తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు
సకాలంలో ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు దాఖలు చేయట్లేదని విమర్శ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు సకాలంలో వార్షిక ఆదాయ అవ సరాల నివేదిక (ఏఆర్‌ఆర్), టారిఫ్ పిటిషన్లు దాఖలు చేయడం లేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) చైర్మన్ టి.శ్రీరంగారావు విమర్శించారు. డిస్కంలను దారిలో పెట్టడానికే జరిమానాల విధానం అమ ల్లోకి తెచ్చామని చెప్పారు.
శనివారం హైదరా బాద్‌లో జరిగిన ఈఆర్సీ సలహా మండలి సమా వేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఇంధన రంగం పాత్ర కీలకమన్నారు. కేవలం టారిఫ్‌ను నిర్ణయించడమే ఈఆర్సీ బాధ్యత కాదని... వినియోగ దారులందరికీ సరసమైన ధరలో విద్యుత్‌ను అందించడం, నాణ్యమైన విద్యుత్ అందేలా చూడటం కూడా తమ బాధ్యతని పేర్కొన్నా రు.
డిస్కంల పనితీరును మెరుగుపరచడంతో పాటు వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తున్నా మన్నారు. విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన అన్ని పిటిషన్లపై సూచనలు, అభిప్రాయాలు తెలియజేయడానికి ఈనెల 11 దాకా గడువిచ్చా మని, పిటిషన్లపై అధ్యయనం చేసి అభిప్రా యాలు తెలియజేయాలని కోరారు. ఏఆర్‌ఆర్ తోపాటు పిటిషన్లపై ఈ నెల 21–25 దాకా బహిరంగ విచారణలు నిర్వహిస్తామన్నారు.
టారిఫ్ అమలును వాయిదా వేయాలి: పరిశ్రమల ప్రతినిధులు
డిస్కంలు ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలను ఆలస్యంగా దాఖలు చేసినందున కొత్త టారిఫ్ అమలుకు ఐదు నెలలే గడువు ఉందని... వాటిని విచారణకు స్వీకరించరాదని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు కోరారు. ఏఆర్‌ఆర్‌పై అభ్యంతరాలు తెలపడానికి గడువు పెంచాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి తగిన నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సూచించగా స్థిర చార్జీలు పెంచాలనే నిర్ణయాన్ని అమలు చేయరాదని పరిశ్రమల ప్రతినిధులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment