న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ‘వైల్డ్ కార్డు’తో మెయిన్ ‘డ్రా’లో ఆడిన భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడు సాకేత్ 6-7 (4/7), 6-7 (4/7)తో థామస్ ఫాబియానో (ఇటలీ) చేతిలో పోరాడి ఓటమి పాలయ్యాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను మూడేసిసార్లు కోల్పోయారు.
అయితే నిర్ణాయక టైబ్రేక్‌లో మాత్రం సాకేత్ పైచేయి సాధించడంలో విఫలమయ్యాడు. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 6-2, 7-5తో సహచరుడు కరుణోదయ్ సింగ్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. యూకీ బాంబ్రీ 6-2, 5-7, 5-7తో లూకాస్ పౌలీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట 7-6 (7/4), 1-6, 10-4తో టాప్ సీడ్ దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
పోరాడి ఓడిన సాకేత్
Published Wed, Feb 19 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM
Advertisement
Advertisement