జైపూర్ : సాధారణంగా ఆస్పత్రికి వచ్చిన రోగిని (ఓపీ) పేరు, వయసు, ఏం వ్యాధి అడుగుతుంటారు. కానీ ఈ హాస్పటల్ తీరే వేరు. ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వారి మతం ఏంటో పక్కాగా చెప్పాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. స్థానిక సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రికిలో ఎదురైన ఈ ఘటనతో రోగులు షాక్‌కు గురయ్యారు. తాజాగా ఈ ఆస్పత్రి ప్రవేశపెట్టిన మొబైల్ సేవలలో సంక్షిప్త సందేశం ద్వారా ఓపీ తీసుకోవచ్చు. కానీ ఇందులో తప్పనిసరిగా మతం నమోదు చేయాలని సూచించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై వైద్యులను సంప్రదించగా కొంత మందికి వారి మతంను బట్టి రోగాలు సంక్రమిస్తాయని అందుకే ఈ విధంగా అడుగుతున్నామని తెలిపారు. వారి మతం తెలిస్తే వారికి వచ్చిన రోగాలకు సులువుగా వైద్యం చేయచ్చనే ఉద్దేశంతోనే ఇలా అడుగుతున్నామే తప్పా ఎలాంటి దురుద్ధేశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో రాజస్థాన్ ప్రభుత్వమే తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment