governance
-
జగన్ పాలనలోనే అత్యుత్తమ పోలీసింగ్! ఇండియా జస్టిస్ నివేదిక వెల్లడి
-
కృత్రిమ మేధను నియంత్రించవచ్చా..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీటి నైతికత, భద్రత, సృజనాత్మక పరిధి, ఆర్థిక వృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని దేశాల్లోనే ఏఐ గవర్నెన్స్‌కు సంబంధించిన స్పష్టమైన విధానాలున్నాయి. సామాజిక భద్రత, మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ కృత్రిమ మేధను నియంత్రించడానికి ఖచ్చితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు వ్యూహాత్మక విధాన ఫ్రేమ్‌వర్క్‌లతో ముసాయిదా చట్టాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.ఏఐ నియంత్రణపై ప్రపంచ దేశాలు ఇలా..చైనా ఏఐ అల్గారిథమ్ల్లో పారదర్శకత, డేటా గోప్యత, ఎథికల్ ఏఐ విధానాలను అమలు చేయడంపై దృష్టి సారించే నిబంధనలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఏఐ చట్టాన్ని అమలు చేస్తుంది. సామాజిక భద్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో హైరిస్క్ అప్లికేషన్లపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది.కెనడాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా యాక్ట్ (ఏఐడీఏ) బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది.దక్షిణ కొరియా నైతిక కృత్రిమ మేధ కోసం మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కృత్రిమ మేధ భద్రత, జవాబుదారీతనాన్ని నియంత్రించడానికి చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది.పెరూ ప్రభుత్వ సేవల్లో నైతిక ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి నిబంధనలు ప్రవేశపెట్టింది.అమెరికా కృత్రిమ మేధ విధానంలో మాత్రం మార్పు వచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో రద్దు చేశారు.యునైటెడ్ కింగ్డమ్, జపాన్, బ్రెజిల్, కోస్టారికా, కొలంబియాతో సహా అనేక దేశాలు తమ చట్టసభలలో ఆమోదం కోసం కృత్రిమ మేధ బిల్లులను రూపొందించాయి.ఇదీ చదవండి: రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసుఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లుసమ్మిళిత, సుస్థిర వృద్ధిని నిర్ధారించేందుకు, సామాజిక ఆర్థిక ప్రగతిని నడిపించడానికి ఏఐ వినియోగంపట్ల దేశాల ధోరణి ఎలా ఉందనేది నేషనల్ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి అధికారిక చట్టాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఏఐ పాలనకు మరింత విస్తృతమైన విధానాలు తీసుకువచ్చేందుకు ఈ డాక్యుమెంట్లు తోడ్పడుతాయి. ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు సుమారు 85 దేశాలు ఇలాంటి వ్యూహాలను ప్రచురించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పత్రాల్లో ప్రధానంగా కింది విషయాలు పొందుపరిచారని తెలిపారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం.హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏకీకృతం చేయడానికి కాలపరిమితి, ప్రాధాన్యాలను నిర్దేశించడం.నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి సూత్రాలను ఏర్పాటు చేయడం.ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పౌరులను సిద్ధం చేయడానికి కావాల్సిన విద్యను ప్రోత్సహించడం.ఏఐ భద్రత, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భాగస్వామ్యాలు తోడ్పాటు అందించడం. -
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్
సాక్షి, అమరావతి: ప్రజలు నేరుగా ఫోన్ ద్వారానే ధృవపత్రాలు అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం గత ఏడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించనుంది. వాట్సాప్ గవర్నెన్స్‌పై బుధవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో అధికారులు ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలు ఎలా పొందాలి, ఆప్షన్లు ఎలా ఎంచుకోవాలో వివరించారు. మొదటి విడతలో దేవదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆరీ్టసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల సేవలు అందుబాటులోకి తెస్తున్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్‌ను రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్నామని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎస్ కె.విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జగనన్న ప్రభుత్వమే బాగుంది..
-
పాలనలోనూ కృత్రిమ మేధస్సు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ)ను మేళవించి ప్రజలకు త్వరితగతిన, సమర్థవంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వ శాఖలు వెనుకంజలో ఉన్నాయనే విమర్శల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.వివిధ ప్రభుత్వ శాఖల్లో కృత్రిమ మేధ వినియోగానికి ఉన్న అవకాశాలపై కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంతో కూడిన అప్లికేషన్లు (యాప్‌లు) ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ బాధ్యతను ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్’కు అప్పగించింది. 21 ప్రభుత్వ శాఖలతో వర్క్‌షాప్ సాంకేతికత వినియోగం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన విధానాల రూపకల్పనలో పేరొందిన ‘జేపీఏఎల్’(జమీల్ పావర్టీ యాక్షన్ లాబ్) రాష్ట్ర పాలనలో ఏఐ వినియోగం విషయంలో ప్రభుత్వంతో జట్టుకట్టింది. ఇటీవల 21 ప్రభుత్వ శాఖలకు చెందిన ‘ఏఐ నోడల్ ఆఫీసర్ల’తో వర్క్‌షాప్ నిర్వహించింది. ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలోని సంక్లిష్ట అంశాలకు ఏఐ ద్వారా ఏ తరహాలో పరిష్కారాలు సాధ్యమనే కోణంలో లోతుగా మదింపు చేశారు. అంతర్జాతీయంగా పాలన, ప్రజాసేవలో ఏఐ ప్రభావం, వినియోగం, వివిధ దేశాలు, రాష్ట్రాలు ఏఐని వినియోగిస్తున్న తీరుపై ఈ వర్క్‌షాప్‌లో నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా.. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు తగిన ఏఐ ఆధారిత యాప్‌లు, ఏ ప్రభుత్వ విభాగానికి ఏ తరహా యాప్‌లు అవసరమనే కోణంలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కసరత్తు చేస్తోంది. ఆయా ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏఐ పాలనలో ఏఐ వినియోగంపై అవగాహన కల్పించి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో దశలవారీగా ఏఐ సాంకేతికత వినియోగాన్ని పెంచేలా ఒక రోడ్‌మ్యాప్ రూపొందించే అంశంపై జేపీఏఎల్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కలసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు యాప్‌లు అందుబాటులోకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ విజయోత్సవాల్లో భాగంగా రైతులు, యువత, మహిళలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఐటీ, ఏఐ ఆధారిత అప్లికేషన్లను విడుదల చేసింది. మరో అప్లికేషన్‌ను ప్రభుత్వమే వినియోగిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, అగ్రికల్చర్ డేటా ఎక్సే్ఛంజీ సంయుక్తంగా ఒక అప్లికేషన్ రూపొందించాయి. వేగంగా డేటా మారి్పడి, వ్యవసాయ ఆవిష్కరణలను ఈ యాప్ వేగవంతం చేస్తుంది. రైతులు రూ.లక్షలోపు రుణాలను గతంలో మాదిరిగా వారాల తరబడి కాకుండా రెండు రోజుల వ్యవధిలోనే పొందడం సాధ్యమవుతుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ది మిత్ర’పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించింది. పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పసిగట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మాదక ద్రవ్య రహిత వాతావరణంలో పిల్లలు పెరిగేలా ఈ యాప్ తోడ్పడుతుంది. గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు కోసం ‘సన్మతి’యాప్ రూపొందించారు. ఏఐ వినియోగంపై సాధారణ పౌరుల్లో అవగాహన పెంచడంలోనూ ఈ యాప్ సాయపడుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ యాప్’తో ప్రస్తుతం లబి్ధదారుల పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో ఈ యాప్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం జేపీఏఎల్ సహకారంతో ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అనేక ప్రతిపాదనలు అందాయి. ఏయే విభాగాల్లో ఏయే అంశాల్లో ఏఐ వినియోగం సాధ్యమవుతుందో పరిశీలిస్తున్నాం. 21 ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు అందినా తొలిదశలో ఐదు శాఖలను ఎంపిక చేసి ఏఐ ఆధారిత అప్లికేషన్లు తయారు చేయాలని భావిస్తున్నాం. త్వరలో సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరుగుతుంది. – రమాదేవి లంకా, డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ -
'లీడర్' అంటే జగన్
-
వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారు
-
అభివృద్ధికి చిరునామా వైఎస్ జగన్ పరిపాలన
-
USA Presidential Elections 2024: భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులు
అగ్రరాజ్యం. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్షపీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ అంతర్గత భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలుసహా యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతోపాటు శత్రుదేశాలనూ ఒప్పించగల నేర్పు తప్పనిసరి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నాలుగేళ్లుగా జో బైడెన్ అమలుచేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హారిస్ చెబుతుండగా అక్రమ వలసలను నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని, విప్లవాత్మక విధానాలను అమలుచేస్తానని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞచేశారు. ‘‘అధ్యక్షురాలిగా గెలవగానే శ్రామిక కుటుంబాల కోసం పాటుపడతా. కనీస వేతనాన్ని పెంచుతా. సేవలు, ఆతిథ్యరంగంలోని సిబ్బందికి అందే టిప్పులపై వసూలుచేస్తున్న పన్నులను రద్దుచేస్తా’ అని హారిస్ అన్నారు. జూన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే హామీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇప్పటికే ట్రంప్, హారిస్ వెల్లడించిన అభిప్రాయాలు వారి పాలనాపంథాపై స్పష్టత తీసుకొస్తున్నాయి. వాటిని ఒకసారి తరచి చూస్తే..అబార్షన్హారిస్: సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్‌కు అనుమతిస్తూ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ట్రంప్: కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్‌పై ఎప్పుడు ప్రశ్నించినా ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్‌పై జాతీయస్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు.చట్టాల అమలు/ ప్రజాస్వామ్యంహారిస్: హారిస్ గెలిస్తే ట్రంప్‌పై కేసులపై దృష్టిపెట్టే అవకాశముంది. గత అధ్యక్ష ఫలితాలను తప్పుబడుతూ, పార్లమెంట్ భవంతి మీదకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పడం, నీలితారకు అనైతిక నగదు చెల్లింపులు, ఆస్తిగా ఎక్కువగా చూపు రుణాల పొందటం వంటి కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా హారిస్ ఒత్తిడి తేవచ్చు. ప్రజాస్వామ్యయుత పాలనకు కట్టుబడతానని హారిస్ గతంలో అన్నారు. ట్రంప్: బైడెన్ చేతిలో ఓడినపుడు అధ్యక్ష ఫలితాలను ట్రంప్ అంగీకరించలేదు. ఈసారి కూడా ఓడిపోతే ఓటమిని ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు. నాటి పార్లమెంట్‌పై దాడి, అక్కడి పోలీసులను గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష పెడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎఫ్బీఐను ప్రక్షాళిస్తానని చెప్పారు. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్‌తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.వాతావరణ మార్పులు/ఇంథనంహారిస్: అమెరికాలో కర్భన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలో చెప్పారు. హరిత ఇంథనానికి జై కొట్టారు. సముద్రగర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతోపాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు. ట్రంప్: వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే పారిస్ ఒప్పందానికి మళ్లీ కటీఫ్ చేప్తానని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్/ ఉక్రెయిన్యుద్ధాలుహారిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలూ ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి, సంధికి మొగ్గుచూపారు. ఈజిప్ట్, ఖతార్‌లతో కలసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు.ట్రంప్: హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధం ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ఆయన కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులనూ ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు.ప్రభుత్వపాలనహారిస్: ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సులభంగా తీసేసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్–ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్‌లపై పన్నును తొలగిస్తానన్నారు. కార్మికుల కనీస వేతనం పెంచుతానని, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు.ట్రంప్: తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతం గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలువేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్దంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దుచేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థలను ప్రక్షాళిస్తానని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Gun Shot: ఆంధ్రాను ఆఫ్ఘాన్ చేసిన చంద్రబాబు
-
జగన్ పాలనలో ఏపీ ముందడుగు
-
వైఎస్ఆర్ రాజముద్ర
-
రాజకీయాలకు చట్టం బలి..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత సంతకం చేసిన ఫైళ్లలో ఒకటి ల్యాండ్ ‘టైటిల్ గ్యారంటీ చట్టం రద్దు’ ఫైల్. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని భూ సంస్కరణలలో భాగంగా భారత దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఒక్కో గ్రామంలో భూ సమస్య పరిష్కారం కావడానికి తరతరాలు పడుతోంది. దీన్ని నివారించడానికి తెచ్చినదే ‘టైటిల్ గ్యారంటీ చట్టం.’ అప్పుడెప్పుడో శతాబ్దాల క్రితం చేసిన సర్వే తప్ప ఇటీవలి కాలంలో భూసర్వే జరగనే లేదు. అందుకే ఈ కొత్త చట్టం ప్రకారం సమగ్ర భూ సర్వే, డిజిటల్ ల్యాండ్ సర్వే చేసి ఏమైనా సమస్యలు ఉంటే సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడికక్కడే పరిష్కరించి పట్టా పాస్ బుక్కులు ఇచ్చారు. అయినా ఎన్నికల్లో దీన్ని ఎందుకు ప్రచారాస్త్రం చేశారు?‘సింగిల్ సెటిల్మెంట్తో భూ సమస్య పరిష్కారం అయితే మేమేం కావాలి? మా పూట ఎలా గడవాలి’ అని గ్రామాల్లో పూట గడుపుకునే పెద్ద మనుషుల నుండి రైతులను చెప్పులు అరిగేలా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్న న్యాయవాదుల వరకు వ్యతిరేకించారు. అందుకే ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది.తెలంగాణలో గొప్పలకు పోయి తెచ్చిన పట్టాదార్ పాస్ బుక్ చట్టం – 2020, ‘ధరణి’ పోర్టల్ వంటివి పెద్ద అక్రమాలకు తావిచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చేసిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని ఉదాహరణగా తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సర్టిఫికేట్లు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఎందుకు మలిచారు? అధికారం చేపట్టగానే రెండో సంతకం ఈ ఫైల్ మీదే ఎందుకు చేసినట్టు? ఈ సందర్భంగా భూ చట్టాల న్యాయ నిపుణులు ‘మంచి చట్టాన్ని చెత్త రాజకీయాలు చంపేశాయ’ని అంటున్నారు. – బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు -
తగ్గిన పేదరికం..ప్రగతి పథంలో ఏపీ హ్యాపీ
-
నేను గర్వంగా చెప్తున్నాను..సీఎం జగన్ పాలనపై కోన వెంకట్...
-
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
ఇక నా రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్ 3న తెలంగాణలో ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారని, స్వేచ్ఛకు మించింది ఏదీ లేదని నిరూపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిజాంను తరిమికొట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ మళ్లీ అలాంటి రాజరిక పోకడలు అవలంబించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో రేవంత్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిన్నటిదాకా సీఎంగా నిబద్ధతతో పనిచేశా. ఇక పార్టీ అధ్యక్షునిగా నన్ను చూస్తారు. ఎన్నికల నగారా మోగినందున ఎన్నికల్లో నా రాజకీయ రూపం చూస్తారు. సీఎంగా వందవ రోజు ఒక గేట్ ఓపెన్ చేశా. అవతల వర్గం ఖాళీ అయితే గేట్లు మూసినా తెరచినా ఒక్కటే. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకుంటానా. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు పెద్దలు కొట్టకుండా ఊరుకుంటామా. యువకుల ఆత్మబలిదానాలతో సమైక్య పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ రాజరికపోకడలను మళ్లీ తీసుకువచ్చారు. తన వారసులే ఆధిపత్యం చెలాయించాలని కోరుకున్నారు. కేసీఆర్ నిజాం నకలునే మళ్లీ చూపించాడు. ప్రశ్నిస్తే అణచివేయాలనుకున్నాడు. తిరుగుబాటు చేసినవారందరినీ అణచివేశాడు. దీంతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ పరిపాలనను తీసుకువచ్చారు. ధర్నాచౌక్ వద్దు అన్న వారిని కూడా ధర్నా చేసుకోనిచ్చిన ప్రభుత్వం మాది. ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సామంతులలాగా అధికారం కొద్ది మంది అధికారుల చేతిలో పెట్టకుండా అధికారులందరికీ పాలనలో స్వేచ్ఛను కల్పించి పారదర్శకతను తీసుకువచ్చాం. ఉద్యమంలో మాట్లాడిన మాటలను మర్చిపోయి కేసీఆర్ తెలంగాణ సంస్కృతిని చెరిపే ప్రయత్నం చేశారు. మేం వచ్చిన తర్వాత జయజయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేశాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు తీసుకువచ్చి, ఆరోగ్య శ్రీ పరిమితి పెంచాం. గృహ జ్యోతి కింద ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరి కమిషన్(ఈఆర్సీ)లో కేసీఆర్ నాటిన గంజాయి మొక్క ఒకటి గృహజ్యోతి డబ్బులు ముందే డిస్కంలకు ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఇచ్చిన వ్యక్తి ఇంటి పేరు కూడా తన్నీరు. ఈ తన్నీరుకు గతంలో రైతులకు ఉచిత విద్యుత్ డబ్బులు కేసీఆర్ ముందే ఇచ్చాడో లేదా తెల్వదా. ఈ గంజాయి మొక్కలన్నింటిని సమూలంగా పీకేస్తాం’ అని రేవంత్ హెచ్చరించారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్కు బిగ్ షాక్..ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా -
Lok Sabha elections 2024: జూన్ నుంచి మూడో టర్ము
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జూన్ నుంచి తమ మూడో టర్ము పాలన మొదలవుతుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆ తర్వాత సాకారమయ్యే వికసిత భారత్ దేశ యువత కలలకు ప్రతిరూపంగా ఉంటుంది. దేశ రూపురేఖలు ఎలా ఉండాలో నిర్ణయించే పూర్తి హక్కులు వారికున్నాయి. వారి కలలే నా సంకల్పం.నా సంకల్పమే వికసిత భారతానికి హామీ. ఈ నయా భారత్‌లో చిన్న లక్ష్యాలకు చోటు లేదు. పెద్ద పెద్ద కలలు కంటూ వాటి సాకారానికి నిరి్వరామంగా కృషి చేస్తున్నాం. పదేళ్లుగా ఈ వేగం ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది’’ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రూ.41 వేల కోట్లతో తలపెట్టిన 2,000 పై చిలుకు రైల్వే ప్రాజెక్టులకు సోమవారం ఆయన వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.వీటిలో 27 రాష్ట్రాల పరిధిలో 554 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి, 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జి పనులున్నాయి. తెలంగాణలో రూ.230 కోట్లతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లతో 17 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లకు మోదీ భూమి పూజ చేశారు. రూ.221 కోట్లతో పూర్తయిన 3 రైల్ ఫ్లై ఓవర్, 29 రైల్ అండర్ పాస్‌లను జాతికి అంకితం చేశారు.కాంగ్రెస్ పాలనలో రైల్వే శాఖ రాజకీయ క్రీడలకు వేదికగా కునారిల్లిందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. తమ పాలనలో పదేళ్లుగా ఆధునికతను అందిపుచ్చుకుని దూసుకుపోతోందన్నారు. ‘‘కొన్నేళ్లుగా భారత్ అన్ని రంగాల్లోనూ శరవేగంగా ప్రగతి సాధిస్తోంది. పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న ప్రతి రూపాయినీ వారి సంక్షేమానికే వెచి్చస్తున్నాం. గత కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లను ప్రారంభించా’’ అని చెప్పారు.టెక్స్టైల్ రంగ ప్రగతికి సాయంటెక్స్టైల్ రంగానికి కేంద్రం అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. ‘‘దేశాభివృద్ధిలో ఆ రంగానిది కీలక పాత్ర వికసిత భారత లక్ష్యసాధనలో టెక్స్టైల్ రంగం పాత్రను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు. భారత్ టెక్స్–2024ను మోదీ ప్రారంభించారు.‘‘వికసిత భారతానికి పేదలు, యువత, రైతులు, మహిళలు నాలుగు స్తంభాలు. వారందరికీ టెక్స్టైల్ రంగంలో గణనీయమైన పాత్ర ఉంటుంది’’ అని ఈ సందర్భంగా అన్నారు. 2014లో రూ.7 లక్షల కోట్లున్న భారత టెక్స్టైల్ రంగం విలువ ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగు రోజుల భారత్ ఎక్స్‌పోలో 100కు పైగా దేశాల నుంచి 3,500కు పైగా ఎగ్జిబిటర్లు, 3,000 పై చిలుకు కొనుగోలుదారులు, 40 వేల మందికి పైగా వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొంటున్నారు. -
నయా పెత్తందార్లకు ధీటైన జవాబు
-
పల్లె పల్లెకూ విస్తరించిన జగనన్న సంక్షేమ క్రాంతి
-
ఒడిదుడుకులకు సిద్ధం కావాలి
న్యూఢిల్లీ: కొత్త ఏడాది (2024)లో అంతర్జాతీయంగా గవర్నెన్స్‌లో సంక్లిష్టత స్థాయి మరింతగా పెరుగుతుందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. మరిన్ని ఒడిదుడుకులు, మరింత విప్లవాత్మక మార్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. పరివర్తన చెందుతున్న క్రమంలో టాటా గ్రూప్ .. కొత్త ఏడాదిలో ప్రణాళికల అమలు, కస్టమరు సంతృప్తి, టెక్నాలజీ అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని చెప్పారు. భౌగోళిక, రాజకీయ ఆందోళనలు మొదలుకుని జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ వినియోగం వరకు వివిధ ట్రెండ్స్‌తో 2023లో ప్రపంచం అస్థిరపర్చే ధోరణులను ఎదుర్కొందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ప్రపంచ గవర్నెన్స్ విధానాలను సంక్లిష్టంగా మార్చాయని, మార్పులకు తప్పనిసరిగా అలవాటు పడేలా ఒత్తిడి తెచ్చాయని ఆయన వివరించారు. 2023లో టాటా గ్రూప్ మెచ్చుకోతగిన విధంగా రాణించిందన్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో, కొత్త గిగాఫ్యాక్టరీలు మొదలైనవి రాబోయే దశాబ్దాల్లో మరింత వృద్ధికి దోహదపడగలవని చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పటికీ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్ టీమ్ కనపర్చిన ఆత్మవిశ్వాసం, చంద్రయాన్ మిషన్ 2023లో గుర్తుండిపోయే రెండు కీలకాంశాలని ఆయన పేర్కొన్నారు. -
విలువలు నైతికతతో రాజకీయాలకు నిర్వచనం
-
జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు
-
53 నెలల పాలన..కొత్త చరిత్ర లిఖించిన సీఎం జగన్
-
తటస్థతకు తూట్లు పొడవొద్దు!
పాలనా ప్రక్రియలో పాలుపంచుకునే ఉన్నతాధికార వర్గం ఆ ప్రక్రియలో పెనవేసుకుని వుండే రాజకీయ పార్శ్వానికి ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్)లో మంత్రులతోపాటు ఉన్నతాధికారవర్గం కూడా భాగస్వామే. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మంత్రులు మారతారు. కానీ ఉన్నతాధివర్గం మాత్రం శాశ్వతం. అందుకే పాలనాపరమైన విధి నిర్వహణ వేరు... రాజకీయ ప్రచారం వేరు అనే స్పృహ అధికార యంత్రాంగానికి ఎప్పుడూ ఉంటుంది. సివిల్ సర్వీసు నిబంధనలు సైతం ఉన్నతాధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటానికి అంగీకరించవు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక సర్క్యులర్ ఆ విభజనను కాస్తా మటుమాయం చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని ప్రచారం చేసేందుకు సీనియర్ అధికారులు దేశంలోని 765 జిల్లాలకూ, ఆ జిల్లాల్లోని 26 కోట్ల 90 లక్షల గ్రామాలకూ తరలివెళ్లాలని ఆ సర్క్యులర్ నిర్దేశించింది. జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ స్థాయి ఉన్నతాధికారులు ఈ యజ్ఞంలో పాలుపంచుకోవాలట. వీరికి రథ్ ప్రభారీస్ (ప్రత్యేక అధికారులు)గా నామకరణం చేశారు. కేంద్రంలోని రక్షణ మంత్రిత్వ శాఖ సహా అన్ని శాఖలూ ఈ మాదిరి సర్క్యులర్‌నే విడుదల చేశాయి. రక్షణ శాఖ ఈ నెల 9న జారీ చేసిన ఉత్తర్వు మరింత విడ్డూర మైనది. వార్షిక సెలవుల్లో వెళ్లే సైనికులు తమ తమ నెలవుల్లో ‘సైనిక దూతలు’గా ప్రభుత్వ పథకా లను ప్రచారం చేయాలని ఆ ఉత్తర్వు పిలుపునిచ్చింది. నవంబర్ 20 మొదలుకొని జనవరి 25 వరకూ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ పేరుతో దీన్ని కొనసాగించాలన్నది సర్క్యులర్ సారాంశం. సరిగ్గా ఈ తేదీల మధ్యనే తెలంగాణ, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలుంటాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చాక ఇలాంటి యాత్రలు ఎంతవరకూ సమంజసమన్న సంగతలావుంచి... అసలు ఉన్నతాధికార వర్గం ఈ మాదిరి ప్రచారకర్తలుగా పని చేయటం సరైనదేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకాల గురించి అందరికీ తెలిసేలా అవసరమైన ప్రచార ఉపకరణాలను సంసిద్ధపరచుకో వటం ఏ ప్రభుత్వానికైనా అవసరం. అందుకోసమే ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉంటుంది. ఆ శాఖ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తుంది. తమ ప్రభుత్వమే మరో దఫా అధికారంలో కొనసాగేందుకు కావలసినదంతా చేస్తుంటుంది. ఇందుకు బడ్జెట్లో కేటాయింపులుంటాయి. తమది ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న రాజకీయ పార్టీ అని బీజేపీ చెప్పుకుంటుంది. ఆ పార్టీకి నోరున్న రాజకీయ నాయకుల లోటు కూడా లేదు. వీరందరినీ కాదని ప్రభుత్వ పథకాలనూ, వాటి ద్వారా సాధించిన ప్రగతినీ ప్రచారం చేసేందుకు ఉన్నతాధికార వర్గాన్ని దించాల నటంలో ఆంతర్యమేమిటన్నది అంతుపట్టని విషయం. కార్యకర్తలు, నాయకుల కంటే ఈ అధికారు లకే విశ్వసనీయత ఉంటుందని పాలకులు అనుకుంటున్నారా? ‘అధికారులు కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోని కుర్చీలకు అతుక్కుపోవాలా? తాము రూపొందించిన పథకాల ప్రభావం క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకోవద్దా?’ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న తర్కం అర్థరహితమైనది. అలా తెలుసుకోవటానికీ, అవసరమైన మార్పులు చేసుకోవటానికీ పకడ్బందీ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలున్నాయి. అవసరమైన సమాచారాన్ని సత్వరం పొందేందుకు ఎన్నో మార్గా లున్నాయి. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజలందరికీ అందించటానికి, అవి కేవలం లక్షిత వర్గాలకు మాత్రమే చేరేలా, దుర్వినియోగానికి తావులేకుండా చేయటానికి ఎన్నో నిబంధనలు అమల్లో కొచ్చాయి. కానీ ఉన్నతాధికారులే స్వయానా ప్రచారకర్తలుగా మారాలనడం, అందువల్ల మాత్రమే ప్రజలంతా అన్నీ తెలుసుకోగలుగుతారనడం సమంజసం కాదు. ఈ క్రమంలో ఉన్నతాధికార వర్గం రాజకీయాలను అంటించుకుంటే పాలనావ్యవస్థకుండే తటస్థతకు జరిగే నష్టం తీవ్రమైనది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఎలాగన్నది కార్యనిర్వాహక వర్గంలోని మంత్రులకు సంబంధించిన ప్రశ్న. అదే వ్యవస్థలో భాగస్థులైన ఉన్నతాధికారవర్గం పాలనా ప్రక్రియ సజావుగా సాగటానికి, పాలకుల విధానాలూ, వారి పథకాలూ లక్షిత వర్గాలకు చేరేలా చేయటంవరకూ పూచీ పడుతుంది. అంతకుమించి ఏం చేసినా దానికి రాజకీయ మకిలి అంటుతుంది. బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఉన్నతాధివర్గం పని... కేవలం శాంతిభద్రతలను పర్యవేక్షించటం, ఖజానాకు ఆదాయం సమకూర్చటం మాత్రమే! కానీ స్వాతంత్య్రం వచ్చాక అదంతా మారింది. సంక్షేమ రాజ్య భావన బలపడటంతో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ పాలకుల సంక్షేమ విధానాల అమలు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి ఉన్నతాధికార వర్గం ప్రధాన కర్తవ్యా లయ్యాయి. రాజకీయ అస్థిరత అలుముకున్న దశలో కూడా ఉన్నతాధికార వ్యవస్థ తటస్థంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకత్వానికి అవసరమైన సలహాలిస్తూ పాలన సజావుగా సాగేందుకు దోహద పడుతోంది. సివిల్ సర్వీసు అధికారులు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాల్లో లేదా మతసంబంధ అంశాల్లో తలదూర్చరాదని ఈ సర్వీసు పథ నిర్దేశకుడైన స్వర్గీయ సర్దార్ పటేల్ హితవు చెప్పారు. అందుకు పూర్తి భిన్నంగా పోయి పాలనావ్యవస్థకూ, సైనిక వ్యవస్థకూ రాజకీయ మకిలి అంటించి మన పొరుగునున్న పాకిస్తాన్ చివరికెలా అఘోరించిందో కనబడుతూనే ఉంది. అందువల్ల ఉన్నతాధికారగణాన్ని ప్రచారకర్తలుగా ఉరికించాలన్న సంకల్పాన్ని కేంద్రం విడనాడాలి. దాని తటస్థతను కాపాడాలి. -
ఏపీకి జగనే కావాలంటోన్న జనం
-
అభివృద్ధి అంటే ఇది అనేలా సీఎం జగన్ పాలన..
-
బలమైన ప్రభుత్వం ఓ అపోహే!
ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనేది అపోహ. సంకీర్ణ ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ ఈ అపోహ జనాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత లేదా సంకీర్ణ ప్రభుత్వాల మధ్య ఎటువంటి తేడా లేదని చరిత్ర చెబుతోంది. అమెరికాలో మహా మాంద్యం తర్వాత, ‘న్యూ డీల్’(1933)లో భాగంగా సంక్షేమ విధానాలను అమలు చేశారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగింది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. భారత్ వంటి విశాలమైన దేశానికి ఒకే పార్టీ, ఒకే నాయకుడి ద్వారా మాత్రమే ఉత్తమ పాలన అందుతుందనే అపోహ ఆధారంగా, ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనను తిరిగి ఎన్నుకోవడం అనే ప్రబలమైన కథనం ఆధారపడి ఉంది. ‘బలమైన ప్రభుత్వం’ అనే ఈ అపోహ– బహుళ పార్టీ, సంకీర్ణ ఆధారిత ప్రభుత్వాలు ‘బలహీనమైనవి’ అనీ, అవి నిర్ణయాలు తీసుకోలేవనీ లేదా చట్టాలను ఆమోదించలేవనీ నమ్మేలా చేస్తుంది. అయితే, రాజనీతి శాస్త్ర రంగంలోని పరిశోధనలు మనకు భిన్నమైన చిత్రణను చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రధానంగా మూడు రకాల ప్రజా స్వామ్య ప్రభుత్వాలు ఉనికిలో ఉన్నాయి. అవి: అధ్యక్ష తరహా, పార్ల మెంటరీ, సంఘటిత (కాన్సోషియేషనల్) ప్రభుత్వాలు. ఈ ప్రతి ప్రభుత్వ రూపంలోనూ, బహుళ పార్టీ ప్రభుత్వాలు లేదా సంకీర్ణ ప్రభు త్వాలు స్థిరంగా ఉండటమే కాకుండా పౌరుల సంక్షేమం విషయంలో కూడా మెరుగ్గా ఉన్నాయని సాక్ష్యాధారాలు చూపుతున్నాయి. అమెరికా, అధ్యక్ష వ్యవస్థను అనుసరిస్తుంది. ఈ వ్యవస్థలో అధ్య క్షుడిని నేరుగా కార్యనిర్వాహక అధిపతిగా ఎన్నుకుంటారు. అయితే పన్నులు పెంచడం, డబ్బు ఖర్చు చేయగల సామర్థ్యం అనే ఖజానా అధికారాలను ప్రతినిధుల సభకు కట్టబెట్టారు. డేవిడ్ మేహ్యూ రాసిన ‘డివైడెడ్ వియ్ గవర్న్: పార్టీ కంట్రోల్, లా మేకింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్స్, 1946–2002’ అనే పుస్తకంలో, ఒకే రాజకీయ పార్టీ అటు అధ్యక్ష పదవినీ, ఇటు కాంగ్రెస్‌నీ నియంత్రించినప్పుడు మాత్రమే అమెరికన్ జాతీయ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనే సాధారణ అపోహను తొలగించారు. చట్టాలను ఆమోదించడంలో ఏకీకృత పార్టీ లేదా వివిధ పార్టీల మధ్య ఎటువంటి తేడా లేదని ఈ పుస్తకం వెల్లడిస్తుంది. నిజానికి, మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) తర్వాత, అంటే 1933లో కొత్త ఒప్పందం (న్యూ డీల్)లో భాగంగా సంక్షేమ ఆధారిత విధానాలు అమలు చేశారు. అలాగే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో ఇటీవలే తీసుకొచ్చిన ద్రవ్యోల్బణ తగ్గింపు చట్టం, 2022 వంటి సంక్షేమ ఆధారిత విధానాల్లో భాగంగానే ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడం, మందుల ధరలను తగ్గించడం, క్లీన్ ఎనర్జీకి మద్దతు ఇవ్వడం వంటివాటిని ఆమోదించారు. సంపూర్ణ మెజారిటీ లేని ప్రభుత్వాల హయాంలోనే ఇవి ఆమోదం పొందాయి. దీనికి విరుద్ధంగా, అఫోర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) లేదా ఒబామా కేర్ చట్టంగా ప్రసిద్ధి చెందిన యాక్ట్‌ను, 2009లో డెమొక్రాటిక్ పార్టీ అటు అధ్యక్ష పదవినీ నిర్వహిస్తూ, ఇటు ప్రతినిధుల సభలోనూ, సెనేట్‌లోనూ మెజారిటీని కలిగి ఉన్నప్పుడు ఆమోదించారు. అయినా ఈ చట్టాన్ని రిపబ్లికన్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యులు, గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా దానిని రద్దు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అటువంటి చట్టంలో భాగం కాలేనప్పుడు, తమ నియోజకవర్గాలకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఉంటాయని తెలిసినప్పటికీ, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఇది సూచిస్తోంది. పశ్చిమ ఐరోపాలో జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం వంటి పార్ల మెంటరీ ప్రజాస్వామ్యాలను ఎక్కువగా వామపక్ష లేదా సంప్రదాయ వాద పార్టీల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తుంటాయి. 1945 నుండి జర్మనీని రైట్ వింగ్ లేదా ఉదారవాద సంకీర్ణ ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. ‘క్రిస్టియన్ డెమో క్రటిక్ యూనియన్ ఆఫ్ జర్మనీ’ మితవాద పక్షానికీ, ‘సోషల్ డెమో క్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ’ మధ్యస్థ–వామపక్ష ప్రభుత్వానికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇక ‘సంఘటిత’ ప్రభుత్వాలను పార్లమెంటరీ విధానంలోని ఉప విభాగంగా చూడవచ్చు. ఇవి సంకీర్ణ ప్రభుత్వాలను మాత్రమే కలిగి ఉంటాయి. ఇటలీ, లెబనాన్, ఇథియోపియా వంటి దేశాలలో, వివిధ రకాలైన జాతి, మత, భాషా సమూహాలు సహజీవనం చేయవలసి వస్తోంది. సంఘటిత ప్రభుత్వాలు ఈ సమూహాలలోని అన్ని వర్గాల ఏకాభిప్రాయంతో ఏర్పడతాయి. వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక సమూహం ఏదైనా విషయంపై మరొకరిని అడ్డుకుంటే,రెండోది ప్రతిగా ఆ సమూహాన్ని నిరోధించే అవకాశం ఉంటుంది. 1980ల చివరి నుండి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు తప్పనిసరి అయిపోయాయి. ఈ కాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. నిర్ణయాత్మకమైన పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేశారు. అలాగే దేశ అణ్వాయుధ ప్రయోగాల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించారు. 2004 నుండి 2014 వరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అనేక పౌరుల, హక్కుల ఆధారిత చట్టాలను రూపొందించింది. వీటిలో 2005లోని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), 2006లోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ హక్కుల చట్టం, 2009లోని విద్యా హక్కు చట్టంతో పాటు, 2013లో తెచ్చిన ఆహార హక్కు చట్టం; భూ సేకరణ, పునరా వాసం, రీసెటిల్మెంట్ (ఎల్ఏఆర్ఆర్) చట్టం ఉన్నాయి. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశించి... బలహీ నమైన, కీలుబొమ్మ ప్రభుత్వం అనే అపోహను ప్రచారం చేయడంతో అది 2014లో బీజేపీ విజయానికి దారితీసింది. అయితే, 2014 నుండి ‘బలమైన నాయకత్వం’ మనకు ఏమి అందించిందో చూద్దాం. హక్కుల ఆధారిత చట్టాలు వేటినీ ఈ ప్రభుత్వం ఆమోదించలేదు. పాలనా పారదర్శకత, జవాబుదారీతనానికి సంబంధించి ఏ ఆధారాలూ లేవు. బదులుగా మోదీ ప్రభుత్వం ప్రజలను జవాబుదారీగా ఉంచాలనుకుంది. పెద్దనోట్ల రద్దు ద్వారా మీ డబ్బును నాకు చూపించమంది; జీఎస్టీ ద్వారా మీ పన్నులు నాకు చెల్లించమంది. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టాన్ని తేవడం వంటివి జరిగాయి. నిరసనల తర్వాత మాత్రమే 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రద్దయినాయి. గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం లేదా స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించడం వంటివి అమలులో ఉన్న సంక్షేమ విధానాలకు పొడిగింపు మాత్రమే. ఏ కొత్త ఆవిష్కరణా లేదా కొత్త దిశనూ ఈ ప్రభుత్వం చూపలేదు. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన సుమారు 50 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆర్థిక సేవలను అందిస్తుంది. అయితే ఇందులో 4.12 కోట్ల మంది జూలై 2023 నాటికి జీరో బ్యాలెన్స్ కలిగి ఉన్నారు. కాగా, జనవరి 2018 నుండి 6 కోట్ల ఖాతాల్లో ఎటువంటి లావాదేవీలు జరగలేదు. హక్కుల ఆధారిత చట్టాలు ఈ ప్రభుత్వ హయాంలో నిర్వీర్య మయ్యాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులు తగ్గాయి. సమాచార హక్కు చట్టాన్ని బలహీనపరచడం ద్వారా ప్రభుత్వం తనను సూక్ష్మశోధనకు అతీతంగా ఉంచుకుంది. వివిధ పథకాలు లేదా ప్రభుత్వ వైఖరి సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి కాదు. ఒక రకమైన భూస్వామ్య పరాధీనతను సృష్టించడంలో భాగమే. అన్ని గ్యాస్ స్టేషన్లపై, మనందరి కోవిడ్ టీకా సర్టిఫికేట్లపై భూస్వామ్య ప్రభువైన ప్రధాని స్వయంగా కనిపిస్తుంటారు. ఏకవ్యక్తి ప్రభుత్వం వర్సెస్ సంకీర్ణ ప్రభుత్వం గురించి చరిత్ర పొడవునా సమీక్షించినప్పుడు, బలమైన నాయకుల అహంకారం వారి ప్రజలకు ఎల్లప్పుడూ మంచిది కాదని మనకు అర్థమవుతుంది. ఇస్లా మిక్ చట్టంలో ఇజ్మా అనే భావన ఉంటుంది. అంటే ఏకాభిప్రాయం. అతి పెద్ద సమాజం తరపున నిర్ణయాలు తీసుకోవడానికి పండితుల సంఘం కలిసి వస్తుందనే అవగాహనపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ రూపంలో మనం ఒక సంభా వ్యతకు సాక్ష్యులుగా ఉన్నాం. భారత దేశంలోని భిన్న సమూహాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం అనేక పార్టీలు కలిసి వస్తున్నాయి. వాళ్లకు ఓటర్లు ఒక అవకాశం ఇస్తారని ఆశించవచ్చు. డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి వ్యాసకర్త ‘జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్’ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ -
ఇదే కదా సుపరిపాలన అంటే..: కొమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ అవసరాల కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు కోసం యాచించాల్సిన అవసరం లేని వ్యవస్థను ప్రభుత్వంలో ప్రవేశపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు సుపరిపాలనలో భాగమన్నారు. గతంలో రైతులు వ్యవసాయ ఇన్ పుట్స్ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసేవారని, ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లకోసం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఇంటికే వచ్చే ఏర్పాటు విజయవంతంగా అమలు అవుతోన్నదన్నారు. ఇదే సుపరిపాలన అంటేనని తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి జరగడం లేదన్న వాదన సరికాదన్నారు. విశాఖలో అదానీ డేటా సెంటరు, భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నంలో పోర్టులు వంటి వి అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దానం లో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మానవతా థృక్పధానికి నిదర్శనమని కొనియాడారు. శ్రీ శ్రీ, గురజాడ, గరిమెళ్ళ, వంగపండు, వంటి ఉత్తరాంధ్ర కవులను, వ్యావహారిక భాషా వేత్త గిడుగు రామ్మూర్తిని, కాళీపట్నం రామారావును ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. తమ ప్రసంగంలో ఆద్యంతం సుపరిపాలన పై విద్యార్థులు ప్రతి స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. నిమ్మ వెంకట రావు మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశ పెట్టిన “నవరత్నాల” పథకంలో మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే, ఆర్ధిక వేత్త అమర్త్య సేన్ ల సిద్ధాంతాలు యిమిడి వున్నాయన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు వారి ఇంటివద్దనే, ఒకటో తేదీనే అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వారికి పేదలు, నిస్సహయుల పట్ల వున్న అనుకూల ధృక్పధాన్ని మనం తెలుసు కోవచ్చన్నారు. చదవండి: అమ్ముడుపోను.. చావుకు భయపడను: పోసాని విద్యకు వృత్తి పరమైన నైపుణ్యాన్నిజోడించడంద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచిందన్నారు. ఆర్ధిక పరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్నిఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లితండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకుప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోగంగా, ఉపయుక్తంగా వుండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటి రిటైర్డ్ వీసీ వి.బాల మోహన్‌దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రి కి మించిన తనయుడు సీఎం జగన్ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీయ విద్యా దీవెనలకు సంబంధించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవర్ స్టేట్ అవర్ లీడర్ వైఎస్సార్ ఇంటలెక్చరర్ ఫోరమ్ చైర్మన్ జి. శాంతమూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బి.అర్ధయ్య, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయభాస్కర్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. రాజేష్, సి.హెచ్. కృష్ణారావు, డా. సి.హెచ్. రాజశేఖర్, ఇ. కామరాజు, పొన్నాల వెంకట లక్ష్మణరావు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాలనలో బలోపేతమైన వైద్య ఆరోగ్య వ్యవస్థలు
-
ఈఎస్జీ కింద 6 కొత్త విభాగాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈఎస్జీ విభాగం కింద (పర్యావరణం, సామాజికం, పరిపాలనా అనుకూలమైన) 6 కొత్త విభాగాలను ప్రవేశపెట్టేందుకు సెబీ అనుమతించింది. ఎక్స్‌క్లూజన్స్, ఇంటెగ్రేషన్, బెస్ట్ ఇన్ క్లాస్, పాజిటివ్ స్క్రీనింగ్, ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, సస్టెయినబుల్ అబ్జెక్టివ్స్ ఈ విభాగాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు థీమ్యాటిక్ విభాగం కింద ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థ ఒక్క ఈఎస్జీ పథకం ఆవిష్కరణకే అనుమతి ఉండడం గమనార్హం. ఈఎస్జీ కింద నూతన విభాగానికి కేటాయింపులు అనేవి తక్షణం అమల్లోకి వస్తాయని సెబీ స్పష్టం చేసింది. పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్టులకు ఈ రూపంలో కావాల్సిన నిధుల మద్దతు లభిస్తుందని సెబీ తన ఆదేశాల వెను క లక్ష్యాన్ని వివరించింది. ఈఎస్జీ పథకాల పే రుతో సమీకరించిన ని« దులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ విభాగంలో పనిచేసే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈఎస్జీ పథకాల కింద సమీకరించిన మొత్తం నిధుల్లో 65 శాతాన్ని లిస్టెడ్ కంపెనీల్లోనే పెట్టాలని సెబీ నిబంధన విధించింది. మిగిలిన 35 శాతాన్ని వ్యాపార బాధ్యత, సస్టెయినబులిటీ రిపోరి్టంగ్ వివరాలను (బీఆర్ఎస్ఆర్) వెల్లడించే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని పేర్కొంది. -
మోదీ హయాంలో 3 రెట్లు పెరిగిన దేశ అప్పు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తిరోగమన పాలనా విధానాల వల్లే దేశ అప్పు గత 9 ఏళ్ల బీజేపీ పాలనలో మూడు రెట్లు పెరిగిందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదలచేయాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘మోదీ పాలనలో దేశ అప్పు ఈ 9 ఏళ్లలో మూడు రెట్లు ఎగసి రూ.155 లక్షల కోట్లకు చేరింది. 2014లో ఈ ప్రభుత్వం వచ్చిననాటి నుంచి లెక్కిస్తే అదనంగా రూ.100 లక్షల కోట్ల అప్పు పెరిగింది. గుజరాత్‌కు సీఎంగా ఉన్న కాలంలో మోదీ.. అసమర్థులు, అవినీతిపరులు, సత్తాలేని వాళ్లు అంటూ ఇతర పార్టీల ప్రభుత్వాలను విమర్శించేవారు. వాస్తవానికి ఈ గుణాలు మోదీకే సరిగ్గా సరిపోతాయి. దేశార్థికాన్ని దారుణంగా దెబ్బతీసి నిరుద్యోగం, ధరల్ని పెంచేశారు. గత 67 ఏళ్లలో 14 మంది ప్రధానులు మొత్తంగా రూ.55 లక్షల కోట్లు అప్పు చేస్తే మోదీ ఒక్కరే రూ.100 లక్షల కోట్లు పెంచేశారు. ఆర్థికవ్యవస్థను సరిదిద్దడమంటే జాతీయమీడియాలో పతాక శీర్షికలకు ఎక్కడం, టెలీప్రాంప్టర్ సాయంతో సుదీర్ఘ ప్రసంగాలు దంచేయడం, వాట్సాప్‌లో సందేశాలు ఫార్వార్డ్ చేయడం లాంటి పనికానే కాదు’ అని అన్నారు. ఆదాయ అంతరాలను ఈ ప్రభుత్వం పెంచేసింది. జనాభాలో కేవలం 10 శాతమున్న సంపన్నుల వద్ద ఏకంగా 80 శాతం సంపద పోగుబడింది. జీఎస్టీ వసూళ్లలో వీరి వాటా మూడు శాతమేనన్నారు. -
సీఎం జగన్ పై ప్రశంసలు...
-
మాకు మద్దతివ్వండి
ముంబై: నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై విశ్వాసం లేదని, అందుకే ఢిల్లీలో పాలనాధికారాలపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ విమర్శించారు. ఆయన బుధవారం ముంబైలో శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ పోరాటానికి మద్దతివ్వాలని ఠాక్రేను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్డినెన్స్‌పై రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును వ్యతిరేకిస్తామని ఉద్ధవ్ హామీ ఇచ్చారన్నారు. సభలో ఈ బిల్లు విఫలమైతే 2024లో బీజేపీ ఓటమి తథ్యమని చెప్పారు. తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించడానికి తాము చేతులు కలిపామని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఈసారి బీజేపీని ఓడించకపోతే దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఠాక్రే వర్గం శివసేనకు రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. కేజ్రివాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి, మద్దతు కోరిన సంగతి తెలిసిందే. -
జగన్...4 ది పీపుల్
-
కేజ్రీవాల్ బంగ్లా దర్యాప్తు అధికారికి ఉద్వాసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారం రాష్ట్ర సర్కార్కే ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం కేజ్రీవాల్ అధికార బంగ్లా ఆధునీకరణకు రూ.45 కోట్లు వెచ్చించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ అధికారి, సీనియర్ ఐఏఎస్ రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తును విజిలెన్స్ విభాగంలోని ఇతర అసిస్టెంట్ డైరెక్టర్లు పంచుకోవాలని, నివేదికలను నేరుగా విజిలెన్స్ సెక్రటరీకి సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు మాటున రాజశేఖర్ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజిలెన్స్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. -
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. వారిదే నిర్ణయం
దేశంలోగాని, ఏదైనా రాష్ట్రంలోగాని ప్రజా ప్రభుత్వాల పాలనపై అసంతృప్తి పెల్లుబికినపుడు జనం రాజకీయాలపైన, రాజకీయ పక్షాలపైన విరుచుకుపడుతుంటారు. సరైన పరిపాలన అందించలేని ఆయా పాలక పక్షాలపై ప్రజలు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. కాని, కొన్ని సందర్భాల్లో జనం మొత్తంగా రాజకీయాలను, రాజకీయ పార్టీను దుయ్యబడుతూ ప్రజాస్వామ్యానికి పార్టీల వల్లే కీడు జరుగుతున్నట్టు మాట్లాడటం అభిలషణీయం కాదు. ఎందుకంటే రాజకీయపక్షాలు లేని ప్రజాస్వామ్యం ఇప్పట్లో సాధ్యం కాదు. రాజకీయ పార్టీల ఉనికి ప్రజల ఆదరణ, మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఓటర్లే నాయకులను లేదా ప్రజా ప్రతినిధులను (చట్టసభల సభ్యులను) ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ ప్రజలకు తమకు నచ్చిన పార్టీలను, నేతలను గద్దెనెక్కించడానికి చక్కటి అవకాశం ఇస్తోంది. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఓటర్లకు ఎనలేని అధికారాలు అందిస్తున్నాయి. అయితే, కొన్ని శతాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న పరిస్థితులను బట్టి అనేక రాజకీయపక్షాలు అధికారం కోసం పోటీపడే బహుళపక్ష ప్రజాస్వామ్యం అవసరం ఇంకా ఉంది. పార్టీ రహిత ప్రజాస్వామ్యం మెరుగైనదని ప్రఖ్యాత రాడికల్ హ్యూమనిస్టు ఎం.ఎన్.రాయ్ వాదించినా ఇప్పటికిప్పుడు పార్టీలు లేని ప్రజాస్వామ్యం అమెరికా వంటి పరిణతి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం సాధ్యం కాదు. శాంతియుత పద్ధతిలో పాలకపక్షాలను మార్చడానికి ప్రజలకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఎలాంటి హింసకు ఆస్కారం లేకుండా దేశంలో ఆరో లోక్ సభ ఎన్నికల్లో (1977) ప్రజలు సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న పాలకపార్టీని (భారత జాతీయ కాంగ్రెస్) అధికారం నుంచి తొలగించి కొత్త రాజకీయపక్షానికి (జనతాపార్టీ) అవకాశం కల్పించారు. చదవండి: మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్ కొత్త రాజకీయపక్షం అంతర్గత కీచులాటలతో హస్తినలో ప్రభుత్వం నడపలేక మూడు సంవత్సరాల లోపే కుప్పకూలిపోయింది. దీంతో ఆగ్రహించిన భారత ఓటర్లు 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టారు. 1956 నుంచీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న పార్టీని 1983 జనవరిలో ఓడించిన జనం కొత్త ప్రాంతీయపక్షానికి అధికారం అప్పగించారు. అప్పటి నుంచి ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల ద్వారా అధికారం కోసం పోటీ జరుగుతోంది. ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించేది రాజకీయపక్షాలే! అన్ని ప్రాంతాల్లోనూ జాతీయపక్షాలకు పోటీగా ప్రాంతీయ రాజకీయ పార్టీలు బలపడుతూ అవి స్థానిక ప్రజల ఆకాంక్షలకు తగినట్టు పరిపాలన అందిస్తున్నాయి. ఫలితంగా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో లేదా 20 ఏళ్లకో అధికారం ఒక పార్టీ నుంచి మరో పార్టీ చేతుల్లోకి ప్రశాంతంగా బదిలీ అవుతోంది. వివిధ రాజకీయపక్షాలకు తమకంటూ సొంత అజెండా, కార్యక్రమాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఎన్నికల ప్రణాళిక ఉన్న కారణంగా ప్రజలకు ప్రతి ఎన్నికల్లోనూ ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. అధికారం లేదా పరిపాలన అనే గమ్యం చేరడానికి రాజకీయపక్షాలే ప్రధాన రహదారులుగా ప్రజలకు ఉపకరిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అంటే వారు స్వయంగా తమను తాము పరిపాలించుకోలేరు కాబట్టి ప్రభుత్వ వ్యవస్థను నడిపే ప్రజా ప్రతినిధులను ఎంపికచేసి చట్టసభలకు పంపిస్తారు. ప్రజా ప్రతినిధులు రాజకీయపక్షాల ప్రతినిధులుగా గాక, స్వతంత్ర అభ్యర్థులుగా గెలిస్తే అంతా గందరగోళం అవుతందనే అంచనాతోనే.. ఓటర్లు 95 శాతానికి పైగా నియోజకవర్గాల్లో పార్టీల టికెట్ పై పోటీకి దిగే అభ్యర్థులనే గెలిపిస్తున్నారు. మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో, రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో గెలిచే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది. చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఏ ఒక్కరూ గెలవలేదు. ఎన్నికల ప్రక్రియ ద్వారా నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకు, రాజకీయాలకు కీలక ప్రాధాన్యం ఉంది. రాజకీయాలు, పార్టీల నాణ్యత పెరగాలని ప్రజలు కోరుకుంటూ ఆ మేరకు ఒత్తిడి తీసుకురావాలేగాని రాజకీయపక్షాలు లేని పరిస్థితిని కోరుకోకూడదు. అందుకే అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ (1809–1865) దాదాపు రెండు శతాబ్దాల క్రితమే ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యంపై మాట్లాడుతూ, ‘ఎన్నికలు ప్రజలవే. వారి నిర్ణయమే ఎన్నికలు ప్రతిబింబిస్తాయి. చలిమంట ముందు వారు శరీరం వెనుక భాగానికి మంట తగిలేలా కూర్చుని, వీపులు కాల్చుకోవాలని నిర్ణయించుకుంటే–కాలిన గాయాలతో వారు కూర్చోవాల్సి ఉంటుంది,’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఓటర్లు వారి నిర్ణయాలకు వారే బాధ్యులనే విషయాన్ని లింకన్ గారు ఇంత చమత్కారంగా వర్ణించారు. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
సీఎం జగన్ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం భేటీ
-
తెలంగాణకు ‘స్కోచ్ గోల్డ్ అవార్డు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. ఇ–గవర్నెన్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్రం ఇ–ప్రొక్యూర్మెంట్ ప్రాజెక్టుకు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని ఇండియా హాబి టాట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ అందించారు. ఐటీఈ అండ్ సీ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ పెండ్యాల శ్రీనివాస్.. ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కల్యాణ్ చక్రధర్‌రెడ్డితో కలిసి ఈ అవార్డును అందుకున్నారు. -
గ్లోబల్ గవర్నెన్స్ ఫెయిల్! ఆ దేశాల గళం వినిపిస్తాం!
ఉక్రెయిన్‌లోని రష్యా యుద్ధమే ప్రధాన అంశంగా జీ20 విదేశాంగ మంత్రులు సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. ఈ జీ20 సమావేశాలు భారత అధ్యక్ష హోదాలో ఢిల్లీలోని హరియానాలో గురుగ్రామ్ వేదికగా మార్చి1 నుంచి 4వ వరకు జరగనున్నాయి. ఈ మేరకు జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తూ.. "ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విపలమయ్యాయన్నారు. అంతేగాదు ప్రస్తుతం ప్రపంచ స్థాయి సంస్థలు సంక్షోభంలో ఉన్నాయనే దానిని మనందరం గుర్తించాలి. దీనికి ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారీ, ఉగ్రవాదం, యుద్ధాలే నిదర్శనమని, అందువల్లే ప్రపంచ పాలన వైఫల్యం చెందిందని స్పష్టంగా తెలుస్తోంది. సంవత్సరాల పురోగతి తర్వాత సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల కోసం మనం మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదంలో ఉన్నాం. అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారం, ఇంధన భద్రతను కల్పించడం కోసం భరించలేని అప్పులతో సతమతమవుతున్నాయి. అలాగే ధనిక దేశాల వల్ల కలిగే గ్లోబల్ వార్మింగ్ వల్ల కూడా ఈ దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. అందుకే భారత్ దక్షిణాది గళం వినిపించేందుకే యత్నిస్తోంది. మనమంతా ప్రపంచ విభజన సమయంలో కలుస్తున్నాం. కాబట్టి ఈ సమస్యలపై సాముహికంగా పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే ఈ సమావేశంలో పాల్గొనని వారిపట్ల కూడా మాకు బాధ్యత ఉంది. మన కలిసి చేయగలిగిన వాటిల్లోకి పరిష్కరించలేని సమస్యలను తీసుకురాకూడదు. తమ చర్యలతో ప్రభావితమైన దేశాల మాట వినకుండా ఏ దేశం లీడర్షిప్ను సాధించలేదు. మనల్ని ఏకం చేస్తున్న వాటిపై దృష్టి సారించాలి గానీ విభజించే వాటిపై కాదని" సదస్సులో ప్రదాని మోదీనొక్కి చెప్పారు. కాగా, రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో జరుగుతున్న ఈ జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో దాదాపు 40 మంత్రి పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాల తోపాటు బంగ్లాదేశ్, ఈ జిప్ట్, నెదర్లాండ్స, మారిషస్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోసహా తొమ్మిది అతిథి దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం. (చదవండి: బిల్‌గేట్స్‌తో సమావేశం వండర్ఫుల్! కోవిడ్ నిర్వహణపై ప్రశంసల జల్లు! కేంద్ర ఆరోగ్య మంత్రి) -
ప్రజలందరి కోసం పారదర్శక పాలన
-
పారదర్శకంగా పాలనా వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రజలపై ప్రభుత్వ పరిపాలన ప్రభావాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిస్థాయిలో విధానాలను, ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా పాలనా వ్యవస్థను పారదర్శకంగా, వేగవంతంగా తీర్చదిద్దడానికి శ్రమిస్తున్నామని అన్నారు. సుపరిపాలనా వారం(సుశాసన్ సప్తాహ్) సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు దేశ ప్రజలకు సందేశామిచ్చారు. దేశవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 25వ తేదీ దాకా సుపరిపాలనా వారం జరుపుకోనున్నారు. ‘ప్రజలే కేంద్రంగా’ కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని మోదీ వివరించారు. ఫిర్యాదుల పరిష్కారం, ఆన్లైన్ సేవలు, దరఖాస్తుల స్వీకరణ–పరిష్కారం, సుపరిపాలనా విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తుచేశారు. కాలం చెల్లిన వేలాది చట్టాలను రద్దు చేశామన్నారు. అనవసర విధానాలు, పద్ధతులకు స్వస్తి పలికామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజలను చేరువ చేయడంలో టెక్నాలజీ పాత్ర చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రజలు సాధికారత సాధించడంలో సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. -
తెలంగాణ కేసీఆర్- యూపీ ఆదిత్యనాథ్: ఎవరి మోడల్ బెటర్?
తెలంగాణలో ఎవరి మోడల్ పాలన బెటర్ అన్న చర్చకు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్లు తెరమీదకు తెస్తున్నాయి. టీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ మోడల్ దేశానికే ఆదర్శం అని వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నేతలు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మోడల్ పాలనను తెలంగాణలో తెస్తామని అంటున్నారు. ప్రజలు ఎవరి మోడల్ కరెక్టు అని అనుకుంటారో ఎన్నికలలో కాని తేలదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజాదరణ చూరగొని రెండోసారి ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుంది. తెలంగాణ 119 అసెంబ్లీ సీట్లతో చిన్న రాష్ట్రం అయితే, యూపీ 405 సీట్లతో అతి పెద్ద రాష్ట్రంగా ఉంది. చదవండి: జగన్ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుందా! తెలంగాణలో ఉద్యమ సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం జరిగింది. కాని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో అది మళ్లీ పునరుద్దరించబడిందని చెప్పాలి. రైతు బంధు, షాదీ ముబారక్, బిఎస్ ఐ పాస్, ధరణి వంటి కార్యక్రమాలతో పాటు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులకు ఇక్కడ శ్రీకారం చుట్టారు. యూపీలో కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ మద్దతుతో యోగి ఆదిత్యనాథ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకించి శాంతి భద్రతల విషయంలో బాగా సీరియస్‌గా ఉన్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఉన్న నిందితుల ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చడం ద్వారా సంచలనం సృష్టించారు. అది వివాదాస్పదం అయినప్పటికీ లా అండ్ ఆర్డర్ కాపాడడంలో బాగా ఉపయోగపడుతోందన్న భావన ఏర్పడింది. అక్కడ అయోధ్య రామమందిరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో యాదాద్రి నరసింహస్వామి ఆలయ అభివృద్దికి కేసీఆర్ కృషి చేస్తున్నారు. యూపీలో కన్నా తెలంగాణలో మతపరమైన విద్వేషాలు తక్కువే అని చెప్పాలి. కాగా ఇటీవలికాలంలో కేంద్ర బీజేపీ నేతలు తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ ఇక్కడ యూపీ తరహా పాలన సాగిస్తామని , యోగి ఆదిత్యనాథ్ మాదిరి రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసేవారిపై పై ఉక్కుపాదం మోపుతామని అంటున్నారు. దీనివల్ల బీజేపీకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలియదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర ముగింపు సభలో కాని, ఇతరత్రా కాని కేంద్ర బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణలో కఠినంగా ఉంటారన్న అభిప్రాయం ప్రజలలోకి వెళ్లడం వల్ల కూడా రాజకీయంగా లబ్ది చేకూరి ఉండవచ్చు. కాని తెలంగాణలో ఆ ధీరీ పనికి వస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే యూపీ రాజకీయాలు వేరు.. తెలంగాణ రాజకీయాలు వేరు. యూపీలో ఉన్న శాంతిభద్రత పరిస్థితి వేరు, తెలంగాణలో ఉన్న పరిస్థితి వేరు. కేంద్ర బీజేపీ నేతలు ఈ విషయాలను గమనించకుండా యూపీ ప్రస్తావన తెస్తున్నట్లుగా అనిపిస్తుంది. యూపీలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఘటనలు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికీ నేరాల రేటులో యూపీనే అగ్రస్థానంలో ఉంది. కాకపోతే అక్కడ జనాభా కూడా అధికం కావచ్చు. మతపరంగా జరిగే గొడవలు కూడా అక్కడ ఎక్కువే. వాటిని అదుపు చేసే క్రమంలోనే యోగి ప్రభుత్వం నేరాలకు పాల్పడుతున్న వారికి సంబంధించిన అక్రమ నిర్మాణాలను బుల్ డోజర్లతో కూల్చివేస్తోంది. పేరుకు అక్రమ నిర్మాణాలు అని చెబుతున్నా, వాస్తవం ఏమిటో తెలియదు. దానితో అక్కడి సమాజంలో మరీ విభజన హెచ్చుగా ఉందని అంటారు. లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడే రైతులపై జీప్ ఎక్కించారన్న వార్త బీజేపీకి అప్రతిష్ట తెచ్చింది. అయినా సంబంధిత కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించలేదు. హత్రాస్ మానభంగ ఘటన, బలియాలో ఒక పోలీస్ స్టేషన్లోనే మాన భంగం జరిగిందన్న ఆరోపణ రావడం.. ఇలా అనేక అభియోగాలు వచ్చాయి. కాన్పూర్‌కు చెందిన ఒక గూండా జరిపిన అరాచకం నేపథ్యంలో అతనిని మధ్యప్రదేశ్‌లో పట్టుకుని ఎన్ కౌంటర్ చేశారు. అలాగే అతని ఇంటిని కూల్చివేయడం జరిగింది. అయితే గత సమాజవాది పార్టీ ప్రభుత్వంతో పోల్చితే ఈ ప్రభుత్వంలో శాంతిభద్రతల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని అంటారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే అంత దారుణమైన పరిస్థితి లేదు. కొన్ని రేప్ ఘటనలు జరిగినా, యూపీతో పోల్చితే తక్కువే. ఒక కేసులో ఇక్కడ కూడా ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించింది. కాని యూపీలో మాత్రం అక్కడి ప్రభుత్వానికి ఇలాంటి సమస్యలు రాలేదు. తెలంగాణలో మతపరమైన గొడవలు ఒక్క భైంసా పట్టణంలో మాత్రమే జరిగాయి. మిగిలిన రాష్ట్రం అంతటా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాలి. హైదరాబాద్ నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నివసిస్తున్నారు. వారెవరికి ప్రభుత్వపరంగా, సంఘ విద్రోహ శక్తుల పరంగా అంత తీవ్రమైన కష్టాలు లేవు. అందువల్ల యూపీ తరహాలో యోగి పాలన తెలంగాణలో తెస్తామని బీజేపీ ప్రచారం చేస్తే అది వారికి నష్టం చేయవచ్చు. ఎందుకంటే యోగి పాలనను బుల్ డోజర్ పాలనగా, నిరంకుశంగా ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వంగా విపక్షాలు విమర్శిస్తుంటాయి. బీజేపీపై ఇప్పటికే వివిధ రూపాలలో ఎక్కుపెట్టి అస్త్ర శస్త్రాలు కురిపిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఈ అంశం ఆధారంగా కూడా బీజేపీని డిపెన్స్ లో పడేసే అవకాశం ఉంది. - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
ESG: పెట్టుబడి.. పదికాలాలు పచ్చగా!
అసలు పెట్టుబడి ఉద్దేశం రాబడే కదా..? ఈ రాబడి కాంక్షే ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుంటుంది. కానీ, నేడు భూ మండలం వాతావరణ మార్పులు అనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వనరుల వినియోగం గరిష్ట స్థాయికి చేరి, కాలుష్యం అసాధారణ స్థాయికి చేరిపోయిన తరుణంలో.. పర్యావరణంపై మమకారంతో పుట్టుకొచ్చిందే ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) విధానం. తాము పెట్టుబడి కోసం ఎంపిక చేసుకుంటున్న కంపెనీ.. పర్యావరణాన్ని ఏ రకంగా చూస్తోందన్నది ఇన్వెస్టర్‌కు కీలకం అవుతుంది. అంటే పర్యావరణానికి తన ఉత్పత్తులు, తయారీ, సేవల ద్వారా హాని కలిగించకూడదు. తన ఉద్యోగులు, భాగస్వాములతో ఎలా వ్యవహరిస్తుందన్నది ‘సోషల్’. ఇక కంపెనీ నిర్వహణ తీరుకు అద్దం పట్టేదే గవర్నెన్స్. ఈ మూడింటిలో పాస్ మార్కులు పొందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఈఎస్జీ ఇన్వెస్టింగ్. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో పాపులర్ అవుతున్న ఈ విధానం పట్ల రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అయితే, ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. కనుక ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తితో ఉన్న ఇన్వెస్టర్లు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటో సమగ్రంగా వివరించే కథనమిది... ప్రపంచవ్యాప్తంగా ఈఎస్జీ పెట్టుబడులు 2020 నాటికే 35 ట్రిలియన్ డాలర్లు (రూ. 2800 లక్షల కోట్లు) దాటాయంటే దీని ప్రాధాన్యం ఏ మేరకో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ తరహా పర్యావరణ అనుకూల పెట్టుబడి విధానం కొత్తదేమీ కాదు. కాకపోతే దీని రూపం మారింది. గ్రీన్ ఇన్వెస్టింగ్, సామాజిక బాధ్యతా పెట్టుబడి విధానం, సుస్థిర పెట్టుబడి అన్నవి ఈఎస్జీని పోలినవే. ఈ తరహా పెట్టుబడులన్నింటినీ ఏకం చేసింది ఈఎస్జీ. ఇప్పుడు ఈఎస్జీ అనుకూలం. ఈఎస్జీ వ్యతిరేకం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కంపెనీలను చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రత్యేకంగా ఈఎస్జీ ఫండ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. పెట్టుబడులు భిన్నం.. కంపెనీలు ఏ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నాయనే దానికంటే.. ఏ విధంగా లాభాలను పొందుతున్నాయన్నది ఈఎస్జీ విధానంలో కీలకం. పర్యావరణానికి హాని తలపెట్టకుండా, వీలైతే మేలు చేస్తూ, చక్కని లాభాలను పోగేస్తున్న కంపెనీలకు ఈ విధానంలో మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం గత రెండు సంవత్సరాల్లోనే సుమారు 32 బిలియన్ డాలర్లు (రూ.2.56 లక్షల కోట్లు) ఈఎస్జీ ఆధారిత యూఎస్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులుగా వెళ్లాయి. ముందే చెప్పుకున్నట్టు ఈ పెట్టుబడికి సామాజిక స్పృహ ఎక్కువ. కనుక రాబడుల విషయంలో కొంత రాజీ పడక తప్పదు. ఎంఎస్సీఐ వరల్డ్ ఈఎస్జీ ఇండెక్స్ రాబడులను పరిశీలిస్తే.. గత 10 ఏళ్లలో రెట్టింపైంది. ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సార్వత్రిక నిబంధనలు, ప్రమాణాలు ఈఎస్‌జీకి లేవు. అలాగే ఏకీకృత నిర్వచనం, విధానం కూడా లేవు. అసలు ఈఎస్జీ పేరుతో మూలసూత్రాలకు విరుద్ధంగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కొన్ని ఈఎస్జీ ఈక్విటీ ఫండ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తర్వాత చమురు ధరల పెరుగుదలతో షెల్, రెప్సోల్ కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకున్నాయి. కాగా, పెట్టుబడులపై భవిష్యత్తులో మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫండ్స్ మేనేజర్ల పెట్టుబడుల విధానాలకు, ఈఎస్జీ సూత్రాలు ఏ విధంగా సరిపోలుతున్నాయో వెల్లడించేలా త్వరలో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. అలాగే, సెబీ సైతం ఫండ్స్ ఈఎస్జీ పథకాలకు సంబంధించి వెల్లడించాల్సిన సమాచారం విషయమై విస్తృతమైన సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేయడం గమనించదగిన అంశం. కొంచెం జాగ్రత్త అవసరం.. ఈఎస్జీ స్టాక్స్‌కు మార్కెట్ కొంచెం ప్రీమియం వ్యాల్యూషన్ ఇస్తుంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఈఎస్జీ థీమ్‌ను దుర్వినియోగం చేస్తున్నాయి. తమ ఉత్పత్తులు పర్యావరణం అనుకూలమని తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ తరహా ధోరణలను అరికట్టేందుకు నూతన పర్యావరణ నిబంధనలను కేంద్రం అమల్లోకి తీసుకురానుంది. దీని కింద కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కాలుష్య విడుదలకు సంబంధించి మరింత సమాచారం, వివరాలను వెల్లడించాలి. ఈఎస్జీ రేటింగ్ కోసం థర్డ్ పార్టీ సంస్థలపైనే కంపెనీలు ఆధారపడాల్సి వస్తోంది. సార్వత్రిక బెంచ్ మార్క్ లేదా పద్ధతి అనేది ఈఎస్జీ రేటింగ్‌లకు అమల్లో లేదు. కేంద్ర నూతన నిబంధనలు, సెబీ సంప్రదింపుల పత్రం తర్వాత విడు దల చేసే మార్గదర్శకాలతో ఈఎస్జీ థీమ్ మరింత పటిష్టం కానుంది. పెట్టుబడులకు ముందు ఆయా అంశాలపై అవగాహన అవసరం. ఈఎస్జీ స్కోర్ ఎలా? ఎన్విరాన్మెంట్ కంపెనీ కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్యలు? గతంలో ఇలాంటి లక్ష్యాలను ఏ మేరకు సాధించింది? ఏ మేరకు ఇంధనాన్ని వినియోగిస్తోంది? పునరుత్పాదక ఇంధన వనరులను ఏర్పాటు చేసుకుందా? నీటి వినియోగం, కాలుష్యం విడుదల, వ్యర్థాల నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ ఈఎస్జీ స్కోర్‌కు ముందు థర్డ్ పార్టీ సంస్థలు చూస్తాయి. సోషల్ ఉద్యోగులతో కంపెనీకి ఉన్న అనుబంధం, వారి భద్రతకు, ఆరోగ్యానికి తీసుకున్న చర్యలు, సమాజంతో ఉన్న సంబంధాలు, భాగస్వాములతో సంబంధాలను అధ్యయనం చేస్తారు. భాగస్వాములు, ఉద్యోగులు అందరినీ ఏకరీతిన చూసేందుకు వీలుగా కంపెనీలు అమలు చేస్తున్న విధానాలు, పద్ధతులను పరిశీలించడం జరుగుతుంది. నాణ్యత, సైబర్ సెక్యూరిటీ, డేటా భద్రత చర్యలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. గవర్నెన్స్ కంపెనీ బోర్డు నిర్మాణం ఎలా ఉంది? నిపుణులు, మహిళలకు చోటు కల్పించారా? బోర్డు కమిటీల ఏర్పాటు, బోర్డు పనితీరు, అవినీతి నిరోధానికి తీసుకున్న చర్యలు, స్టాట్యుటరీ ఆడిటర్లు, ఆడిట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్‌ను కూడా పరిశీలిస్తారు. దేశీయంగా... ఇంకా ఆరంభ దశలోనే దేశీయంగా ఈఎస్జీ థీమ్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఈఎస్జీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం రిస్క్‌తో కూడుకున్నదే. ఎందుకంటే ఇది లోతైన అంశం. విస్తృత సమాచారాన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎస్ఈఎస్ (స్టేక్ హోల్డర్స్ ఎంపవర్మెంట్ సర్వీసెస్) తదితర కొన్ని ఉచిత వేదికలు ఈఎస్జీ కంపెనీలకు సంబంధించి ర్యాంకులను ప్రకటిస్తున్నాయి. ఇతర సంస్థల నుంచి ఈఎస్జీ కంపెనీల వివరాలు పొందాలంటే కొంత చెల్లించుకోవాల్సి వస్తుంది. నేరుగా కంటే మ్యూచువల్ ఫండ్స్ రూట్ నయం. ప్రస్తుతం 10 వరకు ఈఎస్జీ ఆధారిత థీమాటిక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎనిమిది పథకాలు గత రెండేళ్లలో ప్రారంభమైనవే ఉన్నాయి. రెండు పథకాలు ప్యాసివ్‌గా (ఇండెక్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవి) పనిచేస్తున్నాయి. ఒక పథకం దీర్ఘకాలం నుంచి ఉన్నా కానీ, ఆరంభంలో ఈఎస్జీ పథకంగా లేదు. దీర్ఘకాలంలో వ్యాపార పరంగా నిలదొక్కుకోగలవా? ఈఎస్‌జీలో ఏ అంశాల పరంగా కంపెనీ మెరుగ్గా ఉంది? వాటిని ఇక ముందూ కొనసాగించగలదా? భవిష్యత్తు వృద్ధి అవకాశాలు ఇలాంటి అంశాలను సాధారణ ఇన్వెస్టర్ కంటే మ్యూచువల్ ఫండ్స్ పరిశోధన బృందాలు మెరుగ్గా అంచనా వేయగలవు. ఇక ఈఎస్‌జీలో రెండు అంశాల్లో టిక్ మార్క్‌లు పడినా ఆయా కంపెనీలను సైతం ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. ఎందుకంటే పర్యావరణం, సోషల్, గవర్నెన్స్ మూడింటిలోనూ సరితూగే కంపెనీలు కొన్నే ఉంటున్నాయి. అలాంటప్పుడు అదనపు పెట్టుబడుల సర్దుబాటుకు వీలుగా రెండు అంశాల్లో మెరుగైన పనితీరు చూపిస్తున్న వాటిని కూడా ఫండ్స్ ఎంపిక చేసుకుంటున్నాయి. 2022 అక్టోబర్ 1 నుంచి బిజినెస్ రెస్పాన్స్‌బిలిటీ అండ్ సస్టెయిన్‌బిలిటీ రిపోర్ట్ (బీఆర్ఎస్ఆర్)ను విడుదల చేసే కంపెనీల్లోనే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే నిర్వహిస్తున్న పెట్టుబడులకు 2023 సెప్టెంబర్ 30 వరకు సెబీ వెసులుబాటు కల్పించింది. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్‌లో (పీఎంఎస్) ఎస్బీఐ ఈఎస్జీ పోర్ట్‌ఫోలియో, అవెండస్ ఈఎస్జీ ఫండ్స్ పీఎంఎస్, వైట్ ఓక్ ఇండియా పయనీర్స్ ఈక్విటీ ఈఎస్జీ తదితర సంస్థల సేవలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలంలోనే రాబడులు..? ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల కంటే నిఫ్టీ 100 ఈఎస్జీ ఇండెక్స్ పనితీరే కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. గత పదేళ్ల కాలంలో వార్షికంగా 15.25 శాతం కాంపౌండెడ్ రాబడిని ఈ సూచీ ఇచ్చింది. నిఫ్టీ 100 రాబడి కంటే ఇది ఒక శాతం ఎక్కువ. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రాబడులు మిశ్రమంగా ఉన్నాయి. ఏడాది కాలంలో రాబడులు మైనస్ 9 శాతం నుంచి ప్లస్ 27 శాతం మధ్య ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో మాత్రం సానుకూల పనితీరు చూపించాయి. ఏడు పథకాలు ఏడాది కాలంలో నష్టాలను ఇవ్వడం గమనించాలి. సెక్టోరల్ ఫండ్స్.. ఫార్మా (12 శాతం డౌన్), ఐటీ (15 శాతం డౌన్) కంటే ఈఎస్జీ ఫండ్స్ కాస్త నయమనే చెప్పుకోవాలి. మార్కెట్లో ఒక్కో సైకిల్లో కొన్ని రంగాల షేర్లు ర్యాలీ చేయడం, కొన్ని ప్రతికూల రాబడులను ఇవ్వడం సాధారణంగా ఉండే పరిణామమే. ఈఎస్జీ పథకాలు రాబడులను ఇవ్వాలంటే పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలన్నది మర్చిపోవద్దు. పోర్ట్‌ఫోలియో భిన్నమేమీ కాదు.. ఈఎస్జీ థీమ్ పట్ల ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ముందుగా ఈఎస్జీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోను పరిశీలించడం, అధ్యయనం చేయడం ద్వారా కొన్ని అంశాలను అయినా తెలుసుకునే వీలుంటుంది. ఈఎస్జీ ప్యారామీటర్లకు తూగే దేశీ స్టాక్స్ 200 వరకు, ఇంటర్నేషనల్ స్టాక్స్ 40 వరకు ఉంటాయి. ఇవన్నీ థీమ్యాటిక్ ఫండ్స్ కిందకు వస్తాయి. కనుక మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని ఈఎస్జీ కంపెనీల్లోనే అవి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం కూడా ఈఎస్జీ థీమ్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉండకూడదని సెబీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పోర్ట్‌ఫోలియోల్లో కనిపించే స్టాక్సే ఈఎస్జీ పథకాల్లోనూ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ), ఐటీ రంగ కంపెనీలు ఎక్కువ శాతం ఈఎస్జీ పథకాల్లో ప్రముఖంగా ఉన్నాయి. ఇవి పర్యావరణానికి హాని చేయకపోవడం, ప్రజల జీవనాన్ని సౌకర్యవంతం, మెరుగు చేయడం కోసం పనిచేస్తుంటాయి. కనుక వీటికి ఎక్కువ పథకాలు ఓటేస్తున్నాయి. 80 శాతం ఈఎస్జీ పథకాల్లో ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ ప్రముఖ స్టాక్స్‌గా ఉన్నాయి. దాదాపు అన్ని ఈఎస్జీ పథకాల్లోనూ టాప్–10 హోల్డింగ్స్‌లో 4 నుంచి 9 వరకు అవే కంపెనీలు దర్శనమిస్తాయి. పీఎంఎస్, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో సాధారణంగా కనిపించే ఇతర స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్‌యూఎల్ ఉన్నాయి. -
సంక్షేమాభివృద్ధిలో సరికొత్త అడుగులు
-
మూడేళ్లలో రెపరెపలాడిన సంక్షేమాభివృద్ధి బావుటా
-
మడమ తిప్పని వ్యక్తిత్వం.. పాలనలో సంక్షేమం
సాక్షి వెబ్‌డెస్క్: 12 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమారునిగా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ తెలుసు. ‘నన్ను అణచివేయాలని చూస్తే పడిలేచిన కడలి కెరటంలా పైకి ఎగసిపడతాను. గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంతో తిరిగి వస్తాను’ అన్న జగన్ ఆ మాటల్ని నిజం చేసుకున్నారు. ఎన్నో సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ప్రజా సేవే పరమావధిగా మొక్కవోని విశ్వాసంతో సీఎం వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయువుగా దేశంలోనే ఆదర్శ సీఎంగా ఎదిగారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, గత టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని పోరాట యోధుడిగా ఎదురు నిలిచి అకుంఠిత దీక్షకు సంకేతంగా మారారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు సహకరించపోయినా.. సంకల్పబలంతో ముందుకుసాగుతున్నారు. రెండున్నరేళ్లలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్నారు. ఒక వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు.. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తూనే, మరోవైపు సంక్షేమాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. విలువలకు కట్టుబడి.. 2009లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. సీఎం జగన్ ఇష్టపడలేదు. విలువలకే కట్టుబడ్డారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హఠాన్మరణంతో. నాడు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు ఆయనకు సూచించారు. కానీ ఆయన సమ్మతించలేదు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని వైఎస్ జగన్ రాజకీయ విలువలకు కట్టబడ్డారు. ఓదార్పు యాత్ర.. ఇచ్చిన మాట కోసం పార్టీకి రాజీనామా చేయడమే కాదు. ఎంపీ పదవిని సైతం వైఎస్ జగన్ తృణప్రాయంగా వదిలేశారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కడప స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని వీడారు. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేశారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని వారికి కొండంత భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం.. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొద్దినెలలకే 2011 కడప పార్లమెంట్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో రికార్డు విజయం సాధించారు. కుట్రపూరితంగా.. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు. రైతు దీక్ష, జలదీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష ధర్నాలతో ఉద్యమించారు. ఆయనను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై కుట్రపూరితంగా వ్యహరించి అక్రమ కేసులు బనాయించారు. టీడీపీ అవినీతిపై పోరాటం.. 2014 ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి, అసమర్థతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా టీడీపీ ఎన్నో కుట్రలు పన్నింది. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి చంద్రబాబు టీడీడీలో చేర్చుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర.. అవినీతి, అసమర్థ పాలనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేందుకు వైఎస్ జగన్ చారిత్రాత్మక ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలగుండా సాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ నడక సాగించారు. ముఖ్యమంత్రిగా.. 2019 మే 30న నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అపూర్వ ప్రజా మద్దతుతో 151 అసెంబ్లీ సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ రథ సారథిగా, అభివృద్ధి కాముకుడిగా పాలన సాగిస్తున్నారు. -
రిటైరైనవారు ప్రభుత్వ సలహాదారులా?
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఉన్నతోద్యోగులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించడమేమిటని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎక్కువ మొత్తంలో జీతాలు ఇస్తూ మళ్లీ వారిని నియమించడం వల్ల దుబారా ఖర్చు తప్ప ఏమీ ఉండదని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు. కీలకమైన పోస్టుల్లో పాత వారినే నియమించడంతో ఎక్కువ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను పదవీ విరమణ తర్వాత సలహాదారులుగా నియమించడం చూస్తుంటే వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. వీరే కాక రెవెన్యూ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎంతో మంది రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారని, ఇది సమర్థనీయం కాదని అన్నారు. సలహాదారులు, వారి సిబ్బందిపై ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేయడమంటే ప్రజా ధనాన్ని వృథాచేయడమేని స్పష్టం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. చదవండి: తనిఖీల వీడియో వైరల్: ‘సోషల్‌మీడియాను గుడ్డిగా నమ్మొద్దు’ -
ఆర్థిక పురోగతిలో ‘ఆడిట్’కు కీలకపాత్ర
న్యూఢిల్లీ: దేశ ఫైనాన్షియల్ స్థిరత్వం, ఆర్థిక పురోగతిలో ఖచ్చితత్వం కలిగిన, విశ్లేషణాత్మక ఆడిట్ నివేదికల పాత్ర ఎంతో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆయా అంశాలు వ్యవస్థల పట్ల ప్రజలలో విశ్వాసాన్ని నింపుతాయని అన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ (ఎన్‌ఏఏఏ) అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో సుపరిపాలనకు ఆడిటింగ్ ఒక మూలస్తంభమని అన్నారు. ‘‘ఉద్దేశించిన ఫలితాలను సాధించడంలో భాగంగా ప్రజా వనరులు బాధ్యతాయుతంగా, సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశంపై నిష్పాక్షిక అంచనాలకు రావడం అవసరం. ఈ దిశలో న్యాయమైన, నిష్పాక్షికమైన ఆడిట్ పాత్ర ఎంతో ఉంటుంది. ఇది ఆయా వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది’’ అని దాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► అంతర్జాతీయంగా చూస్తే, సమీకృత ఆర్థిక వ్యవస్థలో న్యాయమైన,నిష్పక్షపాతమైన ఆడిట్ అనేది కేవలం దేశీయంగా కీలక పాత్ర పోషించే అంశమే కాదు.ప్రపంచ వేదికపై దేశ ఖ్యాతిని,విశ్వసనీయతను పెంపొందించడానికి ఇది ఒక సాధనం. ► ఫైనాన్షియల్ మార్కెట్ల సంక్లిష్టత, సమర్థవంతమైన వనరుల కేటాయింపు, ప్రజల నుంచి సుపరిపాలనపై ఏర్పడుతున్న అధిక అంచనాలు ఇక్కడ ప్రస్తావించుకోదగిన అంశాలు. ఈ నేపథ్యంలో ఆడిట్ పాత్ర ఎంతో కీలకంగా మారింది. ► భారతదేశం వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం.ఈ విషయంలో భాగస్వాములందరికీ ఆర్థిక పనితీరుపై భరోసాను కల్పించడానికి ఆడిటర్ల నైపుణ్యం, ఈ వ్యవస్థలో పటిష్టత అవసరం. ► కేవలం అందుబాటులో ఉన్న సాక్ష్యాలు, సమాచారం ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సరికాని డేటా వల్ల తగిన నిర్ణయాలను తీసుకోలేం. ► ఇక్కడ బ్యాంకింగ్ రంగాన్నే ఒక ఉదాహరణగా తీసుకుందాం. సరికాని, తప్పుదోవ పట్టించే ఆర్థిక నివేదికల ఆధారంగా బ్యాంక్ రుణ మంజూరీలు చేసినట్లయితే, రుణగ్రహీత కంపెనీ చివరకు దానిని తిరిగి చెల్లించలేకపోతుంది. రుణదాతకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి మిగులుతుంది. దీనికితోడు అర్హత కలిగిన కంపెనీలకు రుణం ఇవ్వడానికీ బ్యాంకింగ్ తదుపరి వెనుకడుగు వేస్తుంది. తనకు వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ఇతరులపై బ్యాంకులు వడ్డీభారాన్ని వేయకా తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. వెరసి ఇదంతా ఆర్థిక వ్యవస్థ తిరోగమనానికి దారితీస్తుంది. ► ఆడిట్ నాణ్యత, పటిష్టత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆడిట్‌ను మెరుగుపరచడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో ఆర్బీఐ సంప్రదింపులు జరిపి అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో వాణిజ్య బ్యాంకుల కోసం రిస్క్ ఆధారిత అంతర్గత ఆడిట్ వ్యవస్థను బలోపేతం చేశాం. ఏప్రిల్‌లో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) చట్టబద్ధమైన ఆడిటర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆధునికీకరణ జరిగింది. రదర్శకత, వివేకవంతమైన వ్యాపార వ్యూహం, సమర్థవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ లక్ష్యాలుగా ఈ చర్యలను తీసుకున్నాం. ► ఆడిట్లో అంతర్జాతీయ ప్రమాణాలు మరింత పటిష్టం చేయడానికి ఈ రంగంలో ప్రముఖులు, నిపుణులతో పాటు ఫైనాన్షియల్ రంగంలోని నియంత్రణ సంస్థలు, పర్యవేక్షకులు కలిసి పనిచేయాలి. బలమైన,అందరికీ చేరువచేసే ఆర్థిక రంగాన్ని నిర్మించడానికి,సుపరిపాలనకు,నైతిక విధానాల పరిపుష్టికి చురుకైన చర్యలు తీసుకోవాలి. -
Afghanistan: తాలిబన్లకు ముళ్లబాటే
ఇల్లు అలకగానే పండుగ కాదు అంటుంటారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లది ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితే. 20 ఏళ్ల తర్వాత దేశాన్ని మళ్లీ ఆక్రమించుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజలపై తమ పాలన రుద్దడానికి సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే కొలువుదీరనున్నారు. తాలిబన్ కమాండర్లే ఇక గవర్నర్లు, మేయర్లుగా అవతారం ఎత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కల్లోలిత అఫ్గాన్ పాలన అనుకున్నంత సులభం కాదని, తాలిబన్ల కోసం ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.. చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం జనామోదం సాధ్యమా? అఫ్గాన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య వంటి కనీస సదుపాయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు అంతంతే. అవినీతి పెచ్చరిల్లింది. జనం మార్పును కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం తాలిబన్లను స్వాగతిస్తున్నారని కాదు. ఘనీ అసమర్థ, అవినీతి పాలనతో విసుగెత్తిపోయిన ప్రజల మనసులను గెలుచుకోవడం తాలిబన్లకు కత్తి మీద సామేనని చెప్పొచ్చు. షరియా చట్టం పేరిట గతంలో సాగించిన నిరంకుశ పాలనకు ఈసారి స్వస్తి చెప్పి, సంస్కరణలకు బాటలు పరిచి, జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెడితే తాలిబన్లకు కొంత జనామోదం లభించే అవకాశం ఉంది. బలగాలు సరిపోతాయా? అఫ్గానిస్తాన్ ప్రస్తుత జనాభా 3.80 కోట్ల పైమాటే. తాలిబన్ల సంఖ్య కేవలం లక్ష లోపే. దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా వారి నియంత్రణలోకి రాలేదు. మారుమూల ప్రాంతాల్లో వార్లార్డ్స్(స్థానిక భూస్వాములు) పెత్తనం సాగిస్తున్నారు. సొంతంగా ప్రైవేట్ సైన్యాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని అణచివేసి, దేశం మొత్తాన్ని తమ పరిధిలోకి తీసుకురావాలంటే తాలిబన్లు తమ బలం, బలగాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. పాలనపై పట్టు చిక్కేనా? తుపాకులు పట్టి శత్రువులపై పోరాడడం తప్ప ప్రజలకు సుపరిపాలన అందించడం తాలిబన్లకు పెద్దగా అలవాటు లేదు. చెప్పుకోదగ్గ ఆధునిక సదుపాయాలు లేని అఫ్గాన్‌ను పాలించడం కష్టమైన పనేనని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి తగిన యంత్రాంగం కూడా అఫ్గాన్‌లో లేదు. పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సిందే. 1996– 2001 వరకూ దేశాన్ని పాలించినప్పుడు తాలిబన్లు అరాచకానికి మారుపేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడైనా తీరు మార్చుకోకపోతే జనం తిరగబడడానికి ఎక్కువ సమయం పట్టదు. సొంత బలగాలను అదుపు చేసేదెలా? విదేశీ శక్తులపై పోరాటం అనే భావన తాలిబన్లను ఇన్నాళ్లూ ఒక్కటిగా కలిపి ఉంచింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే దాని తాలూకు అవలక్షణాలన్నీ ఒంటబట్టడం ఖాయం. కొందరు అధికార భోగాలు అనుభవిస్తుండడం, మరికొందరు సాధారణ సైనికులుగా మిగిలిపోవడం వంటివి వారిలో విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అసంతృప్తితో రగిలిపోయే వారు తిరుగుబాటు చేయడాన్ని కొట్టిపారేయలేం. తాలిబన్ పాలకులు తమ సొంత బలగాలను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి. మైనార్టీలను మచ్చిక చేసుకొనేదెలా? మహిళలు, మైనార్టీల పట్ల తాలిబన్లు కర్కశంగా వ్యవహరిస్తారన్న చెడ్డపేరుంది. వారి నిర్వాకం వల్ల అఫ్గానిస్తాన్ ప్రపంచంలో ఏకాకిగా మారింది. దేశంలో పెద్ద సంఖ్యలో గిరిజన తెగలున్నాయి. వీటిలో చాలా తెగలకు తాలిబన్లతో శత్రుత్వం కొనసాగుతోంది. వారిని మచ్చిక చేసుకొని, మిత్రులుగా మార్చుకోవడం సులభంగా సాధ్యమయ్యే పని కాదని స్థానికులు అంటున్నారు. మానవ హక్కులను, మైనార్టీల హక్కులను కాపాడడం, పౌర చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం వంటివి తాలిబన్ల ముందున్న పెద్ద సవాళ్లు. ఆర్థిక పరిస్థితి ఆగమాగం ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో అఫ్గానిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అఫ్గాన్‌కు లభించే ఆదాయంలో 20 శాతానికి పైగా విదేశాల ఆర్థిక సాయం నుంచే అందుతోంది. తాలిబన్ల దురాక్రమణతో ఆ సాయం మొత్తం ఇక నిలిచిపోయినట్లే. మరోవైపు అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 9.5 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. అంతేకాదు అఫ్గాన్‌కు ఎలాంటి రుణాలు ఇవ్వబోమని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. అఫ్గాన్‌ను ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్టులో చేర్చింది. దీంతో విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. అఫ్గాన్‌లో ఖనిజ సంపద ఉన్నప్పటికీ దాన్ని తవ్వితీయాలంటే విదేశీ పెట్టుబడులు అవసరం. తాలిబన్ పెద్దలు ఇక రష్యా, చైనా, పాకిస్తాన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి చదవండి: తాలిబన్ల దమనకాండ -
పర్యావరణ హిత పరిశ్రమల స్థాపనే లక్ష్యం: మంత్రి గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రజల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక పాలసీ క్షేత్రస్థాయిలోకి ఏ స్థాయికి ఎలా వెళుతుందో, ఎలా అమలు జరుగుతుందో, దాన్ని ప్రభావాలను అంచనా వేయలన్న ఆలోచనల నుంచి పుట్టినదే ‘గవర్నెన్స్ ల్యాబ్‌లు’ అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కాన్ఫరెన్స్ ఆన్ ఇండియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ‘వేగవంతమైన వృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో గవర్నెన్స్ ల్యాబ్‌లు మైలురాళ్లు మారుతాయని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఇస్తోన్న ప్రోత్సాహక విధానాలు, పద్ధతులు సరిగ్గా లేవని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ప్రోత్సాహకాల విషయంలో ఒక పద్ధతి, బడ్జెట్ ఉండాలన్నారు. ప్రోత్సాహాల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకువస్తే చాలా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ లేని ప్రోత్సాహకాలే కాదు ఏదీ మంచిది కాదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయమని తెలిపారు. మారే పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మన ఆలోచనలను సరిదిద్దుకోవడమే అసలైన సంస్కరణ అని చెప్పారు. చైనాకు ప్రత్యామ్నాయం భారతదేశం మాత్రమేనని, పర్యావరణ హిత పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాలిచ్చే పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని వివరించారు. కరోనా సమయంలో పరిశ్రమలు ప్రభుత్వానికి అందించిన తోడ్పాటు మరవలేనిదని అన్నారు. మెడికల్ ఆక్సిజన్, బెడ్స్ వంటి సహా అనేక అంశాలలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ 19 ప్రతి మనిషి మీద అనేక రకాలుగా ప్రభావం చూపిందని, భౌగోళిక, భౌతిక, వాతావరణ మార్పులకు కరోనా మేల్కొలుపని అన్నారు. అభివృద్ధి సంబంధిత శాఖలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు. సంక్షేమం, సమాన అవకాశాలు, విలువైన విద్య, వైద్యం, విజ్ఞాన, పారిశ్రామిక వంటి అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు. సరికొత్త మార్పులకు తగ్గట్లుగానే సరికొత్త విధానాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. -
వైరస్‌కు మన కవచం... సంక్షేమ ఫైర్‌వాల్
విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కుదుటపడటం ఇప్పట్లో కష్టం. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకోవడం, ఆ తీరును మోస్తున్న ‘మీడియా’ అందుకు కారణం. తెలంగాణ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రాంతీయ అస్తిత్వంగా మలిచి, రాజకీయ ప్రతిపత్తిని పొందడం చూశాక అయినా, ఆంధ్ర పౌరసమాజంలో ప్రాంతీయ బంధనం (రీజినల్ బాండ్) కొరకు ఆలోచన మొదలుకావాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక ‘ఎజెండా’తో పనిచేయాలి. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల కోసం అక్కడి జ్ఞాన సమాజం ఈపాటికి ఒక ముసాయిదా రూపొందించి, ప్రభుత్వంతో ‘డైలాగ్’ మొదలెట్టాలి. అదొక సమాంతర ‘ఒత్తిడి బృందం’ (ప్రెషర్ గ్రూప్) కావాలి. అయితే మొదటి ఐదేళ్ళలో ఇవేమీ జరక్కపోవడంతో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఎన్నికైన ప్రభుత్వం అయినా, ఎన్నిక కావాలనుకున్న ప్రతిపక్షం అయినా ప్రజలు–ప్రాంత హితం వాటి లక్ష్యం కావాలి. కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారానికి దూరమే అయినా, అవి నిత్యం ప్రజల పక్షాన ఉన్నట్టుగా కనీసం కనిపిస్తాయి. ‘బీపీవో ప్రభుత్వాలు’ వచ్చాక, ప్రభుత్వంలో వుంటే ఎక్కువ సంపద, ప్రతిపక్షంగా ఉంటే తక్కువ సంపద ‘ఫార్ములా’ అయింది. అందుకే మూకుమ్మడి పార్టీల ఫిరాయింపు మొదలయింది. వ్యాపారం–రాజకీయం నాణేనికి రెండు వైపులుగా మారింది. విభజన తర్వాత ఏపీలో ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ‘హబ్ అండ్ స్పోక్స్’ పాలసీని తన ‘విజన్ 2029’లో ప్రకటించింది. ఇది పూర్తిగా కేంద్రీకృత పాలనా వ్యవస్థ. దాన్ని మరింత సుస్థిర పర్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధులు దాటిమరీ ఇజ్రాయెల్ నుంచి ‘సైబర్ టెక్నాలజీ’ని కూడా తీసుకోవాలని 2017 ఫిబ్రవరి నాటికే అనుకొంది. ఇజ్రాయెల్ దౌత్యవేత్త డేవిడ్ కామెరాన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇది జరిగిన ఐదేళ్లకు ఇజ్రాయెల్ సైబర్ ఆర్మ్ ‘పెగసస్ స్పైవేర్’ మన దేశంలో ఆందోళనకరమైన స్థాయిలో జాతీయ వార్త అయింది. ప్రభుత్వంలో లేకపోయినా సమాంతరంగా ‘షాడో–గవర్నెన్స్’ నడిపితే తప్ప, తమ వాణిజ్య ప్రయోజనాలు కొనసాగని పరిస్థితి టీడీపీలో నెలకొంది. సరిగ్గా ఇక్కడే, మనం జనం కోసమా? లేక మనవాళ్ళ ‘బిజినెస్’ కోసమా? అనే చిట్టచివరి ప్రశ్నకు కూడా జవాబు చెప్పవలసిన అగత్యం ప్రతిపక్షానికి ఏర్పడింది. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీ మనుగడ ‘క్రిటికల్ కేర్’ స్థితికి చేరిన పరిస్థితుల్లో, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ‘లైన్’ తీసుకోవడానికి కూడా వెరవకపోవడం చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా, ఒక ‘షాడో’ రూపంలో ఒక్కొక్కరిలో ‘స్పైవేర్’గా ప్రవేశిస్తూ, ప్రభుత్వాన్ని అలజడికి గురిచేయాలని ప్రయత్నించడం చూస్తున్నాం. ఇందుకోసం పనిచేసేవారిలో నర్సీపట్నం డాక్టర్ పేరు మనకు తెలిస్తే, రామతీర్థం గుడి విధ్వంసం క్రిమినల్ పేరు తెలియక పోవచ్చు. ఇటువంటి నిరంతర ‘షాడో ట్రాకింగ్’ ఒత్తిడిని తట్టుకుంటూ తన పని తాను చేసుకోవడం తర్వాతి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పని అయింది. ముందుగా బాబు ‘హబ్ అండ్ స్పోక్స్’ పాలసీని ‘జీరో’ చేస్తూ– మూడు రాజధానులు, కొత్త జిల్లాలు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, అన్ని కులాల సంక్షేమానికి సంస్థలు, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసి షాడో గవర్నెన్స్‌కు తన ‘ఫైర్‌వాల్’తో తొలి చెక్ పెట్టింది జగన్ ప్రభుత్వం. విభజన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి రాష్ట్ర ‘మ్యాప్’ను ముందు పెట్టుకుని మరీ చేసిన కసరత్తుతో, ‘బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’, ‘పలమనేరు– కుప్పం–మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటును చూసినప్పుడు, ‘పాలిటీ’ తన సరిహద్దులకు చేరిన విషయం మనకు అర్థం అవుతుంది. ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా తన కాలంలో ఇటువంటి విత్తనాలు నాటాలి. రాజ్యాంగ పరిధిలో మనకున్న అధికారాలతో మనం చేయవలసింది మాని, అవతలివాళ్లు చేస్తున్నది తెలుసుకోవడానికి ‘స్పైవేర్’ ఎందుకు? ‘పెగసస్’ ఉదంతం వెలుగులోకి వచ్చాక, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్.. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, ప్రభుత్వాలను కూడా ఇటువంటి ‘సైబర్ ఆయుధాలు’ అస్థిరపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రధానంగా రాజకీయాలకు దూరంగా ఉండే మధ్య తరగతి ఆలోచనాపరుల వివేచన ఎంతైనా అవసరమైన దశలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు పూర్తిగా ‘టెర్మినల్’ దశకు చేరడంతో, వాటి తదుపరి దశను ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మున్ముందు ఇది దేశానికి దిక్సూచి కావొచ్చు. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ప్రభుత్వ పాలనకు విశిష్ట నమూనా ఏపీ
గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు, రేషన్ కార్డులు, నగదు బదలాయింపు, ఆర్ఓఆర్ 1బీ, అడంగల్, వీధి దీపాలు, పబ్లిక్ కుళాయి వంటి సేవలను 24 గంటల్లోపు అందించడం ద్వారా సేవల సరఫరాలో కీలక మలుపును సాధించింది ఏపీ ప్రభుత్వం. కోవిడ్ కష్టకాలంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడికి చేస్తున్న సేవలు విశిష్టమైనవి. లబ్ధిదారులను గుర్తించడంలో స్థానిక నేతల జోక్యం లేనే లేదు. ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతోంది. ముఖ్యంగా వలంటీర్ల సేవలు ఎంతో విశిష్టమైనవి. కేరళలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉనికిలో లేదు. అయితే సచివాలయాలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. లోపాలను సవరించుకుని, పాలనాపరమైన మార్పులు చేసుకుపోతే ప్రభుత్వ పాలనకు ఆంధ్రప్రదేశ్ విశిష్ట నమూనాగా నిలబడుతుంది. దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో 500 రకాల సేవలను అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. వీరిలో 1.26 లక్షలమంది నూతన ప్రభుత్వ ఉద్యోగులు. వీరు పాలన, రెవెన్యూ, వ్యవసాయం, ఆరోగ్యం, సంక్షేమం, పోలీసు వగైరా విధులను చేపడుతున్నారు. మిగిలినవారు గౌరవ వేతనంతో పనిచేస్తున్న వలంటీర్లు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమించడం అనేది దేశచరిత్రలోనే తొలిసారిగా ప్రజల ముంగిటకే పాలనను తీసుకుపోయే విశిష్టమైన నమూనాగా నిలిచిపోయింది. ఏపీలో 11,152 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డ్ సచివాలయాలు ఉన్నాయి. అలాగే గ్రామాల్లో ప్రతి 2 వేలమంది జనాభాను, పట్టణాల్లో ప్రతి 4 వేలమందిని సేవించడానికి ఒక సెక్రటేరియట్ ఉంటున్నాయి. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 12 మంది ప్రభుత్వోద్యోగులు.. వలం టీర్లు నిర్వర్తిస్తున్న వివిధ విభాగాల విధులను పర్యవేక్షిస్తూ పనిచేస్తున్నారు. వలంటీర్లు తాము నిర్వర్తిస్తున్న సేవల్లో అవినీతిని తొలగించి పారదర్శకంగా సకాలంలో సేవలను అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కీలక విధానమైన నవరత్నాల భావన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఈ చర్యలు తోడ్పడతాయి. సచివాలయ వ్యవస్థను ఏపీలో 2020 జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర పథకాలను నాడు–నేడు భావన కింద గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయో చిత్రాల ప్రాతినిధ్యం ద్వారా చూపిస్తున్నారు. అలాగే కోవిడ్ సంబంధిత కార్యకలాపాల్లో కూడా సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ సందర్భంగా కేరళలోని స్థానిక పాలనను కూడా పేర్కొనడం సముచితంగా ఉంటుంది. కేరళలో, ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీల అధిపతికి కార్యనిర్వాహక అధికారం ఉంటుంది. పలువిభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ విభాగాల సిబ్బందికి ఉద్యోగరీత్యా సెక్రటరీలుగా ఉంటారు. దీన్ని ప్రత్యేకించి చెప్పాలంటే, ఆరోగ్య శాఖలో వైద్య కళాశాలలు, ప్రాంతీయ స్పెషాలిటీ ఆసుపత్రులు మినహా ఇతర అన్ని వైద్య సంస్థలూ స్థానిక ప్రభుత్వాల నియంత్రణలో ఉంటాయి. ఉన్నత పాఠశాలలు, ఎగువ ప్రాథమిక పాఠశాలలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉంటాయి. ప్రాథమిక పాఠశాలలు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంటాయి. కేంద్ర ప్రాయోజిత దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు, పారిశుధ్యం, గ్రామీణ నీటి సరఫరా ప్రణాళిక, అమలుతో సహా దారిద్య్ర నిర్మూలన పూర్తిగా స్థానిక సంస్థల బాధ్యతగానే ఉంటుంది. ఇకపోతే పెన్షన్లు, ఐసీడీఎస్, బాల న్యాయం వంటి శాసన సంబంధ విధులన్నింటినీ స్థానిక సంస్థలు నిర్వహిస్తాయి. ఉత్పాదకత పెంపుదల కోసం వ్యవసాయ విస్తరణకు మద్దతు, వాటర్ షెడ్ నిర్వహణ, మైనర్ ఇరిగేషన్, క్షీర అభివృద్ధి, పశువుల సంరక్షణ, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ వంటివి పంచాయతీల పరిధిలో ఉంటాయి. కార్యాచరణ శిక్షణతో సహా విధులకు సంబంధించిన అంశాలపై రిఫ్రెషర్ శిక్షణల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు, సిబ్బంది అందరికీ నిర్దిష్టంగా శిక్షణ ఇస్తారు. ఒక స్థానిక సంస్థ తన సైజును బట్టి 15 లేక 22 మంది శాశ్వత సిబ్బందిని కలిగి ఉంటుంది. అలాగే వృత్తిపన్ను, ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతి ఫీజులు, వినోదపన్ను, సేవా పన్ను, యూజర్ ఫీ వంటి వాటిపై గ్రామ పంచాయతీలు సొంతంగా పన్ను విధించే అధికారాన్ని కలిగి ఉంటాయి. సగటున ప్రతి గ్రామపంచాయతీకి ఏటా నాలుగు కోట్ల బడ్జెట్ ఉంటుంది. దేశంలోనే అత్యంత ఆధునికమైన, వికేంద్రీకృతమైన పాలనకు కేరళ మారుపేరుగా నిలుస్తోంది. ఆంధ్రలో గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు.. కేరళలో అమలవుతున్న స్థానిక పాలనా స్థాయిని ఏపీలో అతి తక్కువకాలంలోనే ఆశించడం సబబు కాదు. ఎందుకంటే ఏపీలో స్థానిక పాలన అనేది ప్రాథమిక స్థాయిలో ఉంది. పైగా అక్షరాస్యతా రేటు, ప్రజా ప్రాతినిధ్య సంస్థలు కేరళలో చాలా బలంగా ఉన్నాయి. ఏపీ సచివాలయాల్లోని కొందరు ప్రభుత్వ సిబ్బందిని కలిసి మాట్లాడినప్పుడు, వారిలో ఆరుమందికి మాత్రమే పూర్తిస్థాయి పని ఉంటున్నట్లు చెప్పారు. పోతే, ప్లానింగ్, మహిళా పోలీసు, వసతులు సదుపాయాలు, ఎనర్జీ వంటి విధుల్లో ఉంటున్న వారికి తక్కువ పని భారం ఉంటున్నట్లు తెలింది. అయితే ఈ సచివాలయాల నుంచి మనం అనేక సానుకూల అంశాలను కూడా చూడవచ్చు. ఏపీలో సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు, రేషన్ కార్డులు, నగదు బదలాయింపు, ఆర్ఓఆర్ 1బీ, అడంగల్, వీధి దీపాలు, పబ్లిక్ కుళాయి వంటి సేవలను 24 గంటల్లోపు అందించడం ద్వారా సేవల సరఫరాలో కీలక మలుపును సాధించింది ఏపీ ప్రభుత్వం. గతంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లి తమకు అవసరమైన సేవలను పొందడానికి రోజుల తరబడి తిరగాల్సివచ్చేది. సేవలకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజలు తమ సమయాన్ని, డబ్బును ఉత్పాదక అవసరాలకు వెచ్చిస్తున్నారు. కోవిడ్ కష్టకాలంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడికి చేస్తున్న సేవలు విశిష్టమైనవి. లబ్ధిదారులను గుర్తించడంలో స్థానిక నేతల జోక్యం లేనే లేదు. ప్రతిదీ పారదర్శకంగానే జరుగుతోంది. ముఖ్యంగా వలంటీర్ల సేవలు ఎంతో విశిష్టమైనవి. కేరళలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉనికిలో లేదు. అయితే సచివాలయాలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వివిధ విభాగాధిపతుల నియంత్రణలో నేరుగా పనిచేస్తున్నందువల్ల సచివాలయ సిబ్బంది మధ్య సమన్వయం ఉండటం లేదు. వివిధ పథకాలకు సంబంధించి తగిన శిక్షణ కొరవడింది. శిక్షణపై స్పష్టమైన ప్రొటోకాల్స్ వంటివాటికి బదులుగా సిబ్బందికి వారి పైఅధికారులు వాట్సాప్ ద్వారా లేక మౌఖిక ఆదేశాల ద్వారా సందేశాలు పంపుతున్నారు. మరోవైపున గ్రామ సిబ్బంది ఉద్యోగాలు తాత్కాలికమేనని బెదిరిస్తూ వారి పై అధికారులు వివిధ విధుల పరిపూర్తికోసం అశాస్త్రీయమైన గడువు పెడుతూ అలవిమాలిన భారం మోపుతున్నారు. తగిన పర్యవేక్షణ లేకుండానే టెక్నికల్ టీమ్‌ను యాప్స్‌ని, సాఫ్ట్‌వేర్‌ని పంపించడం వల్ల పనిలో ఆలస్యం జరుగుతోంది. గ్రామ సచివాలయ కార్యదర్శుల ప్రశ్నలకు వారి పైఅధికారులు నిర్ణీత సమయంలో స్పందించకపోవడం వల్ల ప్రజలకు నచ్చచెప్పడం సమస్య అవుతోంది. ముందడుగు ఇలా.. కేరళలోలాగే ప్రొటోకాల్స్ని కచ్చితంగా పాటించడం ద్వారా సచివాలయ సిబ్బందికి, పీఆర్ఐ సభ్యులకు నిరంతరాయంగా శిక్షణను అందించాల్సిన అవసరం ఉంది. మండల కార్యాలయాలను సందర్శించడం ప్రజలు ఆపివేశారు కాబట్టి మండల స్థాయిలో రెండు పోస్టులు ఉండాల్సిన అవసరం లేదు. తగిన హోదాతో వీరిని ఇతర విభాగాల్లో కలపాలి. లేదా పాత తహసీల్, సమితులకు మార్చాల్సి ఉంది. పాలనలో సరైన పంథాను అవలంబించడం, ప్రభుత్వ డబ్బును ఆదా చేయడం దీనివల్ల సాధ్యపడుతుంది. జవాబుదారీ తనం కోసం, సరైన సమన్వయం కోసం గ్రామ సచివాలయ సిబ్బంది ఒకే అధికారి కింద పనిచేయాలి. సమయాన్ని, డబ్బును వృ«థా చేయకుండా ఉండేందుకు టెక్నికల్ టీమ్ అభివృద్ధి చేసే ప్రతి యాప్‌ని లేదా సాఫ్ట్ వేర్ని అమలు చేయడానికి ముందస్తుగానే చెక్ చేసి జాగ్రత్తలు చేపట్టాలి. వలంటీర్ల పనిని క్రమానుగతంగా మదింపు చేయాలి. అవసరమైతే వారిని మార్చాలి. కేరళలో లాగే గ్రామ స్థాయిలో చాలా సేవలను అందించడానికి సచివాలయాల్లోని వివిధ విభాగాల కార్యదర్శులకు శిక్షణ ఇవ్వడానికి ఒక నిర్దిష్ట వ్యూహాన్ని అమలు పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త ఈ–మెయిల్: prudhvikar@gmail.com -
అపూర్వం...అనితర సాధ్యం
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పురజనులు అపూర్వమైన రీతిలో హారతులు పట్టారు. ఆ చివర శ్రీకాకుళం మొదలుకొని ఇటు అనంతపురం వరకూ ప్రాంతాలకు అతీతంగా ముక్తకంఠంతో తిరుగులేని తీర్పునిచ్చారు. ఆదివారం వెలువడిన పురపాలక సంస్థలు, నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం బహుశా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. ఫలితాలు వెలువడిన 11 నగర పాలక సంస్థలనూ ఆ పార్టీ కైవసం చేసుకోవటంతోపాటు, 75 పురపాలక సంస్థలు/నగర పంచాయతీల్లో 74 సొంతం చేసుకోవటం... పోలైన ఓట్లలో 52.63 శాతం సాధించడం అసాధారణం. గత 22 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనూ, తీసుకుంటున్న విధాన నిర్ణయాలనూ వ్యతిరేకించటమే ఏకైక అజెండాగా పెట్టుకున్న తెలుగుదేశం ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అసెంబ్లీ ఫలితాలకు మించిన ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఖరికి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఏడాదిగా అమరావతి పేరిట సాగిస్తున్న వీధి నాటకం కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదుకోలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ ఉద్యమ ప్రభావం వుందం టున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం తెలుగుదేశం పూర్తిగా అడుగంటింది. జాతీయ పక్షంగా బీరాలు పోతున్న ఆ పార్టీ చాలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్ డివిజన్లు/ వార్డులకు పరిమితమైందంటే దానిపై జనాగ్రహం ఏ స్థాయిలో వున్నదో అంచనా వేసుకోవచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నిష్కళంకమైన పారదర్శక పాలన అంది స్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం వెలువరించిన రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోను ఆ వేదికపై చూపుతూ దాన్ని భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావించి అందులోని వాగ్దానాలను సంపూర్ణంగా నెరవేర్చటానికి త్రికరణ శుద్ధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. గత 22 నెలల పాలన అందుకనుగుణంగా సాగుతోందని జనం గ్రహించబట్టే ఆ పార్టీకి ఇంతటి అపూర్వ విజయాన్ని అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకొచ్చేనాటికి రాష్ట్రం దయనీయ స్థితిలోవుంది. చంద్రబాబు అపసవ్య విధానాలతో, అస్తవ్యస్థ పాలనతో ఖజానా నిండు కుంది. ఒకపక్క దాన్నంతటినీ సరిచేస్తూనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటానికి కృషి చేస్తున్న ప్రభు త్వానికి హఠాత్తుగా విరుచుకుపడిన కరోనా వైరస్ మహమ్మారి పెను సవాల్ విసిరింది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింతగా కుంగదీసింది. లాక్డౌన్ పర్యవసానంగా సమస్త జీవన రంగాలూ స్తంభించి ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడినప్పుడు జగన్ ప్రభుత్వం నేనున్నానంటూ భరోసానిచ్చింది. ఒకపక్క కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే అట్టడుగు ప్రజానీకం కనీస అవసరాలు నెరవేరటానికి అవసరమైన ఆర్థిక తోడ్పాటునందించింది. నిత్యావసరాలు అందించింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను విస్తరించటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. లాక్డౌన్ ఎత్తివేసే సమయానికల్లా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు అండ దండలందించి ఉపాధి కల్పనకు తోవలు పరిచింది. సుదీర్ఘ అనుభవంగలవారి ఏలుబడిలోవున్న రాష్ట్రాలకు సైతం ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇవన్నీ చేస్తూనే మహిళల భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకుంది. సత్వర దర్యాప్తు జరిపి, నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్షలుపడేందుకు వీలు కల్పించే కఠినమైన దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు నెలకొల్పింది. విద్యారంగ సమూల ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించింది. ఈ ఎన్నికల ఫలితాలు చూశాకైనా చంద్రబాబులో పునరాలోచన మొదలవుతుందనుకున్నవారికి నిరాశే ఎదురైంది. ‘ఇదే స్ఫూర్తితో పనిచేస్తే విజయం మనదే’నంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ దిగ్భ్రాం తికరమైనది. ఏమిటా ‘స్ఫూర్తి’? అడుగడుగునా మాయోపాయాలు పన్నడమా? ప్రార్థనా మంది రాల్లో విగ్రహ విధ్వంసానికి పాల్పడటమా? వెళ్లినచోటల్లా సొంత పార్టీవారినీ, జనాన్నీ దుర్భాష లాడటమా? వారిపై చేయి చేసుకోవటమా? మీడియాను గుప్పెట్లో పెట్టుకుని, తప్పుడు కథనాలను ప్రచారంలో పెట్టడమా? వ్యవస్థలను చెప్పుచేతల్లో పెట్టుకోవటమా? ఫలితాలు వెలువడ్డాకైనా పద్ధతులు మార్చుకుంటానని హామీ ఇవ్వాల్సిందిపోయి, తమవైపు తప్పిదాలు జరిగాయని అంగీక రించాల్సిందిపోయి బాబు ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నించటం ఆత్మ వంచన, పరవంచన కూడా. అధికారంలోకొచ్చిన తొలినాళ్లలోనే గ్రామ సచివాలయ వ్యవస్థనూ, వలంటీర్ వ్యవస్థనూ అమల్లోకి తెచ్చి పాలనను ప్రజలకు చేరువ చేశారు జగన్మోహన్ రెడ్డి. అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకూ సమంగా అభివృద్ధిని విస్తరింపజేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు బాబు, ఆయన మిత్రగణం అవరోధాలు సృష్టించకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్ ఎంతో పురోగతి సాధించేది. ప్రజానీకం దీన్నంతటినీ గమనించబట్టే బాబుకూ, ఆయన ప్రత్యక్ష, పరోక్ష మిత్రులకూ పంచాయతీ ఎన్నికలు మొదలుకొని పురపాలక ఎన్నికల వరకూ కర్రు కాల్చి వాతబెట్టారు. మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్రం నలుచెరగులా సంపూర్ణ మద్దతు పలి కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ ఘన విజయం అన్ని రాష్ట్రాల్లోని పాలకులనూ ఆలో చింపజేస్తుంది. చిత్తశుద్ధితో పనిచేస్తే, సమర్థవంతమైన పాలన అందిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తారన్న విశ్వాసం కలగజేస్తుంది. -
సర్కారు సేవలు షురూ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్డౌన్ ఈనెల 29 వరకు అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన పూర్తిస్థాయిలో సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇం దులో భాగంగా సోమవారం నుంచి సిబ్బందిని నూరుశాతం హాజరు కావాలని స్పష్టం చేసింది. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులకు ఈ మేరకు ఆదేశాలు అందాయి. దీంతో జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి కార్యాలయాలు పూర్తిస్థాయిలో సేవలందించనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడనున్నాయి. రెడ్జోన్లుగా ఉన్న జిల్లాల్లో మాత్రం ఉద్యోగులు ప్రస్తుతం కొనసాగుతున్న రొటేషన్ పద్ధతిలోనే హాజరు కావాల్సి ఉంటుంది. మరోపక్క హైదరాబాద్ నగరంలో పరిమిత సంఖ్యలో ఐటీ సంస్థల కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. (చదవండి: ఈ దశ అత్యంత కీలకం! ) తీవ్రత తగ్గడంతో... రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా మిగతా జిల్లాల్లో పాజిటివ్ కేసుల నమోదు పెద్దగా లేదు. ఈ క్రమంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. నిర్మాణ, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు, దుకాణాలను తెరిచేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. దీంతో చాలావరకు వ్యాపార సంస్థలు, పరిశ్రమలు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 7 నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తుండడంతో కాస్త ముందుగానే ఈ సంస్థలు మూసుకుంటున్నాయి. జన సమూహాలు ఏర్పడకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తుండడంతో ప్రభుత్వ శాఖల కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సర్కారు ఉపక్రమించింది. కేసీఆర్ సమీక్ష తరువాత స్పష్టత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్జోన్ల జాబితాలో ఐదు జిల్లాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. గత రెండు వారాలుగా వరంగల్ అర్బన్ జిల్లాల్లో కేసులే నమోదు కాలేదు. అలాగే వికారాబాద్ జిల్లాలోనూ పది రోజులుగా కేసులు నమోదు కాలేదు. దీంతో ఈ రెండు జిల్లాలు కొద్దిరోజుల్లోనే ఆరెంజ్ జోన్లోకి రానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ విస్తరించిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కేసుల నమోదు పెరుగుతుండడంతో ఇక్కడ కొంతకాలం లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుచేసే అవకాశం ఉంది. మరోవైపు రెడ్జోన్లలో కూడా వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లోని ఉద్యోగులు దాదాపు పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని శాఖల్లో వంతులవారీగా ఉద్యోగులు వస్తుండగా, కొందరు మాత్రం తక్కువ సమయం హాజరై ముఖ్యమైన పనులను పూర్తిచేస్తున్నారు. కాగా, ఈ నెల 15తర్వాత సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. మరో నాలుగు రోజుల్లో లాక్డౌన్ సడలింపులపై మరింత స్పష్టత రానుంది. పది శాతం ఐటీ కంపెనీల్లో నేటి నుంచి కార్యకలాపాలు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి ఐటీ సంస్థల కార్యకలాపాలు పరిమిత సంఖ్యలో సిబ్బందితో ప్రారంభం కానున్నాయి. మహానగరం పరిధిలో వెయ్యికిపైగా బహుళజాతి, మధ్యతరహా, చిన్న ఐటీ కంపెనీలున్నాయి. సోమవారం నుంచి వీటిలో పదిశాతం కంపెనీలు.. 15 శాతం సిబ్బందితో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)తెలిపింది. సైబరాబాద్ పోలీసులు 33శాతం మంది ఉద్యోగుల హాజరుతో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించినా.. ఆ స్థాయిలో ఉద్యోగుల హాజరుకు మరో మూడు వారాలు సమయం పడుతుందని అంచనా. ఇప్పటికే పలువురు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన ఉపకరణాలను తమ నివాసాలకు తరలించుకున్నారు. తిరిగి కార్యాలయాల్లో పనిచేసేందుకు తగిన ఏర్పాట్లు, శానిటైజేషన్, ఉద్యోగుల మధ్య భౌతికదూరం నిబంధనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఇప్పటికిప్పుడు అన్ని సంస్థలు ఒకేసారి తెరుచుకునే పరిస్థితి లేదు. కాగా, ప్రభుత్వం ఐటీ కారిడార్‌లో కార్యకలాపాలకు అనుమతించడంతో ఈ రంగం మాంద్యం నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. (చదవండి: వలస కార్మికుల రాకతో రాష్ట్రంలో హైఅలర్ట్ ) -
అభివృద్ధిలో ‘స్థానిక’ పాలనే కీలకం
పార్వతీపురం: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక పాలన కీలకం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిధులు చక్కగా సది్వనియోగం అయితే... ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి సూచిక అన్న నినాదం అందరికీ తెలిసిందే. గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావల్సిందేనని అందరూ అంగీకరించాల్సిన విషయం. స్థానిక సంస్థల ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసంఘం నిధులు విడుదలై గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 5వేల కోట్లవరకు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి గత 18నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణం. నిధులు సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలో నిలిచేవారిలో కొందరికి విధులు, అధికారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సహజమే. ఓటర్లు కూడా తాము ఎన్నుకున్న నాయకుడు నెరవేర్చాల్సిన బాధ్యత, ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. ఎంపీటీసీలు ఏంచేయాలి... విధులు, అధికారాలు.. జెడ్పీటీసీలు పరిస్థితి తదితర అంశాలను తెలుసుకుందాం. జెడ్పీటీసీల ఆవశ్యకత ఇలా... జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ చట్టం పక్కాగా అమలై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే జిల్లా పరిషత్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందే. జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. ఏ తీర్మాణాలు ఆమోదించాలన్నా మెజార్టీ సభ్యులు తప్పనిసరి. ఆమోదించే కార్యక్రమాలు సక్రమంగా నిర్వíర్తించే బాధ్యత సభ్యులపై ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకెళ్లాలి. మండల పరిధిలో జిల్లా ప్రాదేశిక సభ్యులను ఆయా మండల ప్రజలు నేరుగా ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని ఎన్నికకాబడిన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. జెడ్పీటీసీలు మండలంలోని ప్రజల్ని సమన్వయపరచి అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యులవుతారు. జిల్లాపరిషత్ నిర్వహణలో లోపాలు, అలసత్వం, నిధుల దుర్వినియోగంపై జెడ్పీ చైర్మన్, సీఈఓల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 15 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి జెడ్పీ పరిపాలనపై సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సీఈఓ ప్రతీ మూడు నెలలకు ఒకమారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక నివేదికపై చర్చిస్తారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ అధికారిక ఉత్సవాలకు, కార్యక్రమాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా అహ్వానించాలి. నియోజకవర్గ ఆర్థిక సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జెడ్పీ పాఠశాలల స్థితిగతుల మెరుగుకు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందించవచ్చు. నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఎంపీటీసీల అధికారాలు.. విధులు ఎంపీటీసీలు మండల పరిషత్‌లో ఓటు హక్కును వినియోగించుకుని మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీలకు సంబంధిత ప్రాదేశిక సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపీపీ పదవి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీలు అధ్యక్షుడ్ని, ఉపాధ్యాక్షుడిని ఎన్నుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో మండలాభివృద్ధిలో ఎంపీటీసీలే కీలకం అవుతారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు తొలిమూడు సమావేశాలలోపు ప్రమాణ స్వీకారం చేయాలి. లేనిపక్షంలో వారి సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో పాటు వరుస మూడు సమావేశాలకు గైర్హాజరైన సభ్యత్వం పోతుంది. ఆయా పరిధి గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ శాశ్వత అహ్వానితుడవుతారు. పాలకవర్గంలో మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీ అభివృద్ధిపై సూచనలు, సలహాల మేరకు పరిమితమవుతాడే తప్ప నిర్ణయాధికారం మాత్రం ఉండదు. వారి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల విద్యాప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల దురి్వనియోగం అయితే ప్రశ్నించే అధికారం ఉంటుంది. -
విద్యా వ్యవస్ధలో నవోదయం
-
అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌ది
-
బాబు పాలన బాగోలేదు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి విశృంఖలమైందని, సమర్థవంతమైన పాలనను అందించడంలో ఆయన దారుణంగా విఫలమయ్యారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ గ్రూపునకు చెందిన తెలుగు వెబ్సైట్ ‘సమయం’ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(ఒపీనియల్ పోల్)లో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా పోల్ నిర్వహించినట్లు ‘సమయం’ తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో, రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని 60 శాతం మందికి పైగా ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం అమరావతికి ఉపయోగ పడలేదని తేల్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జోక్యం పెరిగిందని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. టీడీపీలోకి ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సరికాదని 80 శాతం మంది సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఎవరికి ఓటేస్తారు? అనే ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్రెడ్డికే తమ ఓటని సర్వేలో పాల్గొన్న అత్యధిక శాతం మంది స్పష్టం చేయటం గమనార్హం. -
గూడేల్లో ఎగిరిన నల్లజెండాలు
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామా ల్లో తుడుందెబ్బ నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ‘మా ఊళ్లో మా రాజ్యం’ పేరుతో నినాదాలు మారుమోగాయి. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నల్ల జెండాలు ఎగురవేస్తూ ఆదివాసీలు నిరసనలు తెలిపారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గూడేలతోపాటు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసేందుకు యత్నించిన ఇద్దరు ఆదివాసీలను పోలీసులు అరెస్టుచేశారు. మా భూమి మాకివ్వండి నేరడిగొండ మండలంలోని వాగ్ధారిలో తమ 105 ఎకరాల భూమిని లంబాడాల పేరుపై పట్టా చేయడాన్ని నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ముందుగా వాగ్ధారి గ్రామంలో కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి, అక్కడి నుంచి ధస్నాపూర్ వరకు 500 మంది ర్యాలీ చేపట్టారు. ఆర్డీవో వచ్చేంత వరకు అక్కడే బైఠాయించారు. మా భూమి మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సమస్యను పది రోజుల్లో పరిష్కరిస్తామని ఆర్డీవో సూర్యనారాయణ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇంద్రవెల్లి తహసీల్దార్ కార్యాలయంపై నల్లజెండా ఎగురవేసే ప్రయత్నం చేసిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవోలకు ఆదివాసీలు వినతి పత్రం అందించారు. ఉపాధ్యాయుల అడ్డగింత ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో లంబాడా మహిళా ఉపాధ్యాయులను బహిష్కరించాలని ఆదివాసీ విద్యార్థులు అడ్డుకున్నారు. తరగతులకు రానివ్వకుండా ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. ఆదిలాబాద్ మండలంలోని కుమురంభీం చౌరస్తాలో, అంకోలి గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులు నల్ల జెండాను ఎగురవేశారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని కుమురంభీం విగ్రహం వద్ద తుడుందెబ్బ నేతలు నల్ల జెండా ఆవిష్కరించి నిరసన తెలిపారు. గుడిహత్నూర్ మండల కేంద్రం, బీంపూర్ మండల కేంద్రం, బోథ్ మండంలోని పట్నపూర్‌లో నల్ల జెండాలు ఎగురవేశారు. ఉట్నూర్ మండలంలోని చిన్నసుద్దగూడ, పెద్దసుద్దగూడ, పర్కుగూడ, కల్లూరిగూడల్లో.. నార్నూర్ మండలంలోని మంకాపూర్, నాగల్కొండ, బలాన్పూర్, శేకుగూడతోపాటు దాదాపు జిల్లావ్యాప్తంగా అన్ని ఆదివాసీ గూడెల్లో నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. -
పాలనకు కొత్త దిశ
సాక్షి, హైదరాబాద్: ప్రజల అవసరాల ప్రాతిపదికగా నిరంతరం పరిపాలన సంస్కరణలు జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు పాలనను దగ్గర చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో భారీగా సంస్కరణ లు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, రెవెన్యూ డివి జన్లు, మండలాలు, పోలీస్ డివిజన్లు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు విషయంలో 90% మంది ప్రజలు సంతో షంగా ఉన్నారన్నారు. కొత్తగా 5 వేల గ్రామ పంచా యతీలు, 15 నుంచి 20 కొత్త మున్సిపాలిటీలు ఏర్పా టు చేస్తామన్నారు. గ్రామస్థాయిలో ఉత్తమ పరిపాల న వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. ‘‘అధికారుల బృందం దక్షిణాఫ్రికా వెళ్లి అధ్యయనం చేస్తుంది. వచ్చే నెలలో అసెంబ్లీలో కొత్త చట్టం తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యాక రెవెన్యూ గ్రామాల పునర్విభజన చేపడతాం’’ అని తెలిపారు. ‘పరిపాలన సంస్కరణలు, నూతన పాలన వ్యవస్థ’ అంశంపై శుక్రవారం అసెంబ్లీలో లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేల సందేహాలకు సీఎం సమాధానమిచ్చారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో జరిగినట్లుగా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతగా సంస్కరణలు జరగలేదని చెప్పారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ఉన్నంతలో మంచిగా చేశాం.. పశ్చిమబెంగాల్, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో తప్ప దేశం లో అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాల పునర్విభజన జరి గింది. జిల్లాల పునర్విభజన జరగకపోవడం వల్ల ఈ రెండు రాష్ట్రాలు నష్టపోయాయి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశాం. 31 జిల్లాల్లోని అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఉన్నంతలో మంచిగా చేశాం. నారాయణపేట జిల్లా కావాలని డిమాండ్ చేశారు. సంస్కరణలు నిరంతర ప్రక్రియ. ఎప్పటి అవసరాలను బట్టి అప్పుడు సంస్కరణలు జరుగు తుంటాయి. అవసరమైతే జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసుకుంటాం. పరకాలను రెవెన్యూ డివిజన్‌గా చేయబోతున్నాం. దేనికైనా రెండుమూడు నెలల సమయం పడుతుంది. 2024 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.5 లక్షల కోట్లకు చేరు తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుర్తించి ఇండియా టుడే తాజాగా రెండు అవార్డులు ఇచ్చింది. ఆర్థికం గా బాగున్న రాష్ట్రంలో పేదలు ఉండటానికి అవకా శం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,750 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 5 వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తాం. అలాగే 15 నుంచి 20 వరకు కొత్త మున్సిపాలిటీలను ఏర్పా టు చేస్తాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అనుభవంతో మంచి సూచనలు చేయాలి. జిల్లాల ఏర్పాటు రాష్ట్రాల నిర్ణయం ప్రజల అభీష్టం.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేర కు పరిపాలన మెరుగుపరిచేందుకు జిల్లాల పునర్వి భజన చేపట్టాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌కున్న ప్రత్యేక గరిమను దెబ్బతీయవద్దని, దాన్ని విభజిం చవద్దని అన్ని రాజకీయ పార్టీలు సూచించాయి. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేకపో వడం వల్ల వారు సమావేశాలకు రాలేదు. అందుకే పునర్విభజనలో హైదరాబాద్ విషయం ఆ పార్టీ సభ్యులు తెలియలేదు. కాంగ్రెస్ సభ్యులకు సీఎల్పీ అవగాహన కల్పించాలి. జిల్లాల పునర్విభజనపై కేంద్రం గెజిట్ ఇవ్వాలనేది పూర్తిగా అసంబద్ధం. ఈ ప్రక్రియ పూర్తిగా రాష్ట్రాల నిర్ణయం. ఎన్ఐసీ, ఆర్బీఐ ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఆర్బీఐ లీడ్ బ్యాంకులను నియమించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేంద్రంలోని అన్ని శాఖలకు సమాచారం పంపించాం. ప్రత్యేకంగా కేంద్రం నోటిఫికేషన్ అవసరం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్రం నుంచి కొత్త జిల్లాల వారీగానే మంజూర్లు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లోనూ తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజన ముసాయిదా లో ఉన్నట్లుగా లేదని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ అన్నారు. నిజమే ముసాయిదాపై అభి ప్రాయం సేకరించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కొత్త జిల్లాల్లో ఉద్యోగులకు సమస్య లున్న మాట వాస్తవమే. 8, 10 నెలల్లో అన్నింటినీ అధిగమిస్తాం. క్యాడర్ అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. కేంద్ర సర్వీసు అధికారులు అలాట్ అవుతారు. కింది స్థాయి సిబ్బం దిని నియ మిస్తు న్నాం. 2019 ఎన్నిక ల్లోపు అంతా చక్కబడు తుంది. ఏ జిల్లా ఆ జిల్లా స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించేలా అవుతుంది. 1300 కోట్లతో జిల్లాల్లో అవసరమైన నిర్మాణాలను చేపడుతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిందే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఒకే జిల్లా పరి ధిలో ఉండాలని ఎక్కడా లేదు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశం. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉన్నాయి. గతంలో భద్రాచలం లోక్‌సభ నియోజక వర్గం 5 జిల్లాల్లో ఉండేది. నా నియోజకవర్గం గజ్వేలు సైతం రెండు జిల్లాల్లో ఉంది. ప్రజల శ్రేయస్సు ప్రాతిపదికనే పాలనలో మార్పులు జరగాలి. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని విభజన చట్టంలోనే ఉంది. అయినా కేంద్రం చేయడం లేదు. దీనిపై కేంద్రాన్ని మళ్లీ అసెంబ్లీ నుంచి కోరుతున్నాం. లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరగాలి. ఎప్పుడో 30 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉన్న సంఖ్యే ఇప్పుడు 130 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఉంటే ఎలా? ప్రధాని మోదీ మెచ్చుకున్నారు కేంద్రం, అన్ని రాష్ట్రాలు కలిపి 44 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటోంది. ఎంత ఖర్చు చేసినా స్థానిక సంస్థలు ఎక్కడికక్కడ పని చేయకపోతే ఏమీ జరగదు. హైదరాబాద్‌లో ఉన్న సీఎం ఏమని చేస్తడు. అధికారాలు, విధులు బదిలీ జరగాలి. ఇదే విషయం చెబితే ప్రధాని మోదీ నన్ను మెచ్చుకు న్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జెడ్పీ చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మారారని బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇలా జరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణం. ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకాన్ని నేరుగా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీని వల్లే జెడ్పీలకు నిధులు లేకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీలకు నిధులిచ్చేందుకు కొత్త చట్టం తెస్తున్నాం. మెరుగైన స్థానిక పరిపాలనకు ఇది ఉపయోగపడుతుంది. జోన్ల పునర్విభజన జరగాలి జోన్ల పునర్విభజన జరగాలి. తెలంగాణకు అనుగుణంగా మార్చుకోవాలి. ముల్కీ నిబంధనలు వద్దని ఆంధ్రాప్రాంతం వారు, కావాలని తెలంగాణ వారు అప్పుడు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో వచ్చాయి. ఇదే విషయంపై ఆంధ్ర వాళ్ల పీడ మనకు విరగడ అయ్యిందని అప్పటి సీఎం పీవీ నర్సింహారావు ఇదే అసెంబ్లీలో చెప్పారు. ఈ మాటలను పట్టుకుని ఆంధ్రావారు ఢిల్లీలో లాబీయింగ్ చేసి సుప్రీంకోర్టు తీర్పును పక్కనబెట్టి అప్పుడు రాజ్యాంగ సవరణ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సింగరేణి వంటి సంస్థలకు వర్తించవని తిరకాసు పెట్టారు. అసెంబ్లీ, సచివాలయం రాష్ట్రపతి ఉత్తర్వులో లేవని అందరు వాళ్లే ఉంటే ఎలా అని ఇదే అసెంబ్లీలో నేను మాట్లాడాను. అందుకే తెలంగాణకు అనుగుణంగా పరిపాలన మార్పులు జరగాలి. జోన్లపై చర్చ పెడదాం. అందరి ఆమోదంతో నిర్ణయం తీసుకుందాం. ప్రజల వద్దకు పాలన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజలకు పాలన దగ్గరైంది. సంక్షేమ పథకాల అమలు తీరు మెరుగుపడింది. కింది స్థాయిలో సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి మండలంలో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించాలి. – జాఫర్ హుస్సేన్, ఎంఐఎం ప్రజలకు ఉపయోగపడాలి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న కార్యాలయాల స్థలాల ఎంపిక సరిగా లేదు. ప్రజలకు దగ్గరగా ఉన్న కార్యాలయాలను పక్కనబెట్టి దూరంగా ఉన్న వాటిని ఎంపిక చేస్తున్నారు. ఖమ్మం, మహబూబ్‌నగర్ ఈ సమస్య ఉంది. – సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ఐటీడీఏలు బాగా లేవు జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదు. జనాభా, విస్తీర్ణం ఏదీ శాస్త్రీయంగా లేదు. ఐటీడీఏలకు అధికారులు లేకుండా అయ్యారు. భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏలకు ఐఏఎస్‌లను పీవోలుగా నియమించాలి. – సున్నం రాజయ్య, సీపీఎం ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకే.. జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదు. ప్రతిపక్ష పార్టీలను బలహీనం చేయడం లక్ష్యంగా చేసినట్లుగా ఉంది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు పట్టున్న నియోజక వర్గాలను రెండుమూడు జిల్లాల్లో కలిపారు. సీఎం కేసీఆర్‌కు ఆరో నంబర్‌పై నమ్మకమని బయట చెప్పుకుంటున్నారు. ముసాయిదాలో జిల్లాల సంఖ్య 24 ఉంటే తర్వాత 31కి పెంచా రు. జిల్లాల పునర్విభజనతో అధికారులకు ప్రజ లకు దగ్గరయ్యారు. అయితే అధికారులకు పెద్దగా పని లేక ఇతర అంశాలపై దృష్టిపెడు తు న్నారు. అధికార పార్టీ వాళ్లు చేస్తే ఏమీ అనడం లేదు. మిగిలిన పార్టీల వారు అయితే ఇంకో తీరుగా వ్యవహరిస్తున్నారు. జనాభా, విస్తీర్ణం పరంగా ఎలా చూసినా హైదరాబాద్ పునర్వి భజన చేయాల్సి ఉంది. ఎంఐఎం కోసమే హైదరాబాద్‌ను ముట్టుకోలేదనే అభిప్రాయం ఉంది. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు ఎంత డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సరిగా జరగలేదు. -ఎస్.సంపత్‌కుమార్, కాంగ్రెస్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.. జిల్లాల పునర్విభజన సరిగా జరగలేదు. ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోలేదు. వర్క్ టు ఆర్డర్‌తో ఉద్యోగులు కొత్త జిల్లాల్లో పని చేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యో గులు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు నివాసాలకు దూరం గా పనిచేస్తూ ఇబ్బంది పడు తున్నారు. ప్రభుత్వం సాధా రణ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలి. జిల్లాల పునర్విభజనతో జిల్లా పరిషత్‌లు నిర్వీర్యమయ్యాయి. -జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత -
అధ్వాన పాలనకు నిలువుటద్దం
ఢిల్లీ నగరానికి ఉన్నవి మూడు ప్రభుత్వాలు, మూడూ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనాలే! మరిక ఓటరు ఏం చేయాలి? సాధారణంగా ఢిల్లీ ప్రజలు తమ జీవనంతో నేరుగా ముడివడి ఉన్న మున్సిపల్ ఎన్నికల పట్ల అతి తక్కువ ఆసక్తిని చూపుతారు, పోలింగూ తక్కువగానే ఉంటుంది. ఈసారి కూడా వారు ఉదా సీనంగానే వ్యవహరిస్తారా? లేదా నగరాన్ని ఈ దుస్థితిలోకి నెట్టిన పార్టీలనే గత్యంతరం లేక తిరిగి ఎన్ను కుంటారా? లేదా భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తూ ఒక కొత్త ప్రత్యామ్నాయానికి అవకాశం ఇస్తారా? జవాబు ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలకు కూడా ఒక ముఖ్య సంకేతంగా నిలుస్తుంది. మన దేశంలో మహానగరాలు ఎంత అధ్వానమైన స్థితిలో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఢిల్లీకి రండి. ప్రభుత్వం పరిష్కారంలో భాగస్వామి కావడానికి బదులు సమస్యకు మూలం కావడం అంటే ఏమిటో చూడాలనుకుంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను చూడండి. దీనిని మార్చడంలో ప్రజాస్వామిక ప్రక్రియగా ఎన్నికలు సైతం ఎందుకు విఫలమవుతున్నాయో అర్థం చేసుకోవాలనుకుంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను పరిశీలించండి. మూడు ప్రభుత్వాల మహా నగరం మన నగరాలలో, మహానగరాలలో ప్రభుత్వం అనేది ఒక పజిల్ లాంటిది. ఎవరిపై ఏ బాధ్యత ఉందో, ఎవరి అధికార పరిధి ఏమిటో అధికారులకు తప్ప మరో మానవుడికి తెలియదు. ఢిల్లీవాసులకు అది ఒక నగరం. కానీ ఈ ఒక్క నగరంలో ఏక కాలంలో మూడు ప్రభు త్వాల పాలన నడుస్తుంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర పాలన, ముఖ్యమంత్రి ద్వారా రాష్ట్ర పాలన, మేయర్, కమిషనర్ల ద్వారా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాలన. భూముల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం తర ఫున డీడీఏ పర్యవేక్షిస్తుంది. భవనాల నిర్మాణాలకు కార్పొరేషన్ అనుమతి మంజూరు చేస్తుంది. కానీ దానికి సంబంధించిన నియమాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. గల్లీ రోడ్లు నిర్మించే పనిని కార్పొరేషన్ చూసుకుంటుంది. కొన్ని ప్రాథమిక పాఠశాలలు, ఆసుపత్రులు కార్పొరేషన్ నిర్వహణలో ఉంటాయి. కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం చూసుకోగా, మరి కొన్నింటిని నేరుగా కేంద్రమే చూసు కుంటుంది. మురుగు కాల్వలు మొదలయ్యే చోట బాధ్యత కార్పొరేషన్‌ది కాగా, అవి అంతమయ్యే దశలో ఆ తలనొప్పిని భరించేది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి, ఇలాంటి గందరగోళం మధ్య ప్రభుత్వం నడపడం కన్నా ఖోఖో ఆడుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది స్పష్టం. ఎవరికీ పట్టని సామాన్యుని గోడు ఇలాంటి పరిస్థితిలో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో గత సంవత్సర కాలపు అను భవం నుంచి అర్థం చేసుకోవచ్చు. నిరుడు వర్షాకాలం తర్వాత ఢిల్లీలో డెంగ్యూ, చికున్‌గున్యా వంటి అంటు వ్యాధులు ప్రకోపించాయి. ప్రభుత్వ లెక్కల్లో కేవలం 15 వేల మందికి ఈ వ్యాధులు సోకినట్టు నమోదైనా, వాస్తవానికి వీటి బారిన పడ్డవారి సంఖ్య 35–40 వేల దాకా ఉంటుంది. తగిన వేతనాలు లభించక పోవడం మూలంగా పారిశుధ్య కార్మికులు పలుమార్లు సమ్మె చేశారు. తూర్పు, ఉత్తర ఢిల్లీలలోని రోడ్లపై చెత్త కుప్పలు పేరుకుపోయాయి. చలికాలం మొదలవుతూనే వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని సైతం మించిపోయింది. ఆ రోజుల్లో ఢిల్లీలో నివసించే ప్రతి వ్యక్తీ నలభై సిగరెట్లకు సమానమైన పొగను పీల్చాల్సి వచ్చింది. ఐఐటీ నిర్వ హించిన పరిశోధనలో ఢిల్లీలో కాలుష్య దుష్ప్రభావం ఫలితంగా గత సంవత్సరం 50 వేల మరణాలు సంభ వించాయని తేలింది. ఈ మహానగరంలో ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. పరిస్థితులు ఇంత ప్రమాదకరంగా ఉన్నా ప్రభు త్వాలు ఇంకా మేల్కోవడం లేదు. ఢిల్లీ నగరాన్ని నడి పించాల్సిన బాధ్యత గల నేతలూ, అధికారులంతా తమ తమ జేబులు నింపుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు లేదా పరస్పర రాజకీయ దూషణల్లో మునిగి ఉన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అంతమొందించేందుకు సుప్రీంకోర్టు ఒక ఏడాది క్రితం 42 మార్గదర్శకాల్ని జారీ చేసింది. కానీ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, బీజేపీ చేతిలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వీటిలో ఒక్క మార్గదర్శకాన్నయినా సరిగా అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం కోసం ఢిల్లీకి రూ. 336 కోట్లు కేటాయించగా, మూడు మునిసిపల్ కార్పొ రేషన్లు కలసి ఖర్చు చేసింది కేవలం రెండు కోట్లు మాత్రమే. ఢిల్లీలో డెంగ్యూ, చికున్‌గున్యా విలయ తాండవం చేస్తున్న రోజుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన వైద్యం కోసం బెంగళూరు వెళ్లగా, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను అధ్యయనం చేయడం కోసం అక్కడకు వెళ్లారు. అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అమెరికా పర్యటనను ముగించుకొని రాగా, ఉత్తర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యూరప్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ నగరం మురికికీ, రోగాలకూ నెలవుగా మారిపోతోంది. ప్రభుత్వాలూ, పార్టీలూ నువ్వంటే నువ్వంటూ పరస్పర నిందారోపణల్లో మునిగి తేలు తున్నాయి. స్థానిక ఎన్నికలకైనా గుర్తురాని పౌర సదుపాయాలు ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగితే ఏం జరుగు తుంది? అన్ని పార్టీలూ ఢిల్లీలో మురికీ, చెత్తా లేకుండా చేయడానికి సంబంధించిన పథకాల్ని ప్రతిపాదించ వచ్చనీ, మురికికి తావులేని ఢిల్లీ అనే నినాదంతో కార్య క్రమాల్ని చేపట్టవచ్చనీ మీరు భావిస్తున్నారు కదా! కానీ ఏప్రిల్ 23న జరుగనున్న మున్సిపల్ ఎన్నికల తీరు తెన్నులెలా ఉన్నాయో గమనించండి. ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలోని 273 వార్డులకు ఎన్నికలు జరుగ బోతున్నాయి. రానున్న ఐదేళ్లలో నగరం స్వరూప స్వభావాల్లో రాగల మార్పు లేమిటో నిర్ణయించు కోవా ల్సిన తరుణమిదే. కానీ పెద్ద పార్టీలన్నీ మురికి, పారి శుధ్యం వంటి సమస్యలు మినహా అప్రధానమైన విష యాలన్నింటి గురించీ మాట్లాడుతున్నాయి. పదే ళ్లుగా మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏలుతున్న బీజేపీ ఈ దుస్థితికి తనదే బాధ్యత అని గుర్తించడానికి బదులు మోదీ వెల్లు వను అడ్డు పెట్టుకొని గెలుపు కోసం ప్రయ త్నిస్తోంది. అపఖ్యాతి పాలైన కార్పొరేటర్లను వదిలించుకోవడానికి బీజేపీ పాత కార్పొరేటర్లందరికీ టికెట్లు నిరాకరించే ఎత్తు గడను చేపట్టింది. ఈ కసరత్తుతో ప్రజలు బీజేపీ ఆధ్వ ర్యంలో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అసమర్థతలనూ, మురికినీ, చెత్తనూ, అవినీతినీ మర్చిపోతారని అది ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గత రెండేళ్లలో చేశామని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అందుకే అది కూడా రోజుకో కొత్త హామీతో ముందుకొస్తోంది. తమ పార్టీ గెలిస్తే ఇంటి పన్నును రద్దు చేస్తుందనీ, పాత బకాయిల్ని మాఫీ చేస్తుందనీ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీని వల్ల పేదలకు ఒరిగే లాభ మేమీ లేదు. ఎందుకంటే గుడిసెల్లో నివసించే వారు, అధికారిక గుర్తింపులేని కాలనీల్లో ఉండేవారు అసలు ఇంటి పన్ను కట్టనే కట్టరు. కానీ ఈ ఇంటిపన్ను మాఫీ పథకంతో మున్సిపల్ కార్పొరేషన్ నడుం విరగడం మాత్రం ఖాయం. పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడానికే అగచాట్లు పడుతున్న కార్పొరేషన్ ఈ మాఫీతో దివాళా తీయక తప్పదు. ఇంతవరకు ఏదో మేరకు జరుగుతున్న పనులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఎన్నికల్లో ఓటమి తప్పదనే అంచ నాతో, నిరాశ మూలంగానే కేజ్రీవాల్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పోటీ పడుతోంది–అరిగి పోయిన అవే వాగ్దానాలతో, ఓటమి అలుముకున్న అవే ముఖాలతో. రాజధాని ఓటరు కొత్త దారి పట్టేనా? ఒక నగరానికి మూడు ప్రభుత్వాలు, మూడూ వైఫల్యా నికి నిలువెత్తు నిదర్శనలే! కాబట్టి ఇప్పుడు ఓటరు ఏం చేయబోతున్నాడనేది అసలు విషయం. సాధారణంగా ఢిల్లీలో మునిసిపల్ ఎన్నికల్లో పెద్దగా ఉత్సాహం కని పించదు. ప్రజలు తమ జీవనంతో నేరుగా ముడివడి ఉన్న ఈ ఎన్నికలపట్ల అతి తక్కువ ఆసక్తిని చూపుతారు, పోలింగూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా ప్రజలు ఎన్నికల్లో ఉదాసీనంగా వ్యవహరించి, ఆ తర్వాత ఫిర్యాదులు చేస్తారా? లేదా ఢిల్లీని ఈ దుస్థితి లోకి నెట్టిన పార్టీలనే గత్యంతరం లేక మరోసారి ఎన్ను కుంటారా? లేదా ఢిల్లీ ప్రజలు తిరిగి ఆ పాత బాటనే సాగడానికి బదులు భవిష్యత్తు వైపు ముందడుగు వేస్తూ ఒక కొత్త ప్రత్యామ్నాయానికి అవకాశం ఇస్తారా?. ఈ ప్రశ్నకు జవాబు ఢిల్లీతో పాటు దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన సంకేతంగా నిలు స్తుంది. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter : @_YogendraYadav -
బజారుపాలవుతున్న భారతం
రెండో మాట ‘తెలుగుదేశం–బీజేపీ’ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న కాంట్రాక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరువును ఏ స్థాయిలో ఎండగడుతున్నాయో మకీ సంస్థ ప్రకటనతో వెల్లడైంది. ‘పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం’ ఈ పని చేశారని మర్యాద పూర్వకంగా ‘మకీ’ హెచ్చరించింది. ‘ఏపీ సర్కారు తీరు దేశ ప్రతిష్ఠకే విఘాతం కల్గించిందని’ కూడా విమర్శించింది. బిడ్డింగ్‌లో ఆఖరి జాబితాలో ఆఖరివాళ్లుగా ఉన్న ‘పోస్టర్ కాంట్రాక్టర్, హఫీజ్ కాంట్రాక్టర్లను రహ స్యంగా ఎంపిక చేసి, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమను తప్పించారని మకీ వెల్లడించింది. ‘అవినీతి అంటే మనకు కంపరం పుడుతోంది. అందుకే మనం దేశంలో మార్పును కోరుకుంటున్నాం. కానీ మనం ఆశిస్తున్న ఆ మార్పు ఆకర్షణీయంగా లేదు. నోట్ల రద్దులో చిత్తశుద్ధి లేదు. నల్లధనమంతా విదేశాలలోనే పోగుపడి ఉంది. నాయకులలో అభద్రతాభావం వల్ల వ్యవస్థలు బలహీనపడుతున్నాయి. దేశాన్ని పాలించే వారిని ఎన్నుకోవడం దగ్గర ఇక జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పొగిడే పని ఇతరులకు కూడా ఇవ్వకుండా తనను తానే పొగుడుకునే వాడు, తన సామర్థ్యం గురించీ, రూపాన్ని గురించీ తనకు తానే కీర్తించుకునే నాయకులున్నచోట మనం జాగ్రత్తగా ఉండాలి.’ – అరుణ్‌శౌరీ (హైదరాబాద్ సాహిత్య సమ్మేళనంలో. 28–1–2017) ‘దేశంలో నన్ను మించిన సీనియర్ నాయకుడు ఎవరూ లేరు. నా పార్టీ ఎంపీల బలంతోనే వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పడింది. ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి దాకా అందరినీ నేనే ఎంపిక చేసేవాడిని. విదేశాల్లో నాకు ఎంత బ్రాండ్ ఇమేజ్ పెరిగిందో అర్థం చేసుకోవాలి. అసలు ప్రపంచం మొత్తాన్ని అనుసంధానిస్తే దావోస్‌నే ఇక్కడికి తీసుకొస్తా.’ – ఏపీ సీఎం చంద్రబాబు (విశాఖ సీఐఐ శిఖరాగ్ర సభ సందర్భంగా విలేకరుల సమావేశంలో, 28–1–2017) మన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలలో ఉన్న గాడి తప్పిన పాలకుల గురించి ప్రఖ్యాత పత్రికా రచయిత అరుణ్ శౌరీ బాహాటంగానూ, నర్మగర్భంగానూ ప్రస్తావించిన అంశాలు, చేసిన విమర్శలు ప్రధాని నరేంద్ర మోదీకీ, ఇతరులకీ కూడా వర్తిస్తాయి. దేశంలో మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం. కానీ ఆ మార్పు ఎంతమాత్రం సానుకూలంగా లేదని శౌరీ వ్యాఖ్య. ఈ ప్రస్తావనలో ముసోలినీ (ఇటలీ నియంత), నియంతల తీరును మరపించిన ఇందిరా గాంధీలతో పాటు నేటి ప్రధాని మోదీనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నూ ఆయన పరోక్షంగా పేర్కొనడం విశేషం. అంతేకాదు, ‘మార్పు కోసం దేశ యువశక్తి జరిపే సబబైన పోరాటం కోసం నేను ఎదురు చూస్తు న్నా’నని కూడా అన్నారు. రెండు వికృతులు, రెండు గ్రంథాలు గతంలో బీజేపీ మంత్రివర్గంలో పనిచేసిన శౌరీ ఆ విధానాలతో విసిగిపోయి వేరయ్యారు. ఆయన మాటల్లోని సారాన్ని మాత్రం గ్రహించాలి. శౌరీ విమర్శలకు బలం చేకూరుస్తూ ‘ది హిందు’ పత్రికా రచయిత, గ్రంథకర్త జోసీ జోసఫ్ హైదరాబాద్ సాహిత్య సమ్మేళనంలోనే ప్రసంగించారు. ‘దేశంలో ఇవాళ అన్ని రంగాలలోను దళారీ వ్యవస్థ పాతుకుపోయింది. న్యాయ వ్యవస్థ సహా రాజకీయ, ఆర్థిక, వ్యాపార రంగాల వరకు దేశాన్ని అమ్మకానికి పెట్టేందుకు కూడా ఈ దళారీ వ్యవస్థ సిద్ధంగా ఉంది. ఒక మాఫియాలా మారిన రాజకీయ రంగం దళారులపైనే ఆధారపడి పాలనను నిర్వహిస్తున్నది’ అని జోసఫ్ విశ్లేషించవలసి వచ్చింది. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత కూడా ఇదీ ఈ దేశం పరిస్థితి. ఈ స్వదేశీ, విదేశీ దళారీ వ్యవస్థల మూలంగా మన వ్యవస్థలకు పట్టిన పీడ, చీడ ఇంతగా విస్తరించడానికి కారణం–1991లో ప్రపంచ బ్యాంక్ సంస్కరణలను పాలకులు బేషరతుగా అమలులోకి తేవడమే. ఇదే అంశాన్ని ఇటీవల కాలంలో రెండు గ్రంథాలు బహిర్గతం చేశాయి. వాటిలో మొదటిది– ‘ఇండియా ఈజ్ ఫర్ సేల్’ (అమ్మకానికి భారతదేశం). బొఫోర్స్ ట్యాంకుల కుంభకోణాలను వెల్లడిస్తూ, వాటి గురించి వ్యాఖ్యానిస్తూ చిత్రా సుబ్ర హ్మణ్యం రాసిన పుస్తకమిది. రెండు–‘ఇండియా ఈజ్ ఆన్ సేల్’. జోసఫ్ తాజాగా రాసిన గ్రంథమిది. హైదరాబాద్ సాహిత్య సమ్మేళనంలో ఆవిష్కరించారు. ప్రపంచ బ్యాంక్ ఆశీస్సులతో తుచ తప్పకుండా ఒంట బట్టించు కుని రాముడు మంచి బాలుడు అన్న తీరులో వాటిని పాటిస్తున్న మహానేతలు మోదీ, చంద్రబాబుల విధానాలే ఈ రెండు గ్రంథాల సారం. నిజానికి ఆ ఇద్దరిదీ గుజరాత్ నమూనాయే. అయితే ఒకరిది (బాబు) దావోస్ మార్గం ద్వారా వయా ప్రపంచ బ్యాంక్ దోపిడీ అమలు జరుపుతుంది. మరొకరిది (మోదీ) ‘భారతదేశంలోనే తయారీ’ (మేక్ ఇన్ ఇండియా) నినాదం చాటున విదేశీ గుత్త సంస్థలే వస్తూత్పత్తి లేదా సరుకులను ఇండియాలో తయారు చేసి పెట్టే వ్యూహం. అంటే రాయి ఏదైనా ఊడగొట్టేది మన పళ్లనే. బాదరాయణ బంధం ప్రపంచ బ్యాంక్, (+ఐఎంఎఫ్) సంస్కరణల ఉద్దేశం ఏమిటి? ప్రపంచ కుబే రులను ఏటా దావోస్ శీతల డోలికల్లో సమావేశపరచం ఎందుకు? కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థల వ్యాపార, వాణిజ్య సుస్థిరతల కోసమేగానీ ఇండియా, ఆసియా–ఆఫ్రికా, లాటిన్ అమెరికా వర్ధమాన, బడుగు దేశాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని సుస్థిరం చేయడానికి కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం రిపబ్లికన్–డెమోక్రాటిక్ పార్టీల నాయకులు ఎలాంటి ఎత్తులు వేస్తారో, ఇండియా లాంటి వర్ధమాన దేశాల పాలకులు కూడా వాటికే అలవాటుపడ్డారు. చిత్రా సుబ్రహ్మణ్యం గ్రంథంలో ముందస్తు హెచ్చరికలు చేయడం ఈ నేపథ్యంతోనే: ‘పశ్చిమ దేశాలకు మన వస్త్ర పరిశ్రమ ఉత్ప త్తులను (టెక్స్టైల్స్) వారి నిర్బంధాలవల్ల ఎగుమతి చేయలేకపోతున్న సమ యంలో కాలిఫోర్నియా (అమెరికా) నుంచి బాదంను దిగుమతి చేసుకుంటున్నాం. మనం ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేసుకోగల బాదంపప్పును ఎందుకు దిగుమతి చేసుకోవాలో ఏ ఆర్థికమంత్రిగానీ, వాణిజ్య శాఖ మంత్రి గానీ ఏనాడూ వివరించలేదు. ఒక మంత్రి మాత్రం ఆల్మండ్ దిగుమతులకు కారణాల్ని వివరించలేనంటూనే అసలు విషయాన్ని బయటపెట్టాడు: ‘అవును, రోనాల్డ్ రీగన్ (అమెరికా అధ్యక్షుడు) ఎన్నికల్లో గెలవాలి కాబట్టి అమెరికా బాదం ఎగుమతుల్ని ఇండియా దిగుమతి చేసుకుని తీరాలి. అమె రికా అధ్యక్ష ఎన్నికలకు, ఇండియాకు, బాదం ఎగుమతులకు లంకేమిటి? ఆ గుట్టు మీకు తెలియదు, తెలివిగల మేధావి కూడా అర్థం చేసుకోలేడు. ఆ రహస్యం అమెరికా, యూరప్ పాలకుల ప్రీత్యర్థం వారిని బుజ్జగించేందుకు తహతహలాడే కొలదిమంది అధికారుల రహస్య ఒప్పందాలకే పరిమితం. అంతే, దాంతో ప్రపంచబ్యాంకు దాని అనుబంధ సంస్థలుగా వర్ధిల్లుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ (పాత గ్యాట్ సంస్థ) నుంచి న్యూఢిల్లీకి ఒక్క టెలిఫోన్ కాల్ వస్తే చాలు ఢిల్లీ పాలకులు గజగజలాడుతూ ఆ ఆదేశాలు పాటించడం పరిపాటి. ఈ మంతనాలన్నీ ఇండియాను సంతలో అమ్మకానికి పెట్టడం కోసమే, భారత సంపదను కాస్తా ఊడ్చి పెట్టడానికే’ (చిత్ర పుస్తకం– పే. 105–106). ఇప్పుడీ వరసలోనే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధినేత దావోస్ ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’కు చంద్రబాబు వెంట వెళ్లి తిరిగొచ్చి చేసిన పని, అదే సీఐఐ అధినేత ఆధ్వర్యంలో మళ్లీ ‘అవగాహన పత్రాల’ పేరుతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడమే. ముందు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలతో రూ. 5,000 కోట్ల పెట్టబడులకు ‘అవగాహన’ ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చు కున్నారేగానీ, అవేవీ ఆచరణలో ప్రతిఫలించలేదు. అయితే ‘ప్రతిపాదిత 80 పరిశ్రమలు కార్యరూపం దాలిస్తే’ మరో రూ. 15 వేల కోట్ల ఒప్పందాలు ఖరా రయ్యే ‘అవకాశం’ ఉందట. అంటే ఏదీ ‘కార్యరూపం’ దాల్చకుండానే చంద్ర బాబు రాజధాని ముసుగులో ఆశల పల్లకీమీద ప్రజల్ని ఎక్కించే చిట్కాలు కనిపెడుతున్నారు. ప్రపంచీకరణ మాటున అసమానత సరిగ్గా ఈ సమయంలోనే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ ప్రసిద్ధ వాస్తు శిల్ప నిర్మాణ సంస్థ ‘మకీ అండ్ అసోసియేట్స్’(జపాన్)తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎలాంటి వివరణ, నోటీసు లేకుండానే అర్ధాంత రంగా చంద్రబాబు రద్దు చేశారు. చివరికి దీనిని పర్యవేక్షిస్తున్న కేంద్రీయ సంస్థకు కూడా తెలియకుండా కాంట్రాక్టును రద్దు చేసినట్టు మకీ అసోసి యేట్స్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘తెలుగుదేశం–బీజేపీ’ ప్రభుత్వం కుదుర్చుకుంటున్న కాంట్రాక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరు వును ఏ స్థాయిలో ఎండగడుతున్నాయో మకీ సంస్థ ఆకస్మిక ప్రకటనతో వెల్లడైంది. ‘పెద్దల స్వార్థ ప్రయోజనాల కోసం’ ఈ పని చేశారని మర్యాద పూర్వకంగా ‘మకీ’ హెచ్చరించింది. ‘ఏపీ సర్కారు తీరు దేశ ప్రతిష్ఠకే విఘాతం కల్గించిందని’ కూడా విమర్శించింది. బిడ్డింగ్‌లో ఆఖరి జాబితాలో ఆఖరివాళ్లుగా ఉన్న ‘పోస్టర్ కాంట్రాక్టర్ (లండన్), హఫీజ్ కాంట్రాక్టర్లను రహస్యంగా ఎంపిక చేసి, ఖరారైన పనులు అప్పగించే సమయానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తమ సంస్థను తప్పించారని మకీ వెల్లడించింది. నిజానికి సమాచార మాధ్యమాల అధ్యయనాలను చూసినా, ఏ ప్రతిష్టా త్మక సంస్థల అంచనాలను చూసినా– అమరావతి రాజధాని కాంట్రాక్టు సహా మొత్తం 40 ప్రాజెక్టులకు నిర్మాణ సారథ్యం వహిస్తున్న ‘మకీ’ సంస్థ 17 అంత ర్జాతీయ పురస్కారాలు అందుకుంది. మన్హాటన్ (అమెరికా)లో 33 కోట్ల డాల ర్లతో ఐక్యరాజ్య సమితి తలపెట్టిన విస్తరణ విభాగాన్ని నిర్మించి కితాబులందు కున్న సంస్థ ‘మకీ’. పునర్జన్మ పొందిన ప్రపంచ వాణిజ్య సముదాయం ‘టవర్–4’ నిర్మాతలు మకీ అసోసియేట్స్. అన్నింటికన్నా విశేషం–బీజేపీ పాలిత రాష్ట్రమైన ‘మధ్యప్రదేశ్ మోడల్’ను ప్రతివారూ ఆదర్శంగా తీసుకో వాలని పెట్టుబడిదారీ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సీఐఐ సంచాల కుడు చంద్రజిత్ బెనర్జీ ప్రచారం చేశాడు. ఈ చర్యతో అతడు మోదీ ప్రచారకర్త అని సదస్సులో కొందరు భావించడం కొసమెరుపు. ‘వ్యాపార సంస్కృతిని సుకరం (ఈజ్ ఆఫ్ బిజినెస్) చేయడం’ లేదా వ్యాపారాభివృద్ధిని సానుకూలం చేయడం, లేదా ఇండియాలోనే విదేశీ కంపె నీలొచ్చి వస్తూత్పత్తి కార్య క్రమాలు నిర్వర్తించి పెట్టడం అనే సరికొత్త వ్యాపార నినాదాలు ఏమైనా– ఆధునిక పరిభాషలో ప్రభుత్వ రంగాన్ని కూల్చి ప్రైవేట్ రంగం లాభాలకు మార్గనిర్దేశాలుగానే భావించాలి. కరెన్సీ విలువల్ని తారు మారు చేసి ఆసియా సంక్షోభాలకు కారకుడైన జార్జి సోరెజ్ సహితం ‘గ్లోబ లైజేషన్ ద్వారా జరిగిన పని–ప్రైవేట్ ఉత్పత్తి సరకులకూ, పబ్లిక్‌రంగ ఉత్పత్తి అవకా శాల మధ్య వనరుల పంపిణీలో అస్తవ్యస్త వ్యవస్థకూ దారితీయడం. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సంపదను సృష్టించవచ్చుగానీ, సమాజ అవసరాల గురించి అది పట్టించుకో’దని చెప్పాడు. అందుకే వరల్డ్ బ్యాంక్ మాజీ అధి పతి సిగిజ్ కూడా, ‘గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచంలో అసమానత్వం పెచ్చరిల్లి పోతుంది!’ అన్నాడు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పెట్టుబడిదారులపైనే పాలకుల ప్రేమ
మహారాణిపేట (విశాఖపట్నం): పెట్టుబడిదారులు, మాఫియాదారులే ప్రభుత్వాలకు మూలస్తంభాలుగా మారారని, అలాంటి వారి వ్యాపారాల కోసం పాలకులు ప్రజల భూములను లాక్కుంటున్నారని కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇ.ఎ.ఎస్.శర్మ విమర్శించారు. మాఫియాదారుల వ్యాపార లావాదేవీల కోసం పచ్చని పంటలు పండే రైతుల భూములను పణంగా పెడుతున్న పాలకుల తీరుపై ఆయన ధ్వజమెత్తారు. మానవహక్కుల వేదిక విశాఖ జిల్లా 5వ మహాసభల సందర్భంగా సిరిపురం బిల్డర్స్ అసోషియేషన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శర్మ ప్రసంగించారు. అమరావతిలో ప్రభుత్వం కడుతున్న రాజధాని కార్పొరేట్ రాజధానా.. ప్రజా రాజధానా పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. రూ.లక్షల కోట్లతో వేల ఎకరాల్లో కడుతున్న రాజధానిలో సామాన్య ప్రజల జీవనానికి ఎంతవరకూ చోటుంటుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇద్దరూ ఎన్ఆర్ఐలేనని శర్మ వ్యంగ్యంగా అన్నారు. వీరిద్దరు డబ్బులు దండుకోవడానికి మాత్రమే విదేశాల్లో ఎన్ఆర్ఐలు, ఆ దేశ ప్రతినిధుల చుట్టూ చెక్కర్లు కొడుతున్నారన్నారు. అక్కడకు వెళ్లి స్మార్ట్‌సిటీ, వైఫై అంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా వారు చేస్తున్నారా అని ప్రశ్నించారు. విదేశాలకు వెళ్లినపుడు పేదప్రజలకు ఇబ్బందులు కలిగించే పర్యావరణ విధ్వంసం, ఉపాధి వంటి సమస్యలు ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడాలేవన్నారు. హుద్‌హుద్ తుపాను వెళ్లి తొమ్మిది నెలలు గడుస్తున్నా విశాఖనగరంలో ఇంతవర కు 15శాతం లబ్ధిదారులకు మాత్రమే రూ.5వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చారని, మిగతా 85 శాతం మంది ఇంకా అధికారులు వచ్చి తమ పేర్లు నమోదు చేయించుకుంటారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల ఉపాధ్యక్షుడు ఎ.చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. సమావేశంలో మానవహక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు ఎం.శరత్, పలువురు ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాలన పట్టదా ?
ఇద్దరు కేబినెట్ మంత్రులు. మరో ముగ్గురు అదేస్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు. మండల పరిషత్‌లు మొదలుకుని జిల్లా, రాష్ట్రస్థాయిలోనూ వారిదే అధికారం. కానీ జిల్లాకు సంబంధించిన కీలక సమీక్షల్లో కనిపించరు. ఎన్నికై నెలలు గడుస్తున్నా ఏనాడూ పాలనాపరమైన సమీక్షల్లో పాల్గొనరు. వచ్చినా మొక్కుబడి హాజరుకే పరిమితం. ఇలాగైతే పాలన పట్టాలెక్కేదెట్ల్లా..? సమస్యలు పరిష్కారమయ్యేదెలా..? సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సుమారు ఏడాది తర్వాత శనివారం జరిగిన విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ సమావేశం మొక్కుబడిగా సాగింది. నాగర్‌కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీకి మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి కో చైర్మన్. కేంద్రం నిధులతో జిల్లాలో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించడం ఈ సమావేశం లక్ష్యం. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం వంటి కీలక ప్రభుత్వ శాఖల పరిధిలో అమలయ్యే వివిధ ప్రభుత్వ పథకాలను ప్రతి మూడు నెలలకోమారు సమీక్షించడం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బాధ్యత. రాష్ట్ర విభజన, ఎన్నికలు, కమిటీ నూతన చైర్మన్ నియామకం తదితర కారణాలతో సమీక్ష సమావేశం సుమారు ఏడాది కాలంగా వా యిదా పడుతూ వస్తోంది. ఇటీవల పార్లమెంటు సమావేశాలు ముగియడంతో ఎట్టకేలకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహణకు ముహూర్తం కు దిరింది. అయితే ఈ సమావేశానికి అధికార పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మినహా మిగతా ప్రజాప్రతినిధులు హాజరు కాలేదు. కమిటీ ఛైర్మన్ నంది ఎల్లయ్యతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్ పాల్గొన్నా రు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎ మ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో సుమారు ఆరు గంటల పాటు సాగాల్సిన సమావేశం గంటన్నర వ్యవధిలో ముగిసింది. ఎజెండా అంశాలు అన్నింటినీ స్పృషించకుండానే మొ క్కుబడిగా సమీక్ష జరిగింది. మంత్రులు లేనప్పుడు తాము వివిధ అంశాలను లేవనెత్తినా ప్రయోజనం ఏముందంటూ విపక్ష సభ్యులు అసహనం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని ముగించారు. సంపూర్ణ సమీక్షలేవీ..? నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచినా జిల్లాలో నెలకొన్న వివిధ సమస్యలపై నేటికీ విభాగాల వారీగా సంపూర్ణ సమీక్షలు జరగడం లేదు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాలు ఇటీవలి కాలంలో రాజకీయ ప్రసంగాలతో పార్టీల నడుమ ఆధిపత్య పోరుకు వేదికగా మారాయి. ఇన్నాళ్లూ జిల్లా నుంచి మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేకపోవడం, ఇన్చార్జి మంత్రులు లేకపోవడంతో అధికారులపైనే ఆధారపడి పాలన సాగుతోంది. కరువు, వలసలు, రైతు ఆత్మహత్యలు, మార్కెటింగ్ సమస్యలు, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, సాగు, తాగునీటి ప థకాల పనుల్లో ఆలస్యం, ఇళ్ల నిర్మాణ బిల్లుల పెం డింగు, అక్రమ ఇసుక రవాణా ఇలా సమస్యల జా బితా చాంతాడును తలపిస్తోంది. మరోవైపు జిల్లా క లెక్టర్, జాయింట్ కలెక్టర్, వివిధ విభాగాల సిబ్బంది నడుమ సమన్వయ లోపం కూడా పాలనపై ప్ర భావం చూపుతోంది. ప్రభుత్వం నుంచే తక్షణ ఆదేశాల అమలుపై సంబంధిత విభాగాల అధికారులు కొద్ది రోజులు ఉరుకులు, పరుగులు పెడుతూ హడావుడి చూపిస్తున్నారు. కానీ వివిధ విభాగాల పని తీరును క్రమం తప్పకుండా సమీక్షించడంలో జిల్లా కలెక్టర్ చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు, సిబ్బందిని విశ్వాసంలోకి తీసుకోకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదే అదునుగా అధికారులు కూడా మొక్కుబడి నివేదికలతో సమావేశాలకు వస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాలన యంత్రాంగం తీరుపై దృష్టి సారించక పోవడంతో సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. దీంతో పాలనను పట్టాలెక్కించే నాథుడి కోసం జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. -
స్వచ్ఛ కర్నూలే లక్ష్యం!
సుందర నగరంగా కర్నూలును తీర్చిదిద్దారాయన. నగరంలోని ప్రధాన కూడళ్లలో వాటర్ ఫౌంటేన్లు, రహదారుల మధ్యలో డివైడర్లు, వాటి మధ్య అందమైన పూల మొక్కలు, గోడలకు అందమైన బొమ్మలు.. ఇలా నగరానికి ఓ సరికొత్త రూపును తీసుకొచ్చారు. పరిపాలనలో పారదర్శకత.. ఆధునిక సాంకేతిక వినియోగంతో నగరాభివృద్ధికి కృషి చేశారు. పాలనలో సంస్కరణలు చేపట్టి కార్పొరేషన్‌కు ఆదాయాన్ని సమకూర్చిపెట్టారు. తన కార్యాలయం నుంచే విద్యుత్ పొదుపుకు శ్రీకారం చుట్టారు. రూ. 12 కోట్ల ఆధునిక టాయిలెట్లు, పీపీపీ విధానంలో సులభ్ కాంప్లెక్స్‌లు నిర్మించారు. నగరంలో 8 చోట్ల బయో టాయిలెట్లను ఏర్పాటు చేశారు. రూ. 40 లక్షలు వెచ్చించి 10 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టారు. అలాగే మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూడలేక కోటి రూపాయలు వెచ్చించి మున్సిపల్ పాఠశాలల్లో బెంచీలు ఏర్పాటు చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. ఎస్ఎస్ఏ సహకారంతో 100 అదనపు తరగతుల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో టాయ్లెట్లు, బాత్రూమ్ల నిర్మాణం చేశారు. కార్పొరేషన్‌కు సంబంధించిన ఖాళీ స్థలాలను గుర్తించి అవి అన్యాక్రాంతం గాకుండా పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దె చెల్లింపులకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. చెత్తను తీసుకెళ్లే వాహనాల పర్యవేక్షణకు వెహికల్ ట్రాకింగ్ విదానం ప్రవేశపెట్టి ఖర్చును తగ్గించారు. ట్రాఫిక్ నియంత్రణకు సెంట్రల్ లైటింగ్‌తో కూడిన డివైడర్ల ఏర్పాటు, మద్యం తాగి డ్రైవింగ్ చేసే వారి ఆటకట్టించే బ్రీత్ అనలైజర్లను కొనుగోలు చేసి పోలీసుల శాఖకు అందజేశారు. కర్నూలు కమిషనర్‌గా ఇటీవల మూడేళ్లు పూర్తి చేసుకున్న పీవీవీఎస్ మూర్తి నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. ఇందిరాగాంధీ స్మారక నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. వారు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నగరాన్ని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. కమిషనర్ : నమస్కారమండీ.. నా పేరు పీవీవీఎస్ మూర్తి. కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌ను. నగరపాలక సంస్థ పాఠశాలల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. హెచ్ఎం గారూ... మీ పాఠశాల ఎలా ఉంది. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారు, మీ పాఠశాలలో ఏవైనా సమస్యలున్నాయా..? హెచ్ఎం : మా పాఠశాలలో ప్రైమరీ, హైస్కూల్ కలిపి దాదాపు 1600 మంది విద్యార్థులు చదువుతున్నారు. మున్సిపల్ స్కూళ్లల్లో ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాల ఇదే. ఈ పాఠశాలలో సమస్యలు కూడా చాలానే ఉండేవి. అయితే కార్పొరేషన్ అధికారుల చొరవతో ఒక్కో సమస్య పరిష్కారమైంది. పాఠశాలలో విద్యార్థులకు టాయ్‌లెట్స్, తాగు నీరు కల్పించారు. ఆడుకోవడానికి వీలుగా మైదానాన్ని చదును చేయించారు. పాఠశాలలో పచ్చదనం పెంపొందించేందుకు డాక్టర్ తిరుపాల్‌రెడ్డి సహకారంతో మొక్కలు కూడా పెంచడంతో పాఠశాల ఆహ్లాదంగా ఉంది. మున్సిపల్ గ్రాంట్స్‌ను సక్రమంగా ఉపయోగించుకుంటూ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పిల్లలకు టీవీలో డాక్యుమెంటరీ కూడా చూపిస్తున్నాం. అర్హులైన ఉపాధ్యాయులుండటం, సమిష్టిగా అందరూ పనిచేయడం వల్ల 80 శాతం పైగా ఫలితాలు సాధిస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న ప్రైవేటు పాఠశాలల్లో మానేసి మా బడికి విద్యార్థులు వస్తున్నారు. పాఠశాలల వేళలు పెంచాలి. అప్పుడు మరిన్ని విజయాలు సాధించి తీరుతాము. కమిషనర్ : ఓకే.. మీరు మీ పాఠశాల గురించి బాగా చెబుతున్నారు. అది నిజమో కాదో మీ విద్యార్థులను అడిగి తెలుసుకుందాం.. ఏమ్మా(10వ తరగతి విద్యార్థినితో) మీ పాఠశాల ఎలా ఉంది. రెండేళ్ల నుంచి ఏమైనా మార్పులు వచ్చాయా..? విద్యార్థిని : సార్ నేను బి సెక్షన్లో చదువుతున్నా. క్లాసులు బాగా నడుస్తున్నాయి. సారు వాళ్లు బాగా వస్తున్నారు. చదువు బాగా చెబుతున్నారు. పాఠశాలలో మొక్కలు పెంచడం వల్ల పచ్చదనం కారణంగా ప్రశాంత వాతావరణం ఉంది. కమిషనర్ : పాఠశాలలో ఆడపిల్లలకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి? విద్యార్థిని : గతంలో ఈ పాఠశాలలో విద్యార్థినిలకు బాత్రూంలు సరిగ్గా ఉండేవి కావు. బాత్రూంలు శుభ్రం చేసేవారు కాదు. దీనికితోడు నీళ్లు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. ఇప్పుడు ఆ సమస్య తీరింది. తాగడానికి ఇక్కడే మంచినీరు లభిస్తోంది. కమిషనర్ : మరో విద్యార్థినితో.. ఏమ్మా నీ పేరేమిటి? విద్యార్థిని : నా పేరు సుంకులమ్మ సార్. కమిషనర్ : మీ పాఠశాలలో చదువెలా చెబుతున్నారు? సుంకులమ్మ : సారు వాళ్లు బాగా చెబుతున్నారు. ట్యూషన్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే సాయంత్రం పూట స్టడీ అవర్స్ చెబుతున్నారు. సాయంత్రం వేళ చీకటి లేకుండా లైట్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. కమిషనర్ : పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, మెనూ ఏం ఇస్తున్నారు..? విద్యార్థిని : భోజనం బాగుంది. రోజూ అన్నం, సాంబారు, కర్రీ వడ్డిస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో గుడ్డు, పండు ఇస్తున్నారు. (మధ్యలో ఓ విద్యార్థిని కల్పించుకుంటూ...) విద్యార్థిని : సార్! పాఠశాలలో స్పీపర్ లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. ఒక్కోసారి మేమే క్లాస్‌రూమ్‌లు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. స్వీపర్‌ను నియమిస్తే బాగుంటుంది. హెచ్ఎం : సార్ మేమే ఒక స్వీపర్‌ను కాంట్రిబ్యూషన్ కింద నియమించుకున్నాం. ఆమె ఒక్కసారి వచ్చి ఊడ్చి వెళుతుంది. ఇంత పెద్ద పాఠశాలకు ఒకరు సరిపోరు. కమిషనర్ : నిజమే.. ఈ సమస్య అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉంది. మధ్యాహ్న భోజనం గురించి పిల్లలు బాగా చెబుతున్నారు. వారు చెబుతున్నది నిజమా కాదా.. వెళ్లి పరిశీలిద్దాం (మధ్యాహ్న భోజనం వండే ప్రాంతానికి వెళ్తూ) కమిషనర్ : ఏమ్మా ఇక్కడ ఎవరు వంట ఏజెన్సీ వారు. ఈ రోజు ఏఏ వంటలు వండుతున్నారు. పిల్లలకు ఏమి భోజనం పెడుతున్నారు? ఏజెన్సీ నిర్వాహకురాలు : సార్ ఈ రోజు అన్నం, పప్పు, కర్రి వండుతున్నాం. భోజనం ఎలాగుందో రోజూ సారోళ్లు వచ్చి చెక్ చేసి వెళుతున్నారు. కమిషనర్ : కట్టెల పొయ్యిలో వండుతున్నారే. మీకు గ్యాస్ కనెక్షన్ లేదా? పైగా తడకలతో షెడ్డు వేసుకున్నట్లు ఉన్నారు. షెడ్డు కట్టించలేదా? ఏజెన్సీ నిర్వాహకురాలు : అవును సార్. తడకలతో మేమే మా డబ్బులతో షెడ్డు ఏర్పాటు చేసుకున్నాము. గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తే వంట దానిపైనే చేస్తాం. (పాఠశాల టీచర్ల వద్దకు మున్సిపల్ కమిషనర్ వెళ్తూ...) కమిషనర్ : మీ పాఠశాల ఎలా ఉంది. ఏమైనా సమస్యలున్నాయా? పిల్లలకు ఎలా బోధిస్తున్నారు? ఉపాధ్యాయులు : మున్సిపల్ పాఠశాలలో పిల్లలు బెంచీలపై కూర్చుంటారనే విషయం ఊహకందని విషయం. కానీ కమిషనర్ ఆ భాగ్యం కల్పించారు. పాఠశాలలోని అన్ని సెక్షన్లకూ బెంచీలు వేయించారు. వసతులు, సౌకర్యాలు బాగుండటంతో మేము కూడా అంతే ఉత్సాహంగా పిల్లలకు బోధిస్తున్నాము. అన్ని సబ్జక్టుల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దాతలు ఇచ్చే స్టడీ మెటీరియల్ కూడా విద్యార్థులకు బాగా ఉపయోగపడుతోంది. అయితే పాఠశాలలో స్వీపర్, నైట్ వాచ్మెన్, అటెండర్లను నియమిస్తే బాగుంటుంది. కమిషనర్ : పిల్లలు ఎలా చదువుతున్నారో వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. ఏమయ్యా నీ పేరేంటి.. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు. విద్యార్థిని తండ్రి : సార్.. నా పేరు దాసు, నాకు నలుగురు కూతుళ్లు. అందరూ ఇదే పాఠశాలలో చదివారు. ఒకమ్మాయి డిగ్రీ కూడా పూర్తి చేసింది. గతంలో కంటే ఇప్పుడు మంచి సౌకర్యాలు ఉన్నాయి. ట్యూషన్ అవసరం లేకుండా సాయంత్రం 7 గంటల వరకు టీచర్లు బోధిస్తున్నారు. కమిషనర్ : చదువుతో పాటు ఇక్కడ ఆటలు కూడా ఆడిస్తున్నట్లున్నారు. ఏమండీ పీఈటీ గారూ.. విద్యార్థులకు ఏఏ ఆటలు ఆడిస్తున్నారు? పీఈటీ : సార్.. నా పేరు కమాల్‌బాషా, మా పాఠశాలలో విద్యార్థులకు హ్యాండ్‌బాల్, టెన్నికాయిట్, కబడ్డీ ఆటలు ఆడిస్తున్నాము. ఇటీవల జోనల్ క్రీడల్లో బాల్‌బాడ్మింటన్ , హ్యాండ్‌బాల్‌లో మా విద్యార్థులు విజేతలుగా నిలిచారు. బాస్కెట్‌బాల్‌లో రన్నర్స్‌గా వచ్చారు. గతంలో జరిగిన జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లోనూ విజయం సాధించారు. కమిషనర్ : క్రీడలు చాలా నేర్పిస్తున్నామని చెబుతున్నారు. నిజమో కాదో విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఏమ్మా మీ పాఠశాలలో సారు వాళ్లు మీకు ఆటలు నేర్పిస్తున్నారా.. లేక మీరే నేర్చుకుంటున్నారా? విద్యార్థిని : లేదు సార్.. సార్ వాళ్లే మాకు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. నేను కంభంలో జరిగిన హ్యాండ్‌బాల్ పోటీలకు వెళ్లి థర్డ్ ప్లేస్ సాధించాను. రెండు సంవత్సరాలుగా క్రీడాకారులకు మెటీరియల్, డ్రస్సులు కూడా అందిస్తున్నారు. కమిషనర్ : ఇక్కడే పారిశుద్ధ్య సిబ్బంది కనిపిస్తున్నారు. వారితో మాట్లాడదాం. ఏమ్మా మీరు ఏ సమయంలో పనిచేస్తున్నారు. ఎలా పనిచేస్తున్నారు. మీకేమైనా సమస్యలున్నాయా? పారిశుద్ధ్య కార్మికులు : సార్.. మేము ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు నగరాన్ని శుభ్రం చేస్తున్నాము. అయితే మాకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. పొరకలు, గంపలు, పారలు, బండ్లు సమకూరిస్తే బాగుంటుంది. (అనంతరం పాఠశాలలో టాయ్‌లెట్స్, తాగునీటి సరఫరాను కమిషనర్ పరిశీలించారు.) అనంతరం సాయంత్రం చిల్డ్రన్స్ పార్కులో.. కమిషనర్ : నేను సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. ఇక్కడ పార్కులో ఏమైనా సమస్యలున్నాయా? మున్సిపల్ పార్కులు ఎలా ఉన్నాయి? ఏవిధమైన అభివృద్ధి జరగాలా? యోగా శిక్షకులు : సార్.. యోగాభ్యాసం నేర్చుకునే వారికి అవసరమైన ల్యాన్(పచ్చగడ్డి) ఏర్పాటు చేశారు. అయితే నేల ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల పూర్తిస్థాయిలో యోగా చేయలేకపోతున్నాం. నగరంలోని మున్సిపల్ ఖాళీ స్థలాల్ని ఇదే విధంగా పార్కులుగా అభివృద్ధి చేయాలి. అక్కడే ఉన్న సీనియర్ సిటీజన్ల వద్దకు వెళుతూ.. కమిషనర్ : ఏం సార్.. ఎలా ఉంది? సాయంత్రం వేళలో ఎలా గడుపుతున్నారు? పార్కులో ఏమైనా సమస్యలున్నాయా? సీనియర్ సిటిజన్ : సార్, మా లాంటి సీనియర్ సిటిజన్లకు ఈ పార్కు ఎంతో అనుకూలంగా ఉంది. అయితే కింద కూర్చోవాలంటే మోకాళ్ల నొప్పుల కారణంగా ఇబ్బందిగా ఉంది. సిమెంటు కుర్చీలు మరికొన్ని వేయిస్తే బాగుంటుంది. (అప్పటికప్పుడు స్పందించిన కమిషనర్.. పార్కులో మూలన ఉన్న సిమెంటు కుర్చీలను తెప్పించి సీనియర్ సిటిజన్స్ కూర్చునే చోట వేయించారు) కమిషనర్ : మహిళలకు, పిల్లలకు పార్కు అనుకూలంగా ఉందా? మహిళలు : సార్, మా ఎదురుగా ఉండే మా స్కూలు పిల్లలు రోజూ ఇక్కడే వచ్చి ఆడుకుంటున్నారు. అయితే పార్కుకు వచ్చే మహిళలకు టాయిలెట్ సౌకర్యం లేదు. -
నిధుల్లేవు.. అభివృద్ధి లేదు
చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసన్న ధ్వజం సాక్షి, నెల్లూరు :‘పైసా నిధుల్లేవు. అభివృద్ధి పనుల్లేవు. కల్లబొల్లి మాటలతో చంద్రబాబు ప్రభుత్వం కాలం నెట్టుకొస్తోంది’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదన్నారు. స్మార్ట్‌సిటీలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, కోస్తా కారిడార్లు అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు మాటల గారడీతో కనికట్టు చేస్తున్నారని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో భేషరతుగా రుణమాఫీ, డ్వాక్ర రుణాల రద్దు, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ గొప్పలు పోయిన చంద్రబాబు అధికారం చేతికొచ్చాక రైతులు, డ్వాక్రా మహిళలను వంచించాడన్నారు. ఇంటికో ఉద్యోగం సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలను పీకి పారేసి నడివీధుల్లోకి నెడుతున్నారని ప్రసన్న విమర్శించారు. ఇప్పటికే గృహ నిర్మాణశాఖ, ఆదర్శ రైతులు, ఉపాధ్యాయులతోపాటు పలు విభాగాల్లో తాత్కాలిక ఉద్యోగులందరినీ వీధిపాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన బాబు వారి గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. చివరకు విద్యార్థులకు ఎంసెట్‌లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మళ్లీ పంట కాలం వచ్చినా రైతులు బ్యాంకుల వద్దకు రుణానికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రీమియం చెల్లించకపోవడంతో పంటల బీమా వర్తించే పరిస్థితి లేదన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదని, ధాన్యానికి పుట్టి రూ.14 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రసన్న డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ ఏ ఆసరాలేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు కల్పిస్తే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటిలో దారుణంగా కోతలు విధిస్తోందని ప్రసన్న విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పదన్నారు. ఇప్పటికైనా బాబు మనసు మార్చుకొని ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలని హితవు పలికారు. 3న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం అక్టోబర్ మూడో తేదీన స్థానికి మాంగుట లేఅవుట్ లోని వెంకటేశ్వర దేవస్థానం వెనుకన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. మూడో తేదీ ఉదయం 11:45 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ పరిశీలకులు, కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
ఇక పాలన మొత్తం ఐప్యాడ్ల ద్వారానే!!
రాబోయే కాలంలో పాలన మొత్తం ఐప్యాడ్ల ద్వారానే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఐప్యాడ్లు ఇచ్చామని, త్వరలోనే ఐఏఎస్ అధికారులకు కూడా వాటిని ఇస్తామని ఆయన అన్నారు. తర్వాత క్రమంగా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులకు కూడా వీటిని అందజేస్తామన్నారు. అలా క్రమంగా మొత్తం పాలనా వ్యవహారాలన్నింటినీ ఎలాంటి పేపర్లు అవసరం లేకుండా ఐప్యాడ్ల ద్వారా చేస్తామన్నారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు. ఆధార్ సీడింగ్ వల్ల సంక్షేమ పథకాల్లో 20 శాతం వరకు నిధులు ఆదా అవుతున్నాయని, 65 లక్షల మందికి చెందిన రేషన్ ఇన్నాళ్లుగా పక్కదారి పడుతోందని ఆయన అన్నారు. 2.62 లక్షల పింఛన్లకు ఆధార్ సీడింగ్ కాలేదని, వాళ్లంతా ఇక తమకు పింఛన్లు రావని భావిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రులకు రావాలంటేనే జనం భయపడుతున్నారని, ఆస్ప్రత్రిలో పనిచేసే ఉద్యోగులు, డాక్టర్లు కూడా వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చుచేసే నిధుల్లో 50 శాతం ప్రభుత్వాస్పత్రులకు వచ్చి ఉంటే చాలా మేలు జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు. -
స్వయం సహాయక బృందాలతో బాబు వీడియో కాన్పరెన్స్
-
మేడిపండులా చంద్రబాబు పాలన
వెంకటాచలం: చంద్రబాబు పాలన మేడిపండు చందాన సాగుతోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ఇస్కపల్లిలో మంగళవారం ఆయన విజయయాత్ర నిర్వహించారు. గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు స్పష్టత లేని వాగ్దానాలు, మాటలతో ప్రజలను మోసం చేస్తూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణమాఫీ అమలులో స్పష్టత కరువైందన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేసి ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు,రేషన్‌కార్డులు తొలగించేందుకు సీఎం యత్నిస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి ఓట్లు వేసిన వారికి ఇప్పుడు మొండి చేయి చూపుతున్నారన్నారు. హంగులు, ఆర్భాటాలు తప్ప మూడు నెలలుగా ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఎమ్మెల్యేల నిధుల్లో కోత విధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్, ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయయాత్ర చేపట్టానన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరికి తోబుట్టువులా, ప్రతి ఇంట్లో సభ్యుడిగా సమస్యల పరిష్కారానికి ముందుంటానని భరోసా ఇ చ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీటీసీ సభ్యురాలు నరాల జయమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ సర్పంచ్ పెళ్లూరు సుధాకర్‌రెడ్డి, కనుపూరు కోదండరామిరెడ్డి, అడపాల ఏడుకొండలు, రావూరు కోదండరామానాయుడు, కోడూరు కమలాకర్‌రెడ్డి, బుడంగుంట రామకృష్ణా, కోడూరు రఘునందన్‌రెడ్డి, ఉప్ప భూపయ్య, డేగా శ్రీనివాసులు, నలగర్ల నరసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రాయల వారి వారసుడొచ్చాడు..
19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయలు మియాపూర్: శ్రీకృష్ణదేవరాయల వారి వారసుడొచ్చారు. సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో 19వ వారసుడు శ్రీకృష్ణదేవరాయలు ముందుకు వచ్చారు. కర్ణాటకలోని ఆనేగుంధే గ్రామం వసపేటలో నివాసం ఉంటున్నారు. ‘ఆనేగుంధే’ అనే ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. గురువారం మియాపూర్‌లోని జయప్రకాశ్ నారాయణనగర్లో గుత్తి నారాయణరెడ్డి సాహితీ పీఠం ఆధ్వర్యంలో గుత్తి చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తాతగారైన శ్రీకృష్ణదేవరాయల పాలన, చరిత్రను దశదిశలా వ్యాపింపచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాయల సామ్రాజ్యనికి నాడు వృత్తి పరంగా అప్పటి ప్రజలకు ఎంతో కృషి చేశారని కొని యాడారు. ప్రజలతో రాయలవారు మైత్రీగా ఉండేవారని తమ పూర్వీకులు చెబుతుండేవారని తెలిపారు. అనంతరం సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చరిత్రను ఈ తరం ఉపాధ్యాయులు మరుగున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి రచించిన శ్రీకృష్ణదేవరాయలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కవులు, కళాకారులకు ఉత్తమ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో కళాకారులు ప్రభాకర్‌రెడ్డి, నిషాపతి, సోమయాజులు, పరమశివమూర్తి, కోక విజయ లక్ష్మి, గోపాల్‌రెడ్డి, రామకృష్ణరావు, లలితాంభిక పాల్గొన్నారు. -
‘చెత్త’.. చెత్తగా..
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ :జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలు ఉ న్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, భైంసా, నిర్మ ల్, మందమర్రి, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు గాను 213 వార్డులు ఉన్నాయి. అందులో 174 వార్డులు మురికి వాడలే. మున్సిపాలిటీ పరిధిలోని మురికి వాడల ప్రాంతాల్లో లక్షల మంది నివసిస్తున్నారు. వీటి పరిధిలో పేరుకుపోతున్న చెత్తతో ఎన్నో రకాల వ్యాధులు వ్యాపిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియాల్లో ప్రత్యే క పాలన కొనసాగుతుండడంతో అధికారులు సమస్యలను గాలికొదిలేశారు. వ్యాధుల వ్యాప్తి.. పరిసరాల్లో ఉండే చెత్తను సిబ్బంది చూసీచూడకుండా వదిలేయడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. వర్షాలు కురిసినప్పుడల్లా చెత్తంతా ఇళ్లలోకి వస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఆ అపరిశుభ్ర వాతావరణం క్రిమికిటకాలు, దోమలకు ఆవాసంగా మారుతోంది. గాలి, నీరు కలుషితమవుతోంది. దీంతో ఏటా చాలా మంది విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అనేక వ్యాధులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం చెత్త అని వైద్యులు పేర్కొంటున్నారు. చెత్తకుప్పలో పదివేల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని పేర్కొంటున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పల నుంచి ఎ గిసిపడే ధూళి రేణువుల ద్వారా శ్యాసకోశ వ్యా ధులు సంక్రమిస్తున్నాయి. అపరిశుభ్ర పరిసరా ల్లో పుట్టిన బ్యాక్టీరియా గుండె, మూత్ర పిండం, చెవి, ముక్కు, గొంతు, చర్మం ఇలా వివిధ భా గాల్లోకి చేరి రోగాలకు కారణమవుతోంది. చెత్తకుప్పలోకి నీరు చేరినప్పుడు వివిధ వాయువు లు వెలువడుతాయి. ఇందులో 87శాతం మిథేన్ ఉంటుంది. కార్బన్డయాక్సైడ్, మిథేన్ వాయువులను నేరుగా పీలిస్తే శ్యాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. కళ్ల మంటలు, తలనొప్పి, దగ్గు, ఆస్తమా, తదితర వ్యాధులు సోకుతాయి. ఈ వాయువును పీల్చితే అల్సరు, డయేరియా, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. దోమలకు ఈ పరిశుభ్ర వాతావరణమే ఆవాసం. దోమలు ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతాయి. చెత్తనుంచి జన్మించి ప్రొటీయన్ క్రిమితో మూ త్ర సంబంధ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. స్రెప్టొకాకస్ అనే బ్యాక్టీరియా గుండె, మూత్ర సంబంధ వ్యాధులకు కారణమవుతోంది. ప్రత్యేక పాలనలో అస్తవ్యస్తం.. మూడేళ్లుగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. 2010 సెప్టెంబర్‌లో మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగిసిం ది. అప్పటి నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకురాలేదు. ప్రతి ఆరు నెలలకోసారి గడువు పొడగిస్తుండడంతో ప్రత్యేక అధికారుల పాలనతో బల్దియాలు బావురుమంటున్నాయి. మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడం.. ప్రత్యేక అధికారులు తమ సొంత శాఖ వ్యవహరాల్లో బీజీగా ఉండడం.. మున్సిపల్ అధికారులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలోని ఏడు బల్దియాల్లోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలు సైతం లేవు. డం పింగ్ యార్డులు లేక మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. వీటితో వ్యాధులు వ్యాపించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఇటు మున్సిపల్, అధికారులు, అటు ప్రత్యేక అధికారులు బల్దియా పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపాలిటీలను చెత్తరహిత మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలి.. మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలనుకుంటారు కొందరు. దీంతో ఇంట్లోని చెత్తను బయట పారేస్తుంటారు. అయితే ఆ చెత్తను ఎక్కడే పడితే అక్కడ పడేయకుండా.. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు చెత్తబుట్టల్లో వేయాలి. మున్సిపల్ అధికారులు చెత్తపై సమరం కార్యక్రమం తలపెట్టినా అది ఆశించిన ఫలితాలివ్వడం లేదనే ఆరోపణలున్నాయి. తడి, పొడి చెత్తను తీసుకెళ్లేందుకు సిబ్బంది ఆయా వార్డుల్లోకి రాకపోవడంతోనే చెత్త రోడ్డుపై దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు చెత్తపై అవగాహన పెంచుకుని పరిసరాల పరిశుభ్రతకు దోహదపడాలి. చెత్త ద్వారా వచ్చే అనర్థాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెత్తపై సమరమెక్కడ...? చెత్తపై 100 రోజుల సమరం అన్న అధికారులు ఎక్కడా చెత్త తొలగింపులో శ్రద్ధ చూపినట్లు కనబడటం లేదు. చెత్తకుప్పలు పెరిగిపోతుడంటంతో స్థానికులు అవస్థలకు గురవుతున్నారు. ఏ రోజుకారోజు తొలగించేలా అధికారులు చర్యలు చే పట్టాలి. చెత్తపై సమరం కాగితాలకే పరిమితం కాకుండా రోజువారిగా సమీక్ష జరపాలి. మున్సిపాలిటీల పరిశుభ్రతకు పాటుపడాలి. - తాళ్లపల్లి రమేష్‌బాబు, మంచిర్యాల