New Trend
-
కొత్త ఇల్లు.. కొత్త ట్రెండ్..
మెట్రో నగరాల్లో గృహ కొనుగోలులో వంట గది కీలకంగా మారింది. అందుబాటు ధర, అభివృద్ధి చెందే ప్రాంతం, వసతులు మాత్రమే కాదండోయ్.. ఇంట్లోని వంట గది శైలి కూడా ఆధునికంగా ఉండాలంటున్నారు కొనుగోలుదారులు. అందుకే సాధారణ కిచెన్స్ స్థానంలో ఇప్పుడు ఓపెన్ కిచెన్స్ ట్రెండ్ నడుస్తోంది. లివింగ్, డైనింగ్ రూమ్‌లతో వంట గది కలిసి ఉండటమే దీని ప్రత్యేకత! – సాక్షి, సిటీబ్యూరోనగరంలోని నిర్మాణ సంస్థలు 1,000 చ.అ.పైన ఉండే ప్రతి ఫ్లాట్‌లోనూ ఓపెన్ కిచెన్ ఏర్పాటుకే ప్రాధాన్యమిస్తున్నాయి. హాలుకు అనుసంధానంగా అడ్డుగా గోడలు లేకుండా ఓపెన్ కిచెన్స్ ఏర్పాటు చేస్తారు. అంటే లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్‌కు కిచెన్ కలిసే ఉంటుందన్నమాట. ముచ్చటిస్తూ వంటలు.. » ఓపెన్ కిచెన్స్‌లో సానుకూల, ప్రతికూల రెండు రకాల అంశాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. » వంట చేస్తూనే ఇతర గదుల్లో ఉన్నవారితో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించవచ్చు. హాల్లో ఉండే టీవీలోని కార్యక్రమాలనూ వీక్షించొచ్చు. » ఓపెన్ కిచెన్ కాబట్టి శుభ్రంగా ఉంచేందుకు శ్రద్ధ తీసుకుంటారు. ఇంటిని అందంగా అలంకరించే కసరత్తును వంట గది నుంచి మొదలుపెడతారు. » ఘుమఘుమలు ఇల్లంతా వ్యాపిస్తాయి. దీంతో కుటుంబ సభ్యుల మూడ్‌ను మారుస్తాయి. » ఇంట్లో చిన్నారులు ఉంటే వంట గది నుంచి కూడా వీరిపై పర్యవేక్షణకు వీలుంటుంది. » వంట పాత్రలు బయటకు కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది కొందరికి నచ్చకపోచ్చు. » డిష్వాషర్, మిక్సీల శబ్ధాలు ఇతర గదుల్లోకి వినిపించి అసౌకర్యంగా ఉంటుంది. » దూరపు బంధువులు, అంతగా పరిచయం లేనివారు వచ్చినప్పుడు వారి ముందు వంట చేయడం కొంత మందికి అంతగా నచ్చకపోవచ్చు.సంప్రదాయ వంటగది: » వీటిని పాత రోజుల నుంచి చూస్తున్నవే.. వంట గది ప్రత్యేకంగా ఉంటుంది. ఏకాంతంగా వంట చేయాలని కోరుకునే వారు సంప్రదాయ శైలిలో ఉండే వంటిల్లునే ఇష్టపడతారు. » గదికి అన్ని వైపులా గోడలుంటాయి. అరలు ఎక్కువ ఏర్పాటుకు వీలుండటంతో పాత్రలన్నింటినీ చక్కగా సర్దేయవచ్చు. » వంటింట్లోని శబ్ధాలు, వాసనలు బయటకు రావు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. » చుట్టూ గోడలు ఉండటంతో ఇరుగ్గా, చీకటిగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది తిరిగేందుకు వీలుండదు. » ఇల్లు డిజైన్ సమయంలోనే ఎలాంటి వంట గది కావాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వంట గదిని నిర్మించేశాక మళ్లీ ఓపెన్ కిచెన్‌లా మార్చాలంటే మరింత ఖర్చు అవుతుంది. -
జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ.. ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఇది అనైతికం..: హయావో మియాజాకి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది. -
మీకు దండం పెడతా ఆ ఫొటోలు ఆపండ్రా బాబు
మార్కెట్లోకి ఏ కొత్త ప్రాడక్ట్ వచ్చినా జనం ఊరుకోరు.. ముఖ్యంగా టెక్నాలజీ పరంగా వచ్చే అప్డేట్స్.. మార్పులు.. కొత్తకొత్త ఆవిష్కరణలు వంటివి జనాన్ని మరింతగా ఆకట్టుకుంటాయి. ఎంతలా అంటే కొత్త ఆవిష్కరణ తీసుకొచ్చిన కంపెనీకి సైతం నిద్రపట్టని స్థాయిలో మనోళ్లు వాడకం ఉంటుంది. ఐ ఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు తిండి నిద్రమానేసి దానికోసం లైన్లో నిలబడి చివరకు దాన్ని దక్కించుకునేవరకూ ఊపిరిసలపని వాళ్ళు కొందరు. దానికోసం ఏకంగా కిడ్నీలు అమ్ముకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ కొనకపోతే ఉరేసుకుంటాను అని తల్లిదండ్రులను బెదిరించిన కేసులూ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా చాట్‌జీపీటీలో వచ్చిన కొత్త ఆవిష్కరణ జిబ్లీ స్టూడియో ఫోటోలు.. అంటే మనం ఏదైనా ఫోటోను దానిలోకి అప్లోడ్ చేస్తే అది కార్టూన్ మాదిరి మార్చేసి మనకు తిరిగి ఇస్తుందన్నమాట. అంటే ఒక చిత్రకారుడు పెన్సిల్.. కుంచెతో వేసినట్లు ఆ ఫోటోలు ఉంటాయి.ఈ కొత్త ఫీచర్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం ఐంది. ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఫోటోలు అప్లోడ్ చేసేసి వాటిని జిబ్లీ స్టూడియో ఫొటోలుగా మార్చేసుకుని ఫేసుబుక్ ట్విట్టర్.. ఇన్‌స్టాలో పోస్టు చేసుకుంటున్నారు. మనిషికి తనని తాను చూసుకోవడం ప్రతిసారీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందేమో..అద్దంలో ఒకసారి ఫోటోలో ఒకసారి.. బొమ్మ గీయించుకొని ఒకసారి..చూసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా కార్టూన్ లో ఎలా ఉంటానో అనే కుతూహలంతో.. చాట్‌జీపీటీలో అందరూ స్టూడియో గిబ్లీ ఆర్ట్ స్టైల్ లో తమ ఫొటోలు మారుస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ఫోటోల పిచ్చి ఏకంగా ఆ చాట్‌జిపిటి సంస్థను సైతం కుదిపేసింది.మనం అప్లోడ్ చేసిన మన మామూలు ఫోటోలను ఏకంగా జపానీస్ యానిమేషన్ స్టూడియో డైరెక్టర్లు హయావో మిజజాకి, ఇసావో టకహట రూపొందించిన పాపులర్ సినిమాలు స్పిరిటెడ్ అవే , ప్రిన్సెస్ మోనోనొకే వంటి సినిమా క్యారెక్టర్లను పోలి ఉండేలా మార్చేసి మనకు అందిస్తోంది. . ఈ కార్టూన్ చిత్రాలు మంచి జనాదరణ పొందడంతో కోట్లకొద్దీ ఫోటోలు చాట్‌జీపీటీలోకి వచ్చి పడుతున్నాయి. దీంతో అక్కడి సిబ్బందికి తిండి నిద్ర కూడా లేదంట. దీంతో ఈ ట్రేండింగ్ ను చూసి విసుగెత్తిపోయిన చాట్ జిపిటి వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మాన్ బాబూ కాస్త గ్యాప్ ఇవ్వండి.. మా సిబ్బంది కూడా కాస్త నిద్రపోవాలి కదా అని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అంటే కొత్త ట్రెండ్ మొదలైతే జనం ఎంతలా వేలం వెర్రిలా ఉంటారన్నదానికి ఇదో ఉదాహరణ అన్నమాట.- సిమ్మాదిరప్పన్న -
ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్‌లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్‌ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్‌వేజ్ ఐటమ్స్‌లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్‌నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్‌పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో... గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. జీవనోపాధికి దోహదం హోటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్‌ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. సండే స్పెషల్స్ ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్‌తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్‌వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్‌లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు వివిధ రకాల పచ్చళ్లు... కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్‌వెజ్‌లో ఫ్రై ఐటమ్స్, వెజ్‌లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రుచి, నాణ్యత ఉంటేనే.. చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం. – వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు -
లగ్జరీ ఇళ్లల్లో కొత్త ట్రెండ్..
ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి యువ గృహ కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. లగ్జరీ కాదు.. అంతకుమించి కోరుకుంటున్నారు. దీంతో 4 వేల నుంచి 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. ఇవి విశాలంగా ఉంటున్నాయే తప్ప సేవలపరంగా యువ కస్టమర్లలో అసంతృప్తి ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా యువ డెవలపర్లు బ్రాండెడ్ హౌసింగ్‌లను నిర్మిస్తున్నారు. అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి బ్రాండెడ్ రెసిడెన్సీ ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. ఇప్పటివరకు ముంబై, బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాలకే పరిమితమైన ఈ తరహా ప్రాజెక్ట్‌లు హైదరాబాద్‌లోనూ నిర్మితమవుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోమారియట్, తాజ్, లీలా, ఇంటర్కాంటినెంటల్ వంటి అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థలతో కలిసి విలాసవంతమైన అపార్ట్మెంట్లను నిర్మించడమే ఈ రెసిడెన్సీల ప్రత్యేకత. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్ క్లాస్‌గా ఉంటాయి. బ్రాండెడ్ రెసిడెన్సీ అంటే కేవలం ప్రాపర్టీని కొనుగోలు చేయడం కాదు.. అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని పొందడం.బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటే? స్టార్ హోటల్ సేవలు, అపార్ట్మెంట్ కలిపి ఉండే మిశ్రమ వినియోగ ప్రాజెక్ట్‌లనే బ్రాండెడ్ రెసిడెన్సీలు అంటారు. ఇందులో లేఔట్ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే అందిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. దాంట్లో నుంచి హోటల్లోని ఫుడ్, స్పా, సెలూన్ వంటి ఆర్డర్ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్ చేస్తారు. బ్రాండెడ్ గృహాల నిర్వహణ మొత్తం ఆతిథ్య సంస్థల ఆపరేటర్లే చూసుకుంటారు. హెచ్ఎన్ఐ, ప్రవాసులు కస్టమర్లు.. కొనుగోలుదారులకు అంతర్జాతీయ జీవనశైలి, డెవలపర్లకు అధిక రాబడి అందించే ప్రీమియం బ్రాండెడ్ గృహాలకు ఆదరణ పెరిగింది. ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లు బ్రాండెడ్ రెసిడెన్సీల విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. దీంతో హెచ్ఎన్ఐలు(హై నెట్‌వర్త్ ఇండివిడ్యు వల్స్), ప్రవాసులు, బిజినెస్ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాండెడ్ రెసిడెన్సీ కస్టమర్లు రెండు, లేదా మూడో గృహ కొనుగోలుదారులై ఉంటారు. దీంతో వీరికి ఆధునిక వసతులే అధిక ప్రాధాన్యత. ఎవరెక్కువ, వినూత్న, విలాసవంతమైన వసతులు అందిస్తారో అందులో కొనుగోలు చేస్తారు.ఎక్కడ వస్తున్నాయంటే.. దేశంలోని విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10 శాతంగా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2,900 యూనిట్లు ఉండగా.. గ్లోబల్ మార్కెట్లో 3 శాతం వాటాగా నమోదైంది. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. కోకాపేట, నియోపొలిస్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలు వస్తున్నాయి. శ్రీఆదిత్య హోమ్స్, బ్రిగేడ్ వంటి పలు నిర్మాణ సంస్థలు బ్రాండెడ్ రెసిడెన్సీలను నిర్మిస్తున్నాయి. వీటి ధరలు రూ.6–8 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.ప్రైవసీ, భద్రత.. కరోనా తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా.. అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఐటీ, ఫార్మా, తయారీ రంగంతో పాటు కాస్మోపాలిటన్ కల్చర్‌తో నగరంలో లగ్జరీకి మించి జీవనశైలి కోరుకుంటున్నారు. సెవెన్ స్టార్ హోటల్లో మాదిరి గ్రాండ్ లాంజ్, డబుల్ హైట్ బాల్కనీ, హోమ్ ఆటోమేషన్, స్కై వ్యూ, స్పా, స్కై లాంజ్, మినీ థియేటర్, రూఫ్‌టాప్ డైనింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, ప్రైవసీ, భద్రత అన్ని ఉంటాయి.ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్.. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్, పర్యావరణహితంగా ఉండేలా అంతర్జాతీయ డిజైనర్లతో తోడ్పాటు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌లలో విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతో సాధారణ గృహాలతో పోలిస్తే రెసిడెన్సీలలో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. వేర్వేరుగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. ఒకేరకమైన అభిరుచులు, జీవన శైలి కోరుకునే నివాసితులు ఒకే గేటెడ్ కమ్యూనిటీలో ఉండటంతో వీరి మధ్య సామాజిక సంబంధాలు బలపడతాయి. -
ఉత్తుత్తి ఉద్యోగాలు.. ఇప్పుడిదే నయా ట్రెండ్!
‘‘ఉద్యోగాలిప్పిస్తామని యువతకు కుచ్చుటోపీ.. ఉద్యోగాల పేరిట టోకరా..!’’ ఈ తరహా కథనాలు చూసి చూసి బోర్ కొడుతోందా? అయితే జస్ట్ ఫర్ ఏ ఛేంజ్.. ఉద్యోగాల పేరిట ఓ వ్యక్తి సొంతవాళ్లను, బంధువులను, చివరకు తనను తానే మోసం చేసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా?. కానీ, ఇప్పుడది నయా ట్రెండ్‌గా అక్కడ ఓ ఊపు ఊపేస్తోంది.సాధారణంగా.. ఎక్కడో సిటీలోనో, టౌన్లోనో ఉంటూ ఉద్యోగాల వేట పేరిట తల్లిదండ్రుల నుంచి డబ్బులు పిండుకునే జాతిరత్నాల గురించి వినే ఉంటారు. అయితే.. నిజంగానే ఉద్యోగాల వేటలో అలసిపోయిన నిరుద్యోగుల కోసం పుట్టుకొచ్చిందే ఈ Pretend To Work ట్రెండ్. అంటే.. పని చేస్తున్నట్లు నటించడమన్నమాట. ఈ జాబ్‌తో జేబులు గుళ్ల కావడం తప్పించి ఎలాంటి ప్రయోజనం ఉండదు!!.ఈ జాబ్ కావాలంటే చేయాల్సిందల్లా.. రోజుకు ఫలానా డబ్బును మీ ఆ సర్వీస్ వాళ్లకు అందించాలి. అప్పుడు వాళ్లు మీకు ఆఫీస్ స్పేస్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి అందులో మీకు కుర్చీ, టేబుల్, కంప్యూటర్ లాంటివివేసి ఉద్యోగి అనే గుర్తింపు ఇస్తారు. అంతేకాదు.. ఆ పనివేళలో మధ్యలో భోజనం, కాఫీ టిఫిన్లు, స్నాక్స్, జ్యూస్‌ల వగైరా లాంటివి కూడా అందిస్తారు. మీరు చెల్లించే డబ్బును బట్టి మీ పొజిషన్, ఇతర సేవలు అందిస్తారు. ఒకవేళ ఎక్కువ చెల్లిస్తే ఏకంగా ఆ కంపెనీకి బాస్(Boss) పొజిషన్లోనే కూర్చోబెడతారు. అలాగని మీకు అక్కడ పని అప్పజెప్తారనుకుంటే పొరపాటే!. ఇవి కేవలం ఉత్తుత్తి ఉద్యోగాలు మాత్రమే!!. కేవలం మీలోని నిరుద్యోగి(Jobless)ని అనే భావనను దూరం చేయడానికి మాత్రమే వాళ్లు ఈ సేవల్ని అందిస్తోంది. అంటే.. మీరు మీ మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎప్పటిలాగే మునిగిపోవచ్చన్నమాట. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతుందో.. అప్పుడు అక్కడికి వెళ్లి వాళ్లు అడిగినంత చెల్లిస్తే సరిపోతుంది. ఆశ్చర్యం కలిగించినా ఇది ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్. చైనా(China)లో ఈ తరహా సేవల గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. పైగా ఈ సర్వీసును అందించేందుకు పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి కూడా!.‘‘మా ఆఫీస్‌కు విచ్చేయండి. మీరూ ఉద్యోగిగా మారిపోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా ఇక్కడే గడపండి. మీకు భోజన, ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తాం. రోజూవారీగా.. అతితక్కువ ధరకే మీకు ఈ సేవల్ని అందిస్తాం’’ అనే ప్రకటనలు హెబెయి ప్రావిన్స్‌లో ఎటు చూసినా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు, యువత ఈ తరహా సేవల కోసం ఎగబడిపోతున్నారు. ఈ తరహా సేవలు కొనసాగుతున్న మాట వాస్తవమేనంటూ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కూడా ఓ కథనంలో పేర్కొంది.చైనాలో ఈ తరహా సర్వీసుల ప్రారంభ ధర 30 యువాన్లు(4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.353)గా ఉంది. వాళ్లు అందించే సౌకర్యాలను బట్టి ఆ రేటు పెరుగుతూ పోతోందన్నమాట.ఈ క్రేజ్ గుర్తించిన కాఫీ షాపులు, లైబ్రరీలు కూడా ఈ తరహా సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి. చైనాలో ప్రస్తుతం లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం వేల సంఖ్యల్లో ఉద్యోగులను తొలగించుకుంటూ పోతున్నాయి. దీంతో.. చిన్న కంపెనీలు కొత్త రిక్రూట్లకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో నిరుద్యోగుల శాతం పెరిగిపోతోంది. ఉద్యోగాలు ఊడిపోవడం.. జాబ్‌లెస్‌గా ఉండిపోవడంతో తీవ్ర ఒత్తిడి, మానసికంగా కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. కాస్త డబ్బు ఉన్న వాళ్లకు ఊరట కలిగించేందుకే ఈ సేవలు పుట్టుకొచ్చాయి. అయితే..ఈ Pretend To Workపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా. దీనివల్ల మోసాలు పెరిగిపోవచ్చని పలువురు అంటున్నారు. అయితే ఖాళీగా రోడ్ల వెంట తిరగడం, ఉద్యోగాల కోసం తిరిగి అలసిపోవడం, ఉద్యోగం దొరక్క ఇంటికి ఆలస్యంగా వెళ్లడం.. ఇలాంటి వాటికంటే ఈ ఉత్తుత్తి ఉద్యోగాలు చేసుకోవడం నయం అనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సేవల ఉద్దేశం ఏదైనా.. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది అక్కడ.ఇదీ చదవండి: అత్యంత అరుదు.. అందుకే రూ.5కోట్లు పలికింది!! -
కళ్ల జోడు.. స్టైల్ చూడు
కళ్ల జోడు కొత్త మోడల్స్ అనునిత్యం నయా పుంతలు తొక్కుతున్నాయి. నలుగురిలో భిన్నంగా ఉండాలనుకునే యువత మార్కెట్లోకి కొత్త మోడల్ వచి్చందంటే దాన్ని మనం ధరించాల్సిందే అంటున్నారు. ఈ తరహా ట్రెండ్ ప్రధానంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఇందులో అత్యధిక శాతం మంది మాత్రం ఎప్పటికప్పుడు తమ కళ్లజోడు మారుస్తున్నారు. నగరవాసులు కొత్త మోడల్స్‌కు మారిపోతున్నారు. అందం, అభినయానికి అనుగుణంగా తమ కళ్లజోడు ఉండేలా సెట్ చేసుకుంటున్నారు.కళ్ల జోడు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం సమస్య వేధిస్తోంది. మోటారు సైకిల్‌పై, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేసేవారికి గాలిలోని ధూళి కణాలు కంట్లో పడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కంటికి రక్షణ, స్టైలిష్ కళ్ల జోడు కోసం నిత్యం వివిధ వెబ్సైట్లలో, ఆప్టికల్ దుఖాణాల్లో కొత్త మోడల్స్‌పై ఆరా తీస్తున్నారు. ఎండలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి రక్షణ కల్పించడం కోసం, రాత్రి వేళ డ్రైవింగ్ చేసే సమయంలో ఎదుటి వాహనాల వెలుతురు ప్రభావం మన కళ్లపై పడకుండా ఉండేందుకు యాంటీ గ్లేర్ గ్లాసెస్, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే యువత కంప్యూటర్ కిరణాల నుంచి రక్షణ కసం బ్లూలైట్ యాంటీ గ్లేర్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలున్న గ్లాసెస్ వినియోగిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కంటి సమస్యలతో కళ్లజోడు వినియోగిస్తున్నారు. చూపు మందగించడం, రీడింగ్ గ్లాసెస్, కళ్లు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడం కోసం కొన్ని రకాల లెన్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రాండ్స్‌పై మోజు.. ప్రపంచంలో పేరెన్నిక కలిగిన పలు బ్రాండెడ్ గాగుల్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. అనునిత్యం కొత్త కొత్త మోడల్స్, ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, రాయదుర్గం, శేరిలింగంపల్లి తదతర ప్రాంతాల్లో బ్రాండెడ్ గాగుల్స్ దుకాణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అచ్చం అలాగే కనిపించే లోకల్ బ్రాండ్స్ సైతం లభిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. చిన్న చిన్న దుకాణాల్లో గాగుల్స్ అడిగితే రూ.100కే లభిస్తున్నాయి. అదే మల్టీనేషన్ కంపెనీ బ్రాండ్ అయితే కనీసం రూ.5 వేలు ఆపైనే ఉంటాయి. వీటి మన్నికలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.సమస్య ఎక్కడ మొదలవుతోంది? నగరంలో యువత జీవన శైలి మారిపోతోంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం, ఉద్యోగం, వ్యాపార లావాదేవీల్లో అవసరాల రీత్యా కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్‌పై పనిచేయాల్సి రావడంతో కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో చాలామందిలో చూపు మందగించడం, కళ్లు ఎక్కువగా ఒత్తిడిగి గురై తలనొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో సైతం ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న బాధితులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బ్రాండ్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి కాలుష్యం నుంచి కంటిని రక్షించుకోవడానికి గాగుల్స్ అవసరం. అయితే వాటిని నిపుణులైన వైద్యుల సూచనల మేరకు వినియోగిస్తే మంచిది. కంటి సమస్యలతో వచ్చేవారికి కళ్లజోడు రాయాల్సి వచి్చనప్పుడు కొత్త మోడల్స్ కావాలని కోరడం సహజంగా మారిపోయింది. కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల దగ్గర, దూరం దృష్టి సమస్యలు, కళ్లు పొడిబారిపోవడం, తలనొప్పి రావడం, ఇంట్రాక్రీనియల్ ప్రెజర్ పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బయటకు వెళ్లే సమయంలో సన్ ప్రొటెక్షన్, కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు నిపుణుల ఆదేశానుసారంగా లెన్స్ గ్లాసెస్ వాడుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాలైనా కంప్యూటర్, మొబైల్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ సార్లు కనురెప్పలను బ్లింక్ చేయాలి. కంట్లో ధూళి కణాలు పడితే నల్లగుడ్డుకు ప్రమాదం వాటిల్లుతుంది. కళ్లజోడు వినియోగించడంతో కంటి లైఫ్ టైం పెంచుకోవచ్చు. బ్రాండ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఏదో ఒకటి కళ్లజోడే కదా చాలు అనుకుంటేనే ఇబ్బంది. – డా.పి.మురళీధర్ రావు, వైరియో రెటినల్ సర్జన్, మ్యాక్స్ విజన్, సోమాజిగూడ -
థీమ్..హోమ్! ఇళ్ల నిర్మాణంలో సరికొత్త ట్రెండ్
సాక్షి, సిటీబ్యూరో: మార్పు అనివార్యం.. జీవనశైలిలోనైనా, నిర్మాణ శైలిలోనైనా.. కాలానుగుణంగా అభిరుచులను, అవసరాలను తీర్చే వాటికి ఎవరైనా జై కొడతారు. వినూత్న నిర్మాణ శైలి, విలాసవంతం, ఆధునికత నగర గృహ నిర్మాణ రంగంలో ఇప్పుడిదే ట్రెండ్ కొనసాగుతోంది. లగ్జరీ వసతులు, ఇంటీరియర్ మాత్రమే కాదు డిజైనింగ్, ఆర్కిటెక్చర్ నుంచే ప్రత్యేకత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే థీమ్ బేస్డ్ హోమ్స్ ట్రెండ్‌గా మారిపోయాయి.థీమ్ ఆధారిత నిర్మాణాలు కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో రాజ భవనాలు, రాజ ప్రాసాదాలు, కోటలు, గోపురాలను దైవం, వాస్తు, శిల్పం వంటి ఇతివృత్తంగా ఆయా నిర్మాణాలు ఉండేవి. వాటికే డెవలపర్లు ఆధునికతను జోడించి గృహ సముదాయాల స్థాయికి తీసుకొచ్చేశారు. సాధారణంగా థీమ్ బేస్డ్ రిసార్ట్లు, హోటళ్లు, పార్క్‌లు ఉంటాయి. కానీ, ఇప్పుడు మెట్రో నగరాల్లో లగ్జరీ అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను ఈ తరహాలో నిర్మిస్తున్నారు.థీమ్ బేస్డ్ అంటే? స్పోర్ట్స్, డిస్నీ, హెల్త్ అండ్ వెల్నెస్, గోల్ఫ్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్ వంటి ఏదైనా ఇతివృతం ఆధారంగా నిర్మించే నివాస సముదాయాలనే థీమ్ బేస్డ్ హోమ్స్ అంటారు. ఒకే రకమైన అభిరుచులు, ఆసక్తులు ఉన్న నివాసితులు ఒకే గృహ సముదాయంలో ఉండటమే వీటి ప్రత్యేకత. దీంతో నివాసితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అద్భుతమైన శిల్పా లు, విశాలమైన ద్వారాలు, కిటికీలు, అందమైన మంటపాలు, గ్రాండ్ గ్యాలరీ, ఆహ్లాదకరమైన పచ్చదనంతో ఉంటాయి.అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే.. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా థీమ్ ఆధారిత గృహాలను నిర్మించేందుకు డెవలపర్లు ముందుకు వస్తున్నారు. అపార్ట్మెంట్లు, విల్లాలు, క్లబ్ హౌస్‌లను కూడా థీమ్ ఆధారంగానే నిర్మిస్తున్నారు. పౌలోమి ఎస్టేట్స్, సుచిరిండియా, రాంకీ, గిరిధారి హోమ్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి. కోకాపేట, తెల్లాపూర్, నల్లగండ్ల, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, మాదాపూర్ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా నిర్మిస్తున్నారు.మౌలిక వసతులూ మెరుగ్గానే.. గృహ కొనుగోలుదారుల అభిరుచులు మారిపోయాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్, క్లబ్ హౌస్ వంటి సౌకర్యాలను విలాసవంతమైన వసతులుగా పరిగణించడం లేదు. అంతకుమించి ఆధునికతను కావాలంటున్నారు. ఒక వసతుల విషయంలోనే కాదు ప్రాజెక్ట్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రత్యేకత లేదో ప్రాజెక్ట్‌ను ఎంపిక చేయడం లేదు. మెరుగైన మౌలిక వసతులు, అన్ని రకాల రవాణా సదుపాయాలు, విస్తీర్ణమైన స్థలం ఉన్న ప్రాంతాల థీమ్ బేస్డ్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి సరైనవి.థీమ్ బేస్ట్ ప్రాజెక్ట్‌లను ఆర్కిటెక్చర్, కల్చర్, లైఫ్ స్టయిల్ మూడు రకాలుగా వర్గీకరిస్తారు.1. ఆర్కిటెక్చర్: ఈ భవన నిర్మాణాల శైలి వినూత్నంగా ఉంటాయి. ఈ తరహా నిర్మాణ శైలిని ప్రపంచ దేశాల్లోని చరిత్రలో వివిధ కాల వ్యవధుల్లో వచ్చిన నిర్మాణాలను ప్రేరణగా తీసుకొని ఆర్కిటెక్చర్ డిజైనింగ్‌ను రూపొందిస్తారు. ఈ తరహా భవన నిర్మాణాలు సమగ్రత్తను నిర్ధారించడంతో పాటు ఫ్యాషన్ సింబల్‌గా మారాయి. ఉదాహరణ: ఇండో సార్సెనిక్, గోతిక్ అండ్ విక్టోరియన్, మొగల్స్, ఈజిప్టియన్, అరబిక్, స్పానిష్, రోమన్, మొరాకన్ ఆర్కిటెక్చర్ నిర్మాణాలు.2. కల్చర్: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ నివాస సముదాయాలు ఉంటాయి. ఉదాహరణకు: డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి స్కాండినేవియన్ దేశాల్లో గృహాల డిజైన్లు ప్రకృతిని పెంపొందించేలా, జపనీయుల హోమ్స్ మినిమలిస్టిక్ డిజైన్లను అవలంభిస్తుంటారు. భారతీయులు చైతన్యపరిచే గృహాలను ఇష్టపడుతుంటారు.3. లైఫ్ స్టయిల్: కొనుగోలుదారుల జీవనశైలి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా నిర్మించే కస్టమైజ్డ్ గృహాలివీ. ఈ ప్రాజెక్ట్‌లలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ధారాళమైన గాలి, వెలుతురుతో ఇట్టే ఆకట్టుకుంటాయి.ఉదాహరణకు: స్పోర్ట్స్ టౌన్‌షిప్‌లు, డిస్నీ, చిల్డ్రన్ సెంట్రిక్ హోమ్స్, హెల్త్ అండ్ వెల్నెస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు వంటివి. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
ఓల్డే..గోల్డు.. పాత మోడళ్లకు కొత్త హంగులు
వడ్డాణం, బంగారపు జడ.. ఓస్ ఈ పేర్లు నిన్నా మొన్నటివే కదా అంటారా? అయితే కంకణాలు, కంటెలు? ‘ఇవెక్కడో విన్న పేర్లలాగే ఉందే’ అనుకుంటున్నారా? కాసుల మాలలు, గుట్ట పూసలు? బాబోయ్ ఇవెక్కడి పేర్లు అంటూ ఆశ్చర్యపోతున్నారా? మీరు చాలా పాతకాలం నాటి మోడ్రన్ జ్యువెలరీ ట్రెండ్స్‌కి ఇంకా దూరంగానే ఉన్నారని అర్థం.. ‘పాత ఒక వింత.. కొత్త ఒక రోత’ అన్నట్టు.. ఆభరణాల ట్రెండ్ కనిపిస్తోంది. మరోవైపు బరువైనా వెరపులేదంటున్న మహిళలు.. వంటి నిండా దిగేసుకుంటున్న నగలన్నీ కలిపితే.. సగటు బంగారం బరువు రెండు కిలోలుగా చెప్పొచ్చు. – సాక్షి, సిటీబ్యూరో ‘ఏమిటలా వంటినిండా ఆభరణాలు దిగేసుకున్నావ్? గుళ్లో అమ్మవారిలా?’ అంటూ ఆభరణ ప్రియులైన మహిళల్ని ఆటపట్టించే రోజులు గతించనున్నాయి. నడుముకు వడ్డాణాలు, బంగారపు పూలజడలు, కంఠాన్ని కప్పేసే నెక్లెస్‌లు.. వగైరాలన్నీ ఒకనాటి ఫ్యాషన్లే కావచ్చు.. అయితే పాతే వింత అంటున్న ఆధునికులు మోటుగా ఉంటాయంటూ తీసి పారేసిన నగల్ని మోజుగా ఆదరిస్తున్నారు. అంతేకాదు.. మరింతగా వెనక్కు వెళ్లి శోధించి.. మరీ పురాతన ఆభరణశైలుల్ని అందుకుంటున్నారు. మన అమ్మమ్మలు, అవ్వల కాలం నాటి స్టైల్స్‌కు ప్రాణం పోస్తున్నారు.కొత్తవాటి ‘కంటె’ మిన్న.. ఒకప్పటి పూర్తి సంప్రదాయ ఆభరణం అయిన కంటెలు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చాయి. రాజుల కాలంలో ధరించేవారట.. ఇటీవల మహానటి సినిమాలో సావిత్రి పాత్రధారిణి కీర్తి సురేష్ సైతం ధరించి కనిపిస్తుంది. కాళ్లకి పట్టీ టైప్‌లో ఉంటూ, మెడకి ధరించే ఈ కంటె చూడడానికి థిక్‌గా ఒక రాడ్డులా ఉంటుంది. దీనికే పెండెంట్స్, పెరల్ డ్రాప్స్ జోడించడం, అలాగే స్టోన్స్‌తో కార్వింగ్ చేయడం ద్వారా మరింత ఫ్యాషనబుల్‌గా మారుస్తున్నారు. రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా వీటి ధరలు ఉంటున్నాయి.కాసుల గలగల.. కాసుల పేర అంటూ తాతల కాలం నాటి సంప్రదాయం మరోసారి కొత్తగా చేస్తున్న సవ్వడి.. ఆధునిక మహిళల మెడలో గలగల మంటోంది. మెడలో వేసుకునే లక్ష్మీ కాసుల మాలలు ఇప్పుడు ట్రెండీ. మామిడి పిందెల రూపంలో ఉండే కాసులను కూడా తయారు చేస్తున్నారు. వీటిని మ్యాంగో మాలలని పిలుస్తున్నారు. కనీసం 25 పైసలంత సైజ్‌లో ఉండే కాసులతో తయారయ్యే మాల కనీసం 30 నుంచి 300 గ్రాముల దాకా బరువు ఉండేవి ధరిస్తున్నారు. వీటి ఖరీదు రూ.2లక్షల నుంచి రూ.10లక్షల దాకా ఉంటుంది.గుట్టలు గుట్టలుగా.. ఒకనాటి తెలంగాణ సనాతన సంప్రదాయ ఆభరణం గుట్ట పూసలు. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిని షేప్‌లెస్ ముత్యాలతో చేస్తారు. ఏ వయసు వారైనా ధరించవచ్చు. రూ.3లక్షల నుంచి రూ.15లక్షల దాకా వివిధ ధరల్లో లభిస్తున్నాయి.కంకణం కట్టుకుంటున్నారు.. మోచేతి అందాన్ని పెంచే గాజులను.. దానికి ముందుగా బంగారు కంకణం ధరించడం అనేది చాలా పాత కాలం నాటి ఆభరణాల శైలి. అయితే ఆధునికులు కూడా ఈ తరహా ట్రెండ్‌ని అనుసరిస్తున్నారు. రెండు చేతులకూ గాజులతో పాటుగా ఒక్కో కంకణం తొడుగుతున్నారు. ఇవి చూసేందుకు లావుగా ఉంటాయి. ఒక్కోటి 30 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకూ బరువులో ఇవి రూ.1లక్ష నుంచి రూ.5లక్షల ధరల్లో లభిస్తున్నాయి.‘పాత’నగల.. జాతరలా.. మోటుగా ఉండే ఆభరణాలు అంటూ ఇప్పుడు ఎవరూ అభ్యంతరం పెట్టడం లేదు. ఓల్డ్ ట్రెండ్స్‌ని అడిగి మరీ చేయించుకుంటున్నారు. ఇక పెళ్లి వేడుకల్లో అయితే పాత కాలం నాటి ఆభరణాలు తప్పనిసరిగా మారాయి. ఇవి కాస్త ఖర్చుతో కూడుకున్నవే అయితే.. గతంలో ఉన్నత స్థాయి వాళ్లు మాత్రమే ధరించేవారు. ఇప్పుడు మిడిల్‌క్లాస్ కూడా వీటినే ఎంచుకుంటున్నారు. – శ్వేతారెడ్డి, ఆభరణాల డిజైనర్ -
ఎస్యూవీ.. కూపే అవతార్!
కుర్ర’కారు’ టాప్‌గేర్‌లో దూసుకెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ).. ఆటోమొబైల్ కంపెనీలకు కూడా గత కొన్నేళ్లుగా కాసులు కురిపిస్తున్నాయ్. అయితే, కస్టమర్ల మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఎస్‌యూవీల షేపు, స్టయిల్, డిజైన్‌లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘ఎస్యూవీ కూపే’ పేరుతో కొత్త సెగ్మెంట్నుక్రియేట్ చేయడం ద్వారా అమ్మకాల గేరు మార్చేందుకు పోటీ పడుతున్నాయి వాహన దిగ్గజాలు. దేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు 55 శాతం వాటా ఎస్‌యూవీలదే కావడం వాటి క్రేజ్‌కు నిదర్శనం. అయితే, కొద్ది నెలలుగా డిమాండ్ కాస్త మందగించడంతో సరికొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు వాహన కంపెనీలు వాటికి కొత్తదనాన్ని జోడిస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్యూవీ విభాగంలో ఎస్యూవీ కూపేలు ఇప్పుడు నయా ట్రెండ్. టాటా మోటార్స్ ‘కర్వ్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపేను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులోనే తాజాగా పెట్రోల్, డీజిల్ మోడల్‌ను కూడా తెచి్చంది. ఇక ఫ్రెంచ్ ఆటో దిగ్గజం సిట్రాన్ ఎస్యూవీ కూపే ‘బసాల్ట్’ను బరిలోకి దించింది. దీని రేటు, డిజైన్ కూడా ఊరించేలా ఉంది. త్వరలోనే మహీంద్రా తన పాపులర్ మోడల్ ఎక్స్‌యూవీ 700లో కూపే మోడల్‌ను విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నట్లు టాక్. మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూపే కూడా క్యూలో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా మార్కెట్లోకి వచి్చన టాటా, సిట్రాన్ కూపే ఎస్‌యూవీలకు కస్టమర్ల రెస్పాన్స్ అదిరిపోవడంతో ఇతర కంపెనీలూ ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ పెంచాయి. ఫోక్స్‌వ్యాగన్, రెనో సైతం భారత్ మార్కెట్ కోసం కూపే ఎస్వీయూలను రెడీ చేస్తున్నాయట! ప్రీమియం లుక్, లగ్జరీ కార్లతో పోలిస్తే చాలా తక్కువ ధరల్లో కూపే మోడల్‌ను కోరుకునే వారిని ఈ ఎస్యూవీ కూపేలతో టార్గెట్ చేయాలనేది కార్ల కంపెనీల ప్లాన్. అమ్మకాల్లో వాటిదే హవా... ఇప్పుడు ఎక్కడ చూసినా ఎస్‌యూవీల హవాయే నడుస్తోంది. హైఎండ్ లగ్జరీ ఎస్వీయూల రేటు భారీగా ఉండటంతో కస్టమర్లకు అదే లుక్కు, ఫీచర్లతో రూ. 10–20 లక్షల ధరలో దొరుకుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఫుల్ గిరాకీ ఉంటోంది. ఈ మిడ్‌సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హోండా ఎలివేట్, స్కోడా కుషక్, ఎంజీ ఆస్టర్, సిట్రాన్ సీ3 ఎయిర్‌క్రాస్ వంటివి హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరోపక్క, చిన్నకారు కొనే యోచనలో ఉన్నవారిని సైతం ఊరించే విధంగా రూ. 10 లక్షల స్థాయిలో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలను తీసుకొచ్చి మార్కెట్‌ను విస్తరించాయి కార్ల కంపెనీలు. మారుతీ బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నెట్, రెనో కైగర్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా ట్రైసర్ వంటివి సబ్‌కాంపాక్ట్ సెగ్మెంట్లో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. గత రెండు మూడేళ్లుగా ఈ రెండు విభాగాల్లో పోటీ పెరిగిపోవడంతో.. ఇప్పుడు ఎస్యూవీ కూపేతో జెన్ జెడ్‌తో పాటు యువ కస్టమర్లను ఆకట్టుకోవాలనేది కార్ల కంపెనీల కొత్త వ్యూహం. ఇప్పటికే లగ్జరీ కూపే కార్లున్నాయ్..మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ల్యాండ్‌రోవర్, పోర్షే, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల దిగ్గజాలు ఇప్పటికే కూపే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అయితే, వీటి లుక్కు, డిజైన్లాగే ధర కూడా ‘టాప్’లేపేలా ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న ఎస్యూవీ కూపేల్లో బీఎండబ్ల్యూ ఎక్స్4 రేటే చాలా తక్కువ. ఎంతంటే జస్ట్ రూ. 96 లక్షలే! (ఎక్స్ షోరూమ్) అ‘ధర’పోయింది కదూ! అందుకే అచ్చం అలాంటి డిజైన్లోనే హాట్ సెల్లింగ్ మిడ్–ఎస్యూవీ రేంజ్‌లోనే ఈ స్టయిలిష్ కూపేలను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మరింత వైవిధ్యాన్ని అందించేందుకు వాహన కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గతేడాది మొత్తం కార్ల అమ్మకాల్లో 16 శాతం వాటా మిడ్–ఎస్‌యూవీలదే కావడం విశేషం!ఎస్యూవీ కూపే అంటే... ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎస్‌యూవీలన్నీ దాదాపు బాక్స్ ఆకారంలో రగ్గ్డ్ లుక్‌తోనే ఉంటున్నాయి. బలిష్టమైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, ఎత్తుగా, స్పోర్ట్స్ లుక్ కూడా ఉండటంతో ఎస్‌యూవీలు మార్కెట్‌ను కొల్లగొడుతూనే ఉన్నాయి. కస్టమర్లకు హాట్ ఫేవరెట్‌గా మారాయి. అయితే, లగ్జరీ స్పోర్ట్స్ కూపే కార్లలోని స్లీక్ డిజైన్‌ను, ఎస్‌యూవీల్లోని రగ్గ్డ్ లుక్‌ను కలగలిపినవే ఈ కూపే ఎస్‌యూవీలు. దీనిలోని ప్రత్యేకత ఏంటంటే, ముందువైపు చూస్తే చాలా భారీగా ఎస్యూవీ స్టయిల్లోనే కనిపిస్తుంది. వెనక్కి వెళ్లే కొద్దీ రూఫ్‌లైన్ బాగా ఏటవాలుగా వంగి కూపే లుక్‌తో ఉంటుంది. ఇతర ఫీచర్లన్నీ ఎస్యూవీ మాదిరే ఉంటాయి. చాలావరకు లగ్జరీ కార్లలో ఇలాంటి డిజైన్‌ను మనం చూడొచ్చు. కస్టమర్లు సాధారణ బాక్స్ డిజైన్ కంటే స్పోర్ట్ లుక్‌తో ఉండే లైఫ్‌స్టయిల్ ఎస్‌యూవీలకే మొగ్గు చూపుతుండటంతో ఎస్యూవీ కూపే క్రాసోవర్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో లగ్జరీ, కాంపాక్ట్, సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీలకు తోడుగా బడ్జెట్ ధరల్లో కూపే ఎస్యూవీ సెగ్మెంట్‌తో దుమ్మురేపేందుకు కంపెనీలు సై అంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వీకెండ్ ఆర్ట్.. వారాంతాల్లో కళాత్మకతకు పదును!
పాటరీ వర్క్‌షాప్స్: ఈ మధ్య కాలంలో పాటరీ వర్క్‌షాప్స్ బాగా ఆదరణ పొందుతున్నాయి. మొత్తని మట్టితో చిన్న చిన్న కళాకృతమైన కుండలు, బొమ్మలు, ఇంట్లో అలంకార వస్తువులను తయారు చేయడంపై శిక్షణ అందిస్తారు. గ్రామీణ మూలాల్లోంచి కొనసాగుతున్న కళ కావడం, అంతేగాకుండా ఈ పాటరీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి ఆదరణ ఉండటంతో ఈ వర్క్‌షాప్స్‌కు ఔత్సాహికులు నిండిపోతున్నారు. తయారు చేసే సామాగ్రి, పనిముట్లు తదితరాలను నిర్వాహకులే సమకూరుస్తున్నారు.మ్యూజిక్ సైన్స్..సంగీతాన్ని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో.. అయితే.. ఈ సంగీతాన్ని ఆస్వాదించడం పోయి వాయించడం అభిరుచిగా మార్చుకుంటున్నారు నగరవాసులు. గిటార్, వయోలిన్, డ్రమ్స్, ఫ్లూట్ ఇలా ఏదో ఒక సంగీత వాయిద్యంపై పట్టు పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఓ వైపు ఐటీ జాబ్స్ చేస్తూనే ఇలాంటి ఆర్ట్స్‌పై అవగాహన పెంచుకుంటూ మ్యూజిక్ బ్యాండ్స్‌లో సైతం సభ్యులుగా మారుతున్నారు. వీటి శిక్షణ కోసం పలు సంగీత శిక్షణ కేంద్రాలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖా ఆధ్వర్యంలోని కేంద్రాలు సైతం ఉన్నాయి.థియేటర్ ఆర్ట్స్..కొంతకాలంగా సిటీలో థియేటర్ ఆర్ట్స్‌కు ఔత్సాహికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నటనలో, నాటకాల్లో శిక్షణ పొందుతూ.. థియేటర్ ప్లేలు ప్రదర్శిస్తూ వినూత్న ఒరవడికి నాంది పలుకుతున్నారు. వీటి కోసం రవీంద్రభారతి, తెలుగు యూనివర్సిటీ కళాప్రాంగణం, రంగభూమి వంటి వేదికలు ఆవకాశాలను కలి్పస్తున్నాయి. రంగస్థలంపై రాణించిన యువతకు సినిమాల్లో అవకాశాలు సైతం వస్తుండటంతో థియేటర్ ఆర్ట్స్ మోడ్రన్ యాక్టివిటీగా మారింది. అన్ని రంగాల్లో జాబ్స్ చేస్తున్న వారు ఇందులో భాగస్వామ్యం అవుతుండటం విశేషం.గార్డెనింగ్.. మోడ్రన్ ఆర్ట్..ఈ మధ్య మొక్కలు పెంచడం కూడా ఓ కళగా మారింది. ఇందులో ఇంటీరియర్, ఎక్స్టీరియర్, టెర్రస్ గార్డెనింగ్ అంటూ విభిన్న రకాలుగా ఉన్నాయి. నగరంలోని కొందరు మొక్కల ప్రేమికులు సోషల్ యాప్స్‌లో గ్రూపులుగా మారి ఈ గార్డెనింగ్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా నగర జీవనశైలి దృష్ట్యా టెర్రస్ గార్డెనింగ్ ఔత్సాహికలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా మీట్స్ ఏర్పాటు చేసుకుని మొక్కలను, వాటి విత్తనాలను ఒకరికొకరు పంచుకుంటున్నారు. ఇదే వేదికలుగా ప్లాంటేషన్‌పై అనుభవజు్ఞలు, నిపుణులచే అవగాహన పొందుతున్నారు.నిత్యం ఒత్తిడి పెంచే సిటీ లైఫ్‌లో గార్డెనింగ్ అనేది వినూత్న కళగా అవతరించింది. ఇవేకాకుండా పెయింటింగ్, రెసిన్ ఆర్ట్స్, హ్యండ్ క్రాఫ్ట్, పేపర్ క్రాఫ్ట్, మైక్రో ఆర్ట్స్, జుంబా వంటి విభిన్న కళా అంశాలపై శిక్షణ పొందుతూ తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. వారి కళాత్మకతను సోషల్ మీడియా వేదికగా రీల్స్, షేర్లు, పోస్టులతో ప్రమోట్ చేసుకుంటూ సోసల్ సెలబ్స్గా మారుతున్నారు. -
లెట్.. సెట్.. గో.. నయాట్రెండ్గా ఆకట్టుకుంటున్న ‘కిట్టీ కల్చర్’!
సాక్షి, సిటీబ్యూరో: కిట్టీపార్టీ.. ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. మహిళలే కాదు. మగవాళ్లు కూడా తాము సైతం అంటూ నెలకోసారి కిట్టీ పార్టీలకు జై కొడుతున్నారు. పది, పదిహేనుమంది ఒక చోట చేరి సరదాగా గడిపేస్తున్నారు. అంతేకాదు.. ప్రతి నెలా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఆర్థిక అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకుంటున్నారు. నెల నెలా పొదుపు చేసిన డబ్బుతో విహార యాత్రలకు వెళ్తున్నారు. నగరంలో ఈ తరహా కిట్టీ పార్టీలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒకే విధమైన ఆలోచన కలిగిన వారి మధ్య స్నేహసంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండే మహిళలు నెలకోసారి ఒక చోట చేరి ఈ వేడుకలను ఏర్పాటు చేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ లేడీస్ స్పెషల్ కిట్టీ పార్టీల తరహాలోనే ‘జెంట్స్ స్పెషల్’ కిట్టీ పార్టీలు కూడా నగర సంస్కృతిలో ఒక భాగంగా కనిపిస్తున్నాయి.ఉరుకుల పరుగుల జీవితం. ఒకే కాలనీలో ఉన్నా, ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా సరే ఒకరికొకరు అపరిచితులే. కనీస పలకరింపులు ఉండవు. చుట్టూ మనుషులే ఉన్నా ఆకస్మాత్తుగా ఏదో ఒక ఆపద ముంచుకొస్తే ఆదుకొనే వారెవరూ అంటే చెప్పడం కష్టమే. అలాంటి సాధారణ, మధ్యతరగతి జీవితాల్లో కిట్టీ పార్టీలు సరికొత్త సంబంధాలను, అనుబంధాలను ఏర్పాటు చేస్తున్నాయి. అదీ ఓ ఐదారు గంటల పాటు సరదాగా గడిపే సమయం. ఆట పాటలు, ఉరకలెత్తే ఉత్సాహాలు, సరదా కబుర్లు.. దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను అధిగమించేందుకు అద్భుతమైన టానిక్‌లా పనిచేసే ఔషధం కిట్టీ పార్టీ. ఉప్పల్‌కు చెందిన కొందరు వాకింగ్ ఫ్రెండ్స్ కిట్టీ పార్టీకి శ్రీకారం చుట్టారు. వారిలో కొందరు ఉద్యోగులు, మరి కొందరు వ్యాపారులు. ప్రతి నెలా ఒక చోట సమావేశమవుతారు.ఒకరికొకరు అండగా..ఒక్కొక్కరూ నెలకు రూ.5000 చొప్పున 15 మంది కలిసి రూ.75000 పొదుపు చేస్తున్నారు. అందులో రూ.60 వేల వరకూ ఆ నెల అవసరమైన వారికి ఇచ్చేస్తారు. మిగతా రూ.15000 లతో సరదాగా గడిపేస్తారు. నెలకోసారి కిట్టీ పార్టీని నిర్వహించేందుకు ఆ గ్రూపులో ఒకరిని ఆతిథ్యం ఇచ్చే హోస్ట్‌గా ఎంపిక చేసుకుంటారు. ‘రోజంతా సరదాగా గడిపేస్తాం. అంతా చుట్టుపక్కల కాలనీల్లో ఉండేవాళ్లమే. కానీ కనీసం పరిచయాలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మేమంతా మంచి స్నేహితులుగా ఉన్నాం. ఎవరికి ఎలాంటి ఆపద వచి్చనా ఆదుకునేందుకు మా టీమ్ రెడీగా ఉంటుంది.’ అని చెప్పారు టీమ్‌కు సారథ్యం వహించే రవి.నగర శివారుకు..అపార్ట్మెంట్లలో మహిళల బృందంలోని ఒకరి ఇంట్లో కానీ లేదా కమ్యూనిటీ హాల్లో కానీ నిర్వహిస్తారు. కానీ జెంట్స్ పార్టీల్లో ఔటింగ్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. సిటీకి దూరంగా వెళ్లి ఒక రోజంతా గడిపేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.విహారయాత్రలు కూడా..కిట్టీ పార్టీల మరో ప్రత్యేకత ఏడాదికి ఒకసారి దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో విహరించడం, ప్రతి నెలా పొదుపు చేసే డబ్బులతో గోవా, కేరళ, కాశ్మీర్, జైపూర్ వంటి ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్తారు. అలాగే దుబాయ్, సింగపూర్, మలేసియా, బ్యాంకాక్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు సైతం కిట్టీ పార్టీలు పరుగులు తీస్తున్నాయి. ఏటా ఓ పది రోజులు టూర్‌కు వెళ్లి రావడం కూడా ఈ పార్టీల కల్చర్‌లో భాగంగా కొనసాగుతోంది.ఇదీ ‘కిట్టీ’ చరిత్ర..దేశవిభజన అనంతరం 1950లో ఈ వినూత్నమైన కిట్టీపార్టీ సంస్కృతి ప్రారంభమైంది. ఒకే ప్రాంతంలో నివసించే మహిళల మధ్య స్నేహ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మొదలయ్యాయి. దేశవిభజన ఫలితంగా ఆర్థికంగా తీవ్ర కష్టాలకు గురైన కుటుంబాలను ఆదుకునేందుకు పది మంది మహిళలు కలిసి రావడం ఒక ఉన్నతమైన సంప్రదాయంగా నిలిచింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లో మొదలైన ఈ సంస్కృతి 1980 తరువాత క్రమంగా అంతటా విస్తరించింది. -
డెనిమ్ న్యూ లుక్ డిజైన్..!
ఫ్యాషన్ ప్రపంచంలో అప్ సైక్లింగ్ మాట ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఉన్నదానిని సృజనాత్మకంగా మార్చడంలో కళాత్మక విలువతో ΄ాటు పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది. ఎప్పుడూ కొత్తవాటి కోసం పరుగులు తీయకుండా ఉన్నవాటిని కొత్తగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియజెప్పడానికి డిజైనర్లుపోటీ పడుతుంటారు. దీంట్లో భాగంగా డెనిమ్ అప్ సైక్లింగ్ ఎప్పుడూ బెస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది.మనకున్న రకరకాల డిజైన్ వేర్లలో వివిధ రకాల ఫ్యాబ్రిక్‌తో రూపొందించినవి ఉంటాయి. వీటిలో డెనిమ్ జాకెట్స్, స్కర్ట్స్, ప్యాంట్స్ కూడా మోడర్న్ డ్రెస్సుల్లో భాగంగా చేరుతుంటాయి. జీన్స్ ప్యాంటులకు ఉపయోగించే నీలం రంగు గట్టి ఫ్యాబ్రిక్‌ను డెనిమ్ అంటారు. డెనిమ్ డ్రెస్సులైతే సంవత్సరాలుగా ఉపయోగించేవీ ఉంటాయి. కొన్నింటిని తీసిపడేయలేం, అలాగని వార్డ్ రోబ్స్లోనూ ఏళ్ల తరబడి ఉంచేయలేం. ఈ పరిస్థితులలో వాటికో కొత్త రూపు ఇవ్వడం చాలా మేలైన కళ. టాప్స్, కుర్తీస్, శారీస్.. ఇలా అనుకూలతను బట్టి అందమైన డిజైనర్ వేర్ని రూపొందించవచ్చు. లేదంటే విడిగా కొత్త ఫ్యాబ్రిక్‌తో సరికొత్త డిజైన్‌నీ క్రియేట్ చేయవచ్చు.అప్ సైకిల్ డెనిమ్ శారీ వర్ణిక సాంగోయి ముంబై ఫ్యాషన్ డిజైనర్. డెనిమ్‌తో ఎన్నో అప్‌సైకిల్ డిజైన్స్ చేసిన డిజైనర్. మోడర్న్ డ్రెస్సులే కాదు శారీస్‌ను కూడా డెనిమ్ టచ్‌తో,ప్యాచ్ వర్క్‌తో వివిధ రకాల మెటీరియల్‌ను ఉపయోగిస్తూ తయారు చేసింది. డెనిమ్ దర్జి పేరుతో స్టూడియో కూడా రన్ చేస్తుంది.– నెట్ ఫ్యాబ్రిక్, డెనిమ్ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన చీర ఇది. చీర బార్డర్పైన ఘుంగ్రూ వర్క్ డిజైన్ చేశారు. – పోల్కా డాట్స్ప్యాచ్ వర్క్‌తో రూపొందించిన శారీ– లినెన్ శారీకి జియోమెట్రిక్ స్టైల్లో కట్ చేసిన డెనిమ్ క్లాతతో ప్యాచ్ వర్క్ చేశారు. – స్కర్ట్ శారీని డెనిమ్‌ను ఉపయోగిస్తూ చేసిన మ్యాజిక్ స్టైల్ డ్రెస్ ఇది. – డెనిమ్ క్రాప్‌టాప్– కాటన్ ఫ్యాబ్రిక్ – డెనిమ్ జాకెట్‌ని ఉపయోగిస్తూ రూపొందించిన కుర్తా– లేస్తో లాంగ్ స్లీవ్స్ రూపొందించిన డెనిమ్ జాకెట్– డెనిమ్ ప్యాచ్‌వర్క్‌తో మోడర్న్ టాప్– డెనిమ్ ప్యాంట్ బెల్ స్టైల్‌కి క్రోచెట్ డిజైన్‌ను అదనంగా జత చేస్తే వచ్చే స్టైల్.ఇవి చదవండి: పవర్ఫుల్ ప్రఫుల్..! -
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ సారి ఇటు చూడండి బ్రదర్..! మీకోసమే ఈ చాయ్..!!
మారుతున్న కాలానుగుణంగా మానవ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఏదైనా కొత్తగా, వింతగా, తక్కువ ఖర్చు, సులభంగా ఉండేట్లుగా ఆలోచిస్తున్నారు. విషయంలోకి వెళితే.. టీ తాగని వారు.., ఆ రుచి ఇష్టపడని వారు కూడా ఈ సరికొత్త టీ-స్టాల్‌ని చూశారో ఓసారైనా ట్రై చేద్దామనుకుంటారు. ఇక అదేంటో చూసేద్దాం! వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్ద కంపెనీలు ప్రవేశించి జిల్లాలు, మండలాల వారీగా ప్రాంచైజీలు ఇస్తున్నారు. ఇక ఎక్కడ పడితే అక్కడ మొబైల్ టీ స్టాళ్లూ ఏర్పాటువుతున్నాయి. ఈమేరకు పాత ఆటోలను మొబైల్ టీ స్టాళ్లుగా హైదరాబాద్‌లో సిద్ధం చేయించిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్తూ ఖమ్మంలో ఆగారు. ఖమ్మంలోని పటేల్ స్టేడియం వద్ద ఆపిన ఈ టీ స్టాల్ వాహనాలను పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇవి కూడా చదవండి: పాత జీన్స్‌ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా? -
సరికొత్త ట్రెండ్ ఉంగారాల చెయిన్లు..!
వేళ్లకి ఉంగరాలు, మెడలో గొలుసులు ధరించడం సాధారణమే! చేతులకు ఉంగరాలు.. చెయిన్లు, హ్యాండ్ కఫ్స్ ధరించడం ఇప్పుడు ట్రెండ్. ఇండోవెస్ట్రన్, వెస్ట్రన్ డ్రెస్సుల మీదకు ఈ ఉంగరాలు, చెయిన్ల వరసలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. యువత వేగానికి, స్టయిల్‌కి అద్దంలా భాసిల్లుతున్నాయి. బంగారు వరసలు లైట్ వెయిట్ జ్యువెలరీలో భాగంగా హ్యాండ్ కఫ్స్, చెయిన్స్ డిజైనర్లను ఆధునికత వైపుగా పరుగులు తీయిస్తున్నాయి. ఆభరణాల డిజైనర్లు బంగారు లోహంతో వెస్ట్రన్ స్టైల్ డిజైన్స్‌ను కొత్తగా మెరిపిస్తున్నారు. వెండి వెలుగులు తక్కువ ఖర్చు అనే జాబితాను ఈ తరం పక్కన పెట్టేస్తోంది. ఏ డిజైన్ తమకు మరింత అందాన్ని తీసుకువస్తుందో, నలుగురిలో గుర్తింపును సంపాదిస్తుందో దానినే ఇష్టపడుతోంది. అందుకే సిల్వర్ డిజైన్స్ మరింతగా యువత మదిని గెలుచుకుంటున్నాయి. స్టీల్ మెరుపులు స్ట్రీట్ అండ్ బోహో స్టైల్లో స్టీల్‌తో తయారైన ఆభరణాలను యువత ఎక్కువ ధరిస్తుంటుంది. క్యాజువల్ వేర్, పార్టీవేర్కీ నప్పే ఈ డిజైన్ వరసలు వందల రూపాయల నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. (చదవండి: తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!) -
అతికించిన అందం! ఇంటి గోడలకు త్రీడీ వాల్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంచరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇల్లు అయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది. త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటుంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1/1 సైజ్ నుంచి 20/20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి ఉంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
వారెవ్వా! రబ్బర్ ఫ్లోరింగ్.. ఇంటీరియర్‌లో నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: ఇంటీరియర్‌లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉన్నాయి. ఆధునిక పోకడలు, అభిరుచుల మేరకు వైవిధ్యభరితమైన ఇంటీరియర్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా రబ్బర్ ఫ్లోరింగ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది ఇంటీరియర్ ప్రియులు గ్రానైట్, మార్బుల్స్, టైల్స్ బదులుగా రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గదికో రకంగా డిజైనింగ్ చేయిస్తున్నారు. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేవి జిమ్‌లు, క్రీడా మైదానాలలో వినియోగిస్తుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలోనూ ఈ తరహా ఫ్లోరింగ్‌ను కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి పిల్లల గదులలో రబ్బర్ ఫ్లోరింగ్‌ను వేయిస్తున్నాయి. పై అంతస్తులో పిల్లలు ఆడుకుంటే కిందికి శబ్దాలు వినిపించకుండా, కిందపడినా దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఈ రబ్బర్ ఫ్లోరింగ్‌ను ఎంపిక చేస్తున్నారు. తడిగా ఉంచే కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాంతాలలో కూడా వీటిని వేసుకోవచ్చు. రబ్బర్ ఫ్లోరింగ్ ఉత్పత్తులు మ్యాట్స్, టైల్స్, రోల్స్ రూపంలో, విభిన్న శైలి రంగులలో, డిజైన్లలో లభ్యమవుతాయి. వీటికి దీర్ఘకాలం మన్నిక ఉంటుంది. సరిగ్గా నిర్వహణ చేస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. ఇతర ఫ్లోరింగ్‌లతో పోలిస్తే చిరిగిపోవటం, పాడైపోవటం వంటివి చాలా తక్కువ. ఫంగస్ కూడా పట్టదు. ఇదీ చదవండి: చిన్న ప్రాజెక్ట్‌లు.. పెద్ద లాభాలు! -
జోడో యాత్రతో కొత్త జాతీయ ఒరవడి
న్యూఢిల్లీ: భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఒక బలమైన నూతన జాతీయ ఒరవడిని సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు, ద్రవ్యోల్బణం పెరుగుదలను యాత్ర సందర్భంగా రాహుల్ ప్రముఖంగా లేవనెత్తారని గుర్తుచేశారు. 2013తో పోలిస్తే 2023లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయానని వెల్లడించారు. గత పదేళ్లలో ఇంటి బడ్జెట్ తీవ్రంగా ప్రభావితమైందని తెలిపారు. ఈ మేరకు పట్టికను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ పట్టికను గమనించాలని ప్రజలను కోరారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వాకాలను రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అధికార బీజేపీ బెంబేలెత్తిపోతోందని వెల్లడించారు. అందుకే రాహుల్‌పై బురద చల్లుతోందని జైరామ్ రమేశ్ మండిపడ్డారు. రాహుల్ సృష్టించిన నూతన ఒరవడి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ కుతంత్రాలు పన్నుతోందని ఆరోపించారు. -
సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న రవితేజ
-
Generation-Z: వీకెండ్ కాపురాలు..రెండు రోజులు మాత్రమే ఒకరికొకరు
పెళ్లంటే రెండు జీవితాల కలయిక. నిండు నూరేళ్ల సావాసం. ఎన్ని కష్టనష్టాలెదురైనా జీవితాంతం ఒకరి చేయి మరొకరు విడిచిపెట్టకూడదు. ఒకేచోట కలిసుంటేనే బంధం బలపడుతుంది... ఇన్నాళ్లూ పెళ్లికి మనకి ఈ అర్థాలే తెలుసు... కానీ... నేటి జనరేషన్ జెడ్ పెళ్లికి కొత్త భాష్యాలు చెబుతోంది. ‘ఎవరి జీవితం వారిది. ఎవరి ఆర్థిక స్వాతంత్య్రం వారిది. ఎవరి వ్యక్తిత్వం వారిది. ఒకరి కోసం మరొకరు వాటిని వదులుకోనక్కర్లేదు. అందమైన జీవితాన్ని మూడు ముళ్లతో బంధించి జీవితాంతం రాజీ పడనక్కర్లేదు’ వంటి ఆలోచనల నుంచి వీకెండ్ మ్యారేజెస్ కాన్సెప్టు పుట్టుకొచ్చింది. జపాన్లోనైతే ఇవి ట్రెండుగా మారాయి. భారత్‌లోనూ మెల్లిగా తెరపైకి వస్తున్నాయి... వీకెండ్ మ్యారేజెస్ అంటే..? ఇవాళ రేపు ఆడ, మగ ఇద్దరూ సమానమే. ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని లేదు. భర్త బయట పని చేసి డబ్బు సంపాదిస్తే, భార్య ఇంటిని చక్కదిద్దుకుంటూ గృహిణి జీవితం గడిపే రోజులు పోయాయి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ సంపాదిస్తున్నారు. తమ వ్యక్తిత్వాన్ని వదులుకోవడానికి, జీవితంలో సర్దుకుపోవడానికి ససేమిరా అంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీల్లేని బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. అందుకే పెళ్లి చేసుకొని ఒకే చోట ఉండడం కంటే వీకెండ్స్‌లో కలిసి ఉండాలని ముందే ఒక అవగాహన కుదుర్చుకుంటున్నారు. వారంలో అయిదు రోజులు ఎవరి జీవితం వారిది, మిగిలిన రెండు రోజులు ఒకరికొకరుగా కలిసి జీవిస్తారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. గుండెల నిండా గూడు కట్టుకున్న ప్రేమని పంచుకుంటూ రెండు రోజులు రెండు క్షణాల్లా గడిపేస్తారు. వీకెండ్ కాపురాలకు కారణాలు ► ఆఫీసులో పని ఒత్తిడితో ఆడ, మగ లైఫ్‌స్టైల్ వేర్వేరుగా ఉంటున్నాయి. ఒకరికి ఉదయం షిఫ్ట్ అయితే మరొకరికి రాత్రి షిఫ్ట్ ఉంటుంది. ఒకరి ఆఫీసు ఊరికి ఒక మూల ఉంటే, మరొకరిది మరో మూల ఉంటుంది. దీంతో ఒకేచోట కలిసుండే పరిస్థితి ఉండడం లేదు ► పెళ్లి చేసుకున్నా ఇద్దరిలో ఎవరికి వారే తాము పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ► ముఖపరిచయం కూడా లేకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరినొకరు చూసుకునే జంటలు ఒకరితో ఒకరు ఎంతవరకు జెల్ అవగలరో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ముందుగా వీకెండ్స్‌లో కలిసుంటే ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ► భార్యాభర్తలకి ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి. ఆఫీసు నుంచి అలిసిపోయి ఇంటికి వచ్చిన వారికి భాగస్వామి తమకి అనుకూలంగా లేకపోతే చిర్రెత్తుకొచ్చి దెబ్బలాటలకి దారి తీస్తాయి. అదే వీకెండ్స్‌లో మాత్రమే కలిస్తే, కలిసుండేది కాస్త సమయమైనా హాయిగా గడుపుదామని అనిపిస్తుంది. మళ్లీ వారం వరకు చూడలేమన్న ఫీల్‌తో ఒకరిపై మరొకరికి ప్రేమ పొంగుకొస్తుంది. సర్ప్రైజ్లు, రొమాన్స్‌లు కొత్తగా వింతగా అనిపించి మానసికంగా ఎనలేని సంతృప్తి ఉంటుంది. ► ఆర్థికంగా ఎవరి స్వాతంత్య్రం వారికుంటుంది. ఎవరికి వారు వాళ్ల ఇళ్లల్లో ఉంటారు కాబట్టి డబ్బుల్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ► అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఈ మధ్య అందరూ తమకి మాత్రమే సొంతమైన ఒక స్పేస్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. వీకెండ్ కాపురాల్లో ఎవరికి కావల్సినంత స్పేస్ వారికి దొరుకుతుంది. భారత్‌లో కుదిరే పనేనా..? వీకెండ్ పెళ్లి పేరుతో వారానికోసారి కలుస్తామంటే అంగీకరించే సామాజిక పరిస్థితులు భారత్‌లో లేవు. ముంబైలాంటి నగరాల్లో కొందరు ప్రయోగాత్మకంగా వీకెండ్ కాపురాలు మొదలు పెట్టారు. ఆఫీసులు చెరో మూల ఉన్నప్పుడు ఇలా వీకెండ్స్‌లో కలవడమే బెటర్ అని నిర్ణయించుకునే జంటలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. రోజంతా ట్రాఫిక్ జామ్‌లో పడి ఏ రాత్రికో ఉసూరంటూ ఇంటికి చేరడానికి బదులుగా ఎవరిళ్లలో వారుంటూ వీకెండ్ వరకు ఎదురు చూడడమే మంచిదన్న అభిప్రాయానికి నేటితరం వస్తున్నా కుటుంబాలైతే అంగీకరించడం లేదు. మన దేశంలో పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక. వడం. కనుక öన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు తప్పనిసరి. పెళ్లి చేసుకుంటే ఒక కమిట్మెంట్తో ఉండాలి. జపాన్, చైనా వంటి దేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి యువతరం విముఖంగా ఉంటోంది. ఏళ్ల తరబడి పిల్లల్ని కనొద్దని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలే శాపంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో పసిపాపల బోసినవ్వులు కనిపించి ఏళ్లవుతున్నాయి. అందుకే పెళ్లి చేసుకొని వారంలో రెండు రోజులైనా కలిసుంటే చాలన్న స్థితి వచ్చింది. మన దగ్గర ఆలా కాదు. ముఖ్యంగా పిల్లలు పుడితే ఏం చేస్తారు ? తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ మధ్య పెరగాల్సిన పిల్లల్ని కూడా వారానికొకరని పంచుకోవడం అసాధ్యం. వ్యక్తిత్వం, ఆర్థిక స్వాతంత్య్రం పేరుతో వీకెండ్ కాపురాలు చేయాలని యువతరం భావించినా పెద్దలు వారిని అడ్డుకుంటున్నారు. అందుకే భారత దేశంలోని కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటోంది. ‘‘భారత్‌లో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. దాన్నో ప్రయోగంగా మార్చాలని ఎవరూ అనుకోరు. ఇద్దరూ వారంలో రెండు రోజులు మాత్రమే కలిసుంటే వారిద్దరి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన ఏర్పడడం కష్టం. భాగస్వామిలోనున్న లోపాలను కూడా ప్రేమించగలిగినప్పుడే ఆ వివాహం పదికాలాలు పచ్చగా ఉంటుంది. కానీ లోపాలను కప్పిపుచ్చుకుంటూ మనలో ఉన్న మంచిని మాత్రమే అవతలి వ్యక్తికి చూపించాలనుకున్నప్పుడు పెళ్లి అన్న పదానికే అర్థం లేకుండా పోతుంది’’ – శ్రేయా కౌలమ్, సైకాలజిస్ట్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ఈ గదిలోకి వెళ్లాల్సిందే!
ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్‌లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. సాక్షి, హైదరాబాద్: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్ రూమ్స్. వీటిని రేజ్ రూమ్స్, బ్రేక్ రూమ్స్, యాంగర్ రూమ్స్, డిస్ట్రక్షన్ రూమ్స్, స్మాష్ రూమ్స్... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. అసలేమిటీ రేజ్ రూమ్‌లు...? కోపం, కసి, ఫ్రస్ట్రేషన్ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్ రూమ్‌ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్‌్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి. ఎప్పుడు మొదలైందీ ట్రెండ్... 2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్‌లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్‌తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్రూమ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మన దేశంలోనూ షురూ... 2017లో ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్‌లో ‘బ్రేక్రూమ్’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ‘భద్దాస్’–యాంగర్ రూమ్ అండ్ కేఫ్ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్రూమ్ను ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్ హైదరాబాద్‌లో తొలి రేజ్రూమ్కు 25 ఏళ్ల సూరజ్ పూసర్ల శ్రీకారం చుట్టాడు. గదిలో ఏముంటాయి? పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్ రూమ్‌లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవీ ప్యాకేజీలు.. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రేజ్ రూమ్‌లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్ బుట్ట (బాటిల్ క్రేట్), ఓ కంప్యూటర్ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్ మోడ్’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్‌లు ఇంకా రేజ్ బాల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. పనికి రానివే.. పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్ రూమ్‌లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్ కేంద్రాలకుతరలిస్తాం. –నిర్వాహకులు -
ఓర్నీ.. టెక్నాలజీ సాయంతో బిక్షాటనా! ట్రెండ్ సెట్ చేశాడుగా!
సాక్షి, బొమ్మలరామారం: మారాజ.. మారాజ.. అంటూ చేతిలో తుపాకీతో, మాటల గారడీ చేస్తూ సంక్రాంతి వేళ భిక్షాటన చేస్తూ సందడి చేసే తుపాకీ రాముడు నేడు ట్రెండ్ మార్చాడు. పోలీస్ ఆఫీసర్లాంటి ఖాకీ యునిఫాం, చేతిలో కట్టె తుపాకీ, నెత్తికి టోపీ, నల్లరంగు బూట్లను ధరించే తుపాకీ రాముడు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కొత్త అవతారమెత్తాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రానికి చెందిన మిరాల రాములు సంచార జాతికి చెందిన వ్యక్తి. 42 ఏళ్లకు పైగా తుపాకీ రాముడి వేషధారణతో సంక్రాంతి సమయంలో భిక్షాటన చేస్తున్నాడు. ఇన్నేళ్లుగా నోటితో గారడీ మాటలు చెబుతూ భిక్షాటన చేసిన రాముడు నేడు ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగించుకుంటున్నాడు. వయసు మీద పడడంతో తన మాటలను రికార్డు చేసి బ్లూటూత్ స్పీకర్ సాయంతో జనానికి వినిపిస్తున్నాడు. సంక్రాంతి పండుగ వేళ బ్లూటూత్ సాయంతో మాటలు వినిపిస్తున్న తుపాకీ రాముడి సందడిని చూసి ప్రజలు ఔరా అని ఆశ్చర్యపోతున్నారు. – మిరాల రాములు, బొమ్మలరామారం (తుపాకీ రాముడు) (చదవండి: బోసిపోయిన భాగ్యనగరం..నిర్మానుష్యంగా మారిన రహదారులు) -
‘వర్క్ ఫ్రమ్ పబ్’.. మందేస్తూ, చిందేస్తూ పని చేయ్..!
లండన్: కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే పని)కి చాలా సంస్థలు మొగ్గు చూపాయి. అయితే, ఇంట్లో ఒంటరిగా కూర్చిని పని చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో విసుగు చెందటం సహజమే. అయితే, అలాంటి వారి కోసమే ఈ బంపర్ ఆఫర్. బ్రిటన్‌లో ఇప్పుడు ‘వర్క్ ఫ్రమ్ పబ్’ అనే సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. వర్క్ అండ్ ప్లే అనే కాన్సెప్ట్‌తో బార్లు, పబ్లులు ఇంటి నుంచే పని చేసే ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా బిజినెస్ లేక పబ్బులు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని ఆకట్టుకునే పనిలో పడ్డాయి యూకేలోని పబ్బులు. ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీలను అందిస్తున్నాయి. యూకేలోని ‘యంగ్’ పబ్ దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రాంచైజీల్లో ఈ ‘వర్క్ అండ్ ప్లే’ ప్యాకేజీని అందిస్తోంది. పని చేసుకునేందుకు ప్రత్యేక స్థలం, లంచ్‌లో సాండ్విచ్, అన్లిమిటెడ్ టీ, కాఫీలు కేవలం రోజుకు 15పౌండ్లు(రూ.1,300)లకే అందిస్తోంది. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్ విస్తరిస్తుండటంతో నలుగురితో కలిసి పనిచేయాలని కోరుకునే ఉద్యోగాలు.. పబ్బుల దారిపడుతున్నారు. ఈ ప్యాకేజీల్లో పవర్ సాకెట్స్, నిశబ్దంగా ఉండే క్యాబిన్లతో పాటు షిఫ్ట్ అయిపోగానే జిన్, పింట్, టోనిక్ వంటి వాటిని సైతం సేవించవచ్చు. అయితే, ఈ స్కీమ్‌ను 2020లోనే యంగ్ పబ్ లాంచ్ చేసింది. మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇప్పుడు మొత్తం 185 ప్రాంచైజీల్లో అమలు చేస్తోంది. తాము పబ్‌లో ఉండే వాతావరణానికే మొగ్గు చూపుతామని కొందరు వర్క్ ఫ్రమ్ పబ్ వినియోగదారులు చెబుతున్నారు. లండన్, గ్రీన్విచ్లోని కట్టి సార్క్ పబ్‌లో ‘వర్క్ ఫ్రమ్ పబ్’ చేస్తున్న ఎడ్యుకేషన్ కాపీరైటర్ జెన్ పలు విషయాలు పంచుకున్నారు. తాను 200 ఏళ్లనాటి వాతవరణాన్ని ఆఫీస్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్యాకేజీ వాటర్ కూలర్‌ను దెబ్బ తీస్తుందని చమత్కరించారు. యూకేలోని ఇతర పబ్బులు సైతం ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఫుల్లర్ పబ్ తన 380 ప్రాంచైజీల్లో రోజుకు 10పౌండ్లు(రూ.900)లకే లంచ్, డ్రింక్ అందిస్తోంది. అలాగే బ్రేవ్హౌస్ అండ్ కిచెన్ 10పౌండ్లకే వర్క్ స్పేస్‌తో పాటు వైఫై, పవర్ సాకెట్స్, అన్లిమిటెడ్ హాట్ అండ్ సాఫ్ట్ డ్రింక్, ప్రింటింగ్ సైతం అందిస్తోంది. ఇదీ చదవండి: 1161 కిలోల ‘జంబో’ గుమ్మడి.. జాతీయ రికార్డు బద్దలు! -
Hyderabad: తెలుగు బ్యాండ్.. నయా ట్రెండ్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. విభిన్న భాషల మేలు కలబోతతో విలసిల్లుతున్న హైదరాబాద్.. భాషలో, యాసలో ఆంగ్ల అనుకరణం కారణంగా కొన్నాళ్లుగా తెలుగుపై కాస్త మక్కువ తగ్గింది. ప్రస్తుతం నగర వేదికగా సంగీత వేదికలపై తెలుగు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ రాక్ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన వేదికలపైనే ఇప్పుడు తెలుగు పాటలు, జానపద సాహిత్యం కొత్త ట్రెండ్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన మ్యూజిక్ బ్యాండ్స్ నగరంలో సందడి చేసేవి. కానీ ఇప్పుడు దాదాపు పాతిక తెలుగు బ్యాండ్స్ ప్రాంతీయ భాషలో అలరిస్తున్నాయి. నగరంలోని బార్లు, పబ్‌లలో జస్టిన్ బీబర్ సాంగ్స్‌కు బదులు బుల్లెట్టు బండి పాటలు మార్మోగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లో సిక్స్ కొడితే ఎలక్ట్రిక్ మ్యూజిక్కు బదులు టాలీవుడ్ మాస్ పాటలు వినిపిస్తున్నాయి. నగర జీవన విధానంలో పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక స్థానముంది. బంజారాహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బార్, క్లబ్‌లలో ఇంగ్లిష్, హిందీ సంగీతం వినిపించేది. కొన్నేళ్లుగా ఈ స్పాట్లలో తెలుగు పాటలు ప్రారంభమయ్యాయి. కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం కేవలం తెలుగు సాహిత్యమే ప్రధానాంశంగా ప్రారంభించాయి. అయిదేళ్ల క్రితం ఇలాంటివి రెండు, మూడు ఉంటే ఇప్పుడు 40 వరకు పెరిగాయి. ఈ మధ్య కాలంలో అనూహ్యంగా తెలుగు బ్యాండ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టేజ్‌పైన లైవ్ మ్యూజిక్ బ్యాండ్‌తో మెలోడీ, మాస్, క్లాస్, జానపద పాటలు అలరిస్తుంటే ఫుడ్, సిప్‌ను ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. ఈ పరిణామంతో తెలుగు బ్యాండ్స్‌కు ఉపాధి పెరిగింది. తెలుగు మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా బాగానే ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ కోవిడ్ కారణంగా కాస్త నెమ్మదించాయి. నైట్ కల్చర్ బాగా అభివృద్ధి చెందిన ప్రదేశాల్లో మాత్రం తెలుగు పాటలే కొత్త ట్రెండ్. నగరం నలుమూలల్లోని ఏ బార్, రెస్టారెంటైనా తెలుగు పాటే క్రేజీనెస్. తెలుగు సాహిత్యం ఉన్న రిసార్ట్స్, బార్లకు కస్టమర్లు కుటుంబ సమేతంగా వస్తుండటం విశేషం. తెలుగు సాహిత్యమే ప్రస్తుత నేపథ్యం.. నగరవాసులు ఇప్పుడు తెలుగు పాటల ట్రెండ్‌నే అమితంగా ఇష్టపడుతున్నారు. కేవలం తెలుగు సాహిత్యాన్ని మాత్రమే ప్రదర్శించాలనే నేపథ్యంతోనే తబులా రాసా బార్ అండ్ రెస్టారెంట్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా తెలుగు పాటలే వినిపిస్తున్నాయి. తెలుగు లైవ్ మ్యూజిక్ బ్యాండ్లకు మంచి వేదికను ఏర్పాటు చేశాం. ఈ మధ్యకాలంలో తెలుగు పాటలను వింటూ కుటుంబంతో సరదాగా గడపాలనే వారి సంఖ్య పెరిగింది. నైట్ కల్చర్‌కు పేరొందిన ప్రదేశాల్లో తెలుగు పాటలున్నవాటినే ముందు రిజర్వ్ చేసుకుంటున్నారు. – జువ్వాడి శ్రవణ్, తబులా రాసా వ్యవస్థాపకుడు, జూబ్లీహిల్స్ -
ఐఫోన్14 అలా వచ్చిందో లేదో...ఐఫోన్15 సిరీస్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్14 అలా లాంచ్ అయిందోలేదో అప్పుడే రానున్న ఐఫోన్ సిరీస్‌పై ఊహాగానాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో లాంచ్ కానుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్‌లో భారీ మార్పులే చేయనుందట. ప్రస్తుతం ఐఫోన్ 14పై మోడల్స్ ఫీచర్స్ మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ ఈసారి భారీ అప్డేట్స్తో నెక్ట్స్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తాజా అంచనాల ప్రకారం ఐఫోన్-15 సిరీస్‌లో ప్రో, ప్రో మాక్స్ వేరియంట్ మధ్య భారీ మార్పులే తీసుకురానుంది.ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో అందించని ప్రత్యేక ఫీచర్లు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లో జోడించనుంది. కాగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఆవిష్కరించింది. ఐఫోన్-14 సిరీస్‌లో ప్రో, నాన్-ప్రో మోడల్స్ ఫీచర్స్ అప్డేట్ చేసినా, కానీ, రెండు ప్రో మోడల్స్ మధ్య బ్యాటరీ, స్క్రీన్ తప్ప మిగతా ఫీచర్స్‌లో పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ యూజర్లు భారీ నిరాశ చెందారు. ముఖ్యంగా ఆపిల్ వ్యవస్థపాకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఇన్‌స్టా స్టోరీ కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 చదవండి:ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది? (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 (1/2) I think Apple should name A16 as A16 Pro and A15 used by two iPhone 14 standard models as A16/A15 Plus. Maybe it helps promote two iPhone 14 standard models. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 -
విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?.. ప్రత్యేకతలివే
దొండపర్తి (విశాఖ దక్షిణ): సినిమాకు వెళ్లాలంటే.. సాధారణ థియేటర్‌కా.. మల్టీప్లెక్సుకా.. అంటూ అనేక ఆలోచనలు చేస్తుంటాం. కానీ కొద్ది రోజుల తరువాత ఈ చాయిస్ లిస్టులో ఇగ్లూ థియేటర్ కూడా చేరనుంది. పుర్రెకో బుద్ధి అన్న నానుడికి తగ్గట్టుగా ఆనంద్‌కు వచ్చిన సరికొత్త ఆలోచనతో సినిమా థియేటర్ రూపుదిద్దుకుంటోంది. ఈ థియేటర్ కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. చదవండి: ‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’ విశాఖ జిల్లాలో ఆనందపురం జంక్షన్ ఫ్లై ఓవర్ తరువాత జాతీయ రహదారికి ఆనుకొని ఏ స్క్వేర్ గోకార్టింగ్ వద్ద ఈ ఇగ్లూ థియేటర్ రూపుదిద్దుకుంటోంది. నెలన్నర క్రితం ప్రారంభమైన ఈ థియేటర్ నిర్మాణం ఇంకో నెల రోజుల్లో పూర్తి కానుంది. ఆగస్టు నెలలో థియేటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. థియేటర్ ప్రత్యేకతలు.. కేవలం 500 గజాల్లో ఇగ్లూ తరహాలో ఎఫ్ఆర్పీ మెటీరియల్‌తో ఈ థియేటర్‌ను నిర్మిస్తున్నారు. ఈ మినీ థియేటర్లో వంద మంది కూర్చొనే విధంగా సీట్ల ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫుల్ ఏసీ, హైక్వాలిటీ సరౌండ్ సిస్టమ్, ఇలా మల్టీప్లెక్సులకు సమానంగా థియేటర్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయిన వెంటనే పక్కనే 500 గజాల్లో మరో ఇగ్లూ థియేటర్‌ను నిర్మించనున్నారు. ఈ ఇగ్లూ థియేటర్.. మల్టీప్లెక్స్ ట్రెండ్‌కు గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. -
Kirru Cheppulu: ట్రెండ్ మారింది.. కిర్రు చెప్పుల ‘సోగ్గాడు’
కొనకనమిట్ల(ప్రకాశం జిల్లా): పెద్దల కాలంలో కిర్రు చెప్పులు రకరకాల రంగుల్లో తయారు చేయించి వేసుకొని వీధుల్లో తిరుగుతుంటే కిర్ కిర్ మంటూ వచ్చే శబ్దం అదో హోదాగా భావించేవారు. ముఖ్యంగా వివాహ వేడుకలు, అమ్మవారి కొలుపులు, ఉత్సవాల సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇలాంటి చెప్పులు వాడేవారు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ప్రజలు వాడే పాదరక్షల విషయంలో పెను మార్పులు చేటు చేసుకున్నాయి. చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా.. కానీ నేటికి అలనాటి కిర్రు చెప్పులపై మోజు తీరని కొందరు పల్లెవాసులు వాటిని వాడుతుండటం విశేషం. మండలంలోని కాట్రగుంట గ్రామంలో ఎల్లమ్మ కొలుపుల వేడుకల్లో రెట్టపల్లి గ్రామానికి చెందిన నాలి పెద్దన్న కిర్రు చెప్పులతో వచ్చి అందరిని ఆకట్టుకున్నాడు. రూ.3 వేలు ఖర్చుపెట్టి చెప్పులు తయారు చేయించానని సాక్షితో ముచ్చటించారు. -
నయా ట్రెండ్: డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్
నాగమణి సాధారణ గృహిణి భర్త ఉద్యోగి. ఓ మధ్యాహ్నం వేళ. అకస్మాత్తుగా ఇంటికి చుట్టాలు వచ్చారు. భోజన సమయం కావడంతో ఏం చేయాలో తోచక భర్తకు ఫోన్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే వేడివేడి వంటకాలతో ఫుడ్ డెలివరీ బాయ్ కనిపించాడు. భర్త ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన బంధువులు రీఫ్రెష్ అయ్యేలోపే తాజా వంటకాలు సిద్ధమయ్యాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్‌ఫ్రం హోంలో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్‌లు వేరు. ల్యాప్‌టాప్‌లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లోని ఫుడ్ డెలివరీ యాప్స్‌లో ఆర్డర్ చేయడం.. నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్‌ను తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. డాబాగార్డెన్స్/బీచ్‌రోడ్డు: విశాఖ నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వెరైటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. ఆకలి వేస్తుందన్న సంకేతాలు రాగానే ఆర్డర్ చేస్తే సరి.. వేడివేడి ఆహార పదార్థాలు గడప ముంగిటకు వచ్చేస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నాయి. కొత్త వంటల పరిచయం నగరవాసులకు వెరైటీ ఫుడ్ అందించాలని పలు హోటళ్లు ఎప్పటికప్పుడు ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఉత్తర భారత దేశం రుచులు, నవాబులు బిర్యానీ, కోస్టల్ రుచి.. ఇలా అనేక రకాల పేర్లతో ఫుడ్ ఫెస్టివళ్లను ఏర్పాటు చేసి ఆహార ప్రియులకు కొత్త అనుభూతిని అందిస్తున్నాయి. కొత్త రుచులు ఇంట్లో కష్టం వారంలో ఐదు రోజులు బిజీబిజీ. తీరిక లేని పనులు. ఫ్యామిలీకి టైం కేటాయించడం కూడా సాధ్యం కావడం లేదు. వీకెండ్ వచ్చిందంటే ఆ ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి రెస్టారెంట్ బాట పడుతున్నాం. మెనూలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి ఫ్యామిలీతో కలిసి చక్కగా భోజనం చేస్తున్నాం. వేర్వేరు అభిరుచులు ఉన్న వారికి ఇంట్లో తయారు చేయడం కొంత కష్టం. రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళితే ఎవరికి నచ్చిన ఐటమ్ వాళ్లు ఆర్డర్ చేసుకోవచ్చు. నచ్చిన వంటకాన్ని కడుపునిండా తినొచ్చు. – సీహెచ్ పవన్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి ట్రెండ్ మారింది ఒకప్పటికీ నేటికి ట్రెండ్ మారింది. వర్క్ స్టైల్ కూడా మారింది. అలానే ఆహారపు అలవాట్లు, అభిరుచులూ మారాయి. వీకెండ్స్ సంస్కృతి వచ్చింది. చాలా మంది ఫ్యామిలీతో రెస్టారెంట్‌కో, హోటల్‌కో వెళ్లి భోజనం చేస్తున్నారు. మెనూలో వెరైటీలు ఉండేలా చూసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా రెస్టారెంట్లు, హోటళ్లు తమ మెనూ మార్చుకుంటున్నాయి. హోం డెలివరీ, టేక్ ఏవే తగ్గిపోయి ఆన్లైన్లో ఆర్డర్స్ పెరిగాయి. హోటల్ బిజినెస్‌లో 60 శాతం వరకు ఆన్లైన్ ఆర్డర్స్ ఆక్రమించేశాయి. – వాకాడ రాజశేఖర్‌రెడ్డి, అతిథి దేవోభవ హోటల్ యజమాని నగరంలో నయా ట్రెండ్ హీరో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భోజన సమయంలో ఇంటికి వచ్చిన బంధువులకు ఏం వంట చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్న హీరోయిన్‌కు హీరో మంచి ఐడియా చెప్తాడు. సిటీలో ప్రముఖ హోటల్ నుంచి ఫుడ్ రప్పించి బంధువులకు అన్ని రకాల రుచులు చూపించి వారి చేత శభాష్ అనిపిస్తాడు. ప్రస్తుతం నగరంలో ఇటువంటి ట్రెండే నడుస్తోంది. ఇంటికి వచ్చే బంధువులకు నగరంలోని లభించే కొత్త కొత్త రుచులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. అందిస్తున్నారు. హోటళ్ల పేర్లూ వెరైటీనే.. విశాఖ నగర వాసులు రోజూ ఇంటి భోజనం తినేందుకు ఇష్టపడడం లేదు. సకుటుంబ సమేతంగా హోటల్‌కో, దాబాకో వెళ్లి సరికొత్త రుచులను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యజమానులు రెస్టారెంట్లు, హోటళ్లకు వెరైటీ పేర్లు పెడుతున్నారు. అమ్మ చేతి వంట, వంటిళ్లు, అరిటాకు, వంటకమ్.. ఇలా రకరకాల పేర్లతోనే కాదు.. బాబాయ్ హోటల్, సుబ్బయ్య హోటల్, రాజుగారి హోటల్, కుండ బిర్యానీ వంటి పేర్లతోనూ నడుస్తున్న హోటళ్లు నగరంలో తమ ప్రత్యేకత చాటుకుంటున్నాయి. బుట్ట భోజనం, కాంబో ఆఫర్, ఫ్యామిలీ ఫ్యాక్, జంబో బిర్యానీ ఇలా స్పెషల్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ.. ఉదయం ఆరు గంటల నుంచే ఆర్డర్లు మొదలవుతాయి. వాటర్ బాటిల్ నుంచి ఐస్‌క్రీం వరకు, టిఫిన్ నుంచి భోజనం, పసందైన బిర్యానీ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కొందరు కర్రీస్, స్నాక్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. రోజు రోజుకూ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లల్లో వంట చేయడం చాలా వరకు తగ్గింది. వేగంగా డెలివరీ చేయడం కూడా ఇందుకు కారణం. ఆన్లైన్ యాప్‌లు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. – కిరణ్, ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్ ఫెస్టివల్స్‌కు వెళ్తుంటా.. నాకు కొత్త కొత్త రుచులంటే చాలా ఇష్టం. అటువంటి రుచులు ఇంట్లో కష్టం. అందుకే నగరంలో ఎక్కడ కొత్త రుచులు ఉన్నాయంటే అక్కడ వాలిపోతా. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్స్, నూతన రెస్టారెంట్లకు వెళ్లి అక్కడ రుచులన్నీ ఆస్వాదిస్తా. –హేమసుందర్ కొత్త రుచులను టేస్ట్ చేస్తాం నేను, నా భర్త ఇద్దరం ఉద్యోగం చేస్తుంటాం. ఇద్దరం కలిసి భోజనం చేయడానికి సమయం దొరకదు. అందుకే వారంలో ఒక్క రోజైనా రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్తాం. కొత్త రుచులను టేస్ట్ చేస్తాం. –రమ్య -
న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్‌కుమార్ సింగ్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్‌గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్‌గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
నయా ట్రెండ్...విలేజ్గ్రౌండ్
రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్ క్యాబిన్ల డిమాండ్ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్ క్యాబిన్లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్ ఆఫీసు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్ క్యాబిన్స్ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ తయ్యబ్ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్ క్యాబిన్లు నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థానికంగా తయారీ... ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్ క్యాబిన్లలో ఇంటీరియల్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... కాకా హోటళ్లు...చాయ్ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది. గతంలో.. సాధారణంగా చాయ్ లేదా ఫాస్ట్‌ఫుడ్ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్ కాంపెక్లŠస్ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్’ కాకున్నా మనకు ‘లక్’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. రీ యూజ్ ఇలా.. కంటైనర్లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. వాటిని స్క్రాబ్ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్ కోసం వినియోగించే మెటల్ కంటైనర్లను పోర్టబుల్ హౌసెస్, ఆఫీస్ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్ షాప్స్, మెటల్ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్హౌస్లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్గోడవున్ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు. లోపల ఏమేమీ ఉంటాయంటే... లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్ఫ్లోర్స్, టైల్స్, ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్వోల్ వినియోగించి ప్రీమియం లుక్ తీసుకువస్తున్నాం. అన్నింటికీ అనుకూలత... తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి. మోబుల్ హౌస్, షాపు ఏదైనా... పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్ కంటైనర్..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్ బెడ్రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్ పోర్ట్‌బుల్ హౌస్ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్ హౌస్ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం లేదు. నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్సెంటర్కు రెడీమెడ్గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. – వెంకటనర్సు, యడ్లపాడు -
అక్షయ్ న్యూ ట్రెండ్
-
పురోహితురాలు.. అమెరికాలో పెళ్లిళ్లు చేస్తున్న సుష్మా ద్వివేది
పురుషులతోపాటు మహిళలు దాదాపు అన్నిరంగాల్లో సమానంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా నిత్య పూజల నుంచి కైంకర్యాల దాకా అంతా మగ పూజారులు, పండితులు మాత్రమే చూసుకోవడం చూస్తున్నాం. కానీ అమెరికాలో పండితుల పీటమీద సుష్మా ద్వివేది కూర్చుని పెళ్లిళ్లు జరిపిస్తూ కొత్త ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. కుల, మత భేదం లేకుండా పెళ్లిళ్లు చేయడమే గాక, పూజలు, వ్రతాలు కూడా నిర్వహిస్తోంది. భారత సంతతికి చెందిన సుష్మ కెనడాలో పెరిగిన అమ్మాయి. 2013లో వివేక్ జిందాల్‌తో పెళ్లి జరిగింది. వీరి పెళ్లితోపాటు వివేక్ జిందాల్ తోబుట్టువు ఒకరి పెళ్లికూడా అదే సమయంలో ఏర్పాటు చేశారు. కానీ అది ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి. దీంతో సుష్మా వాళ్ల పెళ్లి శాస్త్రోక్తంగా జరిగినప్పటికీ తోబుట్టువు పెళ్లి అలా జరగలేదు. అప్పుడు అంతా బాధపడ్డారు. ఆ పెళ్లి కూడా సంప్రదాయబద్ధంగా జరిగితే బావుండును అని సుష్మకు అనిపించింది. కానీ అలా జరగలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోన్న వారికి పరిష్కారం చూపాలని అప్పటి నుంచి ఆలోచించడం ప్రారంభించింది సుష్మ. తొలి బిడ్డ ప్రసవ సమయంలో... నెలలు నిండిన సుష్మ ఆసుపత్రిలో చేరింది. అక్కడ కాన్పు సవ్యంగా జరగడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో ఓ జంటకు పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎనస్థీషియా డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ జంట పెళ్లికి ముందే బిడ్డకు జన్మనివ్వడమే అందుకు కారణమని ఆమె చెప్పడంతో సుష్మ మరోసారి ఆలోచనలో పడింది. అరగంట ఆలోచించి ఆ జంటకు తానే పెళ్లిచే యిస్తానని చెప్పింది. ప్రసవం అయ్యి బెడ్‌మీద నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న సుష్మ గదిలోకి ఆ జంట రాగా అక్కడ ఉన్న నర్సులు పాట పాడగా ఆ జంటకు పెళ్లి తంతుని ముగించింది సుష్మ. ఈ కార్యక్రమం మొత్తాన్ని వివేక్ ఐఫోన్లో వీడియో తీశారు. ఆ తరువాత ఆ వీడియో బాగా వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా సుష్మ పాపులర్ అయ్యింది. అప్పటి నుంచి హిందూ సంప్రదాయంలో ఉన్న పెళ్లిమంత్రాలను నేర్చుకుని పెళ్లిళ్లు చేయడం ప్రారంభించింది. బామ్మ దగ్గర నేర్చుకుని.. ప్రారంభంలో అంతా సుష్మను వ్యతిరేకించినప్పటికీ వాటన్నింటి దాటుకుని ముందుకు సాగుతూ అమెరికాలోనే తొలి మహిళా పురోహితురాలిగా నిలిచింది. ఇదే రంగంలో కొనసాగాలని నిర్ణయించుకున్న తరువాత హిందూ సంప్రదాయాల గురించి లోతుగా తెలిసిన బామ్మతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుంది. అంతేగాక బామ్మతో కలిసి... పూజలు, పెళ్లికి ఏయేమంత్రాలు చదువుతారు? వాటిని ఎలా ఉచ్చరించాలి? సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన క్రతువుల గురించి వివిధ గ్రంథాలను చదివి పెళ్లిమంత్రాలను ఆపోశన పట్టింది. అంతేగాక 88 ఏళ్ల బామ్మ ఇచ్చిన ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని అనేక పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా ఇప్పటిదాకా దాదాపు యాభై పెళ్లిళ్లు చేసింది. అరగంట పెళ్లి.. ఎంతో చక్కగా పెళ్లిళ్లు చేస్తోన్నసుష్మా.. మరింతమందికి తన సేవలు అందించేందుకు 2016లో ‘పర్పుల్ పండిట్ ప్రాజెక్ట్’ పేరిట న్యూయార్క్‌లో సంస్థను ప్రారంభించింది. దీనిద్వారా పెళ్లితోపాటు అనేక మతపరమైన సేవలను అందిస్తోంది. దక్షిణాసియాలోని ‘గే’ కమ్యూనిటీ వాళ్లకు అరగంటలో పెళ్లి చేస్తుంది. సంప్రదాయ హిందూ పెళ్లిళ్లను మూడుగంటల్లో పూర్తి చేస్తోంది. అంతేగాక తన భర్త నిర్వహిస్తోన్న ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ ‘డెయిలీ హార్వెస్ట్’కు ఉపాధ్యక్షురాలిగా కూడా సేవలందిస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి ఒకపక్క సంసారాన్ని, మరోపక్క కంపెనీ బాధ్యతలనూ నిర్వర్తిస్తూనే పౌరోహిత్యం కూడా అంతే సజావుగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని కామెంట్లు వస్తున్నాయి. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుష్మ మరిన్ని పెళ్లిళ్లతో ముందుకు సాగాలని కోరుకుందాం. బాలింతగా ఆస్పత్రి బెడ్‌పైన ఉండి మరీ పెళ్లి జరిపిస్తున్న సుష్మ -
మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ !
మొఘల్ కిచెన్‌లో రూపుదిద్దుకుని నాన్ వెజ్ ప్రియులకు ఇప్పుడెంతో ఇష్టమైన ఆహారంగా మారింది బిర్యానీ. ఎప్పడికప్పుడు బిర్యానీలో వెరైటీలు పుట్టుకొస్తున్నా చికెన్ బిర్యానీనే రాజభోగం. అందులో లెగ్పీస్కే అగ్రాసనం. ఇప్పుడా లెగ్పీస్కి ఛాలెంజ్ ఎదురైంది. నగరంలో సరికొత్త ట్రెండ్‌గా నల్లిబిర్యానీకి డిమాండ్ పెరుగుతోంది. ఊరూరా బిర్యానీ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకం హైదరాబాద్ బిర్యానీ. కానీ దశాబ్ధ కాలంగా బిర్యానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా విస్తరించింది. జిల్లా కేంద్రాలను దాటి మున్సిపాలిటీలకు చేరుకుంది. రోడ్డు పక్కన చిన్న షెడ్డులో కూడా టేక్ ఎవే సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఇంతలా విస్తరిస్తున్నా ఎక్కడా బిర్యానీ క్రేజ్ తగ్గడం లేదు. పైగా కొత్త వెరైటీలు పుట్టుకొస్తున్నాయి. ముంబైలో బాగా ఫేమసైన నల్లి బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లలో హల్చల్ చేస్తోంది. నల్లి బిర్యానీ బిర్యానీలో రారాజుగా ఉన్న చికెన్ బిర్యానీ పోటీగా ఎదుగుతోంది నల్లి బిర్యాని. మటన్‌లో నల్లి బొక్కలతో ప్రత్యేకంగా ఈ వంటకాన్ని తయారు చేయడంతో దీన్ని నల్లిబిర్యానీగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా బిర్యానీలో బాస్మతి రైస్, చికెన్ లేదా రైస్‌ను కలిపి వండుతారు. అయితే నల్లి బిర్యానీలో రైస్, నల్లి బొక్కలను వేర్వేరుగా వండుతారు. ఆ తర్వాత వీటిని కలిపి నల్లి బిర్యానీగా సర్వ్ చేస్తారు. మటన్‌లో ప్రత్యేక రుచిని కలిగి ఉండే నల్లి ఎముకలకు బిర్యానీ రెసీపీ తోడవడటంతో నల్లి బిర్యానీని లొట్టలెసుకుని తింటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పెరిగిన డిమాండ్ హైదరాబాద్ నగరంలో నల్లి బిర్యానీ ట్రెండ్ క్రమంగా విస్తరిస్తోంది. బిర్యానీ ప్రియుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో క్రమంగా నల్లి బిర్యానీ అందిస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ల సంఖ్య పెరుగుతోంది. ముందుగా బంజార్‌హిల్స్, మసాబ్‌ట్యాంక్ దగ్గర రెస్టారెంట్లలో మొదలైన నల్లి బిర్యానీ ప్రస్థానం క్రమంగా హైదరాబాద్ నలుమూలలకు విస్తరిస్తోంది. సాధారణ బిర్యానీతో పోల్చితే రేటు నల్లి బిర్యానీ రేటు ఎక్కువ. అయినా సరే రేటు కంటే రుచే ముఖ్యం అంటూ నల్లిబిర్యానీకి షిఫ్ట్ అవుతున్నారు. నల్లి బిర్యానీ వండే చెఫ్‌లకు ప్రాముఖ్యత పెరిగిపోతుంది. చదవండి : అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
పడవలో మూడు ముళ్లు, ఏడు అడుగులు
వెబ్‌డెస్క్ : వివాహ వ్యవస్థకు అత్యంత గౌరవం ఇచ్చే సమాజం మనది. అందుకే పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి వేడుకలు నిర్వహించడంపై ఎంతో దృష్టి పెడతారు. కేపీఎంజీ సంస్థ 2017లో రూపొందించిన నివేదిక ప్రకారం ఇండియాలో పెళ్లి వేడుకలపై ఏడాదికి ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని చెప్పింది. పెళ్లిని ఘనంగా నిర్వహించడంలో అమెరికరా తర్వాత స్థానం ఇండియన్లదే. న్యూ బిజినెస్ అయితే కరోనా తర్వాత పెళ్లి వేడుకల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ రూల్స్, సోషల్ డిస్టెన్సింగ్‌తో స్వంతూరిలో ఘనంగా పెళ్లి నిర్వహించడం కష్టంగా మారింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ఇంచుమించ ఇవే తిప్పలు ఎదురువుతున్నాయి. ఈ తరుణంలో ఒక్కసారిగా క్రూయిజ్ వెడ్డింగ్‌కి డిమాండ్ పెరిగింది. రెండేళ్ల క్రితం అక్కడక్కడ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. రాబోయే కార్తీక మాసంలో పెళ్లిళ్లలకు సంబంధించి ఇప్పటికే వెయిటింగ్ లిస్టు ఉందంటున్నారు క్రూయిజ్ వెడ్డింగ్ ఈవెంట్ నిర్వహకులు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. చదవండి : Tesla: భారత్‌లో రయ్..రయ్ : వైరల్ వీడియో -
ఫొటో షూట్.. లోకల్ స్పాట్
ఒకప్పుడు పెళ్లి వేడుకకు సంబందించి ఫొటోలు, వీడియోలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే జంటలు ‘ప్రీ వెడ్డింగ్’ ఫొటోషూట్ తీయించుకుంటున్నారు. ప్రస్తుతం ఫొటోషూట్‌కు విపరీతమైన క్రేజీ పెరిగింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు అంతటా విస్తరించింది. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు నచ్చి నిశ్చితార్థం జరిగిందంటే చాలు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లకు సిద్ధమవుతున్నారు. ఫొటో, వీడియోగ్రాఫర్లను తీసుకుని తమకు ఇష్టమైన స్పాట్లకు వెళ్లి అందమైన కాస్టూమ్తో నచ్చే విధంగా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. వీటికి సినీ, జానపద పాటలను కూడా కలుపుతున్నారు. ఇందుకోసం వేలు, లక్షల్లో డబ్బు ఖర్చుపెడుతున్నారు. నగర శివార్లలోని రిసార్ట్స్‌లు, దేవాలయాలు, పార్కులు, ఫాంహౌస్‌లు, లేక్‌లు ఫొటోషూట్‌కు ఔట్‌డోర్ లొకేషన్లుగా మారాయి. మాయాబజార్లో ఓ జంట స్టిల్.. శంషాబాద్, మొయినాబాద్: నగర శివారు ప్రాంతాలు ఫొటోషూట్ స్పాట్స్‌గా మారాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, గండిపేట, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, మేడ్చల్ తదితర మండలాల్లోని రిసార్ట్స్, టెంపుల్స్, ఫాంహౌస్‌లు, పార్కులు, లేక్‌లలో ఫొటోషూట్లు అధికంగా జరుగుతున్నాయి. ప్రధానంగా మొయినాబాద్ మండలంలోని మృగవనితో పాటు మరో రెండు రిసార్ట్స్, మృగవని పార్కు, చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో గండిపేట చెరువు, హిమాయత్‌సాగర్ చెరువు, పలు ఫాంహౌస్‌లు, శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి దేవాలయం, గండిపేట, గోల్కొండ సమీప ప్రాంతాలు ఇందుకు వేదికగా మారాయి. అదేవిధంగా మహేశ్వరం మండలంలోని వండర్లా, కీసర మండలంలోని కీసరగుట్ట ఆలయం, శామీర్‌పేట మండలంలోని పలు రిసార్ట్లు, శామీర్‌పేట పెద్ద చెరువు ఫొటోషూట్ స్పాట్స్‌గా నిలుస్తున్నాయి. మాయాబజార్లో జంట సందడి స్పెషల్‌గా ‘మాయాబజార్’ సినీ షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే శంషాబాద్ ఇప్పుడు ఇలాంటి వేడుకలకు సంబంధించిన షూటింగ్లలో కూడా అగ్రస్థానంలోనే ఉంది. పట్టణంలోని ఫోర్ట్గ్రాండ్.. సిద్దులగుట్ట దేవాలయం, అమ్మపల్లి దేవాలయం పరిసరాల్లో ఫొటోషూట్లు జరుగుతున్నాయి. నర్కూడ సమీపంలో ఏర్పాటు చేసిన ‘మాయాబజార్’.. ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్, పుట్టినరోజు, సీమంతాలు తదితర షూటింగ్‌ల కోసం ఇద్దరు మహిళల నిర్వహణలో కొనసాగుతోంది. ఇందులో 20 ఔట్‌డోర్, ఇండోర్ లొకేషన్లను అందంగా తీర్చిదిద్దారు. సినిమా షూటింగ్‌లతో పాటు ప్రముఖుల వివాహవేడుకలకు కన్వెన్షన్‌గా ఉన్న ఫోర్ట్గ్రాండ్లో ఈ షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. మొఘల్ శైలిలో నిర్మాణం చేసిన ఈ కోట అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ సినిమాలకు సెంటిమెంట్‌గా ఉన్న అమ్మపల్లి దేవాలయంలో కోనేరు పరిసరాలో ఇలాంటి షూటింగ్‌లు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ చిత్రీకరణ జరిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమంతో పాటు బంధువులు, స్నేహితుల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో వివిధ జిల్లాలతో పాటు బయటి రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఎంతో ఆసక్తితో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీయించుకుంటున్నారు. ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదు. ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెరిగిన డిమాండ్.. యువతలో ఫొటోషూట్లకు క్రేజీ పెరగడంతో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు బిజీ అవుతున్నారు. గతంలో పెళ్లి సమయంలోనే ఫొటోలు, వీడియోలు తీసేపని ఉండేది. కానీ, ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్, పెళ్లి సమయంలో, పెళ్లి తరువాత కూడా ఫొటోషూట్ తీయిస్తుండడంతో వారికి పని పెరిగిపోయింది. శివారుల్లోనే మంచి లొకేషన్లు ఫొటోషూట్లకు నగర శివారు ప్రాంతాల్లోనే మంచి లొకేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలోనే చాలా రిసార్ట్స్‌లు, చెరువులు, టెంపుల్స్, ఫాంహౌస్‌లు, పార్కులు ఉండటంతో వాటిలోనే చాలా ఫొటోషూట్లు చేస్తున్నాము. యువత ఆసక్తిని బట్టి లొకేషన్లు మారుస్తుంటాము. – నందు, వీడియోగ్రాఫర్ కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు.. ఫొటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పెళ్లికే ప్రాధాన్యత ఇచ్చి ఫొటోలు, వీడియోలు తీయించుకునేవారు. కానీ, ఇప్పుడు పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా తమకు నచ్చిన విధంగా ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇప్పుడు యువత కొత్తదనాన్ని కోరుకుంటోంది. అందుకు అనుగుణంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలోనూ మార్పులు వచ్చాయి. – రమేష్‌గౌడ్, ఫొటోగ్రాఫర్ -
నువ్వక్కడ, నేనిక్కడ! ఎంచక్కా!!
సాక్షి, న్యూఢిల్లీ : రాఘవ్ చాబ్రా, 28 ఏళ్ల యువకుడు. ఢిల్లీలో చార్టెట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఇంకా పెళ్లి కాలేదు. ఒంటరి వాడు. ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తున్నారు. ఇంట్లో వంట పనులు, లాండ్రీ పనులు తానే చూసుకుంటున్నారు. కరోనా భయం కారణంగా బయటి నుంచి తెచ్చిన సరకుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాంతో పాటు సాయంత్రం ఏడయ్యే సరికి ఆయన శరీరం అలసిపోతోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకుని ఉల్లాసంగా ఉండేందుకు ఆయన ప్రతి రోజు ఏడు గంటలకు ఓ గంట కాలాన్ని ఆనంద కాలక్షేపానికి కేటాయిస్తారు. ఆ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో మిగిలి పనులు చక్క బెట్టుకొని నిద్రకు ఉపక్రమిస్తాడు. అయితే, ఆనందం కోసం గంట కాలాన్ని ఎలా వెచ్చిస్తున్నాడన్న అనుమానం రావొచ్చు. మద్యం సేవిస్తూ ఆయన గంటపాటు అనందంగా కాలక్షేపం చేస్తారనుకుంటే పొరపాటు. ఆ ఆనంద సమయంలో చాబ్రా తన దత్తత తీసుకున్న కుక్క పిల్లతో ఆడుకుంటారు. ముచ్చట్లు పెడతారు. అలా అని ఆ కుక్క పిల్ల ఆయనతోని ఆయన ఇంట్లో ఉంటుందనుకుంటే కూడా పొరపాటే. అది ఢిల్లీకి శివారులోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతంలోని జంతు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఉంటోంది. దానితోని చాబ్రా తన ల్యాప్‌టాప్‌లో స్కైప్ ద్వారా ఆడుకుంటారు. మాటల ద్వారా, సైగల ద్వారా ఆ కుక్కతో ఆత్మీయ అనుబంధాన్ని ఆస్వాదిస్తారు. చాబ్రా అదష్టవశాత్తు దేశంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చిన మార్చి 25వ తేదీకి కొన్ని రోజుల ముందే ఆ కుక్క పిల్లను దత్తత తీసుకున్నారు. దానికి ఫ్రన్నీ అని పేరు కూడా పెట్టుకున్నారు. అక్కడ సంరక్షణ కేంద్రంలో దాని పోషణకు అయ్యే ఖర్చును చాబ్రానే భరిస్తారు. నెలకు లేదా రెండు నెలలకోసారి ఆ ఖర్చును డిజిటల్ పేపెంట్ ద్వారా చెల్లిస్తారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశాక పెంపుడు కుక్కల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ‘ఉమ్మీద్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ’ కార్యాలయానికి వెళ్లి దాన్ని ప్రత్యక్షంగా చూద్దామని, ఓ వారం రోజులపాటు దాన్ని తీసుకొని ఊళ్లు తిరుగుదామని చాబ్రా అనుకుంటున్నారు. పెంపుడు జంతువులతో మానసిక ఉల్లాసం కరోనా కష్ట కాలంలో చాబ్రా లాంటి జంతు ప్రేమికులకు, ఒంటరి వాళ్లకు పెంపుడు కుక్కలను దత్తత తీసుకోవడం అనే కొత్త ట్రెండ్ ఇప్పుడు పెరిగిపోయింది. సొంతిళ్లు లేని జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకునేందుకు భయపడతారు. సొంతిళ్లు ఉన్న వాళ్లలో కూడా ఇంట్లోని పెద్ద వాళ్లకు భయపడి పెంచుకోరు. ఇక ఒంటిరి వాళ్లయితే ఆఫీసుకు, ఇంటికి మధ్యలో దాని ఆలనాపాలనా చూసుకోలేమని భయపడతారు. ఇక అలాంటి భయాలు లేకుండా కుక్కలను దత్తత తీసుకునే పద్ధతి ఆచరణలోకి రావడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానితో ఆడుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా జంతు ప్రేమికులు భావిస్తున్నారు. ఒంటరితనంతో బాధ పడే యువతీ, యువకులు లేదా పెద్ద వారికి పెంపుడు కుక్కలతోని ఎంతో మానసిక ఉపశమనం లభిస్తుందని గురుగ్రామ్‌లోని ‘మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్’ అధిపతి డాక్టర్ కామ్నా చిబ్బర్ తెలియజేస్తున్నారు. ఓ పెంపుడు కుక్క పోషణకు నెలకు కనీసం మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని ‘పీపుల్ ఫర్ ఎనిమల్’ సభ్యులు విక్రమ్ కొచ్చార్ తెలిపారు. దేశంలోని జంతు సంక్షేమ సంఘాల్లో ఈ సంస్థ అతి పెద్దదనే విషయం తెల్సిందే. కరోనా సందర్భంగా ఊర కుక్కల వల్లనే ‘దత్తత’ అనే కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చిందని ఆయన తెలిపారు. లాక్డౌన్ వల్ల ఊర కుక్కలకు తిండి దొరక్క పోవడం, వైరస్ సోకుతుందనే భయంతో కొందరు పెంపుడు కుక్కలను వీధుల్లో వదిలేశారని, వాటన్నింటిని వివిధ సంరక్షణ కేంద్రాలకు తరలించి, దత్తత ద్వారా వాటిని పోషిస్తున్నట్లు ఆయన వివరించారు. గురుగావ్‌లో మనోజ్ మీనన్ అనే జంతు ప్రేమికులు రెండు ఎకరాల గార్డెన్లో ఈ కుక్కలను పోషిస్తున్నారు. వాటి కోసం స్మిమ్మింగ్ పూల్‌ను కూడా నిర్వహిస్తున్నారు. ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల ద్వారా వాటి దత్తత యజమానులతో కాలక్షేపం చేసేలా శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ కొంత కాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని విక్రమ్ కొచ్చార్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ సరికొత్త ట్రెండ్..
-
మరో దిక్కుమాలిన ఛాలెంజ్...
సాక్షి, న్యూఢిల్లీ : స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ పేరిట సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన సరికొత్త ట్రెండ్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ ప్రమాదకర ఛాలెంజ్ వీడియా షేరింగ్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌లో సర్క్యులేట్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు గాలిలో ఎగురుతుండగా, మూడో వ్యక్తి వారి మధ్యలో నిల్చుని అలాగే చేస్తుంటాడు. మధ్యలో వ్యక్తి పైకి ఎగురుతుండగా అతడి కాళ్లపై మిగిలిన ఇద్దరూ తన్నడం ఈ ఆట ప్రత్యేకత. మధ్యలో వ్యక్తి కింద పడేలా తన్నడం చూసిన చిన్నారులు, యువత ఈ ఛాలెంజ్ మత్తులో కూరుకుపోయారు. యాప్‌లో చూపిన విధంగా చిన్నారులు చేస్తుండటంతో వెన్నెముక, తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యువతలో ఈ ఛాలెంజ్‌కు ఆదరణ పెరిగితే వారికి గాయాలయ్యే ప్రమాదం ఉందని తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీనేజ్ యువత ఎక్కువగా ఈ ట్రెండ్‌ను ఫాలోఅవడంతో ఇప్పటికే పలువురికి గాయలయ్యాయని ఎవరూ ఇలాంటి వాటి జోలికి పోరాదని సోషల్ మీడియా నిపుణులు సూచిస్తున్నారు. చదవండి : బన్నీ మనసును తాకిన టిక్‌టాక్ వీడియో -
కుక్కలకు కూడా ఖరీదైన పరుపులు
సాక్షి, న్యూఢిల్లీ : మెత్తటి పరపులపై పడుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చుగానీ డబ్బున్న మహరాజులకు అదో లెక్కా! అయితే మనుషులు పడుకునేందుకు డబ్బుల గురించి లెక్క చేయలేకపోవచ్చుగానీ, కుక్కల కోసం పరుపులు కొనాలంటే, అందులో ఖరీదైనా పరువులు కొనాలంటే ఎంతటి మహరాజులకైనా లెక్కలెకుండా ఉంటుందా! ఇప్పుడు పెంపుడు కుక్కల పరుపులు కూడా పెద్ద బిజినెస్‌గా మారిపోయింది. అందులో రాయల్ పరుపుల సంగతి చెప్పక్కెర్లేదు. ఈ పరుపులను డిజైన్ చేయడానికి ప్రత్యేక డిజైనర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఈ పరుపులు భారతీయ కరెన్సీలో 95 వేల రూపాయల వరకు పలకడం విశేషం. వీటిని రాయల్ కేటగిరీగా పేర్కొంటున్నారు. ఆస్ట్రియా రాకుమారి కటాలిన్ జూ విండిజ్గ్రేజ్ ర్యాన్ వియెన్నాలో సొంత బ్రాండ్‌తో ఈ పరుపుల అమ్మకాలను ప్రారంభించారు. ఆమె తన పేరు స్ఫురించేలా ‘కేజెడ్డబ్లూ పెట్ ఇంటీరియర్స్’ దానికి పేరు పెట్టారు. వాటికి బుల్లి మంచం పరుపు నుంచి కాస్త పెద్ద మంచం పరుపు వరకు, నేల మీద వేసుకునే పరుపులను, వాటికి అనుగుణమైన మెత్తలను కూడా డిజైన్ చేసి అమ్ముతున్నారు. ఈ పరుపులు 800 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉన్నాయి. వాటికి విడివిడి గౌషన్లు కూడా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మార్చు కోవచ్చు. ఆ తర్వాత ఆమె పెంపుడు కుక్కలు ఆడుకునే ఆట వస్తువులతో ‘డాగ్ ఫర్నీచర్’ పేరిట వ్యాపారాన్ని విస్తరించారు. మరో పరుపుల కంపెనీ ‘చార్లీ చాహు’ 800 రూపాయలకు విడుదల చేసిన ‘చార్లీ చాహు స్నగుల్ బెడ్’ పాశ్చాత్య దేశాల మార్కెట్లో పిచ్చ పిచ్చగా అమ్ముడుపోతోంది. అందుకు కారణం దాని ధర అందరికి అందుబాటులో ఉండడమే. చార్లీ చాహు కంపెనీని క్రిసై్టన్ చాహు తన సోదరి జెన్నీ చాహుతో కలసి ఏర్పాటు చేశారు. పెంపుడు కుక్కల కోసం ‘పిప్పా అండ్ కంపెనీ’ మధ్యస్థాయి లగ్జరీ పరపులను తయారీచేసి మార్కెట్లో విక్రయిస్తోంది. వీటిని వాషింగ్ మషిన్లో వేసి ఉతికే అవకాశం కూడా ఉండడం విశేషం. పరుపులోని కుషన్‌కు వాసన, నీరు అంటకుండా నిలువరించగల లైనర్లను ఈ పరపుల తయారీలో ఉపయోగించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు జెన్నీఫర్ టేలర్ తెలిపారు. ‘సిగ్నేచర్ బెడ్స్’ పిప్పా అండ్ కంపెనీ పేరిట పెంపుడు కుక్కల పరపులను సరఫరా చేస్తోంది. -
కుదిపేస్తున్న సరికొత్త ట్రెండ్ ‘ట్రేడ్‌వైఫ్’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆనాటి రోజులు తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుంది. పొద్దు పొద్దున్నే లేచి ఇల్లూ వాకిలి తుడిచి, కల్లాపి చల్లి, ముగ్గులేయడం, గుప్పు గుప్పుమంటూ ముక్కు పుటాలు అదరగొట్టే వేడి వేడి కాఫీ తాగడం, పెరట్లోకి వెళ్లి పేరుకుపోయిన వంట పాత్రలను శుభ్రంగా తోమేయడం, అప్పుడే లేచి పాల కోసం ఏడుస్తున్న చంటోడిని చక్కనేసుకొని పాల పీక నోట్లో పెట్టడం, చిట్టి కన్నా! అంటూ వాడి కన్నీళ్లను తుడుస్తుంటే అందుకు కతజ్ఞతగా వాడు ఆత్మీయంగా నాకేసి చూడడం, ఇంకేమి భయం లేదన్నట్లు మగతలోకి జారుకుంటున్న వాడిని పడుకోపెట్టడం, మిగిలిన చిల్లర పనులు పూర్తిచేసి గబగబా టిఫిన్ తయారు చేయడం, ఇంటిల్లిపాది కలిసి ఆరగించి వసారాలో కాసేపు సేద తీరడం, ఆ తర్వాత రెండు, మూడు గంటలు భోజన ఏర్పాట్లలో తలమున్కలై ఉండడం, ఇంటిల్లి పాదికి కొసరి కొసరి వడ్డించి మెప్పులు, అప్పుడప్పుడు వడ్డింపులు పొందడం ఎంత హాయి! సాయం సంధ్య వేళల్లో పెరట్లోని మల్లె చెట్టు వద్దకెళ్లి విరిసీ విరయని మొగ్గల్ని తెంపి, వాటిని దండగా కూర్చి నెత్తిలో పెట్టుకోవడం, ఏవో తీయని తలపులతో బుగ్గలు ఎరుపెక్కడం, అరుగున చేరి ఇరుగుపొరుగు వారితో పిచ్చాపాటి మాట్లాడుకోవడం అబ్బా ఎంత హాయి!....ఆనాటి రోజులు తలచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతోంది’ అచ్చం ఇలాగే కాకపోయినా ఇలాంటి భావమే బ్రిటన్‌కు చెందిన అలెనా కేట్ పెటిట్‌కు కలిగింది. 1950, 60వ దశకాల్లో భారత దేశంలోనే కాకుండా పాశ్చాత్య దేశాల్లో కూడా మహిళలు ఎక్కువగా వంటావార్పుకే పరిమితం అయ్యేవారు. ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఆకాశంలో సగమన్న మహిళలు హక్కుల కోసం ఉద్యమించి ఆధునిక మహిళలుగా మారారు. మగవాళ్లతోపాటు సమానంగా ఆఫీసులకు వెళ్లడం, ఇంటి పనిని, వంట పనిని కొంచెం అటూ ఇటుగా పంచుకోవడం లేదా పని మనుషులను పెట్టుకోవడం పరిపాటయింది. అలా ఎదిగిన ఆధునిక మహిళే అలెనా. ఆమెకు హఠాత్తుగా 1950, 60వ దశకం నాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆనందం లాంటి విచారానికి గురయ్యారు. విచారం ఎందుకు? ఆనాటి ఆనందం కోసం మళ్లీ ‘ఇంటికి దీపం ఇల్లాలు’ కావాలనుకున్నారు. చేస్తున్న ఉద్యోగం వదిలేశారు. గరిట పుచ్చుకున్నారు. వంటావార్పు మొదలు పెట్టారు. సమీపంలో ఉన్న ఫుడ్ కోర్టుకు కూడా రుచికరమైన ఆహార పదార్థాలను సరఫరా చేసి ఆర్థికంగా కూడా బాగానే సంపాదిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆమె ‘ది డార్లింగ్ అకాడమీ’ అనే పేరుతో ఓ ‘వ్లోగ్’ను నడుపుతున్నారు. వంటావార్పులో ఉన్న సంతప్తిని తోటివారితో పంచుకోవడం మొదలు పెట్టారు. ఏ రకమైన కూరలు ఎలా వండాలో కూడా చిట్కాలిస్తున్నారు. ఆమె ‘వ్లోగ్’ పాఠకులతో ప్రారంభమైన ఈ సరికొత్త (పాత) ఉద్యమం ఇప్పుడు బ్రిటన్ అంతటా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యమం ‘ట్రేడ్‌వైఫ్’ పేరిట అమెరికా సోషల్ మీడియాలో ఊపందుకుని అక్కడి ప్రధాన జన జీవన స్రవంతికి విస్తరించింది. జర్మనీ, జపాన్ దేశాలకు కూడా విస్తరిస్తోంది. కొందరు 1950, 60 దశకం నాటి వంటావార్పు పుస్తకాలను వెలికి తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్నారు. అప్పట్లో వంట చేసే మహిళలు అందుకు అనువైన దుస్తులు ధరించే వారంటూ నాటి పొడువాటి దుస్తుల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మహిళలు కొంత లొంగిపోయి ఉంటేనే పెళ్లి పెటాకులు కాకుండా నిత్య కళ్యాణం అవుతుందంటూ అమెరికా రచయిత్రి హెలెన్ ఆండెలిన్ రాసిన ‘ఫాసినేటింగ్ విమెన్వుడ్’ పుస్తకం దుమ్ము దులిపి మళ్లీ చదువుతున్నారు. ఆ ‘పాత’ మధురం అంటున్నారు. స్రీవాదం పేరిట ‘ఫెమినినిటి క్లాస్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా లక్షకుపైగా అభిమానులను కలిగిన హెలెన్ ఆండెలిన్ కూతురు డిక్సీ ఆండెలిన్ ఫోర్సిత్ ఈ ‘ట్రేడ్‌వైఫ్’ ఉద్యమాన్ని సమర్థించడం విశేషం. బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో మహిళలు ఇప్పటికే ఫెమినిజం సాధించినందున ఇలాంటి ఉద్యమాల వల్ల నష్టమేమి లేదన్నారు. అలెనాతో ఏకీభవిస్తున్న వారితోపాటు విభేదిస్తున్న వారూ లేకపోలేదు. ‘స్త్రీ వాదం’ నుంచి ‘మీటూ’ ఉద్యమం వరకు దూసుకొచ్చిన మహిళలను మళ్లీ వెనక్కి వెళ్లమనడం మూర్ఖత్వం అని కొంత మంది అలెనాపై విరుచుకుపడుతున్నారు. అందుకు సమాధానంగా ‘నేను ఇప్పటికీ స్త్రీవాదినే. ఆ విషయంలో నేనేమీ మారి పోలేదు. అన్ని ఉద్యోగాలు చేసినట్లే ఇంట్లో వంటావార్పు చేసుకునే హక్కు మహిళలకు ఉండాలని కోరుతున్నాను. అందర్ని వంట చేయమని నేను కోరడం లేదు. ఇదొక ఆప్షన్‌గా ఉండాలంటున్నాను. ఇందులో ఉన్న ఆనందం, సంతృప్తి గురించి చెబుతున్నాను. ఇది నిస్వార్థంగా కుటుంబంపై ఓ మహిళ పెట్టే పెట్టుబడి. ఆఫీసులకెళ్లే భార్యాభర్తలు ఇప్పటికే కలసి వంట చేసుకుంటున్నారు. మహిళలు ఇష్టపడి ఇంటికి పరిమితమయితే తప్పులేదంటున్నాను. పైగా కుటుంబ బంధాలు బలపడే అవకాశం ఉంది’ అని వాదిస్తున్నారు. అలెనా సంగతి పక్కన పెడితే ‘ఏ విమెన్స్ ప్లేస్ ఈజ్ ఇన్ ది హోమ్ (మహిళలు ఇంటికే పరిమితం), ట్రయింగ్ టూ బీ ఏ మ్యాన్ ఈజ్ వేస్ట్ ఆఫ్ విమెన్ (మహిళలు మగవాళ్లుగా మారాలనుకోవడం వ్యర్థం)’ అనే కొటేషన్లు ఈ ట్రేడ్‌వైఫ్ ఉద్యమం నుంచి కొత్తగా పుట్టుకొచ్చాయి. -
పెళ్లయిన జంటల్లో ‘ఎల్ఏటీ’ ట్రెండ్
‘ఎల్ఏటీ’ అంటే లివింగ్ ఏ పార్ట్ టుగెదర్. భార్యాభర్తలు దూరదూరంగా ఉంటూ కలిసి ఉండడం. ఇప్పుడు ఇది పలు దేశాల్లో కొత్త ట్రెండ్‌గా మారింది. ఇంగ్లండ్‌లో 25 శాతం జంటలు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్న జంటలు ఎక్కువగా వేర్వేరు ఇళ్లలో స్వతంత్రంగా ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. అలా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటూ స్నేహితుల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ కాపురాలు చేస్తున్నారట. దాని వల్ల వారి మధ్య మొహం మొత్తకుండా ఒకరి పట్ల ఒకరికి ఎప్పటికప్పుడు కొత్త ప్రేమ చిగురిస్తోందట! మరి అలాంటి జంటలు పిల్లలు పుడితే ఏం చేస్తాయో తెలియదు. భార్యా భర్తలు ఎప్పుడూ కలసి ఉండడం వల్ల ఒకరి అలవాట్లు ఒకరికి పడక, తరచూ గొడవ పడుతుండడం అందరికి తెల్సిందే. వారు విడి విడిగా ఉండడం వల్ల ఎవరి స్వతంత్య్రం వారికి ఉండడంతోపాటు ఎవరి ఉద్యోగాలు వారు సక్రమంగా చేసుకోగలుగుతున్నారట. అప్పుడప్పుడు ఒంటరితనం ఫీలనప్పుడు స్నేహితుల్లా కలుసుకోవడం చాలా, చాలా బాగుండడమే కాకుండా జీవితానికి కొత్త స్ఫూర్తినిస్తుందట. ‘యూనివర్శిటీ ఆఫ్ బ్రాడ్ఫోర్డ్’కు చెందిన ప్రొఫెసర్ సైమన్ డుంకన్ ఇలా విడి విడిగా ఉంటూ అప్పుడప్పుడు సహ జీవనం చేస్తున్న 50 జంటలను కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా ఈ అధ్యయనం జరిపారు. యువతీ యువకుల్లో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ సొంత స్పేస్‌ను కోరుకుంటారని, అది లభించడం వల్ల వారి మనుసు కుదట పడడమే కాకుండా దూర, దూరంగా ఉన్న భాగస్వాముల పట్ల తరగని ప్రేమ పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. ఎవరికి వారు విడి విడిగా ఉంటున్నాం కదా! ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా పరస్పర విశ్వాసాలతో సంబంధాలను కొనసాగించడం ఇందులో మరో విశేషం. వేర్వేరుగా ఉంటున్న జంటల్లో 43 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల లోపువారు కాగా 45 శాతం మంది 25 నుంచి 54 ఏళ్ల లోపు వయస్సు వారు, కేవలం 11 శాతం మంది మాత్రమే 54 ఏళ్లు పైబడిన వారు ఉంటున్నారు. ఇలా విడి విడిగా ఉంటున్న జంటల్లో విడాకుల సమస్యే రావడం లేదట. అందుకని ఇంగ్లండ్ 2017 సంవత్సరంతో పోలిస్తే రెండేళ్లలో విడాకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందట. -
ఫ్యామిలీ ఫార్మర్
సాక్షి, హైదరాబాద్: ఆహారం అంటేనే ఆరోగ్యం. ఆరోగ్యం అంటేనే ఆహారం. కానీ ఇప్పుడు ఆహారం అంటేనే దాదాపు భయపడాల్సిన పరిస్థితి. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ద్వారా పండిన పంటలు ఒకవైపు.. కల్తీ ఆహార పదార్థాలు మరోవైపు మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ పంటలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో కూడా ఏది సేంద్రియం.. ఏది సేంద్రియం కాదనేది తెలుసుకోవడం కాస్త కష్టమే. అందుకే నమ్మకమైన ఫ్యామిలీ ఫార్మర్స్ వచ్చేశారు. ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో.. ఫ్యామిలీ ఫార్మర్స్ అలాగన్న మాట. మనకు కావాల్సిన ఆరోగ్యకరమైన, నిజమైన సేంద్రియ పంటలు మన ముంగిళ్లకే తెచ్చి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ‘ఫ్యామిలీ ఫార్మర్స్’ నయా ట్రెండ్ మొదలైంది. దీంతో ఆదాయంతో పాటు తృప్తి కలుగుతుందని ఈ ఫార్మర్స్ చెబుతున్నారు. రసాయనాల్లేని ఆహారాన్ని తమ వంట గదుల్లో అందుబాటులో ఉంచుకోవాలని కోరుకునే కుటుంబాలకు కొందరు రైతులు ‘ఫ్యామిలీ ఫార్మర్లు’గా మారుతున్నారు. నేరుగా ఇళ్లకే సరఫరా.. పరిశుభ్రమైన, పురుగు మందులు, రసాయన ఎరువుల్లేకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించే ఆహారపదార్థాలపై ఇప్పుడు జనంలో ఆసక్తి పెరిగింది. అలాంటి ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారి కోసం కొందరు రైతులు సేంద్రియ ఆహారం పండించి ఇళ్లకు సరఫరా చేస్తు న్నారు. ఇప్పుడు హైదరాబాద్ సహా పలు పట్టణాలు, నగరాల్లో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, వరి, పప్పుల కోసం జనం పరుగులు పెడుతున్నారు. కొందరు పాలు, కూరగాయలు, బియ్యం, పప్పులు, సుగంద ద్రవ్యాలన్నీ ఇలాగే కొంటున్నారు. కొందరు నేరుగా రైతుల నుంచి కొంటుండగా, మరికొందరు పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి మరీ.. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రవీణ్‌రెడ్డి బెంగళూరు, హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. ఉద్యోగంలో సంతృప్తి చెందలేదు. తనకున్న 18 ఎకరాల్లో సేంద్రియ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. వరి, కంది, పెసర, వేరుశనగ తదితర ఆహార పంటలతో పాటు సొర, కాకర, బీర వంటి కూరగాయలను సాగు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో 20 ఇళ్లకు నేరుగా బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. కొందరేమో ప్రవీణ్ ఇంటికి వచ్చి కొనుగోలు చేస్తారు. హైదరాబాద్‌లో ఒక దుకాణానికి వేరుశనగ, ఉలవలు పండించి పంపుతారు. మామిడి పండ్లను కూడా సాధారణ పద్ధతిలో మాగబెట్టి అపార్ట్మెంట్లకు పంపుతున్నట్లు చెబుతున్నారు. నేరుగా అపార్ట్మెంట్లకు.. రంగారెడ్డి జిల్లా కడ్తల్ గ్రామానికి చెందిన చల్లా పవన్‌రెడ్డి హైదరాబాద్‌లో కొందరిని అబ్బాయిలను నియమించుకున్నాడు. వారు నేరుగా అపార్ట్మెంట్లకు, ఇళ్లకు వెళ్లి పవన్ పండించే సేంద్రియ ఆహారపదార్థాలను అందజేస్తారు. తనకున్న 17 దేశవాళీ ఆవు పాలు రోజుకు 100 లీటర్ల వరకు ఇస్తాయి. వాటిని అబ్బాయిల ద్వారా విక్రయిస్తారు. టమాట, మిర్చి, వంకాయ, గోరుచిక్కుడు, కొత్తిమీర పండించి వినియోగదారులకు పంపిస్తాడు. 11 ఎకరాల్లో అతను సాగు చేసి వినియోగదారులకు ఇలా పంపుతున్నాడు. నియమించుకున్న ఒక్కో అబ్బాయికి నెలకు రూ.6 వేలు ఇస్తున్నాడు. రమణారెడ్డి ఇంటికి ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు... నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కారువంగ గ్రామానికి చెందిన రమణారెడ్డి 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తాడు. తాను పండించే పంటల్లో 80 శాతం ఇంటి నుంచే అమ్ముతాడు. సేంద్రియ పద్ధతిలో పండించిన వరి నుంచి పాలీష్ బియ్యం, దంపుడు బియ్యం, తక్కువ దంపుడు బియ్యం మిల్లులో పట్టిస్తాడు. అలాగే మిర్చి, కంది, పెసర, మినుములు, శనగ, జొన్న, వేరుశనగ, ఆవాలు, ధనియాలు పండిస్తాడు. అన్నీ సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల తన ఇంటికి హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కర్ణాటక నుంచి నుంచి జనం క్యూలు కడతారని చెబుతున్నాడు. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు ఐఏఎస్‌లు కూడా తన ఇంటికొచ్చి తన పంటలు కొంటారని పేర్కొంటున్నాడు. హైదరాబాద్‌లోని ఒక దుకాణానికి కూడా తాను పండించేవి పంపుతున్నారు. తన వద్ద కొందరు క్యాన్సర్ రోగులు కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆయనంటున్నారు. సాధారణ పద్ధతిలో పండించే వాటికి, తాను సేంద్రియ పద్ధతిలో పండించే వాటికి ధరలో కేవలం కొద్ది తేడా మాత్రమే ఉంటుందని ఆయనంటున్నారు. తాను పండించే ఆహార పదార్థాలతో ఆరోగ్యం ఎంతో బాగుంటుందని వినియోగదారులు చెబుతున్నారని రమణారెడ్డి చెబుతున్నారు. నాలుగెకరాల్లో పండిస్తున్న రజిత.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు గ్రామానికి చెందిన రజిత కూడా సేంద్రియ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. వరి, టమాట, వంకాయ, మిర్చి, బీరకాయ, గోరు చిక్కుడు, కాకరకాయ వంటివి సీజనల్‌గా పండిస్తున్నారు. తాను పండించే వీటిని ఓ ప్రముఖ సంస్థకు సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. సమీపంలో ఉన్న ఓ హోటల్‌కు కూడా సరఫరా చేస్తున్నారు. ఆ హోటల్ కూడా సేంద్రియ ఆహార పదార్థాలతో పండించే ‘విలేజ్ ఆహారం’పేరుతో ప్రజలకు పెడుతుండటం గమనార్హం. -
‘సన్యాసులు’ అవుతున్న టెకీలు
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం పేరు వినగానే ‘సిలికాన్ వ్యాలీ’ గుర్తుకు వస్తోంది. అది టెకీలుండే ప్రాంతం. టెకీలంటే రోజంతా కష్టపడి రాత్రంతా, తాగి తందనాలు ఆడుతారని, ముఖ్యంగా వారాంతంలో గర్ల్ ఫ్రెండ్స్‌తో బార్లకు, పబ్‌లకు వెళ్లి కులుకుతారని మిగతా సమాజం కుళ్లు పడేది. అందుకు విరుద్ధంగా సిలికాన్ వాలీ టెకీ (ఐటీ నిపుణులు)ల్లో ఓ సరికొత్త ట్రెండ్ మొదలయింది. అదే ‘డొపోమైన్ ఫాస్టింగ్’. ‘డొపోమైన్’ అనేది మెదడులో ఆనందానుభూతికి కల్గించే హార్మోన్. దీన్ని ‘ఆనంద రసాయనం’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ హార్మోన్ ఆనందం అనుభూతిని కలిగించడమే కాకుండా ఆ ఆనందానికి బానిసను కూడా చేస్తుంది. మద్యం, ఇతర మత్తులకు అలాగే బానిసలవుతారు. వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్, జాగింగ్, స్విమ్మింగ్‌ల వల్ల, ఇష్టమైన ఆహారం తినడం వల్ల నరాల ప్రేరణ ద్వారా ఏ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ కారణంగానే మొబైల్ ఫోన్లకు, వాట్సాప్, ట్విట్టర్, టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాకు బానిసలవుతున్నామని కూడా టెకీలు భావించారు. గ్రహించారు. మెదడు నరాల్లో ‘డొపోమైన్’ అనే హార్మోన్‌ను ఉత్పత్తి కాకుండా అడ్డుకోవడం ద్వారా ఇలాంటి వ్యసనాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ‘డొపోమైన్ ఫాస్టింగ్’ను మొదలు పెట్టారు. జిమ్ములు, క్లబ్బులు, పబ్బులు, ఫుడ్‌కోర్టులకు వెళ్లడం మానేశారు. గర్ల్ ఫ్రెండ్స్‌తో ముద్దూ ముచ్చట్లకు గుడ్‌బై చెప్పారు. మొబైల్ ఫోన్లను, సోషల్ మీడియాను ముట్టుకోవడం లేదు. మ్యూజిక్‌తోపాటు మిత్రులకు దూరంగా ఉంటున్నారు. ఆఫీసులకు పోవడానికి సైకిళ్లను, అత్యవసర ఫోన్ల కోసం మాత్రమే మొబైల ఫోన్లను వాడుతున్నారు. మాంసాహారం, శాకాహారాలను కూడా పక్కన పెట్టి పండ్లతోని పచ్చి మంచి నీళ్లతోని పత్తెం ఉంటున్నారు. కొందరైతే విద్యుత్ లైట్లను కూడా ఉపయోగించకుండా చీకట్లో, వెన్నెల్లో గడుపుతున్నారు. కొకైన్ అనే మాదక ద్రవ్యం తీసుకోవడం వల్ల మెదడు మొద్దు బారినట్లయ్యి, సహనం పెరుగుతుందని, అలాగే డొపోమైన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయినట్లయితే సహనం పెరగడంతోపాటు చేసే పనిమీద దష్టి కేంద్రీకతం అవడమే కాకుండా, అదేంటో స్పష్టంగా అవగతమవుతుందని ప్రస్తుతం ఈ ఫాస్టింగ్‌లో ఉన్న సిలికాన్ వాలీ టెకీ, 24 ఏళ్ల జేమ్స్ సింకా తెలిపారు. ఉపవాసం వదిలేశాక మళ్లీ డొపొమైన ఉత్పత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు. అప్పుడు మళ్లీ యథావిధి జీవితాన్ని కొనసాగించవచ్చని చెప్పారు. ఈ ఫాస్టింగ్ వల్ల ఓ అధ్యాత్మిక స్థితి మనస్సుకు ఆవరిస్తుందని, అందువల్ల మనస్సు పరిపరి విధాల పోకుండా, చేసే వత్తిపై కేంద్రీకతం అవుతుందని, తద్వారా కంపెనీల్లో ఉత్పత్తి పెరిగి ప్రశంసల వర్షం కురుస్తుందని, మరోపక్క మానసిక ప్రశాంతత లభించి మనిషి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని భావించడం వల్ల ఎక్కువ మంది టెకీలు ఈ ఫాస్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా సిలికాన్ వాలీలో మొదలైన ఈ ఫాస్టింగ్ ట్రెండ్, భారత సిలికాన్ వ్యాలీగా వ్యవహరించే బెంగుళూరుకు పాకి, ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు తాకింది. ఈ ‘డొపోమైన్ ఫాస్టింగ్’కు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సిలికాన్ వ్యాలీ సైకాలజిస్ట్ డాక్టర్ కమెరాన్ సిపా కొట్టివేశారు. పోషక పదార్థాలు కలిగిన ఆహారం, వ్యాయామం వల్ల డొపోమైన్ హార్మోన్ పెరుగుతుందనడంలో సందేహం లేదని, ఈ రెండింటికి దూరంగా ఉండడం వల్ల, సామాజిక మీడియాకు, సామాజిక సంబంధాలకు దూరంగా ఉండడం వల్ల తగ్గుతుందనడం తప్పని ఆయన చెప్పారు. కాలిఫోర్నియా యూనివర్శిటీలోని న్యూరాలోజీ, సైకాలోజీ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ జోష్ బెర్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొద్దికాలం అన్నింటికి దూరంగా ఉండి, మళ్లీ వాటిని ఆస్వాదించినప్పుడు ఎక్కువ ఆనందానుభూతి కలిగే అవకాశం మానసికంగా ఉందని వారు చెప్పారు. ఏదీ శతి మించి రాగాన పడనీయ రాదని, అలవాట్లు అదుపులో ఉంటే అంతకన్నా మంచి మరోటి ఉండదని, ఇలాంటి ఫాస్టింగ్ల వల్ల ఆరోగ్యం నశించే అవకాశమే ఎక్కువగా ఉందని వారు హెచ్చరించారు. శ్రమ, శ్రమకు తగ్గ విశ్రాంతి, ఆ తర్వాత మిగిలే సమయాన్ని సామాజిక సంబంధాలకు, ఇతర అభిరుచులకు కేటియిస్తే మానసికంగా ప్రశాంత జీవితాన్ని గడపవచ్చని వారు సూచించారు. -
ఇదీ ఇప్పటి కొత్త సంప్రదాయం!
పార్టీ మార్పిడిని సూచించడం ఎలా? గతంలో ఈ ప్రక్రియకు ఉన్న పేరేమిటి? అప్పటి ప్రక్రియ కంటే ఇప్పటి ప్రక్రియ వల్ల ఒనగూరే అదనపు ప్రయోజనాలేమిటి? పైన కనిపిస్తున్న వాక్యం పరీక్ష పేపర్లోని ప్రశ్నలా అనిపిస్తోందా? కరెక్టే. కానీ ఈ ప్రశ్న నా దృష్టికి వచ్చిన తీరూ.. దాని కథా కమామిషూ తర్వాత చెబుతా. క్వెశ్చన్ పేపర్లో దీన్ని చదవగానే.. ‘‘ఇదేంట్రా.. ఈ ప్రశ్నేమిటి ఇలా ఉంది?’’ అంటూ మా బుజ్జిగాడిని అడిగా. ‘‘ఇది చాలా ఈజీ క్వెశ్చెన్ నాన్నా. పైగా ఏదైనా తెలియకపోతే కామన్‌సెన్స్‌తో ఆలోచించి రాసేయమని నువ్వే అన్నావ్ కదా. అలా ఈజీగా రాసేశా’’ అన్నాడు. ‘‘పార్టీ మార్పిడికి అప్పట్లో ఓ మాటా.. ఇప్పుడు ఆ ప్రక్రియకు ఓ విధానం ఉందా? అయినా ఈజీ క్వెశ్చెన్ అంటున్నావు కదా. ఏం రాశావ్?’’ అని అడిగా. అప్పుడు వాడు చెప్పిన జవాబిది. ఒకప్పుడు పార్టీ మారితే.. దాన్ని ‘‘తీర్థం పుచ్చుకోవడం’’ అనే మాటతో సూచించేవారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు ఫలానా అభ్యర్థి ఫలానా పార్టీ ‘‘తీర్థం పుచ్చుకున్నాడ’’ని న్యూస్ పేపర్లలో రాసేవారు. కానీ ప్రస్తుతం ‘‘తీర్థం పుచ్చుకోవడం’’ అనే ఆ మాట పూర్తిగా అంతరించిపోయినట్లే. దాన్ని ఇప్పుడెవరూ న్యూస్ పేపర్లలో రాయడం గానీ, టీవీల్లో చెప్పడం గానీ చేయడం లేదు. అయితే ఒక అభ్యర్థి పార్టీ మారిన సందర్భాల్లో మరికొందరు ‘‘ఫలానా గూటికి చేరడం’’ అని కూడా వ్యవహరించేవారు. ఈ మాట కూడా దాదాపుగా అంతరించే దశలోనే ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం: అయితే ఇప్పుడు తాజాగా పార్టీ మారిన ప్రక్రియకు సూచనగా ఆ పార్టీ జెండాను సూచించేలా ఉన్న రంగులతో కూడిన ‘‘కండువాను పార్టీ మారిన వ్యక్తికి కప్పడం’’ జరుగుతోంది. అందుకే ఇప్పుడు పార్టీ మారే ప్రక్రియను ‘‘తీర్థం పుచ్చుకోవడం’’గా చెప్పడానికి బదులు ‘‘కండువా కప్పుకోవడం’’గా వ్యవహరిస్తున్నారు. ప్రయోజనాలు: తీర్థం పుచ్చుకోవడం అన్న మాట ఒక సూచనాత్మకమైన మాట మాత్రమే. ఈ సమయంలో నిజంగా తీర్థం పుచ్చుకోవడం జరిగేది కాదు. ఒకవేళ గతంలో పార్టీ మారినప్పుడు నిజంగానే తీర్థం పుచ్చుకోవడం జరిగినా అది కడుపులోకి వెళ్లి, మటుమాయం అయిపోతుంది కాబట్టి తాను మారిన పార్టీ ఏమిటో గట్టిగా గుర్తుపెట్టుకుంటే తప్ప అభ్యర్థికి పెద్దగా గుర్తుండే అవకాశం ఉండదు. అయితే కండువా కప్పడం వల్ల మంచి ప్రయోజనం ఉంది. కండువాపై పార్టీ జెండాలోని రంగులు, పార్టీ గుర్తు స్పష్టంగా ఉంటాయి కాబట్టి... ఆ కండువా కనిపిస్తున్నంత సేపు అభ్యర్థికి తాను మారిన పార్టీ ఏదో, తానిప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టంగా తెలుస్తుంది. ‘‘ఇదీ నాన్నా ఆ ప్రశ్నకు ఆన్సరు’’ అంటుండగా నాకు మెలకువ వచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెబుతా వినండి. ప్రస్తుతం మావాడి పరీక్షలు అవుతున్నాయి. ఈ టైమ్‌లోనైనా కాస్తో కూస్తో శ్రద్ధ తీసుకోవాలి కదా అంటూ నిన్న వాడితో సోషల్ సబ్జెక్ట్ చదివించా. అలాగే వాడు పరీక్ష రాసి రాగానే.. ఆ క్వెశ్చన్ పేపర్లోని ప్రశ్నల్ని చదువుతూ.. వాటికి ఆన్సర్లు ఏమి రాశాడో వాకబు చేయడం కూడా నాకు అలవాటు. సరిగ్గా పరీక్షల సీజన్లోనే, ఎన్నికలూ రావడం.. న్యూస్పేపర్లలో చదివిన అంశాలూ, వాడితో చదివించిన విషయాలు మెదడులో కలగాపులగమైపోయాయి. దాంతో వాడు ‘‘పార్టీమార్పిడి... అనుకూల దశలు... పద్ధతులూ – ప్రయోజనాలూ’’ లాంటి పాఠాన్ని నేను వాడితో చదివించినట్టూ.. అదే లెసన్ నుంచి ఎగ్జామ్‌లో క్వెశ్చన్ వచ్చినట్టూ, దానికి వాడు రాసిన ఆన్సర్‌ను నేను చదివించుకున్నట్టూ వచ్చిన కల ఇది. –యాసీన్ -
కళాత్మకం : సరికొత్తగా శుభలేఖలు!
సాక్షి, సిటీబ్యూరో :వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్‌పోర్టు, ఏటీఎం, కాఫీ కప్ తరహా ఇన్విటేషన్స్‌తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిదినగరంలో నడుస్తున్న ట్రెండ్. ‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్‌గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. కొత్తకొత్తగా... భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి. బాక్స్.. భలే కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్‌పోర్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్‌ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్ కార్డ్స్, కష్టమైజ్డ్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి. ఖర్చు తక్కువే... సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం. – టి.ప్రదీప్, గౌలిగూడ -
పెద్ద వైరల్ సృష్టించిన చిన్న వీడియోలు
శ్రీనగర్‌కాలనీ : చేసింది చిన్న వీడియోలే అయినా పెద్ద వైరల్‌నే సృష్టించడంతో గంటల్లోనే సెలబ్రిటీగా మారిపోతే ఆ కిక్కే వేరు. తమలోని ప్రతిభతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారారు. తమ కెరీర్‌ను మలుపు తిరిగేలా చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీరి వీడియోలు కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ సాధించడంతో పాటు వేలాది మందినిఅభిమానులుగా చేసుకున్నారు. సృజనాత్మకత, యాస, భాషతో పాటు సమాజంలో జరిగే విషయాలనుతెలుపుతూ చేస్తున్న వెబ్‌సిరీస్‌లు నెటిజన్లనుఅమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది కొత్తగా వెలుగులోకి వచ్చిన సోషల్ సెలబ్రిటీస్ తమ కెరీర్ అనుభవాలను పంచుకున్నారిలా.. పక్కా తెలంగాణ యాసతో.. నేను పక్కా హైదరాబాదీని. కొరియోగ్రాఫర్‌గా ఎదగాలన్నదే నా కోరిక. నా ఫ్రెండ్ తీసిన ‘నా పిల్ల’ అనే షార్ట్‌ఫిలిం సక్సెస్ అయ్యింది. అనంతరం తెలంగాణ భాషలో ‘దేత్తడి’ అనే ఛానెల్ పెట్టారు. తెలంగాణ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌తో పడుతున్న ఇబ్బందులను పక్కా తెలంగాణ యాసతో చేశాం. సరదాగా చేసినణీ వీడియో నెలలో మిలియన్ వ్యూస్‌ను సాధించింది. 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌గా వచ్చారు. ఆ తర్వాత ఎంబీబీఎస్ గర్ల్, హుషారు పిల్లా వీడియోలకు మంచి స్పందన వచ్చింది. దేత్తడికి ప్రస్తుతం 3లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. – హారిక గోనెళ్ల (హారిక అలైఖ్య)– ‘దేత్తడి ఛానెల్’ నేటివిటీకి తగ్గట్టుగా.. నా స్వస్థలం రాజమండ్రి సమీపంలోని వేమగిరి. చిరంజీవి, పవన్‌కళ్యాణ్ సినిమాలు చూసి యాక్టర్ అవ్వాలని డిసైడయ్యా. ఇంటర్ తర్వాత చెన్నైలో డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశాను. ఆ తర్వాత దేవదాస్ కనకాల వద్ద యాక్టింగ్‌లో మెలకువలు నేర్చుకున్నాను. యూట్యూబ్ ఛానల్ తమడ ద్వారా ‘పక్కింటి కుర్రాడు’ అనే ఛానెల్‌ను ప్రారంభించారు. నేటివిటీకి తగ్గట్టుగా తీసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ 1.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్‌గా ఉన్నారు. మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నదే ఆశయం. నాగచైతన్య సినిమాలో అవకాశం వచ్చింది. – చంద్రశేఖర్ సాయికిరణ్ (చందు)– ‘పక్కింటి కుర్రాడు’ చాయ్బిస్కెట్తో గుర్తింపు.. మాది విజయవాడ. ఎస్వీ రంగారావు ప్రేరణతో నటుడిని అవుదామన్నదే నా కల. బీఎస్సీ అయ్యాక హైదరాబాద్‌కి వచ్చా. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ స్టార్టప్ ఛాయ్‌బిస్కట్ వారికి నా వీడియోలు నచ్చడంతో అవకాశాలు ఇచ్చారు. యువతను ఆకట్టుకొనేలా చిన్న వీడియోలు తీశాం. ఆ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలా ‘నేను మీ కళ్యాణ్ పేరిట’ ఛానెల్ పెట్టాం. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. మా చాయ్‌బిస్కెట్‌కు 2.8 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా ఆశయం. – సుహాస్– ‘నేను మీ కళ్యాణ్’ స్టార్ హీరోలతో వీడియోలు, ఇంటర్వ్యూలు.. నేను బీటెక్ చదువుతున్న రోజుల్లోనే చిన్న చిన్న స్కిట్స్‌ను రాయడం అలవాటు. ఫేస్బుక్ పేజీల్లో నాకు నచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ విభిన్నంగా వాల్లో రాసేవాడిని. బీటెక్ తర్వాత రచయిత అవుదామని హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. నా ఫేస్బుక్లో రైటింగ్స్ చూసిన చాయ్‌బిస్కెట్ టీంలో నన్ను చేర్చుకున్నారు. నా రచననలో నేటివిటీ, మసాలా ఉంటంతో మసాలా సందీప్‌గా పేరుమారింది. స్టార్ హీరోలతో వీడియోలు, ఇంటర్వ్యూలు చేశాం, వాటికి మంచి స్పందన వచ్చింది. రచనలు చేస్తూ నటిస్తున్నాను. – సందీప్‌రాజ్– ‘మసాలా సందీప్’ యువతుల సమస్యలపై ఫోకస్.. నేను జర్నలిజం చేస్తున్న సమయంలో సోషల్ మీడియాలో అప్పటికే వైరల్‌గా ఉన్న చాయ్‌బిస్కెట్ వారితో అనుబంధం ఏర్పడింది. గరŠల్స్ ఇష్యూస్‌తో సీరిస్ ఉంటే బాగుంటుందని అందరి అభిప్రాయాలతో గరŠల్స్ ఫార్ములా అనే ఛానెల్‌ను ప్రారంభించాం. సమాజంలో గరŠల్స్ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ మా టీం దివ్య, హర్షితలతో వీడియోలు చేశాం. ఆ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. మా ఛానెల్‌కి 3లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నటిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు జర్నలిజంపైనే ఆసక్తి. – శ్రీవిద్య పాలకుర్తి– గర్ల్స్ ఫార్ములా ఉద్యోగాన్నే వదిలేశా.. మాది కడప జిల్లా. తమిళనాడులో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. హైదరాబాద్ వచ్చి మెకానికల్ రంగంలో ఉద్యోగిగా చేరాను. యాక్టర్ అవ్వాలని కోరిక చాలా బలంగా ఉండేది. ఉద్యోగాన్ని వదిలి థియేటర్ ఆర్టిస్టుగా చేరాను. యూట్యూబ్ ఛానెల్ ఆడిషన్స్‌లో సెలెక్టయ్యాను. అలా క్రేజీ ఖన్నా పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభమైంది. ఐటీ, యూత్, సోషల్ ప్రాబ్లమ్స్‌తో తీసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. మా ఛానెల్ 70వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. – రాజేష్ ఖన్నా– క్రేజీ ఖన్నా -
పెళ్లి ఫోటోల్లో న్యూ ట్రెండ్
-
నా రూటే సపరేటు అంటున్న హీరో
ఈ రోజుల్లో సినిమా తీయడమే చాలా కష్టమైన పని అంటే.. విడుదలయ్యే వరకు దాన్ని గోప్యంగా ఉంచడం మరింత కష్టమైపోతుంది. కొన్ని కోట్లు ఖర్చుపెట్టి తీసే సినిమాలో విడుదలకు ముందే ఏవైనా సన్నివేశాలు బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది దర్శక, నిర్మాతలకు. గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల సినిమా ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందే తొలి భాగం లీక్ అయ్యి గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఓ హీరో ధైర్యం చేసి తన సినిమాలోని తొలి ఏడు నిమిషాలను తానే స్వయంగా విడుదల చేస్తున్నాడంటే నిజంగానే సాహసం చేస్తున్నాడని అనాలి. ఈ సాహసం చేస్తున్న నటుడు, నిర్మాత విజయ్ ఆంటోని. ఈ తమిళ హీరో త్వరలో విడుదల కాబోయే తన ‘కాశీ’ సినిమా కోసం ఇంత సాహసం చేస్తున్నట్లు సమాచారం. తాను మూస సినిమాలు చేయనని ‘బిచ్చగాడు’ చిత్రంతో నిరూపించుకున్నాడు విజయ్ ఆంటోని. విజయ్ నటించిన సినిమా అంటేనే ఏదో ప్రత్యేకత ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు. అలానే సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా వినూత్న రీతిలో చేస్తుంటాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘కాశీ’ సినిమా ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈసారి ఏకంగా సినిమాలోని మొదటి ఏడు నిమిషాల సన్నివేశాలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఉదయనిధి దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటించిన చిత్రం ‘కాశీ’. అంజలి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. భావోద్వేగాలకు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు ఈ సినిమాలో పెద్దపీట వేసినట్లు విజయ్ ఆంటోని తెలిపారు. -
ఐటం బాయ్‌గా మారిన స్టార్ హీరో
చిత్ర పరిశ్రమలో ‘ప్రత్యేక గీతాల్లో’ నర్తించేందుకు కొన్నాళ్ల క్రితం వరకూ ప్రత్యేకంగా నటీమణులను తీసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. మంచి పారితోషికం, క్రేజ్ కోసం స్టార్ హీరోయిన్లు సైతం స్పెషల్ సాంగ్స్ వైపు మక్కువ చూపుతున్నారు. అయితే ఇన్నాళ్లు ‘ఐటం గర్ల్స్’కు మాత్రమే సొంతమైన ఈ పాటల్లో ఇక ‘ఐటం బాయ్స్’ కూడా రాబోన్నారు. బాలీవుడ్ చరిత్రలోనే ‘ఐటం బాయ్’గా కాలు కదపనున్న తొలి హీరోగా అర్జున్ కపూర్ నిలవనున్నారు. ఈ యువ హీరో తన కజిన్ హర్షవర్ధన్ కపూర్ నటిస్తున్న ‘భవేష్ జోషి సూపర్‌హీరో’ చిత్రంలో ‘చుమ్మే మేన్ చవాన్‌ప్రాష్’ పాటలో కనిపించబోతున్నాడు. ప్రత్యేక గీతంలో అర్జున్ తోపాటు ‘దండేకర్ సిస్టర్స్’ అనుషా, షిబానీ నర్తించనున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్లో వీరు ముగ్గురూ మాంచి రంగు రంగులు దుస్తుల్లో ఐటం తారలకు ధీటుగా మెరిసిపోతున్నారు. ‘మిర్జ్యా’ చిత్రం తర్వాత హర్షవర్ధన్ నటిస్తున్న చిత్రం ‘భవేష్ జోషి సూపర్‌హీరో’. ఈ చిత్రంలో హర్షవర్ధన్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఫాంటమ్ ఫిల్మ్స్ బ్యానర్లో, విక్రమాదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. -
సోషల్ మీడియాతో బిజినెస్‌లో ‘కొత్త ట్రెండ్’
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవర్ ముస్లిం అయినందున ఓలా క్యాబ్ బుకింగ్‌ను అభిషేక్ మిష్రా ఇటీవల రద్దు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ సభ్యుడైన మిష్రా ఈ విషయాన్ని ఏప్రిల్ 20వ తేదీన ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో పెద్ద తుపానునే సృష్టించింది. హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ ఆయన మీద వేల మంది దుమ్మెత్తి పోశారు. ఆయనకు మద్దతుగా కూడా స్పందనలు వచ్చాయి. మూడు రోజులపాటు ఈ రాద్ధాంతాన్ని మౌనంగా గమనించిన ఓలా క్యాబ్ కంపెనీ యజమాన్యం స్పందించి సమాధానంగా మిష్రాకు ఓ ట్వీట్ పంపించింది. ‘మన దేశంలాగా ఓలా కూడా ఓ లౌకిక వేదిక. మేము కులం, మతం, లింగ వివక్షతల ప్రాతిపదికన మా డ్రైవర్ భాగస్వాములను, వినియోగదారులను వేరుచేసి చూడం. అన్ని వేళల్లో పరస్పర గౌరవ మర్యాదాలతో మెలగాల్సిందిగా ఇటు డ్రైవర్లను అటు మా వినియోగదారులను కోరుతాం’ అన్నది ఓలా యాజమాన్యం సమాధానం. కుల, మతాలు, లింగ వివక్షతల కారణంగా ఏ సంస్థ, ఏ కంపెనీ కూడా తమ వ్యాపారాన్ని కోల్పోదు. కాని వ్యాపారం కోసం నేడు రాజకీయ, సామాజిక అంశాలపై కూడా తమ వైఖరేమిటో చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ ట్రెండ్ విదేశాల్లో ఎక్కువగా ఉంది. భారత దేశం జెండా బొమ్మ కలిగిన డోర్‌మ్యాట్స్‌ను కెనడాలో అమెజాన్ కంపెనీ అమ్ముతున్నట్లు తెలియడంతో భారతీయులు గొడవ చేశారు. దాంతో ఆ ఉత్పత్తులను అమెజాన్ కంపెనీ తొలగించింది. కెనడా వెబసైట్ల నుంచి ఫొటోలను తొలగించింది. 2016లో బాలివుడ్ నటుడు ఆమీర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అది సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ‘స్నాప్‌డీల్’ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి ఆయన్ని తొలగించింది. మైనారిటీ మతస్థుడిగా భారత్‌లో బతకడం సురక్షితం కాదని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. అమెరికా ప్రభుత్వం గతేడాది కొన్ని ముస్లిం మెజారిటీ దేశాలపై ‘ట్రావెల్ బ్యాన్’ విధించిన విషయం తెల్సిందే. గతేడాది జనవరిలో ఈ బ్యాన్‌ను ‘లిఫ్ట్’ అనే క్యాబ్ సంస్థ వ్యతిరేకించడంతోపాటు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతున్న ఓ ఎన్జీవో సంస్థకు విరాళం కూడా ఇచ్చింది. అదే సమయంలో ట్రావెల్ బ్యాన్‌ను మరో క్యాబ్ సర్వీస్ సంస్థ ‘ఉబర్’ సమర్థించింది. దీంతో ఆగ్రహించిన అమెరికా ఉదారవాదులు ‘డిలీట్ ఉబర్ యాప్’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో వారం రోజుల్లోనే రెండు లక్షల మంది అమెరికా ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి ఉబర్ యాప్‌ను డిలీట్ చేశారు. దాంతో బిజినెస్ బాగా పడిపోయింది. అదే సమయంలో సమీప ప్రత్యర్థి అయిన ‘లిఫ్ట్’ బిజినెస్ పెరిగింది. వెంటనే ఉబర్ సంస్థ తన వైఖరిని మార్చుకొని నిషేధానికి వ్యతిరేకంగా ప్రకటన జారీ చేసింది. అంతే కాకుండా కోర్టులో నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పోరాడుతున్న సంస్థకు ‘లిఫ్ట్’కన్నా ఎక్కువ విరాళాన్ని అందజేసింది. అమెరికాలోని ఓ ఆహార సంస్థ గే హక్కులను వ్యతిరేకించడం ద్వారా తన అమ్మకాలను పెంచుకుంది. మొజిల్లా అనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ స్వలింగ వివాహాల వ్యతిరేక ఉద్యమానికి నిధులిచ్చి నష్టపోయింది. వెంటనే నిధులను నిలిపివేసింది. చైనాలో కొన్ని విదేశీ కంపెనీలు థైవాన్, టిబెట్లను వేర్వేరు దేశాలుగా పేర్కొనడం పట్ల ఆ కంపెనీలపై చైనా వినియోగదారులు మండిపడ్డారు. దేశాలు, సరిహద్దుల పేరిట తాము వినియోగదారులను విడదీయడం లేదంటూ ఆ కంపెనీలు వివరణ ఇచ్చుకున్నాయి. టిబెట్ చైనా ఆధీనంలోనే ఉన్నదనే విషయం తెల్సిందే. రాజకీయంగా, సామాజికంగా తమ వైఖరేమిటో వెల్లడించకుండా ఇక అమెరికాలో ఏ కంపెనీ తమ ఉత్పత్తులను అమ్ముకోలేదని ఇటీవల అమెరికాలో నిర్వహించిన ఓ సర్వేలో మూడింట రెండు వంతల మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ఇదివరకు తటస్థంగా ఉండే తమ ఉత్పత్తులను అమ్ముకునేది. అప్పుడు ఉత్పత్తుల నాణ్యతను, ధరను బట్టే వినియోగదారులు కొనుక్కునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రెండ్ కూడా మారుతోంది. సోషల్ మీడియా అభిప్రాయలకు విలువనిస్తున్న కంపెనీలకే ఆదరణ పెరుగుతోంది. ఈ కొత్త ట్రెండ్‌ను పాశ్చాత్య మేధావులు ‘సోషల్ క్యాపిటలిజమ్ (సామాజిక పెట్టుబడిదారి విధానం)’గా వ్యవహరిస్తున్నారు. -
దొంగతనాల్లో నయా ట్రెండ్!
విజయనగరం టౌన్: దొంగలు తమ చేతివాటాన్ని చూపడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. పగలు, రాత్రి తేడాల్లేకుండా ఇళ్లల్లో దూరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దాహం వేస్తుందనో, ఆకలేస్తుందనో రావడం పరిసరాలను పరిశీలించడం, కొన్ని రోజుల పరిశీలన తర్వాత దొంగతనాలకు దిగడం చేస్తున్నారు. బ్యాంకుల వద్ద, పోస్టాఫీసుల వద్ద వృద్ధులను, మహిళలను పరి శీలించడం, వారు డబ్బులు పట్టుకెళ్లినప్పుడు, సాధారణంగా నిత్యం వచ్చే వారిని చూడటం అదును చూసి దెబ్బకొట్టడం ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్. వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న దొంగలు జిల్లా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ పుటేజీలు పరి శీలన ఉన్నప్పటికీ, జిల్లా పోలీస్ యంత్రాగం చర్యలు చేపడుతున్నా, వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రధానంగా పట్టణ శివారు ప్రాంతాల్లో నివాసముండేవారిపైనా, పాఠశాలలకు వచ్చే మహిళలపైన, వృద్ధులను వీరు లక్ష్యం చేస్తున్నారు. ఏమరపాటుగా ఉంటే అంతే... ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మత్తుమందు చల్లి, ఇతరత్రా పద్ధతుల ద్వారా ఒంటిమీద నగలన్నీ గుంజుకుపోతారు. పాఠశాలలకు వెళ్లే మహిళలు మెడలో హారాలు, నగలు తెంపుకొని పోతున్నారు. చైన్ స్నాచింగ్ బ్యాచ్‌లో 20 నుంచి 30 ఏళ్లలోపు యువకులే ఎక్కువగా ఉంటున్నారు. ♦ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పర్సులో పది వేలు, నగలు పట్టుకుని పెళ్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ మహిళకు కోట జంక్షన్ వద్దకు రాగానే , ఇద్దరు మహిళలు ఆటోలో ఎక్కారు. అంబటిసత్రం జంక్షన్ రాగానే ఆ ఇద్దరూ దిగిపోయారు. పెళ్లికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ తన ప్రదేశం రాగానే దిగిపోయి, కొంత దూరం వెళ్లి బ్యాగ్‌లో పర్సు చూసేసరికి మాయమైంది. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ♦ బ్యాంకులో రూ.25వేలు విత్ డ్రా చేసుకుని సైకిల్‌కి తగిలించి వెళ్తున్న ఓ వృద్ధుడిని ఎప్పటి నుంచో గమనిస్తున్న ఇద్దరు వ్యక్తులు, వృద్ధుడ్ని మాటల్లో పెట్టి సైకిల్‌కి తగిలించిన సంచితో ఉడాయించారు. వృద్ధుడు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దొంగతనాల జోరును అరికట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అందుబాటులో ఉన్న పోలీస్‌స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ నెంబర్, అడ్రస్ ఆ ప్రాంతవాసులందరి వద్ద ఉంచుకోవాలి. లేదా డయల్ 100కి ఫోన్ చేసి వివరాలు చెప్పాలి. ఎవరైనా ఇళ్లు తాళం వేసి ఊర్లకు వెళ్లినా సమాచారమందించాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. – బివిజె.రాజు, టూటౌన్ సీఐ, విజయనగరం -
అందరూ షాకయ్యారు
ఇంత పెద్ద సిటీలోనూ బైక్ నడిపించే అమ్మాయిల శాతం చాలా తక్కువే. ప్రముఖ కళాశాలల విద్యార్థినులను అడిగినప్పుడు చాలామంది తమకు బైక్ నడిపించడం రాదన్నారు. కారణమేంటని అడిగితే.. తల్లిదండ్రులు వద్దనడం, టీజింగ్, సేఫ్టీ తదితర చెప్పారు. అమ్మాయిలతో బైకథాన్ నిర్వహించాలనుకున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మమతా రఘువీర్, బైకర్నీ జయభారతిలకు ఇది ఆశ్చర్యం కలిగించింది. అప్పుడే అమ్మాయిలకు బైక్ నేర్పించాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వీరు. – సాక్షి, సిటీబ్యూరో సెల్ఫ్ డిఫెన్స్, మెడికల్ ఎమర్జెన్సీ, ట్రాఫిక్ రూల్స్, భద్రత, బాధ్యతాయుత డ్రైవింగ్.. ఇలా అన్నీ కలిపి ఒక కోర్సు తయారు చేసింది జయభారతి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రవాణాశాఖ, హీరో మోటర్స్‌తో కలిసి బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లోని ట్రైనింగ్ పార్క్‌లో ఈ సెషన్ నిర్వహించారు. అమ్మాయిలు బైక్ నేర్చుకోవడానికి అడ్డంకిగా చూపుతున్న అన్నింటికీ ఈ శిక్షణతో సమాధానమిచ్చారు. ఇది మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి బ్యాచ్‌లో 30 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న మహిళలు ‘సాక్షి’తో తమ అనుభవాలు పంచుకున్నారు. ఇదీ కోర్సు.. మొదటి బ్యాచ్‌లో గృహిణులు, ఉద్యోగినులు, విద్యార్థినులు శిక్షణ తీసుకున్నారు. ప్రతి శనివారం ఉదయం 7–9 వరకు 8 వారాలు శిక్షణ ఉంటుంది. మొదటి రెండు తరగతుల్లో లర్నింగ్ లైసెన్స్ సెషన్స్ నిర్వహించారు. శిక్షణలో డ్రైవింగ్ రూల్స్, లైసెన్స్ విధివిధానాలు, ఆర్టీఏ విభాగాలతో సెషన్స్ ఉంటాయి. శిక్షణకు బైక్‌లను హీరో మోటార్స్ సమకూరుస్తోంది. బైకర్నీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణకు రూ.500 నామమాత్ర ఫీజు తీసుకుంటున్నారు. మొదటి బ్యాచ్‌కు వచ్చిన స్పందనతో మరిన్ని బ్యాచ్‌లకు శిక్షణనివ్వనున్నారు. వివరాలకు ‘తరుణి’ ఫేస్బుక్ పేజీని సంప్రదించండి. www.facebook.com/Tharuni.org ఇదో సాధికారత.. అమ్మాయిలు బైక్‌పై వెళ్తే భద్రత ఉండదని పేరెంట్స్ భయపడుతుంటారు. కానీ బైక్ ఉంటే ఎక్కువ సేఫ్. సమయం మన చేతిలో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లగలం. ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుంది. మహిళ బైక్ నడుపుతుందంటే సాధికారత సాధించినట్లే. మహిళలకు సైకిల్స్ ఇవ్వడం, బైక్ రైడింగ్ నేర్పించడం ద్వారా వారిని సాధికారత సాధించేలా చేయాలన్నదే మా సంస్థ లక్ష్యం. – మమత, ‘తరుణి’ నిర్వాహకురాలు చీరకట్టు అడ్డుకాదు.. నా జీవితం ఇంటికి పరిమితమైంది. నేనేమీ చేయలేనని నాన్నకు అభిప్రాయం ఏర్పడింది. ఎలాగైనా బైక్ రైడింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నాన్నను ఇక్కడికి తీసుకొచ్చి నేను బైక్ నడిపి చూపించాను. ఇది నాలో కొత్త ఉత్సాహన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. స్కూటీ లాంటివి నేర్చుకోవడానికి చీరకట్టు అడ్డుకాదు. బైక్‌కు చుడిదార్ వేసుకుంటే సరిపోతుంది. – స్వప్న, గృహిణి అవకాశమే ఆయుధం.. అమ్మాయిలకు బైక్ నేర్చుకునే అవకాశం లేకపోవడంతోనే వారు వెనకబడిపోయారు. అవకాశం కల్పించి నేర్పిస్తే బాగా నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. ఇందుకు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలే ఉదాహరణ. – జయభారతి, లేడీ బైకర్ అందరూ షాకయ్యారు.. మా ఇంట్లో పల్సర్, ఎఫ్‌జడ్ ఉన్నాయి. అయితే బైక్‌లు బరువుగా ఉంటాయని అన్నయ్యలు నన్ను నడపొద్దు అనేవారు. ఇక్కడ శిక్షణలో చేరాక ఓ రోజు బైక్ రైడ్ చేసి చూపించాను. అంతే అందరూ షాకయ్యారు. అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. నాకు అవెంజర్ కొనివ్వమని ఇంట్లో డిమాండ్ చేస్తున్నాను. బైక్ నేర్చుకోవడం కష్టమేం కాదు. బ్యాలెన్సింగ్ రావాలంతే. – శ్రుతి, డిగ్రీ ద్వితీయ సంవత్సరం అబ్బాయిలకే పెద్ద బైకులా? అమ్మాయిలకు చిన్న బైక్‌లు, అబ్బాయిలకు పెద్ద బైక్‌లు అనడం కరెక్ట్ కాదు. ధైర్యసాహసాలు అంటే మగవారి సొత్తుగా చిత్రీకరించారు. అమ్మాయిలందరూ బైక్ నడపాలి. అప్పుడే అన్ని బైక్‌లు అందరికీ అనే ఆలోచన వస్తుంది. – సత్యవేణి ఏ వయసులోనైనా ఓకే.. మనకు నచ్చిన పని చేయడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాదు. నేను 51 ఏళ్ల వయసులో బైక్ నేర్చుకొని నడపిస్తున్నాను. ఏ కారణాలతోనూ మన ప్యాషన్‌ను పక్కన పెట్టొద్దు. సరైన శిక్షణ తీసుకొని, భద్రతా ప్రమాణాలు పాటించాలి. – అనిత, స్వచ్ఛంద సేవకురాలు -
బొద్దుగా ఉన్నా పర్వాలేదు!
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్.. వందకు పైగా దేశాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు.. అగ్రదేశం అమెరికా అ«ధ్యక్షుడి సలహాదారు, ఆయన కూతురు, ఓ ఎంటర్ప్రెన్యూరైన ఇవాంకా ట్రంప్ ముఖ్య అతిథిగా నగరంలో మూడురోజుల వేడుక సాగింది. వ్యాపార, వాణిజ్య రంగాల్లోకి మహిళలు రావాలి.. ఆదాయోత్పత్తుల్లో వారి వాటా పెరగాలని ఇవాంకాతో సహా సదస్సుకు హాజరైనవారంతా నొక్కి చెప్పారు. అందుకే ‘విమెన్ ఫస్ట్.. ప్రాస్పరిటీ ఫర్ ఆల్’ (మహిళకు మొదటిస్థానం.. శ్రేయస్సు అందరికీ) అని నినదించారు. ‘తుమ్హారీ సులూ’.. విద్యాబాలన్ ప్రధాన పాత్రగా తీసిన బాలీవుడ్ చిత్రం. కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి, వంద దేశాల నుంచి మహిళా పారిశ్రామికవేత్తలను పిలిచి.. మూడు రోజుల జీఈఎస్ సదస్సులో రోజుకు 53 సెషన్లలో తమ ఆలోచనలను మథించి, తీర్మానాలను రచించి రూపొందించిన నివేదికను రెండున్నర గంటల్లో చూపించిన సినిమా. ఇప్పుడు ఈ రెండూ హైదరాబాద్ వనితల్లో కొత్త స్ఫూర్తిని నింపాయి. సాక్షి, సిటీబ్యూరో: లావును జీరో సైజ్ కన్నా గొప్పగా.. దాన్నో ప్రైడ్‌గా భావించొచ్చు. ఇంటర్ ఫెయిలైయినా.. ఇష్టమైన ఉద్యోగం చేయొచ్చు. బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ లేకున్నా వ్యాపారంలో విజయం సాధించొచ్చు. లోకం పోకడ తెలియని గృహిణి.. ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోవచ్చు. వీటన్నింటికీ ‘ఆత్మవిశ్వాసం’ అనే అర్హత ఉంటే చాలు. జీఈఎస్ లాంటి వేదికలపై బిజినెస్ పాఠాలు చెప్పొచ్చని, ఇవాంకకు లేని గౌరవాన్ని సాధారణ గృహిణి సైతం సొంతం చేసుకోవచ్చ’ని డిజిటల్లో డిస్ప్లే చేసి మరీ చెప్పిన సినిమా తుమ్హారీ సులూ. ఆత్వ విశ్వాసమే అలైన అందం పెళ్లయి, బిడ్డ పుట్టి బాధ్యతలతో ఒంటి మీద శ్రద్ధ తగ్గో.. ఇతర కారణాల వల్లో లావైపోతే ఆత్మన్యూనతతో కుంగిపోవాల్సిన పనిలేదంటున్నారు సిటీలో వివిధ రంగాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న మహిళలు. ‘తుమ్హారీ సులూ’లోని విద్యాబాలన్‌లా లావుతోనూ (ఒబేసిటీ దుష్పరిణామాలు చూపించనంత వరకు) సగర్వంగా నడవచ్చు.. ఆరోగ్యంగా మెరవచ్చు. ఇది హౌజ్వైవ్స్కే కాదు.. జీరో సైజ్ కోసం పొట్ట మాడ్చుకునే అమ్మాయిలకూ ప్రేరణే. లావు వల్ల ఏ అనారోగ్యం రాకపోయినా.. పర్ఫెక్ట్ బాడీ షేప్స్ కోసం లైపోసెక్షన్, బేరియాట్రిక్ సర్జరీలకు పరిగెత్తే కెరీర్ ఓరియంటెడ్ విమెన్‌కి కూడా స్ఫూర్తే. ∙ఇంటర్ ఫెయిలై ఉన్న అమ్మాయి బ్యూటీ కోర్స్ చేద్దామనే తాపత్రయాన్ని ఇంట్లోవాళ్లు చంపేస్తే.. తనలోని కాంపిటీటివ్ స్పిరిట్‌ను చచ్చిపోనివ్వకుండా పదనుపెట్టుకునే ఓ అమ్మాయి కథ ‘తుమ్హారీ సులూ’. ఒక కొడుకు పుట్టాక కూడా ఆ స్పిరిట్‌ను అలా కంటిన్యూ చేస్తుంది. తను ఉంటున్న వీధిలోను, అబ్బాయి స్కూల్లో పేరెంట్స్‌కి కూడా పోటీగా నిలుస్తుంది విద్యాబాలన్. ప్రతి పోటీలోనూ దూసుకుపోయే ఓ మహిళా ఒక ఎంట్రప్రెన్యూర్ కథకు అద్భుతంగా చూపించారు. నిన్న,మొన్నటి దాకా లావుగా ఉన్నామని, ఆత్మన్యూనతతో బాధపడేవారికి ఓ చక్కటి సందేశాన్నిచ్చిందీ చిత్రం. పైగా ఓ అంతర్జాతీయ సదస్సులో ఆ చిత్రానికి ప్రశంసలు దక్కడందో సిటీ మహిళల ఆలోచనలో సైతం మార్పు మాచ్చింది. జిమ్ములకు వెళ్లి సన్నబడే బదులు ఆత్మ విశ్వాసాన్ని పెంచుకుని తామేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు. లావుగా ఉన్నామన్న భావనను ఆత్మవిశ్వాసంతో అధిగమించవచ్చని.. చేస్తున్న పని చిన్నదైనా ఆత్మగౌరవంతో సాగితే ఆ ప్రభావం పెద్దగా ఉంటుందంటున్నారు సిటీకి చెందిన ప్రముఖ డిజైనర్ గంగు శ్రీవాణి. ఈమెతో ఏకీభవించే సిటీ వనితలు చాలామందే ఉన్నారు. బొద్దుగా ఉండడం కూడా ఓ ట్రెండేనని చెబుతున్నారు. సెంటర్ ఆఫ్‌ది అట్రాక్షన్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ హైదరాబాద్ మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తమకు తాముగా ఎదుగాలనుకునే మహిళలకు ఓ దిక్సూచిగా నిలిచింది. లావు, సన్నం అనే తేడా లేకుండా ఆత్మవిశ్వాసమే తోడుగా ముందుకు కదలమంది. అయినా బొద్దుగా ఉండడం లేటెస్ట్ ట్రెండ్‌గా మారుతోంది. బొద్దుగా ఉన్నవాళ్లే ఏ పార్టీకి వెళ్లినా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారుతారు. – పద్మజ, ఎంటర్ప్రెన్యూర్ విద్యా.. కొత్త స్ఫూర్తినిచ్చారు.. ‘తుమ్హారీ సులూ’ సినిమాలో బొద్దుగా కనిపించిన విద్యాబాలన్ మాలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. లావు, ఫెయిల్, లోకం పోకడ తెలియకున్నా. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించవచ్చన్న కథను ఎంతో చక్కగా చెప్పారు. – దేవిరెడ్డి శ్వేత బొద్దుగా ఉన్నా పర్వాలేదు.. ఎత్తుకి తగిన బరువు, అధిక బరువు, ఒబేసిటీ బరువుని ఇలా మూడు రకాలుగా విభజించవచ్చు. రకరకాల మార్పుల వల్ల బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా స్త్రీలు హార్మోనల్ మార్పులు, అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల బరువు పెరుగుతుంటారు. డెలివరీ తర్వాత తల్లులు కొంత బరువు పెరుగుతారు. ఆ సమయంలో బరువు పెరగకుండా బలమైన ఆహారం ఏం తీసుకోవాలని అందరికీ తెలియదు. ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూవనంత వరకు అధిక బరువుతో ఏ ప్రమాదం లేదు. పని చేసుకోలేకపోవడం, చుట్టుపక్కల వారు, ఇంట్లోవారు మన శరీరం గురించి మాట్లాడుతున్నప్పుడు బరువు పట్ల ఆలోచించడం ప్రారంభిస్తారు. అలాగని లావుగా ఉన్న వారిలో తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటుందని అనుకోవడానికి లేదు. కానీ ఒబేసిటీ ఉన్న స్త్రీలలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని చెప్పగలను. అది వారి మానసిక, శారీరక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది. – డాక్టర్ సునితా గ్రేస్ -
భూగర్భ డ్రిప్‌తో కరువుకు పాతర!
⇒ కొత్త పోకడ ⇒ వాతావరణ మార్పుల నేపథ్యంలో బిందు సేద్యంలో కొత్తపోకడ.. భూగర్భ డ్రిప్‌కు ఆదరణ ⇒ తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ పంటకు రక్షణ ⇒ సాధారణ డ్రిప్‌తో కన్నా.. భూగర్భ డ్రిప్‌తో అదనపు ప్రయోజనాలు ⇒ ఉద్యాన తోటలతోపాటు మొక్కజొన్న, వరి, గోధుమ తదితర పంటలకూ భూగర్భ డ్రిప్ అనుకూలమే.. ⇒ ఇజ్రాయెల్ సాంకేతికతతో భూగర్భ డ్రిప్‌తో వరిని సాగు చేస్తున్న కాలిఫోర్నియా రైతులు ⇒ వరి, గోధుమ సాగులో భూగర్భ డ్రిప్ వాడకంపై అధ్యయనానికి సిద్ధమవుతున్న పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వర్షాకాలంలోనూ తిష్టవేస్తున్న కరువు రైతుల ఆశలను నిలువునా కాటేస్తున్నది. ప్రకృతిపై ఆధారపడి బతికే అన్నదాతల జీవనాధారాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నది. భూతాపం పెరుగుతున్నకొద్దీ ప్రపంచవ్యాప్తంగా కరువు రక్కసి విస్తరిస్తూ ఉంది. కరువు పీడిత ప్రాంతాల జాబితా ఏటేటా తామరతంపరవుతూ ఉంది. మన దేశంలో 1960వ దశకంలో 5 రాష్ట్రాల్లో 66 జిల్లాలు కరువు కాటకాల పాలవ్వగా, 2010వ దశకంలో (2017 జూన్ నాటికి) 23 రాష్ట్రాల్లో 405 జిల్లాలకు కరువు రక్కసి విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో వ్యవసాయ కేంద్రాలైన కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలను సైతం కరువు వణికిస్తోంది. ఈ పూర్వరంగంలో మరింత సమర్థవంతంగా నీటి వినియోగంపై లోతైన అధ్యయనాలు సాగుతున్నాయి. రసాయనిక ఎరువులతో సాగయ్యే ఏక పంటల కన్నా... ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగయ్యే మిశ్రమ పంటలకు కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడం మన రైతులకూ అనుభవంలో ఉన్న సంగతే. పంట మొక్కలు, పండ్ల చెట్ల మొదళ్ల దగ్గర్లో భూమిపైన డ్రిప్‌లు, స్ప్రింక్లర్లతోపాటు.. రెయిన్గన్లు ఏర్పాటు చేసుకొని కొందరు రైతులు సాగు నీటిని పొదుపుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, తరచూ కరువు పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత తక్కువ నీటితో పంటలు పండించ వీలయ్యే ‘భూగర్భ డ్రిప్’ పద్ధతి ముందుకు వస్తోంది. ఎడారిలోనూ సమర్థవంతంగా నీటి వినియోగంపై పరిశోధనలో ముందంజలో ఉన్న ఇజ్రాయెల్ భూగర్భ డ్రిప్ వాడకంలోనూ పైచేయి సాధించింది. ఏళ్ల తరబడి నిరవధికంగా సాగులో ఉండే ఉద్యాన తోటల్లో వినియోగించడం అమెరికాలోనూ అతికొద్ది మంది రైతుల అనుభవంలో ఉన్నదే. కరువు సమస్య తరచూ ఎదురుకాటంతో డెల్టా ప్రాంతాల్లోనూ పంటలకు సాగు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో.. కొద్ది నెలల్లో కోతకొచ్చే మొక్కజొన్న, సోయా చిక్కుళ్లను ఇప్పటికే భూగర్భ డ్రిప్‌తో సాగు చేసి.. కరువును సమర్థవంతంగా తట్టుకోవడంతోపాటు దిగుబడులనూ గణనీయంగా పెంచుకోగలిగినట్లు సమాచారం. భూగర్భ డ్రిప్ సంగతులు.. ♦ భూగర్భ డ్రిప్ అంటే.. పంట మొక్కలు, పండ్ల చెట్లకు నేలపైన కాకుండా.. వేర్ల దగ్గరలో నీటి తేమను అవసరం మేరకు తగుమాత్రంగా అందించే వ్యవస్థ. ముఖ్యంగా వరి సాగులో ఎకరానికి లక్షల లీటర్ల నీటిని ఆదా చేయడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది. ♦ భూమి లోపల పంటను బట్టి 4 నుంచి 30 అంగుళాల లోతులో శాశ్వత డ్రిప్‌ను ఏర్పాటు చేస్తారు. నీటి తేమ వేర్లకు క్రమం తప్పకుండా అందుతుంది. మట్టిలో తేమ పరిస్థితిని సెన్సార్ల ద్వారా గమనిస్తూ.. పంటకు అవసరమైనప్పుడు తగుమాత్రంగా నీటిని అందిస్తారు. ♦ ఏ రకం పంట వేర్లు ఎంత లోతుకు వెళ్తాయన్నదాన్ని బట్టి.. ఆ పొలంలో మట్టి గట్టిపడే లక్షణాన్ని బట్టి.. భూమికి ఎన్ని అంగుళాల లోతున డ్రిప్ పైపులు, లైన్లు వేయాలన్నది నిపుణులు నిర్ణయిస్తారు. ♦ దీన్ని ప్రతి ఏటా మార్చుకోవాల్సిన పని ఉండదు. ఒకసారి వేసుకుంటే పదేళ్లపాటు కదిలించాల్సిన అవసరం ఉండదట. కరువొచ్చినా ఉన్న నీటితోనే మంచి దిగుబడులు తీయగలుగుతారు కాబట్టి.. దీర్ఘకాలంలో రైతులకు లాభదాయకమేనని చెబుతున్నారు. ♦ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు పొలంలో తిరగడం వల్ల భూగర్భ డ్రిప్‌కు ఎటువంటి నష్టమూ ఉండదు. ♦ రెయిన్ గన్ల ద్వారా ఖర్చయ్యే నీటిలో సగంతోనే భూగర్భ డ్రిప్ ద్వారా పంటలు పండించవచ్చు. ♦ వరి తదితర పంట విత్తనాలు మొలకెత్తడానికి మొదట ఒక తడి పెడతారు. మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. పొలంలో భూమి పై భాగం పొడిగానే ఉంటుంది. ఫలితంగా కలుపు సమస్య ఉండదు. చీడపీడల బెడద కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ♦ మట్టిలో నీటి తేమ ఎంత లోతులో ఎంత ఉంది? అనేది ఎప్పటికప్పుడు గమనించి రైతు మొబైల్ లేదా కంప్యూటర్‌కు సెన్సార్లు సమాచారం ఇస్తాయి. నీరు పంటలకు అవసరం లేనంత కిందికి వెళ్తున్నదో లేదో తెలుసుకోవడానికి భూగర్భంలో అక్కడక్కడా సెన్సార్లు పెడతారు. ♦ భూగర్భ డ్రిప్‌తో అతి తక్కువ నీటితో, కరువు కాలంలోనూ పంట తీయవచ్చు. అయితే, దీన్ని ఏర్పాటు చేసుకోవడం అధిక ఖర్చుతో కూడిన పనే. ఎకరానికి రూ. 35 వేల నుంచి 50 వేల వరకు ఖర్చవుతుందని ఒక అంచనా. ♦ అమెరికాలోని మిన్నొసోట రాష్ట్రానికి చెందిన మొక్కజొన్న రైతు బ్రియాన్ వెల్డె తన 58 ఎకరాల పొలంలో భూగర్భ డ్రిప్‌ను గత ఏడాదిగా వాడుతున్నారు. మొక్కజొన్న రైతుల సంఘం ఆర్థిక సాయంతో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. 5 అడుగుల దూరంలో 14 అంగుళాల లోతులో.. 8 అంగుళాల వ్యాసార్ధం గల భూగర్భ డ్రిప్ పైపులను అమర్చారు. వీటి నుంచి డ్రిప్ టేపుల ద్వారా నీటిని మొక్కజొన్న మొక్కల వేర్లకు నేరుగా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ జూలైలో నీటి ఎద్దడి కాలంలోనూ తేలికపాటి ఇసుక నేలలో మొక్కజొన్న పంటను భూగర్భ డ్రిప్ వల్లనే కాపాడుకోగలిగానని, ఇదొక ఆశావహమైన ప్రత్యామ్నాయమని బ్రియాన్ వెల్డె అంటున్నారు. తొలుత ఎక్కువ పెట్టుబడి అవసరమైనప్పటికీ ఇది రైతుకు లాభదాయకమేనన్నారు. ♦ రసాయనిక వ్యవసాయంలోనైనా, సేంద్రియ / ప్రకృతి వ్యవసాయంలోనైనా భూగర్భ డ్రిప్ లైన్ల ద్వారా ద్రవ రూప ఎరువులను అందిస్తూ.. మంచి దిగుబడులు పొందడం అసాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ♦ అంతర పంటలు సాగు చేసుకోవాలనుకుంటే అందుకు అనుగుణంగా అదనపు భూగర్భ డ్రిప్ లైన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పంటల వ్యర్థాలు, గడ్డీ గాదంతో ఆచ్ఛాదనతో ప్రకృతి సేద్యం చేసే రైతులకు భూగర్భ డ్రిప్‌తో అధిక ప్రయోజనం చేకూరవచ్చు. ♦ మట్టి ఉష్ణోగ్రతలు, నేల స్వభావం, పంటల స్వభావం తదితర అంశాలను బట్టి భూగర్భ డ్రిప్ ప్రభావశీలత ఆధారపడి ఉంటుంది. బిందు సేద్యంలో ముందుకొస్తున్న ఈ కొత్తపోకడపై పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కూడా ఈ దిశగా దీక్షగా కదిలితే కరువు పీడిత రైతుల్లో కొందరికైనా మేలు కలుగుతుంది. భూగర్భ డ్రిప్‌తో వరి, గోధుమ సాగుపై పంజాబ్ వర్సిటీ అధ్యయనం! పంజాబ్‌లోని 138 నీటి బ్లాక్‌లకు గాను 110 బ్లాక్‌లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గోధుమ సాగులో డ్రిప్ వాడకంపై పరిశోధనలు చేపట్టింది. రెండేళ్ల క్షేత్రస్థాయి పరిశోధన అనంతరం.. రబీలో డ్రిప్‌తో గోధుమ పంటను సగం నీటితోనే సాగు చేయవచ్చని డాక్టర్ ఎ. ఎస్. బ్రార్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. మొదట 4 అంగుళాల నీటితో పొలంలో నీటిని పారగట్టారు. గోధుమ విత్తనాలు మొలకెత్తిన తర్వాత.. భూగర్భ డ్రిప్ ద్వారా 5 విడతలుగా (కేవలం 20% నీటితోనే) నీటి తడులు ఇచ్చారు. డ్రిప్‌ను వాడటం ద్వారా 15 రోజులు ముందుగా గోధుమ విత్తుకోవడం వీలవుతుంది. తద్వారా 10% దిగుబడిని పెంచే అవకాశం ఉందని ఆయన ఇటీవల ప్రకటించారు. రెండేళ్లుగా డ్రిప్‌పై అధ్యయనం చేసిన డా. బ్రార్ బృందం ఇప్పుడు భూగర్భ డ్రిప్‌పై దృష్టిపెట్టింది. దీనిపై క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టడానికి ఇటీవలే నిధులు విడుదలయ్యాయని డా. బ్రార్ తెలిపారు. రబీలో గోధుమతోపాటు, ఖరీఫ్‌లో వరి పంటను కూడా భూగర్భ డ్రిప్ ద్వారా పండించడానికి అవకాశాలున్నాయన్నారు. వరి, గోధుమ సాగుకు భూగర్భ డ్రిప్‌ను వాడే పద్ధతిని రైతులకు పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండేళ్లలో సిఫారసు చేసే అవకాశాలున్నాయి. కాలిఫోర్నియాలో భూగర్భ డ్రిప్‌తో వరి సాగు! అత్యధిక పరిమాణంలో సాగు నీరు అవసరమయ్యే వరి పొలాల్లో సైతం భూగర్భ డ్రిప్ వాడకానికి అమెరికాలోని కాలిఫోర్నియా రైతులు ఇజ్రాయెల్ సాంకేతిక సహకారంతో శ్రీకారం చుట్టారు. వరి పంటను భూగర్భ డ్రిప్‌తో పండించే సాంకేతికతపై విశేష పరిశోధనలకు ఇజ్రాయెల్‌లోని బెన్–గురియన్ విశ్వవిద్యాలయం పెట్టింది పేరు. వరి సాగుకు పేరొందిన మూడు అమెరికన్ రాష్ట్రాల్లో కాలిఫోర్నియా ఒకటి. సేంద్రియ వరి సాగులో పేరుగాంచిన ‘లుండ్‌బెర్గ్ ఫామిలీ ఫామ్స్’ సంస్థ బెన్–గురియన్ విశ్వవిద్యాలయంతో గత ఏడాది ఒప్పందం చేసుకొని, తొట్టతొలిగా వంద ఎకరాల్లో భూగర్భ డ్రిప్‌తో వరి సాగుకు ఉపక్రమించింది. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నేర నియంత్రణలో కొత్త పంథా
ఏలూరు అర్బన్ : నగర పోలీసులు నేరాల నిరోధం, నియంత్రణలో అప్డేట్ అవుతున్నారు. చికిత్స కన్నా నివారణ మేలు అనే నానుడిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గతంలో నేరం జరిగిన తరువాత తీరుబడిగా విజిల్స్ ఊదుకుంటూ హడావుడి పడుతూ వచ్చే వి«ధానానికి దాదాపు తిలోదకాలు ఇచ్చేశారు. అదే క్రమంలో చేతిలో లాఠీ పట్టుకుని అల్లరిమూకలపై దాడి చేసే ప్రక్రియతో ఆశించిన ఫలితాలు రావని గ్రహించి ఫ్రెండ్లీ పోలీసింగ్ మొదలు పెట్టారు. ప్రజలను కూడా పోలీసు విధుల్లో భాగస్వాములను చేసేందుకు గతంలో పోలీసు మిత్ర పేరిట అమలు చేసిన పథకం ఫెయిల్ కావడంతో ఆ విధానానికి మరింత మెరుగులు దిద్ది విద్యార్థులు, ప్రజలను పోలీసుల విధుల్లో భాగస్వాములు చేసేందుకు కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) అనే నూతన పథకం అమలు చేస్తున్నారు. నిత్యం నగరంలో విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ పేరిట నిత్యం నగరంలో అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సిబ్బందితో కలిసి వాహన, లాడ్జి తనిఖీలు ముమ్మరం చేశారు. రౌడీలు, విద్యార్థులు, వాహన చోదకులకు కౌన్సెలింగ్‌లు రౌడీ షీటర్లను స్టేషన్‌కు పిలిపించి వారి ప్రవర్తనపై ఆరా తీయడం కౌన్సెలింగ్ నిర్వహించడం జరిపేవారు. అయితే ప్రస్తుతం పంథా మార్చారు. పోలీసు అధికారులే నేరుగా వారి ఇళ్ళకు వెళ్లి వారి కుటుంబసభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ర్యాగింగ్ నివారించేందుకు విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమాజంలో కుల వివక్ష రూపుమాపేందుకు ప్రతినెలా సివిల్ రైట్స్ డే పేరిట ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. రహదారి ప్రమాదాల నివారణకు స్కూలు బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు తరచూ కౌన్సెలింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చట్టాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ బహిరంగ ప్రదేశాలలో ధూమపానంపై నిషేధం ఉన్నా చూసీచూడనట్టు వ్యవహరించే పోలీసులు ప్రస్తుతం అందుకు భిన్నంగా చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగంగా పొగతాగుతూ పొగ మేఘాలు సృష్టించే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. అదే విధంగా పాదచారులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారిని గుర్తించి పెనాల్టీగా భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారు. రాంగ్ పార్కింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని అదుపులోకి తీసుకోవడం కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టి కోర్టులో హాజరు పరచడం వంటి కార్యక్రమాలతో ప్రజల మెప్పు పొందుతున్నారు. -
బోధిస్తున్నారా?.. బడి ఎగ్గొడుతున్నారా?
ఉపాధ్యాయుల నిగ్గు తేల్చేందుకు విద్యాశాఖ యత్నం ఫొటోలతో సహా వివరాలు ప్రదర్శించాలని ఆదేశం 4 వేల పైగా స్కూళ్లకు పదుల సంఖ్యలోనే అమలు రాయవరం : ‘మీ గ్రామంలోని పాఠశాలకు అక్కడ నియమించిన ఉపాధ్యాయుడే వస్తున్నారా? ఆయనకు బదులు వేరొక ప్రైవేటు వ్యక్తి బోధిస్తున్నారా? మీ పాఠశాలలో ఎవరు ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో తెలుసా? మీ ఉపాధ్యాయులు తరచూ పాఠశాలకు ఎగనామం పెడుతున్నారా? మీ పాఠశాలలో నకిలీ ఉపాధ్యాయులు బోధిస్తున్న విషయం మీకు తెలుసా?’.. బహుశా చాలామంది తల్లిదండ్రులకు అలాంటి ప్రశ్నల గురించి ఊహించే ఉండరు. అయితే అలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్నది వాస్తవం. అందుకే వీటికి అడ్డుకట్ట వేసేందుకు విద్యాశాఖ కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుడుతోంది. ఇకపై ఆ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల వివరాలు ఫొటోలతో సహా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ విధానం వలన నకిలీ ఉపాధ్యాయులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. బోధన మాని ఇతర వ్యాపకాలు చాలా చోట్ల ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా వారి స్థానంలో వేరొకరిని నియమించి వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు చేపడుతున్నట్లుగా విద్యాశాఖాధికారుల పరిశీలనలో తేలింది. నాణ్యమైన విద్య అందక పోవడానికి ఇదొక కారణంగా గుర్తించారు. ఇటువంటి వారికి చరమగీతం పాడే చర్యల్లో భాగంగా ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల వివరాలు, వారి ఫొటోలు, ఏ సబ్జెక్టులు బోధిస్తారు, విద్యార్హతలు, గ్రేడింగ్ స్థాయి తదితర వివరాలను పాఠశాలల్లోని గోడపై ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఈ ఆదేశం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. జిల్లాలో 4,144 పాఠశాలలు ఉండగా కేవలం పదుల సంఖ్యలోనే వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అమలు వలన ప్రయోజనాలివే.. కొన్ని పాఠశాలల్లో పలువురు ఉపాధ్యాయులు స్వంత పనులకు పరిమితమై వారి స్థానంలో వేరొకరిని ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు ప్రదర్శిస్తే కచ్చితంగా వారే బోధిస్తారు. రాజకీయ పలుకుబడితో విధులకు గైర్హాజరయ్యే వారు ఉన్నారు. స్థానికులు, అధికారులు పాఠశాలలను సందర్శించే సమయంలో ఫొటోల ఆధారంగా గైర్హాజరును గుర్తించే అవకాశం ఉంటుంది. అధికారుల ఆకస్మిక తనిఖీ సమయంలో ఎవరున్నారు, గ్రేడింగ్ స్థాయిని గుర్తించే వీలుంటుంది. ఏ ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టు బోధిస్తున్నారో తెలుస్తుంది. ఆయన బోధనలో ఎక్కడైనా లోపాలుంటే అక్కడికక్కడే సూచనలిచ్చి నైపుణ్యాలను మెరుగుపర్చవచ్చు. ఉపాధ్యాయుల్లోనూ బాధ్యత పెరుగుతుంది. ఎవరైనా ప్రశ్నిస్తారనే భావన కలగడంతో క్రమశిక్షణ పెరుగుతుంది. పాఠశాల పనివేళల్లో తరగతి గదిలో ఉండడంతో మెరుగైన బోధన అందుతుంది. ఫలితంగా ప్రమాణాలు పెరుగుతాయి. 23, 24 తేదీల్లో తనిఖీలు.. ఉపాధ్యాయుల ఫొటోలతో కూడిన వివరాలను కచ్చితంగా ప్రదర్శింనదీ, లేనిదీ తెలుసుకునేందుకు ఈ నెల 23, 24 తేదీల్లో విద్యాశాఖ బృందాలు పాఠశాలలను సందర్శించనున్నాయి. ప్రతి పాఠశాలలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హెచ్ఎంల సమావేశంలో మండల విద్యాశాఖాధికారులు సూచించారు. ఆ మేరకు ఉపాధ్యాయుల వివరాలను ప్రదర్శించారో, లేదో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తనిఖీలు చేపట్టనున్నారు. అన్ని పాఠశాలల్లో అమలు చేయాలి.. పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు, విద్యార్హతల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని ఆదేశాలు ఇచ్చాం. 23, 24 తేదీల్లో ఇదే అంశంపై తనిఖీలు కూడా నిర్వహిస్తాం. – ఆర్.నరసింహారావు, డీఈఓ -
నాట్లు వేశాం.. పంట రుణాలు ఇవ్వండి
ఏలూరు (సెంట్రల్) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. జిల్లాలో 3 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, చట్టప్రకారం భూ యజమానితో సంబంధం లేకుండా అందరికీ రుణార్హత గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉందని జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. అధికారులు చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితికి దూరంగా ఉన్నాయని, కార్డుల జారీలో కొందరు సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6,200 కోట్లు రుణ లక్ష్యం ప్రకటించినా కౌలు రైతులకు ఒక శాతం కూడా రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. జీవో ప్రకారం ప్రతి కౌలు రైతుకూ రూ.లక్ష వడ్డీలేని రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల నాయకులు డి.అశోక్‌కుమా ర్, డీఎన్‌వీడీ ప్రసాద్, జక్కంశెట్టి సత్యనారాయణ, పీవీ రామకృష్ణ ధర్నాకు సంఘీభావం తెలిపారు. అనంతరం కలెక్టర్ కె.భాస్కర్‌కు వినతిపత్రం అందించారు. కౌలు రైతులు కలెక్టరేట్ నుంచి ర్యాలీగా వెళ్లి వ్యవసాయశాఖ జేడీ కార్యాలయాన్ని ముట్టడించారు. వ్యవసాయశాఖ డీడీ, ఆంధ్రా బ్యాంకు ఏజీఎం కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించారు. -
హీరో'ఇన్'
మహిళల్లో శక్తి ఉంటుందని మనమే కాదు... మన పూర్వులే కాదు... పూర్వుల పూర్వులు కూడా గుర్తించారు. అందుకే, మనకు అంతమంది దేవతలు! అలాగే, సినిమా ఇండస్ట్రీ కూడా మహిళలకు పెద్ద ‘పీఠం’ వేస్తోంది. కొత్త ట్రెండ్‌లో హీరోయిన్లే ఇన్! ఈ సినిమాల్లో హీరో అవుట్... క్లీన్‌బౌల్డ్!! అనుష్క: ఇవాళ చాలా సినిమాల్లో హీరోలకు మించిన హీరో(యిన్) - ఈ బెంగుళూరు భామ. గ్లామర్ హీరోయిన్గా మొదలై ఆ పాత్రలే చేస్తూ వస్తున్న ఈ యోగా టీచర్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ ‘అరుంధతి’. ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాకు తెలుగులోనే కాదు... తమిళంలోని ఆడియన్స్ క్లాప్స్ పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిశాయి. అప్పటికే సౌందర్య మరణంతో కొత్త చిరునామా వెతుక్కుంటున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త కేరాఫ్ అడ్రస్ - అనుష్క అయ్యారు. అప్పటి నుంచి ‘పంచాక్షరి’, లేటెస్ట్ ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ దాకా కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందంటే, అనుష్క కాల్షీట్లకి యమ డిమాండ్! రాబోయే చిత్రం: అశోక్ దర్శకత్వంలో తయారవుతున్న ‘భాగమతి’. పేరు చూడగానే ఇదేదో గోల్కొండ నవాబుల కాలం నాటి చారిత్రక కథ అనుకుంటే పొరపాటే! ఇది అచ్చమైన సోషల్ ఫిల్మ్. కథ అంతా హీరోయిన్ పాత్ర చుట్టూరానే తిరుగుతుందని దర్శక, రచయిత, ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ వివరించారు. నయనతార: సినిమా సినిమాకీ గ్లామరస్‌గా కనిపించాలని హీరోయిన్లు అనుకోవడం సహజం. అందుకే ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ ఉంటారు. అయితే ఈ రేంజ్లో కూడా మేకోవర్ కాగలరా? అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశారు నయనతార. ‘చంద్రముఖి’లో కనిపించిన నయనతారేనా ఈవిడ అని ‘బాస్’ సినిమాలో నయనను చూసినవాళ్లు అనుకున్నారు. ఆ సినిమా నుంచి ఆ మధ్య విడుదలైన హిందీ ‘కహానీ’కి దక్షిణాది రీమేక్ ‘అనామిక’ వరకూ నయనతార మేకోవర్ అవుతూ వచ్చారు. సినిమా సినిమాకీ రెట్టింపు అందంతో కనిపిస్తున్నారామె. ఇటు తెలుగు, అటు తమిళంలో తిరుగులేని తార అనిపించేసుకుని, చివరకు లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాక్సాఫీస్ భారం మొత్తాన్నీ తన భుజాలపై మోసేయడానికి రెడీ అన్నారు. కమర్షియల్ సక్సెస్ మాట ఎలా ఉన్నా, హిందీ ఒరిజినల్లో విద్యాబాలన్ లాగా తెలుగు రీమేక్ శేఖర్ కమ్ముల ‘అనామిక’లో టైటిల్ రోల్‌కి న్యాయం చేశారు నయనతార. ఆ తర్వాత ‘మాయ’ అనే నాయికా ప్రధానమైన హార్రర్ ఫిల్మ్‌లో నటించారు. ఆ సినిమా హిట్‌తో ఈ కేరళ కుట్టిని మనసులో పెట్టుకొని చాలామంది హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు. రాబోయే చిత్రం: హారర్ నేపథ్యంలో సాగే ‘మాయ’లో నయనతార నటన చూసిన తమిళ దర్శకుడు దాస్ రామసామి నయనతారను దృష్టిలో పెట్టుకుని ఓ హారర్ బేస్డ్ స్టోరీ రెడీ చేసుకున్నారు. తమిళంలో ‘దొర’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌లో నయనతార చాలా మాస్‌గా కనిపిస్తారట. అందుకోసం నయనతార మళ్ళీ మేకోవర్ అయ్యారు. సెట్స్‌పై ఉన్న ఈ చిత్రంలో కారుకి కీలక పాత్ర ఉంది. నయనతార పాత్రను ఆ కారు వెంటాడుతుందట. విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న హరీశ్ ఉత్తమన్ ఇందులో మరో కీలకపాత్రధారి. అంజలి: ఈ కోనసీమ అమ్మాయి ‘జర్నీ’, ‘అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్ మాల్’) లాంటి సినిమాలతో తమి ళంలో అభినయానికి పెట్టింది పేరు అయింది. డీ-గ్లామరైజ్డ్ హీరోయిన్ పాత్రలైనా, మొత్తం తన చుట్టూ తిరిగే కథలకు ప్రాణం పోసింది. రెండేళ్ళ క్రితం వచ్చిన హిట్ హార్రర్ - కామెడీ ‘గీతాంజలి’ లాంటివి తెలుగులోనూ ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌కు అంజలిని కొత్త ఛాయిస్‌గా మార్చాయి. ఆ తరువాత ఆమె దగ్గరికి ఎన్ని స్త్రీ ప్రధాన చిత్రాల స్క్రిప్ట్‌లు వచ్చాయంటే, చివరకి చాలావాటికి అంజలి నో చెప్పాల్సి వచ్చింది. రాబోయే చిత్రాలు: తెలుగులో తయారవుతున్న తాజా సైకో - యాక్షన్ థ్రిల్లర్ ‘చిత్రాంగద’ (తమి ళంలో టైటిల్ ‘యార్ నీ’)లో హీరో (యిన్) అంజలి యే! అశోక్ డెరైక్షన్‌లో చాలా కాలంగా చిత్రీకరణలో ఉంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో ఉన్న ఈ సినిమాను అందమైన విదేశీ లొకేషన్స్‌లో తీశారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే తమిళంలో మరో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ (‘కాన్బదు పొయ్’ - చూసేదంతా అబద్ధమని అర్థం)లో నటించడానికి కూడా అంజలి సంతకం పెట్టేశారు. ఈ చిత్రాల్లో హీరో పాత్రలు నావ్‌ు కే వాస్తేనే. పాత్రధారులూ పెద్ద నటులు కాదనేది గమనార్హం. సినిమా అంతా హీరోయిన్ చుట్టూరానే తిరిగే స్క్రిప్ట్ అనడానికి అంత కన్నా ఇంకేం నిదర్శనం కావాలి. త్రిష: సినీ రంగంలోకి వచ్చి పుష్కరం దాటినా, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా కనిపించడం తమిళ పొన్ను త్రిషా కృష్ణన్ స్పెషాలిటీ. వయసు పెరగడం కొన్నేళ్ళ క్రితమే ఆగిపోయిం దనిపించే ఈ హీరోయిన్‌కు ప్రేమకథలు, గ్లామర్ పాత్రలు కొట్టింది పిండి. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పు ముడిచినా అందమే అన్నట్లు, ఇటీవల హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలొస్తుంటే సై అంటున్నారు. నిరుడు తమిళంలో వచ్చిన హార్రర్ చిత్రం ‘అరన్మణై-2’ (తెలుగులో ‘కళావతి’), గత నెల రిలీజైన తెలుగు - తమిళ ద్విభాషా హార్రర్ - కామెడీ ‘నాయకి’ త్రిషలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాయి. రాబోయే చిత్రాలు: ఆ మధ్య రెండేళ్ళ క్రితం ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా తమిళంలో ‘రమ్’ (రంభ - ఊర్వశి - మేనక) అనే సినిమాకు సై అన్నారు త్రిష. ఆ సినిమాలో వెరైటీ ఫైట్లు చేయడానికీ సిద్ధపడ్డారు. కానీ ఏమైందో ఏమో కానీ, ఆఖరు క్షణంలో ఆ ప్రాజెక్ట్ అర్ధంతరంగా ఆగిపోయింది. అయితే, ‘అరన్మణై-2’, ‘నాయకి’ తర్వాత జయా పజయాలతో సంబంధం లేకుండా కొత్త కథల వైపు త్రిష మొగ్గారని చెన్నై వర్గాల భోగట్టా. అందుకు తగ్గట్లే తమిళంలో ఆర్. మాధేష్ దర్శకత్వంలో ‘మోహిని’ అనే హార్రర్ సినిమాలో ఆమె నటిస్తున్నారు. రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని ప్రధానంగా లండన్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. టైటిల్ రోల్ పోషిస్తున్న త్రిష ఈ సినిమా స్క్రిప్ట్ గురించి పెద్దగా చెప్పట్లేదు కానీ, లీసెస్టర్ స్క్వేర్, టవర్ బ్రిడ్జ లాంటి ప్రసిద్ధ లండన్ లొకేషన్లలో నెల రోజుల పైగా షూటింగ్ జరుగుతుంటే, ఉత్సాహంగా ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు. తమన్నా: తెలుగులో పరిచయమై, తమిళం, హిందీల్లో కూడా జెండా ఎగరేసిన ఈ పంజాబీ పిల్ల గ్లామర్‌తో పాటు కొత్త తరహా పాత్రలకూ ఎప్పుడూ సిద్ధం అంటుంటారు. తెలుగులో మాట్లాడడమే కాక, పాత్రకు తప్పనిసరి అంటే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొనే దశకు కూడా వచ్చేశారు. బెస్ట్ డ్యాన్సర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ భాటియా వంశపు యువరాణి ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ఓ... యస్ అనేస్తున్నారు. రాబోయే చిత్రాలు: తమిళ దర్శకుడు ఎల్. విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వస్తున్న ‘అభినేత్రి’ సినిమా అచ్చంగా మహిళా ప్రధాన చిత్రమే. నేత చీర కట్టుకొని, నుదుటన బొట్టు, మెడలో పువ్వులు పెట్టుకొని పాత కాలానికి చెందిన అమ్మాయిగా, మరోపక్క అధునాతనమైన దుస్తుల్లో నవ నాగరిక యువతిగా రెండు షేడ్స ఉన్న పాత్రల్లో తమన్నా ఫస్ట్ లుక్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్ర ధరిస్తున్న ప్రభుదేవా సైతం ఈ మహిళా ప్రధాన చిత్రం కొత్తగా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ త్రిభాషా చిత్రం గనక హిట్టయితే, మరో హీరో(యిన్) మనకు దొరికేసినట్లే. మంచు లక్ష్మీప్రసన్న : సినిమా కుటుంబంలో పుట్టి, ఆ వాతావరణంలో పెరిగిన మంచు వారి అమ్మాయికి జీవితం లోనూ, సినీ జీవితంలోనూ ఎప్పటికప్పుడు కొత్తదనం ఇష్టం. ఆమె ప్రయాణమే అందుకు సాక్ష్యం. హాలీవుడ్లో టీవీ షో లతో మొదలుపెట్టి తెలుగు సీమలో టీవీ షోల వరకు ఎప్పటి కప్పుడు కొత్తదనంతో విస్తరించిన కెరీర్ ఆమెది. తొలి చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’లో ప్రతినాయకి ఐరేంద్రి పాత్రతోనే అందరినీ ఆకట్టుకున్న ఘనత లక్ష్మి సొంతం. రాబోయే చిత్రం: ఇప్పటికే ‘చందమామ కథలు’, ‘బుడుగు’, ‘దొంగాట’ చిత్రాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించారు మంచు లక్ష్మి. తాజాగా ‘లక్ష్మీ బాంబ్’ అనే విభిన్న తరహా చిత్రంలో కనిపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ 80 శాతం పూర్తయింది. థ్రిల్లింగ్ అంశాలున్న పక్కా కామెడీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ ఇందులో ఆమెను డైనమిక్‌గా చూపిస్తున్నారు. ‘‘ఈ చిత్రకథ ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కొత్తగా ఉండాలని ఇందులో జడ్జిగా చేశా. ఈ మూవీలో నేను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ఆకట్టుకుంటాయి’’ అని లక్ష్మి అన్నారు. ‘‘హిందీ, ఇతర భాషల్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాగా మార్కెట్ చేస్తున్నాయి. తెలుగులోనూ అలాంటి మార్కెట్ రావాలని చేస్తున్న చిత్రమిది’’ అని లక్ష్మి వ్యాఖ్యానించారు. ⇔ ఆ మార్కెట్ రావాలే కానీ, ఇలాంటివి మరిన్ని రావడం ఖాయం. సినీఫీల్డ్‌లో సర్వసాధారణంగా అందరూ చెప్పేది... లింగ వివక్ష సమస్య. సెట్లో పనిలో, వేతనాల్లో వివక్ష మాటెలా ఉన్నా, సినిమా సక్సెస్‌కు స్క్రిప్ట్‌లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం కీలకమని దర్శక, నిర్మాతలకూ బాగా తెలుసు. అప్పటి సావిత్రి, జమున తరం నుంచి జయప్రద వరకు చాలామంది హీరోయిన్లు మహిళా ప్రధాన చిత్రాల్లో మెప్పించారు. విజయశాంతి, నిన్నటి సౌందర్య బాక్సాఫీస్‌ను మెరిపించారు. ‘అంతులేని కథ’, ‘కర్తవ్యం’ లాంటి ఎన్నో హిట్లే అందుకు ఉదా హరణ. -
నయా లుక్
ఆకట్టుకుంటున్న ఫర్నీచర్ అందరికీ అందుబాటు ధరల్లో.. నగరంలో వెలుస్తున్న దుకాణాలు కరీంనగర్ కల్చరల్ : ఇల్లే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. స్వర్గాన్ని తలదన్నేలా ఇంటిని తయారుచేసుకుంటున్నారు నగరవాసులు. ఇంటికి తగ్గ ఫర్నీచర్‌ను అమర్చినప్పుడే దాని అందం రెట్టింపవుతుంది. ఇందుకనుగుణంగానే నగరవాసులు వారికి నచ్చిన ఫర్నీచర్‌ను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ తరహా షోరూమ్‌లు కరీంనగర్లోనూ వెలుస్తున్నాయి. అందరికీ అందుబాటు ధరల్లోనే ఫర్నీచర్ లభిస్తుండడంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. స్థాయికి తగ్గట్టుగా ఫర్నీచర్ కొనుగోలు చేస్తూ ఇంటికి మరింత అందాన్ని తెస్తున్నారు. వెరైటీగా ఉండే సోఫాసెట్, డైనింగ్ టేబుళ్లు, వాటికి అనుగుణంగా విభిన్న రకాల టీపాయ్‌లు, ఇంటిని మరింత అందంగా మార్చే కప్‌బోర్డులు, డ్రెస్సింగ్ టేబుళ్లను ఇంట్లో అమర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన, అందమైన డిజైన్లలో ఫర్నీచర్ కావాలంటే ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు వెళ్లి వలసి వచ్చేది. కానీ ఇప్పుడు అంతశ్రమ తీసుకోనవసరం లేదు. గృహోపకరణాలతోపాటు కార్యాలయాలకు సరిపడా అన్ని రకాల ఫర్నీచర్ కరీంనగర్‌లోనే లభిస్తుంది. దుకాణాలు శ్రీ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–సాయినగర్ పవన్ ఫర్నీచర్ సెంటర్–వాల్మీకినగర్ తెలంగాణ ఫర్నీచర్ సెంటర్–సవరన్‌స్ట్రీట్ లైఫ్‌సై్టల్ ఫర్నీచర్ సెంటర్– డైలీ మార్కెట్ హిందూస్థాన్ ఫర్నీచర్ సెంటర్– అస్లమ్ మజీద్ దగ్గర ఆకార్ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర ఏపీ ఫర్నీచర్ సెంటర్–అస్లమ్ మజీద్ దగ్గర స్టార్ ఫర్నీచర్ సెంటర్–డాక్టర్స్ స్ట్రీట్ ఆశా ఫర్నీచర్ సెంటర్–ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ దగ్గర మధుర ఫర్నీచర్ సెంటర్–టవర్ సర్కిల్ బాలాజీ ఫర్నీచర్ సెంటర్–ఆఫీస్రోడ్ ధరలు(రూ.లలో) డైనింగ్ సెట్స్ 10వేల–35వేల వరకు సోఫాసెట్లు 11వేల–65వేల వరకు ఆఫీస్ ఫర్నీచర్ 15వేల–50వేల వరకు డబుల్ కాట్బెడ్ 5వేల–35వేల వరకు స్టోరేజ్ డ్రెస్సింగ్ టేబుల్ 5వేల–35 వేల వరకు ఇంటి అందాన్ని పెంచుతాయి ఇల్లు ఎంత ఆధునికతతో నిర్మించినప్పటికి అందుకుతగ్గట్లు ఫర్నీచర్ కూడా ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి మరింత అందం వస్తుంది. గతంలో వెరైటీ ఫర్నీచర్ కావాలంటే ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అన్ని రకాల ఫర్నీచర్ ఇక్కడే లభిస్తుంది. – రతన్‌కుమార్, ప్రభుత్వ ఉద్యోగి వెరైటీలు లభిస్తున్నాయి ఆధునితకు తోడు ఆకర్షణీయ డిజైన్లలో ఫర్నీచర్ లభిస్తుంది. ఇల్లు ఎంత అందంగా కట్టుకున్న అందుకు అనుగుణంగా ఫర్నీచర్ లేకపోతే వృథానే. ఖర్చుతో నిమిత్తంలేకుండా ఇంటి నిర్మాణనికి అనుగుణంగా అవసరమైన ఫర్నీచర్ ఉండాల్సిందే. – డాక్టర్ ఎల్.శేషశైలజ, జనరల్ ఫిజీషియన్ నాణ్యత, మన్నికే ముఖ్యం సంపన్నులతోపాటు మధ్య తరగతివర్గాల వారికి అనువైన రీతిలో ఫర్నీచర్‌తోపాటు అదే తరహా ధరలతో అందించడం మా ప్రత్యేకత. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లతో కూడిన ఫర్నీచర్ అందుబాటులో ఉంటుంది. – శివ బాలజీ, ఫర్నీచర్ సెంటర్ నిర్వాహకుడు -
ఈ సైకిల్ భలే క్రేజ్
హాయ్ ఫ్రెండ్స్! ఈ సైకిల్ చూస్తే చాలా ఆసక్తిగా ఉంది కదూ!! అమెరికాకు చెందిన ప్రఖ్యాత సైకిల్ తయారీ కంపెనీ మోంగూస్... బ్రూటస్ పేరుతో దీనిని రూపొందించింది. దిగుమతితో కలుపుకుని దీని విలువ అక్షరాల రూ.40 వేలు. ఏంటీ నోటి మీద వేలు వేసుకున్నారు. ఇంత డబ్బు పోసి దీనిని ఎవరు కొంటారు అనా? అలాంటి వారూ ఉన్నారండి బాబూ. ఎక్కడో కాదు గుంతకల్లులోని శాంతి నగర్ రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్న సంజీవ్ అనే లోకో పైలెట్ దీనిని ఎంతో ఇష్టంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. అంత డబ్బు పెట్టి కొన్నారు.... దీని ప్రత్యేకత ఏమిటంటారా? చూడండి ఈ సైకిల్ చక్రాలు 26 ఇంచుల వృత్తాకారంలో, నాలుగు ఇంచుల మందంతో ఉన్నాయి. ఈ సైకిల్‌కు బ్రేక్ లివర్ అంటూ ఏదీ లేదు! అయితే ఫెడల్ను వెనక్కు తొక్కితే ఆటోమేటిక్‌గా సైకిల్ ఆగుతుంది. ఇక సైకిల్ తొక్కుతూ ఎంతటి ఎత్తు ప్రదేశాలైనా సునాయసంగా ఎక్కేయవచ్చు. సైక్లింగ్ వల్ల వాయు కాలుష్యం నివారణలో తాను కూడా భాగస్వామినైనందుకు ఎంతో ఆనందంగా ఉందంటున్నారు సంజీవ్... ఆయన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు గుంతకల్లు వాసులు. -
సమూల మార్పులు!
ఆంగ్లం, గణితం, సామాన్యశాస్త్రాలపై ప్రత్యేక దృష్టి నూతన విద్యావిధానం ముసాయిదా రూపొందించిన కేంద్ర ప్రభుత్వం బాలాజీచెరువు (కాకినాడ) : విద్యారంగంపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయి సమస్యలతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలను సాధించడంతోపాటు.. విద్యార్థులను సుశిక్షితులను చేసే లక్ష్యంతో సమూల మార్పులతో నూతన విద్యా విధాన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మంత్రి మండలి మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమ్మణ్యన్ నివేదిక ఆధారంగా రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులతో అమలు చేయనుంది. ఇవీ ముఖ్యాంశాలు.. విద్యాసంస్థల గుర్తింపు, నమోదు కోసం నిర్దేశించిన నిబంధనల్లో విద్యార్థుల భద్రత, సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సుశిక్షితులైన బోధకుల నియామకం తప్పనిసరి. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడి లేని విద్యను అభ్యసించే వీలు ఉంటుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి వీలుగా నియామకాలు, బదిలీలవంటి ప్రక్రియల అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటవుతుంది. నాన్ డిటెన్షన్ విధానంలో నిబంధనలు కూడా మారనున్నాయి. పై తరగతులకు పంపించే ప్రక్రియను ఐదో తరగతి వరకూ మాత్రమే పరిమితం చేస్తారు. ఐదో తరగతి వరకూ స్థానిక లేదా ప్రాంతీయ భాషా మాధ్యమం లేదా మాతృభాషలో బోధన సాగిస్తారు. పాఠశాలల్లో సంస్కృత భాషను ప్రోత్సహించేందుకు సరళ విధానాలు పాటిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి ప్రతి ఐదేళ్లకోసారి నిపుణులతో కమిషన్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే సామాన్యశాస్త్రం, గణితం, ఆంగ్లానికి జాతీయ స్థాయిలో ఒకే ప్రణాళిక రూపొందిస్తారు. పదో తరగతి పరీక్షలు ఇలా.. పదో తరగతి విద్యార్థులు ఎక్కువగా గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్ల పరీక్షల్లో తప్పుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. కొత్త విధానం ప్రకారం ఈ మూడు సబ్జెక్టుల్లో రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పార్ట్–ఏ అత్యుత్తమ ప్రతిభను, పార్ట్–బి తక్కువ ప్రతిభను చూపుతుంది. అయితే ఈ విధానాలపై కొంత మంది ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదర్శ పాఠశాలలు సదుపాయాలు లేక సతమతమవుతూంటే.. ప్రస్తుత కొత్త విధానాలు ఎంతవరకూ సత్ఫలితాలు ఇస్తాయని సందేహలు వ్యక్తం చేస్తున్నారు. ఐదో తరగతి వరకే నాన్ డిటెన్షన్ అమలు చేస్తే బడి మానేసేవారి శాతం పెరిగే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మాతృభాషలో బోధనకు కమిషన్ సిఫారసు చేయడం హర్షణీయం. మరుగున పడిపోతున్న సంస్కృత భాషలో బోధించే విధానం కూడా మంచిదే. ఆంగ్ల, గణిత, సామాన్యశాస్త్రాలకు దేశవ్యాప్తంగా ఒకే ప్రణాళిక ఉండటం కూడా మంచిది. పోటీ పరీక్షల ప్రవేశాలకు ఇది ఎంతో అవసరం. ఈ నూతన విధానం ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి. – పీవీవీ సత్యనారాయణరాజు, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు -
చైనాలో ‘చావు’ ట్రెండ్
బీజింగ్: చైనాలో ఇటీవల ‘చావు’ ట్రెండ్ మొదలైంది. చనిపోయిన తర్వాత మనిషి ఎలా ఫీలవుతాడు? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ప్రత్యక్షంగా అనుభవించాలనుకోవడమే ఆ ట్రెండ్. అందుకోసం వారు కఫిన్‌లో దూరి కళ్లు మూసుకుంటున్నారు. చచ్చినట్లు శవంలా పడుకుంటున్నారు. ఎవరు ఎక్కువసేపు చచ్చిన శవంలా పడి ఉండే అదో మరచిపోలేని అనుభూతి. అదో సంతృప్తి. ఇటీవల ప్రజల్లో బాగా పెరిగిన ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘డెత్’ పార్లర్లు దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. కొన్ని పార్లర్లయితే ఏకంగా అచ్చం శవానికి జరిగినట్లుగానే నకిలీ అంత్యక్రియలు కూడా జరపుతున్నాయి. శాంఘైలో ‘ది సమాధి’ అంటూ ఓ థీమ్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నిజంగా చావు అనుభూతిని తెలుసుకునేందుకు 4డెమైన్షన్ స్టిమ్యులేటివ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ చావు ట్రెండ్‌కు మరింత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. గత శుక్రవారం టియాంజిన్ సిటీలో ‘ఎక్స్‌పీరియెన్సింగ్ డెత్’ పేరిట చావును చూపించారు. విద్యార్థులు సహా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. వారు కఫిన్‌లో మౌనంగా వీలైనంత సేపు గడిపి అనంతరం బయటకు వచ్చాక తమ అనుభూతిని ఇతరులతో పంచుకున్నారు. అలా చచ్చిన శవంలా పడుకోవడం వల్ల తమ బాధలన్నింటినీ మరచిపోయామని, బయటకు వచ్చాక మనుసు తేలికపడ్డట్టుగా, ఎంతో ప్రశాంతంగా అనిపించిందని కూడా వారు చెప్పడం విశేషం. చైనాలోని చాంగింగ్ నగరంలో కూడా మార్చి 27వ తేదీన ఇలాంటి ఈవెంట్‌నే నిర్వహించారు. అక్కడ కాఫిన్లకు ‘డ్రంక్ డ్రైవర్’ అని ‘డ్రంకెన్ స్టూపర్’ లేబుళ్లు కూడా తగిలించారు. దక్షిణ కొరియాలో కూడా ఈ ట్రెండ్ ఉంది. అక్కడ పదంటే పది నిమిషాలు కఫిన్‌లో పడుకొని చూట్టూ ఉన్న చీకటిని, ప్రశాంతతను అనుభూతి చెందుతారు. -
...కాదేదీ ప్రచారానికనర్హం!
కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ... బడి, గుడి.. పార్కు, పాలకేంద్రం.. బారు, బస్టాండ్.. కాదేదీ ప్రచారానికనర్హం అంటున్నారు మన ‘మహా’నాయకులు... ఓటే ముఖ్యంగా.. గెలుపే లక్ష్యంగా ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తా ఓటరూ..’ అంటూ.. వేదిక ఏదైనా.. ఎక్కడైనా.. ప్రచార హోరుతో దూసుకుపోతున్నారు గ్రేట్..ర్ నేతలు. సాక్షి,సిటీబ్యూరో: బల్దియా ప్రచారంలో నయా ట్రెండ్ జోరందుకుంది. వేదిక ఏదైనా సరే ప్రచార పదనిసలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు నాయకగణం. పాఠశాలలు, కళాశాలలు. దేవాలయాలు, పార్కులు, పాలకేంద్రాలు, టీకొట్టు, ఇడ్లీ బండి, కూరగాయల మార్కెట్.. ఇలా ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకప్పటిలా గడగడపకూ వెళ్లి సంప్రదాయ పద్ధతిలో ప్రచారం చేస్తే లాభం లేదని.. ఇప్పుడు ప్రతి అడ్డానూ ప్రచారానికి వేదికగా వినియోగించుకుంటున్నారు నేతలు. దీనికి ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేదు. జెండాలు, అజెండాలు, హామీలతో పనిలేదు. ఎవరైనా.. ఎక్కడైనా.. ప్రచార ట్రెండ్ మాత్రం ఇదే. అభ్యర్థుల ఉత్సాహానికి చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న పాఠశాలలు సైతం ప్రచార హోరులో తడిసి ముద్దవుతున్నాయి. ఓటర్లతోపాటు వారి పిల్లలనూ ప్రభావితం చేసేందుకు చిన్నారుల చేతుల్లో కరపత్రాలు పెడుతూ.. మీ తల్లిదండ్రులను ఓటు మాకే వేయాలని చెప్పమంటున్నారు. అంతటా అభ్యర్థులే... మార్నింగ్ వాక్కు వె ళ్లే ఉద్యోగులు, వృద్ధులు, మహిళల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకునేందుకు ఉదయం 5 గంటల నుంచే పార్కుల వద్ద తిష్ట వేస్తున్నారు అభ్యర్థులు. ఇక ‘స్వామి కార్యం.. స్వకార్యం’ అన్నట్లు కాలనీలు, బస్తీల్లో ఉన్న దేవాలయాలు కూడా పార్టీల ప్రచారంతో సందడిగా మారుతున్నాయి. గుడికి వచ్చిపోయే వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఇక్కడా మకాం వేస్తున్నారు. దైవ సాక్షిగా మీ ఓటు మాకే అంటూ భక్తులతో చేతిలో చేయి వేయించుకుంటున్నారు. ఇక టీకొట్టు, టిఫిన్ బండి, కిరాణా దుకాణాల వద్దకు వచ్చిపోయే వారి చేతిలో కరపత్రం పెట్టి.. వంగి, వంగి దండాలు పెడుతున్నారు. గడ్డాలు, చేతులు పట్టుకొని బతిమిలాడుతున్నారు. ‘మీరు ఏడికెళ్తే ఆడికొస్తాం.. మీ ఓటు మాత్రం మాకే సుమా’ అంటూ సెలవిస్తున్న అభ్యర్థులను చూసి ఓటర్లు విస్తుపోతున్నారు. బార్లకు వచ్చే మందుబాబులకు మందు, విందులతో పసందు చేస్తూ వారి ఓట్లనూ ఒడిసి పట్టేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. బార్లలో ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే టేబుల్ అజెండాగా మారుతోంది ఇప్పుడు. ఇక దీనికి ఇంటింటీ ప్రచారం అదనం. ఇన్ని రకాలుగా ప్రచారం చేసినా ఓటర్లు తమ వైపు ఉంటారో లేదో తెలియక అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ చూసినా ‘మీ ఓటు ఎవరికి..?’ అన్నదే హాట్ టాపిక్‌గా మారింది. ‘ఎవరికి ఓటేస్తే మాకేంటీ లాభమం’టూ జనం బేరీజు వేసుకుంటున్నారు. గతంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు జెండా, అజెండా మార్చేసుకొని ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలవడంతో.. గతంలో వారు చేసిన అభివృద్ధి, స్పందించిన తీరుపై ఓటర్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ఫీట్లు చేస్తున్న అభ్యర్థులు వారి అంతరంగం తెలియక తికమకపడుతున్నారు. -
బ్యూటీపూల జడ
లంగాఓణీకి పొడవైన పూలజడ తోడైతే ఏ అమ్మాయైనా కచ్చితంగా బాపు బొమ్మే. అందుకే రోజూ జీన్స్, టీషర్ట్స్‌లో కనిపించే సిటీ అమ్మాయిలు సైతం.. శుభకార్యాల్లో పొడవాటి పూలజడకే ఓటేస్తారు. తమ చిన్నారికి పూలజడ వేసి మురిసిపోని తల్లి ఉండదు! అలా బాల్యంలో అమ్మ తనకు వేయలేదని అలిగి, దెబ్బలు తిని, చివరికి సాధించుకున్న ఆ పూలజడనే... ఇప్పుడు ‘బిజినెస్ ఐటెమ్’గా మారింది. ఆన్లైన్లో కొత్త ట్రెండ్ అయ్యింది. పెళ్లిళ్లు, పంక్షన్లు, శుభకార్యాలకు కావాల్సిన పూలజడలే కాదు.. పెళ్లికి అవసరమయ్యే అన్ని వస్తువులూ ఆన్లైన్లో దొరికేస్తున్నాయి. ..:: వాంకె శ్రీనివాస్ అందమైన పూలజడ వేయడం ఒక ప్రాసెస్! పూల సేకరణ దగ్గరనుంచి ఒద్దికగా పేర్చడం వరకు ఒక ఆర్ట్! బిజీలైఫ్‌లో అంత ఓపిక , తీరిక లేని వాళ్ల కోసం ఏర్పాటయ్యిందే పెళ్లి పూలజడ డాట్‌కామ్! దీని క్రియేటర్ కల్పన. మొదటగా ఎల్బీనగర్లో ప్రారంభించిన ఆమె ఇప్పడు ఈ సేవలను నగరమంతటా విస్తరించారు. సికింద్రాబాద్, గచ్చిబౌలి, కూకట్పల్లి, కాచిగూడలలో కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. 103 రకాలు... పూలజడల్లో చాలా వెరైటీలున్నాయి. ఎంగేజ్మెంట్కు లైట్ వెయిట్ జడలు, వలలాగా ఉండే నెట్ పూలజడలంటే ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంది. లిల్లీ జడలతోపాటు రోస్పెటల్స్ వాలుజడలకూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. శ్రీమంతానికి గాజుల జడను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. మొగలి, సంపంగి పూలజడలకూ మంచి గిరాకీ. ఇలా ఒకటికాదు రెండుకాదు.. 103 రకాల పూలజడలను తయారుచేస్తున్నారు. ఒక్కో జడకు ఒక్కో కోడ్ నంబరు ఇస్తారు. అభిరుచిని బట్టి ఒక్కో పూలజడ ధర వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. ఒక్కో పూలజడ అల్లడానికి నాలుగు గంటలు పడుతుంది. వీటి కోసం పూలను గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి తెప్పించుకుంటున్నారు. వేసవి సెలవులకు తోడు పువ్వులు కూడా ఎక్కువగా దొరుకుతుండటంతో పిల్లలకు పూలజడలేయించి ఫొటోలు తీయిస్తున్నారు తల్లులు. తాము దూరమైన ఆ స్వీట్ మెమరీని పిల్లలకు దగ్గర చేస్తున్నారు. ఆకట్టుకునే అడ్డుతెర... ఒక్క పూలజడలకే పరిమితం కాకుండా... పెళ్లికి అవసరమయ్యే కొబ్బరిబోండంను డిఫరెంట్ స్టైల్స్‌లో ఆఫర్ చేస్తున్నారు. సీతారాములు తలంబ్రాలు పోసుకున్నట్లుగా, వివిధ డిజైన్స్‌లో వధూవరుల పేర్లు, పీకాక్ డెకరేషన్ ఇలా అనేక రకాలు. అంతేనా.. పెళ్లిలో వాడే అడ్డు తెరనూ అందంగా తయారు చేస్తున్నారు. వధూవరులిద్దరూ హోమం చుట్టూ తిరిగే దృశ్యాన్ని పెయింటింగ్ రూపంలో అడ్డుతెరకు అద్దుతున్నారు. లిల్లీ, మల్లెపూలతో ఆ తెరను సువాసనతో నింపేస్తున్నారు. లిల్లీపూలతో తయారుచేసే అడ్డుతెరకు ఐదు కిలోల పూలు ఉపయోగిస్తారు. ఆరుగురు మహిళలు ఆరు గంటల్లో చేస్తారు. ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది. మల్లెపూలతో తయారుచేసే తెరకు ఎనిమిది గంటలు పడుతుంది. పూలతో అడ్డుతెర తయారుచేయడానికి కనీసం ఒకరోజు పడుతుంది. అపురూపంగా ఐరేని కుండలు.. తామరపువ్వులాంటి పెళ్లిబుట్టలకు, ముత్యాలు, చిలకలు వేలాడుతున్నట్టుగా ఉండే గంపలకూ మంచి ఆదరణ ఉంది. ఫ్లోరల్ డిజైన్లతో చేసిన ఉంగరాల బిందెలు, కర్పూర దండలు, ఇలాచి దండలు కూడా అందిస్తున్నారు. ఇక ఐరేనీ కుండల ను డెకరేట్ చేయడంలోనూ కొత్త కొత్త పోకడలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు పల్లకీ, తలంబ్రాలు పోసే తట్ట, మెడలో వేసుకునే పూలదండలు, ప్రధాన ఉంగరం ఉంచే కుడుకల వరకు... అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది. పూల జువెలరీ.. పువ్వులతో నగలను తయారు చేయడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. నగల కోసం ఎక్కువగా మల్లెమొగ్గలనే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే... ‘సువాసన ఇవ్వడమే కాదు... మల్లెలు చూడ్డానికి ముత్యాల్లా ఉంటాయి’ అని చెబుతారు కల్పన. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల తోపాటు తమిళనాడు, ఢిల్లీ ముంబై, యూఎస్లలోనూ సేవలందిస్తోంది పూలజడ డాట్ కామ్. పూలజడ, జువెలరీ కావాలనుకునేవారు మీరు వేసుకునే డ్రెస్ కలర్ చెబితే చాలు.. దానికి మ్యాచ్ అయ్యే విధంగా, మీ బడ్జెట్లో, మీకిష్టమైన పూలతో డిజైన్ చేసిస్తారు. -
ఫ్యాషన్ కస్టమైజ్
నయా ట్రెండ్‌ను ఫాలో అవుతున్న నగరవాసుల అభిరుచికి అనుగుణంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సాహిల్ గులాటి బంజారాహిల్స్‌లో ఎస్జీ ఫ్యాషన్ స్టూడియోను అందుబాటులోకి తీసుకొచ్చారు. వస్త్రాభిమానులకి నచ్చిన విధంగా డిజైన్ చేసి డ్రెస్సులను ఇక్కడ అందిస్తారు. సల్వార్ సూట్స్, బ్రైడల్, ట్రెడిషనల్, వెస్ట్రర్న్, పార్టీ, నైట్ వేర్స్ ఇక్కడ ఆకర్షణీయంగా ఉన్నాయి. ‘కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టుగా డ్రెస్సులు డిజైన్ చేసి ఇచ్చేందుకు కొత్తగా ఫ్యాషన్ స్టూడియోను ప్రారంభించా. మరో డిజైనర్ అబ్దుల్ అజీమ్‌తో కలసి ట్రెండింగ్ ఫ్యాషన్స్‌కు శ్రీకారం చుట్టా’ అని సహిల్ గులాటి చెప్పారు. ఔత్సాహిక డిజైనర్లకు పాఠాలు చెప్పేందుకు ‘కోటురే’ ద డిజైనర్ ఇన్స్టిట్యూట్ను కూడా ప్రారంభించారు. సాక్షి, సిటీ ప్లస్ -
అందానికి అతికినట్టు..
ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ రాజ్యమేలుతుంటుంది. మినీస్ టైం అలా వచ్చి ఇలా వెళ్లింది.. గాగ్రాస్ టైం గ్రాండ్‌గా ముగిసింది. ఇప్పుడు కొత్తగా బ్యాండేజ్ డ్రెస్‌లు బ్యాండ్ బజాయిస్తున్నాయి. నయా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇన్నోవేటివ్ కలెక్షన్స్ తెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అలా వచ్చినవే.. ఈ తరం యువతులను హత్తుకుంటున్నవే బ్యాండేజ్ డ్రెస్‌లు. పార్టీవేర్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ ట్రెండ్‌కు టీనేజ్ గ్రూప్ రెడ్‌కార్పెట్ పరచి మరీ స్వాగతం పలుకుతోంది. లాంగ్ స్కర్ట్స్, ఫ్రాక్స్, మ్యాక్సీలు, ట్యూబెట్.. ఇలా రకరకాల డిజైన్లు మార్కెట్లో ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొత్త ఒక వింత అనుకునే లోకం కోసం.. ఫ్యాషన్ వీధుల్లో రోజుకో డిజైన్ హల్చల్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యేవారి కోసం ఇప్పటి డిజైనర్లు కొంగొత్తగా ‘బ్యాండేజ్ డ్రెస్’లను ఇంట్రడ్యూస్ చేశారు. డిఫరెంట్ వెరైటీస్.. బ్యాండేజ్ పట్టీలను చుట్టినట్టుగా కనిపించే ఈ డ్రెస్‌లు ఈ తరం అతివలకు అతికినట్టు సరిపోతున్నాయి. కలర్‌ఫుల్ కలర్ కాంబినేషన్స్ ఈ ట్రెండ్ సూపర్‌హిట్ కావడానికి హెల్ప్ అవుతున్నాయి. అందుకే ఈ మధ్య నైట్ పార్టీల్లో బ్యాండేజ్ డ్రెస్‌లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా డిజైన్లు, డ్రెస్ లెన్త్ దొరుకుతున్నాయి. అమ్బ్రే, లక్సె, బాడీకాన్, మినీ-కోక్టైల్, వింటేజ్ ఇలా రకరకాలుగా ప్యాటర్న్స్ ఈ బ్యాండేజ్ డ్రెసెస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా ట్యూబ్ కైన్డ్, స్లీవ్‌లెస్, మెగా స్లీవ్స్, మెడి-స్లీవ్స్, లేస్డ్ స్లీవ్స్ ఇలా కంఫర్ట్‌కు తగ్గట్టుగా వీటిని డిజైన్ చేయించుకోవచ్చు. స్పెషల్ అట్రాక్షన్ పబ్‌లకు, నైట్ పార్టీలకు ఈ తరహా డ్రెసెస్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ట్యూబ్ తరహాలో కనిపించే ఈ బ్యాండేజ్ డ్రెస్ మీదికి ప్రత్యేకంగా జ్యువెలరీ వేసుకోవాల్సిన పని కూడా లేదు. అంతగా కావాలంటే చేతికి ఓ యాంటిక్ బ్రేస్లెట్, మెడలో హెవీ ఫంకీ క్లోజ్ సెట్ వేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ ఫ్రీ హెయిర్, ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుంటే సరి. ఇక ఆ పార్టీలో అందరి కళ్లూ మీ మీదే. మీరే స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు. - హర్ష, ఫ్యాషన్ డిజైనర్