religion
-
నా మతం మానవత్వం... ఇదే నా డిక్లరేషన్... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చంద్రబాబు తిరుమలను కించపరుస్తుంటే బీజేపీ మౌనమేల?
సాక్షి,తాడేపల్లి : నా మతం ఏంటని అడుగుతున్నారా? నా మతం మానవత్వం.. డిక్లేషరేషన్లో రాసుకోండి అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నా మతం ఏంటని అడుగుతారా? నా మతం మానవత్వం. నా కులం, మతం ఏంటో ప్రజలందరికి తెలుసు. ఇదీ చదవండి : నా మతం మానవత్వం : వైఎస్ జగన్నా మతం మానవత్వం. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతా. బయటకు వెళ్తే అన్ని మతాలను గౌరవిస్తా. హిందూమత ఆచారాలను పాటిస్తా. ఇస్లాం, సిక్కు మత సంప్రదాయాలను గౌరవిస్తా.ఎన్డీయే కూటమిలోని చంద్రబాబు లడ్డూ విశిష్టతను కించపరుస్తుంటే బీజేపీ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఒక మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే.. దళితుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. గుళ్లకు వెళ్లి చంద్రబాబు తప్పు చేశారని, తాము కాదని దేవుడికి చెప్పండి’అని వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
దేవుడే నన్ను రక్షించాడు: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: తనను హత్య చేసేందుకు జరిగే ప్రయత్నాలను దేవుడు అడ్డుకొని రక్షించాడని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లిక్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనపై జరిగిన దాడులను విఫలం చేసిమరీ దేవుడు కాపాడాడని పేర్కొన్నారు. ట్రంప్ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘నాపై జరిగిన హత్యా ప్రయత్నాలను దేవుడే విఫలం చేసి నన్ను బతికించాడు. అందుకే మళ్లీ మన దేశంలోకి మతాన్ని తిరిగి తీసుకురాబోతున్నాం. సుమారు 40 ఏళ్లలో న్యూయార్క్ స్టేట్‌ను గెలుచుకున్న మొదటి రిపబ్లికన్ అభ్యర్థి తానే అవుతాను. ఈ దాడులు నా సంకల్పాన్ని మరింత దృఢపరిచాయి. హత్యచేసే ప్రయత్నాలు నా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేవు. నేను ఇక్కడకు రావడానికి కారణం.. ఈసారి ఎన్నికల్లో మనం న్యూయార్క్‌ను గెలవబోతున్నాం. చాలా ఏళ్ల తర్వాత రిపబ్లికన్లు నిజాయితీగా చెప్పడం ఇదే తొలిసారి. మనం గెలిచి చూపించబోతున్నాం. న్యూయార్క్ ప్రజలకు నేను ఒక్కటే చెబుతున్నా.. ఇక్కడ రికార్డు స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. తీవ్రవాదులు, నేరస్థులు పెరుగుతున్నారు. ద్రవ్యోల్బణం ప్రజలన ఇబ్బందులకు గురిచేస్తుంది.వాటి నుంచి బారినుంచి బయటపడాలంటే డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయండి’ అని అన్నారు. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ దేవుడు, మతంపై వంటి అంశాల మీద చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇక.. ఇటీవల ట్రంప్ ఫ్లోరిడా గోల్ఫ్ కోర్స్‌లోని గోల్ఫ్ ఆడుతుండగా.. ఓ దుండగుడు కాల్పులు జరపడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సర్వీసెస్ అప్రమత్తమైన ఆయన్ను రక్షించిన విషయం తెలిసిందే.JUST IN - Trump: "God has now spared my life…. We’re going to bring back religion into our country"pic.twitter.com/yJcTAJx1ts— Insider Paper (@TheInsiderPaper) September 18, 2024 -
పుట్టుకతోనే మతం ముద్రా?!
డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. కానీ ఒకరి విశ్వాస వ్యవస్థ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి. పిల్లల మతాన్ని నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. అది పితృస్వామ్యాన్నీ, మెజారిటీ వాదాన్నీ ప్రోత్సహిస్తుంది. వారి స్వేచ్ఛపై పరిమితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే మతాన్ని ‘వయోజనులకు’ సంబంధించిన అంశంగానే చూద్దాం.ఏప్రిల్ 5 నాటి ప్రముఖ వార్తాపత్రికలోని ఒక ప్రధాన శీర్షిక, ‘జననాల నమోదు కోసం తల్లిదండ్రుల మతాన్ని పొందుపరచనున్న ప్రభుత్వం’ అని చెబుతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023ను గత ఏడాది ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదించింది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), ఓటర్ల జాబితాలు, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి నమోదు, నోటిఫై చేసిన ఇతర అంశాలతో సహా వివిధ డేటాబేస్లను అప్డేట్ చేయ డానికి ఉపయోగించే జాతీయ స్థాయిలో జనన, మరణ డేటాబేస్ నిర్వహణను ఈ చట్టం తప్పనిసరి చేస్తోంది. పిల్లల మతానికి చెందిన కాలమ్‌లో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారైతే వారిద్దరి మతాన్ని నమోదు చేయడాన్ని కూడా ఈ సవరణ చట్టం తప్పనిసరి చేస్తోంది. ఇది, మోసపూరితంగా చట్టానికి ఉదారమైన రూపాన్ని ఇస్తోంది. కానీ మాకు సంబంధించి, పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి.వయోజనులు అనే అంశాన్ని ముందు స్పష్టం చేద్దాం. ఇది ఓటు వేయడానికి లేదా వివాహం చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన వయస్సు కాదు. ఇక్కడ వయోజనుడు అంటే వ్యక్తిగత నైతిక చట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత స్థాయిలో ఎదిగిన వ్యక్తి అని అర్థం. మతం అనే పదం వ్యవస్థీకృతమైన మతాలను సూచిస్తుంది.చట్టపరంగా, వయోజనులు భౌతిక స్వభావం గల లక్షణాలను కలిగి ఉంటారు. అయితే, మతం పాక్షికంగా ఆధిభౌతికమైనది. పిల్లలు పొందిన డీఎన్ఏతో దానిని కలపడం అనేది వారి స్వేచ్ఛపై పరి మితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఇది ప్రమాదకరమైన చట్టం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యపు విలువలను దెబ్బతీస్తుంది. అంతే కాక, మతతత్వం, పితృస్వామ్యం, మెజారిటీతత్వాలను ప్రోత్సహిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’కు (హిందూ అమ్మాయితో ముస్లిం పురుషుడి సంబంధం లేదా వివాహం) వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించిన వాస్తవాన్ని గమనిస్తే, ఆ నిబంధన అంత అమాయ కమైనది కాకపోవచ్చు. కనీసం, ఇది పితృస్వామికతతో కూడుకుని ఉన్నది.మొదటిది, మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. ఓటింగ్ లేదా వివాహం గురించిన అవకాశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక పిల్లవాడు యుక్తవయస్సుకు ఎదగవలసి ఉంటుంది. అయితే, ఓటు వేయమని లేదా వివాహం చేసుకోవాలని ఎవరినీ బలవంతం చేసే చట్టం లేదు. వయోజనుడైన బిడ్డకు ఎంపిక చేసుకోకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉంది. కానీ వ్యవస్థీకృత మతం కొన్నిసార్లు ప్రచ్ఛన్నంగా, కానీ తరచుగా నేరుగానే చేయవలసినవీ, చేయకూడనివీ చెబుతుంటుంది. వాటితోపాటు, తప్పు ఒప్పులను విధిస్తుంది. పౌరాణిక సత్యాలు, తల్లిదండ్రులు, ఇతర పెద్దల సాంప్రదాయిక జ్ఞానం, సామాజిక ఒత్తిళ్లు, ‘సంస్కారం’ ఆశించే నియమాలు, ఆచారాలు, సంప్రదాయా లను అంగీకరించడం తప్ప అభాగ్యుడైన బిడ్డకు వేరే మార్గం లేదు. ఇటువంటి సూక్ష్మమైన, కానీ తీవ్రమైన బ్రెయిన్ వాష్ వల్ల, పిల్లల సహజసిద్ధమైన శాస్త్రీయ ఉధృతికి, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ పరమైన ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.పిల్లల మెదడు అభివృద్ధిలో 80 శాతం జీవితంలో మొదటి 1,000 రోజులలోనే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఛాందస, ఉదారవాద పరిసరాలు పిల్లల జీవితకాలం చెరగని వైఖరులకు కారణమవుతాయి. పైగా అవి స్థూలంగా తిరోగ మనం, అణచివేత, అమానవీయమైనవి కూడా కావచ్చు. ఏది సరైనది ఏది తప్పు అనే సొంత నైతిక చట్రం ఆధారంగా పిల్లల అభివృద్ధిని వారి పరిసరాలు ప్రభావితం చేస్తాయి. డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత లేదా వైద్య శాస్త్రాల ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. అయితే ఒకరి విశ్వాస వ్యవస్థ, మానవత్వం, సున్నితత్వం, ప్రవర్తన, ముందుగా నిర్ణయించిన ‘సత్యాల’ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి.30 ఏళ్ల వయస్సు తర్వాత తాను సాగించిన ప్రయాణంలో, గౌతమ బుద్ధునికి ‘నేను ఇంకా జీవించాల్సిన జీవితం, అది నా స్వభావానికి ప్రతిబింబంగా ఉండితీరాలి’ అనిపించింది. ‘నా భ్రాంతిమయమైన కచ్చితత్వాల ఆశ్రయం నుండి, నా సొంత సరి హద్దుల నుండి నేను విముక్తి పొందాల్సి ఉంటుంది’ అని ఆయన భావించాడు.గౌతముడు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించకుంటే, ఆయన తన అసలైన స్వభావాన్ని గుర్తించడంలో విఫలమై, నిజంగా తన సొంతం కాని నమ్మకాలు, అంతర్దృష్టిలో తెలియకుండానే చిక్కుకుని ఉండే వాడు. పర్యవసానంగా, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యా కులైన వ్యక్తులకు ఓదార్పును అందించి దిశానిర్దేశం చేసిన మానవీయ జీవిత తత్వశాస్త్రం ప్రపంచానికి నిరాకరించబడి ఉండేది. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడిని అనుకరించలేరు కాబట్టి, వారి సొంత ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకునే పిల్లల సామర్థ్యానికి సామాజిక నిబంధనలు, చట్టం అధిగమించ లేని అడ్డంకులను సృష్టించకూడదు.స్థాపితమైన మతం శాస్త్రీయ ఆలోచనాపరులు, స్వేచ్ఛా ఆలోచనా పరులు, మేధావుల పట్ల విపరీతమైన క్రూర త్వాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, రోమన్ క్యాథలిక్ చర్చి, ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియోను మతవిశ్వాసిగా ముద్ర వేసి శిక్షకు గురిచేసింది. 1633లో, గెలీలియోపై చర్చి... సూర్యుడు ప్రపంచానికి కేంద్రం మరియు నిశ్చలమనీ; భూమి దాని చుట్టూ తిరుగుతుందనీ... తప్పుడు, మత గ్రంథాలకు విరుద్ధంగా భావించే నమ్మకాన్ని ఆమోదించాడనీ ఆరోపించింది. హాస్యాస్పదంగా, గెలీ లియో పేర్కొన్న ఈ సంచలనాత్మక ఆవిష్కరణలు న్యూటన్, ఐన్ స్టీన్ సిద్ధాంతాలకు పునాది వేయడమే కాకుండా, ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి మార్గం సుగమం చేశాయి.‘ద చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మ్యాన్’ అనే పదబంధం, విలియం వర్డ్స్‌వర్త్ కవిత ‘మై హార్ట్ లీప్స్ అప్’ నుండి ఉద్భవించింది. ఇది కేవలం కవిత్వ వ్యక్తీకరణ మాత్రమే కాదు. వరుసగా తరాలను రూపొందించడంలో పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారనే లోతైన సత్యాన్ని ఇది వ్యక్తీకరుస్తుంది. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అంటే అదే వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రభావం ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది స్వధర్మం ముసుగులో ఉన్న మతతత్వం, కులతత్వం, ద్వేషపు తాలూకు హింసాత్మక వ్యక్తీకరణల వంటి విభజన భావజాలాలను పిల్లల్లో శాశ్వతంగా కలిగించడంలోనో లేదా బాధితులుగా మార్చడంలోనో గణ నీయమైన ప్రభావాన్ని కలిగివుంది. ఇటువంటి ధోరణులు మెజారిటీ వాదాన్ని పెంపొందించవచ్చు. సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యక్తులను స్పందించకుండా చేయవచ్చు. శతాబ్దాల తరబడి వారసత్వంగా వచ్చిన నమ్మకాల్లో స్థిరపడిన మంచి ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు కూడా అనుకోకుండా తమ పిల్లల నిజమైన సారాన్ని అణచివేయవచ్చు. ఇక, చట్టసభ సభ్యులు క్రూరత్వానికి చెందిన అటువంటి రూపాలను శాశ్వతం చేసి సంస్థాగతీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.– అశోక్ లాల్ ‘ రచయిత, నాటకరంగ కళాకారుడు– నసీరుద్దీన్ షా ‘ హిందీ, ఉర్దూ నాటక రచయిత, నటుడు -
బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. కేంద్రం కీలక మార్పులు?
జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్‌కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్‌లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది. ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్‌కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్‌లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు. -
Election Commission: కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగవద్దని, ఇతర మతాల దేవుళ్లను, దేవతలను కించపరచరాదని పార్టీలకు, నేతలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం అడ్వైజరీ విడుదల చేసింది. గతంలో నియమావళిని ఉల్లంఘించి నోటీసులందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరోసారి తప్పిదానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంది. ప్రచార సమయంలో మర్యాదలు, సంయమనం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రత్యర్థులను కించపరిచడం, అవమానించడం, సదరు పోస్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడదని పేర్కొంది. విద్వేషానికి వ్యాఖ్యలకు పార్టీలు దూరంగా ఉండాలని కోరింది. ‘‘స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు నియమావళిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘించరాదు. వీటిని నిశితంగా పరిశీలిస్తుంటాం. సమాజంలో వర్గ విభేదాలను, శత్రుత్వాన్ని పెంచే మాటలు, చర్యలకు దూరంగా ఉండాలి. ఓటర్లను తప్పుదోవ పట్టించే లక్ష్యంతో తప్పుడు ప్రకటనలు లేదా నిరాధార ఆరోపణలను ప్రచారం చేయవద్దు. వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలి. దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా లేదా మరే ఇతర ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు’’ అని స్పష్టం చేసింది. మహిళల గౌరవం, గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలు లేదా ప్రకటనలను నివారించాలని ఈసీ కోరింది. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, ప్రత్యర్థుల ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్ట్‌లను షేర్ చేయడం మానుకోవాలని పేర్కొంది. శుక్రవారం లఖ్‌నవూలో ఎన్నికల కాఫీ టేబుల్ బుక్ విడుదల చేస్తున్న సీఈసీ రాజీవ్ కుమార్ -
కులమతాల చిచ్చు పెడుతున్నారు
ఇటానగర్: కులం, మతం ప్రాతిపదికన దేశ ప్రజలను మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విడగొడుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టిన సందర్భంగా దోయ్‌ముఖ్‌లో రాహుల్ స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ దేశంలో విద్వేషం చిమ్మడమే బీజేపీ పని. తమ కులం, మతం గొప్పదంటూ దేశ ప్రజలు తమలో తాము ఘర్షణలుపడేలా బీజేపీ కుట్రలు చేస్తోంది. కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తోంది. జనం కష్టాలు ఆ పారీ్టకి పట్టవు. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే వారి ఐక్యత కోసం కాంగ్రెస్ కృషిచేస్తోంది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. కొద్దిరోజులుగా అస్సాంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర మార్గమధ్యంలో శనివారం పాపుం పరే జిల్లా గుండా అరుణాచల్ ప్రదేశ్‌లో అడుగుపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ నబాం టుకీ రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. శనివారం ఒక్కరోజు మాత్రమే అరుణాచల్‌లో యాత్ర కొనసాగి ఆదివారం మళ్లీ అస్సాంలోకి అడుగుపెట్టనుంది -
గింజనే చూస్తే.... గింజవయిపోతావు
‘వాగురయని తెలియక మగ గణములు వచ్చి తగులురీతియున్నది..’’ వాగుర అంటే వల. వల వేసేవాడు వల ఒక్కటే వేయడు. కింద గింజలు వేసి వలేస్తాడు. ఆకలిమీద ఉన్న ప్రాణి కిందున్న గింజలనే చూస్తుంది. రివ్వున వచ్చి వలలో చిక్కుకుని తినేవాడికి అదే గింజయి పోతుంది. తన ఆహారం కోసం వెళ్ళి వేరొకడికి ఆహారమయి పోతుంది. తాను ఏది పొందడానికి వచ్చాడో అది పొందకపోగా వేరొక దానిచేత దానిని పొందబడుతున్నాడు. కారణం – మత్సరం. అప్పటికి నా అంతటి వాడు లేడు.. అని అహంకరించడం. మరొకడిని తక్కువ చేయడం, హేళనచేస్తూ తనను తాను గొప్పవాడిగా భావించుకోవడంలో ఒక చిన్న సంతోషం ఉంది. కానీ నిజానికి అది పతనం చేసే సంతోషం. మృగ గణములు వచ్చి తగులుకున్న రీతిగా నాకు హెచ్చరిక అందట్లేదు. అదే నాకు అప్పటికి సుఖకారణమనిపించి వలకు చిక్కినట్టు నన్ను కట్టిపడేస్తున్నదంటున్నాడు త్యాగయ్య. ఒకసారి పక్షులన్నీ వలలో చిక్కుకుపోయి ఉంటే... అటునుంచి ఒక రుషి వెళ్ళిపోతున్నాడు. రక్షించమని అవి వేడుకున్నాయి. విడిపిస్తాగానీ నేనొక మాట చెబుతా వింటారా...అనడిగితే సరే అన్నాయి. ‘‘గింజలు కనబడగానే వాల రాదు’’. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు మళ్లీ ఇలాటి ఆపద రాదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. మరో పది రోజుల తరువాత ఆయన మళ్ళీ అటుగా వస్తుంటే...మళ్ళీ అవే పక్షులు వలలో చిక్కుకుని ‘రక్షించమని వేడుకున్నాయి. నా మాట మీరెందుకు వినలేదని ఆయన అడిగాడు. వినకపోవడమేమిటి... మీరు చెప్పినట్లే కదా చేసాం... అన్నాయి...అంటూ ‘గింజలు కనబడగానే వాలరాదు’ అందుకే వెంటేనే వాలలేదు కదా... అన్నాయి... అలాగే వాగ్గేయకారుల కీర్తనలు ఎన్నిసార్లు పాడుకున్నాం, ఎన్నిసార్లు విన్నాం, ఎన్నిసార్లు చదివాం ... అని కాదు. అది అర్థం కావాలి. అర్థమయితే సుఖం. ఎంత బాగా పాడావు అన్నదానికన్నా... దానిలోని తత్త్వాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావన్నది కదా ముఖ్యం. తత్త్వం అర్థమయితే అరిషడ్వర్గాలు గురువుగారి అనుగ్రహం వల్ల వెంటనే పోయినట్టే కదా! అప్పుడు ఆయన సద్గురువు. అందుకే కీర్తన చివరన మదమత్సరమను తెరదీయగరాదా... అన్నాడు. ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ మదం కూడా ఉంటుంది. అది నాకు కదా దక్కాలి... అన్నప్పుడు కామం ఉంది. వాడికే ఎందుకు దక్కాలి ... అన్నప్పుడు క్రోధం ఉంది. నాకు ఉండాలన్నప్పుడు లోభం ఉంది. దీనికంతా కారణ అజ్ఞానం అన్నప్పుడు మోహం ఉంది. అరిషడ్వర్గాలు అక్కడ పుట్టాయి. అందువల్ల తెర అంత దట్టంగా ఉంది.‘నీలో మత్సరమను తెర ఉంది. అది తొలగించుకో’ అని ఆయన అనలేదు. తన మీద పెట్టుకున్నాడు. శంకరభగవత్పాదులు రాసిన శ్లోకాల్లో నాకు అంటూంటారు. అంటే ఆయనకు కాదు. ఆ శ్లోకం ఎవరు చదువుతుంటే వాళ్ళకు–అని. వాళ్ళకు దైవానుగ్రహం కలగాలి. అలాగే త్యాగరాజస్వామి తనకు అన్వయం చేసుకుని చెప్పారు. మత్సరం ... మద మత్సరం... అసూయ వినాశ హేతువు. ఆ తెర తీయమంటున్నాడు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
భిన్న కుల, మత, భాషల ప్రజల మధ్య విద్వేషాలు పెంచొద్దు
ముహమ్మద్ ఫసియొద్దీన్: కుల మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించవచ్చా? గుడులు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు వంటి ప్రార్థన స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించవచ్చా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం... ‘లేదు’. ఎవరైనా అలా చేస్తే ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్టే. మీ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సజావుగా అమలు అవుతోందా? పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ప్రవర్తన, చర్యలు.. నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయా? అనే అంశాలను ప్రజలు కూడా పరిశీలించవచ్చు. ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే స్థానిక ఎన్నికల పరిశీలకులను కలిసి లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు లేదా ‘సీ–విజిల్’ యాప్ ద్వారా ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలు/వీడియోలు తీసి నేరుగా ఎన్నికల సంఘానికి పంపొచ్చు. వివిధ సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘంజారీ చేసిన నిబంధనల సంకలనాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తాజాగా విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. విద్వేషాలు రెచ్చగొట్టరాదు... భిన్న కుల, మత, భాష, వర్గాల ప్రజల మధ్య విభేదాలను పెంపొందించే, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదు. ప్రత్యర్థి పార్టీలపై చేసే విమర్శలు కేవలం ఆ పార్టీ విధానాలు, కార్యక్రమాలు, గత చరిత్ర, చేసిన పనులకు పరిమితమై ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ధ్రువీకరణ జరగని ఆరోపణలు, వక్రీకరణల ఆధారంగా విమర్శలు చేయరాదు. ఎన్నికల చట్టాల్లో నేరపూరిత చర్యలుగా పేర్కొన్న కార్యకలాపాలకు అన్ని పార్టీలు, అభ్యర్థులు దూరంగా ఉండాలి. ప్రధానంగా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేయడం, ఓటర్ల స్థానంలో ఇతరులతో ఓటేయించడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం, పోలింగ్‌కు 48 గంటల ముందు సభలు, సమావేశాలు జరపడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడానికి రవాణా సదుపాయం కల్పించడం వంటివి చేయరాదు. ఇంట్లో ప్రశాంతంగా బతికేందుకు ప్రతి పౌరుడి హక్కును గౌరవించాలి. వ్యక్తుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వారి ఇళ్ల ముందు ఏ పరిస్థితుల్లోనూ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టరాదు. యజమానుల సమ్మతి లేకుండా వారి స్థలాలు, భవనాలు, ప్రహరీ గోడలను జెండాలు, బ్యానర్లు, పోస్టర్ల కోసం వినియోగించరాదు. గోడలపై ఎలాంటి రాతలు రాయకూడదు. ఇతర పార్టీల సమావేశాలు, ఊరేగింపులకు తమ మద్దతుదారులు భంగం చేయకుండా చూసుకోవాలి. ఏదైనా ఓ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీల సమావేశం జరుగుతున్న ప్రాంతం మీదుగా ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒక పార్టీ అతికించిన పోస్టర్లను మరో పార్టీ కార్యకర్తలు తొలగించకూడదు. ఊరేగింపులు... ఊరేగింపుల రూట్ మ్యాప్‌ను నిర్వాహకులు ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఊరేగింపులు చేసుకోవాలి. భారీ ర్యాలీ అయితే తగిన నిడివికి తగ్గించుకోవాలి. ఇద్దరు లేదా అంతకుమించిఅభ్యర్థులు/పార్టీలు ఏక కాలంలో ఒకే రూట్లో ఊరేగింపు నిర్వహించే సమయంలో నిర్వాహకులు ముందుగా సంప్రదింపులు జరిపి ఘర్షణ జరగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలి. ఊరేగింపులో తీసుకెళ్లే వస్తువుల విషయంలో పార్టీలు, అభ్యర్థులు నియంత్రణ పాటించాలి. ఆ వస్తువులు అసాంఘిక శక్తుల చేతిలో దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర పార్టీల నేతల దిష్టి బొమ్మలను ఊరేగించడం, వాటిని బహిరంగంగా దహనం చేయడం వంటివి చేయరాదు. పోలింగ్ బూత్‌ల వద్ద.. ఓటర్లు మినహా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించేందుకు ఎవరికీ అనుమతి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం పాస్ కలిగిన వారికి మినహాయింపు. పరిశీలకులను ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో పార్టీలు, అభ్యర్థులకు ఫిర్యాదులుంటే వాటిని పరిశీలకుల దృష్టికి తేవాలి. సభలకు ముందస్తు అనుమతి శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రతిపాదిత సభ సమయం, వేదికను ముందస్తుగా స్థానిక పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలి. సభ వేదిక ఉన్న ప్రాంతంలో ఏవైనా నిషేధాజ్ఞలు అమల్లో ఉంటే వాటిని కచ్చితంగా పాటించాలి. అవసరమైతే ముందుగా దరఖాస్తు చేసుకుని సడలింపులు పొందాలి. సభలో లౌడ్ స్పీకర్, ఇతర సదుపాయాలను వినియోగించడానికి ముందస్తుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి. స్వేచ్ఛగా ఓటు వేసేలా.. అభ్యర్థులు/పార్టీలు ఎలాంటి ఆటంకాలు, బెదిరింపులకు తావు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేలా ఎన్నికల అధికారులకు సహకరించాలి. తమ అనధికార కార్యకర్తలకు గుర్తింపు కార్డులు, బ్యాడ్జీలను ఇవ్వాలి. ఓటర్లకు పంపిణీ చేసే చిట్టీలపై గుర్తులు, పార్టీల పేర్లు ఉండరాదు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం సరఫరా జరపరాదు. పోలింగ్‌బూత్‌ల వద్ద పార్టీలు, అభ్యర్థులు ఏర్పాటు చేసే క్యాంపుల వద్ద ప్రజలను గుమికూడనీయొద్దు. అభ్యర్థుల క్యాంపుల వద్ద పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ఆహార పదార్థాలను సరఫరా చేయరాదు. పోలింగ్ రోజు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలుంటాయి. పర్మిట్లు పొంది వాటికి స్లిక్కర్ బాగా కనిపించేలా వాహనంపై అతికించాలి. -
'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..'
లక్నో: సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మరోసారి స్పందించారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని.. మిగిలినవన్నీ విభాగాలు, పూజా విధానాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమంలో యోగీ ఆదిత్యానాథ్ ఈ మేరకు మాట్లాడారు. 'సనాతన ధర్మం మాత్రమే మతం. మిగిలినవన్నీ వివిధ రకాల పూజా విధానాలు మాత్రమే. సనాతన ధర్మం అంటే మానవత్మమనే మతం. ప్రస్తుతం దానిపై దాడి జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో మానవత్వమే ఆపదలో ఉన్నట్లు.' అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమాలు ఏడు రోజులపాటు గోరఖ్‌నాథ్ దేవాలయం వద్ద నిర్వహించారు. చివరి రోజు వేడుకలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు మాట్లాడారు. మహంత్ దిగ్విజయ్ నాథ్ 54వ వర్థంతి, మహంత్ అవైద్యనాథ్ 9వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. విశాల దృక్పథం ఉన్నవారు మాత్రమే శ్రమధ్ భగవత్ కథా సారాన్ని అర్థం చేసుకోగలరని అన్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. బుల్డోజర్కు పని -
మళ్లీ మతం మంటలు!
విశ్వాసాల ప్రాతిపదికగా చెలరేగిపోయే మూక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారి సుమా అని రెండు వందల యేళ్లనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ హెచ్చరించారు. తరాలు మారినా, అప్పటితో పోలిస్తే ఎంతో ప్రగతి సాధించినా ఆ ప్రమాదకర మనస్తత్వాన్ని వదులుకోలేని బలహీనత కొందరిని పట్టిపీడిస్తోంది. ఒక పక్క మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో చోటుచేసుకున్న అత్యంత దుర్మార్గమైన ఉదంతాలపై పార్లమెంటు లోపలా, వెలుపలా రోజూ ఆందోళన వ్యక్తమవుతోంది. దానిపై చర్చకు విపక్షం పట్టుబడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం సైతం మణిపుర్ దురంతాలపై దృష్టి సారించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందనీ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందనీ కటువుగా వ్యాఖ్యానించింది. ఈలోగానే హరియాణాలో దుండగులు చెలరేగిపోయారు. వరసగా రెండురోజులపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన హింసాకాండతో అక్కడి నూహ్, గురుగ్రామ్ పట్టణాలు అట్టుడికిపోయాయి. ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయి 75 మంది గాయాల పాలయ్యాక, ఒక ప్రార్థనా స్థలంతో పాటు పలు దుకాణాలు తగలబడ్డాక ఇందుకు కారకులని భావిస్తున్న 116 మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు ప్రేరేపించిన ఉదంతమేమిటి, ఎవరు ముందుగా దాడికి దిగారన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. అయితే నిఘా వ్యవస్థ, శాంతిభద్రతల విభాగం పటిష్టంగా ఉన్నచోట ఎవరి ఆటలూ సాగవు. జాగ్రదావస్థలో లేని సమాజంలోనే మూకలు చెలరేగుతాయి. భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, తప్పించుకు తిరుగుతున్న మోను మానెసార్ అనే యువకుడు తాను ర్యాలీకి రాబోతున్నానని ఒక వీడియో సందేశం పంపటంతో నూహ్‌లో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులకు సమాచారం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన దాడి వెంట వెంటనే వేరే ప్రాంతాలకు విస్తరించటం, రెండు వర్గాలూ మారణాయుధాలు ధరించి చెలరేగి పోవటం దేన్ని సూచిస్తోంది? కొందరికి బులెట్ గాయాలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగ జారిందో అర్థమవుతుంది. పరస్పరం దాడులకు ఇరువైపులా దుండగులు అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నారు. ఏమాత్రం సంసిద్ధత లేకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే! ఏమనుకోవాలి దీన్ని? మణిపుర్ దుండగులు ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే అంతర్జాతీయంగా అపఖ్యాతిపాలు చేశాక, సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు ఎన్నో బహుళజాతి కార్పొరేట్ సంస్థలు కొలువు దీరిన హరియాణాలో సైతం అలాంటి మూకే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సాయుధ పోలీసు బలగాలను తరలించి, 144 సెక్షన్ విధించి అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగానే గురుగ్రామ్ అంటుకుంది. అక్కడి మిలీ నియం సిటీ, బాద్షాపూర్ ప్రాంతాల్లో దుకాణాల దహనం, లూటీలు పోలీసుల సాక్షిగా కొనసాగాయి. గొడవలు జరిగిన ప్రతిచోటా స్థానికులు చెప్పే మాటలే ఇప్పుడు నూహ్, గురుగ్రామ్ ప్రాంత వాసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చాన్నాళ్లుగా ఆ ప్రాంతాలకు వస్తున్నారని, స్థానిక యువతను సమావేశపరిచి అవతలి మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేస్తున్నారన్నది వారి మాటల సారాంశం. స్థానికులు కొన్ని రోజులుగా గమనించిన అంశాలపై నిఘా విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఈ దుఃస్థితి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తలవంపులు తీసుకురాదా? వచ్చే నెలలో న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా పలువురు దేశాధినేతలు తరలిరాబోతున్నారు. కనీసం హరియాణా ప్రభుత్వానికి ఈ స్పృహ అయినా ఉందా లేదా అనిపిస్తోంది. దేశంలో చెదురుమదురుగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న మాట వాస్తవమే అయినా, విచ్చలవిడిగా మారణాయుధాలతో మూకలు చెలరేగిన సందర్భాలు అదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో లేవు. కానీ ఉన్నట్టుండి రెండు రాష్ట్రాల్లోనూ రాక్షస మూకలు చెలరేగాయి. ప్రభు త్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా మెలగాలి. లేనట్ట యితే సమస్య మరింత జటిలమవుతుంది. నూహ్ సమీపంలోని ఒక ప్రముఖ ఆలయంలో అనేక మంది యాత్రీకులను నిర్బంధించారని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ చేసిన ప్రకటన అటు వంటిదే. అందుకు సమర్థనగా నిర్బంధితుల్లో కొందరు తనకు లొకేషన్ కూడా పంపారని చెప్పారు. కానీ ఆ ఆలయ అర్చకుడు దీపక్ శర్మ కథనం భిన్నంగా ఉంది. దర్శనానంతరం తిరిగి వెళ్లిన 2,500 మంది భక్తులు బయట ఉద్రిక్తతలుండటం గమనించి తమంత తాము వెనక్కొచ్చి పరిస్థితి చక్క బడ్డాక వెళ్తామని చెప్పారని ఆయనంటున్నారు. ఏ మతానికి చెందిన ప్రజానీకమైనా శాంతినే కోరుకుంటారు. ఏదో ఉపద్రవం జరిగిపోతోందన్న భయాందోళనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులపై కన్నేసి ఉంచితే, వారిని మొగ్గలోనే తుంచితే సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం సులభంగా ఏర్పడుతుంది. మన మతస్తులనో, మన కులస్తులనో భావించి ఏ వర్గమైనా పట్టనట్టు ఊరుకుంటే అంతిమంగా అది మొత్తం సమాజానికే చేటు కలిగిస్తుంది. మణిపుర్, హరియాణాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు అందరికీ కనువిప్పు కావాలి. అటువంటి శక్తులను ఏకాకులను చేయటంలో అందరూ ఒక్కటి కావాలి. -
వాళ్లే నిజమైన యాంటీ నేషనల్స్: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని పరస్కరించుకుని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రస్తత ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమబద్దమైన దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అని ఆమె పేర్కొన్నారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ది టెలిగ్రాఫ్‌లో వ్యాసం రాశారు సోనియా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారతీయులను మతం, భాష, కులం, లింగం ఆధారంగా విభజిస్తున్న వారే నిజమైన జ్యాతి వ్యతిరేకులు(యాంటీ నేషనల్స్) అని సోనియా బీజేపీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఈ రోజు మనం బాబా సాహెబ్ వారసత్వాన్ని గౌరవిస్తున్నప్పుడు, రాజ్యాంగం విజయం.. దాన్ని అమలు చేసే పాలకులను ఎంచుకునే ప్రజలపైనే ఆధారపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే చేసిన హెచ్చరికను గుర్తుంచుకోవాలి.' అని సోనియా అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి దాని పునాలుదైన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయాన్ని బలహీనపరుస్తోందని సోనియా ఫైర్ అయ్యారు. కొందరిని లక్ష్యంగా చేసుకుని రాజ్యాంగ సంస్థలతో దాడులు చేస్తున్నారని, కొంతమంది స్నేహితులకే ప్రయోజనం చేకూర్చుతున్నారని ఆరోపించారు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా? -
ఇక్కడి వివక్షే కనిపిస్తుందా?
కొంతమంది నియోదళిత్ మేధావులకు, వామపక్షీయులకు ప్రతి విషయాన్నీ కులం లేదా మత కోణంలో చూసే ధోరణి గత 30 సంవత్సరాలుగా అలవాటైంది. అకడమిక్స్‌లో కూడా ఈ ధోరణి రావడం ప్రమాదకరం. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన కులాలు, ముస్లింలు, క్రిష్టియన్లు, అగ్ర వర్ణాల వారు కూడా వివక్షను ఎదుర్కొంటున్నారు. 130 కోట్ల జనాభాలో, దాదాపుగా 30 కోట్ల మంది దళితులు ఉన్న భారతదేశంలో... కేవలం కొన్ని సంఘటలను చూపించి రిపోర్టులు తయారు చేసి, దేశమంతా వివక్షత ఉందని చెప్పడం ఎంతమాత్రమూ శాస్త్రీయం కాదు. అధర్మమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో దారుణమైన వివక్ష నేటికీ కొనసాగుతోంది. మన నియోదళిత్ మేధావులు వాటిని ఏమాత్రం ప్రస్తావిం చకుండా భారతదేశానికీ, హిందూమతానికీ వ్యతిరేకంగా పని చేసే కొన్ని సంస్థల రిపోర్టుల గురించి మాట్లాడుతున్నారు. రాజీవ్ మల్హోత్ర, అరవిందన్ నీలకంఠన్ రాసిన ‘బ్రేకింగ్ ఇండియా – వెస్ట్రన్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ద్రవిడియన్ అండ్ దళిత్ ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకంలో ఇటువంటి విదేశీ సంస్థలూ, అధ్యయన కేంద్రాలూ, ఎన్జీఓలూ వంటివి భారతదేశాన్ని, హిందూమతాన్ని విచ్ఛిన్నం చేయడానికి గత 30 సంవత్సరాలుగా చేస్తున్న ఒక బహిరంగమైన కుట్ర బట్టబయలైంది. ఇక ప్రపంచంలోని వివక్షకు వస్తే మొదటగా అమెరికాలో ఉన్న నల్లజాతీయులపై వివక్ష నేటికీ కొనసాగుతోంది. అయినా వారికి భారతదేశంలో దళితులలాగా రాజ కీయాలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు లేవు. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వివక్ష (అపారై్థడ్) 1992 వరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా జరిగింది. ఇప్పటికి కూడా దక్షిణాఫ్రికాలో వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడగలేదు. 1883 వరకు అమెరికాల్లో నల్ల జాతీయులు బానిసలుగా ఉండేవాళ్ళు, 1970 వరకు అమెరికాలో నల్లజాతీయులకు ఓటు హక్కులేదు. ఇప్పటికీ యూఎస్‌తో సహా అనేక దేశాల్లో జాతి, మతపరమైన వివక్ష ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1930లలో భారత్‌లో షెడ్యూల్డ్ కులాల వివక్షమీద అంబేడ్కర్ పోరాటం చేస్తున్న సమయంలోనే అమెరికాలో కూడా వివక్ష మీద పోరాటం జరుగుతోంది. ప్రముఖ అమెరికన్ నల్లజాతీయుల నాయకులు చానీతో బియాస్, బెంజమిన్ మేస్ లాంటి వారు భారతదేశానికి వచ్చి గాంధీని కలిసి వివక్షతపై చర్చలు జరిపారు. 1938లో హోవర్డ్ తురిమెన్ అనే ప్రముఖ నల్ల మతాధికారి అమెరికాకు వచ్చి పోరాటం సాగించాలని గాంధీని కలిసి విన్నవించారు. ప్రముఖ నల్ల జాతి హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్... గాంధీజీనే ఆదర్శంగా తీసుకున్నారు. అలాగే దక్షిణాఫ్రికాలో అపార్థైడ్కు వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలా తదితరులు కూడా మహాత్మా గాంధీనే ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడ నియో దళిత మేధావులు, వామపక్ష వాదులు దాచి పెట్టేదేమిటంటే... పైన పేర్కొన్న నాయకులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్‌ను కలవలేదు. వీరెవ్వరు కూడా ఆయా దేశాల్లో రిజర్వేషన్లు కోరలేదు. ఎందుకంటే ఈక్వాలిటీ అనే యూనివర్సల్ ప్రిన్సిపుల్‌కు రిజర్వేషన్లు అనేవి బద్ధ వ్యతిరేకం కాబట్టి. దేశం 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో కొన్ని శతాబ్దాల కాలం వెనుకబడింది. 1951 నాటికి అక్షరాస్యత కేవలం 16.7 శాతం. గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, కాబట్టి కేవలం దళితులే కాదు అన్ని కులాల వాళ్ళు, మతాల వాళ్ళు వెనకబడే ఉన్నారు. దళితుల పరిస్థితి ఇంకా దయనీయమనే చెప్పాలి. అయితే ల్యాండ్ సీలింగ్ వల్ల వచ్చిన భూమిలో 46 శాతం దళితులకే వచ్చింది. అయినా ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. (క్లిక్ చేయండి: నిరసనకారులకు గుణపాఠమా?!) - డాక్టర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్, చరిత్ర విభాగం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం -
చిచ్చుపెట్టే వారితో జాగ్రత్త! మోసపోతే గోసే..
సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘‘కొందరు దేశాన్ని కులం మతం పేరిట విడదీస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లితే కోలుకోవడం చాలా కష్టం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చైనా, సింగపూర్, కొరియా దేశాల్లోలాగా కుల మత రహిత దేశంగా ముందుకు సాగాలి..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో నిర్మించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఆ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలి: దేశంలో అనేక నదులు, ఎంతో సంపద ఉండి కూడా అభివృద్ధి చెందలేకపోయింది. దేశాన్ని ఏలుతున్న పాలకుల వైఫల్యాలే దీనికి కారణం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసం ఉంది. నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే పార్టీల పట్ల ప్రజలు జాగరూకతతో ఉండాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పార్టీల మాటలకు మోసపోతే గోస పడతాం. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో గత పాలకుల చేతకానితనం, అసమర్థత వల్ల అభివృద్ధికి దూరమయ్యాం. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నేటికీ తీవ్రంగా కరెంట్ కోతలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, కోతల్లేని 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి అద్భుతమైన కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇతర రాష్ట్రాలు తెలంగాణ పథకాలను చూసి నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులను చూసి తమ రాష్ట్రంలోనూ ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండేదని ఇతర రాష్ట్రాల ప్రజలు అంటున్నారు. తలసరి ఆదాయం పెరిగింది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. 2014లో దాదాపు రూ.లక్ష తలసరి ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.2,78,500కు పెరిగింది. ఇది దేశంలోనే అత్యధికం. తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని నేను ఉద్యమకాలంలోనే చెప్పిన. అదిప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఇవాళ రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లకు పెరిగి దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది ఆషామాషీగా ఏమీ జరగలేదు. కడుపు కట్టుకొని పనిచేయడం, అవినీతి రహిత పాలన అందించడం వల్లే సాధ్యమైంది. రాష్ట్రంలో 2,601 రైతు వేదికలను 6 నెలల వ్యవధిలోనే నిర్మించుకోవడం, 11 వేల క్రీడా ప్రాంగణాలనూ అనతి కాలంలోనే ఏర్పాటు చేసుకోవడం సుపరిపాలనతోనే సాధ్యమైంది. పరిపాలన ప్రజలకు ఎంత చేరువగా ఉంటే అంత చక్కగా పనులు జరుగుతాయి. అందుకే 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని, నూతన కలెక్టరేట్లను ప్రారంభించుకుంటున్నాం. సంక్షేమంలో నంబర్ వన్‌గా ఉన్నాం దేశంలో సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. రాష్ట్రంలో ప్రస్తుతం అందిస్తున్న 36 లక్షల పింఛన్లకు అదనంగా మరో 10 లక్షలు కలిపి మొత్తం 46 లక్షల పింఛన్లు అందిస్తున్నాం. ఇవి ఎప్పుడో అందించాల్సింది. కానీ కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. త్వరలోనే వారందరికీ డిజిటల్ కార్డులు జారీ చేస్తాం. గతంలో వృద్ధులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పరిస్థితి కనిపించేది. కానీ ఆసరా పింఛన్ల పుణ్యామా అని అత్త, అమ్మలకు డిమాండ్ పెరిగింది. ఇవాళ రూ.30 వేల నుంచి రూ.50 వేల దాకా వారి సంచిలో ఉంటుండటంతో ఎవరికీ భారం కాకుండా బతుకున్నారు. అందుకు కారణం తమ పెద్ద కొడుకు కేసీఆరేనని భావిస్తున్నారు. త్వరలో డయాలసిస్ రోగులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకుల విద్యాలయాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటిలో చదువుతున్న విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. కరోనా కారణంగా మరికొన్నింటిని ప్రారంభించలేకపోయాం. గతంలో తెలంగాణ జనం పస్తులు ఉండలేక దుబాయ్, బొంబాయిలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల నుంచి 13 లక్షల మందికిపైగా తెలంగాణకు వలస వచ్చి జీవిస్తున్నారు.’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో పరిణామాలను గమనించాలి 60ఏళ్ల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేది. అందుకే 58ఏళ్ల పాటు ఎన్నో గోసలు పడ్డాం. ఇప్పుడు పూర్తి జాగ్రత్తతో ఉండాలి. దేశంలో జరిగే పరిణామాలను గమనించాలి. పత్రికల్లో వచ్చే వార్తలను చూసి వదిలేయకుండా వాటిపై గ్రామాల్లో, బస్తీల్లో సైతం చర్చ జరగాలి. అప్పుడే చైతన్యవంతమైన సమాజ పురోగతి సాధ్యమవుతుంది. మేడ్చల్ అభివృద్ధికి రూ.70 కోట్లు హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ జిల్లా చాలా భాగం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నా.. మిగతా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ నిధులు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలు తనకు విన్నవించారని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనితో అదనంగా ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున 7 నియోజకవర్గాలకు రూ.70 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై గురువారమే జీవో జారీ చేస్తామన్నారు. కాగా.. సభకు ముందు కొత్త కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, భవన సముదాయాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, వివేకానంద, కృష్ణారావు, భేతి సుభాష్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు -
ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!
‘‘ప్రేమ లేని జగత్తు చచ్చిన ప్రపంచమే! ఎవరి పనిలో వారు బందీలై, బాధ్యతలు మోస్తూ ఉన్నప్పుడు ప్రేమపూర్వకమైన పల కరింపు, స్పర్శ స్వర్గతుల్యమవుతుం’’దన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త ఆల్బర్ట్ కామూ. విశ్వ ప్రేమ, కరుణ గురించి అద్భుతమైన సందేశమిచ్చిన బుద్ధుడు, ఒక్కొక్కసారి తర్కాన్ని పక్కనపెట్టి, వెంటనే చేయాల్సింది చెయ్యాలని హితవు పలికాడు. సమాజం భ్రష్టుపట్టి పోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు– నిజమే! కానీ మానవత్వంగల మనుషులు కొందరైనా ఉన్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్‌లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లలో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. బతికి ఉన్న తాబేళ్లను కొంటూ ఉంటాడు. బేరమాడి తాబేళ్లన్నిటినీ కొని ట్రక్కులో సముద్రం దాకా తీసుకుపోయి, ఒక్కొక్కటిగా వాటిని మళ్లీ సముద్రంలోకి వదులుతాడు. ఇటీవల 2022 ఏప్రిల్ 2న రాజస్థాన్ జైపూర్‌లో మానవత, మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ళ హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయిన ఆమె, తన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ... ముస్లింలు అధికంగా ఉండే వీధిలో బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఒక రోజు హిందూ వర్గానికి చెందిన వారు శోభా యాత్ర ఊరేగింపు తీస్తూ... అక్కడ ఉన్న 13 మంది ముస్లింల వెంటపడ్డారు. అదంతా గమనించిన మధూలిక ముస్లింలను తన కొట్టులోకి పంపి, షట్టర్ వేసేసింది. ‘మానవత్వమే అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు సాయం చేశాననీ– మతాల కన్నా మనుషులే ముఖ్యమని’ ఆమె అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలామంది ముస్లింలే. 2022 ఏప్రిల్ 17న తన కొడుకు పెళ్లికి మిత్రులందరినీ పిలిచాడు. అవి రంజాన్ రోజులు గనుక, రోజా పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం ప్రత్యేక వసతులు కల్పించాడు. నమాజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. ఒక హిందువుల వివాహ వేడుకలో ముస్లింల కోసం రంజాన్ ఏర్పాట్లు చూసి అతిథులంతా ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యారు. ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లా తన మజీద్‌లో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. కోళిక్కోడ్‌లో మసీదు ఉన్న ఓ వీధి చివరలో ఒక హిందూ మహిళ ఉంటోంది. ఆమెకు ఈడొచ్చిన కూతురు ఉంది. కానీ ఆ మహిళ కూతురి పెండ్లి చేయలేకపోతోంది. అమ్మాయిని ప్రేమించిన కుర్రాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ అతడి కుటుంబం ఘనంగా పెళ్లి చెయ్యాలన్నది. కానీ ఆమెకు అంత తాహతు లేదు. తనకు ఉన్న పరిచయం కొద్దీ ఓ రోజు ఆమె ముల్లాకి తన గోడు వెళ్లబోసుకుంది. ఆయన పెండ్లి జరిపించి, వందమందికి భోజనాలు పెట్టించే బాధ్యత తనమీద వేసుకున్నాడు. తమ మసీదులోని విశాలమైన ప్రాంగణంలోనే పెళ్లి అన్నారు! ‘‘మేళతాళాలు కూడా నేనే మాట్లాడతాను. ఒక్క పంతులు గారిని మాత్రం పిలుచుకుని, మీ పద్ధతిలో మీరు నిరభ్యం తరంగా పెండ్లి జరిపించుకోండి!’’ అని అన్నాడు. ఆ విధంగా ఒక హిందూ వివాహానికి మసీదు వేదిక అయ్యింది. ఇది కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు 2019లో జరిగింది. ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 2022 ఏప్రిల్ 21 మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముస్లింలు చర్చిలో నమాజ్ చదివారు. ఇఫ్తార్ విందు కోసం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే అక్కడి చర్చ్ ఫాదర్ ఆ విందును అంగీకరించడమే కాకుండా– ఆ ఇఫ్తార్ విందును తన చర్చ్‌లోనే నిర్వహించాలని సూచించాడు. అందువల్ల ముస్లింలంతా చర్చ్‌లోనే నమాజ్ చేసుకున్నారు. చర్చ్ ఫాదర్ కూడా ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ఇక్కడ చెప్పుకున్న అన్ని సంఘటనలకూ ఒక అంత స్సూత్రం ఉంది! ‘‘మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. మన చివరి గమ్యం మా‘నవ’వాదం’’ దీన్ని సాధించడానికి... ఇలా మెల్లగా అడుగులు పడుతున్నాయేమో? ఇలా తరతమ భేదాలు మరిచి, మత విద్వేషాలు రేపి, మారణహోమం సృష్టించే వారి ఆట కట్టిస్తారేమో! అందుకే చేగువేరా అంటాడు – ‘‘మన మార్గం సుదీర్ఘమైనది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. 21వ శతాబ్దపు స్త్రీ, పురుషుల్ని – అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజువారీగా కృషి చేస్తూనే ఉండాలి’’ అని! వ్యాసకర్త: డాక్టర్ దేవరాజు మహారాజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త -
హిజాబ్... తప్పనిసరి మతాచారం కాదు
బెంగళూరు: హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాదని కర్ణాటక హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రభులింగ్ నావడ్గీ వాదించారు. చట్ట ప్రకారమే ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై ఉత్తర్వు ఇచ్చిందని, ఇందులో అభ్యంతరకరమైన అంశమేదీ లేదని స్పష్టం చేశారు. ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హిజాబ్‌కు అనుమతివ్వాల్సిందే.. కర్ణాటకలో శుక్రవారం సైతం పలు ప్రాంతాల్లో ఓ వర్గం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు వచ్చారు. తమను తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టారు. హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపాల్ అనుమతి ఇవ్వడం లేదన్న ఆవేదనతో తుమకూరు జైన్ పీయూ కాలేజీ అధ్యాపకురాలు చాందిని తన ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కిన ఉడుపి మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంపీఎం) కాలేజీ 10 రోజుల తర్వాత శుక్రవారం పునఃప్రారంభమైంది. తరగతులు యథాతథంగా జరిగాయి. హిజాబ్‌కు సంబంధించిన కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని సీనియర్ అడ్వొకేట్ ప్రొఫెసర్ రవివర్మ కుమార్ విజ్ఞప్తి చేయగా, కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. -
ధమ్మ పథం: నాలుగు భయాలు
ఆ రోజుల్లో కొందరు గృహస్తులు భిక్షువుల్ని చూసి, వారికి లభిస్తున్న గౌరవాన్ని చూసి, తామూ భిక్షువులుగా మారేవారు. కానీ అక్కడి క్రమశిక్షణ నియమావళి, నైతిక జీవనంలో ఇమడలేక, మోహాన్ని, రాగాన్నీ వదిలించుకోలేక తిరిగి భిక్షుజీవనాన్ని వదిలి పెట్టేవారు. ఇలాంటివారి గురించి బుద్ధుడు చెప్పిన గొప్ప సందేశం ఇది. నీటిలో దిగేవాడికి నాలుగు భయాలు ఉంటాయి. మొదటిది, తరంగ భయం. తరంగం మనిషిని వెనక్కి పడేస్తుంది. ముందుకు పోనీయదు. అలాగే మనస్సులోని అహంకారం కూడా అలాగే వెనక్కి పడదోస్తుంది. ఇతను నాకు చెప్పేవాడు. నాకంటే వయస్సులో చిన్నవాడు. నాకంటే వెనుక వచ్చినవాడు అనే అకుశల భావన అహంకారాన్ని ప్రేరేపించి జలతరంగంలా మనిషిని వెనక్కి నెట్టేస్తుంది. అలాగే.... నీటిలో ఉండే మొసళ్ళ భయం. ఇది చాపల్యానికి చెందిన అకుశల కర్మ. నీటిలో కనిపించని మొసలి వచ్చి, వడిసి పట్టి లోనికి లాగేస్తుంది. ఈ చాపల్యం కూడా అలాగే లాగేస్తుంది. అంతకుముందు తిన్నది ఇప్పుడు తినకూడదు. తాగింది తాగకూడదు. కానీ ఆ రుచి చపలత మనిషిని మొసలి పట్టు పట్టి వెనక్కి లాగేస్తుంది. అందుకే ఇది మకర భయం. ఇక మూడోభయం సుడిగుండ భయం. సుడిగుండం వేగంగా తనలోకి లాక్కు పోయి, గిరగిరా తిప్పేసి ముంచేస్తుంది. అలాగే గతంలో అనుభవించిన విలాసవంతమైన జీవితం తాలూకు సౌకర్యాలన్నీ మనల్ని సుడిగుండంలా చుట్టుముడతాయి. నాలుగో భయం సొరచేప భయం. మనిషిని పట్టి కత్తిరించి సొరచేప ఎలా మింగేస్తుందో కామం కూడా అలాగే మింగేస్తుంది. అలంకరణలు, అందచందాలను చూసి అదుపు తప్పిన భిక్షువు చివరికి ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఈ కామరాగాన్ని అదుపుచేయని వ్యక్తి కూడా మింగివేయబడతాడు. అంటే పూర్తిగా ఉనికినే కోల్పోతాడు.ఆదర్శ మార్గంతో నడిచే వ్యక్తికి అపాయాన్ని కలిగిస్తాయి నాలుగు భయాలు. అందుకే ఈ నాలుగింటి పట్ల భయంతో ఉండాలి. వాటికి చిక్కుపడకుండా ఉండాలి. అందుకు జాగరూకత కలిగి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి చిరకీర్తిని పొందుతాడు. పరిపూర్ణుడవుతాడు. చివరికంటూ ఆదర్శమూర్తిగా మిగులుతాడు.ధార్మికుడు తప్పనిసరిగా తన జీవితంలో ఊహించుకోవాల్సిన నాలుగు భయాలు ఇవి. వీటిని జయించినవాడు అసలైన యోధుడు. తనను తాను జయించుకున్న జితేంద్రియుడు. చదవండి: chaganti koteswara rao: బతుకుబాటకు దారిదీపం -
మత మార్పిడుల పర్యవసానం....?
సాక్షి, న్యూఢిల్లీ : చట్ట విరుద్ధమైన మత మార్పిడులను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 24వ తేదీన తీసుకొచ్చిన కొత్త చట్టం పర్యవసానాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గత జూలై నెలలోనే పెళ్లి చేసుకున్న రషీద్ అలీ, పింకి డిసెంబర్ ఐదవ తేదీన తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకునేందుకు రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు వారిపై బజ్రంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా రషీద్ అలీని అరెస్ట్ చేసి జైలుకు పంపించి, పింకీ షెల్టర్ హోమ్‌కు పంపించారు. దాడిలో గాయపడిన కారణంగా షెల్టర్ హోమ్‌లో పింకీకి గర్భస్రావం అయింది. ‘నేను మేజర్‌ను నాకు 22 ఏళ్లు. నేను ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. గత జూలై 24వ తేదీన మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్లై అయిదో నెల నడుస్తోంది. దయచేసి మమ్మల్ని వదిలి పెట్టండి’ అంటూ పింకీ ప్రాధేయ పడినా బజరంగ్ దళ్ కార్యకర్తలుగానీ, పోలీసులు వినిపించుకోలేదంటూ సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆమె దాడి వీడియోను సర్కులేట్ చేశారు. దేశంలో ఎప్పటి నుంచో దళితులు, వెనకబడిన వర్గాల మత మార్పిడులు కొనసాగుతున్నాయి. సమాజంలో దళితులను చిన్న చూపు చూస్తున్నందుకు నిరసనగా సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 1956లో ఓ దళిత బృందంతో కలసి బౌద్ధం మతంలోకి మారారు. తమిళనాడులో మారవ సామాజిక వర్గానికి చెందిన భూస్వాముల అణచివేతకు నిరసనగా 1981లో ఆ రాష్ట్రంలోని మీనాక్షిపురంలో వెయ్యి మంది దళితులు ఇస్లాం మతం పుచ్చుకున్నారు. 2002లో హర్యానాలోని జాజ్జర్లో చనిపోయిన ఆవును దాచారన్న కారణంగా ఐదుగురు దళితులపై జరిగిన దాడికి నిరసనగా వందలాది దళితులు బౌద్ధ మతంలోకి మారారు. గత అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో వాల్మీకి కులానికి చెందిన దళిత యువతిని అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు రేప్ చేసి, హత్య చేసినందుకు వాల్మీకి కులానికి చెందిన 200 మంది దళితులు బౌద్ధంలోకి మారారు. యూపీ తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఇలాంటి మత మార్పిడులన్నీ చట్ట విరుద్ధం అవుతాయని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వల్ల ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైతే చట్ట ప్రకారం గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష పడుతుందని, అదే మతం మారితే పదేళ్లు జైలు శిక్ష వేయడం ఏమేరకు సముచితమని వారు ప్రశ్నిస్తున్నారు. Moradabad love jihad case: Woman says that she has suffered miscarriage. She wants her husband and brother-in-law to be released by @Uppolice @Benarasiyaa pic.twitter.com/xJ80d3kIrU — Kanwardeep singh (@KanwardeepsTOI) December 15, 2020 -
కొండపైన దర్శనం...లోయల్లో సేవా సాఫల్యం...
యేసుప్రభువు గలిలయ సముద్ర తీరంలోని ఒక కొండ పైన చేసిన ప్రసంగంలో మానవాళికి ‘పరలోక ధన్యత’ను ప్రకటించాడు. పేదరికం, శ్రమలు, లేమి, ఆకలిదప్పుల వంటి ఎలాంటి సామాజిక అపశ్రుతులకు, ప్రతికూలతలకూ తావులేని ‘దేవుని రాజ్యాన్ని ‘తన కొండ మీది ప్రసంగం’ ద్వారా ఆవిష్కరించాడు. అక్కడినుండి ఆరంభమై, మరో కొండయైన గొల్గొతాపై జరుగనున్న తన సిలువ యాగం దాకా సాగనున్న‘మానవాళి రక్షణ మార్గ ప్రయాణం’లో మజిలీగా శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురిని వెంటతీసుకొని రూపాంతర కొండగా పిలిచే మరో కొండకు యేసుప్రభువు వెళ్ళాడు. అక్కడ యేసుప్రభువు ఆ ముగ్గురికీ తన పరలోక మహిమ రూపాన్ని చూపించాడు. పాత నిబంధన నాటి మోషే, ఏలీయా కూడా కొండ మీదికి దిగి రాగా అక్కడ యేసుప్రభువుతో వారి ‘శిఖరాగ్ర సమావేశం’ జరిగింది. అయితే యేసుప్రభువు, మోషే, ఏలీయాలు పాల్గొన్న అత్యంత ప్రాముఖ్యమైన ఆ ఆధ్యాత్మిక శిఖరాగ్ర సమావేశానికి దేవుడు పేతురు, యాకోబు, యోహానులనే అల్ప మానవులను కూడా పిలవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. యేసు దేవస్వరూపుడు, మోషే ధర్మశాస్త్ర యుగానికి ప్రతినిధి, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి కాగా, మరి పేతురు, యాకోబు, యోహాను ఎవరికి ప్రతినిధులు? యేసుప్రభువు తన సిలువ యాగం ద్వారా ఆవిష్కరించబోతున్న సరికొత్త దేవుని రాజ్యంలో సభ్యులుగా చేరబోతున్న విశ్వాసులందరికీ ఆనాడు వాళ్ళు ప్రతినిధులు. ఆ శిఖరాగ్ర సమావేశంలో ‘ఇక్కడే ఉండిపోవడానికి పర్ణశాలలు కడతానంటూ’ పేతురు చేసిన వ్యాఖ్యను, ‘ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి’ అంటూ ఈ సమావేశాన్ని నిర్వహించిన పరిశుద్ధాత్ముడు వారినుద్దేశించి ఇచ్చిన ఆజ్ఞను సువార్త భాగాలు ప్రస్తావించాయి. లోక మలినానికి దూరంగా ఉన్నహిమాలయాలతో సహా మహా పర్వతాల్ని ఆధ్యాత్మిక స్థావరాలుగా అన్ని మతాల్లాగే యూదు మతం కూడా పరిగణించేది. గొప్ప ఆధ్యాత్మిక దర్శనాలను దేవుడు తన ప్రజలకు కొండ పైన ఇస్తాడు. కానీ ఆ దర్శనాల నెరవేర్పు కోసం‘సేవా క్షేత్రాలను’ మాత్రం కొండ కింది లోయల్లోని సామాన్య ప్రజల సమక్షంలో చూపిస్తాడు. ’కొండ మీదే ఉండిపోదాం’ అని ఎవరికి, మాత్రం ఉండదు? పేతురుకు కూడా అలాగే అనిపించింది, కానీ ‘దర్శన సాఫల్యం’ మాత్రం లోయల్లోని పాపులు, కరడు గట్టిన నేరగాళ్లు, దుర్మార్గులకు దేవుని ప్రేమను ప్రకటించడంలో ఉందని, అందుకు యేసు మాట వినండని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవుని పక్షంగా మాట్లాడటం అంటే ప్రసంగించడం అందరికీ ఇష్టమే, కానీ దేవుని మాటలు వినడమే చాలా కష్టం. కానీ యేసు తన తండ్రి మాటలు విని, లోబడి లోయల్లోకి దిగి వెళ్లి వారిని ప్రేమించి ప్రాణత్యాగం చేశాడు. పేతురు, యాకోబు, యోహాను కూడా భూదిగంతాలకు వెళ్లి దేవుని ప్రేమను ప్రకటించి హత సాక్షులై తమ దర్శనసాఫల్యం పొందారు. అలా లోయల్లోని గొంగళిపురుగులను తమ అద్భుతమైన పరిచర్యతో విశ్వాస పరివర్తన చెందిన సీతాకోక చిలుకలుగా మార్చడానికి ఆనాటి రూపాంతర పర్వత శిఖరాగ్ర సమావేశం దిశానిర్దేశం చేసింది. కేవలం యూదులకే అంతవరకూ పరిమితమైన విశ్వాస జీవితం, నాటి రూపాంతరానుభవపు సార్వత్రిక దర్శనంతో, సర్వలోకానికి వర్తించే అపూర్వ ప్రేమమార్గమైంది. స్వనీతి, తామే జ్ఞానులం, తామే అధికులమన్న అహంకారానికి ప్రతీకగా మారిన యూదులు అనే గొంగళిపురుగు నుండే, సాత్వికత్వం, ప్రేమ, క్షమా అనే ఆత్మీయ సౌందర్యానికి ప్రతీకగా ‘క్రైస్తవం’ ఆవిర్భవించింది. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం ఇ–మెయిల్: prabhukirant.@gmail.com -
దేవుని అండతోనే మహా విజయాలు!!
కండబలంతోనే బతికేటట్లయితే, దేవుడు సృష్టించిన ఈ విశాల విశ్వంలో ఈగలు, దోమల్లాంటి అల్పజీవులకు అసలు తావుండేది కాదు. ఏలా లోయలో ఫిలిష్తీయులతో భీకరయుద్ధం జరుగుతుంటే, ఇశ్రాయేలీయుల సైనికులైన తన ముగ్గురు అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దావీదు యుద్ధభూమికి వెళ్ళా డు. అక్కడ ఫిలిస్తీయుడైన గొల్యాతు అనే మహాబలుడు తన కండలు ప్రదర్శిస్తూ, ధైర్యముంటే వచ్చి తనతో తలపడమంటూ సవాలు చెయ్యడం, ఇశ్రాయేలీయులంతా అతనికి జడిసి గుడారాల్లో దాక్కోవడం దావీదు చూశాడు. గొల్యాతు రూపంలో ‘భయం’ రాజ్యమేలుతున్న యుద్ధభూమిలో, విశ్వాసులుగా నిర్భయంగా జీవించాల్సిన, రోషంతో యుద్ధం గెలవాల్సిన ఇశ్రాయేలీయులు తమ విజయం పైన, ప్రాణాలపైన ఆశలొదిలేశారు, దేవుణ్ణి కూడా వదిలేశారు, వాళ్ళ రాజైన సౌలయితే, అంతా వదిలేసి గడగడలాడుతూ కూర్చున్నాడు. ఆ స్థితిలో దావీదు గొల్యాతుతో తాను యుద్ధం చేస్తానన్నాడు. బక్కగా, పీలగా, ఇంకా లేత ప్రాయంలో ఉన్న దావీదు ఏ విధంగానూ గొల్యాతుకు సమఉజ్జీ కాదనుకున్నారంతా. అయితే తనతో దేవుడున్నాడన్న కొండంత విశ్వాసంతో, దావీదు అందరి అంచనాలను ముఖ్యంగా శత్రువుల అంచనాలను తలకిందులు చేస్తూ, వడిశెల రాయితో గొల్యాతును మట్టికరిపించి అతని కత్తితోనే అతని శిరచ్ఛేదనం చేశాడు, దేవుని ప్రజలకు గొప్పవిజయాన్ని అనూహ్యంగా సాధించి పెట్టాడు. దేవుడెంత శక్తిమంతుడో, గొప్పవాడో ఇశ్రాయేలీయులందరికీ తమ పూర్వీకులు చెప్పిన విషయాల ద్వారా తెలిసినా, దేవుని బాహుబలం తమను కూడా నాటి యుద్ధంలో గెలిపిస్తుందన్న ‘ఆచరణాత్మక విశ్వాసం’లోకి వారు ఎదగలేకపోయారు. అయితే దేవుడు తనతో ఉండగా శత్రువుల బలం, మారణాయుధాలు, వీటన్నింటికీ అతీతమైన విజయం తన సొంతమని నమ్మిన ‘ఆచరణాత్మకవిశ్వాసం’తో దావీదు యుద్ధాన్ని గెలిపించాడు. నేలలో పడ్డ ఒక ‘ఆవగింజ’ అతి చిన్నదే అయినా, కొన్ని రోజుల్లోనే మట్టిపెళ్ళల్ని, రాతి కుప్పల్ని పెకిలించుకొని పైకొచ్చి వృక్షంగా ఎదుగుతుంది. ప్రతి విశ్వాసిలో కూడా దేవుడు నిక్షిప్తం చేసిన కార్యసాధక మహాశక్తి ఇది. ఆవగింజలోని ఈ శక్తి దేవుడిచ్చే తేమ, సూర్యరశ్మితో వృక్షరూపం దాల్చినట్టే, దేవుని సహవాసం, ప్రేమ, సాయం తోడైన మన విశ్వాసంతో మహాద్భుతాలు జరుగుతాయన్నది బైబిల్ చెప్పే గొప్ప సత్యం. మారణాయుధాలతో, కండబలంతో కాక, దేవుని పట్ల గల అచంచల విశ్వాసమనే మహాయుధంతోనే వాటిపై విజయం సాధించగలమన్నది ఈ దావీదు ఉదంతం తెలిపే వెల లేని ఆత్మీయ పాఠం. – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
ఆవగింజంత విశ్వాసంతో అనూహ్యమైన దీవెనలు
ఎలీషా ప్రవక్త శిష్యుల్లో ఒకాయన చనిపోవడంతో అతని కుటుంబమంతా రోడ్డున పడింది. విధవరాలైన అతని భార్య అప్పుతీర్చలేదని తెలిసి, అప్పులవాళ్ళు ఆమె కొడుకులిద్దరినీ తమకు బానిసలుగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. చివరికి ఇంట్లో భోజనానికి గడవడం కూడా ఇబ్బందే అయ్యింది. రోజూ సమస్యలతోనే ఆరంభమై సమస్యలతోనే ముగుస్తున్న ఎంతో విషాదమయ జీవితం ఆమెది. ఎన్నో సమస్యలు నెత్తినపడిన అశక్తత, దిక్కుతోచని స్థితిలో, ఎలీషా ప్రవక్త ’నేను నీకేమి చెయ్యాలని కోరుకొంటున్నావు? నీ వద్ద ఏముంది?’ అనడిగాడు. ’కుండలో కొంచెం నూనె ఉంది’ అని ఆమె జవాబిచ్చింది. ’వెళ్లి అందరి వద్దా వంట పాత్రలు అరువు తెచ్చుకొని వాటిలో ఆ నూనెను పొయ్యడం ఆరంభిస్తే ఆ పాత్రలన్నీ నూనెతో నిండుతాయని, ఆ నూనె అంతా అమ్మి అప్పులు తీర్చుకొని, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బతకమని ఎలీషా చెప్పగా, ఆమె అలాగే చేసింది. అవమానంతో జీవించవలసిన ఆమెను, ఆమె కుటుంబాన్ని దేవుడు ఇలా అనూహ్యంగా స్వాభిమానం, సమద్ధి, ప్రశాంతత వైపునకు నడిపించాడు(2 రాజులు 4:1–7) నీవద్ద ఏముంది? అన్న ఎలీషా ప్రశ్నకు, నా వద్ద ఉన్నవి ఇవీ అంటూ తన సమస్యలన్నీ ఏకరువు పెట్టినా, తన వద్ద ఏమీ లేదని ఆమె జవాబిచ్చినా అక్కడ అద్భుతం జరిగి ఉండేది కాదు. ‘కానీ నావద్ద కొంచెం నూనె ఉంది’ అన్న ఆమె జవాబే పరిస్థితినంతా దేవుడు మార్చడానికి దోహదం చేసింది. మరో విధంగా చెప్పాలంటే, ’ ఇన్ని బాధల్లోనూ ’నా వద్ద ఆవగింజంత విశ్వాసముంది’ అని ఆమె పరోక్షంగా చెప్పింది. ఇంట్లో ఒక అకాల మరణం, అప్పులవాళ్ళ వేధింపులు, పూటగడవని లేమి, ఒంటరితనం, బెదిరింపులు, నిస్సహాయత్వం, భరించలేని వత్తిడి, చుట్టూ అంధకారమే, శూన్యమే తప్ప జీవితం పైన ఆశలేమాత్రం లేని పరిస్థితుల్లో ఆమెకున్న ’ఆవగింజంత విశ్వాసమే’ ఆశీర్వాదాలకు ద్వారం తెరిచింది. జీవితంలో ఏమీ లేకున్నా దేవుడు నాకు పీల్చుకోవడానికి గాలినిచ్చాడు చాలు అన్న సంతప్తి, కతజ్ఞత కలిసిన విశ్వాసమే దేవుని అద్భుతాలకు కారణమవుతుంది. ఆ విధవరాలికున్న ప్రధాన సమస్య డబ్బు లేకపోవడం కాని ఆమెకున్న అతి గొప్ప ఆశీర్వాదం, ఆమెలోని ఆవగింజంత విశ్వాసం. ‘చనిపోయిన నా భర్త భక్తిపరుడు’ అని ఆమె ఎలీషాకు చెప్పింది. తన భర్త విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు తన కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కిస్తాడన్న ఆమె విశ్వాసమే ఆమెను కాపాడింది. వ్యక్తులుగా మనం అశక్తులమే కానీ విశ్వాసులముగా మనం మహా బలవంతులం!! దేవుడు తీర్చలేని కొరతలు, పరిష్కరించలేని సమస్యలు, కూల్చలేని అడ్డుగోడలు తన జీవితంలో ఉండవని విశ్వాసి తెలుసుకోవాలి. చైనాలో మిషనేరీగా గొప్ప పరిచర్య చేసిన హడ్సన్ టేలర్ ఇంగ్లాండ్ లోని తన భార్యకు ఒకసారి ఉత్తరం రాస్తూ, ‘చుట్టూ బోలెడు సమస్యలున్నాయి, జేబులో ఒక చిన్న నాణెం మాత్రమే ఉంది కాని నా గుండెలో దేవునిపట్ల కొండంత విశ్వాసముంది, అందువల్ల ఆనందంగా ఉన్నాను, నువ్వు దిగులుపడకు ’ అని ఆయన పేర్కొన్నాడు. కొండంత అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసంతో లోకాన్నెదుర్కొనవచ్చని యేసుప్రభువే చెప్పాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఈ అసమానతలు ఇంకా ఎన్నాళ్లు?
భారతదేశం నానాటికీ ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా దిగజారడానికి కారణం అవిద్య, అరాచకత్వం, మతతత్వం, స్త్రీ అణచివేత, కులతత్వం, అస్పృశ్యతాచరణ కొనసాగడమే. మోదీ మాటల్లో అంకెలు కనబడుతున్నంత పెద్దగా అభివృద్ధి లేదు. విపరీతమైన ముస్లిం ద్వేషం, అస్పృశ్యుల మీద తీవ్రమైన దాడులు, రాజ్యాంగ నిరసన, ప్రజాస్వామ్య లౌకికవాద భావజాలానికి గొడ్డలి పెట్టుగా మారాయి. భారతదేశంలో మానవ వనరులకు, ప్రకృతి వనరులకు, వ్యవసాయ భూములకు, విద్యావేత్తలకు, విద్యార్జనాపరులకు కొదవలేదు. వృత్తికారులు, దళితులు, ఆదివాసీయులు, ముస్లింలు, ఉత్పత్తి కారకులు వీరిని కులమత భావాలతో నిర్లక్ష్యం చేయడం వల్ల రాను రాను నిరాశా నిస్పృహలు కలుగుతున్నాయి. అలా కలిగించడమే ప్రభుత్వ ధ్యేయంగా మనకు కనిపిస్తుంది. ఆది భారతీయులైన ఆదివాసులు భారతదేశ ఉత్పత్తి రంగానికి పట్టుగొమ్మలు. అయితే భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవన వ్యవస్థల మీద గొడ్డలి వేటు వేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మల్టీనేషనల్ కంపెనీలకు ఆదివాసీలు తరాలుగా చేసుకుంటున్న భూములను, ఆవాసాలను ధారాదత్తం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి రాకపూర్వం ఆదివాసీలు స్వతంత్రులుగా ఉండే వారు. వారి భూములను, ఆవాసాలను బ్రిటిష్ వాళ్ళు ఆ తరువాత నల్లదొరలు కొల్లగొట్టడం ప్రారంభించారు. కొండలను, నదులను రక్షించే సంస్కృతి వారిది. కొండలను తవ్వి పడేసి, నదులను కల్మషం చేసే సంస్కృతి పాలక సంస్కృతి, ఈనాడు గంగా, యమునా నదులన్నీ కల్మషమైపోయి వున్నాయి. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ ప్రధానంగా రాజ్యాంగ నిర్మాణ సభ్యుడయిన జైపాల్ సింగ్ ముండా కృషివలన ఆదివాసుల హక్కులు, వాటి రక్షణకు సంబంధించిన నిబంధనలన్నింటిని రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో చేర్చి, కట్టుదిట్టం చేశారు. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ 1965–66 వరకు భారత పాలక వర్గాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోగా, ఆదివాసుల పట్ల బాధ్యతా రాహిత్యాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో అద్వితీయమైన కార్యాచరణ రూపొందించిన ఆది వాసుల్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మరిం తగా అణగదొక్కడమే గాక వారిని హిందుత్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఉపాధి కూలీలుగా వున్న దళితులకు భూమి హక్కు ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వంలో దళితులకు ఒక్క ఎకరం భూమి కూడా పంచకపోగా, లక్షలాది ఎకరాల దళితుల భూమిని భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు కొల్లగొట్టారు. ఇకపోతే అన్ని విశ్వవిద్యాలయాల్లో దళిత, ఆదివాసీ, ముస్లిం విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ జరుగుతుంది. భావజాల పరంగా, భౌతి కంగా విశ్వహిందూ పరిషత్ వారు దళిత విద్యార్థులను హింసిస్తున్నారు. దళితుల హక్కుల్ని కాలరాసే క్రమంలో హిందువులు కాని వారు భారతీయులు కాదని రెచ్చగొట్టి అగ్రవర్ణ విద్యార్థుల్లో హింసా ప్రవృత్తిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దళిత విద్యార్థులు సివిల్స్ రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించినా వారిని ఇంటర్వూ్యల్లో తప్పించే అగ్రవర్ణ ప్యానల్స్‌ని రూపొందిస్తున్నారు. దళిత విద్యార్థులను ఇంటర్వూ్యల్లో తప్పించి, మీరు అత్యున్నత అధికార పదవులకు పనికి రారు అనే మనుస్మృతి సూత్రాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ విషయాన్ని అఖిల భారతీయ దళిత్ అండ్ ముస్లిం ఫ్రంట్ యు.పి.యస్.సి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. అత్యధిక మార్కులు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం విద్యార్థులను కుల ద్వేషంతో వర్ణ ద్వేషంతో ఎలా తప్పించిందో ఆ వివరాలన్నీ సమాజం ముందుకు తెచ్చింది. భారత్‌లో ప్రజలందరిని, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విద్యారంగాల్లో సమపాళ్ళతో చూడవలసిన అవసరం వుంది. ఉత్పత్తి శక్తులపైన బహుజనులను నిర్లక్ష్యం చేయడం వలన దేశం అభివృద్ధి చెందదు. నిన్నటి వరకు సుజనా చౌదరి, రమేష్‌ల మీద సీబీఐ దాడులు నిర్వహించి, ఈ రోజున వారిని బీజేపీలోకి తీసుకోవడంతో బీజేపీ అవినీతి రాజకీయాలకు పతాకలెత్తుతున్నట్టు అర్థం అవుతోంది. అవినీతి కులాధిపత్య కోణంలో ఫిరాయింపుల ప్రోత్సాహంలో కూరుకుపోయిన చంద్రబాబు పరిస్ధితి ఈనాడు ఏమైందో.. అదే రేపు అవినీతి దళిత వ్యతిరేక పాలక వర్గాలకు గుణపాఠం అవుతుంది. నిరక్షరాస్యత దళితుల్లో నేటికీ 70% ఉంది. అనేక గ్రామాల్లో వారిని నీళ్లకోసం చెరువుల్లోకి రానివ్వడం లేదు. దళితులపై అత్యాచారాలు ముమ్మరం అవుతున్నాయి. లౌకిక, సామాజిక శక్తులన్నీ ఏకమై తమ హక్కుల కోసం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పోరాడాల్సిన సందర్భమిది. అప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నెరవేరతాయి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695 డా: కత్తి పద్మారావు -
షమీ మతాన్ని ప్రస్తావించిన రజాక్
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంగ్లండ్‌పై గెలిస్తే పాక్ సెమీస్ చేరేదని కానీ భారత్ కావాలనే ఓడిపోయిందని వారు విమర్శిస్తున్నారు. దీనిపై పాక్ మీడియా చానెళ్లు కూడా ప్రత్యేక డిబేట్లు పెట్టి మరింత నిప్పు రాజేస్తున్నారు. ఈ సమావేశాలో పాక్ మాజీ ఆటగాళ్లు తమ నోటికి పనిచెబుతూ.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని పొగుడుతూ అతడి మతాన్ని ప్రస్తావిస్తాడు. (చదవండి: హార్దిక్‌ను రెండు వారాలు ఇవ్వండి) భారత్ ఓటమి పాలు కావడం, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గల అవకాశాలను దెబ్బతీయడంపై పాక్ న్యూస్ ఛానల్ చర్చాకార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్బంగా ఆ ఛానల్ వారు ఫోన్ఇన్లో అబ్దుల్ రజాక్ అభిప్రాయాలను సేకరించారు. ‘ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా విజయాలను సాధించడంలో మహ్మద్ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. షమీ ముస్లిం కావడం మనకు మంచి విషయం. టీమిండియా మిగిలిన బౌలర్లు విఫలమైన చోట షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్ మ్యాచ్‌లో ఓ వైపు షమీ వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచితే మిగిలిన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు’అంటూ రజాక్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రజాక్ వాయిస్‌గా భావిస్తున్న ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో మతాన్ని లాగడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. రజాక్ ఈ వ్యాఖ్యలతో ఏం చెప్పదల్చుకున్నాడో స్పష్టంగా అర్థమైందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక పాక్ సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ చిత్తుగా ఓడిపోవాలి. దీంతో ప్రపంచకప్ రసవత్తరంగా మారుతోంది. -
ఆ హాస్పటల్లో రోగి తన మతం చెప్పాల్సిందే...
జైపూర్ : సాధారణంగా ఆస్పత్రికి వచ్చిన రోగిని (ఓపీ) పేరు, వయసు, ఏం వ్యాధి అడుగుతుంటారు. కానీ ఈ హాస్పటల్ తీరే వేరు. ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వారి మతం ఏంటో పక్కాగా చెప్పాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. స్థానిక సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రికిలో ఎదురైన ఈ ఘటనతో రోగులు షాక్‌కు గురయ్యారు. తాజాగా ఈ ఆస్పత్రి ప్రవేశపెట్టిన మొబైల్ సేవలలో సంక్షిప్త సందేశం ద్వారా ఓపీ తీసుకోవచ్చు. కానీ ఇందులో తప్పనిసరిగా మతం నమోదు చేయాలని సూచించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైద్యులను సంప్రదించగా కొంత మందికి వారి మతంను బట్టి రోగాలు సంక్రమిస్తాయని అందుకే ఈ విధంగా అడుగుతున్నామని తెలిపారు. వారి మతం తెలిస్తే వారికి వచ్చిన రోగాలకు సులువుగా వైద్యం చేయచ్చనే ఉద్దేశంతోనే ఇలా అడుగుతున్నామే తప్పా ఎలాంటి దురుద్ధేశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో రాజస్థాన్ ప్రభుత్వమే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆయనది ఏ మతం?
మైసూరు: బీజేపీ అధినేత అమిత్‌షా మమ్మల్ని చూసి భయపడుతున్నారు, అందుకే రాష్ట్రంలో నేను ఎక్కడ ప్రచారాలు నిర్వహించినా వెంటనే అమిత్‌షా కూడా అదే ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. గురువారం మైసూరు నగరానికి చేరుకున్న సీఎం మీడియాతో మాట్లాడారు. ‘హిందూ మతాన్ని విభజించడానికి కుట్రలు చేస్తున్నామంటూ మాపై పదేపదే ఆరోపణలు చేస్తున్న అమిత్‌షా ముందు హిందూ మతానికి చెందిన వారో లేదా జైన మతానికి చెందినవారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. గత ఏడాది నంజనగూడు, గుండ్లుపేట నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప తదితర నేతలు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఏమైందో అమిత్‌షా తెలుసుకోవాలి. అవే ఫలితాలు మే12న జరిగే ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయి. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నాకు ఓటమి తథ్యమంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటివరకు చాముండేశ్వరి నుంచి నేను ఏడు సార్లు పోటీ చేస్తే, ఐదుసార్లు గెలిచాను. నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చాముండేశ్వరి నుంచే ఈసారి కూడా పోటీ చేస్తాను. చాముండేశ్వరి నియోజకవర్గం గురించి ఏమీ తెలియకుండా కుమారస్వామి మాట్లాడుతున్నారు’ అని సిద్ధు మండిపడ్డారు. కావేరి భేటీకి వారెందుకు రాలేదు? కావేరీ నదీ జలాలపై నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు చెప్పలేదని, జలాలపై స్కీమ్‌ను మాత్రమే ఏర్పాటు చేయాలని ఆదేశించిందని సీఎం తెలిపారు. కావేరీపై అఖిలపక్ష సమావేశం జరిపితే బీజేపీ ముఖ్యనేతలైన యడ్యూరప్ప,ఈశ్వరప్పలతో పాటు జేడీఎస్ ముఖ్యనేతలు దేవేగౌడ, కుమారస్వామిలు హాజరుకాలేదన్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు అనంతకుమార్,సదానందగౌడలు మాత్రమే హాజరుకాగా కావేరీ నదీ జలాల పంపిణీలో రాస్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇద్దరు మంత్రులకు తెలిపామన్నారు. కాగా, చాముండేశ్వరిలో సీఎం సిద్ధరామయ్య ప్రచారం ఆరంభించారు. మహిళలు హారతి పట్టగా పళ్లెంలో సిద్ధరామయ్య నోట్ల సమర్పించడం ఎన్నికల కోడ్‌ను అతిక్రమించడమేనని విపక్ష నేతలు ఆరోపించారు. -
కేరళ విద్యార్థుల సంచలన నిర్ణయం
తిరువనంతపురం : రోజు ఏదో ఒక చోట కులం, మతం పేరిట గొడవ పడే రోజుల్లో కేరళ విద్యార్థులు కుల, మత, రహిత సమాజం వైపు తొలి అడుగు వేశారు. బుధవారం ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఈ విషయాలను బహిర్గతం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్‌లో మంత్రి సి రవీంద్రనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ఇప్పటి వరకూ కేరళ వ్యాప్తంగా 1.24 లక్షల మంది విద్యార్థులు తాము ఏ కులానికి, మతానికి చెందమని పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9వేల పాఠశాలల్లో సేకరించిన సమాచారం ప్రకారం పాఠశాల అడ్మిషన్లలో 1,23,630 మంది కులం, మతం పేరును నింపలేదని మంత్రి తెలియచేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ చదువుతున్న వారిలో మొదటి సంవత్సరంలో 278 మంది, ద్వితీయ సంవత్సరంలో 239 మంది తాము ఏకులానికి మతానికి చెందిన వారిమి కాదంటూ తమ అడ్మిషన్లలో పేర్కొన్నారు. -
ఆలోచింపజేస్తున్న సెహ్వాగ్ ట్వీట్
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో పోస్టులు ఎంత సరదాగా ఉంటాయో.. ఒక్కోసారి అంత ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. తోటి ఆటగాళ్లపై సెటైర్లు వేయటమే కాదు.. సామాజిక అంశాలపై కూడా ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో కుల, మతాలపై వీరూ చేసిన ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. వాట్సాప్‌లో గాడ్ (దేవుడు) పేరిట వరల్డ్(ప్రపంచం) అనే గ్రూప్‌ను సృష్టించి.. దానికి మనుషులు, ప్రేమ, మానవత్వాన్ని యాడ్ చేశారు. ఆపై మనుషులు దానికి కులం, మతాల్ని జత చేర్చగా... భరించలేని దేవుడు గ్రూప్ నుంచే ఎగ్జిట్ అయిపోయాడు. దీనిని వీరూ సరిగ్గా సరిపోయేది అంటూ తన ట్విట్టర్లో గురువారం పోస్టు చేశాడు. పాతదే అయినప్పటికీ వీరూ అకౌంట్లో ఇది దర్శనమివ్వటం.. ఆలోచింపజేసేలా ఉండటంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు కూడా మళ్లీ దానిని రీ ట్వీట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. Very apt ! pic.twitter.com/bDBVy2T1YX — Virender Sehwag (@virendersehwag) January 4, 2018 -
మతం పేరుతో భయపెడుతున్నారు: ప్రకాశ్‌రాజ్
చెన్నై: మతం, సంస్కృతి, నైతికత పేరుతో కొందరు ప్రజలను భయపెడుతున్నారంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ శుక్రవారం ఆరోపించారు. ‘నైతికత పేరుతో నా దేశపు వీధుల్లో యువ జంటలపై దాడులు చేయడం భయపెట్టడం కాకపోతే మరేమిటి? గోవధ చేశారేమోనన్న చిన్న అనుమానంతో మనుషులపై సామూహిక దాడులు చేసి హతమార్చడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భయపెట్టడం కాక మరేంటి? అసమ్మతితో చిన్న స్వరం వినిపించినా వారిని బెదిరించడం, దూషించడం అంటే భయపెట్టడం కాదా?’ అని ట్వీట్లు చేశారు. -
కాంగ్రెస్ వల్లే.. అవి జరిగాయా?
సాక్షి, డెహ్రాడూన్ : దేశాన్ని మత, కుల ప్రాతిపదికన మొదట విభజించింది కాంగ్రెస్ పార్టీనేని కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. డెహ్రాడూన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ వల్లే దేశం విడిపోయిందని.. కేవలం మత ప్రాతిపదికన బ్రిటీష్ పాలనలో పాకిస్తాన్‌ను ఏర్పాటుకు సహకరించిందని అన్నారు. అప్పట్లో మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల్లో విభజన తెచ్చిన కాంగ్రెస్ తరువాత కాలంలో.. ఓట్ల కోసం కులాలను చీల్చిందని తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం నిరంతరం దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నించిందని అన్నారు. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాల్లోని ప్రజలకు గతంలో విద్య, ఉద్యోగ, ఉపాధి మార్గాలు లేవని.. ప్రస్తుత మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. -
ఐలయ్యను దేశ ద్రోహిగా గుర్తించాలి
-
ఐలయ్యను దేశ ద్రోహిగా గుర్తించాలి
సాక్షి, కాకినాడ రూరల్ : ఐలయ్య వ్యవహారం చూస్తే దేశ సమైక్యతకే ముప్పు తెచ్చేలా ఉందని, అటువంటి వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి ఆయన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానందస్వామి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీపీఠంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐలయ్య వ్యవహారం హిందూ ధార్మిక వ్యవస్థనే ప్రశ్నించేలా మారిందన్నారు. రూ.లక్ష కోట్లిస్తే ఏదైనా చేస్తానంటూ ఐలయ్య టీవీ షోలో బహిరంగంగా మాట్లాడడం చూస్తే ఆయన దేశద్రోహిగా స్పష్టమవుతోందని చెప్పారు. మతం మారిన ఐలయ్యకు ఇంకో మతాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. దసరా నవరాత్రుల అనంతరం రాష్ట్రంలోని తమ గురువులు, అనుచరులతో చర్చించి ఒక కార్యాచరణను రూపొందించి ఆ దిశగా ఆందోళన చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి ఉన్నారు. -
మతం కాదు... మానవ ధర్మం
ఆత్మీయం బౌద్ధం మతమా లేక దర్శనమా? అని చాలామందికి అనుమానం. దానిని ఏ పేరుతో పిలిచినా తప్పులేదు. ‘బౌద్ధం’ బౌద్ధంగానే ఉంటుంది కాని మారదు. పేరులోనేముంది? మనం ‘మల్లె’ అని పిలిచే పదాన్ని మరేపేరుతో పిలిచినా దాని సుగంధం ఒకటే. మధురంగా ఉంటుంది. రాజకుటుంబంలో జన్మించి, అతిలోక సౌందర్యవతి అయిన భార్యను, ముద్దులు మూటగట్టే కుమారుని పొందాడు గౌతముడు. సుఖభోగాలు పొందడం ఆయనకు అతి సులభమైన పని. అయితేనేం, సర్వమానవ సంక్షేమం కోసం, మానవాళిని దుఃఖ విముక్తులను చేయడం కోసం రాజ్యాన్ని, రాజభోగాలను, సంసార సుఖాలను గడ్డిపోచతో సమానంగా త్యజించి ‘త్యాగం’ అంటే ఇలా ఉండాలి అని చూపిన ఆచరణశీలి. అంతులేని ధనరాశులతో పొందలేని ఆత్మజ్ఞానం అనంతమైన జ్ఞానసాగరంలోని కేవలం ఒక్క బిందువుతోనే అపారంగా పొందవచ్చని గ్రహించాడు. తానేది గ్రహించాడో దానిని బోధించాడు. ఏది బోధించాడో దానినే అక్షరాలా ఆచరించాడు. ఆయన బోధనలు మానవ ధర్మబద్ధమైన, హేతుబద్ధమైన, పవిత్రమైన జీవనానికి Ðð లుగు బాటలు పరిచాయి. శాంతంతో కోపాన్ని, సాత్వికతతో హింసను, దానంతో లోభాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించవచ్చునని, ప్రేమ వల్లనే ద్వేషం నశిస్తుందని ఆయన బోధించాడు. మతమంటే మరేదో కాదు, అన్ని ప్రాణుల పట్ల సానుభూతి కలిగి ఉండడమేనని, అందరినీ ప్రేమించడమే మానవత్వమని నిరూపించాడు. అందువల్ల బౌద్ధమతం అనేకంటే, బౌద్ధం అనడమే సరైనది. -
సమూహమే మతమైపోతే...
సందర్భం ఏం చేసినా గుంపులో కొట్టుకుపోతుంది కనుకనే గుంపుకి తెగింపు ఎక్కువ. తాము చేసిన ఏ చర్యకీ సొంత బాధ్యత ఉండదన్న ధీమా. సమూహం కూడా ప్రశ్నించ వీలులేని ఒక మతంగా స్థిరపడుతున్నపుడు దానిని తప్పక ప్రశ్నించడానికి పూనుకోవాలి. ‘మనిషికో రుచి అంటే మాటలా! ఎక్కువమందికి ఏది నచ్చితే మిగతావాళ్లూ అదే తినాలి.’ ఇళ్లలో వండి వడ్డించేవారు తరచుగా అనేమాట ఇది. ఒక మనిషి ఇష్టాయిష్టాలని అందరి ప్రయోజనంలోనుంచి చూడట మనేది ఒక విలువగా కుటుంబం నుంచే మొదలవుతుంది. అక్కడ నుంచి అది విస్తరించని చోటు లేదు. వ్యక్తులుగా సాధించలేని అనేక విషయాలను మనుషులు గుమిగూడి సాధించారు. మానవ చరిత్ర పొడవునా ఈ విజయాలకు అత్యున్నత గౌరవం ఉంది. సమస్యలు ఎదురైనపుడు అందరొక్కటై చేసిన తిరుగుబాట్లు, విప్లవాలు, తోవ తెలియని చోట్ల చేయి చేయి కలిపి సాగించిన అన్వేషణలు, అనేక ఆలోచనలను కలిపి కుట్టి నిర్మించిన ఆవిష్కరణలు ఒకటా రెండా.. వేలఏళ్లుగా నాగరికతా ప్రస్థానంలో సమూహానిదే పై చేయి. అమెరికన్ రిపబ్లిక్ పతనమై కార్మికోద్యమం బలపడుతుందన్న ఆశతో కాల్పనిక నగరాలను వాస్తవిక పునాది మీద అల్లిన నవల ‘ఉక్కుపాదం’. తిరుగుబాటు చివరి దశలో–చింకిపాతలతో ముళ్ళవలే రేగిన జుత్తుతో లోతుకుపోయిన పొట్టలతో పగిలి కాయలు కట్టిన కాళ్ళూచేతులతో నడిచే అస్థి పంజరాలని నింపుకున్న ఒక బీదరికపు అల.. వీధుల్ని ముంచెత్తివేస్తూ రావడాన్ని జాక్ లండన్ ఎలా వర్ణించాడు! తమ కోసమే జీవితాలను త్యాగం చేసిన విప్లవ నాయకులను తోసుకుంటూ తమ కాళ్ళకింద పడినవారిని కసబిస తొక్కుకుంటూ ప్రాణభీతితో పరుగులు తీసినవారి నిస్సహాయ సమయాలను చదివినపుడు, పీడితుల్ని మానవీయంగా ఉండనివ్వని ఆ స్థితి పట్ల క్రోధం ఎంత ఉన్నా వారందరినీ గుండెలకి హత్తుకున్నాం. అయితే సమూహానికి ఎల్లప్పుడూ పీడిత ముఖమే ఉండదని చరిత్ర చెప్పింది. వర్తమానమూ చెపుతోంది. ఆధిపత్య కులపు స్త్రీలని ప్రేమించిన పాపానికి పునాది కులాల పురుషులని చిత్రవధ చేసి మరీ ప్రాణాలు తీసేది, సినీనాయికలో, డ్యాన్సర్లో నలుగురిలోకీ వచ్చినపుడు వారిని చాటుగా తడిమీ పామీ గిచ్చీ సంతోషపడేది, తమ ఆహా రపు అలవాట్లని కొనసాగించేవారి పెడరెక్కలు విరిచికట్టి వారి నోట మట్టి గొట్టేది, తక్కువ బట్టలు కట్టుకున్న స్త్రీకి బుద్ధి చెప్పడానికి, బట్టలన్నీ ఒలిచి నగ్నంగా ఊరేగిస్తూ సంస్కృతిని పరిరక్షించేది, ఈ సమూహపు మరో ముఖమే. సమూహపు అసలుముఖంపై నీలినీడలు కమ్ముకుని మరోముఖం భయపెడుతున్న దుర్మార్గపు రోజులివి. మూక విజ్ఞత ఏకరూపంలో ఉండదు. అనేక స్వభావాల మనుషుల వలన అడ్డుకట్ట లేని ప్రవాహంలా విశృంఖలంగా పారుతుంటుంది. ఆయా వ్యక్తుల విజ్ఞతని ప్రయోజనకరంగా మలిచి వారందరినీ ఏక తాటిమీదకి తెచ్చే బలమైన కామన్ అంశం ఏదో ఉండాలి. అందరి దృష్టి దాని వైపు మళ్ళించి ముందుకు నడిపే శక్తులు బలంగా ఉండాలి. అటువంటి ఉదాత్తత ఏమీ లేని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఆధిపత్యాన్ని స్థాపించుకోవడానికి, తమకి భిన్నంగా కనిపించేదాన్ని తమకి నచ్చనిదాన్ని అణిచి వేయడానికి ఒక ఎజెండా నిర్మించుకునే సమూహాలు ఉంటాయి. ఈ ఎజెండాకి సహకరించడానికి వాలుకు కొట్టుకుపోయే మనుషులు, మాబ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తులు సిద్ధంగా ఉంటారు. కడుపునిండా తిని కట్టుగుంజకి ఆనుకుని బద్ధకంగా నెమరువేసుకునే ఆవులా, మిగతా సమాజం ఈ ఆటని చూసీచూడనట్లు ఓరకంటితో వీక్షిస్తూ ఉంటుంది. సమూహం ఎప్పుడూ వైబ్రంట్గానే ఉంటుంది. మంచికి మంచి చేయడానికీ చెడుకి మంచి చేయడానికి కూడా. ఏం చేసినా గుంపులో కొట్టుకుపోతుంది కనుకనే గుంపుకి తెగింపు ఎక్కువ. తాము చేసిన ఏ చర్యకీ సొంత బాధ్యత ఉండదన్న ధీమా. బాధ్యత పడాల్సి వచ్చినా తప్పుని నలుగురితో కలిసి పంచుకుంటామన్న ధైర్యం. రక్షణ వ్యవస్థల అలసత్వం, అవసరమైతే ఈ శక్తులకి కొమ్ము కాయడం లాంటి వాటి వల్ల స్త్రీలూ, దళితులు, మైనార్టీ మతాలవారు సమాజంలో స్వేచ్ఛగా ఇప్పటికీ సంచరించలేని స్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో పుండు మీద కారం జల్లుతూ మతవాద శక్తులు వేగంగా ఏకీకృతం కావడం కొత్తబెదురుని సృష్టిస్తోంది. ఈ స్థితిని అదుపు చేసి సమూహాలకి బాధ్యత గుర్తుచేసే పనిని ఎవరు స్వీకరించాలి? తరగతి గదులు పిల్లలందరినీ కలిపి గుచ్చిన పూలమాలల్లాంటివి. వారు వ్యక్తులుగా వికాసం చెందుతూనే సమూహజీవులుగా ఎట్లా మెలగాలో ఉపాధ్యాయులు తాము తెలుసుకుని పిల్లలకి చెప్పాలి. ఇళ్ళు, ప్రయాణాలు, వినోద స్థలాలు, సంతలు, తిరునాళ్ళు, మాల్స్, సభలు సమావేశ మందిరాలు, ఎక్కడెక్కడ మనుషులు కూడుతారో అక్కడల్లా ఎవరి ప్రవర్తనకి వారు బాధ్యత పడాల్సిందేనని, సొంత విజ్ఞత ఉండాల్సిందేనని మనసు పదేపదే గుర్తు చేసేలా శిక్షణ సాగాలి. సమూహం కూడా చివరికి ప్రశ్నించ వీలులేని ఒక మతంగా స్థిరపడుతున్నపుడు దానిని తప్పక ప్రశ్నించడానికి పూనుకోవాలి. మెజారిటీ ఓటరు దేవుళ్ళ సమూహం నిర్ణయించిన నాయకులను నెత్తిన పెట్టుకోలేక నిరంతర ప్రతిపక్షంగా మారడం ఒక తిరుగుబాటు. అనేక ప్రేక్షక మహాశయుల అభిరుచి మేరకి తీసే వ్యాపార సినిమాలను చూడలేక, పుంజీడుమంది కూడా లేని స్లో మూవీ హాల్లో చప్పట్లు కొట్టడం ఒక సూటిప్రశ్న. ఎక్కువమంది పాఠకదేవుళ్ళ మెచ్చుకోళ్ళకి రోసి, నచ్చిన అక్షరాన్ని గుండెనుంచి పెకలించడమొక ఖలేజా. సంస్కృతీ పరిరక్షకులు. దేశభక్తులు, గుంపులో గోవిందమ్మలూ గోవిందయ్యలూ పాడే సామూహిక గీతాల ప్రకంపనలకు చెవులు మూసుకుని మైనారిటీ స్వరాన్ని అట్టడుగు నుంచి తెరవడం ఒక బాధ్యత. మన బాధ్యత. వ్యాసకర్త కార్యదర్శి, ప్రరవే (ఏపీ) ఈ–మెయిల్ : malleswari.kn2008@gmail.com డా. కేఎన్. మల్లీశ్వరి -
నాస్తికులు అందరూ తెలివైన వాళ్లా?
ప్రఖ్యాత శాస్త్రవేత్తలు స్టీఫెన్ హాకింగ్ దగ్గర నుంచి అలన్ ట్యూరింగ్ వరకూ.. ఇలా ప్రపంచంలో చాలా మంది తెలివైన వ్యక్తులందరూ నాస్తికులు. వీరందరూ ఎందుకు నాస్తికులు అయ్యారు?. నాస్తికుడు అయిన ప్రతి వ్యక్తి వీరంత గొప్పగా అవుతారా? లేదా తెలివైన ప్రతి ఒక్కరూ నాస్తికులుగా మారతారా? అనే ప్రశ్నలకు ఉల్స్టర్ ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్, రొట్టర్డమ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. ఈ విషయాలపై అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. మతాన్ని అభిమానించడం లేదా అభిమానించకపోవడం అనేది వ్యక్తి సహజ లక్షణాలపై ఆధారపడివుంటుందని చెప్పారు. తెలివితేటలతో సహజ లక్షణాలను నిలువరింపజేయగల శక్తి వస్తుందని వివరించారు. దీనిపై పూర్తిస్ధాయిలో పరిశోధన కోసం ఇంటిలిజెన్స్-మిస్‌మ్యాచ్ అసోసియేషన్ అనే మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ మోడల్ ద్వారా మతపరమైన సంబంధాలపై తెలివితేటలు గల వ్యక్తులు అనాసక్తిని ఎందుకు ప్రదర్శిస్తారనే విషయాన్ని వివరించేందుకు ప్రయత్నించారు. వ్యక్తి లక్షణాలు, ఒత్తిడిపై కూడా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తెలివైన వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని చెప్పారు. వీరు ఏ పనినైనా ఇట్టే క్షణాల్లో పూర్తి చేయగలరని వివరించారు. -
మతం మాకు చాలా ముఖ్యం!
► భారత్‌లో 80% మంది.. అమెరికాలో 50% మంది వెల్లడి ► మతానికి ప్రాధాన్యతనిచ్చే జనం ఇథియోపియాలో అత్యధికం ► చైనాలో అత్యల్పం.. 100 మందిలో ముగ్గురే మతవిశ్వాసులు ► 2050 నాటికి మారనున్న మత సమీకరణాలు: ప్యూ రీసెర్చ్ సర్వే భారతదేశంలో 80 శాతం మంది ప్రజలు తమ జీవితంలో మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే.. ఇటువంటి వారు ఇథియోపియాలో అత్యధికంగా ఉంటే.. చైనాలో అతి తక్కువగా ఉన్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడిస్తోంది. 2015లో ప్రపంచ వైఖరుల సర్వేలో భాగంగా.. మతం విషయంలో ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయన్నదానిపై అధ్యయనం చేశారు. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా ప్రజల్లో ప్రతి 100 మందిలో 98 మంది మతం తమకు చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నట్లు తేలింది. సర్వేలో ప్రశ్నించిన వారిలో దాదాపు అందరూ ఇథియోపియన్ ఆర్థొడాక్స్ చర్చ్ అనేది తమ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమని బదులిచ్చారు. మరో ఆఫ్రికా దేశమైన సెనెగల్‌లో కూడా దాదాపు ఇదే రకమైన పరిస్థితి ఉంది. మెజారిటీ ముస్లిం మతస్తులైన అక్కడి ప్రజల్లో 97 శాతం మంది మతానికి చాలా ప్రాధాన్యత ఉందని చెప్పారు. ఇక పాకిస్తాన్, ఇండొనేసియా, బుర్కినా ఫాసో తదితర దేశాల్లో 90 శాతానికన్నా ఎక్కువ మంది తమ జీవితంలో మతం చాలా ముఖ్యమైన భాగమని స్పందించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికం అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకన్నా.. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజలకు మతం చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. ఆర్థికంగా శక్తివంతమైన చాలా దేశాల్లో మతం ముఖ్యమైన అంశంగా పరిగణించే జనం 20 శాతం లేదా అంతకన్నా తక్కువగానే ఉన్నారు. ఉదాహరణకు బ్రిటన్, జర్మనీల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మాత్రమే తమ జీవితాల్లో మతాన్ని చాలా ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు. రష్యా, ఆస్ట్రేలియాల్లో ఈ సంఖ్య ఇంకొంచెం తక్కువగా ఉంది. అయితే.. అగ్రరాజ్యం అమెరికాలో సగానికన్నా ఎక్కువ మంది మతాన్ని చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించడం విశేషం. ప్రపంచ దేశాలన్నిటిలోనూ మతాన్ని ముఖ్యమైన విషయంగా పరిగణించే వారి సంఖ్య చైనాలో అతి తక్కువగా ఉంది. అక్కడ ప్రతి 100 మందిలో ముగ్గురు మాత్రమే మతం చాలా ముఖ్యమైనదని చెప్పారు. 2050 నాటికి క్రైస్తవులతో సమానంగా ముస్లింలు... ప్రపంచ జనావరణాలు, జనాభాలు మారుతున్న పరిస్థితుల్లో.. ప్రపంచంలో మత సమీకరణాలు 2050 నాటికి గణనీయంగా మారతాయని అధ్యయనకర్తలు చెప్తున్నారు. అప్పటికి ముస్లింల జనాభా క్రైస్తవుల జనాభాకు సమానంగా పెరుగుతుందని అంచనా. మరోవైపు.. ఏ మతాన్నీ ఆచరించని ప్రజల సంఖ్య పెరగడం నెమ్మదిస్తుందని.. ఫలితంగా ప్రపంచ జనాభాలో ఇటువంటి వారి శాతం మరింత తక్కువ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ► హిందువుల జనాభా 1970లో 46 కోట్లుగా ఉంటే.. 2010 నాటికి 103 కోట్లకు పెరిగింది. ఈ సంఖ్య 2050 నాటికి 138 కోట్లకు పెరుగుతుందని అంచనా. ► క్రైస్తవుల సంఖ్య 1970లో 123 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 217 కోట్లకు పెరిగింది. ఈ జనాభా 2050 నాటికి 292 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► ముస్లింల జనాభా 1970లో 57 కోట్లుగా ఉండగా.. 2010 నాటికి 160 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 276 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ► ఏ మతం ఆచరించని వారి సంఖ్య 1970లో 71 కోట్లు కాగా.. 2010 నాటికి 113 కోట్లకు పెరిగింది. వీరి సంఖ్య 2050 నాటికి 123 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. ► బౌద్ధ మతస్తుల సంఖ్య 1970లో 23 కోట్లు ఉంటే.. 2010 నాటికి 49 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఈ మతస్తుల సంఖ్య అంతే ఉంటుందని అంచనా. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం
-
అందరికీ అభివృద్ధే లక్ష్యం: యూపీ సీఎం
గోరఖ్‌పూర్: కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చూస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక తొలిసారి సొంత పట్టణం గోరఖ్‌పూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగిస్తూ... ఎవరినీ సంతృప్తి పరచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. యూపీ ఎన్నికల గెలుపు సంబరాల్లో అత్యుత్సాహం వద్దని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని బీజేపీ శ్రేణులకు సూచించారు. అలా చేస్తే శాంతి భద్రతలకు అరాచక శక్తులు విఘాతం కలిగించే అవకాశముందన్నారు. అమ్మాయిలతో అబ్బాయిలు కలిసి కనిపిస్తే యాంటీ రోమియో స్క్వాడ్లు ఇబ్బంది పెడుతు న్నాయన్న విమర్శలపై స్పందిస్తూ.. అమా యకుల్ని వేధించవచ్చని పోలీసుల్ని ఆదేశిం చామని చెప్పారు. ఈవ్టీజర్ల వల్ల స్కూళ్లు, కాలేజీలకు వెళ్లలేకపోతున్నామంటూ ఎందరో అమ్మాయిలు తనకు ఫోన్ చేశారని, అందుకే స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్నారు. -
'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తెస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మతపరమైన రిజర్వేషన్లను అమలు కానివ్వమని స్పష్టం చేశారు. పేద ముస్లింల అభివృదికి తాము వ్యతిరేకం కాదన్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే టీఆర్ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తిందని విమర్శించారు. టీఆర్ఎస్ దళితులపై వివక్ష చూపుతోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో తాడో పేదో తేల్చుకుంటామని హెచ్చరించారు. రానున్న మూడు నెలల్లో మండలస్థాయిలో ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. -
మతం కన్నా మానవత్వమే మిన్న
► ఎంపీ వరప్రసాద్ ► సమస్యలపై ముస్లింలంతా ఏకతాటిపై ఉండాలి : భూమన తిరుపతి మంగళం: మనుషులను దూరం చేసే మతం కన్నా ఆత్మీయతతో వారిని ఒక్కటిగా చేసే మానవత్వం ఎంతో గొప్పదని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ఎంఆర్‌పల్లి పరిధిలోని మసీదులో శనివారం ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. సౌత్ఇండియా సయ్యదులు అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జిల్లా హదరీపీఠం పీఠాధిపతి సయ్యద్ షఫీ అహ్మద్‌ఖాదరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా తిరుపతి ఎంపీ వరప్రసాద్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాదరావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఒకరికి మేలు చేయడం తప్ప హాని చేయడం తెలియదన్నారు. అలాంటి వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ముస్లిం సోదరులంతా ఏకతాటిపై ఉంటారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వారి సంక్షేమం కోసం రిజర్వేషన్ లు కల్పించారని.. దాంతో ఎంతో మంది ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా హిందూ– ముస్లింలు సోదరభావంతో మెలగాలని పిలుపునిచ్చారు. గత 1200 సంవత్సరాల నుంచి హిందూ–ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నామని సౌత్ ఇండియా సయ్యదుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ హిల్లారీఫీర్ సామీరి పేర్కొన్నారు. సమావేశంలో ముస్లిం నాయకులు జుభేదఖాదరీ, జాకీర్‌హుసేన్, రఫీ, డాక్టర్ హమీనుల్లా ఖాదరీ పాల్గొన్నారు. -
నా మతంతో నీకేం పని?: సీజేఐ
దేవుడు-మనిషికి మధ్య సంబంధం వ్యక్తిగతం న్యూఢిల్లీ: మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైనదని, దాని గురించి ఇతరులకు పట్టింపు ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. సమాజంలో శాంతికి సహనమే కీలకమని ఆయన నొక్కిచెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారీమన్ జోరాష్ట్రీయనిజం మీద రాసిన పుస్తకం ‘ద ఇన్నర్ ఫైర్, ఫెయిత్, చాయిస్ అండ్ మోడ్రన్ డే లివింగ్ ఇన్ జోరాష్ట్రీయనిజం’ (The Inner Fire, faith, choice and modern-day living in Zoroastrianism)ను జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ భావజాలాల కన్నా మతయుద్ధాల్లోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మతవిశ్వాసాల పేరిట ఈ భూమండలంలో ఎంతో విధ్వంసం, వినాశనం, రక్తపాతం చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘నా మతం ఏమిటి? ఎలా నేను నా దేవుడితో అనుసంధానం అవుతాను? నా దేవుడితో నాకు ఎలాంటి సంబంధం ఉంది? అన్నది ఇతరులకు అవసరంలేని విషయం. మీరు మీ దేవుడితో ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండొచ్చు’ అని అన్నారు. మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైనది. దానికి ఇతరులతో ఏం సంబంధం ఉండదని సీజేఐ స్పష్టం చేశారు. ‘సోదరభావం, సహనం, అన్ని మార్గాలు ఒకే మార్గానికి ప్రయాణించి ఒకే దేవుడిని చేరుకుంటాయన్న ఆమోదనీయ భావం ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తాయి. సుసంపన్నం చేస్తాయి. ఈ విషయంలో రోహింటన్ గొప్ప కృషి చేశారు’ అని జస్టిస్ ఠాకూర్ కొనియాడారు. -
మతం పేరుతో ఓట్లడగటం నేరమా?
కులం, మతం కీలక రాజకీయాంశాలుగా మారాయని వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత రాజకీయాల్లో మతం, కులం కీలకాంశాలుగా మారాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ అంశాన్ని ఎన్నికల చట్టం ప్రకారం అవినీతి చర్యగా భావించవచ్చా? అని బుధవారం ప్రశ్నించింది. ఒక అభ్యర్థి కులం, మతం, జాతి పేరుతో ఓట్లు అడగటాన్ని నేరంగా పరిగణించటం సాధ్యమేనా అని అడిగింది. ఎన్నికల చట్టంలో అక్రమ కార్యకలాపాలపై చర్యలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 123 (3) సెక్షన్ పరిధిపై చర్చ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవ్యక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోంది. నన్ను గెలిపిస్తే మీ అభ్యున్నతికి పాటుపడతాను. నాకు ఓటేయండని అడిగితే తప్పేంటి?’ అని కూడా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజంతా జరిగిన చర్చలో మంగళవారం నాటి ‘హిందుత్వం మతం కాదు, జీవన విధానం’ అనే విషయాన్ని ధర్మాసనం పునరుద్ఘాటించింది. అయితే ‘హిందుత్వ’ అంశాన్ని సుప్రీంకోర్టు తర్వాతైనా మరోసారి చర్చించాల్సిన పరిస్థితి వస్తుందని కక్షిదారుల తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరారు. భారతీయ శిక్ష్మా స్మృతిలోని 153 (ఏ)ను ఉదహరిస్తూ.. మతంపేరుతో ఓట్లు అడగటం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల మధ్య గొడవలు పెట్టేలా వ్యవహరించే వ్యక్తి నేర విచారణకు అర్హుడని సిబల్ కోర్టుకు తెలిపారు. కులం, మతం పేరుతో ఓట్లను రాబట్టుకోవటంలో రాజకీయనేతలు ముదిరిపోయారని.. ఈ పద్ధతికి బ్రేక్ వేయటం తక్షణ అవసరమని కోర్టుకు విన్నవించారు. దీనిపై పలువురి వాదనలు విన్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
ఎన్నికలతో మతానికి ముడిపెట్టొద్దు: సుప్రీం
మతం పేరుతో ఓట్లు అడగడం న్యాయ విరుద్ధమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ గురువారం పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు గానీ, అభ్యర్ధులు గానీ, పార్టీ లేదా అభ్యర్ధి తరఫు వారు మతం పేరుతో ఓట్లు వేయమని అడగకూడదని అన్నారు. 1995లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించిన ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం హిందూ మతం పేరుతో ప్రజలను ఓట్లు వేయాలని కోరచ్చనే తీర్పును కొట్టేసింది. ఎన్నికలు లౌకికంగా జరగాలే తప్ప మతం పేరుతో వాటిని ప్రభావితం చేయకూడదని వ్యాఖ్యానించింది. 2013 డిసెంబర్ లో అమల్లోకి వచ్చిన విశాఖ గైడ్ లైన్స్ ను ఈ సందర్భంగా ఉటంకించిన అత్యున్నత న్యాయస్ధానం హిందూ మతం పేరుతో ఎన్నికల్లో ఓట్లు కోరడంపై నడుస్తున్న వివాదం 20 ఏళ్లుగా పార్లమెంటులో పెండింగ్ లోనే ఉందని, శారీరక వేధింపుల గురించి కూడా ఏళ్లుగా పార్లమెంటు స్పందించడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రచారంలో రామ మందిర నిర్మాణం లాంటి సమస్యలను లేవనెత్తడం కూడా న్యాయవిరుద్ధమని చెప్పింది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్123(3)కింద మతాన్ని చూపుతూ పార్టీలు, అభ్యర్ధులు, పార్టీ లేదా అభ్యర్ధుల కార్యకర్తలు ఓట్లు కోరితే వారిని ఎన్నికల బరిలో నుంచి తప్పించే అవకాశాలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. లౌకికవాదంలోకి మతాన్ని తీసుకురాగాలమా? అంటూ 1994లో మతాన్ని చూపుతూ ఓటు అడగొచ్చని కోర్టులో కేసు వేసిన మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే సుందర్ లాల్ పట్వా తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మతాలకు అతీతంగా ఎన్నికల చట్టాలను తీసుకువచ్చారని చెప్పిన కోర్టు దేశంలో లౌకికవాదం ఫరిడవిల్లేలా త్వరలో తీర్పును ప్రకటిస్తామని తెలిపింది. పట్వా జైన మతానికి చెందిన వారు కాగా ఆయన అనుచరులు ఎన్నికల ప్రచారంలో రామ మందిరాన్ని నిర్మణానికి సాయం చేస్తామని ప్రచారం చెప్పడాన్ని కోర్టు ఈ సందర్భంగా ఉదహరించింది. రాజకీయం, మతం రెండూ వేరని ప్రతివాది తరఫు లాయర్ కు చెప్పింది. -
మతతత్వానికి వ్యతిరేకంగా మానవత ఉద్యమం
– జేఐహెచ్ సద్భావనా సదస్సులో జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా కర్నూలు (ఓల్డ్‌సిటీ): దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా మానవత ఉద్యమం నిర్వహిస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా తెలిపారు. శనివారం రాత్రి స్థానిక సీక్యాంప్ సెంటర్లోని ప్రభుత్వ డ్రై వర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో జేఐహెచ్ సద్భావన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఒకవైపు మతతత్వ వాదం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం నీతులు చెబుతోందని, మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగంలో లేని అంశాలను మాట్లాడుతున్నా ప్రభుత్వపర చర్యలు లేవన్నారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆగస్టు 21వ తేదీ నుంచి సెప్టెంబరు 4 వరకు ‘శాంతి–మానవత’ ఉద్యమం నిర్వహిస్తున్నామని, ఈ ఉద్యమానికి అందరూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. దేశంలో శాంతిని పరిరక్షించేందుకు త్వరలో అన్ని మతాల సభ్యుల ప్రాతినిధ్యంతో పీస్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఫిక్, రాష్ట్ర కమిటీ మెంబర్ ఎస్.ఎ.అమీర్, టీటీడీ రిటైర్డు కోఆర్డినేటర్ వై.సూర్యచంద్రారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్ (బమ్‌సెఫ్), జె.రఘుబాబు (జేవీవీ), ఎంబీ చర్చి సీనియర్ పాస్టర్ విజయకుమార్, ప్యాడ్స్ జిల్లా కన్వీనర్ బాలన్న, జేఐహెచ్ మీడియా ఇన్చార్జి సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
జగద్గురువు ఆదిశంకరులే!
నేడు శంకర జయంతి శంకరులు జన్మించేనాటికి ఆనాటి సమాజంలో బహుదేవతారాధన విస్తృతంగా కొనసాగుతోంది. శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం ఇలా ఎన్నో మతాలు, వాటి ఉపశాఖలు లెక్కకు మిక్కిలిగా వర్థిల్లుతున్నాయి. ఆయా మతాలు, శాఖలు పరస్పర విరుద్ధంగా చెప్పే విషయాలతో అసలు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో, ఆత్మ పరమాత్మ తత్వాల సారమేమిటో, ఏ మతం మంచిదో, ఏ శాఖ చెప్పిన విధానాలను పాటించాలో తెలీని అయోమయ స్థితిలో పడ్డారు సామాన్య ప్రజానీకం. ఆ సమయంలో దశోపనిషత్తుల సారాంశాన్ని రంగరించి శంకరాచార్యులు అద్వైత మతాన్ని స్థాపించారు. ఏ మతాన్ని నిరసించకుండా వారి ఆచారాలను, విధానాలను సంస్కరించి షణ్మత స్థాపకులయ్యారు. ఆయా మతాలన్నిటినీ సమన్వయం చేసి అద్వైతంలో విలీనం చేశారు. పండితుల కోసం శంకర భాష్యాలు, సామాన్యుల కోసం సాధనా పంచకం, ఆత్మబోధలాంటి అజరామరమైన రచనలను అందించారు. పామరుల కోసం వేదాంతం తేలిగ్గా అర్థమయ్యేందుకు వారు సులువుగా పాడుకోగలిగేలా భజగోవిందం లాంటివి రచించారు. ఆయన రచించిన సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారాస్తోత్రం, మహిషాసుర మర్దినీ స్తోత్రం నేటికీ భక్తులు పాడుకుంటున్నారు. ఇంతేకాదు, నిర్వాణ షట్కమ్, కౌపీన పంచకం, సాధనా పంచకం, ప్రశ్నోత్తరి, మణిమాల, నిర్వాణ మంజరి, సార తత్త్వోపదేశం, వివేక చూడామణి, వేదాంత డిండిమ, ఆత్మ షట్కమ్, ఆత్మబోధ తదితరాలనూ అందించారు. ఇతరులకు హితాన్ని బోధించే వ్యక్తే గురువు. అందుకే ఆస్తికులే కాదు, నాస్తికులు కూడా తమకు హితాన్ని బోధించే నిస్వార్థులైన గురువులనే సేవిస్తారు. మన జీవితంలో ధర్మమనే ఒక అసాధారణమైన శక్తి ఉన్నదని నిరీశ్వరవాదులైన బౌద్ధులు కూడా అంగీకరించారు. అటువంటి ధర్మాన్ని జీవితంలో అనుభవానికి అందించే గురువుకు లౌకిక గురువు కన్నా గొప్ప స్థానం సహజంగానే సిద్ధిస్తుంది. అయితే దురదృష్టవశాత్తూ, అటువంటి ధర్మగురువుల పరంపరలో వచ్చిన కొందరు ‘సంకుచిత దృష్టితో ‘మన మతమే సత్యం, మిగతా అంతా పెడదారులు’ అని ఉపదేశిస్తూ వచ్చారు. ఫలితంగా ధర్మం పేరిట కూడా రాగద్వేషాదులు అధికం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ధర్మాలన్నింటినీ సామరస్యం కావించి చూపే ఒక మహాగురువు అవసరం. మిగతా మతాలన్నింటిని తుడిచేసి, దీక్ష లేక శుద్ధి అనే నెపాలతో అందరినీ తమ మతానికి చేర్చుకొని అన్ని మతాలను ఏకం చేస్తే మతసమన్వయం చేకూరుతుందని ఇప్పుడు చాలా చోట్ల భావిస్తున్నారు. అయితే అదే నిజమైన ధర్మమార్గమని చెప్పడానికి వీలుకాదు. నిజంగా ధర్మం బయటి వేషభాషలకు సంబంధించినది కాదు. అది హృదయానికి చెందినది అని గ్రహించాలి. శంకర జయంతిని జరుపుకోవడం నేటికీ జరుగుతోంది. అది చాలదా... ఆయనే జగద్గురువని చెప్పడానికి! - స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ శారదాపీఠం, విశాఖపట్నం -
దళితుల్లో ఆ మతవ్యాప్తి పెరిగిపోతున్నది!
న్యూఢిల్లీ: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబసభ్యులు ఇటీవలే బుద్దిజంలోకి మారారు. దేశంలోని దళిత వర్గాల్లో బౌద్ధమత వ్యాప్తి పెరుగుతున్న ట్రెండ్‌కు ఈ ఘటన అద్దం పడుతున్నది. దళితుల్లో బుద్ధిజం బాగా పెరిగిపోతున్నదని తాజాగా ప్రభుత్వ గణాంకాలు చాటుతున్నాయి. దేశంలో దళిత ఉద్యమం విజయవంతం కావడంలో బుద్ధిజం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాల ప్రజలు బుద్ధిజం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2001లో బుద్ధిస్టు ఎస్సీలు 41.59 లక్షల మంది ఉండగా, 2011నాటికి 57.56 లక్షలకు చేరారు. అంటే ఎస్సీల్లో బుద్ధిజం 38శాతం పెరిగింది. 2001 నాటికి దేశంలో ఎస్సీల జనాభా 16.6 కోట్లు ఉండగా.. 2011నాటికి 21.3శాతం పెరిగి 20.14 కోట్లకు చేరుకుంది. బౌద్ధమతంలో ఉన్న ఎస్సీల్లో 90శాతం మంది మహారాష్ట్రలోనే నివసిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 52.04 లక్షలమంది బుద్ధిస్టులు ఉండగా, అక్కడ బౌద్ధమత వ్యాప్తి 60శాతం వృద్ధిరేటుతో ముందుకుసాగుతుండటం గమనార్హం. అదే సమయంలో 2001 నుంచి 2011 నాటికి హిందూ ఎస్సీల జనాభా కేవలం 19.6శాతం మాత్రమే పెరిగింది. 15.8 కోట్ల నుంచి 18.9 కోట్లకు వారి జనాభా చేరుకుంది. అయితే, మొత్తంగా చూసుకుంటే మాత్రం దళిత జనాభాలో బుద్ధిస్టులు కేవలం 2.83శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో బౌద్ధమత పునరుత్థానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. తన మరణానికి కొన్నిరోజుల ముందు ఆయన బుద్ధమతంలో మారారు. హిందూమతంలో తమ పట్ల అణచివేత ఉందని భావిస్తున్న దళితులు చాలామంది బౌద్ధమతంలోకి మారుతున్నారు. -
'ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం'
వాషింగ్టన్: తమపై అమెరికన్లకు అవగాహన కల్పించేందుకు అమెరికాలోని సిక్కులు నడుంకట్టారు. ఆ దేశంలో తమవారిపై జరుగుతున్న హత్యాకాండలు, హింసపట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ మున్ముందు అలాంటివి జరగకుండా చేసేందుకు భారీ మొత్తంలో ప్రచార కార్యక్రమాలు తలపెట్టారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు రూ.2,68,00,000(నాలుగు లక్షల డాలర్లు) విరాళాలు పోగేశారు. ఈ మొత్తాన్ని అమెరికా వ్యాప్తంగా పర్యటించి తమ గురించి, అమెరికాలో తమ విశ్వాసాల గురించి, నమ్మకాల గురించి ప్రచారానికి ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాల కోసం అత్యధికంగా 90 వేల డాలర్లే అధిక మొత్తంలో విరాళాలుగా రాగా ఈసారి ఆశ్యర్యపడేలా భారీ స్థాయిలో విరాళాలు వచ్చాయి. నేషనల్ సిక్ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. 'అమెరికాలోని సిక్కులకు ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఘట్టం. గతంలో ఎన్నడూ లేనంతగా తమ గురించి చెప్పుకునే అవకాశం ఈ విరాళాల ద్వారా వచ్చింది. దేశ వ్యాప్తంగా పర్యటించి సిక్కుల విశ్వాసాలు, నమ్మకాల గురించి అమెరికన్లకు వివరించి సిక్కులపై జరుగుతున్న దాడులను పూర్తిగా తగ్గించేస్తాం. సిక్కులు మరింత భద్రంగా ఉండేలా కృషిచేస్తాం' అని ఎన్ఎస్ సీ సభ్యుడు కావాల్ కౌర్ చెప్పారు. -
ఉత్తరప్రదేశ్ లో నినాదాల కలకలం
మీరట్: ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ సర్దానా ప్రాంతంలో మళ్ళీ కలకలం సృష్టించింది. ఇప్పటికే జెఎన్ యు కేసుతో దేశం అట్టుడుకుతుండగా మీరట్ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఓ సంతాప సభ సమావేశం అనంతరం ఓ గ్రూప్ నకు చెందని కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాట్ రిజర్వేషన్ల ఆందోళన సందర్భంలో ముజఫర్ నగర్ సోనిపట్ లో మృతి చెందిన దళిత యువకుడు కులదీప్ మృతికి సంతాపంగా సర్దానాలో సభ ఏర్పాటు చేశారు. సభ అనంతరం కార్యకర్తలు ఓ మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఆందోళనకారులు నినాదాలు చేయడంతో పాటు రోడ్లను నిర్బంధించినట్టు రూరల్ ఎస్పీ ప్రవీణ్ రంజన్ తెలిపారు. మత వ్యతిరేక నినాదాలతో ర్యాలీగా వెళ్ళిన కార్యకర్తలు స్థానిక తహశీల్దార్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆరుగురు కార్యకర్తలు మత మనోభావాలను దెబ్బతీసేవిధంగా నినాదాలు చేశారని, వారిని అరెస్ట్ చేయలేదని రూరల్ ఎస్పీ తెలిపారు. ప్రత్యేక భద్రత బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు చెప్పారు. -
మతానికి దూరమవుతున్న బ్రిటన్!
లండన్: బ్రిటన్ పౌరుల్లో అత్యధికులు ఏ మతాన్నీ అనుసరించడం లేదని సర్వేలో తేలింది. ‘యుగోవ్’ సంస్థ గత నెల ఈ సర్వేను నిర్వహించింది. ఇటీవలి కాలంలో బ్రిటన్‌కు వచ్చినవారి(ఇమ్మిగ్రెంట్స్)తోసహా దేశవ్యాప్తంగా 1,500 మందిని ప్రశ్నించింది. వీరిలో దాదాపు సగం మంది(46 శాతం) తాము ఏ మతాన్నీ పాటించట్లేదన్నారు. 2015 ఫిబ్రవరిలో సర్వే చేసినప్పుడు వీరి సంఖ్య 42 శాతం. అదే 2013 జనవరిలో సర్వే జరిపినప్పుడు ఈ సంఖ్య 37 శాతమే. ఇక బ్రిటిష్ జాతీయుల(తెల్లవారి)లో ఇది 50 శాతానికిపైగా నమోదైనట్లు సండే టైమ్స్ తెలిపింది. దేవుడుగానీ, ఇంద్రియాతీతమైన శక్తిగానీ లేదని నమ్మేవారి సంఖ్య బ్రిటన్‌లో పెరుగుతుండగా.. అందులో 40 ఏళ్లలోపువారు ఎక్కువగా ఉన్నారు. అన్ని జాతుల్లోని 40 ఏళ్లలోపున్న వారిలో 56 శాతం మంది తమకు ఎటువంటి మతం లేదని పేర్కొన్నట్టు సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో ఆరో వంతు మంది(16.5 శాతం) తమకు ఎటువంటి మతం లేదని చెబుతూనే.. ఏదో ఒక అతీతశక్తి మనల్ని నడిపిస్తున్నదని మాత్రం విశ్వసిస్తున్నట్టు చెప్పారు. 13 శాతం మంది మాత్రం మతానికి తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. -
నేను చూసిన క్రైస్తవత్వం...
ప్రపంచంలోని ప్రతి మతం పవిత్రమైనదే. అవి బోధించే అంశాలు మానవులకి ఉపయోగపడేవే. మతం పేరిట కొందరి ప్రవర్తనా తీరు వలన మతాన్నే ద్వేషించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఒక్కో ‘మది’ది ఒక్కోతీరు. హిందూమతం దైవ భక్తికి పెద్దపీట వేసింది. దృష్టిని ప్రపంచం మీద కాక, పరమాత్మ మీద నిలిపి ఉంచాలని హిందూమతం బోధించే భక్తి మార్గం. క్రైస్తవ మతమేమో సాటివారికి సాయం చేయాలని బోధిస్తూ, త్యాగానికి, సేవకి పెద్ద ప్రాముఖ్యతని ఇచ్చింది. కొందరు క్రిస్టియన్సలోని త్యాగశీలులకి చెందిన ఉదంతాలు తెలుసుకుంటే నాకు ఒళ్లు పులకరిస్తుంది. క్రీ.శ. 1202లో ఇటలీలోని అస్సీ అనే చిన్న ఊరిలో ఓ ధనవంతుడుండేవాడు. అతని ఇరవై ఏళ్ల కొడుకు ఫ్రాన్సిస్ తన మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి గంట మోగుతున్న చప్పుడు వినిపించింది. ఆరోజుల్లో కుష్టువ్యాధికి మందులేదు. వాళ్లని ఊళ్లోకి అనుమతించేవారు కాదు. ఊరికి దూరంగా కాలనీలో ఆ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఒకవేళ వారు ఊళ్లోకి రావాల్సి వస్తే, ఊరి బయట ఉన్న గంట మోగించి వస్తారు. అప్పుడంతా తప్పుకుంటారు. ఆ గంట విని ఆయన పక్కకి తప్పుకునేలోగా ఓ కుష్ఠు వ్యాధిగ్రస్థుడు అతనికి ఎదురు పడ్డాడు. వ్యాధితో శరీరం, మొహం వికారంగా అయిపోయి ఆ రోగిని ఎవరు చూసినా అసహ్యించు కుంటారు. ఐతే ఫ్రాన్సిస్‌కి ఆ రోగి పరిస్థితి చూడగానే హృదయం ద్రవించింది. అతని దగ్గరకు వెళ్లి అతనిని చూడగానే రెండడుగులు వెనక్కి వేసినందుకు క్షమాపణ చెప్పి, తన జేబులోని డబ్బంతా ఇచ్చి, ఆ రోగిని ఆలింగనం చేసుకున్నాడు. అతని ఔదార్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగిన ఆ రోగి... ‘‘మనిషి స్పర్శ ఎలా ఉంటుందో మరిచిపోయాను. నాకది మీరు గుర్తు చేశారు’’ అన్నాడు. ఆ యువకుడే నేటికీ క్రిస్టియన్స్ అంతా కొలిచే మహాత్ముడు ‘సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీ’. మరో సంఘటన. అది జనవరి 1945. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. పోలెండ్‌లోని జడోర్జూ అనే చిన్ని గ్రామంలోని రైల్వేస్టేషన్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అక్కడ పొడుగు చారల ఖైదీ దుస్తులు ధరించిన పదమూడేళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. సరైన భోజనం లేని అమె మరణానికి దగ్గరగా ఉంది. ‘‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ క్రిస్టియన్ ఫాదర్ అయిన ఆ యువకుడు ఆమెను అడిగాడు. ‘‘నా పేరు ఎడిట్ జైరర్. నాలుగేళ్లుగా నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి తప్పించుకున్నాను. నా స్వగ్రామానికి వెళ్లి నా తల్లిదండ్రులను, సోదరినిని కలుసు కోవాలని బయలుదేరాను’’ చెప్పిందామె. అతను వెళ్లి బ్రెడ్, టీకప్పుతో వచ్చి వాటిని ఆమెకు ఇచ్చి ఆకలిని తీర్చాడు. క్రాకోకి వెళ్లే రైలు రాగానే ఆ యువకుడు బల హీనంగా ఉన్న ఆమెని ఎత్తుకుని, పెట్టెలోకి మోసుకెళ్లాడు. జంతువులను రవాణా చేసే ఆ పెట్టెలో ఆమెకి చలి నించి రక్షణగా తన ఒంటి మీది కోటుని కప్పాడు. భగవంతుని ఆశీస్సులు ఆమెకి లభించాలని ప్రార్థన చేస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న డబ్బులు ఆమెకు ఇచ్చేశాడు. ‘‘మీ పేరు? ఆమె అడిగింది. ‘‘కరోల్ ఓటైలా’’ జవాబు చెప్పాడు. 1994లో ఇజ్రాయెల్‌లోని ఐఫా అనే ఊరిలో నివసిస్తున్న ఎడిట్ ఓ రోజు దిన పత్రిక చదువుతూంటే ‘కరోల్ ఓటైలా’ అనే పేరు కనిపించింది. ఆమె జీవితంలో మరిచిపోలేని పేరు అది. తనని కాపాడినది వారే అయితే అతన్ని ఓసారి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉందని ఓ ఉత్తరం రాసి పోస్టు చేసింది. అయితే ఉత్తరానికి కొద్ది జాప్యం తర్వాత జవాబు వచ్చింది. అది అందుకున్నాక ఎడిట్ 1995లో ఇజ్రాయిల్ నించి యూరప్‌కు వెళ్లినప్పుడు రోమ్‌లోని వాటికన్ సిటీ వెళ్లి పోప్ జాన్‌పాల్-2ని కలుసుకుంది. త్యాగానికి ప్రతీక అయిన ఆ యువకుడే అత్యున్నత క్రిస్టియన్ మతాధికారి ‘పోప్’ అయ్యాడు. ఆ ఖైదీకి అతను సహాయం చేయడం నాజీ సైనికులు చూసి ఉంటే, అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేవారు. అలాగే ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి మత ప్రచారానికి ఓ ఫాదర్‌ని 1932లో పంజాబ్‌కి పంపించారు. అతని పేరు జాన్ లియోపోర్న్. జాన్ ఉత్తర పంజాబ్‌లోని ఓ గ్రామంలో తను నమ్మిన సిద్ధాంతాలని ప్రచారం చేయసాగాడు. ఓ రోజు కొందరు గ్రామ పెద్దలు జాన్ని రచ్చబండ దగ్గరకి పిలిపించారు. అతనితో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రచ్చబండ చుట్టూ మనుషులు అతనికి అడ్డుగా నిలబడి అక్కడినించి కదలనివ్వలేదు. గంట... పది గంటలు... రోజు... మూడు రోజులు అలా గడిచాయి. అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చారు తప్ప ఎవరూ భోజనం పెట్టలేదు. ఐదో రోజు అతను నీరసంతో వాలిపోయాడు. ఆరో రోజు గ్రామపెద్ద అతని తలని తన ఒళ్లో ఉంచుకుని, నిమ్మరసం తాగించి తర్వాత భోజనం పెట్టి చెప్పాడు. ‘‘మేమంతా మిమ్మల్ని ఇన్ని రోజులు పరీక్షించాం. ఆహారం ఇవ్వకుండా, కదలనివ్వకుండా చేసినందుకు మీరు మమ్మల్ని తిడతారని, ద్వేషిస్తారని ఎదురుచూశాం. అదే జరిగితే మిమ్మల్ని గ్రామం నించి బహిష్కరించాలనుకున్నాం. మీరు ఇన్ని రోజులు బోధించిన ‘క్షమ’ మీలో నిజంగా ఉందో లేదో ఇలా పరీక్షించినందుకు క్షమించండి. ఇప్పుడు మీ మతం గురించి, జీసస్ గురించి చెప్పండి.’’ ఒకటా? రెండా? ఇలాంటి ఎన్నో ఉదంతాలు చదివిన నాకు క్రిస్టియానిటీకి దగ్గరయ్యే కొన్ని అదృష్టాలు కలిగాయి. నా ప్రమేయం లేకుండానే క్రిస్టియన్స్‌కి, పవిత్రమైన కొన్ని ప్రదేశాలని నా విదేశీ పర్యటనల్లో సందర్శించడం జరిగింది. టర్కీలోని కుశదాసి ద్వీపానికి ఆగస్ట్ 2010లో వెళ్లాను. క్రీస్తును శిలువ వేశాక, ఆయన ప్రధాన శిష్యులలో ఒకరైన సెయింట్ జాన్ జెరూసలేం నించి ఈ కుశదాసి ద్వీపానికి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం, రోమన్స్ తనని హింసించడం మొదలయ్యాక, జీసస్ తన శిష్యుడు సెయింట్ జాన్ని తన తల్లి మేరీ మాతని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని కోరారు. ఈ ద్వీపంలోని ఓ ఇంట్లో మేరీమాత తన ఆఖరి సంవత్సరాలు, తుదిశ్వాస వదిలేదాక గడిపింది. ఈ విషయం కుడా ప్రపంచానికి దైవికంగా తెలియడం విశేషం. 1774-1824 మధ్య జర్మనీలో జీవించిన క్రిస్టియన్ నన్ క్యాథరీనా ఎమెరిష్కి వర్జిన్ మేరీ చివరి దశలో జీవించిన కుశదాసి ద్వీపంలోని ఈ ఇంటి తాలూకు దర్శనాలు కలిగాయి. ఈ ఇల్లు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నది, అక్కడ ఉన్న వృక్షజాతి, ఎన్నడూ జర్మనీ దేశాన్ని వదలని క్యాథరీనాకి కలలో కనిపించాయి. ఆమె అవన్నీ ఒక పుస్తకంలో రాసింది. కుశదాసికి 395 కిలోమీటర్ల దూరంలోని స్మిర్ణా (ఇజ్మిత్) అనే ఊరికి చెందిన లాజరస్ ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. 1891లో అతను ఇక్కడికి వచ్చి, ఆ పుస్తకంలోని గుర్తుల ప్రకారం ఆ ఇంటి కోసం అన్వేషించాడు. ఈ ద్వీపంలోని ఓ మోనాస్ట్రీకి చెందిన శిథిలమైన చర్చ్‌ని కనుగొన్నాడు. ఆ చర్చ్ మేరీ మాత తన చివరి దశలో నివసించిన ఇల్లుగా గుర్తించాడు. దీని పునాదులు క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందినవని శాస్త్రజ్ఞులు నిర్ధారించాక, ఆ పునాదుల మీదే మళ్లీ ఇంటిని నిర్మించారు. వేల మంది పర్యాటకులు ఈ ఇంటిని సందర్శిస్తున్నారు. మా బస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, సెర్బియా, ఇంగ్లండ్, టర్కీ, గ్రీస్ మొదలైన దేశాలకి చెందినవారు కూడా ఉన్నారు. క్యూలో ఈ ఇంట్లోకి వెళ్తే, లోపల మేరీమాత విగ్రహం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్‌ని ఫీలయ్యే గుణం నాలో నాకు తెలీకుండానే ఏర్పడింది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో, మరికొన్ని ప్రధాన ఆలయాల్లో నేను ఫీలైన వైబ్రేషన్స్‌ని ఇక్కడ స్పష్టంగా ఫీలయ్యాను. అలాంటి చోట్ల నాకు తెలియకుండానే కన్నీళ్లూ, ఆనందంతో కూడిన దుఃఖం కలుగుతాయి. ఈ ఇంట్లో కూడా నాకు ఆ అనుభవం కలిగింది. క్రిస్టియన్స్లోని ఓ తెగవారు జీసస్‌ని కాక, మేరీమాతని కొలుస్తారు. ఓ ఆస్ట్రేలియన్ ఆలయం బయట నాతో చెప్పాడు. ‘‘మేరీ ఈజ్ ద ల్యాడర్ ఆఫ్ హెవెన్’’ (స్వర్గానికి మేరీ మాత నిచ్చెన). ఫర్ మదర్ మేరీ హాజ్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు దిస్ వరల్డ్ (ఎందుకంటే మేరీ మాత స్వర్గం నుంచి ఈ ప్రపంచంలోకి దిగి వచ్చింది) దట్స్‌వై హర్ మెన్ మైట్ ఎసెండ్ ఫ్రమ్ ద ఎర్త్ టు హెవెన్ (మేరీ మాత ద్వారా మనుషులు భూమి నుంచి స్వర్గానికి వెళ్లగలరు). ఆగస్ట్ 2011లో పోలెండ్‌లోని క్రాకోని సందర్శించాను. మా గైడ్ అక్కడి ఓ చర్చిని చూపింది. పోప్ జాన్ పాల్-2 క్రిస్టియన్ ఫాదర్ అయిన కొత్తల్లో ఆ చర్చ్‌లోనే పనిచేసేవాడని చెప్పింది. ఆ సమయంలో ఆయన కరీల్ ఓ టైలా (మొదట్లో చెప్పిన ఉదంతంలోని వ్యక్తి) మాత్రమే. పోప్ జాన్‌పాల్-2 నివసించిన ఇంటిని కూడా (హాస్టల్ లాంటిది) చూశాను. బేలూరులోని రామకృష్ణ పరమహంస నివసించిన గదిని చూసిన సంతోషం లాంటిది ఈ ఇంటిని చూస్తే కలిగింది. అలాగే క్రాకో నగరానికి దక్షిణాన గల ఓటైలా పుట్టిన వడోవైజ్ అనే ఊళ్లోని ఆయన ఇంటిని కూడా మా గైడ్ స్మార్తా చూపించింది. ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఆయన తిరిగిన నేలని బస్‌లోంచి చెప్పులు లేకుండా దిగి స్పర్శించాను. ఆది శంకరాచార్య పుట్టిన కాలడిని సందర్శిస్తే కలిగిన ఆనందం కలిగింది. క్రాకోలో ఆయన చదివిన సెమినరీ (క్రిస్టియన్ మతాచార్యుల కాలేజ్)ని కూడా మా గైడ్ బస్సులోంచి చూపించింది. వడోవైజ్తో ఆయన్ని బాప్టైజ్ చేసిన చర్చిలో, ఆయన మరణానికి మునుపు వైద్యులు చిన్న సీసాల్లో తీసుకున్న రక్తాన్ని ఉంచారని గైడ్ చెప్పింది. సెప్టెంబర్ 2014లోని సాలమాంకా నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్‌కి బస్సులో వెళుతూ ఉన్నప్పుడు ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా (పోర్చుగీస్ భాషలో నోసా సెన్హోరాడి ఫాతిమా) క్షేత్రాన్ని చూశాను. 1916లో 9 ఏళ్ల లూషియ శాంటోస్, ఆ పాప కజిన్స్ జెసింటా మార్డో(6), ఫ్రాన్స్స్పో మార్డో(9)లకి బ్లెస్డ్ వర్జిన్ మేరీ దర్శనం లభించింది. గొర్రెలు కాచుకునే ఈ పిల్లలు ఫాతిమా అనే ఊరుకి సమీపంలోని అల్జేస్ ట్రీవ్ అనే గ్రామానికి చెందినవారు. గొర్రెలతో వెళితే మేరీమాత ఈ ముగ్గురికి దర్శనం ఇచ్చింది. ఆ పిల్లలకి చదువు రాదు. ఇంటికి వచ్చాక ఆ సంగతి పెద్దలకి చెబితే వాళ్లు కొట్టిపారేశారు. ఆ తర్వాత అనేక సార్లు మేరీమాత దర్శనం వారికి లభించింది. ఓసారి నరకంలోని అగ్నిలో పాపపు ఆత్మలు కాలడం కూడా వారు చూశారు. ఇది చూసిన జెసింతా మనసులో గట్టి ముద్ర పడింది. పిల్లల వర్ణన ప్రకారం ఆమె చేతిలో రోజరీ (జపమాల) ఉండటంతో ఆమెకి ‘అవర్ లేడీ ఆఫ్ రోజరీ’ అనే పేరు, అవర్ లేడీ ఆఫ్ ద మోస్ట్ హోలీ రోజరీ అనే పేరు, ఫాతిమా గ్రామం దగ్గర జరగడంతో ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ అనే పేర్లు వచ్చాయి. మేరీ పిల్లలకి చెప్పిన భవిష్యత్తులో రెండో ప్రపంచ యుద్ధం, మరికొన్ని దేశాల మధ్య యుద్ధాలు లాంటివి కూడా ఉన్నాయి. ఆమె దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఆరాధించాలి, త్యాగాలు ఎలా చేయాలి మొదలైనవి పిల్లలకి చెప్పింది. 13మే 1917న జెసింటా సూర్యుడుకన్నా కాంతివంతమైన మేరీమాత నుంచి అత్యంత శక్తివంతమైన కాంతికిరణాలు వెలువడుతుండగా చూసింది. ఆ విషయం తల్లికి చెబితే ఇరుగు, పొరుగు దాన్ని జోక్‌గా కొట్టేశారు. తరువాత 13, జూన్‌లో, 13 జూలైలో కూడా పిల్లలకి మేరీమాత దర్శనం ఇచ్చి మూడు రహస్యాలని చెప్పింది. వీటిని త్రీ సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమాగా పిలుస్తారు. (ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అంశాలే). 1941కల్లా వీటిలోని రెండు నిజంగా జరగడంతో 1943లో బిషప్ మూడో రహస్యం చెప్పమంటే నిరాకరించింది. అది రాసిన కాగితాన్ని కవర్లో ఉంచి, సీల్ చేసి 1960 దాకా తెరవకూడదని కోరింది. 2000లో పోప్ జాన్ పాల్ ॥దీన్ని చదివి అధికారికంగా ప్రకటించగా దాన్ని కాన్సెక్రీషన్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. తర్వాత పెద్దలు కూడా దీన్ని నమ్మి 13 ఆగస్టు 1917న మదర్ మేరీ దర్శనం అవుతుందని అక్కడికి వెళ్లారు. కానీ కాలేదు. ఫ్రాన్సిస్కో 1919లో జెసింటో మార్చి 1920లో చిన్నతనంలోనే మరణించారు. లుసింటా 13 ఫిబ్రవరి 2005న 97వ ఏట మరణించింది. పిల్లలు ఇద్దరి సమాధుల్ని, అవర్ లేడీ ఫాతిమాకి కట్టిన చర్చిని సందర్శించాను. సమీపంలో ఉన్న ఫౌంటెన్లోని నీరు పవిత్రమైనదని చెప్తారు. ఇది తాగితే వ్యాధులు పోతాయట! ఓ సీసాలో ఈ నీటిని తెచ్చి హెబ్సిబారాణి అనే క్రిస్టియన్ ఫ్రెండ్‌కి ఇచ్చాను. కాళ్లు పడిపోయిన వాళ్లు చర్చికి ముందే మోకాళ్ల మీద లోపలికి నడిచి వెళ్తే కాళ్లు బాగవుతాయని స్థానికులు చెప్పారు. ఇక్కడ అనేక మంది మానసిక రోగులు కూడా కనిపించారు. వారికి కూడా స్వస్థత చేకూరుతుందట! 13 మే 1946న పోప్ పయాస్-2 ఇక్కడికి అవర్ లేడీ ఫాతిమా విగ్రహానికి కిరీటాన్ని అమర్చారు. ఎందుకో మేరీ మాత మరణించిందని చెప్పిన కుశదాసిలోని వైబ్రేషన్ నాకు ఈ చర్చిలో కలగలేదు. నేను చూసిన మరో క్రిస్టియన్ విశేషం - అక్టోబర్ 2015లో జర్మన్‌లోని లేడీ ముసా అరబిక్ భాషలో దీని ఆర్థం ‘వ్యాలీ ఆఫ్ మోజెస్ ’. జుడాయిజమ్‌లో, ఇస్లామ్‌లో, క్రిస్టియానిటీలో, బహాయిజమ్లో మోజెస్ ముఖ్యమైన ప్రవక్త. జర్మన్ రాజధాని అమ్మన్ నుంచి ప్రాచీన నగరం పెట్రాకి వెళ్లే దారిలో లేడీ మూసా దగ్గర 240 కిలోమీటర్ల దూరంలో బస్ ఆగింది. మోజెస్ ప్రవక్త ఈ ఎడారి నుంచి వెళ్తూ దానిని అనుసరించేవారి దాహాన్ని తీర్చడానికి ఓ రాతిని కొడితే అది పగిలి నీరు వెలువడిందని బైబిల్ కథనం. ఆ రోజుల్లో పెట్రాని పాలించిన నబాటియన్స్ ఈ నీటి బుగ్గకి అనేక చిన్న కాలువలను తవ్వి పెట్రా నగరానికి దీన్ని తరలించారు. దీనికి గార్డియన్ ఆఫ్ పెట్రా, మోజెస్ వెల్, మోజెస్ వాటర్ స్ప్రింగ్, టోంచ్ ఆరన్ అని పేర్లు. మోజెస్ సోదరులైన అహరోను సమాధి ఈ ప్రాంతంలోనే ఉందని నమ్మకం. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మోజెస్ వెంట ఉండే వారు ఈ ఎడారిలో తప్పిపోయామని పరమాత్మ నిజంగా ఉంటే తమకు నీరు ఇవ్వాలని కోరితే మోజెస్ దైవాన్ని ప్రార్థించి ఈ నీటి బుగ్గని సృష్టించాడని గైడ్ చెప్పింది. బైబిల్లో పేర్కొన్న ఈ ప్రదేశాన్ని 1931లో కనుగొన్నారు. పోప్ జాన్ పాల్-2 కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. మోజెస్ సమాధి కూడా ఇక్కడే ఎక్కడో కొండమీద ఉందట. కానీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆయన జ్ఞాపకార్థం మౌంట్ నెబూ మీద ఉంచిన ఆ విగ్రహాన్ని కూడా దర్శించాను. సమీపంలోని మదాబా అనే గ్రామంలోని పురాతన చర్చిలో ఓ పురాతన మొజాయిక్ మ్యాప్ ఉంది. ఆ రోజుల్లో జెరూసలేం భూమికి మధ్యలో ఉందని నమ్మేవారు. క్రీ.శ. 542కి చెందిన ఈ మ్యాప్‌లో మెడిటేరియన్ సీ, ఈస్ట్రన్ డిజర్ట్స, డెడ్‌సీ జెరికో, బెత్లెహేమ్, జోర్డన్, లెబనాన్ లాంటి క్రిస్టియన్ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మోజెస్ స్ప్రింగ్ నుంచి కూడా నీటిని పట్టి తెచ్చి కొందరు క్రిస్టియన్ మిత్రులకి ఇచ్చాను. అవకాశం ఉంటే జెరూసలేం, బెత్లెహేమ్ దర్శించాలని, క్రీస్తు శిలువతో నడిచిన దారిలోని మట్టిని స్పృశించాలని నా ఆశ. అలాగే మెక్సికో సిటీ ప్రాంతం లోని టెపియాక్ కూడా చూడాలని ఉంది. అక్కడకు కూడా మేరీమాత గొర్రెలు కాచుకునే ఓ కుర్రాడికి దర్శనాన్ని ఇచ్చింది! 9 డిసెంబర్ 1531న గొర్రెలు కాచుకునే జువాన్ డియాగో అనే పదిహేనేళ్ల కుర్రాడికి చుట్టూ కాంతితో ఉన్న పదహారేళ్ల యువతి దర్శనమిచ్చి, చర్చిని కట్టమని స్థానిక భాషలో కోరింది. అతను బిషప్‌కి ఈ విషయం చెపితే రుజువు కోరాడు. సాధారణ ప్రజలు ఉపయోగించే బట్ట (తిల్మా) మీద వర్జిన్ మేరీ ముఖం ప్రత్యక్షమైంది! నేటికీ ఆ బట్ట మీద మేరీ మాత బొమ్మని చూడొచ్చు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ బట్ట ఈ పాటికి నశించిపోవాలి. అయినా అది చెక్కు చెదరకుండా ఉండడం అద్భుతం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రతి మతంలోనూ నేనున్నానని పరమాత్మ ఇలా గుర్తు చేస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఆయన బోధనలను పాటిస్తూ ఆయన్ని మరచిపోకపోవడం. ఓ రోజు లండన్‌లోని అతి పెద్ద చర్చి సెయింట్ పాల్ క్యాథడ్రిల్‌లో ఓ పేదరాలు నేలమీద మోకాళ్ల మీద కూర్చొని దైవ ప్రార్థన చేస్తూ, పక్కన ఎవరో కూర్చోవడం గమనించింది. చూస్తే ఆవిడ బ్రిటిష్ రాణి విక్టోరియా! దాంతో వెంటనే ఆ పేదరాలు లేచి మరో చోటికి వెళ్లి కూర్చుని ప్రార్థించ సాగింది. విక్టోరియా మహారాణి కూడా లేచి ఆ పేదరాలి పక్కన, దైవ ప్రార్థనకి మోకాళ్ల మీద కూర్చొని ఆమె చెవిలో చెప్పింది. ‘‘నేను సింహాసనం మీద ఉన్నప్పుడే రాణిని. దేవుని సన్నిధిలో మనమంతా సమానమే. లేచి వెళ్లకు.’’ ప్రతి మతం వారు గుర్తుంచుకోదగ్గ, ఆచరించదగ్గ గొప్ప విషయాన్ని ఆ మహారాణి అంత అందంగా చెప్పింది. - మల్లాది వెంకటకృష్ణమూర్తి -
మతం మనోవైశాల్యాన్ని కోరుతుంది!
మనుషులకు హితమైనదే మతం. బహుశా ఏ మతం చెప్పినా ఇదే చెబుతుంది. ‘మన విషయంలో జరగకూడదని మనం కోరుకునేది మనం ఇతరులకు చేయకూడదని బైబిల్ చెబుతుంది. ‘తనకు అప్రియమైనది పరులకు చేయకూడద’ని మహాభారతం చెబుతుంది. సంక్రాంతి పండగ వచ్చే ముందుగా వాకిళ్లలో ముగ్గులు పెడతాం. అలాగే క్రిస్మస్ వచ్చే ముందుగా నక్షత్రాన్ని గుమ్మం ముందు అలంకరిస్తారు. గడప దగ్గర పెట్టే ముగ్గు వాకిట్లోనే పైన కనిపిస్తుంటుంది. సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ‘నా సోదరీ సోదరులారా’ అని సంబోధించారట. ఇక నొప్పి, బాధ నుంచి విముక్తం చేసే ఉదాత్తమైన నర్స్ బాధ్యతలు నిర్వహించేవాళ్లను మనం సిస్టర్స్ అంటాం. కట్లు కట్టి గాయాలను నయం చేసే పురుషులను బ్రదర్స్ అంటాం. మరి ఇక మతాల బోధనల్లో తేడా ఎక్కడుంది? మనం సంకుచితంగా వ్యాఖ్యానించినప్పుడే మతం పరిధి కుంచించుకుపోతుంది. కానీ వాస్తవానికి మతం అనేది విశాలత్వాన్ని, మనోవైశాల్యాన్ని కోరుతుంది. అందుకే నా ఉద్దేశంలో మానవాళికి మేలు చేసేదే మతం. ఈ దృష్టితో చూస్తే క్రిస్మస్ కేవలం ఒక మతానికి చెందిన పర్వదినం కాదు. అది సర్వమానవాళికీ పండగ. మా చికిత్సా సేవారంగంలో ఉన్న మహిళలు ప్రధానంగా నిర్వహించుకునే పర్వదినం ఇది. - డా॥మోహనవంశీ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ -
అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లిం కాబట్టే యాకుబ్ ను ఉరి తీస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లిం అయినందు వల్లే యాకుబ్ మెమన్ ఉరిశిక్ష విధించారన్నారు. అతని పిటిషన్ పరిశీలించకుండా, అసలు యాకూబ్ ను ఎలా ఉరి తీస్తారని ఒవైసీ నిలదీశారు. రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హంతకులకు తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో రాజకీయ నేతల అండ ఉందన్నారు. అందుకే వారు యావజ్జీవ శిక్షలతో బతికిపోయారని, కానీ ముస్లిం మతస్థుడైన యాకూబ్‌ను ఆదుకునేవారే కరువయ్యారన్నారు. ఒక వేళ నేరస్తులను ఉరి తీయాలనుకుంటే, మతాన్ని ఆధారంగా చేసుకుని వారికి మరణ శిక్షలు విధించొద్దని ఆయన కోరారు. ఒక మతాన్ని టార్గెట్ చేయడం సమంజసం కాదన్నారు. కాగా 1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి అయిన యాకుబ్ మెమన్‌కు టాడా కోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా మెమన్ క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించారు. ఇటీవల శిక్షనుతగ్గించాల్సిందా యెమెన్ పెట్టుకున్న పిటిషన్ కూడా సుప్రీం తిరస్కరించడంతో ఈ నెల 30న నాగపూర్ జైల్లో అతణ్ని ఉరి తీసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. . ఈ సమయంలో ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. -
మతం నుంచి మానవత్వం వైపు...
మానవత్వాన్ని మించిన మతం లేదు. అయితే, మత పిచ్చితో, మత విద్వేషాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్న మారణహోమాలు కోకొల్లలు. అలాంటి మతం హద్దులను చెరిపేసి.. మతం కంటే మానవత్వం గొప్పదనే సత్యాన్ని మరోసారి నిరూపించాడు ఈ భారతీయ యువకుడు. న్యూజిలాండ్‌లో బిజినెస్ కోర్సు చదువుతున్న ఇతని పేరు హర్మాన్ సింగ్. మే 15వ తేదీన ఆక్లాండ్‌లో పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న హర్మాన్ సింగ్ పరుగెత్తుకొచ్చాడు. తలకు గాయమై తీవ్రంగా రక్తమోడుతున్న పిల్లాడిని చూసి మనసు చలించింది. వెంటనే మరో ఆలోచన లేకుండా తలపాగా తీసి పిల్లాడి తల చుట్టూ కట్టి ప్రాణాపాయం నుంచి కాపాడి ఆస్పత్రిలో చేర్పించాడు. మతాచారం ప్రకారం సిక్కులు బహిరంగంగా తలపాగా తీయడం నిషేధం. ఆన్లైన్లో విస్తృత ప్రచారం పొందిన ఈ వీడియో చూసి లక్షలాది మంది ప్రశంసల జల్లు కురిపించారు. మానవత్వం కంటే మరేదీ గొప్పది కాదని, అందుకే అలా చేశానని ‘వన్న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సాదాసీదా జీవితం గడుపుతున్న హర్మాన్ మానవత్వాన్ని మెచ్చుకున్న ఓ పెద్దాయన ఇతనికి ట్రక్కు నిండా ఫర్నీచర్‌ను బహుమతిగా పంపాడు. -
మత సహనం మన సహజ గుణం
మనది, మతాల మధ్య నిరంతర యుద్ధాలు, అప్పుడప్పుడూ శాంతి విరామాలతో సాగిన చరిత్ర కాదు. నిజానికి అందుకు విరుద్ధంగానే మన చరిత్ర సాగింది. మత సహనం భారత ఉపఖండం స్వాభావిక లక్షణం. వివిధ రూపాలలో వ్యక్తమయ్యే హిందూ మతం.. దాన్ని పాటించిందనీ, అదే ఇతర మతాలలో కూడా వ్యాప్తి చెందిందని ఎవరైనా అనొచ్చు. ఆ వాదన నిజమే కావచ్చని నేనూ అంగీకరిస్తాను. ‘‘షారుఖ్, సల్మాన్, అమీర్‌లతో కూడిన బాలీవుడ్ ఖాన్ల త్రయం విస్తృత జనాదరణను పొందడం... భారతీయులు స్వాభావికంగా లౌకిక వాదులేననీ, రాజకీయ ఉద్దేశాలతో లేదా వంచనతో పెడదోవ పట్టిస్తే తప్ప వారందుకు విరుద్ధంగా ప్రవర్తించరని సూచించడం లేదా?’’ audiomatic.in అనే వెబ్సైట్లో నేను వారం వారం నిర్వహించడం ప్రారంభించిన వీడియో ఆడియో పాడ్‌కాస్ట్‌లో ఓ మహిళ అడిగిన ప్రశ్న ఇది. అది నేను తరచుగా ఆలోచిస్తున్న విషయం కూడా. నిజాయితీగా చెబుతున్నా.. ఆ విషయంలో నేనెప్పుడూ ఇదమిత్థంగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను. నేను పాకిస్తాన్లో ఉండగా, ప్రత్యేకించి హిందువుల సాంగత్యం తక్కువగా ఉండే పంజాబ్ లాంటి ప్రాంతాల్లో సైతం నాకు తరచూ ఇంచుమిం చుగా ఇలాంటి ప్రశ్నే ఎదురయ్యేది. బాలీవుడ్ ప్రేమ కథలకు హిందూ-ముస్లిం కోణం ఉండేట్టయితే, తప్పనిసరిగా అది హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయే అవుతుందని పాక్ పత్రికా సంపాదకుడు, క్రికెట్ నిర్వాహకుడు, రాజకీయవేత్త నజామ్ సేథీ ఒకసారి వ్యాఖ్యానించారు. ఉదాహరణకు మణి రత్నం ‘బొంబాయి’. నాకు సరిగ్గానే గుర్తుండినట్టయితే, భారతీయులు అందుకు విరుద్ధమైనదాన్ని... అంటే ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి ప్రేమను ఆదరించరన్నట్టు సేథీ మాట్లాడినట్టున్నారు. నిజమేనా? కాదంటాను. బాలీవుడ్ డెరైక్టర్లు, రచయి తలు కొందరు పూర్తిగా అలాంటి అలోచనతోనే స్క్రిప్టును సరిగ్గా అలాగే తయారుచేస్తారనడంలో సందేహం లేదు. కానీ వాస్తవాన్ని చూడాలి. ముగ్గురు ఖాన్లూ హిందువులను పెళ్లి చేసుకున్నవారు లేదా సహజీవన బంధంలో ఉన్నవారే. వారి స్థాయిలో విజయవంతం కాలేకపోయిన సైఫ్ అలీఖాన్‌ను కూడా కలిపితే నలుగురు ఖాన్లవుతారు. సైఫ్, కరీనా కపూ ర్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిళ్లు, ప్రేమలతో బాలీవుడ్ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. దీన్నే మనం వెండి తెరకు కూడా వర్తింపజేసి... హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమ కథైతే ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమేమీ ఉండదని ఊహించవచ్చు. దీనికి సంబంధించి రెండో పార్శ్వం కూడా ఉంది. అది బాలీవుడ్ సినిమాల ఇతివృత్తాలు, మన స్టార్ల వ్యవస్థ. భారీ చిత్రాలు సహా చాలా వరకు హిందీ సినిమాల్లో ప్రత్యేకించి కథా నాయకుడి పాత్ర స్వభావంలో ఏ మంత పస ఉండదు. మూసపోతలో చదునుగా, కేవలం ద్విముఖమైనదిగానే ఉం టుంది. సల్మాన్‌ఖాన్ ఏ పాత్రనైనా అలాగే పోషిస్తాడు. అదే, మనిషిగా సల్మాన్ నిజస్వభావమని ఊహిస్తుంటారు. ప్రేక్ష కులు ఆ మనిషికి ఆకర్షితులవుతుం టారే తప్ప ఆ పాత్రకు కాదని ఇది విదితం చేస్తుంది. దశాబ్దాల తరబడి మీడియా ఆ నటుడి స్వభావంలోని భిన్న కోణాలు, అంచులు, చీకటి ప్రాంతాల గురించి చెప్పినదంతా నిజమేనని ప్రేక్షకులు ఊహిస్తారు. అతడు ఎవరు, ఏమిటనేదానితో సహా ప్రేక్షకులు అతన్ని అలాగే అభి మానిస్తారు. వెండితెరపై ముస్లిం అబ్బాయిగా సల్మాన్ హిం దూ అమ్మాయిని ప్రేమించినా వారికి సమస్యేమీ కాదు. దిలీప్కుమార్లాంటి ముస్లిం నటులు హిందూ పేర్ల వల్ల తమకు ఆమోదనీయత లభిస్తుందని భావించిన రోజులనాటి గతం నుంచి బాలీవుడ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటోం ది. అది సమంజసమైనదేనా? గొప్ప ఖాన్ల త్ర యంతో మన అనుభవాన్ని బట్టి కాదనే మనకు అనిపిస్తుంది. ప్రపంచంలో ఒక భాగంగా ఉన్న మన ప్రాంతంలోని సమాజాలు కొన్ని దశాబ్దాల్లోనే అంత గొప్పగా మారిపోయిందేమీ లేదు. నేటి కంటే 1950ల నాటి బాలీవుడ్ ప్రేక్షకులు ఏమంత భిన్నంగా ఉండేవారేమీ కారు. బాలీవుడ్ కేవలం ఒక సూచికేనని, దానికున్న విస్తృత వ్యాప్తి దృష్ట్యా ఉత్తమ సూచిక కూడానని నేనూ అంగీకరి స్తాను. అయితే మన దేశంలో రెండు మతాల మధ్య సంబం ధాల చరిత్ర అతుకులమయమని కూడా ఆమోదిస్తాను. అప్పుడప్పుడు విరుచుకుపడేవే అయినా తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మాట వాస్తవం. దశాబ్దాల తర్వాత అవి తగ్గినట్టనిపిస్తుంది. ఒకే పరిసరాల్లోని భిన్న మతాల ప్రజలు భిన్న ఆవాస ప్రాంతాలవారుగా విడిపోయి ఉండటం కనబ డుతుంది. ప్రత్యేకించి అహ్మదాబాద్, బరోడావంటి సనా తనవాద నగరాల్లో ఇది ఎక్కువ. అలాంటి చోట్ల ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాల చట్టం లాంటి చట్టాల ద్వారా ఈ విభజనను ప్రోత్సహించింది. దేశంలోని అన్ని మతాలవారిలోనూ పరమత సహనం ఉన్నమాట వాస్తవం. లౌకికత అనేది సంక్షిష్టమైన పదం. ఈ సందర్భంగా దాన్ని వాడవచ్చా, లేదా? నాకు తెలీదు. మత సహనం భారత ఉపఖండపు స్వాభావిక లక్షణం. వివిధ రూపాలలో వ్యక్తమయ్యే హిందూ మతం దాన్ని పాటించిం దనీ, అదే ఇతర మతాలలో కూడా వ్యాప్తి చెందిందని ఎవ రైనా అనొచ్చు. ఆ వాదన నిజమే కావచ్చని నేనూ అంగీకరి స్తాను. ఎవరైనా మనల్ని మోసగించి, రెచ్చగొడితే తప్ప స్వాభావికంగానే భారతీయులం పరమత సహనం గలవా రం/ లౌకికవాదులం. అది నాకు చాలా హాయి గొలిపే యోచన. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత - ఆకార్ పటేల్ ఈమెయిల్: aakar.patel@icloud.com) -
మళ్లీ విద్వేష రాజకీయం
సంపాదకీయం మంచీ చెడ్డ విచక్షణ లేకపోతే పోయింది...కనీసం వేళా పాళా అయినా చూసుకోవా లని మతతత్వవాదులు అనుకోవడం లేదు. వివిధ మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలున్న దేశానికి ఆమోదయోగ్యమైన, అపురూపమైన రాజ్యాంగాన్ని అం దించిన మహనీయుడు డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతి జరగ బోతున్నదని గానీ... విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మతాలకూ, సంస్కృతు లకూ, జాతులకూ దేశంలో సమానావకాశాలుంటాయని చెప్పిన సందర్భాన్నిగానీ గుర్తించకుండా ఎన్డీయే కూటమిలోని భాగస్వామి శివసేన మళ్లీ తన నైజాన్ని ప్రద ర్శించింది. ముస్లింలను తరచుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు గనుక వారికున్న ఓటు హక్కును రద్దుచేయాలని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ రెండ్రోజుల క్రితం డిమాండ్ చేసింది. తరచు నోరుపారేసుకోవడంలో ఖ్యాతి గడిం చిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను కఠినంగా అమలు చేయాలని, అందుకు అంగీకరించనివారి ఓటు హక్కును రద్దు చేయాలని కోరారు. హిందూ మహాసభ ఉపాధ్యక్షురాలు సాధ్వీ దేవ ఠాకూర్ ఇంకో అడుగు ముందు కేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ముస్లిం, క్రైస్తవ మతాలవారికి బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తేనే వారి జనాభా పెరగకుండా ఉంటుందని ఆమె సలహా ఇచ్చారు. ఇవి ఎవరో మతి చలించినవారి మాటలుగా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇప్పు డు మాట్లాడిన నేతలందరూ గతంలో కూడా ఇదే బాణీలో మాట్లాడారు. ఇక శివసేన సంగతి చెప్పనవసరం లేదు. ఆ పార్టీ సంస్థాపకుడు స్వర్గీయ బాల్ ఠాక్రే ఇలాంటి ప్రసంగాల్లో అందరినీ మించిపోయారు. 1987 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఆయన ముస్లింలపై చేసిన వ్యాఖ్యానాలపై కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఎన్నికల్లో అవినీతి విధానాలు అవలంబించారన్న అభియోగం రుజువైనందున ఠాక్రేను ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా, ఆయనకు ఓటు హక్కు లేకుండా చేయాలని సుప్రీంకోర్టు 1995 డిసెంబర్లో ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్‌కు సలహా ఇచ్చింది. మిగిలిన ప్రక్రియంతా పూర్తయ్యాక ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకింద 1999లో ఠాక్రే ఓటింగ్ హక్కును సస్పెండ్‌చేశారు. ఆయన ఓటింగ్ హక్కు ఎందుకు రద్దయిందో శివసేన నేతలకు లోతుగా అర్థమై ఉంటే మళ్లీ ఆ తరహా మాటలు మాట్లాడకూడదు. కానీ వారికి తెలిసిందల్లా చట్టంలో ఓటు హక్కు రద్దు చేసే అవకాశం ఉంటుందన్న విషయం ఒక్కటే. అందువల్లే ఇప్పుడు ముస్లింలకు ఆ హక్కు రద్దుచేయమని డిమాండుచేస్తున్నారు. శివసేన వ్యక్తంచేసిన భావాలను తమవిగా భావించనవసరం లేదని బీజేపీ సంజాయిషీ ఇవ్వొచ్చు. సామ్నా సంపాదకీయాన్ని వెనువెంటనే ఆ పార్టీ ఖండించి ఉండొచ్చు. కానీ, ఇంతమాత్రాన బీజేపీ పాపం మాసిపోదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు పార్టీల మధ్యా దూరం పెరిగిన మాట వాస్తవమే కావొచ్చుగానీ...ఇప్పటికీ శివసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్ర కేబినెట్లోనూ కొనసాగుతున్నది. ముస్లింలైనా, మరొకరైనా వారికై వారు ఓటు బ్యాంకుగా మారరు. శివసేన లాంటి పార్టీలు వారిని అలా మార్చుకుంటున్నాయి. సమాజాన్ని కుల, మత ప్రాతి పదికలపై చీల్చి వాటి ఆధారంగా ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూడటం రాజకీయ పార్టీలు చేసే పని. తమ ప్రయోజనాల పరిరక్షణ సాధ్యమవుతుందనో, తమకు రక్షణ లభిస్తుందనో, తమ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందనో ఆశించి చాలామంది ఇలాంటి పార్టీలపై భ్రమలు పెంచుకోవడం మాట వాస్తవమే అయినా అన్నివేళలా అది కొనసాగదు. నిజానికి అలా మత ప్రాతిపదికన ఓట్లేసి ఉంటే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఈ తరహా విజయం సాధ్యమయ్యేదే కాదు. ఈ దేశ ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని అవాంఛనీయమైన మాటలతో, అధిక ప్రసంగాలతో చెదరగొట్టుకుంటున్నదీ, అభద్రతా భావన కల్పించి వారిని మరోవైపు నెడుతున్నదీ ఈ బాపతు నేతలే. ఇంతకూ శివసేనకు ముస్లింల ఓటు హక్కు రద్దుచేస్తే బాగుంటుందన్న ఆలోచన ఎందుకొచ్చినట్టు? పుట్టి ఇన్నేళ్లయినా శివసేన అటు పటిష్టమైన ప్రాంతీయ పార్టీగా ఎదగలేదు. కనీసం హిందూత్వ విషయంలోనూ బలమైన పార్టీగా రూపొందలేదు. మహారాష్ట్ర కూటమిలో తనకు ఒకప్పుడు జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇవాళ శాసించే స్థాయికి చేరుకుంది. తన ఓటు బ్యాంకును కొల్లగొడుతున్నది. గొడ్డు మాంసాన్ని నిషేధించడంలోగానీ, మల్టీప్లెక్స్‌లలో మరాఠీ చిత్రాల ప్రదర్శనకు సంబంధించిన ఆంక్షలు విధించడం లోగానీ బీజేపీ చురుగ్గా వ్యవహరించి శివసేనకు ఎజెండా లేకుండా చేసింది. ఎన్డీయే కూటమితో ఉంటామో ఉండమో చెప్పలేమన్న బెదిరింపులేవీ బీజేపీ అధినేతల ముందు పనిచేయలేదు. దానికితోడు ఎంఐఎం మహారాష్ట్రలో వేళ్లూనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్లే ఇలాంటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి సంచలనం కలిగించాలని, లబ్ధిపొందాలని శివసేన భావిస్తోంది. సమాజంలో అశాం తిని రగిలించేందుకూ, భిన్నవర్గాలమధ్య విభేదాలు సృష్టించేందుకూ ప్రయత్నించే శక్తులను ఆయా పార్టీల్లోని అగ్రనేతలు మందలింపుతో సరిపెట్టడమో, ప్రత్యర్థి పక్షాలు విమర్శించి ఊరుకోవడమో చేసినంతమాత్రాన ఒరిగేదేమీ లేదు. కొంత వ్యవధినిచ్చి అటువంటివారు మళ్లీ అదే బాణీలో మాట్లాడుతున్నారు. సమాజానికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. విద్వేషపూరిత వ్యాఖ్యానాలు ఎవరు చేసినా వెనువెంటనే రంగంలోకి దిగి కేసులు పెట్టి చర్య తీసుకునే స్వతంత్ర వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే ఈ బాపతు నేతలు దారికొస్తారు. తమ వ్యాఖ్యలు ఏదో సంచలనం కలిగించి ఊరుకోవడంకాక జైలుపాలు చేస్తాయని, ఎన్నికల రాజకీయా లకు శాశ్వతంగా దూరంచేస్తాయన్న స్పృహకలిగినప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటారు. రాజ్యాంగంపైనా, చట్టబద్ధపాలనపైనా నమ్మకం ఉన్న పాలకులు చేయాల్సిన పని అది. -
మంచి పరిణామం
సంపాదకీయం మౌనం అంగీకారంగా ధ్వనించే పరిస్థితులున్నప్పుడు మాట్లాడకపోవడం అపచారమవుతుంది. అన్యాయమవుతుంది. బాధ్యతను విస్మరించడం అవుతుంది. సారాంశంలో నేరమవుతుంది. అందువల్ల ఆలస్యమైనా సరే మాట్లాడటమే సరైంది. కనుకనే...విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే ఏ మత బృందాన్నయినా అనుమతించబోమని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్వాగతించదగ్గది. ఎలాంటి ప్రలోభాలకూ, బెదిరింపులకూ లొంగకుండా నచ్చిన మతాన్ని ఎంచుకునే, ఆరాధించే హక్కు, స్వేచ్ఛ అందరికీ ఉంటాయని కూడా ఆయన చెప్పారు. విద్వేషాలను రెచ్చగొట్టే, హింసకు దిగే శక్తులపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక సంఘ్ పరివార్ నేతలు, బీజేపీ నేతలు కొందరు చేసిన ప్రకటనలు...మరీ ముఖ్యంగా ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడుల ఘటనలను చూసి ఆందోళనపడుతున్న వారికి మోదీ చేసిన ప్రకటన సాంత్వన చేకూరుస్తుంది. నరేంద్ర మోదీనుంచి ఇలాంటి ప్రకటన రావాలని చాన్నాళ్లుగా ఎందరో కోరుకున్నారు. అందువల్ల పరిస్థితులు చక్కబడతాయని ఆశించారు. ఆ స్థాయి నాయకుడినుంచి స్పష్టమైన ప్రకటన వస్తే సంఘ్ పరివార్ శ్రేణులు తమ ధోరణిని మార్చుకుంటాయని భావించారు. ప్రార్థనాలయాలను ధ్వంసం చేసిన ఉదంతాలు ఢిల్లీలో గత మూడు నెలలుగా చోటుచేసుకుంటున్నాయి. వీటి వెనక ఎవరున్నారని స్పష్టంగా తెలియకపోయినా ఇవి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు జరిగిన ప్రతిసారీ వాటిని దొంగల పనిగా కొట్టి పారేయడం ఢిల్లీ పోలీసులకు అలవాటైంది. దొంగతనానికి వస్తే డబ్బు జోలికిగానీ, అక్కడున్న ఇతరత్రా విలువైన వస్తువుల జోలికిగానీ ఎందుకు పోలేదన్న ప్రశ్నలకు జవాబులు రాలేదు. నాలుగు రోజులక్రితం క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలోని కాన్వెంట్ స్కూలుపై దాడి జరిగింది. ఇక్కడ రూ. 12,000 పోయాయి గనుక ఇది దొంగలపనేనని పోలీసులు కాస్తంత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. వీటన్నిటిపైనా ఆందోళనపడుతున్నవారికి ధైర్య వచనాలు చెప్పాల్సిందిపోయి... అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ గత మూడేళ్లుగా నగరంలోని ప్రార్థనాలయాల్లో జరిగిన దొంగతనాల జాబితా ఏకరువుపెట్టారు. మొత్తం ఆరు చర్చిల్లో ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం జరిగినట్టు స్పష్టమవుతుండగా ఇలాంటి విశ్లేషణలు చేయడం సమస్య పరిష్కారానికి దోహదపడదని ఆయన గుర్తించలేకపోయారు. ఈ ఉదంతాలన్నిటి మాట అటుంచి సంఘ్ పరివార్ సంస్థల్లోని ముఖ్యులు కొందరు, బీజేపీకి చెందిన నేతలు కొందరు చేస్తున్న ప్రకటనలు, వాడుతున్న భాష ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ వివాదాల పొడవునా ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ మాట్లాడలేదు. కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా...అక్రమ సంతానమా తేల్చుకోవాల’ంటూ ఒక బహిరంగ సభలో మాట్లాడినప్పుడు అప్పటికి సమావేశాలు సాగుతున్న పార్లమెంటులో ఆ ఉదంతం పెను వివాదం సృష్టించింది. మిగిలిన మంత్రులు వివరణనిచ్చినా ప్రధాని మాట్లాడితే తప్ప శాంతించబోమని విపక్షాలన్నీ ఒక్కటై శఠించాయి. చిట్టచివరకు మోదీ జోక్యం చేసుకుని ఆమె వ్యాఖ్యలు తప్పేనని వివరణనివ్వాల్సి వచ్చింది. అది సద్దుమణగక ముందే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మహాత్ముడి హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దానికీ కేంద్రం సంజాయిషీ ఇచ్చుకోవాల్సివచ్చింది. ఇక హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని పిలుపులొచ్చాయి. ఘర్‌వాపసీ పేరుమీద మత మార్పిడులు జరిగాయి. దేశంలో 15 కోట్లమందిని ‘వెనక్కి తీసుకొచ్చేవరకూ’ ఈ కార్యక్రమం ఆగబోదని విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీ ఆర్య ప్రకటించారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడా, అమెరికా వెళ్లాకా చేసిన వ్యాఖ్యానాలు ప్రకంపనలు సృష్టించాయి. ‘మత విశ్వాసాల పరంగా చీలిపోనంత కాలమూ మీరు విజయం సాధిస్తార’ంటూ ఆయన చెప్పిన హితవచనాలపై కొందరికి ఆగ్రహం కూడా కలిగింది. సొంతింటిని చక్కదిద్దు కోవడంలో విఫలమైన ఒబామా మనకు నీతులు చెబుతారా అన్నవారున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మోదీ స్పష్టంగా, సూటిగా మాట్లాకపోవడంవల్లే ఒబామా అలా అనాల్సివచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఆలస్యమైనా మోదీ చేసిన ప్రకటన అలజడులు రేకెత్తించేవారికి ఒక హెచ్చరికే అవుతుంది. అలాగే వారిని అదుపు చేయడంలో తటపటాయిస్తున్న పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన సూచన అవుతుంది. అయితే, ఇది ఇక్కడితో సమసిపోదు. ప్రధాని ప్రకటన తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆచరణలో అది ఎలాంటి ఫలితాన్నిచ్చిందో అందరూ గమనిస్తారు. ప్రార్థనాలయాల విధ్వంసమైనా, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలైనా ఆగాలంటే కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతోనే బీజేపీ అధిక సంఖ్యలో సీట్లు సంపాదించింది. అయితే ఇందుకు భిన్నంగా సాగుతున్న పరిణామాలు చాలామందిలో నిరాశ కలిగించాయి. ఒక గట్టి ప్రత్యామ్నాయాన్ని చూపగలిగిన పక్షం రంగంలోకి దిగితే బీజేపీని ఓడించడం ఖాయమని ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయి. ఒబామా అంతటి వ్యక్తి ఇక్కడి పరిస్థితుల గురించి వ్యాఖ్యానాలు చేయడంవల్లనో...ఢిల్లీ ఎన్నికల ఫలితాలవల్లనో నరేంద్ర మోదీ ఇన్నాళ్లకు ఈ ప్రకటన చేశారని కొందరంటున్నారు. అందులో నిజానిజాల సంగతెలా ఉన్నా మోదీ చేసిన ప్రకటన ఒక మంచి పరిణామం. దీంతోపాటు ఇకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తమ పార్టీ నేతలపై ఆయన కఠిన చర్యలు తీసుకోగలిగితే ప్రజల్లో ఆయనపై విశ్వాసం ఇనుమడిస్తుంది. -
ఒక్క పేరులో బంధించలేం
కోకొల్లలుగా దేవుళ్లు ఉన్న ఈ ప్రపంచంలో, నిజమైన దేవుడు ఎవరో అర్థం కాక అనేకులు సతమతమౌతూ ఉంటారు. తమ దేవుడే నిజమైన దేవుడని ప్రతి మతస్థుడూ చెబుతాడు. అయితే సనాతన ధర్మం ఏకైక భగవానుని ఆరాధించాలని ప్రబోధిస్తోంది. భగవంతుడొక్కడేనని, ఆయనే పూజనీయుడని, సమస్త ఘనతకు, మహిమకు పాత్రుడనీ ఋగ్వేదం చెబుతోంది. దేవుడొక్కడేనని బ్రహ్మసూత్రం సంకేతపరుస్తోంది. అలాగే బైబిలు, ఖురాన్ గ్రంథాలు కూడా దేవుడొక్కడే అని ప్రవచిస్తున్నాయి. అందుకే సృష్టికర్త, మహాశక్తిమంతుడు, మహోన్నతుడు, సర్వాంతర్యామి; కరుణ, దయ, ప్రేమ కలిగిన ఆ దేవ దేవుణ్ణి మనం ఒక్క పేరులో బంధించలేం. ఎందుకంటే ప్రతి పేరుకూ ఒక అర్థం ఉంటుంది. భగవంతునికున్న భిన్న లక్షణాలన్నీ వివరించడానికి ఈ భూప్రపంచమంత విశాలమైన కాగితం మీద, వృక్షాలన్నిటినీ కలంగా మార్చి, సముద్ర జలాలన్నిటినీ సిరాలా ఉపయోగించి రాసినా పూర్తిగా ఆయన్ని వర్ణించలేమని ఖురాన్ చెబుతోంది. అంచేత సత్యం ఒక్కటే. దేవుడు ఒక్కడే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించిననాడు, మతం పేరిట జరుగుతున్న అనర్థాలు సమసిపోయి, శాంతి స్థాపన జరుగుతుంది. లోకం స్వర్గమయం అవుతుంది. - యస్. విజయభాస్కర్ -
నిఘా నీడలో టీవీవీ మహాసభలు
నల్లగొండలో మొదలైన సమావేశాలు అనుమతికి ససేమిరా అన్న పోలీసులు హరగోపాల్ జోక్యంతో అనుమతి నల్లగొండ అర్బన్: నల్లగొండ వేదికగా గురువారం ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) రాష్ట్ర 4వ మహాసభలు నిఘానీడలో కొనసాగాయి. తొలుత అసలు మహాసభల నిర్వహణకే అంగీకరించని పోలీసులు, ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య అనుమతినిచ్చారు. కానీ పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి సభావేదిక వసుంధర ఫంక్షన్‌హాల్ వరకు ర్యాలీకి అంగీకరించలేదు. దీంతో రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభలు గురువారం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య వక్త ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే మాట్లాడుతూ సభకు అనుమతివ్వకుండా పోలీసులు ఇబ్బంది పెట్టడం దురదృష్టకరమన్నారు. ఇది భార త రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. దేశంలో ఒకే సంస్కృతి, ఒకే మతం అనే విధంగా మోదీ సర్కారు పాలన సాగిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఫాసిజాలను తలపిం చే విధంగా పరిపాలిస్త్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామిక విలువల కోసం విద్యార్థులు, యువకులు పోరాడాలని పిలుపునిచ్చారు. మహాసభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాశీం, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డి.విజయ్, టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, ఎ.నర్సింహ్మారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా కళామండలితో పాటు ఆర్.నారాయణమూర్తి కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. హరగోపాల్ చొరవతో.. తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర మహాసభల నిర్వహణకు స్థానిక పోలీసులు ససేమిరా అన్నారు. మహాసభ నిర్వహించాల్సిన ఫంక్షన్‌హాల్‌కు పోలీసులు తాళం వేశారని నిర్వాహకులు ఆరోపిం చారు. మహాసభల నిర్వహణలో అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందన్న నెపంతో అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మహాసభలు నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా లేదా అని టీవీవీ నేతలు ప్రశ్నిం చారు. కాగా, నిర్వాహకులను పిలిపించి సభకు సంబంధించిన అన్ని వివరాలను జిల్లా పోలీస్ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ చొరవ కారణంగానే సభకు పోలీసులు అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో ఈ విషయమై ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అయితే, వేదిక వద్ద పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాశారు. మఫ్టీలో నిఘా పెట్టారు. మహాసభల నిర్వహణను వీడియో తీయించారు. -
మతం పేరుతో ఘర్షణలొద్దు
పరమత సహనం మన విధానం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు న్యూఢిల్లీ: సమాజంలో సంఘర్షణలకు మతం కారణం కారాదని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పిలుపునిచ్చారు. మతాల మధ్య శాంతి, సహ నం, సౌభ్రాతృత్వ పరిఢవిల్లాలని ఆకాంక్షించా రు. సోమవారం నాటి 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. మతమనేది ఐక్యతను సాధించే సాధనమన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. మతం వివాద హేతువు కాకూడదని ప్రణబ్ స్పష్టం చేశారు. పరమత సహనం మన విధానమని గుర్తుచేశారు. ఐకమత్యమే బలమని, ఆధిక్య భావన బలహీనత అని భారతీయ జ్ఞానం ఉద్భోదిస్తోందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. భారత్ నిలుపుకుంటూ వస్తున్న విలువలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుతీరిన తరువాత పలువురు బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ‘ప్రజాస్వామ్య పవిత్ర గ్రంథం మన రాజ్యాంగం. భిన్నత్వానికి ప్రతీకగా నిలిచిన భారతదేశ సామాజిక, ఆర్థిక పరివర్తనకు అది దిక్సూచిగా నిలిచింది’ అని ప్రణబ్ తన ప్రసంగంలో అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం: రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు కొన్నిసార్లు మన సంప్రదాయ విలువలకు వ్యతిరేకంగా పరిణమిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. చట్టం ముందు అన్ని మతాలు, అన్ని విశ్వాసాలు సమానమనే విధానానికి కట్టుబడి ఉండడం భారత్ బలమని స్పష్టం చేశారు. ప్రపంచంలో మతోన్మాద హింస పెచ్చరిల్లుతున్న సమయంలో.. విశ్వాసానికి, రాజనీతికి మధ్య ఉన్న సంబంధానికి మనమిచ్చిన నిర్వచనం భారత్‌ను బలమైన శక్తిగా నిలిపిందని వివరించారు. పాకిస్తాన్ చర్యలను పరోక్షంగా విమర్శిస్తూ.. ‘దేశాల మధ్య ఘర్షణల్తో సరిహద్దులు రుధిర దారులవుతున్నాయి. ఉగ్రవాదం సరిహద్దులు దాటి విస్తరిస్తోంది. శాంతి, అహింస, పొరుగుదేశాలతో సఖ్యత భారత విదేశాంగ విధానంలో కీలకమైనవి. అయితే, మన అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించే శత్రువుల పట్ల అలక్ష్యంగా ఉండబోం’ అని ప్రణబ్ తేల్చి చెప్పారు. భారతీయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసే శక్తులను ఓడించే శక్తిసామర్ధ్యాలు భారత్‌కు ఉన్నాయన్నారు. ఆర్థికరంగంలో 2015 సంవత్సరం ఆశావహంగా ప్రారంభమైందని ప్రణబ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాల్లో 5% మించి వృద్ధి రేటు నమోదవడం శుభసూచకమన్నారు. మహిళల భద్రత మన బాధ్యత: అత్యాచారాలు, హత్యలు, వేధింపులు, కిడ్నాప్‌లు, వరకట్న హత్యలు.. సమాజంలో మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందన్నారు. -
సత్యం అసంపూర్ణం... అంతరార్థం అనంతం
ఈ కాలమ్ మీదే చర్చా వేదిక మతం గురించి విననివారు, తెలియని వారు ఉండరు. పరమార్ధాన్ని గ్రహించే వ్యక్తి స్థాయిని బట్టి మత గ్రంథ రహస్యాలు తెలుస్తాయి. సామాన్యుని దృష్టిలో మతం అంటే పండుగలు, ఆచార సంప్రదాయాలు పాటించడం. అలాగే పండితుని గ్రంథ విశ్లేషణ వల్ల మతం అంతరార్థం, భావ ఘనత తెలుస్తాయి. అయితే ప్రధానంగా సామాన్యుడి వల్లనే మతాచరణ బలపడడం గానీ, బలహీన పడడం గానీ జరుగుతుంది. ఇందుకు నిదర్శనం గత కాలంలో బహు జనాదరణ పొందిన బౌద్ధమతం నేడు అల్పసంఖ్యాక మతంగా మిగిలిపోవడం. అంచేతే మతాల మధ్య పోలికలను వదిలి... పాండిత్యం కన్నా అర్థం మిన్న అని గమనించాలి. స్థూలంగా ఏ మత పరమార్థం అయినా రుజు మార్గాన్ని, సత్యమార్గాన్ని అనుసరించడమే. పవిత్ర గ్రంథాలలో బయటకు కనిపించే అర్థం ఒకటి కాగా, రహస్యార్థం మరొకటి లోపల ఇమిడి ఉంటుంది. మహాయోగి అరవిందుడు ‘ఆన్ ది వేద’ గ్రంథంలో ఈ రహస్య విషయాలను వివరించాడు. ఉదాహరణకు ‘గో’ అనగా వెలుగు అని అర్థం. మనం అనుకునే గోపూజ అంటే వెలుగును పూజించడం అని భావించాలి. స్వామి వివేకానంద తన ‘రాజయోగ’ పుస్తకంలో మనస్తత్వ రీత్యా కొన్ని మాటల అంతరార్థాలను వివరించాడు. ఉదా: వేదకాల దైవం అయిన ఇంద్రుడు సోమరసం తాగినప్పుడు తన్మయత్వంలో అడిగినవి ఇస్తాడని భావన. ఇది విపరీత, విడ్డూర ఆలోచన. వాస్తవానికి కోరికలు తీర్చేది మనస్సు. ఇంద్రియాలకు అధిపతి మనస్సు కనుక. ఇక్కడ ఇంద్రుడు అంటే మనసు అనుకోవాలి. ఇక దైవత్వం అంటే వైభవం, ప్రకాశనం. వైదిక మతం దైవాన్ని ఒకే ఆధ్యాత్మిక భావనతో సత్యం, జ్ఞానం, అనంతరం, ప్రజ్ఞ, అహం అని పలు విధాలుగా నిర్వచనాలు చెప్పింది. ఇలా విశ్లేషిస్తూ పోతే వేద సత్యాలు కూడా పూర్తి కాలేదు అనిపిస్తోంది. ఇంకా అర్థం చేయించవలసినవి రేపటి రుషులే రాయాలి. - డాక్టర్ ఎ.వి.రత్నారెడ్డి, ఎం.ఎ., పీహెచ్.డీ (రిటైర్డ్ రీడర్ ఇన్ పొలిటికల్ సైన్స్), ఎస్.ఎస్.ఎన్. కళాశాల, నరసరావుపేట చిత్తూరు నుండి డి.ప్రభావతి రాసిన ‘అయినా... ఇంకా కాలుస్తూనే ఉన్నారు’ లేఖకు స్పందన... సామాజిక సృహ ఉద్యమం మొదలు పెట్టాలి... ప్రభావతిగారు ఎదుర్కొన్న సమస్యలాంటిదే చాలామందికి ఎదురవుతుంటుంది. బహిరంగ ధూమపాన సమస్య మాత్రమే కాదు... మరో సమస్య కూడా. పోస్టాఫీసులు, బ్యాంకులు, రైల్వే టికెట్టు కౌంటర్ల దగ్గర క్యూలలో నిల్చొని ఉన్నవారిని దాటి నేరుగా కౌంటర్ దగ్గరకు వెళ్లేవారిని ప్రశ్నిస్తే ఛీత్కారమే ఎదురవుతుంది. ‘స్వచ్ఛ భారత్’ మంచి ఆలోచనే. అయితే అంతకంటే ముందు ‘సామాజిక స్పృహ’ అనే ఉద్యమానికి ఊపిరి పోయాలి. ప్రతి వ్యక్తిలోనూ సామాజిక స్పృహ కలిగించే ప్రయత్నం చేయాలి. ‘సభ్యత’ అంటే ఏమిటి? అనే దాని గురించి ప్రచారకార్యక్రమాలు నిర్వహించాలి. - తుమ్మల చిన్నపరెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్, తిరుపతి పాఠకులకు ఆహ్వానం ‘ఈ కాలమ్ మీదే’ అనే ఈ చర్చావేదికలో పాల్గొనండి. చర్చనీయాంశం మీ ఇష్టం. ఏ సామాజిక అంశాన్నయినా, ఆలోచననైనా మీరు చర్చకు పెట్టొచ్చు. మీ వాదనను వినిపించవచ్చు. దానిపై మిగతా పాఠకులనూ చర్చకు ఆహ్వానిస్తుంది సాక్షి ఫ్యామిలీ. వీటిని ప్రతి సోమవారం ప్రచురిస్తుంది. వెంటనే రాసి పంపండి. మీ చర్చనీయాంశం పంపవలసిన చిరునామా: ‘ఈ కాలమ్ మీదే’ సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 . ఇ-మెయిల్: sakshireaders@gmail.com -
మత మార్పిళ్ళపై పార్లమెంట్లో మంటలు Part 2
-
మత మార్పిళ్ళపై పార్లమెంట్లో మంటలు Part 1
-
మత మార్పిళ్ళపై అట్టుడికిన సభ
-
దొంగ దేవుళ్లు మతానికి చేటు
మన దేశంలోని ప్రతి మతంలోనూ బూటకపు దేవుళ్లు, మోసగాళ్లు భక్తులకు తమను తాము హోల్ సేల్‌గా అమ్మేసుకుంటున్నారు. రామ్‌పాల్ లాంటి వ్యక్తి.. విశ్వాసపు ఫ్యాక్టరీనే పెట్టేసి, అసెంబ్లీ లైను మీద అతి సరళమైన పరిష్కారాలను తయారు చేసేసి, నగదు ధర వసూలు చేసి మరీ పేద ప్రజల చేత మింగించేస్తున్నప్పుడు... ఇది ఆందోళన చెందాల్సిన సమయమే. వంచన నీలినీడల్లో జరిగే ఈ భ్రమాత్మక వ్యాపారం భళ్లున బద్దలైనప్పుడు ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించాల్సిందే. కానీ పోలీసు అణచివేత సమాధానం కాదు, ఈ బూటకపు దేవతల నుండి భగవంతుడ్ని కాపాడటం కోసం మన నేతలు నోళ్లు విప్పి తీరాలి. మతానికి ఉండే శక్తి అంతా ప్రశ్నలకు సమాధానాలను చెప్పే దాని సామర్థ్యంలోనే ఉంటుంది. అయినాగానీ అతితరచుగా, ఇప్పుడు హర్యానాలో జరిగినట్టుగా దేవతలమని చెప్పుకునే దొంగ బాబాలు పుట్టుకొస్తూనే ఉంటారు, ప్రశ్నలను సంధిస్తూనే ఉంటారు. మతం హేతుబద్ధతకు విరుగుడు మందేమీ కాదని కనీసం నా అభిప్రాయం. అయినాగానీ ఆ విషయంలో ఏదో ఓ మూల అపనమ్మకం తొంగి చూస్తూనే ఉంటుంది. విశ్వాసం నుండే మతం పుడుతుంది. విశ్వాసం మానవ మస్తిష్కపు పరిధికి వెలుపల ఉంటుంది. అస్తిత్వ సృష్టిలో భాగమైన మానవుని మెదడు అస్తిత్వపు హేతుబద్ధతను లేదా మరణానికి అర్థాన్ని అవగతం చేసుకోలేనిదని బోధపడే వరకు విశ్వాసం అలా మస్తిష్కానికి వెలుపలే ఉంటుంది. నాస్తికులు మాత్రమే మరణాన్ని విశ్వసిస్తారు. సంశయాత్ములకు మరణమంటే అంతుబట్టని దానిలోకి వేసే అడుగు. ఇక ఆస్తికులకైతే మరణమంటే పరలోకానికి సాగే పరివర్తన. భూమిపై బతికుండగా మనం ఏమి చేశామనే దానికి ఒక విధమైన జవాబుదారీతనం మనం వెళ్లే ఆ పరలోకపు పూర్తి స్వభావాన్ని నిర్ణయిస్తుంది. ఇహలోక, పరలోకాల మధ్య ఈ అనుసంధానానికి హామీ ఉండటమే స్థూలంగా నైతిక వ్యవస్థ అమరికకు దోహదపడుతుంది. అయినప్పటికీ దివ్యశక్తి మానవ స్వేచ్ఛాభీష్టానికి సందును కూడా విడుస్తుంది. అతి కటువైన సన్నటి రేఖ మీదుగా తర్కాన్ని సాగతీస్తే, పాశవికత నాస్తికత్వపు తీవ్ర వ్యక్తీకరణ అని సైతం మనం అనగలుగుతాం. ఎందుకంటే దివ్యశక్తి సృజనాత్మక, ప్రశాంత మేధస్సును తిరస్కరించేవారు మాత్రమే క్రూర చర్యలకు లేదా హత్యలకు లేదా అల్లర్లకు పాల్పడతారు. మరి మతం పేరిట నియంతలు పాశవికతను ప్రదర్శించిన ప్పుడో? అలాంటి నయవంచకుల కోసం ప్రతి మతమూ నరకం అనే ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం కాకతాళీయం కాదు. నైతికతను ఆమోదనీయంగా నిర్వచించడమనేదే బహుశా అత్యంత చిక్కు సమస్య కావచ్చు. అతి తరచుగా అధికారంలోని ఉన్నత వర్గీయులు నైతికతను చెరపట్టి, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు దోహదపడే విధంగా దాన్ని తిరగరాయడం జరిగింది. అలాంటి దురన్యాయానికి ఆచరణాత్మక వాహిక మతమే. కాబట్టే 18వ శతాబ్దపు చివ ర్లో ఫ్రాన్స్ ప్రజలు తిరుగుబాటు చేసి బూర్బన్ రాజులు, రాణులు, ప్రభువుల తలలను ఎంత కసిగా నరికారో, అంతే కసిగా కేథలిక్కు చర్చినీ ధ్వంసం చేశారు. ఆ ఆలోచనను కార్ల్ మార్క్స్ మరొక సున్నితమైన మైలురాయిని దాటించి, మతం ప్రజల పాలిట మత్తుమందు అని నిర్వచించాడు. రెండు సువిశాల ఖండాల్లో, ప్రత్యేకించి తరతరాలుగా పేదలను మేధోపరమైన, ఆర్థికపరమైన మందకొడితనపు మత్తులో ముంచిన సమాజాల్లో మార్క్స్ ఆలోచన... సామాజిక నిర్వహణా చట్రం నుండి మతాన్ని నిషేధించే ప్రతిస్పందనను కలిగించింది. ఫ్రెంచి విప్లవకారులు ఊహించినదాని కంటే చాలా త్వరితంగానే కేథలిక్కు మతం ఫ్రాన్స్‌లో పునఃప్రత్యక్షమైంది. హేతుబద్ధత ముఖ్య ప్రవక్తయైన రోబిస్పియర్ హెర్క్యులస్ తరహాలో ఆల్ఫా దేవతను ఏర్పరచి ఫ్రాన్స్ ప్రజల దేవుని అవసరాన్ని తీర్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆల్ఫా ఆయన తల నేల రాలకుండా కాపాడలేకపోయింది. రష్యాలోని ఆర్థడాక్స్ (సనాతన) క్రైస్తవం, చైనాలోని కన్ఫ్యూషియస్-బౌద్ధం- క్రైస్తవం సుదీర్ఘ మైన, బాధాకరమైన నడిమి వయసు సంక్షోభాలను తట్టుకుని నిలిచాయి. సోవియట్ యానియన్ కాలంలో విజయవంతమైన వ్లాదిమిర్ పుతిన్ నేడు ఆర్థడాక్స్ చర్చికి ప్రణమిల్లి ప్రార్థనలు చేస్తారు. రష్యన్లు రొట్టెతోనే బతకలేరని ఆయనకు తెలుసు.‘‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’’లో ఇటీవల వెలువడ్డ తాజా కథనాన్ని విశ్వసించేట్టయితే... నేటి కమ్యూనిస్టు చైనాలో కమ్యూనిస్టు పార్టీ సభ్యుల కంటే క్రైస్తవ మతానుయాయులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ వైపరీత్యాన్ని పరిష్కరించడానికి చైనా ప్రభుత్వం ఆసక్తికరమైన డొంక తిరుగుడు దారిని ప్రయత్నిస్తోంది. చైనా, హాంకాంగ్‌లు ఒకే దేశమైనా రెండు రాజ్యాలు. చైనా నాస్తిక రాజ్యం, హాంకాంగ్ మత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలు ఉన్న రాజ్యం. ప్రభుత్వ అధికార అంగాలనన్నిటినీ చైనా ప్రభుత్వం శాసిస్తుంది. ఇక హాంకాంగ్ నాటకీయమైన ప్రత్యామ్నాయాన్ని ప్రదర్శిస్తోంది. భావజాల రణరంగంలో భారీ శతఘు్నలను మోహరిస్తోంది. రాబోయే ఇరవై ఏళ్లలో ఈ రెంటిలో ఏది నెగ్గుతుంది? మీకు పందాలు కాసే అలవాటుంటే హాంకాంగ్ మీదే పందెం కట్టండి. మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక మన దేశానికే వస్తే, మతానికి ఎదురైన ప్రతి సవాలూ ఊపునందుకోకముందే వీగిపోయింది. బెంగాల్‌లోని మార్క్సిస్టులు రాజకీయ పార్టీలను పక్కకు తోసేయగలమేగానీ, మనగలగాలంటే మాత్రం దుర్గాదేవి, కాళికాదేవి ముందు, నమాజుకు పిలుపునిచ్చే మసీదుల హక్కుకు తలవొంచాల్సిందేనని త్వరగానే గుర్తించారు. హిందువులు స్వర్గసీమలోని అమృతం కోసం వేచి చూస్తుండటంతో, ముస్లింలు జన్నత్(స్వర్గం)లోని తస్నీమ్ (పవిత్ర నది)జలాల కోసం దప్పికగొని ఉండటంతో ‘‘మత్తు మందు’’ సిద్ధాంతం చతికిలబడింది. మన దేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చలేకపోవడం వల్ల మన వాళ్లలో నయవంచనకు గురయ్యే అవివేకం పెరిగి ఉండాలి. వర్తమాన భారతావనికి నాస్తికత్వం నుంచి లేదా దాని బంధుగణం నుండి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ప్రతి మతంలోనూ బూటకపు దేవుళ్లు, మోసగాళ్లు మత విశ్వాసులకు హోల్‌సేల్‌గా తమను తాము మార్కెట్ చేసుకుంటున్నారు. దీనివల్ల మాత్రం మతానికి కొంత ముప్పు పొంచి ఉంది. సాధూలు, సావంత్‌లు, ఇమామ్‌లు అంతా అవినీతిపరులు కాని మాట నిజమే. అయినా ఈ ముప్పు గురించి నొక్కి చెప్పక తప్పదు. రామ్పాల్లాంటి వ్యక్తి ఒక విశ్వాసపు ఫ్యాక్టరీనే పెట్టేసి, అసెంబ్లీ లైను మీద అతి సరళమైన పరిష్కారాలను తయారు చేసేసి నగదు ధర వసూలు చేసి మరీ పేద ప్రజల చేత మింగించేస్తున్నప్పుడు.... ఇది ఆందోళన చెందాల్సిన సమయమే. వంచన నీలినీడల్లో జరిగే భ్రమాత్మక వ్యాపారం ఇది. ఈ వ్యాపారం భళ్లున బద్దలైనప్పుడు ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాను చేయాల్సినది చేయకతప్పదు. కానీ పోలీసు అణచివేత సమాధానం కాదు, రాజకీయ నాయకత్వపు ఒప్పించే శక్తి సామర్థ్యాలే పరిష్కారం. తమకు తామే దేవతలుగా ప్రకటించేసుకున్న ఈ బూటకపు దేవతల నుండి భగవంతుడ్ని కాపాడటం కోసం మన నేతలు నోళ్లు విప్పి తీరాలి. ఎం.జె.అక్బర్ సీనియర్ సంపాదకులు -
మతం, ఉగ్రవాదం.. వేర్వేరు!
-
మతం, ఉగ్రవాదం.. వేర్వేరు!
* ఆ రెండిటి మధ్య ఏ సంబంధాన్నైనా ప్రపంచం తిరస్కరించాలి * ‘తూర్పు ఆసియా సదస్సు’లో ప్రధాని మోదీ పిలుపు * ఉగ్రవాదంపై పోరులో నిజమైన భాగస్వామ్యం కావాలి * సైబర్, స్పేస్‌లను అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి * ఎబోలా నిర్మూలనకు కలసికట్టుగా కృషిచేయాలి * ఇప్పుడు భారత విధానం ‘లుక్ ఈస్ట్’ కాదు ‘యాక్ట్ ఈస్ట్’ * రష్యా, చైనా సహా పలు దేశాల నేతలతో ప్రధాని భేటీ నేప్యితా: మతం, ఉగ్రవాదం.. రెండూ వేరువేరని, వాటి మధ్య ఎలాంటి సంబంధాన్నైనా అంతర్జాతీయ సమాజం తిరస్కరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలపై పోరులో నిజాయితీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేప్యితాలో గురువారం జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో ఆయన ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా ప్రధాని మెద్వదెవ్, చైనా ప్రధాని లీకెకియాంగ్ సహా 18 దేశాల నేతలు ఆ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఈ సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిజమైన అంతర్జాతీయ భాగస్వామ్యంతో కూడిన స్పందన అవసరమన్నారు. మానవత్వమున్న అందరూ ఇందులో కలసిరావాలన్నారు. ‘ఉగ్రవాద, తీవ్రవాద సవాళ్లు పెరిగాయి. వాటికి.. ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమరవాణా, నగదు అక్రమ చెలామణీకి దగ్గరి సంబంధం ఉంది’ అని పేర్కొన్నారు. సైబర్, అంతరిక్షం.. వీటిని విభేదాలకు కాకుండా అభివృద్ధికి, అనుసంధానతకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఆర్థిక రంగ సహకారంపై మాట్లాడుతూ.. ఈఏఎస్ సదస్సు సభ్యదేశాలు ‘సమతుల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’పై అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు, సేవల రంగాలకు సమాన ప్రాధాన్యతనిచ్చే ఈ ఒప్పందం వల్ల ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని మోదీ వివరించారు. 2015లోగా విశాల ‘ఆసియాన్ కమ్యూనిటీ’ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. సమగ్ర ఆసియా,పసిఫిక్ ప్రాంత సమైక్యతకు అది దారులు వేస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. ‘లుక్ ఈస్ట్’ టు ‘యాక్ట్ ఈస్ట్’ ఆర్నెళ్ల క్రితం తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత విధానమైన ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని మరింత క్రియాశీలంగా మార్చే ఉద్దేశంతో ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చామని మోదీ వివరించారు. తూర్పు ఆసియా దేశాల సదస్సు తమ యాక్ట్ ఈస్ట్ విధానానికి ప్రధాన భూమికగా నిలుస్తుందన్నారు. ‘మరే ఇతర అంతర్జాతీయ వేదిక కూడా ఇంత భారీ స్థాయిలో విశ్వ జనాభాను, యువతను, ఆర్థిక, సైన్య సంపత్తిని ప్రతిబింబించదు. అలాగే మరే ఇతర వేదిక కూడా ఈ స్థాయిలో శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం కృషి చేయదు’ అని ఈఏఎస్‌లోని 18 దేశాల శక్తి సామర్ధ్యాలను మోదీ చాటిచెప్పారు. గత 8 సదస్సుల్లో అనేక రంగాల్లో పరస్పర సహకారానికి దారులు వేసుకున్నామన్న మోదీ.. ఇంధన రంగంలో.. ముఖ్యంగా స్వచ్చమైన సౌరశక్తి ఉత్పత్తిలో సభ్య దేశాలు భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అంటువ్యాధులను నిర్మూలించడంలో అంతర్జాతీయంగా అవసరమైన పరస్పర సహకారాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఎబోలా నిర్మూలనకు భారత్ 1.2 కోట్ల డాలర్లను అందించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఎబోలీ తీవ్రంగా ఉన్న లైబీరియాలో ఐరాస కార్యక్రమంలో భాగంగా భారత్‌కు చెందిన పోలీసులు 251 మంది ఉన్నారన్నారు. సదస్సు సందర్భంగా నేప్యితాలోని మయన్మార్ ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ సెంటర్లో పలువురు కీలక ప్రపంచ నేతలతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు. మోదీ చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నాం త్వరలో మోదీ చేయనున్న చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని చైనా ప్రధాని లీ కెఖ్వియాంగ్ పేర్కొన్నారు. నేప్యితాలో గురువారం మోదీ, లీ మొదటిసారి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల్లోని ఆర్థిక సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారత పర్యటన తమకు మరపురాని జ్ఞాపకమని ఈ సందర్భంగా మోదీ లీ కెఖ్వియాంగ్తో అన్నారు. భారత్ మాకు విలువైన భాగస్వామి భారత్ రష్యాకు అత్యంత సన్నిహితమైన, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. గురువారం మోదీతో మెద్వదేవ్ భేటీ అయ్యారు. రెండు దేశాల రాష్ట్రాలు, ప్రాంతాల సమాఖ్య కేంద్రాల అవసరాన్ని మోదీ వివరించారు. దానివల్ల ప్రాంతీయ సహకారం మరింత పెరుగుతుందన్నారు. 2001లో తన రష్యా పర్యటనను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. మలేసియా దేశ పనితీరు సమీక్షా విధానం భేష్ బుధవారం మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో భేటీ సందర్భంగా.. ఆ దేశ ప్రభుత్వ పనితీరు సమీక్షా విధానాన్ని మోదీ ప్రశంసించారు. భారత్‌లోనూ ఆ తరహా విధానాన్ని అవలంబించే విషయంపై చర్చించారు. భారత గృహనిర్మాణ రంగంలో మలేసియా కంపెనీలు పాలు పంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమరవాణాలపై ఆసియాన్ దేశాలు, భారత్‌లు కలసికట్టుగా పోరు సాగించాల్సి ఉందన్నారు. ఫిలిపై్పన్స్ అధ్యక్షుడు బెనినో అక్వినో, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విదోడొలతోనూ మోదీ సమావేశమయ్యారు. -
స్నేహమెంతో మధురం!
ఆగస్టు 3 స్నేహోత్సవం అవి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న రోజులు. ఒకనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని శిబిరానికి వచ్చి ‘‘కర్ణా’’ అని పిలుస్తాడు. శ్రీకృష్ణుని గొంతు విని కర్ణుడు వడివడిగా కృష్ణుని వద్దకు వచ్చి అతనికి నమస్కరించి ‘‘కృష్ణా... ఏమిటి ఇంత రాత్రి వేళ ఈ రాక’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణునికి అతని జన్మ వృత్తాంతం చెప్పి పాండవుల పక్షంలోకి రమ్మని కోరుతాడు. కర్ణుడు చిన్నగా నవ్వి, ‘‘కృష్ణా, నేనెవరన్నదీ నాకు తెలుసు. కురుక్షేత్ర సంగ్రామంలో గెలుపొందేది పాండవులే. ధర్మం పాండవుల పక్షాన ఉంది కనుకనే నువ్వు పాండవుల పక్షాన చేరి ధర్మ సంరక్షణ చేస్తున్నావు. అధర్మ వర్తనులైన కౌరవులు ఎన్నటికీ గెలవరు. ఆ విషయం నాకు తెలుసు’’ అన్నాడు. ‘‘ఇంత తెలిసినవాడివి పాండవుల పక్షాన నువ్వెందుకు చేరడం లేదు’’ అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు. ‘‘దుర్యోధనుడు నన్ను నమ్ముకునే పాండవులతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నన్ను నమ్మిన దుర్యోధనుడిని ఒంటరిని చేసి పాండవులతో చేరడం మిత్రద్రోహం అనిపించుకోదా? నిజమైన స్నేహితునిగా నేను ఉండాలనుకుంటున్నాను’’’అని అన్నాడు కర్ణుడు. తన జన్మం గురించి తెలిసినా, దుర్యోధనుని విడిచి వెళ్లక అతనికి ధైర్యం చెప్పిన ధీశాలి కర్ణుడు. స్నేహానికి ప్రతిరూపం అతడు. ఇక కృష్ణ, కుచేలుర మైత్రి అపురూపమైనది. సాందీపుని వద్ద కృష్ణ, కుచేలురు కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో వారిరువురి మధ్యా స్నేహం ఏర్పడింది. విద్యాభ్యాస కాలమంతా కలసి ఉన్న కృష్ణ, కుచేలురు విద్యాభ్యాసం తర్వాత విడిపోయారు. అధిక సంతానంతో కుచేలుడు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాడు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టలేకపోతున్నాడు. కుటుంబమంతా పస్తులతో గడుపుతున్నారు. అటువంటి సమయంలో కుచేలునికి శ్రీకృష్ణుడు జ్ఞప్తికి వచ్చాడు. శ్రీకృష్ణుని కలసి తన పరిస్థితిని వివరిస్తే అతను కనికరిస్తాడని భావించి కృష్ణుని కలిసేందుకు నిర్ణయించుకున్నాడు. బంధువుల ఇళ్లకు వెళ్లేటప్పుడు, స్నేహితులను చూసేందుకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు. మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్లాలి అని తర్జన భర్జన పడి కొన్ని అటుకులను మూటగా కట్టుకుని ద్వారకకు బయలుదేరాడు కుచేలుడు. కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడు కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కుశలమడిగాడు. ‘‘మిత్రమా! చాలా రోజులకు కలుసుకున్నాం కదా. ఈ స్నేహితునికి తినడానికి ఏమైనా తెచ్చావా?’’ అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు ఎంతగానో సిగ్గుపడిపోయాడు. ఏ సమాధానమూ చెప్పకుండా చేష్టలుడిగి అలాగే ఉండిపోయాడు. కృష్ణుడే అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని కృష్ణునికి ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే కుచేలుడు తను, తన కుటుంబం ఎంతగా బాధపడుతున్నదీ కృష్ణునికి చెప్పకుండానే తిరుగుముఖం పట్టాడు. సర్వం తెలిసిన శ్రీకృష్ణుడు కుచేలుడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు. ఇటువంటి నిస్వార్థ స్నేహమే కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ, కర్ణులను ఆదర్శగా తీసుకుని స్నేహం చెయ్యాలి. - మందరపు సోమశేఖరాచార్యులు -
దారిద్ర్యానికి, ఆకలికి మతం లేదు: రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దారిద్ర్యానికి, ఆకలికి మతం అనేది లేదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సోమవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇంతపెద్ద దేశంలో ఎన్నికలు శాంతియుతంగా జరగడం ముదావహమన్నారు. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘాన్ని అభినందించాలన్నారు. ఈ ఎన్నికలు ఆశావహ దృక్పథంలో జరిగాయని, 66.4 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమన్నారు. కుల, మత సరిహద్దలు చెరిపేసి అభివృధ్ధికి ప్రజలు ఓటు వేశారన్నారు. సుస్థిర ప్రభుత్వం ఎన్నుకున్నందుకు ప్రజలు అభినందనీయులు అని పేర్కొన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన లోక్‌సభ స్పీకర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉండే అన్ని సౌకర్యాలు గ్రామాలకు విస్తరించాలని సూచించారు. రాష్ట్రపతి ప్రసంగం... * మనం ప్రజల సేవ కోసమే పార్లమెంటులో ఉన్నాము. ఆ విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. * కొత్త సభ్యులందరికీ స్వాగతం. రాబోయే రోజుల్లో ఫలప్రదమైన పార్లమెంటు సమావేశాలను జరుపుకుందాం. కొత్త ఎంపీలు ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతినిధులు. * ప్రజలలో ఎన్నికలు, ఓటింగ్ పట్ల కనిపించిన అమిత ఆసక్తి మన ప్రగతికి చిహ్నం. ఇది ఆనందదాయకం. 66 శాతం ప్రజలు ఓటు వేయడం, ఒకే పార్టీ కి 30 ఏళ్ల తరువాత అధికారంలోకి రప్పించడం, కుల, మత, వర్గ భేదాలను విస్మరించి ఓటు వేయడం శుభపరిణామం. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' (దేశమంతా ఒక్కటే... దీన్ని ఘనమైన దేశంగా చేద్దాం) అన్నదే మా నినాదాం. పేదరికాన్ని నిర్మూలించడమే మా కర్తవ్యం. * కొత్త స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మంచిది. లోకసభ మహిళను స్పీకర్ గా తిరిగి ఎన్నుకోవడం ద్వారా మనం మహిళల పట్ల మన గౌరవాన్ని మరో మారు ప్రదర్శించాము. * ప్రభుత్వం కొత్త భూ విధానాన్ని అవలంబించబోతోంది. వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించడమే మా లక్ష్యం. ఈ సారి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని మాకు తెలుసు. అందుకే మేము అత్యవసర ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాము. * 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' (అందరి తోడుగా, అందరి అభివృద్ధి కోసం) అన్నదే నా ప్రభుత్వ విధానం. అతి తక్కువ ప్రభుత్వం, అత్యధిక పాలన అన్న విధానాన్నే నా ప్రభుత్వం పాటించబోతోంది. అందరు అల్పసంఖ్యాకులను పాలనలో, అభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తాం. * కొత్త ఆరోగ్య వైద్య విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. యోగ, ఆరోగ్య విద్యలకు పెద్దపీట వేయబోతున్నాం. స్వచ్ఛ భారత్ అన్న కొత్త ఉద్యమానికి నాంది పలకబోతున్నాం. కొత్త క్రీడా విధానం కూడా త్వరలో రాబోతోంది. స్కూలు విద్యలో క్రీడలు భాగం కాబోతున్నాయి. మంచి క్రీడాకారులను ముందే గుర్తించి, వారికి తగిన శిక్షణ నిచ్చే పనిని చేపట్టబోతున్నాం. * ప్రతి రాష్ట్రంలోనూ ఐఐటీ, ఐఐఎంలు. ప్రతి వ్యక్తికి వృత్తి నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు అందేలా చూస్తాం. * ప్రతి నీటి చుక్కా చాలా విలువైనది. అందుకే జలవనరుల పరిరక్షణకు ప్రాధాన్యం. త్వరలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (ప్రధానమంత్రి వ్యవసాయ నీటిపారుదల పథకం) ప్రారంభిస్తాం. -
శ్రీరాముడేమైనా బీజేపీ సొత్తా..?
-
కేంద్ర సమాచార కమిషన్‌ను ఎవరు నియమిస్తారు?
సోషల్ స్టడీస్ పౌరశాస్త్రం 1. సామాజిక వ్యవస్థాపనలోని ప్రాథమిక అంశం? ఎ) కులం బి) మతం సి) కుటుంబం డి) సంస్కృతి 2. {బహ్మ వివాహమంటే? ఎ) అమ్మాయి తండ్రి వరుడిని వెతికి తెచ్చి పెళ్లి చేయడం బి) అబ్బాయి తండ్రి వధువును వెతికి తెచ్చి పెళ్లి చేయడం సి) ఒకే తెగకు చెందిన అబ్బాయి, అమ్మా యి వివాహం చేసుకోవడం డి) వరుడు, వధువు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం. 3. {పజల పరస్పర అవసరాలను తీర్చే వ్యవస్థ? ఎ) కుటుంబం బి) ప్రభుత్వం సి) సమాజం డి) సంఘం 4. ఇతర సమాజాల నుంచి విలక్షణతను కలిగి ఉండే సమాజం? ఎ) గ్రామీణ సమాజం బి) పట్టణ సమాజం సి) ఆధునిక సమాజం డి) గిరిజన సమాజం 5. ‘కులం’ అంటే..? ఎ) ఒకే ఆచార సాంప్రదాయాలు గల ఒక వర్గం బి) వివాహం లేదా వంశానుక్రమంతో అను సంధానం పొందిన ఒక సమూహం సి) పురాతన కాలం నుంచి కుటుంబ బంధుత్వంతో ఏర్పడిన సమూహవర్గం డి) వర్ణ వ్యవస్థ నుంచి జనించిన ఒక వర్గంతో అనుసంధానించిన సమూహం 6. బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం పిల్లల ను పనిలో పెట్టుకునే వారికి విధించే శిక్ష? ఎ) 6 నెలల జైలు శిక్షా లేదా రూ.10 వేల జరిమానా బి) ఏడాది జైలు శిక్ష లేదా రూ. 25 వేల జరిమానా సి) రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా డి) 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 50 వేల జరిమానా 7. ‘పట్లా’ అంటే..? ఎ) చెంచుల తెగ పెద్ద మనిషి బి) కోయ తెగల పురోహితుడు సి) గోండుల గ్రామ పెద్ద డి) కొండ రెడ్ల ఆది దేవుడు 8. ‘పరివ్రాజకులు’ అంటే..? ఎ) గృహాన్ని వదిలి సత్యాన్వేషణకు బయలుదేరేవారు బి) మతపరమైన విద్యనభ్యసించేవారు సి) {పజల కష్టసుఖాలను తెలుసుకొని, పరిష్కారాలు చెప్పేవారు డి) సమాజంలో కలిసిపోయి రహస్యాలు తెలుసుకొనేవారు 9. దక్షిణ భారతదేశంలో క్రైస్తవ బోధనలను విసృ్తతంగా ప్రచారం చేసిన వారిలో ప్రము ఖుడు? ఎ) సెయింట్ పాల్స్ బి) సెయింట్ పీటర్ సి) సెయింట్ థామస్ డి) సెయింట్ ఫ్రాన్సిస్ 10. సెంట్రల్ విజిలెన్స కమీషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేసారు? ఎ) 1964 బి) 1966 సి) 1972 డి) 1975 11. ‘రాజ్యం మానవుడి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవతరించి, అతడికి ఉత్తమ జీవితం ప్రసాదించడానికి కొనసాగుతుంది’ అని చెప్పినవారు? ఎ) అరిస్టాటిల్ బి) మాకియవెల్లి సి) ప్లేటో డి) ఉడ్రో విల్సన్ 12. సంఘర్షణల పరిష్కార కర్త, సంస్థలకు సంస్థ అని దేనిని పిలుస్తారు? ఎ) ప్రభుత్వం బి) సమాజం సి) రాజ్యం డి) కుటుంబం 13. రాజ్యం అవసరం సమాజానికి లేదని వాదించేవారు? ఎ) పెట్టుబడిదారులు బి) భూస్వాములు సి) బూర్జువాలు డి) కమ్యూనిస్టులు 14. ‘రాజ్యం అంటే ఆచరణలో ప్రభుత్వం’ అని నిర్వచించినవారు? ఎ) జె.ఎస్.మిల్ బి) లాస్కీ సి) మాస్లో డి) హబ్స్ 15. ‘ప్రజా సమూహంలో కలిసి జీవించాలనే ప్రగాఢ వాంఛనే జాతీయత’ అని విశ్లేషించి నవారు? ఎ) సైమన్ బి) ఎల్టన్ మెమో సి) ఆర్నాల్డ్ టామన్బీ డి) కారల్ మార్క్స 16. జాతీయ భావాల వ్యాప్తికి బలమైన శక్తిగా పనిచేసేది? ఎ) భాష బి) కులం సి) మతం డి) సమాజం 17. ‘ఏకజాతి రాజ్యాలు ఆదర్శ రాజ్యాలు’ అని భావించింది? ఎ) మాంటేస్క్యూ బి) జె.ఎస్.మిల్ సి) జాన్లాక్ డి) ఉడ్రోవిల్సన్ 18. ‘జాతి’ అంటే...? ఎ) ఉమ్మడి సహకార గుణంతో లక్ష్యాత్మ కంగా వ్యవహరించే సమూహం బి) సాంస్కృతిక ఔన్నత్యంతో కూడిన సమూహ దృక్పథం గల వర్గ సమూహం సి) సంబంధ బాంధవ్యాల వల్ల ఏర్పడిన ప్రజా సమూహం డి) శక్తి సంబంధాల వల్ల జనించినటు వంటి ఉమ్మడి భావంతో ఉన్న మానవ సమూహం 19. ‘నేషిమో’ అంటే...? ఎ) పుట్టుక బి) జాతి సి) జాతీయత డి) సమూహం 20. రాజ్యం తరఫున సార్వభౌమాధికారం చలాయించేవారు? ఎ) అధికారులు బి) ప్రజలు సి) ప్రభుత్వం డి) నాయకులు 21. {పభుత్వానికి మూలం..? ఎ) రాజ్యం బి) రాజకీయ పార్టీలు సి) ప్రజా ప్రతినిధులు డి) ప్రజల సమ్మతి 22. ‘ప్రభుత్వం’ అంటే...? ఎ) {పజాభీష్టాన్ని ఆచరణలో పెట్టే యంత్రాంగం బి) రాజ్యాభీష్టాన్ని వ్యక్తం చేసి, అమలు పరిచే యంత్రాంగం సి) {పజాప్రతినిధులతో కూడిన అధికార యంత్రాంగం డి) {పజల అవసరాలను తీర్చే ప్రజలతో కూడిన వ్యవస్థ 23. ఆధునిక కాలంలో రాజ్యానికి ముఖ్యంగా కావాల్సింది? ఎ) సోదరభావంతో మెదిలే మానవులు బి) విజ్ఞానదాయకమైన సమాజం సి) సార్వభౌమాధికారం గల ప్రభుత్వం డి) అంతర్జాతీయ గుర్తింపు 24. ‘ది ప్రిన్స’ గ్రంథ రచయిత? ఎ) ప్లేటో బి) మాంటేస్క్యూ సి) ఆరిస్టాటిల్ డి) మాకియవెల్లి 25. ‘జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని’ బలపర్చింది..? ఎ) అబ్రహం లింకన్ బి) మార్టిన్ లూథర్ కింగ్ సి) ఉడ్రో విల్సన్ డి) జార్జీ వాషింగ్టన్ 26. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం? ఎ) 2002 బి) 2005 సి) 2006 డి) 2008 27. కేంద్ర సమాచార కమిషన్‌ను ఎవరు నియ మిస్తారు? ఎ) రాష్ర్టపతి బి) ప్రధానమంత్రి సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి) పార్లమెంట్ 28. రాష్ర్ట ప్రధాన సమాచార అధికారి జీత భ త్యాలు ఎవరితో సమానంగా వుంటాయి? ఎ) గవర్నర్ బి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి) కేంద్ర ఎన్నికల కమిషనర్ డి) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 29. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఎవరిది? ఎ) రాష్ర్ట సమాచార కమిషన్ బి) కేంద్ర సమాచార కమిషన్ సి) ప్రభుత్వం డి) ప్రజా సమాచార అధికారి 30. సమాఖ్య వ్యవస్థ విరుద్ధ లక్షణంగా పరిగ ణించేది? ఎ) ఏక పౌరసత్వం బి) ద్వంద్వ పౌరసత్వం సి) స్వతంత్ర న్యాయవ్యవస్థ డి) అధికారాల పంపిణీ 31. ‘మానవ హక్కుల దినం’గా ఏ రోజును జరుపుకుంటాం? ఎ) డిసెంబర్ 10 బి) సెప్టెంబర్ 5 సి) అక్టోబర్ 18 డి) నవంబర్ 24 32. జాతీయ మావన హక్కుల కమిషన్ ఏర్ప డిన సంవత్సరం? ఎ) 1991 బి) 1993 సి) 1994 డి) 1996 33. మానవ వికాసానికి కావాల్సిన హక్కు? ఎ) జీవించే హక్కు బి) స్వేచ్ఛా హక్కు సి) విద్యా హక్కు డి)స్వాతంత్య్ర హక్కు 34. హక్కులు రాజ్యాంగం అంతరాత్మ అని అభివర్ణించింది? ఎ) గాంధీజీ బి) అంబేద్కర్ సి) వల్లభాయ్ పటేల్ డి) జవహర్లాల్ నెహ్రూ 35. ‘హక్కులను పరిరక్షించే హక్కు’ ఎలాంటిది? ఎ) న్యాయబద్ధమైన హక్కు బి) చట్టబద్ధమైన హక్కు సి) శాసనబద్ధమైన హక్కు డి) సామాజిక హక్కు 36. రాజ్యం మద్ధతు లేని హక్కులు..? ఎ) నైతిక బి) పౌర సి) సహజ డి) మానవ 37. సమాచార కమిషనర్ల పదవీ కాలం? ఎ) 4 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు బి) ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు సి) 6 ఏళ్లు లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డి) మూడేళ్లు లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు 38. మానవ హక్కుల భావనను మొదటిసారిగా ఏ రాజ్యాంగంలో పొందుపర్చారు? ఎ) ఇంగ్లాండ్ బి) ఫ్రాన్స సి) భారత్ డి) అమెరికా 39. {పాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం కలిగినది? ఎ) ప్రభుత్వం బి) కేంద్ర కేబినెట్ సి) పార్లమెంట్ డి) సుప్రీంకోర్టు 40. సహజ హక్కుల సిద్ధాంతాన్ని మొదటిసారి గా రాజ్యాంగ ప్రక్రియలో పొందుపర్చిన తత్వవేత్త? ఎ) ప్లేటో బి)హ్యూగోగ్రేషియస్ సి) లూథర్ గల్లీక్ డి) అరిస్టాటిల్ 41. లోక్‌పాల్‌ను, లోకాయుక్తాను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ? ఎ) సంతానం బి) సర్కారియా సి) సేన్ డి) పటేల్ 42. మొదటిసారిగా లోకాయుక్త చట్టాన్ని రూపొందించిన రాష్ర్టం? ఎ) మహారాష్ర్ట బి) ఆంధ్రప్రదేశ్ సి) రాజస్థాన్ డి) ఒడిశా 43. లోక్ అదాలత్‌లను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎ) 2002 బి) 2004 సి) 1998 డి)1996 44. కేంద్ర సమాచార కమిషన్‌లో సభ్యుల సంఖ్య..? ఎ) 5 బి) 10 సి) 6 డి) 12 45. జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్? ఎ) రంగనాథ్ మిశ్రా బి) వెంకటాచలయ్య సి) జీవన్ రెడ్డి డి) రాజేంద్రబాబు సమాధానాలు 1) సి 2) ఎ, 3) సి 4)డి 5) బి 6) బి 7) సి 8) ఎ 9) సి 10) ఎ 11) ఎ 12) సి 13) డి 14) బి 15) సి 16) సి 17) బి 18) డి 19) ఎ 20) సి 21) డి 22) బి 23) డి 24) డి 25) సి 26) బి 27) ఎ 28) సి 29) సి 30) ఎ 31) ఎ 32) బి 33) సి 34) డి 35) బి 36) ఎ 37) బి 38) డి 39) సి 40) బి 41) ఎ 42) డి 43) ఎ 44) బి 45) ఎ