పుణే ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే సాకేత్‌ పరాజయం  | saketh myneni lost in the first round of Pune open | Sakshi
Sakshi News home page

పుణే ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే సాకేత్‌ పరాజయం 

Published Wed, Nov 21 2018 1:46 AM | Last Updated on Wed, Nov 21 2018 1:46 AM

saketh myneni lost in the first round of Pune open - Sakshi

గతవారం బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని అదే జోరును పుణే ఓపెన్‌లో కొనసాగించలేకపోయాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌ 4–6, 6–7 (1/7)తో భారత్‌కే చెందిన శశికుమార్‌ ముకుంద్‌ చేతిలో ఓడిపోయాడు. గంటా 28 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌ తొలి సెట్‌లో తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన సాకేత్‌ రెండో సెట్‌లో తీవ్రంగా పోరాడాడు. అయితే టైబ్రేక్‌లో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement