
సాకేత్ మైనేనీ
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–2 పురుషుల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ సాకేత్ 5–7, 6–1, 7–5తో ఫ్రాన్సెస్కో విలార్డో (ఇటలీ)పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో కాజా వినాయక్ శర్మ ముందంజ వేశాడు. తొలి రౌండ్‌లో వినాయక్–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) జంట 7–6 (7/3), 7–6 (9/7)తో రెండోసీడ్ జుయ్ చెన్ హంగ్ (చైనీస్ తైపీ)– ఫ్రాన్సెస్కో విలార్డో (ఇటలీ) జోడీకి షాక్ ఇచ్చింది.