
వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. వియత్నాంలోని హో మిన్ చి సిటీలో శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట 7–6 (8/6), 1–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెజాంబ్రో బేగా (ఇటలీ)–స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ 6–3, 3–6, 6–7 (2/7)తో జాన్ మిల్‌మాన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment