పసిడి దిగుమతి టారిఫ్ విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: పసిడి, వెండి దిగుమతి టారిఫ్ విలువను తగ్గిస్తూ... ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కేంద్ర బోర్డ్ (సీబీఈసీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం... 10 గ్రాముల పసిడి దిగుమతి టారిఫ్ విలువ 354 డాలర్ల నుంచి 344 డాలర్లకు తగ్గింది. కేజీ వెండి దిగుమతి టారిఫ్ ధర 470 డాలర్ల నుంచి 461కి తగ్గింది.
ఎటువంటి అవకతవకలకూ అవకాశం లేకుండా... మెటల్స్ దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధింపునకు ఈ టారిఫ్ విలువ(బేస్ ధర)ను సీబీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది. అంతర్జాతీయంగా బంగారం ధరల ధోరణికి అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టారిఫ్ విలువలో మార్పులను ప్రభుత్వం చేపడుతుంది. అయితే టారిఫ్ విలువలో అయిదు శాతం మార్పు ఉంటే ఆ మార్పు ప్రభావం స్పాట్ బులియన్ మార్కెట్‌పై ఉంటుంది.