Tirumala Brahmotsavam
-
తిరుమల : సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహన సేవ (ఫొటోలు)
-
సేనాపతి ఉత్సవం.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి తరపున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో శ్రీవారి ఉత్సవాలు.. 12వ తేదీ రాత్రి ధ్వజావరోహణంతో ముగుస్తాయి.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ క్రమంలో ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. దీన్నే ‘మృత్సంగ్రహణ యాత్ర’ (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. 05వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 06వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 07వ తేదీ సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రికి సర్వభూపాల వాహనం, ఎనిమిదో తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతారు. గరుడ సేవకు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.09వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 11వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 12వ తేదీ శనివారం ఉదయం చక్రవాహనం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. అక్టోబరు 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబరు 8 అర్ధరాత్రి వరకు ద్విచక్రవాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. అలాగే.. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై శ్రీనివాసుడు (ఫొటోలు)
-
హనుమంత వాహనంపై శ్రీవారి దర్శనం
-
తిరుమల బ్రహ్మోత్సవాలు : సింహ వాహనం పై శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. చివరిరోజైన మంగళవారం పుష్కరిణిలో శ్రీవారికి చక్ర స్నానం వేడుకగా ముగిసింది. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇవాళ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రత్తాళ్వర్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రత్తాళ్వరుకు అర్చకులు పుష్కరిణీలో పవిత్ర స్నానం ఆచరించారు. సుదర్శన చక్రతాళ్వార్‌ను పుష్కరిణిలో పవిత్ర స్నానం తర్వాత భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం వరకు చక్రస్నానం పవిత్రత ఉంటుందని,భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వైభవోపేతంగా నిర్వహించింది. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకరాల్లో మలయప్పస్వామి నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయంలోని పలు ఆర్జిత ఏకాంతంగా నిర్వహించింది టీటీడీ. ప్రముఖుల సిఫార్సు లేఖల దర్శనంతో పాటు పలు ప్రత్యేక దర్శనాలను TTD రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల(అక్టోబర్) 15న నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అవుతుంది. చక్రస్నానమంటే.. బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక.. పరమాత్మ సుదర్శన స్వామిని ముందుంచుకొని పుష్కరిణిలో తీర్థమాడుటే చక్రస్నానం. దీనినే చక్రతీర్థం అని కూడా అంటారు. బ్రహ్మోత్సవము అంటే యజ్ఞం. యజ్ఞం పూర్తిగానే అవభృధ స్నానం చేయాలి. ‘భృధం’ అంటే బరువు, ‘అవ’ అంటే దించుకోవడం. ఇన్ని రోజులు యజ్ఞం నిర్వహించి అలిసిపోయినవాళ్లు ఆ అలసట బరువును స్నానంతో ముగించుకుంటారు. యజ్ఞంలో పాల్గొనని వారు కూడ ‘అవభృంధం’లో పాల్గొంటే యజ్ఞ ఫలితం వస్తుందని శాస్త్ర నిర్వచనం. చక్రస్నానం నాడు సుదర్శన స్వామి, మలయప్ప స్వామితో కలిసి స్నానం చేసే మహాభాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలం. -
తిరుమల బ్రహ్మోత్సవాలు: భక్తజనసందోహం నడుమ శ్రీవారికి రథోత్సవం (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: శ్రీవారికి రథోత్సవం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. సోమవారం ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్తజనసందోహం నడుమ ఉదయం 6గం.55ని. రథోత్సవం మొదలుకాగా.. స్వామివారిని రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట తిప్పారు. గోవింద నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీన్నివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు కానీ, సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం. రాత్రి అశ్వవాహనం ఇవాళ రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. రేపు చివరి రోజు రేపు(సెప్టెంబర్ 26, మంగళవారం) చక్ర స్నాన మహోత్సవంలో ముగియనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తగ్గిన భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాలలో ఆదివారం ఏడవ రోజు శ్రీవారిని 66,598 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 3.88 కోట్లుగా లెక్క తేలింది. 25,103 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. -
Tirumala: చంద్రప్రభ వాహనంపై ఉరేగిన స్వామివారు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఏడో రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రప్రభ వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వాహన సేవలో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. -
తిరుమల బ్రహ్మోత్సవాలు స్వర్ణరథంపై గోవిందుడు (ఫోటోలు)
-
తిరుమల బ్రహ్మోత్సవాలు:స్వర్ణరథంపై గోవిందుడు
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం స్వర్ణరథంపై దర్శనమిస్తున్నారు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగుతున్నారు స్వర్ణరథనాకి కల్యాణకట్ట నుంచి తెప్పించిన బంగారు గొలుసుతో స్వామివారిని అలంకరించారు. ఈరోజు ఉదయం హనుమంత వాహనంలో దర్శనమిచ్చారు శ్రీవారు. ఈ రాత్రికి గజవాహనంలో దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. టీటీడీ ఏర్పాట్లు భేష్.. బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడ వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. గరుడ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అందిస్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా. మరోవైపు భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు పయనమయ్యారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు 2.1 కిలోమీటర్ల దూరమే ఉండటంతో భక్తులు ఈ మార్గం మీదుగా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. రద్దీ నేపథ్యంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా పోలీసులు జియో ట్యాగింగ్ వేశారు. అలాగే, గరుడసేవ నేపథ్యంలో తిరుమల బాలాజీ బస్టాండ్ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహన రాకపోకలను టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు నిషేధించారు. ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్, రాం భగీచా, నందకం గెస్ట్‌హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు. దీంతో భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా కొండ మీదకు సాఫీగా చేరుకుని గరుడ సేవను వీక్షించారు. -
గరుడ వాహనంపై గోవిందుడు
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి 7 గంటలకు ఆరంభమైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శుక్రవారం ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు సాక్షాత్కరించారు. శ్రీవారు మోహినీ రూపంలో దంత పల్లకిపై, పక్కనే వెన్న ముద్ద చేతబట్టిన చిన్నికృష్ణుడితో కలిసి భక్తకోటిని అనుగ్రహించారు. కాగా, తిరుమలలో శనివారం శ్రీవారు స్వర్ణరథంపై సాయంత్రం 4 గంటల నుంచి ఆలయ పురవీధుల్లో ఊరేగనున్నారు. కాగా, శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకుని వాహన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఏర్పాట్లు భేష్.. బ్రహ్మోత్సవాల్లో అతిముఖ్యమైన గరుడ వాహన సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2 లక్షల మంది వేచి ఉండేందుకు వీలుగా గ్యాలరీలను నిర్మించింది. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి టీటీడీ సిబ్బంది అనుమతించారు. ఇలా రెండోసారి రీఫిల్లింగ్ చేసి భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. గరుడ వాహన సేవ నేపథ్యంలో వాహనాలపై తిరుమలకు చేరుకునే భక్తులతో ఘాట్ రోడ్డు అత్యంత రద్దీగా కనిపించింది. మధ్యాహ్నం 2 గంటలకే అన్ని గ్యాలరీలూ నిండిపోయాయి. వీరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు, పాలు, బాదం పాలు, కాఫీ, మజ్జిగ, మంచినీరు, గుగ్గిళ్లను టీటీడీ అందిస్తూ వచ్చింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని నియమించింది. గరుడ సేవను తిలకించడానికి 3 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు చేరుకున్నట్లు టీటీడీ అంచనా. మరోవైపు భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు నుంచి పెద్ద ఎత్తున తిరుమలకు పయనమయ్యారు. శ్రీవారిమెట్టు నుంచి తిరుమలకు 2.1 కిలోమీటర్ల దూరమే ఉండటంతో భక్తులు ఈ మార్గం మీదుగా తిరుమలకు చేరుకునేందుకు ఆసక్తి చూపారు. రద్దీ నేపథ్యంలో చిన్న పిల్లలు తప్పిపోకుండా పోలీసులు జియో ట్యాగింగ్ వేశారు. అలాగే, గరుడసేవ నేపథ్యంలో తిరుమల బాలాజీ బస్టాండ్ నుంచి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహన రాకపోకలను టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులు నిషేధించారు. ఉదయం నుంచి బాలాజీ బస్టాండ్, లేపాక్షి సర్కిల్, రాం భగీచా, నందకం గెస్ట్‌హౌస్, వెంగమాంబ అన్నదాన సత్రం వరకు వాహనాల అనుమతిని నిషేధించారు. దీంతో భక్తులెవరూ ఇబ్బందులు పడకుండా కొండ మీదకు సాఫీగా చేరుకుని గరుడ సేవను వీక్షించారు. -
Tirumala: వైభవంగా గరుడోత్సవం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు.. శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వైభవంగా మొదలైంది. గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. చిరు జల్లులతో వరుణుడు స్వాగతం పలికారు. తిరు వీధులు భక్తులతో నిండిపోయి.. గోవింద నామ స్మరణతో మారుమోగాయి. వేద పండితుల మంత్రాలు, భక్తుల గోవింద నామాలు , మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచే చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క మండలాల నుంచి భక్తులు తుమ్మలగుంటకు అధికంగా తరలివచ్చారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో అలంకరించారు. ఏడాది మొత్తంలో.. గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్నది తెలిసిందే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు అంచనా. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డుకు భక్త సంద్రం తరలి వచ్చింది. గరుడోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించారు. ఇస్కాన్ ప్రతినిధులు ఆలయం వద్దకు చేరుకుని సారె సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి సారె సమర్పణ శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. సుమారు వెయ్యి మంది గ్రామస్తులు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు తీసుకు వచ్చి స్వామి వారికి సమర్పించారు. ఉదయం మోహినీ అవతారంలో నిత్య కళ్యాణ శోభితుడు అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కల్యాణ వెంకటేశ్వర స్వామి మోహినీ అవతారంలో పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంకు వున్న ప్రత్యేకత ఏమంటే మోహినీ అవతారం లో వున్న స్వామి భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల ఆభరణాలు ధరించి.. కుడి చేతిలో చిలుకను పట్టుకుని.. ముందు ఏర్పాటు చేసిన అద్దంలో ముఖాన్ని చూస్తూ వుంటారు. స్వామి వారి పల్లకీ సేవలో భక్తులు తరించి పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాల్లో రేపు.. కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు..!
-
తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
-
బ్రహ్మోత్సవాలు రెండో రోజు.. శ్రీవారి సేవలో సీఎం జగన్
-
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్
CM Jagan Tirumala Tirupati Tour Live Updates 07:19AM, 19-09-2023 ►తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని పద్మావతి అతిథి గృహానికి బయలుదేరిన సీఎం జగన్ ►సీఎం వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కే.రోజా, టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, ఈవో ధర్నా రెడ్డి 07:09AM, 19-09-2023 ►శ్రీవారిని దర్శించుకుని శ్రీరంగనాయకులు మండపంకు చేరుకున్న సీఎం జగన్ ►ఆశీర్వదించిన వేద పండితులు 06:40AM, 19-09-2023 ►మహాద్వారం వద్ద స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు ►సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు.టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ►శ్రీవారి ఆలయంకు చేరుకున్న సీఎం జగన్ 09:19PM, 18-09-2023 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద శేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులకు దర్శనం ఇస్తున్న మలయప్ప స్వామి ► గోవిందా నామ స్మరణతో మార్మోగుతున్న తిరుమాడ వీధులు ► తిరుమాడ వీధుల్లో పెద శేష వాహన స్వామి ► మంగళ వాయిద్యాలు , కొలాటల నడుమ కోలాహలంగా సాగిన వాహన సేవ ► విశేష సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందించిన భక్తులు ► గోవింద నామ స్మరణతో మారు మ్రోగిన తిరువీధులు... 08:41PM, 18-09-2023 ► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ►మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. ► కాసేపట్లో పెద శేష వాహనంపై శ్రీవారి ఊరేగింపు. 08:18PM, 18-09-2023 తిరుమలలో సీఎం జగన్ ► శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ.. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనం. ► శ్రీవారి ఆలయం రంగరాయలు మండపంలో 2024 టీటీడీ క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన సీఎం జగన్ ► శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‌కు బయలుదేరిన సీఎం జగన్.. రాత్రికి ఇక్కడే బస 08:07PM, 18-09-2023 ► తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ► ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. 07:55PM, 18-09-2023 శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఏపీ ప్రభుత్వం తరుపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీఎం జగన్ వెంట టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. 07:50PM, 18-09-2023 ► సీఎం జగన్‌కి పరివట్టం కట్టిన ఆలయ ప్రధాన అర్చకులు. ► పట్టువస్త్రాలు సమర్పించేందుకు బేడి ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరిన సీఎం జగన్. 07:42PM, 18-09-2023 ► బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం వైఎస్ జగన్ ► సీఎం జగన్‌తో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు. ► మరికాసేపట్లో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ 06:42PM, 18-09-2023 ► కాసేపట్లో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న సీఎం జగన్. ఆపై శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ. 06:37PM, 18-09-2023 ► రచన అతిథి గృహాన్ని ప్రారంభించిన సీఎం జగన్ 06:08PM, 18-09-2023 ►వకులమాత గెస్ట్ హౌస్ ప్రారంభించిన సీఎం జగన్. 06:05PM, 18-09-2023 ► తిరుమల చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 05:40PM, 18-09-2023 ► తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో గరుడ ధ్వజపటం, స్వామి, అమ్మవార్ల ఊరేగింపు. మీనలగ్నంలో బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం. రాత్రి 9గంటలకు పెదశేష వాహనంపై శ్రీవారి దర్శనం. 05:28PM, 18-09-2023 మరికాసేపట్లో తిరుమలకు సీఎం జగన్ ► తాతయ్య గుంట గంగమ్మ ఆలయం దర్శించుకొని తిరుమలకి బయలుదేరిన సీఎం ► మరికాసేపట్లో తిరుమల చేరుకోనున్న సీఎం జగన్ ► తిరుమలలో వకుళా మాత, రచన అతిథి గృహాలు ప్రారంభించనున్న సీఎం జగన్ ► అనంతరం ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ 05:25PM, 18-09-2023 ► తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ 05:20PM, 18-09-2023 ►గంగమ్మ ఆలయానికి చేరుకున్న సీఎం జగన్. 04:53PM, 18-09-2023 ► తిరుపతి శ్రీపద్మావతి పురం నుంచి గంగమ్మ ఆలయానికి బయలుదేరిన సీఎం జగన్ 04:42PM, 18-09-2023 ► టీటీడీ ఉద్యోగులకు సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 04:30PM, 18-09-2023 శ్రీపద్మావతిపురం.. సీఎం జగన్ ప్రసంగం ►ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. 2019లో అప్పట్లో కేవలం ఎన్నికల నిమిత్తం టెంకాయ కొట్టి.. జీవో ఇచ్చేసిన పరిస్థితి నుంచి.. ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టును చెయ్యి పట్టుకుని నడిపించాం. ఇవాళ ఆ శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రారంభించి.. తిరుపతి ప్రజలకు అంకితమిస్తున్నా. దాదాపు 650 కోట్ల ప్రాజెక్టు.. ఏడు కిలోమీటర్ల పొడవునా.. తిరుపతి ప్రజలకు ప్రత్యేకించి గుడికి పోయే భక్తులకు మరి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ►ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ హాస్టల్‌కు సంబంధించి.. 37 కోట్ల రూపాయలకు సంబంధించి హాస్టల్స్ ప్రారంభించడం వల్ల మెరుగైన వసతులు విద్యార్థులకు అందనున్నాయి. ►వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి టీటీడీకి ఇవ్వడం జరగనుంది. ►అన్నింటికంటే సంతోషం కలిగించే అంశం ఏంటంటే.. టీటీడీలో పని చేస్తున్న దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఉండాలని.. మంచి జరగాలనే తాపత్రయంతో త్వరగా అడుగులు వేశాం. రూ. 313 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి.. 3,518 మందికి సంబంధించి ఈరోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. మరో 280 కోట్లు ఖర్చు చేసి మరో మూడు వేల మందికి ఇస్తాం. ఈ ప్రక్రియ కూడా నెల నుంచి 45 రోజుల్లో పూర్తి చేస్తాం. ►దాదాపు 600 కోట్ల రూపాయలతో.. ఏడు వేల మంది టీటీడీ ఉద్యోగుల ముఖాల్లో సంతోషం చూస్తున్నాం. ఇది అన్నింటికి కంటే ఎక్కువ సంతోషం ఇచ్చే రోజు ఇది. ►22ఏలో అమ్మాలనుకున్న ఇవ్వలేని పరిస్థితిలో సతమతమవుతా ఉన్న పరిస్థితుల్లో నేను ఒకసారి తిరుపతికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకువచ్చిన ఆ సమస్యను పరిష్కరించి సుమారు 8,000 మందికి పైగా నుంచి విముక్తి కల్పించాం. 8,050 మందికి తిరుపతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 2,500 చంద్రగిరిలో 22 ఏలో నుంచి తొలగించి ఉపశమనం కలిగించడం జరిగింది. ఇవన్నీ దేవుడి దయతో చేసే అవకాశం కలిగింది. ఈ నాలుగేళ్లలో మంచి జరగాలని కోరుకుంటూ అడుగులు వేశాం. ►ఇవాళ రూ. 1300 కోట్ల రూపాయలకు సంబంధించిన పలు కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషం కలిగించింది. మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు. 04:25PM, 18-09-2023 60 ఏళ్ల కల సీఎం జగన్ సాకారం చేశారు: భూమన ► టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గతంలో వైఎస్సార్ నిర్ణయించారు. ►పేదల పట్ల గౌరవం ఉన్న వ్యక్తి సీఎం జగన్. ► టీటీడీ ఉద్యోగుల సొంతింటి కల సాకారం చేశారు. ► టీటీడీ ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయం. ►సీఎం జగన్ చొరవతోనే శ్రీనివాస సేతు ప్రాజెక్టు పూర్తయ్యింది. 04:20PM, 18-09-2023 ► గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభించారు సీఎం జగన్. 04:15PM, 18-09-2023 ► శ్రీపద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం జగన్. రూ.684 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం. 04:12PM, 18-09-2023 ► శ్రీపద్మావతిపురం చేరుకున్న సీఎం జగన్. శాస్త్రోక్తంగా పూజల్లో పాల్గొన్న సీఎం జగన్. 03:49PM, 18-09-2023 ► రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి కు బయలుదేరిన సీఎం జగన్. మరికాసేపట్లో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం 03:33PM, 18-09-2023 ► రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ ► సీఎం జగన్‌కు స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఆర్కే రోజా, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 02:23PM, 18-09-2023 ► తిరుమల బ్రహ్మోత్సవాల్లో.. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి పర్యటనకు బయల్దేరారు. అదే సమయంలో తిరుపతిలో పలు ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. తిరుమల స్వామివారికి.. సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ రేపటి(సెప్టెంబర్ 19) షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. -
తిరుమలలో నేడు ధ్వజారోహణం.. సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
సాక్షి, తిరుమల: నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన ఆదివారం సాయంసంధ్యా సమయంలో శ్రీవారి సర్వ సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం సోమవారం సాయంత్రం 6.15–6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తం గా ధ్వజారోహణం నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చారు. సీఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పణ.. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. ►నేడు మధ్యాహ్నం 3.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3.50 గంటలకు స్థానిక మ్యాంగో మార్కెట్ వద్ద శ్రీనివాస సేతు, ఎస్.వి.ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాల శిలాఫలకాల ఆవిష్కరణ చేసి ప్రారంభం. ►టీటీడీ ఉద్యోగులకు ఇంటిపట్టాల పంపిణీ. ►సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని తిరుమల బయలుదేరుతారు. ►సాయంత్రం 5.40 గంటలకు వకులమాత రెస్ట్ హౌస్ ప్రారంభిస్తారు. ►సాయంత్రం 5.55 గంటలకు రచన రెస్ట్ హౌస్ ప్రారంభించి, శ్రీ పద్మావతి అతిధి గృహం చేరుకుంటారు. ►రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుండి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకు వెళ్లి సమర్పిస్తారు. ►పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపటి షెడ్యూల్ ఇదే.. ►మంగళవారం ఉదయం 6.20 గంటలకు సీఎం జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ►ఉదయం 8.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని ఓర్వకల్ విమానాశ్రయానికి బయలుదేరుతారు. -
2 లక్షల మంది వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు టీడీడీ ఈవోExecutive Officer ఏవీ ధర్మారెడ్డి సాక్షికి తెలిపారు. రెండు లక్షల మంది భక్తులు వీక్షించేలా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేసినట్లు చెప్పారాయన. సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చేలా.. బ్రహ్మోత్సవాలను వేడుకగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని సాక్షితో అన్నారాయన. బ్రహ్మెత్సవాలు జరిగే 9 రోజులు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపారాయన. ఆన్లైన్లో 1.30 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు టీటీడీ అందించనుందని తెలిపారాయన. అలాగే.. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారాయన. ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దామని.. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పుట్టమన్నులో నవధాన్యాలను.. తిరుమలలో సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. 18వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. వాహన సేవల వివరాలివీ.. 18న రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. 19న ఉదయం 8 గంటలకు 5 తలల చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి వారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమివ్వనున్నారు. 20న ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు. 21న ఉదయం 8 గంటలకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. 22న ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంలో ఊరేగుతారు. 23న ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీనివాసుడు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. 24న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం 6:55 గంటలకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తారు. 26న ఉదయం 6 గంటలకు చక్రస్నానాన్ని, రాత్రి 7గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా చేపడతారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులకు గమనిక ► స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్ దర్శనాలూ రద్దు ► బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8–10 గంటల వరకు, రాత్రి 7–9 గంటల వరకు వాహన సేవలు ► సెప్టెంబర్ 22న గరుడ సేవ కారణంగా.. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ
-
తిరుమల శ్రీవారికి ఎప్పుడు ప్రత్యేక నైవేద్యాలు
-
నేడు పెద్ద శేష వాహనంపై స్వామి వారి దర్శనం
-
కోనేటి రాయుడికి కొండంత బంగారం
-
చినశేష వాహనంపై ఊరేగిన స్వామివారు
-
సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు..!
-
బ్రహ్మోత్సవాల్లో పుష్పాలంకరణ మరింత ప్రత్యేకం
-
తిరుమల: బాగా పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(సెప్టెంబర్ 5, మంగళవారం) శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,946. తలనీలాలు సమర్పించిన వాళ్ల సంఖ్య 30,294గా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం 4.51 కోట్లుగా లెక్క తేలింది. ఈ ఏడాది అధిక మాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనుంది TTD. 17వ తేదీ వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహోత్సవాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు తిరుమలకు విచ్చేసి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబరు 22న గరుడసేవ, 23న స్వర్ణరథోత్సవం, 25న మహారథం, 26న చక్రస్నానం, చివరగా.. ధ్వజారోహణంతో వార్షిక బ్రహోత్సవాలు ముగుస్తాయి. మళ్లీ అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: యువతలో సనాతన ధర్మం కోసం టీటీడీ ప్రయత్నం -
తిరుమలలో ధ్వజారోహణ కార్యక్రమం
-
పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
-
తొలిసారి వేంకటేశ్వరుడికి ఉత్సవాలు నిర్వహించిన బ్రహ్మదేవుడు
-
వైభవంగా సాలకట్ల తెప్పోత్సవాలు
-
తేరుపై తిరుమలవాసుడు!
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వేంకటేశ్వరుడు మహారథం (తేరు)పై భక్తులను అనుగ్రహించాడు. భక్తకోటి గోవింద శరణాగతుల మధ్య ఈ కార్యక్రమం ఆలయ మాడ వీధుల్లో వేడుకగా సాగింది. గుర్రాల వంటి ఇంద్రియాలు మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి వారు ఈ రథోత్సవం ద్వారా భక్తులకు సందేశమిచ్చారు. రథసేవలో దేవదేవుడిని దర్శించినవారికి పునర్జన్మ ఉండదని పురాణాల ప్రవచనం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోవిందా..గోవిందా..అంటూ మహారథం మోకు (తాడు)ను లాగారు. వాహన సేవ తరువాత గంట పాటు పండితులు నిర్వహించిన వేదగోష్టితో సప్తగిరులు పులకించాయి. అశ్వవాహనంపై ఆనందనిలయుడి దర్శనం రాత్రి చల్లటి చలిగాలుల మధ్య మలయప్ప స్వామి అశ్వ వాహనంపై భక్తులను కటాక్షించారు. చతురంగ బలాల్లో అత్యంత ప్రధానమైనది అశ్వ బలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే ఈ వాహన పరమార్థం. బంగారు, వజ్ర, వైఢూర్య ఆభరణాలు, విశేష çపుష్పాలంకరణాంతరం స్వామి వారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. బ్రహ్మరథం, గజ, అశ్వ, తురగ, చతురంగ బలాలు ముందుకు సాగగా జానపద కళాకారులు, భజన బృందాలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 10 గంటలు పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 82,815 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.3 05 కోట్లు వేశారు. నేడే చక్రస్నానం.. బుధవారం ఉదయం 3 గంటల నుంచి పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వరాహస్వామి ఆలయంలో నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీవారి శంఖు, చక్రాలను పుష్కర జలాల్లో ముంచి లేపుతారు. ఈ కార్యక్రమం ఉదయం 3 నుంచి ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. రాత్రి 7–9 గంటల మధ్యలో ధ్వజావరోహణం నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీవారి సేవలో న్యాయమూర్తులు శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. అనంతరం వీరందరూ వాహన సేవలో పాల్గొన్నారు. అలాగే, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అశ్వవాహన సేవలో పాల్గొన్నారు. -
Tirumala : అశ్వవాహనంపై మలయప్పస్వామివారు (ఫొటోలు)
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేకంగా నిలిచిన స్వామి వారి అలంకరణలు (ఫొటోలు)
-
Tirumala : సూర్యప్రభ వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : హనుమంత వాహనంపై శ్రీరాముని అవతారంలో స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : గరుడు వాహనంపై మలయప్పస్వామి (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం (ఫొటోలు)
-
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : కల్పవృక్ష వాహనంపై శ్రీవారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు: ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు : సింహ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి (ఫొటోలు)
-
తిరుమలలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన (ఫొటోలు)
-
అలనాడు బ్రహ్మోత్సవాలే... కల్యాణోత్సవాలు
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరుగుతుంది. కాని ప్రాచీనకాలంలో ఈ నిత్యకల్యాణోత్సవ సంప్రదాయం ఉన్నట్లు కనిపించదు. అప్పట్లో బ్రహ్మోత్సవాలనే స్వామివారి కల్యాణోత్సవాలుగా భావించేవారని తెలుస్తోంది. కాని బ్రహ్మోత్సవాలలో స్వామివారికి, అమ్మవారికి కల్యాణం చేసే ఉత్సవం ఏమీ ఉండదు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి వివాహోత్సవాన్ని మొదటిసారి 1546 జూలై 17వ తేదీన తాళ్లపాక పెద తిరుమలాచార్యులు ప్రారంభించినట్లు శాసనంలో కనిపిస్తుంది. ఆనాటి సంప్రదాయంగా ఐదు రోజులు శ్రీవారి వివాహ కార్యక్రమాన్ని దగ్గరుండి ఎంతో ఘనంగా నిర్వహించారు. అనురాధ నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ వరకు ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను మార్చి, ఏప్రిల్ మాసాలలో నిర్వహించేవారు. ఆ రోజుల్లో 5 రోజుల వివాహంలో జరిగే అన్ని తతంగాలను, లాంఛనాలను ఈ వివాహంలో జరిపించేవారు. స్వామివారికి అభ్యంగనస్నానం, తిరుమంజనం, నూతన వస్త్రధారణ, తిరువీథి ఉత్సవం, నైవేద్యం, స్వామివారిని, దేవేరులను ఉయ్యాలపై ఉంచి చేసే ఉయ్యాలసేవ, పెళ్లికొడుకు పాదాలను క్షీరంతో అభిషేకించడం, ధ్రువనక్షత్ర దర్శనం, చందన వసంతోత్సవం, కల్యాణహోమం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, పూలబంతి ఆట... ఇలా అన్ని వేడుకలను ఐదు రోజులపాటు వివాహోత్సవం కార్యక్రమంలో నిర్వహించేవారు. తాళ్లపాక వారు ఏర్పాటు చేసిన ఈ ఉత్సవంలో తాళ్లపాక వంశీయులు ప్రధానపాత్ర వహించి స్వామివారికి కన్యాదానం చేసే సంప్రదాయం మెదలైంది. అటు తరువాత ఈ కార్యక్రమం నిత్య కల్యాణోత్సవంగా రూపాంతరం చెంది ప్రతినిత్యం నిర్వహిస్తున్నారు. కన్య తరపున తాళ్లపాక వంశీకులే కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకుగానూ అన్నమయ్య వంశీకులకు టీటీడీ ప్రత్యేకంగా సంభావన, ప్రసాదాలు అందిస్తోంది. ఐదు రోజులపాటు వైభవంగా స్వామివారికి నిర్వహించే కల్యాణోత్సవం ఖర్చుల నిమిత్తం తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు కొండవీడు సీమలోని శెందళూరు అనే గ్రామం, మల్లవరం అనే గ్రామాన్ని దేవదాయం చేశాడట. అ సమయంలో మలయప్పస్వామి, దేవేరులకే కాకుండా, ఆలయంలో శ్రీకృష్ణునికి, వరాహస్వామివారికి నైవేద్య సమర్పణ జరిగింది. మనోహరం అనే ప్రసాదం కూడా అప్పుడే స్వామివారికి సమర్పించడం ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా స్వామివారి కల్యాణోత్సవం గురించి లిఖించిన శాసనంలోనే ప్రస్తావించారు. అంతకు పూర్వం ఈ నైవేద్యం గురించి ఎక్కడా ప్రస్తావన లేదట. ఇది ఒక రకమైన బెల్లపు లడ్డు, సున్నుండ లాంటిది. 16వ శతాబ్దం మధ్యభాగంలో మొదలైన ఈ ప్రసాదం 20వ శతాబ్దం మధ్య భాగం వరకు చాలా ప్రాచుర్యంలో వుండేది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే ముఖ్య భక్తులకు దేవస్థానం ఇచ్చే ప్రధాన ప్రసాదంగా పేరు తెచ్చుకుంది. దాని స్థానంలో ఇప్పుడు తిరుపతి లడ్డూగా పేరుగాంచిన శనగపిండి లడ్డూ ప్రాముఖ్యానికి వచ్చింది. రుచిలో... నాణ్యతలో తిరుపతి లడ్డూనే దానికది సాటిగా పేరు తెచ్చుకుంది. (చదవండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
తిరుమల బ్రహ్మోత్సవాలు: ఘనంగా శ్రీవారి చక్రస్నానం
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: అశ్వ వాహనంపై శ్రీనివాసుడు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: హనుమంత వాహనంపై శ్రీనివాసుడు
-
తిరుమల బ్రహ్మోత్సవాలు: మోహినీ అవతారంలో శ్రీవారు
-
రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం దుర్గమ్మను దర్శించికుని.. మధ్యాహ్నం 3 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదివారం 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశాం. దీనికి భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అన్నారు. ఇంద్రకీలాద్రి: నేడు రెండు అవతారలలో దుర్గమ్మ దర్శనం.. ఇంద్రకీలాద్రిపై దసరామహోత్సవాల్లో నేడు ఐదవరోజు ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇక నేడు రెండు అవతారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. పంచమి, షష్టి తిథులు ఏకమవ్వడంతో అమ్మవారికి రెండు అలంకారాలు చేస్తారు. ఉదయం అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తుండగా.. మధ్యాహ్నం 12 గంటల నుంచి మహాలక్ష్మీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం లభిస్తుంది. సోమవారం ఉదయం 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. (చదవండి: దుర్గమ్మ దర్శనానికి.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి) తిరుమల: మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్స మండపంలో శ్రీమలయప్పస్వామివారు మోహినీ రూపంలో దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.రాత్రి 7 గంటలకు విశేషమైన గరుడవాహన సేవ ఉంటుంది. చదవండి: టీటీడీ చరిత్రలో అరుదైన దృశ్యం.. -
తిరుమల బ్రహ్మోత్సవాలు: కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మలయప్పస్వామి
-
Tirumala Srivari Brahmotsavam: ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: ప్రతి ఏటా శరన్నవరాత్రుల సందర్భంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం అయ్యాయి. ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వైభవంగా ధ్వజారోహణం జరిగింది. దీనిలో భాగంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అర్చకులు ధ్వజపటం ఎగురవేసి ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. నేటి రాత్రి(గురువారం) పెద్దశేష వాహన సేవ ఉండనుంది. చదవండి: తిరుపతి వెంకన్నస్వామికి గద్వాల ఏరువాడ పంచెలు రెడీ -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు: విద్యుత్ ధగధగలతో మెరిసిపోతున్న తిరుమల
-
బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులకు అనుమతి
తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకునే సామాన్య భక్తుల కోసం నిర్మిస్తోన్న నడక దారి పైకప్పు పనులు పూర్తయ్యాయని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు. అలిపిరి నుంచి తిరుమల వరకు జరుగుతోన్న నడక దారి పైకప్పు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. తొలగించిన కాంక్రీట్ వ్యర్థాలను త్వరితగతిన తొలగించాలని అధికారులను ఆదేశించారు. 1న డయల్ యువర్ ఈవో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం అక్టోబర్ 1న ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరగనుంది. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవోకి ఫోన్ ద్వారా తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి, తిరుపతి: శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు వెంకన్నను దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీఐఐసీ కమిషనర్ సుబ్రమణ్యం, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి సోమవారం ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీ చైర్మన్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ.. ‘పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామి వారి ఆశీస్సులు పోందడం ఆనందదాయకంగా ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో బయట దేశాల్లో ఉన్న చాలా మంది ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురయ్యారు. గత ఐదు నెలల వ్యవధిలో 40 వేలకి పైగా మన వాళ్లని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇండియా తీసుకొచ్చాం. ప్రవాస భారతీయులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏపీఎన్ఆర్టీకి కాల్ చేస్తే ఖచ్చితంగా వారికి మా పూర్తి సహకారం అందిస్తాం’ అని తెలిపారు. (చదవండి: ఏకాంతంగానే నవరాత్రి బ్రహ్మోత్సవాలు) -
వీనుల విందుగా సుందరకాండ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పతో కలిసి తిరుమలలో సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన గీతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించారు. నాద నీరాజనం వేదికపై సుమారు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో ఆద్యంతం వారు భక్తి పారవశ్యంలో తన్మయం చెందారు. సుందరకాండలోని ముఖ్యమైన ఘట్టాల గురించి శ్రద్ధగా విన్నారు. ‘శ్రీ హనుమా.. జయ హనుమా..’ అనే సంకీర్తనను కళాకారులు ఆలపిస్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సైతం పెదవి విప్పి మాట కలుపుతూ పరవశించిపోయారు. భక్తి శ్రద్ధలతో శ్రీవారి దర్శనం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, బీఎస్ యడియూరప్పలు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 6.20 గంటలకు సీఎం వైఎస్ జగన్ తొలుత ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అంతలో అక్కడికి చేరుకున్న కర్ణాటక సీఎం యడియూరప్పకు అందరూ కలిసి స్వాగతం పలికారు. అనంతరం మహాద్వారం మీదుగా ఇద్దరు సీఎంలు ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ధ్వజస్తంభానికి నమస్కరించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారు వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. టీటీడీ చైర్మన్, ఈవోలు వారికి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. వైఎస్ జగన్‌ను కలిసిన డీకే శ్రీనివాస్ ► చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు డీకే ఆదికేశవులు నాయుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ దంపతుల కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త డీకే శ్రీనివాస్ గురువారం తిరుమలలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ► తన తండ్రి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరానని శ్రీనివాస్ చెప్పారు. నూతన వసతి సముదాయానికి భూమి పూజ ► 2008లో టీటీడీ తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మధ్య అంగీకారం కుదిరింది. ► ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించనున్న వసతి సముదాయాలకు గురువారం కర్ణాటక సీఎం యడియూరప్ప ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఇందులో 242 వసతి గదులు, 32 సూట్ రూములు, 12 డార్మిటరీలు, కల్యాణమండపం, డైనింగ్ హాల్ నిర్మిస్తారు. పుష్కరిణిని పునరుద్ధరిస్తారు. టీటీడీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించనుంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ► ఉదయం 10.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. 11 గంటలకు యడియూరప్పకు వీడ్కోలు పలుకగా, ప్రత్యేక విమానంలో ఆయన బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. -
ఏకాంతంగా దేవదేవుడి గరుడోత్సవం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు బుధవారం రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పంచెకట్టు, తిరునామంతో సంప్రదాయబద్ధంగా అందజేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► న్యూఢిల్లీ నుంచి నేరుగా సాయంత్రం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం.. రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్, అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు. ► అనంతరం అన్నమయ్య భవన్ చేరుకుని ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అక్కడి నుంచి బేడి ఆంజనేయస్వామి ఆలయం చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు పరివట్టంతో తలపాగా చుట్టి పట్టువస్త్రాల పళ్లెంను సీఎం తలపై పెట్టారు. ► వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ 6.23 గంటలకు ఆలయం లోపలికి చేరుకుని, అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేసి, శ్రీవారిని దర్శించుకున్నారు. ► అనంతరం వకుళామాత దేవిని, ఆలయ ప్రదక్షిణగా విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి నమస్కరించారు. హుండీలో కానుకలు చెల్లించి, రంగనాయక మండపం చేరుకున్నారు. టీటీడీ 2021 డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ► వేద ఆశీర్వచనం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి స్వామివారి చిత్రపటంతోపాటు, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కల్యాణ మండపం వద్ద ఏకాంతంగా సాగిన గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. కాగా, సీఎం హోదాలో వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఇది రెండోసారి. ► టీటీడీ ముద్రించిన 2021 సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను సీఎం జగన్ ఆలయంలో ఆవిష్కరించారు. 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్ టాప్ క్యాలెండర్లు 75 వేలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది. ఇవి సెప్టెంబర్ 28వ తేదీ నుంచి తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ రెండో వారం నుంచి ఇతర ప్రాంతాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. ► సీఎం వైఎస్ జగన్ బుధవారం రాత్రి తిరుమలలోనే బసచేస్తారు. గురువారం ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుంటారు. నాద నీరాజనం వేదికపై నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర చారిటీస్ సత్రాల శంకుస్థాపనలో పాల్గొంటారు. -
సర్వభూపాల వాహనంపై సర్వాంతర్యామి
-
తిరుమల : కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి
-
ఈసారి పరిమితుల మధ్య బ్రహ్మోత్సవాలు
తెలుగువారి ఇలవేలుపు తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా ఆరంభిస్తాడు కాబట్టి బ్రహ్మోత్సవాలయ్యాయని, నవ బ్రహ్మలలోని ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క రోజు వచ్చి జరిపిస్తాడు కాబట్టి ఈ పేరు వచ్చిందని, పరబ్రహ్మ స్వరూపుడైన వేంకటేశ్వరునికి జరిపే ఉత్సవాలు అయినందున బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారని, బ్రహ్మాండ నాయకుడిని తలుస్తూ, కొలుస్తూ బ్రహ్మాం డంగా చేసే ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలు అని, ఇలా రకరకాలుగా చెబుతారు. ‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు...’ అని అన్నమయ్య అన్నట్లుగా, ఏ తీరున అభివర్ణించినా, ఏ రీతిన కొలిచినా, ఇవి బ్రహ్మోత్సవాలే. ప్రతి ఏటా ఎక్కడెక్కడి నుండో భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. కరోనా వల్ల ఈ సంవత్సరం ఏకాంతంగా జరుపుకుంటున్నారు. అందరి మేలుకోరి ఇలా జరుపుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. శ్రీ విష్వక్సేనుడి వద్ద తొలి రోజు పూజలు జరిపి అంకురార్పణ చేశారు. శనివారం నాడు ధ్వజారోహణంతో మొదలైన ఈ సంబ రాలు చక్రస్నానంతో ముగుస్తాయి. సెప్టెంబర్ 19వ తేదీన మొదలైన ఈ వేడుకలు 27 వరకూ సాగుతాయి. గరుడసేవ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అంకురార్పణకు ఒక విశిష్టత వుంది. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగ మొదలైన నవధాన్యాలను పోసి పూజిస్తారు. ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రుని వలె నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థనలు జరుపుతారు. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞ కుండలాలను నిర్మిస్తారు. తరువాత, పూర్ణకుంభ ప్రతిష్ఠ చేస్తారు. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోస్తారు. అవి పచ్చగా మొలకెత్తుతాయి. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్ని అంకురార్పణ అంటారు. మొదటి రోజు జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఉదయాన్నే సుప్రభాత, తోమాల సేవలు జరిపాక, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజనం చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంపై పతాకావిష్కరణ చేస్తారు. ఈ గరుడ పతాకమే సకల దేవతలను పిలిచే ఆహ్వానపత్రం. రెండవరోజు శేషవాహనంలో ఇరువురు అమ్మలతో అయ్యవారిని ఊరేగిస్తారు. సింహవాహనంపై స్వామివారిని మూడవరోజు ఊరేగిస్తారు. సర్వ భక్తుల సకల కోరికలు తీర్చడానికి కల్పవృక్ష వాహనంపై స్వామివారు నాల్గవరోజు ఎల్లరకు కన్నుల విందు చేస్తారు. అన్ని రోజులు ఆలయ వాహన మండపంలో ఆరంభమైతే, ఐదోరోజు ఆలయంనుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. ఈరోజు స్వామి మోహినీ అవతారంలో ఉంటారు. స్వామివారి ప్రధానభక్తుడైన గరుడవాహనం సేవ ఈరోజు ఉంటుంది. రాష్ట్ర ప్రజల తరపున ముఖ్యమంత్రి నూతన వస్త్రాలు సమర్పించే విశేష కార్యక్రమం ఈరోజు ఉంటుంది. ఆరవరోజు గజవాహనం, ఏడవరోజు సూర్యప్రభ వాహనం, ఎనిమిదవ రోజు ర«థోత్సవం, తొమ్మిదవ రోజు చక్రస్నానం జరుగుతాయి. చక్రస్నానాలు పూర్తయిన తర్వాత, సాయంకాలం ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణ చేస్తారు. అంటే దించుతారు. ఈ అవరోహణతో బ్రహ్మోత్సవాలకు వచ్చిన సర్వ దేవతలకు వీడ్కోలు పలికినట్లే. ఇలా ప్రతి ఏటా వేడుకలు జరపడం కొన్ని వందల సంవత్సరాల నుండీ జరుగుతోన్న ఆనవాయితీ. ఏనాడూ ఉత్సవాలు ఆగలేదు. ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి’ అన్నట్లు ఇంత వైభవంగా బ్రహ్మోత్సవాలు ఎక్కడా జరుగవు, క్షేత్రరాజంగా విరాజిల్లే తిరుమలలో తప్ప. వచ్చే సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని విశ్వసిద్దాం. వ్యాసకర్త: మాశర్మ , సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 93931 02305 -
ముత్యపు పందిరి వాహనంపై శ్రీనివాసుడు ఫొటోలు
-
సీఎం జగన్ తిరుమల పర్యటన ఖరారు
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు వెళతారు. సాయంత్రం 6.20 గంటలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం 8.10 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు. (చదవండి: సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు) (చదవండి: దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్ సరికొత్త యాప్) -
సింహవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
-
శ్రీవారిని దర్శించుకున్న ఆర్పీ పట్నాయక్
తిరుమల: సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా భక్తులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, సామాజిక దూరం పాటిస్తూ చాలా చక్కటి దర్శనం జరిగిందన్నారు. కరోనా నుంచి ప్రజలందరూ విముక్తి కావాలని దేవ దేవుడ్ని ప్రార్ధించినట్లు ఆర్పీ పట్నాయక్ తెలిపారు. (శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ) హంస వాహనంపై పరమహంస తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి మలయప్ప స్వామివారు హంస వాహనాన్ని అధిరోహించి సర్వవిద్యా ప్రదాయని అయిన సరస్వతీదేవి రూపంలో కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించారు. గుణ, అవగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతమైన హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు దర్శనమివ్వడం నయనానందకరం. శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపం నుంచి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా హంస వాహన సేవను నిర్వహించారు. ఉదయం ఐదు శిరస్సుల శేషుడి నీడలో శ్రీకృష్ణుని రూపంలో మలయప్ప స్వామివారు కనువిందు చేశారు. శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం వరకు స్వామివారిని చిన్నశేష వాహనంపై ఏకాంతంగా ఊరేగించారు. నేటి వాహన సేవల వివరాలు: బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపు పందిరిలో స్వామివారు ఏకాంతంగా ఊరేగనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. -
మలయప్పస్వామికి చిన శేష వాహన సేవ
-
చిన శేష వాహనంపై మలయప్ప
సాక్షి, తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఆదివారం ఉదయం మలయప్ప స్వామి ఐదు శిరస్సుల చిన శేషవాహనంపై భక్తులకు ఏకాంతంగా దర్శనం ఇస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శేషునికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. పెద శేష వాహనంపై తొలిరోజు రాత్రి ఆది శేషుడు పెద శేషవాహనంలో ఉభయ దేవేరులతో దర్శనం ఇచ్చిన స్వామి, చిన శేష వాహనంపై మలయప్ప స్వామి ఏకాంతంగా దర్శనం ఇస్తున్నారు. ఐదు శిరస్సుల చిన శేషుడుని వాసుకి భావిస్తారు. కోవిడ్ కారణంగా ఆలయంలోనే ఏకాంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. చిన శేషవాహనంపై మలయప్ప స్వామిని తనివితీరా దర్శించుకున్న భక్తులకు కుండలినీ యోగసిద్ది ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక రాత్రికి స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కన్యా మాసం హస్త నక్షత్రంలో శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆలయంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం, వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. (పెద్దశేష వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు) అంకురార్పణ విశిష్టత.. వైఖానసం ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని 'సస్యకారక' అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి. (డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి) అంకురార్పణ క్రమం.. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన 'సముర్తార్చన అధికరణ' అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. (చరిత్రలో తొలిసారి.. బ్రహ్మోత్సవం ఏకాంతం..) ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవోహరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల: తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలపై వివాదం చేస్తున్నాయని ఎల్లో మీడియా తీరును విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా రోజూ వివిధ మతాలకు చెందిన, వేలాది మంది భక్తులు వస్తారని.. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. (చదవండి: ఎస్వీబీసీ ఛానెల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు) ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని మాత్రమే తాను చెప్పాననన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని, డిక్లరేషన్ తీసేయాలని అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, బురదజల్లాలని చూస్తున్న ప్రతిపక్షం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమలలో టీటీడీ డిక్లరేషన్ వివాదంపై శనివారం ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగతున్న సమయంలో అనవసర వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. (బాబు మరో జన్మెత్తినా వైవీ కుటుంబానికి సాటిరారు) వాళ్లెవరూ డిక్లరేషన్ ఇవ్వలేదు టీటీడీ చట్టంలోని రూల్ 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. ఇక స్వామివారి దర్శనం చేసుకోదలచిన ఇతర మతస్తులు తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతట తామే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్ : 137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే (ఉదాహరణకు ఏసయ్య, అహ్మద్, సర్దార్ సింగ్ ఇలాంటి ఇతరత్రా పేర్లు లేదా వారి శరీరం మీద ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉంటే) దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. అదే విధంగా, పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తిరుమల శ్రీవారి మీద మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా టీటీడీ ఆహ్వానం మేరకు, రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈనెల 23న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తున్న సీఎం జగన్‌ను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా ఆయన మాటలను వక్రీకరిస్తూ, అసత్య కథనాలు ప్రచారం చేస్తోంది. -
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
సాక్షి, తిరుమల: దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూసేవారు. కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారు. ఉత్సవాల్లో రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించినా అలాంటి పరిస్థితే తెరపైకి వచ్చేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల–తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది. తిరుమల చరిత్రలోనే తొలిసారి కోవిడ్ కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. అందులో భాగంగానే అర్చకులు గరుడ ధ్వజ పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానము.. శాస్రో్తక్తంగా అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీవారి ఆలయం ముందు ఎల్సీడీల ద్వారా భక్తులకు వీకక్షించే సౌకర్యం కల్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు పెద్దశేష వాహనంపై మలయప్పస్వామి రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు భక్తులకు దర్శనం ఇవ్వనన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. శ్రీ గోవిందాచార్యులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమరుత్తులను(దేవతాపురుషులు), రుషిగణాన్ని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్ ధ్వజస్తంభాన్ని అధిరోహిస్తారని ప్రాశస్త్యం. కాగా ధ్వజపటంపై గరుడునితోపాటు సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పెసరపప్పు అన్నం(ముద్గర) ప్రసాద వినియోగం జరిగింది. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంపదలు సమకూరుతాయని విశ్వాసం. అదేవిధంగా, ధ్వజస్తంభానికి కట్టిన దర్భ అమృతత్వానికి ప్రతీక. పంచభూతాలు, సప్తమరుత్తులు కలిపి 12 మంది దీనికి అధిష్టాన దేవతలు. ఇది సకలదోషాలను హరిస్తుంది. దర్భను కోసేటప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేటపుడు ధన్వంతరి మంత్ర పారాయణం చేస్తారు. ధ్వజారోహణం అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందుకు సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు శ్రీ డిపి.అనంత, శ్రీ శివకుమార్, శ్రీ కుమారగురు, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జగన్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శుక్రవారం వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. అద్దాల మండపంలో పుట్టమన్ను సేకరించి శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఈ సారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గుడి ప్రాకారం లోపలే బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు (శనివారం) ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించనున్నారు. ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు: సుబ్బారెడ్డి కోవిడ్ కారణంగా తిరుమల చరిత్రలోనే తొలిసారిగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు అంకురార్పణ ఘట్టం ముగిసింది. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయి.. ఈనెల 27న చక్రస్నానంతో ముగుస్తాయి. శ్రీవారి భక్తులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. ఇతర ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశాం. ఈనెల 23న సాయంత్రం గరుడ వాహనసేవకు ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 23 నాడు సాయంత్రం 7 గంటలకు కర్ణాటక సీఎం యడియూరప్ప తిరుమల చేరుకుంటారు. 24వ తేదీ ఉదయం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం నాదనీరాజనం మండపంలో జరుగుతున్న సుందరకాండ పారాయణంలో ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. తిరుమలలో కర్ణాటక సత్రం, యాత్రికుల వసతి సముదాయాలు శంకుస్థాపన కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొంటార’ని సుబ్బారెడ్డి తెలిపారు. -
చరిత్రలో తొలిసారి.. బ్రహ్మోత్సవం ఏకాంతం..
-
చరిత్రలో తొలిసారి.. బ్రహ్మోత్సవం ఏకాంతం..
బ్రహ్మోత్సవం అంటే భక్తజన సందోహం. వైకుంఠనాథుడి వైభవం చూసి తరించే సందర్భం. గోవిందనామస్మరణతో సప్తగిరులు పులకించే వైభోగం. ఏడుకొండల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే దేదీప్యం. వాహన సేవల ముందు సాంస్కృతిక నీరాజనం. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కరోనా కాలంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఆలయ ఆవరణలోనే ఏకాంతంగా దేవదేవుడి బ్రహ్మోత్సవాన్ని పరిపూర్ణం చేయాలని నిర్ణయించింది. మానవసేవే.. మాధవ సేవగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: దేవదేవుడి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం దేశవ్యాప్తంగా భక్తులు ఎదురుచూసేవారు. కలియుగ వైకుంఠంలో శ్రీవారి ఉత్సవాలను కనులారా తిలకించేందుకు వడివడిగా తిరుమల గిరులు చేరుకునేవారు. ఉత్సవాల్లో రోజూ లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఎప్పుడు బ్రహ్మోత్సవాలు నిర్వహించినా అలాంటి పరిస్థితే తెరపైకి వచ్చేది. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జనరద్దీని కట్టడి చేసేందుకు తిరుమల–తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాలను గుడి ప్రాకారం లోపలే నిర్వహించాలని తలపెట్టింది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో కరోనా విజృంభణ జిల్లాలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. బ్రహ్మోత్సవాల రద్దీ నేపథ్యంలో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి భావించింది. ప్రజల జీవన స్థితిగతులు, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయించింది. ఈ సారి బ్రహ్మోత్సవాలను కోవిడ్–19 నిబంధనలకనుగుణంగా నిర్వహించాలని భావించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి ఏకాంతంగా నిర్వహించాలని సంకలి్పంచింది. జీయ్యర్ స్వాములు, ఆగమ సలహాదారులు, ప్ర«ధాన అర్చకులతో చర్చించి సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ఎస్వీబీసీ చానల్లో తిలకించేందుకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రికి ఆహ్వానం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరుఫున ముఖ్యమంత్రి పట్టువ్రస్తాలను శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ బృందం ఆహ్వానం మేరకు ఈనెల 23న గరుడసేవ సందర్భంగా ముఖ్యమంత్రి తిరుమల చేరుకుని శ్రీవారికి పట్టు వ ్రస్తాలు సమరి్పంచనున్నారు. చరిత్రలో తొలిసారి.. దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంత్యంత వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ. దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులతో కిటకిటలాడే తిరుమల క్షేత్రంలో ఈ సారి ఏకాంతగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. టీటీడీ బోర్డు చరిత్రలో ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇదే మొదటి సారి అని చరిత్రకారులు చెబుతున్నారు. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
సాక్షి,అమరావతి/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌లు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎం వైఎస్ జగన్‌ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు శ్రీవారి ప్రసాదాలు అందజేసి, బ్రహ్మోత్సవాలకు హాజరై సంప్రదాయం ప్రకారం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆహ్వానించారు. వారి వెంట టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఉన్నారు. (చదవండి: రూ. 23.78 కోట్ల జీఎస్టీ రద్దు చేయండి) శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ ఈ నెల 19 నుంచి 27 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ విష్వక్సేనుల వారిని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేస్తారు. వైఖానస ఆగమనాన్ని పాటించే తిరుమల, ఇతర ఆలయాల్లో ఉత్సవాలకు ఒకరోజు ముందు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే, బ్రహ్మోత్సవాలకు 19న సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఈ బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహించనుంది. టీటీడీలో కొత్తగా 8 పోస్టులు మరోవైపు అమరావతి బోర్డ్ నిర్ణయం మేరకు ప్రభుత్వం టీటీడీలో కొత్తగా 8 పోస్టులు సృష్టించింది. టీటీడీ నగలు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు బోర్డు ఇప్పటికే కొత్తగా చీఫ్ జ్యుయెలరీ ఆఫీసర్, జ్యుయెలరీ ఆఫీసర్, రెండు ఏఈఓ, 4 జ్యుయెలరీ అప్రైజర్ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా తిరుమల
-
ముగిసిన తిరుమల బ్రహ్మోత్సవాలు
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం
సాక్షి, తిరుమల: బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సేవలందించిన టీటీడీ, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు. రద్దీ ఎక్కువగా ఉన్నా.. భక్తులు సమయనం పాటించి స్వామివారి దర్శనం చేసుకున్నారన్నారు. గత ఏడాది 5.8 లక్షల మంది దర్శనం చేసుకోగా, ఈ ఏడాది 7.7 లక్షల మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఈవో వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే లక్షా 5 వేల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో 3.23 లక్షల మంది స్వామివారికి తలనీలాలు సమర్పించగా.. గత ఏడాది 2.17 లక్షల మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించారు. ఆర్టీసీ ద్వారా 4.24 లక్షల మంది తిరుమలకు చేరుకున్నారని చెప్పారు. ఈ ఏడాది భక్తులకు 34 లక్షల లడ్డూలు అందించగా.. గత ఏడాది 24 లక్షల లడ్డూలు అందించామన్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో 18 రాష్ట్రాల నుండి 357 కళా బృందాలు పాల్గొన్నాయన్నారు. వచ్చే ఏడాది 25 రాష్ట్రాల నుండి ఉన్నత స్థాయి కళాకారులు రప్పిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.20 కోట్ల 50 లక్షల 85 వేల హుండీ ఆదాయం వచ్చిందని తెలిపారు. -
అశ్వవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు
-
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు
-
‘శ్రీవారి గరుడ సేవకు అన్ని ఏర్పాట్లు చేశాం’
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా గరుడ వాహన సేవకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. మాడ వీధుల్లో 20 ప్రాంతాల్లో, వెలుపల 14 ప్రాంతాల్లో గరుడ సేవను భక్తులు తిలకించడానికి ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశామని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత స్వామివారి గరుడ వాహన సేవకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి తెలిపారు. సుమారు 4 వేల మంది పోలీసులు, 15000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతరం కంట్రోల్‌రూమ్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారని పేర్కొన్నారు. 1600 సీసీ కెమెరాలతో గరుడసేవ నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్యాలరీలలోకి భక్తులను అనుమతిస్తామని గోపీనాథ్ తెలిపారు. -
తిరుమలలో ‘మీడియా సెంటర్’ ప్రారంభం
సాక్షి, తిరుమల : వీఐపీ బ్రేక్ దర్శనంలో మార్పులు చేయడంతో సామాన్య భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అదనంగా గంటన్నర సమయం లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుమలలో ‘మీడియా సెంటర్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు మీడియా ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతిని నిర్మూలిస్తే.. తాము టీటీడీలో అధికారుల సహాయంతో అవినీతిని నిర్మూలిస్తున్నామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులకు ఆహారం, నీరు అందించడంలో ఎటువంటి లోటు లేకుండా చూస్తామని తెలిపారు. టీటీడీలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నేడు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. -
సామాన్య భక్తులకూ సంతృప్తికర దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో దేవదేవుడు శ్రీవేంకటే«శ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అత్యంత వైభవపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు 14 రాష్ట్రాల కళాకారులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ అశోక్‌సింఘాల్ ఇచ్చిన ఇంటర్వ్యూ... బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు మెరుగైన దర్శనానికి తీసుకుంటున్న చర్యలు? శ్రీవారి మూలమూర్తితోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తికరంగా దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేపట్టాం. భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జితసేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశాం. బ్రేక్ దర్శనం ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం. గరుడసేవ రోజు (అక్టోబరు 4న) బ్రేక్ దర్శనాలు, అంగప్రదక్షిణ టోకెన్లు రద్దు చేశాం. వాహనసేవలు తిలకించేందుకు మాడ వీధుల్లో చేపట్టిన ఏర్పాట్లు? భక్తులు వాహనసేవలను వీక్షించేందుకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశాం. వాహనసేవలను తిలకించేందుకు మాడవీధులు, భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో 37 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. శ్రీవారి ఆలయంలో కైంకర్యాల నిర్వహణ ఎలా ఉంటుంది? శ్రీవారి ఆలయంలో నిత్యకైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. క్యూలైన్ వెలుపలికి వెళ్లినపుడు నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లు? నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులకోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశాం. ఇక్కడ వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తాం. షెడ్లకు అనుబంధంగా మరుగుదొడ్ల వసతి కల్పించాం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా ప్రణాళిక రూపొందించాం. గరుడసేవనాడు భక్తుల కోసం ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు? శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 4న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 3 రాత్రి 11 గంటల నుండి అక్టోబరు 5 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్‌రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేయనున్నాం. ద్విచక్రవాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి పాత చెక్‌పోస్టు, శ్రీవారిమెట్టు వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశాం. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం. బస్సుల్లో 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందిని తరలిస్తాం. ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా ఉండేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశాం. దాదాపు 1,200మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందితోపాటు 4,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టాం. మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 1,650 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం. íపీఏసీ–4లోని సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో వీడియోవాల్ ద్వారా పలు ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తాం. భక్తులు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్లు ఏమైనా ఉన్నాయా? భక్తులు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు టోల్‌ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333కు ఫిర్యాదు చేయవచ్చు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 18004254242ను అందుబాటులో ఉంచాం. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు ? తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో తిరువేంకటపథం, బాలాజినగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండు, ముళ్లగుంటలోపార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్, శ్రీవారి మెట్టు వద్ద 5 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. పారిశుద్ధ్యం కోసం చేపట్టిన చర్యలు? అదనపు సిబ్బందిని నియమించారా? తిరుమలలో రోజువారీ మొత్తం 1,088 మంది సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ. ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం బ్రహ్మోత్సవాల రోజుల్లో అదనంగా 510 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 1,075 మంది ఏర్పాటు చేయనున్నాం. భక్తులకు ఎక్కడెక్కడ అన్నప్రసాదాలు అందిస్తారు? ఫుడ్ కౌంటర్లు ఎన్ని? బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్మెంట్లు, క్యూలైన్లు, కాలిబాట మార్గాల్లో అన్నప్రసాదం, పాలు, అల్పాహార వితరణకు ఏర్పాట్లు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 5 ఫుడ్ కౌంటర్ల ద్వారా అన్నప్రసాదాలు అందిస్తాం. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ. వైద్యం కోసం చేపట్టిన చర్యలు? 2 వైద్యకేంద్రాలు, 6 డిస్పెన్సరీలు, 11 ప్రథమ చికిత్స కేంద్రాలు, ఒక మొబైల్ క్లినిక్, 45 మంది వైద్యులు, 60 మంది పారామెడికల్ సిబ్బంది, 12 అంబులెన్సులతో వైద్యసేవలు అందించనున్నాం. అలాగే వివిధ శాఖల పరిధిలో 3,500 మంది శ్రీవారి సేవకులు, దాదాపు వెయ్యిమంది ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారు. టీటీడీ కాల్ సెంటర్, వాట్సాప్ నంబరు, ఈ–మెయిల్? టీటీడీ కాల్‌సెంటర్ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులకు అందించే ఏర్పాటు. కాల్ సెంటర్ నంబరు: 0877–2277777, 2233333. భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా వాట్సాప్ 9399399399, ఈ–మెయిల్: helpdesk@tirumala.org బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు ‘తిరుమల బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశాం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. టీటీడీకి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం సర్వసాధారణమే అయినా, ప్రతి ఏటా నిర్వహణ లోపాలను సమీక్షించుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాం. గత ఏడాది గరుడోత్సవం రోజున భక్తులు లగేజీని పెట్టుకున్న ప్రాంతం చేరుకోవటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాం. ఈసారి వాహనాల పార్కింగ్ ఏర్పాట్లకు ఎక్కువ స్థలం కేటాయించాం. గోగర్భం నుంచి నారాయణగిరి వరకు రింగ్ రోడ్డు వచ్చింది. అక్కడ పార్కింగ్‌కు ఎలాంటి సమస్య ఉండదు. దేవుని కృపతో చిత్తశుద్ధితో నిజాయతీగా కార్యక్రమాలు చెయ్యగలుగుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు తు.చ. తప్పకుండా కార్యక్రమాలు చేపడుతున్నాము’ అని టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మారెడ్డి చెప్పిన బ్రహ్మోత్సవాల విశేషాలు ఆయన మాటల్లోనే... టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా... తిరుమలలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా టీటీడీ భారీ మార్పులు చేపట్టింది. గతంలో 40 వేల నుంచి 50 వేల మంది భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం 70 వేల నుంచి 80 వేల మంది వరకు భక్తులు ప్రతిరోజూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. గతంలో 20 వేల నుంచి 30 వేల మందికి అన్నదానం చేసేవాళ్లం. ప్రస్తుతం లక్ష మందికిపైగా భక్తులకు టీటీడీ అన్నదానం చేస్తోంది. క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు పాలు, కాఫీ, టీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులను నా హయాంలో మొదలు పెట్టాం. ఇప్పుడు వైకుంఠం క్యూకాంప్లెక్స్, రిసెప్షన్, కళ్యాణకట్ట.. ఇలా ఆలయంలోని ప్రతి శాఖలోనూ శ్రీవారి సేవకులను తీసుకుంటున్నాం. ప్రతి రోజూ మూడువేల నుంచి మూడున్నరవేల మంది శ్రీవారి సేవకులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపటమే లక్ష్యం ఎల్1, ఎల్2, ఎల్3 పద్ధతిని రద్దుచేసి ప్రొటోకాల్‌కి సమస్య లేకుండా వీఐపీ దర్శనాలు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజూ అదనంగా 2 గంటల సమయం సామాన్య భక్తులకు కేటాయిస్తున్నాం. ఈ పద్ధతిలో ప్రముఖులకు ఎక్కడా సమస్య లేకుండా చర్యలు తీసుకుంటూనే దళారీ వ్యవస్థను కట్టడి చేశాం. ప్రస్తుతం 90 శాతం మేరకు దళారీ వ్యవస్థ లేకుండా చర్యలు చేపట్టాం. నిరంతరం తిరుమలలోనే ఉంటూ రిసెప్షన్, కళ్యాణకట్ట, అన్నదానం, వైకుంఠం–1, వైకుంఠం–2 క్యూకాంప్లెక్స్లు, ఆలయంలో రెగ్యులర్‌గా పర్యవేక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తిరుమలకు రాలేని వారిని దృష్టిలో ఉంచుకుని... తిరుమలకు రాలేని పరిస్థితిలో ఉన్న భక్తులు కూడా స్వామివారి కళ్యాణం చూసి తరించేందుకు అవకాశాలు కల్పిస్తున్నాం. 2004 నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఎస్వీబీసీ చానెల్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా స్వామివారి సేవలను భక్తులకు తెలియజేస్తున్నాం. పరకామణిలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించాం. పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. కాలుష్య రహిత తిరుమల తిరుమల ఎంత పవిత్రమైన క్షేత్రమో అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తిరుమలను ప్లాస్టిక్ రహిత తిరుమలగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఉద్యోగులు ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులు వాడకుండా రెండు నెలలుగా నియంత్రించాం. అతిథి గృహాల్లో వాటర్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. వాటి ద్వారా జల ప్రసాదం నీళ్లను అందించేందుకు ప్రణాళికలు చేపట్టాం. వీఐపీలకు అదే నీటిని గాజు గ్లాసులో అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్లాస్టిక్ వాటర్ ప్యాకెట్లను ఆపేశాం. ప్రస్తుతం వాటర్ బాటిళ్ల కొనుగోలు నిలిపివేశాం. ప్లాస్టిక్ నియంత్రణకు తిరుమలలోని హోటల్స్ యాజమాన్యాలతో సంప్రదింపులు చేపట్టాం. జనతా క్యాంటీన్లలో కూడా ఇదే పద్ధతిని తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చాం. ఇంకా చిన్న చిన్న హోటళ్లు, ఫుడ్ సెంటర్స్ వారితో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ రహిత తిరుమలపై అవగాహన కల్పించి, నియంత్రించే ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నదానం కోసం కూరగాయలు, బియ్యం సరఫరా చేసే డోనర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. మరింత నాణ్యమైన సరుకులు సరఫరా చెయ్యాలని కోరాం. శ్రీవారి సేవలో అరుదైన అవకాశం శ్రీవారికి సేవ చేసేందుకు నాకు అరుదైన అవకాశం దక్కింది. తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నాలుగు మాఢవీధులు విస్తరణ చేపట్టాం. ప్రైవేటు వారి చేతుల్లో ఉన్న ఆస్తులను సేకరించాం. రెండవసారి అవకాశం వచ్చాక బూందీ పోటును బయటకు తెచ్చాం. అప్పట్లో 40వేల లడ్డు ప్రసాదాలు తయారు చేసేవారు. ఇప్పుడు 4 లక్షల నుంచి 5 లక్షల లడ్డుప్రసాదాలు తయారు చేసే స్థాయికి తీసుకొచ్చాం. మొదట్లో 40వేల నుంచి 45 వేల మంది భక్తులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉండేది. మహాలఘు దర్శనం ద్వారా లక్ష మందికి పైగా దర్శన ఏర్పాట్లు కల్పించే స్థాయికి తీసుకొచ్చాం. వైకుంఠం–1, వైకుంఠం–2 క్యూ కాంపెక్స్‌లను ఎయిర్ కండిషన్ చేశాం. అతిథి గృహాల్లో 4వేల గదులు ఉండేవి. అటువంటిది 3,500 గదులను అదనంగా నిర్మించగలిగాం. అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఉన్న షెడ్ల ఆధునికీకరణ కోసం డోనర్‌ను ఒప్పించాం. త్రీడీ రూపంలో స్వామి వారి నగలు స్వామివారి నగలను అందరూ చూసే అవకాశం ఉండదు. అందుకోసం స్వామి వారి నగలను త్రీడీ ఇమేజ్ చెయ్యనున్నాం. అలాగే మ్యూజియంలో ఆలయ నమూనా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అందులో ఆలయ విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించనున్నాం. దీని కోసం డోనర్ కూడా ముందుకు వచ్చారు. మా ప్రయత్నాలు విజయవంతమైతే వచ్చే ఆరునెలల్లోగా స్వామి వారి నగలను త్రీడీ ద్వారా చూపించనున్నాం. టైమ్ స్లాట్‌తో రండి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటి నుంచి బయలు దేరేటప్పుడే టైమ్ స్లాట్ తీసుకొస్తే దర్శనం సులభతరం. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చెయ్యనున్నాం. టైమ్ స్లాట్ లేకుండా వస్తే ఆలస్యం అవుతుందని తెలుసుకుని ప్రతి ఒక్కరూ టైమ్ స్లాట్ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టనున్నాం. – మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి. -
భక్తులు మెచ్చేలా చక్కటి కార్యాచరణ
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సన్నద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు పదహారు రకాల వాహనాలపై శ్రీనివాసుడు తిరుమాడ వీధుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు రానున్నారు. రుత్వికులు అంకురార్పణ చేసిన తర్వాత ఉత్సవాలు మొదలవుతాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లూ చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తన చేతుల మీదుగా తొలిసారి బ్రహ్మోత్సవాలను నిర్వహించే భాగ్యం కలగడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ... టీటీడీ చైర్మన్‌గా తొలిసారిగా బ్రహ్మోత్సవాల నిర్వహణ చేపట్టడంపై మీ అనుభూతి? అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి అత్యంత వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించే భాగ్యం నాకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో జన్మల పుణ్యఫలంతోనే ఈ మహాక్రతువులో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుంది. బ్రహ్మోత్సవాలను భక్తులందరూ తిలకించేలా చక్కని ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో కంటే మిన్నగా బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తారా? బ్రహ్మదేవుడే స్వయంగా నిర్వహించిన ఈ ఉత్సవాలను టీటీడీ ఎప్పటికప్పుడు భక్తజనరంజకంగా నిర్వహించడానికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి కూడా స్వామివారి ఉత్సవాలను భక్తులంతా మెచ్చేలా నిర్వహించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తిరుమల క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం. స్వామివారిని క్షణకాల దర్శనం చేసుకుంటే చాలని అశేష భక్తజనకోటి ఎదురు చూస్తుంటారు. వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, ఎంతమంది వస్తే అంతమందికి తగిన ఏర్పాట్లతో, ముందస్తు చర్యలతో భక్తులందరికీ చక్కగా దర్శనభాగ్యం కల్పించడానికి టీటీడీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలివచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? బ్రహ్మోత్సవాలలో తిరుమల క్షేత్రానికి తరలివచ్చే సామాన్య భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాం. ఇందుకోసం తిరుమలలోని అద్దెగదుల్లో అధికశాతం కరెంట్ బుకింగ్ ద్వారానే కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించాం. ఇవి కాకుండా, తిరుమలలోని ఐదు ఉచిత వసతి సముదాయాలను సకల వసతులతో సిద్ధంగా ఉంచాం. భక్తులందరూ టీటీడీ కల్పించిన ఈ వసతులను ఉపయోగించుకుని, బ్రహ్మోత్సవాలను తిలకించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతిలోని వసతి సముదాయాలలోనూ అద్దె గదులను ఎక్కువ శాతం కరెంట్ బుకింగ్ ద్వారానే కేటాయించే ఏర్పాట్లు చేశాం. వీటితో పాటు విష్ణునివాసం, శ్రీనివాసం, శ్రీగోవిందరాజస్వామి సత్రాలలో డార్మిటరీలు, గదులు భక్తులకు ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికీ అన్న పానీయాలను అందించడానికి టీటీడీ అన్నప్రసాదం విభాగం ఇప్పటికే ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు తిరుమలలోని ముఖ్యమైన కూడళ్లు, వైకుంఠం–1, 2 క్యూకాంప్లెక్సులు, బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులందరికీ ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలను అందించడానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేశాం. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాన్ని అందించే సమయంలోనూ మార్పులు చేశాం. సాధారణ రోజుల్లో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు, బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు అన్నపానీయాలను అందించాలని నిర్ణయించాం. గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇందుకోసం టీటీడీ యంత్రాంగంతో పాటు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. తిరుమలకు వచ్చే భక్తులందరూ లడ్డు ప్రసాదం పొందేలా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు తప్పకుండా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే చక్కని ప్రణాళికలను టీటీడీ రూపొందించుకుంది. ఎనిమిదిన్నర లక్షల లడ్డులు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ మూడున్నర లక్షల లడ్డులు భక్తులకు అందజేసేలా ఏర్పాట్లు చేశాం. గరుడసేవ రోజున లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బ్రహ్మోత్సవాలు అంతా ఒక ఎత్తు అయితే, శ్రీవారి గరుడసేవ ఒక్కటే మరో ఎత్తు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులందరూ తప్పకుండా వీక్షించాలని తపనపడే వాహనసేవ స్వామివారి గరుడసేవ. గరుడసేవ రోజున తిరుమల భక్తజనసంద్రంగా మారుతుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి లోటు రాకుండా ప్రత్యేక చర్యలతో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గరుడసేవ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అదనపు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధిస్తున్నాం. గత ఏడాది తిరుమలలో 7800 వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేయగా, ఈసారి అదనంగా మరో 1200 వాహనాలకు పార్కింగ్ వసతి కల్పిస్తున్నాం. భక్తులందరికీ రాత్రి 1 గంట వరకు అన్న పానీయాలను నిరంతరాయంగా అందించే ఏర్పాట్లు చేశాం. – కోన సుధాకర్‌రెడ్డి, సాక్షి, అమరావతి -
ఆనంద నిలయంలో అజ్ఞాత మండపాలెన్నో...
దివి నుంచి భువికి దిగివచ్చిన శ్రీహరి సాక్షాత్తుగా కొలువై దివ్యదర్శనమిస్తున్న సుప్రసిద్ధ క్షేత్రమే తిరుమల పుణ్యక్షేత్రం. శేషాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి కొండల పై వెలసిన శ్రీవారిని ఏడుకొండలవాడని, సప్తగిరీశుడని పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారు వెలసిన ఆలయానికి వున్న ముఖమండపాన్ని ఘంటామండపమని పిలుస్తారు. 43 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడవు ఉండే మహామండపాన్ని 1417 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య మంత్రివర్యులు అమాత్య మల్లన నిర్మించారు. నాలుగు వరుసలలో 16 స్తంభాలు వుండే ఈ మండపంలో స్తంభాల పైన వరాహస్వామి, నృసింహస్వామి, మహావిష్ణువు, శ్రీవేంకటేశ్వరస్వామి, వరదరాజస్వామి శిల్పాకృతులు చెక్కబడి వుంటాయి. శ్రీ మండపంలోనే గరుడాళ్వార్, జయవిజయలు వెలసి వుంటారు. శ్రీవారికి ప్రతి నిత్యం వేకువ జామున సుప్రభాత సేవను ఇదే మండపంలో నిర్వహిస్తారు. ఇక బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం, గురువారం నిర్వహించే తిరుప్పావై సేవలతో పాటు ప్రతి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే ఆస్థానాలు ఇదే మండపంలో అర్చకులు నిర్వహిస్తారు. స్వామివారికి నైవేద్య సమయంలో మోగించే ఘంటానాదం ఇదే మండపంలో వుండడంతో మహామండపానికి ఘంటామండపం అని పేరు వచ్చింది. ఘంటామండపం దాటిన తర్వాత వున్న మండపాన్ని స్నపన మండపం అంటారు. 27 అడుగులు చతురస్రాకారంలో వుండే స్నపన మండపం స్తంభాలపై బాలకృష్ణుడు, యోగనరసింహ స్వామి, శ్రీకృష్ణ కాళీయమర్దనం వంటి శిల్పాలు వుంటాయి. 614వ సంవత్సరంలో పల్లవరాణి సామవై వెండి భోగ శ్రీనివాసమూర్తిని ఆలయానికి బహూకరించారు. ఆ సమయంలో ఇదే మండపంలో స్వామివారికి పూజలు నిర్వహించారట. ప్రస్తుతం ప్రతిరోజు శ్రీవారికి తోమాలసేవ అనంతరం గర్భాలయంలో వున్న కొలువు శ్రీనివాసమూర్తిని ఈ మండపంలో వేంచేపు చేసి బంగారు సింహాసనంపై వుంచి స్వామివారికి కొలువును నిర్వహిస్తారు. శ్రీవారు మహారాజు కావడంతో ప్రతినిత్యం పంచాంగ శ్రవణం నిర్వహించి ఆ రోజు తిథి, నక్షత్రాలతోపాటు స్వామివారికి హుండీలో లభించిన కానుకల లెక్కలు చెబుతారు. ఇక ఏకాంత సేవ అనంతరం శ్రీవారి హుండీని ఇదే ప్రాంతంలో భద్రపరుస్తారు. ఇక స్వామివారికి అలంకరించే ఆభరణాలు అన్నీ కూడా ఇదే మండపంలో భద్రపరచి వుంటారు. స్వామివారికి ప్రతి శుక్రవారం రోజున ఆభరణాలు అలంకరించడం, గురువారం రోజున సడలింపు చేసిన ఆభరణాలను తిరిగి ఇదే మండపంలో భద్రపరుస్తారు. దీంతో ఈ మండపానికి కొలువు మండపమని, కానుకల భాండాగారం అనే పేర్లు కూడా వచ్చాయి. స్నపన మండపాన్ని దాటగానే వచ్చే మండపం రాములవారి మేడ. 12 అడుగుల పొడవు, 10 అడుగులు వెడల్పు వుండే ఈ మండపం 1262–65 సంవత్సరానికి ముందు లేదని, ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షణ మార్గంలో కలసి వుండేదంటున్నారు పరిశోధకులు. రాములవారి మేడలో ఎల్తైన అరుగుల మీద దక్షిణం వైపు శ్రీవారి పరివార దేవతలైన అంగద, హనుమంత, సుగ్రీవ తదితర ఉత్సవ విగ్రహాలు వుండేవి. ఉత్తరం వైపున విష్వక్సేన, అనంత, గరుడ ఉత్సవమూర్తులు కొలువై ఉంటారు. అలాగే ప్రస్తుతం గర్భాలయంలో వున్న శ్రీ సీతారామలక్ష్మణ స్వాముల విగ్రహాలు కూడా ఇదే మండపంలో వుండేవట. అందుకే ఈ మండపానికి రాములవారి మేడ అని పేరు వచ్చిందట. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో రాములవారి విగ్రహాలను గర్భాలయంలోకి, పరివార దేవతలను అంకురార్పణ మండపంలోకి తరలించారు. రాములవారి మేడ దాటిన తర్వాత లోపలికి ప్రవేశించే మండపం శయన మండపం. శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్న గర్భాలయానికి ముందున్న మండపం శయన మండపం. పదమూడున్నర అడుగుల కొలతలో వుండే ఈ మండపాన్ని అర్ధ మండపం అని కూడా పిలుస్తారు. శ్రీవారికి ప్రతిరోజు రాత్రి వేళలో ఏకాంత సేవను ఈ మండపంలోనే నిర్వహిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి కూడా ఇదే మండపంలో ఏకాంత సేవను నిర్వహిస్తారు. ఇక శ్రీవారి నైవేద్య సమర్పణ ఈ మండపంలోనే నిర్వహిస్తారు. స్వామివారికి భోజనశాలగా, శయనశాలగా ఉపయోగపడు తున్న పవిత్ర మండపం శయన మండపం. అటు తర్వాత వుండే మండపమే సాక్షాత్తూ ఆ కలియుగ వేంకటేశ్వర స్వామివారు వెలసి వున్న ప్రాంతం. అదే శ్రీవారి గర్భాలయం. 7.2 అడుగుల మందంతో, 12.9 అడుగుల చతురస్ర మండపం గర్భాలయం. స్వామివారి గర్భాలయంపై ఆనంద నిలయం 1244–50 సంవత్సరాల మధ్య నిర్మించారట. సాలగ్రామ శిలామూర్తిగా శ్రీవేంకటేశ్వరస్వామి వారు వెలసి వుండే ఈ గర్భాలయంలో శ్రీవారికి పూజాకైంకర్యాలను నిర్వహించే అర్చకులు, జీయంగార్లకు మినహా మరెవ్వరికీ అనుమతులు వుండవు. శ్రీవారి పంచబేరాలు ఈ గర్భాలయంలోనే వుంటాయి. మూలమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్పస్వామి వారి ఉత్సవ విగ్రవాలు ఇక్కడే వుంటాయి. శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్, రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు, శ్రీసీతారామలక్ష్మణ స్వాముల విగ్రహాలు ఇక్కడే వుంటాయి. కలియుగ ఇల వైకుంఠ నాథుడు వెలసిన పుణ్యస్థలానికి ప్రత్యక్షంగా చేరుకోవాలి అంటే ఇన్ని మండపాలను దాటుకుని వెళ్ళాలి. ప్రతిపుణ్యస్థలాన్ని దాటుకుంటూ వెళ్లాలి. ప్రతి మండపానికి విశిష్టత తెలుసుకుంటూ వెళ్ళాల్సిందే. -
బ్రహ్మ కడిగిన పాదము...
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారికి అర్చకులే కాదు... సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూడా పూజలు నిర్వహిస్తారు.... శ్రీవారికి ఆగమ శాస్త్రబద్ధంగా ప్రతి నిత్యం ఆరుసార్లు అర్చకులు పూజలు నిర్వహిస్తే... బ్రహ్మదేవుడు ఏకాంతంగా స్వామివారికి పూజ లు నిర్వహిస్తాడు. అసలు బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహించడం ఏంటి... ఏ సమయంలో స్వామివారికి బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహిస్తాడో చూద్దాం... కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి ప్రతి నిత్యం ఆగమ శాస్త్రబద్ధంగా పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహిస్తారు. శ్రీవారికి పూజాకైంకర్యాల నిర్వహణపై వెయ్యి సంవత్సరాల క్రితం వరకు నిర్దిష్టమైన విధానం వుండేది కాదు. దీంతో వెయ్యి సంవత్సరాల క్రితం తిరుమలకు విచ్చేసిన రామానుజాచార్యులు శ్రీవారి ఆలయంలో పూజా కైంకర్య నిర్వహణపై విధి విధానాలు నిర్దేశించారు. స్వామివారికి అర్చకులు ఆగమ శాస్త్ర్తబద్ధంగా పూజ లు నిర్వహించాలని, వాటిని పర్యవేక్షించే బాధ్యతలను జియ్యంగార్లకు అప్పగించారు. అప్పటి నుంచి కూడా శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగా పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. మధ్యలో శ్రీవారి ఆలయ పరిపాలన అనేక రాజులు, బ్రిటిష్ వారు, మహంతులు పర్యవేక్షించినప్పటికీ పూజా విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. ఇక 1933లో టీటీడీ ఏర్పడినప్పటి నుంచి అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తుండేది. స్వామివారికి ప్రతి నిత్యం సుప్రభాతం సేవతో మేల్కొలుపు పలికి, పుష్పాల అలంకరణకు తోమాల సేవను నిర్వహిస్తారు. అటు తరువాత స్వామివారికి సహస్ర నామాలతో అర్చన సేవను నిర్వహించి నివేదన సమర్పిస్తారు. ఇక సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవను స్వామివారికి శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహిస్తారు. అటు తరువాత శ్రీవారికి ప్రతి నిత్యం సంపంగి ప్రాకారంలో వున్న మండపంలో కళ్యాణోత్సవం, అద్దాల మహల్ లో డోలోత్సవం, వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, దీపాలంకరణ మండపంలో సహస్రదీపాలంకరణ సేవలు నిర్వహిస్తారు. ఇక సాయంత్రం స్వామివారికి మరొక్కసారి పుష్పాలంకరణ కోసం తోమాల సేవ అటు తరువాత అర్చన సేవలను నిర్వహించి స్వామివారికి నైవేద్య సమర్పణ జరిపిస్తారు. ఇక రాత్రి స్వామివారికి ఏకాంత సేవను అర్చకులు నిర్వహిస్తారు. శ్రీవారి పంచబేరాలలో ఒక్కటైన భోగ శ్రీనివాసమూర్తికి పవళింపు సేవను నిర్వహిస్తారు. అదే సమయంలో శ్రీవారి మూలవిరాట్టు ముందు పంచపాత్రలలో బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు చేసేందుకు వీలుగా ఆకాశగంగ నీటిని అర్చకులు వుంచుతారు. తిరిగి ఆ నీటిని ఉదయం సుప్రభాత సేవ సమయంలో పక్కనపెడతారు అర్చకులు.బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహించినందుకు సాక్ష్యంగా పంచపాత్రలో వున్న నీరు తగ్గి వుండడమే కాకుండా ఆ ప్రాంతంలో తడిగా కూడా వుంటుంది అంటారు అర్చకులు. ఇలా స్వామివారికి సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ప్రతి నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహించి నివేదన సమర్పిస్తారు. అందుకే శ్రీవారి ఆలయంలో స్వామివారికి నివేదన సమర్పించకుండా భక్తులకు తీర్థాన్ని అందించరు. కాని సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తులకు మాత్రం స్వామివారికి బ్రహ్మదేవుడు సమర్పించిన తీర్థాన్ని భక్తులకు బ్రహ్మ తీర్థంగా అర్చకులు అందిస్తారు. బ్రహ్మ తీర్థాన్ని స్వీకరించిన భక్తులకు సకలపాప హరణం జరుగుతుంది. -
స్వామికి అభిషేకం శుక్రవారం ఎందుకు?
తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి. ఈ ప్రశస్తికి కారణం ఈ ప్రాంతంలో శ్రీవారు స్వయంభువై వెలిసి ఉండడం. తిరుమల కొండలపై ఒక సాలగ్రామ శిలద్వారా స్వయంభువై వెలసిన శ్రీవేంకటేశ్వరుని శ్రీనివాసుడని, సప్తగిరీశుడని, ఏడుకొండలవాడని, బాలాజీ అని, తిరుమలప్ప అని... ఇలా భక్త జనులు రకరకాల పేర్లతో స్వామివారిని ప్రేమతో పిలుచుకుంటారు. కలియుగం ఆరంభంలో అనగా ఇంచుమించు ఐదు వేలసంవత్సరాల క్రితం వక్షస్థలంపై మహాలక్ష్మీ సమేతంగా స్వయంభువై వెలసిన శ్రీవారికి ఎందరో భక్తులు తరతరాలుగా మందిరం, గోపుర ప్రాకారం, మహా ద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. ఆ వెంకటపతికి నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, సంవత్సరోత్సవాది ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వచ్చారు. కొండలలో వెలసిన కోనేటిరాయుడు ఎంతటి భక్తజన ప్రియుడో అంతటి నైవేద్య ప్రియుడు. ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి అలంకార ప్రియుడు. అందుకే శ్రీవారికి నిత్యం అర్చకులు రెండు పూటలా పుష్పాలంకరణ చేస్తారు. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాలైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడుకొండలవాడికి నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలిపి, తోమాలసేవతో పుష్పాలంకరణ చేసి, అర్చనతో సహస్ర నామార్చన చేస్తారు. అటు తరువాత వారోత్సవాన్ని నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం శ్రీవారికి తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అనంతరం అర్చకులు రాత్రి ఏకాంత సేవతో శ్రీవారిని నిద్రపుచ్చుతారు. ఇక ప్రతి నెల శ్రీనివాసునికి ఏదో ఒక ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. జనవరిలో పార్వేటి ఉత్సవం, ఫిబ్రవరిలో రథసప్తమి, మార్చిలో తెప్పోత్సవం, ఏప్రిల్‌లో వసంతోత్సవం, మే నెలలో పద్మావతి పరిణయోత్సవం, జూన్ నెలలో జేష్ఠాభిషేకం, జూలై నెలలో ఆణివార ఆస్థానం, ఆగస్టు నెలలో పవిత్రోత్సవాలు, అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాలు, నవంబర్ నెలలో పుష్పాభిషేకం వంటి మాసోత్సవాలు నిర్వహిస్తారు. మరో వైపు ప్రతి వారం శ్రీవారికి వారోత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళపాదపద్మారాధన, బుధవారం సహస్రకలశాభిషేకం, గురువారం తిరుప్పావై, శుక్రవారం మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం శ్రీవారికి నిర్వహించే అభిషేక సమయంలో 84తులాల పచ్చకర్పూరం, 36తులాల కుంకుమ పువ్వు, ఒకతులం కస్తూరి, ఒక్కటిన్నర తులం పునుగు తైలం, 24తులాల పసుపుపొడి వంటి పరిమళ ద్రవ్యాలను వినియోగిస్తారు. శ్రీనివాసునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయగా వచ్చే తీర్థాన్ని పులికాపు తీర్ధం అంటారు. అభిషేక సేవలో పాల్గొనే భక్తుల మీద సేవానంతరం ఈ తీర్థంతో అర్చకులు సంప్రోక్షణ చేస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూలమూర్తి నొసటన నామాలతో అర్చకులు అలంకరిస్తారు. దీనినే తిరుమణికాప్పు అంటారు. వారంలో ఒకసారి మాత్రమే అంటే అభిషేక సేవ అనంతరం చేసే తిరుమణి కాప్పునకు 16 తులాల పచ్చకర్పూరం, ఒక్కటిన్నర తులాల కస్తూరిని అర్చకులు ఉపయోగిస్తారు. శుక్రవారం నొసటి భాగాన తిరునామాలతో అలంకరించిన తర్వాత తిరిగి గురువారం వాటిని సడలిస్తారు. గురువారం రోజున నామాలు బాగా తగ్గించినందువల్ల శ్రీవారి నేత్రాలు బాగా కనిపిస్తాయి. దీంతో గురువారం ఒక్కరోజు భక్తులకు శ్రీవారి నేత్ర దర్శన భాగ్యం లభిస్తుంది. బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ నామం సమర్పణలో రెట్టింపు వుంటుంది. అంటే ప్రతి సంవత్సరం పది రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ముందు వచ్చే శుక్రవారం 32 తులాల పచ్చకర్పూరం, 3 తులాల కస్తూరితో శ్రీవారి నామాలను ఏర్పాటు చేస్తారు. అభిషేక సేవ అనంతరం శ్రీవారి మూలవిరాట్టుకు 24 మూరల పొడవు, 4 మూరల వెడల్పుగల సరిగంచు వున్న పెద ్దపట్టువస్త్రాన్ని ధోవతిగాను, 12 మూరల పొడవు 2 మూరల వెడల్పు గల పట్టువస్త్రాన్ని ఉత్తరీయంగాను అలంకరిస్తారు. ఇక 38 రకాల ఆభరణాలతో శ్రీవారి మూల విరాట్టును అలంకరిస్తారు. ఈ ప్రక్రియ అంతా ఆగమబద్ధంగా నిర్వహించడానికి దాదాపుగా రెండున్నర గంటల సమయం పడుతుంది. శ్రీవారికి శనివారం విశేషమైన రోజు కావడంతో వెంకన్న దర్శనార్థం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రద్దీ రోజులలో శ్రీవారికి అభిషేక సేవ నిర్వహిస్తే భక్తులు స్వామిని సందర్శించుకునే సమయం బాగా తగ్గుతుంది. దీనికితోడు శ్రీనివాసుడి వక్షస్థలంపై లక్ష్మీ అమ్మవారు వుండడంతో, అమ్మవారికి శుక్రవారం విశేషమైన రోజు కావడం వల్ల శ్రీవారితోపాటు అమ్మవారికి కూడా కలిపి ఒకేరోజు అభిషేక సేవను నిర్వహిస్తారు. -
తిరుమల కొండలలో 108 తీర్థప్రవాహాలు
దేవదేవుడు కొలువైన తిరుమల కొండలు ముక్కోటి తీర్థాలకు నిలయాలు. శేషాచల కొండలలో దాదాపు 108 పుణ్యతీర్థాలు ఉన్నట్లు పురాణాల కథనం. ఈ108 తీర్థాలలోని పవిత్రజలాలు అన్నీ అంతర్గతంగా శ్రీవారి పుష్కరిణి తీరంలో కలుస్తాయి. అందుచేతనే శ్రీవారి పుష్కరిణి స్నానం సకల పాపహరణం అంటారు. అయితే భక్తులకు సా«ధారణంగా శేషాచల ఏడుకొండలలోని ముఖ్యతీర్థాలు మాత్రమే తెలుసు. కానీ సాక్షాత్తూ స్వామివారి గర్భాలయం భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ పవిత్రజలాలు నేరుగా శ్రీవేంకటేశ్వరుని పాదాలను నిత్యం స్పృశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి ప్రత్యేకతలున్న ఈ పవిత్ర తీర్థాల గురించి ప్రత్యేక కథనం. సాక్షాత్తూ స్వామివారి పాదాల కింద ప్రవాహించేది విరాజానది. ఆలయంలో సంపంగి ప్రాకారంలో ఉత్తరం వైపు ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరాజానది అంటారు. ఆలయంలోని ఈ దేవనది స్వామిపాదాల కింద నుంచి నేరుగా ప్రవహిస్తుందంటారు. ఇదేవిధంగా మరో బావి కూడా ఆలయంలోనే వుంది. ఈ బావిని చతురస్రాకారంలో చెక్కిన రాళ్లతో నిర్మించారు. దీనిపై అలనాటి అద్భుతమైన శిల్పకళా సంపదను చూడవచ్చు. రాతిరాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి వున్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయ మర్దనంలో శ్రీకృష్ణుని వేడుకొంటున్న నాగకన్యలు, ఏనుగును ఆజ్ఞాపిస్తున్న వేంకటేశ్వరుడు, గరుత్మంతుడి శిల్పాలు కనిపిస్తాయి. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మల బావిగా పిలుస్తుంటారు. స్వామి నిర్మాల్యం పూలబావికే పరిమితం అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూల బావి ఉంది.స్వామివారికి సమర్పించిన తులసీ పుష్పమాలలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం మొదటి నుంచి లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూతీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. అభిషేక సేవకు బంగారుబావి నీళ్లు వకుళమాత కొలువైన పోటు పక్కనే బంగారుబావి ఉంది. స్వామివారి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చే భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని పవిత్రజలాలనే వాడుతారు. బంగారుబావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో ఒరలాంటి రక్షణ నిర్మించారు. దీనికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీ తీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పుణ్యఫలం కటాహతీర్థ పానం శ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహతీర్థ పానం– ఈ మూడూ త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహతీర్థం శ్రీవారి హుండీకి వెలుపల అనుకుని తొట్టి మాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీనిని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామివారి పాదాల నుంచి వచ్చే అభిషేక తీర్థమిది, ఈ తీర్థ్దాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరీ మంత్రం లేదా కేశావాది నామాలు లేదా శ్రీవేంకటేశ్వరుని గోవింద నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఈ తీర్థ్దాన్ని స్వీకరించడం వలన జన్మజన్మల కర్మఫలాలు తొలగిపోతాయని, ఒక్క చుక్క స్వీకరించినంతనే మహాపాతకం, అవిద్య, అజ్ఞానం నశించిపోయి భూమ్మీదవున్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మోక్ష ప్రాప్తి కలిగించే పుష్కరిణి స్నానం శ్రీవారి పుష్కరిణి స్నానం సకల పాపహరణం అంటారు. బ్రహ్మాండంలోని సరస్వతి తీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాద్రితో పాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠక్షేత్రానికి తీసుకొచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారిని దర్శించడం, పుష్కరిణి తీర్థాన్ని సేవించడం, ఇందులో పుణ్యస్నానాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖశాంతులతో పాటు పరలోకంలో మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తిరుమల కొండలలో నెలవైన వందలాది పుణ్యతీర్థాల పవిత్రజలాలన్నీ ఇందులో ప్రవహిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలలో అడుగడుగునా వింతలే. స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఆయన సన్నిధిలోని అణువణువునూ సందర్శించాల్సిందే. పుష్కరిణిలో ప్రాచుర్యంలో తొమ్మిది తీర్థాలు ముక్కోటి తీర్థ సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి మార్కండేయ తీర్థం (తూర్పుభాగం), ఆగ్నేయతీర్థం(ఆగ్నేయభాగం), యమతీర్థం(దక్షిణ భాగం), విశిష్టతీర్థం (ౖ¯ð రుతి) వరుణతీర్థం(పడమర) వాయుతీర్థం (వాయవ్య భాగం), ధనదతీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం(ఈశాన్యం) సరస్వతి తీర్థం(మధ్యభాగం). దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట. ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగరుగ్మతలను పోగొట్టుకుని, భోగభాగ్యాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి.