంది. దీంతో కలిపి 2024 మ్యాచ్‌లు ఆడినట్లు అవుతుంది. ఈ స్థాయిలో మ్యాచ్‌లు జరగడం ఇదే ప్రథమం. కాగా, ఏప్రిల్ 24న జరిగిన మహిళల అండర్–23 చాలెంజర్ ట్రోఫీ ఫైనల్‌తో 2 వేల మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దేశవాళీలో మొత్తం 37 జట్లు 3,444 రోజుల పాటు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాయి. 2017–18లో 28 జట్లు 1,032 మ్యాచ్‌లకు 1892.5 రోజులు మాత్రమే ఆడటం గమనార్హం. పటిష్టమైన ప్రణాళికతోనే ఇది సాధ్యమైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. సీజన్ మొత్తంలో 13,015 మంది ఆటగాళ్ల పేర్లు రిజిస్టరవ్వగా, 6471 మంది పాల్గొన్నారు. సీనియర్ స్థాయి సహా, వివిధ వయో విభాగాల మ్యాచ్‌లకు దేశవ్యాప్తంగా ఉన్న 100 నగరాలు ఆతిథ్యమిచ్చాయి. కవరేజీ కోసం బీసీసీఐ 170 మంది చొప్పున వీడియో అనలిస్టులు, స్కోరర్లను వినియోగించింది. -
ఇది నోబాల్ కాదా?
న్యూయార్క్ : క్రికెట్ తెలిసిన ఎవ్వరైనా ఇది చూసి నోబాల్ లేక వైడ్ బాల్ అనే అంటారు. కొంత క్రికెట్ పరిజ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్లు మాత్రం అది ఖచ్చితంగా నోబాల్ అని చెబుతారు. కానీ ఫీల్డ్అంపైర్ మాత్రం లీగ్‌ల్ డెలివరీగా ప్రకటించి తన అసమర్థతను చాటుకున్నాడు. ఈ వింత ఘటన అమెరికా డొమెస్టిక్ క్రికెట్లో జరగ్గా.. అభిమానులు ఆ అంపైర్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. మంగళవారం విక్టోరియా-క్విన్స్‌లాండ్ జట్ల మధ్య జరిగిన డొమెస్టిక్ మ్యాచ్‌లో క్విన్స్‌లాండ్ లెగ్ స్పిన్నర్ వేసిన బంతి ఔట్ సైడ్ పిచ్‌పై పడి కీపర్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇది నోబాల్ అని మైదానంలోని ఆటగాళ్లంతా భావించారు. కానీ అంపైర్ అలాంటిదేం లేకుండా సరైన బంతి ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు. అంపైర్ నిర్ణయంతో వికెట్ కీపర్ సైతం అవాక్కయ్యాడు. ఇక మ్యాచ్ కామెంటేటర్స్ అయితే అది ఖచ్చితంగా నోబాల్ అని, బంతి ఏమాత్రం పిచ్ పడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అభిమానులు మాత్రం అంపైర్ల ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. పూర్ అంపైరింగ్ మరో నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విక్టోరియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. "That did not land on the pitch" 😳 #SheffieldShield pic.twitter.com/UaTBNugsWP — cricket.com.au (@cricketcomau) February 26, 2019 The standard of umpiring is getting worse... — Cricket Australia Fan (@CricketAustFan) February 26, 2019 -
దూసుకొచ్చాడు!
అండర్–14 జట్టు తరఫున ఆడుతుండగానే అండర్–16లో చోటు... అండర్–16లో ఉన్నప్పుడే అండర్–19 టీమ్‌కు ఎంపిక... అండర్–19 తరఫున బరిలోకి దిగిన సమయంలోనే అండర్–23 జట్టులో అవకాశం... ఆటలో ఒక ప్రతిభ గల కుర్రాడు ఎలా దూసుకుపోతున్నాడో ఈ పురోగతి చూపిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ప్రదర్శన ఇది. వేర్వేరు వయోవిభాగాల్లో ఇప్పటికే సత్తా చాటిన తిలక్ మరోసారి భారత అండర్–19 ‘బి’ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. తనకు లభించిన పరిమిత అవకాశాల్లోనే దూకుడైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన అతను మరింతగా దూసుకుపోయేందుకు సిద్ధమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో గడిపే సహనం... మైదానంలో నలుదిశలా చక్కటి స్ట్రోక్స్ ఆడగల సత్తా... ఫార్మాట్‌ను బట్టి ఆటతీరు మార్చుకోగల నైపుణ్యం... చిన్న వయసు నుంచే నిలకడగా భారీ స్కోర్లు సాధించగల ప్రతిభ... ఇవన్నీ 16 ఏళ్ల తిలక్ వర్మను ప్రత్యేకంగా నిలబెడతాయి. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగల సత్తా ఉన్న ఆటగాడిగా క్రికెట్ వర్గాల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకోవడం అతని బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. ఎడంచేతి వాటం ఓపెనర్ అయిన తిలక్ ఇప్పటికే ఏజ్ గ్రూప్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. దాదాపు మూడేళ్ల క్రితం దేశవాళీ అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో భారీగా పరుగులు సాధించడంతో అందరి దృష్టి అతనిపై పడింది. ఆ టోర్నీలో ఆడిన 8 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 5 సెంచరీలు (ఇందులో ఒక డబుల్ సెంచరీ), 2 అర్ధసెంచరీలతో ఏకంగా 960 పరుగులు సాధించడం విశేషం. అప్పటి నుంచి అతని కెరీర్ వేగంగా దూసుకుపోతోంది. విజయ్ మర్చంట్ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచినందుకు తిలక్ వర్మకు బీసీసీఐ వార్షిక అవార్డుల్లో దాల్మియా పురస్కారం లభించింది. లీగ్‌లలో భారీ స్కోర్లు... సాధారణ నేపథ్యం... తండ్రి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి... సన్నిహిత బంధువు ఒకరు క్రికెట్ ఆడటం చూసిన తర్వాత కలిగిన ఆసక్తితో ఆటలో చేరిన తిలక్ వేగంగా నేర్చుకున్నాడు. క్రికెట్లో కోచ్ సాలమ్ బయాష్ వద్ద ప్రాథమికాంశాలు నేర్చుకున్న అనంతరం తిలక్ వర్మకు వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. ముందుగా జాతీయ స్థాయి అండర్–14 టోర్నీలో ఆడేందుకు హైదరాబాద్ టీమ్‌లో స్థానంతో పాటు కెప్టెన్సీ అవకాశం కూడా దక్కింది. ఇక్కడే బెస్ట్ బ్యాట్స్ మన్, బెస్ట్ కెప్టెన్ అవార్డులు కూడా దక్కాయి. ఇక అండర్–16 టోర్నీ అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత హెచ్‌సీఏ లీగ్‌లలో పరుగుల వర్షం కురిపిం చాడు. ఫలితంగా ఎన్నో సెంచరీలు అతని ఖాతాలో చేరాయి. లీగ్ మ్యాచ్‌ల ఫలితాలలో దాదాపు ప్రతీ రోజు అతని పేరు వినిపించిందంటే అతిశయోక్తి కాదు. అండర్–19 సభ్యుడిగా... భారీ స్కోర్లు సాధిస్తుండటంతో తిలక్‌ను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. గత ఏడాది తొలిసారి హైదరాబాద్ అండర్–19 టీమ్‌లో స్థానం లభించింది. నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేయడంతో సౌత్‌జోన్ టీమ్‌లోకి కూడా ఎంపికయ్యాడు. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ టోర్నీలో కూడా అతను మూడు ఇన్నింగ్స్‌లలో 2 సెంచరీలు, ఒక అర్ధసెంచరీ సాధించడం విశేషం. ఫలితంగా గత ఏడాది కూడా క్వాడ్రాంగులర్ టోర్నీలో భారత్ అండర్–19 ‘బి’ టీమ్‌లో అవకాశం లభించింది. ‘బి’ విజేతగా నిలిచిన ఈ టోర్నమెంట్లో వర్మ 40, 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈసారి కూడా మళ్లీ అదే అవకాశం వచ్చింది. తాజా సీజన్లో అండర్–19 టోర్నీలో చెలరేగిపోవడమే మళ్లీ జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. నాలుగు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు సహా 779 పరుగులతో అతను హైదరాబాద్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రంజీ అవకాశం... అండర్–19లో ఆడుతూ ఉండగానే అండర్–23 సీకే నాయుడు ట్రోఫీ కోసం హైదరాబాద్ టీమ్‌లో అవకాశం లభించింది. జార్ఖండ్‌పై తొలి మ్యాచ్‌లోనే 160 పరుగులు చేసి అతను సత్తా చాటాడు. ఇదే జోరులో తాజా సీజన్లో రంజీ ట్రోఫీలో కూడా అరంగేట్రం చేశాడు. ఆంధ్రతో ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను 5, 34 పరుగులే చేసినా... 16 ఏళ్ల వయసులోనే రంజీ ఆడే అవకాశం దక్కడం ఈ కుర్రాడిలో ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా నాయకత్వ లక్షణాలు కూడా ఉన్న తిలక్... సీజన్ చివరి రెండు మ్యాచ్‌లలో హైదరాబాద్ అండర్–19 టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మున్ముందు కూడా ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే తొందరలోనే టీమిండియా అవకాశం కూడా అతనికి దక్కవచ్చు. శేరిలింగంపల్లిలోని లేగల క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న తిలక్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తిలక్ వర్మ సోదరుడు తరుణ్ వర్మ జాతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు కావడం విశేషం. వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యం... అండర్–19 టీమ్ తరఫున దేశవాళీ క్రికెట్లో రాణించినా వరల్డ్ కప్ స్థాయి టోర్నీల్లో ఆడినప్పుడే బాగా గుర్తింపు లభిస్తుంది. ఇప్పుడు సీనియర్ టీమ్‌లో ఉన్న చాలా మంది విషయంలో అదే జరిగింది. వచ్చే ఏడాది ఆరంభంలో జూనియర్ వరల్డ్ కప్ ఉంది. కాబట్టి అందులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నా. ప్రస్తుతం క్వాడ్రాంగులర్‌లో ‘బి’ తరఫున బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నా. ఇక్కడ రాణిస్తే ఆ వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా అవకాశం లభిస్తుంది. కాబట్టి దానిపై కూడా దృష్టి పెట్టా. సహజంగానే భారత జట్టు తరఫున ఆడాలనేదే నా అసలు లక్ష్యం. – ఠాకూర్ తిలక్ వర్మ ఎవరి అండదండలు లేకుండా ఇంత వేగంగా తిలక్ ఎదుగుతున్నాడంటే కేవలం అతని ప్రతిభే కారణం. మేటి బ్యాట్స్‌మన్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి వికెట్‌పైనైనా ఆడగలడు. ముఖ్యంగా కవర్‌డ్రైవ్, బ్యాక్ ఫుట్ పంచ్ అద్భుతంగా ఉంటాయి. క్రమశిక్షణతో పాటు సుదీర్ఘ సమయం పాటు నిర్విరామంగా ప్రాక్టీస్ చేయగల పట్టుదల కూడా అతనిలో ఉంది. ఒక కోచ్‌గా చెప్పాలంటే అతని ఆటలో లోపాలు దాదాపుగా లేవు. మున్ముందు తిలక్ మరింత ఎదగాలని కోరుకుంటున్నా. – సాలమ్ బయాష్, కోచ్ -
అద్భుతం.. ఒకే ఓవర్లో 43 పరుగులు!
వెల్లింగ్టన్ : ఒకే ఓవర్లో 43 పరుగులా? ఇది మేం నమ్మలా ? పోవుపోవయ్యా.. 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే కదా.. మరి 43 ఎలా వచ్చాయ్? అంటారా..? మీరడిగేది పాయింటే కానీ ఆ ఓవర్లో రెండు నోబాల్స్ పడితే అవి సిక్సర్లైతే.. ఇది సాధ్యం కాదంటారా! అవును న్యూజిలాండ్ దేశవాళి వన్డేలో ఇదే జరిగింది. బుధవారం సెంట్రల్ డిస్ట్రిక్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నార్తెర్న్ డిస్ట్రిక్ బ్యాట్స్‌మెన్ జో కార్టర్, బ్రెట్ హంప్టన్ ఈ అద్భుతాన్ని సృష్టించారు. వారి విధ్వంసానికి సెంట్రల్ డిస్ట్రిక్ట్ పేసర్ విలియమ్ లుడిక్ బలయ్యాడు. ఈ ఇద్దరు లుడిక్ వేసిన ఓవర్లో 4, 6+nb, 6+nb, 6, 1, 6, 6, 6లతో మొత్తం 43 పరుగులు పిండుకుని క్రికెట్ చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. దీంతో ఒక ఓవర్లో అత్యధిక (43) పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లుడిక్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ దెబ్బకు 10 ఓవర్లు వేసిన లుడిక్ మొత్తం 85 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు కార్టర్(102 నాటౌట్) సెంచరీ సాధించిగా.. హంప్టన్ (95) శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో నార్తెర్న్ డిస్ట్రిక్ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ జట్టు 288 పరుగులే చేయడంతో నార్తెర్న్ డిస్ట్రిక్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. 4, 6+nb, 6+nb, 6, 1, 6, 6, 6 43-run over ✔️ List A world record ✔️ Congratulations Joe Carter and Brett Hampton!#ndtogether #cricketnation pic.twitter.com/Kw1xgdP2Lg — Northern Districts (@ndcricket) November 7, 2018 ఇక ఇప్పటి వరకూ ఒక ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డు ఢాకా ప్రీమియర్ లీగ్-2013లో నమోదైంది. ఇందులో బంగ్లాదేశ్ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ అల్లావుద్దీన్ బాబు ఒకే ఓవర్లో 39పరుగులు సమర్పించుకున్నాడు. యువరాజ్ సింగ్ తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించగా... దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్ 2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్ స్పిన్నర్ డాన్ వాంగ్ ఓవర్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక దేశవాళీ క్రికెట్లో రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్లు తిలక్ రాజ్, మాల్కోమ్ నాష్‌ల బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు. -
పక్కా ప్రపంచకప్ ఆడుతా: రహానే
ముంబై : గత ఫిబ్రవరి నుంచి వన్డేలకు దూరంగా ఉన్న టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే 2019 ప్రపంచకప్ పక్కా ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘త్వరలోనే టీమిండియా వన్డే జట్టులో చోటుదక్కుతుంది. కచ్చితంగా 2019 ప్రపంచకప్ టోర్నీ ఆడుతాననే నమ్మకం ఉంది. ఇది జరగాలంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడటం ఎంతో ముఖ్యం. నా బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి సమస్య లేదు. కొన్ని సార్లు అద్భుతంగా ఆడామనుకున్నా ఫలితం మనకు ప్రతికూలంగా ఉంటుంది. స్పిన్ బౌలింగ్‌ను ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై కసరత్తులు మొదలు పెట్టా. ఇప్పటికే ఈ విషయంలో చాలా మెరుగయ్యాను. అందుకే నేను డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆడుతున్నాను. దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి రెండు టెస్టులకు జట్టులో చోటుదక్కకపోవడంతో బాధపడలేదు. అలా అయితే ఏంచేయలేం. అది మనచేతులో ఉండదు. టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని మనం గౌరవించాలి. నాకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే ఎదురు చూశా.’ అని తెలిపాడు. (చదవండి: ధోని లేకుండానే... ధనాధన్‌కు) బేసిక్స్, షాట్స్ ఆడటం తెలిసుంటే ఏ ఫార్మాటైనా మారుతూ సులువుగా ఆడవచ్చని, ఒకే ఫార్మాట్ ఆడితే ఇంకా బాగా రాణించవచ్చని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనకు పదిరోజులు ముందుగా వెళ్లనున్నామని, అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడునున్నామని తెలిపాడు. ఏ దేశాన్నైనా వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని, ఇరు జట్లలో మంచి బౌలింగ్ అటాక్ ఉందని, ఈ సిరీస్ రసవత్తరంగా సాగనుందని పేర్కొన్నాడు. తన దృష్టిలో బుమ్రా కష్టమైన బౌలరని, ఉమేశ్ అత్యంత వేగమైన బౌలర్‌ని రహానే చెప్పుకొచ్చాడు. ఇక 2016 నుంచి వన్డేల్లో 48 ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే కేవలం మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. (చదవండి: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు..) -
రహానే ఇంకా సెంచరీ కాలేదబ్బా!
న్యూఢిల్లీ : దేశవాళీ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్కోర్ బోర్డు తప్పిదంతో పప్పులో కాలేసిన రహానే 97 పరుగులకే సెంచరీ అయిందని సంబరాలు చేసుకున్నాడు. సహచర ఆటగాడు సురేశ్ రైనా ఇది గుర్తించడంతో అక్కడ నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ‘సీ’ను విజయం వరించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఏంజరిగిందంటే.. భారత బీ బౌలర్ నదీమ్ వేసిన 37ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ రాబట్టిన రహానే సెంచరీ పూర్తయిందని డ్రెస్సింగ్ రూమ్‌వైపు బ్యాట్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో పాటు, గ్యాలరీలోని ప్రేక్షకులు కూడా రహానేను చప్పట్లతో అభినందించసాగారు. మరోవైపు స్కోరుబోర్డుపై కూడా అతను శతకం పూర్తి చేసుకున్నట్లు కనిపించింది. కానీ అప్పటికీ రహానే స్కోరు 97 పరుగులే అని.. ఇంకా శతకానికి మరో మూడు పరుగులు చేయాల్సి ఉందని సహచర ఆటగాడు సురేశ్ రైనా చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి. What happened there? 😁 😆 @ajinkyarahane88 felt he got to a 100, @ImRaina was quick to rectify there were 3 more runs to go 😄 pic.twitter.com/qi5RaMF8t8 — BCCI Domestic (@BCCIdomestic) October 27, 2018 కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యఛేదనకు దిగిన భారత్-బి సైతం గట్టిగానే పోరాడింది. భారత్-బి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేంత పనిచేశారు. కానీ భారత్-సీ బౌలర్లు చెలరేగడంతో భారత్-బి 46.1ఓవర్లలో 323పరుగులకు ఆలౌట్ అయింది. -
శివాల్కర్, గోయల్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు
శాంతా రంగస్వామికి కూడా 8న బెంగళూరులో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానం న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్లు రాజిందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్‌లు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి నామినేట్ అయ్యారు. వీరితో పాటు మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి కూడా ఉన్నారు. ఈ పురస్కారం పొందనున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె నిలవనుంది. మార్చి 8న బెంగళూరులో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ‘గోయల్, శివాల్కర్ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని ఎన్.రామ్, రామచంద్ర గుహ, డయానా ఎడుల్జిలతో కూడిన అవార్డుల కమిటీ అభిప్రాయపడింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. హరియాణా తరఫున ఆడిన గోయల్ రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (637) తీసిన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఓవరాల్‌గా ఆయన 750 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టారు. ఇక శివాల్కర్ ఆడిన 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 589 వికెట్లు తీయగా... ఇందులో 13 సార్లు పది వికెట్ల చొప్పున తీశారు. అయితే బిషన్ సింగ్ బేడీ ఉజ్వలంగా వెలుగుతున్న దశలోనే వీరి కెరీర్ కూడా సాగడంతో జాతీయ జట్టులో మరో ఎడంచేతి వాటం స్పిన్నర్‌కు స్థానం లేకుండా పోయింది. 1975–76లో బేడీపై వేటు కారణంగా శివాల్కర్ జట్టులోకి వచ్చినా 12వ ఆటగాడిగా ఉన్నారు. శాంతా రంగస్వామి నేతృత్వంలో భారత మహిళల జట్టు 12 టెస్టుల్లో, 16 వన్డేల్లో తలపడింది. మరోవైపు వామన్ విశ్వనాథ్ కుమార్, దివంగత రమాకాంత్ దేశాయ్‌లకు బీసీసీఐ ప్రత్యేక అవార్డులు దక్కనున్నాయి. అవార్డులకు ముందు రోజు జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ఉపన్యసిస్తారు. -
దేశవాళీ క్రికెట్ లో ధోని!
బెంగళూరు: టీమిండియా వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో జరుగనున్న విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ తరపున ధోని ఆడాలనుకుంటున్నాడు. ఇది కూడా పాకిస్థాన్ -టీమిండియాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ జరగని పక్షంలో దేశవాళీ లీగ్ లో ఆడాలనుకుంటున్నట్లు జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేన్ సెక్రటరీ రాజేశ్ వర్మ పేర్కొన్నారు. దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాలనే కోరికను ధోని తాజాగా వెల్లడించినట్లు ఆయన స్పష్టం చేశారు. ' మేము ధోనితో మాట్లాడాం. విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని ధోని మమ్ముల్ని అడిగాడు. ఆ సమయంలో పాకిస్థాన్-టీమిండియాల సిరీస్ లేకపోతే ధోని జట్టుతో కలుస్తాడు. ఆ ట్రోఫీలో ధోని ఎన్ని మ్యాచ్ లు ఆడతాడనేది కచ్చితంగా తెలియదు. అతని కోరితే జార్ఖండ్ కు ధోనినే కెప్టెన్ గా కొనసాగుతాడు' అని రాజేశ్ వర్మ పేర్కొన్నారు. ఒకవేళ ధోని ఆ ట్రోఫీలో ఆడినట్లయితే ఎనిమిది సంవత్సరాల తరువాత మళ్లీ దేశవాళీ మ్యాచ్ ల్లో పాల్గొనట్లవుతుంది. చివరిసారిగా 2007లో కోల్ కతా లో జరిగిన సయ్యద్ ముస్తాఖా అలీ ట్వంటీ 20 చాంపియన్ షిప్ లో ధోని దేశవాళీ లీగ్ ఆడాడు. -
‘రంజిం'పజేసేనా!
నేటి నుంచి 82వ రంజీ ట్రోఫీ బరిలో 27 జట్లు తొలి మ్యాచ్‌లలో ముంబైతో ఆంధ్ర, గోవాతో హైదరాబాద్ ‘ఢీ’ భారత దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ టోర్నీ అయిన రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు వేళయింది. గత కొన్నేళ్లుగా స్టార్ క్రికెటర్లు దూరంగా ఉంటుండటంతో కాస్త కళ తప్పినట్లు కనిపించినా... దాని విలువ మాత్రం తగ్గలేదు. కొత్తగా వచ్చే కుర్రాళ్లు తమ సత్తా చాటి సెలక్టర్ల దృష్టిలో పడేందుకు ఇదే సరైన వేదిక. ఇక్కడ నిలబడగలగితే, నిలకడగా రాణిస్తే భవిష్యత్తుకు గట్టి పునాది అవుతుందనడంలో సందేహం లేదు. ఐపీఎల్ మెరుపులతో కొన్ని సార్లు వార్తల్లో నిలిచినా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ అయిన రంజీలో ప్రదర్శన లేకుండా ఎవరూ టీమిండియాకు ఎంపిక కాలేరనేది దిగ్గజాల అభిప్రాయం. ఇక పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్న సీనియర్లకూ ఇది మంచి అవకాశం. క్రీడా విభాగం ; రంజీ ట్రోఫీ 2015-16 సీజన్‌కు అన్ని జట్లూ సన్నద్ధమయ్యాయి. నేటి నుంచి ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడు గ్రూప్‌లలో కలిపి మొత్తం 27 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూప్‌లోని ఇతర ఎనిమిది జట్లతో లీగ్ మ్యాచ్‌లలో తలపడుతుంది. ‘ఎ’, ‘బి’ గ్రూప్‌లకు టోర్నీలో సమాన హోదా ఉండగా... ‘సి’ గ్రూప్‌లో మాత్రం చిన్న జట్లు ఉన్నాయి. తొలి రెండు గ్రూప్‌ల నుంచి మూడు జట్లు, చివరి గ్రూప్ నుంచి రెండు జట్లు కలిపి మొత్తం ఎనిమిది టీమ్‌లు క్వార్టర్ ఫైనల్ (నాకౌట్)కు అర్హత సాధిస్తాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 28 మధ్య ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు అర్హత పొందే జట్లు తర్వాతి ఏడాది పై గ్రూప్‌లకు ప్రమోట్ అవుతాయి. ఆ రెండు గ్రూప్‌లలో ఆఖరి స్థానంలో నిలిచిన టీమ్‌లు ‘సి’కి పడిపోతాయి. 1934-35 సీజన్లో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఇప్పటి వరకు 81 సార్లు జరిగింది. ఇందులో ముంబై (గతంలో బాంబే) ఏకంగా 40 సార్లు విజేతగా నిలవడం విశేషం. ఉత్సాహంగా ఆంధ్ర... చాలా కాలంగా గ్రూప్ ‘సి’కే పరిమితమవుతూ చిన్న జట్లతోనే పోటీ పడుతూ వచ్చిన ఆంధ్ర జట్టు గత ఏడాది అనూహ్యంగా పుంజుకుంది. చక్కటి ప్రదర్శనతో నాకౌట్‌కు అర్హత పొంది పై గ్రూప్‌లోకి ప్రమోట్ అయింది. ఫలితంగా ఈసారి బలమైన జట్లతో తలపడే అవకాశం లభించింది. దీని వల్ల ఆటగాళ్ల ప్రదర్శనకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశం ఉంది. విజయనగరంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన ముంబైని ఆంధ్ర ఎదుర్కోనుంది. సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే జట్టు ఆత్మవిశ్వాసం అమితంగా పెరగడం ఖాయం. గత ఏడాదిలాగే మొహమ్మద్ కైఫ్ కెప్టెన్సీ, మార్గదర్శనంలో ఆంధ్ర ఎలాంటి విజయాలు సాధిస్తుందో చూడాలి. మళ్లీ మొదటి నుంచి హైదరాబాద్ గత మూడేళ్లుగా పేలవంగా ఆడుతోన్న హైదరాబాద్ మరోసారి గ్రూప్ ‘సి’కే పరిమితమైంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఎక్కడా జట్టు నుంచి చెప్పుకోదగిన ప్రదర్శన రావడం లేదు. జట్టులో సభ్యులంతా ఫర్వాలేదనిపించే స్థాయిలో ‘ఏవరేజ్’ ఆటతోనే నెట్టుకొచ్చేస్తున్నారు తప్ప అద్భుతం అనిపించే ఆటతీరు కనబర్చలేకపోతున్నారు. మ్యాచ్ ఫలితాన్ని మార్చే లేదా శాసించే తరహాలో ఒక గొప్ప ఇన్నింగ్స్ గానీ ఒక అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన గానీ హైదరాబాద్ ఆటగాళ్లు చూపించి చాన్నాళ్లయింది. దురదృష్టవశాత్తూ సొంత మైదానంలో కూడా హైదరాబాద్ గొప్పగా రాణించలేకపోతోంది. హనుమ విహారి నాయకత్వంలో ఈసారి అయినా మెరుగ్గా ఆడి పై గ్రూప్‌కు వెళ్లడమే ప్రస్తుతం హైదరాబాద్ లక్ష్యం. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్, గోవాతో తలపడుతుంది. కర్ణాటకనే ఫేవరేట్... గత రెండు సీజన్లలో విజేతగా నిలిచిన డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై గురి పెట్టింది. ముంబై తర్వాత అత్యధిక టైటిల్స్ (8) సాధించిన రికార్డు ఉన్న ఈ జట్టు వినయ్ కుమార్ నాయకత్వంలో ఈసారి కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. తమిళనాడు నుంచి ఆ జట్టుకు ప్రధానంగా పోటీ ఎదురుకావచ్చు. వీటితో పాటు బరోడా, పంజాబ్ కూడా పటిష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది తమ సొంత జట్ల నుంచి ఇతర జట్లకు మారిన ఆటగాళ్లపై కూడా ప్రధానంగా దృష్టి నిలిచింది. వీరిలో తొలిసారి హర్యానా తరఫున బరిలోకి దిగుతున్న వీరేంద్ర సెహ్వాగ్ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. ప్రజ్ఞాన్ ఓజా (బెంగాల్), వసీం జాఫర్ (విదర్భ), ఆర్పీ సింగ్ (గుజరాత్)లు కూడా తమ కొత్త జట్ల తరఫున రాణించాల్సి ఉంది. జట్ల వివరాలు: గ్రూప్ ‘ఎ’: అస్సాం, కర్ణాటక, బెంగాల్, మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, విదర్భ, ఒడిషా. గ్రూప్ ‘బి’: ఆంధ్ర, ముంబై, పంజాబ్, గుజరాత్, రైల్వేస్, తమిళనాడు, బరోడా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. గ్రూప్ ‘సి’: హైదరాబాద్, గోవా, జమ్మూ కాశ్మీర్, కేరళ, సౌరాష్ట్ర, త్రిపుర, సర్వీసెస్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్. ఈసారి పాత నిబంధనలే... రంజీ ట్రోఫీని ఆసక్తికరంగా మార్చేందుకు అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ పలు సూచనలు చేసింది. గత ఏడాది 108 లీగ్ మ్యాచ్‌లలో ఏకంగా 51 ‘డ్రా’గా ముగిశాయి. దాంతో జట్లు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోసం కాకుండా విజయం కోసం ఆడే విధంగా బోనస్ పాయింట్లను అందించాలని కమిటీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనలకు బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆమోదం ఇవ్వాల్సి ఉండగా... గత నెల 28న జరిగిన ఆ సమావేశం అనూహ్యంగా వాయిదా పడింది. దాంతో పాత నిబంధనలతోనే ఈసారి కూడా టోర్నీ కొనసాగనుంది. -
దులీప్ ట్రోఫీకి మంగళం
టోర్నీని రద్దు చేసిన బీసీసీఐ - దేవధర్, విజయ్ హజారే, ముస్తాక్ అలీ టోర్నీ ఫార్మాట్లో మార్పులు న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్లో ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఫస్ట్‌క్లాస్ జోనల్ టోర్నీ దులీప్ ట్రోఫీని బీసీసీఐ రద్దు చేసింది. 2015-16 సీజన్లో ఈ టోర్నీని నిర్వహించరాదని నిర్ణయించింది. తర్వాతి సీజన్లో దీనిని మళ్లీ పునరుద్ధరిస్తారా లేక శాశ్వతంగా రద్దు చేశారా అనేదానిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు తాజా సీజన్‌ను పలు మార్పులతో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, కోచ్‌ల విజ్ఞప్తి మేరకు దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని సరిగ్గా ఐపీఎల్ వేలంకు ముందు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లతో ప్రారంభమయ్యే 2015-16 భారత దేశవాళీ సీజన్ మార్చి 10న ఇరానీ కప్‌తో ముగుస్తుంది. రంజీ తరహాలో వన్డేలు... ఇప్పటి వరకు వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ఐదు జోన్లలో ముందుగా నిర్వహించి అక్కడ ముందంజ వేసిన జట్లతో నాకౌట్ పోటీలు జరిపేవారు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలాగే మొత్తం 27 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించి టోర్నీని జరుపుతారు. టి20ల్లోనూ జోనల్ పద్ధతిని పక్కన పెట్టి సరిగ్గా ఇదే విధంగా ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిం ది. మరోవైపు జోనల్ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీని కూ డా ఐదు జోన్లుగా కాకుండా మూడు జట్లతో నిర్వహిస్తారు. ఇందులో విజయ్ హజారే ట్రోఫీ విజేత ఒక జట్టుగా ఉంటుంది. మిగిలిన రెండు జట్లను సెలక్టర్లు ఎంపిక చేస్తారు. కొత్త టోర్నీలకు సిద్ధం... ఈ సీజన్ నుంచి బోర్డు కొత్తగా అండర్-19 స్థాయిలో చాలెంజర్ ట్రోఫీని నిర్వహించనుంది. ఇందులో ప్రదర్శన కనబర్చిన జూనియర్ ఆటగాళ్లు వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. మహిళల క్రికెట్లో కూడా ఈసారి కొత్తగా మరో రెండు టోర్నీలకు బోర్డు శ్రీకారం చుట్టింది. ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ అండర్-23 టోర్నీతో పాటు మూడు రోజుల సీనియర్ ఇంటర్ జోనల్ టోర్నీని కూడా తొలిసారి ప్రవేశపెట్టారు. -
మృత్యుక్రీడ
ఫిల్ హ్యూస్కు ముందు కూడా పలువురు ఆటగాళ్లు మైదానంలో గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ దేశవాళీ క్రికెట్లోనే జరిగాయి. అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాళ్లు తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నా ఎవరూ చనిపోలేదు. క్రికెట్ ఆడుతూ చనిపోయిన వారు... రమణ్ లాంబా (38 ఏళ్లు- భారత్): 1998లో బంగ్లాదేశ్‌లో లీగ్ ఆడుతూ ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్‌కు బలయ్యాడు. అబ్దుల్ అజీజ్ (17 ఏళ్లు -పాక్): 1959లో దేశవాళీ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా బంతి ఛాతీకి గట్టిగా తగలడంతో మృతి డరైన్ రాండల్ (32 ఏళ్లు - దక్షిణాఫ్రికా): స్థానిక ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో పుల్ షాట్ ఆడబోయి తలపై గాయం కావడంతో గత ఏడాది చనిపోయాడు. ఇయాన్ ఫాలీ (30 ఏళ్లు - ఇంగ్లండ్): 1993లో వైట్హావెన్ జట్టు తరఫున బ్యాటింగ్ చేస్తుండగా కంటి వద్ద పెద్ద దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మరణించాడు. జుల్ఫిఖర్ భట్టీ (22 ఏళ్లు -పాక్): ఏడాది క్రితం లీగ్ మ్యాచ్‌లో పుల్ షాట్ ఆడగా, ఛాతీకి బలమైన దెబ్బ తగిలింది. ఆస్పత్రికి చేర్చే లోపే కన్ను మూశాడు. జార్జ్ సమ్మర్స్ (25 ఏళ్లు - ఇంగ్లండ్): 1870లో లార్డ్స్‌లో ఆడుతుండగా ఒక షార్ట్ బంతి బలంగా తాకినా...అంతా బాగుందంటూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. అయితే అదే గాయంతో నాలుగు రోజుల తర్వాత జార్జ్ మరణించాడు. - సాక్షి క్రీడావిభాగం -
విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక
అహ్మదాబాద్: దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టు హవా ఈ సీజన్లోనూ కొనసాగుతోంది. గత ఏడాది మూడు ప్రధాన టైటిల్స్‌ను గెలుచుకున్న కర్ణాటక ఈ సారి కూడా ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఇక్కడి సర్దార్ పటేల్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో కర్ణాటక 156 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా వరుసగా రెండోసారి దేశవాళీ వన్డే టోర్నీ విజేతగా నిలిచింది. ముందుగా కర్ణాటక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం పంజాబ్ 38.2 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. మయాంక్ సెంచరీ... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకకు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (100 బంతుల్లో 125; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (81 బంతుల్లో 87; 9 ఫోర్లు, 2 సిక్స ర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 24.2 ఓవర్లలో 162 పరుగులు జోడిం చారు. అనంతరం కరుణ్ నాయర్ (71 బంతు ల్లో 86; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించ గా, మనీశ్ పాండే (37 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. బల్తేజ్ సింగ్, సందీప్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ 9 పరుగుల వద్దే వోహ్రా (5) వికెట్ కోల్పోయింది. అయితే మన్దీప్ సింగ్ (81 బంతుల్లో 76; 7 ఫోర్లు, 1 సిక్స్), అమితోజ్ సింగ్ (44 బంతుల్లో 46; 8 ఫోర్లు) రెండో వికెట్‌కు 12 ఓవర్లలోనే 82 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ దశలో కర్ణాటక బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. యువరాజ్ సింగ్ (23)తో సహా ఇతర బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యాడు. కర్ణాటక బౌలర్లలో మిథున్‌కు 3, బిన్నీకి 2 వికెట్లు దక్కాయి.