జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలు ఉ న్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, భైంసా, నిర్మ ల్, మందమర్రి, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు గాను 213 వార్డులు ఉన్నాయి.
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ :జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీలు ఉ న్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, భైంసా, నిర్మ ల్, మందమర్రి, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలకు గాను 213 వార్డులు ఉన్నాయి. అందులో 174 వార్డులు మురికి వాడలే. మున్సిపాలిటీ పరిధిలోని మురికి వాడల ప్రాంతాల్లో లక్షల మంది నివసిస్తున్నారు. వీటి పరిధిలో పేరుకుపోతున్న చెత్తతో ఎన్నో రకాల వ్యాధులు వ్యాపిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. బల్దియాల్లో ప్రత్యే క పాలన కొనసాగుతుండడంతో అధికారులు సమస్యలను గాలికొదిలేశారు.
వ్యాధుల వ్యాప్తి..
పరిసరాల్లో ఉండే చెత్తను సిబ్బంది చూసీచూడకుండా వదిలేయడంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. వర్షాలు కురిసినప్పుడల్లా చెత్తంతా ఇళ్లలోకి వస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఆ అపరిశుభ్ర వాతావరణం క్రిమికిటకాలు, దోమలకు ఆవాసంగా మారుతోంది. గాలి, నీరు కలుషితమవుతోంది. దీంతో ఏటా చాలా మంది విషజ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అనేక వ్యాధులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం చెత్త అని వైద్యులు పేర్కొంటున్నారు. చెత్తకుప్పలో పదివేల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని పేర్కొంటున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్త కుప్పల నుంచి ఎ గిసిపడే ధూళి రేణువుల ద్వారా శ్యాసకోశ వ్యా ధులు సంక్రమిస్తున్నాయి. అపరిశుభ్ర పరిసరా ల్లో పుట్టిన బ్యాక్టీరియా గుండె, మూత్ర పిండం, చెవి, ముక్కు, గొంతు, చర్మం ఇలా వివిధ భా గాల్లోకి చేరి రోగాలకు కారణమవుతోంది. చెత్తకుప్పలోకి నీరు చేరినప్పుడు వివిధ వాయువు లు వెలువడుతాయి. ఇందులో 87శాతం మిథేన్ ఉంటుంది. కార్బన్‌డయాక్సైడ్, మిథేన్ వాయువులను నేరుగా పీలిస్తే శ్యాసకోశ వ్యాధులు సంక్రమిస్తాయి. కళ్ల మంటలు, తలనొప్పి, దగ్గు, ఆస్తమా, తదితర వ్యాధులు సోకుతాయి. ఈ వాయువును పీల్చితే అల్సరు, డయేరియా, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది. దోమలకు ఈ పరిశుభ్ర వాతావరణమే ఆవాసం. దోమలు ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతాయి. చెత్తనుంచి జన్మించి ప్రొటీయన్ క్రిమితో మూ త్ర సంబంధ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. స్రెప్టొకాకస్ అనే బ్యాక్టీరియా గుండె, మూత్ర సంబంధ వ్యాధులకు కారణమవుతోంది.
ప్రత్యేక పాలనలో అస్తవ్యస్తం..
మూడేళ్లుగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. 2010 సెప్టెంబర్‌లో మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ముగిసిం ది. అప్పటి నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకురాలేదు. ప్రతి ఆరు నెలలకోసారి గడువు పొడగిస్తుండడంతో ప్రత్యేక అధికారుల పాలనతో బల్దియాలు బావురుమంటున్నాయి. మూడేళ్లుగా ప్రజాప్రతినిధులు లేకపోవడం.. ప్రత్యేక అధికారులు తమ సొంత శాఖ వ్యవహరాల్లో బీజీగా ఉండడం.. మున్సిపల్ అధికారులకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలోని ఏడు బల్దియాల్లోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలు సైతం లేవు. డం పింగ్ యార్డులు లేక మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. వీటితో వ్యాధులు వ్యాపించి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా ఇటు మున్సిపల్, అధికారులు, అటు ప్రత్యేక అధికారులు బల్దియా పరిస్థితిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపాలిటీలను చెత్తరహిత మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల్లో చైతన్యం రావాలి..
మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలనుకుంటారు కొందరు. దీంతో ఇంట్లోని చెత్తను బయట పారేస్తుంటారు. అయితే ఆ చెత్తను ఎక్కడే పడితే అక్కడ పడేయకుండా.. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు చెత్తబుట్టల్లో వేయాలి. మున్సిపల్ అధికారులు చెత్తపై సమరం కార్యక్రమం తలపెట్టినా అది ఆశించిన ఫలితాలివ్వడం లేదనే ఆరోపణలున్నాయి. తడి, పొడి చెత్తను తీసుకెళ్లేందుకు సిబ్బంది ఆయా వార్డుల్లోకి రాకపోవడంతోనే చెత్త రోడ్డుపై దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు చెత్తపై అవగాహన పెంచుకుని పరిసరాల పరిశుభ్రతకు దోహదపడాలి. చెత్త ద్వారా వచ్చే అనర్థాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చెత్తపై సమరమెక్కడ...?
చెత్తపై 100 రోజుల సమరం అన్న అధికారులు ఎక్కడా చెత్త తొలగింపులో శ్రద్ధ చూపినట్లు కనబడటం లేదు. చెత్తకుప్పలు పెరిగిపోతుడంటంతో స్థానికులు అవస్థలకు గురవుతున్నారు. ఏ రోజుకారోజు తొలగించేలా అధికారులు చర్యలు చే పట్టాలి. చెత్తపై సమరం కాగితాలకే పరిమితం కాకుండా రోజువారిగా సమీక్ష జరపాలి. మున్సిపాలిటీల పరిశుభ్రతకు పాటుపడాలి.
- తాళ్లపల్లి రమేష్‌బాబు, మంచిర్యాల