Wild card
-
బిగ్‌బాస్ సీజన్-8.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వీళ్లే (ఫొటోలు)
-
'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!
బిగ్‌బాస్ సీజన్ ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో మొదలై ఇన్ని రోజులవుతున్నా ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఒక్క విష్ణు ప్రియ మినహాయిస్తే అంతా కొత్త వాళ్లే కావడంతో షో చప్పచప్పగా సాగిపోతోంది. అందుకే బిగ్‌బాస్ సరికొత్త ఐడియాతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టేశాడు.అందులో భాగంగానే గతంలో బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్స్‌గా అలరించిన వారిని ఏరికోరి మరీ సెలెక్ట్ చేసుకున్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీల్లో మాత్రం కొత్తవాళ్లకు చోటివ్వలేదు. బుల్లితెర ఇండస్ట్రీలో బాగా ఫేమ్ ఉన్నవాళ్లనే పట్టుకొచ్చారు. హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, ముక్కు అవినాష్, గౌతమ్, నయని పావని, మెహబూబ్, రోహిణి లాంటి హౌస్‌లోకి తోసేశారు. ఇక నుంచైనా అభిమానులను ఆకట్టుకునేందుకు బిగ్‌బాస్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే.(ఇది చదవండి: Bigg Boss 8: ఏడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్)వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది హౌస్‌లో అడుగుపెట్టాక మొదటి ప్రోమో విడుదలైంది. ఇందులో గంగవ్వ హౌస్‌లో నవ్వులు పూయించారు. రోహిణి- గంగవ్వ మధ్య ఫన్నీ సంభాషణ నడించింది. ఇక తొలిరోజే ముక్కు అవినాశ్ అడ్డంగా బుక్కయ్యాడు. మొదటి రోజే పాత్రలు క్లీన్ చేసే పనికి పూనుకున్నాడు. నేనేదో యుద్ధానికి పోతున్నట్లు అందరూ క్లాప్స్ కొడుతున్నారంటూ కామెడీ పండించాడు. ఈ ప్రోమో చూస్తే కొత్త, పాత వాళ్లతో కలిసి బిగ్‌బాస్ హౌస్ కళకళలాడుతోంది. ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలైతే అసలు కథ స్టార్ట్ అవుతుంది. -
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజే.. వారిద్దరి ఎంట్రీ ఖాయం!
నెల రోజులకు పైగా బిగ్‌బాస్ సీజన్-8 టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హోస్లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిలో గతంలో హౌస్‌లోకి వచ్చినా వాళ్లు కూడా ఉన్నారు.తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్త కంటెస్టెంట్స్‌పై హౌస్ సభ్యులందరినీ నాగార్జున అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారిని త్వరగా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్లలో భాగంగా స్వాగ్ టీమ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీమ్స్ సందడి చేశాయి.(ఇది చదవండి: Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?)వారిపైనే ఆసక్తి?అయితే అందరి దృష్టి వారిపైనే ఉంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రోమో చూస్తే కొందరి పేర్లు కనిపెట్టేలా హింట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు హౌస్‌లోకి గతంలో మధ్యలోనే బయటికెళ్లిన గంగవ్వ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాంకర్ హరితేజ కూడా హౌస్‌లో అడుగుపెట్టనుంది. వీరితో పాటు మరికొంత ప్రముఖులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. -
బిగ్‌బాస్ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! నిజమెంత?
Bigg Boss 5 Tlugu, Wild Card Entry: బిగ్‌బాస్ షోలో ఫేక్ ఎలిమినేషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు సర్వసాధారణమే! కాకపోతే అదును చూసి వాటిని రంగంలోకి దింపుతాడు బిగ్‌బాస్. గత సీజన్లలో దీక్షాసేత్, పూజా, కుమార్ సాయి, ముక్కు అవినాష్, స్వాతి దీక్షిత్.. ఇలా కొంతమంది వైల్డ్‌కార్డ్ ద్వారా షోలో పాల్గొన్నారు. అయితే ఈసారి లాంచింగ్ ఎపిసోడ్‌లోనే అత్యధికంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. దీంతో ఈసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉంటుందా? లేదా? అని సోషల్ మీడియాలో అనేకసార్లు చర్చ జరిగింది. మెజారిటీ నెటిజన్లు ఉండకపోవచ్చనే అభిప్రాయపడ్డారు. 19 మందితో బిగ్‌బాస్ హౌస్‌ఫుల్ అయిందని, కొత్తగా ఎవరినీ పంపించకపోవచ్చని అనుకున్నారు. కానీ ఆ మధ్య యాంకర్ వర్షిణి, విష్ణుప్రియ హౌస్‌లోకి అడుగుపెడుతున్నారంటూ పుకార్లు వ్యాపించాయి. కానీ అందులో ఇసుమంతైనా నిజం లేదని తేటతెల్లమవడంతో నిట్టూర్పు విడిచారు జనాలు. తాజాగా మరో భామ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రీతి అన్షు బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందంటూ సోషల్ మీడియలో ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆమె ఎవరా? అని నెట్టింట గాలింపు మొదలు పెట్టింది యూత్. ప్రీతి అన్షు ఒక మోడల్. మై దిల్ అనే షార్ట్ ఫిలింలోనూ నటించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతోంది. అయితే పెద్దగా గుర్తింపు లేని ఆమెకు బిగ్‌బాస్ ఆఫర్ ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో మొదటగా ఆమె హౌస్‌లో అడుగు పెట్టబోతుందని చెప్పిన లీకువీరులే.. అబ్బే, అదంతా తూచ్, వైల్డ్‌కార్డ్ ద్వారా ఆమె బిగ్‌బాస్ షోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ప్రీతి అన్షు పేరు మాత్రం నెట్టంట మార్మోగిపోతోంది. -
ఫ్రెంచ్ ఓపెన్‌లో ముర్రేకు వైల్డ్ కార్డు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు ఈ నెల 27న మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డు కేటాయించారు. నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడేందుకు తగిన ర్యాంక్ లేకపోవడంతో ముర్రే గత ఘనతలను లెక్కలోనికి తీసుకొని (2016లో రన్నరప్) ఈ అవకాశం ఇచ్చారు. గాయాల కారణంగా కొంతకాలం ఆటకు దూరం కావడంతో ముర్రే ర్యాంక్ 129కి పడిపోయింది. యూఎస్ ఓపెన్‌లోనూ ముర్రే వైల్డ్ కార్డుతోనే ఆడాడు. -
బిగ్‌బాస్ : సామ్రాట్‌ను హెచ్చరించిన తల్లి
గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. లవ్ ఫెయిల్యూర్, స్వామి రారా సినిమాలతో ఫేమస్ అయిన పూజా రామచంద్రన్ అర్దరాత్రి దాటాక బిగ్‌బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ఎపిసోడ్‌లోనే ఈ విషయం స్పష్టమైన విషయం తెలిసిందే. అయితే ఆమె వైల్డ్ కార్డా లేక యాంకర్ ప్రదీప్‌లా గెస్టా.. అనే సందేహం కలిగింది. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని స్పష్టమైంది. ఇంటి సభ్యులను సర్ప్రైజ్ చేయడం కోసం.. కౌశల్ సలహా మేరకు డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నారు. మొదటగా గణేష్, దీప్తి సునయనలు పూజను గమనించారు. అనంతరం ఆమె ఇంటి సభ్యులందరిని పరిచయం చేసుకున్నారు. బిగ్‌బాస్ షోపై బయట జనాల అభిప్రాయం, ఇంట్లో తీసిన సినిమా గురించి టాక్ ఎలా ఉందో ఇంటి సభ్యులకు వివరించారు. ఎమోషనల్‌గా సాగిన కార్యక్రమం... ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్ చేసి.. వారిచ్చే హింట్స్‌ను గుర్తుపట్టి సరైన హౌజ్‌మేట్‌కు ఫోన్‌ను ఇచ్చేయాలి. ఇలా గుర్తుపట్టని యెడల ఆ ఫోన్ కట్ అయిపోతుంది. ఆ హౌస్ మేట్‌కు తన వాళ్లతో మాట్లాడే అవకాశం కోల్పోతారు. మొదటి కాల్ కౌశల్‌కు.. మొదట వచ్చిన కాల్‌ను గీత లిఫ్ట్ చేయగా.. మిష్టర్ ఫర్ఫెక్ట్, మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు అని చెప్పగా.. కౌశల్‌కు ఫోన్ ఇచ్చారు. కౌశల్ పిల్లలు మాట్లాడగానే కన్నీరు పెట్టుకున్నాడు. తన బిజినెస్, పిల్లల స్కూల్ వివరాల గురించి అడిగాడు. కౌశల్ భార్య మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్రెండ్స్‌గా భావించి మాట్లాడే వారే నీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని, బయట తనకు ఫాలోయింగ్ ఉందని కౌశల్ చెప్పారు. నందిని, దీప్తిల విషయాన్ని కూడా ప్రస్తావించారు. తనకు సోషల్ మీడియాలో భారీగా సపోర్ట్ లభిస్తోందని, గేమ్ జాగ్రత్తగా ఆడాలంటూ సలహా ఇచ్చారు. రెండో కాల్ రోల్ రైడాకు.. మొదటగా ఫోన్ మాట్లాడిన కౌశల్.. రెండో కాల్‌ను లిఫ్ట్ చేసిన వెంటనే.. అటునుంచి గల్లీ పోరగాడు.. బిర్యానీ తిండిబోతు అని హింట్స్ ఇవ్వగా... రోల్ రైడా అని గుర్తుపట్టి ఫోన్ అందజేశాడు. రోల్ ఫోన్ తీసుకోగా.. తన చెల్లెలితో మాట్లాడాడు. హౌస్‌లో చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడనీ, రోల్‌కు బయట చాలా మంది ఫ్యాన్స్ అయ్యారని చెప్పారు. ఎవరినీ సెల్ఫ్ నామినేట్ చేసుకో అని చెప్పకూడదని, నీ ఆట నువ్వు ఆడాలి అంటూ సలహా ఇచ్చారు. మూడో కాల్ దీప్తి సునయనకు.. రెండో కాల్ రోల్ మాట్లాడగా.. తరువాతి ఫోన్ రింగ్ అయ్యాక.. అవతలి వ్యక్తి తమ పేరును చెప్పేయడంతో కాల్ కట్ అయింది. అవతలి వ్యక్తి ఇచ్చిన హింట్స్‌తో దీప్తి సునయనకు ఫోన్ వచ్చిందని గుర్తుపట్టాడు రోల్. కానీ ముందే పేరు చెప్పేయడంతో కాల్ కట్ అయినట్లు బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో దీప్తి సునయన చిన్నబోయింది. మళ్లీ తరువాత వచ్చే ఫోన్ కూడా రోల్ రైడానే గుర్తుపట్టాలని ఆదేశించాడు. ఈ సారి సామ్రాట్‌కు సంబంధించిన వారు ఫోన్ చేశారు. వారిచ్చిన హింట్స్‌తో సామ్రాట్‌ను గుర్తుపట్టిన రోల్.. తనకి ఫోన్ అందజేశాడు. ఫోన్లో సామ్రాట్ అమ్మ మాట్లాడారు. ఎలిమినేషన్ నుంచి తప్పించిన ప్రేక్షకులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సామ్రాట్‌ను బిగ్‌బాస్ ఎందుకు వచ్చావని, నువ్వు నీలా ఉండాలని, అందరితో కలవాలంటూ, అనవసరమైన ట్యాగ్స్‌ను తగిలించుకోవద్దని, అర్దరాత్రి స్విమ్మింగ్ చేయద్దంటూ సలహాలు ఇస్తూ.. ‘నీపై చాలా నెగటివ్ ఉంది నాన్నా.. దానిని నేను తట్టుకోలేను.. జాగ్రత్తా’ అని హెచ్చరించారు. తరువాతి ఫోన్ ఎవరికి వస్తుందో.. వారిచ్చిన హింట్స్‌ను గుర్తుపడతారో లేదో మిగతా హౌస్ మేట్స్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వస్తుందో లేదో చూడాలి. -
శిక్ష అనుభవించాక ఇదేం శిక్ష?
షరపోవాకు వైల్డ్‌కార్డ్ నిరాకరణపై డబ్ల్యూటీఏ చీఫ్ వ్యాఖ్య పారిస్: మాజీ నంబర్‌వన్ మరియా షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో వైల్డ్‌కార్డ్‌ను నిరాకరించడంపై డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్ మండిపడ్డారు. స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్డు (సీఏఎస్ ) షరపోవాకు విధించిన 15 నెలల శిక్ష అనుభవించాక కూడా మళ్లీ శిక్షించడమేంటని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల (ఎఫ్ఎఫ్టీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మాజీ చాంపియన్‌ను ఇలా అవమానించడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు. టెన్నిస్ యాంటి డోపింగ్ ప్రోగ్రామ్ (టీఏడీపీ)లో బాధ్యత కలిగిన భాగస్వాములైన గ్రాండ్‌స్లామ్, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్, ఏటీపీ సంస్థలు శిక్షించిన క్రీడాకారిణిని మళ్లీ ఈ రకంగా శిక్షించడం సరైనది కాదని సైమన్ అభిప్రాయపడ్డారు. గత నెల 26తో 15 నెలల నిషేధం పూర్తయిన తర్వాత షరపోవా... స్టట్గార్ట్ ఓపెన్‌లో తొలిసారిగా బరిలోకి దిగింది. ఇందులో సెమీస్ చేరిన ఆమె తదనంతరం మాడ్రిడ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అయితే గాయాలైన వారికే తప్ప డోపీలకు వైల్డ్ కార్డ్‌లు ఇవ్వమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. -
సాకేత్‌కు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
జనవరి 2 నుంచి చెన్నై ఓపెన్ చెన్నై: భారత నంబర్‌వన్, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి చెన్నై ఓపెన్ టోర్నమెంట్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. భారత్ నిర్వహిస్తున్న ఈ ఏటీపీ టోర్నమెంట్ జనవరి 2న మొదలవుతుంది. ఇందులో స్థానిక ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్‌కు కూడా నిర్వాహకులు ఇదివరకే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రపంచ ఆరో ర్యాంకర్ మారిన్ సిలిచ్ సహా పలువురు అంతర్జాతీయ స్టార్లు ఈ టోర్నీలో తలపడేందుకు చెన్నైకి రానున్నారు. హైదరాబాద్ యువతార సాకేత్ మైనేని గత మూడేళ్లుగా చెన్నై ఓపెన్‌లో ఆడుతున్నాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వడంపై 29 ఏళ్ల మైనేని మాట్లాడుతూ ‘ఈ అవకాశం దక్కడం ఆనందంగా ఉంది. ఇందులో సత్తాచాటేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తాను. చక్కగా సన్నద్ధమయ్యేందుకు సమయం కూడా ఉంది’ అని అన్నాడు. ఐటా సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎస్.పి. మిశ్రా మాట్లాడుతూ ‘భారత్ నుంచి యువ ఆటగాళ్లకు వైల్డ్‌కార్డ్ ఇచ్చాం. వీరిద్దరూ డేవిస్‌కప్‌లో సత్తాచాటుకున్నారు. ఏటీపీ ర్యాంకింగ్‌సను మెరుగుపర్చుకునేందుకు చెన్నై ఓపెన్ మంచి వేదిక’ అని అన్నారు. -
మహేశ్ భూపతితో జతగా సాకేత్
* చెన్నై ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’ కేటాయింపు * జనవరి 5 నుంచి టోర్నీ చెన్నై: అంతర్జాతీయస్థాయిలో ఈ ఏడాది నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేనికి చెన్నై ఓపెన్‌లో ‘వైల్డ్ కార్డు’ లభించింది. వచ్చే నెల జనవరి 5 నుంచి చెన్నైలో జరిగే ఈ టోర్నమెంట్లో భారత డబుల్స్ దిగ్గజం మహేశ్ భూపతితో కలిసి సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నాడు. వైజాగ్‌కు చెందిన 27 ఏళ్ల సాకేత్ ఈ సంవత్సరం భారత డేవిస్ కప్ జట్టులో చోటు సంపాదించడంతోపాటు ఆసియా క్రీడల్లో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, సనమ్ సింగ్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. డబుల్స్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ 154కు చేరుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో మియామి మాస్టర్స్ సిరీస్ తర్వాత భూపతి మరో టోర్నీలో బరిలోకి దిగలేదు. చెన్నై ఓపెన్‌తో అతను కొత్త ఏడాదిని ప్రారంభించనున్నాడు. సాకేత్, భూపతిలతో పాటు భారత్‌కే చెందిన జీవన్ నెదున్‌చెజియాన్, శ్రీరామ్ బాలాజీలకు కూడా డబుల్స్ విభాగంలో ‘వైల్డ్ కార్డు’ను కేటాయిస్తున్నట్లు టోర్నీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ కార్తీ చిదంబరం తెలిపారు. సింగిల్స్‌లో సోమ్‌దేవ్, రామ్‌కుమార్ రామనాథన్‌లకు కూడా ‘వైల్డ్ కార్డు’ ఇచ్చారు. -
పోరాడి ఓడిన సాకేత్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో ఆడిన భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ 6-7 (4/7), 6-7 (4/7)తో థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో పోరాడి ఓటమి పాలయ్యాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను మూడేసిసార్లు కోల్పోయారు. అయితే నిర్ణాయక టైబ్రేక్‌లో మాత్రం సాకేత్ పైచేయి సాధించడంలో విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-2, 7-5తో సహచరుడు కరుణోదయ్ సింగ్‌ను ఓడించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. యూకీ బాంబ్రీ 6-2, 5-7, 5-7తో లూకాస్ పౌలీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట 7-6 (7/4), 1-6, 10-4తో టాప్ సీడ్ దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
యూకీ బాంబ్రీ పరాజయం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత యువతార యూకీ బాంబ్రీకి తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 21 ఏళ్ల యూకీ 3-6, 6-1, 2-6తో పొటిటో స్టారెస్ (ఇటలీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. అయితే డబుల్స్ విభాగంలో మాత్రం యూకీ నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడనున్నాడు. చైనాలో ఇటీవల జరిగిన ‘వైల్డ్ కార్డు’ ప్లే ఆఫ్ టోర్నీలో యూకీ-మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడి విజేతగా నిలువడంతో ఈ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడే అవకాశం లభించింది.