Saketh Myneni
-
సాకేత్ జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ సంచలన విజయంతో బోణీ చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.తొలి రౌండ్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ క్రిస్టియన్ రోడ్రిగెజ్ (కొలంబియా)– రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీని కంగుతినిపించింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–రామ్ జంట ఐదు ఏస్‌లు సంధించింది. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.అనిరుధ్ జోడీ ముందంజ ఇదే టోర్నీలో ఆడుతున్న హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ భారత్‌కే చెందిన తన భాగస్వామి నిక్కీ కలియంద పూనాచాతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో మూడో సీడ్ అనిరుధ్–నిక్కీ ద్వయం 6–3, 7–5తో ఎస్కోఫియర్–బెనోట్ పెయిర్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఇసారో (థాయ్‌లాండ్) జంట 3–6, 5–7తో మొరెనో (అమెరికా)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.రిత్విక్ ద్వయం ముందంజసాక్షి, హైదరాబాద్: స్లొవాక్ ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ ముందంజ వేసింది. స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–4, 6–4తో భారత్‌కే చెందిన జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ ఈ మ్యాచ్‌లో కీలకదశలో పాయింట్లు గెలిచింది. తొలి సెట్లో ఒకసారి, రెండో సెట్లో ఒకసారి ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను బ్రేక్ చేసి తమ సర్వీస్‌లను కాపాడుకొని విజయాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీ కూడా డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) ద్వయం 6–3, 6–7 (2/7), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్)–మాట్వీ మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది.క్వార్టర్ ఫైనల్లో రష్మిక జోడీసాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ఓడిపోయిన రష్మిక... డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన తన భాగస్వామి వైదేహి చౌదరీతో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.ప్రపంచ 422వ ర్యాంకర్ గాబ్రియేలా డ సిల్వా ఫిక్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 300వ ర్యాంకర్ రష్మిక 5–7, 3–6తో ఓడిపోయింది. 88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ తొలి రౌండ్లో రష్మిక–వైదేహి జోడీ 7–6 (7/3), 6–4తో మూడో సీడ్ లీ యు యున్ (చైనీస్ తైపీ)–నీనా వర్గోవా (స్లొవేకియా) జంటపై సంచలన విజయం సాధించింది. -
టైటిల్ పోరుకు సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కెరీర్లో 16వ ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించడానికి భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని విజయం దూరంలో నిలిచాడు. చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో సాకేత్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) జంటతో నేడు జరిగే ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం తలపడుతుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో సాకేత్–రామ్‌కుమార్ 6–3, 6–2తో రెండో సీడ్ తొషిహిడె మత్సుయ్–కైటో యుసుగి (జపాన్)లపై నెగ్గగా... రిత్విక్–నిక్కీ పునాచా 6–3, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేకబ్ షానైటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ)లను ఓడించారు. 58 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సాకేత్–రామ్ జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. భారత జట్టులో సాకేత్
ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ మైనేని జట్టులోకి పునరాగమనం చేశాడు. 2022 సెప్టెంబర్‌లో నార్వేతో జరిగిన వరల్డ్ గ్రూప్ తొలి రౌండ్ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, యూకీ బాంబ్రీ, నిక్కీ పునాచా, దిగి్వజయ్ ప్రతాప్ సింగ్ జట్టులో ఇతర సభ్యులుగా ఉన్నారు. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగిన ఈ టోరీ్నలో సాకేత్–యూకీ ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో పోరాడి ఓడింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సాకేత్–యూకీ జంట 7–6 (7/2), 6–7 (2/7), 9–11తో టాప్ సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. సాకేత్–యూకీలకు 10,660 డాలర్ల (రూ. 8 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ గాలోవే (అమెరికా)–మిగేల్ ఎంజెల్ రేయస్ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
Myneni Saketh: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్ జోడీ
ATP 250 Dallas Open: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
Saketh Myneni- Yuki Bhambri: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్–మార్కస్ జిరోన్ (అమెరికా) జోడీపై గెలిచింది. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడు ఏస్‌లు సంధించారు. క్వార్టర్ ఫైనల్లో జూలియన్ క్యాష్–హెన్రీ ప్యాటర్న్ (బ్రిటన్)లతో సాకేత్–యూకీ ఆడతారు. చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం -
బ్యాంకాక్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సాకేత్-బాంబ్రీ జోడీ
నొంతాబురి (థాయ్‌లాండ్): గత ఏడాది ఏకంగా ఆరు ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్స్ సాధించి అదరగొట్టిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ కొత్త ఏడాదిలో ఆడిన రెండో టోర్నీలోనే టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ ఢిల్లీకి చెందిన తన సహచరుడు యూకీ బాంబ్రీతో కలిసి విజేతగా నిలిచాడు. గంటా 50 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్–యూకీ జోడీ 2–6, 7–6 (9/7), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)–అకీరా సాంటిలాన్ (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచింది. చాంపియన్‌గా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 4,645 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 77 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా టైటిల్‌తో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ తొమ్మిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 74వ ర్యాంక్‌కు, యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 90వ ర్యాంక్‌కు చేరుకుంటారు. తదుపరి సాకేత్–యూకీ జోడీ సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగనుంది. -
Korea Open 2022: సెమీఫైనల్లో సాకేత్–యూకీ జోడీ
కొరియా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రి జోడీ 6–3, 6–4తో రోడ్రిగ్వెజ్ (కొలంబియా)–డీగో హిడాల్గొ (ఈక్వెడార్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీఫైనల్లో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)– నాథనిల్ లమన్స్ (అమెరికా) జోడీతో భారత ద్వయం పోటీపడుతుంది. మరో వైపు ఇజ్రాయెల్‌లో జరుగుతున్న టెల్ అవీవ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్స్‌లో బోపన్న–మిడిల్‌కూప్ జంట 4–6, 7–6(7/5), 10–5తో ఫ్రాంకో స్కుగొర్ (క్రొయేషియా)–డెనిస్ మొల్చనొవ్ (ఉక్రెయిన్) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో బోపన్న జోడీ... ఫ్రాన్స్‌కు చెందిన ఫాబియన్ రిబొల్–సాడియో డంబియా జంటతో తలపడుతుంది. చదవండి: Sachin Tendulkar: బ్రెట్ లీ బౌలింగ్‌లో ట్రేడ్‌మార్క్ షాట్.. ఎన్నాళ్లయిందో -
Davis Cup: భారత్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టు వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది. నార్వే జట్టుతో జరిగిన వరల్డ్ గ్రూప్–1 పోటీలో భారత్ 1–3తో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌గా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ జోడీ 3–6, 6–3, 3–6తో కాస్పర్ రూడ్–విక్టర్ దురాసోవిచ్ (నార్వే) ద్వయం చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. అంతకుముందు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సింగిల్స్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 4–6తో దురాసోవిచ్ చేతిలో పరాజయం చవిచూశాడు. ఫలితం తేలిపోయాక నాలుగో మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–2, 6–1తో లుకాస్ హెలమ్ (నార్వే)ను ఓడించాడు. తుది ఫలితంతో మార్పు ఉండే అవకాశం లేకపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. భారత్ వచ్చే ఏడాది వరల్డ్ గ్రూప్–1లో చోటు కోసం ప్లే ఆఫ్ మ్యాచ్ ఆడుతుంది. -
భారత డేవిస్‌కప్ టెన్నిస్ జట్టులో సాకేత్
సాక్షి, హైదరాబాద్: నార్వే వేదికగా నార్వే జట్టుతో ఈనెల 16, 17వ తేదీల్లో జరిగే డేవిస్‌కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. గాయంతో వైదొలిగిన డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనిని ఎంపిక చేశారు. ఈ ఏడాది యూకీ బాంబ్రీతో కలిసి సాకేత్ ఐదు ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్స్ గెలిచాడు. ప్రస్తుతం సాకేత్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 96వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2014లో తొలిసారి భారత డేవిస్‌కప్ జట్టులోకి ఎంపికైన సాకేత్ డేవిస్‌కప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. -
సాకేత్–యూకీ జోడీ ఖాతాలో నాలుగో టైటిల్
అమెరికాలో జరిగిన లెక్సింగ్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్–యూకీ 3–6, 6–4, 10–8తోబ్రువెర్ (నెదర్లాండ్స్)–మెకగ్ (బ్రిటన్)లపై నెగ్గారు. ఈ ఏడాది సాకేత్–యూకీకిది నాలుగో ఏటీపీ చాలెంజర్ టైటిల్. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 46 వేలు) లభించింది. -
సాకేత్ జంటకు టైటిల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో 11వ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌లోని ప్రోస్తెజోవ్ పట్టణంలో శుక్రవారం జరిగిన చెక్ ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ 6–3, 7–5తో రెండో సీడ్ రోమన్ జెబవీ (చెక్ రిపబ్లిక్)–ఆంద్రెజ్ మార్టిన్ (స్లొవేకియా) జంటపై నెగ్గింది. సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–4, 6–4తో టాప్ సీడ్ ఎర్లెర్–మెడ్లెర్ (ఆస్ట్రియా) జంటను... క్వార్టర్ ఫైనల్లో 7–6 (7/4), 3–6, 13–11తో మూడో సీడ్ మొల్చ నోవ్ (ఉక్రెయిన్)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయే షియా) జోడీని ఓడించడం విశేషం. విజేతగా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 5,250 యూరో ల (రూ. 4 లక్షల 37 వేలు) ప్రైజ్‌మనీ తోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం -
సెమీ ఫైనల్లో అడుగు పెట్టిన సాకేత్ జంట
న్యూఢిల్లీ: మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ బాంబ్రీ జంట 6–3, 7–6తో మైఖైల్ పెర్వోలారకిస్ – మన్సూరి (గ్రీస్) జోడీపై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. చదవండి: హైదరాబాద్‌లో ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నీ -
Charleston Open: సెమీస్‌లో సానియా జోడి...
Charleston Open- చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. అమెరికాలోని సౌత్ కరోలినాలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట 3–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ అలెక్సా గురాచి (చిలీ)–జెస్సికా పెగూలా (అమెరికా) ద్వయంపై గెలిచింది. తొలి రౌండ్లో సానియా–హర్డెస్కా 7–5, 7–6 (7/5)తో ఫ్రాన్సెస్కా లొరెంజో–కేటీ వొలినెట్స్ (అమెరికా)లపై గెలిచారు. డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ జంట Salinas Open- సాలినాస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈక్వెడార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 6–4తో బెంజమిన్ లాక్–జాన్ లాక్ (జింబాబ్వే) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో సాకేత్–యూకీ జంట 6–3, 7–6 (8/6)తో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీని ఓడించింది. చదవండి: GT Vs PBKS: ఎదురులేని టైటాన్స్.. గుజరాత్ ‘హ్యాట్రిక్’ -
Saketh Myneni: పోరాడి ఓడిన సాకేత్–రామ్‌కుమార్ జంట
Dubai Tennis Championships: దుబాయ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ (భారత్) జంట తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన సాకేత్–రామ్ ద్వయం 82 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో 5–7, 5–7తో జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా)–పొలాసెక్ (స్లొవేకియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న (భారత్)–కరాత్సెవ్ (రష్యా) జంట 2–6, 6–3, 5–10తో టాప్ సీడ్ మెక్టిక్–పావిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్స్‌లో నీతూ, అనామిక న్యూఢిల్లీ: స్ట్రాండ్జా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మహిళా బాక్సర్లు నీతూ (48 కేజీలు), అనామిక (50 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బల్గేరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో నీతూ 5–0తో ల్యూలియా (రష్యా)పై, అనామిక 4–1తో చుకనొవా(బల్గేరియా) పై గెలిచారు. 54 కేజీల బౌట్లో శిక్ష 0–5తో దినా జొలమన్ (కజకిస్తాన్) చేతిలో ... పురుషుల 67 కేజీల పోటీలో ఆకాశ్ 0–5తో క్రొటెర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్ ఔట్ -
Bengaluru Open: సెమీస్‌లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు ఓపెన్–2 ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బెంగళూరులో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ ద్వయం 6–4, 7–6 (7/3)తో వ్లాదిస్లావ్ ఒర్లోవ్ (ఉక్రెయిన్)–కాయ్ వెనల్ట్ (జర్మనీ) జోడీపై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) ద్వయం 6–3, 4–6, 11–9తో కలోవెలోనిస్ (గ్రీస్)–మత్సుయ్ (జపాన్) జంటను ఓడించి సెమీఫైనల్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణులు రష్మిక, సామ సాత్విక, శ్రావ్య శివాని క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. గురుగ్రామ్‌లో గురువారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–2, 6–2తో హుమేరాపై, సాతి్వక 7–6 (7/1), 7–5తో స్మృతి భాసిన్‌పై గెలిచారు. పూజా ఇంగ్లేతో జరిగిన మ్యాచ్‌లో శ్రావ్య శివాని తొలి సెట్‌ను 6–0తో నెగ్గి, రెండో సెట్లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయంతో వైదొలిగింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక–హుమేరా జంట 7–5, 2–6, 10–7తో షర్మదా బాలు–శ్రావ్య శివాని జోడీని ఓడించి సెమీఫైనల్ చేరింది. -
కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే మార్గమేది?
న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌లో కొత్తగా కుర్రాళ్లు వెలుగులోకి వచ్చే మార్గమే లేదని తెలుగుతేజం సాకేత్ మైనేని అన్నాడు. దేశంలో ఇప్పటివరకూ యువ టెన్నిస్ ఆటగాళ్లు రాణించేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలే లేవన్నాడు. ఓ వార్తాసంస్థకిచి్చన ఇంటర్వ్యూ లో భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడైన సాకేత్ నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ఎప్పటి నుంచో ఎంతో మంది ఎన్నోసార్లు అది చేస్తాం, ఇది చేస్తామన్నారు... కానీ ఆచరణలో అవేవీ చూడలేదు ఇప్పటివరకు! క్రీడావర్గాలకు అసలు ఆటగాళ్లు ఎలా తయారవుతారన్న ఆలోచనే లేదు. నిజానికి ఇదంతా ఓ నిర్ణీత కాలచక్రంగా ఓ పద్ధతి ప్రకారం జరగాలి కానీ... ఇక్కడ అలా లేదు. ఆటగాళ్లంతా తమ సొంతంగా ఎదగడమే తప్ప... క్రీడా సంఘాలు, ఆ శాఖ చేసేది కూడా ఏమీ ఉండదు. ఒక్కోక్కరిది ఒక్కోకథ. అందరివీ కష్టంతో కూడుకున్నవే! ఏ ఒక్కరూ నల్లేరుపై నడకలా వచి్చనట్లు, ఎదిగినట్లు ఉండదు. ముఖ్యంగా జూనియర్ ఆటగాళ్లను ఆర్థిక కష్టాలు వేధిస్తాయి. స్పాన్సర్ షిప్ దొరకదు. అలాంటపుడు పెద్ద టోరీ్నలు ఆడేలా, భవిష్యత్తు తీర్చిదిద్దుకునేలా చేయూత లభించదు’ అని ముక్కుసూటిగా మాట్లాడాడు. అలాగే నేర్చుకోవాలన్నా... శిక్షణ పొందాలన్నా... మౌలిక సదుపాయాలు చాలా దూరంగా ఉంటాయని, 15 కిలోమీటర్లు వెళ్లి రావాల్సి ఉంటుందని ఆటగాళ్ల కష్టాలు వివరించాడు. -
రన్నరప్ సాకేత్ జోడీ
పుణే: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–7 (3/7), 3–6తో టాప్ సీడ్ రామ్‌కుమార్ రామనాథన్–పురవ్ రాజా (భారత్) జోడీ చేతిలో ఓడిపోయింది. విజేత రామ్‌కుమార్–పురవ్ జంటకు 3100 డాలర్లు (రూ. 2 లక్షల 22 వేలు), రన్నరప్ సాకేత్–అర్జున్ జోడీకి 1800 డాలర్లు (రూ. లక్షా 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సాకేత్ పునరాగమనం
చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేని భారత డేవిస్ కప్ జట్టులోకి పునరాగమనం చేశాడు. పాకిస్తాన్‌తో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్ కోసం రోహిత్ రాజ్‌పాల్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఐదుగురు సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సింగిల్స్ విభాగంలో భారత టాప్ ఆటగాళ్లయిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్‌కుమార్ రామనాథన్‌లను ఎంపిక చేశారు. డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంటను ఎంపిక చేసింది. గతవారం చైనాలో జరిగిన చెంగ్డూ చాలెంజర్ టూర్ సిరీస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను గెలిచిన సాకేత్ మైనేనికి కూడా స్థానం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీతో కోల్‌కతాలో జరిగిన వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సాకేత్ ఆడలేదు. గతేడాది సెప్టెంబర్‌లో సెర్బియాతో జరిగిన వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో చివరిసారి సాకేత్ బరిలోకి దిగాడు. డేవిస్ కప్‌లో భారత్–పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు 6 సార్లు తలపడగా అన్నింటిలోనూ భారతే విజయం సాధించింది. ఇస్లామాబాద్ వేదికగా సెప్టెంబర్ 14, 15 తేదీల్లో డేవిస్ కప్ పోరులో మరోసారి భారత్–పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. -
రామ్‌కుమార్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో రామ్‌కుమార్ రామనాథన్ శుభారంభం చేయగా... సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. సోమవారం మొదలైన ఈ టోర్నమెంట్లో తొలి రౌండ్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ 4–6, 6–4, 5–7తో గిలెర్మో లోపెజ్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. లాకోతో జరిగిన మ్యాచ్‌లో రామ్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 24 విన్నర్లు కొట్టిన ఈ చెన్నై ప్లేయర్ కేవలం పది అనవసర తప్పిదాలు చేశాడు. లోపెజ్‌తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 15 ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 43 విన్నర్స్ కొట్టిన సాకేత్ 29 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
తొలి రౌండ్లో సాకేత్ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నాన్‌చాంగ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే పరాజయం చవిచూశాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 4–6తో జీజెన్ జాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 82 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఐదు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ 2–6, 4–6తో నికోలా మిలోజెవిచ్ (సెర్బియా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–ప్రజ్నేశ్ జోడీ 7–6 (7/5), 6–4తో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్)–లూకా మార్గరోలి (స్విట్జర్లాండ్) జంటపై గెలిచింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట రెండో సెట్లో ఏకంగా తొమ్మది బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జెమీ సెరెటాని (అమెరికా) ద్వయం 6–4, 7–6 (7/4)తో యెకాంగ్ హి–డి వు (చైనా) జోడీపై నెగ్గగా... విష్ణువర్ధన్–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జంట 6–7 (4/7), 6–7 (7/9)తో సాండెర్ అరెండ్స్ (నెదర్లాండ్స్)–వీస్‌బార్న్ (ఆస్ట్రియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాకేత్ మైనేని (భారత్)–సంచాయ్ రటివటానా (థాయ్‌లాండ్) ద్వయం 6–4, 6–4తో మూడో సీడ్ శ్రీరామ్ బాలాజీ (భారత్)–హాన్స్ హచ్ వెర్డుగో (మెక్సికో) జోడీపై విజయం సాధించింది. 61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట మూడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఒక్కో సెట్లో ఒక్కోసారి ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో నికోలా కాచిచ్ (సెర్బియా)–హిరోకి మొరియా (జపాన్) జోడీతో సాకేత్–సంచాయ్ ద్వయం తలపడుతుంది. -
పుణే ఓపెన్ తొలి రౌండ్లోనే సాకేత్ పరాజయం
గతవారం బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని అదే జోరును పుణే ఓపెన్‌లో కొనసాగించలేకపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 6–7 (1/7)తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్ చేతిలో ఓడిపోయాడు. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ తొలి సెట్లో తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సాకేత్ రెండో సెట్లో తీవ్రంగా పోరాడాడు. అయితే టైబ్రేక్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. -
ప్రజ్నేశ్‌కు టైటిల్
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనిపై విజయం సాధించాడు. ప్రజ్నేశ్ బలమైన ఫోర్‌హ్యాండెడ్ షాట్లతో ఫైనల్ ఏకపక్షంగా మారింది. ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించగా.. చెన్నై ప్లేయర్ ప్రజ్నేశ్ ఖాతాలో కేవలం రెండు మాత్రమే చేరాయి. కానీ కీలక సమయాల్లో అనవసర తప్పిదాలు చేసిన సాకేత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైటిల్ విజయంతో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ ర్యాంకుల్లో తన స్థాయిని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా 144వ ర్యాంకు నుంచి 110వ స్థానానికి ఎగబాకాడు. మరోవైపు బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే చేరడం విశేషం. గతేడాది సుమీత్ నాగల్ ఈ టోర్నీ విజేతగా నిలిచాడు. -
ప్రజ్నేశ్‌తో సాకేత్ అమీతుమీ
బెంగళూరు: వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్ చేరనుంది. గతేడాది సుమీత్ నాగల్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకోగా... ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టు సభ్యులు సాకేత్ మైనేని, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ టైటిల్ కోసం నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని 4–6, 6–4, 6–4తో అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై గెలుపొందగా... ప్రజ్నేశ్ 6–4, 6–1తో బ్రైడెన్ ష్నుర్ (కెనడా)ను చిత్తుగా ఓడించాడు. నెదోవ్‌యెసోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో సాకేత్ 5–0తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా నాలుగు గేమ్‌లు చేజార్చుకున్నాడు. అయితే పదో గేమ్‌లో పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో పురవ్ రాజా (భారత్)–ఆంటోనియో సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో పురవ్ రాజా–సాన్సిచ్ ద్వయం 6–7 (3/7), 3–6తో మాక్స్ పర్సెల్–ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. -
సాకేత్ సంచలనం
బెంగళూరు: తన విజయ పరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ నాగల్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) నుంచి ప్రజ్నేశ్‌కు ‘వాకోవర్’ లభించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 2–6, 8–10తో పురవ్ రాజా (భారత్)–సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది. -
సాకేత్ ముందంజ
బెంగళూరు: భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాకేత్ 6–3, 7–6 (7/3)తో ఆదిల్ కల్యాణ్‌పుర్ (భారత్)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో నెడొల్కో (రష్యా)పై, శశికుమార్ 7–6 (8/6), 6–3తో అల్టామిరానో (అమెరికా)పై నెగ్గారు. డబుల్స్ తొలి రౌండ్లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–4, 6–3తో సుమీత్ నాగల్ (భారత్)–బ్రైడెన్ ష్నుర్ (కెనడా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
న్యూఢిల్లీ: లిజౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–1, 3–6, 10–8తో కెచ్‌మానోవిచ్ (సెర్బియా)–జె లీ (చైనా) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్‌కు చేరగా... సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. ప్రజ్నేశ్ 6–4, 7–5తో జొహాన్ టాట్లోట్ (ఫ్రాన్స్)పై నెగ్గగా... సుమీత్ 2–6, 3–6తో తత్సుమైతో (జపాన్) చేతిలో... రామ్‌కుమార్ 6–7 (3/7), 3–6తో డేవిడోవిచ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
నింగ్బో: యిన్‌జౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–0, 6–3తో హిరోకి మొరియా (జపాన్)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీపై నెగ్గింది. 54 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం రెండు ఏస్‌లు సంధించడంతోపాటు తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఇదే టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–3, 2–6, 7–6 (7/0)తో లీ జె (చైనా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. -
మెయిన్ ‘డ్రా’కు సాకేత్
నింగ్బో (చైనా): యిన్‌జౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో సాకేత్ 6–0, 6–3తో రైటా తనుమ (జపాన్)పై గెలుపొందాడు. అంతకుముందు రెండో రౌండ్లో సాకేత్ 6–3, 7–5తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్‌ను ఓడించాడు. ఇదే టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–6 (9/7), 6–2తో మొహమ్మద్ సఫ్వాత్ (ఈజిప్ట్)పై నెగ్గి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. ప్రాంజల ర్యాంక్ 340 వరుసగా రెండు వారాల్లో రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్ (లాగోస్ ఓపెన్) సాధించిన హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 109 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 340వ ర్యాంక్‌లో నిలిచింది. అంకిత రైనా 201వ ర్యాంక్‌లో, కర్మన్‌కౌర్ థండి 215వ ర్యాంక్‌లో ఉన్నారు. -
సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో జరుగుతున్న కెంటకీ బ్యాంక్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో భారత డేవిస్‌కప్ జట్టు మాజీ సభ్యుడైన సాకేత్ 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్ నార్బర్ట్ గొమ్బాస్ (స్లొవేకియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్స్ చేరాడు. గంటా 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 16 ఏస్‌లు సంధించడం విశేషం. మరోవైపు డబుల్స్‌లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ టాప్ సీడ్‌కు షాకిచ్చి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. తొలి రౌండ్లో సాకేత్–ప్రశాంత్ 7–6 (7/5), 2–6, 10–6తో రువాన్ రోలొఫ్సే (దక్షిణాఫ్రికా)–ల్యూక్ సవిల్లె (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది. -
పోరాడి ఓడిన సాకేత్
అస్తానా: ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. కజకిస్తాన్‌లోని అస్తానాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 4–6, 7–6 (12/10), 5–7తో డానియల్ బ్రాండ్స్ (జర్మనీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2 గంటల 26 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 13 ఏస్‌లు సంధించడంతోపాటు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయాడు. క్వార్టర్స్‌లో ఓడిన సాకేత్‌కు 3,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 50 వేలు)తోపాటు 18 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్ సంచలనం
అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. ప్రపంచ మాజీ ఎనిమిదో ర్యాంకర్ మిఖాయిల్ యూజ్నీ (రష్యా)ని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 357వ ర్యాంకర్ సాకేత్ 3–6, 6–4, 6–3తో టాప్ సీడ్, ప్రపంచ 105వ ర్యాంకర్ యూజ్నీపై గెలిచాడు. గంటా 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 14 ఏస్‌లు సంధించడంతోపాటు యూజ్నీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
ఉజ్బెకిస్తాన్ ఐటీఎఫ్ టోర్నీ విజేత సాకేత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–2 టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని విజేతగా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్‌లోని కర్షీ నగరంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాకేత్ 4–6, 6–3, 7–6 (7/4)తో షైలా యారాస్లావ్ (బెలారస్)పై నెగ్గాడు. సాకేత్ కెరీర్లో ఇది 12వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. -
సెమీస్‌లో సాకేత్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియన్ ఫ్యూచర్స్–2 పురుషుల టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని నిలకడగా రాణిస్తున్నాడు. కోల్‌కతాలో జరుగుతోన్న ఈ టోర్నీలో సాకేత్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ఏడో సీడ్ సాకేత్ 6–3, 6–3తో రెండోసీడ్ శశికుమార్ ముకుంద్‌కు షాకిచ్చాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ఐదో సీడ్ అర్జున్‌తో సాకేత్ తలపడతాడు. -
సాకేత్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–2 పురుషుల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సాకేత్ 5–7, 6–1, 7–5తో ఫ్రాన్సెస్కో విలార్డో (ఇటలీ)పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో కాజా వినాయక్ శర్మ ముందంజ వేశాడు. తొలి రౌండ్లో వినాయక్–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) జంట 7–6 (7/3), 7–6 (9/7)తో రెండోసీడ్ జుయ్ చెన్ హంగ్ (చైనీస్ తైపీ)– ఫ్రాన్సెస్కో విలార్డో (ఇటలీ) జోడీకి షాక్ ఇచ్చింది. -
ముగిసిన సాకేత్ పోరు
ఈ ఏడాది భారత్‌లో జరుగుతోన్న తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు, భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని పోరాటం ముగిసింది. శుక్రవారం పుణేలో జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాకేత్ 3–6, 2–6తో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. మరో సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్) 6–2, 6–4తో అడ్రియన్ మెనెన్‌డెజ్ (స్పెయిన్)పై నెగ్గి శనివారం రామ్‌కుమార్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–జీవన్ జంట 4–6, 4–6తో పెడ్రో మార్టినెజ్–అడ్రియన్ మెనెన్‌డెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఫైనల్లో సాకేత్ జంట
వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో సాకేత్–విజయ్ (భారత్) ద్వయం 7–6 (7/3), 3–6, 10–7తో టీ చెన్ (చైనీస్ తైపీ)–మ్యాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. -
డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట
వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. వియత్నాంలోని హో మిన్ చి సిటీలో శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట 7–6 (8/6), 1–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెజాంబ్రో బేగా (ఇటలీ)–స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ 6–3, 3–6, 6–7 (2/7)తో జాన్ మిల్మాన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
సాకేత్, యూకీ పునరాగమనం
లియాండర్ పేస్‌కు దక్కని స్థానం న్యూఢిల్లీ: కెనడాతో వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ టెన్నిస్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలో తలపడే భారత జట్టును ప్రకటించారు. గాయాల నుంచి కోలుకున్న హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని, సింగిల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశారు. కెనడాలోని ఎడ్మంటన్‌లో సెప్టెంబరు 15 నుంచి 17 వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. మరోవైపు డబుల్స్ దిగ్గజం లియాండర్ పేస్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. సాకేత్, యూకీలతోపాటు రామ్‌కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న జట్టులోని మిగతా సభ్యులు. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ రిజర్వ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. గత ఏప్రిల్‌లో స్వదేశంలో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయాల కారణంగా సాకేత్, యూకీ ఆడలేదు. ఉజ్బెకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆరుగురు సభ్యులున్న జట్టులో పేస్‌ను ఎంపిక చేసినా నలుగురు ఆటగాళ్లున్న తుది జట్టులో అతడికి స్థానం లభించలేదు. ‘ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున రోహన్ బోపన్న ర్యాంక్ మెరుగ్గా ఉండటంతో అతడిని ఎంపిక చేశాం. భవిష్యత్‌లో పేస్ పేరును కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జట్టులో ముగ్గురు సింగిల్స్ ఆటగాళ్లు ఉండాలని కెప్టెన్ మహేశ్ భూపతి కోరడంతో డబుల్స్ విభాగంలో ఒకరినే ఎంపిక చేశాం. ఈసారి యూకీ, రామ్‌కుమార్ సింగిల్స్ మ్యాచ్‌లు ఆడతారు. డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్–బోపన్న జంట బరిలోకి దిగుతుంది’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్పీ మిశ్రా తెలిపారు. -
సాకేత్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
జనవరి 2 నుంచి చెన్నై ఓపెన్ చెన్నై: భారత నంబర్‌వన్, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చెన్నై ఓపెన్ టోర్నమెంట్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. భారత్ నిర్వహిస్తున్న ఈ ఏటీపీ టోర్నమెంట్ జనవరి 2న మొదలవుతుంది. ఇందులో స్థానిక ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్‌కు కూడా నిర్వాహకులు ఇదివరకే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ సహా పలువురు అంతర్జాతీయ స్టార్లు ఈ టోర్నీలో తలపడేందుకు చెన్నైకి రానున్నారు. హైదరాబాద్ యువతార సాకేత్ మైనేని గత మూడేళ్లుగా చెన్నై ఓపెన్‌లో ఆడుతున్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వడంపై 29 ఏళ్ల మైనేని మాట్లాడుతూ ‘ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఇందులో సత్తాచాటేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తాను. చక్కగా సన్నద్ధమయ్యేందుకు సమయం కూడా ఉంది’ అని అన్నాడు. ఐటా సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్.పి. మిశ్రా మాట్లాడుతూ ‘భారత్ నుంచి యువ ఆటగాళ్లకు వైల్డ్‌కార్డ్ ఇచ్చాం. వీరిద్దరూ డేవిస్‌కప్‌లో సత్తాచాటుకున్నారు. ఏటీపీ ర్యాంకింగ్‌సను మెరుగుపర్చుకునేందుకు చెన్నై ఓపెన్ మంచి వేదిక’ అని అన్నారు. -
ఒలింపిక్స్‌కు మేటి జంటను పంపలేకపోయారు
న్యూఢిల్లీ: గత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో డబుల్స్‌లో అత్యుత్తమ జోడీలను పంపలేకపోయామని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ వ్యాఖ్యానించాడు. హైదరాబాద్ యువ సంచలనం సాకేత్ మైనేని ఆటతీరును ఆకాశానికెత్తాడు. అతనిలో అసాధారణ ప్రతిభ ఉందని కితాబిచ్చాడు. ‘రియో, గత లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మేటి డబుల్స్ జంటను పంపలేదు. దీనివల్లే తగిన మూల్యం చెల్లించుకున్నామని నేను కచ్చితంగా చెప్పగలను. ఈ ఒలింపిక్స్‌లో మంచి మిక్స్డ్ జోడీని బరిలోకి దించే అవకాశాన్ని కాదనుకున్నాం. గత 14 నెలల్లో నాలుగు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ టైటిల్స్‌ను సాధించిన నన్ను కాదని మరో ఆటగాడిని రియోకు పంపడం ఏమాత్రం సమంజసంగా లేదు’ అని అన్నాడు. సానియాకు జతగా రోహన్ బోపన్న బరిలోకి దిగగా ఈ జోడి సెమీఫైనల్‌తోపాటు కాంస్య పతక పోరులో ఓడింది. ప్రస్తుత డేవిస్ కప్ టీమ్ ఈవెంట్లో సాకేత్ మైనేనిలాంటి ఆటగాడితో జతకట్టడం బాగుందని పేస్ అన్నాడు. ఈ జోడీ... రాఫెల్ నాదల్-మార్క్ లోపెజ్ జోడి చేతిలో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. ‘మైనేని సర్వీస్ అద్భుతం. రిటర్న్ షాట్లు అసాధారణం. కెరీర్ తొలినాళ్లలోనే అతను చక్కని ఆటతీరుతో ఆదరగొడుతున్నాడు. అనుభవం సంతరించుకుంటే భారత టెన్నిస్ మేటి ఆటగాడిగా ఎదుగుతాడు’ అని తెలుగు కుర్రాడిని ప్రశంసలతో ముంచెత్తాడు. మనకు మరో 18 నెలల్లో ఆసియా గేమ్స్, నాలుగేళ్లకు టోక్యో ఒలింపిక్స్ ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుగానే డబుల్స్‌లో ఎవరు, మిక్స్డ్ డబుల్స్‌లో ఎవరెవరు ఆడతారనే స్పష్టతతో ముందడుగు వేయాలని అఖిల భారత టెన్నిస్ సంఘాని (ఐటా)కి సూచించాడు. దీంతో చివరి నిమిషంలో అనవసరపు గందరగోళానికి తావుండదని చెప్పాడు. మరోవైపు ‘సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడంతో సమానం’ అని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా మీర్జా వ్యాఖ్యానించడం విశేషం. -
జొకోవిచ్ తో పోరును సాకేత్ మిస్సయ్యాడు!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్లో హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ భాగంగా మంగళవారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం) జరిగిన పోరులో సాకేత్ 6-7(5), 6-4, 6-2, 2-6, 5-7 తేడాతో జిరి వెస్లే(చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి పాలై టోర్నీనుంచి నిష్క్రమించాడు. మూడు గంటల 47 నిమిషాలపాటు సుదీర్ఘంగా జరిగిన మ్యాచ్‌లో సాకేత్ పోరాడి ఓడాడు. తొలి సెట్‌ను టై బ్రేక్‌లో కోల్పోయిన సాకేత్, రెండు, మూడు సెట్లను కైవసం చేసుకున్నాడు. కాగా, ఆపై తిరిగి పుంజుకున్న వెస్లీ నాల్గో సెట్ ను దక్కించుకోవడంతో స్కోరు సమం అయ్యింది. దాంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఆ సెట్ ఆదిలో సాకేత్ 3-1, 4-2 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా, ఆపై అతని కుడి తొడ కండరాలు పట్టేశాయి. దాంతో చికిత్స కోసం కొంత సమయం తీసుకుని తిరిగి బరిలోకి వచ్చినా పూర్తిస్థాయిలో ఆడలేక ఓటమి పాలయ్యాడు. రెండు రోజుల క్రితం యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు సాకేత్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. అయితే సాకేత్ తొలిరౌండ్లోనే ఓడిపోవడంతో టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్‌తో పోరును మిస్సయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే రెండో రౌండ్లో జొకోవిచ్‌తో సాకేత్ తలపడేవాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్-భూపతి జంట
చెన్నై: చెన్నై ఓపెన్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు తేజం సాకేత్ మైనేని తన భాగస్వామి మహేశ్ భూపతితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్-భూపతి ద్వయం 6-7 (4/7), 6-4, 10-6తో భారత్‌కే చెందిన ‘కవల సోదరులు’ చంద్రిల్ సూద్-లక్షిత్ సూద్ జంటపై చెమటోడ్చి గెలిచింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా శ్రమించింది. సాకేత్ మ్యాచ్ మొత్తం చురుకుగా కదలగా... 10 నెలల విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగిన భూపతి పలుమార్లు అనవసర తప్పిదాలు చేశాడు. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లియాండర్ పేస్ (భారత్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా)లతో సాకేత్-భూపతి తలపడతారు. -
మహేశ్ భూపతితో జతగా సాకేత్
* చెన్నై ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’ కేటాయింపు * జనవరి 5 నుంచి టోర్నీ చెన్నై: అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేనికి చెన్నై ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’ లభించింది. వచ్చే నెల జనవరి 5 నుంచి చెన్నైలో జరిగే ఈ టోర్నమెంట్లో భారత డబుల్స్ దిగ్గజం మహేశ్ భూపతితో కలిసి సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నాడు. వైజాగ్‌కు చెందిన 27 ఏళ్ల సాకేత్ ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టులో చోటు సంపాదించడంతోపాటు ఆసియా క్రీడల్లో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. డబుల్స్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ 154కు చేరుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో మియామి మాస్టర్స్ సిరీస్ తర్వాత భూపతి మరో టోర్నీలో బరిలోకి దిగలేదు. చెన్నై ఓపెన్‌తో అతను కొత్త ఏడాదిని ప్రారంభించనున్నాడు. సాకేత్, భూపతిలతో పాటు భారత్‌కే చెందిన జీవన్ నెదున్‌చెజియాన్, శ్రీరామ్ బాలాజీలకు కూడా డబుల్స్ విభాగంలో ‘వైల్డ్ కార్డు’ను కేటాయిస్తున్నట్లు టోర్నీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కార్తీ చిదంబరం తెలిపారు. సింగిల్స్‌లో సోమ్‌దేవ్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు కూడా ‘వైల్డ్ కార్డు’ ఇచ్చారు. -
సాకేత్ మైనేని జోడీకి డబుల్స్ టైటిల్
పుణె: పుణె ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. సనమ్ సింగ్‌తో జత కట్టిన సాకేత్ ఫైనల్లో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో సాకేత్, సనమ్ జంట 6-3, 6-2 స్కోరు తేడాతో థాయ్‌లాండ్ జోడీ సంచాయ్, సొంచాట్ను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్‌లో సాకేత్‌కు నిరాశ ఎదురైంది. సెమీస్‌లో సాకేత్ ఓటమి చవిచూశాడు. -
సానియా, సాకేత్ లకు జగన్ అభినందన
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన టెన్నిస్ స్టార్స్ సానియా మీర్జా, సాకేత్ మైనేనిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ద్వయం సానియా మీర్జా, సాకేత్ మైనేని టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొన్న తెలుగు కుర్రాడు సాకేత్ రెండు పతకాలు సాధించాడు. -
టెన్నిస్ లో సానియా, సాకేత్ జోడీకి స్వర్ణం
-
సానియా-సాకేత్ జోడీకి గోల్డ్ మెడల్
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ ఆరో స్వర్ణం సాధించింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. సానియా మీర్జా- సాకేత్ మైనేని జోడీ భారత్ కు మరో బంగారు పతకం సాధించిపెట్టింది. సోమవారం జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీ జోడీని 6-4, 6-3తో ఓడించి విజే్తగా నిలిచారు. తెలుగు తేజం సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలోనూ పతకం ఖాయం చేసుకున్నాడు. సనమ్ సింగ్‌తో కలిసి ఫైనల్లో అడుగుపెట్టాడు. తుదిపోరులో విజయం సాధిస్తే మరో బంగారు పతకం అతడి ఖాతాలో చేరుకుంది. ఒకవేళ ఫైనల్లో ఓడినా వెండి పతకం దక్కుతుంది. కాగా, సానియా మీర్జా దోహాలో 2006లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు నాలుగు ఆసియన్ గేమ్స్ లో పాల్గొన్న ఆమె మొత్తం 9 మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది. -
బోపన్నపై సాకేత్ గెలుపు
ఫైనల్లో ఓఎన్జీసీతో గెయిల్ పోరు బెంగళూరు: ఇంటర్ యూనిట్స్ పెట్రోలియం టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని ప్రాతినిధ్యం వహిస్తున్న గెయిల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టీమ్ ఈవెంట్లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్నకు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ షాక్ ఇచ్చాడు. సెమీఫైనల్లో గెయిల్ జట్టు 2-0తో ఐఓసీఎల్ జట్టుపై విజయం సాధించింది. సింగిల్స్ మ్యాచ్‌లో సాకేత్ (గెయిల్) 7-6 (7/4), 6-4తో రోహన్ బోపన్న (ఐఓసీఎల్)పై చెమటోడ్చి నెగ్గాడు. మరో పోరులో రాంకుమార్ రామనాథన్ (గెయిల్) 6-2, 6-1తో వాసుదేవ్ రెడ్డి (ఐఓసీఎల్)పై అలవోకగా గెలిచాడు. మరో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఓఎన్జీసీ 2-0తో ఓఐఎల్ జట్టుపై గెలుపొందింది. హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ (ఓఎన్జీసీ) 6-1, 6-2తో అన్షుమన్ దత్త (ఓఐఎల్)పై గెలుపొందగా, రంజీత్ (ఓఎన్జీసీ) 6-1, 6-1తో సీఎస్ మహంతి (ఓఐఎల్)ని ఓడించాడు. బుధవారం జరిగే టైటిల్ పోరులో ఆతిథ్య గెయిల్ జట్టు... ఓఎన్జీసీతో తలపడుతుంది.