
అందానికి అతికినట్టు..
ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ రాజ్యమేలుతుంటుంది.
ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ రాజ్యమేలుతుంటుంది. మినీస్ టైం అలా వచ్చి ఇలా వెళ్లింది.. గాగ్రాస్ టైం గ్రాండ్‌గా ముగిసింది. ఇప్పుడు కొత్తగా బ్యాండేజ్ డ్రెస్‌లు బ్యాండ్ బజాయిస్తున్నాయి. నయా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఇన్నోవేటివ్ కలెక్షన్స్ తెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. అలా వచ్చినవే.. ఈ తరం యువతులను హత్తుకుంటున్నవే బ్యాండేజ్ డ్రెస్‌లు. పార్టీవేర్‌గా మార్కెట్‌లోకి వచ్చిన ఈ ట్రెండ్‌కు టీనేజ్ గ్రూప్ రెడ్‌కార్పెట్ పరచి మరీ స్వాగతం పలుకుతోంది.
లాంగ్ స్కర్ట్స్, ఫ్రాక్స్, మ్యాక్సీలు, ట్యూబెట్.. ఇలా రకరకాల డిజైన్లు మార్కెట్‌లో ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొత్త ఒక వింత అనుకునే లోకం కోసం.. ఫ్యాషన్ వీధుల్లో రోజుకో డిజైన్ హల్‌చల్ చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యేవారి కోసం ఇప్పటి డిజైనర్లు కొంగొత్తగా ‘బ్యాండేజ్ డ్రెస్’లను ఇంట్రడ్యూస్ చేశారు.
డిఫరెంట్ వెరైటీస్..
బ్యాండేజ్ పట్టీలను చుట్టినట్టుగా కనిపించే ఈ డ్రెస్‌లు ఈ తరం అతివలకు అతికినట్టు సరిపోతున్నాయి. కలర్‌ఫుల్ కలర్ కాంబినేషన్స్ ఈ ట్రెండ్ సూపర్‌హిట్ కావడానికి హెల్ప్ అవుతున్నాయి. అందుకే ఈ మధ్య నైట్ పార్టీల్లో బ్యాండేజ్ డ్రెస్‌లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా డిజైన్లు, డ్రెస్ లెన్త్ దొరుకుతున్నాయి. అమ్బ్రే, లక్సె, బాడీకాన్, మినీ-కోక్‌టైల్, వింటేజ్ ఇలా రకరకాలుగా ప్యాటర్న్స్ ఈ బ్యాండేజ్ డ్రెసెస్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవేకాకుండా ట్యూబ్ కైన్డ్, స్లీవ్‌లెస్, మెగా స్లీవ్స్, మెడి-స్లీవ్స్, లేస్డ్ స్లీవ్స్ ఇలా కంఫర్ట్‌కు తగ్గట్టుగా వీటిని డిజైన్ చేయించుకోవచ్చు.
స్పెషల్ అట్రాక్షన్
పబ్‌లకు, నైట్ పార్టీలకు ఈ తరహా డ్రెసెస్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ట్యూబ్ తరహాలో కనిపించే ఈ బ్యాండేజ్ డ్రెస్ మీదికి ప్రత్యేకంగా జ్యువెలరీ వేసుకోవాల్సిన పని కూడా లేదు. అంతగా కావాలంటే చేతికి ఓ యాంటిక్ బ్రేస్లెట్, మెడలో హెవీ ఫంకీ క్లోజ్ సెట్ వేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ ఫ్రీ హెయిర్, ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుంటే సరి. ఇక ఆ పార్టీలో అందరి కళ్లూ మీ మీదే. మీరే స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తారు.
- హర్ష, ఫ్యాషన్ డిజైనర్