Vietnam Open International Challenger doubles title
-
ఫైనల్లో సాకేత్ జంట
వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ఆటగాడు సాకేత్ మైనేని డబుల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీఫైనల్లో సాకేత్–విజయ్ (భారత్) ద్వయం 7–6 (7/3), 3–6, 10–7తో టీ చెన్ (చైనీస్ తైపీ)–మ్యాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా) జంటపై గెలిచింది. -
డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట
వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. వియత్నాంలోని హో మిన్ చి సిటీలో శుక్రవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట 7–6 (8/6), 1–6, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో అలెజాంబ్రో బేగా (ఇటలీ)–స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచింది. సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్) పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో యూకీ 6–3, 3–6, 6–7 (2/7)తో జాన్ మిల్మాన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. -
సాత్విక్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ రంకీరెడ్డి సాత్విక్ సాయిరాజ్ వియత్నాం ఓపెన్ అంతర్జాతీయ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన చిరాగ్ శెట్టితో జతకట్టి ఆడిన సాత్విక్ విజేతగా నిలిచాడు. వియత్నాంలోని హనోయ్‌లో ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 17–21, 21–9, 21–15తో ఐదో సీడ్ త్రావుత్ పొతియెంగ్–నంతాకమ్ యోర్డ్‌ఫైసాంగ్ (థాయ్‌లాండ్) జోడీపై విజయం సాధించింది. సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ జోడీ 16–21, 21–11, 21–18తో హెంద్రా గుణవాన్ –మార్కిస్ కిడో (ఇండోనేసియా) జంటపై సంచలన విజయం సాధించింది.