
కేంద్ర సమాచార కమిషన్‌ను ఎవరు నియమిస్తారు?
సోషల్ స్టడీస్ పౌరశాస్త్రం 1. సామాజిక వ్యవస్థాపనలోని ప్రాథమిక అంశం? ఎ) కులం బి) మతం సి) కుటుంబం డి) సంస్కృతి
సోషల్ స్టడీస్
పౌరశాస్త్రం
1. సామాజిక వ్యవస్థాపనలోని ప్రాథమిక అంశం?
ఎ) కులం బి) మతం
సి) కుటుంబం డి) సంస్కృతి
2. {బహ్మ వివాహమంటే?
ఎ) అమ్మాయి తండ్రి వరుడిని వెతికి తెచ్చి పెళ్లి చేయడం
బి) అబ్బాయి తండ్రి వధువును వెతికి తెచ్చి పెళ్లి చేయడం
సి) ఒకే తెగకు చెందిన అబ్బాయి, అమ్మా యి వివాహం చేసుకోవడం
డి) వరుడు, వధువు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం.
3. {పజల పరస్పర అవసరాలను తీర్చే వ్యవస్థ?
ఎ) కుటుంబం బి) ప్రభుత్వం
సి) సమాజం డి) సంఘం
4. ఇతర సమాజాల నుంచి విలక్షణతను కలిగి ఉండే సమాజం?
ఎ) గ్రామీణ సమాజం
బి) పట్టణ సమాజం
సి) ఆధునిక సమాజం
డి) గిరిజన సమాజం
5. ‘కులం’ అంటే..?
ఎ) ఒకే ఆచార సాంప్రదాయాలు గల ఒక వర్గం
బి) వివాహం లేదా వంశానుక్రమంతో అను సంధానం పొందిన ఒక సమూహం
సి) పురాతన కాలం నుంచి కుటుంబ బంధుత్వంతో ఏర్పడిన సమూహవర్గం
డి) వర్ణ వ్యవస్థ నుంచి జనించిన ఒక వర్గంతో అనుసంధానించిన సమూహం
6. బాలకార్మిక నిషేధ చట్టం ప్రకారం పిల్లల ను పనిలో పెట్టుకునే వారికి విధించే శిక్ష?
ఎ) 6 నెలల జైలు శిక్షా లేదా రూ.10 వేల జరిమానా
బి) ఏడాది జైలు శిక్ష లేదా రూ. 25 వేల జరిమానా
సి) రెండేళ్ల జైలు శిక్ష లేదా రూ.లక్ష జరిమానా
డి) 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 50 వేల జరిమానా
7. ‘పట్లా’ అంటే..?
ఎ) చెంచుల తెగ పెద్ద మనిషి
బి) కోయ తెగల పురోహితుడు
సి) గోండుల గ్రామ పెద్ద
డి) కొండ రెడ్ల ఆది దేవుడు
8. ‘పరివ్రాజకులు’ అంటే..?
ఎ) గృహాన్ని వదిలి సత్యాన్వేషణకు బయలుదేరేవారు
బి) మతపరమైన విద్యనభ్యసించేవారు
సి) {పజల కష్టసుఖాలను తెలుసుకొని, పరిష్కారాలు చెప్పేవారు
డి) సమాజంలో కలిసిపోయి రహస్యాలు తెలుసుకొనేవారు
9. దక్షిణ భారతదేశంలో క్రైస్తవ బోధనలను విసృ్తతంగా ప్రచారం చేసిన వారిలో ప్రము ఖుడు?
ఎ) సెయింట్ పాల్స్ బి) సెయింట్ పీటర్
సి) సెయింట్ థామస్
డి) సెయింట్ ఫ్రాన్సిస్
10. సెంట్రల్ విజిలెన్‌స కమీషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేసారు?
ఎ) 1964 బి) 1966
సి) 1972 డి) 1975
11. ‘రాజ్యం మానవుడి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవతరించి, అతడికి ఉత్తమ జీవితం ప్రసాదించడానికి కొనసాగుతుంది’ అని చెప్పినవారు?
ఎ) అరిస్టాటిల్ బి) మాకియవెల్లి
సి) ప్లేటో డి) ఉడ్రో విల్సన్
12. సంఘర్షణల పరిష్కార కర్త, సంస్థలకు సంస్థ అని దేనిని పిలుస్తారు?
ఎ) ప్రభుత్వం బి) సమాజం
సి) రాజ్యం డి) కుటుంబం
13. రాజ్యం అవసరం సమాజానికి లేదని వాదించేవారు?
ఎ) పెట్టుబడిదారులు బి) భూస్వాములు
సి) బూర్జువాలు డి) కమ్యూనిస్టులు
14. ‘రాజ్యం అంటే ఆచరణలో ప్రభుత్వం’ అని నిర్వచించినవారు?
ఎ) జె.ఎస్.మిల్ బి) లాస్కీ
సి) మాస్లో డి) హబ్స్
15. ‘ప్రజా సమూహంలో కలిసి జీవించాలనే ప్రగాఢ వాంఛనే జాతీయత’ అని విశ్లేషించి నవారు?
ఎ) సైమన్ బి) ఎల్టన్ మెమో
సి) ఆర్నాల్డ్ టామన్‌బీ డి) కారల్ మార్‌క్స
16. జాతీయ భావాల వ్యాప్తికి బలమైన శక్తిగా పనిచేసేది?
ఎ) భాష బి) కులం
సి) మతం డి) సమాజం
17. ‘ఏకజాతి రాజ్యాలు ఆదర్శ రాజ్యాలు’ అని భావించింది?
ఎ) మాంటేస్క్యూ బి) జె.ఎస్.మిల్
సి) జాన్‌లాక్ డి) ఉడ్రోవిల్సన్
18. ‘జాతి’ అంటే...?
ఎ) ఉమ్మడి సహకార గుణంతో లక్ష్యాత్మ కంగా వ్యవహరించే సమూహం
బి) సాంస్కృతిక ఔన్నత్యంతో కూడిన సమూహ దృక్పథం గల వర్గ సమూహం
సి) సంబంధ బాంధవ్యాల వల్ల ఏర్పడిన ప్రజా సమూహం
డి) శక్తి సంబంధాల వల్ల జనించినటు వంటి ఉమ్మడి భావంతో ఉన్న మానవ
సమూహం
19. ‘నేషిమో’ అంటే...?
ఎ) పుట్టుక బి) జాతి
సి) జాతీయత డి) సమూహం
20. రాజ్యం తరఫున సార్వభౌమాధికారం చలాయించేవారు?
ఎ) అధికారులు బి) ప్రజలు
సి) ప్రభుత్వం డి) నాయకులు
21. {పభుత్వానికి మూలం..?
ఎ) రాజ్యం బి) రాజకీయ పార్టీలు
సి) ప్రజా ప్రతినిధులు
డి) ప్రజల సమ్మతి
22. ‘ప్రభుత్వం’ అంటే...?
ఎ) {పజాభీష్టాన్ని ఆచరణలో పెట్టే యంత్రాంగం
బి) రాజ్యాభీష్టాన్ని వ్యక్తం చేసి, అమలు పరిచే యంత్రాంగం
సి) {పజాప్రతినిధులతో కూడిన అధికార యంత్రాంగం
డి) {పజల అవసరాలను తీర్చే ప్రజలతో కూడిన వ్యవస్థ
23. ఆధునిక కాలంలో రాజ్యానికి ముఖ్యంగా కావాల్సింది?
ఎ) సోదరభావంతో మెదిలే మానవులు
బి) విజ్ఞానదాయకమైన సమాజం
సి) సార్వభౌమాధికారం గల ప్రభుత్వం
డి) అంతర్జాతీయ గుర్తింపు
24. ‘ది ప్రిన్‌స’ గ్రంథ రచయిత?
ఎ) ప్లేటో బి) మాంటేస్క్యూ
సి) ఆరిస్టాటిల్ డి) మాకియవెల్లి
25. ‘జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని’ బలపర్చింది..?
ఎ) అబ్రహం లింకన్
బి) మార్టిన్ లూథర్ కింగ్
సి) ఉడ్రో విల్సన్ డి) జార్జీ వాషింగ్టన్
26. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం?
ఎ) 2002 బి) 2005
సి) 2006 డి) 2008
27. కేంద్ర సమాచార కమిషన్‌ను ఎవరు నియ మిస్తారు?
ఎ) రాష్ర్టపతి బి) ప్రధానమంత్రి
సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
డి) పార్లమెంట్
28. రాష్ర్ట ప్రధాన సమాచార అధికారి జీత భ త్యాలు ఎవరితో సమానంగా వుంటాయి?
ఎ) గవర్నర్
బి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సి) కేంద్ర ఎన్నికల కమిషనర్
డి) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
29. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఎవరిది?
ఎ) రాష్ర్ట సమాచార కమిషన్
బి) కేంద్ర సమాచార కమిషన్
సి) ప్రభుత్వం
డి) ప్రజా సమాచార అధికారి
30. సమాఖ్య వ్యవస్థ విరుద్ధ లక్షణంగా పరిగ ణించేది?
ఎ) ఏక పౌరసత్వం
బి) ద్వంద్వ పౌరసత్వం
సి) స్వతంత్ర న్యాయవ్యవస్థ
డి) అధికారాల పంపిణీ
31. ‘మానవ హక్కుల దినం’గా ఏ రోజును జరుపుకుంటాం?
ఎ) డిసెంబర్ 10 బి) సెప్టెంబర్ 5
సి) అక్టోబర్ 18 డి) నవంబర్ 24
32. జాతీయ మావన హక్కుల కమిషన్ ఏర్ప డిన సంవత్సరం?
ఎ) 1991 బి) 1993
సి) 1994 డి) 1996
33. మానవ వికాసానికి కావాల్సిన హక్కు?
ఎ) జీవించే హక్కు బి) స్వేచ్ఛా హక్కు
సి) విద్యా హక్కు డి)స్వాతంత్య్ర హక్కు
34. హక్కులు రాజ్యాంగం అంతరాత్మ అని అభివర్ణించింది?
ఎ) గాంధీజీ
బి) అంబేద్కర్
సి) వల్లభాయ్ పటేల్
డి) జవహర్‌లాల్ నెహ్రూ
35. ‘హక్కులను పరిరక్షించే హక్కు’ ఎలాంటిది?
ఎ) న్యాయబద్ధమైన హక్కు
బి) చట్టబద్ధమైన హక్కు
సి) శాసనబద్ధమైన హక్కు
డి) సామాజిక హక్కు
36. రాజ్యం మద్ధతు లేని హక్కులు..?
ఎ) నైతిక బి) పౌర
సి) సహజ డి) మానవ
37. సమాచార కమిషనర్ల పదవీ కాలం?
ఎ) 4 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు
బి) ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు
సి) 6 ఏళ్లు లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు
డి) మూడేళ్లు లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు
38. మానవ హక్కుల భావనను మొదటిసారిగా ఏ రాజ్యాంగంలో పొందుపర్చారు?
ఎ) ఇంగ్లాండ్ బి) ఫ్రాన్‌స
సి) భారత్ డి) అమెరికా
39. {పాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం కలిగినది?
ఎ) ప్రభుత్వం బి) కేంద్ర కేబినెట్
సి) పార్లమెంట్ డి) సుప్రీంకోర్టు
40. సహజ హక్కుల సిద్ధాంతాన్ని మొదటిసారి గా రాజ్యాంగ ప్రక్రియలో పొందుపర్చిన తత్వవేత్త?
ఎ) ప్లేటో బి)హ్యూగోగ్రేషియస్
సి) లూథర్ గల్లీక్ డి) అరిస్టాటిల్
41. లోక్‌పాల్‌ను, లోకాయుక్తాను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ?
ఎ) సంతానం బి) సర్కారియా
సి) సేన్ డి) పటేల్
42. మొదటిసారిగా లోకాయుక్త చట్టాన్ని రూపొందించిన రాష్ర్టం?
ఎ) మహారాష్ర్ట బి) ఆంధ్రప్రదేశ్
సి) రాజస్థాన్ డి) ఒడిశా
43. లోక్ అదాలత్‌లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 2002 బి) 2004
సి) 1998 డి)1996
44. కేంద్ర సమాచార కమిషన్‌లో సభ్యుల సంఖ్య..?
ఎ) 5 బి) 10 సి) 6 డి) 12
45. జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్?
ఎ) రంగనాథ్ మిశ్రా బి) వెంకటాచలయ్య
సి) జీవన్ రెడ్డి డి) రాజేంద్రబాబు
సమాధానాలు
1) సి 2) ఎ, 3) సి 4)డి 5) బి
6) బి 7) సి 8) ఎ 9) సి 10) ఎ
11) ఎ 12) సి 13) డి 14) బి 15) సి
16) సి 17) బి 18) డి 19) ఎ 20) సి
21) డి 22) బి 23) డి 24) డి 25) సి
26) బి 27) ఎ 28) సి 29) సి 30) ఎ
31) ఎ 32) బి 33) సి 34) డి 35) బి
36) ఎ 37) బి 38) డి 39) సి 40) బి
41) ఎ 42) డి 43) ఎ 44) బి 45) ఎ