కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇబ్బందుల పాలైన దేశవాళీ క్రికెటర్లకు చెల్లించే ఫీజుల పంపిణీ ప్రక్రియను క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆరంభించింది. ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా పురుష, మహిళా క్రికెటర్లకు ఆయా నిబంధనల మేరకు చెల్లింపులు షురూ చేసింది. కాగా 85 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోవిడ్-19 కారణంగా 2020-21 రంజీ ట్రోఫీ టోర్నీ నిర్వహణ రద్దైన విషయం తెలిసిందే. అదే విధంగా పలు కీలక మ్యాచ్‌ల నిర్వహణకు కూడా ఆటంకం ఏర్పడింది.
ఈ క్రమంలో ఆటగాళ్లకు జరిగిన ఆర్థిక నష్టానికి పరిహారంగా ఫీజులు చెల్లించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. మహ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూపు ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసింది. ఇందులో భాగంగా... 2019-20 సీజన్‌లో భాగంగా రంజీ ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌కు సుమారు 11 లక్షల రూపాయలు చెల్లించారు.
రోజుకు(నాలుగు రోజుల పాటు మ్యాచ్) 35 వేల చొప్పున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. ఇక 2020-21 ఏడాదికి గానూ నష్టపరిహారం రూపంలో సదరు ఆటగాడికి మరో 5 లక్షల రూపాయల మేర దక్కనుంది. ఈ మేరకు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా.. దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు పెంచుతూ బీసీసీఐ సెప్టెంబరులో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త స్లాబుల ప్రకారం... 40 మ్యాచులకు పైగా ఆడిన సీనియర్లకు రూ. 60 వేలు, అండర్-23 ప్లేయర్లకు 25 వేలు, అండర్-19 క్రికెటర్లకు 20 వేలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
చదవండి: IPL 2022 Auction: ఆంధ్రా క్రికెటర్‌కు వేలంలో మంచి ధర పలకడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment