సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాకేత్‌ | Saketh in Pre Quarters of Kentucky Bank Tennis Championship | Sakshi
Sakshi News home page

సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాకేత్‌

Published Thu, Aug 2 2018 10:33 AM | Last Updated on Thu, Aug 2 2018 10:33 AM

Saketh in Pre Quarters of Kentucky Bank Tennis Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో జరుగుతున్న కెంటకీ బ్యాంక్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడైన సాకేత్‌ 7–5, 7–6 (7/5)తో మూడో సీడ్‌ నార్‌బర్ట్‌ గొమ్‌బాస్‌ (స్లొవేకియా)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్స్‌ చేరాడు. గంటా 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌ 16 ఏస్‌లు సంధించడం విశేషం. మరోవైపు డబుల్స్‌లో సాకేత్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జోడీ టాప్‌ సీడ్‌కు షాకిచ్చి క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో సాకేత్‌–ప్రశాంత్‌ 7–6 (7/5), 2–6, 10–6తో రువాన్‌ రోలొఫ్సే (దక్షిణాఫ్రికా)–ల్యూక్‌ సవిల్లె (ఆస్ట్రేలియా) జంటను ఓడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement