'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతపరమైన రిజర్వేషన్లను తెస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మతపరమైన రిజర్వేషన్లను తెరపైకి తెస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో మతపరమైన రిజర్వేషన్లను అమలు కానివ్వమని స్పష్టం చేశారు. పేద ముస్లింల అభివృదికి తాము వ్యతిరేకం కాదన్నారు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్ ఈ అంశాన్ని లేవనెత్తిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ దళితులపై వివక్ష చూపుతోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో తాడో పేదో తేల్చుకుంటామని హెచ్చరించారు. రానున్న మూడు నెలల్లో మండలస్థాయిలో ప్రభుత్వంపై ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు.