
నింగ్బో (చైనా): యిన్‌జౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో సాకేత్ 6–0, 6–3తో రైటా తనుమ (జపాన్)పై గెలుపొందాడు. అంతకుముందు రెండో రౌండ్‌లో సాకేత్ 6–3, 7–5తో భారత్‌కే చెందిన శశికుమార్ ముకుంద్‌ను ఓడించాడు. ఇదే టోర్నీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–6 (9/7), 6–2తో మొహమ్మద్ సఫ్వాత్ (ఈజిప్ట్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
ప్రాంజల ర్యాంక్ 340
వరుసగా రెండు వారాల్లో రెండు ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్స్ (లాగోస్ ఓపెన్) సాధించిన హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. సోమవారం విడుదల చేసిన మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లో ప్రాంజల 109 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 340వ ర్యాంక్‌లో నిలిచింది. అంకిత రైనా 201వ ర్యాంక్‌లో, కర్మన్‌కౌర్ థండి 215వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment