tariff
-
లాభాల్లో ఆసియా మార్కెట్లు
-
చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ
-
అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు
వాషింగ్టన్: సుంకాల దెబ్బకు విలవిలలాడుతున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనతో సంప్రదింపులు జరిపేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. ఈ క్రమంలో ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాయంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన.నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెసెషనల్ కమిటీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఏరకంగా చూసుకున్నా పార్లమెంట్(Congress) కంటే నేనే మెరుగైన మధ్యవర్తిని. అందుకే ఆయా దేశాలు నాకే ఫోన్లు చేస్తున్నాయి. సుంకాల విషయంలో ఊరట కోసం బతిమాలుకుంటున్నాయి.(ఈ క్రమంలోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు). ప్లీజ్ సర్.. మాతో ఒప్పందం చేసుకోండి అంటూ వేడుకుంటున్నాయి. ఏమైనా చేస్తామంటూ దిగజారిపోతున్నాయి’’ అని వ్యాఖ్యానించారాయన. అలాగే..సుంకాల దేశాలతో ఒప్పందం కోసం పార్లమెంట్‌ను అనుమతించాలని కొందరు రిపబ్లికన్ పార్టీలో కొందరు రెబల్ నేతలు కోరుతున్నారు. అదే జరిగి ఉంటే.. చైనా మీద ఇవాళ 104 శాతం సుంకాలు విధించాల్సి వచ్చేది కాదు. చైనా ఎంతో సంతోషంగా ఉండి ఉండేది. పైగా అమెరికానే సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. పైగా మన దేశాన్ని అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి మధ్యవర్తిత్వంలో చట్టసభ సమర్థవంతంగా పని చేస్తుందని నేను అనుకోను. ఇక్కడ ఒక విషయం చెప్పదల్చుకున్నా.. నాలా మీరెవరూ మధ్యవర్తిత్వం వహించలేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: ఫార్మా రంగం.. భారత్‌కు ట్రంప్ బిగ్ షాక్ -
వావ్.. తగ్గిన బంగారం ధరలు
-
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. -
స్టాక్ మార్కెట్లపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్
-
టారిఫ్‌లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగసోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు. ‘టారిఫ్ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు. -
టారిఫ్ టెర్రర్... ఇన్వెస్టర్లకు ఫీవర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ బాంబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అల్లకల్లోలం మొదలైంది. ప్రధానంగా భారత్, చైనా వంటి కీలక దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మందగమనంలోకి జారిపోవచ్చని, దీంతో ప్రపంచ ఎకానమీ గాడి తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, చైనా కూడా 34% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడింది. ఇతర దేశాలూ ఇదే బాట పట్టి వాణిజ్య యుద్ధం ముదిరితే, అమెరికాతో పాటు యూరప్ కూడా మాంద్యంలోకి జారే ప్రమాదం ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లతో పాటు కమోడిటీలు (బంగారం, వెండి, కాపర్, క్రూడ్ ఇతరత్రా) కూడా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్‌ను పదే పదే టారిఫ్ కింగ్‌గా పేర్కొంటూ వస్తున్న ట్రంప్.. కాస్త కనికరించి 27 శాతం ప్రతీకార సుంకాలతో సరిపెడుతున్నట్లు ప్రకటించారు. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం దాకా టారిఫ్‌లను వడ్డించడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ ఎగుమతులపై సుంకాల పోటు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలే వృద్ధి మందగమనంలో ఉన్న మన జీడీపీకి ఇది మరింత ప్రతికూలాంశంగా చెబుతున్నారు. వృద్ధి రేటుపై కనీసం అర శాతం ప్రభావం ఉండొచ్చనేది (ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతానికి పరిమితం కావచ్చు) ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోపక్క, వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే రూపాయి బలహీనపడొచ్చని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఆసియాలో మనకు ప్రధాన పోటీదారులైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై మన కంటే అధిక సుంకాలు విధించడం అనేది మనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ‘ట్రంప్ లిబరేషన్ డే టారిఫ్‌లపై సంబంధిత దేశాలన్నీ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడితే, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత అతిపెద్ద ఆర్థిక కుదుపు తప్పదు. టారిఫ్ ప్రభావిత తీవ్ర ఆటుపోట్లు కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్లలో కొనసాగవచ్చు’ అని వెస్టెడ్ ఫైనాన్స్ ఫౌండర్, సీఈఓ విరమ్ షా పేర్కొన్నారు. మార్కెట్లో మరింత కరెక్షన్ తప్పదు... టారిఫ్ వార్ దెబ్బకు అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా సూచీలు లిబరేషన్ డే రోజున 3–6% కుప్పకూలగా.. వారాంతంలో మరో 5–6% క్రాష్ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో 4 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడం సుంకాల సునామీకి నిదర్శనం! ట్రేడ్ వార్తో ఎగుమతులు మందగిస్తే, వృద్ధి రేటుకు మరింత సెగ తగులుతుందని, స్వల్పకాలికంగా మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ‘టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇకపై సాధ్యపడకపోవచ్చు. అంతేకాకుండా వాణిజ్యపరమైన అడ్డంకులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే రిస్క్ పెరుగుతుంది. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కకావికలం అవుతుంది’ అని అభిప్రాయపడింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పోటీపరంగా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో మాంద్యం ముప్పు మన మార్కెట్లకు ప్రతికూలాంశమని ఎడెలీ్వజ్ ఎంఎఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య పేర్కొన్నారు.ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ‘ట్రంప్ టారిఫ్‌లపై ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ముఖ్యంగా రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్ షేర్లు కాస్త మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చు. సైక్లికల్ రంగాల (ఆటో, మెటల్స్) షేర్లకు ప్రతికూలం. టారిఫ్‌లపై కుదిరే వాణిజ్య ఒప్పందాల ఫలితాలే దీర్ఘకాలింగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. స్వల్పకాలానికి మాత్రం మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల విషయాలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని స్టాక్సా్కర్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ సూచించారు. మార్కెట్లో స్వల్పకాలిక సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా మన ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆనంద్ రాఠీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా చెప్పారు. టారిఫ్‌ల దెబ్బతో తక్షణం మార్కెట్లో తీవ్ర కుదుపులు ఉన్నప్పటికీ.. మధ్య, దీర్ఘకాల దృక్పథంతో భారీగా కరెక్షన్కు గురైనప్పుడల్లా పటిష్ట ఫండమెంటల్స్ ఉన్న నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా పొజిషన్లను పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టీ గతేడాది సెప్టెంబర్‌లో 26,277 పాయిట్ల గరిష్టాన్ని తాకగా.. 2025 మార్చిలో 21,964 పాయిట్లకు (దాదాపు 16.6 శాతం) క్షీణించింది. ఎఫ్‌పీఐల దన్నుతో ఆ తర్వాత 7 శాతం బౌన్స్ అయ్యింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్ల క్రాష్‌తో పాటు మన సూచీలు కూడా మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. ఈ వారంలో 2.5 శాతం పడ్డాయి.డెట్ ఫండ్స్‌కు దన్ను... జీడీపీ వృద్ధి మందగమనానికి తోడు ఇప్పుడు టారిఫ్‌ల పిడుగుతో ఎకానమీకి దన్నుగా ఆర్బీఐ సరళతర పాలసీని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించడం (6.25 శాతానికి) సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించింది. ‘వాణిజ్య యుద్ధాలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నుంచి దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లకు రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీరేట్లను మరింత తగ్గించడంతో పాటు సానుకూల లిక్విడిటీ చర్యలను చేపట్టవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్లు దిగిరావడం వల్ల ఇప్పటికే ట్రేడవుతున్న అధిక కూపన్ (వడ్డీ) రేటు బాండ్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర అసెట్ విలువ (ఎన్ఏవీ) ఎగబాకేందుకు దోహదం చేస్తుంది. డెట్ ఫండ్సో్ల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది సానుకూలాంశమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: తమ దిగుమతులపై 34 శాతం టారిఫ్ విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వారు తప్పు చేశారంటూనే దాన్ని చైనా అమలు చేయలేదన్నారు. ఇంకా చైనా భయపడిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో చైనా విధించిన టారిఫ్ ల పై స్పందించారు ట్రంప్ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూఎస్ వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు చైనా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత చైనా ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా వస్తువులపై అదనంగా 34 శాతం సుంకాలను అమెరికా విధించిన నేపథ్యంలో.. చైనా కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా అంతే శాతాన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్నట్లు ప్రకటించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల్గిన దేశాల మధ్య టారిఫ్ వార్..!చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం చైనా.. తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించడంతో ఇది చర్చకు దారి తీసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణానికి దారితీసినట్లయ్యింది. అమెరికా, చైనాలు ఎవరికి వారే వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది టారిఫ్ లకే పరిమితం అవుతుందా.. లేక విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందా అనేది ప్రజల్లో తలెత్తున్న ప్రశ్న. అమెరికా విధిస్తున్న సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
కొంత లాభం.. నష్టం
సాక్షి, అమరావతి: మన దేశం నుంచి జరిగే ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం కొన్ని రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంటే మరికొన్ని రంగాలకు చేటు చేస్తుందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలను 27 శాతం పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడంతో దీని ప్రభావం మన రాష్ట్రంపై ఎలా ఉంటుందన్న దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.రాష్ట్రం నుంచి అత్యధికంగా అమెరికాకు ఎగుమతయ్యే ఆక్వా వంటి సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్ రంగాలపై ఈ టారిఫ్ పెంపు భారీ ప్రభావం చూపుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో టారిఫ్‌ల పెంపుతో ఎల్రక్టానిక్స్, ఆభరణాలు, ఫార్మా, పౌల్ట్రీ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 2023–24 సంవత్సరంలో రాష్ట్రం నుంచి మొత్తం రూ.1.67 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, అందులో సుమారు రూ.35,000 కోట్లు అమెరికాకే జరిగాయి.రాష్ట్ర ఎగుమతిదారులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడంతో ట్రంప్ నిర్ణయ ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న దానిపై విస్తృత అధ్యయనం మొదలైంది. టారిఫ్‌ల పెంపుపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల తర్వాత ఈ టారిఫ్‌లు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల తర్వాత సుమారు రూ.15,000 కోట్ల ఎగుమతులు జరిగే ఫార్మా రంగాన్ని టారిఫ్ పెంపు నుంచి మినహాయించడంపై ఆ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల పెంపుపై వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఎల్రక్టానిక్స్ తయారీ రంగానికి ఊపు పీఎల్ఐ స్కీంతో ఎల్రక్టానిక్స్ తయారీ రంగం రాష్ట్రంలో ఊపందుకుంది. తైవాన్, చైనాలపై అమెరికా అత్యధికంగా టారిఫ్‌లు పెంచడం మనకు కలిసి వచ్చే అంశం. ఇండియాపై 27 శాతం టారిఫ్ విధిస్తే చైనాపై 54 శాతం విధించడంతో ఎల్రక్టానిక్స్ తయారీకి ఇండియా బెస్ట్‌గా మారే అవకాశముంది.– రవీంద్ర సన్నారెడ్డి, ఎండీ, శ్రీసిటీ. ఇదో చక్కటి అవకాశం రాష్ట్రం నుంచి అమెరికాకు పౌల్ట్రీ ఎగుమతులు చాలా తక్కువ. దీంతో టారిఫ్ పెంపు ప్రభావం ఈ రంగంపై అంతగా కనిపించదు. కానీ మన దేశంతో పోలిస్తే పౌల్ట్రీ ఫీడ్‌లో ప్రధానమైన మొక్కజొన్న చాలా చౌక. దీన్ని ఉపయోగించుకుంటూ కేవలం పౌల్ట్రీ ఎగుమతుల కోసం పౌల్ట్రీ ఫీడ్ తెచ్చుకుంటే ఉత్పత్తి వ్యయం 30–40 శాతం తగ్గిపోతుంది. అప్పుడు ఇతర దేశాల పౌల్ట్రీ పరిశ్రమతో మనం పోటీ పడగలం. – సురేష్ చిట్టూరి, వీసీఎండీ, శ్రీనివాస్ ఫామ్స్. ఇంకా అధ్యయనం జరగాలి స్టీల్, మెటల్స్ రంగాలపై టారిఫ్ ప్రభావం ఎంత అన్నది ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. మన రాష్ట్రం నుంచి అమెరికాకు లోహాల ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వివిధ దేశాలపై చెబుతున్న టారిఫ్ శాతాలపై కొంత గందరగోళం ఉంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. – నీరజ్ శర్దా, డిప్యూటీ ఎండీ, శర్ద మెటల్స్ అండ్ అల్లాయిస్ దెబ్బ మీద దెబ్బ పలు దేశాల మధ్య యుద్ధాలు, రాజకీయ అనిశ్చితులతో టెక్స్టైల్ రంగం దెబ్బతింది. అమెరికా టారిఫ్‌ల పెంపుతో ఎగుమతులు పడిపోతాయి. భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో పత్తి ధర చాలా తక్కువ. ఇక్కడ పత్తిని కొని ఎగుమతులు చేయలేకపోతున్నాం. పోనీ.. దిగుమతి చేసుకుందామా అంటే భారత్ పత్తి దిగుమతులపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీంతో టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడే స్థితికి వస్తుంది. – లంకా రఘురామి రెడ్డి, గౌరవాధ్యక్షుడు, ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ -
ఎగుమతులకు టారిఫ్‌ల గండం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల ప్రతిపాదనలతో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ప్రతికూలంగా ఉంటుందని ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. దీని వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు.10 శాతం వరకు సుంకాలు ఫర్వాలేదని, అంతకు మించితే మాత్రం ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్‌పై టారిఫ్‌ల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. దిగుమతి సుంకాలపై అనిశ్చితి వల్ల ఇప్పటికే కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లివ్వకుండా తాత్కాలికంగా ఆపి ఉంచారని రాల్హన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిస్థితిని సరిదిద్దాలని, టారిఫ్‌ల సమస్యను ఎదుర్కొనడంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. -
టారిఫ్‌లకు వేళాయె
న్యూయార్క్/వాషింగ్టన్/రోమ్/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్‌కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్‌హౌస్ తాజాగా స్పష్టం చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. జపాన్ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్‌లు విధించింది. మా బటర్, చీజ్ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్‌లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్‌లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్‌లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్‌లను భారత్ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ అమెరికా టారిఫ్‌లకు బెదిరేది లేదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్‌ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్.ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్‌ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్ బాదుడు నుంచి జపాన్ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్‌లపై కేంద్రం ప్రకటనన్యూఢిల్లీ: భారత్‌కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.హెచ్చు టారిఫ్‌లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్‌ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్‌ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్ ఎఫ్‌టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి.ఇదీ పరిస్థితి!అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల అంతరం ఆటోమొబైల్స్ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్‌పై 7.2, ప్లాస్టిక్స్‌పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్‌పై 2.5, టెక్స్టైల్స్, క్లా్లతింగ్లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రధాని నరేంద్రమోదీని మెచ్చుకున్నారు. వాషింగ్టన్- భారతదేశం మధ్య సుంకాల చర్చలపై ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తి అని సుంకాల విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర సమన్వయం ఉంటుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ ఆ మర్నాడే భారత్ సుంకాలపై స్పందించారు. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా వచ్చారని, తమ మధ్య మంచి స్నేహం ఉన్నదన్నారు. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చాలా తెలివైన వ్యక్తి అని, తామ సుంకాల విషయంలో చర్చలు జరిపామని, ఇది అమెరికా, భారత్‌లకు మంచి చేస్తుందన్నారు. అమెరికాలోకి దిగుమతి చేసుకున్న వాహనాలపై ట్రంప్ సర్కారు 25 శాతం సుంకాన్ని విధిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇది ఏప్రిల్ 2 నుండి అమలులోకి రానుంది.భారతదేశం విధించే అధిక సుంకాలను హైలైట్ చేసిన ట్రంప్ తాము కూడా త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని, వారు మా నుంచి వసూలు చేస్తే, మేము వారి నుంచి వసూలు చేస్తామన్నారు. భారత్, చైనాలు లేదా అక్కడి కంపెనీల విషయంలో తాము న్యాయంగా ఉండాలనుకుంటున్నామని, పరస్పర అంగీకారంలో సుంకాల విధింపు ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీని సందర్శించి ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు తమ నూతన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ‘మిషన్ 500’గా నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల వస్తు, సేవల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్థారించారు.ఇది కూడా చదవండి: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’కు సుంకాలతో ముప్పు
భారత్‌కు ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ అనే బిరుదును తెచ్చిపెట్టిన ఇండియా ఫార్మా రంగానికి అమెరికా పరస్పర సుంకాల ముప్పు పొంచి ఉందని హెటిరో గ్రూప్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు బి.పార్థసారధిరెడ్డి పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై భారత్ ప్రస్తుతం 10 శాతం దిగుమతి సుంకం విధిస్తుండగా, అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఔషధాలపై ఎలాంటి సుంకాలు విధించడం లేదు. యూఎస్ ప్రభుత్వం ఈ అంతరాన్ని పూడ్చేందుకు సుంకాలు విధిస్తే భారత్‌కు నష్టం కలుగుతుందన్నారు.2023-24లో భారత మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అమెరికా 31 శాతం లేదా 9 బిలియన్ డాలర్లు (రూ.74,000 కోట్లు) వాటాను కలిగి ఉందని పార్థసారధిరెడ్డి తెలిపారు. అమెరికా ఏవైనా పరస్పర సుంకాలు భారతీయ ఫార్మా ఉత్పత్తులపై విధిస్తే పోటీతత్వాన్ని తగ్గించడంతోపాటు అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమకు నష్టం చేకూరుతుందన్నారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదల భారత ఫార్మా కంపెనీలకు, ముఖ్యంగా తక్కువ ధరలకు లభించే జనరిక్ మందుల మార్కెట్ వాటాను కోల్పోవడానికి దారితీస్తుందని చెప్పారు. దీనివల్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, అనేక పెట్టుబడులు లాభసాటిగా ఉండవన్నారు.సామరస్య పరిష్కారానికి చర్యలు‘భారత ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గణనీయంగా దోహదం చేస్తోంది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అంతరాయం ఏర్పడితే విదేశీ ఇన్వెస్టర్ల ఆదాయాలు తగ్గుతాయి. ఫార్మా పరిశ్రమతో ముడిపడి ఉన్న తయారీ, పరిశోధన, పంపిణీ, ఇతర రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలి. ప్రపంచ పోటీతత్వాన్ని కొనసాగించడానికి, ప్రపంచవ్యాప్తంగా సరసమైన మందులను సరఫరా చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మా కంపెనీలకు సబ్సిడీలు, పన్ను మినహాయింపుల ద్వారా భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందించాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?బడ్జెట్లోనే కీలక నిర్ణయంఅమెరికా నుంచి ఏటా ఫార్మా దిగుమతులు ప్రస్తుతం 800 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నందున అమెరికా ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ఇప్పటికే ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్లో ఇప్పటికే అనేక కీలక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని తొలగించారు. -
భారత్‌పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?
ప్రతిపాదిత అమెరికా సుంకాల నుంచి భారత్‌కు కొంతమేర ఉపశమనం లభించవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై యూఎస్ విధిస్తున్న సుంకాల మాదిరిగా కాకుండా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా-ఇండియా మధ్య వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని, ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు కనిపించడం లేదన్నారు.కొత్త వాణిజ్య చర్యలను దశలవారీగా అమలు చేయడానికి వీలుగా అనువైన విధానాన్ని అధికారులు అన్వేషిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. ఈ ఒప్పందంలో భాగంగా గణనీయమైన వాణిజ్య పరిమాణాలు కలిగిన అధిక డిమాండ్ ఉన్న వస్తువులపై ఒక మోస్తరు సుంకం పెరుగుదలనే చూడవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు.మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడిఅమెరికాకు అధిక పరిమాణంలో ఎగుమతి చేసే కొన్ని కీలక రంగాలపై సుంకాలను తగ్గించాలని భారత వాణిజ్య అధికారులు యూఎస్‌పై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో కొత్త వాణిజ్య ఒప్పంద వివరాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూఎస్‌తో చర్చలు సానుకూలంగా ఉన్నప్పటికీ అమెరికా భారత్ నుంచి మరిన్ని రాయితీలు కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.616 కోట్లు ఎగనామంఇతర దేశాల మాదిరి కాదు..ప్రపంచ వాణిజ్య పునర్వ్యవస్థీకరణల మధ్య అమెరికా తన టారిఫ్ వ్యూహాన్ని సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. చైనా, మెక్సికో, కెనడాల మాదిరిగా కాకుండా భారత్‌ను ప్రత్యేకంగా చూస్తూ కొంతమేర సుంకాల్లో వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది అమెరికాతో భారత్‌కు ఉన్న ప్రత్యేక వాణిజ్య సంబంధాలను హైలైట్ చేస్తుంది. దీంతో భారీగా టారిఫ్ పెంపుపై ఆందోళన చెందుతున్న భారత ఎగుమతిదారులకు ఉపశమనం లభించనుందనే వాదనలున్నాయి. -
టారిఫ్‌లపై ఆందోళన వద్దు: కానీ..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌లతో తలెత్తబోయే ప్రతికూల ప్రభావాల గురించి దేశీ కార్పొరేట్లు ఆందోళన చెందరాదని గోద్రెజ్ అండ్ బాయిస్ సీఎండీ జంషీద్ గోద్రెజ్ సూచించారు. దాని బదులు మరింతగా పోటీపడే సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.పోటీతత్వాన్ని పెంపొందించుకునేందుకు భారతీయ తయారీ సంస్థలు, చైనాలాగా భారీ స్థాయిలో తయారీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని గోద్రెజ్ వివరించారు. తమ ఎగుమతులపై భారత్ విధిస్తున్న స్థాయిలోనే ఏప్రిల్ 2 నుంచి భారత్ ఎగుమతులపై తాము కూడా సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొంది.పలు భారతీయ కంపెనీలు అంతర్జాతీయంగా విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ స్థానిక కంపెనీలు తయారీ విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నాయని గోద్రెజ్ చెప్పారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తయారీ రంగ వాటా గణనీయంగా తగ్గిందని, దీన్ని స్థూల దేశీయోత్పత్తిలో నాలుగో వంతుకు పెంచుకోవాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదని తెలిపారు. -
ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయి
సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా.. భారత్ మీద ఆ ప్రభావాన్ని కొంత తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళు, బోర్బన్ విస్కీ అండ్ కాలిఫోర్నియా వైన్స్ మీద దిగుమతి సుంకాలను తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాలు కొన్ని ఉత్పత్తులపై సుంకాలను మరింత తగ్గించి.. వాణిజ్య సంబంధాలను పెంచుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయి.ప్రభుత్వం గతంలో హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై దిగుమతి సుంకాలను 50 శాతం నుంచి 40 శాతానికి తగ్గించింది. ఇప్పుడు దీనిని మరింత తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే.. ఈ ప్రీమియం బైకులోను దేశంలో సరసమైన బైకుల జాబితాలోకి చేరుతాయి.బోర్బన్ విస్కీపై దిగుమతి సుంకాన్ని గతంలో 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించారు. రెండు దేశాల మధ్య సజావుగా వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అధికారులు ఇప్పుడు మరి కొంత ట్యాక్స్ తగ్గించనున్నారు. ఈ వాణిజ్య చర్చలు మోటార్ సైకిళ్ళు, ఆల్కహాలిక్ పానీయాలకే పరిమితం కాలేదు. ఎందుకంటే ఇందులో ఔషధ ఉత్పత్తులు, రసాయనాల ఎగుమతుల విస్తరణలు కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా అధికారులు చర్చిస్తున్నారు.భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఔషధ రంగంలో తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని అమెరికా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే భారతదేశం అమెరికాకు తన ఎగుమతులకు అనుకూలమైన నిబంధనలను పొందాలని చూస్తోంది. -
సుంకాల కోతకు సిద్ధం!
న్యూఢిల్లీ: ఇండియాలో సుంకాలు అధికంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ ఉత్పత్తులపై విచ్చలవిడిగా సుంకాలు వసూలు చేస్తున్న దేశాల ఉత్పత్తులపై అదేస్థాయిలో సుంకాలు విధిస్తామని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. ఇందులో చైనా, ఇండియా, మెక్సికో వంటి దేశాలు ఉన్నాయి. అమెరికాలో వచ్చే నెల 2వ తేదీ నుంచి ఈ ప్రతీకార టారిఫ్‌లు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.అమెరికా నుంచి దిగుమతి అయ్యేవాటిలో 55 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని నిర్ణయాని కొచ్చినట్లు ప్రభుత్వ వర్గాల ను ఉటంకిస్తూ ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలియజేసింది. తగ్గించే సుంకాల విలువ 23 బిలియన్ డాలర్లు(రూ.1.96 లక్షల కోట్లు)గా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. టారిఫ్‌ల తగ్గింపు నిర్ణయం నుంచి మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీటిపై టారిఫ్‌లు యథాతథంగా అమలవుతాయని వివరించింది. అల్మాండ్స్, పిస్తా, ఓట్మీల్, క్వినోవా వంటి వాటిపై సుంకాలు తగ్గుతాయని తెలిపింది.అమెరికా–ఇండియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలోభాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికాలో ప్రతీకార సుంకాల వల్ల భారతదేశ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌ల భారాన్ని భారత ప్రభుత్వం తగ్గించబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.భారత్‌తో అమెరికాకు వాణిజ్య లోటుప్రస్తుతం ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై 5 శాతం నుంచి 30 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. కొన్ని రకాల ఉత్పత్తులపై సుంకాలను క్రమంగా తగ్గిస్తూ.. పూర్తిగా ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ప్రతిపాదన ఇప్పటికైతే చర్చల దశలోనే ఉంది. అమెరికాలో పెంచిన టారిఫ్‌లు అమల్లోకి వచ్చేలోగానే ఆ దేశంతో స్పష్టమైన ఒప్పందం చేసుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. టారిఫ్‌ల భారం ఇరుదేశాలపై పడకుండా ఈ ఒప్పందం ఉండొచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై ఇండియాలో సుంకాలు తగ్గిస్తే... ఇండియా ఉత్పత్తులపై అమెరికాలో సుంకాలు తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఒకవేళ ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గకపోతే భారత ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉంది. భారత ప్రధాని మోదీ ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. టారిఫ్‌ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సాధ్యమైనంత త్వరగా వాణిజ్య చర్చలు ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయానికొచ్చారు. ప్రస్తుతం ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 45.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును పూర్తిగా పూడ్చుకోవాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. -
అమెరికా సుంకాలు: ఆ రంగంపైనే అధిక ప్రభావం..
న్యూఢిల్లీ: అమెరికా ప్రతికార సుంకాలు విధిస్తే.. అప్పుడు భారత ఫార్మా రంగంపై అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక టారిఫ్‌లతో అమెరికాలో భారత ఫార్మా ఉత్పత్తుల ఖరీదు, ఇతర దేశాలతో పోల్చితే పెరిగిపోతుందంటున్నారు. అదే సమయంలో భారత ఆటోమొబైల్ కంపెనీలపై సుంకాల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందంటూ.. అమెరికాకు ఆటో ఎగుమతులు చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు మోపుతున్న భారత్‌పై ఏప్రిల్ 2 నుంచి తాము కూడా అదే స్థాయిలో ప్రతిసుంకాలు అమలు చేస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదే పనిగా ప్రకటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై భారత్ 10 శాతం సుంకం అమలు చేస్తోంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు.చరిత్రను గమనిస్తే దేశీ డిమాండ్‌ను తీర్చుకునేందుకు అమెరికా ఇప్పటి వరకు ఫార్మా ఉత్పత్తుల విషయంలో నికర దిగుమతిదారుగా ఉన్నట్టు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్నర్ అరవింద్ శర్మ తెలిపారు. ‘‘భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై గణనీయ స్థాయిలో టారిఫ్‌లు విధించాలని అమెరికా ఇటీవల నిర్ణయించడం భారత ఫార్మా రంగంపైనా చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా దేశీ వినియోగంపైనా దీని ప్రభావం ఉంటుంది’’అని చెప్పారు.అమెరికన్లకు గణనీయంగా ఆదా..అమెరికాలో ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్ నుంచి సరఫరా అవుతుండడం గమనార్హం. చౌకగా భారత్ అందిస్తున్న ఔషధాలతో అమెరికాకు 2022లో 219 బిలియన్ డాలర్లు ఆదా అయినట్టు పరిశ్రమ వర్గాల అంచనా. 2013 నుంచి 2022 వరకు చూస్తే పదేళ్ల కాలంలో 1.3 ట్రిలియన్ డాలర్లను అమెరికన్లు ఆదా చేసుకున్నారు. అంతేకాదు భారత చౌక జనరిక్ ఔషధాలతో అమెరికాకు వచ్చే ఐదేళ్లలో మరో 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అవుతుందని అంచనా.భారత ఫార్మా ఎగుమతులకు అమెరికా పెద్ద మార్కెట్ అని శర్మ చెప్పారు. భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటాయే మూడింట ఒక వంతుగా ఉన్నట్టు తెలిపారు. ఉన్నట్టుండి టారిఫ్‌లు పెంచితే, అది భారత్‌లో ఔషధ తయారీని, దిగుమతి వ్యయాలను పెంచుతుందన్నారు. అదే జరిగితే అప్పుడు ఇతర దేశాలతో పోల్చితే భారత ఔషధ ఉత్పత్తులు ఖరీదుగా మారతాయన్నారు. ఇది అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచుతుందని, వినియోగదారులపై భారాన్ని మోపుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఫార్మా రంగానికి కొత్త దారులుఅమెరికా అధిక సుంకాలతో కొత్త మార్కెట్ అవకాశాల దిశగా భారత ఫార్మా రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని శర్మ అంచనా వేస్తున్నారు. భారత కంపెనీలు యూరప్, ల్యాటిన్ అమెరికా లేదా ఆఫ్రికాలపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు భారత ఆటో ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ రంగంపై సుంకాల ప్రభావం తక్కువే ఉంటుందని ఇండస్ లా పార్ట్నర్ శశి మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. కాకపోతే భారత ఆటో విడిభాగాల కంపెనీలపై కొంత ప్రభావం ఉండొచ్చన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు ఆ దేశ ఆటో ఉత్పత్తులపై భారత్ సుంకాలను సున్నా స్థాయికి సమీప కాలంలో తగ్గించకపోవచ్చన్న విశ్లేషణ వ్యక్తం చేశారు. -
నేటి నుంచి యూఎస్‌పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారం
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం(Trade Tensions) ముదురుతోంది. ఇటీవల అమెరికా చైనా దిగుమతులపై సుంకాలు(tariffs) విధిస్తున్నట్లు ప్రకటించింది. చైనా దిగుమతులపై సుంకాలను 10 నుంచి 20 శాతానికి పెంచుతూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రతీకారంగా సోమవారం నుంచి అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై బీజింగ్ సుంకాలు అమలు చేసింది.ట్రంప్ ఓటర్ బేస్ లక్ష్యంగా..కొత్త చైనా సుంకాలు చికెన్, గోధుమ, మొక్కజొన్న, పత్తితో సహా యూఎస్ వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిపై 10-15 శాతంగా అమలు చేస్తున్నారు. అలాగే సోయాబీన్స్, పంది మాంసం, పాడి ఉత్పత్తులపై కూడా ఈ సుంకాలు అమలు చేయాలని చైనా నిర్ణయించింది. అమెరికాలో ట్రంప్ ఓటర్ బేస్‌ను ఆధారంగా చేసుకొని, వ్యవసాయ రాష్ట్రాల్లోని వారే లక్ష్యంగా ఈ సుంకాలను చైనా జాగ్రత్తగా రూపొందించినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.పరిస్థితులు మరింత క్లిష్టతరం?యూఎస్-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో చైనా నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా సాగుతోంది. వినియోగదారుల వ్యయ సామర్థ్యం తగ్గుతోంది. దీర్ఘకాలిక స్థిరాస్తి రంగం సంక్షోభంలోకి వెళుతుంది. రికార్డు స్థాయిలో యువత నిరుద్యోగంతో అవస్తలు పడుతున్నారు. ఈ క్రమంలో వాణిజ్య యుద్ధం ఒత్తిళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు, చైనా తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి చేస్తున్న ప్రయత్నాలు పరిస్థితులను మరింత క్లిష్టతరం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ పరిస్థితిని మెరుగ్గా నిర్వహిస్తామని చైనా అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్‌ల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి క్రియాశీల ఆర్థిక విధానాల అవసరాన్ని నొక్కిచెప్పిన చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్‌కు సన్నిహితుడైన లీ కియాంగ్ ఇటీవల ఈ సంవత్సరానికి 5 శాతం ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు.ఇదీ చదవండి: మహిళలకూ కావాలి సమగ్ర బీమాచర్చలకు దారి తీస్తాయా..ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదం ముదురుతున్న కొద్దీ పరస్పరం ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బీజింగ్ సుంకాలు అమెరికాపై రాజకీయ ఒత్తిడి తీసుకురావడానికి రూపొందించినప్పటికీ అవి ఇరు వర్గాల మధ్య చర్చలకు దారితీసే అవకాశం కూడా కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహాలు పరిష్కారానికి దారితీస్తాయా లేదా మరింత ఉధృతికి అవకాశం కల్పిస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. -
Mr Trump: టారిఫ్ వార్‌లో వెనక్కి తగ్గినట్లే తగ్గి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యధావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన.కెనడా, మెక్సికోతోపాటు చైనాపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించడం ఆయా దేశాలతో వాణిజ్య యుద్ధానికి కారణమైంది. ఈ ప్రభావం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపైనా ప్రతికూల ప్రభావం చూపెట్టవచ్చనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే తన నిర్ణయంపై మార్కెట్ కుదేలు ప్రభావమేమీ లేదని ఆయన అంటున్నారు. కేవలం అమెరికా కార్ల తయారీదారుల కోసమేనని చెప్పారాయన. అయితే ఒకవైపు కెనడా వాణిజ్య ప్రతినిధులతో చర్చలు.. మరోవైపు మెక్సికో ప్రెసిడెంట్‌తో మాట్లాడిన తర్వాతే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా.. అమెరికా-మెక్సికో-కెనడా మధ్య ఒప్పందం(USMCA) అమలులో ఉంది. తాజా నిర్ణయంతో ప్రస్తుతానికి ఆ రెండు దేశాల ఆటోమేకర్స్‌కు ట్రంప్ ఊరట ఇచ్చారు. మరోవైపు కెనడా నుంచి దిగుమతి అయ్యే 62 శాతం ఉత్పత్తులు కొత్త సుంకాలను ఎదుర్కొనాల్సిందేనని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఎనర్జీ ప్రొడక్ట్స్‌కు మాత్రం 10 శాతమే వర్తిస్తుందని తెలిపారు.కెనడా కూడా అమెరికాపై విధించిన సుంకాల విషయంలో వెనక్కి తగ్గింది. సుమారు 125 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులపై విధించిన రెండో దశ సుంకాల అమలును ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా ేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. అన్ని టారిఫ్‌లను ఎత్తేసే దిశగా ప్రయత్నాలుకొనసాగిస్తామని తెలిపింది.రాజకీయ దుమారంఅధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అయితే ఇది క్రమంగా రాజకీయ మలుపు తిరిగింది. ట్రంప్‌తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ.. కెనడా-అమెరికాలు భవిష్యత్తులో వాణిజ్య యుద్ధంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ట్రూడోకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.అధికారంలో కొనసాగడానికి సుంకాల వివాదాన్ని ట్రూడో వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. కెనడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాన్ని తెలుసుకోవాలని తాను ప్రయత్నించినప్పటికీ.. అక్కడ నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపాయి. 51వ రాష్ట్ర గవర్నర్‌గా కొనసాగేందుకు ట్రూడో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారాయన. దీంతో కెనడా మండిపడింది. కెనడా ఏనాటికీ అమెరికాలో కలవబోదని కౌంటర్ ఇచ్చింది. కెనడాను అమెరికాలో విలీనం చేసి.. 51వ అమెరికా రాష్ట్రంగా మార్చకుంటామని.. అవసరమైతే ఆర్థిక-సైనిక శక్తులను ఉపయోగిస్తామని ట్రంప్ గతకొంతకాలంగా చెబుతున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ చర్యపై వారెన్ బఫెట్ ఆందోళన
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) కెనడా, చైనా, మెక్సికోలపై భారీ సుంకాలను విధించారు. ఈ ప్రకటన ''యుద్ధ చర్య'' అని బిలియనీర్, ప్రముఖ పెట్టుబడిదారు 'వారెన్ బఫెట్' (Warren Buffett) అని అన్నారు. సుంకాలు ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపుతాయనే విషయాన్ని కూడా వెల్లడించారు.సుంకాలు.. వస్తువులపై పన్నుగా పనిచేస్తాయని. ఇది ప్రజలు లేదా వినియోగదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బఫెట్ అన్నారు. ఇప్పటి వరకు మా కంపెనీ అమెరికా ప్రభుత్వానికి గత 60 ఏళ్లలో 101 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పన్ను చెల్లించిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ.. ఇంత పెద్ద మొత్తంలో పన్ను చెల్లించలేదని స్పష్టం చేశారు.అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన బఫెట్.. సుంకాల ఆర్థిక భారం వినియోగదారులపై పడుతుందని చెప్పారు. ఈ రోజు (మంగళవారం) నుంచి అమలులోకి వచ్చే కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాలను విధించడంలో ట్రంప్ ముందుకు సాగుతున్నందున.. బఫెట్ ఈ వ్యాఖ్యలు చేశారు.చైనా దిగుమతులపై సుంకాలను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ చర్య బీజింగ్‌తో ఉద్రిక్తతలను పెంచానుందని నిపుణులు చెబుతున్నారు. చైనా కూడా సుంకాలతోనే ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఇవన్నీ గమనిస్తుంటే.. వాణిజ్య యుద్ధం జరుగుతుందా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: చైనా నెత్తిన ట్రంప్ పిడుగు.. సుంకాల విషయంలో తగ్గేదేలే!సుంకాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాయని.. వ్యాపారాలు, వినియోగదారులపై ఖర్చుల భారం పెరుగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సుంకాలతో విదేశీ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి కారణం.. దేశీయ తయారీని పెంచడమే అని ట్రంప్ సమర్ధించుకుంటున్నారు. అయితే విమర్శకులు ఇటువంటి విధానాల వల్ల ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం ఎంతంటే..
అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ అధిక శాతం దేశీ డిమాండ్ (వినియోగం)పై ఆధారపడి ఉన్న విషయాన్ని తన తాజా నివేదికలో గుర్తు చేసింది. దీనికితోడు అమెరికాకు భారత్ చేసే ఎగుమతుల్లో ఎక్కువ భాగం సేవల రూపంలో ఉన్నందున, ట్రంప్ పాలనా యంత్రాంగం వీటిని లక్ష్యంగా చేసుకోకపోవచ్చని తెలిపింది. భారత్ సహా తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలన్నింటి నుంచి వచ్చే దిగుమతులపై అదే మోతాదులో తాము కూడా సుంకాల మోత మోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీ సమక్షంలోనే స్పష్టం చేయడం గమనార్హం. అమెరికా ప్రతీకార సుంకాలు ఎక్కువగా వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్‌పై ప్రభావం చూపిస్తాయని, ఆ దేశాలు అమెరికాతో అధిక వాణిజ్య మిగులు కలిగి ఉన్నట్టు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ ఆర్థికవేత్త విశృత్ రాణా తెలిపారు. అమెరికాతో ఎక్కువగా సేవల వాణిజ్యం నడుపుతున్న జపాన్‌పైనా సంకాలు ఏమంత ప్రభావం చూపించబోవన్నారు. ధరల ఆజ్యంతో అధిక వడ్డీ రేట్లుఅమెరికా విధించే ప్రతీకార సుంకాలు ధరలకు ఆజ్యం పోస్తాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా అధిక వడ్డీ రేట్లకు దారితీయొచ్చని రాణా అభిప్రాయపడ్డారు. ‘భారత్ వృద్ధి కోసం ఎగుమతులపై అంతగా ఆధారపడి లేదు. కాబట్టి అమెరికా టారిఫ్‌ల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుంది’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. జ్యుయలరీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్, కెమికల్స్‌పై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్నారు. అయితే, భారత్ నుంచి వచ్చే ఫార్మాస్యూటికల్స్‌పై అమెరికా అధిక సుంకాలు విధించకపోవచ్చని, అలా చేయడం అమెరికాలో ఆరోగ్య వ్యయాలను పెంచుతుందన్నారు. అదే సమయంలో టెక్స్టైల్స్, కెమికల్స్ అధిక టారిఫ్‌ల రిస్క్ ఎదుర్కోవాల్సిరావచ్చన్నారు. ట్రంప్ మొదటి విడత పాలనను గుర్తు చేసుకుని చూస్తే మొత్తం మీద భారత్‌పై పడే ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని ఫువా విశ్లేషించారు.ప్రభావం ఏ మేరకు..?ట్రంప్ టారిఫ్‌లతో భారత జీడీపీపై 0.1–0.6 శాతం మేర ప్రభావం పడొచ్చని గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపైనా సగటు వ్యత్యాసం మేర టారిఫ్‌లు మోపితే, అలాంటి పరిస్థితుల్లో భారత్ చేసే ఎగుమతులపై అమెరికా నికర టారిఫ్ రేట్లు 6.5 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అలా కాకుండా, విడిగా ప్రతీ ఉత్పత్తిపై రెండు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసం మేర అదనంగా టారిఫ్ పెంచేస్తే అప్పుడు భారత ఎగుమతులపై పెరిగే సుంకాల భారం 6.5–11.5 శాతం మధ్య ఉంటుందని వివరించింది.2024–25లో వృద్ధి 6.3 శాతమే: ఎస్బీఐ రీసెర్చ్దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024–25) 6.2–6.3 శాతమే వృద్ధి చెందొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జాతీయ శాంపిల్ కార్యాలయం (ఎన్ఎస్వో) జూన్, సెపె్టంబర్ త్రైమాసికాల అంచనాలను పెద్దగా సవరించకపోవచ్చని పేర్కొంది. 6.4 శాతం వృద్ధి నమోదు కావొచ్చని ఎన్ఎస్వో లోగడ అంచనా వేయడం గమనార్హం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండడం స్థిరత్వాన్ని తీసుకొస్తుందని, ఇతర రంగాల్లో వృద్ధికి ఊతంగా నిలుస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం తగ్గడం విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతుందని, అది వినియోగ ఆధారిత వృద్ధికి దారితీస్తుందని అంచనా వేసింది. భారత్ 2024–25, 2025–2026 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్నది ఐఎంఎఫ్ అంచనాగా ఉంది. మరోవైప ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సైతం వచ్చే రెండేళ్ల పాటు భారత్ జీడీపీ 6.7–6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తాజాగా వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు తక్కువే అయినప్పటికీ, అదే ఆదాయ స్థాయి కలిగిన దేశాల కంటే ఎగువనే ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ ఈఫార్న్ ఫువా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ఆదాయ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందన్నారు. ఇదీ చదవండి: ‘గ్రోక్ 3’ను ఆవిష్కరించిన మస్క్ఫార్మాపై టారిఫ్‌లతో అమెరికన్లపైనే ప్రభావం..-ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను భారత ఫార్మా ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు విధించేలా అమెరికా నిర్ణయం తీసుకుంటే, అమెరికన్ వినియోగదారులపైనే ప్రధానంగా ప్రభావం పడుతుందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రాజా భాను వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి దేశీయ పరిశ్రమ వేచి, చూసే ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు. అమెరికాకు భారత్ ఏటా 8 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు చేస్తోందని చెప్పారు. అమెరికన్ అధ్యయన నివేదికలను ఉటంకిస్తూ.. భారత ఔషధ ఎగుమతులతో అమెరికాలోని హెల్త్‌కేర్ వ్యవస్థకు 2013–2022 మధ్య 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయినట్లు భాను తెలిపారు. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 బిలియన్ డాలర్లు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో (మన ఔషధాలతో వాళ్లకు ఇంత ఆదా అవుతున్నప్పుడు) మనపై టారిఫ్‌లు విధిస్తామంటే ఏమనగలం‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్ నుంచి ఫార్మా దిగుమతులపై అమెరికాలో ఎటువంటి సుంకాలు లేవు. ఈ ఆరి్థక సంవత్సరం మొత్తం ఫార్మా ఎగుమతులు 29 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు భాను తెలిపారు. -
కరెంటు చార్జీలు పెరగవు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం 2025–26లో సైతం విద్యుత్ చార్జీలు పెరగవు. ప్రస్తుత చార్జీలనే యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని కోరాయి. ఈ మేరకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ ప్రతిపాదనలు 2025–26ను మంగళవారం ఈఆర్సీకి సమర్పించాయి. డిస్కంల అంచనాల ప్రకారం 2025–26లో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల ఖర్చులు కలిపి మొత్తం రూ.65,849 కోట్ల వ్యయం కానుంది. అందులో విద్యుత్ కొనుగోళ్లకే రూ.50,572 కోట్ల వ్యయం కానుండగా, నిర్వహణ, పర్యవేక్షణ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు కలిపి మిగిలిన వ్యయం కానుంది. అయితే, ప్రస్తుత చార్జీలతో రూ.45,698 కోట్ల ఆదాయం మాత్రమే రానుంది. దీంతో విద్యుత్ చార్జీలు పెంచకపోతే రూ.20,151 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. అయితే, డిస్కంలు సమర్పించిన అంచనా ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన తర్వాత హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ సైతం జరపనుంది. అనంతరం వాస్తవికతకు దగ్గరగా ఉండేలా డిస్కంల అంచనాలను సవరిస్తూ ఆమోదించనుంది. ఒకవేళడిస్కంల ఆదాయ లోటు రూ.20,151 కోట్లు వాస్తవమేనని ఈఆర్సీ ఆమోదిస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలను పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వంపై సబ్సిడీల భారం పడకుండా గతంలో ఈఆర్సీ.. డిస్కంల ఆదాయ లోటును తగ్గించి చూపించినట్టు విమర్శలున్నాయి. ఏటేటా నష్టాలు ప్రభుత్వం ఏ మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరిస్తే ఆ మేరకు మాత్రమే ఆదాయ లోటు ఉందని ఈఆర్సీ నిర్ధారించడంతో డిస్కంల నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. 2023–24లో రూ.6,299.29 కోట్ల కొత్త నష్టాలను మూటగట్టుకోగా, మొత్తం నష్టాలు రూ.57,448 కోట్లకు ఎగబాకాయి. ఒక్క టీజీఎస్పీడీసీఎల్ నష్టాలే రూ.39,692 కోట్లకు చేరగా, టీజీఎన్పీడీసీఎల్ రూ.17,756 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం డిస్కంలకు రూ.11,499 కోట్ల సబ్సిడీలను చెల్లించేందుకు అంగీకరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడానికి సబ్సిడీలను మరింతగా పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, విద్యుత్ టారిఫ్‌ను యథాతథంగా కొనసాగించినా, హెచ్‌టీ కేటగిరీ వినియోగదారులకు గ్రిడ్ సపోర్ట్ చార్జీలతోపాటు స్టాండ్ బై చార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలను మాత్రం సవరించాలని డిస్కంలు ఈఆర్సీని కోరినట్టు తెలిసింది. -
ట్రంప్ టారిఫ్ దెబ్బ.. దిగొచ్చిన కొలంబియా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంత పవర్ఫుల్ అనేది మరోసారి స్పష్టమైంది. ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు మరో దేశం దిగివచ్చింది. తమ దేశానికి చెందిన వలసదారులను మిలిటరీ విమానాల్లో తీసుకురావడాన్ని అనుమతించమని ప్రకటించిన కొద్ది గంటల్లోనే కొలంబియా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ట్రంప్ ఆంక్షల భయంతో అమెరికా మిలిటరీ విమానాలను అనుమతిస్తామని కొలంబియా తెలిపింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ తాజాగా ఒక అధికార ప్రకటనలో వెల్లడించింది. ‘అక్రమ వలసదారుల విమానాలను మిలిటరీ విమానాలతో సహా అనుమతించడానికి కొలంబియా ఒప్పుకుంది. ఈ పరిణామాల ద్వారా ప్రపంచానికి అమెరికాను గౌరవించాలని స్పష్టమైంది.అమెరికా సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అక్రమ వలసదారులను సాగనంపడాన్ని అన్ని దేశాలు ఒప్పుకుంటాయని ఆయన ఆశిస్తున్నారు’అని వైట్‌హౌజ్ తన ప్రకటనలో తెలిపింది. కాగా, తమ దేశానికి చెందిన వలసదారులను మిలిటరీ విమానాల్లో పంపడాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తొలుత వ్యతిరేకించారు. విమానాలను వెనక్కి పంపారు. అయితే ట్రంప్ ఆంక్షల భయంతో ఆయన కొద్ది గంటల్లోనే వెనక్కు తగ్గి డిపోర్టేషన్ విమానాలను అంగీకరించారు. తమ దేశానికి చెందిన వలసదారులను పంపడం కోసం తన ప్రెసిడెన్షియల్ విమానాన్ని కూడా వాడుకునేందుకు ఒప్పుకున్నారు.ఇదీ చదవండి: కొలంబియాపై ట్రంప్ కొరడా -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
ఎప్పుడో వాడిన కరెంటుకు ఇప్పుడు చార్జీలా?
సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్): ‘ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువుకు ఒక ధర నిర్ణయించి విక్రయిస్తారు. దాని తయారీకి అయిన విద్యుత్ ఖర్చు సహా అన్ని ఖర్చులూ అందులో ఉంటాయి. వినియోగదారుడు ఆ రేటు చెల్లించి వస్తువు కొంటాడు. కొన్ని నెలల తర్వాత ఆ వస్తువు తయారు చేస్తున్న రోజుల్లో వాడిన విద్యుత్తుకు అదనపు చార్జీ చెల్లించాలంటున్నారు. అదెలా సాధ్యం? ప్రభుత్వం అడిగినట్లు మేం కూడా వస్తువు కొన్న వాళ్ల దగ్గరకు వెళ్లి అప్పుడు మీరు కొన్న టీవీకి అదనపు డబ్బులు ఇమ్మని అడిగితే ఇస్తారా? అర్ధం లేని చార్జీలతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. సర్దుబాటు చార్జీలను వెంటనే రద్దు చేయాలి’ అని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కర్నూలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో పారిశ్రామికవేత్తలు కరాఖండిగా చెప్పారు. ప్రజలు కూడా విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంధన సర్దుబాటు చార్జీలకు అంతమనేదే లేదా? అంటూ అనంతపురానికి చెందిన చంద్రశేఖర్ సహా పలువురు నిలదీశారు. పెంచిన చార్జీలు ప్రజలు కాదు.. ప్రభుత్వమే భరించాలని అందరూ స్పష్టం చేశారు. మూడు రోజుల్లో 94 అభ్యంతరాలు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రూ.15,485 కోట్లకు సమర్పించిన 2025–26 ఆరి్థక సంవత్సరం ఆదాయ అవసరాల నివేదికలపై ఏపీఈఆర్సీ ఏపీఈఆర్సీ ఇన్చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్, సభ్యుడు పీవీఆర్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో, శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయంలో బహిరంగ విచారణ జరిపారు. మధ్యాహ్నం వరకూ అభ్యంతరాలను వినిపించడానికి ఎంచుకున్నవారికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆన్లైన్లో లేదా సమీపంలోని డిస్కం సర్కిల్, డివిజన్ కార్యాలయాల నుంచి మాట్లాడేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. ఈ మూడు రోజుల్లో వివిధ వర్గాలకు చెందిన 94 మంది వారి అభ్యంతరాలను మండలి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల అభ్యంతరాలపై డిస్కంల సీఎండీలు వివరణ ఇచ్చారు. ఏపీఈఆర్సీ, ఇంధనశాఖ విరుద్ధ ప్రకటనలు టారిఫ్ పెంపుదలపై డిస్కంలు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని, అయితే వారు చూపించిన రెవెన్యూలోటు రూ. 14,683 కోట్లను ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ తెలిపారు. అయితే ఇంధనశాఖ మాత్రం రెవెన్యూ లోటు తాము భరిస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రాయితీలకు కట్టుబడి ఉన్నామని, తద్వారా డిస్కంల రెవెన్యూ లోటు తగ్గించేందుకు మాత్రమే సాయపడతామని చెప్పినట్లు ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శి బీఏవీపీ కుమారరెడ్డి వెల్లడించారు. ప్రజల అభ్యంతరాలు, డిస్కంల వివరణను పరిశీలించి ఏప్రిల్ 1 నుంచి టారిఫ్ ఆర్డర్‌ను ఖరారు చేస్తామని చైర్మన్ చెప్పారు.»పారిశ్రామిక విద్యుత్ (హెచ్‌టీ) వినియోగదారులు ఏటా ఆర్థిక సంవత్సరం చివర్లో ఆడిట్ నివేదికలు సమర్పిస్తాయి. ఏడాది ముగిసిన తరువాత పాత వినియోగంపై అదనంగా బిల్లులు వేస్తే చెల్లించడం ఎలా సాధ్యం? – అమర్‌రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ప్రతినిధి కుమార్ రాజా » ట్రూ అప్ చార్జీలు న్యాయ సూత్రాలకు విరుద్ధం. అదనపు చార్జీలు వేయడంపై ఉన్న శ్రద్ధ నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడంలో కనిపించడంలేదు. విద్యుత్ లైన్లు తెగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పాతపడ్డ లైన్లను మార్చడంలేదు. – కడప జిల్లా కమలాపురానికి చెందిన అశోక్‌కుమార్‌రెడ్డి » ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులోనే ఉండాలి. పీక్ లోడ్ అవర్స్ కింద రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అది కాకుండా అదనంగా 4 రకాల చార్జీలు వేస్తున్నారు. ఏది ఎందుకో తెలియడంలేదు. – కర్నూలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామచంద్రారెడ్డివామపక్షాల ఆందోళనమరోవైపు కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో విద్యుత్ టారిఫ్‌లపై బహిరంగ విచారణ సమయంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీఎం చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచబోమని చెప్పి ఒకేసారి రూ.15 వేల కోట్ల భారం మోపుతున్నారని వామపక్షాలు మండిపడ్డాయి. ప్రజలపై అదనపు విద్యుత్ భారాలు వేయొద్దని, ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టవద్దని డిమాండ్ చేశాయి. సీపీఎం నాయకుడు, ఎండీ ఆనందబాబు, సీపీఐ నాయకుడు పి.రామకృష్ణారెడ్డి, సీపీఐ (ఎంఎల్) నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
మళ్లీ మొబైల్ టారిఫ్‌లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్‌ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్‌లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్‌లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్‌ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్‌లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్‌ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో పట్టణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్స్‌ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్‌లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్‌లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్‌లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్‌పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో సబ్‌స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్‌లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్‌లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
ఆ నిర్ణయంతో అమెరికాకే నష్టం.. ట్రంప్ భయం అదే!
అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్, ‘తాను 2025 జనవరి 20న అధికారం చేపట్టిన వెంటనే అమెరికాతో వాణిజ్యం చేస్తున్న మూడు అగ్రభాగ దేశాలైన చైనా, కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలను విధిస్తానని’ చెప్పారు. చైనాపై ఇప్పటి వరకూ ఉన్న 60 శాతం సుంకాలతో పాటుగా అదనంగా 10 శాతం, కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలను విధిస్తానని ప్రకటించారు. అమెరికా సరిహద్దు వెంబడి అక్రమ మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయనీ, అనధికార వలసదారుల ప్రవేశానికి ప్రతిస్పందనగా తాజా చర్యలు తీసుకోబోతున్నాననీ నవంబరు 26 నాడు ప్రకటించారాయన. తాజాగా నవంబరు 30న ఏకంగా బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలను విధిస్తానని ప్రపంచం విస్తుపోయేలా ప్రకటించారు. ‘బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ దేశాలు) డాలరుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, ప్రత్యామ్నాయ కరెన్సీకి కృషి చేస్తే... బ్రిక్స్ దేశాలు అద్భుతమైన, శక్తిమంతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు వీడ్కోలు చెప్పాలి. డాలరును వ్యతిరేకించననే నిబద్ధత ఈ దేశాల నుంచి మా కవసరం’ అని ట్రంప్ సోషల్ మీడియాలో రాశారు.2023లో ప్రపంచ దేశాలతో మొత్తం 773 బిలియన్ల (77,300 కోట్ల డాలర్లు) వాణిజ్య లోటుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ జబ్బుపడి ఉంది. కేవలం బ్రిక్స్ దేశాలతోనే 43,350 కోట్ల డాలర్ల వాణిజ్య లోటును అమెరికా కల్గి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చైనాతో 279 బిలియన్లు (27,900 కోట్ల డాలర్లు), మెక్సికోతో 15,200 కోట్ల డాలర్లు, చిన్న దేశమైన వియత్నాంతో 10,400 కోట్ల డాలర్ల వాణిజ్యలోటును కలిగి తన కృత్రిమ డాలరు మారకపు విలువతో పబ్బం గడుపుకుంటోంది. బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే... ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరప్‌కు మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనుకబడి ఉంది. స్వదేశీ డిమాండును ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగవచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. డాలరు ఏకఛత్రాధిపత్యం కోసం అమెరికా తీసుకొంటున్న చర్యలకు ప్రత్యామ్యాయంగా ఇప్పటికే 3 దశాబ్దాల నుండి యూరో కరెన్సీని ఐరోపా యూనియన్ ప్రవేశపెట్టింది. చైనా, రష్యాలు పరస్పరం తమ కరెన్సీలతోనే వాణిజ్యం చేసుకొంటున్నాయి.2వ ప్రపంచ యుద్ధంలో నష్టపోని అమెరికా ఆయుధ అమ్మకాలతో విపరీతమైన బంగారు నిల్వలను పోగు చేసుకొంది. 1944 జులై నుంచి ‘బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్’ అనే అంతర్జాతీయ ద్రవ్యసంస్థను ఏర్పాటు చేసుకుంది. దాని ద్వారా 44 దేశాల మద్దతుతో డాలరును అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా ఏర్పాటు చేసుకొని 1971 వరకూ బంగారం ఆధారిత డాలరుగా కొనసాగించింది. వాస్తవానికి తన వద్దనున్న బంగారు నిల్వలకు పొంతన లేకుండా డాలరు నోట్లను ముద్రించుకొంటూ ఆధిపత్యం చలాయించింది. ప్రస్తుతం అమెరికా వద్ద 8,133.46 టన్నుల బంగారు నిల్వలున్నాయి. ఈ నిల్వలను అమ్మితే వచ్చే 69,100కోట్ల డాలర్లతో అమెరికా సుమారు 36 లక్షలకోట్ల రుణాలను ఎలా తీరుస్తుంది?1971 మేలో జర్మనీ డాలరుతో తెగతెంపులు చేసుకొని బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ నుంచి బయటపడిన 3 నెలల్లోనే అనూహ్యమైన ఆర్థిక పురోభివృద్ధి సాధించింది. డాలరుతో పోల్చుకొంటే జర్మన్ మార్కు 7.5 శాతం వృద్ధి రేటు సాధించింది. వెనువెంటనే ప్రపంచ దేశాలన్నీ డాలరు విలువను బంగారం విలువతో సరిపెట్టమని డిమాండు చేశాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు జర్మన్ బాటలో పయినించటంతో తీవ్ర ఒత్తిడికి లోనైన అమెరికా బ్రెట్టిన్ ఉడ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని కోల్పోయింది. 1971లో (ప్రెసిడెంట్ నిక్సన్ షాక్‌గా పిలవబడే) బంగారు నిల్వతో డాలరు విలువను రద్దు చేసుకొని నేటి ‘డాలర్ ఫియట్ ఫ్లోటింగ్’ విధానాన్ని ప్రవేశపెట్టింది.ప్రస్తుతం ట్రంప్ విధిస్తానన్న వాణిజ్య ఆంక్షలతో బ్రిక్స్ కరెన్సీ ఏర్పడి... రానున్న కాలంలో డాలర్, యూరోలతో పోటీపడినా ఆశ్చర్యపోనవసరంలేదు. అదీగాక రష్యా, చైనా, భారత్ దేశాలు వాణిజ్యపరంగా ఐక్యమైతే ప్రపంచ దిశనే మార్చే అవకాశం ఉంది. ఒకప్పటి ప్రపంచాన్ని తమ కరెన్సీలతో ఆధిపత్యం చలాయించిన దేశాలన్నీ ఇప్పుడు అత్యంత బలహీనమైన ఆర్థికదేశాలుగా మిగిలాయి. అమెరికా కూడా ఈ తరహా దేశంగా మిగులుతుందని ట్రంప్ భయం. పరిస్థితులును పసిగట్టిన ట్రంప్ వాణిజ్య సుంకాలతో ఈ కృత్రిమ డాలరు విలువను నిలబెట్టాలని అనుకుంటున్నారు.- బుడ్డిగ జమిందార్కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
డిస్కంలను గాడిన పెట్టేందుకే జరిమానాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సకాలంలో వార్షిక ఆదాయ అవ సరాల నివేదిక (ఏఆర్ఆర్), టారిఫ్ పిటిషన్లు దాఖలు చేయడం లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు విమర్శించారు. డిస్కంలను దారిలో పెట్టడానికే జరిమానాల విధానం అమ ల్లోకి తెచ్చామని చెప్పారు. శనివారం హైదరా బాద్‌లో జరిగిన ఈఆర్సీ సలహా మండలి సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఇంధన రంగం పాత్ర కీలకమన్నారు. కేవలం టారిఫ్‌ను నిర్ణయించడమే ఈఆర్సీ బాధ్యత కాదని... వినియోగ దారులందరికీ సరసమైన ధరలో విద్యుత్‌ను అందించడం, నాణ్యమైన విద్యుత్ అందేలా చూడటం కూడా తమ బాధ్యతని పేర్కొన్నా రు. డిస్కంల పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తున్నా మన్నారు. విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన అన్ని పిటిషన్లపై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయడానికి ఈనెల 11 దాకా గడువిచ్చా మని, పిటిషన్లపై అధ్యయనం చేసి అభిప్రా యాలు తెలియజేయాలని కోరారు. ఏఆర్ఆర్ తోపాటు పిటిషన్లపై ఈ నెల 21–25 దాకా బహిరంగ విచారణలు నిర్వహిస్తామన్నారు.టారిఫ్ అమలును వాయిదా వేయాలి: పరిశ్రమల ప్రతినిధులుడిస్కంలు ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను ఆలస్యంగా దాఖలు చేసినందున కొత్త టారిఫ్ అమలుకు ఐదు నెలలే గడువు ఉందని... వాటిని విచారణకు స్వీకరించరాదని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కోరారు. ఏఆర్ఆర్పై అభ్యంతరాలు తెలపడానికి గడువు పెంచాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సూచించగా స్థిర చార్జీలు పెంచాలనే నిర్ణయాన్ని అమలు చేయరాదని పరిశ్రమల ప్రతినిధులు కోరారు. -
డిస్కంలు చెప్పాయి.. ఈఆర్సీ నిర్ణయించింది
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలానికి టారిఫ్ నిర్ణయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోని పరిశ్రమలకు ఊరట లభించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పిన దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆ టారిఫ్ని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే(చెరకు పిప్పి) విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఖర్చుల ఆధారంగా ఏపీఈఆర్సీ ధరలను సమీక్షించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు 26 ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.965 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బయోమాస్ బేస్డ్ పరిశ్రమల నుంచి 171.25 మెగావాట్లు, బగాస్సే పరిశ్రమల నుంచి 206.95 మెగావాట్లు చొప్పున విద్యుత్ వస్తోంది. వీటికి గతంతో 2019–20 నుంచి 2023–24 వరకు నిర్ణయించిన టారిఫ్ ప్రస్తుతం అమలులో ఉంది. టారిఫ్‌ను నిర్ణయించినప్పుడే వార్షిక ఇంధన ధర 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తారు. ఈ లెక్కన 2023–24కి ఇంధన ధరలు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల యూనిట్‌కు రూ. 5.80, బగాస్సేకి యూనిట్ రూ. 3.82 చొప్పున అమలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన ధరలను ఆమోదించాలని లేదా 2023–24కి ఆమోదించిన అదే ధరలను కొనసాగించాలని డిస్కంలు మండలిని కోరాయి. పరిశ్రమల నిర్వాహకులు ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వెల్లడించాలనుకుంటే దానికి కూడా కమిషన్ అవకాశం కల్పించింది. కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, దానికి తోడు డీజిల్ ధరలు భారీగా పెరిగినందున ఖర్చులు విపరీతంగా ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు ఏపీఈఆర్సీకి మొరపెట్టుకున్నారు. తాము కోలుకోవాలంటే యూనిట్ విద్యుత్‌ను కనీసం రూ. 8 నుంచి రూ. 15కు విక్రయించేలా అనుమతించాలని కోరారు. కానీ దానికి డిస్కంలు అంగీకరించలేదు. దీంతో దాదాపుగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలకే 2024–29 నియంత్రణ కాలానికి ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. -
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
జో బైడెన్ కీలక నిర్ణయం.. చైనా ఉత్పత్తులపై కఠిన ఆంక్షలు
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనీస్ ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపైన విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మరో మూడు సంవత్సరాలు అమలులో ఉంటాయి. అమెరికాలో చవకైన ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.స్వదేశీ వస్తువుల వినియోగం పెరగటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కొత్త ఆవిష్కరణ ఉత్పత్తి చాలా అవసరం. కాబట్టి అమెరికాలోనే కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని చెబుతున్నారు.2025 నాటికి, సెమీకండక్టర్లపై ట్యాక్ రేటు కూడా 25 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది, నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదలను చూస్తుంది. బ్యాటరీ విడి భాగాల మీద ట్యాక్స్ కూడా 25 శాతానికి పెరుగుతుంది. మొత్తం మీద అమెరికా చైనా వస్తువుల మీద భారీ సుంకాలను విధిస్తూ కీలక ప్రకటనలు చేసింది. -
మొబైల్ యూజర్స్‌కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది. వినియోగదారులపై ప్రభావం25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.టారిఫ్ ధరలు పెరిగితేటారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది. కంపెనీలకు లాభమేమార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్‌టెల్‌కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. -
‘కరెంట్’ వడ్డన ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇచ్చిన గడువు జనవరి 2తో ముగియనుంది. విద్యుత్ టారిఫ్ రెగ్యులేషన్స్ ప్రకారం.. ఏటా నవంబర్ 30లోగా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు, వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) అంచనాలను డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాలి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడువు పెంచాలని డిస్కంలు విజ్ఞప్తి చేయగా.. ఈఆర్సీ జనవరి 2 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు టారిఫ్ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించేందుకు కొత్త ప్రభుత్వం నుంచి డిస్కంలు ఇంకా అనుమతి పొందలేదు. దీంతో జనవరి 30వరకు మరోసారి గడువు పొడిగించాలని ఈఆర్సీని కోరేందుకు డిస్కంల యాజమాన్యాలు సిద్ధమైనట్టు తెలిసింది. టారిఫ్ ప్రతిపాదనల్లో ఏం ఉంటాయంటే..? 2024–25లో రాష్ట్రంలో మొత్తం ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది? అందుకు ఎన్ని రూ.వేల కోట్ల ఆదాయం అవసరం? ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2024–25లో కొనసాగిస్తే ఎంత ఆదాయ లోటు ఏర్పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న సబ్సిడీ నిధులు ఎంత, ఇంకా ఎంత లోటు ఉంటుంది? ఆ లోటును పూడ్చుకోవడానికి 2024–25లో ఏయే కేటగిరీల వినియోగదారుల చార్జీలను ఎంతమేర పెంచాలన్న అంశాలు డిస్కంల ఏఆర్ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి. ఈ ప్రతిపాదనలపై ఈఆర్సీ రాతపూర్వకంగా అభ్యంతరాలను సేకరించి, బహిరంగ విచారణ నిర్వహించి.. కొత్త టారిఫ్ ఆర్డర్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. రూ.30వేల కోట్లకు చేరిన ఆర్థిక లోటు 2022–23 నాటికి రాష్ట్రంలో డిస్కంల నష్టాలు రూ.62,461 కోట్లకు పెరిగాయి. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సగటున ప్రతి నెలా రూ. 1,386 కోట్లు లెక్కన మరో రూ.11,088 కోట్ల నష్టాలు వచ్చినట్టు ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో డిస్కంల నష్టాలు రూ. 73,549 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.11,500 కోట్ల విద్యుత్ సబ్సిడీనే కొనసాగిస్తే.. 2024–25లో డిస్కంలకు కొత్తగా మరో రూ.16,632 కోట్ల నష్టాలు వస్తాయని అంచనా. నష్టాలను అధిగమించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.31,632 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉండనుంది. లేకుంటే లోటును భర్తీ చేసుకోవడానికి విద్యుత్ చార్జీలు పెంచాల్సి వస్తుంది. కొత్త సర్కారు ముందు సవాళ్లు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యుత్ సంస్థల నిర్వహణ సవాలుగా మారింది. విద్యుత్ సబ్సిడీలను ఏటా రూ.30వేల కోట్లకు పెంచడం లేదా ఏ ఏడాదికా ఏడాది లోటు భర్తీ చేసుకోవడానికి చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితి. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడిన ఏడాదే విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతిస్తే విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన ఉంది. దీంతో టారిఫ్ ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఉచితంగా 200 యూనిట్లపైప్రతిపాదనలు సిద్ధం కాంగ్రెస్ సర్కారు హామీ మేరకు ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసే అంశాన్ని 2024–25 టారిఫ్ ప్రతిపాదనల్లో చేర్చడంపై డిస్కంలు కసరత్తు పూర్తిచేశాయి. 200యూనిట్లలోపు వినియోగించే వినియోగదారులు ఎందరు? వారికి ఉచిత విద్యుత్ కో సం అయ్యే వ్యయం ఎంత? అన్న గణాంకాలతో ప్రతి పాదనలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే.. ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు ఈఆర్సీ అనుమతిని కోరనున్నాయి. ఈ పథకాన్ని అమలు చేస్తే.. ప్రభుత్వం అదనంగా రూ.3,500 కోట్ల సబ్సిడీని డిస్కంలకు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు చెప్తున్నారు. -
విద్యుత్ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వినియోగదారులపై ఈసారి ఎలాంటి విద్యుత్ భారం పడలేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఛార్జీలు మినహా ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీఈఆర్సీ నిర్ణయించిన ఆదాయ అంతరం మొత్తంలో రూ.10,135 కోట్లను సబ్సిడీ రూపంలో డిస్కంలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది చాలా సంతోషకరమన్నారు. నగరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకుర్ రామ్‌సింగ్, ఎ.రాజగోపాల్‌రెడ్డిలతో కలిసి విద్యుత్ టారిఫ్ చార్జీలను నాగార్జునరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్ క్రమబద్ధీకరణకు సబ్సిడీ.. ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగింపుతో పాటు ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు, ఆక్వా రైతుల వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులకు టారిఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.52,590.70 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాలను ఏపీఈఆర్‌సీకీ సమర్పించాయని.. అందులో రూ.49,267.36 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు. విద్యుత్ అమ్మకాలు, కొనుగోలు అవసరాలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు విద్యుత్ పంపిణీ సంస్థల అంచనాల కంటే తక్కువగా వుండడంతో ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత పరిశ్రమ, పిండిమిల్లులకు ఊరట ఇక పవర్లూమ్ వినియోగదారులకు కేవీఏహెచ్ (కిలోవోల్ట్ యాంపియర్ అవర్స్) బిల్లింగ్ మినహాయింపు ఇచ్చినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్ వినియోగదారుల అభ్యర్థనల మేరకు 10 హెచ్‌పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్‌ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, గతేడాదిలో ఒక్కసారే వున్న ఆఫ్–సీజన్ ఎంపికను ఈ ఏడాదికి రెండుసార్లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్‌లో హెచ్‌టీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ డిమాండ్ చార్జీలను వసూలుచేయడం లేదన్నారు. ఈ ఏడాదిలో రూ.475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. సోలార్ రైతులకు సమస్యలొస్తే.. ఉచిత విద్యుత్ సోలార్ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్ విద్యుత్ వినియోగంలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేయాలని ఆదేశించినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. అంతేకాక.. సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్ఈడీ, ట్యూబ్‌లైట్లు, బీఎల్డీసీ (బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్) సీలింగ్ ఫ్యాన్లు, సూపర్ ఎఫీషియెంట్ ఎయిర్ కండిషనర్లు వంటి ఇంధన ఉపకరణాల విక్రయాల పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌లో అలసత్వం వహిస్తే చర్యలు రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తే డిస్కమ్ అధికారులపై చర్యలు తప్పవని నాగార్జునరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల సంతృప్తిని సమీక్షించేందుకు జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపీఈఆరీ్సకి సమర్పించాలని ఆదేశించామన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని.. అది చట్టపరిధిలోని అంశమని ఆయన స్పష్టంచేశారు. -
‘ట్రూఅప్’పై తేలేది నేడే..!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారుల నుంచి మొత్తం రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 2016–17 నుంచి 2022–23 మధ్య కాలానికి సంబంధించి రూ.12,015 కోట్ల విద్యుత్ కొనుగోలు ట్రూఅప్ చార్జీలతో పాటు 2006–07 నుంచి 2020–21 మధ్యకాలానికి సంబంధించి రూ.4,092 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీల వసూళ్లు ఆ ప్రతిపాదనల్లో ఉన్నాయి. విద్యుత్ చట్టం 2003, విద్యుత్ టారిఫ్ నిబంధనల ప్రకారం.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ 1 తేదీ నుంచి కొత్త టారిఫ్ ఉత్తర్వులను అమలు చేయాల్సి ఉంది. దీనికి కనీసం వారం రోజుల ముందు టారిఫ్ ఉత్తర్వులను ఈఆర్సీ ప్రకటించాలి. ఈ నేపథ్యంలో గురువారం 2023–24కి సంబంధించిన వార్షిక టారిఫ్ ఉత్తర్వులతో పాటు ట్రూఅప్ చార్జీలపై ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనుందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ట్రూఅప్ చార్జీలపైనే ఉత్కంఠ ప్రస్తుత విద్యుత్ టారిఫ్ 2023–24లోనూ యధాతథంగా కొనసాగించాలని వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్ఆర్) నివేదికలో డిస్కంలు ప్రతిపాదించిన నేపథ్యంలో విద్యుత్ టారిఫ్‌లో మార్పులు ఉండే అవకాశాలు లేవు. అయితే రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో రూ.5,986 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినియోగదారులపై పడే భారాన్ని దృష్టిలో పెట్టుకుని రూ.16,107 కోట్ల ట్రూఅప్ చార్జీల్లో ఎంత మేరకు వినియోగదారుల నుంచి వసూలు చేయాలి? ఎంత కాల వ్యవధిలో వసూలు చేయాలి? అన్న అంశాలపై ఈఆర్సీ నిర్ణయాన్ని ప్రకటించనుంది. పారిశ్రామిక, వినియోగదారుల సంఘాల వ్యతిరేకత ఏఆర్‌ఆర్‌తో పాటు ట్రూఅప్ చార్జీల ప్రతిపాదనలపై గత నెలలో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి అన్ని వర్గాల వినియోగదారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. డిస్కంలు 2019–20, 2020–21, 2021–22 సంవత్సరాలకు సంబంధించిన ఏఆర్ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించలేదని, నిబంధనల మేరకు ఈ సంవత్సరాలకు సంబంధించిన ట్రూఅప్ చార్జీల వసూళ్లకు అనుమతి ఉండదని బహిరంగ విచారణలో విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామిక సంఘాలు వాదనలు వినిపించాయి. ట్రూఅప్ చార్జీలు అంటే..? ఒక ఆర్థిక సంవత్సరంలో అయ్యే విద్యుత్ పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) వ్యయం, విద్యుత్ కొనుగోలు వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదిస్తుంది. దీనికి తగినట్టుగా కరెంట్ బిల్లుల వసూళ్లకు అనుమతిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత లెక్క తేల్చిన వాస్తవ వ్యయంలో ఉండే హెచ్చుతగ్గులను ట్రూఅప్/ ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందస్తుగా అనుమతించిన వ్యయం కన్నా అధిక వ్యయం జరిగితే, ఆ మేరకు వ్యత్యాసాన్ని ఆ తర్వాత కాలంలో ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఒక వేళ తక్కువ వ్యయం జరిగితే ఆ తర్వాత కాలంలో విద్యుత్ చార్జీలను తగ్గించి ట్రూడౌన్ చేయాల్సి ఉంటుంది. -
విద్యుత్ పీపీఏల టారిఫ్: ఇక ఇదే రేటు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. యూనిట్ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ.3.43 ఇవ్వాలని విండ్ పవర్ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ ఇవ్వాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్సీ టారిఫ్ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్సీ.. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. పవన విద్యుత్‌కు అనుకూలంగా రాష్ట్రం కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది. రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. -
తమిళనాడులో ఇకపై ఏటా పవర్ షాక్!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ దారులకు ఇకపై ఏటా వడ్డన తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇకపై ప్రతి జూలై నెలలో 6శాతం మేరకు విద్యుత్ చార్జీల పెంపునకు సంబంధించిన ఓ నివేదిక విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు మంగళవారం బోర్డు అందజేశాయి. రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్ వాడకం పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2014లో ఒకసారి విద్యుత్ చార్జీలను పెంచారు. ఆ తర్వాత కొత్తగా ఎలాంటి చార్జీలు విధించలేదు. ఫలితంగా కాల క్రమేనా విద్యుత్ బోర్డుకు కష్టాలు పెరిగాయి. అప్పులు అమాంతంగా పెరిగాయి. అయినా, గత పాలకులు విద్యుత్ చార్జీల పెంపుపై దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఈ అప్పులు మరింత భారంగా మారాయి. దీంతో చార్జీల వడ్డనకు విద్యుత్ బోర్డు కసరత్తు చేస్తోంది. కొత్త చార్జీలను అమల్లోకి తీసుకొచ్చే ముందుగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేవిధంగా గత నెల విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ పెంపు ప్రకటన చేశారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటాలు సైతం సాగుతున్నాయి. దీంతో ప్రజా అభిప్రాయాన్ని సేకరించే పనిలో విద్యుత్ బోర్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ బోర్డు వినియోగదారుల నెత్తి మరోబాంబును పేలి్చంది. పెంపునకు ప్రణాళిక.. ప్రస్తుతం ఉన్న అప్పులు, మున్ముందు ఎదురయ్యే నష్టాలు, కష్టాలను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ బోర్డు ముందస్తు ప్రణాళిక సిద్ధ్దం చేసింది. భారం మరింత బరువెక్కకుండా ఏటా చార్జీల వడ్డనకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇందుకు తగ్గ నివేదికను రూపొందించి, ఆమోదం కోసం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు పంపించింది. తొలివిడతగా.. ఏటా 6 శాతం పెరుగుదలతో నాలుగేళ్లపాటు దీన్ని కొనసాగించాలని అందులో సిఫార్సు చేసింది. చదవండి: శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు -
విద్యుత్ ఛార్జీల పెంపునకు ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు
సాక్షి, తిరుపతి: విద్యుత్ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలు తెలిపింది. ఈ సందర్భంగా తిరుపతిలో విద్యుత్ చార్జీల టారిఫ్‌ను పీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు తెలిపారు ధరలు పెంచడం బాధాకరంగా ఉన్నా తప్పడం లేదని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. 20 ఏళ్ల తరువాత విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి పోవడంతోనే చార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. కాగా ఏపీఈఆర్సీ ప్రతిపాదనల ప్రకారం.. 30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు, 31- 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంపు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు, 400 యూనిట్‌కు 55పైసల పెంపుకు ప్రతిపాదించాయి. -
నిరంతరం సలహాలు, సూచనల స్వీకరణ
సాక్షి, అమరావతి: ఏడాదికి ఒకసారి టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎవరైనా వినియోగదారులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలను ఏడాదిలో ఎప్పుడైనా అందించేలా నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి చెప్పారు. 365 రోజులు విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి, సంస్థల ప్రయోజనాలను పరిరక్షించడానికి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ రంగం మరింతగా అభివృద్ధి చెందే అవకాశముందని పేర్కొన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్), టారిఫ్‌లపై ఆన్లైన్ ద్వారా ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. దీనిపై సమీక్షించేందుకు నిర్వహించిన స్టేట్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
ఎంత వాడితే అంతే బిల్లు : నాగలక్ష్మి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు. ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ 1912కి కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్ బిల్లులు చెల్లించడానికి జూన్ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు. -
భారత్, చైనాలకు ట్రంప్ వార్నింగ్!
వాషింగ్టన్ : అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకొంటూ భారత్, చైనా నేటికీ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) కల్పించే ప్రయోజనాలను పొందుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఇకపై తాను ఇలా జరగబోనివ్వనని హెచ్చరించారు. భారత దిగుమతులపై టారిఫ్‌లు పెంచేయడంతో.. భారత్ కూడా అంతే దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై గత నెల నుంచి టారిఫ్‌లను పెంచింది. అదే విధంగా చైనాతో కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచాయి. ఈ నేపథ్యంలో పెన్సుల్వేనియాలో మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ...ఆసియాలో రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లను ఇకపై అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించకూడదని వ్యాఖ్యానించారు. ఈ సాకు చూపి చాలా ఏళ్లుగా ఈ రెండు దేశాలు వాణిజ్య సంస్థ నుంచి అనేక ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు డబ్ల్యూటీవోలోని లొసుగులు అడ్డుపెట్టుకుంటాయని, ఇకపై అలా చేస్తే యూఎస్ ట్రేడ్ రిప్రంజంటేటివ్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసియా దేశాలతో పాటు టర్కీ కూడా డబ్ల్యూటీవో నిబంధనలను నీరుగార్చి ప్రయోజనాలు పొందుతోందని ఆరోపించారు. ‘ అన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలే. మేము మాత్రం అందుకు మినహాయింపే కదా. ఆ పేరు చెప్పుకొని వారంతా లాభం పొందుతున్నవారే. ఈ విషయంలో డబ్ల్యూటీవో మా వాదనను తప్పుబట్టదనే అనుకుంటున్నా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి పోర్టల్
న్యూఢిల్లీ: టెలికం కంపెనీల టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఇది బీటా వెర్షన్. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు అందించే టారిఫ్‌ల వివరాలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ట్రాయ్ www.tariff.trai.gov.in పేరిట ఈ పోర్టల్‌ను తీసుకువచ్చింది. పలు రకాల టారిఫ్ ప్లాన్స్‌ను, ఇతర టారిఫ్ ఇన్స్ట్రూమెంట్స్ను డౌన్లోడ్ ఫార్మాట్ రూపంలో వెబ్సైట్లో ఉంచుతామని తెలిపింది. తొలి దశలో ఈ సేవలను ఢిల్లీ సర్కిల్లో అందుబాటులో ఉంచామని, యూజర్లు ఈ సర్వీసుపై ఫీడ్‌బ్యాక్ అందించాలని కోరింది. సేవలను తర్వాత దశలవారీగా ఇతర సర్కిళ్లకు విస్తరిస్తామని పేర్కొంది. -
టాటా, అదానీ పవర్లకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: నష్టపరిహార టారిఫ్ కేసులో టాటా పవర్, అదానీ పవర్లకు సుప్రీం షాక్ ఇచ్చింది. అదు రాష్ట్రాల్లో నష్టపరిహారం చెల్లించాలంటూ గత ఏడాది అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సుప్రీం మంగళవారం పక్కన పెట్టింది. విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. టాటా పవర్, అదానీ పవర్ కంపెనీలు ఐదు రాష్ట్రాల్లో వినియోగదారులపై భారం మోపడానికి వీల్లేదని ఆదేశించింది. తద్వారా గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లో విద్యుత్ బిల్లులు పెరగకుండా అడ్డుకుంది. దీంతో టాటా, అదానీ పవర్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అదానీ పవర్ 15 శాతం టాటా పవర్ 5.2 శాతం నష్టపోయాయి. అయితే సుప్రీం తీర్పుపై అదానీ పవర్ స్పందించింది. దేశీయ బొగ్గు సరఫరా కొరత కారణంగా తమకు ఖర్చులు పెరగడంతో గతంలో తమకు ఈ ఊరట లభించినట్టు పేర్కొంది. కాగా 2010లో ఇండోనేషియా చట్టాల ప్రకారం కోల్ ధరలు పెరిగినకారణంగా చార్జీలు పెంచాలని రెండు కంపెనీలు కోరాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ దీనికి సమ్మతించింది. అలాగే గత ఏడాది ఏప్రిల్ లో ఈకేసులో టాటా,అదానీలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉందని అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. దీని ప్రకారం సంస్థలు డిసెంబర్ లో ఎక్కువ చార్జీ వసూలు చేయటానికి అనుమతించింది. అయితే ఈనిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఇండోనేషియానుంచి ముడిబొగ్గును దిగుమతి చేసుకునే రెండు కంపెనీలు ఐదు రాష్ట్రాల్లో 8620 మెగావాట్ల ఉత్పత్తిని చేస్తున్నాయి. -
జియో టారిఫ్‌లు దూకుడుగా ఉన్నాయి: మిట్టల్
బార్సిలోనా: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ దూకుడుగా ఉన్నాయని దేశీ దిగ్గజ మొబైల్ ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. దీనికి స్పందనగా పరిశ్రమ మరిన్ని కాంపిటీటివ్ ప్లాన్స్‌తో, అదనపు డేటాతో జియోని ఎదుర్కొవలసి ఉందని తెలిపింది. ‘జియో ప్రకటించిన టారిఫ్‌లకు ప్రతిగా మేము యూజర్లకు ఎక్కువ ప్యాకేజీలు అందించాలి. అధిక డేటాను అఫర్ చేయాలి’ అని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఆయన ఇక్కడ జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో మాట్లాడారు. జియో తన సర్వీసులకు ఏప్రిల్ 1 నుంచి చార్జీలను వసూలు చేయడం టెల్కోలకు శుభవార్తని తెలిపారు. అయితే ఇంతటితోనే టారిఫ్‌ల యుద్ధం ముగియలేదన్నారు. ‘జియో తన రూ.303 టారిఫ్‌లో యూజర్లకు రోజుకు ఒక జీబీ డేటా ఇవ్వనుంది. ఇది చాలా తక్కువ ధర. ఉచిత సర్వీసులకు కన్నా ఇది నయం’ అని పేర్కొన్నారు. ఎయిర్టెల్ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, మార్కెట్లోని తీవ్రమైన పోటీ కారణంగా తాము నష్టాల్లోకి వెళతామని భావించడం లేదని తెలిపారు. 2018 మార్చి వరకు కంపెనీ ఆదాయంపై జియో ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. -
పసిడి దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: పసిడి, వెండి దిగుమతి టారిఫ్ విలువను తగ్గిస్తూ... ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... 10 గ్రాముల పసిడి దిగుమతి టారిఫ్ విలువ 354 డాలర్ల నుంచి 344 డాలర్లకు తగ్గింది. కేజీ వెండి దిగుమతి టారిఫ్ ధర 470 డాలర్ల నుంచి 461కి తగ్గింది. ఎటువంటి అవకతవకలకూ అవకాశం లేకుండా... మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది. అయితే టారిఫ్ విలువలో అయిదు శాతం మార్పు ఉంటే ఆ మార్పు ప్రభావం స్పాట్ బులియన్ మార్కెట్‌పై ఉంటుంది. -
చందాలకు.. దందాలొద్దు
పెద్దఎత్తున వినాయక చవితి వసూళ్లు దౌర్జన్యం చేస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు నెల్లూరు: వినాయకచవితి ఉత్సవాల పేరిట జిల్లాలో చందాల వసూళ్లు జోరందుకున్నాయి. పండగకు రెండురోజులు మాత్రమే ఉంది. దీంతో ఉత్సవ కమిటీలు బృందాలుగా ఏర్పడి చవితి చందాలను భారీగా వసూలు చేస్తున్నారు. చందాలు అడిగే పద్ధతి అభ్యర్థనగా ఉండటం లేదు. కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చేతిలో ఒక పుస్తకం, రసీదు బుక్ పట్టుకుని ఇంటింటికి వెళుతున్నారు. ఇంకా జీతాలు రాలేదని మళ్లీ రండి అని చెప్పిన వారి పట్ల బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మీ వద్దకు మళ్లీ...మళ్లీ రావాలా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. 20 నుంచి 30 అడుగల ఎత్తు ఉండే విగ్రహాలు పెడుతున్నామని అవి కొనుగోలు చేయాలంటే రూ. 50వేలు అవుతాయని, చందా ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంత ఇవ్వలేమని అంటే దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో వీధికి రెండు, మూడు బృందాలు కూడా వసూళ్లకు వెళుతున్నాయి. అదేమని అడిగితే వీధి చివర వినాయకుడిని ప్రతిష్టించామని ఒక బృందం, వీధి ప్రారంభం వద్ద ప్రతిష్టించనున్నామని మరో బృందం చెబుతోంది. ఒక విగ్రహం ఏర్పాటు చేస్తే చాలదా.. అని ప్రశ్నిస్తే వారితో తమకు విబేధాలున్నాయని కలిసి పనిచేయలేమని చెబుతున్నారు. ఈసారి ఆ గ్రూపుకన్నా పెద్ద విగ్రహం పెట్టి ఘనంగా జరుపుతామని దీంతో భారీగా చందా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది గతంలో మూడురోజులు చేశామని ఈఏడాది ఐదురోజులు చేస్తున్నామని చందా ఎక్కువగా ఇవ్వాలని అడుగుతున్నారు. ఒక్కో ఇంటికి కనీసం రూ.100 నుంచి రూ.1,000 వరకు వసూళ్లు చేస్తున్నారు. దుకాణమైతే వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. వసూలు చేసిన డబ్బులకు లెక్కలుండవు. ఎవరి జేబులు నిండుతున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ప్రతి ఇంటిలో పండుగ చేసుకోవడానికి కనీసం రూ. 500 నుంచి రూ. 1000 ఖర్చవుతుంది. ఘనంగా చేసుకోవాలనుకునే వారు మరింత ఎక్కువ ఖర్చుపెట్టుకుంటున్నారు. ఇచ్చిన వారి దగ్గర చందా తీసుకొంటే మంచిది, ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. -నగరంలోని ఆచారివీధిలో రాజు నివసిస్తున్నాడు. ఆయన కొరడా వీధిలో బంగారు పనిచేసుకొని జీవనం సాగిస్తున్నాడు. కొరడా వీధిలో కొందరు వినాయకచవితి నిర్వహిస్తున్నామని అతని వద్దకు వచ్చారు. చందా ఇవ్వాలని కోరారు. రాజు రూ.100 ఇస్తుండగా రూ. 1000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రాజు వారు అడిగినంత ఇచ్చారు. -మూలాపేటకు చెందిన నాగరాజును వినాయకచవితి చందా ఇవ్వాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. తాను రూ.116 ఇచ్చారు. వారు రూ. 516 ఇవ్వాలని కోరారు. తన వద్ద లేవని చెప్పినప్పటికి వారు వినిపించుకోలేదు. బలవంతం చేస్తే చర్యలు: ఎస్ మగ్బుల్, నగర డీఎస్పీ ప్రజలకు ఇబ్బంది కల్గకుండా వారు ఎంత ఇస్తే అంతే చందా తీసుకోవాలి. అలాకాకుండా బలవంతంగా వసూళ్లు చేస్తే కఠినచర్యలు తప్పవు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఉత్సవ కమిటీలు ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉత్సవాల పేరిట అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. -
కరెంట్ పిడుగు
కొత్త టారిఫ్ ప్రకటించిన ఏపీఈఆర్సీ ఐదు జిల్లాల ప్రజలపై రూ.366.66 కోట్ల భారం ఈపీడీసీఎల్‌కు సమకూరనున్న ఆదాయం డిస్కం ప్రతిపాదనల్లో 1శాతం మాత్రమే తగ్గించిన ఏపీఈఆర్సీ 200 యూనిట్లపైన 5 శాతం పెరిగిన చార్జీ ఏప్రిల్ నుంచి అమలులోకి ... విశాఖపట్నం: అనుకున్నంతా అయ్యింది..ప్రజలపై విద్యుత్ చార్జీల పిడుగు పడింది. 2015-16 ఆర్ధిక సంవత్సరానికి టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యు త్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) సోమవారం ప్రకటించింది. వచ్చే నెల మొదటి తేదీ నుంచి అమలులోకి రానున్న కొత్త చార్జీల వల్ల ఈపీడీసీఎల్‌కు దాదాపు రూ.366.66కోట్ల ఆదాయం ఏడాదికి సమకూరనుంది. ఆ మేరకు ప్రజలపై భారం పడనుంది. జిల్లాలోనే ఏడాదికి ఏపీఈపీడీసీఎల్ ప్రతిపాదించిన 2015-16 ఆర్ధిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల(ఎఆర్ఆర్, రిటైల్ సప్లై టారిఫ్)పై గత నెల 23,24 తేదీల్లో విశాఖలో ఏపీఈఆర్సీ ‘బహిరంగ విచారణ’ నిర్వహించింది. ఈపీడీసీఎల్ అధికారులు 6 శాతం విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాధించారు. సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లో 52.18 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. ఈపీడీసీఎల్‌కు రానున్న ఆర్ధిక సంవత్సరంలో రూ.10,367కోట్ల ఆదాయం అవసరం కాగా అన్ని వనరుల నుంచి రూ.8,021కోట్లు వస్తుందని అంచనా వేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల మరో రూ.440 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉందని, అయినా రూ.1905కోట్ల లోటు ఉంటుందని ఏపీఈఆర్సీకి ఇచ్చిన నివేదికలో తెలిపారు. చివరికి ఒక శాతం తగ్గించి 5 శాతం పెంచుతూ ఏపీఈఆర్సీ టారిఫ్ ప్రకటించింది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, చక్కెర, ఫౌల్టీ పరిశ్రమలకు చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. జిల్లాపై రూ.70 కోట్ల భారం: జిల్లాలో 12 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో 8.27లక్షలమంది గృహ విద్యుత్ వినియోగదారులున్నారు. 0-100 యూనిట్లు వాడే వారు 5.03లక్షల మంది, 101యూనిట్లు ఆపైనవాడే గృహ వినియోగ దారులు 3.24 లక్షల మంది ఉన్నారు. వందయూనిట్ల వినియోగించే వినియోగదారులు నెలకు 2.85కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.5.50కోట్ల ఆదాయం వస్తుంది. 101 యూనిట్లకు మించి 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులు నెలకు 6.4కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. దీని వల్ల రూ.25కోట్ల ఆదాయం వస్తుంది. 200పైన విద్యుత్ వాడే వారి నుంచి మరో రూ.34.5 కోట్ల ఆదాయం వస్తోంది. హెచ్‌టీ సర్వీసులున్న వారి నుంచి రూ.170కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుత టారిఫ్‌లో 200 యూనిట్ల లోపు వినియోగంపై చార్జీలు యధాతధంగా ఉంచారు. ప్రస్తుతం నెలకు విశాఖ సర్కిల్‌కు రూ.235 కోట్ల ఆదాయం వస్తోంది. దీనికి 5 శాతం అదనంగా ఆదాయం సమకూరనుంది. -
భారం తప్పదు !
ఈ ఏడాది భారీగా పెరగనున్న విద్యుత్ చార్జీలు ముగిసిన ‘ఏపీఈఆర్సీ’ బహిరంగ విచారణ {పభుత్వ వైఖరి తీసుకున్న తర్వాత టారిఫ్‌పై నిర్ణయం ‘ఈపీడీసీఎల్’ ప్రతిపాదనలపై సానుకూలత వాపపక్షాల నుంచి మినహా వెల్లడికాని వ్యతిరేకత విశాఖపట్నం : వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ప్రతిపాదించిన చార్జీల పెంపు టారిఫ్‌పై చివరి బహిరంగ విచారణ బుధవారం హైదరాబాద్‌లోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో జరిగింది. విశాఖ, కాకినాడ, హైదరాబాద్ సమావేశాల్లో విద్యుత్ చార్జీలు పెంచవద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం సమకూర్చుకోవాలని కొందరు చెప్పగా, 100 యూనిట్ల పైన చార్జీలు పెంచినా అభ్యంతరం లేదని కొందరు స్పష్టం చేశారు. చార్జీల పెంపుపై కాకుండా సంస్థాగత మార్పులపైనే ఎక్కువ అభిప్రాయాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ ఏడాది చార్జీల పెంపు తప్పనిసరి అని తెలుస్తోంది. ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 52.18 లక్షల మంది వినియోగదారులున్నారు. 65 వినియోగదారుల సేవా కేంద్రాలతో సేవలందిస్తోంది. సంస్థ నిర్వహణకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,367 కోట్లు అవసరం కాగా, సంస్థకు రూ.8,022 కోట్లు ఆదాయం వస్తోంది. ఈ లెక్కన రూ.2,345 కోట్ల లోటు కనిపిస్తోంది. విద్యుత్ చార్జీలు పెంచి రూ.440 కోట్లు సమీకరించుకోవాలని సంస్థ ప్రతిపాధించింది. అలా చూసినా ఇంకా రూ.1905 కోట్ల లోటు ఉంటుందని సంస్థ చెబుతోంది. ఈ ఏడాది విద్యుత్ కోనుగోలుకే రూ.7,564 కోట్లు వెచ్చించాల్సి వస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీలు పెంచక తప్పదని ఈపీడీసీఎల్ గట్టిగా వాదిస్తోంది. 2013-14 ధరలపై 6 శాతం పెంపునకు పట్టుబడుతోంది. పేదల నుంచి రాని వ్యతిరేకత ఈపీడీసీఎల్ సమర్పించిన రిటైల్ సరఫరా వ్యాపారం, సమగ్ర ఆదాయ ఆవశ్యకత నివేదికపై విశాఖ, కాకికాడ లో ఏపీఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణలో వినియోగదారుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. నెలకు 100 యూనిట్ల వరకూ వాడే వినియోగదారులకు పాత చార్జీలే ఉంటాయని ఈపీడీసీఎల్ స్పష్టం చేయడంతో పేద వర్గాల నుంచి ఆందోళన వ్యక్తం కాలేదు. ఏపీఈఆర్సీ చైర్మన్ సైతం భిన్నాభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తేల్చిచెప్పారు. దీనిని బట్టి ఈ ఏడాది ఖచ్చితంగా విద్యుత్ చార్జీలు పెరుగుతాయని స్పష్టమవుతోంది. అయితే దీనిపై ఏపీఈఆర్సీ ప్రభుత్వ వైఖరిని తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపైనే వినియోగదారులపై పడే భారం ఆధారపడి ఉంది. సానుకూలత వచ్చింది ఏపీఈఆర్సీ హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో విద్యుత్ టారిఫ్ తగ్గించాలని ఒక్క సీపీఐఎంఎల్ న్యూడెక్రసీ మాత్రమే కోరింది. వినియోగదారుల పట్ల ఉద్యోగులు గౌరవంగా మెలగాలని, త్వరితగతిన సేవలందేందుకు వీలుగా ఉద్యోగుల సంఖ్యను పెంచాలని కొంత మంది సూచించారు. వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ పగటి పూట మాత్రమే ఇవ్వాలని రైతు సంఘాలు కోరాయి. ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమల ప్రతినిధులు, స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్లు, రైల్వే విభాగాల నుంచి రాయితీలు, ప్రాధాన్యాలు పెంచాలనే విజ్ఞప్తులు వచ్చాయి. ‘పీపీఏ’లపై సమీక్ష చేయమని, విద్యుత్ ప్రమాదాల్లో పరిహారం పెంచాలని పలువురు కోరారు. వాటన్నిటినీ నమోదు చేసుకున్నాం. టారిఫ్ ఆవశ్యకతను కూడా వినియోగదారులకు వివరించాం. దాదాపుగా అన్ని వర్గాల నుంచి మా ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తమైంది. -ఆర్.ముత్యాలరాజు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఎయిర్టెల్ టారిఫ్‌లు పైపైకి..!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ డిస్కౌంట్ ఆఫర్ల కోతను కొనసాగిస్తోంది. టారిఫ్‌లను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు. పెరుగుతున్న వ్యయా లను తట్టుకోవడానికి డిస్కౌంట్ ఆఫర్లను తగ్గిం చడం, టారిఫ్‌లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలను కొనసాగిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతమున్న తక్కువ టారిఫ్‌లను కొనసాగించడం సాధ్యం కాని పని అని వివరించారు. పెరుగుతున్న వ్యయాలే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని, నెట్వర్క్, నెట్వర్క్ విస్తరణ, స్పెక్ట్రమ్, ఫైబర్ తదితర వ్యయాలు పెరిగిపోతున్నాయని వివరించారు. ఎయిర్టెల్ కంపెనీ కొన్ని స్కీమ్స్‌కు సంబంధించిన ఇం టర్నెట్, వాయిస్ కాల్స్ రేట్లను ఇటీవలనే పెంచిన విషయం తెలిసిందే. చివరకు 5-6 కంపెనీలే ఉంటాయ్ ప్రస్తుతం 10-12 మొబైల్ కంపెనీలు సేవలందిస్తున్నాయని, భవిష్యత్తులో కన్సాలిడేషన్ జరిగి చివరకు 5-6 మొబైల్ కంపెనీలే రంగంలో ఉంటాయని భారతీ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఎఫ్ఓ సర్విజిత్ థిల్లాన్ వివరించారు.