అద్భుతం.. ఒకే ఓవర్‌లో 43 పరుగులు! | New Zealand Duo Belt 43 runs Off Single Over | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 7 2018 2:32 PM | Last Updated on Fri, Nov 9 2018 8:45 AM

New Zealand Duo Belt 43 runs Off Single Over - Sakshi

వెల్లింగ్టన్‌ : ఒకే ఓవర్‌లో 43 పరుగులా? ఇది మేం నమ్మలా ? పోవుపోవయ్యా..  6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టినా 36 పరుగులే కదా.. మరి 43 ఎలా వచ్చాయ్‌? అంటారా..? మీరడిగేది పాయింటే కానీ ఆ ఓవర్‌లో రెండు నోబాల్స్‌ పడితే అవి సిక్సర్లైతే.. ఇది సాధ్యం కాదంటారా! అవును న్యూజిలాండ్‌ దేశవాళి వన్డేలో ఇదే జరిగింది. బుధవారం సెంట్రల్‌ డిస్ట్రిక్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ బ్యాట్స్‌మెన్‌ జో కార్టర్‌, బ్రెట్‌ హంప్టన్‌ ఈ అద్భుతాన్ని సృష్టించారు. వారి విధ్వంసానికి సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ పేసర్‌ విలియమ్‌ లుడిక్‌ బలయ్యాడు. ఈ ఇద్దరు లుడిక్‌ వేసిన ఓవర్‌లో 4, 6+nb, 6+nb, 6, 1, 6, 6, 6లతో మొత్తం 43 పరుగులు పిండుకుని క్రికెట్‌ చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు.

దీంతో ఒక ఓవర్‌లో అత్యధిక (43) పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా లుడిక్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ దెబ్బకు 10 ఓవర్లు వేసిన లుడిక్‌ మొత్తం 85 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు కార్టర్‌(102 నాటౌట్‌) సెంచరీ సాధించిగా.. హంప్టన్‌ (95) శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరి విధ్వంసంతో నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ డిస్ట్రిక్‌ జట్టు 288 పరుగులే చేయడంతో నార్తెర్న్‌ డిస్ట్రిక్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ అద్భుత ఓవర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

ఇక ఇప్పటి వరకూ ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఢాకా ప్రీమియర్‌ లీగ్‌-2013లో నమోదైంది. ఇందులో బంగ్లాదేశ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ అల్లావుద్దీన్‌ బాబు ఒకే ఓవర్‌లో 39పరుగులు సమర్పించుకున్నాడు. యువరాజ్‌ సింగ్‌ తొలి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ బౌలర్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించగా... దక్షిణాఫ్రికా ఆటగాడు గిబ్స్‌ 2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్‌ స్పిన్నర్‌ డాన్‌ వాంగ్‌ ఓవర్‌లో ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్‌లు తిలక్‌ రాజ్‌, మాల్కోమ్‌ నాష్‌ల బౌలింగ్‌లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement