
డబ్లిన్: ఐర్లాండ్ క్రికెట్ క్లబ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఒక బుజ్జి కుక్క చేసిన పని మైదానంలో ఫీల్డర్లను పరుగులు పెట్టేలా చేసింది. విషయంలోకి వెళితే..ఐర్లాండ్‌లోని బ్రీడి క్రికెట్ క్లబ్ మైదానంలో బ్రీడీ, సీఎస్‌ఎన్‌ఐ మధ్య వుమెన్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అసలే వర్షం పడడంతో 20 ఓవర్లను కాస్త 12 ఓవర్లకు కుదించారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో అబ్బీ లెక్కీ స్కేర్‌లెగ్ దిశగా షాట్ ఆడింది. ఫీల్డర్ బంతిని అందుకొని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరింది.
చదవండి: SL Vs SA: త్రో దెబ్బకు రనౌట్.. స్టంప్ మైక్ ఊడి వచ్చింది
అదే సమయంలో ఒక బుజ్జి కుక్క తన యజమాని నుంచి తప్పించుకొని మైదానంలోకి పరుగులు తీసింది. బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గిరాటేసే ప్రయత్నం చేయగా.. మిస్ అయింది. అలా రనౌట్ అవకాశం కూడా పోయింది. ఇక బంతిని బుజ్జి కుక్క తన నోట కరుచుకొని గ్రౌండ్‌లో పరుగులు పెట్టింది. అలా ఫీల్డర్లు కూడా ఆ కుక్క వెంబడి పరుగులు తీశారు. చివరికి బ్యాట్స్‌వుమెన్ వద్దకు వెళ్లి ఆగిన కుక్క బంతిని అక్కడ పడేసి వెళ్లింది. చివరకు మైదానంలోకి ప్రవేశించిన యజమాని కుక్కను తన వెంట తీసుకెళ్లడంతో కథ సుఖాంతం అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నవ్వులు పూయిస్తుంది.
చదవండి: Mitchell Marsh: గర్ల్‌ఫ్రెండ్‌తో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ నిశ్చితార్థం
The fielding coach we all need. 🐶pic.twitter.com/TWjjQEQR8k
— CricTracker (@Cricketracker) September 11, 2021