senior journalist
-
మనోజ్ వెనుక ఏపీ మాజీ మంత్రి..!
-
చైనాలో జర్నలిస్ట్‌పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు
బీజింగ్: చైనా న్యాయస్థానం గూఢచర్యం ఆరోపణలున్న సీనియర్ జర్నలిస్ట్ డాంగ్ యుయు(62)కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. చైనాలో స్వేచ్ఛ, పాలనా సంస్కరణల కోసం పోరాడుతున్న అతికొద్ది మందిలో డాంగ్ ఒకరు. అధికార కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండే ఐదు ప్రధాన పత్రికల్లో గ్వాంగ్మింగ్ డైలీ ఒకటి. ఈ పత్రికలో ఎడిటోరియల్ విభాగం డిప్యూటీ చీఫ్ అయిన డాంగ్ 2022లో బీజింగ్‌లోని ఓ రెస్టారెంట్లో జపాన్ దౌత్యాధికారితో చర్చలు జరుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జపాన్ ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ దేశ దౌత్యాధికారిని కొద్ది గంటల తర్వాత విడిచిపెట్టారు. డాంగ్ మాత్రం అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా అమెరికా, జపాన్ తదితర దేశాల అధికారులతో సమావేశాలు జరపడం నచ్చని ప్రభుత్వం ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపింది. శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 1989లో బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్‌లో నిరసనలకు దిగిన వేలాది మంది విద్యార్థుల్లో డాంగ్ కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన అరెస్టయ్యారు. పలు జపాన్ యూనివర్శిటీల్లో విజిటింగ్ ఫెలోగా, ప్రొఫెసర్‌గాను ఆయన పనిచేశారు. న్యూయార్క్ టైమ్స్‌కు పలు వ్యాసాలు రాశారు. -
భక్తులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. పవన్ కు తిలక్ అదిరిపోయే కౌంటర్..
-
చంద్రబాబు పై నిప్పులు చెరిగిన సీనియర్ జర్నలిస్ట్
-
జత్వాని కేసుపై పెట్టిన ఫోకస్.. పూనమ్ కౌర్ కేసుపై అదే స్పీడ్ ఉండాలి..
-
కరకట్ట కొంపలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు.. విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
-
ఎన్నికల క్షేత్రంలో భేరి మోగింది
సార్వత్రిక ఎన్నికల భేరి మ్రోగింది. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అది పెద్ద ఎన్నికల క్రతువుకు ముహూర్తం ఖరారైంది. దేశమంతా లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం జెండా ఊపింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా? నేనా?.. విజయమా? పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. పోయినసారి మాదిరిగా ఈసారి కూడా ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కింపుతో అందరి జాతకాలు బయటపడతాయి. ఎవరి ధీమా వారిది. కొందరిది అతి విశ్వాసం. ఇక సర్వేలు, ప్రీ-పోల్, పోస్ట్-పోల్ అంచనాలు, బెట్టింగులు, కోట్లాది రూపాయల డబ్బుల ఖర్చు, తాయిలాలు, ఆకర్షణలు, వికర్షణలు, ప్రలోభాలు, ఒత్తిళ్లు, బేరసారాలు, అలకలు, కులుకులు.. అన్నీ మామూలే. ఎన్నికలు రాగానే సహజంగా జరిగే పెద్దతంతులో భాగమే ఈ చర్యలు. ఓటరు మదిలో ఏముందో? చివరికి కానీ తెలియదు. ఓటింగ్ సరళి, ఎన్నికలు, రాజకీయాలు, దేశం గురించి పుంఖాను పుంఖంగా ఉపన్యాసాలు దంచే మేధావులు సగంమంది అసలు ఓటే వెయ్యరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక దురదృష్టకర సంప్రదాయం. 60-70 శాతం మంది వేసే ఓట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి. మిగిలినవారు ఎప్పటికీ ప్రేక్షకులుగానే మిగిలిపోతారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు 67 శాతం మాత్రమే. అందులో మహిళల భాగస్వామ్యం కాస్త ఆశాజనకంగా వుంది. 33శాతం మంది ఓటర్లు ఎన్నికలకు దూరంగా వున్నారన్నది పచ్చినిజం. ఈసారి ఎట్లా ఉంటుందో చూడాలి. యువత పెరిగిన సమాజంలోకి వచ్చేశాం. అక్షరాస్యత పెరిగిన కాలంలోకి ప్రవేశించాం. ఈ క్రమంలో కులాల కుంపట్లు రగులుతూనే వున్నాయి, అవి పెరుగుతూనే వున్నాయి. ఇదొక విషాదం. రేపు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదుర్కోవాల్సిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం వున్నాయి. మొత్తం 545 స్థానాలు కలిగిన లోక్ సభలో, దేశ అధికార పీఠాన్ని అధిరోహించాలంటే 272 స్థానాల్లో గెలవాలి. 2014, 2019 రెండు పర్యాయలలోనూ బీజేపీ / ఎన్డీఏ అఖండంగా గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో బిజెపి మరింత బలపడింది, కాంగ్రెస్ ఘోరంగా చతికిలబడిపోయింది. గత ఎన్నికల్లో 303 సీట్లు సాధించుకున్న అధికార పార్టీ ఈసారి 370-400 సీట్లు సాధించాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈసారి గెలిచి, అధికారంలోకి వస్తే? బీజేపీ హ్యాట్రిక్ సాధించడమే కాక, అత్యంత శక్తివంతమైన పార్టీగా స్థిరపడిపోతుంది. ఈ క్రమంలో తమ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే పనిలోనూ పడిపోయింది. కూటమి నుంచి విడిపోయిన టీడీపీ వంటి పార్టీలను మళ్ళీ తీసుకొచ్చుకొని తన దొడ్లో కట్టేసుకుంటోంది. తటస్థంగా వున్న వైసీపీ, బీజేడీ వంటి పార్టీలతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. బీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు కూడా ఇంకా తటస్థంగానే వున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒకే మాటపై వున్నారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని పదే పదే వెల్లడించారు. ఈ పదేళ్ల నరేంద్రమోదీ పాలనలో ప్రవేశపెట్టిన చాలా బిల్లులకు మద్దతు పలికారు. కేంద్రంతో ఎటువంటి తగాదాలు లేకుండా స్నేహపూర్వకంనే వ్యవహరించారు. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ది కూడా ఇంచుమించూ అదే తీరు. వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రయోజనాల వరకే తమను పరిమితం చేసుకున్నారు. కాకపోతే, ఈసారి బీజేడీతో ఎన్నికల బంధం ఏర్పరచుకోవడానికి బీజేపీ చూస్తోందని వింటున్నాం. సీట్ల సర్దుబాటు అంశం ఇంకా కొలిక్కిరాలేదు.దానిని బట్టిగానీ, ఆ ప్రయాణాన్ని అంచనా వేయలేం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను తాజాగా ఈ.డి అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ అంశం వేడివేడిగా వుంది. రేపటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - బీఆర్ఎస్ మధ్య బంధం ఏర్పడుతుందని నిన్నటి దాకా వార్తలు గుప్పుమన్నాయి. కవిత అరెస్టు నేపథ్యంలో ఈ బంధం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. దక్షిణాదిలో బలోపేతం కావాలనే లక్ష్య సాధనలో బీజేపీ ఎంత వరకూ విజయం సాధిస్తుందన్నది ఈసారి అనుమానమే. కర్ణాటక, కొంత తెలంగాణలో తప్ప, ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,కేరళలో బీజేపీ పుంజుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ వాతావరణం చూస్తుంటే, బీజేపీ చేపట్టిన పొత్తులు ఏ మాత్రం ఆ పార్టీకి లాభం తెచ్చిపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఒరిస్సాలో బీజేడీ బలంగా వుంది. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేని వాతావరణమే కనిపిస్తోంది. వైసీపీ ఒక్కటి ఒక వైపు - మిగిలిన ప్రతిపక్షాలన్నీ ఒక వైపు అన్నట్లుగానే వుంది. బీజేపీ -టీడీపీ -జనసేన ఒక పొత్తు కిందకు వచ్చాయి. షర్మిల సారథ్యంలోని కాంగ్రెస్ కూడా తన బాణాలను ప్రధానంగా జగన్ వైపే ఎక్కుపెట్టి యుద్ధం చేస్తోంది. తమ పథకాలు, ప్రజలపై అత్యంత విశ్వాసంతో జగన్ వున్నారు. కొత్త పొత్తుతో బలమైన శక్తిగా మారుతామనే నమ్మకంలో చంద్రబాబు, పవన్ వున్నారు. ఏపీలో ఏమవుతుందో చూద్దాం! తెలంగాణ బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. కవిత అరెస్టు అంశం కూడా తెలంగాణ రాజకీయ పార్టీలలో కొంత ప్రభావం చూపించకపోదు. ఎత్తుజిత్తులు బాగా ఎరిగిన కెసీఆర్ ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలో మళ్ళీ నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడిన 'ఇండియా కూటమి' ఇంకా శక్తివంతంగా మారలేదు. ఆ కూటమిలోని నాయకుల మధ్య సయోధ్య పెద్దగా లేదన్నది బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జగన్ మోహన్ రెడ్డిని అధికార పీఠం నుంచి ఎలాగైనా దించాలని ప్రతిపక్షాలన్నీ అనుకుంటున్నట్లుగా, కేంద్రంలో నరేంద్రమోదీని దించాలని విపక్షాలు అనుకుంటున్నాయి. ప్రతిపక్షాలు అలా అలోచించడం సహజమైన అంశం. ఆ మేరకు బలోపేతం కావడంలోనే అసలు రహస్యం దాగి వుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెద్ద ఎత్తున తేవాల్సిన అవసరం కూడా వుంది. కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత, నాయకత్వం పట్ల విశ్వసనీయత, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో బలంగా చెప్పగలగడం మొదలైన అంశాలు చాలా వున్నాయి. ఇవన్నీ సాధించకపోతే, కూటమి విజయం ఉత్తుత్తి ప్రగల్బాలుగానే మిగిలిపోతుంది. ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే, బీజేపీ పాలన పట్ల, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏమీ లేదు. ఈ పదేళ్ల సామాజిక పరిణామాన్ని గమనిస్తే, హిందూ భావజాలం, ఐక్యత పెరిగాయనే చెప్పాలి. దేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువుల 'ఓటుశక్తి'పై బీజేపీ పెంచుకున్న విశ్వాసం కూడా పెరుగుతూ వస్తోంది. పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధిలేమి, ప్రభుత్వ ఉద్యోగాలు సన్నగిల్లడం, అధిక ధరలు మొదలైనవి అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదనే మాటలు వినపడుతున్నాయి. నరేంద్రమోదీ - అమిత్ షా ద్వయం తప్ప, మిగిలినవారికి స్వతంత్రత లేదని, కేంద్ర మంత్రులు సైతం డమ్మీలుగా మారిపోయారని, అంతా పిఎంఓ, గుజరాత్ గణమే చక్రం తిప్పుతున్నారనే మాటలు బలంగా వినపడుతున్నాయి. వీటన్నిటిని దాటుకుంటూనే నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ ఇన్నాళ్లూ వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లోనూ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, బీజేపీ అధికారంలో ఉండడం చారిత్రక అవసరంగా భావించి, మౌనముద్ర వహిస్తున్నారనే మాటలు వినవస్తున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ఎంత ముఖ్యమో, కాంగ్రెస్‌కు అంతకంటే ముఖ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో, చంద్రబాబుకు అంతకంటే ముఖ్యం. - మాశర్మ, సీనియర్ జర్నలిస్టు -
క్వాష్ పిటిషన్ కొట్టివేత! బాబు మళ్లీ జైలుకే..!
-
జర్నలిస్ట్ ఆనంద్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: సీనియర్ జర్నలిస్ట్ ఆనంద్ కుమార్ ఆకస్మిక మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆనంద్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆనంద్ ఢిల్లీలో గత 35 ఏళ్లుగా వివిధ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సలహాదారు (నేషనల్ మీడియా) కార్యాలయంలో మీడియా కోఆర్డినేటర్ ఆనంద్ కుమార్ పని చేశారు. అంతకు ముందు దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పని చేశారాయన. తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అనారోగ్యంతో ఢిల్లీలోని సర్దార్ పటేల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. మరోవైపు ఆనంద్ మృతి పట్ల జర్నలిస్ట్ యూనియన్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. -
కేసులో మేటర్ లేదు..చేతులెత్తేసిన చంద్రబాబు లాయర్
-
''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..''
పొద్దు మీకింది. మొగులు మీద చుక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ఎపటి తీర్గనే ఆనంద్ బాగ్ చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్ డబ్బ ఉన్నది. గది మాదోస్తుల అడ్డ.‘‘ఎలచ్చన్లు దగ్గర బడుతున్నయి. లీడర్లు ఏం జేస్తున్నరు?’’ అని సత్నారి అడిగిండు.‘‘ముందుగాల సర్వేలు జేపిచ్చిండ్రు’’ అని యాద్గిరిజెపిండు.‘‘సర్వేలు ఎందుకు?’’‘‘ఎవలకు ఎంత బలముందో ఎర్క జేస్కునేతందుకు.’’‘‘ఎర్క జోస్కోని ఏం జేస్తరు?’’‘‘ఎవ్వలికి ఎక్వ బలముంటె గాల్లకు ఎమ్మెల్యె టికిట్ఇస్తరు.’’‘‘టికిట్ రానోల్లు ఏం జేస్తరు?’’‘‘గోడ దుంకుతరు. లేకుంటె రెబల్ క్యాండిడేట్లుగ పోటి జేస్తరు.’’‘‘అన్ని పార్టిల లీడర్లు ఏం జేస్తరు?’’‘‘పాదయాత్రలు జేస్తరు. బస్సు యాత్రలు జేస్తరు.’’‘‘ఇంకేం జేసిండ్రు?’’‘‘పార్టీ కార్యకర్తలకు ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు.’’‘‘ఎవలితోని ఇపిచ్చిండ్రు?’’‘‘ముందుగాల బిచ్చపతి అనేటి బిచ్చగానితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు. ‘ఒక్క పది రూపాయలు దానమియ్యి. దానమిస్తె పున్యమొస్తది. నీ పేరు జెప్పుకోని బత్కుత. నీ పెండ్లాం పిల్లలు సల్లగుంటరు అనుకుంట బిచ్చమడ్గాలె. బిచ్చమేసె దాంక సతాయించాలె. ఇండ్లల్ల అడుక్కునేటప్పుడు గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ ఎయ్యమ్మా అని పాడాలె. ధర్మతల్లీ! నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లి అయితది. నీ కొడ్కుకు కొల్వు దొర్కుతది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వడ్డాన వొస్తయి. చేతులకు బంగారి గాజులు,చెవులకు కమ్మలొస్తయి. నీ మొగడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. అమెరిక గొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావాలన్నాఇస్తడు. గింత ఉడుకుడు బువ్వెయ్యమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! గిలాసల జెరంత సల్లబొట్టు బొయ్యమ్మా అని అనాలె. బిచ్చం బెట్టెదాంక ఇంటి ముంగటనే ఉండాలె. ఇయ్యాల బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లుఅడ్గుడు మీకు అల్కగైతది’అనుకుంట బిచ్చపతి పాటం జెపిండు.థియరీ క్లాసులైనంక ప్రాక్టికల్స్ షురువైనయి. చిన్గిన అంగి, పైంటును పార్టీ కార్యకర్తలు దొడుక్కున్నరు. ఒక చేత్ల బొచ్చె, ఇంకో చేత్ల కట్టె బట్టుకున్నరు. కొందరు గుడి మెట్ల మీద గూసోని బిచ్చమడిగిండ్రు. కొందరు రేల్టేషన్ల, బస్టాండ్లల్ల బిచ్చమడిగిండ్రు. కొందరు గుడ్డోల్లు, కుంటోల్ల లెక్క యాక్టింగ్ జేస్కుంట బిచ్చమడిగిండ్రు.పొద్దు మీకినంకగా దినం అడ్క తెచ్చినయి గాల్లు బిచ్చపతికి సూబెట్టిండ్రు. గవ్విటిని జూసి గాడు మార్కులేసిండు.’’‘‘ఇంకెవలితోని ట్రేనింగ్ ఇపిచ్చిండ్రు?’’‘‘తిట్ల మీద పాటం జెపెటందుకు నర్సమ్మ అనేటామెను బిల్సిండ్రు. గామె తిట్లల్ల మషూర్. ముందుగాల తిట్టినంకనే గామె మాట్లాడ్తది. ‘నీ నోట్లె మన్నువడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్ దగ్గర బడ. నీ తలపండు బల్గ. నీకు పిండం బెట్ట. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూది బెట్ట. నీ చేత్ల జెష్ట మొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ యాపారం జెడ. నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు.బట్టె బాజ్ గానివి. బద్మాష్వి. సన్నా సివి. దద్దమ్మవు. బేకార్గానివి. నక్కవు. గజ్జి కుక్కవు.పందివి. జిల్ల పుర్గువు. నీ కాల్లు చేతులిర్గ. నీకు గత్తర్ దల్గ’ అనుకుంట నర్సమ్మ తిట్ల దండకం సదివింది. తిట్ల దండకంను చపాయించి తలా ఒక కాపి ఇచ్చిండ్రు.’’‘‘ఇంకెవ్వరితోనైన ట్రేనింగ్ ఇపిచ్చిండ్రా?’’‘‘ఒక గూండాను బిలిసిండ్రు. మీటింగ్‌లను ఎట్ల చెడగొట్టాలెనో, సూటి జూసి కోడిగుడ్లు, టమాటలు, పాత చెప్పులు ఎట్ల ఎయ్యాలెనో గాడు నేరిచ్చిండు. ఒక బైరూపులోడు వొచ్చిండు. రంగు బూస్కోకుంటనే యేసాలు ఎట్ల ఎయ్యాలెనో జెపిండు.ఇంకొగాయిన వొచ్చిండు. ఏం లేకున్నా గంటలు,గంటలు ఎట్ల సీచ్ గొట్టాలెనో పాటాలు జెపిండు.’’గీ తీర్గ మా దోస్తులు మాట్లాడుకుండ్రు. -తెలిదేవర భానుమూర్తి, సీనియర్ జర్నలిస్ట్,99591 50491 -
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
హఫీజ్‌పేట్/సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సీహెచ్‌వీఎం కృష్ణారావు (64) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన వివిధ మీడియా సంస్థల్లో పనిచేశారు. రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా పేరుపొందిన ఆయన పూర్తిపేరు చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు. 1959 ఆగస్టు 9న ఆయన జన్మించారు. పాత్రికేయ రంగంలో కృష్ణారావు ప్రయాణం 1975లో ఒక రిపోర్టర్‌గా ప్రారంభమైంది. ఆతర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో పనిచేశారు. డెక్కన్ క్రానికల్ పత్రికలో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. గత ఏడాది ఆయన కేన్సర్ బారిన పడ్డారు, కృష్ణారావుకు భార్య లక్ష్మి, కుమారుడు కిరీటి, కూతురు కిన్నెర ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. కుమారుడు హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా కుమార్తె అమెరికాలో ఉన్నారు. కాగా, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కృష్ణారావు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గవర్నర్, ముఖ్యమంత్రి సంతాపం కృష్ణారావు మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు , ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. కృష్ణారావు మరణం తెలుగు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖుల నివాళి కృష్ణారావు మరణ వార్త తెలుసుకున్న పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టు ముఖ్యలు గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్‌కాలనీలో ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి హరీశ్‌రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేవీపీ రాంచందర్‌రావు, జూలూరి గౌరిశంకర్, కొమ్మినేని శ్రీనివాసరావు, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృష్ణారావుకు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. కాగా, శుక్రవారం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో కృష్ణారావు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. -
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణా రావు కన్నుమూత
-
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు కన్నుమూత
సాక్షి, అమరావతి: సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్‌వీఎం కృష్ణారావు(64) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణారావు గురువారం కన్నుమూశారు. కాగా, అనలిస్ట్‌గా నిక్కచ్చిగా వ్యవహరించారు కృష్ణారావు. ఆయన రాజకీయ వర్గాల్లో ‘బాబాయ్’గా సుపరిచితులు. చిర్రావురి వెంకట మాణిక్య కృష్ణారావు 1959లో ఏలూరు జన్మించారు. 1975లో ఒక స్ట్రింగర్‌గా నిరాడంబరమైన తన జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా ఆయన పలు తెలుగు, తెలుగు దినపత్రికల్లో పనిచేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. డెక్కన్ క్రానికల్‌లో న్యూస్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం ప్రయాణం సాగించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీఎం జగన్ సంతాపం సీహెచ్‌వీఎం కృష్ణారావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘ తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో కృష్ణారావు మంచి ప్రావీణ్యం పొందారు. కిందిస్థాయి నుండి మంచి జర్నలిస్టుగా ఉన్నతస్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణారావు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్.. కృష్ణారావు మృతికి సంతాపం తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అభ్యుదయ భావాలు కలిగిన కృష్ణారావు సీనియర్ జర్నలిస్టుగా చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. పలు రంగాల్లో లోతైన అవగాహనతో ప్రజా ప్రయోజనాల కోణంలో వారు చేసిన రచనలు, విశ్లేషణలు, కొనసాగించిన టీవీ చర్చలు ఆలోచన రేకెత్తించేవిగా ఉండేవని సీఎం తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటని సీఎం అన్నారు. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ► సన్నిహితులు ప్రేమగా ‘బాబాయ్’ అని పిలుచుకునే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు కృష్ణారావుమృతి బాధాకరం. కృష్ణారావు 47 ఏళ్లుగా పత్రిక రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఆయన మరణం మీడియా రంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ► ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సానుభూతి ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ సంపాదకులు సిహెచ్ విఎం కృష్ణారావు గారి మృతి పట్ల ఏపీ బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ దాదాపు 5 దశాబ్దాలుగా పత్రిక రంగంలో, రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరని లోటు. 18 ఏళ్ల పాటు డెక్కన్ క్రానికల్ దిన పత్రికలో బ్యూరో చీఫ్ గా ఆయన సేవలు ఎనలేనివి.. ఆయన ప్రతిభ అసామాన్యమైనది’ అని తన సానుభూతి తెలిపారు. ప్రత్యేకంగా టీవీ డిబేట్లలో నిర్మాణాత్మక రాజకీయ విశ్లేషణలు చేయడంలో ఆయనకు ఆయనే సాటని, ఎందరో యువ జర్నలిస్టులకు కృష్ణారావు జీవితం ఆదర్శణీయమన్నారు. ► కృష్ణారావు మరణం అత్యంత బాధాకరం. తెలుగు రాష్ట్రాలలో కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా వారికున్న అవగాహన , పలు అంశాల్లో వారు చర్చలలో పాల్గోన్న తీరు, పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చలు వారి అభిప్రాయాలు అద్భుతం . నాలుగు దశాబ్దాలకు పైబడి జర్నలిజం రంగానికి నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా :::ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్దన్‌రెడ్డి ► ఢిల్లీ: సీనియర్ పాత్రికేయులు గా కృష్ణారావు సేవలు చిరస్మరణీయం. రాజకీయ, సామాజిక అంశాలపై ఎంతో అవగాహనతో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణారావు చేసిన విశ్లేషణలు, టీవీ మాద్యమాల్లో జరిపిన చర్చలు ఎంతో ప్రేరణ కలిగించాయి. నిరాడంబరంగా, నిజాయితీగా సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు సాగించిన పాత్రికేయ జీవితం ఎంతో ఆదర్శప్రాయం. నాకు ఎంతో కాలంగా అత్యంత సన్నిహితుడైన జర్నలిస్ట్ సోదరుడు కృష్ణారావు మరణం నన్ను కలిచివేసింది. ఆయన మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. :::మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంతాపం ► పాత్రికేయ రంగంలో నేల కొరిగిన ధృవతార. సీనియర్ జర్నలిస్ట్, ఎడిటర్, సిహెచ్ ఎం వీ కృష్ణారావు ఇక లేరన్న విషయం అత్యంత బాధాకరం .సిహెచ్ ఎం వి కృష్ణారావు గారు సీనియర్ జర్నలిస్టుగా పలు అంశాల్లో విశ్లేషణలు, టీవీ చర్చల్లో నిష్పక్షపాతంగా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు అద్భుతం . పాత్రికేయు రంగం లో నిజాయితీగా సేవలందించిన సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు మరణం పత్రికా రంగానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను . ::: శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇది కూడా చదవండి: చంద్రబాబు కొత్త డ్రామా.. సానుభూతి కోసం ఇంతకు దిగజారాలా? -
బెంగళూరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం
దొడ్డబళ్లాపురం: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కుమార్తె వాఙ్మయి వివాహం బెంగళూరులో గురువారం నిరాడంబరంగా జరిగింది. ఉడుపి అదమారు మఠం బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వాఙ్మయి– ప్రతీక్ల వివాహం బెంగళూరులోని టమరిండ్ ట్రీ అనే ఓ హోటల్లో జరిగింది. ఉడుపి మఠానికి చెందిన పలువురు స్వామీజీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి అతి కొద్దిమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న వాఙ్మయి ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. -
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క!
ఒక ఆటగాడు ఓడిపోకుండా మైదానంలో ఎంతసేపు నిలబడగలిగాడు, మొత్తం విజయానికి ఏ విధంగా దోహదపడ్డాడు అనేది అతడి ట్రాక్ రికార్డ్‌కి సంకేతం. వ్యక్తిగత స్కోర్ కంటే కీలక ఘట్టాల్లో జట్టు విజయానికి అండగా నిలవడం చాలా ముఖ్యం. జర్నలిజం రంగంలో జి.యస్. వరదాచారి కూడా ఇలాంటి ఆటగాడే. ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు జర్నలిజం వికాసానికి, విలువలకు, జర్నలిస్టుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పాటుపడుతూ వచ్చిన కార్యదక్షుడు. మరో సుప్రసిద్ధ జర్నలిస్టు సి. రాఘవాచారికి వర్తించే మాటలే వరదాచారికీ సరితూగుతాయి. తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోకుండా ఇంగ్లిష్ జర్నలిజంలోకి వరదాచారి ప్రవేశించి ఉంటే ఏ కోటంరాజు రామారావో అయ్యేవారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన లాయర్‌గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఏ నానాపాల్కీవాలానో అయి ఉండేవారు. యూనియనిస్టుగానే కొనసాగి ఉంటే మరో మానికొండ చలపతిరావు అయ్యేవారు. కానీ ఇవేవీ కావాలనుకోలేదు. కనుకే ఆయన గోవర్ధన సుందర వరదాచారి అయ్యారు. నమ్మిన సిద్ధాం తాల విషయంలో రాజీపడేవారు కారు. ఎదుటివారు ఏ భావజాలానికి చెందిన వారైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గోవర్ధన కృష్ణమాచార్యులు, జానకమ్మ దంపతులకు 1932 అక్టోబర్ 15న జన్మిం చారు. జర్నలిజంపై మక్కువతో విద్యార్థి దశలోనే కొంతకాలం ‘వైష్ణవ’ పత్రికను నడిపారు. జర్నలిజం వృత్తిలో ప్రవేశించడా నికి విద్యార్హతల పట్టింపు లేని ఆ రోజు ల్లోనే బి.ఏ. డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. కోర్సులో భాగంగా చెన్నైలోని ‘ది హిందూ’లో ఇంటర్న్‌షిప్ దిగ్వి జయంగా పూర్తిచేశారు. ఇంగ్లిష్ జర్నలిజంలో ప్రవేశించే అవకాశం వచ్చినా తెలుగు భాషపై మక్కువతో ఆ ఆఫర్‌ను కాదనుకుని 1956లో హైదరాబాద్‌లో ‘ఆంధ్ర జనత’లో చేరారు. జర్నలి జంలో చేరిన కొత్తల్లోనే సహోద్యోగుల సందేహాలను ఓపికగా విడమరిచి చెప్తుండేవారు. నాటి నుంచి వరదాచారిని ‘ప్రొఫెసర్’ అని పొత్తూరి వెంకటేశ్వరరావు పిలిచేవారు. ‘ఆంధ్ర భూమి’లో న్యూస్ ఎడిటర్‌గా రెండు దశాబ్దాలు, ‘ఈనాడు’లో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించినప్పటి నుంచి జర్న లిజం శాఖ అధిపతిగా, ప్రొఫెసర్‌గా 22 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. ప్రెస్ అకాడమీ సహా పలు విద్యా సంస్థల్లోనూ జర్నలిజం పాఠాలు బోధించారు. హెచ్ఎం టీవీలో తీర్పరిగా బాధ్యతలు చేపట్టి తెలుగులో తొలి అంబుడ్స్ మన్‌గా ఖ్యాతి గడించారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యాలయమైన దేశోద్ధారక భవన్ అనుమతి సాధనలో, నిర్మాణ నిధుల సేకరణలో ముఖ్య భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘా నికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్థాపక కార్యదర్శిగా, జర్నలిస్టుల గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా, జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిర్విరామ సేవలు అందిస్తూ వచ్చారు. వెటరన్ జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా రిటైరైన జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డుల కోసం పాటుపడ్డారు. పాత్రికేయులకు కరదీపికలుగా నిలిచే పలు పుస్తకాలను ఈ సంఘం తరఫున ప్రచురించారు. వరదాచారి తన ఆత్మకథను ‘జ్ఞాపకాల వరద’ పేరిట వెలువ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం నార్ల వెంకటే శ్వరరావుపై మోనోగ్రాఫ్ రాశారు. పత్రికా రచనలో దొర్లే పొర బాట్లను సోదాహరణంగా వివరిస్తూ రాసిన ‘దిద్దుబాటు’ కాలమ్‌ను అదే పేరుతో సంకలనంగా వెలువరించారు. పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషిస్తూ ‘ఇలాగేనా రాయడం?’ పేరుతో వ్యాసాల సంకలనం రూపొందించారు. వరదాచారి పాత్రికేయ స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన బహుముఖీన కృషికి దర్పణం పడుతూ ప్రముఖుల రచనలతో ‘వరద స్వర్ణాక్షరి’ వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. స్వీయ ప్రతిభతో, బహుముఖీన కృషితో తెలుగు జర్నలిజం రంగాన్ని ఆరు దశాబ్దాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చి పరిపూర్ణ జీవితం గడిపిన వరదాచారి ధన్యజీవి. తెలుగు పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క. గోవిందరాజు చక్రధర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
సీనియర్ పాత్రికేయుడు కేఎల్ రెడ్డి కన్నుమూత
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీనియర్ పాత్రికేయుడు కంచర్ల లక్ష్మారెడ్డి (93) గురువారం కన్నుమూశారు. పూర్వపు నల్లగొండ జిల్లా పర్సాయపల్లికి చెందిన కేఎల్ రెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 15 రోజులుగా గ్రేటర్ వరంగల్‌లోని గొర్రెకుంటలో ఉన్న ఆనంద ఆశ్రమంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతిచెందారు. బంధువులు ఆయన భౌతికకా యానికి హైదరాబాద్‌లోని నాగోల్‌లో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. సుదీర్ఘ పాత్రికేయ జీవితం 1950లో ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి కేఎల్ రెడ్డి తెలుగుదేశం పేరిట వచ్చిన రాజకీయ వారపత్రికతో జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ ఇలా పలు పత్రికల్లో పనిచేశారు. ‘తెలంగాణ ప్రభ’ పేరుతో వారపత్రికను, ‘కాలేజీ విద్యార్థి’ పేరుతో మాస పత్రికను సొంతంగా నడిపారు. 1969 తెలంగాణ ఉద్య మం సమయంలో ఆ వార్తలతో ‘నేడు’ పేరిట 3 నెలలపాటు కరపత్రాన్ని వెలువరించారు. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక పత్రిక స్థాయిలో ‘నేడు’ను వెలువరించడం నేరంగా పరిగణించి ఆయనకు నెల రోజులు జైలుశిక్ష కూడా వేశారు. సీఎం, ప్రముఖుల సంతాపం సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి పత్రికా రంగానికి నిస్వార్థ సేవలు అందించారని, ఆయన మృతి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు. ఐజేయూ, టీయూడబ్ల్యూజే నివాళి సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కేఎల్ రెడ్డిల మృతిపట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రగాఢ సంతాపం వ్యక్తం ప్రకటించాయి. తెలుగు పత్రికా రంగం ఒకేరోజు ఇద్దరు పాత్రికేయ దిగ్గజాలను కోల్పో యిందని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సీనియర్ జర్నలిస్టు జీఎస్ వరదాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు గోవర్ధన సుందర (జీఎస్) వరదాచారి (92) గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. పంజాగుట్ట జర్నలిస్టు కాలనీలో నివాసం ఉండే ఆయనకు భార్య సరోజిని, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. భార్య 2000 సంవత్సరంలోనే చనిపోయారు. వరదాచారి మృతి పట్ల పలువురు ప్రముఖులు, సీనియర్ పాత్రికేయులు సంతాపం తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం పంజాగుట్ట çశ్మశానవాటికలో వరదాచారి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుదీర్ఘ పాత్రికేయ జీవితంతో.. జీఎస్ వరదాచారి 1932లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జన్మించారు. న్యాయవాద కోర్సుతోపాటు జర్నలిజంలో డిప్లొమా చేశారు. 1956 ఒక తెలుగు దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. 1961లో ఆంధ్రభూమి దినపత్రికలో న్యూస్ ఎడిటర్‌గా చేరి 22 ఏళ్లు పనిచేశారు. 1983లో ఈనాడులో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరారు. అనంతర కాలంలో తెలుగు విశ్వవిద్యాలయం, ఇతర యూనివర్సిటీలు, ప్రముఖ దినపత్రికల జర్నలిజం కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతుల్లో ‘పత్రికల భాష’ అంశంపై శిక్షణ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. సంతాపం తెలిపిన ప్రముఖులు జర్నలిజంలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు వరదాచారి తీసుకున్న చొరవ యావత్ పాత్రికేయ సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జర్నలిజంపై జీఎస్ వరదాచారి బోధనలు నేటి తరానికి గొప్ప స్ఫూర్తి అని, ఆయన మృతి తెలుగు జర్నలిజానికి తీరని లోటు అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. వరదాచారి మృతిపట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షుడు దాసు కేశవరావు, కార్యదర్శి కె.లక్ష్మణ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిజానికి సుదీర్ఘ సేవలు: సీఎం కేసీఆర్ జీఎస్ వరదాచారి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వరదాచారి నాలుగు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా జర్నలిజం రంగానికి సేవలందించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ జర్నలిస్ట్ గోపాల్‌రెడ్డి దుర్మరణం
సాక్షి,అమరావతి/ తిరుమల: రాయల సీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి పట్టణానికి చెందిన మబ్బు గోపాల్‌రెడ్డి(75) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను కవర్ చేసేందుకు తిరుమల వచ్చిన గోపాల్‌రెడ్డి బుధవారం రాత్రి బైక్‌పై తిరిగి తిరుపతికి వెళుతుండగా మొదటి ఘాట్ రోడ్డులోని 12వ మలుపు వద్ద కిందపడి రక్షణ గోడను ఢీకొట్టారు. చదవండి: గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే? తీవ్రంగా గాయపడిన ఆయనను తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. పలు ప్రముఖ దిన పత్రికల్లో పనిచేసిన గోపాల్‌రెడ్డి.. ప్రస్తుతం యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు. ఆయన మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన సజ్జల సీనియర్ జర్నలిస్ట్ మబ్బు గోపాలరెడ్డి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గోపాలరెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. -
సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆచార్య చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్రావుకు ఓయూ డాక్టర్ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
ఆ విమర్శలతో నా నటనలో మార్పు వచ్చింది: చిరంజీవి
Chiranjeevi Condolence To Gudipudi Srihari: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (88) అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. గుడిపూడి శ్రీహరి మరణం పట్ల పలువురు సినీ తారలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 'గుడిపూడి శ్రీహరి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీ విమర్శకుడు. నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు.. నటుడిగా నన్ను నేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోవడానికి ఎంతో ఉపకరించాయి. ఆయన మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను' అని చిరు ట్విట్ చేశారు. అలాగే మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో గుడిపూడి శ్రీహరి గురించి చిరంజీవి మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ శ్రీహరికి నివాళి అర్పిస్తున్నారు. గుడిపూడి శ్రీహరి గారు ఓనిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీవిమర్శకుడు.నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు,నటుడిగా నన్నునేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోడానికి ఎంతో ఉపకరించాయి.ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరనిలోటు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను pic.twitter.com/wCTFIrQby3 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 5, 2022 ఈ వీడియోలో ''నా నట జీవితాన్ని సరైన మార్గంలో పెట్టిన వారిలో గుడిపూడి శ్రీహరి, పీఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, నందగోపాల్ తదితర జర్నలిస్ట్‌లు ఉన్నారు. నా సినిమా సెట్లో వారితో చర్చించి ఎన్నో విషయాలు నేర్చుకునేవాడిని. ఆరోగ్యకరం జర్నలిజం అంటే ఏంటో వారి దగ్గర తెలుసుకున్నా. ఒకప్పుడు గుడిపూడి శ్రీహరి 'సితార'లో సినిమా రివ్యూలు రాశేవారు. ఆయన పదజాలం కొంచెం హార్ష్‌గా అనిపించినా ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి చెబుతున్నట్లు ఉండేది. నేను బాగా నటిస్తున్నాని, పోరాటాలు, డ్యాన్సులు అన్నింటిల్లో వేగం పెంచానని ప్రశంసిస్తూనే డైలాగ్‌లు చాలా వేగంగా చెబుతున్నానని విమర్శించారు. 'నటనలో స్పీడ్ ఉండాలి గానీ మాటల్లో కాదు. మనం చెప్పే మాట ముందు మన చెవికి వినపడాలి. తర్వాత ఇతరులకు వినపడాలి' అని చెప్పి నాలో మార్పు తీసుకొచ్చారు'' అని చిరంజీవి పేర్కొన్నారు. -
విషాదం.. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత..
Gudipudi Srihari Passed Away: ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (జులై 5) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గతేడాది నవంబర్‌లో శ్రీహరి భార్య లక్ష్మీ మరణించారు. అయితే భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన ఆయన ఇంట్లో జారి పడటంతో తొంటి వెముక విరిగింది. దీంతో నిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అయితే ఆయన ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. శ్రీహరి కుమారుడు స్వదేశానికి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారని సమాచారం. గుడిపూడి శ్రీహరి 1968లో 'ది హిందూ'కు కంట్రిబ్యూటర్‌గా పాత్రికేయ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అనంతరం ఈనాడు, ఫిల్మ్ ఫేర్ వంటి పత్రికలలో పనిచేశారు. హైదరాబాద్ ఆల్ ఇండియఆ రేడియోలోనూ న్యూస్ బ్రాడ్ కాస్టర్‌గా రాణించారు. సుమారు 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా చిత్ర పరిశ్రమకు సెవలందించారు. 1969 నుంచి ది హిందూ పత్రికలో రివ్యూలు రాయడం ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక తెలుకు సినిమాలకు రివ్యూలు రాశారు. 1985లో ఉత్తమ బాలల చిత్రంగా అవార్డు అందుకున్న 'మాకూ స్వాతంత్య్రం కావాలి' సినిమాకు శ్రీహరి మాటలు రాశారు. 2013 సంవత్సరానికి గానూ ఆయనకు తెలుగు విశ్వవిద్యాలయం 'పత్రికా రచన'లో 'కీర్తి పురస్కారాన్ని' ప్రకటించింది. గుడిపూడి శ్రీహరి మృతిపట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. -
సీనియర్ పాత్రికేయుడు శ్రీరంగనాథ్ మృతి
సాక్షి, అమరావతి/అమలాపురం: కోనసీమకు చెందిన సీనియర్ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన శ్రీరంగనాథ్ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది. శ్రీరంగనాథ్ ఉదయం దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఉదయం స్టేట్ బ్యూరోలో కూడా పనిచేశారు. వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్ నెట్ వర్క్ ఇన్ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా పనిచేశారు. కమ్యూనిస్ట్ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ఇండియా మార్ట్గేజ్డ్ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్ తాకట్టులో భారతదేశం పేరుతో అనువదించారు. శ్రీరంగనాథ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సీఎం సంతాపం శ్రీరంగనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీరంగనాథ్ మృతి పత్రికా లోకానికి తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జీవితాంతం బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని ఆచరిస్తూ.. నీటిపారుదల రంగంలో డెల్టా వ్యవస్థ మెరుగుదలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారని కొనియాడారు. మంగళవారం శ్రీరంగనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరంగనాథ్ ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. -
సీనియర్ పాత్రికేయుడు ప్రసాద్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, చారిత్రక నవలా రచయిత పాలపర్తి ప్రసాద్ (88)కన్నుమూశారు. కొద్ది రోజులుగా లివర్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని నివాసంలో మృ తిచెందారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మ హాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించా రు. ప్రచార ఆర్భాటాలకు, పురస్కారాలకు దూరంగా ఉన్న ప్రసాద్ నడుస్తున్న నిఘం టువు వంటి వారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఆయన విద్యాభాసమంతా మద్రాస్ లోనే జరిగింది. పాత్రికేయులుగా, ఆంధ్రప త్రిక ఎడిటర్‌గా పని చేసి, పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రోషనారా, అక్బర్, ఆర్య చాణక్య, పృథ్వీరాజ్, షాజహాన్ వంటి చారిత్రక నవలలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. మితభాషి అయిన ప్రసాద్ మృతితో ఒక మంచి రచయితను, గొప్ప పాత్రికేయుడిని కోల్పోయామని పలు వురు పాత్రికేయులు, సాహిత్యాభిమానులు తమ సంతాపాన్ని తెలియజేశారు. -
మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఎడిటర్, పొలిటీషియన్ చందన్ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్ మిత్రా రాజీనామా చేశారు. Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 2, 2021 I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9 — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 -
సీనియర్ జర్నలిస్టు వీరాజీ మృతి
సాక్షి, హైదరాబాద్ః ప్రముఖ నవలా రచయిత, సీనియర్ జర్నలిస్టు వీరాజీ (పిళ్ళా కృష్ణమూర్తి, 80) బుధవారం హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసంలోల మరణించారు. వీరాజీ ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమితో పాటు పలు ఆంగ్ల, హిందీ పత్రికల్లో సంపాదకుడిగా పని చేశారు. వీరాజీ కాలమిస్టుగా 2011లో గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్నారు. 1990 నుంచి ఆంధ్రభూమి డైలీలో ప్రచురితమైన కాలమ్ ‘వీరాజీయం’మంచి పాఠకాదరణ పొందింది. తన అనుభవాల సమాహారంగా రాసిన ‘స్మృతి లయలు’ 106 వారాల పాటు కొనసాగింది. ఆయనకు ఇద్దరు కుమారులు. వీరాజీ మృతి పట్ల ఆయన కుటుంబానికి బాలసాహిత్య పరిషత్ సంతాపాన్ని తెలియజేసింది. -
జర్నలిస్ట్ అండా రామారావు కన్నుమూత
సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్వో అండా రామారావు ఇకలేరు. కర్నూలు జిల్లా ఆదోనిలోని స్వగృహంలో అనారోగ్యంతో ఆదివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారాయన. డిగ్రీ పూర్తయ్యాక బీఎడ్ చేయాలనుకున్నా జర్నలిజంవైపు వచ్చారు. పలు అగ్ర దినపత్రికలతో పాటు సినీ వారపత్రికల్లోనూ పని చేశారాయన. ఘంటసాల వెంకటేశ్వరరావుపై వీరాభిమానంతో పలు వ్యాసాలు రాశారు.. కొందరి సహకారంతో ‘మీ ఘంటసాల’ పుస్తకాన్ని తెచ్చారు. ‘మ్యూజిక్ ఛానల్’ అనే మాస పత్రికను కొద్ది రోజులు నడిపారు రామారావు. ఆ తర్వాత నిర్మాత ఎమ్ఎస్. రెడ్డి వద్ద పీఆర్వోగా ఉన్నారు. ‘తెలుగు నిర్మాతల చరిత్ర’ పుస్తకం తీసుకురావడంలో నిర్మాత కె. మురారికి రామారావు సహకరించారు. గత ఏడాది హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్లిన రామారావు ‘ఘంటసాల గానామృతం’, ‘యుగపురుషుడు యన్టీఆర్’ అనే వాట్సప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా ఉంటూ పాత చిత్రాల విశేషాలను పంచుకున్నారు. అండా రామారావు మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తమ సంతాపం వ్యక్తం చేశారు. -
సీనియర్ జర్నలిస్టు కోప్ర కన్నుమూత
ముషీరాబాద్: జర్నలిస్టు, కవి, రచయిత, బహుజన మేధావి కోలపూడి ప్రసాద్ (56) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కోప్రగా ఆయన అందరికీ సుపరిచితుడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వారం క్రితం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మొదట పెరాలసిస్ రావడంతో కొన్ని అవయవాలు పనిచేయలేదు. కిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందారు. ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ప్రసాద్ మొదట్లో ఆర్ అండ్ బిలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొంతకాలం విరసంలో, అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో పనిచేశారు. అనంతరం ఆ పార్టీకి దూరమై హైదరాబాద్ వచ్చారు. జర్నలిస్టుగా అనేక పత్రికలలో పనిచేశారు. అనేక పాటలు, కవితలు, వ్యాసాలు రాసి బహుజన మేధావిగా గుర్తింపుపొందారు. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ప్రాచుర్యం పొందారు. కోలపూడి ప్రసాద్ (కోప్ర) మరణంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, తెలంగాణ ఎమ్మార్పీఎస్ నేతలు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, మేడి పాపయ్య మాదిగలతోపాటు బహుజన మేధావులు, కవులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కోప్ర మరణం బీసీ ఉద్యమానికి తీరనిలోటన్నారు. చదవండి: కాల్పుల విరమణ దిశగా మావోలు? -
సీనియర్ పాత్రికేయుడు ప్రభుకిరణ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ సువార్తికులు రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ (63) ఆదివారం కింగ్‌కోఠిలోని జిల్లా ఆస్పత్రిలో కన్నుమూశారు. పదిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ప్రభుకిరణ్, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం పెంబర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుత జనగామ జిల్లా పెంబర్తికి చెందిన ప్రభుకిరణ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. అనంతరం క్రైస్తవ మత ప్రవచకులుగా ఉంటూనే ‘సాక్షి’ఫ్యామిలీ సన్నిధి పేజీలో పన్నెండు సంవత్సరాలకు పైగా ఆయన రాసిన సువార్త వ్యాసాలు ఎంతో పాఠకాదరణ పొందాయి. ఆయన మృతి పట్ల సాక్షి సంపాదకుడు వర్ధెల్లి మురళి సంతాపం ప్రకటించారు. ప్రభుకిరణ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చదవండి: నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త! -
సీనియర్ పాత్రికేయులు ఎం.రాజేంద్ర కన్నుమూత
బంజారాహిల్స్: సీనియర్ జర్నలిస్ట్, కథా రచయిత ముత్తిరేవుల రాజేంద్ర (84) బంజారాహిల్స్ జర్నలిస్ట్ కాలనీ లోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య రాజేశ్వరితో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. రాజేంద్ర ఇండియాటుడే తెలుగు ఎడిషన్‌కు మొదటి ఎడిటర్‌గా పనిచేయడంతో పాటు కథా రచయితగానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన ఈనాడు చీఫ్ సబ్ఎడిటర్గా, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, జనతా పత్రికలలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇండియాటుడే వార్షిక సాహిత్య సంచిక తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత రాజేంద్రదే. చిత్తూరు జిల్లా అరగొండకు చెందిన రాజేంద్ర అపోలో ఆస్పత్రిచైర్మన్ ప్రతాప్‌రెడ్డికి బంధువు. ఆయన అంత్యక్రియలు మంగళవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య ఇకలేరు.. -
బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టు విడుదల
ఢాకా: దాదాపు వారం క్రితం అరెస్టయిన బంగ్లాదేశ్ సీనియర్ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లామ్ ఆదివారం విడుదలయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అనుమతి లేకుండా ఫోటోలు తీశారన్న ఆరోపణలపై వలసవాద కాలానికి చెందిన ఓ చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుపై బంగ్లాదేశ్‌లోని మీడియా సహా ఐక్యరాజ్యసమితి వరకూ పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 5వేల టాకాలను పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్‌పోర్టును సమర్పించాలని కోర్టు ఆమెను కోరింది. అనంతరం కాశీంపుర్ మహిళా సెంట్రల్ జైలు నుంచి ఆదివారం రోజినా విడుదలయ్యారు. జూలై 15వరకూ బెయిల్ కొనసాగనుంది. వ్యాక్సిన్లను కొనే వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆమె ఫొటోలు తీశారంటూ ఆరోగ్య శాఖ ఆమెపై కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇకపై కూడా జర్నలిస్టుగా మరింత బాధ్యతతో పని చేస్తానని చెప్పారు. (చదవండి: UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది) -
బంగ్లాదేశ్‌లో మహిళా జర్నలిస్ట్ అరెస్టు
ఢాకా: వలసవాద కాలానికి చెందిన అధికారిక గోప్యతా చట్టం (1923) కింద బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ ప్రముఖ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాంను అరెస్టు చేయడంపై అక్కడి జర్నలిస్టు సంఘాలు, హక్కుల సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి చెందిన కొన్ని ఫైల్స్‌ను ఆమె అనుమతి లేకుండా ఫొటోలు తీశారని, అందువల్ల అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. పోలీసులు ఐదురోజుల కస్టడీ కోరగా కోర్టు నిరాకరించి జైలుకు పంపింది. అరెస్టయిన మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లాం ఆ దేశంలోని ప్రోతోమ్ అలో అనే వార్తా పత్రికకు పని చేస్తున్నారు. అది దేశంలోనే అతి పెద్ద వార్తా పత్రిక కావడం గమనార్హం. చదవండి: బైడెన్ దంపతుల ఆదాయమెంతో తెలుసా? -
కరోనాతో ‘జీ టీవీ’ ఎడిటర్ కన్నుమూత
కోల్‌కత: మాయదారి కరోనా జర్నలిస్టులపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పెద్ద ఎత్తున జర్నలిస్టులు కూడా కరోనాకు బలవుతున్నారు. తాజాగా టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అంజన్ బందోపాధ్యాయ్ కరోనాతో కన్నుమూశారు. దీంతో బెంగాల్ జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్లో ప్రముఖ టీవీ యాంకర్లలో అంజన్ బందోపాధ్యాయ్ ఒకరు. ఆయన జీ 24 గంట బెంగాల్ టీవీ ఛానల్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాంకర్‌గా కూడా చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన అంజన్ కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయ్యారు. కొన్ని రోజులకు మళ్లీ కరోనా తిరగబెట్టింది. తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మృతిచెందారు. అంజన్ బందోపాధ్యాయ్ జర్నలిజంలో 33 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అంతకుముందు ఆనంద్‌బజార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఎడిటర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన టీవీ 9 బెంగాల్ న్యూస్ ఛానల్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. చదవండి: కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం
సాక్షి, చిత్తూరు: సీనియర్ జర్నలిస్టు, ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి కన్నుమూశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం తెల్లవారుజామున గోపి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రిలో చేరారు. గత వారం రోజులుగా గోపి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గోపి కుటుంబానికి సాక్షి మీడియా ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. ప్రముఖుల సంతాపం: ► సీనియర్ జర్నలిస్టు, ‘గరం గరం వార్తలు’ ఫేమ్ గోపి అకాల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ విచారం వ్యక్తం చేశారు. గోపి కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. ► సీనియర్ జర్నలిస్ట్ గోపి హఠాన్మరణం పట్ల ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. గోపి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని.. -
కరోనాతో సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ చిన్న పెద్ద వ్యతాసం లేకుండా అందరిని బలి తీసుకుంటోంది. ఇప్పటీకే మహమ్మారి బారినపడి ఎంతోమంది జర్నలిస్టులను ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆర్కేగా సుపరిచితుడైన సీనియర్ జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ బుధవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో గాంధీ హాస్పిటల్లో చేరారు. గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆర్కే ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆర్కే స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఎన్‌టీవీలతోపాటు డెక్కన్ క్రానికల్‌లో ఆయన పనిచేశారు. ఆర్కే మరణంతో మీడియా వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.. జర్నలిస్ట్ భళ్ళమూడి రామకృష్ణ మృతి పట్ల జర్నలిస్టు సంఘాలు విచారం వ్యక్తం చేశాయి. చదవండి: కరోనా: దేశంలో కొత్తగా 3,82,315 కేసులు -
కరోనాతో ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత: అమిత్‌షా సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును బలితీసుకుంది. ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానాకు ఇటీవల కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గురువారం మెట్రో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సర్దానా అకాలమరణంపై పలువురు జర్నలిస్టు పెద్దలు, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రోహిత్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఇంకా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష సిసోడియా, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా రోహిత్ మరణం షాక్‌కు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా మహమ్మారి తన సన్నిహితుడిని బలి తీసుకుంటుదని ఊహించలేదంటూ జీ న్యూస్‌కు చెందిన సుధీర్ చౌదరి సంతాపం తెలిపారు. రోహిత్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని నష్టమని మరో సీనియర్ జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన కోవిడ్‌తో బాధ పడుతున్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో ఏ మాత్రం వెనుకాడలేదని తోటి జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. కాగా 2000 జీ న్యూస్‌తో కరియర్‌ను ఆరంభించిన సర్దానా ఆ తరువాత సర్దానా 2017లో ఆజ్ తక్లో చేరారు. జీ న్యూస్‌లో 'తాల్ తోక్ కే' , ఆజ్ తక్లో "దంగల్" అనే చర్చా కార్యక్రమాలతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. 2018 లో గణేష్ విద్యార్తి పురస్కార్ అవార్డు గెల్చుకున్నారు. టీవీ న్యూస్ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో రోహిత్ ఒకరు. (రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం) अब से थोड़ी पहले @capt_ivane का फ़ोन आया।उसने जो कहा सुनकर मेरे हाथ काँपने लगे।हमारे मित्र और सहयोगी रोहित सरदाना की मृत्यु की ख़बर थी।ये वाइरस हमारे इतने क़रीब से किसी को उठा ले जाएगा ये कल्पना नहीं की थी।इसके लिए मैं तैयार नहीं था।ये भगवान की नाइंसाफ़ी है.. ॐ शान्ति — Sudhir Chaudhary (@sudhirchaudhary) April 30, 2021 Pained to learn about Shri Rohit Sardana ji’s untimely demise. In him, the nation has lost a brave journalist who always stood up for unbiased and fair reporting. May God give his family the strength to bear this tragic loss. My deepest condolences to his family and followers. — Amit Shah (@AmitShah) April 30, 2021 More terrible news friends. Well known Tv news anchor Rohit Sardana has passed away. Had a heart attack this morning. Deep condolences to his family. RIP — Rajdeep Sardesai (@sardesairajdeep) April 30, 2021 -
జర్నలిజంలో ఘనాపాటి ‘తుర్లపాటి’
పటమట (విజయవాడ తూర్పు): దేశ స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు అందరికీ ఆదర్శప్రాయుడని ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని స్వర్ణ కల్యాణ మండపంలో తుర్లపాటి కుటుంబరావు సంస్మరణ సభ ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1990–92 మధ్య ఉదయం దినపత్రికలో పనిచేస్తున్న సమయంలో పలుమార్లు తుర్లపాటిని కలిశానని, సమాజంలో అనేక కోణాలను తుర్లపాటి ఆవిష్కరించేవారని చెప్పారు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా తుర్లపాటి విలువైన సలహాలిచ్చేవారని వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో నేరుగా మాట్లాడే వ్యక్తుల్లో తుర్లపాటి ఒకరని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా కూడా తాము అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ తుర్లపాటి ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉండేవని, రాజకీయాలకు అతీతంగా ఆయన అందరితో సంబంధాలను కలిగి ఉండేవారని అన్నారు. అసెంబ్లీ ఉప సభాపతి కోన రఘుపతి మాట్లాడుతూ తుర్లపాటి 10వేలకు పైగా సభల్లో ఉపన్యాసాలిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారన్నారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న తొలి తెలుగు జర్నలిస్ట్ తుర్లపాటి అని కీర్తించారు. ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదనానికి ఆయన బ్రాండ్‌గా ఉండేవారన్నారు. అంతకుముందు సావిత్రి కళాపీఠం తుర్లపాటి జీవితంపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్మరణ సభలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామ్మోహన్, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముప్పవరపు మురళీకృష్ణ, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ బాబురావు పాల్గొన్నారు. -
మూగబోయిన గళం.. ఆగిపోయిన కలం
విజయవాడ కల్చరల్: ఆ గళం మూగబోయింది.. ఆ కలం ఆగిపోయింది.. ఏడు దశాబ్దాల సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం ముగిసి పోయింది.. విజయవాడ నగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు, కాలమిస్ట్, గ్రంథ రచయిత పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన మృతి పాత్రికేయులతో పాటు, సాహితీ ప్రియుల్లో విషాదం నింపింది. నిన్నటి వరకూ సన్నిహితులతో సరదాగా మాట్లాడిన ఆయన ఆకస్మిక మరణాన్ని పాత్రికేయులు, సాహితీ ప్రియులు నమ్మలేకున్నారు. విజయవాడ నగరంలోని స్వర్గపురిలో సోమవారం సాయంత్రం తుర్లపాటికి ప్రముఖులు, సాహితీవేత్తలు, జర్నలిస్టుల అశృనయనాల మధ్య అంత్య క్రియలు జరిగాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణా జిల్లా పామర్రులో 1933 ఆగస్టు 10న తుర్లపాటి జన్మించారు. పత్రికా రంగంలో ఆయన ప్రస్థానం 1946లో తన 14వ ఏట ప్రారంభమైంది. పాత్రికేయునిగా ప్ర«ధాన మంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను సైతం తుర్లపాటి ఇంటర్వ్యూ చేశారు. దేశ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పి.వి.నరసింహారావుతో ఆయనుకు పరిచయాలున్నాయి. రాష్ట్రంలో రాజీవ్‌గాంధీ ప్రసంగాలకు తుర్లపాటి అనువాదకుడిగా వ్యవహరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు. అంతేకాదు రాష్ట్రపతులుగా సేవలందించిన వి.వి.గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలామ్లతో ఆయనకు పరిచయం ఉంది. సినిమా రంగంలో ప్రత్యేక ముద్ర తుర్లపాటి కుటుంబరావు జ్యోతిచిత్ర ఎడిటర్‌గా ఉన్నప్పుడు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తమ ఇంటర్వ్యూల కోసం తుర్లపాటి వద్ద సినీనటులు పడిగాపులు పడేవారని చెబుతారు. సినిమాల రిలీజ్ సమయంలో తమ సినిమా గురించి వ్యాసం రాయండంటూ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన వద్దకు క్యూ కట్టేవారు. అదే సమయంలో ముంబైలో జరిగే ఫిల్మ్‌ఫేర్ అవార్డుల తరహాలో తెలుగు సినిమా పరిశ్రమలో అవార్డులు ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఫిల్మ్‌ఫేమ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి, మంచి చిత్రాలకు అవార్డులను అందజేసేవారు. కాల క్రమేణా ప్రభుత్వం నంది అవార్డులను ప్రవేశ పెట్టడంతో అవి నిలిచిపోయాయి. 6 వేలకు పైగా జీవిత చరిత్రల వ్యాసాలు పాత్రికేయ కురువృద్ధునిగా పిలుచుకునే తుర్లపాటి వార్తల్లోని వ్యక్తిగత శీర్షిక ద్వారా ఆరు వేలకు పైగా జీవిత చరిత్రలను పరిచయం చేశారు. ఇలా దేశ ప్రధానులు, రాష్ట్రపతులు, ప్రముఖుల గురించి వ్యాసాలు రాశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల గురించి బుక్లెట్లను ప్రచురించారు. అవార్డులు.. రివార్డులెన్నో.. ఉపన్యాస కేసరి, దశ సహస్ర సభాకేసరి, ముట్నూరి కృష్ణారావు పాత్రికేయ పురస్కారం (1989), ఉత్తమ జీవిత చరిత్ర రచయిత పురస్కారం, (తెలుగు విశ్వవిద్యాలయం 1990), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అత్యధిక సభల్లో పాల్గొన్నందుకు 1993లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందారు. సభ ఏదైనా అధ్యక్ష స్థానం ఆయనదే.. విజయవాడ నగరంలో జరిగే సాహిత్య, రాజకీయ సభ ఏదైనా అధ్యక్ష స్థానంలో మాత్రం తుర్లపాటి ఉండేవారు. ఆ సభ నిర్వహించే అంశాలపై ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. అంశం ఏదైనా, సందర్భోచితంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే వారు. ఎన్నో విశేషాలను వివరిస్తూ, ఆ సభపై తనదైన ముద్ర వేసేవారు. ప్రకాశం పంతులు గారు రూ.5 బాకీ.. ప్రకాశం పంతులుకు కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఏదో సందర్భంలో ఆయనకు తుర్లపాటి రూ.5 ఇచ్చారట. తరువాత మరో సందర్భంగా ప్రకాశం ఎదురుపడ్డప్పుడు నాకు మీరు రూ.5 బాకీ. అవి ఎప్పుడిస్తారు? అని సరదాగా అడిగేవారని సన్నిహితులతో చెప్పేవారు. అక్కినేని నాగేశ్వరరావుకు నటసామ్రాట్ బిరుదు ప్రదానం చేసింది తుర్లపాటే. అక్కినేని నటజీవన ప్రస్థానంలో అత్యంత విలువైన బిరుదు నటసామ్రాట్‌ను తుర్లపాటి ప్రేరణతో విజయవాడలోనే ప్రదానం చేశారు. ఎన్టీఆర్ నటుడు కాదు.. గుంటూరులో ఎన్టీఆర్ నటించిన సినిమా శతదినోత్సవ సభలో ఆయన వేదిక మీదకు రాలేదు. తుర్లపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ నటుడు కాదు అని కొద్ది సమయం గ్యాప్ ఇచ్చారట. దీంతో జనం తుర్లపాటి మీదకు దాడికి వచ్చారట. అప్పుడు రామారావు నటుడు కాదు.. మహానటుడు అనడంతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారని తుర్లపాటి తన జీవిత చరిత్ర పుస్తకంలో రాసుకున్నారు. ఆంజనేయ స్వామి భక్తుడు తుర్లపాటి ఆంజనేయ స్వామి భక్తుడు. లబ్బీపేట సాయిబాబా ఆలయానికి ట్రస్ట్ బోర్డ్ సభ్యుడుగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన సలహాలు, సూచనలతోనే సంఘాలు నడిచేవి. రచయితల సంఘం సంతాపం కుటుంబరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య,చలపాక ప్రకాష్, నవ్యాంధ్ర రచయితల సంఘం కార్యదర్శి కలిమిశ్రీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి జీవీ పూర్ణచంద్ సంతాపం వ్యక్తం చేశారు ప్రముఖుల సంతాపం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థనరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు తుర్లపాటి పార్ధివ దేహాన్ని సందర్శించారు. వివిధ కళాసంస్థలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. -
ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉండవు: తెలకపల్లి రవి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని గతంలో హైకోర్టు చెప్పిందని.. ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉండవని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి తెలిపారు. గతంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా సరికాదన్నారు. నిమ్మగడ్డ కావాలనే ప్రతిష్టంభన వాతావరణం తీసుకొస్తున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్ వాస్తవిక దృక్పథాన్ని అవలంభించాలన్నారు. ఎస్ఈసీ సంఘర్షణలతో కాకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని తెలకపల్లి రవి సూచించారు.(చదవండి: చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) -
కరోనా: సీనియర్ వీడియో జర్నలిస్టు మృతి
సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి తమిళనాడులో సీనియర్ వీడియో జర్నలిస్టును బలితీసుకుంది. 15 రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వేల్ మురుగన్(41) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కన్నుమూశారు. దీంతో తోటి జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రారంభ రోజుల్లో ఫ్రెషర్లుగా మీడియా రంగంలోకి ప్రవేశించిన మిత్రులకు మురుగన్ ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. మురుగన్ అకాలమరణంపై స్పందించిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి జయకుమార్ 50 వేల రూపాయల సాయం ప్రకటించారు. మురుగన్ భార్య షణ్ముగ సుందరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మీడియా మిత్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (బజాజ్ ఆటో ప్లాంట్‌లో కరోనా కలకలం ) అటు డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ ట్విటర్ ద్వారా జర్నలిస్టు మరణంపై విచారాన్ని ప్రకటించారు. మీడియా జర్నలిస్టులు సేఫ్టీపై ప్రధానంగా దృష్టిపెట్టాలని కోరారు. మీడియాలో పనిచేసేవారు ఎంత జాగ్రత్తగా ఉండాలో మురుగన్ ఉదంతం తెలియజెప్పిందని ఎండిఎంకె నాయకుడు వైకో వ్యాఖ్యానించారు. మురుగన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతిని ప్రకటించారు. మీడియాలోని కామ్రేడ్లందరూ తీసుకోవలసిన భద్రతా చర్యలపై మీడియా సంస్థలు, ప్రభుత్వం మార్గ నిర్దేశనం చేయాలన్నారు. గత 20 సంవత్సరాలుగా వివిధ తమిళ టెలివిజన్ ఛానెళ్లలోవెల్ మురుగన్ కెమెరాపర్సన్‌గా పనిచేశారు. మురుగన్ కు భార్య, ఒక కుమారుడు ఉండగా, భార్య షణ్ముగ సుందరి ఆర్‌జీజీజీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తున్నారు. -
పాత్రికేయ ప్రముఖుడు ‘పొత్తూరి’ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: విలువలతో కూడిన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానంతో పాటు చివరి శ్వాస వరకు పౌరహక్కులు, బలహీనుల పక్షాన నిలిచిన సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఆయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చివరి కోరిక మేరకు మూడు రోజుల క్రితమే ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య సత్యవాణి, కుమారులు ప్రేమ్గోపాల్, రహీ ప్రకాష్, కుమార్తెలు వాత్సల్య, డాక్టర్ పద్మజ ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు జర్నలిస్టులు, పాత్రికేయ సంఘాల ప్రతినిధులు మాసబ్‌ట్యాంక్ విజయనగర్ కాలనీలోని ఆయన నివాసానికి వచ్చి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయనకు కుమారుడు గోపాల్ అంత్యక్రియలు నిర్వహించారు. సుదీర్ఘ పాత్రికేయ ప్రస్థానం గుంటూరు జిల్లా పొత్తూరులో 1934 ఫిబ్రవరి 8న జన్మించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. 1957లో తన సమీప బంధువైన బీవీ రాజు సారథ్యంలో వెలువడిన ఆంధ్రజనత పత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, ఉదయం పత్రికల్లో కీలక హోదాల్లో పనిచేశారు. జర్నలిజంలో విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఆయన తన అభీష్టానికి భిన్నంగా ఓ పత్రిక యాజమాన్యం ఒక వార్తను నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సంపాదక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 2005లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లోనూ పొత్తూరి ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన వ్యాసప్రభ, చింతన, నాటి పత్రికలు–మేటి విలువలు తదితర పుస్తకాలతో పాటు ‘విధి నా సారథి’ పేరుతో ఆత్మకథను రాశారు. పొత్తూరి ఓ మైలురాయి : గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సాక్షి, అమరావతి: సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సంతాపం వ్యక్తంచేశారు. ఐదు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా సమాజానికి సేవలందించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు పాత్రికేయరంగంలో మైలురాయి వంటివారని పేర్కొన్నారు. పత్రికారంగంలో పొత్తూరి సేవలు ఎనలేనివి: సీఎం వైఎస్ జగన్ సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు పాత్రికేయరంగంలో పొత్తూరి పాత్ర మరువలేనిదన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐదు దశాబ్ధాలకు పైగా పత్రికా రంగంలో సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. పొత్తూరి కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రముఖుల సంతాపం సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె.రామకృష్ణ, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు, కుర్తాళం సిద్దేశ్వరీ పీఠం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. -
పెద్దదిక్కు ‘పొత్తూరి’
నాలుగు అక్షరాలే కానీ, నాలుగు రాళ్ళు వెనకేసుకోలేని పరిస్థితి తెలుగు పత్రికారంగంలో గతంలో ఎక్కువగా ఉండేది. ఆదాయం తక్కువై శ్రమ ఎక్కువైనా, వేళాపాళా లేకపోయినా చాలామంది పత్రికారంగాన్ని పట్టుకుని వేళ్లాడడానికి కారణం, ఆ వృత్తిపట్ల ఆసక్తి, దాని విలువలపట్ల నిబద్ధతే. పొత్తూరి వెంకటేశ్వరరావు అలాంటి తరానికి చెందిన పాత్రికేయులు. ఆంధ్రజనత, ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ, ఉదయం పత్రికలలో సబ్–ఎడిటర్ నుంచి సంపాదకుని వరకు వివిధ హోదాలలో పనిచేసిన పొత్తూరిగారు పాత్రికేయ కులపతులలో ఒకరుగా పరిణమించి తదుపరి తరాలవారికి మార్గదర్శి అయ్యారు. ఆయన తొంభైల ప్రారంభంలోనే పదవీవిరమణ చేసినప్పటికీ ఆ తర్వాత కూడా ఏనాడూ కలం దించలేదు, నడుము వాల్చలేదు. మధ్యలో కొన్నేళ్లు ప్రెస్ అకాడెమీ ఛైర్మన్‌గా ఉన్నారు. ‘ఆంధ్రజాతి అక్షరసంపద తెలుగుపత్రికలు’ అనే పరిశోధనాత్మక గ్రంథం పత్రికారంగానికి వారిచ్చిన అమూల్యమైన కానుక. అలాగే, సామాజిక, రాజకీయ పరిణామాలను పట్టించుకున్నారు. డెబ్బై, ఎనభై దశకాలలో పత్రికారంగంలోకి వచ్చినవారిలో ఆయన దగ్గర తర్ఫీదైనవారు చాలామంది ఉన్నారు. వారి మృతి వారందరిలోనూ వారి జ్ఞాపకాలను రేపే విషాద సందర్భం. రామ్‌నాథ్ గోయెంకా సారథ్యంలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్–ఆంధ్రప్రభ గ్రూపులో పనిచేయడం వల్ల సంపాదకునిగా తన స్వేచ్ఛను ప్రకటించుకుని, తన ముద్రను స్థాపించుకునే అవకాశం పొత్తూరిగారికి లభిం చింది. గోయెంకా తన సంస్థలో దిద్దిన ఒరవడి అది. సంపాదకుల విధులు, విధానాలలో ఆయన జోక్యం చేసుకునేవారు కాదు, ఇంకొకరిని చేసుకొనిచ్చేవారు కాదు. ఎందులోనైనా సంపాదకునిదే తుదిమాట కావాలని శాసించేవారు. పత్రిక విధానాన్ని రూపొందించుకునే తన స్వేచ్ఛను యజమాని ప్రశ్నిస్తున్నారని పొత్తూరిగారు శంకించి రాజీనామా చేయడం, ఒక పాఠకునిగా నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ నాకు లేదా అని గోయెంకా ప్రశ్నిస్తూ రాజీనామాను చించి చెత్తబుట్టలో వేయడం ఒకటి రెండుసార్లు సంభవించాయి. ‘విధి నా సారథి’ పేరుతో తను రచించిన ఆత్మ కథలో పొత్తూరి తెలిపిన ఇలాంటి ఉదంతాలు సంపాదకునికీ–యజమానికీ మధ్య ఉండాల్సిన ఆదర్శబంధాన్ని వెల్లడిస్తాయి. సంపాదకునిగా పొత్తూరిగారు చాలా విషయాలలో చాలా ఉదారవాదిగా వ్యవహరించేవారు. సిబ్బందిని నియమించుకోవడంలో అది స్పష్టంగా కనిపించేది. అతివాదులు, మితవాదులు, మతవాదులు, మధ్యేవాదులతో సహా అన్ని రకాల ఆలోచనాపంథాల వారికీ; అన్ని సామాజికవర్గాల వారికీ పత్రికలో చోటు ఇచ్చేవారు. ప్రోత్సాహం, పదోన్నతి అందించడంలో సామర్థ్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన అవకాశంతో ప్రతిభకు సానపెట్టుకుని తర్వాతి కాలంలో ఎందరో సంపాదకులు, బ్యూరో చీఫ్‌లు అయ్యారు. నాటి నార్ల వేంకటేశ్వరరావుగారిలా నీలం రాజు వెంకటశేషయ్యగారిలా ఆంధ్రప్రభ దినపత్రిక, వారపత్రికలు రెండింటికీ సంపాదకత్వం వహించే అవకాశం పొత్తూరిగారికి కూడా లభించింది. వారపత్రిక సంపాదకీయ రచనలో విషయ సేకరణకు ఎంతో సమయం వెచ్చించి, ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. దాంతో అవి సాహిత్యపు విలువను సంతరించుకునేవి. వారపత్రిక సంపాదకీయమైనా, దినపత్రిక సంపాదకీయమైనా చెప్పదలచుకున్న అంశాన్ని సరళమైన భాషలో, చిన్న చిన్న మాటలలో చెప్పడం ఆయన శైలి. సంపాదకీయాన్ని విధిగా మరొకరి చేత చదివించిగానీ పత్రికలో పెట్టించేవారు కాదు. చదివిన వ్యక్తి ఎక్కడైనా సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు తను రాసింది సక్రమమే అనుకున్నా సరే సవరించడానికి వెనుకాడేవారు కాదు. మనం రాసేది పాఠకునిలో ఎలాంటి సందేహాలకు, అస్పష్టతకు తావు ఇవ్వకూడదనేవారు. పొత్తూరిగారి తరంలో, అంతకుముందు తరంలో సంపాదకుని విధి పత్రికా నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. రాజకీయ, సామాజిక రంగాలతో సహా వివిధ రంగాలకు వారి సలహాలు, సూచనలు అవసరమయ్యేవి. అది సంపాదకునిపై అదనపు బాధ్యత అయ్యేది. పొత్తూరిగారి వృత్తిజీవితంలోనూ అలాంటి ఘట్టాలు అనేకం ఉన్నాయి. ఆత్మకథలో వాటిని పొందుపరచుకున్నారు. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలను ఫలప్రదం చేయడానికి కృషిచేసిన ప్రముఖులలో పొత్తూరి ఒకరు. తను ఆంధ్ర ప్రాంతానికి చెందినా, తెలంగాణ జిల్లాల్లో అనేకసార్లు పర్యటించిన పాత్రికేయునిగా ఇక్కడ ప్రత్యేక రాష్ట్రవాదం ఎంత బలంగా ఉందో గుర్తించి మొదటినుంచీ తెలంగాణ ఏర్పాటును బలంగా కోరుతూవచ్చిన ప్రజాస్వామికవాది ఆయన. అర్థశతాబ్దికి పైగా తెలుగువారి చరిత్రతో తన జీవితాన్ని పెనవేసుకున్న అక్షర సంపాదకుడు ఆయన. - కల్లూరి భాస్కరం వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్ : 97034 45985 -
సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ఆత్మహత్య
పంజగుట్ట : సీనియర్ జర్నలిస్టు, రచయిత వడ్డాలపు ప్రభాకర్ (43) హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో కుమారునితో కలిసి ఉంటున్న ఆయన శనివారం రాత్రి 7 గంటలకు ఇంట్లో నుండి బయల్దేరి ఎనిమిదిన్నరకు సెల్‌ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నారు.అయితే ఆయన నేరుగా ఆఫీస్‌కు వెళ్లకపోవటం, రాత్రి రెండు గంటలు దాటినా ఇంటికి రాకపోవటంతో ఆయన కుమారుడు శిల్పి ఆదివారం తెల్లవారుజామున పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యాపారులు హుస్సేన్‌సాగర్‌లో ఓ గుర్తు తెలియని శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు జేబుల్లో లభించిన సెల్‌ఫోన్, గుర్తింపు కార్డు ఆధారంగా ప్రభాకర్‌ను గుర్తించారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో బాధపడుతున్నందునే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రభాకర్ పలు టీవీ చానళ్లతో పాటు, బస్తీ సినిమాకు మాటల రచయితగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ‘సాక్షి’దినపత్రికలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ప్రభాకర్ మరణంపై ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ వర్ధెల్లి మురళి సంతాపం వ్యక్తం చేశారు. నేడు స్వస్థలానికి భౌతిక కాయం గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచిన ప్రభాకర్ భౌతికకాయాన్ని పలువురు జర్నలిస్టులు సందర్శించి సంతా పం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి నివాళి అర్పించారు. సోమవారం ఉదయం కుటుంబీకుల సమక్షంలో పోస్ట్‌మార్టం నిర్వహించి ఆయన స్వస్థలం కేసము ద్రం మండలం కల్లెడకు తరలిస్తారు. -
సీనియర్ జర్నలిస్టు కన్నుమూత
సాక్షి, ముంబై : ప్రముఖ, సీనియర్ జర్నలిస్ట్ నీల్‌కంఠ్ ఖాదిల్కర్ (85) అనారోగ్యంతో కన్నుముశారు. సబర్బన్ బాంద్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన శుక్రవారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మరాఠీ వార్తాపత్రిక ‘నవకాల్’ కు సంపాదకుడిగా 27 సంవత్సరాలుగా తన విశేష సేవలందిస్తున్నారు. తన పదునైన సంపాదకీయాలతో ప్రజాదరణ పొందారు. "ప్రాక్టికల్ సోషలిజం’’, ‘‘రష్యా పర్యటన విశేషాలు" లాంటి పుస్తకాలను ఆయన రచించారు. పద్మశ్రీ జీ జీ జాదవ్ మెమోరియల్ అవార్డు తీసుకుంటున్న నీల్‌కంఠ్ ఖాదిల్కర్ (ఫైల్ ఫోటో) -
స్వచ్ఛమైన అక్షరం..స్నేహమయ వ్యక్తిత్వం
ఆదర్శాలు మాట్లాడటం వేరు. ఆదర్శంగా జీవించడం వేరు. ఆదర్శంగా జీవిస్తూ ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకుండా అదేం పెద్ద గొప్ప కాదు అన్నట్టుగా మరింత గొప్పగా జీవించడం వేరు. రాఘవాచారి ఆ గొప్పతనం ఉన్న గొప్పమనిషి. చక్రవర్తుల రాఘవాచారి అంటే ఎవరూ గుర్తుపట్టరు. సి.రాఘవాచారి అనగానే ఆ తెల్లటి స్వచ్ఛమైన రూపం గుర్తుకు వస్తుంది. పాత్రికేయుడిగా బహు సుపరిచితుడు. కాని వ్యక్తిగా రాఘవాచారిని పరిచయం చేయడమే చాలా కష్టం. ఒక అమృత హృదయుడి గురించి పరిచయం చేయడానికి మనకు అర్హత ఉందా లేదా అని అంతరాత్మ తప్పనిసరిగా మథన పడుతుంది. తుది శ్వాస వరకు రాఘవాచారి కమ్యూనిస్టుగానే నిరాడంబరంగా జీవించి, ఆదర్శంగా నిలిచారు. స్థితప్రజ్ఞత, పూర్వభాషణం, మృదుభాషణం ఆయన లక్షణాలు. రాఘవాచారి గారిది ఆదర్శ వివాహం. బాల్యంలో శ్రీవైష్ణవానికి అనుగుణంగా త్రికాల సంధ్యావదనం చేశారు. వైష్ణవ నామాలు, వెనకాల పిలక, పంచెకట్టు, చేతులకు శంఖుచక్రాలు వేయించుకున్నారు. అంతటి నిష్ఠాగరిష్టులైన రాఘవాచారి డిగ్రీ చదువుతుండగా కమ్యూనిజానికి ప్రభావితులయ్యారు. తన ఆలోచనలను మార్చుకున్నారు. పేరు మార్చుకోవలసిన అవసరం ఏముంది? ఆచారి అని ఉంచుకుంటే మాత్రమేం ఆలోచన, ఆచరణలో ఆ పేరు తనకు ఆటంకం కాబోదు కదా అనుకున్నారు. రాఘవాచారి అజాత శత్రువు, ఎవ్వరినీ విమర్శించరు. ఆయనతో మాట్లాడుతుంటే ఒక గ్రంధాలయమంతా కలియతిరిగిన భావన కలుగుతుంది. రాఘవాచారికి ఇద్దరు ఆడ పిల్లలు. 1990 ఆగస్టులో రెండో అమ్మాయి ప్రమాదవశాత్తు మరణించింది. ఆ సమయంలో రాఘవాచారి నిబ్బరంగా కూర్చోవడం చూసి ఆయనతో ‘అమ్మాయి పోయింది కదా!’ అని అడిగితే, ‘బతికుంటే బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేది’ అన్నారే కాని ‘విధి నా మీద పగబూనింది’ లాంటి చిన్న మాటలు ఆయన నోటి నుంచి రాలేదు. ఇది ఇలా ఉంటే, రాఘవాచారికి అత్యంత ఆత్మీయుడైన రేడియో దిగ్గజం ఉషశ్రీ సెప్టెంబరు 7, 1990 లో కన్ను మూశారు. అప్పటికి రాఘవాచారి అమ్మాయి పోయి పూర్తిగా నెల కూడా కాలేదు. ఉషశ్రీ హైదరాబాదు ఆసుపత్రిలో గతించే సమయానికి విజయవాడలోని ఉషశ్రీ ఇంట్లో ఆయన తల్లి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. టీవీలో వార్తలలో అకస్మాత్తుగా తండ్రి గతించిన వార్త చూస్తే పిల్లలు ఏమైపోతారో ఏమోనని రాఘవాచారి సతీమణి జ్యోత్స ్న గబగబ ఉషశ్రీ ఇంటికి చేరి విషయం చెప్పారు. ఒక పక్కన తండ్రి పోయినందుకు బాధపడాలో, కూతురు పోయిన బాధలో కూడా ఉషశ్రీ కూతుళ్ల గురించి ఆలోచించిన ఆయన విజ్ఞతకు చేతులెత్తి నమస్కరించాలో తెలియదు. ఉషశ్రీ, రాఘవాచారిది విచిత్రమైన అనుబంధం. ఉషశ్రీ రిటైరయ్యాక, మధ్యాహ్నం భోజనం చేశాక, నిద్ర మధ్యలో లేపద్దని చెప్పి నిద్రపోయేవారు. సరిగ్గా అదే సమయానికి రాఘవాచారి విశాలాంధ్ర ఆఫీసులో ఎడిటోరియల్ పూర్తి చేసి ఐదో నెంబరు బస్సు దిగి, ఉషశ్రీ ఇంటి మీదుగా ఇల్లు చేరుకునేవారు. తప్పనిసరిగా ఉషశ్రీ ఇంటి దగ్గర ఆగి మంచి నీళ్లు తాగి ఉషశ్రీతో కొద్దిసేపు చర్చించి వెళ్లేవారు. ఆయన వస్తే, మాత్రం తప్పకుండా నిద్ర లేపమనేవారు. ఇద్దరూ శ్వేతవస్త్రాలే ధరించడం, ఇద్దరివీ కమ్యూనిస్టు భావాలే కావడం, ఇద్దరికీ సాహిత్య చర్చలంటే ఇష్టం కావడంతో, వీరిద్దరి మధ్య అనుబంధం సన్నని లతలా పెనవేసుకున్నట్లు కూడా తెలియనంత గాఢంగా పెనవేసుకుంది. వారిద్దరూ మార్నింగ్ వాక్ చేస్తుంటే చూసినవారంతా వేదవ్యాస్, కార్ల్ మార్క్స్ అనుకునేవారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకునేవారు. ఉషశ్రీ గతించి మూడు దశాబ్దాలు అవుతున్నా రాఘవాచారి తుదిశ్వాస వరకూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని పెనవేసుకునే ఉన్నారు. తామరాకు మీద నీటిబొట్టు అనే మాట రాఘవాచారికి అన్వయించినట్లుగా మరొకరికి పొసగదు. రాఘవాచారి ఎంత సామాన్యంగా జీవిస్తారో ఒకరు చెప్పవలసిన పని లేదు. ఒక పత్రికకు అతి చిన్న వయసులో ఎడిటర్ అయ్యి, అదే పత్రికకు మూడు దశాబ్దాల పాటు అతి తక్కువ జీతానికి ఎడిటర్‌గా పనిచేసిన ఒకే ఒక్క జర్నలిస్టు బహుశా రాఘవాచారి మాత్రమేనేమో. విజయవాడలో 16 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉండి, ఆ తరవాత సొంత ఇల్లు కట్టుకుని, అక్కడ 16 సంవత్సరాలు ఉన్నాక, కొన్ని కారణాల వల్ల ఇల్లు అమ్మేశారు. ‘మీకు బాధగా లేదా’ అని ఎవరో ప్రశ్నిస్తే, స్వచ్ఛమైన చిరునవ్వులు నిండిన పెదవులతో, ‘ఏముంది షోడశ సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నాను. మరో షోడశ కాలం సొంత ఇంట్లో ఉన్నాను. మళ్లీ అద్దె ఇంట్లో ఎంతకాలమంటే అంత కాలం’ అని నిజాయితీగా అనేవారు. అసంతృప్తికి అర్థం తెలియదు రాఘవాచారికి. ఆయనకు అనారోగ్యమని తెలిసి ఎవరైనా పలకరించడానికి వెళితే ఆయన తన అనారోగ్య విషయం తప్ప మిగిలిన ఎన్నో విజ్ఞానదాయక విషయాలు మాట్లాడేవారు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, మార్క్సిజం, న్యాయశాస్త్రం, స్టాటిస్టిక్స్... అన్ని అంశాల మీద తడబాటు లేకుండా మాట్లాడగలిగిన శక్తి రాఘవాచారికి ఎక్కడ నుంచి వచ్చిందో మరి. ఆయనకు పెద్దచిన్న తారతమ్యం తెలియదు. మానవులంతా ఒకటే అనే ఆత్మ కలిగిన రాఘవాచారి రాజకీయనాయకుడిని, రిక్షా తొక్కుకునే వ్యక్తిని, టీ అమ్ముకునే కుర్రవాడిని అందరినీ సమదృష్టితో పలకరించేవారు. – వైజయంతి -
ప్రముఖ సంపాదకుడు రాఘవాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సంపాదకుడు, సాహితీవేత్త, కమ్యూనిస్టు నేత చక్రవర్తుల రాఘవాచారి (80) కన్నుమూశారు. కిడ్నీక్యాన్సర్తో ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో నెలక్రితం చికిత్సకోసం చేరారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. ఉదయం 7గంటల సమయంలో ఆయన భౌతికకాయాన్ని హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూం భవన్లో ఉంచారు. అక్కడ ఆత్మీయులు, ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం విజయవాడకు తరలించారు. రాఘవాచారికి భార్య జ్యోత్న్స, కుమార్తె డాక్టర్ సి.అనుపమ ఉన్నారు. విశాలాంధ్ర సంపాదకునిగా 33 ఏళ్లు రాఘవాచారి వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాంతాపురానికి చెందిన వరదాచారి, కనకమ్మ దంపతులకు 1939 సెప్టెంబర్ 10న జన్మించారు. నిబద్ధత, విలువలతో కూడిన జర్నలిజానికి మారుపేరుగా నిలిచారు.ప్రాథమిక, కళాశాల విద్యాభ్యాసం వరంగల్‌లోనే పూర్తి చేశారు. హైదరాబాద్‌లో లా చదివారు.ఆయనకు విజ్ఞాన నిఘంటువుగాను, మేధావిగాను ఎనలేని గుర్తింపు ఉంది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్ధి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. 33 ఏళ్ల పాటు విశాలాంధ్ర పత్రిక సంపాదకునిగా బాధ్యతలు నిర్వర్తించిన రాఘవాచారి..సీపీఐ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యునిగా వ్యవహరించారు. 1972లో విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2005 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఢిల్లీ నుంచి వెలువడే ‘పేట్రియట్’దినపత్రిక, లింక్ వార పత్రికలకు ఆయన హైదరాబాద్ పాత్రికేయునిగా పనిచేశారు. కొద్దికాలం ఢిల్లీలో కూడా పనిచేశారు. పార్టీ కార్యకలాపాల్లో పరిచయమైన విజయవాడకు చెందిన జ్యోత్స్నను ఆయన 1969లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. రాఘవాచారి భౌతికకాయం వద్ద విషణ్న వదనాలతో కుటుంబ సభ్యులు ఏడేళ్ల కిందటే కిడ్నీ క్యాన్సర్.. ఏడేళ్ల క్రితం రాఘవాచారి కిడ్నీ క్యాన్సర్‌తో అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అస్వస్థతలో ఉన్నప్పటికీ ఆయన సమకాలీన అంశాలపై పూర్తి అవగాహనతో ఉండేవారు. ఇటీవల కిడ్నీ క్యాన్సర్ తిరగబెట్టడంతో తన కుమార్తె అనుపమ వైద్యురాలిగా పనిచేస్తున్న ఆసుపత్రిలోనే చికిత్సకు చేరారు.అక్కడే తుదిశ్వాస విడిచారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్తగా ఆయన సాగించిన జీవితం ఆదర్శ ప్రాయమన్నారు.కుటుంబ సభ్యులు, సహచరులకు సానుభూతి తెలిపారు.అదేవిధంగా సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఐ అగ్రనేత సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రముఖ పరిశోధకుడు, కవి జయధీర్ తిరుమలరావు రాఘవాచారి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. రాఘవాచారి సేవలు మరువలేనివి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రాఘవాచారి విలువల ఆధారిత జర్నలిజాన్ని విశ్వసించారని కొనియాడారు. తెలుగు పాత్రికేయ రంగంలో రాఘవాచారి చేసిన సేవలు మరువలేనివని శ్లాఘించారు. ఆయన రచనలు నేటి తరానికి ప్రేరణగా నిలుస్తాయరు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాఘవాచారి భౌతికకాయాన్ని అంబులెన్స్‌లోకి తీసుకువెళ్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు -
జర్నలిస్టులలో దీపధారి–రాఘవాచారి
ఎనభై సంవత్సరాలు నిండిన జీవితంలో అరవై సంవత్సరాల ప్రజా జీవితం, అందులో నలభై సంవత్సరాల పాత్రికేయ జీవితం గడిపి, విలువలతో, విద్వత్తుతో, విస్పష్టమైన దృక్పథంతో, ప్రపంచం పట్ల అపారమైన ప్రేమతో అజాత శత్రువుగా జీవించి సోమవారం ఉదయం హైదరాబాద్‌లో మరణించిన చక్రవర్తుల రాఘవాచారి (సెప్టెంబర్ 10, 1939 – అక్టోబర్ 28, 2019) జీవితమూ, కృషీ, ప్రవర్తన ఉదాహరణప్రాయమైనవి, ఆదర్శప్రాయమైనవి. పాత వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో సంపన్న భూస్వామ్య శ్రీవైష్ణవ కుటుంబంలో చక్రవర్తుల వెంకట వరదాచార్యులు, కనకవల్లి దంపతుల సంతానంలో చివరివాడుగా జన్మించిన రాఘవాచారి కుటుంబ ఆచారాన్ని అనుసరించి ఇంట్లోనే సంస్కృతం, ఉర్దూ, తెలుగు, తమిళం చదువుకున్నారు. మతాచార పరులైనప్పటికీ కుటుంబానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పట్ల సానుభూతి ఉండడం, గెరిల్లాలకు ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం, సమీప బంధువు ఒకరు గెరిల్లాగా పనిచేస్తూ పోలీసు కాల్పుల్లో చనిపోవడం ఆయన తొమ్మిది, పదేళ్ల వయసు నాటికే కలిగిన అనుభవాలు. పాఠశాల విద్య హనుమకొండలో, పీయూసీ హైదరాబాదులో చదివి, బీఎస్సీ కోసం 1957లో వరంగల్ ఆర్ట్స్ కాలేజి చేరేనాటికే ఆయనలో వామపక్ష భావాలు బలపడ్డాయి. అక్కడే కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా కూడా ఉండి, ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం చదవడానికి వచ్చేసరికి ఆయన అప్పటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. కులాచారపరంగా వేదాధ్యయనమూ ఉపనయనమూ జరిగి, తొమ్మిదో ఏటి నుంచి పద్దెనిమిదో ఏటి దాకా పూజా పునస్కారాలు చేసిన వ్యక్తే, జంధ్యం ధరించిన వ్యక్తే ఒకటొకటిగా వాటన్నిటినీ వదిలేశారు. ఆ వదిలేయడం కూడా ఏదో ఉద్వేగం కొద్దీ కాదు, క్రమక్రమంగా అధ్యయనంతో దృక్పథం బలోపేతమవుతుండగా కమ్యూనిస్టుగా మారి 1960 నాటికి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అలా బ్రాహ్మణ భూస్వామ్య విలువల్లో పుట్టి పెరిగి, తనలో తాను సంఘర్షణతో, ప్రశ్నలతో, చర్చలతో, అధ్యయనంతో ప్రజానుకూల ప్రగతిశీల వామపక్ష అభిప్రాయాలు పెంపొందించుకుని కొత్త విలు వల కమ్యూనిస్టు కార్యకర్తగా మారారు. ఆ విలువలతోనే అరవై ఏళ్లకు పైగా జీవించారు. ఉద్వేగంతో కొన్ని విలువలు ఏర్పడతాయి, కానీ అధ్యయనంతో వాటిని స్థిరపరచుకోవాలి అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ ప్రయాణం సులభంగా సాగిందేమీ కాదు. చదువుకున్న న్యాయశాస్త్ర విద్యతో న్యాయవాదిగా మారి ఉంటే ఏమై ఉండేవారో తెలియదు గానీ, డిగ్రీ రోజుల నుంచే సామాజిక విషయాల మీద రచన అలవాటు ఉండడంతో పత్రికారచనలోకి వచ్చారు. పార్టీ చీలిక సందర్భంగా మొహిత్ సేన్, తానూ కలిసి రాఘవాచారిని న్యాయవాద వృత్తి ఆలోచన నుంచి తప్పించి విశాలాంధ్రలోకి తీసుకువచ్చామని సంస్మరణ సభలో కందిమళ్ళ ప్రతాపరెడ్డి అన్నారు. అలా ఆయన 1965లో విశాలాంధ్ర దినపత్రికలో విలేకరిగా చేరడం న్యాయవ్యవస్థకు జరిగిన నష్టమేమో గాని, తెలుగులో వామపక్ష పత్రికా రచనకు అందిన అద్భుతమైన కానుక. అప్పటికే ఆయనకు ఇంగ్లిష్ రచనలో కూడా ప్రావీణ్యం ఉండడంతో పేట్రియట్, లింక్ పత్రికలకు హైదరాబాద్ లోనూ, ఢిల్లీలోనూ కూడా కరెస్పాండెంట్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టు ఉద్యమ నిర్మాణంలో పనిచేశారు. విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకుడిగా 1972 నుంచి 2000 వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పని చేసి, అతి ఎక్కువ కాలం సంపాదకుడిగా ఉన్న ఏకైక వ్యక్తి అయ్యారు. ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఆయన రాసిన వేలాది సంపాదకీయాలతో పాటు, తీర్చిదిద్దిన పాత్రికేయులు వందల మంది ఉన్నారు. విశాలాంధ్ర ఒక కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక గనుక పత్రికా రచన చరిత్రలో దానికి, సంపాదకుడిగా రాఘవాచారిగారికి దక్కవలసిన స్థానం దక్కకపోయినా, ఆయన వ్యక్తిత్వంలోని ఇతర ప్రభావశీల అంశాలు ఆయనను అపురూపమైన తెలుగు మేధావిగా నిర్ధారించాయి. ఆయన ఒక గొప్ప ఉపన్యాసకుడు. విషయం ఏదైనా, సభా నిర్వాహకులెవరైనా, కొన్నిసార్లు ఆయన భావాలను వ్యతిరేకించేవారైనా ఆయన ఉపన్యాసకుడిగా ఉండాలని కోరుకునేవారు. ఆయన ఉపన్యాసమంటే ఒక ప్రవాహంలా సాగేదేమీ కాదు, నింపాదిగా సాగుతున్నట్టే ఉండేది. కానీ హాస్యం, చమత్కారం, విద్వత్తు నిండిన ఆయన ఉపన్యాసం ఎంతసేపు సాగినా వినాలనిపించేట్టు ఉండేది. అది ఐదు పది నిమిషాల చిన్న ఉపన్యాసమైనా, గంటకు పైగా వివరంగా సాగే ఉపన్యాసమైనా అందులో ఇంగ్లిష్, ఉర్దూ, సంస్కృతం, తెలుగు సాహిత్యాల నుంచీ, సమాజం నుంచీ ఎన్నో ఉటంకింపులు ఉండేవి. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు ఆయన జ్ఞాపకశక్తి విస్తారమైనది. ఉటంకింపులు షేక్ స్పియర్వి అయినా, కాళిదాసువైనా, మార్క్స్, లెనిన్లవి అయినా, గాంధీవైనా ఉపన్యాసం మధ్యలో, తెచ్చిపెట్టుకున్నట్టుగా కూడా కాకుండా, చాలా సహజంగా, అనివార్యంగా వచ్చినట్టుగా ఇమిడిపోయేవి. శ్రోతలకు తెలియని సమాచారం, తెలిసిన సమాచారంలోనే కొత్త కోణాలు, అతి సులభమైన, వివరమైన పద్ధతిలో ఉండేవి. అందువల్ల విజయవాడలో ఆయన ఉపన్యాసం లేకుండా జరిగిన సభలు అరుదు. ఆయన శ్రోతగా వచ్చి కూచున్నా మాట్లాడమని పిలిచిన సందర్భాలెన్నో. అన్నిటికీ మించి ఆయన ఒక అద్భుతమైన మానవీయమైన మనిషి. అంత జ్ఞానసంపన్నుడై కూడా అత్యంత నిరాడంబరంగా, అందరితోనూ ఆప్యాయంగా ఉండేవారు. నడుస్తున్న గ్రంథాలయంగా, విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకుని కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపేవారు. తనకన్న ముప్ఫై నలభై సంవత్సరాల చిన్నవారితో కూడా గౌరవంగా ప్రవర్తించేవారు. పూర్తిగా వ్యతిరేకమైన భావజాలం ఉన్నవారి నుంచి కూడా గౌరవాద రాలు పొందిన అజాతశత్రువు. నలభై సంవత్సరాలుగా నాకు తెలిసి ఆయన ఆహార్యం తెల్లని మల్లెపూవు లాంటి దుస్తులే. ఆహార్యంలో మాత్రమే కాదు ఆయన హృదయంలోనూ, మానవ సంబంధాలలోనూ అటువంటి స్వచ్ఛమైన మల్లెపూల సుగంధాన్నే నింపుకున్నారు. వందల సంపుటాల ఉద్గ్రంథం లాంటి జ్ఞానసంపదను మల్లెపూల పరిమళంలా వ్యక్తిగత సంభాషణల్లోనూ, సభల్లోనూ వెదజల్లారు. ఎన్ వేణుగోపాల్ వ్యాసకర్త వీక్షణం పత్రిక సంపాదకులు మొబైల్: 98485 77028 -
సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత
-
సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవాచారి హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన భౌతికకాయాన్ని మఖ్ధుమ్ భవన్‌కు తరలించారు. రాఘవాచారి పార్థివ దేహానికి సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. అలాగే ఆయన మృతిపట్ల సీపీఐ నేత రామకృష్ణ, విశాలాంధ్ర గౌరవ చైర్మన్ ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. అనంతరం విశాలాంధ్ర కార్యాలయానికి తరలిస్తారు. రాఘవాచారి స్వస్థలం వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం. 1939 సెప్టెంబరు 10వ తేదీన ఆయన జన్మించారు. నిబద్దత కలిగి, విలువలకు జీవితాంతం కట్టుబడిన కమ్యూనిస్టుగా విజ్ఞానఖనిగా రాఘవాచారి పేరుగాంచారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు. 33 ఏళ్లుపాటు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. రాఘవాచారి మృతిపట్ల సీఎం వైఎస్ జగన్ సంతాపం పాత్రికేయులు రాఘవాచారి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. జర్నలిజం వృత్తిలో విలువల కోసం ఆయన కృషి చేశారని, రాబోయే తరాలకు రాఘవాచారి రచనలు స్ఫుర్తిదాయకమన్నారు. తెలుగు జర్నలిజంలో రాఘవాచారి చేసిన సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు. రాఘవాచారి ఎందరికో ఆదర్శంగా నిల్చారని పేర్కొన్నారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా రాఘవాచారి మృతికి సంతాపం తెలిపారు. ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని...రాఘవాచారి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాఘవాచారి మృతికి సంతపం వ్యక్తం చేశారు. -
పత్రికా చక్రవర్తి రాఘవాచారి
తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండితుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజా యితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మిం చారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు, ప్రాచీన కావ్యాలు, రామాయణ మహాభారతాలు చదివారు. ఆయనకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ నేర్పడానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. సంస్కృతం నేర్చుకోవడానికి ఆయనను ఆంధ్ర ప్రాంతంలోని పొన్నూరు పంపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో జన్మించిన రాఘవాచారి సికింద్రాబాద్ సమీపంలోని లాలాగూడ రైల్వే పాఠశాలలో 11వ ఏట అయిదో తరగతిలో చేరారు. 1953 నుంచి రాఘవాచారి విశాలాంధ్ర చదవడం ప్రారంభించారు. నిజాం కళాశాలలో పి.యు.సి.లో చేరిన తరువాత పిలక తీసేశారు. పి.యు.సి.లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతటిలో ఆరవ ర్యాంకు సాధిం చారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కానీ ఇంజనీరింగు రెండో సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయనకు చదువు మీద ఆసక్తి తగ్గింది. వరంగల్ వెళ్లి బీఎస్సీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో చేరారు. కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. పట్టభద్రుడైన తరువాత హైదరాబాద్ వచ్చి న్యాయశాస్త్రం అభ్యసించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధిగా లా కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానానికి పోటీ చేశారు. అప్పుడు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఇంగ్లిష్ చదువుతున్న ఎస్. జైపాల్ రెడ్డి వంటి వారు తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసినా రాఘవాచారి అఖండ విజ యం సాధించారు. న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత ఎల్.ఎల్.ఎం. చేశారు. 1969–71 మధ్య ఆయన ఢిల్లీ నుంచి వెలువడే వామపక్ష అనుకూల పేట్రియట్ ఇంగ్లిష్ పత్రిక విలేకరిగా పని చేశారు. 1971లో ఆయన విజయవాడ వెళ్లి విశాలాంధ్రలో చేరారు. కొద్ది కాలానికే ఆ పత్రికకు సంపాదకులయ్యారు. 28 ఏళ్ల సుదీర్ఘ కాలం విశాలాంధ్ర సంపాదకులుగా ఉన్నారు. ఆయన సంపాదకీయాలు సూటిగా, స్పష్టంగా ఉండేవి. స్పష్టత, సంక్షిప్తత ఆయన శైలి. ‘తెలుగు పత్రికల పరిణామం–ప్రయోగాలు–ప్రయోజనం‘ అన్న వ్యాసంలో తెలుగు పత్రికా రంగంలో వాడే భాష ప్రామాణీకరణ జరగలేదని విచారం వ్యక్తం చేశారు. విజయవాడలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉపన్యాసకుడిగా ఆయనను ఆహ్వానించే వారు. ఆయన మాటల్లో అడుగడుగునా వ్యంగ్యం తొణికిసలాడుతుంది. ఆయన గొప్పవాడిగా కనిపించే ప్రయత్నం ఎన్నడూ చేయరు. మేధావిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉన్నా ఎనిమిది పదుల వయసు నిండిన రాఘవాచారిలో కలివిడితనం తగ్గలేదు. ఆయనతో మాట్లాడిన వారు ఎవరైనా ఆయన జ్ఞాన విస్తృతి చూసి ముచ్చ టపడతారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్న రాఘవాచారి నిస్సందేహంగా మేధావి అయిన సంపాదకుడే. (రాఘవాచారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా..) వ్యాసకర్త: చెన్నమనేని రాజేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు -
ఏపీ భవన్ ఓఎస్డీగా అరవింద్ నియామకం
ఢిల్లీ: ఏపీ భవన్ మీడియా వ్యవహారాల ఓఎస్డీగా సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారిక జీవో విడుదల చేశారు. మీడియా రంగంలో 24 ఏళ్లుగా విశేష సేవలందించిన అరవింద్ యాదవ్ ఇక మీదట ఏపీ భవన్ కేంద్రంగా విధులు నిర్వర్తించనున్నారు. ఆయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ మీడియా సంస్థలలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. జాతీయ మీడియా సంస్థలు ఆజ్ తక్, ఐబిఎన్ 7లో దక్షిణ భారత వ్యవహారాల పాత్రికేయుడిగా పని చేశారు. టీవీ9, సాక్షి, యువర్ స్టోరీ మీడియాల్లోనూ కీలక బాధ్యతలు చేపట్టారు. అరవింద్ పలు హిందీ పుస్తకాలను రచించారు. -
విసిగిపోయాను..అందుకే ఇలా..
సాక్షి, మహబూబాబాద్ : వారసత్వంగా తనకు వచ్చిన భూమిని వేరే వారికి ధారాదత్తం చేశారనే ఆవేదనతో ఓ సీనియర్ జర్నలిస్టు వినూత్న నిరసన చేపట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తన సొంత భూమిలో భుజాల వరకు మట్టిలో ఉంటూ 72 గంటల పాటు నిరసనకు దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మారెడ్డి నాగేందర్ రెడ్డి గత 22 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనకు చెందిన భూమిని కొంతమంది అవినీతి అధికారులు ఏకపక్షంగా రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తూ మంగళవారం శాంతియుత దీక్షకు దిగారు. ఈ సందర్భంగా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో తమ తాతల నుంచి సంక్రమించిన భూమిని.. తమ ప్రమేయం లేకుండా అధికారులు ఇతరులకు ధారాధత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...‘ మా నాన్న మారెడ్డి అప్పిరెడ్డి చనిపోయిన తరువాత రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే....2012-13లో అక్రమంగా ఆర్వోఆర్ చేసినట్లు గుర్తించాను. ఏడాదిన్నర నుంచి పోరాటం చేస్తున్నాను. రెవెన్యూ అధికారుల ధన దాహనికి నాతో పాటు వందలాది మంది రైతులు దగా పడ్డారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ను ఆధారాలతో సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎవరికి వారు ఉచిత సలహాలు ఇచ్చారు తప్ప రికార్డులను మార్చిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేదు. అవినీతి అధికారుల వలన రెండు సంవత్సరాల నుంచి రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందలేకపోయాను. వారు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించారు అని వాపోయారు. విసిగిపోయాను అందుకే ఇలా.. ‘నాకు జరిగిన అన్యాయంపై గళం విప్పాను. అయినా చర్యలు శూన్యం. నా 22 సంవత్సరాల మీడియా జీవితంలో ఎందరికో అండగా ఉన్నాను. అవినీతి అధికారుల భరతం పట్టాను. రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖలో అధికారులను సస్పెండ్ చేయించాను. అయినా నాకు జరిగిన అన్యాయంపై చర్యలు లేవు. కలెక్టర్ ను కలిశాను. ఆర్డివో కోర్టులో అప్పీల్ చేసుకోమన్నారు. తప్పు రెవెన్యూ వాళ్లది అయితే... నేను ఎందుకు అప్పీల్‌కు వెళ్లాలి. ఎవరిని అడిగి రికార్డులను మార్చారు అంటే సమాధానం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రికార్డులను మార్చవచ్చా. ఎకరానికి రూ. 5 నుంచి 10 వేలు తీసుకుని రికార్డులను ఇష్టానుసారంగా మార్చారు. అవినీతికి పాల్పడిన వీఆర్వో రాంబాబు, ఆర్.ఐ లక్ష్మణ్, తహశీల్దారు విజయ్ కుమార్ మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు శూన్యం. వ్యవస్థ మీద విసిగిపోయాను. అందుకే ఇలా శాంతియుత దీక్షకు దిగాను ’ అని మారెడ్డి నాగేందర్‌రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ తనకు అండగా నిలవాలని కోరారు. -
జర్నలిస్ట్ రవీశ్‌కు మెగసెసె అవార్డు
మనీలా: ఆసియా నోబెల్‌గా అభివర్ణించే ప్రఖ్యాత రామన్ మెగసెసె పురస్కారం ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, ఎన్డీటీవీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీశ్ కుమార్‌ను వరించింది. 2019 ఏడాదికి గాను రవీష్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు రామన్ మెగసెసె ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. నిస్సహాయుల గొంతుకగా నిలిచినందుకుగాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ పేర్కొంది. అలాగే భారత్దేశ టెలివిజన్ జర్నలిస్టుల్లో అత్యంత ప్రతిభావంతమైన వారిలో రవీశ్ ఒకరని కొనియాడింది. రవీష్‌తోపాటు మరో నలుగురు ఆసియా నుంచి మెగసెసె–2019 పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో కో స్వీ విన్(మయన్మార్), అంగ్ఖానా నిలపైజిత్(థాయిలాండ్), రేముండో పుజాంతే కాయాబ్యాబ్(ఫిలిప్పీన్స్), కిమ్ జాంగ్ కి(దక్షిణ కొరియా) ఉన్నారు. వీరందరికీ ఆగస్టు 31వ తేదీన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆసియా నోబెల్‌గా పరిగణించే ఈ అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఆసియా అత్యున్నత పురస్కారంగా పిలిచే ఈ అవార్డును వ్యక్తులు లేదా సంస్థలకు రామన్ మెగసెసే ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. గతంలో భారత్ నుంచి రామన్ మెగసెసె అవార్డును ఆర్కే లక్ష్మణ్, పి.సాయినాథ్, అరుణ్ శౌరి, కిరణ్ బేడీ, అర్వింద్ కేజ్రీవాల్ అందుకున్నారు. రవీష్ ప్రస్థానం.. బిహార్‌లోని జిత్వార్పూర్ గ్రామం లో రవీశ్ జన్మించారు. ప్రముఖ న్యూస్ చానల్ ఎన్డీటీవీలో రిపోర్టర్‌గా 1996లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఎన్డీటీవీ హిందీ భాషలో తొలిసారి 24 గంటల చానల్‌ను ప్రారంభించడంతో అందులో ఆయన ప్రైమ్ టైమ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రైమ్ టైమ్ కార్యక్రమం ద్వారా అంతగా వెలుగులోకి రాని సామాన్యుల సమస్యలను దేశానికి చూపించే ప్రయత్నం చేశారని ఫౌండేషన్ పేర్కొంది. అనేక ఒత్తిడులు ఉండే మీడియా వాతావరణంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపింది. వాస్తవాల ఆధారిత రిపోర్టింగ్ పద్ధతులను ఆచరించేవారని, నైతికతతో తన వృత్తిని నిర్వహించేవారని వెల్లడించింది. -
ప్రముఖ పాత్రికేయులు వాసుదేవ దీక్షితులు కన్నుమూత
-
వాసుదేవ దీక్షితులు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు (76) శుక్రవారం కన్నుమూశారు. నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇవాళ మధ్యాహ్నం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా వాసుదేవ దీక్షితులు ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. పత్రికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా ఆయనకు మంచిపేరు ఉంది. వాసుదేవ దీక్షితులు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వాసుదేవ దీక్షితులు మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీక్షితులు మృతిపై సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ ఎడిటర్ వాసుదేవ దీక్షితులు గుండెపోటుతో మృతిచెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్‌గా పనిచేసిన దీక్షితులు మరణం పత్రికా రంగానికి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. దీక్షితులు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
సీఎం సలహాదారుగా అశ్లీల సీడీ నిందితుడు
రాయ్‌పూర్ : గత ఏడాది కలకలం రేపిన సెక్స్ సీడీ ఉదంతంలో పేరు వినిపించిన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ వర్మ చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ రాజకీయ సలహాదారుగా నియమితులయ్యారు. అశ్లీల సీడీ కేసులో బీజేపీ నేత ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు మేరకు 2017 అక్టోబర్‌లో వర్మను ఘజియాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది డిసెంబర్లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సీడీ పేరుతో తనను బ్లాక్ మెయిల్ చేశారని పాండ్రి పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బజాజ్ ఫిర్యాదు చేయడంతో వర్మను అరెస్ట్ చేశారు. ఇక వర్మతో సహా సీఎంకు నలుగురు సలహాదారులను నియమిస్తూ చత్తీస్‌గఢ్ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ దినపత్రిక ఎడిటర్‌గా రాజీనామా చేసి ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మరో జర్నలిస్టు రుచిర్ గార్గ్‌ను సీఎం మీడియా సలహాదారుగా నియమించారు. ఇక ప్రదీప్ శర్మ ప్రణాళిక, విధాన, వ్యవసాయ సలహాదారుగా, రాజేష్ తివారీ పార్లమెంటరీ సలహాదారుగా నియమితులయ్యారని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు
-
కుల్దీప్ కన్నుమూత
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన కలం మూగబోయింది. పత్రికా స్వేచ్ఛకోసం అహర్నిశలు శ్రమించడంతోపాటు మానవహక్కులకోసం పోరాడిన గొంతుక ఇక సెలవంటూ వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుల్దీప్ నయ్యర్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న నయ్యర్‌ను ఐదురోజుల క్రితం ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛపై ఎడతెగని పోరాటం చేసిన వ్యక్తిగా నయ్యర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత్–పాక్ మధ్య శాంతి నెలకొల్పే విషయంలోనూ తనవంతు ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో 1923లో జన్మించిన నయ్యర్.. ఉర్దూ పత్రికతో జర్నలిజం వృత్తిని ప్రారంభించారు. తర్వాత పలు ఇంగ్లిష్ పత్రికలకు ఎడిటర్‌గా సేవలందించారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఎడిటర్స్ గిల్డ్, రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. నిర్భయంగా భావాల వ్యక్తీకరణ కుల్దీప్ నయ్యర్ జర్నలిస్టుగానే ఎక్కువగా పరిచితులైనా మానవహక్కుల న్యాయవాదిగా, బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా, రచయితగా సేవలందించారు. ఎమర్జెన్సీకాలంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించినందుకు అరెస్టై జైలుకు వెళ్లారు. ‘ఎమర్జెన్సీ సందర్భంగా కుల్దీప్‡ ప్రజాస్వామ్య చాంపియన్‌గా నిలిచారు. పాఠకులకు ఆయన మృతి తీరనిలోటు’ అని రాష్ట్రపతి కోవింద్ సంతాపసందేశంలో పేర్కొన్నారు. ‘మా కాలంలో కుల్దీప్ ఓ గొప్ప రచయిత, మేధావి. నిర్భీతితో తన అభిప్రాయాలను వెల్లడించడంలో దిట్ట. దశాబ్దాలుగా తన కలంతో ఎందరో పాఠకులను చైతన్యవంతులను చేశారు. ఎమర్జెన్సీలో పట్టుదలగా వ్యవహరించిన తీరు, భవ్యభారతం కోసం ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని దేశం ఎన్నటికీ మరవదు.’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రేరణ నయ్యర్ న్యూస్ స్కూప్స్ యువ జర్నలిస్టులకు ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. విశ్వసనీయతను కాపాడుకుంటూ వేగంగా, చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు అవసరమైన వార్తలందించే విషయంలో నయ్యర్ స్ఫూర్తిదాయకంగా ఉండిపోతారని సంతాప సందేశంలో పేర్కొంది. ‘రిపోర్టర్ల ఎడిటర్’గా నయ్యర్‌ను కీర్తించింది. ఎడిటర్స్ గిల్డ్‌కు కుల్దీప్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మానవహక్కులు, మీడియా స్వేచ్ఛను కాపాడటంలో నయ్యర్ పాత్ర మరువలేనిదని ‘ద వీక్’ మ్యాగజీన్ ఎడిటర్ సచ్చిదానంత మూర్తి గుర్తుచేసుకున్నారు. 1980ల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరువునష్టం దావా బిల్లును నయ్యర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘బిట్వీన్ ద లైన్స్’ పేరుతో నయ్యర్ తన భావాలను ధైర్యంగా వ్యక్తపరిచిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఎంలు నయ్యర్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. ‘వివిధ హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. జర్నలిస్టుగా, దౌత్యవేత్తగా, పార్లమెంటేరియన్‌గా, రచయితగా దశాబ్దాల ప్రజాజీవితంలో ఎన్నో గొప్ప శిఖరాలను చేరుకున్నారు’ అని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘పాత్రికేయ రంగంలో ఓ శకం ముగిసింది. నయ్యర్ ప్రజాస్వామ్యానికి అసలు సిసలు సైనికుడు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ కూడా నయ్యర్ మృతిపట్ల సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతోపాటు రాజకీయ, మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టుకు కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ తదితరులు పాల్గొన్నారు. జగమెరిగిన జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్! నాలుగు దశాబ్దాల పాత్రికేయ జీవితం బహుముఖ ప్రజ్ఞాశాలి న్యూఢిల్లీ: 1923 ఆగస్టు 14న నాటి బ్రిటిష్ హయాంలోని పంజాబ్ సియాల్కోట్లో (ప్రస్తుత పాక్‌లో) జన్మించిన నయ్యర్ చిన్నతనమంతా అక్కడే గడిచింది. లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశాక, లాహోర్‌లోనే న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన మారణహోమానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. 1952లో అమెరికా ఇలినాయిస్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజం కోర్సు పూర్తిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉర్దూ పత్రిక ‘అంజామ్’లో పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఇంగ్లిషు జర్నలిజంలోకి ప్రవేశించారు. దేశంలోని వివిధ మీడియాసంస్థలు, ఏజెన్సీలకు సేవలందించారు. లండన్‌కు చెందిన ‘ద టైమ్స్’ ప్రతినిధిగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయరంగంలో సాగిన పయనంలో ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద స్టేట్స్‌మన్’ తదితర పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. భారత్–పాక్ స్నేహబంధం కోసం.. 1990లో వీపీసింగ్ ప్రభుత్వం ఆయన్ను ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత–పాకిస్తాన్ల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడేందుకు, రెండుదేశాల మధ్య మానవహక్కులు, శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. పాత్రికేయ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2015లో రామ్‌నాథ్ గోయంకా జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘వితవుట్ ఫియర్, బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ రీ టోల్డ్, స్కూప్: ఇన్సైడ్ స్టోరీస్ ఫ్రం పార్టిషన్ టు ద ప్రెజెంట్’, ‘డిస్టెంట్ నైబర్స్: ఏ టేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్’ వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు. భారతీయ యువతపై భగత్ సింగ్ ప్రభావం ఎలా ఉందో ‘వితవుట్ ఫియర్’ పుస్తకంలో వివరించారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్గురుల స్వాతంత్య్ర పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హన్స్‌రాజ్ వోహ్రా భగత్‌సింగ్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడన్నది వివరించారు. నయ్యర్ చివరి వ్యాసంలో.. చనిపోయేందుకు కొద్ది గంటలముందు కూడా మోదీ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ లోక్మత్ టైమ్స్‌కు నయ్యర్ ఓ వ్యాసం రాశారు. కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వ భావాలను రుద్దకుండా అభివృద్ధి సుపరిపాలనపైనే దృష్టిపెట్టాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ అని.. దీనిపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఆర్టికల్‌ను గురువారం నాగ్‌పూర్ ఎడిషన్ లోక్మత్ టైమ్స్ ‘శరణార్థులా? ఓటుబ్యాంకా?’ శీర్షికతో ప్రచురించింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్యరాష్ట్రాల్లోని 25 ఎంపీ సీట్ల విషయంలో మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని నయ్యర్ సూచించారు. వాజ్‌పేయి మృతిచెందిన తర్వాత ఆయనకు నివాళులర్పిస్తూ నయ్యర్ ఓ వ్యాసం రాశారు. దీన్ని పత్రికలకు పంపాల్సి ఉంది. ఇంతలోనే నయ్యర్ కన్నుమూశారు. వాజ్‌పేయి నయ్యర్ ఇద్దరూ 1920వ దశకంలోనే పుట్టారు. వారం రోజుల్లోనే కన్నుమూయటం యాదృచ్ఛికం. మృతిపై కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మాజీ ఎంపీ కుల్దీప్నయ్యర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. సామాజిక, రాజకీ య, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై కుల్దీప్ నయ్యర్ చేసిన అధ్యయనం, రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించారు. మానవ హక్కులు, శాంతి ఉద్యమకారుడిగా కుల్దీప్నయ్యర్కు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ గుర్తింపు ఉందని సీఎం పేర్కొన్నారు. కుల్దీప్ మృతికి జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై మంచి పట్టు, సరైన అవగాహన కలిగిన నయ్యర్ తన రచనల్లో వాటిని ప్రతిబింబింపజేసే వారని జగన్ కొనియాడారు. మానవహక్కుల కార్యకర్తగా ఆయన తన రచనలతో ఎంతో మంది యువకులను ప్రభావితం చేశారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతదేశం తరపున బ్రిటన్‌కు హైకమిషనర్ హోదాలో పనిచేసినప్పటికీ నయ్యర్ క్షేత్ర స్థాయి వాస్తవాలకు దగ్గరగా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. -
సీనియర్ జర్నలిస్ట్ వేదగిరి రాంబాబు కన్నుమూత
-
సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ పోరాట యోధుడు, సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వర్రావు(78) ఆసిఫ్‌నగర్ దత్తాత్రేయ కాలనీలోని స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 60 ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. ఆంధ్రభూమి, గోల కొండ, ఆంధ్రజ్యోతి, ఉదయం, దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తదితర దినపత్రికల్లో హైదరాబాద్, ఢిల్లీలో వివిధ హోదాల్లో పని చేశారు. జనతా, రాజధాని పత్రికలను నడిపారు. ఇటీవల రాష్ట్ర అవతరణ వేడుకల్లో కేసీఆర్ నుంచి ఆదిరాజు ఉత్తమ పాత్రికేయునిగా అవార్డు అందుకున్నారు. ఆదిరాజు భౌతిక కాయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సాక్షి దినపత్రిక ఈడీ రామచంద్రమూర్తి, పలువురు రాజకీయనేతలు, పాత్రికేయులు సందర్శించి నివాళులర్పించారు. షేక్‌పేట్ మహాప్రస్థానంలో ఆదిరాజు వెంకటేశ్వర్రావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదిరాజు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆదిరాజు ఎంతగానో కృషి చేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. -
100 కోట్ల అవకతవకలు
న్యూఢిల్లీ: రూ.100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరపటంతోపాటు సివిల్ ఏవియేషన్ బ్యూరో సెక్యూరిటీ (బీసీఏఎస్)పాస్‌లు పొంది దేశ భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు ఉపేంద్రరాయ్తోపాటు మరికొందరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇందుకు సంబంధించి లక్నో, నోయిడా, ఢిల్లీ, ముంబైల్లో గురువారం సోదాలు జరిపింది. ‘ఢిల్లీకి చెందిన ఉపేంద్ర రాయ్ అనే సీనియర్ జర్నలిస్ట్, ఎయిర్ వన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అధికారి ప్రసూన్ రాయ్ మరికొందరితో కలిసి బీసీఏఎస్‌ను, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ను మోసం చేశారు. తప్పుడు పత్రాలతో ఏరోడ్రోమ్ ఎంట్రీ పాస్‌లు పొంది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో అత్యంత భద్రత ఉండే, నిషిద్ధ ప్రాంతాల్లో ప్రవేశానికి అనుమతి పొందారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరించారు. అక్రమ డబ్బు పెట్టుబడులకు రాహుల్ శర్మ, సంజయ్ స్నేహి సహకరించారు. 2017లో ఉపేంద్ర ఖాతాలో ఒక్కసారిగా రూ.79 కోట్లు జమయ్యాయి. ఐటీ శాఖలో సెటిల్మెంట్లకుగాను పలు నకిలీ కంపెనీల నుంచి రూ.16 కోట్లు వచ్చాయి’ అని సీబీఐ పేర్కొంది. -
‘శ్రీదేవి భౌతికకాయానికి రీపోస్టుమార్టం చేయాలి’
న్యూఢిల్లీ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మృతి విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతూ సీనియర్ జర్నలిస్టు ఎస్ బాలకృష్ణన్ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు. సాధారణంగా బాత్‌టబ్ ఎత్తు మూడు అడుగులు మాత్రమే ఉంటుందని, అందులో మునిగి ఒక వ్యక్తి ఎలా చనిపోతారని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. శ్రీదేవి శరీరంలో ఉన్న ఆల్కాహాల్ స్థాయి చాలా తక్కువ అని, అలాంటి సమయంలో ఆమె అకస్మాత్తుగా బాత్‌టబ్‌లో మునిగి ఎలా చనిపోతుందని ఆయన ప్రశ్నించారు. ఆమె భౌతికకాయాన్ని ముంబైకి తరలించిన తర్వాత మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని ఆయన లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. 54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆమె భౌతికకాయాన్ని ఇప్పటికీ దుబాయ్‌లోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ జరుపుతోంది. శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది. -
సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావుతో మనసులో మాట
-
ఏబీకే ప్రసాద్‌తో మనసులో మాట
-
సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు సురేష్ కృష్ణమూర్తి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణ మూర్తి గతంలో పలు పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం ది హిందూకు సినిమా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సురేష్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రి హరీష్‌రావు, తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని పలువురు జర్నలిస్టులు కంటతడి పెట్టారు. -
సాక్షి టవర్స్‌లో జెస్సీ సంతాప సభ
-
సాక్షి సీనియర్ జర్నలిస్ట్ జెస్సీ కన్నుమూత
-
సీనియర్ జర్నలిస్ట్ వి. హనుమంతరావు మృతి
కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ జగన్ సహా ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, డీఎన్ ఎఫ్ న్యూస్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు వి.హను మంతరావు(91) మంగళవారం ఉదయం కన్ను మూశారు. వృద్ధాప్యంతో కొంతకాలంగా నలతగా ఉంటున్న ఆయన మంగళవారం ఉద యం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. హను మంతరావు మరణవార్త తెలియగానే శ్రీనగర్ కాలనీ నాగార్జుననగర్‌లోని ఆయన నివాసానికి సన్ని హితులు, జర్నలిస్టులు చేరుకుని నివాళి అర్పిం చారు. ఆయన భార్య సరళ, కుమారుడు సతీష్ బాబులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణు కులో పుట్టిన హనుమంతరావు కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వద్ద స్టెనోగా చేరి, ఆ పై జర్నలిస్టు జీవితాన్ని ఆరం భించి అంచెలంచెలుగా ఎదిగి వివిధ పత్రికలు, హోదాల్లో పనిచేశారు. ప్రముఖుల సంతాపం.. హనుమంతరావు మరణంతో తెలుగు జర్నలి జం గొప్ప వ్యక్తిని కోల్పోయినట్లయ్యిందని తెలంగాణ, ఏపీ సీఎంలు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కె.జానారెడ్డి అన్నారు. హనుమంతరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని, జర్నలిజానికి రోల్ మోడల్ లాంటి వారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హనుమంతరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్ జర్న లిస్టు కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజమౌళి, విజయ్ కుమార్‌రెడ్డి, జర్నలిస్టులు మల్లె్లపల్లి లక్ష్మయ్య, వీక్షణం వేణుగోపాల్, సీఎం సీపీఆర్వో నర్సింగరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి తదితరులు హనుమంతరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. హనుమంత రావు మృతిపట్ల ఇండియన్ జర్నలిస్టు యూని యన్(ఐజేయూ), తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టీయూ డబ్ల్యూజే) సంతాపం వ్యక్తం చేశాయి. ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ నాయకులు కె.శ్రీని వాస్‌రెడ్డి, టీయూ డబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె.విరహత్ అలీ హను మంతరావు భౌతిక కాయానికి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కళాశాలకు దానం చేశారు. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ, సీపీఎం, యూసీసీఆర్ (ఎంఎల్) సంతాపాన్ని ప్రకటిం చాయి. విశాలాంధ్ర విలేకరిగా జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించి సుదీర్ఘకాలం వివిధ పత్రికల్లో పనిచేశారని, ఫ్రీలాన్సర్‌గా నేటితరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలిచారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. తుదిశ్వాస వరకు సమాజంలో మార్పు కోసం కృషి చేశారని సీపీఎం నేత జి.నాగయ్య పేర్కొన్నారు. ఆయన మరణం జర్నలిస్టులు, కమ్యూనిస్టు ఉద్యమానికి, సాహితీలోకానికి తీరని లోట న్నారు. ఆయన మరణంతో కమ్యూనిస్టులు నిజమైన మిత్రుడిని కోల్పోయారని యూసీసీఆర్ఐ (ఎంఎల్) కార్యదర్శి వినోద్ సంతాపం తెలిపారు. హనుమంతరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కె.ప్రతాపరెడ్డి (సీపీఐ), నరసింహారావు, శ్రీనివాస్ (సీపీఎం) తదితరులున్నారు. హనుమంతరావు ఓ విప్లవకారుడు హనుమంతరావు నిజమైన విప్లవకారుడని, ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతిని ప్రక టిస్తున్నామని భారత కమ్యూనిస్టు విప్లవకా రుల సమైక్యతా కేంద్రం (మార్కిస్టు–లెనినిస్టు) ప్రకటించింది. వైఎస్ జగన్ సంతాపం ప్రముఖ జర్నలిస్టు వి.హనుమంతరావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ జర్నలిస్టు జీవితంలో వయసు పైబడిన తరుణంలో కూడా ఆయన చురుగ్గా ఉంటూ క్రియాశీలంగా వృత్తిని కొనసాగించారని జగన్ శ్లాఘించారు. ఆర్థిక పరమైన, బడ్జెట్ విశ్లేషణలకు హనుమంతరావు పేరెన్నికగన్న వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్ ఆకాంక్షించారు. -
ప్రాతినిధ్య 2015 పుస్తక అవిష్కరణ
-
ABKతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
తీర్పు పలు అసంతృప్తుల కూర్పు
విశ్లేషణ బీజేపీ దాని మిత్రులు తెలివిగా చట్టవిరుద్ధ వలసలపై దృష్టిని కేంద్రీకరించారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిలవరించడంలో విఫలమైన కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజలను అది వెంటనే ఆకట్టుకుంది. తీవ్ర సమస్యలలో మునిగి ఉన్న రాష్ట్రం తిరుగుబాటుదారుల చేతుల్లో అనుభవించినంత దారుణమైన బాధను ప్రభుత్వం వల్లా, ప్రభుత్వ సంస్థలవల్లా కూడా అనుభవించింది. రాష్ట్ర సామాజిక జీవితానికి సంకేతంగా మారిన అశాంతికి స్వస్తి పలకడమూ, ఊపిరి పీల్చుకోవడానికి తగినంత తాజా గాలి అస్సాంకు కావాలి. అస్సాంలో గత రెండేళ్లుగా పెంపొందుతున్న పరిస్థితిని బట్టి చూస్తే సుదీర్ఘంగా, మూడు దఫాలు వరుసగా అధికారం నెరపిన కాంగ్రెస్ ఓటమి పాలు కావడంలో అశ్చర్యమేమీ లేదు. కాకపోతే బీజేపీకి, దాని మిత్రులకు ప్రజలు కట్టబెట్టిన అఖండ విజయం ఆ పార్టీ నేతలకు, ఎన్నికల పండి తులకు సైతం ఊహాతీతమైనదిగా ఉండటం విస్మయకరం. ప్రతిపక్షం బలహీనంగా, చీలిపోయి ఉండటం వల్ల కాంగ్రెస్ అక్కడి శాసనసభ ఎన్నికల్లో వరుస విజయాలను సాధించగలిగింది. అసోం గణ పరిషత్ (ఏజీపీ) ఐదేళ్ల దుష్పరిపాలన ఫలితంగా 2001లో ఓటర్లు ప్రత్యామ్నాయం కోసం తహతహలాడారు. ఏజీపీ ప్రభుత్వం చేయించిన ‘రహస్య హత్యల’ వల్ల ఉల్ఫా తిరుగుబాటుదార్ల బంధువులైన పలువురు అమాయకులు బలైపోయారని ఆరోణపణలున్నాయి. ఏజీపీతో ఎన్నికలకు ముందే కూటమిని నిర్మించిన బీజేపీ కూడా అప్రతిష్టపాలై, రెండు పార్టీలూ ఆ శాసనసభ ఎన్నికల్లో ఓటమికి గురయ్యాయి. ఆ హత్యలకు బాధ్యులని భావిస్తున్న కొందరు పోలీసు అధికారులను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ప్రజలు కొంత ఊరట కలిగినట్టు భావించారు. కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలు బీజేపీ, ఏజీపీల పతనోన్ముఖ పయనం కొనసాగుతుండగా... కాంగ్రెస్ 2006, 2011 శాసనసభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతలతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షమే లేకపోవడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు వేగంగా క్షీణించిపోయింది, అవినీతి మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో పెరిగి పోయింది. అయితే 2016 పరిస్థితి అందుకు పూర్తి భిన్నమైనదిగా మారింది. రెండేళ్ల క్రితమే దానికి సంబంధించిన తొలి హెచ్చరికలు పొడ సూపాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌ని తొలగించాలని హేమంత బిశ్వశర్వ నేతృత్వంలోని కాంగ్రెస్ అసమ్మతి శాసనసభ్యులు డిమాండ్ చేశారు. వారి ఫిర్యాదులను కాంగ్రెస్ హైకమాండ్ చెవికెక్కించుకోలేదు. ఫలితంగా వారంతా గత ఏడాది బీజేపీలో చేరిపోయారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం అనుకూలతను సృష్టించగల వ్యూహ చతురునిగా ప్రసిద్ధి చెందిన బిశ్వశర్వ బీజేపీకి కలిసొచ్చిన అదృష్టమే అయ్యాడు. పార్టీలో చేరిన కొన్ని వారాలకే ఆయన బీజేపీ అగ్రనేతలతో రహస్య సమావేశం జరిపి అస్సాంలో కాంగ్రెస్‌ను గద్దెదించడానికి పథకాన్ని రచించారు. ప్రాంతీయ పార్టీలతో, ఆదివాసి సంస్థలతో బృహత్ కూటమిని ఏర్పరచాలనే ఆయన సూచనకు బీజేపీలోనే కొంత వ్యతిరేకత ఉన్నాగానీ వారు అంగీకరించారు. అసోంలోని ప్రతి పౌరునికి సంబంధించిన సాధారణ సమస్యలపై ఆదివాసి, ఆదివాసియేతర ప్రజలను అందిరినీ ఐక్యం చేయాలనేదే... ఏజీపీ, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)లతో, మరో రెండు చిన్న ఆదివాసి పార్టీలతో బీజేపీ ఒప్పందాలకు కారణం. చట్టవిరుద్ధ వలసలే కీలక సమస్య బీజేపీ దాని మిత్రులు తెలివిగా చట్టవిరుద్ధ వలసలపై దృష్టిని కేంద్రీకరించి, అలాంటి వారిని గుర్తించడం అనే రాష్ట్రస్థాయి అంశాన్ని చేపట్టారు. బంగ్లాదే శ్ నుంచి జరుగుతున్న చొరబాట్లను నిలవరించడంలో విఫలమైన కాంగ్రెస్‌పై ప్రజలు అప్పటికే ఆగ్రహం చెంది ఉండటం వల్ల ఈ వైఖరి వెంటనే ప్రజలను ఆకట్టుకుంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారి జనాభా అసాధారణంగా పెరిగిపోయిందని 2001, 2011 జనాభా లెక్కలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆదేశించకపోతే అస్సాం ఒప్పందంలో పొందుపరచిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్ఆర్సీ)ను సవరించే ప్రక్రియను చేపట్టడం జరిగేదే కాదు. ఇలా ముందు చేయాల్సిన ప్రధాన కృషి అంతా జరిగాక ప్రజలను ఆకట్టుకునేదిగా ఉండే ఒక సంకేతం బీజేపీకి అవస రమైంది. వెంటనే అది, చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిలో అతి పెద్ద వర్గాల మద్దతు ఉన్న ఆల్ ఇండియా యునెటైడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), దాని అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ నుంచే ‘‘అసలు ముప్పు’’ పొంచి ఉన్నదని గట్టిగా నొక్కి చెప్పసాగింది. ఇది మతాలకు, తెగలకు ప్రాంతాలకు అతీతంగా అస్సాం ఓటర్లను ప్రభావితం చేసింది. కాగల కార్యం తీర్చిన ‘కింగ్‌మేకర్’ ఎన్నికలకు ముందు అజ్మల్ ప్రవర్తన బీజేపీకి సానుకూలతను కల్పించడమే కాదు, ఆయన మద్దతుదార్లలో గందరగోళాన్ని రేకెత్తించింది. జనవరి 23న ఆయన హిందువుల కేంద్రీకరణ అనే దానికి వ్యతిరేకంగా మైనారిటీలంతా ఐక్యం కావాలంటూ రంగియాలో జరిగిన ఓ బహిరంగ సభలో విజ్ఞప్తి చేశారు. దీంతో సరిగ్గా బీజేపీ కోరుకుంటున్న పనినే ఆయన చేసినట్టయింది. విదేశీ పౌరుల పట్ల భయం మరింత బలపడేట్టు చేసింది. దీనికితోడు, ఇంతకు ముందు ఏఐయూడీఎఫ్‌కు ఓటు చేసిన బెంగాలీ ముస్లింలలోని చాలా మంది పౌరులు చట్టవిరుద్ధంగా వలసవచ్చినవారితో గుర్తింపును పొందడానికి ఇష్టపడక కాంగ్రెస్ వైపు మళ్లారు. వీటన్నిటి మధ్యన అజ్మల్, కాంగ్రెస్‌తో ఎన్నికల ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో ఆయన కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభు త్వమంటూ ఒక విధమైన మూడో ఫ్రంట్గురించి కూడా మాట్లాడటం మొదలెట్టారు. అదీ పనిచేయక పోవడంతో ‘కింగ్ మేకర్’ను అవుతానని, తన మద్దతు లేనిదే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు అసాధ్యమని ప్రకటిం చారు. క్షేత్రస్థాయి వాస్తవికత గురించి ఏ మాత్రం తెలియక కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 16,723 ఓట్ల తేడాతో ఓడిపోయారు. చాపకింది నీరై వచ్చిన ‘పరివర్తన్’ గాలి ఈ స్థూల సమస్యలన్నీ వివిధ రకాల స్థానిక సమస్యలతో కలసి ఈ ఎన్నికల్లో ‘పరివర్తన్’ గాలిని సృష్టించాయి. ఈ గాలే పది మంది మంత్రులను ఓటమికి గురిచేసి పలువురికి విస్మయం కలిగించింది. ‘‘బరాక్ లోయలో కాంగ్రెస్ మాజీ మంత్రి గౌతమ్రాయ్పట్ల ఉన్న అసంతృప్తి గాలి అతన్ని, అతని బంధువులను ఓడించడం కోసం అక్కడి ప్రజలను మతాలకు, తెగలకు అతీ తంగా ఐక్యం చేసింది’’ అని ఏఐయూడీఎఫ్ మాజీ ఉపాధ్యక్షుడు హఫీజ్ రషీద్ చౌధ్రీ అన్నారు. మర్ఘేరిటాలో కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రద్యుత్ బార్డొలాయ్ సన్నిహిత బంధువు బేకరీ పెట్టుకోవడం కోసం ఒక బస్ స్టాండ్‌ను కూల్చివేయడం బెడిసికొట్టి పెద్ద వివాదంగా మారి, చివరికి బీజేపీ విజయానికి కారణమైందని అక్కడి స్థానికులు చెప్పారు. ఈ అంతఃప్రవాహాలు బలమైనవేగానీ పైకి కనిపించకుండా దాగి ఉన్నవి. కాబట్టే బీజేపీ సైతం అన్ని సీట్లను సంపాదించగలమని ఊహించలేక పోయింది. మిత్రులతో కలసి దాదాపు 75 నుంచి 80 సీట్లు రావచ్చని అది ఆశించింది. మొత్తం 126 శాసనసభ స్థానాలలో బీజేపీ కూటమికి 86 లభించాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా 60 స్థానాలను సాధించగా, ఏజీపీ, బీపీఎఫ్‌లకు వరుసగా 14, 12 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు వచ్చినవి 26 కాగా, ఏఐయూ డీఎఫ్‌కు 3 స్థానాలు దక్కాయి. బీజేపీ గెలుస్తామనుకున్న ఐదు స్థానాల్లో ఓడినా, అనూహ్యంగా గెలిచిన 6 ఇతర స్థానాలతో ఆ లోటు పూడిపోయింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రకటించిన తీర్పు. సుదీర్ఘ కాలంగా తీవ్ర సమస్యలలో మునిగి ఉన్న రాష్ట్రం తిరుగుబాటు దారుల చేతుల్లో అనుభవించినంత దారుణమైన బాధను కాంగ్రెస్ ప్రభు త్వంవల్లా, ప్రభుత్వ సంస్థలు, అధికారుల వల్లా కూడా అనుభవించింది. 1970ల నుంచి రాష్ట్ర సామాజిక జీవితానికి సంకేతంగా మారిన అశాంతికి స్వస్తి పలకడమూ, ఊపిరి పీల్చుకోవడానికి తగినంత స్వచ్ఛమైన తాజా గాలి అస్సాంకు కావాలి. రాజీవ్ భట్టాచార్య వ్యాసకర్త అసోంలోని సీనియర్ పాత్రికేయులు, రచయిత ఈమెయిల్: rajkrbhat@gmail.com -
సీనియర్ జర్నలిస్ట్ దాసరి రవీందర్ కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు దాసరి రవీందర్(42) శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు వరుసగా రెండు ఆపరేషన్లు నిర్వహించగా.. ఈ రోజు మధ్యాహ్నం మరణించారు. ఆయన తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పీఆర్వోగా ఉండేవారు. దాసరి రవీందర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా రాయికల్. గతంలో ఆయన సాక్షి టీవీలో సీనియర్ కరస్పాండెంట్‌గా విధులు నిర్వహించారు. రవీందర్ మృతికి సాక్షి యాజమాన్యం, సిబ్బంది సంతాపం ప్రకటించింది. రవీందర్ మృతి కారణంగా మిషన్ కాకతీయ మీడియా అవార్డుల కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆయన మృతిపట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపాయి. -
అవినీతికి ‘సుప్రీం’ అంకుశం
రెండో మాట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అండ వల్ల ఒక మోస్తరు మెజారిటీ వచ్చింది. కానీ ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నుంచి ఆకర్ష్ పథకం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్లో 2002లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల చంద్రబాబు నాడు బాహాటంగానే ఏహ్యభావాన్ని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మోదీ ‘ప్రక్రియ’నే అనుసరిస్తున్నారు. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలోనూ ఇదే పథకం కింద ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించే పని యథేచ్ఛగా సాగుతోంది. ‘పార్లమెంట్ సభ్యులు, శాసనసభల సభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిని నేరగాళ్లుగా నిర్ధారించేదాకా వేచి ఉండవలసిన అవసరం లేకుండానే, సభా వ్యవహారాలకు అనర్హుడిని చేసే స్పష్టమైన ఒక చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.’ - రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా తీసుకోవలసిన చర్యలను గురించి చర్చిస్తున్న సుప్రీంకోర్టు మూడవరోజు సమావేశాన్ని ప్రారంభిస్తూ చేసిన నిర్ణయం (9-3-2016 నాటి వార్తలు) నేర విచారణలో ఉన్న లెజిస్లేటర్ మీద కింది కోర్టు (ట్రయల్ కోర్టు) అభియోగాలను నమోదు చేసే దశలోనే శాసనవేదికలకు అతడిని అనర్హుడిగా ప్రకటించవచ్చా? అన్న ప్రశ్నను ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. విచారణ ఎదుర్కొంటున్న అలాంటి సభ్యులకు శిక్ష ఖరారయ్యే వరకు కూడా సభలో వేటు వేయకుండా ఉపేక్షించవలసిందేనా అని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నిం చింది. అవినీతి అంటే కోట్లకు పడగలెత్తడమే కాదు. పార్టీ ఫిరాయింపులు కూడా. నిజానికి ఈ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసుకోగోరు తున్నాం అనీ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కాలానుగుణంగా పరీక్షలు ఎదుర్కొంటూ ఉండగా, న్యాయ వ్యవస్థ మాత్రం రోజూ కఠిన పరీక్షలనే చవి చూడవలసి వస్తున్నదనీ ఇంతకు ముందు రెండు సందర్భాలలో జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షతన సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరికగా ప్రశ్నించవలసి వచ్చింది. అంటే పాలకులూ, ప్రజలూ లెజిస్లేటర్లూ, న్యాయవ్యవస్థలూ చేసిన పలు ఉల్లంఘనలకు మూలం ఎక్కడుందో ఆలోచించాలి. ఉపోద్ఘాతం ప్రాధాన్యాన్ని గుర్తించాలి అమెరికా రాజ్యాంగం దాదాపు రెండు వందల ఏళ్ల నుంచి అమలులో ఉంది. కానీ దానికి జరిగిన సవరణలు ముప్పయ్. మన రాజ్యాంగానికి 65 ఏళ్లలోనే -1951 లగాయితూ 2013 వరకు వచ్చిన సవరణలు వందను మించి పోయాయి. అయినా ‘భారత ప్రజలమైన మేము...’ అని ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ పౌరులందరికీ సమాన హోదా, మతాలకు అతీతంగా సోషలిస్ట్, సెక్యులర్, ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకునే సంకల్పం తో ఒక కార్యాచరణ సంకల్పంతో ఉపోద్ఘాతం రూపొందించుకున్నాం. తద్వారా భారత ప్రజలకు ఎలాంటి లక్ష్యాలు ఆచరణలో సాధించిపెట్టవలసిన బాధ్యత ఉందో వివరించారు. అవి- పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వివక్షలేని సమైక్యతను విధిగా సాధించి పెట్టడం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛలకు భంగం కలిగించకుండా కాపాడు కోవడం, కుల వ్యవస్థ నిర్మూలన . అందుకే మొత్తం రాజ్యాంగ లక్ష్యమంతా ముఖపత్రంలోనే, ఉపోద్ఘాతంలోనే క్లుప్తీకరించడం జరిగింది. ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? నెరవేరకుంటే అందుకు కారకులు ఎవరు? అని అన్ని విభాగాలు, వాటి నిర్వాహకులు ముఖ్యంగా జెండాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న పాత కొత్త పాలకులంతా ప్రశ్నించుకుని సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది. విచారణ సంఘాలు, ఎన్నికల కమిషన్లు వంటివి ఈ రాజ్యాంగ చట్టాలతోనే తెచ్చుకున్నాం. అలాగే డబ్బు కోసమో, పదవుల కోసమో ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి ఫిరాయించే, లేదా అమ్ముడుపోయే లెజిస్టేటర్లను కట్టడి చేసే ఉద్దేశంతో కూడా చట్టాలను రూపొందించుకున్నాం. ఇంకా ఫిరాయింపులను నిషేధిస్తూ, అలాంటి వారిని లెజిస్లేచర్ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించగల చట్టాలను కూడా తెచ్చు కున్నాం. ఎన్నికలలో అవినీతికి పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకోవా లని సంకల్పించి ఏళ్లూ పూళ్లూ గడచిపోయాయి. రాజకీయులకూ, పోలీసు లకూ, మాఫియా ముఠాలకూ మధ్య విడదీయరాని బంధం ఏర్పడినందున వాటి నిరోధానికి ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలనూ చూశాం! పాలనా వ్యవస్థలలో అవినీతి పేరుకుపోయినందున ఆ అవినీతిలో అంత ర్భాగంగానే ఓట్లు కొనుగోలు చేయడం, ‘ఓటుకు నోటు’ వంటివి యథేచ్ఛగా ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఆచరణలో చట్టబద్ధంగా భావించే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నాం. చివరకు ఈ పుండు ఎంత లోతుకు తొలచుకుంటూ వెళ్లిందంటే, అధికార పార్టీకి మెజారిటీ ఉన్నా, ‘బెల్లంతో ఈగలని’ ఆకర్షించే అవసరం లేకున్నా ప్రతిపక్షాన్ని మాత్రం బలహీనం చేసేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ ఒక సంస్కృతిగా విస్తరిస్తోంది. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోను, బలహీన స్థితిలో పార్లమెంటులోను కూడా జరిగింది. పార్లమెంటులో తనకున్న బ్రూట్ మెజారిటీ మూలంగా బీజేపీ ఈ క్షణానికి ఇతర పార్టీల నుంచి వచ్చే ఫిరాయింపుదారులకు చోటు కల్పించకపోవచ్చు. కానీ రేపటి అవసరం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసనసభలలో జరుగుతున్న తాజా పరిణామాలూ రాష్ట్రపతి పాలన విధింపులూ బీజేపీ పాలకుల కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రాపకం కోసం ఈ ప్రక్రియ ముందుకు వెళ్లడం ఖాయం. అంటే బొమ్మైకేసు తీర్పు నుంచి కూడా మోదీ పాలన పాఠం నేర్చుకోలేదు. మోదీ ప్రక్రియకు దాసోహం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ ఫలితమే. ఈ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అండ వల్ల ఒక మోస్తరు మెజారిటీ వచ్చింది. కానీ ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నుంచి ఆకర్ష్ పథకం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్లో 2002లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల చంద్రబాబు నాడు బాహాటంగానే ఏహ్యభావాన్ని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మోదీ ‘ప్రక్రియ’నే అనుసరిస్తున్నారు. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలోనూ ఇదే పథకం కింద ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించే పని యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలో న్యాయస్థానాలను కూడా తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి గతంలో పాలక పక్షాలు ప్రయత్నించిన సంగతిని విస్మరించలేం. అవినీతి రాజకీయాలకు అలవాటు పడిన అన్ని బ్రాండ్ల పాలకులూ న్యాయవ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం రాజ్యాంగంలో శాసనాలపైనా, పాలకుల చేష్టలపైనా లెజిస్లేచర్ స్పీకర్ల నిర్ణయాలపైన భాష్యం చెప్పేందుకు జ్యుడీషియరీకి కల్పించిన విశిష్టాధికారాన్ని కూడా ప్రశ్నించడానికి సాహసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యురాలు ఆర్కె రోజా మీద శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ ఉత్తర్వును ఏడాది పాటు అమలులోకి వచ్చేటట్టు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఈ సందర్భంగా కోర్టులో ప్రశ్నార్థకం కావలసి వచ్చింది. ఫలితంగా సింగిల్ జడ్జి బెంచ్ ఆ ఉత్తర్వును నిలిపివేయవలసి వచ్చింది. దాని మీద చంద్రబాబు ప్రభుత్వం ఆ స్టే (నిలుపుదల) ఉత్తర్వును రద్దు చేయించుకుంది. రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాతే సింగిల్ జడ్జి బెంచ్ ఏర్పడక తప్పలేదు. ‘‘అసలు హైకోర్టులో ఏం జరుగుతోందో, స్పీకర్ కార్యాలయంలో ఏం జరుగుతోందో తెలుసుకోగోరుతున్నాం’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించే వరకు సభా వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. కానీ ఇక్కడ మరచిపోరాని విషయం- శాసనబద్ధంగా తనకు లభించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎదురైన సమస్యను సభలో వివరించడానికి రోజాకు అవకాశం ఇవ్వకపోవడం. ఏడాది పాటు (సభ్యుల సస్పెన్షన్ కాల పరిమితి ఏ దశలో అయినా గరిష్టంగా ఆ సమావేశాల వరకేనని నిబంధనలు నిర్దేశిస్తున్నా) ఆ సభ్యురాలి ప్రవేశాన్ని అడ్డుకుంటూ తీర్మానించడమూ, ప్రజలలోనూ కోర్టులలోనూ ఇంటా బయటా అల్లరైపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్లేటు ఫిరాయించింది. దాంతో సభా వ్యవహారాల సంఘం ముందు ఈ నెల 6న (రేపు) హాజరు కావలసిందిగా రోజాను తాజాగా ఆహ్వానించవలసి రావడం ఆలస్యంగా జరిగినా ఆహ్వానించదగినదే. ఇది ప్రజావిజయం ఈ కొత్త పరిణామం ప్రజాభిప్రాయానికీ, చట్టానికీ విజయమే. అటు రోజా తాజా పిటిషన్ మీద సుప్రీంకోర్టు రేపో మాపో తీర్పును ఇవ్వబోతున్నది. దీనితో అసెంబ్లీలో రోజా అంశం ప్రకంపనలు సృష్టించబోవడం సభా హక్కుల సంఘం తాజా నిర్ణయానికి ప్రధాన కారణమై ఉండవచ్చు. ‘స్పీకర్ నిర్ణయం మేరకు సభ్యురాలిని సస్పెండ్ చేసే అధికారం సభకు ఉంది’ అన్న సమర్థన కోసమే పంటి బిగువుతో టీడీపీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. అయితే స్పీకర్ నిర్ణయం సైతం సభా నిబంధనలకు, రాజ్యాంగం లోని 194వ అధికరణాంశాలకు బద్ధమయి ఉండాలన్న సంగతి విస్మరించ రాదు. అలాగే విపక్షం నుంచి అధికార పక్షం వైపుగా గోడ దూకుడుకు అలవాటు పడిన లెజిస్లేటర్లను బర్తరఫ్ చేయాలని రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు నిబంధనను స్పీకర్లు పాటించి తీరవలసిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ధర్మాసనం 1994లోనే స్పష్టం (ఎస్. రవినాయక్ వర్సెస్ ప్రభుత్వం కేసు)చేసింది. అలాగే కిహోటో వర్సెస్ జాచిలూ కేసులో (1992) ఇలా శాసించవలసి వచ్చింది: ‘స్పీకర్ గానీ, కౌన్సిల్ అధ్యక్షుడు గానీ 10వ షెడ్యూలు కింద బాధ్యతలు, అధికారాలు నిర్వహించేటప్పుడు లెజిస్లేచర్ సభ్యుల హక్కులను, కర్తవ్యాలను నిర్ధారించే ఒక సాధికార ట్రిబ్యునల్‌గా మాత్రమే వ్యవహరించాలి గానీ, అన్యధా కాదు. అయితే స్పీకర్/ చైర్మన్ నిర్ణయాలు మాత్రం న్యాయస్థానాల సమీక్షకు బద్ధమై ఉండాల్సిందే’. అసలు మాట్లాడే హక్కునే దేశద్రోహంగా పరిగణించే పాలక వర్గాలు ఉన్న వాతావరణమిది. ఇంకో అడుగు ముందుకు వేసి అవి న్యాయస్థానాల హక్కులను కూడా హరించే యత్నం చేస్తున్నాయి. (వ్యాసకర్త : ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు) -
ఢిల్లీ అబ్ బహుత్ దూర్ హై!!
ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజా కోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నారు. ప్రజాజీవితంలో బాధ్యతగల స్థానాల్లో ఉన్నవాళ్ల మీద ఆరో పణలు రావడం కొత్తకాదు. అలాంటప్పుడు వాళ్ళు రెండు పనులు చేయాలి. మొదటిది, తమను నమ్మి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను అప్పగించి న ప్రజలకు ఘటనల పూర్వా పరాలను వివరించి, తమవల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో జరిగిన తప్పులకు క్షమాప ణలు కోరడం. రెండోది, న్యాయప్రక్రియకు సిద్ధపడటం. తన మీద, తన పార్టీ మీద బలమైన ఆరోపణలు వచ్చిన పుడు నిర్వర్తించాల్సిన ప్రాణప్రదమైన కర్తవ్యాల్ని ఆం ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రజా కోర్టు ఇప్పటికే చంద్రబాబును దోషిగా నిర్ధారించింది. ఇక కోర్టులో ఏం జరుగుతుందనేది ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. అక్కడ నుండి బయటపడటానికి ఉన్న సాంకేతిక రంధ్రాల కోసం వారూ, వారి న్యాయ సలహాదారులూ పగలూ రాత్రి మేధోమథనం చేస్త్తున్నా రు. న్యాయకోవిదులు కోర్టుల్లో సకల మోళీలను, గారడీ లను ప్రదర్శించి సూది బెజ్జమంత రంధ్రంలోంచి ఏను గుల్లాంటి దోషుల్ని బయటపడేస్తుంటారు. ఈ కథను చాలా మంది చదివే ఉంటారు. మహారాణి తప్ప మరె వరూ ఏడు గుర్రాల బగ్గీని వాడకూడదని ఇంగ్లండులో ఒక చట్టం ఉండేది. ఒకడెవరో ఏడు గుర్రాల బగ్గీలో లం డన్ వీధుల్లో తిరిగితే, అరెస్టు చేసి బోనెక్కిస్తారు. తెలివైన అతని లాయరు ఏడోది గుర్రం (హార్స్) కాదనీ, ఆడ గుర్రం (మేర్) అని నిరూపించి తన కక్షిదారుడ్ని నిర్దోషి గా బయటపడేస్తాడు. చట్టంలో ఇలాంటి ఏ సాంకేతిక రంధ్రాన్నయినా కనిపెట్టి కేసు నుండి బయటపడాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లాయర్ల సలహాల మేరకు కొందరు నిందితులు బోనెక్కాక అనేక ప్రశ్నలను ‘కాదు’ ‘తెలీదు’ వంటి జవా బులతో, మౌనంతో దాటవేస్తారు. లీగల్ కోర్టులో చేసి నట్టు ప్రజాకోర్టులోనూ టెక్నికల్‌గా వ్యవహరించడమే చంద్రబాబు ప్రత్యేకత. ఆయన అచ్చమైన హైటెక్కు నేత! రేవంత్ రెడ్డి వీడియో క్లిప్పింగుల మీద, వాటిలో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ, ప్రాంతీయ, కులసమీకర ణల మీద రెండు రాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆ అంశాలపై నోరు తెరవడానికి బాబు సిద్ధంగా లేరు. మౌనం అర్థాంగీకారం అవుతుందని గుర్తించే స్థితిలోనూ లేరు. ఆ క్లిప్పింగుల పుట్టుక చట్టబద్ధంగానే సాగిందా? ఒక సీఎం మీద ఏసీబీ స్టింగ్ ఆపరేషన్లు, ఫోన్ ట్యాపిం గులు చేయడం చట్టసమ్మతమా? వగైరా సాంకేతిక అంశాల మీదనే ఉంది వారి ధ్యాసంతా. ఏపీకి రావల సిన రాయితీలు, సౌకర్యాలు, వెసులుబాటులు, జాతీయ స్థాయి విద్యా, వైద్య, సాంకేతిక సంస్థలు, మౌలికరంగ పథకాలు చాలా ఉన్నాయి. రాయలసీమను, ఉత్తరాం ధ్రలో మూడు జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంది. వీటి సాధనకు చంద్రబాబు పోరాటం చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా వారి పోరాటం తనను గెలిపించిన ఏపీ ప్రజల కోసం కాదు... హైదరాబాద్‌లో గవర్నర్‌కు విశేషాధికారాల సాధన కోసం. ఇదో రాజకీయ వైచిత్రి! ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఇప్పుడు రెండు విరుద్ధ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఒకైవైపు, ఏపీ సీఎం గవర్నర్ తన విశే షాధికారాలను ప్రయోగించాలని ప్రాధేయపడుతుంటే, మరోవైపు, తెలంగాణ సీఎం గవ ర్నర్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఢిల్ల్లీలోనూ దాదాపు ఇదే సీన్. ఏపీ సీఎం ఢిల్లీ వెళ్లినా జరగని పనులు తెలం గాణ సీఎం ఢిల్లీ వెళ్లకపోయినా జరిగిపోతున్నాయి. బాబు ఢిల్ల్లీ పర్యటనలో ఉండగానే తెలంగాణలోని యాదాద్రి-వరంగల్ నాలుగు లేన్ల రోడ్డు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది! ప్రధాని నరేంద్ర మోదీ అచ్చమైన గుజరాతీ వ్యాపా రి. చంద్రబాబు ఆస్థి ఖాతా అనుకుంటే ఎదురొచ్చి స్వాగ తం పలుకుతారు... వ్యయం ఖాతా అనుకుంటే పలక రించడానికీ ఆసక్తి చూపరు. ఇలాంటి విషయాలను రాష్ర్టస్థాయిలోనే పరిష్కరించుకోవాలేగానీ ఢిల్లీ వరకు తేకూడదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనడం ఢిల్లీలోని కొత్త పరిణామాలకు ఒక సంకేతం. మోదీ ప్రభుత్వానికి ఏపీ రాయబారిగా ఉంటున్న వెంకయ్య నాయుడు కూడా ఈ కష్టకాలంలో బాబుతో అంటీ ముట్టనట్ట్టుగా ఉంటున్నారు. ఢిల్లీలో మోదీతో చంద్ర బాబు ఏం మాట్లాడారో గానీ.. హైదరాబాద్ తిరిగి రాగానే ప్రధానికి సుదీర్ఘ లేఖ రాశారు. ప్రధానితో ఎక్కు వగా మాట్లాడే అవకాశం బాబుకు దక్కలేదనే ఇది సూచి స్తోంది. చంద్రబాబుకు ఢిల్ల్లీ అబ్ బహుత్ దూర్ హై!! చంద్రబాబు లేఖ ప్రధాని కార్యాలయానికి చేరక ముందే...హైదరాబాద్‌లో ఆంధ్రులకు భద్రత లేదనడం చంద్రబాబు అపోహేనంటూ ఆ లేఖలోని ప్రధాన అం శాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఖండించా రు. కేసీఆర్‌తో పాటు చంద్రబాబు కూడా యోగా శిబిరా నికి వచ్చి మానసిక వత్తిడిని దూరం చేసుకోవాలని హితవు చెప్పారు. యోగముద్రలో ఉన్న జనసేన అధి నేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. ఒకవేళ స్పందిం చినా అది బాబుకు ప్రతికూలంగా ఉండే అవకాశాలే ఎక్కువ. మిత్రపక్షాలు కూడా చంద్రబాబుకు దూరం అవుతున్నాయనడానికి ఇవన్నీ సంకేతాలు కావచ్చు. (రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు) మొబైల్: 9010757776 -
అమరావతి కారాదు సంక్షోభ నగరి!!
రాశిలోగాక వాసిలో, స్థాయిలో గాక సారంలో గొప్ప నగరాన్ని నిర్మించడం అత్యుత్తమం. గృహ వసతి, రవాణా సదుపాయాల అవస రాల కంటే సరఫరా ముందుండేటట్టు చేయగలిగితే అది సాధ్యమే. తద్విరుద్ధంగా అవసరాలను అనుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సంక్షోభం. అందుకు తావే లేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకాశాన్ని చంద్రబాబు వదులుకోరాదు. మన దేశం ఏమంత ఎక్కువగా కొత్త నగరాలను నిర్మించింది లేదు. స్వాతంత్య్రోదయ కాలంలో నిర్మిం చిన చండీగఢ్ రూపకర్త ఫ్రెంచివా డైన లి కొర్బూజె కాగా, జర్మన్ వాస్తు శిల్పి ఆటొ కొనిగ్స్ బెర్గర్ భువనేశ్వ ర్కు రూపకల్పన చేశారు. ఆపై నిర్మించిన గాంధీనగర్‌పై కోర్బూసి యర్ ప్రభావం ఉంది. ఆ అర్థంలో నవీ ముంైబె , రాయ్‌పూర్‌లు మాత్రమే బహుశా పూర్తి స్వదేశీ నమూనాలుగా లెక్క. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి.. సింగపూర్ నమూనాలతో నిర్మాణం కానుంది. సింగపూర్ ఒక నగర రాజ్యమే తప్ప వలసలతో పట్టణీకరణ దిశగా సాగుతూ అభివృద్ధి చెందుతున్న ఒక రాష్ట్ర రాజధాని కాదు. ప్రత్యేకించి ఆ అంశం కారణంగా మనకున్న పరిమిత అనుభవం నేపథ్యం నుంచే అమరావతి ఎలా ఉం డాలో ఊహించుకోవాల్సి ఉంది. మన దేశంలోని ఇతర నగ రాలన్నీ దశాబ్దాలు, శతాబ్దాల తరబడి పరిణామం చెంది నవే. ప్రామాణిక భారత నగరంగా చూపగలిగేదేదీ లేదు. అమరావతి ‘స్మార్ట్’ నగరం కావాల్సిందే. కాకపోతే ఎంత సూక్ష్మబుద్ధితో అందుకు ప్రణాళికను రూపొందిస్తాం, అమ లుచేస్తాం అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. నూతన నగరం శాసనసభ, సచివాలయం, తత్సంబంధిత వివిధ భవనాల సముదాయం ప్రధాన భాగంగా ఉండే ఒక రాష్ట్ర రాజధాని. ప్రత్యేకించి ఆ కారణంగా నిర్మాణానికి ముందే కొన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి. అమరావతి భవనాల ముందరి భాగాలు ధగధగలాడే గాజుతో కూడినవి కాకూడదు. అలాంటి భవనాలు లోపలి భాగాలను సౌఖ్యవంతం చేయడం కోసం ఖరీదైన, కొరతగా ఉన్న విద్యుత్తును తెగ కబళించేస్తాయి. ఇక రవాణా కార్లపై ఆధారపడినది కాకూడదు. గృహ వసతి, రవాణా వ్యవస్థలే ఒక నగరం నాణ్యత, సమర్థతలకు కొలబద్ధలు. చండీగఢ్ నగర ప్రణాళిక వృద్ధి చెందుతున్న సేవలనందించే వర్గానికి, అల్పాదాయ వర్గాలకు చౌకగా గృహవసతి ఏర్పాట్లను విస్మ రించి తప్పు చేసింది. నగరం చుట్టూ మురికివాడల వలయా న్ని సృష్టించుకుంది. అక్కడ నివసించేవారు ఎంతో వ్యయప్ర యాసలతో, నానా బాధలూ పడి పని కోసం నగరంలోకి వెళ్లి రావాలి. ప్రధానంగా ఉద్యోగుల గృహవసతి సహా ప్రభుత్వ అవసరాల కోసమే తయారైన గాంధీనగర్ కూడా వలసవచ్చే పేద గ్రామీణ ప్రజలను విస్మరించింది. ముంబై నగర విస్తీ ర్ణానికి సమానంగా ఉండే నవీ ముంబై ఆవిర్భావం సుదీ ర్ఘంగా సాగింది. పేరుకు ప్రపంచంలోనే అతి పెద్ద నగరమైనా నేటికీ అది నత్తనడక నడుస్తోంది. అందులో మూడోవంతు భాగం మాత్రమే మునిసిపాలిటీల కిందికి వచ్చింది. మరో మూడో వంతు మురికివాడలే. గ్రామా లను మురికివాడలుగా మారేంతవ రకు నిర్లక్ష్యం చేశారు. వాటిలో సదు పాయాలు శూన్యం, జనసమ్మర్థం ముమ్మరం. త్వరలో వివరాలను వెల్లడించ నున్న అమరావతి భారీ ఎత్తున గృహ వసతి కల్పనకు హామీనిచ్చే బాధ్య తను స్వీకరించాలి. నివాసానికి సిద్ధం గా ఉన్న గృహాలు కనీసం లక్షయినా ఉంటేనే తక్షణమే అది జనావాస నగరంగా మారుతుంది. కొద్దికొద్దిగా పెంచుకుం టూపోయే పద్ధ్దతి ధరలు పెరగడానికి మాత్రమే దారితీస్తుం ది. అలాగాక ప్రభుత్వం మాత్రమే అక్కడుండేట్టయితే... సాయంత్రానికి అది భూత నగరిగా మారుతుంది. రోడ్ల మీద కార్లను నివారించడం, చౌకగా సమర్థవంతమైన రవాణాను సాధ్యం చేయడం అనే రెండు కారణాల రీత్యా ముందు నుం చే ప్రజార వాణా వ్యవస్థను ఎంచుకోవాలి. స్మార్ట్ సిటీ అంటే ఐటీ రంగ ఉద్యోగులకు పార్కింగ్ స్థలాల లభ్యతే కానవస రంలేదు. నగర ప్రజలకు ఎంత చౌకగా గృహవసతిని, రవా ణాను అందిస్తామనేది గీటురాయి కావాలి. హాంకాంగ్ వాసులకు కారు అవసరం లేదు. మెరుగైన ప్రభుత్వ రవాణా వ్యవస్థ వల్ల ఫ్రాన్స్‌లోని లీయోన్ నగరంలో కార్ల వాడకం 20 శాతం పడిపోయింది. మ్యూనిచ్ కార్ల అవసరమే ఉండన ట్టుగా గృహసముదాయాల ప్రణాళికలను రచిస్తోంది. ప్రభు త్వ రవాణా వ్యవస్థ ఔచిత్యాన్ని లండన్ సైతం గుర్తించింది. హెల్సింకి కార్ల కంటే సైకిళ్లకు ఎక్కువ స్థలాన్ని కేటాయి స్తోంది. ఈ జాబితా చాలానే ఉంది. ప్రపంచం ఎక్కువ జనసమ్మర్థత, ఎత్తై భవనాలు, తక్కువ కార్లపై ఆధారపడే నమూనా దిశగా పయనిస్తోంది. అదే నేటి పట్టణ ప్రణాళికా వివేకంగా పెంపొందుతోంది. కానీ మనం మాత్రం కార్ల వాడకం ఇంకా ఇంకా పెరగాల్సిం దే, రోడ్లు మరింతగా కిక్కిరిసిపోవాల్సిందేనన్న భావనలోనే చిక్కుకుపోయాం. ప్రజా రవాణా వ్యవస్థ పట్ల మన్నన కొరవ డింది. నగర జీవితాలను భయంకరమైన రోజువారీ ఒత్తిడిమ యంగా మార్చుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు విజ్ఞ తతో రాసిలోగాక వాసిలో, స్థాయిలోగాక సారంలో గొప్ప నగరాన్ని రూపొందించడం అత్యుత్తమం. గృహవసతి, రవా ణా సదుపాయాల అవసరాల కంటే సరఫరా ముందుం డేట్టుగా చేయగలిగితే అది సాధ్యమే. కానీ అవసరాలననుస రించి సరఫరా సాగుతుండటమే మన పట్టణీకరణలోని సం క్షోభం. అందుకు తావేలేని గొప్ప నగరాన్ని నిర్మించే అవకా శం బాబు ముందుంది. దాన్ని ఆయన వదులుకోకూడదు. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com) -
క్రీడా పాత్రికేయుడు పిళ్లై కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ క్రీడా పాత్రికేయుడు టీఎన్ పిళ్లై (85) శుక్రవారం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా పాత్రికేయుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా టీఎన్ పిళ్లై పని చేశారు. దక్కన్ క్రానికల్‌లో క్రీడా సంపాదకులుగా పిళ్లై పనిచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుగున్న పిళ్లై శుక్రవారం తిరిగిరాని లోకాలకు వెళ్లారు. -
కృష్ణా పత్రిక ఎడిటర్ పిరాట్ల కన్నుమూత
-
కృష్ణా పత్రిక ఎడిటర్ పిరాట్ల కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, కృష్ణా పత్రిక ఎడిటర్ పిరాట్ల వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి కన్నుమూశారు. నారాయణగూడలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన రాత్రి 7.45 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను నవంబర్ 21న ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం నుంచి ఆయన వెంటలేటర్ మీద ఉన్నారు. యూరిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు పాడైపోవడంతో ఆయన చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. పిరాట్ల వెంకటేశ్వర్లు మరణం పట్ల జర్నలిస్టు సంఘాలు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
విజయ్‌కుమార్‌కు అశ్రునివాళి
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కరీంనగర్: అనారోగ్యంతో మృతి చెందిన సీని యర్ జర్నలిస్టు, జీవగడ్డ సాయంకాలం పత్రిక సంపాదకుడు బి.విజయ్‌కుమార్ అంత్యక్రియ లు ఆదివారం ఘనంగా జరిగాయి. శనివారం ఆయన చనిపోయారనే విషయం తెలియగానే వివిధ ప్రాంతాల నుంచి జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. విజయ్‌కుమార్ పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం రాత్రి నుంచి కరీంనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఉంచారు. బస్సుయాత్ర సందర్భంగా జిల్లాకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం అక్కడికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించి, అంజలి ఘటించారు. అశ్రునయనాల మధ్య నగరంలో అంతిమయాత్ర, అంత్యక్రియలు నిర్వహించారు. అంతి మయాత్రలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్, విసరం నేత వరవరరావు, రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరె డ్డి భాస్కర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. ఎంతో మంది జర్నలిస్టులకు మార్గదర్శకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌కుమార్ మృతి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. 1971లో విద్యుల్లత సాహిత్య పత్రికను చాలాకాలం తన సంపాదకత్వంలో నిర్వహించారని, ఎమర్జెన్సీ కాలంలో పోలీసుల చిత్రహింసలు, 20 నెలల జైలుశిక్ష అనుభవించిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి జర్నలిస్టులు, ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. అద్దె ఇల్లు.. ఆరుబయటే వీడ్కోలు విజయ్‌కుమార్ కరీంనగర్‌లోని గణేష్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్య సబిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె రీనా ఆయన చితికి నిప్పంటించి దహన సంస్కారాలు చేశారు. విజయ్‌కుమార్ పార్కిన్సన్ వ్యాధితో అయిదేళ్ళుగా మంచానికే పరిమితిమయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం విషమించటంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఆయన కన్నుమూశారు. అద్దె ఇల్లు కావటంతో మృతదేహాన్ని జర్నలిస్టులు నేరుగా ప్రెస్‌క్లబ్‌కు తరలించారు. అంతిమ సంస్కారాల తర్వాత ఆయన కుటుంబీకులు, బంధువులకు ప్రెస్‌క్లబ్‌లోనే విడిది ఏర్పాటు చేశారు. -
జర్నలిస్టు విజయ్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు జీవగడ్డ విజయ్‌కుమార్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరీంనగర్ కేంద్రంగా విద్యుల్లత, జీవగడ్డ పత్రికలు నడిపిన విజయ్‌కుమార్ జీవితాంతం వృత్తిపట్ల పూర్తి నిబద్ధత ప్రదర్శించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఎంతో మంది జర్నలిస్టులకు గురువుగా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారని కొనియాడారు. -
సీనియర్ జర్నలిస్టు ఎంవీ కామత్ కన్నుమూత
మణిపాల్ (కర్ణాటక)/న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్టు, ప్రసారభారతి మాజీ చైర్మన్ మాధవ్ విఠల్ కామత్ గురువారం ఉదయుం కన్నుమూశారు. 93 ఏళ్ల కామత్‌కు ఛాతీలో నొప్పిరావడంతో బుధవారం రాత్రి మణిపాల్‌లోని కస్తూర్బా ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రమైన గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఎంవీ కామత్‌గా అందరికీ పరిచితులైన ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీతకూడా. 1946లో కామత్ ముంబైలో ‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’లో విలేకరిగా పాత్రికేయ జీవితం ప్రారంభించారు. 1955 నుంచి 58 వరకు ఆయన ఐక్యరాజ్యసమితిలో పీటీఐకి స్పెషల్ కరెస్పాండెంట్‌గా పనిచేశారు. అనంతరకాలంలో ఆయన ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియూ, ఫ్రీ ప్రెస్ బులెటిన్, భారత్ జ్యోతి వంటి పత్రికలకు ఎడిటర్‌గా, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు యుూరొప్, అమెరికాల్లో కరెస్పాండెంట్‌గా పనిచేశారు. 1947 ఆగస్టు 14వ తేదీ భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పు డు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతంత్య్ర ప్రకటన వెలువడే సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. ఆ అద్భుత ఘట్టాన్ని రిపోర్టుచేసిన వారిలో ఇప్పటివరకు ఉన్నది ఆయన ఒక్కరే కావడం విశేషం. ఆయన 45 పుస్తకాలు రాశారు. 1921 సెప్టెంబర్ 7వ తేదీన ఆయన కర్ణాటకలోని ఉడిపిలో జన్మించారు. కామత్ మృతికి ప్రదాని మోదీ సంతాపం తెలిపారు. -
మనసు పెట్టి రాస్తే జీవకళ! మెదడు పెట్టి రాస్తే సమగ్రత!!
అంతర్వీక్షణం వి. హనుమంతరావు, సీనియర్ జర్నలిస్ట్... అంటే ఆయన సంతోషిస్తారు. ప్రొఫెసర్ హనుమంతరావు, ఆర్థికవేత్త హనుమంతరావు అనే మకుటాలు నాకొద్దంటూ నిక్కచ్చిగా చెప్పేస్తారు. గడచిన ఆగస్టు 30వ తేదీతో 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టారాయన. ఆయన జర్నలిస్టు జీవితానికి అరవై దాటాయి. ఈ సందర్భంగా ఇది ఆయన అంతర్వీక్షణం. పాత్రికేయ వృత్తి గురించి ఒక్కమాటలో..! అత్యంత బాధ్యతాయుతమైనది, పవిత్రమైనది. మీ రోజుల్లో శిక్షణ ఉండేదా? అప్పట్లో జర్నలిజం కోర్సుల్లేవు. ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్, టైపింగ్, షార్ట్‌హ్యాండ్ అర్హతలతో ఈ వృత్తిలోకి వచ్చాను. ఓనమాల నుంచి పనిచేస్తూనే నేర్చుకున్నాను. తప్పులు చేస్తూ... సీనియర్లు దిద్దిన కాపీ చూసి నేర్చుకున్న తరం మాది. మీ తొలి ఉద్యోగం... పోస్టల్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో స్టెనోగ్రాఫర్. మరి పత్రికారంగంలోకి ఎలా వచ్చారు? ప్రజాశక్తిలో పుచ్చలపల్లి సుందరయ్యకు సహాయకుడిగా టైప్, షార్ట్ హ్యాండ్ వచ్చిన వ్యక్తి కావాలని స్నేహితులు చెప్పడంతో చేరాను. ఆ తర్వాత పార్లమెంటు కార్యకలాపాలను నోట్స్ రాసుకుని కథనాలు తయారు చేయడానికి షార్ట్ హ్యాండ్ వచ్చు అనే అర్హతతోనే నన్ను ఢిల్లీకి పంపారు. అప్పట్లో పత్రికల మధ్య అక్షరయుద్ధం సాగేదా? 1955 మధ్యంతర ఎన్నికల సమయంలో ఆంధ్రప్రభ (నార్ల వెంకటేశ్వరరావు) - విశాలాంధ్ర (రాంభట్ల కృష్ణమూర్తి) పత్రికల మధ్య కార్టూన్ల యుద్ధం తీవ్రంగా సాగింది. పాత్రికేయునిగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా? యుఎన్‌ఐలో పనిచేస్తున్నప్పుడు మాకు పిటిఐతో పోటీ. జాతీయపత్రికల్లో హైదరాబాద్ కనిపించాలంటే దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే వార్తాకథనాలు రాయాలి. రాజేంద్రనగర్, తార్నాకల్లోని అఖిలభారత సైన్సు, సాంకేతిక సంస్థల్లో నాకు మంచి విషయాలు దొరికేవి. మీరు కాలరెగరేసుకుని చెప్పగలిగిన రిపోర్టింగ్? బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో విమాన వాహక నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’ నుంచి యుద్ధవార్తలు పంపడం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనొక్కడినే. మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు? ఇరవై వరకు ఉంటాయి. ‘ఎపి యట్ 50’ ఆంధ్రప్రదేశ్ మీద సమగ్ర సమీక్ష సమాచారంతో ఇంగ్లిష్‌లో ప్రచురించిన తొలి పుస్తకానికి సంపాదకత్వం వహించాను. నేను స్థాపించిన డిఎన్ఎఫ్ (డేటా న్యూస్ ఫీచర్స్) అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి న్యూస్ ఏజెన్సీ. విలేఖరిగా మీరు ఊహించని హఠాత్పరిణామం ఏదైనా ఉందా? విశాఖపట్నంలో జరిగింది. పాకిస్తాన్ సబ్‌మెరైన్ విశాఖ తీరంలో మునిగిపోయింది. పాక్ జలాంతర్గామిని పేల్చివేసిన శబ్దాన్ని విశాఖ నగరం మొత్తం విన్నది. వైస్ అడ్మిరల్ ఆ విషయాన్ని పత్రికాసమావేశంలో వెల్లడించి మేమున్న గది తలుపులు వేయించాడు. ఎందుకలా!... పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ వార్తను ప్రభుత్వం ప్రకటించకముందు పత్రికల్లో రాకూడదని. వ్యక్తికి - విలేఖరికి తేడా!... వ్యక్తి తప్పు చేస్తే దాని దుష్ర్పభావాన్ని వారు మాత్రమే భరిస్తారు. జర్నలిస్టు తప్పు రాస్తే ఒక వాస్తవం మరుగున పడి, అవాస్తవం సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. జర్నలిజానికి కేంద్రబిందువు రాజకీయాలేనా? కాదు, ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా సాగే వార్తలకు, వార్తా కథనాలకు కట్టుబడి ఉండడమే విలేఖరి తనకు తాను గీసుకోవాల్సిన లక్ష్మణరేఖ. జర్నలిస్టుకు మీరిచ్చే సందేశం? ఈ వృత్తిలో కొనసాగుతున్నది జీతం కోసమే, అయినా ‘మనసు పెట్టి పని చేస్తే రాష్ట్రానికీ, దేశానికీ, ప్రజలకు సేవ చేయవచ్చు’ అనే తలంపు ఉండాలి. అప్పుడే వార్తకు జీవకళ వస్తుంది. మెదడుకు పని చెప్పి మేధస్సు జోడిస్తే వార్తకు సమగ్రత వస్తుంది. - వాకా మంజులారెడ్డి -
హక్కుల నేత ఎంటీ ఖాన్ కన్నుమూత
హైదరాబాద్: పౌరహక్కుల సంఘం నేత, సీనియర్ జర్నలిస్టు ఎం.టి.ఖాన్ (85) బుధవారం హైదరాబాద్ పురానాపూల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సాయంత్రం పురానాపూల్ మూసాఖాద్రీ దర్గాలో ఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఖాన్ గొప్ప మానవతావాది అని.. పౌర హక్కుల కోసం తుదిశ్వాస వరకు పోరాడారని కొనియాడారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేక పోరులో అరెస్టైన తొలితరం పౌరహక్కుల నేతల్లో ఖాన్ ఒకరని చెప్పారు. పౌర హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ శేషయ్య, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, సియాసత్ సంపాదకులు జాహేద్ అలీఖాన్, సినీ దర్శకులు నారాయణమూర్తి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం సంతాపం: ఎంటీ ఖాన్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఖాన్ పాత్రికేయరంగానికి చేసిన సేవలను కొనియాడారు. సీపీఐ సంతాపం..: ఎం.టి.ఖాన్ మృతిపట్ల తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంటకరెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అణగారినవర్గాల ఉద్యమాలు, హక్కుల రక్షణతో ఖాన్ జీవితం ముడిపడి ఉన్నదని, ఆయన మరణం ప్రజాఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు. -
చర్చనీయాంశమయ్యే ప్రేమకథ
‘‘చాలామంది కాలేజీ అమ్మాయిలతో మాట్లాడి ఎంతో పరిశోధన చేసి ఈ కథాంశం తయారు చేశాను. కచ్చితంగా చర్చనీయాంశమయ్యే ప్రేమకథ ఇది’’ అని దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావ్య ఫిలింస్ పతాకంపై కృష్ణమూర్తి సమర్పణలో యక్కలి రవీంద్రబాబు నిర్మించిన చిత్రం ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, ప్రియాంక పల్లవి, దివ్య, సత్యానంద్. ఎల్ తదితరులు ఇందులో ముఖ్యతారలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శుక్రవారం హైదరాబాద్‌లో సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు, సీనియర్ ఫొటో జర్నలిస్ట్ సాయిరమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘చిత్రీకరణ పూర్తయింది. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు. క్రైమ్‌ని ఎంకరేజ్ చేయకుండా పాజిటివ్‌గా ఉండే చిత్రమిదని మనోజ్ నందం చెప్పారు. అమాయకత్వంతో కూడిన కామెడీ పాత్ర చేశానని అనిల్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక ప్రియాంక పల్లవి, ఎడిటర్ అర్చన ఆనంద్, సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. బాపిరాజు, రాజా. జి, ఎఫ్ఎమ్ బాబాయ్ మాట్లాడారు. -
సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి
పెనుగొండ/పెనుగొండ రూరల్, న్యూస్‌లైన్ : సీనియర్ జర్నలిస్ట్, ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన ఇవటూరి వెంకట బసవయ్య(57) మంగళవారం ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం సుస్తీ చేయటంతో తణుకు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువ జామున మృతి చెందారు. 1988లో ఉదయం దినపత్రికతో విలేకరిగా జీవితం ప్రారంభించిన బసవయ్య అనంతరం ఆంధ్రప్రభలో పని చేశారు. ప్రస్తుతం వార్త విలేకరిగా ఉన్నారు. బసవయ్యకు కుమారుడు, కుమార్తె సంతానం. పేద కుటుంబం కావడంతో కుమారుడు జీవనోపాధి నిమిత్తం గతేడాది గల్ఫ్ దేశం వెళ్లాడు. మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన బసవయ్య మరణవార్తకు అధికారులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలేటిపాడులోని ఇంటివద్ద ఉంచిన ఆయన మృతదేహాన్ని ఇరగవరం, పెనుగొండ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు.సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పెనుగొండ జెడ్పీటీసీ రొంగల రవికుమార్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు యాదాల ఆశాజ్యోతి, బిరుదగంటి రత్నరాజు, కడలి మంగాదేవి, కేతా భీముడు, పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కేతా సత్యనారాయణ(సత్తిబాబు) తదితరులు ఉన్నారు. ఆచంట ప్రెస్ క్లబ్ రూ.10వేల ఆర్థిక సాయం ఆచంట నియోజకవర్గ ప్రెస్‌క్లబ్ సభ్యులు బసవయ్య కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు జవ్వాది మోహన వెంకటేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి గుర్రాల శ్రీనివాసరావు, సభ్యులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సంతాపం ఏలూరు (ఫైర్ స్టేషన్ సెంటర్) : సీనియర్ జర్నలిస్ట్ ఐవీ బసవయ్య ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.భాస్కర నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, కొవ్వూరు డివిజనల్ పౌరసంబందాధికారి కె. రామ్మోహనరావు, ఏలూరు డివిజనల్ పౌరసంబందాధికారి ఆర్వీఎస్ రామచంద్రారావు తదితరులు ఉన్నారు. -
ప్రముఖ జర్నలిస్టు పాపయ్య శాస్త్రి మృతి
హైదరాబాద్, సీనియర్ జర్నలిస్టు శివకోటి పాపయ్య శాస్త్రి(78) శుక్రవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 50 ఏళ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. 1955లో డెక్కన్ క్రానికల్ రిపోర్టర్‌గా, 1960-63 వరకు ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్‌గా, 1964-66 గుంటూరులో ఆంధ్ర పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా, 1967లో ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్‌గా, 1980-91 మధ్య ఆంధ్రప్రభ బ్యూరోచీఫ్‌గా, 1994-2004 మధ్య దూరదర్శన్‌లో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పనిచేశారు. శాస్త్రికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కాగా, శాస్త్రి అంత్యక్రియలు శనివారం సాయంత్రం జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
సినిమాగా సినిమా పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ నాదెండ్ల నందగోపాల్ రచించిన ‘సినిమాగా సినిమా’ పుస్తకావిష్కరణ యువకళావాహిని ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డా. సి.నారాయణరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి విచ్చేసిన అతిథులకు అందించారు. ‘సినిమాగా సినిమా’ అనే పేరే విచిత్రంగా ఉందని, నందగోపాల్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని సినారె అన్నారు. నందగోపాల్‌తో చెన్నయ్నాటి పరిచయాన్ని డి.రామానాయుడు గుర్తు చేసుకున్నారు. తన సినీజీవితంలో నందగోపాల్ మరిచిపోలేని వ్యక్తి అని ఈ సందర్భంగా ఆయనన్నారు. ‘‘ఈ బుక్ రాసింది నేనే అయినా... రాయడానికి కారకులు మాత్రం పరుచూరి హనుమంతరావుగారు. ఈ పుస్తకం పూర్తి చేయడానికి అయిదేళ్లు పట్టింది. అది కూడా ఆయన ప్రోద్భలంతో. హనుమంతరావు నాతో ఓ మాట అన్నారు. ‘నీకు తెలిసింది మట్టిలో కలిసిపోనీకు. నా చేతిలో పెట్టు’ అని. అందుకే... ఈ పుస్తకం రాశాను.. ఈ పుస్తకం ఆయన వెలిగించిన దీపం. అందుకే... ఆయనకే అంకితం ఇస్తున్నా’’ అని నందగోపాల్ చెప్పారు. పరుచూరి హనుమంతరావు, సారిపల్లి కొండలరావు, రమేష్‌ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, నన్నపనేని రాజకుమారి, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, ఏఎస్ జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాజ్‌నాథ్‌ను కలిసిన శైలేష్
పరిగి, న్యూస్‌లైన్: సీనియర్ జర్నలిస్ట్, జీ24 గంటలు టీవీ చానల్ మాజీ సీఈఓ శైలేష్‌రెడ్డి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పార్టీ కండువా వేసి అభినందించారు. ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి చేతుల మీదుగా శైలేష్‌రెడ్డి పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ విషయాన్ని శైలేష్రెడ్డియే స్వయంగా వెల్లడించారు. నేడు అధికారికంగా చేరిక.. సీనియర్ జర్నలిస్ట్, జీ 24 అవర్స్ న్యూస్ చానల్ మాజీ సీఈఓ శైలేష్‌రెడ్డి ఆదివారం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధిష్టానంతో ఆయన సంప్రదింపులు జరిపారు. బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన నేపథ్యంలో ఆ పార్టీలో చేరటం లాంఛనమే కానుంది. శైలేష్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి గాని, పరిగి అసెంబ్లీ స్థానం నుంచి గాని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పరిగి నియోజకవర్గం బీజేపీ నాయకులతోనూ కొంత కాలంగా ఆయన సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. తనకు సన్నిహితులైన ఇతర పార్టీల నాయకులతోనూ ఇప్పటికే ఈ విషయమై ఆయన చర్చించినట్లు సమాచారం. పార్టీలో చేరనున్న నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలంగా పరిగి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో క్రీయశీలకంగా వ్యవహరిరిస్తూ, బీజేపీ నాయకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. స్థానికుడు కావటం కలిసొచ్చే అంశం..! శైలేష్రెడ్డిది పరిగి నియోజకవర్గంలోని గండేడ్ మండలం జూలపల్లి గ్రామం. స్థానికుడు కావటం ఆయనకు కలిసొచ్చే అంశం కానుంది. నియోజకవర్గంలో అతను స్థానికుడు కావటంతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాకుండా పరిగి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలో పరిచయాలు ఉండటం, ఇటీవల తెలంగాణ విషయంలో బీజేపీ అనుసరించిన విధానాలు సైతం ఆయనకు సానుకూలంగా మారనున్నాయని ఆయన ఆశిస్తున్నారు. అయితే రెండు మూడు దఫాలుగా పరిగి తాలుకా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీనియర్, నియోజకవర్గానికి చెందిన మరో బీసీ నాయకుడు సైతం ఈసారి టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్‌కు అంత్యక్రియలు
చిలకలూరిపేట, న్యూస్‌లైన్: సాక్షి దినపత్రికలో చీఫ్ సబ్ఎడిటర్గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీమోహనరావు(57) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో సోమవారం సాయంత్రం అశృనయనాలనడుమ సాగింది. ఈయన గుండెపోటుతో ఆదివారం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం విదితమే. ఈయనకు భార్య సువర్చల, కుమారులు రామలక్ష్మణులు, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోని హిందు శ్మశాన వాటికలో అంతక్రియలు నిర్వహించారు. భౌతికకాయాన్ని గుంటూరు సాక్షి దినపత్రిక బ్రాంచి మేనేజర్ ఆర్.రామచంద్రరెడ్డి, ఏపీయూడబ్యూజే జిల్లా అధ్యక్షుడు పి భక్తవత్సలరావు, తదితరులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
సాక్షి సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్రావు హఠాన్మరణం
సాక్షి, హైదరాబాద్: సాక్షి సీనియర్ జర్నలిస్టు పులిపాక మురళీ మోహన్‌రావు(57) ఆదివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హైదరాబాద్ అత్తాపూర్‌లో నివాసముంటున్న ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆయన మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన మురళీమోహన్రావు గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పనిచేశారు. ప్రస్తుతం సాక్షి దినపత్రికలో రీజియన్ డెస్క్‌లో చీఫ్ సబ్ఎడిటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మురళీమోహన్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆయన మరణవార్త తెలియగానే సాక్షి సిబ్బందిలో విషాదం నెలకొంది. సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళీతోపాటు సహచర ఉద్యోగులు, సిబ్బంది కేర్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మురళీమోహన్రావు హఠాన్మరణం పట్ల జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అత్తాపూర్‌లోని సంగం స్మశాన వాటికలో సోమవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా జగన్ దీక్ష విరమించాలి