
క్రికెట్ తెలిసిన ఎవ్వరైనా ఇది చూసి నోబాల్ లేక వైడ్ బాల్ అనే అంటారు.
న్యూయార్క్ : క్రికెట్ తెలిసిన ఎవ్వరైనా ఇది చూసి నోబాల్ లేక వైడ్ బాల్ అనే అంటారు. కొంత క్రికెట్ పరిజ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్లు మాత్రం అది ఖచ్చితంగా నోబాల్ అని చెబుతారు. కానీ ఫీల్డ్‌అంపైర్ మాత్రం లీగ్‌ల్ డెలివరీగా ప్రకటించి తన అసమర్థతను చాటుకున్నాడు. ఈ వింత ఘటన అమెరికా డొమెస్టిక్ క్రికెట్‌లో జరగ్గా.. అభిమానులు ఆ అంపైర్‌ను సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. మంగళవారం విక్టోరియా-క్విన్స్‌లాండ్ జట్ల మధ్య జరిగిన డొమెస్టిక్ మ్యాచ్‌లో క్విన్స్‌లాండ్ లెగ్ స్పిన్నర్ వేసిన బంతి ఔట్ సైడ్ పిచ్‌పై పడి కీపర్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇది నోబాల్ అని మైదానంలోని ఆటగాళ్లంతా భావించారు.
కానీ అంపైర్ అలాంటిదేం లేకుండా సరైన బంతి ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు. అంపైర్ నిర్ణయంతో వికెట్ కీపర్ సైతం అవాక్కయ్యాడు. ఇక మ్యాచ్ కామెంటేటర్స్ అయితే అది ఖచ్చితంగా నోబాల్ అని, బంతి ఏమాత్రం పిచ్ పడలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అభిమానులు మాత్రం అంపైర్ల ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. పూర్ అంపైరింగ్ మరో నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విక్టోరియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
"That did not land on the pitch" 😳 #SheffieldShield pic.twitter.com/UaTBNugsWP
— cricket.com.au (@cricketcomau) February 26, 2019
The standard of umpiring is getting worse...
— Cricket Australia Fan (@CricketAustFan) February 26, 2019