సాకేత్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
జనవరి 2 నుంచి చెన్నై ఓపెన్
చెన్నై: భారత నంబర్‌వన్, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చెన్నై ఓపెన్ టోర్నమెంట్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. భారత్ నిర్వహిస్తున్న ఈ ఏటీపీ టోర్నమెంట్ జనవరి 2న మొదలవుతుంది. ఇందులో స్థానిక ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్‌కు కూడా నిర్వాహకులు ఇదివరకే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ సహా పలువురు అంతర్జాతీయ స్టార్లు ఈ టోర్నీలో తలపడేందుకు చెన్నైకి రానున్నారు. హైదరాబాద్ యువతార సాకేత్ మైనేని గత మూడేళ్లుగా చెన్నై ఓపెన్‌లో ఆడుతున్నాడు.
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వడంపై 29 ఏళ్ల మైనేని మాట్లాడుతూ ‘ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఇందులో సత్తాచాటేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తాను. చక్కగా సన్నద్ధమయ్యేందుకు సమయం కూడా ఉంది’ అని అన్నాడు. ఐటా సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్.పి. మిశ్రా మాట్లాడుతూ ‘భారత్ నుంచి యువ ఆటగాళ్లకు వైల్డ్‌కార్డ్ ఇచ్చాం. వీరిద్దరూ డేవిస్‌కప్‌లో సత్తాచాటుకున్నారు. ఏటీపీ ర్యాంకింగ్‌సను మెరుగుపర్చుకునేందుకు చెన్నై ఓపెన్ మంచి వేదిక’ అని అన్నారు.