అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. వివిధ చైనీస్ దిగుమతులపై గణనీయమైన సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. చైనీస్ ఈవీలపై విధించే సుంకం ఈ ఏడాది 25 శాతం నుంచి 100 శాతానికి పెరగనుంది. బ్యాటరీలు, బ్యాటరీ భాగాలు, విడిభాగాలపైన విధించే ట్యాక్స్ 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరగనున్నట్లు సమాచారం.
అమెరికా తీసుకున్న ఒక్క నిర్ణయం 18 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభావం చూపుతుంది. ఈ ట్యాక్స్ 2024 నుంచి మరో మూడు సంవత్సరాలు అమలులో ఉంటాయి. అమెరికాలో చవకైన ఉత్పత్తుల పెరుగుదలను నిరోధించడానికి బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వదేశీ వస్తువుల వినియోగం పెరగటానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే కొత్త ఆవిష్కరణ ఉత్పత్తి చాలా అవసరం. కాబట్టి అమెరికాలోనే కొత్త ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని చెబుతున్నారు.
2025 నాటికి, సెమీకండక్టర్లపై ట్యాక్ రేటు కూడా 25 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుంది. లిథియం అయాన్ ఈవీ బ్యాటరీలపై సుంకం 2024లో 7.5 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది, నాన్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీలపై కూడా ఇదే పెరుగుదలను చూస్తుంది. బ్యాటరీ విడి భాగాల మీద ట్యాక్స్ కూడా 25 శాతానికి పెరుగుతుంది. మొత్తం మీద అమెరికా చైనా వస్తువుల మీద భారీ సుంకాలను విధిస్తూ కీలక ప్రకటనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment